shares
-
'కాంచన 3' నటి సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
భర్త ఒడిలో క్యూట్ కిడ్స్.. ఐ లవ్ యూ సో మచ్ అంటున్న పీవీ సింధు (ఫొటోలు)
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కన్నడ నటి మేఘనా.. సోషల్ మీడీయాలో వైరల్ (ఫోటోలు)
-
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ఇన్ఫీ మూర్తి కుటుంబ సంపదలో రూ.1900 కోట్లు ఆవిరి!
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy) కుటుంబం సంపద ఒక్క రోజులో రూ.1900 కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో శుక్రవారం (జనవరి 17) నాడు ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయి రూ. 1,812.70 వద్ద ముగిశాయి. ఈ భారీ తగ్గుదలతో మూర్తి కుటుంబం నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 1,900 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. అమ్మకాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.54 లక్షల కోట్లకు పడిపోయింది.4.02 శాతం వాటాసెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో సమిష్టిగా 4.02 శాతం వాటాను నారాయణ మూర్తి కుటుంబం కలిగి ఉంది. ఇందులో మూర్తి 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన సతీమణి సుధా మూర్తికి 0.92 శాతం, వారి కుమారుడు రోహన్ మూర్తికి 1.62 శాతం వాటా ఉంది. ఇక వారి కుమార్తె, యూకే (UK) మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి 1.04 శాతం, నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తి 0.04 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం నాటి క్షీణత తర్వాత కంపెనీలో మూర్తి కుటుంబం హోల్డింగ్‌ల విలువ రూ. 30,334 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటి రూ. 32,236 కోట్లతో పోలిస్తే గణనీయమైన నష్టాన్ని ప్రతిబింబిస్తోంది.లాభాలు బాగున్నా..ఇన్ఫోసిస్ బలమైన త్రైమాసిక ఆదాయాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ కల్లోలం ఏర్పడింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ.6,806 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను 4.5-5 శాతానికి సవరించింది. ఇది దాని వ్యాపార పథంలో విశ్వాసాన్ని సూచిస్తోంది.ఇదీ చదవండి: విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ, స్టాక్ క్షీణత విస్తృత పరిశ్రమ సవాళ్లు, మార్కెట్ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళనలను తెలియజేస్తోంది. 1,812.70గా ఉన్న స్టాక్ విలువ ఐటీ రంగంలో రానున్న ఎదురుగాలి గురించిన భయాందోళనలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న ముఖ్యమైన వాటా కంపెనీ వారసత్వంలో వారి కీలక పాత్రను తెలియజేస్తోంది. ఐటీ రంగంలోని కీలక పరిణామాలు, ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని అంచనా వేయడానికి డీల్ పైప్‌లైన్‌ను నిశితంగా పర్యవేక్షించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
Keerthy Suresh: భర్తతో జాలీగా వెకేషన్.. కానీ! (ఫోటోలు)
-
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.మస్క్ సంపదబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
Sonakshi Sinha: పులిని నిద్రపుచ్చుతూ.. సింహం పక్కనే సేదతీరుతూ.. (ఫోటోలు)
-
ఎన్పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్!
యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్లో 30 శాతానికి మించకూడదని ఎన్పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.కాగా ఎన్పీసీఐ నిర్ణయం వల్ల వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్‌లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. -
అద్భుత క్యాప్షన్‌తో సంగీత్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
500 షేర్లకు T+0 సెటిల్మెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్‌జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్‌కు ఆప్షనల్‌గా టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.నిబంధనలకు లోబడి టీప్లస్‌జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్‌మెంట్‌లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది. ఐసీఈఎక్స్కు చెల్లు సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది. -
వొడాఫోన్ ఐడియా షేర్ల జారీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 175.53 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. షేరుకి రూ. 11.28 ధరలో వొడాఫోన్ గ్రూప్ సంస్థలకు వీటిని కేటాయించనుంది. తద్వారా రూ. 1,980 కోట్లు సమకూర్చుకోనుంది. ఒమెగా టెలికం హోల్డింగ్స్‌కు రూ. 1,280 కోట్లు, ఉషా మార్టిన్ టెలిమాటిక్స్‌కు రూ. 700 కోట్లు విలువైన షేర్లను జారీ చేయనుంది.2025 జనవరి 7న నిర్వహించనున్న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఈ అంశాలను బోర్డు చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ వాటా 22.56 శాతంకాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వం 23.15 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 8,747 కోట్ల నుంచి తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం సహకరించింది.మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం మెరుగుపడి రూ. 10,918 కోట్లను తాకింది. కాగా.. ఇటీవల టెలికం దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్తో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం సుమారు రూ. 30,000 కోట్ల(3.6 బిలియన్ డాలర్లు) విలువైన డీల్‌ను వొడాఫోన్ ఐడియా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు రూ. 8.11 వద్ద ముగిసింది. -
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. పెళ్లికళ ఉట్టిపడుతోందిగా! (ఫోటోలు)
-
మాటల్లో వర్ణించలేను: బుమ్రా భావోద్వేగం.. రోహిత్ శర్మ భార్య రితికా రిప్లై వైరల్(ఫొటోలు)
-
ఏక్..దో..తీన్..అన్‌స్టాపబుల్ అంటున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
శ్రీదేవి ముద్దుల కూతురి బర్త్ డే.. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్‌ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్‌లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్‌ఫెలోస్‌లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
సమంత హల్దీ ఫంక్షన్.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
స్పైస్‌జెట్ ఫ్లోర్ ధర రూ. 64.79
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి నిధుల సమీకరణకు తెరతీసింది. ఇందుకు తాజాగా షేర్ల జారీ(ఫ్లోర్) ధరను ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 64.79 చొప్పున సెక్యూరిటీలను విక్రయించనుంది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. క్విబ్ ద్వారా రూ. 3,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత వారం వాటాదారుల నుంచి స్పైస్‌జెట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా.. వాటాదారుల అనుమతిమేరకు ఫ్లోర్ ధరపై 5 శాతానికి మించకుండా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించింది. కంపెనీ ఆర్థిక సవాళ్లు, న్యాయ వివాదాలు, విమాన సరీ్వసులు నిలిచిపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది. బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు 5.25 శాతం పతనమై రూ. 73.72 వద్ద ముగిసింది. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్ వాటా పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్‌లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్‌వైడ్ విక్రయించింది. డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్‌లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది. -
జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్
'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. ఇందులో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ గురించి కూడా ప్రస్తావించారు.100 జీబీ ఫ్రీ47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్హోల్డర్లను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని ఆయన ప్రకటించారు.ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి & యాక్సెస్ చేయడానికి జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. వచ్చే దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Addressing the shareholders during the 47th Annual General Meeting, Reliance Industries Chairman Mukesh Ambani says, "I am thrilled to announce the Jio AI-Cloud Welcome offer. Today, I am announcing that Jio users will get up to 100 GB of free cloud storage, to securely… pic.twitter.com/80RnNxePI7— ANI (@ANI) August 29, 20241:1 బోనస్ ఇష్యూసెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన ఆమోదించబడితే.. పెట్టుబడిదారుడు ప్రతి షేరుకు అదనపు వాటాను పొందే అవకాశం ఉంటుంది.డైరెక్టర్ల బోర్డు 1:1 బోనస్ ఇష్యూను ప్రతిపాదిస్తే.. కంపెనీ నిల్వలను క్యాపిటలైజ్ చేయడం ద్వారా నిధులు సమకూరుస్తాయి. 1:1 బోనస్ ఇష్యూ అనేది ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు కలిగి ఉన్న షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా రివార్డ్ చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వారి షేర్లను సమర్థవంతంగా రెట్టింపు చేస్తుంది. బోనస్ ఇష్యూలు కంపెనీ తన భవిష్యత్తు అవకాశాలపై మరియు బలమైన ఆర్థిక స్థితిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఆశీర్వాదం కావాలంటూ! (ఫొటోలు)
-
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
ఫారిన్ ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి
-
హీరోయిన్ రష్మిక చెల్లిని చూశారా? ఎంత చిన్న పిల్లనో! (ఫొటోలు)
-
'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. చాలామంది జీవితాలను తలకిందులు చేసిన కరోనా లాక్డౌన్ ఓ మహిళను మాత్రం కోటీశ్వరురాలిని చేసింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులో నివాసముంటున్న ప్రియా శర్మ 2020 కరోనా సమయంలో ముంబై వెళ్లిపోయింది. ఆ సమయంలో చాలా రోజులు ఇంట్లోనే కాలం గడపాల్సి వచ్చింది. ముంబైలో వ్యాపారవేత్తగా ఉన్న ఆమె తాత ఇష్టాలను, ఇతర విషయాలను తెలుసుకోవడం ప్రారంభించింది. సరిగ్గా అలాంటి సమయంలోనే.. ఆమె తాత 2014లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలో 500 షేర్లు కొనుగోలు చేసినట్లు, ఆ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆమె కంటపడ్డాయి.ఇదీ చదవండి: ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులుప్రియా శర్మకు దొరికిన ఆ పత్రాలే ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. 16 సంవత్సరాల వ్యవధిలో ఈ షేర్లు 4,500కి పెరిగాయి. వాటి విలువ ఏకంగా రూ. 1.72 కోట్లకు పెరిగింది. అయితే ఈ డబ్బును పొందటం చాలా కష్టంతో కూడుకున్న పని అయిపోయింది. చాలారోజులు పట్టించుకోకుండా వదిలేసినా ఈ స్టాక్స్ కోసం ప్రియా.. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీని లేఖ రాసింది. ఆ తరువాత చాలా నిబంధనలను దాటుకుంటూ ముందుకు వెల్లాల్సి వచ్చింది. మొత్తం మీద తాత చేసిన పని మనవరాలిని కోటీశ్వరురాలిని చేసింది. -
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
సోనాక్షి బ్యాచిలరేట్ పార్టీ.. ఆ డ్రెస్సును గుర్తు పట్టారా? (ఫొటోలు)
-
కొడుకు ఫేస్ రివీల్ చేసిన సింగర్ గీతామాధురి.. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో! (ఫొటోలు)
-
క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన టెక్ దిగ్గజం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ కంపెనీలకు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సమస్య స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్క సారిగా కంపెనీ 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది.టెక్ దిగ్గజం షేర్ విలువ ఒకేసారి 0.71 శాతం తగ్గింది. దీంతో కంపెనీ దాదాపు 23 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర నిన్నటి ముగింపు సమయంలో 443.52 డాలర్ల వద్ద ఉండేది. అయితే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఇది 440.37 డాలర్లకు పడిపోయినట్లు ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాక్‌లిటిక్స్ వెల్లడించింది.స్టాక్‌లిటిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలపైన గణనీయమైన ప్రభావం చూపాయి. భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది. -
వైట్ డ్రస్‌లో మెరిసిపోతూ.. స్టన్నింగ్ లుక్స్ షేర్ చేసిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
రాజ కుమారుడిలా రాహుల్.. అందంగా అతియా (ఫోటోలు)
-
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్‌కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్‌కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్‌ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్‌లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్‌కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
క్యూ1లో వేదాంతా దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా గ్రూప్ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇటీవల దూకుడు చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 28– జూన్ 20 మధ్య గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 2.2 లక్షల కోట్లు ఎగసింది. వెరసి మార్కెట్ విలువ వృద్ధి వేగంలో డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం, కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లను సైతం అధిగమించింది. ఈ కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువకు రూ. 1.4 లక్షల కోట్లు చొప్పున జమయ్యింది. వేదాంతా గ్రూప్‌లోని హిందుస్తాన్ జింక్ షేరు ధర 52 వారాల కనిష్టం నుంచి రెట్టింపైంది. ఇందుకు విడదీత ప్రతిపాదన, రుణభార తగ్గింపుపై యాజమాన్య దృష్టి, మెరుగైన పనితీరు వంటి పలు సానుకూలతలు తోడ్పాటునిచ్చాయి. ఇక ఈ కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 60,600 కోట్లమేర బలపడగా.. ఆర్ఐఎల్ విలువ రూ. 20,656 కోట్లమేర క్షీణించింది. రికార్డ్ రెవెన్యూ గతేడాది(2023–24) వేదాంతా గ్రూప్ రూ. 1,41,793 కోట్ల ఆదాయం సాధించింది. గ్రూప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధికంకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 36,455 కోట్లను తాకింది. 30 శాతం ఇబిటా మార్జిన్లను అందుకుంది. సమీప కాలంలో 10 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించేందుకు వేదాంతా గ్రూప్ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు వీలుగా జింక్, అల్యూమినియం, చమురు–గ్యాస్, విద్యుత్ తదితర బిజినెస్‌ల 50 ప్రభావవంత ప్రాజెక్టులను సమయానుగుణంగా పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం గ్రూప్‌పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.03 శాతం పెరిగి 8.77 శాతానికి చేరింది. దీంతో గత నెల 22న వేదాంతా షేరు రూ. 507 వద్ద, హింద్ జింక్ షేరు రూ. 807 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. బీఎస్ఈలో గురువారం వేదాంతా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 470ను అధిగమించగా.. హింద్ జింక్ షేరు 2.3 శాతం బలపడి రూ. 648 వద్ద ముగిసింది. -
Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు)
-
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
టీ20 వరల్డ్‌కప్-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్ కపుల్(ఫొటోలు)
-
మార్కెట్‌కు ఎన్నికల కలవరం
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఆద్యంతం అమ్మకాలే ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి. → సూచీల వారీగా ఆయిల్‌అండ్‌గ్యాస్ 3.50%, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్ సూచీలు 2% పతనమయ్యాయి. → మార్చి క్వార్టర్లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్ మోటార్స్ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. → క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఆర్బీఐ కొట్టిన దెబ్బ.. షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిన దెబ్బతో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఉదయ్ కోటక్ సంపదకు కూడా భారీగా గండి పడింది.కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.ఆర్బీఐ చర్యల తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 13 శాతం వరకు పడిపోయాయి. కంపెనీలో దాదాపు 26 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఉదయ్ కోటక్ భారీ నష్టాన్ని చవిచూశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన సంపద 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10 వేల కోట్లు) తగ్గింది. ఏప్రిల్ 24 నాటికి ఉదయ్ కోటక్ నెట్‌వర్త్ 14.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు).ప్రత్యర్థి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 2016 సెప్టెంబర్ తర్వాత మొదటిసారి కోటక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించిన తర్వాత యాక్సిస్ షేర్లు పుంజుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవోగా ఉదయ్ కోటక్ తప్పుకొన్న తర్వాత అశోక్ వాస్వానీ ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. -
ఇప్పుడు 1 షేరుకు 20 షేర్లు ఫ్రీ.. రికార్డ్ తేదీ ప్రకటన!
-
రూ.1000 అప్పుకు రూ.2 కోట్లు తిరిగిచ్చాడు!
చేసిన మేలును మరిచిపోయే ఈ రోజుల్లో కూడా ఎప్పుడో తీసుకున్న 1000 రూపాయలకు ఏకంగా రూ.2 కోట్లు తిరిగి ఇచ్చి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వైద్యనాథన్ (Vaidyanathan) అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐడీఎఫ్సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అంటే కొందరికి గుర్తొస్తుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కంటే ఈయన చేసిన దాతృత్వం వల్ల చాలా మందికి సుపరిచయం. ఆపదలో ఉన్న వారికి తన షేర్లను గిఫ్ట్ ఇస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. వైద్యనాథన్ ఇప్పటికి రూ. 80 కోట్ల విలువ చేసే షేర్లను ప్రజలకు పంచిపెట్టారు. తాజాగా మరో 5.5 కోట్ల రూపాయల విలువైన షేర్లను మరో ఐదు మందికి గిఫ్ట్‌గా ఇచ్చేసారు. అంటే 7 లక్షల షేర్స్ (మార్చి 22న ఒక్కో షేర్ ధర రూ.78 వద్ద ముగిసింది) గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి వింగ్ కమాండర్ 'సంపత్ కుమార్' ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సంపత్ కుమార్ గతంలో ఎప్పుడో వైద్యనాథన్‌కు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారట. దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు వైద్యనాథన్ ఏకంగా వైద్య సహాయం కోసం 2.50 లక్షల షేర్స్ (సుమారు రూ. 2 కోట్లు) గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. కేవలం వెయ్యి రూపాయలకు.. 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారంటే అయన దాతృత్వాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికి మాత్రమే కాకూండా మనోజ్ సహాయ్ అనే వ్యక్తికి 50 వేల షేర్స్, సమీర్ మాత్రే అనే వ్యక్తికి మరో 50 వేల షేర్స్ అందించారు. తన సహోద్యోగి మరణించడం వల్ల అతని కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా వారికి 75వేల షేర్స్ ఇచ్చారు. ఎ.కనోజియా అనే వ్యక్తికి కూడా 2.75 లక్షల షేర్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. -
మనవడిపై ప్రేమ.. 4 నెలల బిడ్డకు రూ.240 కోట్ల గిఫ్ట్
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. కేవలం పదివేల రూపాయలతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. భారతదేశంలోని మిలియనీర్ల జాబితాలో ఒకరైన నారాయణ మూర్తి తన మనవడికి ఏకంగా కోట్ల రూపాయల షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల 'ఏకాగ్రహ్ రోహన్ మూర్తి' (Ekagrah Rohan Murty)కి ఏకంగా రూ. 240 కోట్ల విలువైన షేర్స్ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 1500000 షేర్స్ లేదా 0.04 శాతం వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ 2023 నవంబర్ 10న బెంగళూరులో మగబిడ్డకు జన్మనిచ్చారు. నారాయణ మూర్తి, సుధా మూర్తికి ఇప్పటికే కృష్ణ సునక్, అనౌష్క సునక్ అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరిరువురూ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, అక్షతా మూర్తి కుమార్తెలు. ఏకాగ్ర పేరు మహాభారతంలోని అర్జున్ పాత్ర నుంచి ప్రేరణ పొందింది. సంస్కృత పదమైన 'ఏకాగ్రహ్'కు అచంచలమైన దృష్టి, సంకల్పం అని అర్థం. -
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు. 2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి. -
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!
పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్‌లో వన్97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్‌లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది. -
మెప్పించని ఆర్బీఐ పాలసీ
ముంబై: ఆర్బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నమోదుతో ఎఫ్ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా ఆర్బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి. ఐషర్ మోటార్స్ 3%, అపోలో టైర్స్ 2.50%, మారుతీ, ఎంఅండ్ఎం, సంవర్ధన మదర్సన్ షేర్లు 2%, టీవీఎస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 1%, ఎంఆర్ఎఫ్ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1% మేర నష్టపోయాయి. నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
ఐటీ, ఇంధన షేర్లకు డిమాండ్
ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది. ► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది. -
ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్..
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk)కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మస్క్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల సేల్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. చైనా ప్రధాన పోటీదారుగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. టెస్లా స్టాక్ భారీగా తగ్గడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. టెస్లా అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో చైనా తమకు పోటీ వస్తోందని ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్ మీద నియంత్రణ కోల్పోతే చైనా తప్పకుండా ఇతర దేశాల వ్యాపారాలను కొల్లగొట్టే ప్రమాదం ఉందని వాపోయారు. ప్రస్తుతం BYD కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని.. టెస్లా కార్లకంటే కూడా ఇవి తక్కువ ధరలో లభించడం వల్ల టెస్లా అమ్మకాలు క్షీణించాయని చెబుతూ.. గత త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు బాగా తగ్గినట్లు వెల్లడించారు. -
భారీగా పెరిగిన షేర్స్.. కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మైక్రోసాఫ్ట్!
గ్లోబల్ ఐటీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మార్కెట్ విలువ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్‌ను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కంపెనీ ఈ పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఎక్సేంజ్‌లో మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 1.3 శాతం పెరిగి 403.78 డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్ విలువ పెరగడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. గతంలో 3 ట్రిలియన్ మార్కెట్ విలువను సాధించిన మొదటి కంపెనీగా యాపిల్ చేరింది. ఇప్పుడు అలాంటి రికార్డును తాజాగా మైక్రోసాఫ్ట్ కైవసం చేసుకుంది. ఇక యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 3.03 ట్రిలియన్ డాలర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా? మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం.. కంపెనీ ముందుకు దూసుకెళ్లడానికి, వృద్ధి సాధించడానికి కారణమవుతోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధిని సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ, యాపిల్ కంపెనీని అధిగమిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి - ఎవరో తెలుసా?
విప్రో వ్యవస్థాపకుడు 'అజీమ్ ప్రేమ్‌జీ' (Azim Premji) తన కుమారులు.. సంస్థ చైర్మన్ 'రిషద్ ప్రేమ్‌జీ', ఎంటర్ప్రైజెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'తారిఖ్ ప్రేమ్‌జీ'లకు జనవరి 23న దాదాపు రూ.500 కోట్ల విలువైన 10.2 మిలియన్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ చూపించింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అండ్ అజీమ్ ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్‌లో బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. లావాదేవీ తర్వాత, అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబానికి కంపెనీలో 4.4% వాటా ఉంది. ఇందులో ప్రేమ్‌జీకి 4.3%, అతని భార్య యాస్మీన్ ప్రేమ్‌జీకి 0.05%, ఇద్దరు కొడుకులకు 0.03% వాటా ఉంది. ఇదీ చదవండి: ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు.. ప్రేమ్‌జీ కుటుంబం విప్రోలో 72.9% వాటా కలిగి ఉన్నప్పటికీ 7.4% షేర్ల నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌తో సహా ప్రేమ్‌జీ సంపద మొత్తం 11.3 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. విప్రో షేర్లు శుక్రవారం నాడు రూ.484.9 వద్ద ముగిశాయి. దీని ప్రకారం 1,0230,180 షేర్ల విలువ రూ. 496 కోట్లుగా ఉంది. -
వికాస్ లైఫ్‌కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్‌జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
కార్వీ కేసులో సెబీకి నాలుగు వారాల గడువు: శాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం స్పష్టం చేసింది. శాట్ మునుపటి ఆర్డర్ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లకు (ఎన్ఎస్డీఎల్) ఆర్డర్ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్ఎస్డీఎల్ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్ బ్యాంక్‌కు అనుమతించింది. 2023 డిసెంబర్ 20 నాటి శాట్ ఆర్డర్‌పై డిసెంబర్ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్ దాఖలు చేసింది. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్‌క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్‌క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్‌హోల్డర్‌గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్‌క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్‌క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్‌క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
షేర్స్ కొనడానికి రూ. లక్ష అడిగిన యూజర్ - ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) దృష్టిని ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో యూజర్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో సర్, మహీంద్రా గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడానికి నాకు 1 లక్ష రూపాయలు కావాలి' అని అడిగినట్లు చూడవచ్చు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. నీ ధైర్యానికి అభినందనలు, ఆలా అడగడంలో తప్పేముందని అన్నారు. యూజర్ అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఇలాంటి సంఘటనల మీద స్పందించడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల ఓ పిల్లాడు 700 రూపాయలకు మహీంద్రా థార్ కొంటానని వాళ్ళ నాన్నతో చేసిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదీ చదవండి: మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే! ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని సరదాగా అన్నారు. What an idea Sirji. Aapki himmat ke liye Taaliyaan! Poochne mein kya jaata hai? 😀 https://t.co/respZDQXKl — anand mahindra (@anandmahindra) December 27, 2023 -
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఊహించని ఎదురు దెబ్బ!
‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా తయారైంది ప్రముఖ టెక దిగ్గజం ఇన్ఫోసిస్ పరిస్థితి. ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ రద్దయి ఐటీ రంగంలో హాట్ టాపిగ్గా మారిన ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. కృత్తిమ మేధ ప్రాజెక్ట్ రద్దయ్యిందన్న వార్తలతో ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ సుమారు రూ.7,200 కోట్లు క్షీణించింది. డిసెంబర్ 26న స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్ల క్షీణించాయి. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,200 కోట్లకు పైగా తగ్గింది. గత సెషన్లో మార్కెట్ ముగిసే సమయంలో ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1,562తో పోలిస్తే 1.12 శాతం క్షీణించి రూ.1,544.5 వద్ద ముగిసింది. ఊహించని కార్పొరేట్ పరిణామాల నేపథ్యంలో అత్యంత బలమైన ఐటీ రంగ సంస్థలు కూడా బలహీనంగా ఉండటం ప్రస్తుత ఐటీ మార్కెట్‌కు పరిస్థితికి అద్దం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ షేరు ధర ఎందుకు పడిపోయింది? ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణతకు ఓ అంతర్జాతీయ కంపెనీతో కుదుర్చున్న ఒప్పందం రద్దవ్వడమేనని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ 15ఏళ్ల పాటు కంపెనీ ప్లాట్‌ఫామ్‌లు, కృత్రిమ మేధ(ఏఐ) సొల్యూషన్స్‌పై పని చేసేందుకు ఓ అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తాజాగా, 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,450 కోట్లు) విలువైన ఈ ఒప్పందాన్ని సదరు కంపెనీ రద్దు చేసుకుంది. డీల్ రద్దుతో మదుపర్ల అప్రమత్తం ఈ డీల్ రద్దు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్ట్ రద్దు ఇన్ఫోసిస్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న అంచనాలతో మదపర్లు షేర్లను విక్రయించారు. ఇన్ఫోసిస్ కొత్త తరం ఏఐ టెక్నాలజీల్లోకి విస్తరించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని చాలా మంది ఊహించారు. అయితే, ప్రాజెక్ట్ కేన్సిల్ అవ్వడంతో ఇన్ఫోసిస్ ఆదాయ మార్గాలు, వృద్ధి అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీ రంగానికి ఎదురుదెబ్బలు కొన్నిసార్లు అస్థిరంగా ఉండే ఐటీ రంగం.. ప్రస్తుతం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొందని రాయిటర్స్ నివేదించింది. టెక్నాలజీ పెట్టుబడులను ప్రభావితం చేసే అనూహ్య ఆర్థిక పరిస్థితులను తట్టుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు తమ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌కు ఈ తాజా కార్పొరేట్ అడ్డంకిని అధిగమించేటప్పుడు నష్ట నియంత్రణ, వాటాదారులకు భరోసా ఇవ్వడంపై తక్షణ దృష్టి సారించే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక హైలెట్ చేసింది. -
మెటల్, ఇంధన షేర్లలో కొనుగోళ్లు
ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. మోటిసన్స్ లిస్టింగ్ భళా మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 98 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
మారుతీ చేతికి గుజరాత్ ప్లాంట్
న్యూఢిల్లీ: మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీకి వాటాదారులు అనుమతించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పార్టీ లావాదేవీకింద సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకుగాను రెండు ప్రత్యేక అంశాలపై పోస్టల్ బ్యాలట్ ద్వారా మారుతీ గత నెలలో వాటాదారుల నుంచి అనుమతిని కోరింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం(సంబంధిత పార్టీ లావాదేవీ)తోపాటు.. నగదుకాకుండా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపుపై ఓటింగ్‌కు తెరతీసింది. ఈ రెండు అంశాలకూ వాటాదారుల నుంచి 98 శాతానికిపైగా అనుకూలంగా ఓట్లు లభించినట్లు మారుతీ తాజాగా వెల్లడించింది. గత నెలలో రూ. 12,841 కోట్లకు ఎస్ఎంజీని కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకీ దాదాపు రూ. 10,241 ధరలో మొత్తం 1.23 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదముద్ర వేసింది. వెరసి ఎస్‌ఎంజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకునే బాటలో ప్రిఫరెన్షియల్ జారీకి మారుతీ బోర్డు తెరతీసింది. ఈ లావాదేవీతో మారుతీలో ఎస్‌ఎంసీకిగల వాటా 56.4 శాతం నుంచి 58.28 శాతానికి బలపడనుంది. మరోవైపు ఎస్ఎంజీ మారుతీకి పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది!
యాపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) ఇటీవల తన షేర్లలో భారీ భాగాన్ని విక్రయించి, గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద విక్రయాన్ని నమోదు చేసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనం చూసేద్దాం. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కుక్ 5,11,000 షేర్లను (శుక్రవారం 2,70,000 షేర్లు, సోమవారం 2,41,000 షేర్లు) విక్రయించి దాదాపు 41.5 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 345 కోట్లు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 88 మిలియన్ డాలర్లు, మొత్తం టాక్స్ తరువాత అతనికి 41.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు తరువాత కుక్ విక్రయించిన అతిపెద్ద ఆపిల్ షేర్లు ఇవే కావడం గమనార్హం. ఇదీ చదవండి: అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే? టిమ్ కుక్ తన యాపిల్ షేర్లలో కొన్నింటిని విక్రయించినప్పటికీ, తన వార్షిక ప్రణాళికలో భాగంగా అతను అదే సంఖ్యలో షేర్లను అందుకోవడం వల్ల కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. ఇప్పటికి కూడా ఇతడు 3.3 మిలియన్ యాపిల్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం సుమారు 565 మిలియన్ డాలర్లు. -
ఈ పెద్దాయన స్టాక్ మార్కెట్‌ని ఏలుతున్నారు?, కోట్లు వెనకేసి
చూశారా!! ఈ పెద్దాయనని. ఈయన ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారా? అయితే, మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆయన గురించి తెలుసుకుందాం పదండి. స్టాక్ మార్కెట్‌తో డబ్బులు సంపాదించడం ఎలా? అని ఎవరినైనా అడిగితే అమ్మో స్టాక్ మార్కెటా? వద్దులే. ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తేనో లేదంటే తెలిసిన వాళ్లకి వడ్డీ ఇచ్చుకున్నా నాలుగు రాళ్లు వెనకేసువచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అంటూ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని, అనుభవజ్ఞులైన నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలా తెలుసుకునే షేర్లలో పెట్టుబడులు పెట్టారు ఈ పెద్దాయన. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, క్రమశిక్షణ, ఓపిక వహించారు. ఇప్పుడు ముదుసలి వయసులో భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటారా? క్రమశిక్షణ, సహనం ఈ రెండింటిలో ఆరితేరిన బిగ్ బుల్, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్లు స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ల్పిట్లతో లాభాల్ని గడిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ కూడా అంతే. సోషల్ మీడియా ఓవర్‌నైట్ స్టార్ గురించి పెద్దగా వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నెటిజన్ ఈ పెద్దాయన గురించి వీడియో చేశారు. ఆ వీడియోలో కోట్ల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయనకు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో వివరించారు. ఆ వివరాల ఆధారంగా సదరు పెద్దాయన నికర ఆస్తి విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్అండ్టీలో 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో 4,000 షేర్లు తన వద్ద ఉన్నాయని తన మాతృ భాషలో పెద్దాయన చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం..100 మిలియన్ (రూ.10 కోట్ల) కంటే ఎక్కువ విలువైన షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అదనంగా, ఆ వ్యక్తి తాను సంవత్సరానికి సుమారుగా రూ. 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. As they say, in Investing you have to be lucky once He is holding shares worth ₹80 crores L&T ₹21 crores worth of Ultrtech cement shares ₹1 crore worth of Karnataka bank shares. Still leading a simple life#Investing @connectgurmeet pic.twitter.com/AxP6OsM4Hq — Rajiv Mehta (@rajivmehta19) September 26, 2023 ఈ సందర్భంగా రాజీవ్ మెహతా మాట్లాడుతూ పెద్దాయన చెప్పినట్లుగా పెట్టుబడులు మీరు అదృష్టవంతులు కావాలని అన్నారు. అంతేకాదు ఎల్ అండ్ టీలో రూ.80 కోట్ల విలువైన షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో రూ. 21 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో రూ. కోటి విలువైన షేర్లు ఉన్నాయని మెహతా పోస్ట్ చేశాడు.ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అని’ మెహతా పేర్కొన్నారు. Bhai 27,000 L&T shares = 8 cr no? Similarly 3.2 cr. of Ultratech 10 lakh of Ktk bank It's a decent amount still. More power to him. But please consider blurring his face, such publicity usually doesn't do good esp for old people living a simple life. — Deepak Shenoy (@deepakshenoy) September 26, 2023 ఆ వీడియోపై క్యాపిటల్ మైండ్ సీఈఓ, ఫౌండర్ దీపక్ షెనాయ్ స్పందించారు. రాజీవ్ మెహతా చెప్పిన దానిని బట్టి.. ఎల్ అండ్ టీ కంపెనీలో 27 వేల షేర్ల విలువ రూ. 8 కోట్లు, అల్ట్రాటెక్ కంపెనీలో రూ. 3.2 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంకులో రూ. 10 లక్షల విలువైన షేర్లు.. ఇలా మొత్తంగా రూ. 12 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం, ఈ పెద్దాయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. -
బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా.. షేర్లు ఢమాల్!
ప్రైవేట్ రంగ ధనలక్ష్మి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీధర్ కళ్యాణసుందరం బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. ఆయన వైదొలిగిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ధనలక్ష్మి బ్యాంక్ షేర్లు పాక్షికంగా కోలుకోవడానికి ముందు సోమవారం (సెప్టెంబర్ 18) 9 శాతం వరకూ పడిపోయాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బ్యాంక్ షేర్లు 3.25 శాతం క్షీణించి 28.20 రూపాయల వద్ద ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి బ్యాంక్‌కి కళ్యాణసుందరం 2022 డిసెంబరులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) ధనలక్ష్మి బ్యాంక్ ప్రస్తుతం బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ నేతృత్వంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ప్రణాళికాబద్ధమైన హక్కుల సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తానని, దీంతో తనను బ్యాంకు నుంచి తొలగిస్తామని బెదిరించారని సెప్టెంబరు 16న ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో కళ్యాణసుందరం ఆరోపించారు. ధనలక్ష్మి బ్యాంక్ 2023 మార్చి నాటికి కేవలం రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. బ్యాంక్ నాయకత్వానికి సంబంధించి చాలా కాలంగా గందరగోళం నెలకొంది. దీంతో ఈ బ్యాంక్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిన ఆర్బీఐ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను ఉంచింది. -
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్‌టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్‌వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్‌లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్‌డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్‌లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్‌క్యాప్స్‌నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్‌పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్‌లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్‌చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్‌లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్‌డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
జొమాటోలో కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో టైగర్ గ్లోబల్, డీఎస్టీ గ్లోబల్ మొత్తం 1.8 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాకు సమానమైన 12,34,86,408 షేర్లను విక్రయించింది. ఇక డీఎస్టీ గ్లోబల్ 0.4 శాతం వాటాకు సమానమైన 3,19,80,447 షేర్లను అమ్మివేసింది. షేరుకి రూ. 90–91 సగటు ధరలో విక్రయించిన వీటి మొత్తం విలువ రూ. 1,412 కోట్లు. యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రులైఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 92.3 వద్ద ముగిసింది. -
నష్టాల్లోంచి లాభాల్లోకి...
ముంబై: ఆఖరి గంటలో అధిక వెయిటేజీ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం ఇంట్రాడే నష్టాలను భర్తీ చేసుకొని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచీ సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్నాయి. ట్రే డింగ్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 79 పాయింట్ల లాభంతో 65,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 170 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఆరు పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, ఇంధన, ఫార్మా, కన్జూమర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. ► అదానీ పోర్ట్స్ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ ని్రష్కమణతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అంబుజా సిమెంట్స్ షేరు 3.50% పతనమైంది. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 3.26% నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్స్ 2.50%, ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 2% వరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 1.50%, ఎన్డీటీ 1.30%, అదానీ పవర్ ఒక శాతం పతనయ్యాయి. ► రూ.880 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో గతవారం ఐపీఓకు వచి్చన టీవీఎస్ సప్లై చివరి రోజు నాటికి 2.78 రెట్ల సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.51 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా మొత్తం 6.98 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 3 వేల కోట్ల ఫండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రీమియం బిజినెస్ పార్క్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు 525 మిలియన్ సింగపూర్ డాలర్లతో (సుమారు రూ. 3,225 కోట్లు) ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ (సీఎల్ఐ) వెల్లడించింది. క్యాపిటలాండ్ ఇండియా గ్రోత్ ఫండ్ 2 (సీఐజీఎఫ్ 2)లో ఒక అంతర్జాతీయ సంస్థ రూ. 1,630 కోట్లతో 50 శాతం తీసుకున్నట్లు తెలిపింది. సీఎల్‌ఐకి చెందిన ’ఇంటర్నేషనల్ టెక్ పార్క్ చెన్నై’లో సీఐజీఎఫ్2 ఫండ్ 70 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 590 కోట్లు వెచ్చించింది. వాటాల విక్రయం తర్వాత కూడా సదరు అసెట్ నిర్వహణను సీఎల్ఐ కొనసాగించనుంది. సింగపూర్‌కి చెందిన సీఎల్ఐ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాల్లో ఒకటి. 2023 మార్చి ఆఖరు నాటికి సంస్థ నిర్వహణలో 133 బిలియన్ సింగపూర్ డాలర్ల (ఎస్జీడీ) అసెట్స్ ఉన్నాయి. వీటిలో 4 బిలియన్ ఎస్జీడీ విలువ చేసే అసెట్స్ భారత్‌లో ఉన్నాయి. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్‌లు.. రిలయన్స్‌కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), విదేశాల్లో లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది.