IPO market
-
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్‌కు, రూ.140 కోట్లు బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్‌కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.ధర శ్రేణి: రూ. 275–289రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు లిస్టింగ్: 13ననివా బూపాఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్‌కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్‌చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.ధర శ్రేణి: రూ. 70–74 రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు లిస్టింగ్: 14నఇదీ చదవండి: బేర్ ఎటాక్..!కార్దేఖోఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్‌లో వెలువడిన కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్దేఖో నిలవనుంది. -
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
14 ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ
పద్నాలుగేళ్ల తర్వాత ఈ నెల(సెప్టెంబర్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి.ఫైనాన్షియల్ మార్కెట్లు వృద్ధిలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెప్టెంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌స్క్రైబ్ అవుతున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోల్లో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది. -
కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు..
కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రెండు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా, సమీకృత ఐటీ సొల్యూషన్లు అందించే ఎస్కోనెట్ టెక్నాలజీస్ తాజాగా సెబీని ఆశ్రయించాయి. ఈ బాటలో ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ సైతం స్టాక్ ఎక్ఛ్సెంజీలలో లిస్టింగ్‌పై కన్నేసింది. ఆ వివరాలు చూద్దాం.. రేస్ పవర్ ఇన్ఫ్రా సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఐపీవోను చేపట్టనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 29.95 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవోకంటే ముందుగానే షేర్ల జారీ లేదా ప్రమోటర్లు 14.97 లక్షల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ. 45 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇది జరిగితే ఆమేర ఈక్విటీ జారీ తగ్గనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సోలార్ విభాగంలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సరీ్వసులను అందిస్తోంది. 1,207 మెగావాట్ల పీక్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా కంపెనీ దేశీయంగా సోలార్ విభాగంలోని లీడింగ్ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. గతేడాది(2022–23) మొత్తం ఆదాయం రూ. 891 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 131 కోట్లను అధిగమించింది. ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐటీ రంగంలో సమీకృత సరీ్వసులందిస్తున్న ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐపీవో ద్వారా నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 33,60,000 షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతోపాటు.. పూర్తి అనుబంధ సంస్థ జీక్లౌడ్ సరీ్వసెస్ విస్తరణ వ్యయాలకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వెచి్చంచనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన కంపెనీ హైఎండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్, డేటా సెంటర్ సౌకర్యాలు, స్టోరేజీ సర్వర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ తదితరాలను సమకూర్చుతోంది. గ్లోబల్ దిగ్గజాలు ఏఎండీ, అమెజాన్ వెబ్ సరీ్వసెస్, సిస్కో, డెల్ టెక్నాలజీస్, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సాంకేతిక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఐటీ, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు క్లయింట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. డివైన్ పవర్ ఎనర్జీ ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. తద్వారా సమకూర్చుకున్న నిధులతో సామర్థ్య విస్తరణ చేపట్టాలని ప్రణాళికలు వేసింది. తాజా పెట్టుబడుల వినియోగంతో 2026కల్లా రూ. 400 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని ఆశిస్తోంది. వెరసి ఈ ఫిబ్రవరి లేదా మార్చికల్లా ఐపీవో చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో సాగుతోంది. దీంతో 2025కల్లా ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత రూ. 150 కోట్ల టర్నోవర్‌ను తొలుత రూ. 300 కోట్లకు, ఆపై రూ. 400 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. కంపెనీ పేపర్ కవర్డ్, డబుల్ కాటన్ కవర్డ్ కండక్టర్లు, ఫైబర్‌గ్లాస్ ఇన్సులేషన్, సూపర్ ఎనామిల్డ్ ఇన్సులేషన్లను రూపొందిస్తోంది. వీటిని ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు తదితర ఎలక్ట్రికల్ పరికరాలలో వినియోగిస్తారు. ఘజియాబాద్‌లో 40,000 చదరపు అడుగులలో విస్తరించిన తయారీ యూనిట్ ద్వారా రూపొందించిన ప్రొడక్టులను టాటా పవర్, బీఎస్ఈఎస్సహా పలు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు అందిస్తోంది. నాల్కో, బాల్కో, హిండాల్కో నుంచి ముడిసరుకులను పొందుతోంది. -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్‌అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్‌లో టాప్‌లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్‌లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్‌తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
వెలవెలబోతున్న ఐపీవో మార్కెట్
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్లో సందడి కనిపించడం లేదు. జనవరి నెలలో కేవలం 12 ఐపీవోలు రాగా, ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.478 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. ఇందులోనూ రూ.323 కోట్లు కేవలం రెండు కంపెనీలు మెయిన్‌బోర్డ్ రూపంలో సమీకరించినవి కావడం గమనించొచ్చు. 10 ఎస్ఎంఈ కంపెనీలు కలసి రూ.155 కోట్లను సమీకరించాయి. గత డిసెంబర్లో ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.5,120 కోట్లుగా ఉంది. ‘‘నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పడిపోవడంతో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఐపీవోలకు ఇది అనుకూల సమయం కాదు. అయినప్పటికీ ఆకర్షణీయమైన ధరతో వచ్చే ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. 2022లో రూ.57,000 కోట్లు గతేడాది మొత్తం మీద 38 కంపెనీలు ఐపీవో రూపంలో రూ.57,000 కోట్లను సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించినవి కావడం గమనించొచ్చు. 2021లో 63 కంపెనీలు కలసి సమీకరించిన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే గతేడాది గణనీయంగా తగ్గడాన్ని గమనించొచ్చు. ఎల్ఐసీ ఐపీవో లేకుంటే నిధుల సమీకరణ గణాంకాలు మరింత తక్కువగా ఉండేవి. గతేడాది నుంచి ఈక్విటీ మార్కెట్లు అస్థిరతలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీలు రూ.644 కోట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) రూపంలో రూ.829 కోట్లు రాబట్టాయి. -
నేడే ఎల్ఐసీ ఐపీవో ..స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 56946 పాయింట్లు, నిఫ్టీ 14పాయింట్లు నష్టపోయి 17054 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక బ్రిటానియా,ఎన్టీపీసీ,ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, బీపీసీఎల్, విప్రో, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్, కిప్లా, ఎంఅండ్ ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో రానే వచ్చింది. నేటి నుంచే ఐపీఓకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుండగా.. పాలసీ దార్లు, ఇన్వెస్టర్లు ఐపీవో ధరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవో ధర రూ.902 నుంచి రూ.949 మధ్యలో ఉండగా.. పాలసీదార్లకు రూ.60, రీటైలర్లు,ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు. -
ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనాలని అనుకుంటున్నారా? మీ పాన్ ను ఇలా అప్డేట్ చేయండి!
రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీఓ) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి రానుంది. ఇదే విషయాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది. అయితే ఇప్పుడు మనం ఎల్ఐసీ పాలసీ లో పాన్ నెంబర్‌ను ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకుందాం. ► కార్పొరేషన్ వెబ్సైట్ www.licindia.in లేదా https://licindia.in/Home/Online-PAN-Registrationని సందర్శించండి ►మీ పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడిని సిద్ధంగా ఉంచుకోండి, మీ పాన్‌ను అప్డేట్ చేస్తున్నప్పుడు నింపాల్సిన అవసరం ఉంది. ►మీరు పై లింక్‌ని ఉపయోగించి మీ అన్ని LIC పాలసీల రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ►మీరు కార్పొరేషన్ వెబ్సైట్ www.licindia.in లేదా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatusని సందర్శించడం ద్వారా మీ పాలసీలో మీ పాన్ అప్డేట్ అఅయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చు. ► ప్రత్యామ్నాయంగా, మీరు మీ ఎల్ఐసీ ఏజెంట్‌ని కూడా సంప్రదించవచ్చు. -
ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంతలోనే భారీ షాక్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ► దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్ ప్రీమియంను వసూలు చేశాయి. ► ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు. ► ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. ► మొత్తం మార్కెట్లో ఎల్ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఈ ఆఫర్లో ప్రత్యేకత. ఇక పబ్లిక్ ఇష్యూకు రావడానికి కూడా ఎల్ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ఐపీవో బాటలో స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌డీల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత బిజినెస్‌లు నిర్వహించే పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్నాప్‌డీల్ నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో 3.07 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. లిస్టింగ్ ద్వారా కంపెనీ విలువ 1.5–1.7 బిలియన్ డాలర్ల(రూ. 12,750 కోట్లు)కు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ఈక్విటీ జారీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, లాజిస్టిక్స్ విస్తరణ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో స్నాప్‌డీల్ పేర్కొంది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజాలు జొమాటో, నైకా, పాలసీబజార్, పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పొందిన విషయం విదితమే . మ్యాప్‌మైఇండియా లాభాల లిస్టింగ్ ఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్‌మైఇండియా షేరు తొలిరోజు ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర 1,033తో పోలిస్తే 53 శాతం ప్రీమియంతో రూ.1,581 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.1,587 వద్ద గరిష్టాన్ని.., రూ.1,395 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరి గంట లాభాల స్వీకరణతో 35% లాభంతో రూ.1,394 వద్ద నిలిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.7,425 కోట్లుగా నమోదైంది. -
Paytm IPO: తొలి రోజే పేటిఎమ్ మదుపర్లకు భారీ షాక్!
ఇండియాలోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. సుమారు రూ.18,300 కోట్లను సేకరించడం లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో ఐపీవో ధర రూ.2,150తో పోలిస్తే పేటీఎం షేరు విలువ 27.25% లేదా రూ.585.85 నుంచి రూ.1,564కు పడిపోయింది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 19.99% తక్కువగా ముగిసింది. నేటి సెషన్ ముగిసే సమయానికి సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ సమయంలో పేటిఎమ్ మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,955తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు 27.44% తక్కువగా రూ.1,560 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. ప్రారంభ ధర రూ.1,950తో పోలిస్తే స్టాక్ 20% తక్కువగా ముగిసింది. (చదవండి: యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!) పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080-2,150గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు తీపికబురు) -
స్టాక్ మార్కెట్, ఇకపైనా టెక్ కంపెనీల ఐపీవోల జోరు
న్యూఢిల్లీ: ఇటీవల పబ్లిక్ ఇష్యూల బాట పట్టిన వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు ఇకపైనా మరింత జోరు చూపనున్నట్లు అజయ్ త్యాగి పేర్కొన్నారు. గత 18 నెలల్లో ఐపీవోల ద్వారా ఈ సంస్థలు రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ త్యాగి తెలియజేశారు. ఈ బాటలో ఇకపైన మరో రూ. 30,000 కోట్లు సమకూర్చుకునేందుకు వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాఖలైన ప్రాస్పెక్టస్‌లు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టార్టప్ వ్యవస్థలో యూనికార్న్‌లుగా ఆవిర్భవిస్తున్న కంపెనీలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. బిలియన్ డాలర్(సుమారు రూ. 7,400 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో పుట్టుకొస్తున్న కొత్త తరం టెక్ కంపెనీలు స్టార్టప్ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పలు కంపెనీలు ప్రత్యేకతలు కలిగిన బిజినెస్ మోడళ్లపై దృష్టిపెడుతున్నాయని చెప్పారు. వెనువెంటనే లాభాలు అందుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేగవంత వృద్ధిని అందుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నాయని ప్రశంసించారు. పారిశ్రామిక సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో స్టార్టప్‌లకు సంబంధించి త్యాగి పలు విషయాలను ప్రస్తావించారు. ఈక్విటీకి దన్ను ఇటీవల విజయవంతమైన పబ్లిక్ ఆఫరింగ్స్‌కుతోడు మరిన్ని కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగనుండటంతో ఈక్విటీ మార్కెట్లు మరింత విస్తరించే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. టెక్ స్టార్టప్‌ల నుంచి తొలిసారిగా జొమాటో పబ్లిక్ ఇష్యూకి వచ్చి సక్సెస్ సాధించిన విషయం విదితమే. జొమాటో లిస్టింగ్‌తో టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు అనేకం సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో పేటీఎమ్, పాలసీబజార్, మొబిక్విక్, నైకా తదితరాలున్నాయి. కొద్ది కాలంగా ఐపీవో మార్కెట్లో బూమ్ నెలకొన్నట్లు త్యాగి పేర్కొన్నారు. దీంతో 2020–21లో ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 46,000 కోట్ల పెట్టుబడులు సమకూరిన విషయాన్ని ప్రస్తావించారు. అంతక్రితం ఏడాది సమీకరించిన రూ. 21,000 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) ఈ స్పీడ్ మరింత పెరగనుంది. తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్–ఆగస్ట్)నే దాదాపు గతేడాది సమీకరించిన నిధులను అందుకోవడం గమనార్హం! వెరసి ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్న ఏడాదిగా 2022 నిలిచే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. మరింత పెరగాలి.. ఐపీవోలకు నిర్ణయించే ధరల శ్రేణి అంశంలో సంస్కరణలు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు త్యాగి వెల్లడించారు. ప్రస్తుతం ఐపీవో మార్కెట్ ధర నిర్ణయంలో సెకండరీ మార్కెట్‌తోపోలిస్తే పారదర్శకత తక్కువేనని వ్యాఖ్యానించారు. భారీగా దాఖలయ్యే ఈ డాక్యుమెంట్లలో పలు టెక్నికల్ అంశాల ప్రస్తావన ఉంటుందని, రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని చదివి, అర్ధం చేసుకోవడం సవాలేనన్నారు. చదవండి: జొమాటో ప్రస్థానం.. పిజ్జా డెలివరీపై అసంతృప్తితో -
ఆగస్టులో ఐపీవో స్పీడ్ డౌన్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దూకుడు చూపుతూ వచ్చిన ప్రైమరీ మార్కెట్ గత నెలలో కొంతమేర మందగించింది. అయితే ఇదే సమయంలో సెకండరీ మార్కెట్లు రేసు గుర్రాల్లా దౌడు తీశాయి. ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం ద్వారా రికార్డులు నెలకొల్పాయి. ఒక్క ఆగస్ట్ నెలలోనే 9 శాతం పురోగమించాయి. సెన్సెక్స్ 57,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. ఈ జోష్‌తో 10 కంపెనీలు విజయవంతంగా పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్‌లో సగం కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. వివరాలు ఎలా ఉన్నాయంటే.. స్పందన సైతం గత కేలండర్ ఏడాది(2020)లో అటు ఇన్వెస్టర్ల స్పందనలోనూ.. ఇటు లిస్టింగ్ లాభాల్లోనూ జోరు చూపిన ఐపీవోలు ఈ ఏడాది(2021)లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)ను పరిగణిస్తే ఏప్రిల్ నుంచి 20 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 45,000 కోట్లను సమీకరించాయి. వీటిలో ఆగస్ట్‌లోనే 10 కంపెనీలు ఐపీవోలు పూర్తి చేసుకున్నాయి. అయితే గత నెలకల్లా ఐపీవోల స్పీడ్‌కు బ్రేక్ పడింది. ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి తగ్గింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే సగం కంపెనీలు నీరసంగా లిస్టయ్యాయి. ఇందుకు వెల్లువెత్తుతున్న ఇష్యూలు, నాణ్యమైన ఆఫర్లు కరవుకావడం వంటి అంశాలు కారణమైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. దీనికితోడు మిడ్, స్మాల్ క్యాప్స్‌లో భారీ ఒడిదొడుకులు నమోదుకావడం ప్రభావం చూపినట్లు విశ్లేషించారు. ఆగస్ట్‌లో మిడ్ క్యాప్ 3.3 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.5 శాతమే బలపడింది. జాబితా ఇదీ ఆగస్ట్‌లో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, ఎగ్జారో టైల్స్, విండ్లాస్ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్, కార్‌ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా ఐపీవోలను పూర్తి చేసుకుని లిస్టింగ్ సాధించాయి. వీటిలో ఐదు కంపెనీలే ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ 37 శాతం, రోలెక్స్ రింగ్స్ 30 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ను సాధించాయి. ఈ బాటలో ఎగ్జారో టైల్స్ 10 శాతం, గ్లెన్‌మార్క్ లైఫ్ 4 శాతం లాభాలతో మాత్రమే లిస్టయ్యాయి. ఇక తొలి రోజు క్రిస్నా 4% బలపడింది. నష్టాలతో.. ఇష్యూ ధరతో పోలిస్తే విండ్లాస్ బయోటెక్ 11 శాతం నష్టంతో లిస్టయ్యింది. ఇక కార్‌ట్రేడ్ టెక్ 8 శాతం, నువోకో విస్టాస్ 7 శాతం డిస్కౌంట్‌తో నమోదయ్యాయి. కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ ట్రేడింగ్ రోజున 1 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి. కాగా.. గత నెలలో వచ్చిన అన్ని ఐపీవోలు సక్సెస్ అయినప్పటికీ దేవయాని, రోలెక్స్ రింగ్స్‌కు మాత్రమే భారీ స్పందన లభించడం గమనార్హం! ఐపీవోకు ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటిర్ల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 1,300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు వీలుగా ఈ నెలలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. 2005లో ప్రారంభమైన కంపెనీ క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటర్లతోపాటు.. ప్రొడక్ట్ ఆర్అండ్డీ తదితర సేవలు అందిస్తోంది. కస్టమర్లలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, టాటా క్యాపిటల్, డీసీబీ బ్యాంక్, ముత్తూట్ గ్రూప్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐపీవోకు తొందర లేదు:ఫోన్‌పే న్యూఢిల్లీ: ఐపీవోకు వెళ్లేందుకు తొందర లేదని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. కంపెనీకి అర్ధవంతం, కారణం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తామని అన్నారు. ‘కంపెనీ అయిదేళ్ల క్రితం ప్రారంభమైంది. 30 కోట్ల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. ఆర్థిక సేవల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్, బీమా విభాగాల్లో గణనీయమైన పెరుగుదలను ఫోన్‌పే నమోదు చేసింది. త్వరలో బీటూబీ అకౌంట్ అగ్రిగేటర్సహా ఇతర సేవల్లోకి అడుగు పెడుతున్నాం. పోటీ కంపెనీ ఐపీవోకు వెళితే నేను లెక్క చేయను’ అని తెలిపారు. రూ.7.47 లక్షల కోట్ల విలువైన 394.13 కోట్ల లావాదేవీ లను జూన్ క్వార్టర్లో ఫోన్‌పే నమోదు చేసింది. -
రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తమ ఆన్లైన్ పేమెంట్స్ వ్యాపారాన్ని కొత్త అనుబంధ సంస్థకు బదలాయించాలని భావిస్తోంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు దీన్ని బదిలీ చేయడానికి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు సెప్టెంబర్ 23న అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఈజీఎం నోటీసు పంపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తెలిపింది. కొత్త సంస్థ బుక్ వేల్యు సుమారు రూ. 275–350 కోట్లుగా ఉంటుందని, ఈ నిధులను అయిదేళ్ల పాటు వార్షిక చెల్లింపుల కింద మాతృసంస్థ వన్9 కమ్యూనికేషన్స్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. అక్టోబర్‌లో రూ. 16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు పేటీఎం కసరత్తు చేస్తోంది. -
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది. ఆస్టిన్ జీఐఎస్‌లో టెక్‌మహీంద్రా పెట్టుబడులు న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్‌లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్‌మహీంద్రా ఐఎన్‌సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది. -
పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా, ఐపీవోలు ఖుషీ
ముంబై: కొద్ది నెలలుగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్‌కు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు దన్నునిస్తున్నారు. దీంతో పలు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోలు చేపట్టేం దుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. మరోపక్క లిస్టింగ్‌లోనూ భారీ లాభాలను సాధిస్తుండటంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే రిటైల్ ఇన్వెస్టర్లు లక్షల సంఖ్యలో జత కలుస్తున్నారు. ఇది ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో రిటైలర్ల వాటా సరికొత్త గరిష్టాన్ని తాకేందుకు దోహదం చేసింది. జూన్ చివరికల్లా మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతానికి ఎగసింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 16.18 లక్షల కోట్లు! 40 కొత్త లిస్టింగ్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాయి. తద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో పలు ఇష్యూలకు 100 రెట్లు, ఆపై సబ్స్క్రిప్షన్ లభించడం విశేషం. మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇకపైనా ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. వెరసి మరో రూ. 75,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందువల్లనే ఇటీవల ఒక బులెటిన్‌లో ఆర్బీఐ.. 2021ను ఐపీవో నామసంవత్సరంగా పేర్కొన్నట్లు తెలియజేశారు. చదవండి : దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్ మార్చిలో మహాజోరు ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2020 మార్చిలో 3 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. ఈ బాటలో 2021 జూన్ చివరికల్లా వీటి సంఖ్య 8 కోట్లకు చేరింది. గతేడాది మార్చిలో 35 శాతం పతనమైన మార్కెట్ తదుపరి బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ జనవరిలో 50,000 పాయింట్ల మైలురాయికి చేరిన సెన్సెక్స్ సరికొత్త చరిత్రను లిఖిస్తూ తాజాగా ఇంట్రాడేలో 56,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. రిటైల్ స్పీడ్ ఇటీవలే లిస్టయిన దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోకు రిటైలర్ల నుంచి 40 రెట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్‌కు 42 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఈ బాటలో చిన్న ఇష్యూ అయిన తత్వ చింతన్‌కు మరింత అధికంగా 59 రెట్లు ఎక్కువగా బిడ్స్ లభించాయి. అయితే క్లీన్ సైన్స్ టెక్నాలజీకి 9 రెట్లు, భారీ ఇష్యూ జొమాటోకు 7.5 రెట్లు అధికంగా మాత్రమే రిటైలర్లు దరఖాస్తు చేయడం గమనార్హం! ప్రీమియంతో.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి డైరెక్టుగా ప్రవేశిస్తున్నట్లు ట్రస్ట్‌ప్లస్ వెల్త్ సీఈవో సమీర్ కౌల్ తెలియజేశారు. ఇందువల్లనే ఇటీవల పలు ఐపీవోలు భారీగా సక్సెస్ అవుతున్నట్లు వివరించారు. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఇష్యూకి 3.9 మిలియన్ దరఖాస్తులు లభించాయి. దీంతో గతంలో 4.2 మిలియన్లతో రికార్డు నెలకొల్పిన రిలయన్స్ పవర్ తదుపరి నిలిచింది. అయితే ఆర్‌పవర్‌కు రిటైల్ విభాగంలో 83 రెట్లు స్పందన లభించగా.. గ్లెన్‌మార్క్ 15 రెట్లు మాత్రమే సాధించింది. భారీ లిక్విడిటీ పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఈక్విటీ బ్రోకింగ్ హెడ్ అరుణ్ జైన్ తెలియజేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం కారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో లిస్టవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా తత్వ చింతన్, జొమా టో, జీఆర్ ఇన్ఫ్రా 97–78 శాతం మధ్య ప్రీమియంతో లిస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. -
అప్పుడు సూపర్ హిట్, ఇప్పుడు జొమాటోకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ ఈ ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 100 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 266 కోట్ల నుంచి రూ. 844 కోట్లకు జంప్‌చేసింది. ఇక మొత్తం వ్యయాలు సైతం రూ. 383 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో గ్రోఫర్స్ ఇండియా లో 9.25%, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 9.27% చొప్పున వాటాల కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గ్రోఫర్స్ ఇండియా ప్రయివేట్, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్, గ్రోఫర్స్ ఇంటర్నేషనల్ తదితరాలతో డీల్ కుదుర్చుకున్నట్లు జొమాటో వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 125 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల ఐపీవో లిస్టింగ్ లో జొమాటో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో .. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. సబ్స్క్రిప్షన్స్ సైతం గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ జొమాటో నిలిచింది. కానీ క్యూ1 ఫలితాల్లో జొమాటో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది. నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరడంపై ఇన్వెస్టర్లు, అటు మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్, ఆ ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్ -
దేవుడా.! ఓ మంచి దేవుడా అడగకుండానే వేల కోట్లు ఇచ్చావ్
దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్. వేలకోట్ల ఆస్తి ఇచ్చావ్. వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియాను చేశావ్. ఇప్పుడు నేను అడగకుండా ఇచ్చే ధనం వద్దు.. నేను దానం చేసే గుణం ఇవ్వు' అని కోరుకుంటున్నారు. రాకేశ్ జున్‌జున్‌వాలా పరిచయం అక్కర్లేని పేరు. దలాల్ స్ట్రీట్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిలో కొద్ది మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..నేను ఇప్పుడు దేవుడిని సంపదను ఇవ్వమని కోరుకోవడం లేదు. కానీ సంపాదించిన ఆస్తిని దానం చేసే గుణాన్ని ఇవ్వమని వేడుకుంటున్నా. అన్ని సహకరిస్తే త్వరలో రూ.400 నుంచి రూ.500కోట్ల క్యాపిటల్ ఫండ్ తో ఎన్జీఓని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కరోనా కారణంగా దేశంలో తలెత్తిన ఆర్ధిక మాద్యంపై స్పందించారు. గతంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కంటే .. కరోనా సృష్టించిన ఆర్ధిక సంక్షోభం పెద్దది కాదని, రాబోయే రోజుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10శాతం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఓకి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్టార్ హెల్త్‌లో వాటాదారులుగా ఉన్నారు. చెన్నైకి చెందిన వి.జగన్నాథన్ యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006లో వి.జగన్నాథన్ చెన్నైలో స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ను ప్రారంభించి మెడిక్లయిమ్,యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్‌తో అనతికాలంలో ప్రజాదారణ పొందారు. దీంతో బిగ్ బుల్ రాకేశ్ 2018 ఆగస్ట్ నెలలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, మాడిసన్ క్యాపిటల్ తో కలిసి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 90 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు -
దూకుడుమీదున్న మార్కెట్లు, ఐపీఓ బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు చూపుతున్న దూకుడు నేపథ్యంలో తాజాగా డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,900 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
జొమాటోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 8,250 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే జొమాటో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.7,500 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ఇన్ఫో ఎడ్జ్ ఇండియా మరో రూ.750 కోట్ల విలువైన్ షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపేనీల కొనుగోళ్లు, విస్తరణ, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో జోమటో పేర్కొంది. కొత్త కాలంగా ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థలు భారీ స్థాయిలో పురోగమిస్తున్న విషయం విదితమే. వెరసి 2019-20లో జొమాటో ఆదాయం రెట్టింపునకు ఎగసి 89.4 కోట్ల డాలర్లు(రూ. 2900కోట్టు)ను తాకింది. అయితే రూ. 2,200 కోట్ల నిర్వహణ(ఇబిటా) నష్టాలు నమోదయ్యాయి. కాగా ఈ ఫిబ్రవరిలో టైగర్ గ్లోబల్స్ కోరా తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి 25 కోట్ల డాలర్లు(రూ.1800 కోట్లు) సమీకరించింది. దీంతో జొమాటో విలువ 5.4 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఐపీఓకి మరో మూడు కంపెనీలు, కళకళలాడుతున్న మార్కెట్లు
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్ల జోరుతో గత కొంత కాలంగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. దీంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు సైతం కళకళలాడుతున్నాయి. తాజాగా మరో మూడు కంపెనీలు ఇన్వెస్టర్లను పలుకరించనున్నాయి. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందాయి. ఈ జాబితాలో క్లీన్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ చేరాయి. వివరాలు ఇలా.. పబ్లిక్ ఇష్యూకి అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే మూడు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ క్లీన్‌సైన్స్‌కు ఈ నెల 12న, రియల్టీ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్‌కు 15న, మౌలిక సదుపాయాల కంపెనీ జీఆర్ ఇన్ఫ్రాకు 16న సెబీ దాదాపు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఐపీవో ద్వారా క్లీన్‌సైన్స్ రూ. 1,400 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు, వాటాదారులు ఈక్విటీని విక్రయించనున్నారు. పెర్ఫార్మెన్స్, ఎఫ్ఎంసీజీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియెట్స్ తదితరాలను రూపొందిస్తోంది. రూ. 800 కోట్లకు సై పబ్లిక్ ఇష్యూ ద్వారా బెంగళూరు సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 800 కోట్లను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 550 కోట్ల ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నాయి. దీనికి అదనంగా రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. జాబితాలో టీపీజీ క్యాపిటల్, టాటా క్యాపిటల్, వాల్టన్ స్ట్రీట్ క్యాపిటల్ తదితర సంస్థలున్నాయి. కంపెనీ ఈక్విటీలో 58 శాతం వా టా వరకూ కలిగి ఉన్నాయి. దీంతో ఐపీవో నిధుల లో ప్రధాన భాగం పెట్టుబడి సంస్థలకు చేరనున్నా యి. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్ర ధానంగా దక్షిణాదిలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 1,000 కోట్ల అంచనా ఉదయ్‌పూర్ ఈపీసీ కంపెనీ జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఐపీవో ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు 1.15 కోట్ల షేర్లకుపైగా విక్రయానికి ఉంచనున్నాయి. వాటాలు విక్రయించనున్న సంస్థలలో లోకేష్ బిల్డర్స్, జాసమ్రిత్ ప్రెమిసెస్, ఫ్యాషన్స్, క్రియేషన్స్, ఇండియా బిజినెస్ ఎక్సలెంట్ ఫండ్ తదితరాలున్నాయి. జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టే ఈ సంస్థ ఇటీవల రైల్వే రంగ ప్రాజెక్టులలోకీ ప్రవేశించింది. చదవండి: ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
2020: ఐపీవో నామ సంవత్సరం
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)ని ఐపీవో నామ సంవత్సరంగా పేర్కొనవచ్చునంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 30,000 కోట్లకుపైగా సమీకరించాయి. 2019లో ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న నిధులు రూ. 20,300 కోట్లు. వీటితో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇప్పటికే 50 శాతానికిపైగా ఫండ్స్‌ను కంపెనీలు సమీకరించగలిగాయి. అంతేకాకుండా 14 కంపెనీలూ ప్రస్తుతం ఐపీవో ధరలతో పోలిస్తే లాభాలతో ట్రేడవుతుండటం విశేషం! వెరసి 2020ను ఐపీవో ఏడాదిగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి కోవిడ్-19 సంక్షోభం నుంచి మార్కెట్లు ఫీనిక్స్‌లా పుంజుకోవడం విశేషమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి కనిష్టాల నుంచి ఎన్ఎస్ఈ నిఫ్టీ 79 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. కొత్త సంవత్సరం(2021)లోనూ ప్రైమరీ మార్కెట్ ఇదేవిధంగా కళకళలాడే వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ భావిస్తోంది. ఇందుకు ప్రధానంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుండటాన్ని ప్రస్తావిస్తోంది. కొత్త ఏడాదిలో ఐపీవోకు రాగల కంపెనీలలో కళ్యాణ్ జ్యువెలర్స్(రూ. 1750 కోట్లు), ఇండిగో పెయింట్స్(రూ. 1,000 కోట్లు), స్టవ్ క్రాఫ్ట్, సంహి హోటల్స్, ఏజీజే సురేంద్ర పార్క్ హోటల్స్, జొమాటో తదితరాలున్నాయి. ఎల్‌ఐసీకాకుండా 30 కంపెనీలు సుమారు రూ. 30,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఎల్ఐసీ భారీ ఇష్యూకావడంతో రూ. 50,000 కోట్లకు మించి నిధుల సమీకరణకు వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ అంచనా వేస్తోంది. (వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?) బెక్టర్స్ ఫుడ్ రికార్డ్ ఈ ఏడాది 15వ కంపెనీగా గురువారమే ఐపీవో పూర్తిచేసుకున్న బెర్టర్స్ ఫుడ్ గత ఐదేళ్లలోలేని విధంగా 198 రెట్లు అధిక బిడ్స్‌ను పొందింది. ఇంతక్రితం 2018లో అపోలో మైక్రోసిస్టమ్స్ మాత్రమే ఇంతకంటే అధికంగా 248 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. వెరసి బెక్టర్స్ ఫుడ్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇక ట్రేడింగ్ ప్రారంభం రోజు లాభాలకు వస్తే.. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రెట్టింపునకుపైగా లాభంతో రూ. 731 వద్ద లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 340 మాత్రమే. ఇదేవిధంగా హ్యాపియెస్ట్ మైండ్స్ ఐపీవో ధర రూ. 166కాగా.. రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ బాటలో రూ. 350 ధరలో ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్ రూ. 708 వద్ద లిస్టయ్యింది. బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 60కాగా.. 115 వద్ద లిస్టయ్యింది. రోజారీ బయోటెక్ ఐపీవో ధర రూ. 425తో పోలిస్తే రూ. 670 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. కాగా.. ఈ ఏడాది 16వ కంపెనీగా వచ్చే వారం నుంచీ ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) వెనకడుగులో ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన కంపెనీలలో ఇష్యూ ధర కంటే దిగువన లిస్టయిన కంపెనీల జాబితా చూస్తే.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ చోటు చేసుకున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ లాభాల బాట పట్టడం గమనార్హం. ఇక ఐపీవో ధరను మించి లాభాలతో లిస్టయిన కంపెనీలలో బర్గర్ కింగ్, గ్లాండ్ ఫార్మా, లిఖిత ఫైనాన్స్, మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, రూట్ మొబైల్, హ్యాపియెస్ట్ మైండ్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, రోజారీ బయోటెక్ నిలుస్తున్నాయి. -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతుండటంతో తాజాగా మరో కంపెనీ ఐపీవో బాట పట్టింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. సోమవారం(21) నుంచి ప్రారంభంకానున్న ఇష్యూ బుధవారం(23న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా రూ. 300 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. 47 షేర్లు ఒక లాట్‌గా నిర్ణయించింది. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇదే పరిమాణంలో రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్‌కు చెందిన లీడ్స్, టామ్‌బ్రిడ్జ్, క్యామ్‌బ్రిడ్జ్, గిల్డ్‌ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది.