హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రవాణా సేవల కంపెనీ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ (ఫెడెక్స్) దక్షిణ భారత్ ప్రాంతాలకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానత కల్పించేందుకు కొత్తగా ఐదు కార్గో విమాన సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి కీలక దిగుమతులకు ఈ విస్తరణ వీలు కల్పిస్తుందని, యూరప్, యూఎస్‌ఏకి ఎగుమతుల వృద్ధికి సాయపడుతుందని కంపెనీ తెలిపింది.
అలాగే, లాజిస్టిక్స్, సరఫరా చైన్‌కు అనుకూలిస్తుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో దక్షిణ భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని పేర్కొంది. ‘‘దేశ వృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ కంపెనీలకు కేంద్రంగా ఉంటోంది. నూతన ఫ్లయిట్ సేవలు ఈ ప్రాంత డిమాండ్‌ను తీర్చేందుకు ఫెడెక్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’అని ఫెడెక్స్ సీఈవో, సీఎఫ్‌వో రిచర్డ్ వి.స్మిత్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment