గ్రూప్ మార్కెట్ విలువ హైజంప్
రూ. 2.2 లక్షల కోట్లు ప్లస్
టాటా, రిలయన్స్‌కంటే స్పీడ్
అదానీ, ఎంఅండ్‌ఎం సైతం వెనుకే
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా గ్రూప్ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇటీవల దూకుడు చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 28– జూన్ 20 మధ్య గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 2.2 లక్షల కోట్లు ఎగసింది. వెరసి మార్కెట్ విలువ వృద్ధి వేగంలో డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ, ఆటో దిగ్గజం ఎంఅండ్‌ఎం, కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)లను సైతం అధిగమించింది.
ఈ కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువకు రూ. 1.4 లక్షల కోట్లు చొప్పున జమయ్యింది. వేదాంతా గ్రూప్‌లోని హిందుస్తాన్ జింక్ షేరు ధర 52 వారాల కనిష్టం నుంచి రెట్టింపైంది. ఇందుకు విడదీత ప్రతిపాదన, రుణభార తగ్గింపుపై యాజమాన్య దృష్టి, మెరుగైన పనితీరు వంటి పలు సానుకూలతలు తోడ్పాటునిచ్చాయి. ఇక ఈ కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 60,600 కోట్లమేర బలపడగా.. ఆర్‌ఐఎల్ విలువ రూ. 20,656 కోట్లమేర క్షీణించింది.
రికార్డ్ రెవెన్యూ
గతేడాది(2023–24) వేదాంతా గ్రూప్ రూ. 1,41,793 కోట్ల ఆదాయం సాధించింది. గ్రూప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధికంకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 36,455 కోట్లను తాకింది. 30 శాతం ఇబిటా మార్జిన్లను అందుకుంది. సమీప కాలంలో 10 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించేందుకు వేదాంతా గ్రూప్ ప్రణాళికలు అమలు చేస్తోంది.
ఇందుకు వీలుగా జింక్, అల్యూమినియం, చమురు–గ్యాస్, విద్యుత్ తదితర బిజినెస్‌ల 50 ప్రభావవంత ప్రాజెక్టులను సమయానుగుణంగా పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం గ్రూప్‌పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.03 శాతం పెరిగి 8.77 శాతానికి చేరింది. దీంతో గత నెల 22న వేదాంతా షేరు రూ. 507 వద్ద, హింద్ జింక్ షేరు రూ. 807 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. బీఎస్‌ఈలో గురువారం వేదాంతా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 470ను అధిగమించగా.. హింద్ జింక్ షేరు 2.3 శాతం బలపడి రూ. 648 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment