NSE
-
11 కోట్లకు ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మార్క్‌ను (2024 ఆగస్ట్ నాటికి) అధిగమించింది. చివరి కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం ఐదు నెలల్లోనే చేరినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎన్ఎస్ఈ వద్ద ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు వేగాన్ని అందుకున్నాయని, గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగినట్టు తెలిపింది. ఎన్ఎస్ఈ 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మొదటి కోటి ఇన్వెస్టర్ల చేరికకు 14 ఏళ్లు పట్టగా, తదుపరి కోటి మందికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం 3.5 ఏళ్లలోనే చేరారు. ఆ తర్వాత కోటి మంది చేరికకు కేవలం ఏడాది సమయం తీసుకుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ పేర్కొంది. ‘‘గత ఐదు నెలల నుంచి రోజువారీ యూనిక్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు 47,000 నుంచి 73,000 మధ్య ఉంటున్నాయి. డిజిటైజేషన్ వేగాన్ని పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో అవగాహన, అందరికీ ఆర్థిక సేవల చేరువ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మార్కెట్ పనితీరు బలంగా ఉండడం వంటివి దోహదం చేశాయి’’అని ఎన్ఎస్ఈ వివరించింది. -
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్‌పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్‌ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్‌సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మొత్తం క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్ల మార్కును దాటింది. డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్ల స్థాయిలో ఉండగా స్వల్ప వ్యవధిలోనే ఈ మైలురాయిని దాటినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్భారత వృద్ధి గాథపై ఇన్వెస్టర్లకున్న పటిష్టమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ (2.2 కోట్లు), గుజరాత్ (1.8 కోట్లు), చెరి 1.2 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్
ముంబై: ఇన్వెస్టర్ల విస్తృత ప్రయోజనాల దృష్టా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈ) కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. అలాగే, తన ఎన్ఎస్ఈ వెబ్సైట్ సేవలు మరింత మెరుగుపరిచింది. తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లోని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయికాగా, ఎన్ఎస్ఈ మొబైల్ యాప్ యాపిల్ స్టోర్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. మార్కెట్‌కు సంబంధించిన ఇండికేషన్లు, అప్డేట్లు, ట్రెండింగ్, ఆప్షన్ డేటా ట్రేడింగ్ సంబంధిత కాల్స్, పుట్స్ తదితర సమగ్ర సమాచారం ఇందులో ఉంది. పెట్టుబడి దారులు సురక్షితమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
భారత ఈక్విటీల్లో యూబీఎస్ ఏజీ వరుస అమ్మకాలు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ యూబీఎస్ గ్రూప్ ఏజీ.. శుక్రవారం ఒక్క రో జే (30వ తేదీన) ఏకంగా భారత ఈక్విటీల్లో భారీ అమ్మ కాలకు దిగింది. ఏడు కంపెనీల్లో రూ.4,961 కోట్ల విలువ చేసే షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూ పంలో విక్రయించింది. యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏషియా రూపంలో బల్‌్కడీల్స్ ద్వారా అమ్మకాలు చేసినట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయిల్ ఇండియాలో రూ.972 కోట్లు, డిక్సన్ టెక్నాలజీస్‌లో రూ.904 కోట్లు, ఆర్‌వీఎన్‌ఎల్‌లో రూ.797 కోట్లు, జైడస్ లైఫ్సైన్సెస్లో రూ.756 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేసింది. అలాగే, వొడాఫోన్ ఐడియా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌లోనూ రూ.1,531 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. మరోవైపు బంధన్ బ్యాంక్‌లో రూ.384 కోట్ల విలువ చేసే 1.92 కోట్ల షేర్లను యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ కొనుగోలు చేసింది. -
నిఫ్టీ.. సిల్వర్ జూబ్లీ!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఓ మరపురాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ ఎన్ఎస్ఈ తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెపె్టంబర్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలతో ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 81,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 25 వేల స్థాయిపైన 25,011 వద్ద నిలిచింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు బలపడి 82,129 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 25,078 వద్ద జీవితకాల గరిష్టాలు అందుకున్నాయి. పశి్చ మాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో మిడ్‌సెషన్ నుంచి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, ఐటీ, యుటిలిటీ, టెక్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో ముగిశాయి. కాగా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.25,000 ప్రయాణం ఇలా.. → 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.→ సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.→ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కోవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది. → కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెపె్టంబర్ 11న 20,000 స్థాయికి చేరింది. → ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం. -
ఎల్ఐసీ పెట్టుబడులపై లాభాల పంట
కొంతమేర పెట్టుబడుల విక్రయం ∙అయినప్పటికీ పెరిగిన విలువ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పలు దిగ్గజ కంపెనీలలో గల వాటాలను కొంతమేర విక్రయించింది. ఇందుకు స్టాక్ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరుగు తీస్తుండటం ప్రభావం చూపింది. అయినప్పటికీ గతేడాది ఎల్ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా 37 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! వివరాలు చూద్దాంస్టాక్ ఎక్సే్ఛంజీలకు దాఖలైన సమాచారం ప్రకారం ఎల్ఐసీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలలో అత్యధిక పెట్టుబడులను కలిగి ఉంది. ఈ బాటలో టాటా, అదానీ గ్రూప్‌లలోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. గత వారాంతానికల్లా దిగ్గజ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.39 లక్షల కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన విలువతో పోలిస్తే ఇది 37.5 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో పెట్టుబడులు 34 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో పెట్టుబడులను గతేడాది 6.37 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గించుకుంది. ఇదేకాలంలో టాటా గ్రూప్ కంపెనీలలో వాటా 4.22 శాతం నుంచి 4.05 శాతానికి నీరసించింది. వీటి విలువ రూ. 1.29 లక్షల కోట్లు. ఇక అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ వాటా 4.27 శాతం నుంచి 3.76 శాతానికి దిగివచి్చంది. వీటి విలువ 49 శాతం దూసుకెళ్లి రూ. 64,414 కోట్లను తాకింది. ఎన్ఎస్ఈలో బుధవారం ఎల్ఐసీ షేరు 1.5% బలపడి రూ. 1,048 వద్ద ముగిసింది. ఈ ధరలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 6.62 లక్షల కోట్లను అధిగమించింది.ప్రభుత్వం సైతం నిజానికి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. రూ. 1,050 సమీపంలో కదులుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. దీంతో ఎల్ఐసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంది. వీటిని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో సరికొత్త గరిష్టాన్ని అందుకుంటూ జోరు చూపుతున్నాయి. దీనికితోడు ఏడాది కాలంలో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు వేలంవెర్రిగా లాభాల పరుగు తీస్తున్నాయి. వెరసి ప్రభుత్వం వీటిలో కొంతమేర వాటాల విక్రయాన్ని చేపడితే.. సులభంగా బడ్జెట్ ప్రతిపాదిత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ వద్దు
న్యూఢిల్లీ: డెరివేటివ్స్(ఎఫ్‌అండ్‌వో)లో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చీఫ్ ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. తగినంత సమాచారంతోపాటు రిసు్కలను అర్ధం చేసుకోగల, మేనేజ్‌చేయగల ఇన్వెస్టర్లకు మాత్రమే ఎఫ్‌అండ్‌వో విభాగం పరిమితమని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేయడానికి బదులుగా మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో ఈక్విటీలలో పెట్టుబడులు చేపట్టడం ఉత్తమమని సూచించారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రదాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ సైతం డెరివేటివ్స్ విభాగంలో పెరుగుతున్న రిసు్కలపై రిటైలర్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతేడాది(2023) నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కూడా ఎఫ్‌అండ్‌వోపై అధికంగా దృష్టిపెట్టవద్దంటూ రిటైల్ ఇన్వెస్టర్లు హెచ్చరించడం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌లో పాల్గొనవద్దంటూ రిటైల్ ఇన్వెస్టర్లను ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ తాజాగా హెచ్చరించారు. ఎంఎఫ్ మార్గంలో ఈక్విటీలలో పెట్టుబడులు చేపట్టమంటూ సలహా ఇచ్చారు. డెరివేటివ్స్ విభాగమే ప్రయోజనమనుకునే ఇన్వెస్టర్లు పూర్తిస్థాయిలో రిసు్కలను అర్ధం చేసుకున్నాకే ట్రేడింగ్‌ను చేపట్టమని చౌహాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రిసు్కలను మేనేజ్‌చేయగల సామర్థ్యం సైతం కీలకమని పేర్కొన్నారు. ఇలాకాని పక్షంలో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను చేపట్టవద్దని స్పష్టం చేశారు. -
ఎన్ఎస్ఈ నిఫ్టీ.. భళా
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది. ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్ఎస్ఈలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు జూమ్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఫెడ్‌పై దృష్టి దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది. ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.డీ డెవలప్మెంట్ @ రూ. 193–203పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’
డీప్‌ఫేక్.. ఇటీవల చాలామంది నుంచి వినిపిస్తున్న పదం. ఈ టెక్నాలజీ వాస్తవానికి, కల్పనకు మధ్య తేడాను చెరిపేస్తోంది. క్రియేటివిటీ పేరుతో బోగస్ అంశాలను, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి దీన్ని వాడుతున్నారు. సినీ స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులతోపాటు స్టాక్‌మార్కెట్ ప్రముఖులు సైతం ఈ టెక్నాలజీ అరాచకానికి బలవుతున్నారు. ప్రముఖుల ఫేస్, వాయిస్‌తో ‘ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభాలు సొంతం చేసుకోండి’ అంటూ డీప్‌ఫేక్ వీడియోలు వెలుస్తున్నాయి. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ సైతం దీని బారినపడ్డారు. చౌహాన్ స్టాక్స్ సిఫార్సు చేస్తున్నట్లు, ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ‘కొన్ని మీడియాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఆడియోల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రతి సమాచారాన్ని, అప్డేట్లను సంబంధిత వెబ్సైట్లో తెలియజేస్తాం. స్టాక్‌లకు సంబంధించి ఎలాంటి సిఫార్సులు సంస్థ చేయదు. ఈమేరకు ఇన్వెస్టర్లు, రిటైలర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. నకిలీ వీడియోలు, ఇతర మాధ్యమాల నుంచి వచ్చే పెట్టుబడి సలహాలు అనుసరించొద్దు’ అని ఎన్ఎస్ఈ వివరించింది. ఇదీ చదవండి: మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల స్వరాన్ని, ముఖాన్ని అనుకరించి డీప్‌ఫేక్స్‌ను వ్యాప్తిచేసే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు పలుమార్లు హెచ్చిరించిన విషయం తెలిసిందే. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మాటలను వక్రీకరించి ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందన్నారు. డీప్‌ఫేక్‌కు సంబంధించిన ప్రమాదాలను నివారించేలా నిబంధనలు రూపొందించాలని నిపుణులు కోరుతున్నారు. -
25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్మెంట్.. టీప్లస్‌జీరో
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్1 సెటిల్మెంట్కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితరాలున్నాయి. తాజా సెటిల్మెంట్తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు. -
ఐదు నెలల్లో కోటి మంది కొత్త మదుపర్లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ప్లాట్‌ఫామ్‌పై నమోదైన మదుపర్ల సంఖ్య 9 కోట్లను అధిగమించిందని సంస్థ ప్రకటించింది. గత 5 నెలల్లోనే కోటి మంది కొత్త మదుపర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపింది. గత అయిదేళ్లలో ఎక్స్ఛేంజీ మదుపర్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. డిజిటలీకరణ, మదుపర్లలో అవగాహన పెరగడం, స్టాక్‌మార్కెట్లు బలంగా రాణించడం వంటివి ఇందుకు కలిసొచ్చాయని తెలిసింది. ఎక్స్ఛేంజీలో నమోదైన ఖాతాదారు కోడ్ల సంఖ్య 16.9 కోట్లకు చేరింది. 2023 డిసెంబరు చివరికి ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.50,77,900.36 కోట్లకు చేరింది. నవంబరులో ఈ విలువ రూ.49,04,992.39 కోట్లుగా ఉంది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియెంటెడ్ పథకాల్లోని రిటైల్ పెట్టుబడుల విలువ రూ.28,87,504 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ పథకాలు కలిసి రూ.9,872 కోట్లను సమీకరించాయని తెలిసింది. గతేడాది డిసెంబర్ నాటికి క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా ఫండ్లలోకి రూ.17,610.16 కోట్లు వచ్చాయి. -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్‌మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
సాక్షి మనీ మంత్ర : లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
ఒడిదుడుకుల మధ్య సూచీలు జనవరి 9న వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 30.99 పాయింట్ల లాభంతో 71,386 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు లాభంతో 21,544.80 వద్ద మార్కెట్లు ముగిశాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ మరియు అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ ,ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలలో ఆటో, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్ రియల్టీ ఒక్కొక్కటి 0.5-2.5 శాతం వృద్ధిని సాధించాయి. లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. -
హైరిస్క్ డెరివేటివ్స్తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అత్యధిక రిస్క్లతోకూడిన డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేటపుడు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా సూచించారు. స్టాక్ మార్కెట్లో తరచూ లావాదేవీలు నిర్వహించడం రిస్క్‌లతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. వీటికి చెక్ పెట్టడం ద్వారా నష్టాలను తప్పించుకోమంటూ సలహా ఇచ్చారు. దేశ వృద్ధి పథంలో భాగస్వామిగా కట్టుబాటును ప్రదర్శిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవలసిందిగా సూచించారు. స్టాక్ మార్కెట్లో సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను అందిస్తుంటాయన్న విషయాన్ని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలియజేశారు. రిజిస్టరైన ఇంటర్మీడియరీలతోనే లావాదేవీలు చేపట్టమంటూ పేర్కొన్నారు. నియంత్రణ పరిధిలోలేని ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయవద్దంటూ హెచ్చరించారు. దీర్ఘకాలిక దృష్టి.. దీర్ఘకాలంలో సంపద సృష్టి యోచనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేపట్టవలసిందిగా ఇన్వెస్టర్లకు ఆశి‹Ùకుమార్ సలహా ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు నిలకడైన ఇన్వెస్టర్లను సైతం నిస్పృహకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కొత్త ఇన్వెస్టర్లు లేదా అంతగా అవగాహనలేనివారు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకమని వివరించారు. కాగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) పట్ల ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి ఆశ్చర్యంతోపాటు కలవరపాటుకు గురిచేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ గత నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌అండ్‌వో విభాగంలో 90 శాతంమంది ఇన్వెస్టర్లు సొమ్ము నష్టపోతున్నట్లు వెల్లడించారు. -
గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం..
