FedEx to set up its first ever Advanced Capability Community in Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఫెడెక్స్‌ ‘ఏసీసీ’

Published Fri, Mar 10 2023 6:08 AM | Last Updated on Fri, Mar 10 2023 10:49 AM

FedEx announces first advanced capability community in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: లాజిస్టిక్స్‌ సేవల్లోని ఫెడెక్స్‌ హైదరాబాద్‌లో తన తొలి అడ్వాన్స్‌డ్‌ క్యాపబులిటీ కమ్యూనిటీ (ఏసీసీ)ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన భిన్నమైన మానవవనరుల నియామకం, అభివృద్ధి కోసం దీన్ని వినియోగించు కోనుంది.

తద్వారా మరింత చురుకైన, సమర్థ వంతమైన సంస్థగా కస్టమర్లకు డెలివరీ అనుభవాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఫెడెక్స్‌ తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏసీసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వ్యాపార అవసరాలు, అధిక నైపుణ్య మావన వనరుల అవసరాల ఆధారంగా ప్రాంతాలను ఎంపిక చేస్తామని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement