Stock Exchange
-
ఆరేళ్లలో ఈ2ఈ షేర్ ప్రభంజనం: రూ. 57 నుంచి రూ.5000కు!
స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చిన్న కంపెనీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్ఫామ్లో లిస్టయిన కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. తాజాగా డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ పెట్టుబడుల రూపంలో 21 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. అయితే అతిచిన్న కంపెనీగా ప్రారంభమైన ఈ షేరు ప్రస్తుతం మిడ్‌క్యాప్ స్థాయికి చేరుకోవడం విశేషం!ప్రస్థానమిలా..2018 మే 15న ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో షేరుకి రూ. 57 ధరలో ఐపీవోకు వచ్చిన కంపెనీ ఈ2ఈ నెట్వర్క్స్. తాజాగా ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 4,978 వద్ద ముగిసింది. వెరసి వరుసగా ఏడో రోజు అప్పర్ సర్క్యూట్ వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ. 8,404 కోట్లకు చేరింది. గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. గత నెల రోజుల్లో చూస్తే 70 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 3 శాతం నీరసించడం గమనార్హం!ఇటీవల ధూమ్‌ధామ్ గత 9 వారాలను పరిగణిస్తే అంటే సెపె్టంబర్ 2నుంచి ఈ2ఈ షేరు రూ. 2,332 నుంచి 113 శాతం ఎగసింది. నిజానికి 2024 జనవరి నుంచి 621 శాతం దూసుకెళ్లింది. ఈ సమయంలో నిఫ్టీ 10 శాతం మాత్రమే బలపడింది. ఇక 2023 ఆగస్ట్ 4న రూ. 285 వద్ద కదిలిన ఈ షేరు గత 15 నెలల్లో 17 రెట్లు లేదా 1,644 శాతం పురోగమించింది. కాగా.. 2024 సెపె్టంబర్30న సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా 1.05 శాతం వాటాకు సమానమైన 1,77,043 షేర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ2ఈ కంపెనీ షేరు మెయిన్‌బోర్డ్‌లో ట్రేడవుతోంది.కంపెనీ ఏం చేస్తుందంటే?ఈ2ఈ నెట్వర్క్స్ సీపీయూ, జీపీయూ ఆధారిత క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తద్వారా కస్టమర్లకు భారీస్థాయి జనరల్ అండ్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను నిర్వహించడంలో సహకారమందిస్తుంది. చిప్ దిగ్గజం ఎన్విడియా సాంకేతిక సహకారం ఇందుకు కంపెనీకి తోడ్పాటునిస్తోంది. ఈ బాటలో చిప్ తయారీ దిగ్గజాలు ఎన్విడియా, ఇంటెల్, ఏఎండీసహా హెచ్‌పీఈ, మైక్రోసాఫ్ట్, డెల్‌తో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఓపెన్‌సోర్స్ టెక్నాలజీ ద్వారా ప్రొప్రయిటరీ వర్చువలైజేషన్, క్లౌడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్(ఐపీ) అభివృద్ధి చేస్తోంది. -
ట్యాప్ సిస్టమ్ కేసుకు రూ.643 కోట్ల పరిష్కారం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), దాని మాజీ చీఫ్ విక్రమ్ లిమాయే, ఇతర ఎనిమిది మంది శుక్రవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో ఒక కీలక కేసును పరిష్కరించుకున్నారు. టీఏపీ– ట్యాప్ (ట్రేడింగ్ యాక్సెస్ పాయింట్) సిస్టమ్ లోపాలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలకు సంబంధించిన కేసును రూ. 643 కోట్ల చెల్లింపుల ద్వారా పరిష్కరించుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సెటిల్మెంట్కు సంబంధించి ఇది అత్యధిక మొత్తమే కాకుండా, కో–లొకేషన్ సమస్యతో ఇప్పటికే ఆలస్యం అయిన ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)వేగవంతానికి ఈ చర్య దోహదపడనుంది.‘‘ఆరోపణలను అంగీకరించడం లేదా తిరస్కరించడం లేదా చట్ట ద్వారా పరిష్కరించుకోవడంతో సంబంధం లేకుండా ఒక పరిష్కార ఉత్తర్వు ద్వారా ఈ సమస్య పరిష్కారం అయినట్లు’’ అధికార వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్ఈ, లిమాయేసహా సెబీతో కేసును పరిష్కరించుకున్న వారిలో ఉమేష్ జైన్ జీ, ఎం. షెనాయ్, నారాయణ్ నీలకంఠన్, వీఆర్ నరసింహన్, కమల కే, నీలేష్ తినాయకర్, ఆర్ నందకుమార్, మయూర్ సింధ్వాద్ ఉన్నారు. అసలు ట్యాప్ కేసు ఏమిటి? ట్రేడింగ్ సభ్యులు– ఎన్ఎస్ఈ ట్రేడింగ్ సిస్టమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ట్యాప్ వ్యవస్థను 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో భద్రతా లోపాలు, మెరుగుదలలో జాప్యాలు, ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోకపోవడంలో ఆలస్యం వంటి అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థలను ప్రవేశపెట్టినప్పటికీ, ట్యాప్‌ను ఈక్విటీల కోసం 2019 వరకు, ఇతర విభాగాల కోసం 2020 వరకు వినియోగించడం జరిగింది. దీనిపై సెబీ విచారణ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ‘‘2023 ఫిబ్రవరి 28 నాటి ఎన్సీఎన్ (షోకాజ్ నోటీసు) ద్వారా దరఖాస్తుదారులకు వ్యతిరేకంగా ప్రారంభించిన చర్యలను పూర్తిగా నిలుపుచేయడం జరిగింది’’ అని సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
త్వరలో సింగిల్ ఫైలింగ్
ముంబై: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి సింగిల్ ఫైలింగ్ ప్రతిపాదన త్వరలోనే అమల్లోకి రాగలదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ వెల్లడించారు. దీనితో, లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలు తాము వెల్లడించాల్సిన సమాచారాన్ని ఒక ఎక్సే్చంజీలో ఫైలింగ్ చేస్తే రెండో ఎక్సే్చంజీలో కూడా అది ఆటోమేటిక్‌గా అప్లోడ్ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఫైనాన్సింగ్ 3.0 సదస్సులో ప్రత్యేక ప్లీనరీ సెషన్లో పాల్గొన్న సందర్భంగా మాధవి ఈ విషయాలు తెలిపారు. సెబీ మాజీ హోల్‌టైమ్ సభ్యుడు ఎస్కే మొహంతి సారథ్యంలోని కమిటీ ఈ సిఫార్సులు చేసింది. మరోవైపు, నెలకు అత్యంత తక్కువగా రూ. 250 నుంచి ప్రారంభమయ్యే సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రతిపాదన కూడా త్వరలో సాకారం కాగలదని కాగలదని మాధవి వివరించారు. అన్ని ఆర్థిక సాధనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక పరిణామం కాగలదని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ఐపీవో పత్రాలు..: భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు, ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పత్రాలను బహుళ భాషల్లో అందుబాటులోకి తేవాలన్న నిబంధనను కూడా ప్రవేశపెట్టే యోచన ఉందని మాధవి చెప్పారు. మరింత మంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో పాలుపంచుకునేందుకు ఐపీవో ప్రాస్పెక్టస్ 15–16 ప్రాంతీయ భాష ల్లో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇన్వెస్టరు తీరుకు అనుగుణమైన వివిధ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సాధనాలను ప్రవేశపెట్టడంపై పరిశ్రమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు.‘హోల్డ్’లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ‘ఆఫర్’జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తును సెబీ ‘హోల్డ్’లో పెట్టింది. ‘పరిశీలన జారీ చేశాం. దీంతో నిలుపుదల చేశాం’అని సెబీ పేర్కొంది. కారణాలను తెలియజేయలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 16న ఐపీవో పత్రాలను సెబీకి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సమరి్పంచడం గమనార్హం. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం.. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్‌లోని నాగౌర్‌లో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 19 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం (ఎంటీపీఏ) ఉండగా.. 60 ఎంటీపీఏ చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవోకు ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్: వీఎఫ్ఎక్స్ సేవల కంపెనీ ‘ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్’ ఐపీవోకి రావాలనుకుంటోంది. ఎన్ఎస్ ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌పై (సూక్ష్మ కంపెనీలకు ఉద్దేశించిన) లిస్ట్ అయ్యేందుకు వీలుగా పత్రాలు సమరి్పంచింది. ఐపీవోలో భాగంగా 36.94 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. సమీకరించే నిధులతో ముంబైలోని అంధేరిలో ఉన్న స్టూడియో, ఆఫీస్ నవీకరణ, అంధేరిలోనే కొత్త శాఖలో సౌండ్ స్టూడియో సెటప్ ఏర్పాటుకు వినియోగించనుంది. లక్నోలో నూతన బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలకు కావాల్సిన వీఎఫ్ఎక్స్ సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.20 కోట్ల ఆదాయంపై, రూ.5.34 కోట్ల లాభాన్ని ప్రకటించింది.ఐపీవో షేర్లు.. వారంలోనే విక్రయం!లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది స్వల్పకాల దృష్టితోనే వస్తున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. ఐపీవోలో తమకు కేటాయించిన షేర్లలో 54 శాతం మేర (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయిస్తున్నారు. ఐపీవో ధరతో పోలి్చతే లాభాలతో లిస్టింగ్ అయ్యేవి ఎక్కువ ఉంటుండగా, కొన్ని నష్టాలతో లిస్ట్ కావడం లేదా లిస్ట్ అయిన వెంటనే నష్టాల్లోకి వెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. అయితే, నష్టాలతో లిస్ట్ అయిన వాటి కంటే, లాభాలతో లిస్ట్ అయిన వాటిని విక్రయించే స్వభావం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఐపీవోలలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రిటైల్ కోటా సైతం పదులు, వందల సంఖ్యలో అధిక సబ్‌్రస్కిప్షన్లను అందుకుంటోంది. దీంతో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్ల ధోరణి తెలుసుకునేందుకు సెబీ లోతైన అధ్యయనం నిర్వహించింది. 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో 144 ఐపీవోలకు సంబంధించిన డేటాను విశ్లేíÙంచింది. యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగిలిన ఇన్వెస్టర్లు 54 శాతం మేర షేర్లను (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయించారు. ఇందులో 50.2 శాతం షేర్లు వ్యక్తిగత ఇన్వెస్టర్లకు చెందినవి కాగా, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం 63.3 శాతం షేర్లను వారంలోనే విక్రయించారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 42.7 శాతం షేర్లను లిస్ట్ అయిన వారంలోపే విక్రయించి లాభాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీవోల్లో పాల్గొన్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు 70 శాతం మేర తమకు కేటాయించిన షేర్లను ఏడాదిలోపు విక్రయించినట్టు సెబీ అధ్యయనంలో తెలిసింది. -
మార్కెట్‌కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
లిస్టెడ్ కంపెనీగానే ఇండియా సిమెంట్స్
న్యూఢిల్లీ: దక్షిణాదిన కార్యకలాపాలు విస్తరించిన ఇండియా సిమెంట్స్(ఐసీఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుందని అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా పేర్కొంది. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదని ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం తెలియజేసింది. వారాంతాన ఐసీఎల్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించిన నేపథ్యంలో లిస్టింగ్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. డీల్ విలువ రూ.3,954 కోట్లుకాగా.. ఇప్పటికే ఐసీఎల్‌లో 23 శాతం వాటా కలిగిన అల్ట్రాటెక్ దీంతో నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ.390 ధరలో 8.05 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు అల్ట్రాటెక్ రూ.3,142 కోట్లకుపైగా వెచ్చించనుంది. అయితే ఐపీఎల్ క్రికెట్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) యాజమాన్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఐసీఎల్ ప్రమోటర్ ఎన్.శ్రీనివాసన్, కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అల్ట్రాటెక్ తరఫున ఓపెన్ ఆఫర్‌ను చేపట్టిన యాక్సిస్ క్యాపిటల్.. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదన్న విషయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. పూర్తిస్థాయిలో ఓపెన్ ఆఫర్ విజయవంతమైతే ఐసీఎల్‌లో అ్రల్టాటెక్ వాటా 81.49 శాతానికి చేరే వీలుంది! బీఎస్ఈలో ఐసీఎల్ షేరు 0.7 శాతం నీరసించి రూ. 372 వద్ద ముగిసింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 4.6 శాతం డిస్కౌంట్. -
క్యూ1లో వేదాంతా దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా గ్రూప్ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇటీవల దూకుడు చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 28– జూన్ 20 మధ్య గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 2.2 లక్షల కోట్లు ఎగసింది. వెరసి మార్కెట్ విలువ వృద్ధి వేగంలో డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం, కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లను సైతం అధిగమించింది. ఈ కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువకు రూ. 1.4 లక్షల కోట్లు చొప్పున జమయ్యింది. వేదాంతా గ్రూప్‌లోని హిందుస్తాన్ జింక్ షేరు ధర 52 వారాల కనిష్టం నుంచి రెట్టింపైంది. ఇందుకు విడదీత ప్రతిపాదన, రుణభార తగ్గింపుపై యాజమాన్య దృష్టి, మెరుగైన పనితీరు వంటి పలు సానుకూలతలు తోడ్పాటునిచ్చాయి. ఇక ఈ కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 60,600 కోట్లమేర బలపడగా.. ఆర్ఐఎల్ విలువ రూ. 20,656 కోట్లమేర క్షీణించింది. రికార్డ్ రెవెన్యూ గతేడాది(2023–24) వేదాంతా గ్రూప్ రూ. 1,41,793 కోట్ల ఆదాయం సాధించింది. గ్రూప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధికంకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 36,455 కోట్లను తాకింది. 30 శాతం ఇబిటా మార్జిన్లను అందుకుంది. సమీప కాలంలో 10 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించేందుకు వేదాంతా గ్రూప్ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు వీలుగా జింక్, అల్యూమినియం, చమురు–గ్యాస్, విద్యుత్ తదితర బిజినెస్‌ల 50 ప్రభావవంత ప్రాజెక్టులను సమయానుగుణంగా పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం గ్రూప్‌పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.03 శాతం పెరిగి 8.77 శాతానికి చేరింది. దీంతో గత నెల 22న వేదాంతా షేరు రూ. 507 వద్ద, హింద్ జింక్ షేరు రూ. 807 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. బీఎస్ఈలో గురువారం వేదాంతా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 470ను అధిగమించగా.. హింద్ జింక్ షేరు 2.3 శాతం బలపడి రూ. 648 వద్ద ముగిసింది. -
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
సౌదీ అరేబియా స్టాక్ ఎక్స్ఛేంజ్ హెడ్‌గా సారా! ఎవరీమె.?
సౌదీ అరేబియాలో మహిళల పట్ల ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట ఇటీవల పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకు కారణం ఆ దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ అని చెప్పొచ్చు. ఇటీవల ఆయన హాయాంలోనే సంచలన నిర్ణయాలు ఎక్కువుగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సౌదీ దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. వాటన్నింటకంటే మునుపే ఓ మహిళ సౌదీ అతి పెద్ద స్థాక్ మార్కెట్‌కి చైర్మన్ అయ్యి సంచలనానికి తెరతీసింది. ఏకంగా యావత్తు ప్రపంచం ఆమె విజయాన్ని చూసి విస్తుపోయింది. ఇంతకీ ఎవరీమె అంటే.. 44 ఏళ్ల సారా అల్-సుహైమి సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా అత్యున్నత పదవిని అలంకరించిన తొలి సౌదీ మహిళగా చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఆర్థిక ప్రపంచంలో రికార్డు సృష్టించింది. ఆమెను చూస్తే.. సౌదీ కార్యాలయాల్లో మహిళల పాత్రలు దినదినాభివృద్ధి చెందుతున్నాయోమో! అనిపిస్తుంది. ఇక ఆమె ఎడ్యుకేషన్ పరంగా..సౌద్ విశ్వవిద్యాలయంలో అకౌంటింగ్ ప్రోగ్రామ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఆమె బ్యాంకింగ్ కుటుంబానికి చెందినది. ఎందుకంటే ఆమె తండ్రి జమ్మాజ్ అల్ సుహైమి గల్ఫ్ బ్యాంక్, సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్స్ అథారిటీలో ఉన్నత పదవులును అలంకరించారు. ఇక సారా కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచింది. అత్యున్నత మార్కులతో గ్రాడ్యుయేఏషన్ పూర్తి చేసి అద్భతమైన కెరీర్‌కు మార్గం సుగమం చేసుకుంది. సారా తొలుత ఎన్సీబీ క్యాపిటల్ చీప్ ఎగ్జిక్యూటివ్‌గా అయ్యినప్పుడే ఆమె కెరీర్ అంచెలంచెలుగా పెరగడం ప్రారంభించింది. ఇది సౌదీ అరేబియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఏర్పడటానికి సాంబాతో విలీనమయ్యింది. ఇక ప్రస్తుతం సారా సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌కే చైర్మన్ అయిన తొలి మహిళగా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆమె విజయం ఒక్క సౌదీలోనే గాదు యావత్తు ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. అంతేగాదు ఆమె ఎన్సీబీ క్యాపిటల్ ఫైనాన్షియల్ ల్యాండ్‌స్కేప్‌లో కీలక పాత్ర పోషించింది. వినూత్న పెట్టుబడి వ్యూహాలను పరిచయం చేసింది. దీంతో అత్యధిక మంది క్లయింట్ల ఆకర్షించేలా మంచి ఫలితాలను అందుకుంది. అంతేగాదు సారా ఫోర్బ్స్ మ్యాగజైన్లో ప్రపంచంలోని అత్యుత్తమ మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. On the occasion of #InternationalWomensDay, Sarah al-Suhaimi, the Arab world’s first female stock exchange head, rang the opening bell of Tadawul, the largest financial market in the region.https://t.co/fo6MckbJ2M pic.twitter.com/s22FYn8ZZe — Al Arabiya English (@AlArabiya_Eng) March 8, 2019 (చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా 75 వేల కోట్లు..!) -
ఆర్థిక సంవత్సరానికి లాభాలతో గుడ్ బై...
ముంబై: ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు పెరిగి 73,651 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్లు బలపడి 22,327 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,194 పాయింట్లు పెరిగి 74,190 వద్ద, నిఫ్టీ 392 పాయింట్లు బలపడి 22,516 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధించి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో బలహీనతల కారణంగా ఆఖర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంతమేర ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ దాదాపు ఒకశాతం లాభపడటంతో బీఎస్ఈలో రూ.3.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ (0.50%), రిలయన్స్ (0.37%), హెచ్‌సీఎల్ (0.26%), టెక్ మహీంద్రా (0.25%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. ► బీఎస్ఈ, నిఫ్టీలు ఎంపిక చేసుకున్న షేర్లలో బీటా వెర్షన్ టి+0 ట్రేడ్ సెటిల్మెంట్ను ప్రారంభించాయి. తొలి రోజున రెండు ఎక్స్ఛేంజిల్లో 60 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. నేడు ఎక్స్ఛేంజిలకు గుడ్‌ఫ్రైడే సెలవు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు రోజులు కావడంతో ట్రేడింగ్ సోమవారం ప్రారంభం అవుతుంది. ర్యాలీ ఎందుకంటే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(ఏఐఎఫ్)లో రుణదాతల పెట్టుబడులపై గతంలో కఠిన ఆంక్షల విధించిన ఆర్బీఐ తాజాగా నిబంధనలను సులభతరం చేయడంతో అధిక వెయిటేజీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ రంగాల షేర్లు రాణించాయి. మోర్గాన్ స్టాన్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి అవుట్‌లుక్‌ను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి అప్‌గ్రేడ్ చేసింది. ఇటీవల ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల పట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా సూచీలు రికార్డు స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 0.5% పెరిగాయి. 2023– 24లో రూ.128 లక్షల కోట్ల సృష్టి దేశీయ స్టాక్ మార్కెట్ 2023–24లో గణనీయమైన లాభాలు పంచింది. సెన్సెక్స్ 14,660 పాయింట్లు (25%) ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ ఏడాది వ్యవధిలో 128 లక్షల కోట్ల పెరిగి రూ.387 లక్షల కోట్లు చేరింది. సెన్సెక్స్ మార్చి 7న 74,245 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్చి 2న ఇన్వెస్టర్ల సంపద సైతం రూ.394 లక్షల వద్ద ఆల్‌టైం హైని తాకింది. ఇదే కాలంలో నిఫ్టీ 4,967 పాయింట్లు(29%) పెరిగింది. మార్చి 11న 22,526 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. 2022–23లో 423 పాయింట్లు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కార్వికి సెబీ మరో షాక్ కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు సెబీ మరో షాక్ ఇచ్చింది. అర్హత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు మర్చంట్ బ్యాంకర్ రిజి్రస్టేషన్‌ను రద్దు చేసింది. 2023 మార్చి 15–17 తేదీల్లో కార్వీ ఇన్వెస్టర్ సర్విసెస్‌ను సెబీ బృందం తనిఖీల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. గతంలోనూ సెబీ కార్వీపై పలు చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డీలిస్టింగ్ స్టాక్ ఎక్స్ఛేంజిల నుంచి డీలిస్ట్ చేసేందుకు 72 శాతం వాటాదారులు అనుమతించినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా వెల్లడించింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. డీలిస్టింగ్ తదుపరి మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనంకానున్నట్లు తెలియజేసింది. డీలిస్టింగ్ పథకంలో భాగంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాటాదారులు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 67 ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను పొందనున్నట్లు వెల్లడించింది. -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్‌డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్‌ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్‌ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్‌తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్‌కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్మెంట్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్మెంట్ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్ 1) సెటిల్మెంట్ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్0) సెటిల్మెంట్కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ పేర్కొన్నారు. ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్స్టెంట్) సెటిల్మెంట్కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్‌టైమ్ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆలోచనపై మార్కెట్ మేకర్స్ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్మెంట్ను ప్రస్తుత సెటిల్మెంట్కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీప్లస్ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఆరు కంపెనీలుగా వేదాంతా
బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది. వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్‌సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్ప్లే బిజినెస్‌లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్‌నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్‌లు తమ మార్కెట్ పొజిషన్‌ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్‌ల విడదీత వార్తలతో ఎన్ఎస్ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్‌చేసి రూ. 308 వద్ద ముగిసింది. నిధుల సమీకరణ.. ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్‌ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్‌ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది. -
కొత్త రికార్డ్! ఐపీవో ముగిసిన రెండు రోజుల్లోనే లిస్టింగ్..
న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ కొత్త రికార్డుకు తెరతీస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 20) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతోంది. వెరసి పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ అయిన తొలి కంపెనీగా నిలుస్తోంది. ఇక టీ+3 విధానంలో లిస్టయిన తొలి కంపెనీ రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్కాగా.. రెండో రోజు నుంచి టీ+2లో ఆర్ఆర్ కేబుల్‌లో ట్రేడింగ్ ప్రారంభంకానుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆగస్ట్‌లో ఐపీవో తదుపరి లిస్టింగ్ కాలాన్ని సగానికి కుదించింది. దీంతో టీ+6 నుంచి టీ+3కి లిస్టింగ్ కాలావధి తగ్గింది. ఆర్ఆర్ కేబుల్ ఇష్యూ సెప్టెంబర్ 13న మొదలై 15న ముగిసింది. సెప్టెంబర్ 1 నుంచి లిస్టింగ్ తాజా మార్గదర్శకాలు స్వచ్చంద ప్రాతిపదికన అమలులోకి వచ్చాయి. అయితే 2023 డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఆర్ఆర్ కేబుల్ ఈక్విటీ షేర్లు బీ గ్రూప్‌లో లిస్ట్‌కానున్నట్లు బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. -
డెలాయిట్ రాజీనామాకు సరైన కారణాలు లేవు
న్యూఢిల్లీ: ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ వ్యవహారాలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్ పరిధిలో ఉండదని డెలాయిట్‌కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్‌గా కొనసాగేందుకు డెలాయిట్ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్–ఆడిటర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్ ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్‌ను ఆడిటర్‌గా నియమించుకుంది. -
మూడు రోజుల్లోనే లిస్టింగ్ - సెబీ తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు సంబంధించి సెబీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఐపీవో ఇష్యూ ముగిసిన రోజు నుంచి ఆరు పని దినాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రస్తుతం లిస్ట్ కావాల్సి ఉండగా, దీన్ని మూడు రోజులకు తగ్గించింది. అంటే ఇకపై ఐపీవో ముగిసిన రోజు తర్వాత నుంచి మూడో పనిదినం రోజున ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1, ఆ తర్వాత నుంచి వచ్చే ఐపీవోలకు మూడు రోజుల లిస్టింగ్ నిబంధన ఐచ్ఛికమే. అంటే ఇప్పటి మాదిరే ఆరు రోజులు (టీప్లస్6) లేదంటే మూడు రోజుల గడువు (టీప్లస్3)ను కంపెనీలు అనుసరించొచ్చు. కానీ, డిసెంబర్ 1 నుంచి మాత్రం విధిగా అన్ని ఐపీవోలు మూడు రోజుల లిస్టింగ్ నిబంధననే అమలు చేయాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అందరికీ అనుకూలమే సెబీ నిర్ణయం చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. షేర్ల కేటాయింపు లేకపోతే బ్యాంక్ ఖాతాల్లో బ్లాక్ అయిన నిధులు తొందరగా విడుదల అవుతాయి. రుణం తీసుకుని ఐపీవోల్లో దరఖాస్తు చేసే హెచ్ఎన్ఐలు కూడా ఉంటారు. వీరికి రోజుల వారీగా రుణంపై వడ్డీ భారం పడుతుంది. తొందరగా లిస్ట్ అయితే, తాము తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేసే వీలుంటుంది. అటు ఐపీవోకు వచ్చిన కంపెనీలకూ ప్రయోజనమే. ఎలా అంటే ఐపీవో నిధులను అవి వేగంగా పొందొచ్చు. ఏఎస్బీఏ కింద షేర్లు అలాట్ కాని వారి నిధులను బ్యాంకు ఖాతాల్లో టీప్లస్3 రోజున అన్‌బ్లాక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి చెల్లించే పరిహారం అనేది ట్లీప్లస్3 తర్వాతి రోజు నుంచి అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. -
9 భాషల్లో ఎన్డీటీవీ న్యూస్ ఛానల్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో భాగమైన మీడియా దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) తొమ్మి ది భారతీయ భాషల్లో న్యూస్ ఛానల్స్‌ను మొదలుపెట్టే యోచనలో ఉంది. దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సంస్థ తెలియజేసింది. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. అనుమతులు వచ్చాక చానళ్ల ప్రారంభ తేదీలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల వాటాలను కూడా కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గతేడాది డిసెంబర్లో కంపెనీని పూర్తిగా దక్కించుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్డీటీవీ రూ. 221 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
హైదరాబాద్‌లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ టెక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ పీఎల్‌సీఎక్సలెన్స్ సెంటర్‌ఏర్పాటుతో దాదాపు వెయ్యిమందికి ఉపాధి లభించనుంది.మంత్రి కేటీఆర్‌తో లండన్‌లోజరిగిన సమావేశం అనంతరం సంస్థ ప్రకటించింది. (ప్యూర్ ఈవీ కొత్త ఈ-స్కూటర్: 150 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?) ఈ మేరకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ లండన్‌లో ఎల్ఎస్ఈజీ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO) ఆంథోనీ మెక్‌కార్తీతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యూకే పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ఎల్ఎస్ఈజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎంఓయూపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మెక్‌కార్తీ సంతకాలు చేశారు. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి ఊతమమ్వివనుందని అంచనా. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ప్రొవైడర్‌గా సేవలందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో పని చేయడంతో పాటు 190 దేశాలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. Exciting news for Telangana, all the way from London! London Stock Exchange Group PLC (LSEG) announces its decision to set up a Technology Centre of Excellence in Hyderabad generating employment for about 1000 people in a year. The announcement was made after Minister @KTRBRS,… pic.twitter.com/9gqmgzzm65 — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 12, 2023 -
స్టార్టప్‌లలో మహిళల హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన దేశీ స్టార్టప్ రంగంలో ఇప్పుడు మహిళలు దూసుకెళుతున్నారు. కొంగొత్త ఆవిష్కరణలతో అంకుర సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. టెక్నాలజీ, ఈ–కామర్స్, ఫైనాన్స్ తదితర రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల సారథ్యంలోని నైకా, జివామి, షీరోస్ వంటి పలు విజయవంతమైన అంకుర సంస్థలు ఇందుకు నిదర్శనం. ఫల్గుణీ నాయర్ నేతృత్వంలోని ఫ్యాషన్ ప్రొడక్ట్స్ సంస్థ నైకా... సంచలన స్థాయిలో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు భారీగా ఎగబడి మరీ షేర్లు కొన్నారు. ఇక అంతకన్నా ముందు .. దాదాపు నలభై ఏళ్ల క్రితం రజని బెక్టర్ ఏర్పాటు చేసిన బేకరీ ఉత్పత్తుల సంస్థ మిసెస్ బెక్టర్స్ లిస్టింగ్‌కు వస్తే ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సానుకూల స్పందన ఊతంతో మరిన్ని స్టార్టప్‌లు కూడా లిస్టింగ్ బాట పడుతున్నాయి. గజల్ అలగ్ సహ–వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ మామాఎర్త్ కూడా తాజాగా ఐపీవో యత్నాల్లో ఉంది. ఇలా పలు అంకుర సంస్థలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు అవసరమైన ఉత్పత్తులు, సర్విసులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టేవిగా ఉంటున్నాయి. 2014లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సహా దేశీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్‌ల సంఖ్య .. మొత్తం అంకుర సంస్థల్లో 8 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇది దాదాపు 14 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల సారథ్యంలోని అంకుర సంస్థలతో పోలిస్తే మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు 2.5 రెట్లు ఎక్కువగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని, పెట్టుబడులపై 35 శాతం అధికంగా రాబడులు అందించగలుగుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. లక్ష్యంపైనే గురి.. వ్యాపారాన్ని ప్రారంభించడమంటే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు మిగతా వర్గాల నుంచి సహకారం లభించడం కూడా కీలకం. వ్యాపారం ప్రారంభించడానికి ముందే టార్గెట్ మార్కెట్, పోటీ, తాము అందించే సర్వీసులు, ఉత్పత్తుల ప్రత్యేకత వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని స్పేస్మంత్ర వ్యవస్థాపకురాలు నిధి అగర్వాల్ పేర్కొన్నారు. మహిళా ఎంట్రప్రెన్యూర్లు మరింత తరచుగా తమ నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుందని టెరావిటా వ్యవస్థాపకురాలు రాహీ అంబానీ తెలిపారు. అయితే, ఒడిదుడుకులను అధిగమించి, లక్ష్యంపైనే దృష్టి పెడితే విజయం సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వాల తోడ్పాటు.. స్టార్టప్ రంగంలోనూ మహిళలు రాణించేలా ప్రభుత్వాలు, వివిధ సంస్థలు తోడ్పాటు అందిస్తుండటం కూడా వారికి సహాయకరంగా ఉంటోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్టాండప్ ఇండియా వంటి స్కీములు స్టార్టప్‌లకు అండగా ఉంటున్నాయి. నిధులపరంగాను, ఇతరత్రా సహాయాన్ని అందించేందుకు యాక్సిలరేటర్లు, ఇన్క్యుబేటర్లు మొదలైనవి ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ నుంచి యాక్సెలరేట్‌హర్ 2023 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ వెబ్ సర్విసెస్ (ఏడబ్ల్యూఎస్), ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ లైట్‌స్పీడ్ కలిసి యాక్సెలరేట్‌హర్ 2023 పేరిట ప్రత్యేక ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. ప్రారంభ స్థాయి దేశీ స్టార్టప్‌ల మహిళా వ్యవస్థాపకులు తమ సంస్థలను నిర్మించుకునేందుకు, వృద్ధిలోకి తెచ్చుకునేందుకు, విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన తోడ్పాటు దీని ద్వారా పొందవచ్చు. ఈ ఆరు వారాల యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌నకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ ఇండియా హెడ్ (స్టార్టప్ ఎకోసిస్టమ్) అమితాబ్ నాగ్‌పాల్ తెలిపారు. దీనికి ఎంపికైన స్టార్టప్‌లు నిధుల సమీకరణ, సాంకేతిక అంశాలపరమైన మద్దతు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీస లాభదాయకత ఉత్పత్తి కలిగి ఉండి, మూడు మిలియన్ డాలర్ల కన్నా తక్కువ నిధులను సమీకరించిన స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్లలో 10 శాతమే.. గడిచిన కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మహిళల మేనేజర్ల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ అది సుమారు 10% స్థాయిలోనే ఉన్నట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య గతేడాది 32గా ఉండగా ప్రస్తుతం 42కి పెరిగింది. అదే సమయంలో మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరింది. వీరిలో 42 మంది మహిళలు.. ఫండ్స్‌ను ప్రైమరీ లేదా సెకండరీ మేనేజర్లుగా నిర్వహిస్తున్నారు. 2017లో 18 మందికి పరిమితమైన ఫండ్ మేనేజర్ల సంఖ్య ఆ తర్వాత నుంచి క్రమంగా పెరిగినట్లు మార్నింగ్‌స్టార్ పేర్కొంది. ప్రస్తుతం 24 ఫండ్ సంస్థల్లో 42 మంది మహిళా మేనేజర్లు ఉన్నారు. మహిళా మాసంగా మార్చి .. ఐసీఐసీఐ లాంబార్డ్ ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నెలను మహిళా మాసంగా పాటిస్తున్నట్లు ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ (ముందుగా వచ్చిన వారికి) ప్రాతిపదికన 10,000 మంది మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వివరించింది. దీని కింద థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డీ, బీ12 తదితర టెస్టులను నిర్వహిస్తారు. అలాగే మహిళా మోటరిస్టులకు కాంప్లిమెంటరీగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీసులు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక మహిళా ఎంట్రప్రెన్యూర్íÙప్ను ప్రోత్సహించే దిశగా మహిళా ఏజెంట్లను రిక్రూట్ చేసుకునేందుకు, అవగాహన కల్పించేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కంపెనీ ఈడీ సంజీవ్ మంత్రి పేర్కొన్నారు. మహిళల కోసం సిగ్నిటీ ప్రత్యేక కార్యక్రమాలు టెక్నాలజీ రంగంలో మహిళలకు తోడ్పాటునిచ్చే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ వెల్లడించింది. మార్చి 9న ’ఉమెన్ ఇన్ టెక్ రౌండ్‌టేబుల్’ వర్చువల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పలు మహిళా దిగ్గజాలు పాల్గొనే ఈ చర్చాగోష్టికి సంస్థ ఎస్వీపీ శిరీష పెయ్యేటి సారథ్యం వహిస్తారు. అలాగే, మహిళలు కొత్త విషయాలను నేర్చుకునేలా, అనుభవజ్ఞులు నుంచి సలహాలు పొందేలా వెసులుబాటు కల్పించే దిశగా ’హర్డిజిటల్స్టోరీ’ పేరిట ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నట్లు సిగ్నిటీ పేర్కొంది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీతో కలిసి పనిచేస్తున్నట్లు, ’ప్రాజెక్ట్ సిగ్నిఫికెన్స్’ పేరిట 100 మంది గ్రామీణ ప్రాంత మహిళలకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించింది. -
ఎఫ్‌అండ్‌వోలో జీల్ కొనసాగింపు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్(జీల్)ను కొనసాగించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా ప్రకటించింది. వెరసి డెరివేటివ్స్ నుంచి జీల్‌ను తప్పించేందుకు గురువారం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా ప్రక్రియను వారాంతాన జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) నిలిపివేసింది. ఎసెస్ల్ గ్రూప్‌లోని మరో కంపెనీ సిటీ నెట్వర్క్స్ రూ. 89 కోట్ల చెల్లింపుల్లో విఫలంకావడంపై ఇండస్ఇండ్ బ్యాంక్ క్లెయిమ్ చేసింది. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా ఉంది. కాగా.. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)తో విలీనంకానున్న జీల్‌కు ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఉపశమనాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి జీల్ కౌంటర్లో తిరిగి మే నెల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ఎన్ఎస్ఈ అనుమతించింది. మార్చి, ఏప్రిల్ కాంట్రాక్టులు యథాతథంగా కొనసాగుతాయి. -
విశాఖలో బీఈఎల్ ‘ఎస్డీసీ’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్(ఎస్డీసీ)ను ప్రారంభించింది. రక్షణతోపాటు వివిధ రంగాలకు సంబంధించి సురక్షితమైన ఐటీ సేవలను అందించడమే లక్ష్యంగా విశాఖలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఈ ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు బీఈఎల్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 150 మంది ఇంజనీర్లు పని చేసేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్డీసీ కేంద్రాన్ని ఇటీవల బీఈఎల్ డైరెక్టర్ (బెంగళూరు కాంప్లెక్స్) కె.వినయ్‌కుమార్ ప్రారంభించినట్లు వెల్లడించింది. బెంగళూరులోని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్‌బీయూ)ను విస్తరిస్తూ విశాఖలో ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు వివరించింది. బీఈఎల్‌కు చెందిన సాఫ్ట్వేర్ డివిజన్ ఇప్పటికే అతి కీలకమైన రక్షణ, ఎయిర్‌స్పేస్, ఈ–గవర్నెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేసింది. అత్యంత కీలకమైన విభాగాల్లో సురక్షితమైన ఐటీ సేవలను అందించే లక్ష్యంతో విశాఖలో ఎస్డీసీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక్కడ నుంచి డీఆర్డీవోతో కలిపి నేవీకి సంబంధించిన అన్ని రకాల ఐటీ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటితోపాటు స్మార్ట్ సిటీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాల్లో అవసరమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు పేర్కొంది. ఆహ్లాదకరమైన, అత్యంత సురక్షిత వాతావరణంలో ఉద్యోగులు పనిచేసే విధంగా ఎస్డీసీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, రాండ్‌స్టాడ్ వంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలను ఆకర్షించిన విశాఖ... తాజాగా మరో నవరత్న కంపెనీ బీఈఎల్ కూడా తమ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
నిఫ్టీ సూచీలలో అదానీ గ్రూప్ షేర్లు
నిఫ్టీ ఇండెక్సులలో ఈ ఏడాది మార్చి31 నుంచి సవరణలు చేపడుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్సులలో ప్రయివేట్ రంగ కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్‌తోపాటు పలు ఇతర కంపెనీలకు చోటు లభించనుంది. అదానీ విల్మర్ నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక అదానీ పవర్‌కు నిఫ్టీ 500, 200లతోపాటు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, 150, లార్జ్‌మిడ్ క్యాప్ 250, మిడ్‌స్మాల్ క్యాప్ 400లలో చోటు లభించనుంది. ఇండెక్సుల నిర్వహణ సబ్‌కమిటీ షేర్ల జాబితాలో సవరణలను నిర్ణయించినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. అయితే ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎలాంటి మార్పులూ చేపట్టడంలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. కాగా.. నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌లో ఏబీబీ ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ సైతం ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫసిస్, వన్ 97 కమ్యూనికేషన్స్లను నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. -
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్‌కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్‌లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్‌లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్‌పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్‌కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
ఇక ఎన్ఎస్ఈ సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ
న్యూఢిల్లీ: ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజీ ఏర్పాటుకు ముందస్తు అనుమతి పొందింది. ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్ అందుకుంది. దీంతో ఎస్ఎస్ఈ పేరుతో విడిగా ఒక విభాగాన్ని నెలకొల్పేందుకు కృషి చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ప్లాట్‌ఫామ్ సోషల్ ఎంటర్ప్రైజ్లకు గరిష్ట లబ్దిని అందించగలదని విశ్వసిస్తున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సస్టెయిబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలకు చేయూతనివ్వగలదని తెలియజేశారు. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్, టెక్ని కల్ గ్రూప్ సిఫారసులమేరకు జులైలోనే ఎస్ఎస్ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దేశీయంగా ఎస్ఎస్ఈ కొ త్త ఆలోచనకాగా.. ప్రయి వేట్, నాన్‌ప్రాఫిట్ రంగాలకు పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించడం ద్వారా సేవలందించనుంది. కాగా.. అక్టోబర్‌లో బీఎస్ ఈసైతం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు సూత్ర ప్రాయ అనుమతిని పొందినట్లు వెల్లడించిన విషయం విదితమే. -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
మరింత పారదర్శకంగా బైబ్యాక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు తాజా ప్రతిపాదనలతో చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా బైబ్యాక్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా, వాటాదారులకు మద్దతిచ్చే బాటలో చేపట్టే చర్యలకు తెరతీసింది. వీటి ప్రకారం గరిష్ట పరిమితిలో కోతతోపాటు, బైబ్యాక్ పూర్తిచేసే గడువును భారీగా తగ్గించనుంది. బైబ్యాక్‌లో షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 15 శాతానికి మించకుండా ఫ్రీ రిజర్వుల ద్వారా బైబ్యాక్‌ను చేపట్టేందుకు వీలుంది. వచ్చే ఏప్రిల్ నుంచి 10 శాతానికి కుదిస్తోంది. ఆపై ఏడాది 5 శాతానికి, తదుపరి పరిమితిని పూర్తిగా ఎత్తివేయనుంది. ఇక టెండర్ మార్గంలో బైబ్యాక్‌కు ప్రస్తుతమున్న 25 శాతం పరిమితిని 40 శాతానికి పెంచనుంది. ప్రస్తుతం బైబ్యాక్ పూర్తికి ఆరు నెలల గడువు లభిస్తోంది. అయితే ఈ గడువులో కృత్రిమంగా డిమాండును సృష్టించడం ద్వారా షేర్ల ధరలను ప్రభావితం చేసేందుకు అవకాశముంటున్నదని సెబీ పేర్కొంది. దీంతో గడువులో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రతిపాదనలపై సెబీ డిసెంబర్ 1వరకూ పబ్లిక్ నుంచి సూచనలు కోరుతోంది. 22 రోజులకు పరిమితం తాజా ప్రతిపాదనల ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి బైబ్యాక్ గడువును 66 పనిదినాలకు కుదించనుంది. ఆపై 2024 ఏప్రిల్ నుంచి 22 రోజులకు తగ్గించనుంది. ఈ బాటలో 2025 ఏప్రిల్ నుంచి ఓపెన్ మార్కెట్ విధానానికి స్వస్తి పలకనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్‌ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75 శాతం వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. అంతేకాకుండా గడువులో సగం రోజులు ముగిసేసరికి కనీసం 40 శాతం సొమ్మును షేర్ల కొనుగోలుకి వెచ్చించవలసి ఉంటుంది. యాక్టివ్‌గా ట్రేడయ్యే షేర్లలోనే బైబ్యాక్‌ను చేపట్టవలసి ఉంటుంది. కంపెనీ నికరంగా రుణరహితమై ఉంటే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు బైబ్యాక్ చేపట్టేందుకు అనుమతిస్తారు. అయితే ఇందుకు ఆరు నెలల కనీస గడువును పాటించడంతోపాటు టెండర్ మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఇక బుక్ బిల్డింగ్ పద్ధతిలో ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు ప్రమోటర్లు, సహచరులు పాల్గొనేందుకు అనుమతించరు. బైబ్యాక్‌పై పన్ను విధింపును కంపెనీకి బదులుగా సంబంధిత వాటాదారులకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం బైబ్యాక్‌లో పాలుపంచుకోని వాటాదారులపై పన్ను భారం పడుతున్నందున తాజా సవరణలకు సెబీ ప్రతిపాదించింది. -
బీఎస్ఈ లాభాల్లో క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో స్టాక్ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు సగానికి క్షీణించి రూ. 34 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 65 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 240 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 226 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే నిర్వహణ మార్జిన్లు 28 శాతం నుంచి 7 శాతానికి భారీగా పతనమయ్యాయి. ఇందుకు కారణాలను ఎక్ఛేంజీ వెల్లడించలేదు. కాగా.. మొత్తం వ్యయాలు 36 శాతం పెరిగి రూ. 184 కోట్లను దాటాయి. ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 11.7 కోట్లకు ఎగశాయి. రోజువారీ సగటు టర్నోవర్ ఈక్విటీ విభాగంలో 17 శాతం వృద్ధితో రూ. 4,740 కోట్లను తాకగా.. డెరివేటివ్స్ నుంచి 88 శాతం అధికంగా రూ. 2.26 లక్షల కోట్లు చొప్పున నమోదైంది. కరెన్సీ డెరివేటివ్స్‌లో సైతం సగటు టర్నోవర్ 31 శాతం ఎగసి రూ. 32,161 కోట్లకు చేరింది. -
సోషల్ స్టాక్ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సోషల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎస్ఎస్ఈ)కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసింది. ఈ ఎక్సే్చంజీలో నమోదు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు, వెల్లడించాల్సిన వివరాలు మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. లాభాపేక్ష లేని సంస్థలు (ఎన్పీవో) నిధులు సమీకరించుకునేందుకు అదనపు మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలో సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సమీకరించిన నిధుల వినియోగం గురించిన వివరాలను త్రైమాసికం ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఎస్‌ఎస్‌ఈకి ఎన్పీవో తెలియజేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల్లోగా సదరు నిధుల వినియోగంతో సాధించిన సామాజిక ప్రయోజనాల వివరాలను (ఏఐఆర్)ను కూడా సమర్పించాలి. మరిన్ని వివరాలు .. ► చారిటబుల్ ట్రస్టుగా ఎన్పీవో నమోదై ఉండాలి. కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10 లక్షల నిధులు సమీకరించుకుని, రూ. 50 లక్షల మేర వ్యయాలు చేసినదై ఉండాలి. ► అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్ 5 దాతలు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాలి. బడ్జెట్, కార్యకలాపాల స్థాయి, ఉద్యోగులు.. వాలంటీర్ల సంఖ్య, ప్రోగ్రామ్‌వారీగా నిధుల వినియోగం మొదలైనవి తెలియజేయాలి. ► నియంత్రణ సంస్థ నిర్దేశించిన 16 అంశాల్లో ఏదో ఒక దానిలో ఎన్పీవో కార్యకలాపాలు సాగిస్తున్నదై ఉండాలి. పేదరికం, అసమానతలు, పౌష్టికాహార లోపం మొదలైన వాటి నిర్మూలన, విద్య.. ఉపాధి కల్పనకు తోడ్పాటునివ్వడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి. ► అఫోర్డబుల్ హౌసింగ్ సంస్థలు తప్ప కార్పొరేట్ ఫౌండేషన్లు, రాజకీయ లేదా మతపర కార్యకలాపాలు సాగించే సంస్థలు, ట్రేడ్ అసోసియేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హౌసింగ్ కంపెనీలను సోషల్ ఎంటర్‌ప్రైజ్‌గా గుర్తించరు. స్టాక్ బ్రోకర్ల కట్టడికి నిబంధనలు.. క్లయింట్ల సెక్యూరిటీలు, నిధులను స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లో నుంచి సెక్యూరిటీలను ట్రేడింగ్ మెంబరు పూల్ ఖాతాల్లోకి బదలాయించడాన్ని డిపాజిటరీలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ మధ్య విలీనానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. రెండు ఎక్సే్ఛంజీలూ ఇందుకు నో అబ్జక్షన్ ప్రకటించినట్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ఇతర నియంత్రణ సంస్థల నుంచి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీనానికి తొలుత స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు అనుమతించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది మార్చి 27న రెండు సంస్థలూ విలీన అంశాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. విలీన కంపెనీ 1,500కుపైగా తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఆవిర్భవించనుంది. సంయుక్త సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,788 వద్ద నిలవగా.. ఐనాక్స్ లీజర్ 5.3 శాతం జంప్‌చేసి రూ. 482 వద్ద ముగిసింది. -
బీఎస్ఈ డివిడెండ్ రూ. 13.5
న్యూఢిల్లీ: దిగ్గజ స్టాక్ ఎక్సేంజీ బీఎస్ఈ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 72 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 32 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 152 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు జంప్‌చేసింది. వాటాదారులకు షేరుకి రూ. 13.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. మార్చిలో ప్రకటించిన బోనస్ ఇష్యూ తదుపరి పూర్తి ఈక్విటీపై డివిడెండు చెల్లించనుంది. గత కొన్నేళ్లుగా సంస్థలు, ఇన్వెస్టర్ల కోసం మార్కెట్లు, ప్రొడక్టులను బీఎస్ఈ నిర్మిస్తూ వచ్చినట్లు ఎక్సేంజీ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. తద్వారా అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్లోనూ వృద్ధికి ఊతమిచ్చినట్లు తెలియజేశారు. ఈ ఏడాది (2022–23)లోనూ వివిధ వృద్ధి అవకాశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్ఈ నికర లాభం 73 శాతం దూసుకెళ్లి రూ. 245 కోట్లను తాకింది. 2020–21లో రూ. 142 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 48 శాతం వృద్ధితో రూ. 743 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 501 కోట్ల టర్నోవర్ నమోదైంది. చదవండి: ఐసీఈఎక్స్‌పై సెబీ కొరడా! -
బీమా కంపెనీలు లిస్టింగ్‌కు వెళ్లాలి!
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్‌లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్డీఏ చైర్మన్‌గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌ను ఐఆర్డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది. -
డిష్ టీవీకి షాక్! వాటాదారులతో అంత ఈజీ కాదు!
గతేడాది(2021) డిసెంబర్ 30న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో ప్రతిపాదనలన్నీ వీగిపోయినట్లు డీటీహెచ్ సేవల కంపెనీ డిష్ టీవీ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు, డైరెక్టర్‌గా తిరిగి ఏఎం కురియన్ ఎంపిక తదితర మూడు ప్రతిపాదనలనూ వాటాదారులు తిరస్కరించినట్లు తాజాగా స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. అతిపెద్దవాటాదారు అయిన యస్ బ్యాంక్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఇప్పటివరకూ వివరాలను బయటపెట్టలేదని కంపెనీ ప్రస్తావించింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఈ అంశాలను వెల్లడించినట్లు డిష్ టీవీ పేర్కొంది. ఇటీవల జరిగిన 33వ ఏజీఎంలో ప్రతిపాదించిన 2021–22 ఏడాదికి కాస్ట్ ఆడిటర్స్ రెమ్యునరేషన్, స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలు, కురియన్ పునఃనియామకం అంశాలకు వ్యతిరేకంగా అధిక శాతం వోటింగ్ నమోదైనట్లు వివరించింది. -
ఏజీఎం ఓటింగ్ ఫలితాలు ప్రకటించండి
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ 30న వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) నిర్వహించిన ఓటింగ్ ఫలితాలను తక్షణమే స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయాలంటూ డిష్ టీవీ ఇండియాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వివిధ ప్రతిపాదనలపై జరిపిన ఓటింగ్ ఫలితాలను వెల్లడించకుండా డిష్ టీవీ తొక్కిపెట్టి ఉంచుతోందంటూ యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇతర షేర్హోల్డర్లు ఫిర్యాదు చేయడంతో సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో డైరెక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డిష్ టీవీ మాతృ సంస్థ అయిన ఎస్సెల్ గ్రూప్‌లో కొన్ని కంపెనీలు.. షేర్లను తనఖా పెట్టి యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయి. అవి డిఫాల్ట్ కావడంతో వాటి షేర్లను యస్ బ్యాంకు జప్తు చేసుకుంది. తనఖా పెట్టిన షేర్ల యాజమాన్య హక్కులపై ప్రమోటరు గ్రూప్ కంపెనీ డబ్ల్యూసీఏ, యస్ బ్యాంక్‌ల మధ్య వివాదం నెలకొంది. కంపెనీ ఏజీఎంలో వోటింగ్ హక్కులను నిరాకరించడంతో యస్ బ్యాంక్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయి తే, ఓటింగ్ ఫలితాలు మాత్రం డిష్ టీవీ వెల్లడించకపోవడం మరో వివాదానికి దారి తీసింది. -
ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు...! స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయా..?
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత వార్తలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశా నిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్, ఓపెక్ సమావేశ నిర్ణయాలపై మార్కెట్ వర్గాలు ఓ కన్నేయొచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) చివరి వారంలో మార్కెట్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పటికీ.., రెండు శాతం ర్యాలీ చేసింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 1,130 పాయింట్ల, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘గత రెండు వారాలుగా మార్కెట్ రికవరీ దశలో ఉంది. అయినంత మాత్రాన పరిస్థితులు చక్కబడ్డాయనే అంచనాకు రావడం తగదు. ఒమిక్రాన్ వేరియంట్ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ట్రేడర్లు అప్రమతత్త వైఖరి కొనసాగిస్తూ.., రక్షణాత్మకంగా హెడ్డింగ్ పొజిషన్లను తీసుకోవడం ఉత్తమం. సాంకేతికంగా నిఫ్టీ నిర్ణయాత్మకమైన 17350 స్థాయిని చేధించి 17354 వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులతో అమ్మకాలు జరిగితే దిగువస్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది.’’ రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే.., ఒమిక్రాన్ ప్రభావం.. ఒమిక్రాన్ వేరియంట్ రోజుకు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. గతేడాది అక్టోబర్ రెండో తేదీ తర్వాత అత్యధిక ఈ ఏడాది తొలిరోజు(జనవరి 1న) 22,775 కేసుల నమోదయ్యాయి. కేసుల కట్టడికి దేశంలో ఇప్పటికే ప్రధాన రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంక్షలను మరి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, కెనడా దేశాల్లో రోజుకు రెండు లక్షల చొప్పున కేసులు నమోదుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిళ్లు పెరిగి, అనిశ్చితికి దారి తీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా ఇప్పటికే విడుదలైన డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు, జీఎస్టీ వసూళ్లపై స్పందించాల్సి ఉంది. భారత్‌తో పాటు యూరోజోన్, అమెరికాలు నేడు (సోమవారం) డిసెంబర్ మార్కిట్ మాన్యుఫ్యాక్చరింగ్ డేటాను విడుదల చేయనున్నాయి. ఇవే దేశాలు బుధవారం(జనవరి 5న) సేవా రంగ పీఎంఐ గణాంకాలు ప్రకటించనున్నాయి. ఓపెక్ దేశాలు సమావేశం మంగళవారం జరగనుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పా లసీ కమిటీ మినిట్స్ బుధవారం వెలువడున్నాయి. యూరోజోన్ రిటైల్ డేటా.., అమెరికా ఉద్యోగ గ ణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ కీ లకమైన ఈ స్థూల గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. విదేశీ, దేశీయ విక్రయాల ప్రభావం గత రెండు నెలల ట్రెండ్‌ను కొనసాగిస్తూ డిసెంబర్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మొత్తం రూ.35,494 ల కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నా యి. 2021 ఏడాదిలో రూ.91,600 కోట్ల షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్ఐఐల వరుస విక్ర యాలు సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు)ను ప్రభావితం చేయలేకపోయాయి. డీఐఐలు డిసెంబర్లో రూ.31,231 కోట్ల షేర్లను, గత సంవత్సరంలో రూ.94,800 కోట్ల కొన్నారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలు, ఒమిక్రాన్ కేసులు, వడ్డీరేట్ల వంటి పరిణామాల నేపథ్యంలో., భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకం కానుంది. చదవండి: కొత్త ఏడాదిలో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..! -
చైనా ‘ఎవర్‌గ్రాండ్’: దెబ్బ మీద దెబ్బ
China Evergrande shares fall: కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్‌గ్రాండ్.. డిఫాల్టర్ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది. చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి. పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్.. యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీస్ సర్వీసెస్‌లో 51 శాతం భాగాన్ని.. హోప్‌సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్‌కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్‌సన్ డెవలప్మెంట్ మాత్రం ఎవర్‌గ్రాండ్ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్లవడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండ్ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్‌గ్రాండ్ ఫౌండర్ క్జూ జియాయిన్(హుయి కా యాన్) హామీ ఫలించడం లేదు. తాజాగా షేర్లు భారీగా పడిపోతుండడంతో.. చైనాలో అతిపెద్ద కార్పొరేట్ పతనం తప్పదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే గ్లోబల్ మార్కెట్ కుదేలు కావడం ఖాయం. ఇక ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో కనిష్ట స్థాయిలో ట్రేడ్ కాగా.. ఇప్పుడు అంతకు మించే పతనం కావడం మరో విశేషం. షెంజెన్ కేంద్రంగా చైనా రియల్ ఎస్టేట్ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఎవర్‌గ్రాండే.. పోయిన నెలలో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో చేరాల్సి ఉండగా.. అది కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. షేర్ల పతనంతో కుదేలు అవుతున్న తరుణంలో.. కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. బకాయిల్లో 83.5 మిలియన్ డాలర్ల చెల్లింపులు చేపట్టాలని 30 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ అది జరగకుంటే ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. ఘనం నుంచి పతనం ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అయితే కిందటి ఏడాది అగష్టులో ప్రభుత్వం డెవలపర్స్ మీద ఉక్కుపాదం మోపడం, అడ్డగోలు డిస్కౌంట్లతో అమ్మకాల నుంచి ఎవర్‌గ్రాండ్ పతనం మొదలైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. డిఫాల్ట్ గండం నుంచి ఎవర్‌గ్రాండ్ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
క్యూ3లో ఐపీవో స్పీడ్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 60,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్‌కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్‌ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. పేటీఎమ్ భారీగా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 7,300 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇ న్సూరెన్స్(రూ. 7,000 కోట్లు), పాలసీ బజార్(రూ. 6,000 కోట్లు), హెల్త్‌కేర్ సంస్థ ఎమ్క్యూర్ ఫార్మా (రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు) తదితరాలున్నాయి. 14 కంపెనీలు రెడీ క్యూ3లో లిస్టింగ్ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్ ఫాస్ఫేట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్ ఆర్క్ సైతం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్, గో ఎయిర్‌లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు. -
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. తొలుత పీఈ ఫండ్స్ జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. కారణాలివీ. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు. 40 కంపెనీలు ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి. జాబితా ఇలా.. అక్టోబర్–నవంబర్‌లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
Stock Market: లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిఫ్టీ 17,350 స్థాయిని నిలుపుకుంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,500–17,600 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువ స్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,600 వద్ద మరో కీలక మద్దతు ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ తెలిపారు. సూచీల కదలికకు ఇవే కీలకం.. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని వారంటున్నారు. ఫెడ్ ట్యాపరింగ్, కరోనా కేసుల నమోదు వార్తలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారింవచ్చు. సానుకూలతలూ ఉన్నాయ్... జీడీపీతో సహా ఇటీవల కేంద్రం విడుదల విడుదలు చేసిన స్థూల ఆరి్థక గణాంకాలన్నీ మార్కెట్ వర్గాలను మెప్పించాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ అంశాలతో అంతర్లీనంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశీయంగా అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో గతవారంలో సెన్సెక్స్ 2005 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 618 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. భారత్ వైపు ఎఫ్ఐఐల చూపు ... భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. డెట్ విభాగంలో ఆగస్టు పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత్, అమెరికా బాండ్ ఈల్డ్స్ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. డాలర్ రూపాయి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈక్విటీ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలను విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలుగా మలుచుకున్నారు. అని జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూ బాటలో వ్యాప్కోస్ జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్కోస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్కోస్లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. ఇదే యోచనలో నేషనల్ సీడ్స్ : కాగా.. ఇదే ఐపీఓ బాటలోనే మరో పీఎస్‌యూ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ఎస్సీ)లోనూ 25 శాతం వాటాను ఆఫర్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రతిపాదించిన విషయం విదితమే. -
విదేశాల్లో నేరుగా భారత కంపెనీల లిస్టింగ్
ముంబై: భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పలు స్టార్టప్‌లు (యూనికార్న్‌లు) నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. ‘‘భారత సంస్థలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు అనుమతి ఉంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఈ దిశగా అనుమతించాలని కోరిన సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు ఏటా జనవరి చివర్లో ప్రారంభమై రెండు దశల్లో కొనసాగుతాయని తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) సెక్యూరిటీలను లిస్ట్ చేసేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. భారత కంపెనీలు విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తే అది పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. నిధుల సమీకరణను సులభతరం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో, అదే మాదిరి విదేశీ కంపెనీలు భారత స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్‌కు అనుమతించాలని సెబీ 2018లోనే ప్రతిపాదించింది. ధరల స్పీడ్‌కు వంట నూనెలు, పప్పుదినుసులే కారణం ముంబై: వంట నూనెలు, పప్పు దినుసుల ధరల తీవ్రత వల్లే మొత్తం ద్రవ్యోల్బణం రేటు తీవ్రంగా ఉంటోదని తరుణ్ బజాబ్ పేర్కొన్నారు. మార్కెట్లో వాటి లభ్యత పెంపు, సరఫరాల వ్యవస్థ మెరుగుదల, సుంకాల తగ్గింపు వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం ప్రయత్నిస్తుందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అలాగే పంట దిగుబడి ఒకసారి అందుబాటులోకి వచ్చాక సమస్య మరికొంత దిగివస్తుందన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం నిర్దిష్ట శ్రేణిలో కొనసాగుతుందన్న అంచనాలను వెలువరించారు. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేందుకు ఏపీలో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా తమ రీసైక్లింగ్ సామర్థ్యం రెట్టింపు అవుతుందని ఆర్ఐఎల్ బుధవారం స్టాక్ ఎక్స్చేంజ్ లకు తెలియజేసింది. 100% రిలయన్స్ అవసరాల కోసం శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసి నిర్వహిస్తుందని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైర్మన్ ముఖేష్ అంబానీ ఆలోచనల మేరకు ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఐఎల్ పెట్రో కెమికల్స్ బిజినెస్ సీవోవో విపుల్ షా తెలిపారు. రిలయన్స్‌తో ఒప్పందం ద్వారా ప్లాస్టిక్ రీ సైక్లింగ్‌లో విస్తరించడానికి తమకు అవకాశం దొరికిందని శ్రీచక్ర ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస్ మిక్కిలనేని చెప్పారు. రీసైకిల్ చేసిన వస్తువులను రిక్రాన్ గ్రీన్ గోల్డ్ ఫాబ్రిక్స్ పేరుతో రిలయన్స్ విక్రయిస్తోంది. -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి తర్జాతీయ సూచీలు నెగటివ్‌గా స్పందిస్తున్నాయి. అదే ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై కూడా పడింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై సందేహాలతకు తోడు కోవిడ్ కేసులు పెరగడం కూడా ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. దీంతో మార్కెట్ ప్రారంభం అవగానే ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో స్టాక్ మార్కెట్లు వరుసగా పాయింట్లు కోల్పోతూ వచ్చాయి. ఈరోజు ఉదయం 52,606 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ కనిష్టంగా 52,405 పాయింట్లకు పడిపోయింది. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య గరిష్టంగా 52,821 పాయింట్లను తాకింది. రోజు మొత్తంలో దశలోనూ నిన్నటి గరిష్ట స్థాయికి చేరుకోలేకపోయింది. సాయంత్రానికి 586 పాయింట్లు కోల్పోయి 52,553 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం 15,800 పాయింట్లు దాటిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈరోజు 171 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 15,752 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా నెస్టల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. -
కోలుకున్న స్టాక్ మార్కెట్
ముంబై: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివరకు కోలుకుంది. సాయంత్రం 4 గంటలకు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 134 పాయింట్లు లాభపడి 52,904 దగ్గర క్లోజయ్యింది. ఉదయం 52,801 దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత గంట పాటు క్రమంగా పాయింట్లు కోల్పోతూ నష్టపోయింది. అనంతరం ఇన్వెస్టరు ఆసక్తి చూపించడంతో మార్కెట్ కోలుకుంది. ఈ రోజు సెన్సెక్స్ గరిష్టంగా 15,877 పాయింట్లు తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 15,808 పాయింట్ల దగ్గర మొదలై ఒక దశలో 15,877 గరిష్టానికి చేరుకుంది. చివరకు 41 పాయింట్లు లాభపడి 15,853 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ షేర్లు లాభపడగా మారుతి సుజూకి, హిందుతస్థాన్ యూనిలీవర్, నెస్టల్ ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మాలు నష్టపోగా, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. -
జొమాటో సరికొత్త రికార్డ్: ఆ అంశంలో తొలి సంస్థగా..
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ నేటి (బుధవారం) నుంచీ ప్రారంభం కానుంది. షేరుకి రూ.72-76 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.9,375 కోట్లను సమీకరించాలని జొమాటో భావిస్తోంది. ఇష్యూ శుక్రవారం (16న) ముగియనుంది. చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ పెట్టుబడులున్న జొమాటో ఈ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్చేంజీలలో లిస్ట్ కానున్న తొలి దేశీ యూనికార్న్ స్టార్టప్‌గా నిలవనుంది. అంతేకాకుండా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగానూ ఆవిర్భవించనుంది. మరోవైపు 2020 మార్చిలో ఐపీవో ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించిన ఎస్బీఐ కార్డ్స్ తదుపరి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. వెరసి ఈ జనవరిలో వచ్చిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఇష్యూని అధిగమించనుంది. ఐపీవోలో భాగంగా జొమాటో రూ. 9,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. 5 లిస్టెడ్ కంపెనీలు వెనక్కి... దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీలు ఐదు లిస్టింగ్ పొందాయి. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్, బర్గర్ కింగ్ ఇండియా, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, స్పెషాలిటీ రెస్టారెంట్స్. ఇష్యూ తదుపరి జొమాటో విలువ రూ.64,365 కోట్లను తాకనుంది. వెరసి ఈ విభాగంలోని లిస్టెండ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువను జొమాటో అధిగమించనుంది. జూబిలెంట్ మార్కెట్ విలువ రూ.40,771 కోట్లుకాగా.. వెస్ట్‌లైఫ్ మార్కెట్ క్యాప్ రూ.8,381 కోట్లు. యాంకర్ పెట్టుబడులు: ఐపీవోలో భాగంగా మంగళవారం(13న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి జొమాటో 56 కోట్ల డాలర్లు (సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించినట్లు తెలుస్తోంది. షేరుకి రూ.76 ధరలో విక్రయించినట్లు సమాచారం. -
దివాలా కంపెనీలకు స్పెషల్ ట్యాగ్
ముంబై: కార్పొరేట్ దివాలా ప్రక్రియ ప్రారంభమైన కంపెనీల విషయంలో ఇన్వెస్టర్లకు స్పష్టతను ఇచ్చేందుకు వీలుగా దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మార్గదర్శకాలు రూపొందించాయి. తద్వారా ఇలాంటి కంపెనీల లిస్టింగ్ అంశాలకు సంబంధించి సరైన సమాచారాన్ని అందించేందుకు నడుం బిగించాయి. ఇటీవల రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా పలు కంపెనీలు వాటాదారులకు ఎలాంటి చెల్లింపులనూ చేపట్టకుండానే తమ ఈక్విటీల డీలిస్టింగ్ లేదా రైటాఫ్, రద్దు వంటివి చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దివాలా ప్రక్రియలో భాగంగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) రుణ పరిష్కార ప్రణాళికలను ఆమోదించడంలో తొలి ఆదేశాలు, తదుపరి రాతపూర్వక ఆదేశాలకు మధ్య గడువుకు ఆస్కారం ఉంటోంది. దీంతో ఎన్సీఎల్టీకి చేరిన కంపెనీలు ఈ అంశాలపై తగిన విధంగా సమాచారాన్ని అందించడంలేదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలియజేశాయి. ఎన్సీఎల్టీ నుంచి రాతపూర్వక ఆదేశాలు వచ్చేవరకూ స్టాక్ ఎక్సే్ంజీలకు వివరాలను దాఖలు చేయడంలేదని వివరించాయి. ఇలాంటి సమాచారం ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అందుతున్నదని, ఇది అస్పష్టతకు తావిస్తున్నదని తెలియజేశాయి. వెరసి మార్కెట్లలో ఈ కంపెనీల లిస్టింగ్ సమాచారంపై గందరగోళం నెలకొంటున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా రూపొందించిన నిబంధనలలో భాగంగా కార్పొరేట్ రుణ పరిష్కార ప్రక్రియకు చేరిన కంపెనీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలను జారీ చేయనున్నాయి. సెబీ ఎల్‌వోడీఆర్ నియంత్రణల ప్రకారం ఈ ఆదేశాలు జారీకానున్నాయి. వీటిని స్టాక్ ఎక్సే్ంజీల వెబ్సైట్లలో పొందుపరచరు. ఆయా కంపెనీల ఈమెయిల్స్‌కు పంపిస్తాయి. ఎల్‌వోడీఆర్ నిబంధనలను రిజల్యూషన్ ప్రొఫెషనల్ అమలు చేయవలసి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై నిర్ణయాలను 30 నిముషాల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. దీంతోపాటు లిస్టెడ్ సెక్యూరిటీల వాటాదారులపై ఈ ప్రభావానికి సంబంధించి తగిన సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఇదే సమయంలో ఆయా కంపెనీలు, రుణపరిష్కార నిపుణులు.. రిజల్యూషన్ ప్రణాళికకు చెందిన రహస్య అంశాలపట్ల ఎక్సే్ంజీలకు దాఖలు చేసేటంత వరకూ గోప్యతను పాటించవలసి ఉంటుంది. ఏదైనా కంపెనీ ఎన్సీఎల్టీకి చేరిన వెంటనే ఎక్సే్ంజీలు టాగ్ చేస్తాయి. ఇలాంటి కంపెనీల జాబితాను సైతం పొందుపరుస్తాయి. ఎన్సీఎల్టీ ఆదేశాలు ఏవైనా ఉంటే అలర్ట్‌ను ప్రకటిస్తాయి. -
పేటీఎమ్ భారీ ఐపీవో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ భారీ ఐపీవోకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 16,600 కోట్లు సమకూర్చుకునేందుకు వీలుగా వాటాదారుల అనుమతి కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.78 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. పేటీఎమ్ ఈ నెల 12న అసాధారణ వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అదనంగా కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు వాటాలు విక్రయించడం ద్వారా రూ. 4,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవోకు వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కంపెనీ విలువ రూ. 1.78–2.2 లక్షల కోట్లస్థాయికి చేరవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. తద్వారా దేశీయంగా లిస్టయిన ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలలో మార్కెట్ విలువరీత్యా టాప్–10లో ఒకటిగా నిలవనుంది. పేటీఎమ్ ప్రధాన వాటాదారుల్లో చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్(29.71% వాటా), సైఫ్ పార్టనర్స్(18.56 శాతం), విజయ్ శేఖర్ శర్మ(14.67 శాతం)తోపాటు.. ఏజీహెచ్ హోల్డింగ్, టీ రోవే ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్ బెర్కషైర్ హాథవే ఉన్నాయి. -
స్టాక్ ఎక్సేంజీలపై సెబీ కన్నెర్ర !
ముంబై: స్టాక్ ఎక్సేంజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కన్నెర్ర చేసింది. ట్రేడింగ్ విషయంలో సాంకేతిక ఇబ్బందుల పేరుతో ఇన్వెస్టర్లను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. నాలుగు గంటలకు మించి టెక్నికల్ గ్లిచెస్ కొనసాగితే భారీగా జరిమానాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను జారీ చేసింది. రంగంలోకి సెబీ నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో 2021 ఫిబ్రవరి 24న టెక్నికల్ ఇష్యూస్‌తో 4 గంటల పాటు ట్రేడింగ్ నిలిచి పోయింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్స్, డిపాజిటరీలులకు కీలక ఆదేశాలు సెబీ జారీ చేసింది. టెక్నికల్ సమస్యలు తలెత్తితే రోజుకు కనిష్టంగా లక్ష రూపాయల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు జరిమానా విధిస్తామంది. అంతేకాదు ఎమ్ఐఐల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసరు(సీటీఓ)ల వార్షిక వేతనంలో 10 శాతం వరకు కోత పెడతామని తేల్చి చెప్పింది. టెక్నికల్ ఇష్యూస్‌పై సెబీ రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ - ఒకటి లేదా ఎక్కువ కీలక వ్యవస్థల్లో టెక్నికల్ గ్లిచెస్ వస్తే 30 నిమిషాల్లోగా పరిష్కరించాలి. లేదంటే గంటలోగా దానిని ‘డిజాస్టర్’గా ప్రకటించాలి. - డిజాస్టర్ ప్రకటనను వెల్లడించడంలో ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల స్టాండలోన్ నికర లాభంలో సగటున 10 శాతం లేదా రూ.2 కోట్లు, ఇందులో ఏది ఎక్కువైతే దాని ప్రాతిపదికన అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులూ తమ వార్షిక వేతనంలో 10 శాతం చొప్పున చెల్లించాలి. - సంఘటన జరిగిన తర్వాత 75 నిమిషాల నుంచి 3 గంటల్లోపు సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. లేదంటే ఎమ్‌ఐఐలు రూ.50 లక్షలు జరిమాన చెల్లించాలి. మూడు గంటలకు మించి టెక్నికల్ అవాంతరాలు కొనసాగితే కోటి రూపాయల జరిమాన కట్టాలి. - సాంకేతిక సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2 లక్షల నుంచి 25 లక్షల వరకు జరిమాన. - 24 గంటల్లోగా జరిగిన ఘటనలపై ప్రాథమిక నివేదిక సమర్పించాలి. - సాంకేతిక అవాంతరానికి కారణాలను వెల్లడించే కాంప్రహెన్సివ్ రూట్‌కాజ్ అనాలసిస్(ఆర్సీఏ) నివేదికను 21 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆలసమ్యమైతే జరిమాన. - నిర్దేశించిన గడువులోగా నివేదికలు ఇవ్వకపోతే... ఆ తర్వాత వచ్చే ఒక్కో వర్కింగ్‌డేకు లక్ష రూపాయల వంతున అపరాధ రుసుము చెల్లించాలి. -
బుల్ జోరుకు బ్రేక్..
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల నమోదు తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో సోమవారం బుల్ జోరుకు బ్రేక్ పడింది. సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 52,736 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లను కోల్పోయి 15,814 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడేళ్లు గరిష్టానికి చేరుకోవడం కూడా మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ ప్రభావిత రంగాలకు కేంద్రం ప్రకటించిన రూ.1.1 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఐటీ, ఆర్థిక రంగాల షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు ఒక శాతం క్షీణించి సూచీల ఆరంభ లాభాల్ని హరించి వేశాయి. అయితే ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. ప్రైవేటీకరణ వార్తలతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు మరోసారి డిమాండ్ నెలకొంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1659 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1277 కోట్ల షేర్లను కొన్నారు. రికార్డు లాభాలు మాయం... దేశీయ మార్కెట్ ఉదయం సరికొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 53,127 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 15,916 వద్ద మొదలయ్యాయి. ఈ ప్రారంభ స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. ఆసియాలో పలు దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో అక్కడి మార్కెట్లు నష్టాల్లో కదలాడటం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అలాగే సూచీలు ఆల్‌టైం హైని తాకిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. మిడ్ సెషన్ తర్వాత యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారం భం, ఆర్థిక మంత్రి ఉద్దీపన చర్యలు మెప్పించకపోవడంతో అమ్మకాల ఉధృతి మరింత పెరిగింది. చదవండి: పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు.. -
Stock Exchange : కిమ్స్, దొడ్ల... శుభారంభం
ముంబై : స్టాక్ ఎక్సేంజ్‌లో దొడ్ల డెయిరీ, కిమ్స్ హస్పిటల్స్‌కి సంబంధించిన షేర్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు ఐపీవోను జారీ చేశాయి. అనంతరం జూన్ 28న తొలిసారిగా స్టాక్మార్కెట్లో లిస్టయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే ఈ రెండు సంస్థలకు చెందిన షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఉత్సాహాం చూపించారు. కిమ్స్ సానుకూలం కిమ్స్ హాస్పిటల్ సంస్థ షేరు రూ. 825తో మొదలవగా కాసేపట్టికే 25 శాతం పెరిగి రూ. 1034 దగ్గర గరిష్ట స్థాయికి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సెంజీలో రూ. 1036 వరకు చేరుకుంది. కిమ్స్ షేర్ల ట్రేడింగ్ పట్ల మార్కెట్ సానుకూలంగానే ఉంది. సౌతిండియాలో కిమ్స్ ఆధ్వర్యంలో 9 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. 3,064 బెడ్ల సామర్థ్యం ఉంది. దొడ్ల షేర్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డైయిరీ సంస్థైన దొడ్ల సైతం ఈ రోజు స్టాక్ మార్కెట్ తొలి సారి లిస్టయ్యింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో దొడ్ల షేర్ 475 -525 మధ్యన ట్రేడ్ అవుతోంది. ఒక దశలో షేర్ వాల్యూ 33 శాతం పెరిగి రూ. 575 దగ్గర నమోదైంది. ఎన్ఎస్సీలో రూ. 572 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రెండు సంస్థలకు సంబంధించి ఐపీవోలు జూన్ 16 నుంచి 18వరకు ముగిశాయి. చదవండి : Mahindra XUV 700: మేఘాలలో తేలిపోమ్మనది -
కృష్ణపట్నం.. అదానీ పరం
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్ సోమవారం స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్ టన్నుల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లుగా పేర్కొంది. విస్తరణ దిశగా కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగివున్న కృష్ణపట్నం పోర్టును భారీగా విస్తరించనున్నట్లు ఏపీసెజ్ సీఈవో కరన్ అదాని తెలిపారు. 2025 నాటికి ప్రస్తుత పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డీప్‌వాటర్ పోర్టు కావడం, 6,800 ఎకరాలు ఉండటం మాస్టర్ ప్లాన్ ప్రకారం పోర్టు సామర్థ్యం 300 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశాలుగా పేర్కొన్నారు. దక్షిణాంధ్రప్రదేశ్‌కు కృష్ణపట్నం పోర్టును ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇది ఎంతో కీలకంకానుందని చెప్పారు. తూర్పు తీరంపై ప్రత్యేక దృష్టి 2025 నాటికి ఏపీసెజ్ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టపల్లి, ఎన్నోర్ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ, మన రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది. అదాని గ్రూపు రాష్ట్రంలోని ఈ రెండు పోర్టులో కొనుగోలు చేయడం కోసం రూ.20,354 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్ర ఆదాయంలో మార్పు ఉండదు కృష్ణపట్నం పోర్టులో ఏపీసెజ్ 100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎటువంటి ప్రభావం చూపదని ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఇప్పుడు 100 శాతం వాటా తీసుకున్నా అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీథరన్ ‘సాక్షి’కి తెలిపారు. -
నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్‌అండ్‌వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది. ఏం జరిగిందంటే... నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు. కనెక్టివిటీ సమస్యలే కారణం.. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది. వివరణ కోసం సెబీ ఆదేశం.. ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్‌ను డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు.. ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్‌లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్‌లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్‌లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది. బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది. మిగతా దేశాల్లోనూ... ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020) ట్రేడింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు. టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020) మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018) సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015) చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008) సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది. మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్ మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది. -
ఫ్యూచర్ రిటైల్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్‌కు ఓకే.. కానీ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే డీల్‌కు సంబంధించి స్టాక్ ఎక్సే్చంజీలు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పేర్కొన్నాయి. అమెజాన్‌డాట్‌కామ్ ఫిర్యాదులు, ఫ్యూచర్ రిటైల్ స్పందన మొదలైన వివరాలన్నీ కూడా స్కీమ్‌లో భాగమైన షేర్‌హోల్డర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించాయి. అలాగే, స్కీమ్ ముసాయిదా సమర్పించే ముందు ఎన్సీఎల్టీకి కూడా తెలియజేయాలని పేర్కొన్నాయి. ఎన్సీఎల్టీకి దాఖలు చేసే పిటిషన్లో స్టాక్ ఎక్సే్చంజీలు, సెబీ సూచనలను కూడా పొందుపర్చాలని తెలిపాయి. మరోవైపు ప్రతిపాది త డీల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌కు లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉండటంతో.. ఈ డీల్ ద్వారా అమెజాన్ కూడా వాటాదారుగా మారింది. ఇక కరోనా సంక్షోభ పరిస్థితుల కారణంగా రిటైల్ విభాగాన్ని రిలయన్స్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించింది. అమెజాన్ తీరును వ్యతిరేకిస్తూ ఫ్యూచర్ గ్రూప్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదం ప్రస్తు తం ఆర్బిట్రేషన్, న్యాయస్థానాల్లో నలుగుతోంది. -
డిసెంబర్ నుంచి ఎన్ఎస్ఈ వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీ ఎన్ఎస్ఈ వచ్చే నెల నుంచి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబర్ ఒకటిన ముడి సోయాబీన్ ఆయిల్ కాంట్రాక్టుతో తమ తొలి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టును ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. సోయాబీన్ ఆయిల్ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమల సంస్థలు .. ధరలను హెడ్జ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. లాట్ పరిమాణం 10 మెట్రిక్ టన్నులుగాను, కాంట్రాక్టు సెటిల్మెంట్ నెలవారీగాను ఉంటుందని తెలిపింది. దేశీ కమోడిటీ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే తెలిపారు. -
బీఎస్ఈతో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా స్టాక్ ఎక్సే్ఛంజ్ బీఎస్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్‌ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్ఎంఈలకు పరిమితంగా ఉంటోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. ప్రస్తు తం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రాష్ట్రానికి చెందిన కొన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సంఖ్య త్వరలో పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
11,000 పైకి నిఫ్టీ..
ముంబై : మార్కెట్ జోరు కొనసాగుతోంది. కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, బ్యాంక్, ఐటీ రంగ షేర్ల దన్నుతో మన స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్లపైకి ఎగబాకింది. 121 పాయింట్ల లాభంతో 11,022 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 399 పాయింట్లు పెరిగి 37,419 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఈ 4 రోజుల్లో సెన్సెక్స్ 1,386 పాయింట్లు, నిఫ్టీ 415 పాయింట్లు పెరిగాయి. రోజంతా లాభాలు... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. కంపెనీలు ముఖ్యంగా ఐటీ, బ్యాంక్‌ల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 74.91కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. మార్కెట్లో ఇదే జోరు కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అంచనా వేస్తున్నారు. షేర్ వారీ కదలికలే అధికంగా ఉంటాయని, ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలని సూచించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ► బజాజ్ ఫైనాన్స్ 4% లాభంతో రూ.3,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ►దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్, ఆర్తి డ్రగ్స్, గ్రాన్యూల్స్, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►ఈ క్యూ1లో నికర లాభం 20 శాతం పెరగడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 3 శాతం లాభంతో రూ.1,133 వద్ద ముగిసింది. ►1: 1 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూని ప్రకటించడంతో మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ 10% లాభంతో రూ.230 వద్ద ముగిసింది. క్యామ్స్ ఐపీఓకు సెబీ ఆమోదం న్యూఢిల్లీ : కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(క్యామ్స్) ఐపీఓకు నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. వార్బర్గ్ పింకస్ ఎల్ఎల్సీ,ఎన్ఎస్ఈలు ఈ కంపెనీలో ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. ఈ ఐపీఓ సైజు రూ.1,500–1,600 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా. ఐపీఓలో భాగంగా కంపెనీ వాటాదారులు 1.22 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. -
పాకిస్తాన్ స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రదాడి
కరాచీ : పాకిస్తాన్‌లోని స్టాక్‌మార్కెట్‌పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు, ముగ్గరు ఉగ్రవాదులు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. సోమవారం ఉదయం కరాచీలోని స్టాక్‌మార్కెట్ భవనంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడితో అప్రమత్తమమైన భద్రతా బలగాలు ప్రతిదాడిచేసి ముగ్గుర్ని హతమార్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. దాడిలో పలువురికి గాయాలైనట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులేనని పేర్కొంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి. -
కనీసం రెండు రోజులు ఎక్సే్ఛంజ్‌లు మూసేయండి
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజ్‌లను కనీసం రెండు రోజుల పాటు మూసేయాలని స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్, ఏఎన్ఎమ్ఐ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 900కు పైగా స్టాక్ బ్రోకింగ్ సంస్థలకు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్ఛంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా(ఏఎన్ఎమ్ఐ)లో సభ్యత్వం ఉంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, అయితే స్టాక్ బ్రోకింగ్ సంస్థలను అత్యవసర సంస్థలుగా కొన్ని రాష్ట్రాలు గుర్తించడం లేదని, దీంతో తమ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏఎన్ఎమ్ఐ పేర్కొంది. తమ ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు హాజరు కాలేకపోతున్నారని, విధి నిర్వహణలో విఫలమవుతున్నారని వివరించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తే, బ్రోకరేజ్ సంస్థలు మొత్తం అవుట్‌స్టాండింగ్ పొజిషన్లను స్క్వేరాఫ్ చేస్తాయని పేర్కొంది. కాగా సెబీ నియంత్రణలోని స్టాక్ మార్కెట్ సంస్థలను లాక్డౌన్ నుంచి మినహాయింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరింది. -
తొలి ఎన్బీఎఫ్సీ కమర్షియల్ పేపర్ల లిస్టింగ్
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (ఏబీఎఫ్‌ఎల్) తమ కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ చేసింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిలి్చంది. ఈ సీపీ ద్వారా ఏబీఎఫ్‌ఎల్ రూ. 100 కోట్లు సమీకరించింది. వీటి మెచ్యూరిటీ గడువు 2020 ఫిబ్రవరి 7గా ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కమర్షియల్ పేపర్ల లిస్టింగ్‌కు తగిన విధానాలు రూపొందించాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజీలకు నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది అక్టోబర్‌లో సూచించింది. సెబీ నిబంధనల ప్రకారం.. కనీసం రూ. 100 కోట్ల నికరవిలువ ఉన్న ఎన్బీఎఫ్సీలు, కంపెనీలకు లిస్టింగ్ అర్హత ఉంటుంది. -
హాంకాంగ్‌లో అలీబాబా అదుర్స్
హాంకాంగ్: హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో చైనా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అలీబాబా షేర్లు శుభారంభం చేశాయి. అలీబాబా షేర్ అంచనాల కంటే తక్కువగానే 176 హాంకాంగ్ డాలర్ల వద్ద లిస్టయినప్పటికీ, ఆ తర్వాత 8 శాతం లాభంతో 189.50 హాంకాంగ్ డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6 శాతం లాభంతో 187.50 హెచ్‌కే డాలర్ల వద్ద ముగిసింది. అలీబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ కావడం ఒక మైలురాయని కంపెనీ సీఈఓ డేనియల్ జాంగ్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో అది పెద్ద ఐపీఓ... ఐపీఓలో భాగంగా అలీబాబా కంపెనీ 50 కోట్ల షేర్లను ఆఫర్ చేసి 8,800 కోట్ల హాంకాంగ్ డాలర్లు (1,100 కోట్ల డాలర్లు–రూ.77,000 కోట్లు) సమీకరించింది. హాంకాంగ్‌లో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద ఐపీఓ. హాంకాంగ్‌లో అలజడులు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో అలీబాబా షేర్ లిస్ట్ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. -
నిర్భయోగ్రఫీ
రెండేళ్ల క్రితం భయం లేకుండా న్యూయార్క్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి తొలి మహిళా ఈక్విటీ ట్రేడర్‌గా అడుగుపెట్టిన లారెన్స్ సైమన్స్ (24) సాహస ఉద్యోగ జీవితంపై హాలీవుడ్ చిత్రం తయారవుతోంది. లారెన్స్ సైమన్స్ పాత్రను యువ నటి కియర్సీ క్లెమన్స్ గర్వాతిగర్వంగా పోషించబోతున్నారు. ఇరవై రెండేళ్ల వయసులో వాల్‌స్ట్రీట్‌లోని ‘న్యూయార్క్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్’ గాజు గోడల్ని భళ్లున బద్దలు కొట్టుకుని లోనికి వచ్చిన లారెన్స్ సైమన్స్ని ‘ఎవరు బేబీ నువ్వు, ఎవరు కావాలి?’ అని అడిగాయి అక్కడ పండిన తలలు కొన్ని.. రెండేళ్ల క్రితం. ‘నాకు ఎవరో కావడం కాదు, నేనే మీకు కావాలి’ అన్నట్లు నవ్వింది సైమన్స్! ‘ఏం ధైర్యం ఈ పిల్లకు’ అని వాల్‌స్ట్రీట్ నివ్వెరపోయింది. ఫ్రెష్‌గా అప్పుడే డిగ్రీ పూర్తి చేసి, ‘ఈక్విటీల ట్రేడింగ్’ చెయ్యడానికి వచ్చానంటే.. అలవాటు లేని అరణ్యం లోకి వచ్చిన కుందేలు పిల్లను చూసినట్లే కదా ఉండేది. పైగా ఫుల్ టైమ్ జాబ్ చెయ్యడానికి వచ్చానంటోంది. అంతేనా! ‘రోజన్బ్లాట్ సెక్యూరిటీస్’ తరఫున వచ్చానంది. రోజన్బ్లాట్ సీఈవో రిచర్డ్ రోజన్బ్లాట్. మొదట ఆయనా ఇలాగే ఆశ్చర్యపోయారు. ‘‘జెనెటిక్స్‌లో ఇంజనీరింగ్ చేశానంటున్నావ్. వాల్స్ట్రీట్కి ఎందుకొచ్చావ్?’’ అని అడిగారు. ‘‘ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది. న్యూయార్క్ ఫ్లయిట్ ఎక్కేశా. మీరు కనిపించారు’’ అంది. ‘‘మైక్రోసెకన్స్లో ఇక్కడ డెసిషన్స్ తీసుకోవాలి తెలుసా. ఎందుకొచ్చిన స్ట్రెస్. జార్జియా తిరిగి వెళ్లి నువ్వు చదివిన కెన్నసా యూనివర్సిటీ ల్యాబ్‌లోని మైక్రోస్కోపుల్లో పరిశోధనలు చేసుకో. ఈ పరుగులొద్దు’’ అని పితృవాత్సల్యంతో ఆయన సలహా ఇచ్చారు. ఆయనదీ పెద్ద వయసేం కాదు. యాభై. సైమన్స్తో పోలిస్తే పెద్దవాడే. ‘‘లేదు సర్. వెళ్లను’’ అంది. ‘‘సరే, నీ ఇష్టం. అయితే నీకు ఇష్టమైంది కదా అని ‘ఈక్విటీ ట్రేడర్’ ఉద్యోగం ఊరికే వచ్చేయదు. ఇంటెర్న్‌గా ఉండాలి. అందుకోసం ‘సిరీస్ 19’ ఎగ్జామ్ రాయాలి. ఫ్లోర్ బ్రోకర్ బ్యాడ్జి రావడానికి అది మినిమం క్వాలిఫికేషన్’’ అని చెప్పారు రిచర్డ్స్. ‘‘రాస్తాను సర్’’ అంది. ‘‘రాస్తే కాదు. పాస్ అవ్వాలి. రాసిన వాళ్లలో 20 శాతం మంది కూడా పాస్ కారు’’అన్నారు ఆయన. సైమన్స్ నవ్వింది. సిరీస్ నైన్టీన్ ఎగ్జామ్ పాస్ అయ్యాక కూడా అలాగే నవ్వింది. ‘‘చూశారా పాస్ అయ్యాను’ అని ఆ నవ్వుకు అర్థం కాదు. ‘‘కష్టపడి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాను సర్’’ అని చెప్పడం. వెంటనే జాబ్. జాబ్‌లో చేరింది. మైక్రో సెకన్స్‌లో డిసిషన్స్ తీసుకుంటోంది! సీనియర్స్‌ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వారి ప్రశంసలతో పాటు తనకో ముద్దుపేరును కూడా కొట్టేసింది. ‘లోన్ ఉమన్ ఆన్ వాల్ స్ట్రీట్’ అని! ఈక్విటీ ట్రేడర్‌గా ఇంతవరకు అక్కడ ఒక్క అమ్మాయి కూడా లేదు మరి. బాగుంది. ఇప్పుడెందుకు సైమన్స్ సీన్లోకి వచ్చింది. హాలీవుడ్ యువనటి కియర్సీ క్లెమన్స్ హీరోయిన్గా సైమన్స్ నిర్భయోగ్రఫీ ఓ సినిమా రాబోతోంది! సైమన్స్ ఇప్పుడక్కడ చెయ్యట్లేదు. ‘లోన్ ఉమన్ ఆన్ వాల్ స్ట్రీట్’ టైటిల్ ఇంకా అక్కడే ఉంది.. ఆమె పేరు మీద. -
ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో 140 కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్యతరహా కంపెనీల స్టాక్ ఎక్సే్చంజ్ అయిన ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో ఇప్పటి వరకు 140 కంపెనీలు నమోదుకాగా.. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 కంపెనీలున్నాయి. ఎమర్జ్‌లో లిస్టింగ్‌కు మరో 30 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఎన్ఎస్ఈ ప్రతినిధి గురువారం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ కంపెనీలున్నాయన్నారు. మొత్తం 18 రంగాల్లో ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ కంపెనీలు ఐపీఓ ద్వారా కనీసం రూ.4 కోట్లు, గరిష్టంగా రూ.85 కోట్లు సమీకరించాయి. వీటి క్యాపిటలైజేషన్ రూ.11,000 కోట్లు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్ఎంఈలన్నీ గడిచిన ఏడాది కాలంలోనే లిస్ట్ అవడం విశేషం. నెలరోజుల్లోపే అనుమతి..: సాధారణంగా ఐపీఓకు వెళ్లాలంటే కంపెనీలకు సెబీ అనుమతి తప్పనిసరి. ఎస్ఎంఈలకు మాత్రం ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్ఎస్ఈ అనుమతులిస్తోంది. మూడేళ్లు వ్యాపారంలో ఉండి, రెండేళ్లు లాభాలు ఆర్జించిన కంపెనీలు ఎమర్జ్ ద్వారా ఎక్సే్చంజ్‌లో నమోదు కావొచ్చని ఎన్ఎస్ఈ ప్రతినిధి తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న మూడు నుంచి నాలుగు వారాల్లోనే అనుమతులిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఎస్ఎంఈ క్లస్టర్లు, పారిశ్రామిక సంఘాల ద్వారా చిన్న కంపెనీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో ఎస్ఎస్ ఇన్ఫ్రా లిస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కన్సల్టెంట్స్ గురువారం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో లిస్ట్ అయింది. ఇటీవలే ఐపీవో ద్వారా ఈ కంపెనీ రూ.17 కోట్లను సమీకరించింది. ఐపీవో 10.98 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ నిధులను మూలధన అవసరాలకు, నూతన విభాగాల్లో ఎంట్రీకి వినియోగించనున్నట్టు సంస్థ సీఎండీ సత్యనారాయణ సుందర ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ఆర్డర్ బుక్ రూ.120 కోట్లుంది. ఏటా రూ.40 కోట్ల కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. 2017–18లో కంపెనీ టర్నోవరు రూ.31 కోట్లు. ఈ ఆర్థిక ఇది రూ.50 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. నికరలాభం 18–20 శాతం ఉండొచ్చు’ అని వివరించారు. -
మేనేజ్డ్ కో లొకేషన్ సేవలు
న్యూఢిల్లీ: చిన్న మధ్య స్థాయి ట్రేడింగ్ సభ్యుల అవసరాల కోసం మేనేజ్డ్ కో లొకేషన్ సేవలు అందించాలని స్టాక్ ఎక్స్ఛేంజ్లను సెబీ ఆదేశించింది. అలాగే, ఆల్గో ట్రేడింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా కొన్నింటిని ఉచితం చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలకు తోడు, సెబీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీలను సంప్రదించిన అనంతరం సెబీ తాజా నిర్ణయాలు తీసుకుంది. ‘‘చిన్న, మధ్య స్థాయి ట్రేడింగ్ సభ్యులు (బ్రోకరేజీ సంస్థలు) అధిక వ్యయాలు, నిర్వహణలో అనుభవం లేకపోవడం వంటి పలు కారణాలతో కో లొకేషన్ సర్వీసులు పొందలేకున్నారు. దీంతో మేనేజ్డ్ కొ లొకేషన్ సౌకర్యం కింద అర్హులైన వారికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తాయి. ఇక్కడి నుంచి ఆల్గోరిథ్మిక్, నాన్ ఆల్గోరిథ్మిక్ ఆర్డర్లను ప్లేస్ చేసుకోవచ్చు’’ అని సెబీ తెలిపింది. సాంకేతిక విషయాలైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఇతర సేవలకు సంబంధించిన సమాచారం వెండర్లకు అందించడం జరుగుతుందని పేర్కొంది. -
కుంభకోణంపై నాలుగు రోజులకే సీబీఐకి ఫిర్యాదు
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణాన్ని గుర్తించిన నాలుగు రోజుల్లోనే ఇటు రిజర్వ్ బ్యాంక్‌కు అటు సీబీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పది రోజులకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. రూ. 11,400 కోట్ల భారీ కుంభకోణంపై వివరణ ఇవ్వాలంటూ స్టాక్ ఎక్స్చేంజీలు సూచించిన మీదట పీఎన్బీ ఈ విషయాలు వెల్లడించింది. మోసం చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని వివరించింది. మోదీ, ఆయన కంపెనీలు నకిలీ బ్యాంక్ గ్యారంటీలను ఏ విధంగా ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలను తీసుకుని, మోసానికి పాల్పడినదీ స్టాక్ ఎక్స్చేంజీలకు పీఎన్బీ సవివరంగా తెలియజేసింది. పరిణామక్రమం ఇదీ.. ♦ 2018 జనవరి 25న పీఎన్బీ ఈ స్కామ్‌ను గుర్తించింది. జనవరి 29న రిజర్వ్ బ్యాంక్‌కు ఫ్రాడ్ రిపోర్టు సమర్పించింది. అదే రోజున ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి క్రిమినల్ కంప్లైంటు కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 5న స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ మోసం గురించి తెలియజేసింది. ♦ మళ్లీ ఫిబ్రవరి 7న ఆర్బీఐకి మరో ఫ్రాడ్ రిపోర్టును సమర్పించింది. అదే రోజున సీబీఐకి ఇంకో ఫిర్యాదు కూడా చేసింది. ఫిబ్రవరి 13న నీరవ్ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్, చంద్రి పేపర్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ సంస్థలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి కూడా పీఎన్బీ ఫిర్యాదు చేసింది. వీటి గురించి ఆ మరుసటి రోజున స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫిర్యాదుల సారాంశం ఇదీ.. ♦ పీఎన్బీ ముంబై శాఖలోని ఫారిన్ ఎక్సే్చంజీ విభాగంలో డిప్యుటీ జీఎంగా పనిచేసిన గోకుల్‌నాథ్ శెట్టి (ప్రస్తుతం రిటైర్డ్) తదితర ఉద్యోగులతో మోదీ, ఆయనకు చెందిన కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ముత్యాల దిగుమతికి నిధుల అవసరాల పేరిట పీఎన్బీ నుంచి మోసపూరితంగా 1.77 బిలియన్ డాలర్ల విలువ చేసే గ్యారంటీలు పొందాయి. వాటిని ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలు తీసుకున్నాయి. ♦ ఆ తర్వాత 2018 జనవరి 16న ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్బీ శాఖకు దిగుమతి పత్రాలతో వచ్చిన నీరవ్ మోదీ గ్రూప్‌నకు చెందిన సంస్థలు .. విదేశీ సరఫరాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ కోరాయి. అప్పటికి శెట్టి రిటైరయ్యారు. 100 శాతం నగదు మార్జిన్ లేనందున లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ) ఇవ్వడం కుదరదంటూ పీఎన్బీ సిబ్బంది.. మోదీ సంస్థలకు స్పష్టం చేశాయి. అయితే, తాము చాలా ఏళ్లుగా ఇలాంటి వెసులుబాటు పొందుతున్నామంటూ సదరు సంస్థలు వెల్లడించాయి. దీంతో .. పీఎన్బీ వెంటనే ఈ అంశాన్ని పరిశీలించింది. గతంలో కూడా ఎల్వోయూలు జారీ అయినట్లు గుర్తించింది. వాటి ఆధారంగా రుణాలు ఇవ్వాలంటూ.. బ్యాంకు అంతర్గత వ్యవస్థలో ఎక్కడా నమోదు చేయకుండా స్విఫ్ట్ విధానం ద్వారా విదేశీ బ్యాంకులకు సందేశాలు వెళ్లినట్లు గుర్తించింది. ♦ ఇవన్నీ బైటపడటంతో .. సదరు మొత్తాలను చెల్లించాలంటూ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్ వర్గాలతో ఢిల్లీ, ముంబైలలో పీఎన్బీ చర్చలు జరిపింది. అటుపైన నీరవ్ మోదీకి చెందిన మూడు గ్రూప్ సంస్థల ప్రమేయమున్న రూ. 280 కోట్ల మోసానికి సంబంధించి 2018 జనవరి 29న ఎఫ్ఎంఆర్–1 (మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ఆర్బీఐ నిర్దేశిత ఫార్మాట్)ను రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించింది. అటుపై ఫిబ్రవరి7న గీతాంజలి గ్రూప్‌నకు చెందిన రెండు కంపెనీలు మోసపూరితంగా తీసుకున్న సుమారు రూ. 65.25 కోట్ల ఎల్వోయూలు మెచ్యూర్ కావడంతో మరో రిపోర్టును ఆర్బీఐకి పంపింది. హాంకాంగ్‌లోని అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు శాఖల నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం కోరింది. -
విదేశీ ఎక్స్చేంజిల్లో దేశీ సూచీల ట్రేడింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల పెట్టుబడులు విదేశీ మార్కెట్లకు తరలిపోకుండా... ఇకపై అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజిల్లో తమ సూచీల ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మూడు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించుకున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజిఆఫ్ ఇండియా (ఎంఎస్‌ఈఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి (ఎస్‌జీఎక్స్) తాజాగా నిఫ్టీ 50లో భాగమైన కంపెనీల స్టాక్స్ ఫ్యూచర్స్‌లో కూడా ట్రేడింగ్ ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్‌జీఎక్స్ తదితర ఎక్స్చేంజిల ధోరణులతో... దేశ మార్కెట్ల నుంచి లిక్విడిటీ విదేశీ మార్కెట్లకు తరలిపోయే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. విదేశీ ఎక్సే్చంజీలు, ట్రేడింగ్ ప్లాట్‌ఫాంల డెరివేటివ్స్ ట్రేడింగ్‌కి సంబంధించి సూచీలు, స్టాక్స్ ధరల వివరాలను అందించేందుకు కుదుర్చుకున్న లైసెన్సింగ్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు మూడు ఎక్సే్చంజీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. -
ఒక్కసారిగా కుప్పకూలిన వాక్‌వే
-
అలా చూస్తుండగానే కుప్పకూలింది..!
జకార్తా: జకార్తాలోని ఇండోనేషియా స్టాక్ ఎక్చ్సేంజ్ భవనంలో సోమవారం తీవ్ర ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే భవనంలోని వాక్‌వే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో వాక్‌వేపై నడుస్తున్న వాళ్లు హాహాకారాలు చేస్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో 72 మంది గాయపడ్డారు. ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్టడీ టూర్లో భాగంగా విద్యార్థులు జకార్తాలోని స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించడానికి వచ్చారు. వివిధ కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే బహుళ అంతస్తుల(32) భవనాన్ని సందర్శిస్తుండగా.. ఒక అంతస్తులోని వాక్‌వే ఒక్కసారిగా కూలిపోయింది. వాక్‌వేపైకి పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో కూలినట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనేకమంది పర్యాటకులు, ఇతర ఉద్యోగులను ఖాళీ చేయించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు భోజన విరామం కావడంతో స్టాక్ ఎక్సేంజ్ ఉద్యోగులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జకార్తాలో అత్యంత ఆధునిక భవనాలలో ఒకటైన స్టాక్ ఎక్చ్సేంజ్ భవనం కుప్పకూలడం స్థానికంగా ఆందోళన రేపింది. ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. స్టాక్ ఎక్చ్సేంజ్ డైరెక్టర్ ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇదే భవనంలో ప్రపంచ బ్యాంకు సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రాణనష్టం ఎంత అనేది అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఈ ప్రమాదంపై ఇప్పటికే ట్విట్టర్లో వీడియోలు, పోస్ట్‌లు వెల్లువెత్తాయి. -
బీమా బ్రోకింగ్‌లోకి బీఎస్ఈ
ముంబై: స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు సంస్థ తెలిపింది. త్వరలోనే ఇందుకోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ ఎక్సే్చంజీ ఈబిక్స్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తద్వారా బీమా పథకాల విక్రయ వ్యాపారానికి ఉపయోగపడే ఎక్సే్చంజ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. బీఎస్ఈ–ఈబిక్స్ పేరిట ప్రారంభించే ఈ కొత్త వెంచర్ .. దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ అవుట్‌లెట్స్, స్టాక్ బ్రోకర్లు, వెల్త్ మేనేజ్మెంట్ అడ్వైజర్లు, ఆర్థిక సంస్థలు.. జీవిత బీమా, సాధారణ బీమా పథకాలను విక్రయించేందుకు బీమా పంపిణీ ఎక్సే్చంజ్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడగలదని బీఎస్ఈ తెలిపింది. -
నేటి నుంచే బీఎస్ఈ ఐపీఓ
• 25న ముగింపు • ఇష్యూ ధర రూ.805–806 న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్ఈ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా బీఎస్ఈ రూ.1,243 కోట్లు సమీకరించనున్నది. ఒక దేశీయ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది వస్తున్న తొలి ఐపీఓ కూడా ఇదే. రూ.805–806 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ఈ నెల 25(బుధవారం) ముగియనున్నది. ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖ విలువ గల 1.54 కోట్ల షేర్లను(28.26 శాతం వాటా) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఆఫర్ చేయనున్నారు. కనీసం 18 షేర్లకు, ఆ తర్వాత 18 గుణిజాల్ల చొప్పున షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సెల్ఫ్ లిస్టింగ్‌కు సెబీ నిబంధనలు అనుమతించని కారణంగా బీఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలోనే లిస్ట్ అవుతాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు 46 లక్షల షేర్లను ఒక్కోటి రూ.806 చొప్పున కేటాయించి బీఎస్ఈ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించింది. ఈ దృష్ట్యా ఈ ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. ఆసియాలో పురాతనమైన ఎక్సే్ఛంజ్.. ఆసియా దేశాల్లో అత్యంత పురాతనమైన ఎక్సే్ఛంజ్అయిన బీఎస్ఈలో ప్రస్తుతం బజాజ్ హోల్డింగ్స్ ఇన్వెస్ట్మెంట్, కాల్డ్వెల్ ఇండియా హోల్డింగ్స్, అకేసియా బన్యన్ పార్ట్నర్స్, సింగపూర్ ఎక్సే్ఛంజ్, అమెరికా ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌కు చెందిన మారిషస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే క్వాంటమ్ ఫండ్, డాషే బోర్సే, ఎస్బీఐ, ఎల్ఐసీ, జీకేఎఫ్ఎఫ్ వెంచర్స్, తదితర సంస్థలకు వాటాలున్నాయి. బీఎస్ఈలో ప్రారంభంలో సుమారుగా 9,000 మంది వాటాదారులున్నారని అంచనా. వీరిలో అధికులు స్టాక్ బ్రోకర్లే. కాలక్రమంలో విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు ఈ బ్రోకర్ల నుంచి ఈ వాటాలను కొనుగోలు చేశారు. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే బీఎస్‌ఈనే ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే భారత్‌లో అతి పెద్దది, ప్రపంచంలో పదవది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,10,23,189 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 5,911 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇక భారత్‌లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఎకైక ఎక్సే్ఛంజ్.. ఎంసీఎక్స్(మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్). కాగా రూ.10 వేల కోట్ల సమీకరణ నిమిత్తం ఎన్ఎస్ఈ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. -
స్టాక్ మార్కెట్‌కు సెన్సెక్స్, నిఫ్టీలే ప్రామాణికం ఎందుకు?
స్టాక్ మార్కెట్‌కు ప్రామాణికంగా ప్రధాన ఇండెక్స్‌లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇండెక్స్‌లో వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల స్టాక్స్ ఉంటాయి. దేశంలో చాలా స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి. కానీ బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లు మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. బీఎస్ఈ 1875లో ఏర్పాటయ్యింది. దీని ప్రామాణిక ఇండెక్స్ ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్. సెన్సెక్స్‌లో 30 స్టాక్స్ ఉంటాయి. ఇవి వివిధ రంగాల్లోని పెద్ద, ఆర్థికంగా బలమైన, షేర్లలో అధిక లిక్విడిటీ ఉన్న కంపెనీలకు చెందినవి. ఇక ఎన్ఎస్ఈ 1992లో ప్రారంభమైంది. దీని బెంచ్‌మార్క్ ఇండెక్స్ సీఎన్ఎక్స్ నిఫ్టీ. నిఫ్టీలో 23 రంగాలకు చెందిన 50 ప్రముఖ స్టాక్స్ ఉంటాయి. ఈ రంగాలకు సూచీలో ఎంతమేర వాటా ఉందో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు. సెన్సెక్స్, నిఫ్టీలలో బాగా ట్రేడయ్యే వివిధ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ కంపెనీల స్టాక్స్ ఉంటాయి. అందుకే ఆయా రంగానీలకు చెందిన ఏ చిన్న వార్త అయినా.. సంబంధిత కంపెనీ స్టాక్ విలువను ప్రభావితం చేస్తుంది. అంటే సంబంధిత షేరు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీలు ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న అంశాల వల్ల కూడా ఇవి ప్రభావితమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఈ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండెక్స్‌లు కూడా పెరగడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. అందుకే సెన్సెక్స్, నిఫ్టీలను ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ప్రధాన సూచీలుగా భావిస్తారు. సెన్సెక్స్ లేదా నిఫ్టీ హిస్టారికల్ ట్రెండ్స్(గత ధోరణి)ను విశ్లేషించడం ద్వారా కూడా భారత ఈక్విటీ మార్కెట్ వృద్ధిని అంచనా వేయవచ్చు. -
వచ్చే వారంలో ఎన్ఎస్ఈ ఐపీఓ పత్రాలు దాఖలు!
ఓఎఫ్ఎస్ మార్గంలో షేర్ల జారీ న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి వచ్చే వారంలో సమర్పించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్ఎస్ఈ అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద ఐపీఓ అన్న అంచనాలున్నాయి. ఈ ఐపీఓలో భాగంగా ఎన్ఎస్ఈలో వాటాలున్న పలు కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించనున్నాయి. ఎన్ఎస్ఈ ఐపీఓ సన్నాహాల నేపథ్యంలో ఆశ్చర్యకరంగా ఎన్ఎస్ఈ సీఈఓ చిత్ర రామకృష్ణన్ తన పదవికి ఈ మధ్యే రాజీనామా చేశారు. కాగా ఈ ఐపీఓ కోసం ఎన్ఎస్ఈ ఇప్పటికే లిస్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి, మర్చంట్ బ్యాంకర్లను కూడా నియమించింది. సిటిగ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ ల్లో లిస్టింగ్ కానున్నామని ఈ ఏడాది జూన్‌లోనే ఎన్ఎస్ఈ ప్రకటించింది. మరో స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ కూడా ఐపీఓకు రానుంది. -
స్టాక్ ఎక్స్ఛేంజ్ లలోకి తాజా గోల్డ్ బాండ్లు
రేపటి నుంచి ట్రేడింగ్ ప్రారంభం ముంబై: గత నెల జారీ చేసిన గోల్డ్ బాండ్లలో బుధవారం నుంచి ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గత నెల 30న జారీ అయి డీమ్యాట్ మోడ్‌లో ఉన్న బంగాం బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ నెల 19వ తేదీ నుంచి ట్రేడింగ్‌కు అర్హమైనవని ఆర్బీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఐదో విడత గోల్డ్ బాండ్ల జారీ ప్రకటనను ఆగస్ట్‌లో జారీ చేసింది. సెప్టెంబర్ 1-9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా... రెండు లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అదే నెల 30న బాండ్లను జారీ చేసింది. బంగారంపై పెట్టుబడులకు సంబంధించి ఆభరణాలకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఈ బాండ్లను తొలిసారి గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. -
బిగ్‌బజార్ చేతికి ‘హెరిటేజ్ ఫ్రెష్’!
• అమ్మకానికి హెరిటేజ్ రిటైల్ వ్యాపారం • ఫ్యూచర్ గ్రూప్‌తో చర్చలు నిజమేనన్న కంపెనీ • ఈ వార్తలతో పరుగులు తీసిన షేరు ధర సాక్షి, అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూపు నష్టాల్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని వదిలించుకోవడానికి సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, తుది రూపునకు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ఎక్స్ఛేంజీలకు పూర్తి వివరాలను తెలియచేస్తామని కంపెనీ ఆ లేఖలో పేర్కొంది. ఈ వాటాల విక్రయంపై ఒక ఆంగ్ల బిజినెస్ పత్రికలో వచ్చిన కథనంపై ఎక్స్చేంజీ వివరణ కోరింది. ఈ వార్తల నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు సోమవారం ఒకానొక దశలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను రూ.956ను తాకి చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 10 శాతం లాభంతో రూ.898 వద్ద ముగిసింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ.362లుగా ఉన్న షేరు ధర ఏడాదిలో సుమారు రెట్టింపై రూ. 956 వరకు పెరిగింది. నష్టాలకు తోడు... డెయిరీ, రిటైల్, ఆగ్రి, బేకరీ, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూపు గత మార్చి నాటికి రూ. 2,387 కోట్ల టర్నోవర్‌పై రూ. 55 కోట్ల లాభాలను నమోదు చేసింది. కానీ మొత్తం వ్యాపారంలో సుమారు 20 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. గత మార్చి నాటికి రిటైల్ విభాగం రూ. 583 కోట్ల ఆదాయంపై రూ. 14 కోట్ల నష్టాన్ని (పన్నుకు ముందు) ప్రకటించింది. హెరిటేజ్ ఫ్రెష్ బ్రాండ్ నేమ్‌తో దేశవ్యాప్తంగా 115 స్టోర్స్ ఉన్నాయి. నష్టాలకు తోడు సుమారు 70కిపైగా రిటైల్ ఔట్లెట్లు తెలంగాణాలోనే ఉండటం కూడా రిటైల్ వ్యాపారం నుంచి వైదొలగడానికి కారణం కావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిటైల్ నుంచి వైదొలిగి ప్రధానమైన డెయిరీ వ్యాపారంపై మరింత దృష్టిసారించాలని కంపెనీ యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ‘మోర్’రిటైల్ ఔట్లెట్లను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చినా వాస్తవ రూపందాల్చలేదు. ఇప్పుడు దక్షిణాది మార్కెట్లో బాగా విస్తరించి ఉన్న హెరిటేజ్ ఫ్రెష్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు దాదాపు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మార్జిన్లు అధికంగా ఉండే సొంత లేబుల్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చన్నది ఫ్యూచర్ గ్రూపు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఊహాగానాలపై ఫ్యూచర్ గ్రూపు స్పందించలేదు. హెరిటేజ్ రిటైల్ వ్యాపారం విలువ ఎంత కట్టారు, ఈ ఒప్పందం ఏ విధంగా జరగనుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం షేర్ల బదలాయింపు విధానంలో కాకుండా నేరుగా నగదు రూపంలోనే జరగొచ్చని తెలుస్తోంది. అంకెల్లో... ⇔ ప్రస్తుత హెరిటేజ్ గ్రూపు మార్కెట్ క్యాప్ రూ. 2,092 కోట్లు ⇔ మార్చి నాటికి హెరిటేజ్ గ్రూపు ఆదాయం రూ.2,387 కోట్లు ⇔ రిటైల్ బిజినెస్ ఆదాయం రూ. 583 కోట్లు ⇔ మార్చినాటికి కంపెనీకి ఉన్న అప్పులు రూ. 106 కోట్లు ⇔ రిటైల్ బిజినెస్ స్థూల నష్టం: 14 కోట్లు ⇔ ప్రస్తుత రిటైల్ ఔట్లెట్ల సంఖ్య 115 ⇔ నెలకు 20 లక్షల మంది ఖాతాదారులు ⇔ రిటైల్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 2,689 ⇔ ఏడాదిలో రెట్టింపై రూ.363 నుంచి రూ.956కి చేరిన షేరు -
ఆర్బీఎల్ షేరు ధర 33 శాతం అప్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజ్లో కొత్తగా లిస్టైన ఆర్బీఎల్ బ్యాంక్ షేరు బుధవారం ర్యాలీ జరిగింది. బీఎస్ఈలో 33 శాతంమేర ఎగసి రూ.299.3 వద్ద ముగిసింది. ఇది ఇ ష్యూ ధర (రూ.225)తో పోలిస్తే 33 శాతం అధికం. ఆర్బీఎల్ షేరు లిస్టింగ్ రూ.274 వద్ద ప్రారంభమయ్యింది. ఇది ఇష్యూ ధరతో పోలిస్తే 22 శాతం ఎక్కువ. ఇంట్రాడేలో షేరు ధర 35.55 శాతం పెరిగి రూ.305 గరిష్ట స్థాయికి చేరింది. ఇక ఎన్ఎస్ఈలో ఆర్బీఎల్ షేరు ధర 33 శాతం వృద్ధితో రూ.299.4 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2 కోట్లకుపైగా, ఎన్ఎస్ఈలో 7 కోట్లకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11,068 కోట్లుగా ఉంది. ఈ బ్యాంకు గతవారంలో ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. -
బీఎస్ఈ నుంచి ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలు
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ తాజాగా ఈక్విటీ, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ఒకే ఒక మెసేజ్‌తో పలు కోట్స్ చేయడానికి వీలుగా ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ట్రేడింగ్ చేసే వ్యక్తి 99 కోట్స్ చేయవచ్చని బీఎస్ఈ తెలిపింది. ఒకే ప్రొడక్ట్‌కు చెందిన పలు కాంట్రాక్టులకు మల్టిపుల్ కోట్స్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ కోట్ అనేది ఒక సైడ్ (కొనడం లేదా అమ్మడం) కావొచ్చు లేదా డబుల్ సైడ్ (కొనడం, అమ్మడం)కు సంబంధించినది కావొచ్చని తెలిపింది. రిక్వెస్ట్ ద్వారా కోట్స్‌ను సవరించుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ట్రేడర్ రిస్క్ రిడక్షన్ మోడ్‌లోకి వెళితే పెండింగ్‌లో ఉన్న అన్ని కోట్స్ డిలీట్ అవుతాయని తెలిపింది. -
సోమవారం నుంచి గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్
ముంబై: ఫిబ్రవరి 8, మార్చి 29న జారీ అయిన గోల్డ్ బాండ్లు సోమవారం (ఆగస్టు 29) నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత జారీ అయిన సావరిన్ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటికి నాలుగు దఫాలుగా పసిడి బాండ్ల జారీ పక్రియ జరిగింది. చివరి దశలో జారీ చేసిన పసిడి బాండ్లు ఎప్పుడు ట్రేడవుతాయన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆర్బీఐ పేర్కొంది. కాగా ఐదవ విడత పసిడి బాండ్ల జారీ ప్రక్రియను వచ్చే నెల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. రెండు గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది. -
గతవారం బిజినెస్
గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ శుభారంభం స్టాక్ ఎక్స్చేంజ్ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ గత సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది. టాటా క్లిక్‌లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా టాటా గ్రూప్ ఇటీవలనే ప్రారంభించిన తన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘టాటా క్లిక్’లో ప్రత్యేకమైన స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్ తన ట్యాబ్లెట్స్, సాఫ్ట్వేర్, ఫోన్లను వినియోగదారులకు విక్రయించనున్నది. ప్రోంటెక్లో పెరిగిన హవెల్స్ వాటా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హవెల్స్ తన భాగ స్వామ్య కంపెనీ ప్రోంటెక్ రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో అధిక వాటాను చేజిక్కించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 51 శాతం ఉన్న వాటాను హవెల్స్ 70 శాతానికి పెంచుకున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రోంటెక్ ప్రస్తుతం ఎల్ఈడీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ రంగంలో ఉంది. ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ పేరు మార్పు ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ కంపెనీ పేరు భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్గా మారింది. భారత్‌లో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థల్లో ఒకటిగా భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 18 రాష్ట్రాల్లో లక్షకు పైగా గ్రామాల్లో 63.65 లక్షల మహిళా సభ్యుల సూక్ష్మ రుణ అవసరాలను తీరుస్తోంది. ఈ సంస్థ రుణ రికవరీ పద్ధతులు దారుణంగా ఉండటంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం 2010లో సంచలనం సృష్టించింది. ఎంజీఎల్ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.380-421 మహానగర్ గ్యాస్ లిమిటెడ్(ఎంజీ ఎల్) తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు ధర శ్రేణిని రూ.380-421గా నిర్ణయించింది. దేశంలో రెండో అతి పెద్ద సీఎన్జీ రిటైల్ సంస్థ అయిన ఎంజీఎల్ ఈ ఐపీఓ ద్వారా రూ.1,040 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగుస్తుంది. పెరిగిన టోకు ద్రవ్యోల్బణం కూరగాయల ధరలు మండిపోవడంతో మే నెల టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.79 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 0.45గా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.34 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.21 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94 శాతానికి పెరిగింది. మాల్యా నేరస్థుడే! బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేయడంతోపాటు.. బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మరో అడుగుముందుకేసింది. ఈడీ వినతి మేరకు ఇక్కడి ప్రత్యేక మనీలాండరింగ్ నేరాల విచారణ(పీఎంఎల్ఏ) కోర్టు మాల్యాను మంగళవారం ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించింది. ఐడీబీఐ బ్యాంకుకురూ.900 కోట్ల రుణ బకాయిలను ఎగవేసిన కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తగ్గిన ఎగుమతులు అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో ఎగుమతులు మే నెలలో 0.79% క్షీణించి 2,217 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు వరుసగా 18వ నెలలో కూడా పతనమయ్యాయి. మే నెలలో ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా క్షీణించాయి. గత ఏడాది మేలో 3,275 కోట్లు డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది మేలో 13% తగ్గి 2,844 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది మేలో 1,040 కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ ఏడాది మేలో 627 కోట్ల డాలర్లకు తగ్గింది. సామాన్యుడికీ విమాన యోగం కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500, అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అలాగే వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా కేంద్రం చరమగీతం పాడింది. ప్రయాణికులకు టిక్కెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆమోదం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితోపాటు దాదాపు రూ.1,000 కోట్ల మూలధనంలో ఏర్పాటయిన భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ దాదాపు 90 బ్రాంచీలతో పనిచేస్తోంది. తాజా పరిణామంతో ప్రపంచ స్థాయి బ్యాంక్‌గా ఆవిర్భావ దిశలో ఎస్బీఐ కీలక అడుగు వేసినట్లయ్యింది. చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం చక్కెర ధరను అదుపు చేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటిఫై చేసినట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆరు నెలల క్రితం రూ. 30 వద్దనున్న చక్కెర ధరలు అమాంతం రూ. 40 వరకూ పెరిగాయి. ఈ నేపథ్యంలో 25 శాతం ఎగుమతి సుంకాన్ని విధించాలంటూ ఆహార మంత్రిత్వ శాఖ సిఫార్సుచేయగా, అంతకంటే తక్కువ సుంకాన్నే ఆర్థిక శాఖ విధించింది. నిధుల సమీకరణలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్! అందుబాటు ధరల్లో గృహాలు, మౌలిక వసతుల రంగానికి రుణాలు అందించేందుకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.50వేల కోట్ల నిధుల సమీకరణకు వాటాదార్ల అనుమతి కోరనుంది. డెట్ ఇన్స్ట్రుమెంట్స్, టైర్-2 కేపిటల్ బాండ్స్, సీనియర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌ను దేశీయ మార్కెట్లో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.50వేల కోట్లకు మించకుండా నిధులు సేకరించాలని బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. స్టార్టప్‌ల కోసం ఎస్బీఐ ఫండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలో నెలకొనే స్టార్టప్‌ల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 200 కోట్లతో ఫండ్ ఏర్పాటుచేసింది. బ్యాంకింగ్, సంబంధిత టెక్నాలజీ కోసం ఇండియాలో రిజిస్టర్ అయిన స్టార్టప్ కంపెనీకి రూ. 3 కోట్ల వరకూ ఈ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందించనున్నట్లు ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కొ)లో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. హడ్కొలో పెయిడప్ ఈక్విటీలో 10 శాతం వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డీల్స్.. * టెక్నాలజీ రంగంలో అతిపెద్ద డీల్‌కు మైక్రోసాఫ్ట్ తెరతీసింది. వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు, సంస్థలకు ఆన్లైన్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్ఇన్ను చేజిక్కిం చుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ కోసం ఏకంగా 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(దాదాపు రూ.1.75 లక్షల కోట్లు) చెల్లించనున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కావడంతోపాటు... సత్య నాదెళ్ల కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే కావడం గమనార్హం. * వెల్స్పన్ ఎనర్జీ అనుబంధ కంపెనీ ‘వెల్స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’(డబ్ల్యూఆర్ఈపీఎల్)ని టాటా పవర్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. డీల్ విలువ రూ.9,249 కోట్లుగా ఉంటుందని అంచనా. * దేశీ బీమా రంగంలో అతిపెద్ద విలీన-కొనుగోలు ఒప్పందానికి తెరలేచింది. మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. -
గోల్డ్ బాండ్ ట్రేడింగ్ శుభారంభం
ముంబై: స్టాక్ ఎక్స్చేంజ్ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది. భౌతికంగా బంగారాన్ని కొనకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవడానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ వీలు కల్పిస్తాయి. గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 30న ప్రారంభించింది. -
13వ తేదీ నుంచీ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్
ముంబై: మొదటి విడత జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు 13వ తేదీ (సోమవారం) నుంచీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 నవంబర్ 30న జారీ చేసిన బాండ్లు సోమవారం నుంచీ ట్రేడవుతాయని, తరువాతి తేదీల్లో జారీ చేసిన బాండ్ల ట్రేడింగ్ తేదీలను తరువాత నోటిఫై చేస్తామని కూడా ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకూ మూడు విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. త్వరలో నాల్గవ విడతను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం బాండ్లపై వార్షిక వడ్డీరేటు 2.75 శాతం. -
ఈ నెల 18 నుంచి డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం. షేర్ల బైబ్యాక్ కోసం డీఆర్ఎల్ గరిష్టంగా రూ. 1,569 కోట్లు కేటాయించింది. కంపెనీ మొత్తం మూలధనంలో 25 శాతం షేర్లకు మించకుండా ఈ బైబ్యాక్ జరుపుతుంది. మిగులు నిధులను సమర్ధంగా వినియోగించుకునే లక్ష్యంలో భాగంగా బైబ్యాక్ చేపట్టాల్సి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా బైబ్యాక్‌తో షేర్ల సంఖ్య తగ్గుతుందని, ఫలితంగా షేరు ఒక్కింటిపై రాబడి (ఈపీఎస్) పెరుగుతుందని పేర్కొన్నాయి. గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి డీఆర్ఎల్ చేతిలో సుమారు రూ. 2,500 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కాగా, షేర్ల బైబ్యాక్ వార్తలతో మంగళవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు ధర 1.79 శాతం పెరిగి రూ. 3,082.80 వద్ద క్లోజయ్యింది. -
ఎగవేతదారులపై సెబీ కొరడా
నిధులు సమీకరించకుండా నిషేధం ♦ కంపెనీల బోర్డు పదవులకూ నో న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక చర్యలు తీసుకుంది. బ్యాంకు రుణాలఉ ఉద్దేశపూర్వకంగా ఎగవేసే వారి విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి వారు షేర్లను, బాండ్లను జారీ చేసి జనం నుంచి నిధులు సమీకరించకుండా నిషేధం విధించింది. వీరికి కంపెనీల బోర్డుల్లోనూ ఎలాంటి పదవినీ చేపట్టే అర్హత ఉండదు. రుణ ఎగవేత ఆరోపణలున్న వ్యాపారి విజయ్ మాల్యాపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆయన వివిధ సంస్థల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. అవన్నీ పోయే అవకాశముంది. మరోవైపు, సెక్యూరిటీస్, కమోడిటీస్ మార్కెట్లలో అవకతవకలను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు బ్రోకింగ్ సంస్థలు.. ఇతర మధ్యవర్తులపై పర్యవేక్షణ పెంచాలని కూడా సెబీ నిర్ణయించింది. శనివారం జరిగిన బోర్డు భేటీలో పాల్గొన్న అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా ఈ వివరాలు తెలిపారు. విల్‌ఫుల్ డిఫాల్టరుగా నిర్ధారణ అయిన వ్యక్తి లేదా కంపెనీని మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించనివ్వడం రిస్కుతో కూడుకున్నదని అన్నారు. నోటిఫై చేసిన తర్వాతి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. మరోవైపు, లిస్టెడ్ కంపెనీలను కొన్నప్పుడు యాజమాన్య అధికారాల బదిలీ, సంక్షోభంలో ఉన్న డెట్ సెక్యూరిటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు తదితర అంశాలనూ ఇందులో చర్చించారు. ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచేందుకు, కమోడిటీ డెరివేటివ్స్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బోర్డు సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. బీఎస్ఈ ఐపీవోకు అనుమతులు .. స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కు సూత్రప్రాయంగా అనుమతినిచ్చినట్లు సిన్హా తెలిపారు. దీంతో మరో 6-9 నెలల్లోగా బీఎస్ఈ ఐపీవోకు మార్గం సుగమమైంది. జనవరిలోనే ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్న తాము... ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్లను నియమించుకున్నామని బీఎస్ఈ తెలిపింది. -
హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆరంభం
ఆ నేడు 1943 నవంబర్ 14: స్టాక్ ఎక్స్ఛేంజ్ అనగానే మనకు ముంబాయే గుర్తొస్తుంది కానీ, హైదరాబాద్‌లో 1942 న వంబర్లోనే స్టాక్ఎక్స్ఛేంజ్ని నెలకొల్పారని తెలుసా? నాటి బ్రిటిష్ ఇండియాలో ఆర్థికమంత్రి గులాబ్ మహమ్మద్ నేతృత్వంలో కమిటీ ఏర్పడి, స్టాక్ ఎక్స్ఛేంజ్ను స్థాపించవలసిన ఆవశ్యకతను చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెంటనే స్టాక్ ఎక్స్ఛేంజ్ను నెలకొల్పారు. పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్ అధ్యక్షుడిగా ఏర్పడిన ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1943 నవంబర్ 14న ఆరంభం అయింది. అహ్మదాబాద్, బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు స్టాక్ ఎక్స్ఛేంజ్ల తర్వాత ఇది ఆరవది. 1958లో జంటనగరాల నుంచి పని చేసేవిధంగా దీనికి తాత్కాలిక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలు పెరగడంతో 1983 నుంచి శాశ్వత ప్రాతిపదికన గుర్తింపు వచ్చింది. తొలుత కోఠీలోని ఓ అద్దెభవనంలో ఆరంభమైన హెచ్ఎస్ఈ ఆ తర్వాత అనేక స్థలాలు, భవనాలు మారి చివరికి సోమాజిగూడలోని ఓ సువిశాల ప్రాంగణంలోకి మారింది. అయితే సెబీతో సర్దుబాట్లు కుదరని కారణంగా 2007లో దీని గుర్తింపు రద్దయింది. -
సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు
స్టాక్ బ్రోకర్లకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సూచన న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానాలు విధించిన దరిమిలా స్టాక్ ఎక్స్చేంజీలు తదుపరి చర్య లు మొదలుపెట్టాయి. స్కామ్ లో నిందితులైన సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో పాటు ఆయన సంబంధీకులు, సంస్థలు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో ఏడేళ్ల పాటు పాల్గొనకుండా చూడాలని ట్రేడింగ్ సభ్యులకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచించాయి. నిషేధం ఎదుర్కొంటున్న వారిలో రామలింగ రాజు తల్లి బి. అప్పలనరసమ్మ, ఆయన ఇద్దరు కుమారులు తేజ రాజు .. రామ రాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఝాన్సీ రాణి (సూర్యనారాయణ రాజు భార్య), చింతలపాటి శ్రీనివాస రాజు (అప్పట్లో సత్యం డెరైకర్)తో పాటు చింతలపాటి హోల్డింగ్స్, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ సంస్థలు ఉన్నాయి. అక్రమంగా ఆర్జించిన రూ. 1,800 కోట్లు కట్టాలంటూ రామలింగ రాజు సంబంధీకులు, సంస్థలను సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2009 జనవరి 7 నుంచి వడ్డీ కింద మరో రూ. 1,500 కోట్లు కూడా వీరు కట్టాల్సి ఉంటుంది. సత్యం ఖాతాల్లో కుంభకోణం జరిగిందంటూ 2009లో రామలింగరాజు స్వయంగా వెల్లడించడంతో స్కామ్ వెలుగులోకి రావడం, ఆయన జైలుకెళ్లడం, కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే.