
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీ ఎన్‌ఎస్‌ఈ వచ్చే నెల నుంచి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబర్ ఒకటిన ముడి సోయాబీన్ ఆయిల్ కాంట్రాక్టుతో తమ తొలి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టును ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. సోయాబీన్ ఆయిల్ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమల సంస్థలు .. ధరలను హెడ్జ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. లాట్ పరిమాణం 10 మెట్రిక్ టన్నులుగాను, కాంట్రాక్టు సెటిల్మెంట్ నెలవారీగాను ఉంటుందని తెలిపింది. దేశీ కమోడిటీ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment