
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే.

ఇటీవల దేవర మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ గురించి కొద్దమందికే తెలుసు.

శ్రీదేవి రెండో కూతురైన ఖుషీ కపూర్ ఇవాళ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటోంది.

తన బాయ్‌ఫ్రెండ్ వేదాంగ్ రైనా కూడా బర్త్ డే పార్టీలో పాల్గొన్నాడు.

ఖుషీ కపూర్- వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తున్నట్లు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి.

పజామా పార్టీ పేరుతో పుట్టిన రోజు వేడుకను నిర్వహించింది.

తన కూతురి బర్త్ డే పార్టీకి తండ్రి బోనీ కపూర్ కూడా హాజరయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పార్టీలో అక్క జాన్వీ కపూర్ కనిపించకపోవడం గమనార్హం.