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన స్థానంలో ఉంది. దేశ ఆర్థికాభివృద్ధి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇండియా ఎకానమి గ్రోత్‌కు సంబంధించి పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. అందుకు అనువుగా స్టాక్‌మార్కెట్లు మరింత పుంజుకుంటున్నాయి. కరోనా సమయంలో నిఫ్టీ సూచీ 8000 మార్కు వద్ద ఉండేది. ప్రస్తుతం 21,700 పాయింట్లతో జీవితకాల గరిష్ఠాన్ని చేరుతుంది. భారత్ వృద్ధిపై ఎలాంటి అనుమానం లేకుండా సమీప భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందనే భావన బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా చాలా మంది స్టాక్మార్కెట్లో మదుపు చేస్తున్నారు. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మదుపరుల డేటా విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 2023లో భారీగా పెరిగింది. ఈ ఏడాదితో మదుపుదారుల సంఖ్య తొలిసారి 8 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్ 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్ మార్కెట్ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ గుజరాత్‌ను అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో యూపీ రెండో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది. -
2023లో క్విప్ నిధుల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్‌ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం! ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే. కారణాలివీ క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్‌నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు. దిగ్గజాలు సై ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్‌పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభం నుంచి మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి 19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34.55 పాయింట్లు నష్టపోయాయి. హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్ట్రా టెక్ సిమెంట్ 2.8శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.9శాతం, ఎల్ అండ్ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్‌ఫార్మా 1.5శాతం, టెక్ మహీంద్రా 1.4శాతం, ఎన్టీపీసీ 1.3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.1శాతం, భారతీఎయిర్‌టెల్ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఒకేసారి 13 కొత్త కాంట్రాక్టులు.. ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌లో మరింత విస్తరించే దిశగా ఎన్ఎస్ఈ కొత్త కాంట్రాక్టులను జోడిస్తోంది. సోమవారం ఒకేసారి 13 నూతన కాంట్రాక్టులను ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. కమోడిటీ డెరివేటివ్స్‌లో ఎన్ఎస్ఈ ఆఫర్ చేస్తున్న ఉత్పత్తుల సంఖ్య 28కి చేరింది. గోల్డ్ 1కేజీ ఫ్యూచర్స్, గోల్డ్ మినీ ఫ్యూచర్స్, సిల్వర్ మినీ ఫ్యూచర్స్, కాపర్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, గోల్డ్ గినియా (8గ్రాములు) ఫ్యూచర్స్, అల్యూమినియం ఫ్యూచర్స్, అల్యూమినియం మినీ ఫ్యూచర్స్, లెడ్ ఫ్యచర్స్, లెడ్ మినీ ఫ్యూచర్స్, నికెల్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, జింక్ మినీ ఫ్యూచర్స్‌లో ‘ఆప్షన్ ఆన్ ఫ్యూచర్స్’ను ఎన్ఎస్ఈ తాజాగా ప్రారంభించింది. ఇంధనం, బులియన్, బేస్ మెటల్స్‌లో అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందిస్తున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లో రిస్క్‌ను సమర్థవంతంగా హెడ్జ్ చేసుకోవచ్చని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. గత కొన్ని రోజుల్లో ఎన్ఎన్ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిల్వర్‌కు సంబంధించి ఆరు నూతన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించడం గమనార్హం. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. -
మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్‌లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్‌కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది. ఇండెక్సులలో.. ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్‌ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్‌లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎల్ఐసీకి షేర్లు ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్‌ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్‌లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది. ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి. పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్ ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్‌్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్‌తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది. రూపాయి రికవరీ 14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం. -
ఎన్ఎస్ఈతో కలసి ఓఎన్డీసీ అకాడమీ
న్యూఢిల్లీ: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఎన్ఎస్ఈ సబ్సిడరీ అయిన ఎన్ఎస్ఈ అకాడమీ భాగస్వామ్యంతో ఓ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ వ్యాపారాన్ని సులభంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఓపెన్ నెట్వర్క్ భాగస్వామ్యులు, విక్రేతలకు శిక్షణ ఇవ్వనుంది. టెక్స్ట్, వీడియో ఫార్మాట్ రూపంలో విక్రేతలకు కావాల్సిన సమాచారాన్ని ఓఎన్డీసీ అకాడమీ అందించనుంది. ఈ విషయాన్ని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ వెల్లడించారు. ఓ గ్రామస్థుడు ఈకామర్స్ పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా, సెల్లర్ యాప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చని వివరించారు. టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం లేకుండానే సొంత యాప్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ ప్రయాణాన్ని విజయవంతంగా ఎలా కొనసాగించాలనే సమాచారాన్ని సైతం ఈ అకాడమీ నుంచి పొందొచ్చు. ఓఎన్డీసీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఈకామర్స్ నెట్వర్క్ కావడం గమనార్హం. -
ఆర్ఐఎల్ కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ.. ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీస్తోంది. ఫైనాన్షియల్ సర్వి సెస్ బిజినెస్‌ను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఆర్ఐఎల్ విడదీయనుంది. తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌గా మార్పు చేయనుంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకూ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరును కేటాయించనుంది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 20కాగా.. అదే రోజు కొత్తవిధానంలో ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను ఎన్ఎస్ఈ నిర్వహించనుంది. దీని ప్రకారం నిఫ్టీ ఇండెక్స్‌లో ఆర్ఐఎల్ కొనసాగనుంది. 19 ఇండెక్సులలో..: జియో ఫైనాన్షియల్‌ను తాత్కాలికంగా నిఫ్టీ–50లో కొనసాగించడంతోపాటు.. 19 ఇండెక్సులలో చోటు కల్పించనుంది. దీంతో జూలై 20 నుంచి కనీసం మూడు రోజులపాటు నిఫ్టీకి తాత్కాలికంగా 51 షేర్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. జియో ఫైనాన్షియల్ లిస్టయిన రోజు నుంచి మూడు రోజులు( ఖీ+3) పూర్తయ్యాక ఇండెక్సుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నిఫ్టీ ఇండెక్సుల కొత్త విధానం ప్రకారం ఎన్ఎస్ఈ చేపట్టనుంది. ఏప్రిల్‌లో ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ కొన్ని సవరణల ద్వారా కొత్త విధానానికి తెరతీసింది. కంపెనీల విడదీతసహా కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా తాజా విధానానికి రూపకల్పన చేసినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తే నిఫ్టీలో విడదీత కంపెనీకి చోటు కల్పించవచ్చు. రికార్డ్ డేట్ ఎఫెక్ట్.. అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వి సెస్ విడదీతకు రికార్డ్ డేట్ జూలై 20 కాగా.. 19 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకు జియో ఫైనాన్షియల్ షేర్లు పొందేందుకు వీలుంటుంది. ఇక గురువారం (20న) ఎన్ఎస్ఈ రెగ్యులర్ ట్రేడింగ్ కంటే ముందుగా ప్రత్యేక ప్రీ–ఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తోంది. ఉదయం 9–10 మధ్య జియో ఫైనాన్షియల్ షేరు ధర నిర్ణయానికి ఇది సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన ఉదాహరణను చూద్దాం.. 19న (టీ–1) ఆర్ఐఎల్ ముగింపు ధర రూ. 2,800 అనుకుంటే.. 20న రూ. 2,600 ధర పలికిందనుకుందాం.. వెరసి జియో ఫైనాన్షియల్ షేరు ధరను రూ. 200గా పేర్కొనవచ్చు. -
నాన్స్టాప‘బుల్స్’ : ఒక్కరోజే రూ.44,898 కోట్లు సంపాదించారు!
ముంబై: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం ర్యాలీకి తోడ్పడ్డాయి. సూచీలు నాలుగోరోజూ ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 299 పాయింట్ల లాభంతో 65,504 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,407 వద్ద మొదలయ్యాయి. తొలి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో సూచీలు కొంతమేర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల్లో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా నాలుగోరోజూ సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 65,673 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు బలపడి 19,434 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ మార్కెట్ ముగిసేసరికి 66 పాయింట్లు బలపడి 19,389 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.22%, 0.05 % చొప్పున లాభపడ్డాయి. ఇంధన, ఆటో, కన్జూమర్, కమోడిటీ, టెలికం షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,134 కోట్లు ఈక్విటీ షేర్లు కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.785 షేర్లు అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి 11 పైసలు బలపడి 82.02 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయిదురోజుల్లో రూ.7.90 లక్షల కోట్లు సెన్సెక్స్ వరుస రికార్డుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గడిచిన అయిదు రోజుల్లో ఈ సూచీ 2,500 పాయింట్లకు పైగా బలపడటంతో బీఎస్ఈ ఎక్సే్చంజీలో రూ.7.90 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.44,898 కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.2,98.57 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.585)తో పోలిస్తే బీఎస్ఈలో 5% ప్రీమియంతో రూ.615 వద్ద లిస్టయ్యింది. తొలి సెషన్లో 15% ర్యాలీ రూ.670 స్థాయికి చేరింది. ఆఖరికి 0.04% స్వల్ప నష్టంతో రూ.584.75 వద్ద ఫ్లాటుగా ముగిసింది. ♦ ఐడీఎఫ్సీ విలీనానికి బోర్డు ఆమోదం తెలపడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 4% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. అయితే ఐడీఎఫ్సీ షేరు మాత్రం 6 శాతం పెరిగి రూ.116 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 2% పెరిగి రూ.111 వద్ద స్థిరపడింది. -
స్కాక్ మార్కెట్లో నయా రికార్డ్.. తొలిసారి 65,000 మార్క్ తాకిన సెన్సెక్స్
ముంబై: సానుకూల జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ సోమవారమూ కొనసాగింది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్ ద్వయం షేర్లు రాణించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. సెన్సెక్స్ ఉదయం 117 పాయింట్ల లాభంతో 64,836 వద్ద మొదలైంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 19,247 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తొలి గంట తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఇంధన, ఆర్థిక, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా మూడోరోజూ సెన్సెక్స్ 581 పాయింట్లు పెరిగి 65,300 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు బలపడి 19,345 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. చివరికి సెన్సెక్స్ 486 పాయింట్ల లాభంతో 65,205 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ ముగిసేసరికి 134 పాయింట్లు బలపడి 19,323 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.56%, 0.30% చొప్పున లాభపడ్డాయి. జూన్ వాహన విక్రయాలు అంతంత మాత్రంగా ఉండటంతో ఆటో షేర్లు నష్టపోయాయి. ఐటీ, టెక్, విద్యుత్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 81.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.1.73 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.2.98 లక్షల కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల సైకిల్‌ను ఆపేయ్యొచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఆసియాలో జపాన్ ఇండెక్స్ నికాయ్ 33 ఏళ్ల గరిష్టం(33,753) ముగిసింది. ‘‘మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీతో పలు షేర్ల వాల్యూయేషన్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ ఎఫ్వై 24 ఆదాయ అంచనాకు 20 రెట్ల అధిక ప్రీమియంతో ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే వీలుంది. ఏదైన చిన్న ప్రతికూలాంశం అనూహ్య దిద్దుబాటుకు దారి తీయవచ్చు. కావున పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ కుమార్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦విలీనం తర్వాత తొలి ట్రేడింగ్ సెషన్లో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఇంట్రాడేలో హెచ్డీఎఫ్సీ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు వరుసగా 4%, 3% చొప్పున ర్యాలీ చేసి రూ.2,926 వద్ద, రూ.1,758 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకాయి. చివరికి హెచ్డీఎఫ్సీ షేరు 2% లాభంతో రూ.2,871 వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు ఒక శాతం పెరిగి రూ.1,719 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువ రూ.14.93 లక్షల కోటక్లు పెరిగింది. ♦ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏడాది గరిష్టం (45,353) తాకింది. చివరికి ఒకశాతం లాభంతో 45,158 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ సైతం 52 వారాల గరిష్టం(20,398) అందుకొని ఆఖరికి 1% లాభంతో 20,253 వద్ద నిలిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. -
సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్ఎస్ఈ..
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్ఎస్ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి. 2021 ఫిబ్రవరి 24న ఎన్ఎస్ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్లైన్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎన్ఎస్ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్తోపాటు సెటిల్మెంట్ బాధ్యతలను ఎన్సీఎల్ నిర్వహిస్తుంది. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
ఈ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త: ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ: కచ్చితమైన రాబడులు ఇస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేస్తున్న పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయ వద్దంటూ పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. వీణ, అంకితా మిశ్రా, విషాల్ అనే వ్యక్తులు ఈ తరహా పెట్టుబడి పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ((2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా) (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) వీరు ఎన్ఎస్ఈ వద్ద సభ్యులుగా లేదా అధికారిక వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఖాతా వివరాలు (యూజర్ ఐడీ, పాస్వర్డ్) వీరితో పంచుకోవద్దని కోరింది. స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు అంటూ వీరు ఆఫర్ చేసే ఎలాంటి పథకం అయినా, ఉత్పత్తిలో, సంస్థలో ఇన్వెస్ట్ చేయవద్దని సూచించింది. ఒకవేళ పెట్టుబడులు పెడితే అది ఇన్వెస్టర్లు స్వీయ రిస్క్ తీసుకున్నట్టుగా పరిగణించాలని కోరింది. ఈ విషయంలో ఎన్ఎస్ఈకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
స్టాక్ మార్కెట్లో డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి?
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు చట్టవిరుద్ధమైన డబ్బా ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా పేర్కొంది. స్టాక్ ఎక్ఛేంజీ ప్లాట్‌ఫామ్‌తో సంబంధంలేకుండా బయట షేర్లలో లావాదేవీలు చేపట్టడాన్ని డబ్బా ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. ఇది చట్టవిరుద్ధంకాగా.. కొంతమంది ఆపరేటర్లు ఇలాంటి ట్రేడింగ్ రింగ్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఇతరులను అనుమతిస్తారు. వెరసి ఇలాంటి లావాదేవీలపట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇన్వెస్టర్లను ఎన్ఎస్ఈ హెచ్చరించింది. డబ్బా ట్రేడింగ్‌ను నితిన్ శాంతీలాల్ నగ్డా, నరేంద్ర వి.సుమారియా ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. వీళ్లు ట్రేడింగ్ సభ్యులు(టీఎం)గా రిజిస్టర్కావడంతో అధీకృత వ్యక్తులు(ఏపీ)గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. వెరసి చట్టవిరుద్ధమైన ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ లావాదేవీలు చేపట్టవద్దంటూ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరికలు జారీ చేసింది. వీటికి ఇన్వెస్టర్లే బాధ్యత వహించడంతోపాటు.. నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి లావాదేవీ లకు స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి ఎలాంటి అనుమతులు లభించవని స్పష్టం చేసింది. -
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్‌లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
రీట్స్, ఇన్విట్స్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ.. దేశీయంగా తొలిసారి రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్) ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయ్యి, ట్రేడయ్యే రీట్స్, ఇన్విట్స్ పనితీరును పరిశీలించేందుకు మదుపరులకు వీలు చిక్కనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే రియల్టీ ఆస్తులతో రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులతో ఇన్విట్స్ ఏర్పాటయ్యే సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. దీర్ఘకాలికమైన రియల్టీ ప్రాజెక్టులలో రీట్స్, మౌలిక రంగ ప్రాజెక్టులలో ఇన్విట్స్ పెట్టుబడులు చేపడుతుంటాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లకు విభిన్న మార్గాలలో నిరవధిక ఆదాయానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు నగదు ఆర్జించే ప్రాజెక్టుల ద్వారా నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక అవకాశాలుగా రీట్స్, ఇన్విట్స్ గుర్తింపు పొందాయి. కాగా.. ఇండెక్సులో ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెక్యూరిటీలకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఒక్కో సెక్యూరిటీకి 33 శాతం పరిమితిని అమలు చేయనుంది. ఇండెక్స్ ప్రాథమిక విలువ 1,000కాగా.. త్రైమాసికవారీగా సమీక్షించనుంది. -
కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్‌లో వార్బర్గ్ పింకస్‌కు చెందిన హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 2.26 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో రూ.256.6 కోట్లకు విక్రయించింది. ఎన్ఎస్ఈలో బల్క్ డీల్ సమాచారం ప్రకారం ఒక్కొక్కటి రూ.110.04 చొప్పున 2,33,25,686 షేర్లను హైడెల్ విక్రయించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? డిసెంబర్ త్రైమాసికంలో కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్‌కు 26.36 శాతం వాటా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు ధర మంగళవారం 9.06 శాతం పడిపోయి రూ.107.90 వద్ద స్థిరపడింది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు -
అదానీ పవర్‌పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్‌ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్‌ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్‌లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్‌లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
పతంజలి ప్రమోటర్ల వాటాలు సీజ్
న్యూఢిల్లీ: ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలన్న నిబంధన అమలులో విఫలమైనందుకు పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల వాటాలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్తంభింప (ఫ్రీజ్) చేశాయి. ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని పతంజలి ఫుడ్స్ పేర్కొంది. పతంజలి ఆయుర్వేద్ సహా 21 ప్రమోటర్ సంస్థల వాటాలను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఫ్రీజ్ చేసినట్టు పతంజలి అంతకుముందు ప్రకటించింది. ‘డిస్క్లోజర్’ నిబంధనల కింద స్టాక్ ఎక్సేంజ్‌లకు తాజా విషయాన్ని తెలియజేసింది. కనీస ప్రజల వాటా నిబంధన అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రమోటర్ల నుంచి తమకు సమాచారం అందినట్టు పతంజలి ఆయుర్వేద్ తెలిపింది. ప్రజల వాటాను పెంచేందుకు మెరుగైనది ఏదనే విషయమై వారు చర్చిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82 శాతం వాటా ఉంది. నిబంధనల ప్రకారం 75% మించకూడదు. అంటే మరో 5.82% వాటా విక్రయించాల్సి ఉంటుంది. నేపథ్యం..: రుచి సోయా ఇండస్ట్రీస్ (పతంజలి ఫుడ్స్ పూర్వపు పేరు)ని దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2019 సెప్టెంబర్‌లో పతంజలి గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థలో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 98.87 శాతం వాటా లభించింది. 2022 మార్చిలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు పతంజలి ఫుడ్స్ వచ్చింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 648 చొప్పున 6.61 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ప్రజల వాటా 19.18 శాతానికి పెరిగింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి ప్రజల వాటా 25%కి చేర్చాల్సి ఉంది. మరో ఎఫ్‌పీవో: బాబా రామ్‌దేవ్ ఏప్రిల్‌లో మరో విడత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) చేపట్టనున్నట్టు పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. తద్వారా ప్రజల వాటా కనీసం 25% ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని తెలిపింది. పతంజలి గ్రూప్ అధినేత బాబా రామ్‌దేవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదన్నారు. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎక్సే్ఛంజ్‌ల చర్య ప్రభావం చూపించదని భరోసా ఇచ్చారు. తాము 6% వాటాలను తగ్గించుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే జాప్యానికి కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక ఏప్రిల్‌లో ఎఫ్‌పీవో చేపడతామన్నారు. -
ఎఫ్‌అండ్‌వోలో జీల్ కొనసాగింపు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్(జీల్)ను కొనసాగించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా ప్రకటించింది. వెరసి డెరివేటివ్స్ నుంచి జీల్‌ను తప్పించేందుకు గురువారం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా ప్రక్రియను వారాంతాన జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) నిలిపివేసింది. ఎసెస్ల్ గ్రూప్‌లోని మరో కంపెనీ సిటీ నెట్వర్క్స్ రూ. 89 కోట్ల చెల్లింపుల్లో విఫలంకావడంపై ఇండస్ఇండ్ బ్యాంక్ క్లెయిమ్ చేసింది. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా ఉంది. కాగా.. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)తో విలీనంకానున్న జీల్‌కు ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఉపశమనాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి జీల్ కౌంటర్లో తిరిగి మే నెల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ఎన్ఎస్ఈ అనుమతించింది. మార్చి, ఏప్రిల్ కాంట్రాక్టులు యథాతథంగా కొనసాగుతాయి. -
మున్సిపల్ బాండ్ ఇండెక్స్‌ను ప్రారంభించిన ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ అనుబంధ విభాగమైన ఎన్ఎస్ఈ ఇండిసెస్ మొదటిసారిగా మున్సిపల్ బాండ్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు నిధులు సమీకరణ కోసం జారీ చేసే మున్సిపల్ బాండ్లను ‘నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్’ ట్రాక్ చేస్తుంటుంది. అన్ని రకాల మెచ్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌ల వివరాలు ఇందులో ఉంటాయి. శుక్రవారం బెంగళూరులో మున్సిపల్ డెట్ సెక్యూరిటీలపై సెబీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ సూచీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సూచీలో 28 మున్సిపల్ బాండ్లు ఉన్నాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్లు వీటిని జారీ చేశాయి. ఏఏ క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఉన్నాయి. ఎంత మేర నిధులు చెల్లించాల్సి ఉందనే ఆధారంగా ఒక్కో బాండ్‌కు వెయిటేజీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లు అభివృద్ధి ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను ఇలా సెక్యూరిటీల జారీ ద్వారా సమీకరించుకోవచ్చు. -
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చేస్తోంది: ఇక వాటికి పెట్టుబడుల వెల్లువ!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఎస్ఈ)ని ఏర్పాటు చేయడానికి సెబీ ఆమెదించిందని తెలిపింది. దీని ప్రకారం మార్చినుంచి ఎస్ఎస్ఈ మొదలు కానుందని చెప్పింది. దీని ప్రకారం ఏదైనా సామాజిక సంస్థ, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓపి) లేదా ఫర్-ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్‌పిఇలు), సామాజిక ఉద్దేశం ప్రాధాన్యాన్ని స్థాపించే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజ్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు, లిస్టింగ్ కావచ్చు అని ఎన్ఎస్ఈ వెల్లడించింది. అంటే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారులుఈ సంస్థల షేర్లను కొనుగోలు చేయవచ్చు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం, వాటికి దృశ్యమానతను అందించడానికి, సామాజిక సంస్థల ద్వారా నిధుల సమీకరణకు ఇది ఉపయోపడనుంది. అలాగే వినియోగంలో పారదర్శకతను పెంచడానికి సామాజిక సంస్థలకు కొత్త మార్గాన్ని అందించాలనేది కూడా తమ లక్ష్యమని ఎస్ఎస్ఈ పేర్కొంది ఈ సెగ్మెంట్లో అర్హత కలిగిన ఎన్ఓపీ నమోదు చేసుకోవచ్చు. తద్వారా వీటిని పెట్టుడుల సమీకరణకు ఆస్కారం లభిస్తుంది. ఆన్‌బోర్డింగ్ అర్హత కలిగిన ఎన్జీవో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (ZCZP) వంటి సాధనాలను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. నిబంధనల ప్రకారం ఇష్యూ పరిమాణం కోటి రూపాయలు, సబ్స్క్రిప్షన్ కనీస అప్లికేషన్ సైజును రూ. 2 లక్షలుగాను సెబీ నిర్దేశించింది. -
నిఫ్టీ సూచీలలో అదానీ గ్రూప్ షేర్లు
నిఫ్టీ ఇండెక్సులలో ఈ ఏడాది మార్చి31 నుంచి సవరణలు చేపడుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్సులలో ప్రయివేట్ రంగ కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్‌తోపాటు పలు ఇతర కంపెనీలకు చోటు లభించనుంది. అదానీ విల్మర్ నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక అదానీ పవర్‌కు నిఫ్టీ 500, 200లతోపాటు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, 150, లార్జ్‌మిడ్ క్యాప్ 250, మిడ్‌స్మాల్ క్యాప్ 400లలో చోటు లభించనుంది. ఇండెక్సుల నిర్వహణ సబ్‌కమిటీ షేర్ల జాబితాలో సవరణలను నిర్ణయించినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. అయితే ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎలాంటి మార్పులూ చేపట్టడంలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. కాగా.. నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌లో ఏబీబీ ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ సైతం ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫసిస్, వన్ 97 కమ్యూనికేషన్స్లను నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. -
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్‌కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్‌లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్‌లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్‌పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్‌కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
ట్రేడర్లకు అలర్ట్: అదానీ షేర్ల పతనం, ఎన్ఎస్ఈ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ తరువాత అదానీ గ్రూప్ షేర్లన్నీ దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత దాదాపు అన్నీ 52 వారాల కనిష్టానికి చేరాయి. కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్ వద్ద నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, మార్కెట్ అస్థిరత కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్‌లను ఫిబ్రవరి 3, 2023 నుండి ASM (అదనపు నిఘా మార్జిన్) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచింది, దీని ప్రకారం ఆయా షేర్లలో ట్రేడింగ్ చేయడానికి 100శాతం మార్జిన్ ఉండి తీరాలి. తద్వారా పలు ఊహాగానాలను, షార్ట్ సెల్లింగ్‌ను అరికట్టవచ్చని అంచనా. (షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో) "ధర/వాల్యూమ్ వైవిధ్యం, అస్థిరత మొదలైన ఆబ్జెక్టివ్ పారామితుల ఆధారంగా సెక్యూరిటీలపై అదనపు నిఘా చర్యలు (ASM) ఉంటాయి" అని ఎన్ఎస్ఈ తన వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది (అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!) కాగా అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20 వేల కోట్ల ఎఫ్ఈవో రద్దు తర్వాత, అదానీ గ్రూప్ మార్కెట్ నష్టాలు గురువారం నాడు 100 బిలియన్ డార్లకు పైగా చేరిన సంగతి తెలిసిందే.ఫోర్బ్స్ గురువారం అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గౌతం అదానీ 16 వ స్థానానికి పడిపోయారు. (అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్ నేత సంచలన సలహా) -
అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు, నష్టాల్లో దేశీ స్టాక్ సూచీలు
జాతీయ,అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాతో పాటు ఆసియా మార్కెట్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, భారత్‌లో యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మదపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. వెరసి మంగళవారం ఉదయం 9.37 గంటల సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టంతో 59341 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ అత్యల్పంగా 47 పాయింట్ల నష్ట పోయి 17601 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక బీపీసీఎల్, ఓఎన్జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎం అండ్ ఎం, మారుతి సుజికి, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, సిప్లా, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్, టీసీఎస్, లార్సెన్,హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
మళ్లీ ఎన్ఎస్ఈ టాప్, వరుసగా నాలుగో ఏడాది రికార్డ్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్సే్ఛంజీగా వరుసగా నాలుగో ఏడాది నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) నిలిచింది. ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్యరీత్యా 2022లోనూ రికార్డ్ నెలకొలి్పంది. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్(ఎఫ్ఐఏ) వెల్లడించిన వివరాలివి. మరోవైపు నాలుగో ఏడాదిలోనూ టాప్ ర్యాంకులో నిలిచినట్లు ఎన్ఎస్ఈ సైతం ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతేకాకుండా లావాదేవీల సంఖ్య(ఎల్రక్టానిక్ ఆర్డర్ బుక్) రీత్యా 2022లో ఈక్విటీ విభాగంలో ఎన్ఎస్ఈ మూడో స్థానానికి మెరుగుపడినట్లు ఎక్సే్ఛంజీల వరల్డ్ ఫెడరేషన్(డబ్ల్యూఎఫ్ఈ) వెల్లడించింది. 2021లో ఎన్ఎస్ఈ నాలుగో ర్యాంకులో నిలిచింది. గత క్యాలండర్ ఏడాది(2022)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50 18,887ను అధిగమించడం ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్‌లో లిక్విడిటీ భారీగా పెరిగింది. ఈక్విటీ విభాగంలో ఈటీఎఫ్‌ల రోజువారీ సగటు టర్నోవర్ 2022లో 51 శాతం జంప్‌చేసి రూ. 470 కోట్లను తాకింది. ఇక సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ల రోజువారీ సగటు టర్నోవర్ 59% ఎగసి రూ. 7 కోట్లకు చేరింది. ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ గత నెలలో సగటు టర్నోవర్ రూ. 3 కోట్లకు చేరడం గమనార్హం! చదవండి: గత ఎన్నికల ముందు బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి? -
బీఎస్ఈ సీఈవోగా సుందరరామన్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈకి ఎండీ, సీఈవోగా సుందరరామన్ రామమూర్తి ఎంపికయ్యారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రామమూర్తి ఎంపికకు గత నెలలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు బీఎస్ఈ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌ను రామమూర్తి ఆమోదించవలసి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈ గత ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ గతేడాది(2022) జూలైలో పదని నుంచి తప్పుకుని మరో దిగ్గజ స్టాక్ ఎక్ఛేంజీ ఎన్ఎస్ఈకి తరలి వెళ్లారు. దీంతో ఎన్ఎస్ఈలో సభ్యులుగా వ్యవహరించిన రామమూర్తికి బీఎస్ఈ అత్యున్నత పదవిని ఆఫర్ చేసింది. -
ఇక ఎన్ఎస్ఈ సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ
న్యూఢిల్లీ: ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ ఏర్పాటుకు ముందస్తు అనుమతి పొందింది. ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్ అందుకుంది. దీంతో ఎస్ఎస్ఈ పేరుతో విడిగా ఒక విభాగాన్ని నెలకొల్పేందుకు కృషి చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ప్లాట్‌ఫామ్ సోషల్ ఎంటర్ప్రైజ్లకు గరిష్ట లబ్దిని అందించగలదని విశ్వసిస్తున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సస్టెయిబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలకు చేయూతనివ్వగలదని తెలియజేశారు. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్, టెక్ని కల్ గ్రూప్ సిఫారసులమేరకు జులైలోనే ఎస్ఎస్ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దేశీయంగా ఎస్ఎస్ఈ కొ త్త ఆలోచనకాగా.. ప్రయి వేట్, నాన్‌ప్రాఫిట్ రంగాలకు పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించడం ద్వారా సేవలందించనుంది. కాగా.. అక్టోబర్‌లో బీఎస్ ఈసైతం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు సూత్ర ప్రాయ అనుమతిని పొందినట్లు వెల్లడించిన విషయం విదితమే. -
మరో భారత్ బాండ్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ తాజాగా మరో బాండ్ ఇండెక్సును ప్రారంభించింది. నిఫ్టీ భారత్ బాండ్ ఇండెక్స్ సిరీస్‌లో భాగంగా ఏప్రిల్ 2033ను ప్రవేశపెట్టింది. అత్యధిక భద్రతగల ఏఏఏ రేటింగ్ ప్రభుత్వ బాండ్లతో ఎన్ఎస్ఈ బాండ్ ఇండెక్సులను ఆవిష్కరిస్తోంది. వీటిలో భాగంగా ఏప్రిల్ 2033ను విడుదల చేసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. భారత్ బాండ్ ఇండెక్స్‌లో భాగంగా తొలు త 2019 డిసెంబర్లో ఏప్రిల్ 2023, ఏప్రిల్ 2030 గడువులతో బాండ్ ఇండెక్సులను ప్రవేశపెట్టింది. తదుపరి 2020 జులైలో మరోసారి ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2031 గడువులతో ఇండెక్సులను ఆవిష్కరించింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ సిరీస్‌లో భాగంగా త్వరలో విడుదల చేయనున్న ఆరో భారత్ బాండ్ ఈటీఎఫ్ ద్వారా భారత్ బాండ్ ఇండెక్స్ 2033ను ట్రాక్ చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
ఎన్ఎస్ఈలో జిమ్ ల్యాబ్ లిస్టింగ్
న్యూఢిల్లీ: జనరిక్ ప్రొడక్టుల హెల్త్‌కేర్ కంపెనీ జిమ్ ల్యాబొరేటరీస్ తాజాగా ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. శుక్రవారం రూ. 336 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 340 వద్ద గరిష్టం, రూ. 330 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 3 శాతం లాభంతో రూ. 332 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2018 జూన్‌లోనే లిస్టయిన స్మాల్ క్యాప్ కంపెనీ వారాంతాన ఎన్ఎస్ఈలోనూ లిస్టింగ్‌ను సాధించింది. విభిన్న, నూతన తరహా జనరిక్ ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, ఎండీ అన్వర్ డి. పేర్కొన్నారు. వీటిని ఈయూ మార్కెట్లలో ఫైలింగ్ చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రధానంగా నూతనతరహా డ్రగ్ డెలివరీ సొల్యూషన్స్ అందిస్తోంది. -
సైబర్ దాడులను ఎదుర్కొనే కొత్త వ్యవస్థలు
బెంగళూరు: సైబర్ దాడులను అధిగమించే వ్యవస్థలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మార్చి నాటికి కొత్త వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని సెబీ చైర్పర్సన్ మాధవి పురి తెలిపారు. సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు ఆమె తెలిపారు. సంక్షోభం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే చక్కని ప్రణాళికను స్టాక్ ఎక్సే్ఛేంజ్‌లు, డిపాజిటరీలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఏదో సాధారణ ప్రామాణిక విపత్తు రికవరీ ప్రణాళికలు అన్నవి కేవలం లొకేషన్ డౌన్‌టైమ్, హార్డ్‌వేర్, నెట్వర్క్ బ్రేక్‌డౌన్‌లనే పరిగణనలోకి తీసుకుంటాయి. సాఫ్ట్వేర్ బ్రేక్‌డౌన్, సమస్య విస్తరణను కాదు. సైబర్ దాడిలో సాఫ్ట్‌వేర్‌పైనే ప్రభావం పడుతుంది. దాంతో విపత్తు రికవరీ సైట్ కూడా ప్రభావానికి గురవుతుంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అందుకే దేశంలోని రెండు పెద్ద స్టాక్ ఎకేŠస్ఛ్‌ంజ్‌లు అయిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తగిన భద్రతా వ్యవస్థలను అమల్లో పెట్టేలా చర్యలను సెబీ తీసుకుంది’’అని మాధవి వివరించారు. ప్రస్తుతం ఈ పని పురోగతిలో ఉందంటూ, ఇది వచ్చే మార్చి నాటికి పనిచేయడం మొదలు పెడుతుందన్నారు. ‘‘ప్రతిపాదిత యంత్రాంగంలో ప్రతి క్లయింట్‌కు సంబంధించి అన్ని రకాల పొజిషన్లు, తనఖా తదితర వివరాలన్నీ ‘ఏ’ ఎక్సే్ఛేంజ్ (ఆన్లైన్)లో ఉంటాయి. ఈ డేటా అంతా కూడా వెళ్లి ఎక్సే్ఛేంజ్ ‘బీ’ లోని స్టోరేజ్ బాక్స్‌లో (డేటా సెంటర్) ఎప్పటికప్పుడు నిల్వ అవుతుంటుంది. ఒకవేళ ఎక్సే్ఛేంజ్ ఏ బ్రేక్‌డౌన్ అయితే, అది సాఫ్ట్వేర్ దాడి (సైబర్ దాడి) అని సెబీ నిర్ధారిస్తే.. అప్పుడు ఎక్సేంజ్ బీలో డేటా అప్లోడ్ అయ్యే బటన్‌ను సెబీ ప్రెస్ చేస్తుంది’’అని సెబీ చైర్పర్సన్ వివరించారు. -
నిఫ్టీ సూచీ నుంచి హెచ్డీఎఫ్సీ తొలగింపు!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీని ఎన్ఎస్ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్ 25న నిర్వహించనున్నారు. అలాగే, ఆర్బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి నిఫ్టీ ఇండెక్స్‌లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్డీఎఫ్సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్‌లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్‌పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్ఎస్ఈ ఉద్దేశ్యం. -
టెలిగ్రామ్, వాట్సప్‌లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే!
ముంబై: రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలో ఎలాంటి పెట్టుబడులు పెట్టొందంటూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘టెలిగ్రామ్, వాట్సప్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలు మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టి మోసపోద్దు. ఈ సంస్థలకు ఎక్స్చేంజ్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో గత నెలలో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సైతం ఎక్స్చేంజ్ నిషేధించింది. ఇది చదవండి: కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం, కుప్పకూలిపోతున్న షేర్లు!
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత తొలిసారి ప్రారంభమైన స్టాక్ మార్కెట్లో బిగ్‌బుల్‌కు చెందిన అన్నీ షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ♦ ముఖ్యంగా యాప్‌టెక్ లిమిటెడ్,స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు 5శాతం నష్టపోయాయి. ♦ బిగ్ బుల్ టైటాన్ షేర్లు 1.54శాతం నష్టపోయాయి. గతవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేర్ వ్యాల్యూ రూ.2,471.95 ఉండగా.. ఇప్పుడు అదే షేర్ ప్రైస్ రూ.2,433వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ♦ జూన్ నెల త్రైమాసికం(వార్షిక ఫలితాలు)లో టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయన భార్య రేఖ షేర్లు 5.10శాతంతో రూ.11,086.9కోట్లుగా ఉంది. ♦ తొలి త్రైమాసికంంలో యాప్ టెక్ లిమిటెడ్‌లో రాకేష్ ఝన్‌ఝున్‌వాలా 23.40శాతంతో రూ.225కోట్లను పెట్లుబడులు పెట్టగా.. ఆయన మరణం కారణంగా బీఎస్ఈలో ఆ షేర్ వ్యాల్యూ క్షీణించింది. 3.67శాతం కంటే తక్కువగా రూ.224.20వద్ద ట్రేడ్ అవుతుంది. ♦ బిగ్‌బుల్‌కు పెద్దమొత్తంలో పెట్టుబడులున్న స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు భారీ పతనమవుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ కొనసాగే సమయానికి మునుపటి ముగింపు రూ .696.10తో పోలిస్తే 4.79 శాతం క్షీణించి రూ .662.75 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. జూన్ 2022 త్రైమాసికం నాటికి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఝున్‌ఝున్ వాలాకు 14.39 శాతంతో 8.28 కోట్ల షేర్లు, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 3.10 శాతంతో 1.78 కోట్ల షేర్లు ఉన్నాయి. స్టార్ హెల్త్‌లో ఝున్ఝున్వాటా విలువ రూ.7,017.5 కోట్లుగా ఉంది. ♦ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఫోర్ట్పోలియోకి చెందిన టాటా మోటార్స్ స్టాక్స్ 0.68 శాతం క్షీణించి రూ .480.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. జూన్ త్రైమాసికం చివరి నాటికి టాటా మోటార్స్‌లో రూ .1731.1 కోట్ల విలువైన షేర్లున్నాయి. ♦ బీఎస్ఈలో ఝున్‌ఝున్‌వాలా షేర్లున్న క్రిసిల్ లిమిటెడ్ షేరు మునుపటి ముగింపు రూ.3261.60 తో పోలిస్తే 0.56 శాతం క్షీణించి రూ .3243కు పడిపోయింది. జూన్ త్రైమాసికంలో క్రెడిట్ రేటింగ్ సంస్థలో ఆయనకు రూ .1301.9 కోట్ల విలువైన వాటా ఉంది. ♦ ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు బీఎస్ఈలో 0.20 శాతం తగ్గి రూ .281.30 వద్ద ట్రేడవుతుండగా.. ఇలా బిగ్బుల్ కు చెందిన అన్నీ షేర్లు నష్టాల పాలవ్వడంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్వెస్టర్లకి అలర్ట్: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో.. ఓ లుక్కేద్దాం!
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాల వెల్లడి, ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ఎక్స్పైరీ ముగింపుతో పాటు కీలక కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటన అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘స్టాక్ సూచీలు ఈ వారం తీవ్ర ఊగసలాటకు గురికావొచ్చు. బుధ, గురువారాల్లో వెలువడనున్న ముఖ్యంగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు, రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని శాసించవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే 16,800–850 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,250–16,500 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు గతవారంలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఐటీ, బ్యాంకింగ్, వినిమయ, మెటల్ షేర్లకు రాణించడంతో సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. కార్పొరేట్ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ ముందుగా నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కంపెనీల షేర్లకు నిఫ్టీ సూచీలో 30 శాతానికిపైగా వెయిటేజీ ఉంది. ఇక వారంలో నిఫ్టీ సూచీలో 18 కంపెనీలతో సహా సుమారు 400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, శ్రీ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీఐసీ, సన్ ఫార్మా కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(జూలై 26న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు (బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఫెడ్ కమిటీ గత సమీక్షలో చెప్పినట్లు 50–75 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపునకే కట్టడి ఉండొచ్చు. అయితే ద్రవ్యోల్బణ కట్టడికి అధికప్రాధాన్యతనిస్తూ ఒకశాతం పెంపునకు మొగ్గుచూపితే అది మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచినట్లే అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎఫ్ఐఐల యూటర్న్ కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.ఈ జూలైలో ఇప్పటి వరకు(1–22 తేదీల్లో) రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘యూఎస్ రిటైల్ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్లో తిరిగి కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడం, దేశీయ జూన్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడం కూడా కలిసొచ్చింది’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. చదవండి: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
బుల్ రంకెలు..5 రోజుల్లో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.., దలాల్ స్ట్రీట్‌లో అయిదోరోజూ కొనుగోళ్లు కొనసాగాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో పాటు డాలర్ మారకంలో రూపాయి రికవరీ అంశాలు దేశీయ మార్కెట్లో సెంటిమెంట్ బలపరిచాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 284 పాయింట్లు పెరిగి 55,682 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84 పాయింట్లు బలపడి 16,605 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు ఏడువారాల గరిష్టం కావడం విశేషం. ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన ఐటీ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.25%, స్మాల్‌క్యాప్ సూచీ ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,799 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.313 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టం(80.06) నుంచి కోలుకొని 20 పైసలు బలపడి 79.85 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! సెన్సెక్స్ ఉదయం ఐదు పాయింట్లు పతనమై 55,392 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్ల నష్టపోయి 16,524 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో పరిమితి శ్రేణిలో స్తబ్ధుగా కదలాడిన సూచీలు క్రమంగా పుంజుకొని ట్రేడింగ్ చివర్లో అనూహ్యరీతిలో లాభాలను ఆర్జించాయి. 5 రోజులు : రూ.10 లక్షల కోట్లు సెన్సెక్స్ అయిదు రోజుల్లో 2,266 పాయింట్లు దూసుకెళ్లిన బీఎస్ఈలో రూ.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు ఎగసింది. ఇదే ఐదు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 556 పాయింట్లు పెరిగింది. ‘‘చమురు ధరలు దిగివచ్చాయి. యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు దూకుడుగా ఉండకపోవచ్చనే ఆశలు చిగురించాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొంటున్నారు. మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అంశాలతో భారత మార్కెట్ 5 ట్రేడింగ్ సెషన్లలో 4% ర్యాలీ చేసింది’’ అని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦జూన్ త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబరచడంతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 8% లాభపడి రూ.948 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిది శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.961 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన ఈ షేరు ఇదే. ♦ఐటీసీ షేరు బీఎస్ఈలో అరశాతం లాభపడి రూ.299.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.5% లాభపడి మూడేళ్ల తర్వాత రూ.300 స్థాయిని అధిగమించి రూ.302.20 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వార్షిక సమావేశంలో హోటల్ వ్యాపార విభజనతో పాటు తన అనుబంధ సంస్థ టెక్నాలజీ వెంచర్‌ను లిస్టింగ్ చేసే అంశాలపై చర్చించడం షేరు ర్యాలీకి కారణమైంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦జూన్ త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబరచడంతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 8% లాభపడి రూ.948 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో తొమ్మిది శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.961 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన ఈ షేరు ఇదే. ♦ఐటీసీ షేరు బీఎస్ఈలో అరశాతం లాభపడి రూ.299.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.5% లాభపడి మూడేళ్ల తర్వాత రూ.300 స్థాయిని అధిగమించి రూ.302.20 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వార్షిక సమావేశంలో హోటల్ వ్యాపార విభజనతో పాటు తన అనుబంధ సంస్థ టెక్నాలజీ వెంచర్‌ను లిస్టింగ్ చేసే అంశాలపై చర్చించడం షేరు ర్యాలీకి కారణమైంది. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
NSE: మాజీ చీఫ్ నారాయణ్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ పరిపాలన నిర్వహణ లోపాలకు సంబంధించిన కేసులో ఆ సంస్థ మాజీ చీఫ్ రవి నారాయణ్‌కు శాట్‌లో ఊరట లభించింది. రవి నారాయణ్‌కు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) స్టే విధించింది. అది కూడా నాలుగు వారాల్లోపు సెబీ వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని, ఈ షరతుకు లోబడే తమ ఉత్తర్వుల అమలు ఆధారపడి ఉంటుందన్న షరుతు విధించింది. రవి నారాయణ్ ఎన్ఎస్ఈ సీఈవోగా 2013 మార్చి 31 వరకు పనిచేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2017 జూన్ వరకు ఎన్ఎస్ఈ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఎన్ఎస్ఈలో చోటుచేసుకున్న పరిణామాలకు రవి నారాయణ్‌ను బాధ్యుడ్ని చేస్తూ సెబీ ఫిబ్రవరి 11న ఆదేశాలు జారీ చేసింది. సెబీ నమోదిత ఇంటర్ మీడియరీలు, ఏదేనీ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో భాగస్వామి కాకుండా రెండేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. అలాగే రూ.2 కోట్ల పెనాల్టీ కట్టాలని కూడా ఆదేశించింది. దీనిపై నారాయణ్ శాట్‌ను ఆదేశించారు. నారాయణ్ నుంచి ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో బాధ్యతలను చేపట్టిన చిత్రా రామకృష్ణ.. అర్హతలు లేకపోయినా భారీ వేతనానికి వ్యక్తిగత సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించినట్టు సెబీ గుర్తించింది. అంతేకాదు, సుబ్రమణియన్‌కు పెద్ద ఎత్తున అధికారాలను చిత్రా కట్టబెట్టినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. చదవండి: మిస్టర్ ఆనంద్ సుబ్రమణియన్ రూ.2.05 కోట్లు కట్టండి.. లేదంటే? -
మిస్టర్ ఆనంద్ సుబ్రమణియన్ రూ.2.05 కోట్లు కట్టండి.. లేదంటే?
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ని పట్టి కుదిపేస్తున్న కో లోకేషన్ కేసు, తదనంతర పరిణామాల నేపథ్యంలో సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఎస్ఈకి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రమణియన్ పని చేసిన కాలంలో పక్కదారి పట్టిన రూ.2.05 కోట్ల రూపాయలను 15 రోజుల్లోగా చెల్లించాలంటూ సెబీ నోటీసులు జారీ చేసింది. సకాలంలో ఈ డబ్బులు చెల్లించకపోతే ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాల స్థంభన, అరెస్టు వంటివి ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ ఘాటుగా హెచ్చరించింది. సెబీ ఎండీగా చిత్ర రామకృష్ణ, ఆమెకు అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌లు పని చేసిన కాలంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సెబీ, సీబీఐలు విచారణ చేస్తున్నాయి. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అడ్వెజర్‌గా ఉన్న ఆనంద్ సుబ్రమణియన్‌ను ఆ తర్వాత కాలంలో గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవిని కూడా కట్టబెట్టారు. సెబీ విచారణలో అవినీతి విషయం వెలుగు చూడటంతో గత ఫిబ్రవరిలో రూ. 2 కోట్లు ఫైన్ విధించగా సకాలంలో చెల్లించలేదు. దీంతో జరిమానాతో పాటు అరెస్టు చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది సెబీ. చదవండి: Chitra Ramkrishna: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ -
కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన అప్పీలును సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ సెబీని ఆదేశించింది. అలాగే సెబీ విధించిన రూ. 2 కోట్ల జరిమానా మొత్తాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్ చేయాలని చిత్రా రామకృష్ణను, ఆమెకు చెల్లించాల్సిన రూ. 4.73 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్‌లో కాకుండా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీకి సూచించింది. తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే, ఎన్ఎస్ఈలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిత్రా రామకృష్ణకు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్ కింద ఆమెకు దఖలుపడే రూ. 1.54 కోట్లు, అలాగే రూ. 2.83 కోట్ల బోనస్‌ను జప్తు చేసుకుని, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్‌లో జమ చేయాలని ఎన్ఎస్ఈకి సూచించింది. దీనితో పాటు ఈ వివాదంతో సంబంధమున్న మరికొందరిపై కూడా సెబీ జరిమానా విధించడంతో పాటు పలు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ చిత్రా రామకృష్ణ శాట్‌ను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..! -
రెండోసారి బాధ్యతలు కోరుకోవడం లేదు: లిమాయే
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రెండోసారి బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టం చేశారు. లిమాయే పదవీకాలం జూలైలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో పాలనా పరమైన లోపాలు, కో–లొకేషన్ వ్యవహారంపై సెబీ, సీబీఐ విచారణలు, మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో లిమాయే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను రెండవ టర్మ్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. అందువల్ల తిరిగి దరఖాస్తు చేయడంకానీ, ప్రస్తుతం జరుగుతున్న నియామకం ప్రక్రియలో పాల్గొనడం కానీ చేయడం లేదు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాను. నా పదవీకాలం 2022 జూలై 16వ తేదీతో ముగుస్తుంది’’ అని లిమాయే తెలిపారు. చాలా క్లిష్టమైన కాలంలో సంస్థను నడిపించడానికి, సంస్థను స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి, పాలనా ప్రక్రియ, సమర్థతను మరింత పటిష్టంగా మార్చడానికి, సాంకేతిక పురోగతికి, వ్యాపార వృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
సీబీఐ కస్టడీలో చిత్రా రామకృష్ణ
న్యూఢిల్లీ: కో–లొకేషన్ కుంభకోణం కేసులో ఆదివారం రాత్రి అరెస్టయిన నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఏడు రోజుల కస్టడీకి తీసుకుంది. తగిన విచారణకు ఆమె కస్డడీ అవసరమని సీబీఐ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ఇక్కడ ప్రత్యేక జడ్జి సంజీవ్ అగర్వాల్ ఆదేశాలు ఇచ్చారు. 2022 మార్చి 14వ తేదీన ఆమెను తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. స్టాక్ ఎక్సేంజీలో కొందరు బ్రోకర్ల సర్వర్లకు ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్ సమాచారం ముందుగా చేరేట్లు చేయడం, ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉందన్న వార్తలు సంచలనం కలిగించాయి. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్ ముందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం. అంతకుముందు మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. -
ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్
న్యూఢిల్లీ: కోలొకేషన్ కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం. గత మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. -
సుబ్రమణియన్ పని అయ్యింది.. ఇక చిత్రనే మిగిలింది!
నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో సంచలనం రేపిన కో లొకేషన్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి చిత్ర రామకృష్ణన్ అరెస్టుకు రంగం సిద్ధమయ్యింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె దరఖాస్తు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా చిత్ర రామకృష్ణ అరెస్టు కావచ్చనే ప్రచారం ఊపందుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీకి చిత్ర రామకృష్ణన్ గతంలో ఎండీగా పని చేశారు. ఈ సమయంలో ఓ అదృశ్య యోగి ఆజ్ఞల మేరకు ఆమె రహస్య సమాచారం లీక్ చేశారు. అంతేకాకుండా అదృశ్య యోగి ఆదేశాలంటూ అనర్హులను అందలం ఎక్కించారు. మొత్తంగా ఆమె పదవీ కాలంలో ఎన్ఎస్ఈలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. కో లొకేషన్ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి, అదృశ్య యోగి అనే అనుమానాలు ఉన్న సుబ్రమణియన్‌ను ఇప్పటికే చెన్నైలో సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 2022 మార్చి 6 వరకు అతన్ని విచారించనుంది. అతని విచారణ ముగిసిన వెంటనే చిత్రా రామకృష్ణన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. చదవండి: ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..! -
ఆ ప్రముఖ సంస్థకు ఎండీ, సీఈవో కావలెను!
న్యూఢిల్లీ: పాలనా సంబంధ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీ ఎన్ఎస్ఈ.. కొత్త ఎండీ, సీఈవో కోసం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న విక్రమ్ లిమాయే ఐదేళ్ల గడువు జూలైలో ముగియనుంది. దీంతో అర్హతగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహా్వనిస్తోంది. ఐపీవో సంబంధ అనుభవమున్న వ్యక్తులు ఈ నెల 25లోగా అప్లికేషన్లు పంపించవలసిందిగా తాజా నోటీసులో ఎన్ఎస్ఈ పేర్కొంది. లిమాయే మరోసారి పదవీ బాధ్యతలు నిర్వర్తించేందుకు సైతం వీలుంది. అయితే సెబీ నిబంధనల ప్రకారం ఈ పదవిని ఆశిస్తున్న ఇతర వ్యక్తులతో పోటీ పడి నెగ్గుకురావలసి ఉంటుంది. 2017లో తొలిసారి ఎన్ఎస్ఈ చీఫ్‌గా 2017 జూలైలో లిమాయే ఎంపికయ్యారు. అప్పటి ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ తదుపరి బాధ్యతలు స్వీకరించారు. అయితే వివిధ ఆరోపణల నడుమ 2013లో చిత్రా రామకృష్ణ నియామకంలో దరఖాస్తుదారులను ఆహ్వానించకపోవడంపై పలు త్రైమాసికాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక లిమాయే ఎన్ఎస్ఈకి రీబ్రాండింగ్ను కల్పించారు. ఆయన అధ్యక్షతన డెరివేటివ్స్‌లో లావాదేవీలు భారీ వృద్ధిని సాధించాయి. అయితే సాంకేతిక లోపాల కారణంగా గతేడాది కొన్ని ఇబ్బందులను సైతం ఎక్సేంజీ ఎదుర్కొంది. తప్పనిసరి కార్పొరేట్ పాలనలో సమర్థత, ఎంటర్ప్రైజ్ రిస్క్‌ల నిర్వహణ, మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్ నిబద్ధత తదితర అర్హతలను తప్పక కలిగి ఉండాలంటూ తాజా నోటీసు లో అభ్యర్థులకు ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. వీటికి అదనపు అర్హతలుగా లిస్టెడ్ కంపెనీలో పనిచేస్తున్న అనుభవం లేదా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న కంపెనీ నిర్వహణ తదితరాలను పేర్కొంది. దరఖాస్తుల గడువు ముగిశాక నామినేషన్లు, రెమ్యునరేషన్ కమిటీ అభ్యర్ధులను ఎంపిక చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
ఎన్ఎస్ఈ కుంభకోణం కేసులో అదిరిపోయే ట్విస్ట్.. అతడే "అదృశ్య" యోగి!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేంజీని పట్టి కుదిపేస్తున్న కో లొకేషన్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి ఆనంద్ సుబ్రమణియన్‌ను నేడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అదిరిపోయే ఒక ట్విస్ట్ బయటపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణ నిర్ణయాలను గత కొన్ని ఏళ్లుగా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదృశ్య "హిమాలయ యోగి" ఎవరు అనేది తెలిసిపోయింది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కేసులో అరెస్టయిన మాజీ అధికారి ఆనంద్ సుబ్రమణియన్ అదృశ్య "హిమాలయ యోగి" అని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ చిత్ర రామకృష్ణతో ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసిన "యోగి" అని సీబీఐ వర్గాలు ఈ రోజు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. ఆనందే అదృశ్య"హిమాలయ" యోగి అనే విషయం ఖరారైనట్లు తెలుస్తుంది. యోగి పేరుతో చిత్ర రామకృష్ణ తీసుకున్న నిర్ణయాలలో ఆయన వివాదాస్పద నియామకం ఒకటి అని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒక నివేదికలో తెలిపింది. ఆనంద్ సుబ్రమణియన్ ఒక ఇమెయిల్ ఐడీ ద్వారా తనను తాను యోగి అని వెల్లడించినట్లు సీబీఐ పేర్కొంది. సుబ్రమణియన్ మెయిల్ ఐడీని rigyajursama@outlook.com సృష్టించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీ తెలిపింది. చిత్ర రామకృష్ణ 2013 -2016 మధ్య కాలంలో rigyajursama@outlook.comకు చిత్ర రామకృష్ణ rchitra@icloud.com మెయిల్ ఐడీ నుండి ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పంచుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మెయిల్స్'లో కొన్ని ఆనంద్ సుబ్రమణియన్ మరొక మెయిల్ ఐడీకి కూడా మార్క్ చేయబడినట్లు సమాచారం. సుబ్రమణియన్ మెయిల్ ఐడీల నుంచి ఈ మెయిల్స్ స్క్రీన్ షాట్'లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. సుబ్రమణియన్'ను సీబీఐ గత వారం నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చెన్నైలో అతన్ని అరెస్టు చేశారు. "సుబ్రమణియన్ విచారణకు సహకరించలేదు; అతను తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడు" అని సీబీఐ వర్గాలు తెలిపాయి. సుబ్రమణియన్ మొదటిసారి 2013లో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటజిక్ ఎడ్వైజర్'గా నియమితులయ్యారు. ఆ తర్వాత చిత్ర రామకృష్ణ 2015లో అతన్ని గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్'గా పదోన్నతి కల్పించారు. 2016లో అవకతవకల ఆరోపణలు రావడంతో ఎన్ఎస్ఈని ఆనంద్ విడిచిపెట్టాడు. గత కొద్ది రోజులుగా జరగుతున్న విచారణలో చిత్ర రామకృష్ణ "యోగి"తో రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు దర్యాప్తులో ఉంది. ఆ యోగీ ప్రభావం వల్ల ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని ఆనంద్ సుబ్రమణియన్'ని చీఫ్ స్ట్రాటజిక్ ఎడ్వైజర్, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమించారని దర్యాప్తులో భాగంగా సెబీ తెలిపింది. అలాగే, తన పనితో సంబంధం లేకుండా చిత్ర రామకృష్ణ భారీ స్థాయిలో జీతాలు పెంచారు అని కూడా తేలింది. సుబ్రమణియన్ నియామకం, ప్రమోషన్ విషయంలో ఆరోపణలు రావడంతో చిత్ర రామకృష్ణ, ఇతరులపై సెబీ అభియోగాలు మోపింది. ఇమెయిల్స్ ఆధారంగా, శ్రీమతి రామకృష్ణ ఈ వ్యక్తిని "2015లో అనేకసార్లు" కలుసుకున్నట్లు సెబీ పేర్కొంది. చిత్ర రామకృష్ణ 2013 నుంచి 2016 వరకు ఎన్ఎస్ఈకి నాయకత్వం వహించారు. (చదవండి: NSE Scam: యోగి సత్యం! మెయిల్ మిథ్య?) -
క్రికెట్ బెట్టింగ్ తరహా కుంభకోణం! అయితే ప్లేస్ మారింది
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లో కో–లొకేషన్ వివాదానికి సంబంధించి వివిధ దర్యాప్తు బృందాలు ఇందులోని మరిన్ని కొత్త కోణాలపై విచారణ జరుపుతున్నాయి. సర్వర్లు, డేటా అందించడంలో కొంత మంది బ్రోకర్లకు ప్రా«ధా న్యం ఇవ్వడం, ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాల్లో ఎవరెలా లబ్ధి పొందినదీ వెలికి తీయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇది అచ్చం క్రికెట్ బెట్టింగ్ స్కామ్లాగా పని చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరసెకను ముందు తెలిసినా.. ‘సాధారణ ఇన్వెస్టరు లేదా బ్రోకర్ తన సాధారణ టెర్మినల్ మీద ట్రేడింగ్ చేయడమంటే.. క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను టీవీలో లేదా స్టేడియంలో చూసినట్లుగా ఉంటుంది. అయితే, ఫీల్డ్‌లోని ప్రతి ఆటగాడి కదలికలు, వారు ఏం చేయబోతున్నారన్నది మిగతా వారి కన్నా ముందుగానే తెలిసిపోతే ఎలా ఉంటుంది? కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరెలా నష్టపోతున్నారన్నది అర్థమవుతుంది. మార్కెట్ డేటా మిగతావారికన్నా అరసెకను ముందు వచ్చినా ట్రేడర్లు బోలెడంత లబ్ధి పొందుతారు‘ అని ఒక అధికారి పేర్కొన్నారు. కొనసాగుతున్న విచారణ అధిక మొత్తం చెల్లించిన బ్రోకింగ్ సంస్థలకు స్టాక్ ఎక్సేంజీలో సర్వర్లు ఏర్పాటు చేసుకునేందుకు, మిగతా వారితో పోలిస్తే ముందుగా డేటాను పొందే వెసులుబాటు పొందేందుకు ఎన్ఎస్ఈ వివాదాస్పద కో–లొకేషన్ విధానం అమ లు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్ఎస్ఈ మాజీ సీఈవోలు చిత్రా రామకృష్ణ, రవి నారాయణ్ తదితరులపై విచారణ జరుగుతోంది. చిన్న ఇన్వెస్టర్లకూ నష్టమే దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా నష్టం లేదనడాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదని వాదించడం అర్థరహితం. వారికి షేరుపై రూపాయో లేదా కొన్ని చిల్లర పైసల్లోనో నష్టం వచ్చి ఉండవచ్చు. కానీ రోజూ కొన్ని లక్షలు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నప్పుడు.. కేవలం కొద్ది మంది బ్రోకర్లు ఏళ్ల తరబడి వందలు, వేల కోట్ల మేర లబ్ధి పొంది ఉంటారు‘ అని ఒక అధికారి వివరించారు. అక్రమ సంపాదన ఇటీవల బైటపడిన కొన్ని అంశాలను బట్టి ఉన్నత స్థానం లోని కొందరు.. ట్రేడింగ్ స్లాట్ల కేటాయింపులో కొంత మందికి ప్రాధాన్యమివ్వడం ద్వారా దశాబ్ద కాలంగా అక్రమంగా భారీ మొత్తం కూడబెట్టుకుని ఉంటారన్న అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి 2009–2016 కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించనున్నట్లు వివరించారు. చదవండి: చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..! -
యోగి సత్యం! మెయిల్ మిథ్య?
national stock exchange Scam: చిత్రా రామకృష్ణ... ఇప్పుడు ఇంటర్నెట్లో అత్యధికులు వివరాలు వెతుకుతున్న పేరు ఇది. దేశవ్యాప్తంగా ఆమె ఇప్పుడు అంత సంచలనం మరి! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కి సారథ్యం వహించిన ఓ మనిషి గుర్తుతెలియని ఓ ‘యోగి’ పుంగవుడి ‘మార్గదర్శకత్వం’లో నిర్ణయాలు తీసుకున్నానంటూ చెబితే సంచలనం కాక మరేమవుతుంది! ఎవరి సలహానో, ఏమి సాన్నిహిత్యమో కానీ ‘ఎన్ఎస్ఈ’కి ముక్కూమొహం తెలియని ఆనంద్ సుబ్రమణియన్ అనే వ్యక్తిని తనకు వ్యూహాత్మక సలహాదారుగా, గత జీతం కన్నా పది రెట్లు ఎక్కువకు తీసుకురావడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏ విషయంలోనూ అంత పట్టు, గ్రహణశక్తి లేని సదరు ఆనంద్ జీతం ఆ పైన మూడు రెట్లు పెరిగి, రూ. 4 కోట్లు ఎలా పెరిగింది? ‘ఎన్ఎస్ఈ’లో జరిగిన గోల్‌మాల్‌పై సెక్యూరి టీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఆదాయపన్ను శాఖ సహా పలు సంస్థలు చేస్తున్న దర్యాప్తుతో డొంకంతా కదులుతోంది. ఆరేళ్ళ క్రితపు చిత్ర ఇ–మెయిల్స్‌ను ‘సెబీ’ తాజాగా బయట పెట్టడంతో ఇన్వెస్టర్లే కాదు... ఇండియా మొత్తం నివ్వెరపోతోంది. అత్యున్నత పదవుల్లోని మేధావులు సైతం మానసిక ప్రశాంతత కోసమో, మరిదేనికో తమకు నచ్చిన ‘గురువు’లనో, ‘గాడ్మన్’లనో ఆశ్రయించడం చరిత్రలో చూస్తున్నదే. అమెరికా లాంటి చోట్లా ప్రఖ్యాత సీఈఓలకూ ఆ ఘన చరిత్ర ఉంది. ప్రఖ్యాత యాపిల్ సంస్థ సహ–వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కూడా ఒక దశలో ఓ భారతీయ గురువు ప్రభావంలో గడిపారు. అయితే, అలాంటి వారి మధ్య ఆ సాన్నిహిత్య వేళ సాగిన సంభాషణలు ఇప్పుడు బయటకొస్తే విచిత్రంగానే అనిపిస్తాయి. చిత్ర ఇప్పుడు ఆ జాబితాకు ఎక్కారు. కాకపోతే, హిమాలయాల్లో సంచరించే నిరాకారుడైన సిద్ధ పురుషుడని ఆమె చెబుతున్న వ్యక్తికి ఇ–మెయిల్ అడ్రస్ ఉండడం, ఆమె కేశశైలి నుంచి అందం, ఆహార్యాలను ఆయన ప్రత్యేకంగా అభినందించడం, ఐహిక బంధం ఉండని ఆ వ్యక్తి ఆమెతో కలసి సేషెల్స్‌కు సేదతీరదామనడం, అతి గోప్యంగా ఉండాల్సిన కార్పొరేట్ సమాచారాన్నీ, సమావేశాల అజెండానూ, పంచవర్ష పురోగమన ప్రణాళికలనూ ఆయనకు ఆమె అందించడమే చిత్రాతిచిత్రం! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)ను బలంగా నిలబెట్టిన కీలక సభ్యుల్లో ఒకరూ, సాక్షాత్తూ మాజీ సీఈఓ అయిన ఒక వ్యక్తి ఇలాంటి పని చేయడం అంతుపట్టని విషయమే. ‘ఎన్ఎస్ఈ’ని స్థాపించిన 1992 నాటికి చిత్ర ఓ యువ ఛార్టెర్డ్ ఎకౌంటెంట్. ఐడీబీఐలో పనిచేస్తున్న ఆమె తెలివితేటలకు ముచ్చటపడి, ‘ఎన్ఎస్ఈ’కి ఎంపిక చేసిన అయిదుగురి కీలక సభ్యుల్లో ఒకరిగా తీసుకున్నారు. అక్కడ నుంచి ఆమె పురోగతి అనూహ్యం. సరిగ్గా రెండు దశాబ్దాలలో 2013 ఏప్రిల్ నాటికల్లా ‘ఎన్ఎస్ఈ’కి మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ అయ్యారు. తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందిన చిత్రకు దైవభక్తి, అంతకు మించి అనేక నమ్మకాలు. గత రెండు దశాబ్దాల తన ప్రగతి, ‘ఎన్ఎస్ఈ’ పురోగతికి సదరు అభౌతిక ‘యోగి’ సలహాలే కారణమని ఆమె భావన. వ్యక్తిగత నమ్మకాల మాటెలా ఉన్నా, గోప్యంగా ఉంచాల్సిన కార్పొరేట్ సమాచారాన్ని ఆమె తన గుర్తు తెలియని ‘మార్గదర్శకుడి’కి అన్నేళ్ళుగా ఇ–మెయిల్స్ ద్వారా ఎలా చేరవేస్తున్నారన్నది ప్రశ్న. అసలప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందనేది అర్థం కాని విషయం. ఆనంద్ సహా ఆ యోగి ఎవరై ఉంటారన్నది ఆసక్తికరం. ఆమె నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లకూ, రిటైల్ మదుపరులకూ ఎంత భారీయెత్తున నష్టం వాటిల్లి ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, ఈ వ్యవహారాన్ని ఆధ్యాత్మికతగా కన్నా ఆర్థిక మోసంగానే అత్యధికులు భావిస్తున్నారు. దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైన ఏడాదికే 1992 ఏప్రిల్‌లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం బయటపడింది. సాంకేతికత, పారదర్శకత నిండిన ఆధునిక స్టాక్ ఎక్స్ఛేంజ్ అవసర మని అప్పట్లో సర్కారు గుర్తించడంతో ‘ఎన్ఎస్ఈ’ ఆవిర్భవించింది. తీరా అక్కడా అనేక అక్రమాలే నని ఇప్పుడు తేలింది. ఆధునిక భారతావనికి ప్రతీకగా, ప్రపంచంలోని అతి పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ లలో ఒకదానికి మూడున్నరేళ్ళు సారథ్యం వహించిన మహిళాశక్తిగా నీరాజనాలు అందు కున్న చిత్ర ఇలా అట్టడుగుకు జారిపోవడం విషాదమే. స్టాక్ బ్రోకర్లైన కొందరికి అనుచిత సాయం చేశారంటూ వచ్చిన ఆరోపణలతో 2016 డిసెంబర్లో ఆమె తన పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే ఆమె తప్పులు, అక్రమాల గురించి తెలిసినా సరే, ‘ఎన్ఎస్ఈ’ బోర్డు నోరు విప్పలేదు. సెబీకి చెప్పలేదు. ప్రశంసిస్తూనే, సాగనంపింది. అందుకు హేతువేమిటో అర్థం కాదు. కరోనా తర్వాత మార్కెట్ పుంజుకుంటోదని భావిస్తున్న వేళ ఈ కథ ఇప్పుడే ఎందుకు బయటకొచ్చిందో తెలీదు. అవినీతి, అక్రమాలు, కార్పొరేట్ నిర్వహణలో తప్పులు, అంతుచిక్కని అనుబంధాలతో కూడిన చిత్ర ఉదంతం అచ్చంగా ఓ వెబ్‌సిరీస్. ఇంత జరుగుతుంటే, స్టాక్ ఎక్స్ఛేంజ్ను నియంత్రించాల్సిన ‘సెబీ’ కుంభకర్ణ నిద్ర పోతోందా? ఈ కథలో చిత్ర అమాయకంగా ఎవరి చేతిలోనో మోసపోయారా, లేక ఆర్థిక అక్రమాల బృహత్ప్రణాళికలో ఆమె కూడా ఓ భాగమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియాలి. ఇప్పటికైనా ‘ఎన్ఎస్ఈ’లో ఏం జరిగిందో లోతుగా దర్యాప్తు చేయాలి. ఈ వ్యవస్థాగత వైఫల్యంలో తెర వెనుక బండారాన్ని బయటకు తీయాలి. నమ్మకంతో కోట్లాది రూపాయలు విపణిలో పెట్టే అమాయక మదుపరుల ఆర్థిక క్షేమంపై అనుమానాలు ప్రబలుతున్న వేళ అది అత్యంత కీలకం. విచిత్ర మానసిక స్థితితో ‘యోగి సత్యం... మెయిల్ మిథ్య’ అని కూర్చుంటేనే కష్టం! -
మదుపరుల అనుమతి లేకుండా సుమారు రూ.1000 కోట్లు కాజేశాడు!...అనుగ్రహ్’ కేసులో ఎన్ఎస్ఈ సీఈఓ
సాక్షి, హైదరాబాద్: మదుపరుల డీ–మ్యాట్ ఖాతాల్లోని షేర్లను వారి అనుమతి లేకుండా ట్రేడింగ్ చేసి, ఆ మొత్తాలు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుగ్రహ్ స్టాండ్ అండ్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ అక్రమాల విషయం తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు (ఎన్ఎస్ఈ) చెందిన కీలక వ్యక్తులనూ నిందితులుగా చేర్చారు. దాని మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ లిమయేతో పాటు చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ప్రియ సుబ్బరామన్ ఈ జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అనుగ్రహ్ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్తో (ఎన్ఎస్ఈ) పాటు ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో క్లైంట్కు సంబంధించిన షేర్లతో పాటు కొంత నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుంటూ అనేక మంది మదుపరులు రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని మరిన్ని షేర్లు ఖరీదు చేయడానికి వినియోగిస్తుంటారు. దీనిని తనకు అనువుగా మార్చుకున్న అనుగ్రహ్ డైరెక్టర్ పరేష్ ముల్జీ కరియా మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఇలా దాదాపు రూ.1000 కోట్ల మేర మదుపరుల సొమ్ము కాజేశాడు. ఈ పంథాలో నగరంలోని చిక్కడపల్లికి చెందిన కంపెనీ సెక్రటరీ టి.రవిప్రకాష్ రూ.1,87,47,493 నష్టపోయారు. ఈయన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు బుధవారం అనుగ్రహ్‌పై కేసు నమోదు చేశారు. అనుగ్రహ్ సంస్థ వద్ద ఉండాల్సిన మదుపరుల షేర్లతో భారీ తగ్గుదల ఉన్నట్లు ఎన్ఎస్సీతో పాటు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌కు (సీడీఎస్ఎల్) ముందే తెలుసని రవి ప్రకాష్ ఆరోపించారు. సెబీ ఆధీనంలో పని చేసే సీడీఎస్ఎల్తో పాటు ఎన్ఎస్ఈ సైతం ఈ విషయాన్ని పట్టించుకోకుండా అనుగ్రహ్‌కు పరోక్షంగా సహకరించినట్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని సెబీ గతేడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 2017–18 నాటికే అనుగ్రహ్ వద్ద ఉండాల్సిన మదుపరుల షేర్లకు సంబంధించి రూ.112 కోట్లు గోల్మాల్ అయ్యాయని తెలిసినప్పటికీ ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్ 2020 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సెబీ స్పష్టం చేసినట్లు రవి ప్రకాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎడిల్వైజ్ కస్టోడియన్ సర్వీసెస్ లిమిటెడ్‌కు పాత్ర ఉందని ఆరోపించారు. ఈయన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు అనుగ్రహ్‌పై నమోదు చేసిన కేసులో ఆ సంస్థతో పాటు దాని యజమాని పరేష్, దీంతో సంబంధం కలిగి ఉన్న తేజిమండి.కామ్ వెబ్సైట్ యజమాని అనిల్ గాంధీ, ఎన్ఎస్ఈ, దీని సీఈఓ, ఎండీగా ఉన్న విక్రమ్ లిమయే, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ ప్రియ సుబ్బరామన్, ఎడిల్వైజ్ కస్టోడియన్ సర్వీసెస్ లిమిటెడ్, సీడీఎస్‌ఎల్‌లను నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘రవి ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఈ కేసు నమోదు చేశాం. దాని ప్రకారమే నిందితుల జాబితా రూపొందించాం. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. -
మిడ్క్యాప్స్లోనూ డెరివేటివ్స్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ స్టాక్స్‌లోనూ డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నెల 24 నుంచీ నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లో కాంట్రాక్టులను అనుమతించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందినట్లు పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ నుంచి ఎంపిక చేసిన 25 స్టాక్స్తోకూడిన పోర్ట్‌ఫోలియోను నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ట్రాక్ చేస్తుందని వివరించింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన స్టాక్స్‌లోనూ విడిగా డెరివేటివ్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. ఒక్కో స్టాక్‌కు ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్ధతిలో వెయిటేజీ ఉంటుందని వివరించింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో భాగంగా నెలవారీ గడువు కాంట్రాక్టును మినహాయించి వారం రోజుల్లో గడువు ముగిసే(వీక్లీ) కాంట్రాక్టులతోపాటు, మరో మూడు నెలవారీ సీరియల్ కాంట్రాక్టులకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. లార్జ్ క్యాప్స్‌లో..: ప్రస్తుతం ఇండెక్స్ డెరివేటివ్స్ ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లేదా రంగాల ఆధారంగా ఎంపిక చేసిన కౌంటర్లలో అందుబాటులో ఉన్నట్లు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీ విక్రమ్ లిమాయే ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మిడ్‌క్యాప్స్ 17 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియో రిస్కును తగ్గించుకునే బాటలో నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లో డెరివేటివ్స్ అదనపు హెడ్జింగ్ టూల్‌గా వినియోగపడతాయని వివరించారు. ఇటీవల మార్కెట్ ర్యాలీలో విభిన్నతరహా ఇన్వెస్టర్ల నుంచి మిడ్‌క్యాప్‌లో లావాదేవీలు పెరగడం, లిక్విడిటీ పుంజుకోవడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ఏడాదిలో 39% వృద్ధి చూపడం గమనార్హం! -
మూడేళ్లలో రెట్టింపైన డీమ్యాట్ ఖాతాలు
ముంబై: డీమ్యాట్ ఖాతాలు 2019 మార్చి నుంచి 2021 నాటికి రెట్టింపైనట్టు సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి చెప్పారు. 2019 మార్చి నాటికి 3.6 కోట్లుగా ఉన్న ఖాతాలు 2021 నవంబర్ నాటికి 7.7 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. నిఫ్టీ ఇండెక్స్ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్యాగి మాట్లాడారు. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ధోరణుల మాదిరే భారత్‌లోనూ వ్యక్తిగత ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లలోకి రావడం గణనీయంగా పెరిగింది. 2019–20లో సగటున ప్రతీ నెలా 4 లక్షల చొప్పున డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021లో ఇది ప్రతీ నెలా 20 లక్షలకు పెరిగింది. 2021 నవంబర్‌లో ఇది 29 లక్షలకు చేరుకుంది’’అని వివరించారు. చక్కగా రూపొందించిన ఇండెక్స్ మార్కెట్ పనితీరును అంచనా వేయడంతోపాటు, పెట్టుబడులకు పోర్ట్ఫోలి యో మాదిరిగా పనిచేస్తుందన్నారు. -
NSE INDIA : మహీంద్రా గ్రూప్ సిల్వర్ జూబ్లీ
దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా అనేక రికార్డులు సృష్టిస్తున్న మహీంద్రా గ్రూపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో అడుగు పెట్టి నేటికి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. దేశంలో రెండో స్టాక్ ఎక్సేంజీగా వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో సైతం మహీంద్రా తనదైన ముద్రను వేసింది. 1996 జనవరి 3న ఎన్ఎస్ఈలో మహీంద్రా లిస్టయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఈ ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీకి జీపులు తయారు చేసే కంపెనీగా మార్కెట్లోకి అడుగు పెట్టిన మహీంద్రా అండ్ మహ్మద్ కంపెనీ ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాగా మారింది. గత 75 ఏళ్లలో మహీంద్రా గ్రూపు ఎన్నో విజయాలు సాధించింది. వాహనాల తయారీ నుంచి బ్యాంకింగ్ సెక్టార్ వరకు అనేక రంగంలో పాదం మోపి విజయం సాధించింది. Hearty congratulations from all of us at NSE to Mahindra & Mahindra Ltd. One of India's leading automobile companies on completing 25 years of being listed on the NSE. #ThisDayThatYear #NSE #NSEIndia pic.twitter.com/mK2kGN9qw6 — NSEIndia (@NSEIndia) January 3, 2022 -
Paytm ఢమాల్.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్
Paytm Shares Downfall Continue: ఇండియన్ మార్కెట్లో పేటీఎం అట్టర్‌ప్లాప్ షో కొనసాగుతోంది. వరుసగా మూడు రోజుల సెలవు తర్వాత సోమవారం మొదలైన మార్కెట్లో పేటీఎం షేర్ల విలువ పతనాన్నే చవిచూస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పేటీఎం మాతృక సంస్థ వన్97 one97 కమ్యూనికేషన్ షేర్ల విలువ 14 శాతం పతనంతో రూ.1,348.30 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఐపీఓ ఇష్యూ ప్రైస్‌తో(రూ.2,150) పోలిస్తే 36 శాతం పతనానికి గురైంది. ఇన్వెస్టర్ల 63 వేల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఈ కుదేలుతో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సంపద భారీగా పతనం అయ్యింది. సుమారు 1.5 బిలియన్ డాలర్లు(పదివేల కోట్ల రూపాయలకు పైగా) సంపద కరిగిపోయనట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా 2.5 బిలియన్ డాలర్లకు చేరిన శర్మ సంపద.. సోమవారం ఉదయం నాటికి 781 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక పేటీఎంలో 9.1 శాతం వాటా కలిగి ఉన్న శర్మ.. ఆరుకోట్ల ఈక్విటీ షేర్లు, 2.1 కోట్ల ఆప్షన్స్ కలిగి ఉన్నారు. భారత్‌లోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. అయితే ఐపీవో ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్లో లక్షా ఐదువేల కోట్లతో నిలిచిన పేటీఎం.. పతనం దిశగా వెళ్తూ సోమవారం నాటికి 87 వేల కోట్లకు చేరుకుంది. ఇక ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు(గురువారం 18 నవంబర్, 2021) లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. VIDEO: ఒక్కసారిగా కన్నీళ్లు కార్చిన విజయ్ శేఖర్ శర్మ! -
రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్ ఇష్యూ!
దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీ ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై తాజాగా తీసుకున్న న్యాయ సలహాలు ఎన్ఎస్ఈ ఆఫర్ జారీకి అనుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఆల్గో ట్రేడింగ్ కుంభకోణం నేపథ్యంలో సెబీ ఇందుకు విముఖత చూపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లీడర్‌గా నిలుస్తున్న నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూకి భారీ స్థాయిలో స్పందన లభించనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. NSE Likely to Get Clearance from SEBI for Big Ticket IPO: నేషనల్ స్టాక్ ఎక్సే్ంజీ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఆల్గోరిథమ్ ట్రేడింగ్ స్కామ్ నేపథ్యంలో రెడ్‌సిగ్నల్ ఇచ్చిన సెబీ తాజాగా న్యాయపరమైన అంశాలను తీసుకుని, ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి ఎన్ఎస్ఈకి సెబీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా త్వరలో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఇప్పటికే అనధికార(గ్రే) మార్కెట్లో ఎన్ఎస్ఈ షేరు రూ.3,000–4,000 శ్రేణిలో కదులుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అతిపెద్ద ఇష్యూ ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో దాదాపు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించే వీలుంది. ఐపీవో ద్వారా ఎన్ఎస్ఈ రూ. 2 లక్షల కోట్ల విలువను సాధించవచ్చని అంచనా. నిజానికి 2016 డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా ఎన్ఎస్ఈ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. అయితే తదుపరి ఆల్గో ట్రేడింగ్ మోసం బయటపడటంతో సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అజయ్ త్యాగి ఎన్ఎస్ఈ ఐపీవోకు చెక్ పెట్టారు. ఎక్సే్ంజీ సహలొకేషన్ల సర్వర్ల ద్వారా డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణల నేపపథ్యంలో సెబీ దర్యప్తుకు సైతం ఆదేశించింది. సెబీ చర్యలు ఆల్గో స్కామ్ నేపథ్యంలో 2019 మే నెలలో సెబీ రూ.1,000 కోట్లు చెల్లించమంటూ ఎన్ఎస్ఈని ఆదేశించింది. అంతేకాకుండా ఎక్సే్ంజీ సీనియర్ అధికారులపై కేసులు నమోదు చేసింది. కాగా.. ప్రస్తుతం ఈ కేసు కోర్టుల పరిధిలో ఉన్నప్పటికీ సెబీ తాజాగా న్యాయ సలహా పొందినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో వాటా విక్రయానికి కోర్టు అభ్యంతరం చెప్పకపోవడంతో తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా ఎన్ఎస్ఈను సెబీ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు కేసులు నమోదైన అధికారులను ఎక్సే్ంజీ నుంచి తొలగించడం సానుకూల అంశంగా నిలవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. సెబీ రూ.1,000 కోట్ల జరిమానా విధింపుపై ఎన్ఎస్ఈ శాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీఎస్ఈతో పోలిస్తే ఇప్పటికే లిస్టింగ్‌ను సాధించిన మరో స్టాక్ ఎక్సే్ంజీ దిగ్గజం బీఎస్ఈ గత 12 నెలల ఆర్జనను పరిగణిస్తే 38 పీఈ (నిష్పత్తి)లో ట్రేడవుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అతిభారీ ప్రయివేట్ డీల్స్ నమోదయ్యే ఎన్ఎస్ఈ విలువ 80–100 స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవో ధరల శ్రేణి సైతం ప్రీమియంలో నిర్ణయంకావచ్చని భావిస్తున్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్‌లో దాదాపు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న కారణంగా ఎన్ఎస్ఈ 80 శాతం ఇబిటా మార్జిన్లు సాధిస్తున్నట్లు చెబుతున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2021 మార్చికల్లా ఎన్ఎస్ఈ నిర్వహణ ఆదాయంలో 60 శాతం వృద్ధిని సాధించింది. రూ. 5,625 కోట్లను ఆర్జించింది. నికర లాభం సైతం 89 శాతం జంప్‌చేసి రూ. 3,574 కోట్లను తాకింది. అయితే గతేడాది అనుబంధ సంస్థ క్యామ్స్(సీఏఎంఎస్)లో వాటా విక్రయం ద్వారా పొందిన ఆదాయం నికర లాభాల్లో కలసి ఉన్న విషయం గమనార్హం! చదవండి:కొనసాగుతున్న ఐపీవోల సందడి -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!