logistics
-
లాజిస్టిక్స్‌లో టాప్–25లో భారత్
న్యూఢిల్లీ: వేగవంతమైన వస్తు రవాణా, వ్యయాల తగ్గింపునకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీల మద్దతుతో రవాణా రంగ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థానం మెరుగుపడనుంది. ‘ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచిక’లో 2030 నాటికి భారత్ టాప్–25 దేశాల్లో ఒకటిగా ఉంటుందని ఒక అధ్యయనం అంచనా వేసింది. ఈఏసీ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ సాయంతో మెస్సే స్టట్గార్ట్ ఇండియా (అంతర్జాతీయ ప్రదర్శన సంస్థ) అధ్యయనం నిర్వహించి, ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నెల 13–15 మధ్య ముంబైలో అంతర్జాతీయ లాజిస్టిక్స్ ఎగ్జిబిషన్ ‘లాగిమ్యాట్ ఇండియా 2025’ సదస్సుకు ముందు దీన్ని విడుదల చేయడం గమనార్హం. ప్రపంచబ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచీలో (ఎల్పీఐ) 139 దేశాలకు గాను భారత్ ప్రస్తుతం 38వ స్థానంలో ఉండగా, 2030 నాటికి టాప్–25లో చేరాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం విధించుకుంది. పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున రవాణా వసతుల అభివృద్ధిని చేపట్టడం ఈ లక్ష్యం సాధనకు ఉపకరిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. నివేదికలోని అంశాలు.. → భారత ఫ్రైట్, లాజిస్టిక్స్ మార్కెట్ ఏటా 8.8 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2029 నాటికి 484.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2024 నాటికి ఇది 317.26 బిలియన్ డాలర్లుగా ఉంది. → అంతర్జాతీయ లాజిస్టిక్స్ కేంద్రంగా మారే విషయంలో భారత్ చాలా వేగంగా అడుగులు వేస్తోంది. → ప్రస్తుతం భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయాలు జీడీపీలో 13–14 శాతంగా ఉండగా, 2030 నాటికి ఒక అంకెకు తగ్గించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. మౌలిక వసతులను ఇతోధికం చేయడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దీన్ని సాధించాలనుకుంటోంది. → హైస్పీడ్ రహదారులు, హైపర్‌లూప్‌లు, కొత్త విమానాశ్రయాలు.. ఇలా బహుళ నమూనాల ద్వారా రవాణా సమయాన్ని 66 శాతం తగ్గించి, లాజిస్టిక్స్ పోటీతత్వాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉంది. → జపాన్ను అధిగమించి 2026 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చేరనున్నట్టు అంచనాలున్నాయి. ఇందుకు పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ తదితర బలమైన విధానాల మద్దతు అవసరం ఎంతో ఉంది. → పీఎం గతిశక్తి కింద కేంద్రం రూ.11.17 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులను చేపట్టింది. తద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఉంది.ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం అవసరం.. ‘‘వినూత్నమైన పరిష్కారాలు, అత్యాధునిక టెక్నాలజీతో మౌలిక సదుపాయాల పరంగా అంతరం తొలగించడం ద్వారా అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజంగా భారత్ అవతరించొచ్చు. ఇందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం సమన్వయంతో కలసి పనిచేయడం ఎంతో అవసరం’’అని ఈ నివేదిక సూచించింది. -
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్‌కు, రూ.140 కోట్లు బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్‌లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
రెండేళ్లలో తగ్గనున్న లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) లాజిస్టిక్స్ వ్యయాల వాటా 9%కి తగ్గుతుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఇది 14% ఉన్నట్లు చెప్పారు. అమెరికాతో పాటు యూరప్‌లోని పలు పెద్ద దేశా ల్లో ఈ వ్యయాలు 12% ఉండగా చైనాలో 8 శాతంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. 2022–23 ఎకనమిక్ సర్వే ప్రకారం దేశ జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 14–18%గా ఉన్నాయి. అంతర్జాతీయ సగటు 8% తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీగా అవకాశాలు ఉన్నాయని గడ్కరీ చెప్పారు. తక్కువ నాణ్యత గల బొగ్గును మిథనాల్ తయారీకి ఉపయోగించవచ్చన్నారు. జీవ ఇంధనాల విభాగంలో దేశం గణనీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రహదార్ల నిర్మాణంలో రీసైకిలింగ్ చేసిన టైర్ పౌడరు, ప్లాస్టిŠక్ మొదలైన మెటీరియల్స్‌ను వినియోగించడం వల్ల బిటుమిన్ దిగుమతులు తగ్గగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాదే జపాన్ను దాటేసి అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని గడ్కరీ చెప్పారు. 2014లో రూ. 7.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ మార్కెట్ 2024 నాటికి రూ. 18 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. -
‘ఈసీ’ న్యూ ప్లాన్.. ఓటర్లకు రవాణా సదుపాయం !
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)చర్యలు ప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన 266 నియోజకవర్గాలను గుర్తించింది. ఈ స్థానాల్లో ఈసారి ఓటింగ్‌ను పెంచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 5) ఢిల్లీలో ఈసీ అధికారులు గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల సిబ్బందితో సమావేశమయ్యారు. తెలంగాణ, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో జాతీయ సగటు 67.40 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాన్ని అమలు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. ప్రజలే స్వయంగా ఓటింగ్‌కు ముందుకువచ్చే వాతావరణాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలకు రవాణా, కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రభావితం చేసే వ్యక్తుల సాయం తీసుకోవాలని సూచించారు. ఇదీ చదవండి.. వందలసార్లు ఓడినా మళ్లీ బరిలోకి -
త్వరలోనే ఇంటి నుంచి పార్శిళ్ల సేకరణ, డెలివరీ
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్ను గురువారం ఆయ న ప్రారంభించారు. లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు... నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు. -
డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్’.. ఎక్కడో తెలుసా..
భారతప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా ‘భారత్ మార్ట్’కు శంకుస్థాపన చేశారు. యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కలిసి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. భారత్ మార్ట్ దుబాయ్‌కు చెందిన లాజిస్టిక్స్, పోర్ట్ టెర్మినల్ కార్యకలాపాలు, మెరిటైమ్ సేవలను అందిస్తున్న డీపీ వరల్డ్‌తో కలిసి రూపొందించనున్నారు. భారత్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారుచేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్ట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మార్ట్ 2025 వరకు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. చైనాకు పోటీగా.. ప్రధానంగా ఈమార్ట్ వల్ల దుబాయ్‌తోపాటు దగ్గర్లోని ఇతర దేశాలకు త్వరగా సరుకులు రవాణాచేసేలా వీలవుతుంది. దాంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. దుబాయ్‌లో నెలకొల్పనున్న భారత్ మార్ట్ చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్‌తో పోటీపడనుంది. డ్రాగన్ మార్ట్‌లాగా భారత్ మార్ట్ కూడా దుబాయ్‌లో అనేక ఉత్పత్తులను విక్రయించనుంది. పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు.. మహ్మద్ బిన్ రషీద్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో సహకారంపై చర్చించారు. భారత్, యుఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..? ఈ నేపథ్యంలో 2022లో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యాన్ని గుర్తించి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కేటాయించారు. -
సరుకు రవాణాల్లో ఏపీ భేష్
సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది. భూ కేటాయింపుల్లోనూ బెస్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది. వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్‌పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది. ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది. -
అచీవర్స్ జాబితాలో ఏపీ
-
‘అచీవర్’ ఆంధ్రప్రదేశ్.. కేంద్ర ప్రభుత్వ సూచికలో టాప్!
వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సరకు రవాణా రంగంలో అద్భుత పనితీరుతో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్‌గా అవతరించింది. సరకు రవాణాలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల పనితీరుపై రూపొందించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అచీవర్‌లుగా వర్గీకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి అవసరమైన లాజిస్టికల్ సేవల్లో ఆయా రాష్ట్రాల సామర్థ్యాన్ని ఈ సూచిక తెలియజేస్తోంది. కాగా లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్‌లో అచీవర్స్ తర్వాత ఫాస్ట్ మూవర్స్ కేటగరిలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆస్పైరర్స్ కేటగిరీలో ఉన్నాయి. రాష్ట్రాల్లో సరకు రవాణా సేవలకు కల్పిస్తున్న అనుకూల పరిస్థితుల ఆధారంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. -
ఆర్పీజీ గ్రూప్ నుంచి తాబి మొబిలిటీ సర్వీసులు
ముంబై: ఆర్పీజీ గ్రూప్ తాజాగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ సంస్థలకు సాఫ్ట్వేర్ సేవలందించే (సాస్) దిశగా తాబి మొబిలిటీ వెంచర్‌ను ఆవిష్కరించింది. ఆయా సంస్థలు తమ వాహనాలను, లాజిస్టిక్స్ కార్యకలాపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించుకునేందుకు, లోపాలను సవరించుకునేందుకు తాబి సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇంధన వ్యయాల ను తగ్గించుకునేందుకు, వాహనాల వినియోగాన్ని మరింత సమర్ధమంతంగా పెంచుకునేందుకు ఇది సహాయపడగలదని సంస్థ సీఈవో పాలి త్రిపాఠి తెలిపారు. తాబి సొల్యూషన్స్ ఇప్పటికే 100 రోజు ల్లో 100 క్లయింట్ల వ్యాపారవృద్ధికి దోహదపడిందని వివరించారు. 45,000 పైచిలుకు లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వాహనాల అప్‌టైమ్‌ను 60,000 కిలోమీటర్ల మేర మెరుగుపర్చిందని త్రిపాఠి తెలిపారు. -
బ్లూడార్ట్ సేవల విస్తరణ
ముంబై: ఎక్స్‌ప్రెస్ ఎయిర్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సేవల్లోని బ్లూడార్ట్ విస్తరణపై దృష్టి సారించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 76 పిన్కోడ్లకు తన కార్యకలాపాలను కొత్తగా విస్తరించినట్టు ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో 15 కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే 15 ఫ్రాంచైజీ కలెక్షన్ సెంటర్లు, 15 ఎక్స్‌ప్రెస్ ఏజెంట్లు, 15 ప్రాంతీయ సరీ్వస్ ప్రొడైడైర్ ఫ్రాంచైజీలను నియమించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రతి పాంతానికీ సేవలు అందించగలమని తెలిపింది. దేశ ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ అంకిత భావానికి ఈ సేవల విస్తరణ నిదర్శనంగా కంపెనీ పేర్కొంది. విజయవాడ, సికింద్రాబాద్, మధురై, భువనేశ్వర్, లుధియానా, కోల్‌కతా తదితర పట్టణాల్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరిచినట్టు తెలిపింది. తాజా విస్తరణతో దేశవ్యాప్తంగా 55వేలకు పైగా ప్రాంతాలకు తమ సేవలు చేరువ అయినట్టు వివరించింది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సేవలు అందించడంపై తమ దృష్టి ఉంటుందని బ్లూడార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి తెలిపారు. -
భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు స్టెల్లార్
ముంబై: థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలు అందించే స్టెల్లార్ వేల్యూ చెయిన్ సొల్యూషన్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన సెవా లాజిస్టిక్స్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్‌కు చెందిన మొత్తం వాటాలను దక్కించుకోనుంది. తద్వారా భారత్‌లో తన కార్యకలాపాలను సెవా మరింతగా విస్తరించగలదని స్టెల్లార్ వెల్లడించింది. అయితే డీల్ విలువ ఎంతనేది మాత్రం తెలపలేదు. లాజిస్టిక్స్ రంగ వెటరన్ అన్షుమన్ సింగ్ 2016లో స్టెల్లార్ వేల్యూ చెయిన్‌ను ఏర్పాటు చేశారు. డీల్‌లో భాగంగా స్టెల్లార్‌కు దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 75 లక్షల చ.అ. కార్పెట్ ఏరియా గల 70కి పైగా గిడ్డంగులు, 8,000 మంది పైచిలుకు పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు సెవాలో భాగమవుతారు. అన్షుమన్ సింగ్ యథాప్రకారం సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు సెవా లాజిస్టిక్స్‌కు భారత్‌లో ప్రస్తుతం 35 నగరాల్లో 27,00,000 చ.అ. విస్తీర్ణంలో గిడ్డంగులు ఉన్నాయి. టాప్ 5 గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థల్లో ఒకటిగా ఎదగాలన్న తమ లక్ష్యానికి స్టెల్లార్‌లో వాటాల కొనుగోలు ఉపయోగపడగలదని సెవా లాజిస్టిక్స్ సీఈవో మాథ్యూ ఫ్రైడ్‌బర్గ్ తెలిపారు. -
శ్రీసిటీలో ‘కెర్రీ ఇండెవ్’ లాజిస్టిక్స్ కేంద్రం ప్రారంభం
సత్యవేడు (తిరుపతి జిల్లా): భారత్‌లోని ప్రముఖ ఇంటిగ్రేటివ్–3పీఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్ నెట్వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించిన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఇది పనిచేయనుంది. పరిశ్రమ ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మిత్సుబిషి ఎలక్ట్రిక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)ఒబాటా మసకాజు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెర్రీ ఇండెవ్ చైర్మన్ డాక్టర్ గ్జావియర్ బ్రిట్టో మాట్లాడుతూ..వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపార సంస్థలకు శ్రీసిటీ అత్యంత అనువైన వ్యూహాత్మక స్థానమని చెప్పారు. తమ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శ్రీసిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒబాటా మసకాజు మాట్లాడుతూ నూతన ప్లాంట్ ఏర్పాటులో కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్, ఇండోస్పేస్ బృందాల అత్యుత్తమ కృషిని అభినందించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో లాజిస్టిక్, వేర్‌హౌసింగ్ సేవల ప్రాముఖ్యతను వివరించారు. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ప్లానింగ్ హెడ్ గణపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు -
గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి
ముంబై: పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో గ్రేడ్ ఏ వేర్‌హౌస్ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్ ఆక్రమించినట్టు తెలిపింది. దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు దీర్ఘకాలంలో గ్రేడ్–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్ నివేదిక తెలిపింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్సీఆర్ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. -
రికార్డు స్థాయిలో వేర్ హౌస్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల నుంచి గోదాములకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంత్సరంలో (2022–23) ఎనిమిది ప్రధాన పట్టణాల్లో రికార్డు స్థాయిలో గోదాముల లీజు పరిమాణం 51.32 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా భారత వేర్ హౌసింగ్ (గోదాములు) మార్కెట్‌పై మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఎనిమిది పట్టణాలకు గాను ఏడుపట్టణాల్లో గోదాముల అద్దె 3–8 శాతం మధ్య పెరిగింది. తయారీ/అసెంబ్లింగ్ కోసం పారిశ్రామిక రంగం నుంచి కూడా గిడ్డంగులకు డిమాండ్‌ను పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం 2022–23లో గోదాముల మొత్తం లీజు పరిమాణం 5,13,24,201 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2021–22లో ఇది 5,12,94,933 చదరపు అడుగులుగానే ఉండడం గమనార్హం. ప్రధానంగా ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో గోదాముల లీజు డిమండ్ పెరగ్గా, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, అహ్మదాబాద్ మార్కెట్లలో తగ్గింది. హైదరాబాద్‌లో డౌన్ హైదరాబాద్‌లో గోదాముల లీజు పరిమాణం 2022–23లో 7 శాతం తగ్గి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో అత్యధికంగా 25 శాతం మేర లీజు పరిమాణం పెరిగింది. 7.4 మిలియన్ దరపు అడుగులకు చేరింది. ఆ తర్వాత కోల్‌కతాలో 18 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్లో 5 శాతం తగ్గి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా, పుణెలో 2 శాతం తక్కువగా 74 మిలియన్ చదరపు అడుగులుగా, చెన్నైలో 11 శాతం క్షీణించి 4.5 మిలియన్ చదరపు అడుగులుగా, అహ్మదాబాద్‌లో 29 శాతం పడిపోయి 3.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా లాజిస్టిక్స్ రంగం 39 శాతం లీజుకు తీసుకుంది. రిటైల్ రంగం వాటా 13 శాతంగా ఉంటే, తయారీ, ఇతర రంగాల వాటా 30 శాతంగా ఉంది. ఈ కామర్స్ సంస్థల వేర్‌హౌసింగ్ లీజు పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. కరోనా సంక్షోభ సమయంలో ఎక్కువ సామర్థ్యాలను నిర్మించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2021–22లో గోదాముల్లో ఈ కామర్స్ రంగం లీజు వాటా 23 శాతంగా ఉంటే, 2022–23లో 7 శాతానికి పరిమితమైంది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మొత్తం 412 మిలియన్ చదరపు అడుగుల వేర్ హౌసింగ్ సామర్థ్యం అందుబాటులో ఉండగా, ఇందులో 12 శాతం ఖాళీగా ఉంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి ట్రాన్సిండియా పార్క్.. డీల్ విలువ ఎంతంటే?
ముంబై: హర్యానాలోని జజ్జర్ లాజిస్టిక్స్ పార్క్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించనున్నట్లు ట్రాన్సిండియా రియల్టీ తాజాగా పేర్కొంది. సరుకు రవాణా దిగ్గజం ఆల్కార్గో లాజిస్టిక్స్‌తో విడివడిన తదుపరి ట్రాన్సిండియా వాటా విక్రయ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా లాజిస్టిక్స్ పార్క్‌ను రూ. 625 కోట్లకు విక్రయించేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఇతర పార్క్‌లలోనూ 10 శాతం వాటా విక్రయానికి సైతం ఇతర సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 60 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకోనున్నట్లు వెల్లడించింది. వెరసి అన్ని రకాల చెల్లింపుల తదుపరి రూ. 400 కోట్లకుపైగా సమకూర్చుకోనున్నట్లు పేర్కొంది. ఈ నిధులను కంపెనీ వృద్ధి ప్రణాళికలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ గతంలో ట్రాన్సిండియా రియల్టీ అండ్ లాజిస్టిక్స్ పార్క్స్ లిమిటెడ్‌గా కార్యకలాపాలు నిర్వహించింది. -
V-Trans India Limited: మూడేళ్లలో రూ. 3,000 కోట్ల టర్నోవరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సంస్థ వీ–ట్రాన్స్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,000 కోట్ల టర్నోవరు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో 600 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనుంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ మహేంద్ర షా ఈ వివరాలు వెల్లడించారు. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగానికి, తద్వారా తమ సంస్థ వృద్ధికి ఊతం లభించగలదని ఆయన వివరించారు. దేశీయంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా గిడ్డంగులు, కొత్త శాఖలను ఏర్పాటు చేయడంపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు షా చెప్పారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ రాజేష్ షా చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000 పైగా శాఖలు, 50 పైచిలుకు ట్రాన్స్షిప్మెంట్ సెంటర్లు, 2,500 పైగా ట్రక్కులు ఉన్నట్లు ఆయన వివరించారు. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్‌గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
భారత్ లాజిస్టిక్స్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. 2014తో ఈ ర్యాంక్ 54. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. ఆయా అంశాల్లో ప్రపంచ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సర్వే, తత్సంబంధ అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ మౌలిక రంగం అటు భౌతికంగా (హార్డ్), ఇటు సాంకేతికంగా (సాఫ్ట్) ఎంతో మెరుగుపడింది. రెండు విభాగాల్లోనూ గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. ► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024–25 నాటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్– పీఎం గతి శక్తి పేరుతో కీలక చొరవలకు అక్టోబర్ 2021 శ్రీకారం చుట్టింది. ► త్వరితగతిన డెలివరీకి, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి, తయారీ రంగం సమయం, డబ్బును ఆదా చేయడానికి, లాజిస్టిక్స్ రంగంలో కావలసిన వేగాన్ని తీసుకురావడానికి 2022లో ప్రధాన మంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పీ)ని ప్రారంభించారు. ► ఈ విధాన చర్యలు ఫలవంతమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఎల్పీఐ మెరుగుదలకు దోహదపడుతోంది. ► భారత్ ర్యాంక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి 2018లో 52వ స్థానం వద్ద ఉంటే, 2023లో 47వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సరకు ఎగుమతులకు సంబంధించి ర్యాంక్ 44 నుంచి 22కు ఎగసింది. లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో విషయంలో నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. ట్రాకింగ్, ట్రేసింగ్ విషయాల్లో ర్యాంక్ 3 స్థానాలు జంప్ చేసి 38కి ఎగసింది. ► భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించడానికి ఆధునికీకరణ, డిజిటలైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ► 2015 నుండి భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధిత సాంకేతికతను గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే భౌతికంగా సైతం మౌలిక రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్ పురోగతిలో సాంకేతికత కీలకమైన అంశంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్‌ఫారమ్ నిర్వహణ వల్ల లాజిస్టిక్స్ విభాగంలో ఆలస్యాలు గణనీయంగా తగ్గాయి. ► 2022 మే – అక్టోబర్ మధ్య కంటైనర్ నిరీక్షణ (పోర్ట్ లేదా టెర్మినల్స్‌లో) సమయం భారతదేశం, సింగపూర్లలో మూడు రోజులుగా ఉంది. ఇది కొన్ని పారిశ్రామిక దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో ఈ సమయం ఏడు రోజులు ఉంటే, జర్మనీలో 10 రోజులుగా ఉంది. విశాఖపట్నం పోర్ట్ విషయంలో 2015లో ఈ సమయంలో 32.4 రోజులు ఉంటే, 2019లో 5.3 రోజులకు తగ్గింది. 50వేల కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున నడుస్తోంది. మోదీ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో 50,000 కిలోమీటర్ల మేర అదనంగా జాతీయ రహదారుల నిడివి పెరిగింది. 2014–15 నాటికి జాతీయ రహదారుల విస్తీర్ణం 97,800 కిలోమీటర్లుగా ఉంటే.. 2023 మార్చి నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014–15లో సగటున ఒక్క రోజు 12.1 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా, 2021–22లో ఇది 28.6 కిలోమీటర్లకు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రహదారుల వసతులు ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. ఆర్థికాభివృద్ధితోపాటు సామా జికాభివృద్ధి కూడా రహదారుల విస్తరణతో సా ధ్యపడుతుంది. ఏటా మన దేశంలో వస్తు రవాణాలో 70 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతాన్ని రహదారులే తీరుస్తున్నాయి. 63.73 ల క్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలో విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది. -
ఇక ఆ రెండు వేరువేరు: స్పైస్‌జెట్
ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక విభాగంగా విడదీసింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్వతంత్రంగా నిధులను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 51 కోట్ల నికర లాభం నమోదు చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) డీల్ ప్రకారం స్పైస్‌జెట్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 2,556 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు జారీ చేయనుంది. కార్లైల్ ఏవియేషన్ పార్ట్నర్ చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్ల రుణాన్ని గత నెల పునర్వ్యవస్థీకరించుకున్నామని అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాజాగా లాజిస్టిక్స్ విభాగం విడదీతతో స్పైస్‌జెట్ బ్యాలెన్స్ షీటు మరింత పటిష్టంగా మారగలదని, కంపెనీ నెగటివ్ నికర విలువ భారం గణనీయంగా తగ్గగలదని ఆయన వివరించారు. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
హైదరాబాద్‌లో ఫెడెక్స్ ‘ఏసీసీ’
హైదరాబాద్: లాజిస్టిక్స్ సేవల్లోని ఫెడెక్స్ హైదరాబాద్‌లో తన తొలి అడ్వాన్స్డ్ క్యాపబులిటీ కమ్యూనిటీ (ఏసీసీ)ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన భిన్నమైన మానవవనరుల నియామకం, అభివృద్ధి కోసం దీన్ని వినియోగించు కోనుంది. తద్వారా మరింత చురుకైన, సమర్థ వంతమైన సంస్థగా కస్టమర్లకు డెలివరీ అనుభవాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఫెడెక్స్ తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏసీసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వ్యాపార అవసరాలు, అధిక నైపుణ్య మావన వనరుల అవసరాల ఆధారంగా ప్రాంతాలను ఎంపిక చేస్తామని పేర్కొంది. -
ఐబీఎస్ సాఫ్ట్వేర్ చేతికి ఏఎఫ్‌ఎల్‌ఎస్
తిరువనంతపురం: యాక్సెంచర్ ఫ్రైట్ అండ్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ (ఏఎఫ్‌ఎల్‌ఎస్)ను కొనుగోలు చేసినట్లు ఐబీఎస్ సాఫ్ట్వేర్ తెలిపింది. అయితే డీల్ విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఒప్పందంతో తాము ఆకాశ, సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టెక్నాలజీ సర్వీసులు అందించడానికి సాధ్యపడనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపారాన్ని అలాగే కార్యకలాపాలను అంతర్జాతీయంగా మరింత విస్తరించుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ సర్వీసులను (ఎస్ఏఏఎస్) ఐబీఎస్ అందిస్తోంది. ట్రావెల్, రవాణా, లాజిస్టిక్స్ కోసం చెన్నైలో కొత్తగా డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది భారత్‌లో తమకు నాలుగోదని వివరించింది. -
70 కోట్ల చదరపు అడుగులకు గిడ్డంగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిడ్డంగులు, సరుకు రవాణా కేంద్రాల స్థలం 2030 నాటికి రెండింతలై 70 కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ‘ఈ–కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ ఇందుకు కారణం. ఎనమిదేళ్లలో పరిశ్రమకు రూ.1.66 లక్షల కోట్ల నిధులు కావాలి. ఈ నిధుల్లో అధిక మొత్తం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవసరం అవుతుంది. గ్రేడ్–ఏ స్థలం వాటా ప్రస్తుతం ఉన్న 35 నుంచి 2030 నాటికి 50 శాతానికి చేరనుంది. పరిశ్రమలో దేశవ్యాప్తంగా 2022 జనవరి–సెప్టెంబరులో రూ.1,194 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చా యి. ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో లీజింగ్ స్థలం 40 శాతం అధికమై 92 లక్షల చదరపు అడుగులు నమోదైంది. మూడు త్రైమాసికాల్లో 2.2 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజ్‌కు ఇచ్చారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
రవాణా, లాజిస్టిక్స్‌లో పెట్టుబడి అవకాశాలు
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వరకు వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బలమైన జీడీపీ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మెరుగైన రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్, ఆటో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు (ఓఈఎంలు), ఆటో విడిభాగాల కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు ఎక్కువ లబ్ధి పొందనున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ నూతన పథకం (ఎన్ఎఫ్వో) ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఈ నెల 20న ముగియనుంది. వృద్ధి అవకాశాలు ఆసియాలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూసినా, పాశ్చాత్య దేశాలతో పోల్చినా తలసరి కార్ల వినియోగం మన దేశంలోనే చాలా తక్కువ. ఇది వచ్చే కొన్ని దశాబ్దాల పాటు వృద్ధికి మద్దతునిచ్చే అంశం. పైగా ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది. ఇవన్నీ కలసి కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. 2021–22 నుంచి 2026–27 మధ్య ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర మోటారు వాహనాల విక్రయాలు డబుల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని చూస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏటా 12–15 శాతం మేర కాంపౌండెడ్ వృద్ధిని చూడనున్నాయి. ఈ అప్సైకిల్లో ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల కంపెనీలు వచ్చే కొన్నేళ్లపాటు ప్రయోజనం పొందనున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల హవా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మొత్తంలో సబ్సిడీలను అందిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ తదితర ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వినియోగదారుల్లోనూ పర్యావరణం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయి. ఇది కూడా ఆటోమొబైల్ రంగానికి అనుకూలమే కానుంది. ఇప్పటికే భారత ఆటోమొబైల్ మార్కెట్లో చాలా కంపెనీలు ఈవీలను ప్రవేశపెట్టాయి. లాజిస్టిక్స్‌కు ప్రోత్సాహం భారత్‌లో తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం లాజిస్టిక్స్ రంగానికి సానుకూలించనుంది. నూతన లాజిస్టిక్స్ పాలసీని కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. భారత్‌లో తయారీకి లాజిస్టిక్స్ కీలకం కానుంది. తక్కువ ఖర్చుకే వేగంగా ఉత్పత్తులను రవాణా చేసే సదుపాయాలు ఎంతైనా అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీంతో లాజిస్టిక్స్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రోడ్డు, పోర్టులను అనుసంధానించనుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాలు, సమయాన్ని ఆదా చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడుల అవకాశాలు ఆటో, లాజిస్టిక్స్ రంగాలకు అపార అవకాశాలు ఉండడంతో ఈ రంగంలోని మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందొచ్చు. ఈ రంగంలో వచ్చే కొన్నేళ్లపాటు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కనీసం రూ.5,000 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ఈ నెల 20న ముగుస్తుంది. ఇది ధీమ్యాటిక్ ఫండ్ అవుతుంది. అంటే ఫలానా రంగాలకు పెట్టుబడులను పరిమితం చేసేవి. వీటిల్లో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. రిస్క్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఎదుర్కొంటున్నాయి. దీనికితోడు వడ్డీ రేట్ల పెరుగుదల స్వల్ప కాలంలో ఇవి ఆటోమొబైల్ రంగంపై చూపించే అవకాశం లేకపోలేదు. కానీ, 2030 నాటికి ప్రపంచంలోని టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి కానుంది. కనుక దీర్ఘకాలానికి రవాణా, లాజిస్టిక్స్ థీమ్ మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న యూటీఐ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఆరంభం నుంచి వార్షికంగా 15 శాతంపైనే రాబడినిచ్చింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
మహీంద్రా లాజిస్టిక్స్ చేతికి రివిగో ‘బీ2బీ’ వ్యాపారం
ముంబై: లాజిస్టిక్స్ సంస్థ రివిగో సర్వీసెస్‌కు చెందిన బీ2బీ ఎక్స్‌ప్రెస్ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) వెల్లడించింది. వ్యాపార బదిలీ ఒప్పందం (బీటీఏ) రూపంలో ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం రివిగోలోని బీ2బీ ఎక్స్‌ప్రెస్ వ్యాపారం అసెట్స్, కస్టమర్లు, టీమ్, టెక్నాలజీ ఫ్లాట్‌ఫాం మొదలైనవి ఎంఎల్‌ఎల్‌కు దక్కుతాయి. ఎక్స్‌ప్రెస్ నెట్వర్క్ ప్రస్తుతం 250 ప్రాసెసింగ్ కేంద్రాలు, శాఖల ద్వారా దేశవ్యాప్తంగా 19,000 పిన్ కోడ్లకు సర్వీసులు అందిస్తోంది. తమ వ్యాపారా సామర్థ్యాలను మరింత పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఎంఎల్ఎల్ ఎండీ రామ్‌ప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు. -
ఆటో రంగంలో పెట్టుబడులా!
సాక్షి, హైదరాబాద్: థీమ్యాటిక్ ఫండ్స్ అన్నవి ఫలానా రంగాలకే పెట్టుబడులను పరిమితం చేసేవి. గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చవిచూసింది. తదుపరి వృద్ధికి ఈ రంగం సిద్ధంగా ఉందని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు, మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఆటోమొబైల్ రంగాన్ని పెట్టుబడులకు పరిశీలించొచ్చు. ఈ విభాగంలో యూటీఐ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ప్రస్తుత ట్రెండ్.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి పనితీరు చూపించిన వాటిల్లో ఒకటి. 2021 అక్టోబర్ తర్వాత నుంచి చూస్తే ఆటోమొబైల్ రంగం నుంచి 171 లిస్టెడ్ కంపెనీలు ఉంటే, అందులో 50 స్టాక్స్ ఇప్పటికే గరిష్టాలకు చేరాయి. దీంతో స్టాక్స్ వ్యాల్యూషన్లను కొంత విస్తరించాయని అర్థం చేసుకోవాలి. కానీ, సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో సైకిల్ మొదలైందంటే కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని నిపుణుల అంచనా. కనుక పెట్టుబడులకు ఇంకా మంచి అవకాశాలున్నట్టుగానే భావించాలి. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాక్టివ్ ఫండ్ ఇదొక్కటే. ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్‌ను కోరుకునే వారు నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను సైతం పరిశీలించొచ్చు. రాబడులు.. యూటీఐ ట్రాన్స్పోర్ట్ పథకం ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో అటు నిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్, నిఫ్టీ టీఆర్ఐ500 టీఆర్ఐ, నిఫ్టీ ఆటో టీఆర్ఐ కంటే మెరుగైన రాబడులు అందించడం గమనించాలి. అంటే చూడ్డానికి సైక్లికల్ రంగానికి సంబంధించిన పథకమే అయినా రాబడుల విషయంలో దీర్ఘకాలంలో మెరుగ్గా పనిచేయడాన్ని విస్మరించకూడదు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 29 శాతం రాబడినిచ్చింది. మూడేళ్లలో వార్షిక రాబడి రేటు 24 శాతంగా ఉంది. ఐదేళ్లలో ఏటా 18 శాతానికి పైనే రాబడినిచ్చింది. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా, 16 శాతం వార్షిక రాబడినిచ్చింది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1,886 కోట్ల పెట్టుబడులున్నాయి. 96.42 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన పెట్టుబడులను నగదు, ఇతర రూపాల్లో కలిగి ఉంది. పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు 73 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. మిడ్‌క్యాప్ విభాగానికి 20 శాతం, స్మాల్‌క్యాప్ విభాగానికి 7 శాతం వరకు కేటాయించింది. పెట్టుబడుల ప్రాధాన్యాన్ని గమనించినట్టయితే నూరు శాతం తీసుకెళ్లి ఆటోమొబైల్ స్టాక్స్‌లో పెట్టలేదు. ఈ రంగానికి 80 శాతాన్ని కేటాయించింది. సేవల రంగ కంపెనీలకు 12.34 శాతం, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌కు 2.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
ఆర్టీసీ కార్గో విస్తరణకు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పార్సిల్, కార్గో విభాగాన్ని భారీగా విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. గత కొన్ని నెలలుగా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించటంతో ప్రస్తుతం రోజుకు 15 వేల నుంచి 18 వేల పార్సిళ్లను తరలిస్తూ రూ.25 లక్షల మేర ఆదాయాన్ని పొందుతోంది. ప్రస్తుతం దీనిని రూ.కోటికి పెంచే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని తెలిసింది. దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్సిళ్లను తరలించేలా పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో తపాలా శాఖ, రైల్వేలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని బహుళజాతి కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా మంచి నెట్వర్క్ ఉంది. ఈ ప్రాంతాల్లో సరుకుల తరలింపు బాధ్యతను ఆర్టీసీ సునాయాసంగా చేపడుతుంది. ఇక రాష్ట్రం వెలుపల నెట్వర్క్ లేని ప్రాంతాల్లో తాను ఆర్డర్లు తీసుకుని, పార్సిళ్ల తరలింపు ఇతర సంస్థలకు అప్పగిస్తుంది. ఇలా ఇతర సంస్థల సహకారంతో రోజువారీ ఆదాయం రూ.కోటికి చేరేలా వ్యాపారాన్ని వృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసుగా ఉన్న పేరును టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్‌గా మార్చింది. మరోవైపు ప్రత్యేకంగా వస్తువులు తయారయ్యే ప్రాంతాల నుంచి వాటిని డోర్ డెలివరీ చేసే పనిపై కూడా దృష్టి సారించింది. లాజిస్టిక్స్ విభాగం బిజినెస్ హెడ్ బదిలీ.. ఈ విభాగం బిజినెస్ హెడ్‌గా ఉన్న జీవన్ ప్రసాద్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బదిలీ చేశారు. ఆయనను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్‌గా పంపించారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంఈ (ఓఅండ్‌పీ)గా ఉన్న పి.సంతోష్‌కుమార్‌ను ఇన్చార్జిగా నియమించారు. -
యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన లాజిస్టిక్స్ సర్వీసులను అందించే దిశగా అమెరికాకు చెందిన యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు కట్టింది. ఇందుకోసం మొవిన్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా బీ2బీ లాజిస్టిక్స్ సేవలను మొవిన్ అందించనుంది. దేశీయంగా బీ2బీ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోనున్నామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జేబీ సింగ్ తెలిపారు. జేవీ సంస్థ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తోందని .. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు కూడా ప్రారంభించిందని వివరించారు. 220 పైగా దేశాలు, ప్రాంతాల్లో యూపీఎస్ సర్వీసులు అందిస్తోంది. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ .. ఏవియేషన్ (ఇండిగో ఎయిర్‌లైన్స్), ఆతిథ్య తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన లాజిస్టిక్స్ సర్వీసులను అందించే దిశగా అమెరికాకు చెందిన యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ జట్టు కట్టింది. ఇందుకోసం మొవిన్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా బీ2బీ లాజిస్టిక్స్ సేవలను మొవిన్ అందించనుంది. దేశీయంగా బీ2బీ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోనున్నామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జేబీ సింగ్ తెలిపారు. జేవీ సంస్థ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తోందని .. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు కూడా ప్రారంభించిందని వివరించారు. 220 పైగా దేశాలు, ప్రాంతాల్లో యూపీఎస్ సర్వీసులు అందిస్తోంది. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ .. ఏవియేషన్ (ఇండిగో ఎయిర్‌లైన్స్), ఆతిథ్య తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్, ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన పాలసీలను తెస్తోంది. 2020–21లో రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో రూ.3.50 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ –2022 – 27 రూపొందించింది. ఈ ముసాయిదా పాలసీకి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. చదవండి: ఎంఎస్ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ‘పుష్’ విధానంతో రెట్టింపు ఎగుమతులను రెట్టింపు చేసేలా ‘పుష్’ (పీయూఎస్‌హెచ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తులకు మరింత విలువను జోడించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించనున్నారు(ప్రమోట్–పీ). ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. ఎగుమతులకు కీలకమైన ఓడ రేవులు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లతో పాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు లాంటి కీలక మౌలిక వసతులను అభివృద్ధి (అప్‌గ్రేడ్–యూ) చేయనున్నారు. ఇప్పటికే 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు విశాఖ, అనంతపురంలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ఎగుమతుల విధానాన్ని స్ట్రీమ్‌లైన్ (ఎస్) చేస్తూ నూతన టెక్నాలజీ వినియోగం ద్వారా (హార్నెస్–హెచ్) ఎగుమతులను ప్రోత్సహించేలా ముసాయిదా పాలసీలో ప్రతిపాదించారు. ఆరు ఆంశాలపై దృష్టి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆరు కీలక అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎగుమతుల సమాచారమంతా ఒకేచోట లభించే విధంగా డ్యాష్‌బోర్డు అభివృద్ధి చేయడంతోపాటు టెక్నాలజీని మరింతగా వినియోగించుకోనున్నారు. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్ హబ్, ఎయిర్‌పోర్టులు, పోర్టు, రహదారుల అనుసంధానం లాంటి వాటిపై భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రతి జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్ది ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నాణ్యతా పరమైన కారణాలతో ఎగుమతులు తిరస్కరణకు గురి కాకుండా క్వాలిటీ టెస్టింగ్ కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించండంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేలా పాలసీలో పలు ప్రతిపాదనలు పొందుపర్చారు. ‘స్వయం ఆంధ్రా’ పేరుతో బ్రాండింగ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను అంతర్జాతీయంగా సరఫరా చేసే విధంగా ‘స్వయం ఆంధ్రా’ పేరుతో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ)ఎగుమతులను ప్రోత్సహించనుంది. కేవలం ఎగుమతుల కోసం ఉత్పత్తి పేరుతో అంతర్జాతీయంగా ప్రచారం కల్పించి నాణ్యత ధ్రువీకరణ సదుపాయాలు కల్పిస్తారు. సర్టిఫికేషన్ చార్జీలపై సబ్సిడీ, మార్కెటింగ్, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనే వారికి రాయితీలతో పాటు ఫైనాన్సింగ్, అవార్డులు లాంటి ప్రోత్సాహకాలను పాలసీలో ప్రతిపాదించారు. ♦తూర్పు తీరంలో 974 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఏకైక రాష్ట్రం ♦14 నోటిఫైడ్ పోర్టులు ఉండగా 6 పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణ ♦మరో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦2020–21 నాటికి రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.24 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో 19.14 శాతానికి సమానం ♦దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతం ♦దేశీయ ఎగుమతుల సంసిద్ధత ర్యాంకుల్లో 20 నుంచి 9 స్థానానికి ఎగబాకిన ఏపీ ♦వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఎగుమతులను రూ.3.50 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యం. జిల్లాల వారీగా ఉత్పత్తులకు ప్రోత్సాహం ఒక్కో జిల్లాల్లో ఎగుమతికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి ప్రోత్సహిస్తాం. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి పోర్టులపై రూ.20,000 కోట్లు సముద్ర వాణిజ్య అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తోంది. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది. -
సరికొత్త సేవలు ప్రవేశ పెట్టిన మెజెంటా ఈ-మొబిలిటీ..!
ముంబై: ప్రముఖ ఈ-మొబిలిటీ ఫ్లాట్ ఫారం మెజెంటా సరికొత్తగా ఈవీఈటీ పేరుతో ఒక కొత్త కనెక్టెడ్ ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలు తీసుకొని వచ్చింది. ఈ సిస్టమ్ ద్వారా ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని ట్రాక్ అండ్ ట్రేస్ చేయడంతో పాటు వేహికల్ హెల్త్, డ్రైవింగ్ ప్రవర్తన, ఛార్జ్ స్టేటస్, తక్కువ ఛార్జ్ ఉంటే అలారం వంటివీ మరెన్నో ఆప్షన్స్‌తో ఈవీ డెలివరీ, లాజిస్టిక్స్ సర్వీసుల అందిస్తుంది. మెజెంటా 2021లో ఈవీఈటీ బ్రాండ్ కింద తన ఈ-మొబిలిటీ ఫ్లాట్ ఫారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఫ్లాట్ ఫారాన్ని ఉపయోగించి 400కు పైగా ఎలక్ట్రిక్ కార్గో డెలివరీ, లాజిస్టిక్స్ సర్వీసులను అందించింది. మెజెంటా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఛార్జ్ గ్రిడ్ బ్రాండ్ కింద ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను కూడా అందిస్తుంది. ఈవీ సొల్యూషన్ టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్(టీసీయు) ద్వారా జనరేట్ చేసిన గణనీయమైన వాల్యూం డేటాను ప్రాసెస్ చేయగలదు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లపై రియల్ టైమ్‌లో దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు. (చదవండి: ఫేస్‌బుక్‌పై విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు..!) -
లాజిస్టిక్స్ సూచీలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
న్యూఢిల్లీ:ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిల్చే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో గుజరాత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన 2021 సూచీలో వరుసగా మూడోసారి టాప్‌లో నిల్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హర్యానా (2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన వాటితో 2021 నివేదిక రూపొందింది. దీన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1,405 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. వచ్చే అయిదేళ్లలో లాజిస్టిక్స్ వ్యయాలను అయిదు శాతం మేర తగ్గించుకునేందుకు ఆయా వర్గాల అభిప్రాయాలు దోహదపడగలవి గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి. -
రూ.100 లక్షల కోట్లతో ‘గతిశక్తి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని ప్రధాని మోదీ చెప్పారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుందని తెలిపారు. రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ‘పీఎం గతిశక్తి.. నేషనల్ మాస్టర్‌ప్లాన్ ఫర్ మల్టీ–మోడల్ కనెక్టివిటీ’ కార్యక్రమానికి ప్రధాని బుధవారం శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పంతో రాబోయే 25 సంవత్సరాల భారతదేశానికి పునాది వేస్తున్నామని ఉద్ఘాటించారు. ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం.. ఇదే ఈనాటి మంత్రమని అన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే విషయంలో దేశంలో చాలా రాజకీయ పక్షాలకు ఓ ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనను కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తుండడం దారుణమని మండిపడ్డారు. ఏమిటీ ‘గతిశక్తి’? ఈ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్‌ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు. ఆరు స్తంభాల పునాదితో.. ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది. గరిష్టీకరణ: వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది. ఉదాహరణకు ఒకచోట నుంచి మరోచోటికి వస్తువుల రవాణా కోసం సమయం, ఖర్చుపరంగా గరిష్ట ప్రయోజనం గల మార్గాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది. కాల సమన్వయం: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలు, విభాగాలు వేటికవి తమ పని తాము చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ‘పీఎం గతిశక్తి’ వీటికి స్వస్తి పలుకుతుంది. ప్రతి విభాగం ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చు. దీంతో కాలం, శక్తి ఆదా అవుతుంది. విశ్లేషణాత్మకత: 200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలని్నటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది. గతిశీలత: ‘జీఐఎస్’ సాయంతో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను గమనించడంతోపాటు సమీక్షిస్తూ, ప్రగతిని పర్యవేక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ఉపగ్రహ చిత్రాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా ప్రాజెక్టుల ప్రగతి వివరాలు క్రమబద్ధంగా పోర్టల్‌లో నమోదు చేస్తారు. సమగ్రత: పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత, ప్రణాళికల రూపంలో గల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. -
పారిశ్రామిక స్థలాలకు డిమాండ్.. సీబీఆర్ఈ నివేదిక
న్యూఢిల్లీ: పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల ఆఫీస్ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి–జూన్) మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో లీజింగ్ కార్యకలాపాలు 13 శాతం పెరిగి 14 మిలియన్ చ.అ.లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో ఇది 11 మిలియన్ చ.అ.లుగా నమోదైంది. సరఫరాలో అంతరాయాలను అధిగమించే దిశగా తమ వినియోగదారులకు చేరువలో ఉండే ప్రాంతాలను ఎంచుకునేందుకే లాజిస్టిక్స్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయని నివేదిక వివరించింది. కొన్ని సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను కూడా ఎంచుకుంటున్నాయని పేర్కొంది. ఢిల్లీ–దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), బెంగళూరులో అత్యధికంగా (50 శాతం) లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో అర్ధ సంవత్సర ప్రాతిపదికన అద్దెలు 2 శాతం నుంచి 14 శాతం దాకా పెరిగాయి. -
వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ–కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్) శరవేగంగా విస్తరిస్తుండటంతో గిడ్డంగులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) నాటికి హైదరాబాద్‌లో 2.1 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్టాక్ ఉందని సీబీఆర్ఈ సౌత్ ఆసియా తెలిపింది. ఇందులో 43 శాతం వేర్‌హౌస్ స్థలాన్ని రిటైల్ సంస్థలు, 19 శాతం 3 పీఎల్, 15 శాతం ఈ–కామర్స్ కంపెనీల వాటాలున్నాయని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అదనంగా 50 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ చేరుతుందని అంచనా వేసింది. కొన్ని కంపెనీలు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది హెచ్1లో నగరంలో గిడ్డంగుల అద్దెలు 5–14 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. 2018–2021 హెచ్1 నాటికి నగరంలో 1.1 కోట్ల చ.అ.లుగా ఉంది. టీఎస్ఐపాస్, పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి వంటివి రాష్ట్రంలో గిడ్డంగుల వృద్ధికి ప్రధాన కారణాలని తెలిపింది. చదవండి: ఆగస్ట్‌లో రూ.2,150 కోట్ల రుణాలు -
AP: జలరవాణా పెంపు లక్ష్యం
సాక్షి, అమరావతి: ఒక వస్తువు ధర నిర్ణయంలో కీలకమైన సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించి వ్యాపార లాభాన్ని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిసారించింది. ఇందుకోసం జలరవాణాను పెంచడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందిస్తోంది. కొత్త పోర్టుల ఏర్పాటు.. పాత పోర్టుల అభివృద్ధికి తోడు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేస్తోంది. అలాగే, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో జలరవాణా సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పోర్టుల ద్వారా 173 మిలియన్ టన్నులు రవాణా అవుతుండగా.. 2026 నాటికి అదనంగా మరో 350 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భావనపాడు, కాకినాడ సెజ్, మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేయనుంది. అలాగే, రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టుతో పాటు గంగవరం, కాకినాడలోని రెండు పోర్టులు, కృష్ణపట్నం పోర్టుల సరుకు రవాణా సామర్థ్యం 327.58 మిలియన్ టన్నులు ఉన్నప్పటికీ ఇందులో కేవలం 173 మిలియన్ టన్నులు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. మెరుగైన లాజిస్టిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వీటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. కృష్ణపట్నం, కాకినాడ రేవుల సమీపంలో రెండు భారీ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు గిడ్డంగులు వంటి ఇతర సౌకర్యాలను పెంచడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఏపీ లాజిస్టిక్ పాలసీ 2021–26ను తీసుకురానుంది. జలరవాణాలో టన్నుకు రూ.1.06 ఖర్చు ఒక వస్తువు ధరలో సుమారు 50 శాతం సరుకు రవాణా వ్యయమే ఉంటుంది. దీనిని ఎంత తగ్గించుకుంటే అంత చౌకగా వస్తువులను అందించవచ్చు. రహదారుల ద్వారా ఒక టన్ను సరుకును కి.మీ దూరం తీసుకెళ్లడానికి రూ.2.58లు వ్యయమైతే.. రైల్ ద్వారా రూ.1.41, జలరవాణా ద్వారా రూ.1.06 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, మన రాష్ట్రంలో జరుగుతున్న సరుకు రవాణాలో 58 శాతం.. అధిక వ్యయం అయ్యే రోడ్డు రవాణా ద్వారానే జరుగుతోంది. 35 శాతం రైల్ ద్వారా.. 6 శాతం జలరవాణా ద్వారా ఒక శాతం ఆకాశయానం ద్వారా జరుగుతోంది. ఇప్పుడు రోడ్డు రవాణాను తగ్గించి రైలు, జలరవాణాను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. రైల్వేల ద్వారా ప్రస్తుతం 94.33 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా దీనిని 2026 నాటికి 188 మిలియన్ టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం మూడు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను రైల్వేశాఖ అభివృద్ధి చేస్తోంది. ఖరగ్‌పూర్–విజయవాడ, నాగపూర్–విజయవాడ, చెన్నై–విజయవాడ మార్గాల్లో వీటిని అభివృద్ధి చేయనున్నారు. విజయవాడ–ముక్త్యాల మధ్య ఇన్‌ల్యాండ్ జలమార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. -
స్వీడన్ లాజిస్టిక్స్ కంపెనీలో ఆల్కార్గోకు వాటాలు
ముంబై: స్వీడన్‌కు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ నార్డికాన్ గ్రూపులో 65 శాతం వాటాలను కొనుగోలు చేసినట్టు ఆల్కార్గో లాజిస్టిక్స్ ప్రకటించింది. నార్డిక్స్ ప్రాంతంలో (డెన్మార్క్, నార్వే, స్వీడన్‌తో కూడిన ఉత్తర యూరోప్) రైల్ కన్సాలిడేషన్ విభాగం, ఎల్సీఎల్లో నార్డిక్స్ గ్రూపు మార్కెట్ లీడర్‌గా ఉంది. బెల్జియం అనుబంధ సంస్థ ఆల్కార్గో బెల్జియమ్ రూపంలో వాటాలను కొనుగోలు చేసినట్టు ఆల్కార్గో లాజిస్టిక్స్ తెలిపింది. 2003లో ఈసీయూ వరల్డ్వైడ్ను సొంతం చేసుకున్న తర్వాత ఆల్కార్గోకు ఇది మూడో కొనుగోలు కావడం గమనార్హం. 2019లో రూ.416 కోట్లతో గతి సంస్థలోనూ వాటాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించడంతోపాటు.. కొత్త ప్రాంతాలకు విస్తరించే వ్యూహంలో భాగమే ఈ కొనుగోలు అని ఆల్కార్గో లాజిస్టిక్స్ గ్రూపు చైర్మన్ శశికిరణ్ శెట్టి తెలిపారు. -
త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ–2021 తీసుకురానున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ తీసుకురాబోతున్నామని వివరించారు. కేంద్ర స్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించి సీఎస్ చైర్మన్‌గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాన్ మేజర్ పోర్టుల్లో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళికలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని.. ఏపీఐఐసీ భూముల్లో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణంలో ట్రక్ పార్కింగ్ ప్రాంతాలు నిర్మించాలని.. అక్కడ ఇంధన స్టేషన్లు, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఐటీకి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనలపైన అధికారులతో మంత్రి చర్చించారు. రామాయపట్నం సమీపంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూ సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ సలహాదారులు కృష్ణ వి గిరి, లంకా శ్రీధర్ పాల్గొన్నారు. -
ఇలా చేస్తే రూ. 311 లక్షల కోట్లు ఆదా, నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: సరుకు రవాణాకోసం పరిశుభ్రమైన, వ్యయాలను తగ్గించగలిగే ఇంధనాలను వినియోగించడం వల్ల భారత్.. 2020–2050 మధ్య కాలంలో లాజిస్టిక్స్ ఇంధనంపరంగా రూ. 311 లక్షల కోట్లు ఆదా చేసుకోగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. అలాగే వచ్చే మూడు దశాబ్దాల్లో 10 గిగాటన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో సరుకు రవాణా వేగవంతం చేయడంలో పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం అంశంపై రాకీ మౌంటెయిన్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎంఐ)తో కలిసి నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. ఉత్పత్తులు, సర్వీస్ లను డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సరుకు రవాణాకు కూడా డిమాండ్ గణనీయంగా పెరగగలదని నివేదిక పేర్కొంది. రైల్వే నెట్‌వర్క్‌నుపెంచుకోవడం, వేర్‌హౌసింగ్‌ను మెరుగుపర్చుకోవడం, విధానపరమైన సంస్కరణలు తీసుకోవడం, పరిశుభ్రమైన టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం, ఇంధన ఆదా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వృద్ధి బాటలో ఉన్న భారత ఎకానమీకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం సరుకు రవాణా కీలకంగా మారిందని, రవాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సలహాదారు (రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటీ) సుధేందు జె సిన్హా తెలిపారు. కేంద్రం నిర్దేశించుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా తదితర లక్ష్యాల సాకారానికి కూడా సమర్ధమంతమైన రవాణా విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. చదవండి: వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
ఆర్టీసీ 'డోర్ టు డోర్' పార్సిల్ సర్వీసు
సాక్షి, అమరావతి: లాజిస్టిక్ సేవల ద్వారా ఆదాయం పెంపుదలపై ఆర్టీసీ దృష్టి సారించింది. మొదటగా రాష్ట్రంలో ‘డోర్ టు డోర్’ పార్సిల్ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో సాధారణ పార్సిల్ సర్వీసు అందుబాటులో ఉంది. అంటే ఆర్టీసీలోని ఏఎన్ఎల్ పాయింట్‌కు వెళ్లి పార్సిల్ బుక్ చేయాలి. దాన్ని తీసుకునేవారు గమ్యస్థానంలోని ఆర్టీసీ బస్ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాలి. కాగా, ప్రస్తుతం ‘డోర్ టు డోర్’ పార్సిల్ సర్వీసు సేవలనూ ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఆర్టీసీని సంప్రదిస్తే ఇంటివద్దకే వచ్చి పార్సిల్/కొరియర్ బుక్ చేసుకుని తీసుకెళ్తారు. గమ్యస్థానంలోనూ నిర్ణీత చిరునామాకు వెళ్లి ఆ పార్సిల్/కొరియర్‌ను అందజేస్తారు. తద్వారా తమ వాణిజ్య సేవలను మరింత విస్తరించడంతోపాటు ప్రజలకు చేరువ కావచ్చన్నది ఆర్టీసీ ఉద్దేశం. అందులో భాగంగా మొదట పార్సిల్ ‘డోర్ డెలివరీ’ సేవలను త్వరలో ప్రవేశపెట్టనుంది. తర్వాత రెండుమూడు నెలలకు ‘డోర్ పిక్ అప్’ సేవలను అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పార్సిల్ సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి లాజిస్టిక్ సేవల ద్వారా ఆర్టీసీకి చెప్పుకోదగ్గ ఆదాయం సమకూరుతోంది. 2019–20లో మొత్తం రూ.97.44 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా పరిస్థితులతో లాక్డౌన్, ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ 2020–21లో లాజిస్టిక్ సేవల ద్వారా రూ.87.24 కోట్లు ఆదాయం రావడం విశేషం. వాటిలో పార్సిల్ సర్వీసుల ద్వారా రూ.46.42 కోట్లు, కొరియర్ సేవల ద్వారా రూ.1.78 కోట్లు, బల్క్ బుకింగ్‌ల ద్వారా రూ.0.53 కోట్లు, కాంట్రాక్టు వాహనాల ద్వారా రూ.17.31 కోట్లు, ఏజెన్సీ సేవల ద్వారా రూ.21.20 కోట్లు వచ్చాయి. ఏజెన్సీ ద్వారా పార్సిల్ సేవలు ఆదాయం పెరిగిన నేపథ్యంలో లాజిస్టిక్ సేవలను మెరుగుపరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తమకున్న వ్యవస్థీకృత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ సేవలను సమర్థంగా నిర్వర్తించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. మొదటగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ‘డోర్ టు డోర్’ పార్సిల్/కొరియర్ సేవలను తీసుకురానుంది. మునుముందు మరిన్ని కొత్త తరహా సేవలను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. -
బజాజ్ ఎలక్ట్రికల్స్, మహీంద్రా లాజిస్టిక్స్ డీల్
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవలను పొందేందుకుగాను మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్)తో బజాజ్ ఎలక్ట్రికల్స్ (బెల్), ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎండ్ టు ఎండ్ రీడిజైన్ సహా పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవల కోసం ఔట్సోర్సింగ్ కాంట్రాక్టుపై రెండు కంపెనీలూ సంతకాలు చేశాయి. దేశీ పరిశ్రమలోనే అత్యున్నత లాజిస్టిక్స్ సర్వీసులను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ పేర్కొంది. (గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు) ఐదేళ్లలో డీల్ విలువ రూ. 1,000 కోట్లకుపైగా చేరవచ్చని అంచనా వేసింది. తద్వారా ఏడాదికి 25 శాతానికిపైగా రవాణా సంబంధ వ్యయాలను ఆదా చేయనున్నట్లు తెలియ జేసింది. డీల్‌లో భాగంగా బజాజ్ ఎలక్ట్రికల్స్ కోసం రీడిజైన్ చేసిన కన్సాలిడేటెడ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనుంది. తాజా డీల్ ద్వారా తమ లాజిస్టిక్స్ విభాగం భారీ మార్పులకు లోనుకానున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ పొద్దార్ పేర్కొన్నారు. దీంతో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు కస్టమర్లకు సేవలు, లాభదాయకత వంటివి మెరుగుపరచుకోనున్నట్లు తెలియజేశారు. (వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త) -
కార్గో సేవలను ప్రారంభించిన మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) కొత్తగా కార్గో సేవలను ప్రారంభించింది. "ఈడెల్" పేరుతో కార్గో సేవల రంగంలోకి అడుగుపెట్టింది. ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ తదితర విభాగాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ తాజాగా కార్గో రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. వినియోగదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈడెల్ సేవలు దేశంలోని బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, కోల్‌కతా వంటి 6 ప్రధాన నగరాల్లో లభించనున్నట్లు పేర్కొంది. రాబోయే 12 నెలల్లోనే ఈ సేవలను 14 నగరాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ, సీఈవో రాం ప్రవీన్ స్వామినాథన్ తెలిపారు. -
ఈకామ్ ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్ : 7 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా సంక్షోభ సమయంలో ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ తీపి కబురు చెప్పింది. 7000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో లాస్ట్-మైల్ డెలివరీ, గిడ్డంగుల నిర్వహణ, కార్యకలాపాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్సెస్ విభాగాల్లో పూర్తి సమయం ఉద్యోగులుగా ఈ నియామకాలుంటాయని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అంతేకాదు రానున్న పండుగ సీజన్ నాటికి ఆన్లైన్ షాపింగ్, డోర్‌స్టెప్ డెలివరీలకు ప్రాధాన్యతనిచ్చేలా దాదాపు 35000 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలను కూడా రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, చండీగడ్, ఇండోర్, పట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్‌నుంచి వీరిని ఎంపిక చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త నియామకాలు తమ మొత్తం సిబ్బందిలో 25 శాతం అని సంస్థ సినియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ దీప్ సింగ్లా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయాల్లో, నగరాల్లో ఆన్లైన్ షాపింగ్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డోర్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రవాణా సేవలను అందించే సంస్థగా తమకు ఉద్యోగులే తమకు ఇరుసులాంటి వారని పేర్కొన్నారు. సురక్షితంగా, సకాలంలో డెలివరీ సేవలు లక్ష్యంగా ఈ కొత్త నియామకాలని ఆయన వెల్లడించారు. -
చిన్న సంస్థల కోసం అమెజాన్ నిధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న చిన్న స్థాయి లాజిస్టిక్స్ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. సరుకు డెలివరీ సేవలందించే చిన్న, మధ్య తరహా వ్యాపార భాగస్వామ్య సంస్థలకు, దేశీయంగా ఎంపిక చేసిన రవాణా భాగస్వామ్య సంస్థలకు దీని ద్వారా సహాయం అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్‌లో సిబ్బంది చెల్లింపులు, కీలకమైన ఇన్ఫ్రా వ్యయాలు లాక్డౌన్ ఎత్తివేత తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్తి స్థాయిలో విస్తరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక తోడ్పాటును వన్‌టైమ్ ప్రాతిపదికన సమకూర్చనున్నట్లు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ ఆపరేషన్స్ విభాగం) అఖిల్ సక్సేనా తెలిపారు. కోవిడ్–19 వ్యాధి బారిన పడిన వారికి తోడ్పాటునిచ్చేందుకు కంపెనీ ఇటీవలే 25 మిలియన్ డాలర్లతో అమెజాన్ రిలీఫ్ ఫండ్ (ఏఆర్ఎఫ్) ప్రారంభించింది. దీన్ని ఎంపిక చేసిన డెలివరీ భాగస్వాములకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. -
జోరుమీదున్న లాజిస్టిక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో లాజిస్టిక్, వేర్ హౌజ్ విభాగం ఫుల్ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు వల్ల దేశీయ లాజిస్టిక్ విభాగంలో డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్ అండ్ వేర్ హౌజ్ స్థలం అందుబాటులోకి వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్‌లాంగ్ లాసెల్లె (జేఎల్ఎల్) నివేదిక తెలియజేసింది. 215 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. ఏటా దేశీయ లాజిస్టిక్ విభాగం 33.81 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికి ఈ పరిశ్రమ 215 బిలియన్ డాలర్లకు చేరుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. ‘‘2018లో 3.2 కోట్ల చదరపుటడుగుల స్థలం లీజుకు తీసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 84 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకున్నారు. ఇంజనీరింగ్, ఆటో మరియు అనుబంధ సంస్థలు, ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, టెలికం విభాగాలు లాజిస్టిక్ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయి’’ అని జేఎల్ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అండ్ సీఈఓ రమేష్ నాయర్ చెప్పారు. లాజిస్టిక్ సప్లయి చైన్‌లో జీఎస్టీ రాకతో సవాళ్లు తొలిగాయని, ఒకే రకం పన్ను విధానం అమల్లోకి రావటంతో లావాదేవీలు, పన్ను వసూళ్లలో స్పస్టత ఏర్పడిందని చెప్పారాయన. అందుకే ఈ రంగంలో డిమాండ్ పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో ఈ–కామర్స్‌దే హవా హైదరాబాద్‌లో గిడ్డంగులకు ప్రధానంగా ఈ–కామర్స్ రంగం నుంచే డిమాండ్ వస్తోంది. 2017లో నగరంలో 20 లక్షల చ.అ. వేర్ హౌజ్ లావాదేవీలు జరగగా.. 2018 నాటికి ఇది వంద శాతం వృద్ధితో 40 లక్షలకు చేరింది. మొత్తం లీజు/కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ–కామర్స్ విభాగం వాటా 40 శాతం వరకూ ఉన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇందులోనూ 70 శాతం లావాదేవీలు జీడిమెట్ల – మేడ్చల్– కొంపల్లి క్లస్టర్‌లోనే జరిగాయని పేర్కొంది. శంషాబాద్, పటాన్చెరు క్లస్టర్స్ కూడా ముఖ్యమైనవేనని తెలిపింది. ఐదేళ్లలో రూ. 47,385 కోట్లు గిడ్డంగుల రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ జోరు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: గిడ్డంగుల రంగంలో గత కొన్నేళ్లలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్, నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది 2014 నుంచి చూస్తే, ఇప్పటివరకూ మొత్తం 47,385 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. జీఎస్టీ అమలు తర్వాత తయారీదారులు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లాజిస్టిక్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోందని, అందుకే ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని పేర్కొంది. ముఖ్యాంశాలు... ► గత ఏడాది వేర్ హౌజింగ్ స్పేస్ 77 శాతం వృద్ధితో 46.2 మిలియన్ చదరపుటడుగులకు పెరిగింది. ► 2014 నుంచి గిడ్డంగుల రంగంలో వచ్చిన రూ.47,385 కోట్ల పెట్టుబడుల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల వాటా 49 శాతంగా ఉంది. సావరిన్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 31 శాతం, డెవలపర్ల ఇన్వెస్ట్మెంట్స్ 20 శాతంగా ఉన్నాయి. ► తయారీ రంగం నుంచి వేర్‌హౌసింగ్ స్పేస్ డిమాండ్ ప్రస్తుతం 74 కోట్ల చదరపుటడుగులుగా ఉంది. ఇది 5 శాతం చక్రగతి వృద్ధితో 2024 కల్లా 92 కోట్ల చదరపుటడుగులకు చేరుతుంది. -
ఎఫ్ఎమ్ లాజిస్టిక్ రూ.1,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ఎఫ్ఎమ్ లాజిస్టిక్ కంపెనీ భారత్‌లో రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. గోదాముల నిర్మాణం కోసం ఐదేళ్లలో ఈ పెట్టుబడులు పెడతామని ఎఫ్ఎమ్ లాజిస్టిక్ తెలిపింది. భారత్‌లో వృద్ధి బాగా ఉందని కంపెనీ సీఈఓ జీన్–క్రిస్టోఫ్ మాచెట్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పాటునందించేందుకు గాను వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు. నాలుగు మెట్రో నగరాలను కలుపుకొని మొత్తం ఐదు నగరాల్లో గోదాముల నిర్మాణం చేపడతామని తెలిపారు. నిధుల కోసం స్థానిక, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా ఈ రంగంలో అపార అవకాశాలు లభించాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఏడాదిలో 500 మందికి ఉద్యోగాలు మొదటగా ముంబైలో తొలి మల్టీ క్లయింట్ వేర్హౌస్ను అందుబాటులోకి తెస్తామని, ఢిల్లీ ఎన్ఎస్ఆర్లో నెలరోజుల్లోనే మరో వేర్హౌస్ను అందుబాటులోకి తెస్తామని మాచెట్ తెలిపారు. గుర్గావ్ సమీపంలోని జాజ్పూర్లో 31 ఎకరాలను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో ఏడాది కాలంలో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భారత కార్యకలాపాల కోసం కొత్త ఎమ్‌డీగా అలెగ్జాండర్ అమైనె సౌఫియానిని నియమించామని వెల్లడించారు. పుణేకు చెందిన స్పియర్ లాజిస్టిక్స్ కంపెనీని 2016లో కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్ఎమ్ లాజిస్టిక్ కంపెనీ భారత్‌లోకి ప్రవేశించింది. -
ఆర్టీసీ కార్గోలో దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ కార్గోలో వినియోగదారుల నుంచి ప్రైవేటు సిబ్బంది ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ద్వారా పార్శిల్ సేవలు బుక్ చేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. కార్గో వ్యాపారాన్ని రెండేళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు యాజమాన్యం అప్పగించింది. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఈ ప్రైవేటు సంస్థకు కార్గో వ్యాపారం మొత్తం కట్టబెట్టారు. కార్గో వ్యాపారం ఏడాదికి రూ.కోటి జరిగితే, ఒప్పందం ప్రకారం 4.95 శాతం కమీషన్ చొప్పున ప్రైవేటు సంస్థకు రూ.4.95 లక్షలు చెల్లించాలి. (ఆర్టీసీని వాడేద్దాం!) గత 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సుల్లో పార్శిల్ వ్యాపారం ఏఎన్ఎల్ సంస్థ నిర్వహించింది. ఆ సంస్థ ఏడాదికి ఆర్టీసీకి రూ.9 కోట్ల వరకు చెల్లించేది. 2017 ఆగస్టులో ఏఎన్ఎల్ నుంచి కార్గో వ్యాపారం మొత్తం ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. పార్శిల్ వ్యాపారాన్ని వోల్వో బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఒక్క నెలలోనే రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీలో 10,700 బస్సుల్లోనూ పార్శిల్ సేవలను ఆరంభించడంతో ఆదాయం రూ.30 కోట్లకు చేరింది. (యాత్రల పేరిట ఆర్టీసీపై మరో పిడుగు..) పత్తాలేని పర్యవేక్షణ కార్గో వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించినా ఆర్టీసీ అధికారులే స్వయంగా పర్యవేక్షించాలి. కానీ ప్రైవేటు సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందినది కావడంతో ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్శిల్ సేవలకు నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకునే ప్రతి పార్శిల్‌కు బీమా సౌకర్యం కల్పిస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, అది ఎక్కడా అమలు కావడం లేదు. -
లాజిస్టిక్స్‌లో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ రంగంలో 2025 నాటికి 500 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 34.5 లక్షల కోట్లు) పెట్టుబడులు రాగలవని వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దీంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. అలాగే దేశీయంగా వ్యాపారాలకు, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోగలవని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన ఇండియా లాజిస్టిక్స్ లోగోను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే లాజిస్టిక్స్ వ్యయాలు భారత్‌లో అత్యధికంగా.. స్థూల దేశీయోత్పత్తిలో 14 శాతంగా ఉన్నాయి. ‘2025 నాటికి ఇన్ఫ్రా సహా లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు 500 బిలియన్ డాలర్లకు చేరతాయి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటాను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో లాజిస్టిక్స్‌దే కీలక పాత్ర’ అని ప్రభు చెప్పారు. భారీ లాజిస్టిక్స్ వ్యయాలు.. పోటీ తత్వంపైనా, సరకు రవాణాపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. లాజిస్టిక్స్‌కి సంబంధించిన వర్గాలన్నింటినీ ఒకే చోట చేర్చేలా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా జాతీయ లాజిస్టిక్స్ పోర్టల్‌ను తయారు చేస్తోందని వివరించారు. ఎగుమతి.. దిగుమతి వ్యయాలు, దేశీయంగా వాణిజ్య వ్యయాలను తగ్గించేందుకు సమగ్రమైన వ్యూహాన్ని కూడా రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సెంటర్ ఫర్ లాజిస్టిక్స్ ఏర్పాటుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)తో లాజిస్టిక్స్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
లాజిస్టిక్‌లో 30 లక్షల ఉద్యోగాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో దేశీయ లాజిస్టిక్ రంగంలో పారదర్శకత చేకూరడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో వచ్చే నాలుగేళ్లలో దేశంలోని లాజిస్టిక్ రంగంలో కొత్తగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలొస్తాయని ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ టీమ్‌లీజ్ తెలిపింది. హైదరాబాద్‌లో ఏకంగా 1.96 లక్షల ఉద్యోగాలు వస్తాయని టీమ్‌లీజ్ ‘ఇండియన్ లాజిస్టిక్ రివల్యూషన్: బెగ్ బెట్స్– బిగ్ జాబ్స్’ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం... ప్రస్తుతం దేశీయ లాజిస్టిక్ విపణి రూ.14.19 లక్షల కోట్లకు చేరిందని.. ఏటా 10.5% వృద్ధిని నమోదు చేస్తుంది. జీఎస్టీ, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ఈ వృద్ధికి కారణమని టీమ్‌లీజ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ సేన్ తెలిపారు. లాజిస్టిక్ రంగ వృద్ధితో ఈ రంగంతో అనుబంధమైన రోడ్డు, రైలు, విమాన, జల రవాణా రంగాలు, గిడ్డంగులు, ప్యాకేజింగ్, కొరియర్ విభాగాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఏ రంగంలో ఎన్నెన్ని ఉద్యోగాలంటే.. 2022 నాటికి లాజిస్టిక్ రంగం అనుబంధ విభాగాల్లో వచ్చే ఉద్యోగ అవకాశాల గణాంకాలను పరిశీలిస్తే.. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల్లో పెట్టుబడుల కారణంగా రోడ్డు రవాణాలో 1.45 లక్షలు, కార్గో వృద్ధి కారణంగా విమాన మార్గంలో 26 వేలు, రైలు విభాగంలో 4 వేల ఉద్యోగాలు వస్తాయని నివేదిక వెల్లడించింది. నగరీకరణ, ప్యాకేజింగ్ ఆవిష్కరణలు, ఐటీ స్వీకరణ కారణంగా కొరియర్ రంగంలో 11 వేలు, గిడ్డంగుల విభాగంలో 7 వేలు, ప్యాకేజింగ్ రంగంలో 3 వేల ఉద్యోగ అవకాశాలుంటాయి. రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు.. లాజిస్టిక్ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయి. గతేడాది లాజిస్టిక్ రంగానికి మౌలిక రంగ హోదా ఇవ్వడంతో రుణాల లభ్యత పెరిగిందని.. దీంతో కొత్త కంపెనీలు, విదేశీ సంస్థలు పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులతో రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఈ రంగంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దీంతో ఉద్యోగ వృద్ధి గణనీయంగా ఉంటుందని తెలిపింది. 2014లో 54వ ర్యాంక్‌గా ఉన్న లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఎల్పీఐ) ప్రస్తుతం 35కు చేరడమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం జల రవాణాపై దృషి, రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్స్, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌ల ఏర్పాటు వంటివి కూడా దేశీయ లాజిస్టిక్ రంగ వృద్ధికి ప్రధాన కారణం. శంషాబాద్, మహబూబ్‌నగర్ హవా.. దేశీ లాజిస్టిక్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ హైదరాబాదే. శంషాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాలు వేర్‌హౌస్ కారిడార్లుగా శరవేగంగా వృద్ధి చెందుతున్నాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా ఉండటం, భూముల లభ్యత ఎక్కువగా ఉండటం, అద్దెలూ అందుబాటులో ఉండటమే కారణం. రూ.1,930 కోట్ల పెట్టుబడులతో 97 కి.మీ. మేర నాలుగు లైన్ల మోడల్ రోడ్ కారిడార్లు, మల్టీమోడల్ పార్క్‌ల ఏర్పాటు వంటివి రానున్నాయని.. దీంతో హైదరాబాద్‌లో నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి. నైపుణ్య కొరత పెద్ద సవాల్.. పాత పని విధానాలు, నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత, లింగ వివక్ష వంటివి లాజిస్టిక్ రంగానికి ప్రధాన సవాల్‌గా మారాయి. మరోవైపు ఈ రంగంలోని ఉద్యోగులకు పరిహారం, ప్రోత్సాహకాలు తక్కువగా ఉండటం, అధిక పని ఒత్తిడి, శిక్షణ లేమి వంటి రకరకాల కారణాలతో ఉద్యోగులు ఈ రంగం నుంచి వైదొలుగుతున్నారు. టెక్నాలజీ వినియోగం పెరగడంవల్ల కూడా నైపుణ్య కొరత తీవ్రమైంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే నైపుణ్యం కొరత ఎక్కువగా ఉందని.. సుమారు నగరంలో 1.18 లక్షల మంది ఉద్యోగులు నైపుణ్యం లేక ఉన్నారని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. 2010లో లాజిస్టిక్ రంగంలో 5 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 20%కి పెరిగింది. వచ్చే నాలుగేళ్లలో 26 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. -
నాలుగేళ్లలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశీ లాజిస్టిక్స్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల కొత్త ఉద్యోగాలు రావొచ్చని మానవ వనరుల సంస్థ ‘టీమ్‌లీజ్’ అంచనా వేసింది. జీఎస్టీ అమలు, మౌలిక రంగంపై పెడుతున్న పెట్టుబడుల వంటివి ఉద్యోగాల సృష్టికి దోహదపడగలవని నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం.. ►రోడ్డు రవాణా, రైలు రవాణా, వేర్‌హౌసింగ్ (గిడ్డంగులు), జలమార్గాలు, వాయు రవాణా, ప్యాకేజింగ్, కొరియర్ సర్వీసులు అనే ఏడు సబ్–సెక్టార్లలో ఈ కొత్త ఉద్యోగాలు రావొచ్చు. దీంతో లాజిస్టిక్స్ రంగంలో ప్రస్తుతం 1.09 కోట్లుగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 2022 నాటికి 1.39 కోట్లకు పెరగొచ్చు. ►రోడ్డు రవాణాలో 18.9 లక్షల ఉద్యోగాలు, రైలు రవాణాలో 40,000 ఉద్యోగాలు, వాయు రవాణాలో 4,00,000 ఉద్యోగాలు, జలమార్గాల్లో 4,50,000 ఉద్యోగాలు రావొచ్చు. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, జీఎస్టీ అమలు వంటి పలు అంశాలు లాజిస్టిక్స్ రంగ వృద్ధికి కారణంగా నిలువనున్నాయి. ►లాజిస్టిక్స్ రంగంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో కొన్ని కొత్త నైపుణ్యాలు అవసరం కావొచ్చు. అలాగే దిగువ స్థాయిలో పలు ఉద్యోగాల కోత జరగొచ్చు. -
లాజిస్టిక్స్‌కు ‘మౌలిక’ హోదా
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక పార్కులు, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, రవాణా మొదలైనవన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. మౌలిక రంగంలో ఉపవిభాగాల కింద ’రవాణా’కి ’లాజిస్టిక్స్’ని కూడా జోడించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ మేరకు సవరించిన నిబంధనలపై ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మౌలిక రంగ హోదా లభించడంతో ఇక లాజిస్టిక్స్ సంస్థలు తక్కువ వడ్డీలకు దీర్ఘకాలిక రుణాలు పొందే వీలు కలుగుతుంది. దేశీయంగా ఎగుమతులకు సంబంధించి లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉంటుండటంతో... భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం కనీసం రూ.50 కోట్ల పెట్టుబడి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు లాజిస్టిక్స్ ఇన్ఫ్రా కిందకి వస్తాయి. అలాగే, కనీసం రూ. 15 కోట్ల పెట్టుబడి గల కోల్డ్ స్టోరేజీలు, రూ. 25 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్న గిడ్డంగులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కేంద్రం.. గత కొన్నాళ్లుగా రవాణా, లాజిస్టిక్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం తెలిసిందే. రహదారులు.. వంతెనలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, టన్నెల్స్ వంటివన్నీ రవాణా, లాజిస్టిక్స్‌లోకి వస్తాయి. పరిశ్రమ వర్గాల హర్షం.. ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. దీంతో తక్కువ వడ్డీలకే తాము రుణాలు సమీకరించుకునేందుకు వీలు లభిస్తుందని, సరుకు రవాణా చార్జీలు తగ్గేందుకు ఇది తోడ్పడగలదని తెలిపాయి. వ్యయాల పరంగా చూస్తే లాజిస్టిక్స్ సంస్థలకు కనీసం 50 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం చేకూరగలదని అవశ్య సీసీఐ లాజిస్టిక్స్ (ప్రైవేట్ దిగ్గజం ఆల్కార్గో హోల్డింగ్ సంస్థ) చీఫ్ దీపల్ షా తెలిపారు. దీనితో పారిశ్రామిక పార్కులు, వేర్హౌస్లలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, వినియోగం కూడా భారీ గా పెరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధికి ఊతం.. ఇన్ఫ్రా హోదాతో లాజిస్టిక్స్ రంగ సంస్థలకు రుణ సౌలభ్యం మెరుగుపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఇది తయారీ రంగ వృద్ధితో పాటు దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడగలదని తెలిపింది. ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని.. తాజా చర్యతో ఇటు దేశీయంగా ఈ రంగానికి తోడ్పాటు లభించడంతో పాటు అంతర్జాతీయంగాను డిమాండ్ మెరుగుపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫ్రా హోదా ఊతంతో.. లాజిస్టిక్స్ రంగ సంస్థలు విదేశీ వాణిజ్య రుణాలను, బీమా కంపెనీలు..పెన్షన్ ఫండ్స్ నుంచి దీర్ఘకాలిక రుణాలను సమీకరించుకోగలవని వివరించింది. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నుంచి కూడా ఈ సంస్థలు రుణాలు తీసుకోవచ్చని పేర్కొంది. -
ఉద్యోగ కల్పవృక్షాలు... ఈరంగాలు
రియల్టీ, రిటైల్, లాజిస్టిక్స్.. న్యూఢిల్లీ: నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్, రిటైల్, రవాణా, లాజిస్టిక్స్ రంగాలు సమీప భవిష్యత్తులో అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో 2013 నాటికి 4.5 కోట్ల ఉద్యోగాలు ఉండగా, మరో 3.1 కోట్ల మంది అవసరం ఉన్నట్టు అసోచామ్ నివేదిక పేర్కొంది. వ్యవస్థీకృత రిటైల్ రంగం కోటికి పైగా ఉద్యోగావకాశాలను రానున్న ఐదేళ్లలో అందించనుందని, టెక్స్టైల్స్ రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పేర్కొంది. ‘‘ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. ఉద్యోగ కల్పన నిదానంగా ఉండనుంది. 2022 నాటికి ఈ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు అవసరమని నివేదిక వివరించింది. -
లోడెంతైనా ఒకవైపే చార్జీ..!
⇔ లాజిస్టిక్స్ రంగానికి టెక్నాలజీని జోడించిన తులిప్ ⇔ బీ2బీ మార్కెట్లో కస్టమర్లుగా 80కి పైగా కంపెనీలు ⇔ 4 లక్షల వాహనాలు నమోదు; నెలకు రూ.2 కోట్ల వ్యాపారం ⇔ 2 నెలల్లో రూ.150 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ⇔ సాక్షి ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ నివాస్. కె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో దేశంలోని లాజిస్టిక్స్ రంగంలో ప్రధాన సమస్యేంటో తెలుసా? రెండు వైపులా చార్జీని కస్టమరే భరించడం! అలా కాకుండా ఒక వైపు చార్జీలే చెల్లించే విధానముంటే బావుంటుంది కదూ!!. అదనపు ట్రిప్పులతో ట్రక్ డ్రైవర్‌కు, ఒకవైపు చార్జీతో లోడ్ ఓనర్‌కూ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. ఇదిగో ఇలాంటి వ్యాపార విధానంతోనే పనిచేస్తోంది హైదరాబాద్‌కు చెందిన తులిప్ లాజిస్టిక్స్.కామ్. ఓలా, ఉబర్లు కారు డ్రైవర్‌ను, కస్టమర్‌ను ఎలాగైతే కలుపుతాయో.. తులిప్ కూడా అదే రీతిలో ట్రక్కుల్ని, కస్టమర్లను కలుపుతుంది. తులిప్ సేవలు, విస్తరణ ప్రణాళికల వివరాలను సంస్థ వ్యవస్థాపక సీఈఓ నివాస్ కె ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆయనేమన్నారంటే... మాకు యూఎస్ఎం గ్రూప్ కింద మైనింగ్, సాఫ్ట్వేర్, ఇన్ఫ్రా కంపెనీలున్నాయి. మైనింగ్ విభాగంలో ట్రాన్స్పోర్ట్ ఎప్పుడూ ఇబ్బందే. వాహనం ఎప్పుడొస్తుందో తెలియదు. అసలెక్కడుందో తెలియదు. ఏజెంట్లు, బ్రోకర్లపై ఆధారపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే అనిపించింది..!! టెక్నాలజీలోనూ సేవలందిస్తున్న మనమే ఎందుకూ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని జోడించకూడదు అని? రూ.20 లక్షల పెట్టుబడితో 2014లో హైదరాబాద్ కేంద్రంగా తులిప్ లాజిస్టిక్స్ ప్రారంభించటానికి ఆ ఆలోచనే కారణం. బీ2సీ నుంచి బీ2బీ మార్కెట్లోకి.. మొదట్లో బీ2సీ మార్కెట్లో పిపీప్ లాజిస్టిక్స్‌ను ప్రారంభించాం. ఇది అగ్రిగేట్ మోడల్. వాహన డ్రైవర్లు తమ వాహనాలను పిపీప్లో నమోదు చేసుకోవాలి. కావాల్సిన కస్టమర్లతో వారిని పిపీప్ కలుపుతుంది. 800 కి.మీ. వరకు రూ.400, 1,200 కి.మీ వరకైతే రూ.800, ఆపైన ఎన్ని కి.మీ. అయినా రూ.1,000 చార్జీ వసూలు చేస్తాం. కానీ ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాహనంలోని సరుకుకు బాధ్యత ఎవరిదని చాలా మంది కస్టమర్లు అడిగారు. దీంతో టెక్నాలజీని అభివృద్ధి చేసి తులిప్ లాజిస్టిక్స్ పేరిట బీ2బీ మార్కెట్లోకి వచ్చాం. సాంకేతికత, వేగం, కచ్చితత్వం.. ఈ మూడే తులిప్ స్పెషాలిటీ. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో కంపెనీలతో భాగస్వామ్యమవుతాం. ట్రక్ డ్రైవర్‌కు చార్జీ తులిపే చెల్లిస్తుంది. ఆ తర్వాత కస్టమర్ నుంచి తులిప్ వసూలు చేసుకుంటుంది. ఈ విధానంలో సరుకు బాధ్యత తులిప్దే. 2 టన్నుల నుంచి మొదలు... తులిప్ లాజిస్టిక్స్.కామ్‌లో ట్రక్ల సామర్థ్యం 2 టన్నుల నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం తులిప్‌లో 50 వేల మంది ఏజెంట్లు, వాహన ఓనర్లు రిజిస్టరయ్యారు. 4 లక్షలకు పైగా వాహనాలు నమోదై ఉన్నాయి. ఇందులో టాటా ఏస్ నుంచి 20 చక్రాల భారీ వాహనాల వరకూ ఉన్నాయి. మాంసాహార ఉత్పత్తులు, పాలు, పండ్ల వంటి ఉత్పత్తుల సరఫరా కోసం ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే వాహనాలూ ఉన్నాయి. జీపీఎస్ సాంకేతిక విధానంతో ట్రక్ ఎక్కడుంది? ఎంత సమయంలో చేరుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు లోడ్, ట్రక్ ఓనర్లకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంటాం కూడా. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లోడ్‌తో వచ్చే వాహనాల తనీఖీ సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి వాహనానికి తులిప్ లాజిస్టిక్స్.కామ్ సర్టిఫికెట్‌ను ఇస్తాం. ఇందులో వాహనానం, లోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలుంటాయి. దీంతో తనిఖీ అధికారుల పని సులువవ్వటమే కాకుండా ట్రక్ కూడా త్వరగా గమ్యాన్ని చేరుకుంటుంది. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్.. కోకకోలా, జేకే సీడ్స్, భారతి సిమెంట్స్, భవ్య సిమెంట్స్, హల్దీరామ్స్, ఇమామి, కేఎల్ఆర్, పార్లే బిస్కెట్స్, బేక్మేట్ వంటి ప్రముఖ కంపెనీలు మా సేవలను వినియోగించుకున్నాయి. ట్రక్కును బట్టి చార్జీ ఉంటుంది. ప్రారంభ ధర రూ.10–20 వేల మధ్య ఉంటుంది. ఆర్డర్ బుకింగ్ అయినప్పుటి నుంచి సరుకు గమ్య స్థానాన్ని చేరే వరకూ బాధ్యత తులిప్దే. ప్రస్తుతం రోజుకు 30 ట్రక్కులు బుక్ అవుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్–బెంగళూరు, విశాఖపట్నం పోర్ట్–బెంగళూరు, ఆంధ్రప్రదేశ్–లక్నో, పాట్నా మార్గాలుంటున్నాయి. నెలకు రూ.1.5–2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని చేరాం. రూ.150 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. విస్తరణ కోసం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.150–200 కోట్ల వీసీ ఫండ్ కోసం చూస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నాయి. మరో 2 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఉద్యోగులపై వేటు వేస్తున్న స్నాప్‌డీల్
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల కోత పెడుతోంది. తమ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో దాదాపు 600 మందిని స్నాప్ డీల్ తీసివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పారు. గత వారం నుంచే ఈ ప్రక్రియను స్నాప్ డీల్ ప్రారంభించిందని, మొత్తం 500 నుంచి 600 మందిని తీసివేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ జర్నీ సాగుతుందని స్నాప్ డీల్ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. కంపెనీలో ఇప్పటివరకు 8000 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించడానికి కూడా స్నాప్ డీల్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు పైకి ఎగిశాయి. ఈ రెవెన్యూలతో స్నాప్ డీల్ దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా పేరొందనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. -
డెలివరీ స్పెషల్... ‘జిప్.ఇన్’
♦ అదేరోజు డెలివరీకి సొంత లాజిస్టిక్స్ ♦ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖల్లో సేవలు ♦ 6 నెలలకో మెట్రోకు విస్తరణ.. బెంగళూరుతో షురూ ♦ 5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో జిప్.ఇన్ ఫౌండర్ కిశోర్ గంజి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరంభించి నిండా ఏడాదిన్నర కూడా కాలేదు. కానీ 30 వేల మంది కస్టమర్లకు చేరువయిందీ అన్లైన్ కంపెనీ. అంతేకాదు! నెలకు రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేసే స్థాయికి చేరింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సేవలందిస్తున్న ఈ కంపెనీ... త్వరలో బెంగళూరుకు... అక్కడి నుంచి ప్రతి ఆరునెలలకు మరో మెట్రో నగరానికి విస్తరించాలని లక్షిస్తోంది. ఈ స్థాయికి చేరుకున్న జిప్.ఇన్ ప్రస్థానం... ఈ వారం ‘స్టార్టప్ డైరీ’లో... హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న జిప్.ఇన్ ప్రత్యేకత ఏంటంటే... ఆర్డర్ చేసిన రోజే సరుకులు డెలివరీ చేస్తుంది. ఉదయం ఆర్డర్ చేసినవారికి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా సరువులు వచ్చి వాలిపోతాయి. ఇందుకోసం సంస్థ ప్రత్యేక లాజిస్టిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అమెరికాలో ‘ఆస్టిర్’ పేరిట ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిన కిశోర్ గంజి... 2014 డిసెంబర్లో ‘జిప్.ఇన్’ను ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా పనిచేస్తున్న ఆస్టిర్... ప్రస్తుతం 40 మిలియన్ డాలర్ల టర్నోవర్‌కు చేరుకుంది. హైదరాబాద్ ఏంజిల్స్ బోర్డ్ మెంబర్లలో కూడా కిశోర్ ఒకరు. ఇప్పటివరకు సుమారు 30 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ‘జిప్.ఇన్’ ప్రారంభం, విస్తరణ ప్రణాళిక గురించి మరిన్ని వివరాలు కిశోర్ మాటల్లోనే... ఈ రోజుల్లో ఆన్లైన్లో వ్యాపారానికి కస్టమర్లను ఆకర్షించడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ లాజిస్టిక్సే ప్రధాన సమస్య. ఎందుకంటే ఇచ్చిన ఆర్డర్‌ను సమయానికి డెలివరీ చేయాలి. అలా చేయకుంటే ఎంత మంచి కస్టమరైనా మరోసారి రాడు. అదే గడువులోగా డెలివరీ చేస్తే... కస్టమర్‌తో పాటు బ్రాండ్ విలువ కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే... ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడే వ్యాపార అవకా శాలూ పుష్కలంగా ఉంటాయని! ఇదే జస్ట్.ఇన్ ప్రారంభానికి కారణమైంది. దేశంలో గ్రాసరీ విభాగంలో ఉన్న లాజిస్టిక్ సమస్యలను క్షుణ్నంగా తెలుసుకున్నాం. అందుకే ముందుగా వ్యవస్థీకృతమైన లాజిస్టిక్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మరో కో-ఫౌండర్ వెంకట్‌తో కలిసి కోటి రూపాయల పెట్టుబడులతో 14 నాలుగు చక్రాల వాహనాలను లీజుకు తీసుకొని జిప్.ఇన్ను ప్రారంభించాం. నెలకు మిలియన్ డాలర్లు..: ప్రస్తుతం మాకు 30 వేల మంది కస్టమర్లున్నారు. ఇందులో 60-70% మంది రిపీటెడ్ కస్టమర్లే. నెలకు 5-6 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. డెలివరీకి కనీస ఆర్డర్ విలువ హైదరాబాద్‌లో అయితే రూ.500, విశాఖలో అయితే రూ.249గా నిర్ణయించాం. ప్రస్తుతం మా సంస్థలో 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆరు నెలలకో మెట్రోకు.. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో సేవలందిస్తున్నాం. త్వరలోనే బెంగళూరుకు విస్తరిస్తాం. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఓ మెట్రో నగరంలో విస్తరించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం 5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. 8,500 ఉత్పత్తులు.. ప్రస్తుతం జిప్.ఇన్‌లో పండ్లు, కూరగాయలు, వంట సామగ్రి, కాస్మొటిక్స్, పూజా సామగ్రి, పెట్ కేర్, మాంసం... ఇలా సుమారు 15 విభాగాల్లో 8,500 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.5 నుంచి రూ.5వేల వరకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తుల సంఖ్యను 12 వేలకు పెంచుతాం. ఇందుకోసం రిటైలర్లు, హోల్‌సేలర్స్, రైతులు.. ఇలా పలువురితో ఒప్పందాలు చేసుకున్నాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఐదేళ్లలో రూ. 16,250 కోట్లు ఖర్చుచేస్తాం: ఫ్లిప్‌కార్ట్
గిడ్డంగులు, లాజిస్టిక్స్‌కు వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వచ్చే నాలుగైదేళ్లలో సుమారు రూ.16,250 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తాన్ని గిడ్డంగుల ఏర్పాటుతోపాటు లాజిస్టిక్స్‌కు వ్యయం చేయనున్నట్టు కంపెనీ సీవోవో బిన్నీ బన్సల్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఫ్లిప్‌కార్ట్ ఏర్పాటు చేసిన భారీ గిడ్డంగిని ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ‘2019-20 నాటికి 80-100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. వీటిలో మూడు, నాల్గవ తరగతి పట్టణాల్లో సగం గిడ్డంగులను నెలకొల్పుతాం. దేశంలోని కస్టమర్లకు రెండు రోజుల్లోనే ఉత్పత్తులను చేర్చాలన్నది లక్ష్యం. రెండు మూడేళ్లలో లాభాల్లోకి వస్తాం’ అని సీవోవో తెలిపారు. కంపెనీ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం. మేడ్చల్ గిడ్డంగి నుంచి ఒక రోజులోనే ఈ రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేసే వీలుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పోచంపల్లి చీరలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని కంపెనీ వివరించింది. చిన్న వ్యాపారుల్నీ సంరక్షిస్తాం: ఈటల ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల రాకతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల రిటైల్ వర్తకులు నష్టపోతున్నారన్న సాక్షి ప్రతినిధి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెద్ద కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తాయి కాబట్టి వాటికి తక్కువ ధరకు సరుకులు వస్తాయి. అందుకే డిస్కౌంట్ ఇవ్వగల్గుతున్నాయి. అయితే కంపెనీలతోపాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులనూ బతికించుకుంటాం’ అని మంత్రి వివరించారు. కస్టమర్లు ఆన్లైన్లో కొంటున్నారు కాబట్టి రిటైలర్లు కూడా వ్యాపార విధానాన్ని మార్చుకోవాల్సిందేనని బన్సల్ స్పష్టం చేశారు. రిటైలర్ల వ్యాపార విస్తరణకు తాము వేదికగా ఉన్నామన్నారు. -
గ్రామాల్లోనూ ఈ-కామర్స్ క్లిక్..!
* సింహభాగం అమ్మకాలు చిన్న పట్టణాల్లోనే... * స్మార్ట్ఫోన్ల నుంచే ఆన్లైన్లో ఆర్డర్లు... * కీలకపాత్ర పోషిస్తున్న లాజిస్టిక్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఫీవర్ గ్రామీణ మార్కెట్లో చొచ్చుకుపోతోంది. సింహభాగం అమ్మకాలు చిన్న పట్టణాల నుంచే నమోదవుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మార్కెటింగ్ వ్యూహంతో మారుమూల పల్లెల్లోని కస్టమర్లూ ఆకర్షితులవుతున్నారు. ప్రతిరోజు ‘సేల్స్’ పేరుతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఆర్డరు ఇస్తే చాలు ఉత్పాదన రాగానే ఎంచక్కా ఇంటి వద్దే డబ్బులు చెల్లించేలా క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం ఉండడం కస్టమర్లను ఆకట్టుకునే అంశం. వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ సంస్థలు రవాణా, కొరియర్ కంపెనీలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన ఇండియా పోస్ట్ ద్వారా మారుమూలనున్న కస్టమర్లకూ ఉత్పత్తులను చేరవేస్తున్నాయి. ఇంకేముంది జోష్మీదనున ్న వినియోగదార్లు సింపుల్‌గా తమకు కావాల్సిన వస్తువులను స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డరు ఇచ్చేస్తున్నారు. ఈ-రిటైల్‌లో 40 శాతం వాటా మొబైల్స్‌దే కావడం విశేషం. బ్రాండ్స్ పట్ల అవగాహన.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి ఉపకరణాలు ఖరీదైనవి. చాలామంది గ్రామీణులకు ఇవేంటో కూడా తెలియదు. ఇవి కొనలేనివారు ఎంచక్కా స్మార్ట్ఫోన్లలో షాపింగ్ చేస్తున్నారు. రూ.3 వేల నుంచి స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. అటు గ్రామీణ కస్టమర్లకు బ్రాండ్స్‌పట్ల అవగాహన పెరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా టెలికం కంపెనీల దూకుడుతో డేటా టారిఫ్‌లు దిగొస్తున్నాయి. ఆఫర్ల పేరుతో ఈ-కామర్స్ కంపెనీలు ఊరిస్తున్నాయి. నలుగురిలో ప్రత్యేకత కోసం ఆన్లైన్లో ఆర్డరు ఇచ్చేవారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏదైతేనేం ఇప్పుడు గ్రామీణ వినియోగదారులు ఉన్నచోట నుంచే ఏం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెప్పించుకుంటున్నారు. టాప్ ఈ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. తమ కంపెనీకి భాగ్యనగరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా కస్టమర్లు ఉన్నారని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. చిన్న ఊర్లు-పెద్ద వాటా.. భారత్‌లో ఈ-కామర్స్ కంపెనీలు పండుగల సీజన్‌ను మరింత ఆకర్షణీయంగా మలుస్తున్నాయి. గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సాంకేతికంగా సమస్యలు రాకుండా టెక్నాలజీని సిద్ధం చేశాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈబే, మింత్రా, ఆస్క్‌మీబజార్ వంటి కంపెనీలు పోటాపోటీగా డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అన్ని కంపెనీల అమ్మకాల్లో చిన్న పట్టణాలదే పైచేయి. కంపెనీనిబట్టి ఈ మార్కెట్ల వాటా 70 శాతం వరకు ఉంది. ఆన్లైన్ లో వస్తువులను కొనుక్కునే వినియోగదార్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఇందులో 4.5 కోట్ల మంది తమ కస్టమర్లని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 75 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డరు చేస్తున్నారని తెలిపింది. 2015లో ఈ-కామర్స్ మార్కెట్ దేశంలో రూ.52,000 కోట్లు నమోదు చేస్తుందని అసోచామ్ వెల్లడించింది. కాగా, భారత స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 30 శాతం ఉంది. మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ మోడళ్ల వాటా 22-25 శాతముంది. అమ్మకాలూ ఎక్కువే.. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డే సేల్‌లో అత్యధిక అమ్మకాలు గ్రామీణ మార్కెట్ల నుంచే నమోదయ్యాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునీత్ సోని తెలిపారు. అది కూడా మొబైల్ ఫోన్ల ద్వారానే జరిగాయని చెప్పారు. బిగ్ బిలియన్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించింది. అక్టోబర్ 13-17 మధ్య జరిగిన ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్‌లో 65 శాతంపైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి వచ్చాయని అమెజాన్ వెల్లడించింది. ఆర్డరు బుక్ నాలుగు రెట్లు పెరిగిందని వివరించింది. కస్టమర్లలో 70 శాతం మంది మొబైల్ ద్వారా ఆర్డర్లిచ్చినట్టు తెలిపింది. లక్షలాది మంది కొత్త కస్టమర్లు చిన్న పట్టణాల నుంచి ఉన్నారని వివరించింది. ఇప్పుడు ఇదే ఊపుతో అక్టోబర్ 26-28 మధ్య గ్రేట్ ఇండియన్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. మారుమూల ప్రాంతాల నుంచి 70 శాతం వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నట్టు స్నాప్‌డీల్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే దిల్ కీ డీల్ దివాలీ సేల్‌లో పరిమాణం పరంగా 10 రెట్లు, కస్టమర్ల పరంగా 5 రెట్లు అధికమైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి రెండింట మూడొంతుల వ్యాపారం సమకూరిందని వెల్లడించింది. మొత్తం 60 లక్షల ఆర్డర్లను పొందింది.