రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్‌టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్‌కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.
ధర శ్రేణి: రూ. 275–289
రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు
లిస్టింగ్: 13న
నివా బూపా
ఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్‌ఎల్‌పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్‌కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్‌చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ధర శ్రేణి: రూ. 70–74
రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు
లిస్టింగ్: 14న
ఇదీ చదవండి: బేర్ ఎటాక్..!
కార్‌దేఖో
ఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్‌దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్‌లో వెలువడిన కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్‌దేఖో నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment