Fedex Courier Company
-
దక్షిణ భారత్‌కు ఐదు కొత్త కార్గో విమాన సర్వీసులు
హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రవాణా సేవల కంపెనీ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ (ఫెడెక్స్) దక్షిణ భారత్ ప్రాంతాలకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానత కల్పించేందుకు కొత్తగా ఐదు కార్గో విమాన సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి కీలక దిగుమతులకు ఈ విస్తరణ వీలు కల్పిస్తుందని, యూరప్, యూఎస్ఏకి ఎగుమతుల వృద్ధికి సాయపడుతుందని కంపెనీ తెలిపింది.అలాగే, లాజిస్టిక్స్, సరఫరా చైన్‌కు అనుకూలిస్తుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో దక్షిణ భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని పేర్కొంది. ‘‘దేశ వృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ కంపెనీలకు కేంద్రంగా ఉంటోంది. నూతన ఫ్లయిట్ సేవలు ఈ ప్రాంత డిమాండ్‌ను తీర్చేందుకు ఫెడెక్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’అని ఫెడెక్స్ సీఈవో, సీఎఫ్‌వో రిచర్డ్ వి.స్మిత్ ప్రకటించారు. -
ఢిల్లీలో భారీ సైబర్ క్రైం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నార్కోటిక్స్ డివిజన్ అధికారులమంటూ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలి(34) నుంచి సుమారు రూ.4.50 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ తరహా సైబర్ నేరం ఇదేనంటున్నారు పోలీసులు. ఫెడ్ఎక్స్ కొరియర్ సర్వీస్ ద్వారా ఆమె పేరుతో ముంబై నుంచి తైవాన్ వెళ్లాల్సిన పార్సిల్లో ఇతర వస్తువులతోపాటు డ్రగ్స్ ఉన్నాయంటూ నేరగాళ్లు మే 5న సదరు బాధితురాలికి ఫోన్ చేశారు. అది మొదలుకొని అంధేరి పోలీస్ స్టేషన్, ముంబై డీసీపీ, ఆర్బీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారుల పేరుతో పలువురు స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు మాయమాటలు చెప్పారు. ఈ విషయాలను భర్త సహా ఎవరికీ చెప్పొద్దంటూ నమ్మించారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉన్న రూ.4.47 కోట్లను డ్రా చేయించి, ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. స్కైప్ ద్వారా జరిగిన సంభాషణలను డిలీట్ చేయించారు. డబ్బును తిరిగి ఇస్తామన్న మోసగాళ్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితురాలు మోసం గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు. -
హైదరాబాద్‌లో ఫెడెక్స్ ‘ఏసీసీ’
హైదరాబాద్: లాజిస్టిక్స్ సేవల్లోని ఫెడెక్స్ హైదరాబాద్‌లో తన తొలి అడ్వాన్స్డ్ క్యాపబులిటీ కమ్యూనిటీ (ఏసీసీ)ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన భిన్నమైన మానవవనరుల నియామకం, అభివృద్ధి కోసం దీన్ని వినియోగించు కోనుంది. తద్వారా మరింత చురుకైన, సమర్థ వంతమైన సంస్థగా కస్టమర్లకు డెలివరీ అనుభవాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఫెడెక్స్ తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏసీసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వ్యాపార అవసరాలు, అధిక నైపుణ్య మావన వనరుల అవసరాల ఆధారంగా ప్రాంతాలను ఎంపిక చేస్తామని పేర్కొంది. -
ఫెడ్ఎక్స్: ఏకంగా ఆ ఉద్యోగులకే షాక్.10 శాతం ఔట్
న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడ్ఎక్స్ కార్పో కూడా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. అమెరికాలో ఇప్పటికే 12వేల మంది సాధారణ ఉద్యోగులను తొలగించిన సంస్థ ఇపుడికి మేనేజ్మెంట్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునేందుకు నిర్ణయంచింది. షిప్పింగ్ మందగమనం నేపథ్యంలో ఫెడెక్స్ కార్ప్ తన గ్లోబల్ మేనేజ్మెంట్ సిబ్బందిలో 10 శాతం కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈమేరకు తమ సిబ్బందికి ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. అలాగే కంపెనీ ఆఫీసర్ , డైరెక్టర్ ర్యాంక్‌ల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు , కొన్ని టీంలను కలిపివేస్తున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజ్ సుబ్రమణ్యం వెల్లడించారు. సంస్థ అభివృద్ధి కోసం దురదృష్టవశాత్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేని పేర్కొన్నారు. డిసెంబరులో దాని ఇటీవలి ఆర్థిక ప్రకటన ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 550,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. -
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
మరో అంతర్జాతీయ కంపెనీకి సీఈవోగా భారత సంతతి వ్యక్తి
కొరియర్ రంగంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఫెడ్ ఎక్స్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతి వ్యక్తి రాజ్ సుబ్రమణియన్ పదవీ బాధ్యలు చేపట్టనున్నారు. 2022 జూన్ 1 నుంచి ఆయన ఈ పదవిలోకి వస్తారని ఫెడ్ఎక్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఫెడ్ఎక్స్ సంస్థకి ప్రస్తుతం సీఈవోగా ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ ఉన్నారు. జూన్ 1తో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త సీఈవో వేటలో ఉన్న ఫెడ్ఎక్స్ సంస్థ చివరకు రాజ్ సుబ్రమణియన్‌ను ఆ స్థానానికి తగిన వ్యక్తిగా ఎంపిక చేసుకుంది. ఫ్రెడెరిక్ స్మిత్ 1971లో ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థను స్థాపించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో ఆరు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక రాజ్సుబ్రమణియన్ విషయానికి వస్తే ఫెడ్‌ఎక్స్‌లో 1991లో చేరిన రాజ్ సుబ్రమణియన్ 2020లో ఫెడ్ఎక్స్ బోర్డు సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. రెండేళ్లు అక్కడ పని చేసిన తర్వాత ఏకంగా సీఈవో స్థానానికి చేరుకున్నారు. ఫెడ్ఎక్స్ సీఈవో పోస్టుకు రాజ్ సుబ్రమణియన్ తగిన వ్యక్తని. ఆయన సారధ్యంలో ఫెడ్ఎక్స్ మరిన్న ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం ఉందని ఫెడ్ఎక్స్ గవర్నింగ్ బోర్డు చైర్మన్ డేవిడ్ స్టైనర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్రెడెరిక్ స్మిత్ ఎంతో ముందు చూపుతో స్థాపించిన ఫెడ్ఎక్స్ను మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని రాజ్ సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: ఆస్కార్ అవార్డ్ వేడుకలో తళుక్కున మెరిసిన ఇండియన్ ఇంజనీర్..! -
అక్కడ ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. కస్టమర్‌కి చేరేది కష్టమే! ఎందుకో తెలుసా?
లాస్ ఏంజెల్స్.. టీవీ, సినీ రంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నగరం. ప్రత్యేకించి ఇక్కడుండే హాలీవుడ్ సైన్ గురించి చెప్పనక్కర్లేదు కదా. అలాంటి నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కూడా!. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై చోరీలతో అమెజాన్‌లాంటి ఈ-కామర్స్ సైట్లు, రైల్వే ఆపరేట్లు విపరీతంగా నష్టపోతున్నారు. లాస్ ఏంజెల్స్ కౌంటీ రైల్వే ప్యాసింజర్లతో ఉండే బిజీ రూట్. దీంతో గూడ్స్‌తో వెళ్లే రైళ్లను ఈ మార్గంలో చాలాసేపు నిలిపేస్తారు. ఇదే అదనుగా నేరస్థులు చెలరేగిపోతున్నారు. కంటెయినర్లను బద్ధలు కొట్టి.. అందులోని పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లిపోతున్నారు. రమారమీ 2021లో ఇలా పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా వాటిల్లిన నష్టం 5 మిలియన డాలర్ల( సుమారు 37 కోట్ల రూపాయలకు) అంచనా వేసింది ఈ రూట్లో రైళ్లు నడిపించే యూనియన్ ఫసిఫిక్. తాజాగా శుక్రవారం ఓ భారీ చోరీ చోటు చేసుకోగా.. పోస్టల్ శాఖ పార్శిల్స్‌తో పాటు అమెజాన్, ఫెడ్ఎక్స్, టార్గెట్, యూపీఎస్ లాంటి ఈ-కామర్స్ కంపెనీల పార్శిల్స్ సైతం చోరీకి గురైనట్లు బయటపడింది. అంతేకాదు చోరీ తర్వాత ఆ బాక్స్‌లను పట్టాలపైనే పడేసి.. వాటిలో చాలావరకు డబ్బాలను కాల్చి పడేశారు కూడా. కొత్తేం కాదు.. లాస్ ఏంజెల్స్ రైల్వే రూట్లో దొంగతనాలు ఈమధ్య కాలంలో జరుగుతున్నవేం కాదు. 2020 సెప్టెంబర్ నుంచి లాస్ ఏంజెల్స్ కౌంటీలో దొంగతనాల శాతం 160 మేర పెరిగిందని యూనియన్ ఫసిఫిక్ (రైల్వే ఆపరేటర్) చెబుతోంది. కరోనా టైం నుంచి ఈ నేరస్థులు చెలరేగిపోతున్నారు. పార్శిల్స్‌ను మోసుకెళ్లడం కష్టమవుతుందనే ఉద్దేశంతో వాటిని అక్కడే చించేసి.. కేవలం అందులోని వాటిని తీసుకెళ్తున్నారు. తక్కువ ధరలకే బయట అమ్మేసుకుంటున్నారు. కొవిడ్-19 టెస్ట్ కిట్స్, ఫర్నీఛర్, మందులు.. చోరీకి గురవుతున్న వాటిలో ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా క్రిస్మస్, న్యూఇయర్ టైంలో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సీజన్లో సగటున రోజుకి 90కి పైగా కంటెయినర్లను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ పసిఫిక్ ఆ రైల్వే రూట్లో భద్రత కట్టుదిట్టం చేసింది. డ్రోన్ పర్యవేక్షణతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని ట్రాక్‌ల వెంట కాపలా కోసం నియమించుకుంది. ఈ క్రమంలో వంద మంది నేరగాళ్లను అదుపులోకి సైతం తీసుకున్నట్లు యూనియన్ పసిఫిక్ చెప్తోంది. అంతేకాదు కాలిఫోర్నియా అటార్నీకి సైతం ఇలాంటి నేరాల్లో శిక్ష తక్కువ విధించడంపై సమీక్ష చేయాలంటూ కోరింది యూనియన్ పసిఫిక్ రైల్వే. చదవండి: ఒమిక్రాన్ అలర్ట్.. ఉద్యోగులకు వార్నింగ్! -
ఫెడెక్స్ మాజీ ఉద్యోగి ఘాతుకం, నలుగురు భారతీయులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని ఇండియానాపొలిస్ నగరంలో చోటు చేసుకున్న కాల్పుల్లో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉండటం విషాదాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనపై విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్‌లోని స్థానిక అధికారులకు, సిక్కు సంఘ నాయకులకు భారతదేశం అన్ని విధాలా సహాయం చేస్తుందని వెల్లడించారు. నలుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోవడంపై సిక్కు సంఘం కూడా స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 4 గురు సిక్కులతో సహా 8 మందిని బలితీసుకున్న ఈ కాల్పుల సంఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు. ఎనిమిది మంది మృతుల్లో నలుగురు సిక్కులున్నారని తెలిపారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఇతను ఫెడెక్స్ మాజీ ఉద్యోగి అని పేర్కొన్నారు. (అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత్య) ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించిన భారతీయ బాధితుల పేర్లు అమర్ జీత్ జోహాల్ (66) జస్వీందర్ కౌర్ (64) అమర్ జీత్ షెఖాన్ (48) జస్వీందర్ సింగ్ (68) కాగా ఇండియానాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫెడెక్స్ గిడ్డంగి వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రాండన్ స్కాట్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది వరకు ఫెడెక్స్ లో పనిచేసిన బ్రాండన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాలడ్పాడని అక్కడి పోలీసు అధికారి క్రెయిగ్ మెక్ కార్ట్ చెప్పారు. అతడు గత ఏడాది వరకు పనిచేశాడని చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Deeply shocked by shooting at FedEx facility in Indianapolis. Victims include persons of Indian American Sikh community. Our Consulate General in Chicago in touch with Mayor & local authorities in Indianapolis as well as community leaders. Will render all possible assistance: EAM pic.twitter.com/ONhvrdLQHD — ANI (@ANI) April 17, 2021 -
అమెరికాలో కాల్పులు
హూస్టన్: అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. హూస్టన్‌లోని హారిస్ కౌంటీలో గల ఓ ఇంటికి గురువారం ఫెడ్ఎక్స్ కొరియర్ కంపెనీ దుస్తులు వేసుకుని వచ్చిన ఓ దుండగుడు ఆ ఇంట్లోని నలుగురు పిల్లలను, వారి తల్లిదండ్రులను కాల్చిచంపాడు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని రాన్ లీ హస్కెల్(33)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడి భార్యకు, మృతులకు బంధుత్వం ఉందని, విడాకులకు సంబంధించిన వివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు బాలురు(4, 14 ఏళ్లు), ఇద్దరు బాలికలు(7, 9 ఏళ్లు) ఉన్నారు. -
అమెరికాలో ఉన్మాది కాల్పులు
కెన్నెసా (అమెరికా): అట్లాంటా సమీపంలోని ఫెడెక్స్ కొరియర్ కంపెనీ స్టేషన్ వద్ద మంగళవారం ఓ ఉద్యోగి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని పోలీసులు తెలిపారు. ఫెడెక్స్ సెంటర్లో ప్యాకింగ్ హ్యాండ్లర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి అసాల్ట్ రైఫిల్‌ను, కత్తిని పట్టుకుని వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. దీంతో తోటి ఉద్యోగులంతా తలోదిక్కు ప్రాణభయంతో పారిపోయారు.