ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.
ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్‌కు, రూ.140 కోట్లు బ్లాక్‌బక్ ఫిన్‌సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.
ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
ఏరిస్‌ఇన్‌ఫ్రా ఐపీవోకు రెడీ
నిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్‌మెంట్‌లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్‌మెక్స్ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment