Initial public offering
-
ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..
రెనెవబుల్ ఎనర్జీ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ హోల్డింగ్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి రూ.275–289 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.2,395 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.505 కోట్ల విలువైన షేర్లను ఆక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ.2,900 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(5న) షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.1,795 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన సంస్థగా ఆవిర్భవించింది. 2024 జూన్‌కల్లా నిర్వహణలోని 28 ప్రాజెక్టులను కలిగి ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌లలోనే 18 ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుత సామర్థ్యం 1,320 మెగావాట్లుకాగా.. 1,650 మెగావాట్లు నిర్మాణంలో ఉన్నాయి. గతేడాది రూ. 1,319 కోట్ల ఆదాయం, రూ. 698 కోట్ల నికర లాభం సాధించింది.ధర శ్రేణి: రూ. 275–289రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 51 షేర్లు లిస్టింగ్: 13ననివా బూపాఆరోగ్య బీమా రంగ కంపెనీ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ గురువారం(7న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న ఇష్యూకి రూ.70–74 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రేపు(6న) షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో 62.19 శాతం వాటాగల బూపా సింగపూర్ హోల్డింగ్స్ రూ.350 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. 26.8 శాతం వాటా కలిగిన ఫెటల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,050 కోట్ల విలువైన వాటాను విక్రయించనుంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ మార్కెట్లో స్టార్ హెల్త్ తదుపరి స్టాండెలోన్ కంపెనీగా లిస్ట్‌కానుంది. గతేడాది మొత్తం ప్రీమియం ఆదాయం 38 శాతం జంప్‌చేసి రూ.5,608 కోట్లకు చేరింది. రూ.82 కోట్ల నికర లాభం ఆర్జించింది.ధర శ్రేణి: రూ. 70–74 రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్: 200 షేర్లు లిస్టింగ్: 14నఇదీ చదవండి: బేర్ ఎటాక్..!కార్దేఖోఆటో క్లాసిఫైడ్స్ పోర్టల్ కార్దేఖో పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. సంస్థ సహవ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లను నియమించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో 2021 ఆగస్ట్‌లో వెలువడిన కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీవో తదుపరి రెండో ఆటో క్లాసిఫైడ్ లిస్టెడ్ సంస్థగా కార్దేఖో నిలవనుంది. -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
వెలవెలబోతున్న ఐపీవో మార్కెట్
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్లో సందడి కనిపించడం లేదు. జనవరి నెలలో కేవలం 12 ఐపీవోలు రాగా, ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.478 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. ఇందులోనూ రూ.323 కోట్లు కేవలం రెండు కంపెనీలు మెయిన్‌బోర్డ్ రూపంలో సమీకరించినవి కావడం గమనించొచ్చు. 10 ఎస్ఎంఈ కంపెనీలు కలసి రూ.155 కోట్లను సమీకరించాయి. గత డిసెంబర్లో ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.5,120 కోట్లుగా ఉంది. ‘‘నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పడిపోవడంతో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఐపీవోలకు ఇది అనుకూల సమయం కాదు. అయినప్పటికీ ఆకర్షణీయమైన ధరతో వచ్చే ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. 2022లో రూ.57,000 కోట్లు గతేడాది మొత్తం మీద 38 కంపెనీలు ఐపీవో రూపంలో రూ.57,000 కోట్లను సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించినవి కావడం గమనించొచ్చు. 2021లో 63 కంపెనీలు కలసి సమీకరించిన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే గతేడాది గణనీయంగా తగ్గడాన్ని గమనించొచ్చు. ఎల్ఐసీ ఐపీవో లేకుంటే నిధుల సమీకరణ గణాంకాలు మరింత తక్కువగా ఉండేవి. గతేడాది నుంచి ఈక్విటీ మార్కెట్లు అస్థిరతలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీలు రూ.644 కోట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) రూపంలో రూ.829 కోట్లు రాబట్టాయి. -
ఆర్కియన్ కెమ్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. రూ. 386–407 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 32 రెట్లు అధిక స్పందన లభించింది. కంపెనీ 1.99 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 64.31 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి 49 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 15 రెట్లు అధికంగా బిడ్స్ లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. 11న ముగిసిన ఇష్యూ ద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమకూర్చుకుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించారు. తాజా ఈక్విటీ నిధులను కంపెనీ జారీ ఎన్సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా బ్రోమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, పొటాష్ సల్ఫేట్ తయారీతోపాటు, ఎగుమతులను సైతం చేపడుతోంది. -
ఐపీవో నిబంధనలు కఠినతరం
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఏ అంశాల ప్రాతిపదికన ఆఫర్ ధరను నిర్ణయించారన్న వివరాలను ఆఫర్ డాక్యుమెంట్, ప్రైస్ బ్యాండ్ ప్రకటనల్లో ’ఇష్యూ ధరకు ప్రాతిపదిక’ సెక్షన్ కింద వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది. ఇష్యూయర్లు ఇందుకోసం గతంలో జరిపిన నిధుల సమీకరణ, లావాదేవీలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వాటితో పాటు కీలక పనితీరు సూచికలను (కేపీఐ) ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో వివిధ సెక్షన్ల కింద ఇస్తున్నా.. ఆఫర్ డాక్యుమెంట్లలోని ఆర్థిక వివరాల సెక్షన్లలో ఉండటం లేదు. ఎటువంటి ట్రాక్ రికార్డు లేని కొత్త తరం కంపెనీలు పెద్ద యెత్తున ఐపీవోలకు వస్తుండటం, ఇన్వెస్టర్లు నష్టపోతుండటం జరుగుతున్న నేపథ్యంలో సెబీ శుక్రవారం బోర్డు సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడగలదని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. అలాగే ఐపీవో యోచనలో ఉన్న కంపెనీలు ఆఫర్ డాక్యుమెంట్లను ’ప్రీ–ఫైలింగ్’ చేసే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనకూ సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఇష్యూకి వచ్చే సంస్థలు తమ ఆఫర్ పత్రాలను బహిరంగ పర్చకుండా, ప్రాథమిక సమీక్ష కోసం సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలకు అందించాల్సి ఉంటుంది. ప్రీ–ఫైలింగ్‌తో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాసెసింగ్ విధానం కూడా ఇకపైనా కొనసాగుతుంది. మరిన్ని నిర్ణయాలు.. ► మ్యుచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలు, విక్రయాలను ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ప్రస్తుతం ఈ నిబంధనలు లిస్టెడ్ కంపెనీలు లేదా లిస్ట్ కాబోతున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తున్నాయి. ► మ్యుచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ లావాదేవీలకు కూడా రెండంచెల ధృవీకరణను సెబీ తప్పనిస రి చేసింది. ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమ ల్లోకి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ల విక్రయ సమయంలో ఆన్లైన్ లావాదేవీలకు టూ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను, ఆఫ్‌లైన్ లావాదేవీలకు సంతకం విధానాన్ని అనుసరిస్తున్నారు. ► ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విషయంలో నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు సంబంధించి కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం కనీసం 10 శాతం వాటా, కనిష్టంగా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్న పక్షంలోనే నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు ఓఎఫ్ఎస్లో పాల్గొనే వీలుంటోంది. ► పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల నిధులు, షేర్ల నిర్వహణకు సంబంధించి వివిధ టీమ్‌లు పోషించే పాత్రలు, బాధ్యతలు అలాగే రిస్కు నిర్వహణ విధానాలు మొదలైనవి రాతపూర్వకంగా ఉంచాలి. ► స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు, తొలగింపునకు కొత్త నిబంధనలను సెబీ ఆమోదించింది. వీటి ప్రకారం నియామకం లేదా తొలగింపునకు సాధారణ తీర్మానం, మైనారిటీ షేర్‌హోల్డర్ల మెజారిటీ తీర్మానం అంటూ రెండు పరామితులు ఉంటాయి. ► ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఓపెన్ ఆఫర్ ధర లెక్కింపు విధానంలో మార్పులు చేశారు. వీటి ప్రకారం రేటును లెక్కించేందుకు గత 60 ట్రేడింగ్ రోజుల వాల్యూమ్ వెయిటెడ్ సగటు మార్కెట్ రేటు (వీడబ్ల్యూఏఎంపీ)ను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిబంధనను తొలగించారు. ► క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. పరిశ్రమల వర్గీకరణ కోసం ప్రామాణిక విధానాన్ని పాటించాలన్న ఆదేశాల అమలుకు డెడ్‌లైన్‌ను సెబీ రెండు నెలల పాటు నవంబర్ 30 వరకూ వాయిదా వేసింది. -
‘బోట్’ కంపెనీ కీలక నిర్ణయం
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘బోట్’ కీలక నిర్ణయం తీసుకుంది. బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ ఐపీవోకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2 వేల కోట్ల రూపాయల ఐపీవో ప్రాథమిక ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ముందు ఉంచినట్లు సమాచారం. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్స్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఈక్విటీ షేర్లు, అగ్రిగేటింగ్ అప్ రూ.900 కోట్ల మేర, సేల్ అగ్రిగేటింగ్ 1,100 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ చెల్లింపు కోసం ఉపయోగించనుంది. రుణ చెల్లింపు సంస్థకు ఈక్విటీ నిష్పత్తికి అనుకూలమైన రుణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాదు వ్యాపార వృద్ధితో పాటు విస్తరణలో తదుపరి పెట్టుబడి కోసం దాని అంతర్గత సంచితాల(Internal cumulative)ను ఉపయోగించుకునేలా చేస్తుంది. 2013లో స్థాపించబడింది ఇమాజిన్ మార్కెటింగ్. 2014లో ఫ్లాగ్షిప్ బ్రాండ్ BoAt నేతృత్వంలో హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లాంటి ఉత్పత్తులతో సెప్టెంబరు 30, 2021 నాటికి బహుళ, అధిక-వృద్ధి వినియోగదారుల వర్గాలలో వాల్యూమ్ మరియు విలువ పరంగా భారతదేశంలో ప్రముఖ మార్కెట్ స్థానాలను ఏర్పాటు చేసింది. లాభదాయకతను కొనసాగిస్తూనే FY19 నుండి FY21 వరకు దాని నిర్వహణ ఆదాయాన్ని 141 శాతం CAGR వద్ద వృద్ధి చేయడం ద్వారా కంపెనీ వేగవంతమైన, స్థిరమైన వృద్ధి ట్రాక్ రికార్డ్‌ను ప్రదర్శించింది. యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్, క్రెడిట్ సుయిస్సె సెక్యూరిటీస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ICICI సెక్యూరిటీలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. -
ఐపీవో జోరు.. మరో నాలుగు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ప్రైమరీ మార్కెట్‌కు సైతం జోష్ నిస్తున్నాయి. దీంతో కొద్ది నెలలుగా పలు కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) వెళ్తున్నాయి. ప్రస్తుత కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటికే ఐపీవోల ద్వారా వివిధ సంస్థలు భారీ స్థాయిలో నిధులు సైతం సమీకరించాయి. ఈ బాటలో తాజా గా మరో 4 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తలుపు తట్టాయి. వివరాలు ఇలా.. గో ఫ్యాషన్ ఇండియా ఐపీవోకు అనుమతించమంటూ గో కలర్స్ బ్రాండుతో మహిళల దుస్తులను రూపొందిస్తున్న గో ఫ్యాషన్ ఇండియా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1,28,78,389 షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీలో ప్రస్తుతం పీకేఎస్, వీకేఎస్ కుటుంబ ట్రస్ట్‌లకు విడిగా 28.74 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. సమీకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా మహిళలు ధరించే చుడీదార్లు, లెగ్గింగ్స్, ధోతీలు, ట్రౌజర్లు తయారు చేస్తోంది. వీఎల్సీసీ హెల్త్‌కేర్ వెల్నెస్, బ్యూటీ ప్రొడక్టుల దేశీ కంపెనీ వీఎల్సీసీ హెల్త్‌కేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లతోపాటు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 89.22 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంతోపాటు దేశీయంగా మరిన్ని వెల్నెస్ క్లినిక్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. హాట్‌న్యూస్: మస్త్ ఫీచర్లతో మడత ఫోన్లు.. చూసేయండి పారదీప్ ఫాస్ఫేట్స్ ఐపీవోకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ ఫెర్టిలైజర్ కంపెనీ పారదీప్ ఫాస్ఫేట్స్ సెబీకి దరఖాస్తు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,255 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో జువారీ మారోక్ ఫాస్ఫేట్స్ 75,46,800 షేర్లు ఆఫర్ చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం 11.24 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో జువారీ మారోక్కు 80.45 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం 19.55 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను గోవాలోని ఎరువుల తయారీ యూనిట్ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ప్రకాష్ జైన్‌తోపాటు, మంజులా జైన్, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్‌లు విక్రయానికి ఉంచనున్నాయి. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వ్యక్తిగతంగా ప్రకాష్ జైన్ రూ. 131 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుండగా.. ట్రస్ట్ తరఫున రూ. 277 కోట్లు, మంజులా జైన్ ట్రస్ట్ రూ. 92 కోట్లు చొప్పున ఈక్విటీని విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను రుణ చెల్లింపులతోపాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
జొమాటో నిధుల సమీకరణ జోరు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టనుంది. ఈ ఏడాది జూన్‌కల్లా ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన పీఈ సంస్థలు మరోసారి వాటాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ జొమాటోలో వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఇటు పీఈ సంస్థల తాజా పెట్టుబడులు, అటు యాంట్ గ్రూప్ వాటా విక్రయం ద్వారా కంపెనీ 50 కోట్ల డాలర్ల(రూ. 3,650 కోట్లు) వరకూ సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. కాగా.. చెల్లించిన మూలధనాన్ని జొమాటో మూడు రెట్లు పెంచుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా 880 కోట్ల షేర్లను జారీ చేసినట్లు తెలుస్తోంది. వెరసి పెయిడప్ క్యాపిటల్ రూ. 535 కోట్ల నుంచి రూ. 1,448 కోట్లకు ఎగసినట్లు తెలియజేశాయి. తాజా పెట్టుబడుల నేపథ్యంలో జొమాటో విలువ 6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 44,000 కోట్లు) చేరినట్లు అంచనా వేశాయి. వాటా విక్రయం జొమాటోలో కొంత వాటా విక్రయం ద్వారా యాంట్ గ్రూప్ 25 కోట్లడాలర్లను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జొమాటోలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థలు ఐపీవోకు ముందే మరోసారి నిధులను అందించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జొమాటో 25 కోట్ల డాలర్లను(రూ. 1825 కోట్లు) సమకూర్చుకోనున్నట్లు చెబుతున్నాయి. ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీల జాబితాలో టైగర్ గ్లోబల్, కోరా ఇన్వెస్ట్మెంట్స్, ఫిడిలిటీ, స్టెడ్‌వ్యూ తదితరాలున్నాయి. దీంతో ఐపీవోకు ముందు కంపెనీ చేతిలో రూ. 7,300 కోట్ల నగదు చేరనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. జొమాటోలో దేశీ కంపెనీ ఇన్ఫోఎడ్జ్, యాంట్ గ్రూప్ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కలిగి ఉన్నాయి. ఐపీవో ద్వారా యాంట్ గ్రూప్ వాటాను విక్రయిస్తే.. కంపెనీలో ఇన్ఫోఎడ్జ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచే వీలున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఐపీవోలు కళకళ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు జూలై–సెప్టెంబర్ కాలంలో ర్యాలీ చేయడం ప్రైమరీ మార్కెట్‌కు కలిసొచ్చింది. సుమారు ఎనిమిది కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 850 మిలియన్ డాలర్ల (రూ.6,290 కోట్ల) నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది రెండో అర్ధభాగం (జూలై–డిసెంబర్)లో ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ మెరుగ్గా ఉండొచ్చని ఈవై నివేదిక తెలియజేసింది. ఈ సంస్థ 2020 సంవత్సరం మూడో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) ఐపీవో ధోరణులపై సోమవారం నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్, ఆతిథ్యం, నిర్మాణం, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు నిధుల సమీకరణలో చురుగ్గా ఉన్నాయి. 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 12 ఐపీవోలు రాగా, ప్రస్తుత ఏడాది ఇదే కాలంలో ఇవి ఎనిమిదికి పరిమితం కావడం గమనార్హం. అయితే, ఐపీవోలు సంఖ్యాపరంగా తక్కువగానే కనిపించినా సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 12 ఐపీవోలు కలసి సమీకరించిన మొత్తం 652 మిలియన్ డాలర్లు (రూ.4,824 కోట్లు)గానే ఉంది. బడా ఐపీవో ఒక్కటే... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్ ఆర్ఈఐటీ ఐపీవో అతిపెద్దదిగా ఉంది. ఈ సంస్థ 602 మిలియన్ డాలర్లను (రూ.4,320 కోట్లు) సమీకరించింది. ‘‘ప్రధాన మార్కెట్లలో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) 2020 క్యూ3లో నాలుగు ఐపీవోలు వచ్చాయి. కానీ 2019 క్యూలో 3 ఐపీవోలే వచ్చాయి. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో ఒక్క ఐపీవో లేదు. దీంతో 2020 సెప్టెంబర్ క్వార్టర్లో 33 శాతం వృద్ధి కనిపిస్తోంది’’ అని ఈవై ఇండియా తెలిపింది. ఇక ఎస్ఎంఈ మార్కెట్లలో నాలుగు ఐపీవోలు నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నాయి. 2020లో ఇప్పటి వరకు ఐపీవోల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా తొమ్మిదో స్థానంలో ఉన్నట్టు ఈవై ఇండియా తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవో కార్యకలాపాలు 14 శాతం పెరిగాయని.. 872 ఐపీవోలు 43 శాతం అధికంగా 165.3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయని ఈ నివేదిక వివరించింది. కల్యాణ్ జువెల్లర్స్ ఐపీవోకి గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదముద్ర లభించింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. కల్యాణ్ జువెల్లర్స్ ప్రమోటర్ టీఎస్ కల్యాణరామన్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను, హైడెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సుమారు రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కల్యాణ్ జువెల్లర్స్ నిర్వహణ మూలధన అవసరాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి కంపెనీకి దేశవ్యాప్తంగా 107, మధ్యప్రాచ్య దేశాల్లో 30 షోరూమ్‌లు ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ ఆఫర్ ప్రారంభం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంగళవారం(అక్టోబర్ 20న) ఐపీఓ ప్రారంభం కానుం ది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఇష్యూ గురువారం(అక్టోబర్ 22న)ముగిస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.517.6 కోట్లు సమీకరించనుంది. ఈ ఏడాదిలో 12వదైన ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.32–33 మధ్య ఉంది. -
సౌదీ ఆరామ్‘కింగ్’!
దుబాయ్: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో స్టాక్ మార్కెట్ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్ ధరను (9.39 డాలర్లు –రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్ మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, షెవ్రాన్, బీపీ) మొత్తం మార్కెట్ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఐపీఓ, మార్కెట్ విలువలోనూ అగ్రస్థానం.... ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్కో బ్రేక్ చేసింది. ఇక బంపర్ లిస్టింగ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా ప్రపంచ నెంబర్–1 కంపెనీగా సౌదీ ఆరామ్కో అవతరించింది. అంతే కాకుండా లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్ 10 స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్ ఎక్సే్ఛంజ్ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్ (92,600 కోట్ల డాలర్లు), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ (86,200 కోట్ల డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► 1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్కో ప్రస్థానం మొదలైంది. ► ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లాభదాయక, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది. ► ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముడి చమురు సరఫరాల్లో 10% ఈ సంస్థేదే. ► 2018లో కంపెనీ నికర లాభం 46% ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 13 రిలయన్స్‌లకు మించి... ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో(14,050 కోట్ల డాలర్లు) రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్కో కన్నా తక్కువే!! -
లిస్టింగ్‌కు ఎన్ఎస్ఈ రెడీ...
♦ వచ్చే జనవరి కల్లా ఐపీఓ పత్రాల దాఖలు ♦ విదేశీ ఎక్స్ఛేంజీల్లోనూ లిస్టింగ్‌కు అవకాశం... ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. భారత్‌తో పాటు విదేశాల్లోని స్టాక్ మార్కెట్లలో కూడా లిస్టింగ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దేశీయ లిస్టింగ్ కోసం ఐపీఓ ముసాయిదా పత్రాలను వచ్చే ఏడాది జనవరి కల్లా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పిస్తామని తెలియజేసింది. విదేశాల్లో లిస్టింగ్ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా సంబంధిత పత్రాలను సమర్పిస్తామని, లిస్టింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ప్రస్తుతమున్న లిస్టింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించామని, ఈ కమిటీ నిర్దేశిత గడువులో నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది. అయితే సెల్ఫ్ లిస్టింగ్ ఆప్షన్, క్రాస్-లిస్టింగ్ ఆప్షన్లకు సంబంధించిన స్పష్టతను ఎన్ఎస్ఈ ఇవ్వలేదు. ఈ విషయాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఎన్ఎస్ఈ బోర్డ్ కమిటీ మదింపు చేస్తుందని పేర్కొంది. మరోవైపు ఎన్ఎస్ఈ వ్యాపార పునర్వ్యస్థీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. నియంత్రణలో లేని పోర్ట్‌ఫోలియో వ్యాపారం కోసం ఒక ప్రత్యేకమైన కంపెనీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడం వల్ల ఎక్స్ఛేంజ్ విలువలో పారదర్శకత చోటుచేసుకుంటుందని అంచనా. మరో స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ ఇప్పటికే ఐపీఓ ప్రక్రియ మొదలు పెట్టింది. త్వరలో ఐపీఓ ముసాయిదా పత్రాల(డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్)ను సెబీకి సమర్పించనుంది. -
ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్... ఐపీవో.. ఈ పదాన్ని మనం తరుచుగా వింటూనే ఉంటాం. పలు కంపెనీలు ఐపీవోకు వస్తున్నట్లు ప్రకటిస్తూనే ఉంటాయి. ఒక కంపెనీ తొలిసారి తన షేర్లను ప్రజలకు విక్రయించడాన్ని ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐపీవో)గా చెప్పుకుంటాం. నిధుల సమీకరణ కోసం ఒక కంపెనీ ఐపీవోకు వస్తుంది. ఇక్కడ ఏ సంస్థ/కంపెనీ అయినా ఐపీవోకు రావాలంటే.. తప్పనిసరిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల మాదిరిగానే ఐపీవో ఇన్వెస్ట్మెంట్లలో కూడా రిస్క్ ఉంటుంది. అందుకే ఐపీవో మార్గంలో షేర్లను కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి. ఇదివరకే ఐపీవోకు వ చ్చిన/ తెలిసిన కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం సులభమే. ఎందుకంటే ఆయా కంపెనీల చరిత్ర, పనితీరు వంటి తదితర అంశాలు మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని విశ్లేషించుకొని పలు అంశాలను బేరీజు వేసుకొని ఆయా కంపెనీల స్టాక్స్ కొనాలా? వద్దా? అని ఒక నిర్ణయానికి రావొచ్చు. కానీ ఇక్కడ తొలిసారి ఐపీవోకు వచ్చే కంపెనీ గురించి మనకు అంతగా ఏమీ తెలియదు. అప్పుడు మనం ఆ కంపెనీ మేనేజ్మెంట్, ఐపీవో పత్రాలు వంటి తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కంపెనీ ఐపీవో మార్గంలో సమీకరించే నిధులను దేని కోసం వెచ్చిస్తుందనే విషయాలపై దృష్టిలో ఉంచుకోవాలి. -
త్వరలో రూ. 2,500 కోట్ల ఇండిగో ఐపీఓ !
ముంబై: విమానయాన రంగంలో అత్యధిక మార్కెట్ వాటా ఉన్న ఇండిగో త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఇండిగో సంస్థ మేలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో సంస్థ రూ.2,500 కోట్లు సమీకరిం చాలని యోచిస్తున్నదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. 37.1 శాతం మార్కెట్ వాటా ఉన్న ఈ కంపెనీ 91 విమానాలతో రోజుకు 600 విమాన సర్వీసులను నడుపుతోంది. విమానయాన రంగంలో లాభాల్లో ఉన్న రెండు దేశీయ కంపెనీల్లో ఇండిగో ఒకటి. రెండోది గో ఎయిర్ సంస్థ. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఇండిగో రూ.317 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
సుజ్లాన్ జోరు
నెల రోజుల్లో 55 శాతం వృద్ధి ముంబై: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్ బుధ వారం 11 శాతం పెరిగింది. ఇదే రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐనాక్స్విండ్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రారంభమైన నేపథ్యంలో సుజ్లాన్ షేర్‌కు డిమాండ్ పెరిగింది. గత నెల 16న సన్ ఫార్మా దిలిప్ సంఘ్వి రూ.1,800 కోట్లతో ఈ కంపెనీలో 23 శాతం వాటాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈషేర్ జోరుగా పెరుగుతోంది. గత నెల 16ను రూ.19.14గా ఉన్న ఈ షేర్ ధర బుధవారం నాటికి 55 శాతం వృద్ధితో రూ.29.65 వద్ద ముగిసింది. గత ఏడాది జూన్ నుంచి చూస్తే ఇది గరిష్ట స్థాయి. బుధవారం నాడు ఎన్ఎస్ఈలో 15.3 కోట్లు, బీఎస్ఈలో 3.4 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఐనాక్స్ ఐపీఓ ప్రారంభమైన నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీని రూ.30 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. పవన విద్యుత్తుకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తోన ఐనాక్స్ విండ్ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.315-325 రేంజ్లో ఉంది, దీంతో చూస్తే సుజ్లాన్ ఎనర్జీ షేర్ చౌకగా లభ్యమవుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది.