South India
-
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
రెహమాన్‌కు దూరంగా ఉండటానికి కారణం ఇదే: సైరా బాను
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయిన తర్వాత సోషల్‌మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రెహమాన్‌ను తప్పుపడుతూ తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వారు పలు కథనాలు ప్రసారం చేయడంతో తాజాగా సైరా బాను రియాక్ట్ అయ్యారు.'రెహమాన్ చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి తెలియకుండా తప్పుగా ప్రచారం చేయడం బాధగా ఉంది. పలు అనారోగ్య కారణాలతో నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణం వల్లే ఆయనకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నా. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మీడియాతో పాటు యూట్యూబ్ వారికి నా విన్నపం. దయచేసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయకండి. ప్రపంచంలో ఆయనకు ఉన్న మంచి గుర్తింపును చెడగొట్టకండి. ఇప్పటికీ ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. ఇకనైనా తప్పుడు కథనాలకు ఫుల్స్టాప్ పెడుతారని అనుకుంటున్నాను. మేమిద్దరం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో మా గోప్యతను కాపాడండి. కొద్దిరోజుల్లో నేను చెన్నై వస్తాను.' అని ఆమె తెలిపారు. -
దక్షిణ భారత్‌కు ఐదు కొత్త కార్గో విమాన సర్వీసులు
హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రవాణా సేవల కంపెనీ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ (ఫెడెక్స్) దక్షిణ భారత్ ప్రాంతాలకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానత కల్పించేందుకు కొత్తగా ఐదు కార్గో విమాన సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి కీలక దిగుమతులకు ఈ విస్తరణ వీలు కల్పిస్తుందని, యూరప్, యూఎస్ఏకి ఎగుమతుల వృద్ధికి సాయపడుతుందని కంపెనీ తెలిపింది.అలాగే, లాజిస్టిక్స్, సరఫరా చైన్‌కు అనుకూలిస్తుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో దక్షిణ భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని పేర్కొంది. ‘‘దేశ వృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ కంపెనీలకు కేంద్రంగా ఉంటోంది. నూతన ఫ్లయిట్ సేవలు ఈ ప్రాంత డిమాండ్‌ను తీర్చేందుకు ఫెడెక్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’అని ఫెడెక్స్ సీఈవో, సీఎఫ్‌వో రిచర్డ్ వి.స్మిత్ ప్రకటించారు. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
మిషన్ మేకోవర్
ఇప్పుడు కమల్‌హాసన్ మిషన్ ఏంటంటే... ‘మేకోవర్’ అన్నమాట. కొత్త సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు కమల్‌హాసన్. ఆయన హీరోగా ‘కేజీఎఫ్’ ఫైట్ మాస్టర్స్ అన్బు–అరివుల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. అయితే ‘ఇండియన్’ సీక్వెల్స్ ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలతో పాటు ‘థగ్ లైఫ్’ చిత్రంతో కమల్‌హాసన్ బిజీగా ఉన్నారు.ఈ కారణంగా అన్బు–అరివులతో కమల్‌హాసన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘ఇండియన్ 2’ విడుదల కాగా, ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ చిత్రాలను కమల్ పూర్తి చేశారు. దీంతో అన్బు–అరివులతో చేయాల్సిన సినిమాను వచ్చే జనవరి నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం కమల్‌హాసన్ స్పెషల్ మేకోవర్ అవుతున్నారు. ఆయన తాజా లుక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
లీక్డ్ వీడియోతో ఒవియా వైరల్.. బిగ్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
ఒవియా హెలెన్.. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ పేరు సౌత్ ఇండియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధింఇచన లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట షేర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒవియా ఫోటోను లారెన్స్ షేర్ చేస్తూ సినిమా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' ప్రాంచైజీ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, 'కాంచన 4' ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను తాజాగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురౌతున్న ఒవియాకు లారెన్స్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. లారెన్స్ దర్శకత్వంలో 2011లో విడుదలైన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ జానర్లో ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ సినిమా 2015లో రెండో పార్ట్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సూపర్ హిట్ కావడంతో 2019లో 'కాంచన-3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మళ్లీ భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఈ నవంబర్‌లో నాలుగో భాగం షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, అదికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మూడు భాగాల్లో లారెన్స్ ప్రధానపాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. కోవై సరళ, శరత్‌కుమార్ గత మూడు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) -
డ్రగ్స్ కేసులో 'పిశాచి' సినిమా నటి
మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్ నిర్వహించి ఒక డీజే పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అతనిపై ఇప్పటికే దాదాపు 30 క్రిమినల్ కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తితో మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు నటీనటులు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ 5న ఓ పార్టీలో పాల్గొన్న ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారిని విచారించగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సరైన ఆదారాలు కోర్టుకు అందించడంలో పోలీసులు విఫలం కావడంతో ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్‌కు బెయిల్ వచ్చింది. కానీ, వారిద్దరితో టచ్‌లో ఉన్న నటీనటులు ఎవరనేది చర్చ జరుగుతుంది.మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనాథ్ భాసితో పాటుగా.. పిశాచి చిత్రం ద్వారా ఫేమ్ అయిన నటి ప్రయాగ మార్టిన్ ఈ డ్రగ్స్‌తో లింక్ ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా ఓం ప్రకాశ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు వారు అతని గదికి కూడా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 20 మందికి పైగా ఓం ప్రకాశ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు లభించిన CCTV ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారట. కానీ, ఆ వీడియోను పోలీసులు బహిర్గతం చేయలేదు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో గుహ లోయలో పడిపోయిన పాత్రలో శ్రీనాథ్ భాసి కనిపించారు. నటి ప్రయాగ మార్టిన్ 2014లో పిశాచి సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. -
ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్
బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించారు. రెండోరోజు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అవార్డ్స్ అందించారు. అయితే, బాలీవుడ్ విభాగంలో తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా సత్తా చాటింది. కానీ, జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. అయితే, సౌత్ ఇండియా నుంచి ఉత్తమ చిత్రంగా జైలర్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) అవార్డ్ అందుకున్నారు. అయితే, నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.ఐఫా 2024 విజేతలు (సౌత్ ఇండియా)ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవిఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంతఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టిఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరాఉత్తమ నటుడు (తెలుగు)- నాని (దసరా)ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రహ్మానందం(రంగమార్తాండ)ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పీఎస్ 2)ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోనీ)ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబుఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పీఎస్ 2)ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టిఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ నటుడు (కన్నడ) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పీఎస్ 2)ఉత్తమ లిరిక్స్ – జైలర్ (హుకుం)ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్ 2)ఐఫా 2024 విజేతలు (బాలీవుడ్)ఉత్తమ చిత్రం : యానిమల్ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్)ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )ఉత్తమ విలన్: బాబీ డియోల్(యానిమల్)ఉత్తమ సంగీతం: యానిమల్ ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్)ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీఅచీవ్మెంట్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్ -
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
యువతిపై 'జానీ మాస్టర్' లైంగిక దాడి నిజమే.. రిమాండ్ రిపోర్టు ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్‌ను విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడా జైలుకు తరలించారు. అయితే, రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై దురుద్దేశంతోనే తన వద్ద అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది. (ఇదీ చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు.' రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ తర్వాత జానీకి శిక్ష తప్పదని తెలుస్తోంది. -
పీరియాడికల్ ఫిల్మ్‌లో...
కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమా ప్రకటన ఆదివారం వెలువడింది. ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్‌కు ‘టానాక్కారన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు.కార్తీ కెరీర్లో 29వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి చెందిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
విజయ్ రాజకీయ పార్టీకి గుడ్‌న్యూస్.. అభిమానుల్లో ఉత్సాహం
దళపతిగా కోలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంబంధించి జెండాతో పాటు గుర్తును కూడా ఆవిష్కరించారు.ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్.విజయ్‌కి ఎన్నికల సంఘం నుంచి శుభవార్త వచ్చింది. తమ పార్టీకి గుర్తింపు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా విజయ్ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తన రాజకీయ పార్టీకి గుర్తింపు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ కార్యచరణ గురించి వెళ్లడిస్తామని అన్నారు. ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం వేదికగా TVK పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. 21 నిబంధనలతో సభకు అనుమతి లభించింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ముందే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా తన మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో తప్పకుండా దిగుతామని విజయ్ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా..? లేదా పొత్తుల సాయంతో ముందుకొస్తారా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. -
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
సారీ... నాకు తెలియదు: రజనీకాంత్
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న హేమా కమిటీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి హీరో రజనీకాంత్ తనకు ఏమీ తెలియదంటూ స్పందించడం సినిమా వాసులను ఆశ్చర్యపరుస్తోంది.చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల కోసం జస్టిస్ హేమా కమిటీ తరహాలో కోలీవుడ్‌లోనూ ఓ కమిటీ రావాలంటారా? అనే ప్రశ్నకు రజనీకాంత్ స్పందిస్తూ– ‘‘సారీ... ఆ అంశం గురించి నాకేమీ తెలియదు’’ అంటూ జబాబు చెప్పారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
కంగువ వాయిదా?
‘కంగువ’ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.ఈ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దసరా సెలవులను టార్గెట్‌గా చేసుకుని ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కావడం లేదని, నవంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందనే టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్‌తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు. 2012లో మిస్ సౌత్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్‌కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు. -
కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా. -
OTT: మమ్ముట్టి ‘టర్బో’ రివ్యూ
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘టర్బో’. ఇదో సీరియస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. దీనికి దర్శకులు వైశాఖ్. డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సులో ఉన్న మమ్ముట్టి ఈ సినిమాలో నలభై ఏళ్ల వ్యక్తిలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. టర్బో జోస్ (మమ్ముట్టి) తనకు సంబంధం లేని తగాదాల్లో తల దూరుస్తుంటాడు. అతనిది ఎవ్వరికీ భయపడని మనస్తత్వం... ఒక్క వాళ్లమ్మకు తప్ప. జోస్‌కి మంచి ఆప్తుడు జెర్రీ. జెర్రీకి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించడంలో జెర్రీని ప్రేమించిన నిరంజనకు జోస్ తారసపడి, అదే సందర్భంలో తన ఆప్తుడైన జెర్రీని పోగొట్టుకుంటాడు. అలాగే జెర్రీ సమస్య నగరంలో అసమాన్యుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయపడే వెట్రివేల్ షణ్ముగంతో ముడిపడి ఉంటుంది. దీంతో వెట్రివేల్‌తో టర్బో జోస్ పోరాడవలసి వస్తుంది. అసలు జెర్రీకి వచ్చిన సీరియస్ సమస్య ఏంటి ? జెర్రీ ఎలా చనిపోయాడు? వెట్రివేల్‌ను జోస్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది మాత్రం సోనీ లివ్ ఓటీటీæ తెరమీదే చూడాలి. టర్బో అంటే అదనపు శక్తి అన్నమాట. టైటిల్‌కి తగ్గట్టే సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ అదనపు శక్తితో నడుస్తాయి. మమ్ముట్టి మంచి ఈజ్‌తో జోస్ పాత్రను రక్తి కట్టించారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పాత్ర రాజ్ బి. శెట్టిది. ఇతనే వెట్రివేల్ షణ్ముగం. ఈ సినిమాలో ప్రతినాయకుడు. విలన్ పాత్రలో రాజ్ బి. శెట్టి చాలా విలక్షణంగా చేశారు. ఈ పాత్రలతో పాటు సినిమా మొత్తం యాక్షన్, కామెడీ సన్నివేశాలతో సీరియస్ కథను సరదా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన విధానం అద్భుతం. వీకెండ్‌కి ఓ మంచి సినిమా ఈ ‘టర్బో’. – ఇంటూరి హరికృష్ణ -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్‌లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్‌లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
ఈమెని గుర్తుపట్టారా? సౌత్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపింది.. కానీ కొన్నాళ్లకే!
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. హీరోయిన్లు గ్లామర్ మెంటైన్ చేసినన్నీ రోజులు, హీరోలకు హిట్ సినిమాలు దక్కినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో మార్పులొస్తాయో.. నటీనటులు జీవితాలు అప్పుడప్పుడు తలక్రిందులవుతుంటాయి. అలాంటి ఓ నటినే ఈమె. ఈ మాత్రం చెప్పాం కదా! మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో సంప్రదాయబద్ధంగా చీరలో పూలు పెట్టుకుని కనిపిస్తున్న అమ్మాయి సిల్క్ స్మిత. అవును మీరు ఊహించింది కరెక్టే. పశ్చిమ గోదావరి జిలాల్లో పుట్టి పెరిగిన వడ్లపాటి విజయలక్ష్మీ.. టీనేజీలో ఉండగానే హీరోయిన్ అయిపోదామని ఇంట్లో కూడా చెప్పకుండా మద్రాసు పారిపోయింది. పేరు మార్చుకుని సిల్క్ స్మితగా మారిపోయింది. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరుగా మొదలై.. స్టార్ హీరోలతో కలిసి ఐటమ్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్)80-90ల్లో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఐటమ్ సాంగ్స్ అంటే దర్శకనిర్మాతలకు ముందు గుర్చొచ్చేది ఈమెనే. అంతలా సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపిన సిల్క్ స్మిత.. ఆ తర్వాత వచ్చిన ఫేమ్, డబ్బుని మేనేజ్ చేసుకోలేక.. కొందరు హీరోల మాయలో పడి సర్వస్వం కోల్పోయింది. ఒత్తిడి తట్టుకోలేక కేవలం 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో సినిమాలు చేసినప్పటికీ.. ఈమెని ఇప్పటి జనరేషన్ కూడా గుర్తుంచుకుంటోంది.ఇలాంటి సిల్క్ స్మిత రేర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చీరతో అందానికే ఆధార్‌లా ఉన్న సిల్క్‌ని చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఓర్నీ.. ఈమె సిల్క్ స్మితనా అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఈమె జీవితాన్ని ఆధారంగా కొన్నేళ్ల క్రితం హిందీలో 'ద డర్టీ పిక్చర్' అనే మూవీ వచ్చింది. ఇది చూస్తే సిల్క్ స్మిత జీవితం ఎలా ఉంటుందో తెలిసే ఛాన్స్ ఉంది!(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి) -
ఖరీదైన కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో
తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. త్వరలో నటుడు విజయ్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. త్వరలో పాదయాత్ర కూడా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2012లో ఎంతో ఇష్టపడి రోల్స్‌రాయ్స్ ఖరీదైన కారును ఆయన కొనుగోలు చేశారు. అయితే దాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవడం వల్ల లోకల్ టాక్స్ కట్టలేదనే ఆరోపణలను విజయ్ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించి భంగపడ్డారు. చైన్నె న్యాయస్థానం విజయ్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. అలాంటిది విజయ్ తను ముచ్చటపడి కొనుక్కున ఖరీదైన కారు విక్రయానికి వచ్చిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ విజయ్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అని రోల్స్‌రాయ్స్ కారు ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. దీని ధర రూ.26 కోట్లు అని, అయితే ఇది నిర్ణయిత ధర కాదని పేర్కొన్నారు. అయితే అది విజయ్ కారా, కాదా అనే చర్చ జరుగుతోంది. -
ధనుష్‌కు మద్ధతుగా నిలిచిన నడిగర్ సంఘం
తమిళ టాప్ హీరో ధనుష్‌పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్‌పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్‌ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.ధనుష్ అధికమొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని ఆపై షూటింగ్స్‌కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్‌పీసీ అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్‌తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్‌కు మద్ధతుగా నిలిచింది.ధనుష్‌తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్‌కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. -
అజర్బైజాన్ కు బై
అజర్బైజాన్ కు బై బై చెప్పారు అజిత్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా, అర్జున్ , ఆరవ్, రెజీనా, నిఖిల్ ఇతర రోల్స్‌లో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా అజర్బైజాన్లో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తయింది. అజిత్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట మేకర్స్.కాగా దాదాపు పదమూడేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గ్యాంబ్లర్’ (2011) సినిమా తర్వాత అజిత్–అర్జున్ –త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విడాముయర్చి’ కావడం విశేషం. హీరో కుటుంబం విహారయాత్రకు వెళ్తుంది. అక్కడ హీరో భార్య, అతని కుమార్తె అదృశ్యం అవుతారు. వారి ఆచూకీని హీరో ఎలా కనుక్కున్నాడు? ఏ విధంగా రక్షించాడు? అన్నది ‘విడాముయర్చి’ కథ అని కోలీవుడ్ టాక్. -
నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్లో 50వ సినిమా.ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను. ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ చేయాలనుంది. నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్‌బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
గ్లామరస్ పాత్రలలో ఎందుకు నటించనంటే..: ఐశ్వర్య రాజేశ్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెండ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. అయితే, సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడానికే దర్శక నిర్మాతలు యత్నిస్తుంటారు. ఇక చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుంటారన్నది వాస్తవం. అయితే, అందుకు భిన్నంగా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి ఐశ్వర్యరాజేశ్ ఒకరు. కోలీవుడ్‌లో ఐశ్వర్యరాజేశ్‌కు అంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్యరాజేశ్ అక్కడ నుంచి గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఐశ్వర్య రాజేశ్ కూడా గ్లామర్‌కు మారిపోయారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయన్నారు. కానీ, తాను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదన్నారు. తనకు తగిన పాత్రల్లో నటించడమే తనకు ఇష్టం అని పేర్కొన్నారు. గ్లామరస్‌గా నటించడం తనకు తగదన్నారు. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదన్నారు. తనకు కుటుంబ కథా చిత్రాలే కావాలనీ, అందులోనూ నటనకు అవకాశం ఉండాలనీ కోరుకుంటు న్నాని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొన్నారు. కాగా ఈమె కన్నడంలో శివరాజ్ కుమార్‌కు జంటగా నటించిన ఉత్తరఖాండ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈమె నటించిన తొలి కన్నడ చిత్రం ఇదే కావడం గమనార్హం. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
నన్ను క్షమించండి: పార్తిబన్
హీరోయిన్ తమన్నాకు తమిళ నటుడు–దర్శక–నిర్మాత పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా డ్యాన్స్ గురించి పార్తిబన్ చేసిన కామెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు కోరారు. ఆ ఇంటర్వ్యూలో పార్తిబన్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలో కథ ఉందా? లేదా అన్నది ప్రేక్షకులు చూడటం లేదు.హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది’’ అన్నారు. పార్తిబన్ మాటలను పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. దాంతో పార్తిబన్ స్పందిస్తూ– ‘‘సినిమా ఇండస్ట్రీ వారిపై నాకు గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అన్నారు. ఇక తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రచ్చ’ సినిమాలో పార్తిబన్ నటించిన విషయం తెలిసిందే. -
బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు!
ధనుష్ టైటిల్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రకాశ్‌రాజ్, ఎస్జే సూర్య, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనుంది.ఈ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంగళవారం ‘రాయన్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘రాయన్... అడవిలో ప్రమాదమైన జంతువు ఏదో తెలుసా’, ‘సింహం,’ ‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. రెండూ ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టిముట్టి, ఓ పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి’, ‘వస్తాడు... బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు... దహనం చేస్తాడు’, ‘రావయ్యా... రాయన్... వెళ్లి ఏం చెప్పావ్... టక్కున కేసు వెనక్కు తీసుకున్నాడు’ అనే డైలాగ్స్ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. -
సైమా అవార్డ్స్.. నాని హిట్ సినిమాకే ఎక్కువ క్రేజ్
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి. సైమా ఛైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను ప్రకటిస్తామని సైమా టీమ్ తెలిపింది. అభిమానులు తమ ఓట్‌ను సైమా ఫేస్బుక్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. -
డేటా సెంటర్ల జోరు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహాకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్ధిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20% క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ చార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి. చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి. 5జీ, ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యాచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ భారతదేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నాయి.హైదరాబాద్‌లో 47 మెగావాట్లు.. ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి. -
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023.. ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..తెలుగు..ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)తమిళంఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్ఉత్తమ సహాయ నటి - ఊర్వశిఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయిఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)ఉత్తమ గేయ రచయిత- తమిరైఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)ఉత్తమ గాయని - అంతనా నందిఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్ కన్నడఉత్తమ చిత్రం -కాంతారఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)ఉత్తమ నటి - చైత్ర జే అచార్ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్ఉత్తమ సహాయ నటి - మంగళఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్ఉత్తమ గాయని- సునిధి చౌహాన్ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండలఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడమలయాళంఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడుఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పుఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం) -
ట్రైలర్ రెడీ
హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్‌హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.సిద్ధార్థ్, ఎస్జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
తంగలాన్ రెడీ
విక్రమ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రం నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు.ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఏప్రిల్‌లోనూ ‘తంగలాన్ ’ థియేటర్స్‌కు రాలేదు. అయితే తాజాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు లింగం యాదవ్. ‘‘ఏ’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. -
రాజధాని రౌడీ వస్తున్నాడు
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్గా నటించిన కన్నడ చిత్రం ‘రాజధాని’. కేవీ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం అందించారు. కన్నడలో విజయం సాధించిన ఈ మూవీని ‘రాజధాని రౌడీ’ పేరుతో సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ–‘‘మాదక ద్రవ్యాలు, మద్యపానం బారినపడి నలుగురు యువకులు వారి జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. చెడు పరిణామాలను ఎత్తి చూపించి, ఆలోచన రేకెత్తించే పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్ నటించారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు. -
డేట్ చేంజ్
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్ ’. ఈ మూవీ కాస్త ఆలస్యంగా థియేటర్స్‌లోకి రానుంది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది.నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను తొలుత జూన్ 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ జూలై 26న రిలీజ్ చేయనున్నట్లుగా ధనుష్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా రూపొందిన ‘రాయన్’ కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఇంకా సమయం ఉంది
‘‘భారతీయుడు 2(తమిళంలో ఇండియన్ 2)’ చిత్రం నా కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉందనే భావన కలిగించింది. ఈ సినిమా గురించి చాలా విషయాలు జనాలతో పంచుకోవాలనే ఆత్రుతగా ఉంది. కానీ, అందుకు ఇంకా సమయం ఉంది’’ అంటున్నారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. నటుడు, దర్శక–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన విషయం తెలిసిందే.పెళ్లి కోసం కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ జోరుమీదున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందింది. ఈ మూవీలో రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ–‘‘భారతీయుడు 2’ నా కెరీర్లోనే ఎంతో స్పెషల్ మూవీ. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను. నా గత చిత్రాలకంటే ఈ మూవీలోని నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేసినన్ని రోజులు గొప్ప అనుభూతి కలిగింది. శంకర్‌గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు. -
23 ఏళ్లుగా సినిమాలకు దూరం.. స్టార్ హీరోతో పెళ్లి ఆపై రూ. 300 కోట్లతో..
కోలీవుడ్ హీరోయిన్ షాలిని చిన్నప్పటి నుంచి తన చురుకైన నటనతో అభిమానులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో బాలతారగా నటించిన షాలినిని బేబీ షాలిని అని ముద్దుగా పిలుచుకునేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కథానాయికగా వెలుగొందుతున్న షాలిని 1997లో విడుదలైన అనియతి ప్రవు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసింది. తమిళ్లో విజయ్ సరసన 'కాదలుక్కు మరియాధై' చిత్రంతో షాలిని తెరంగేట్రం చేసింది.తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన షాలిని తమిళంలో తన తదుపరి చిత్రంలో అజిత్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అజిత్, షాలినీ కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్కాలం’. శరణ్ దర్శకుడు. 1999 ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా విడుదలై విజయం సాధించడంతో వారి రొమాన్స్ కూడా అలాగే సాగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన సఖి చిత్రంతో ఈ జోడీ మరింత పాపులర్ అయింది. సినీరంగంలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో అదే ఏడాదిలో అజిత్- షాలిని వివాహం చేసుకున్నారు. అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. బాలనటిగా దక్షిణాదిలో రాణించి ఆపై టాప్ హీరోయిన్ స్థాయికి షాలినీ చేరుకుంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగానే ఉంది. అలా సినిమా నుంచి తప్పుకున్న 23 ఏళ్ల తర్వాత కూడా శాలినికి సినిమా ఛాన్స్‌లు వచ్చాయి కానీ, సున్నితంగా వాటిని ఆమె తిరష్కరించింది. తన పిల్లలు అనుష్క (16), అద్విక్ (09) చదువు విషయంలో ఆమె ఎక్కువగా సమయం కేటాయిస్తుంది. తమిళంలో కేవలం 5 సినిమాల్లోనే షాలిని హీరోయిన్గా నటించినా.. ఆ కాలంలో రూ. 50 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. అజిత్, షాలినీల ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే తిరుగులేని హీరోయిన్గా కొనసాగిన షాలిని చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. -
తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!
చారిత్రాత్మకంగా,తిరుచిరాపల్లిని సాధారణంగా ఆంగ్లంలో "ట్రిచినోపోలీ" అని పిలుస్తారు. వాడుకంలో ఎక్కువగా "ట్రిచీ" లేదా "తిరుచ్చి" అని పిలుస్తారు. అధికారికంగా మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుచురాపల్లి అని ఉంటుంది. ఇక్కడ ఐకానిక్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రంగనాథ స్వామి దేవాలాయం. తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయ పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ తిరుచ్చి. ఇక్కడ ఉన్న అద్భుతమైన వాస్తు శిల్ప కళా సంపదను చూడవచ్చు. ఇది గొప్ప వారసత్వ సాంస్కృతికి నిలయం. ఆ నగరంలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలివే..శ్రీరంగనాథ స్వామి ఆలయం..తిరుచ్చి ఐకానిక్ ఆభరణంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం అలరారుతుంది. ఈ ఆలయం సుమారు 156 ఎకరాల్లో ఏడు ప్రాకారాలతో నిర్మించారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా 45 నుంచి 75 మీటర్ల ఎత్తు వరకు ఆలయ గోపురాలు ఉంటాయి. ముఖ్యంగా మూలల్లో చెక్కబడిన సంగీత స్థంబాలు, మందిరాలు, శతబ్దాల నాటి విగ్రహాలతో కూడి ఆలయాలు మనసును దోచుకునేలా ఉన్నాయి. వెయ్యి స్తంభాల హాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ ప్రతినిత్యం ఆలయ కైంకర్యాలు నిరాటకంగా జరుగుతాయి.మరో అద్భుత ఆలయం రాక్‌ఫోర్ట్..రాక్‌ఫోర్ట్ అనేది 273 అడుగుల ఎత్తైన రాతిపై ఉన్న కోట. ఇది ఏకశిలలతో నిర్మితమైన గుహ దేవాలయాలు. వీటిని తొలుత పల్లవులచే నిర్మిచబడినప్పటికీ..తర్వాత ముధురై నాయకులు, విజయనగర పాలకులు పునర్నించారు. ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడు థాయుమానవర్గా పూజలందుకోగా, పార్వతి దేవి మట్టవర్ కుజలమ్మాయిగా కొలుచుకుంటారు భక్తులు. ముందుగా రాతి కోట పాదాల వద్ద ఉన్న మాణిక్క వినాయకర్ ఆలయం దర్శంచుకుని, శివ పార్వతులు ఆలయాలను దర్శిస్తారు భక్తులు. ఈ రాతి శిలను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా నమ్ముతారు. ఈ శిలా కోట చుట్టు ఉన్న కావేరి నదం దారంలా చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. సైకిల్‌పై చుట్టి రావచ్చు కూడా..తిరుచ్చిలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సైకిళ్లపై చుట్టి రావచ్చు కూడా. తెల్లవారుజాము నుంచి టూరిస్ట్ గైడ్ ఆధ్వర్యంలో సైకిల్ పర్యటనను ప్రారంభిస్తారు. 18వ శతాబ్దపు జెస్యూట్ క్వార్టర్స్ నుంచి దక్షిణాసియాలోని తొలి ప్రింటింగ్ ప్రెస్‌లు, బ్రిటిష్ కాలం నాటి టౌన్సైడ్ మాన్షన్లను చుట్టిరావొచ్చు. తిరుచ్చి పట్టణంలో ఐకానిక్‌గా ఉండే కావేరి వంతెన మిమ్మల్ని ఉత్సహపరిచేలా స్వాగతం పలుకుతుంది. ఆ మార్గ మధ్యంలో ఉండే వివిధ రుచులతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌లు మిమ్మల్ని ఆస్వాదించమన్నట్లుగా నోరూరిస్తాయి. ఒంటరి మహిళా ప్రయాణికులకు కూడా ఇది సురక్షితమైన నగరంగా పేరుగాంచింది. కాంస్య కళాకారులు, స్తపతులు..స్వామిమలైలోని పురాతన ఆలయ కళ గ్రామం చూస్తే..మీ కళ్ల ముందే రాతి శిల్పాలు పుట్టుకొస్తాయని రాసి ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన కాంస్య కళాకారులు, శిల్పులను చూడొచ్చు. ఇక్కడ శిల్పులు పవిత్ర క్షేత్రాల నంచి తీసిన మట్టి నమునాలను మైనపు కళాఖండాలుగా మార్చి, అగ్ని ఆచారాలతో నిండిన ఆధ్యాత్మిక లాస్ట్ వాక్స్ మెటల్ కాస్టింగ్ ప్రకియ ద్వారా మెరిసే విగ్రహాలుగా రూపొందించారు. ఇక్కడ శిల్పశాస్త్రానకి సంబధించిన అద్భుతమైన స్తపతులు దర్శనమిస్తారు. ముఖ్యంగా, మట్టి, మైనంతో చక్కటి విగ్రహాలను తయారు చేయడం వారి ప్రత్యేకత. పచ్చదనానికి మారుపేరుగా ఉండే ఉద్యానవనాలు, ఎకోపార్క్‌లు..ప్రశాంతమైన కావేరి నది చుట్టుతా పచ్చని ఉద్యానవనాలు పర్యాటకులను సేదతీరమని పిలుస్తున్నట్లుగా ఆహ్లదకరంగా ఉంటాయి. పక్షి జాతులకు సంబంధించన అభయ అరణ్యలు, ఎకో పార్క్‌లు ప్రదాన చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. కావేరి నదిలో ఉండే చిన్న ద్వీపాల మాదిరగా ఉండే గ్రామాలను బోటింగ్‌తో చుట్టి వచ్చే సదుపాయం కూడా ఉంది. ఇక్కడి పార్కుల్లో జంతు శిల్పాలను పర్యాటకులను కట్టిపడేస్తాయి. హెర్బల్ గార్డెన్లు, పచ్చిక శిల్పాలు, పిల్లల ప్లే జోన్లు తదితర పర్యాటక ప్రదేశాలకు నెలవు ఈ తిరుచ్చి నగరం. తప్పక దర్శించి తరించాల్సిన ప్రదేశం ఇది.(చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?) -
నవ భారత నిర్మాణం కోసం...
రాజ్యాంగమే మనకు దిక్సూచి. రాజ్యాంగమే మనకు ప్రమాణం. రాజ్యాంగం హామీ ఇచ్చిన వ్యక్తిస్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. బౌద్ధం ప్రవచించిన సామాజిక సమానత్వం తిరిగి సాకారం కావాలి. ప్రజలు సిరిసంపదలతో తులతూగే, సుఖ సంతోషాలతో శాంతమయమైన జీవితాన్ని గడిపే రోజులు మళ్లీ రావాలి. ప్రేమతత్వాన్ని పెంపొందించాలి, ద్వేషాన్ని విడనాడాలి.అంబేడ్కర్ భారతదేశాన్ని బౌద్ధ భారతంగా గుర్తించారు. బీజేపీ పార్టీ రాముడు అని నినాదం చేస్తే, ఆవ్‌ు ఆద్మీ పార్టీ వాళ్ళు ఆంజనేయుడు అన్నారు. కొందరు రామరాజ్యం కావాలి అంటే, ఇంకొందరు కృష్ణరాజ్యం కావాలి అన్నారు. కానీ ఈరోజు కావాల్సింది బౌద్ధ రాజ్యం. బౌద్ధంలో సామాజిక సమానత్వం ఉంది. బౌద్ధ సూత్రాలతోనే అంబేడ్కర్ రాజ్యాంగం రచించారు. ‘మన ఉద్యమాలు హిందువుల మనసులను మార్చలేకపోయాయి. మనం ఆశించిన సమానత్వాన్ని అందుకోలేకపోయాం. వర్ణ వ్యవస్థకు, అస్పృశ్యతకు మూలమైన హిందూమతంలో కొనసాగేకంటే ఆ మతానికి స్వస్తి చెప్పి మరో మతాన్ని స్వీకరించడం మేలు. దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. అది నా చేతిలో లేదు. కానీ నేను హిందువుగా మరణించను’ అని అంబేడ్కర్ ప్రకటించారు. ఈ ప్రకటన హిందువుల గుండెల్లో ఆందోళన రగిలించింది. అంబేడ్కర్ హిందూ మతాన్ని విడనాడేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసిన హైందవేతర మతాధిపతులు అంబేడ్కర్‌ను తమ తమ మతాలను స్వీకరించాల్సిందని రాయబారాలు సాగించారు. ఆ సమయంలో ఇటలీ బౌద్ధ భిక్షువు లోక్‌నాథ్ శ్రీలంక వెళ్తూ బొంబాయిలోని రాజగృహ గ్రంథాలయంలో అంబేడ్కర్‌ను కలుసుకొని బౌద్ధ మత విశిష్టత గూర్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత దేశంలో అస్పృశులకు స్వాతంత్య్రాన్నీ, సమానత్వాన్నీ అందివ్వగలిగేది బౌద్ధమేననీ, అందుకు బౌద్ధాన్ని ప్రచారం చేయమనీ కోరారు. శ్రీలంక చేరుకున్న తర్వాత కూడా ఒక ఉత్తరాన్ని రాశారు. ‘‘...ఈ ఉత్తరాన్ని ముగించే ముందు నేను మీతో మీ గ్రంథాలయంలో మాట్లాడిన విషయాన్ని మరొక్క మారు గుర్తుకు తేనివ్వండి. డాక్టర్ అంబేడ్కర్! మీ భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. పీడిత ప్రజానీకానికి ఆనందమైన జీవితాన్ని అందించినా లేక వారిని దుఃఖంలో ముంచినా అంతా మీపై ఆధారపడి ఉంది. వారి భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మీరు మరో సామాన్యమైన మతాన్ని స్వీకరించినట్లయితే మీరే కాకుండా కోట్లాది ప్రజలు నష్టపోతారు. వారిని బౌద్ధమతం వైపు నడిపించండి. బౌద్ధమతం గురించి మీరు ప్రశంసించిన మాటలు నాకింకా బాగా గుర్తున్నాయి. మీ గ్రంథాలయ గోడపై ధ్యాన నిమగ్నంలో ఉన్న అత్యంత సౌందర్యవంతమైన బుద్ధుని చిత్రపటం నాకళ్ళ ఎదుటే వున్నట్లు కనిపిస్తుంది’ అంటూ భిక్కు లోక్‌నాథ్ రాశారు. అంబేడ్కర్ బౌద్ధమతం తీసుకోవటం వెనుక లోక్‌నాథ్ ప్రభావం కూడా ఉంది.నిజానికి బౌద్ధం గొప్ప చారిత్రక, రాజకీయ ధర్మం. శాతవాహన, ఇక్ష్వాకు రాజకుటుంబాల్లోని స్త్రీలు బౌద్ధం పట్ల మక్కువజూపి లెక్కలేనన్ని బౌద్ధచైత్యాల్ని, మండపాల్ని, విహారాల్ని నిర్మించారు. నాగార్జున కొండలో బయల్పడిన ప్రాకృత శాసనాలను పరిశీలిస్తే, ఆ కాలపు ప్రజలు సిరిసంపదలతో తులతూగి, సుఖ సంతోషాలతో, శాంతమయమైన జీవితాన్ని గడిపారని తెలుస్తుంది. వర్తకులు, కళాకారులు, భూస్వాములు, సైనికులు, ఉన్నతోద్యోగులు, ఒకరేమిటి వివిధ వృత్తులవారు ఒక్కటై బౌద్ధారాధనలో అంకిత భావంతో అమితోత్సాహంగా పాలు పంచుకొన్నారు. దీనికి అప్పటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించి తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల్లో బౌద్ధం విస్తరించటానికి తోడ్పడినాయి. అంబేడ్కర్‌కు ఈ చరిత్రంతా తెలుసు. అందుకే ఆయన బౌద్ధాన్ని ఒక జీవన విధానంగానే కాక, ఒక దేశీయ విధానంగానూ భావించారు. నిజానికి మనది బౌద్ధ భారతం. మన రాజముద్ర ఏది? బౌద్ధ చక్రవర్తి అశోకుడు చెక్కించిన సారనాథ్‌లోని నాలుగు తలల సింహస్తూపం, 24 ఆకులు గల ధర్మ చక్రాలతో కూడిన ముద్రే కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర ఏదీ? విదికుడనే చర్మకారుడు క్రీస్తు శకం 12 శతాబ్దంలో అమరావతి స్తూపంపై చెక్కిన పూర్ణ ఘట శిలాఫలకమే కదా! మనం వాడే ధర్మం అనే పదం ఎక్కడిది? బుద్ధుడు నైతిక విలువలకు చిహ్నంగా బోధించిన ‘ధమ్మ’ పదం నుంచి వచ్చిందే కదా! దక్షిణ భారతంలో ప్రసిద్ధులైన అనేకమంది మేధావులు బౌద్ధం నుండి వచ్చినవారే. నాగార్జునుడు, ఆర్యదేవ, భవ్య, దిఙ్నాగ, ధర్మకీర్తి, వసుబంధు, బుద్ధపాలిత, భావవివేక, అసంగ తదితర తత్వవేత్తలు అందరూ బౌద్ధులే. బౌద్ధం ప్రేమ తత్వాన్ని బోధించింది. ద్వేషాన్ని తొలగించింది. బౌద్ధ భారత నిర్మాణంలోనే ‘కుల నిర్మూలన’ జరుగుతుందని అంబేడ్కర్ బోధించారు. నిజానికి భారత రాజ్యాంగం అంతా బౌద్ధ సాంస్కృతిక జ్ఞాన వికాసంతో నిండి ఉంది. నిజానికి మత భావకులు ప్రేమను, నైతికతను, జ్ఞాన సంపదను చెప్పవలసిందిపోయి పరలోక రాజ్యాల గురించి బోధిస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగం అంతా అహింసా సూత్రాలతో నడుస్తుంది. అంటరానితనం నిషేధించబడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. రాజ్యాంగాన్ని పరిశీలిస్తే అంబేడ్కర్ బౌద్ధ ధమ్మపథ సారాన్ని అంతా ఎలా అందులోకి ఇమిడ్చారో మనకు అర్థమౌతుంది. అంబేడ్కర్ భారతదేశ చరిత్రను, సంస్కృతిని, నీతిశాస్త్రాన్ని, అహింసా ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని, కరుణ భావాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి బౌద్ధ భారత నిర్మాణానికి పునాదులు వేశారు. ఈనాడు ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు, లౌకిక వాదులు, సాంస్కృతిక వాదులు అందరం అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధ భారత నిర్మాణానికి తిరిగి పూనుకుందాం. అప్పుడే భారతదేశంలో క్రాంతి, శాంతి, అహింస, నైతికత, ఉత్పత్తి, ప్రేమ సమతుల్యం అవుతాయి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ప్రేక్షకులకు ఎలా దగ్గర కావాలో నాకు తెలుసు: రాశీ ఖన్నా
బహుభాషా కథానాయికల్లో నటి రాశీఖన్నా ఒకరు. అలాగే అందాలను విచ్చలవిడిగా తెరపై గుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడని నటి కూడా. అయితే పలు చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ స్టార్ అంతస్తు కోసం పోరాడుతూనే ఉంది. బహుశ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించడంతో ఏ భాషలోనూ సరిగా దృష్టి సారించకపోవడం కారణం కావచ్చు. రాశీఖన్నా తమిళంలో నటించిన తొలి చిత్రం ఇమైకా నొడిగళ్. నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తరువాత జయంరవికి జంటగా నటించిన అడంగ మరు, ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రంఫలం, కార్తీకి జంటగా సర్ధార్ చిత్రాల్లో నటించింది. కాగా తాజాగా ఈమె కథానాయకిగా నటించిన తమిళ చిత్రం అరణ్మణై 4. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో కథానాయకిగా తమన్న నటించింది. ఈ చిత్రంలో అందాలను ఆరబోయడంతో రాశీఖన్నా తమన్నతో పోటీ పడిందనే చెప్పాలి. ఏదేమైనా అరణ్మణై 4 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది. ఈ సందర్భంగా నటి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ ఇప్పుడు తాను తమిళం, తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలనని చెప్పింది. తాను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని చెప్పింది. తాజాగా అరణ్మణై 4 (తెలుగులో బాకు చిత్రంలో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది. తాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నానని, భాష అర్ధం అయితే ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని తనకు తెలుసు అని పేర్కొంది. కాగా తనకిప్పుడు తెలుగు, తమిళం భాషలను అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పింది. కాబట్టి ఇకపై తనకు భాషా సమస్య లేదని చెప్పింది. తాను నటించిన కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా ఈ పయనం బాగుందనే అభిప్రాయాన్ని నటి రాశీఖన్నా వ్యక్తం చేసింది. -
పడమ్ బిగిన్స్
కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ఆరంభమైంది.సూర్య కెరీర్‌లోని ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ, ‘పడమ్ బిగిన్స్’ (సినిమా ఆరంభమైంది) అంటూ చిన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సూర్య లుక్‌ని బట్టి ఇది పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. -
వారం తర్వాత కూలీగా...
‘కూలీ’గా మారిపోవడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్. ఆయన హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో సత్యరాజ్, శోభన కీలక పాత్రల్లో నటించనున్నారని, కమల్‌హాసన్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కాగా ‘కూలీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గర పేర్కొన్నారు రజనీకాంత్.తొలి షెడ్యూల్ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభం కానుందని తెలిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ‘కూలీ’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘వేట్టయాన్’ను అక్టోబరు 10న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా రజనీకాంత్ పేర్కొన్నారు. -
అప్పుడే ఇండియన్ 2 గురించి శంకర్‌తో మాట్లాడా!: కమల్‌హాసన్
‘‘ఇరవైఎనిమిదేళ్ల క్రితం నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాల్సింది. అదే సమయంలో ‘ఇండియన్’ కథతో దర్శకుడు శంకర్ వచ్చారు. ఈ రెండు చిత్రాల కథలు దగ్గర దగ్గరగా ఉన్నాయని శివాజీగారితో చెప్పాను. ‘శంకర్గారితోనే సినిమా చేయండి. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. శివాజీగారు అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతో శంకర్‌గారితో ‘ఇండియన్ ’ సినిమా చేశాను. నిర్మాత ఏఎం రత్నంగారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ సమయంలోనే ‘ఇండియన్’కు సీక్వెల్ గురించి శంకర్‌గారితో మాట్లాడాను. కథ రెడీగా లేదన్నారు.28 ఏళ్ల తర్వాత ‘ఇండియన్ 2’ చేశాం. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది’’ అన్నారు కమల్‌హాసన్. హీరో కమల్‌హాసన్– దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలు రూపొందాయి. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ‘ఇండియన్ 2’ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో శంకర్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్ వంటి నటులు ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇండియన్ 2’ పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఇండియన్’ సినిమాకు ఏఆర్ రెహమాన్‌గారు గొప్ప సంగీతం ఇచ్చారు. ‘ఇండియన్ 2’కి నేను సంగీతం ఇచ్చాను. శంకర్‌గారు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు అనిరు«ద్ రవిచందర్. -
అటెన్షన్... లుంగీ ఇన్ లండన్
దక్షిణ భారతంలో లుంగీతో కనిపించడం వింతేమీ కాదు. అయితే లండన్‌లో కనిపిస్తే మాత్రం వింతే. ఆ వింతే ఈ వీడియోను వైరల్ అయ్యేలా చేసింది. వలేరి అనే తమిళియన్ రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో, పాపుల్లో ‘రీల్స్’ చేసి అక్కడి ప్రజల రియాక్షన్‌ను రికార్డ్ చేసింది. ‘వియరింగ్ లుంగీ ఇన్ లండన్’ కాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
హరర్ సినిమాతో వస్తున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. హన్సిక. ఆమె ఇప్పుడు 'గాంధారి'గా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్. కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్, కండెన్ కాదలై, సేటై, ఈవెన్ తందిరన్, బిస్కోత్ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా 'గాంధారి' పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు.ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హారర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా, అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు.ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా దిపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం చైన్నె సముద్ర తీరంలో రూ.60 లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుగళం నరేన్, స్టంట్ సిల్వ, వినోదిని, పవన్ కుడివేలు మురుగన్, కలైరాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2025లో సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా గాంధారి సినిమా రిలీజ్ అవుతుంది. -
స్ఫూర్తిదాయక పోరాటం
రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు.‘సలార్, కేజీఎఫ్’ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మించిన తొలి తమిళ సినిమా ఇది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఈ సినిమా కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది... నవ్విస్తుంది... స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు కీర్తీ సురేష్. ఒక సామాజిక అంశంతో ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ‘రఘు తాత’ ఉంటుందని టాక్. తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందట. -
నయనతార ప్లేస్‌లో త్రిష?
తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, ఆర్జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్జే శరవణన్‌తో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది.వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి.. సీక్వెల్లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
అండమాన్‌లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్‌కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్‌లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. -
జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 22న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచి్చ, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్ 30న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి.సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కలి్పంచారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ రూ.14,250, 3 ఏసీ రూ.21,900, 2 ఏసీ రూ.28,450గా ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం గాని సెల్ : 9281495848, 8287932312 నంబర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. -
ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్ కపాడియా
కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్‌లో మెరిసింది. తొలి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్‌గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్ శివన్ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అనసూయ సేన్ గుప్తా ‘ది షేమ్‌లెస్’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్. నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ‘లా సినిఫ్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్’ అనే మరో భారతీయ యానిమేటెడ్ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. దర్శకురాలు పాయల్ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమా సత్తా చాటింది.గ్రాండ్ ప్రిక్ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుకు కూడా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్ డి ఓర్ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్ బేకర్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.‘గ్రాండ్ టూర్’ సినిమాకు గాను మిగ్యుల్ గోమ్స్ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్ ఆఫ్ కైండ్‌నెస్’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పరేజ్’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్ డియార్డ్ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్‌కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ స్వీకరించారు.‘‘నిజానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్’కి థ్యాంక్స్. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఫెస్టివల్ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమాను థామస్ హకీమ్, జూలియన్ గ్రాఫ్ నిర్మించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌కే కాన్స్‌లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్ ప్రిక్ అవార్డు రావడం విశేషం.అయితే కాన్స్‌లో పాయల్ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్ ఐ అవార్డు పాయల్‌కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్ నూన్ క్లౌడ్’ ప్రదర్శితమైంది. ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్‌ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్షిప్లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్ ట్రిప్‌కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. -
కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్‌లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్‌లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్‌కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్‌లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్‌లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్‌కతా. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్‌లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్‌లో 2020 జూన్‌లో ‘ది షేమ్‌లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్‌కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్‌కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్‌ఫ్లవర్స్’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద. -
కాంబినేషన్ కుదిరింది
‘మిన్సార కనవు’ (‘మెరుపు కలలు’ – 1997) చిత్రం తర్వాత కాజోల్, ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇరవయ్యేడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గుప్తాఆదిత్య సీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ మొదలైంది.‘‘మా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్‌తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చరణ్ తేజ్‌కి మాత్రమే కాదు.. సంయుక్తాకు కూడా హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
Lok Sabha Election 2024: దక్షిణాన కాషాయ జెండా
భువనేశ్వర్: దక్షిణ భారతదేశంలో ఈసారి కూడా బీజేపీయే అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వెలిబుచ్చారు. దేశమంతటా ఎన్డీఏకు స్థానాలు పెరుగుతాయని, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతదేశంలో బీజేపీ బలం మరింతగా పెరగనుందని జోస్యం చెప్పారు. ‘‘దళిత, ఓబీసీ, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో ఉన్న పార్టీ బీజేపీయే. కానీ ‘బీజేపీ పట్టణ పార్టీ, కేవలం ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ–బనియా పార్టీ’ అంటూ దుష్ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దక్షిణాదిన మాకు బలం లేదన్నది కూడా విపక్షాలు వ్యాప్తి చేసిన అలాంటి అపోహే. దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఇలాంటి అపోహలను ప్రచారంలో పెట్టాయి. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది? దక్షిణ భారతంలో బీజేపీయే అతి పెద్ద పారీ్టగా అవతరించింది. అప్పటితో పోలిస్తే అక్కడి ప్రజల మనసును మరింతగా గెలుచుకున్నాం. ఆ లెక్కన దక్షిణాదిన ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం. మా భాగస్వాములనూ కలుపుకుంటే అక్కడ ఎన్డీఏ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది’’ అన్నారు. ఆదివారం పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన 131 లోక్‌సభ స్థానాల్లో 2019లో బీజేపీకి 29 సీట్లు రావడం తెలిసిందే. తూర్పు భారతదేశంలో దశాబ్దాల అభివృద్ధి లేమిని పక్కా ప్రణాళికతో పదేళ్లలో తుడిచిపెట్టామని మోదీ అన్నారు. ‘‘మొత్తం తూర్పు భారతాన్నీ సాధికారపరిచాం. ఫలితంగా ‘రెడ్ కారిడార్’గా పిలిచే ఆ ప్రాంతం ‘కాషాయ కారిడార్’గా మారిపోయిందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయనున్నాయి. పలు తూర్పు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని సారథ్యంలోని ఇండియా కూటమి ఖాతా కూడా తెరవలేవు’’ అని జోస్యం చెప్పారు. దాంతో భువనేశ్వర్, కోల్‌కతాతో పాటు ఢిల్లీలోనూ కొన్ని పారీ్టలకు ఇప్పట్నుంచే కంటిపై కునుకు కరువైందని బిజూ జనతాదళ్, తృణమూల్, కాంగ్రెస్‌లను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల ఆశీస్సులతో మేమీసారి రికార్డు స్థాయి విజయం సాధించబోతున్నాం. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాలు సాధించడం ఖాయం (4 జూన్, 400 పార్)’’ అని చెప్పారు. ‘‘ఉనికిపరంగానే గాక భావజాలపరంగా కూడా బీజేపీ మాత్రమే దేశంలో సిసలైన జాతీయ పార్టీ. ఎందుకంటే దేశమే ముందన్నది మా మూల సిద్ధాంతం’’ అని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కాంగ్రెస్‌కు లారీల్లో నల్లధనం! ‘అదానీ–అంబానీ’ అవినీతి అంటూ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను కొన్నేళ్లుగా నిత్యం విమర్శిస్తూ వచి్చన రాహుల్ బాబా ఎన్నికలు మొదలవగానే ప్లేటు ఫిరాయించారు. ఆయన ప్రచారంలో ఎక్కడా వారి ప్రస్తావనే లేదు! హఠాత్తుగా ఎందుకీ మార్పు? ఎందుకంటే అంబానీ, అదానీలతో లోపాయకారీ లింకులున్నది కాంగ్రెస్ పారీ్టకే. తమకు లారీల నిండా డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడబోమన్న కాంగ్రెస్ అగ్ర నేత అ«దీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అదానీ, అంబానీలతో కాంగ్రెస్‌కు డీల్ కుదరడం, రాహుల్ తమను విమర్శించకుండా ఉండేందుకు వారిద్దరూ లారీల నిండా నల్లధనం పంపడం నిజమో కాదో చెప్పాలి! ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ నేతల ఆరోపణలూ పస లేనివే. అవి రెండూ స్వతంత్రంగా పని చేసే సంస్థలని స్వయానా అ«దీర్ చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. ‘ప్రత్యేక పౌరుల’ హోదాకు ఒప్పుకోను మైనారిటీ సంతుïÙ్టకరణ కోసం కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాలనే నా ఎన్నికల ప్రసంగాల్లో బయట పెడుతున్నాను. అంతే తప్ప మైనారిటీలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ కూడా వారికెప్పుడూ వ్యతిరేకం కాదు. కాకపోతే ‘ప్రత్యేక పౌరుల’ హోదాను ఎప్పటికీ అంగీకరించబోను. ఎందుకంటే ప్రజలందరూ సమానమే. కేవలం ఎన్నికల రాజకీయాల కోసం రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక స్ఫూర్తికి నిత్యం గండి కొట్టే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. రిజర్వేషన్లకు మతం ప్రాతిపదిక కారాదని అంబేడ్కర్, నెహ్రూతో సహా రాజ్యాంగ నిర్మాతలంతా తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో నిండా ముస్లిం లీగ్ ఛాయలే! చివరికి టెండర్ల కేటాయింపు వంటివాటిలో కూడా మైనారిటీలకు రిజర్వేషన్లిస్తామని అందులో హామీలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉండగా పాకిస్తాన్‌తో సమర్థంగా వ్యవహరించకుండా జాతి ప్రయోజనాలనే పణంగా పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. రాహుల్ వ్యాఖ్యలను పాక్ నేతలు ప్రశంసిస్తున్న పరిస్థితి! మన వీర సైనికులను పొట్టన పెట్టుకున్నది పాక్ ఉగ్రవాదులు కాదని కాంగ్రెస్ నేతలంటున్నారు. పాక్ వద్ద అణుబాంబులున్నాయి గనుక ఆ దేశాన్ని గౌరవించాలని చెబుతున్నారు. సర్జికల్ దాడులకు రుజువులేవని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించడం, కాంగ్రెస్ కుట్రలను బయట పెట్టడం నా బాధ్యత. కాంగ్రెస్‌ది సంతుïÙ్టకరణ బాట. నాది అందరినీ సంతృప్తిపరిచే అభివృద్ధి బాట. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి పారీ్టల పేలవ ప్రచారం కూడా ఓ కారణం. వాటికి సొంత కార్యకర్తలు కూడా ఓటేయడం లేదు. ఇదంతా బీజేపీకే లాభం చేకూరుస్తుంది. బీజేడీ పుట్టి మునుగుతోంది ఒడిశా ప్రజలు మార్పు కావాలని నిర్ణయించుకున్నారు. నవీన్ పటా్నయక్ ప్రభుత్వంపై వారిలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అధికార బిజూ జనతాదళ్ మనుగడ ఇక కష్టమే. ఒడిశాలో బీజేపీ ఐదేళ్లుగా తీవ్రంగా కష్టపడి నంబర్ టూ నుంచి నంబర్‌వన్ స్థానానికి చేరింది. యూసీసీ హామీ నెరవేరుస్తాం ఉమ్మడి పౌర స్మృతి, ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బీజేపీ మేనిఫెస్టో హామీలు. వాటిని నెరవేర్చి తీరతాం. జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే ముందుగా మేమేం చేయాలో సూచించాల్సిందిగా దేశ యువతనే అడగదలచుకున్నా. అందుకోసం ‘తొలి 100 రోజుల కార్యాచరణ’ను 125 రోజులకు పొడిగించాను. మాకు 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న విపక్షాల విమర్శలు నిరాధారం. నేను స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ నా శ్రేయస్సు కూడా రాజ్యాంగ శ్రేయస్సులోనే ఇమిడి ఉంది. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే రాజ్యాంగం వల్లే. నేను స్ఫూర్తి, శక్తి పొందేదే రాజ్యాంగం నుంచి!బ్రాండ్ మోదీ!నేను కార్యసాధకున్ని. ‘బ్రాండ్ మోదీ’ అన్నది రెండు దశాబ్దాల పై చిలుకు ప్రజా జీవితంలో వారి నుంచి సంపాదించుకున్న విశ్వాస ఫలితం. అంతే తప్ప దానికోసం నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. నేనూ మనిíÙనే. తప్పిదాలు చేసుండొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశాలు మాత్రం నాకెప్పుడూ ఉండవు. మండెటెండల్లో కూడా నా సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వారి కళ్లలో నాపై కనిపించే తిరుగులేని విశ్వాసమే నాకు శక్తినిచ్చి నడిపిస్తోంది. 13 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా చేసిన వ్యక్తి మాతృమూర్తి తన చివరి రోజుల్ని ప్రభుత్వాసుపత్రిలో గడిపిందంటే, అలాంటి దేశానికి మరే ఇతర బ్రాండూ అవసరం లేదని నా అభిప్రాయం. అతడు భిన్నమైన వ్యక్తి అని ఆ దేశం ఏనాడో అర్థం చేసుకుంది’’.రూ.250 కోట్ల అవినీతి కంటే 250 జతల బట్టలు మేలే! తాను అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తానంటూ రాహుల్ తదితరులు చేసే ఆరోపణలపై మోదీ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోపణ దుస్తుల గురించే! నాకు 250 జతల బట్టలున్నాయని గతంలో గుజరాత్ మాజీ సీఎం అమర్‌సింగ్ చౌదరి ఆరోపణలు చేశారు. అప్పుడు నేను సీఎంగా ఉన్నా. అదే రోజు ఓ సభలో పాల్గొన్నా. ‘రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా, లేక 250 జతల బట్టలున్న ముఖ్యమంత్రా?’ అని వేదిక నుంచి ప్రజలనడిగా. 250 జతల బట్టలున్నా పర్లేదు గానీ అవినీతిపరుడు వద్దని వారంతా ముక్త కంఠంతో చెప్పారు. దాంతో విపక్షాలు ఇంకెప్పుడూ నాపై అవినీతి ఆరోపణలకు ధైర్యం చేయలేదు’’ అన్నారు. నిజానికి తనకెప్పుడూ అన్ని జతల బట్టల్లేవంటూ ముక్తాయించారు. -
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అపరిచితుడు. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రాన్ని రూ.20 కోట్లతో తెరకెక్కించగా.. రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రి రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు అభిమానులను అలరించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. త్రిపాత్రాభినయంతో రెమో, అపరిచితుడు, బ్రాహ్మణుడిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. -
బీజేపీకే దక్షిణ భారత్: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక లోక్‌సభ సీట్లను సాధించి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పది స్థానాలకుపైగా కచ్చితంగా గెలుస్తామని.. 13 సీట్లలో పార్టీ పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను బీజేపీయే గెలవబోతోందని పేర్కొన్నారు. ఈసారి 400 సీట్లు దాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు శనివారం సాయంత్రం కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌లతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రషు్టపట్టాయి. దీనిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో 4% ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం. గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైంది. సోనియా పుట్టినరోజున రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ సోనియా ఎన్నో పుట్టినరోజున అనేది చెప్పలేదు. రైతులకు రూ.15 వేల భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదు. అవేవీ చేయలేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు హైకమాండ్‌కు ఇచ్చిన ఒక హామీ ని మాత్రం పూర్తిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారు. పీవోకే భారత్‌లో భాగమే.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా.. పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. కశీ్మర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోం. పీవోకే భారత్‌లో అంతర్భాగమే. రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడుగుతున్నారు. అలా స్ట్రైక్స్ చేసిన మూడో దేశం భారత్ మాత్రమే. దేశ సరిహద్దులు, అంతర్గత అంశాల్లో చొరబడేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోబోం. వారి భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ దాడిచేస్తాం. ఇండియా కూటమి దేశాన్ని విభజిస్తోంది.. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు విభజన చేస్తున్నాయి. ఇప్పటికే దేశాన్ని కాంగ్రెస్ ఒకసారి విడగొట్టింది. వారికి అంతకన్నా ఇంకేం రాదు. బీజేపీ ఉన్నంత వరకు విభజన జరగనివ్వం. అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమయం ఇచ్చింది. బెయిల్ రావడమే క్లీన్ చిట్ అనుకుంటే.. అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ రాహుల్ గాం«దీని 20సార్లు లాంచ్ చేసినా విజయవంతం కాలేదు. 21వసారి కూడా అదే విఫల ప్రయత్నం చేస్తోంది. వారి తీరుతో ఆర్థికంగా వెనుకబాటు 2014లో తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్‌గా ఉంది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా రూ.80 వేల కోట్లు వడ్డీల కిందే కట్టాల్సిన దుస్థితి నెలకొంది. విభజనకు ముందు కేంద్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.15వేల కోట్లు అందితే.. ఇవాళ ఒక్క తెలంగాణకే కేంద్రం నుంచి రూ.60వేల కోట్లు గ్రాంట్లుగా వస్తోంది. తెలంగాణలో మౌలిక వసతుల కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు అందిన నిధులకంటే.. మోదీ సర్కారు గత పదేళ్లలో రెట్టింపు నిధులు ఇచ్చింది. రిజర్వేషన్ల రద్దు ఉద్దేశమేదీ లేదు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే కాంగ్రెస్ ప్రచారాన్ని అవాస్తవం. గత పదేళ్లుగా ఎన్డీయేకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. మేం రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మేం మా మెజారిటీని ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దుకు, రామాలయ నిర్మాణానికి వాడాం. ఏవైనా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఆర్థికంగా, సామాజికంగా, విద్యపరంగా వెనుకబాటుదనం ప్రాతిపదికన రిజర్వేషన్లను ముస్లింలు, క్రిస్టియన్లు పొందవచ్చు. దానికి మేం వ్యతిరేకం కాదు. నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. ఈ అంశంపై నా మాటలను మారి్ఫంగ్ చేసి ప్రచారం చేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఐదేళ్ల టర్మ్‌ను పూర్తిచేస్తారు. దానిపై బీజేపీలో ఎలాంటి అనుమానాల్లేవు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో 92 శాతం అమలు చేశాం. మూడు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. నాలుగో దశలోనూ మద్దతివ్వాలని కోరుతున్నాం’’అని అమిత్ షా పేర్కొన్నారు. మా ప్రగతి ఓవైపు.. వారి అవినీతి మరోవైపు.. ఓ వైపు ఇండి కూటమి.. మరోవైపు ఎన్డీయే కూటమి బరిలో ఉన్నాయి. ఓవైపు రూ.12 లక్షల కోట్ల అవినీతి కూటమి.. మరోవైపు 23 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా ఉన్న మోదీపై 25 పైసల అవినీతి కూడా లేని కూటమి. అధికార అహంకారం తలకెక్కిన ఇండి కూటమి అటు.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఇటు.. నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టి, కాస్త ఎండలు కాస్త పెరగగానే థాయ్లాండ్కో. మరో చోటికో వెళ్లే యువనేత అటు.. పేదింట్లో పుట్టి పెరిగి, పేదల కష్టాలు తెలిసి వాటిని దూరం చేస్తున్న మోదీ ఇటు.. గత పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆరి్ధక వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా వంటివాటిలో గణనీయ ప్రగతి సాధించాం. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రం కుట్రచేస్తోందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. రాష్ట్రాన్ని వారు నడుపుతున్న తీరును చూసి ఎవరూ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అయినా పెట్టుబడులు కావాలంటే ప్రధానిని కలసి, అడిగితే బాగుంటుంది. అనవసర విమర్శలు సరికాదు. ప్రాంతీయ పార్టీలు తమ వాణిని వినిపించే అధికారం ఉంటుంది. కేసీఆర్‌కు కూడా ఆ అధికారం ఉంది. అంతే తప్ప బీజేపీతో పోల్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఎండోమెంట్ చట్టం తొలగింపు అంశం కోర్టు ముందుంది. కోర్టు ఏం చెబితే అదే చేస్తాం. -
వందో ఆస్కార్‌కి నాలుగు వేల కోట్లు!
ఆస్కార్ శతాబ్ది ఉత్సవాల (ఆస్కార్ అవార్డుల వందో వేడుక) సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆస్కార్ 100’ పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఆస్కార్ 100’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం.ఇందుకోసం 500 మిలియన్ డాలర్ల క్యాంపైన్ (దాదాపు రూ. నాలుగు వేల కోట్లు)ను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాదిన్నరలో ఇప్పటికే ‘ఆస్కార్ 100’ కోసం వంద మిలియన్ డాలర్లను సేకరించాం. ‘ఆస్కార్ 100’ ఈవెంట్‌ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంలోనే మరో వంద సంత్సరాల పాటు ఆస్కార్ అవార్డు వేడుకలను ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుని, ఓ అవగాహనకు రావాలనుకుంటున్నాం’’ అని ఆస్కార్ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్ క్రామోర్ చెప్పుకొచ్చారు. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్న విషయం తెలిసిందే. -
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్‌గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. -
జూన్‌లో రాయన్
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం జూన్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు ఈ సినిమా నుంచి తొలి పాటని ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు ధనుష్. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదలైన మటన్ కొట్టు రాయన్గా ధనుష్ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. -
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మరో ఓటీటీ సంస్థ!
ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్ శంకర్, ఎంఆర్ శీనివాసన్, సుధాకర్ కలిసి ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్ జాన్ కిళడి(పైరీ), మణివర్మన్(ఒరునొడి), ఆర్.వెంకట్(కిడా), బాలాజీ వేణుగోపాల్ (లక్కీమేన్), కన్నుసామి(వట్టార్ వళక్కు), యశ్వంత్ కిశోర్ (కన్నగి), విఘ్నేశ్కార్తీక్( హార్ట్స్పార్ట్) శరత్ జ్యోతి, రచయిత వసంత్ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్ ముణుసామివీరప్పన్(వెబ్‌సిరీస్)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్‌లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్ శంకర్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్ మరో 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్‌ఫామ్‌గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్ శంకర్ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్ అనే వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను, సెన్టెన్స్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
మరింత ఆలస్యంగా ‘ఇండియన్ 2’..?
భారతీయుడి రాక మరింత ఆలస్యం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). పాతిక సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌తోనే ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు శంకర్. ‘ఇండియన్ 2’ని ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్ రవిచందర్. -
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్‌ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్‌లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్‌ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్‌లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
పాన్ ఇండియా రేంజ్లో రజనీకాంత్ బయోపిక్
సెలబ్రిటీల జీవిత చరిత్రలు వెండితెరకెక్కడం సహజమే. అలా ఇప్పటికే రాజకీయ రంగంలో మహాత్మాగాంధీ, కామరాజర్, జయలలిత,వైఎస్ఆర్.. క్రీడా రంగంలో మహేంద్రసింగ్ ధోని వంటి పలువురు బయోపిక్స్ సినిమాగా రూపొందాయి. ఇందిరాగాంధీ, సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. కాగా తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కర్ణాటకకు చెందిన శివాజీరావ్ గైక్వాడ్ అనే ఒక సాధారణ బస్సు కండెక్టర్ ఇవాళ దక్షిణ భారత సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే. రజనీకాంత్ జీవిత పయనం చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పాలి. కాగా ఈయన జీవిత చరిత్రను ఇప్పుడు వెండి తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా వార్త. హిందీలో పలు చిత్రాలను నిర్మించిన సుజిత్ నడియద్వాలా నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయన ఇటీవల నటుడు రజనీకాంత్‌ను కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. ఆయన అనుమతితో ఈ స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ? రజనీకాంత్‌గా ఎవరు నటిస్తారూ? అన్న విషయాల గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కనుందన్న ప్రచారం మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి ఇది హిందీలోనే రూపొందుతుందా? లేక పాన్ ఇండియా చిత్రంగా రానుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
తమిళ నటుడు, నిర్మాత సుందర్ సి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన అరణ్మనై-4తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నటుడిగా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన భార్య ఖుష్బు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.సుందర్ మాట్లాడుతూ..'ఇదంతా మా పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు ఖుష్బు అనారోగ్యంతో ఉంది. తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఖుష్బు ఏడుస్తూ చెప్పింది. కానీ నేను తననే వివాహం చేసుకోవాలకున్నా. నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ దేవుడు మమ్మల్ని మరోలా దీవించాడు. ప్రస్తుతం మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.' అని తెలిపారు.సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా మే 3కి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఖుష్బు నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా.. 2016లో పార్ట్-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది. -
రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ప్రముఖ నటుడు
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే నిధుల కొరత కారణంగా భవన నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే దీన్ని పూర్తి చేయడానికి ప్రస్తుత కార్యవర్గం నడుం బిగించింది. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ.40 కోట్ల వరకూ అవసరం అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకోసం నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుంటున్నట్లు సంఘం కార్యదర్శి విశాల్ ఇటీవల తెలిపారు. కాగా సంఘం నూతన భవన నిర్మాణం కోసం సినీ ప్రముఖులు పలువురు పెద్ద మొత్తంలో నిధిని విరాళంగా అందిస్తున్నారు. నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధిస్టాలిన్ ఇటీవల కోటి రూపాయలను విరాళంగా అందించారు. అదే విధంగా నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, నటుడు విజయ్ కూడా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. కాగా ఇటీవల నటుడు శివకార్తికేయన్ రూ. 50 లక్షలు విరాళం అందించారు. కాగా తాజాగా ప్రముఖ నటుడు నెపోలియన్ రూ.కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈయన 2000 నుంచి 2006 వరకూ నడిగర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారన్నది గమనార్హం. ఇప్పుడు కోటి రూపాయలను నూతన భవన నిర్మాణానికి విరాళంగా అందించడంతో ఆయనకు సంఘ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా ఇటీవలే నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజకీయ జీవితంనెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా గెలిచారు. 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
అజిత్‌కి జోడీగా...
కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్‌బాబు సినిమాలో...మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
స్టార్ హీరోకు కూతుర్ని.. నన్నే రూమ్‌కు వస్తావా అన్నాడు: వరలక్ష్మీ శరత్ కుమార్
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్‌లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్‌గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్‌లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్‌లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది. -
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్‌కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్‌లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్‌లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్‌లాల్‌గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్‌లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్‌లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్‌లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
గ్రీన్‌సిగ్నల్
మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నయనతార. మలయాళ నటుడు నివిన్ ΄పౌలి నటించనున్న చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారామె. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సందీప్ కుమార్ అండ్ జార్జ్ ఫిలిప్ రాయ్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నివిన్ ΄పౌలికి చెందిన ΄పౌలి జూనియర్ పిక్చర్స్, కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్ అండ్ అల్ట్రా కలిసి ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది.