కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్‌పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.
ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..
ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్‌హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్‌ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment