Khushi Kapoor
-
డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరో కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం నదానియన్(Nadaaniyan). ఈ మూవీలో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్(khushi kapoor) హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ నదానియన్ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. వచ్చేనెల మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.కాగా.. ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఏ ధర్మాటిక్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, దియా మీర్జా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఖుషీ కపూర్ లవ్యాపా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. Kuch Kuch Hota Hai aisi Nadaaniyan dekh kar 🥰💕Watch Nadaaniyan, out 7 March, only on Netflix!#NadaaniyanOnNetflix pic.twitter.com/piwn818AFx— Netflix India (@NetflixIndia) February 20, 2025 -
అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!
సెలబ్రిటీల లైష్స్టైల్, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు. అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్లో దేవర మూవీతో దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఇల్లు అంటే క్రేజ్ మామూలుగా ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్‌లో నివసిస్తుంది. పాలి హిల్‌లోని విలాసవంతమైన ఈ భవనం విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్‌తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్‌కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్‌లో బోనీ కపూర్ అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి అంత అదమైన భవనం, సౌకర్యాల గురించితెలుసుకుందాం. ఫరాఖాన్ అందించిన వివరాల ప్రకారం తొలి చూపులోనే పాలి హిల్‌లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో, లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్‌లు, ఫోటోలు, ఇతర కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని ఈ అపార్ట్‌మెంట్‌ను 2022లో కొనుగోలు చేసిందట జాన్వి. తన జుహు అపార్ట్‌మెంట్‌ని రాజ్‌కుమార్ రావ్‌కి విక్రయించి మరీ ఆ ఇల్లును ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్ లాంటి స్టార్లు జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో నిర్మించిన ఈ గృహంలో ఓపెన్ కిచెన్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్,పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి. బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.శ్రీదేవి పెయింటింగ్ అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్రూమ్లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్ కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే ఫోటో, ఇతర మెమరీస్ ఫోటోలుగా అమరాయి. పొడవైన చెక్క డైనింగ్ టేబుల్‌పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్తో డైనింగ్ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోని ఆర్ట్‌వర్క్ అంతా తన తల్లి శ్రీదేవే సెలెక్ట్ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా స్వయగా జాన్వీనే తెలిపింది. తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్వర్క్లేనని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని చెప్పింది. -
ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్
హీరోయిన్ అన్నాక అందంగా కనిపించడమే కాదు, ఆ అందాన్ని కాపాడుకోవాలి కూడా! అదే సమయంలో అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు సర్జరీలను ఆశ్రయిస్తారు. లిప్ ఫిల్లర్స్, ప్లాస్టిక్ సర్జరీ.. ఇలా రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ఇది తప్పేం కాదంటోంది హీరోయిన్ ఖుషీ కపూర్ (Khushi Kapoor). కనుబొమ్మల మధ్య..'నా కనుబొమ్మ వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయి. కానీ వాటి మధ్య గ్యాప్ కనిపించింది. దాన్నలా వదిలేయలేకపోయాను. కనుబొమ్మలు సరిచేయించుకున్నాను. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయించుకున్నాను. అప్పుడు పది రోజులవరకు కళ్లపై నీళ్లు పడనివ్వొద్దన్నారు. స్నానం చేసేటప్పుడు ధరించమని ఓ షీల్డ్ ఇచ్చారు. అది నాకు సరదాగా అనిపించింది. వాటిని కళ్లపై పెట్టుకుని మా ఫ్రెండ్స్‌కు ఫోటో పంపించాను. ఎవరూ దాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇప్పుడిలాంటివన్నీ సర్వసాధారణం. అవమానంగా ఫీలవడానికి ఏముంది?ఇలాంటి పద్ధతులను అనుసరించడం నేరమేమీ కాదు. ప్లాస్టిక్.. అనగానే అదేదో అవమానంగా ఫీలవుతారు. దాని గురించి బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. కారణం జనాలు ఎక్కడ ద్వేషిస్తారోనని! నేనేమంటానంటే ద్వేషించాలనుకునేవారు ఏ సాకుతోనైనా అదే పని చేస్తారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు జనాలు కూడా నాగురించి ఏవేవో ఊహించుకున్నారు. నేనెలా ఉంటాను? ఏంటి? అంటూ ఎక్కువగా నెగెటివ్‌గానే చర్చించారు' అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఖుషి కపూర్.. తాను లిప్ ఫిల్లర్స్ వేయించుకున్న విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే.ఆర్చీస్తో తెరంగేట్రంఇకపోతే దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి.. ద ఆర్చీస్ (2023) సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో బెట్టీ కూపర్‌గా నటించింది. ప్రస్తుతం లవ్యాపా మూవీ చేస్తోంది. ఇది తమిళ లవ్‌టుడే సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది.చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
ఎవరికీ ప్రపోజ్ చేయలేదన్న ఖుషీ కపూర్.. 'రైనా' సంగతేంటి..?
అలనాటి నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) నటించిన కొత్త సినిమా 'లవ్యాపా' (Loveyapa). బాలీవుడ్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇందులో ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో జంటగా ఆమె నటించారు. యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకథలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'లవ్ టుడే'కు రీమేక్‌గా 'లవ్యాపా' సినిమా రానుంది. అయితే, తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఖుషీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంటర్యూలో భాగంగా ఇప్పటి వరకు ఎవరినైనా ప్రేమించారా..? ప్రపోజ్ చేశారా..? అని ఖుషీ కపూర్‌ను అడగ్గా.. ఆమె ఇలా చెప్పారు. తాను ఇప్పటి వరకు ఎవరికీ ప్రపోజ్ చేయలేదని షాకింక్ ఆన్సర్ ఇచ్చారు. కానీ, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే అందుకు సంబంధించిన ఒక ఫోటోను తీసుకోవాలని ఉందని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమా 'ది ఆర్చిస్'లో నటించిన తన కో స్టార్ వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కూడా జంటగా పలు ప్రదేశాల్లో కెమెరాల కంట కూడా పడ్డారు. ఇలాంటి సమయంలో తాను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు అని ఖుషీ చెప్పడంతో నెట్టింట ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బహూశా బ్రేకప్ ఏమైనా చెప్పారా..? అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.2023లో విడుదలైన 'ది ఆర్చిస్' సినిమాతో ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అక్కతో పోటీ లేదు..కెరీర్ పరంగా జాన్వీకపూర్‌తో తాను పోటీ పడలేనని ఖుషీ కపూరు చెప్పారు. నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన తమ ఇద్దరిలోనూ లేదని ఆమె పేర్కొన్నారు. తాము పోటీ పడుతున్నట్లు ఎవరైనా అనుకుంటే అదొక వింతే అని ఖుషీ తెలిపారు. ఒకవేళ తామిద్దరం కలిసే ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా ఎక్కువ మార్కులు జాన్వీ అక్కకే పడుతాయని ఆమె అన్నారు. ఆమె చాలా బాగా నటిస్తుంది. స్క్రీన్‌పై అక్క నటన చూస్తే చాలా ఆనందం కలుగుతుందని ఆమె తెలిపారు. 'నేను ఏదైనా చిత్రంలో బాగా నటిస్తే అక్క చాలా సంతోషిస్తుంది. చాలా బాగా చేశావ్ అంటుంది. అప్పుడు కూడా అదంతా తన విజయంగా ఆమె భావిస్తుంది.' అని అన్నారు. -
హాలీడే ట్రిప్‌లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
హాలీడే ట్రిప్‌లో చిల్ అవుతోన్న పాలక్ తివారీ..నివేదా థామస్ షాకింగ్ లుక్..రెడ్ డ్రెస్‌లో ఖుషీ పాప స్టైలిష్ పోజులు..ఐశ్వర్య రాజేశ్ బర్త్ డే పోస్ట్.. View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
రాజస్థాన్‌లో మెహరీన్ చిల్.. గోవాలో పూనమ్ బజ్వా వెకేషన్
రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మెహరీన్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఒర్రీలో జాన్వీ కపూర్ సిస్టర్ పోజులు..వారణాసిలో ఛాయ్ తాగుతూ రేణు దేశాయ్..అందాలు ఒలకబోస్తోన్న అరియానా గ్లోరీ..అలాంటి డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు.. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్ సిస్టర్ (ఫోటోలు)
-
తరుణ్ తహిలియానీ డిజైనర్ శారీలో కుషీకపూర్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
స్టార్ డైరెక్టర్ ఇంట పెళ్లిసందడి.. హల్దీ వేడుకలో ఖుషీ కపూర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు ఆలియా కశ్యప్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కాగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ఈ హల్దీ వేడుకలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ అందమైన దుస్తులు ధరించి మెరిసింది. ఈ ఫోటోలను అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అనురాగ్ కశ్యప్ తన కుమార్తెతో వివాహానికి ముందు అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమాని చూడటానికి తండ్రీకూతుళ్లిద్దరూ వెళ్లారు.కాగా.. ఆలియా కశ్యప్ కొంతకాలంగా షేన్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారానే పరిచయమయ్యారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో తన సోషల్ మీడియా ఖాతాల ప్రమోషన్స్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె యూట్యూబ్ ఛానెల్లో వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
శ్రీదేవి ముద్దుల కూతురి బర్త్ డే.. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
టాంజానియాలో లైగర్ భామ.. గోవాలో బాలీవుడ్ బ్యూటీ!
జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ క్యూట్ లుక్స్.. ఈవెంట్లో సందడి చేసిన ఉప్పెన భామ కృతి శెట్టి.. టాంజానియాలో లైగర్ భామ అనన్య పాండే చిల్.. గోవాలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్ హాట్ లుక్స్.. హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ లేటెస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by @natasastankovic__ -
'జిగ్రా' ట్రైలర్.. రూమర్ బాయ్‌ఫ్రెండ్‌పై అక్కాచెల్లెళ్ల ప్రశంసలు
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. వాస్తవంగా ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కావాల్సింది. అయితే, అదే రోజు ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కానున్నడంతో జిగ్రా సినిమా రిలిజ్ను రెండు వారాల పాటు వాయిదా వేశారు. దీంతో అక్టోబర్ 11న జిగ్రా విడుదల కానుంది.తమ్ముడు కోసం అక్క చేసే పోరాట కథనంతో ‘జిగ్రా’ సినిమా ఉండనుంది. మహిళా ప్రాధాన్యతను తెలిపేలా ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తమ్ముడు ఒక ప్రమాదంలో చిక్కుకుంటే తన అక్క చేసే పోరాటం ఏ రేంజ్లో ఉంటుందో చిత్ర దర్శకుడు సినిమా రూపంలో చూపించాడు.ట్రైలర్‌పై ఖుషి కపూర్ కామెంట్అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ జిగ్రా ట్రైలర్ గురించి కామెంట్ చేసింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నటుడు వేదాంగ్ రైనాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రైలర్‌ను పంచుకుంది. హార్ట్ సింబల్‌తో పాటు ఎమోషనల్ ఫేస్ ఎమోజీలను కూడా ఖుషి కపూర్ షేర్ చేసింది.జాన్వీ కపూర్ కూడా జిగ్రా ట్రైలర్‌పై పోస్ట్ చేశారు. ఇందులో వేదాంగ్ నటన చూసి తాను చాలా ఎమోషనల్ అయినట్లు పంచుకుంది. తన హృదయం కూడా బరువెక్కిందని పేర్కొంది. ట్రైలర్‌కే తాను ఇలా అయితే, సినిమా చూసిన తర్వాత తాను ఏవిధంగా ఫీలవుతానో అర్థంకావడం లేదంటూ రాసుకొచ్చింది. లేడీ బచ్చన్ అలియాభట్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తెలిపిందని జాన్వీ పేర్కొంది. -
Khushi Kapoor: వింటేజ్ లుక్‌లో జాన్వీ కపూర్ చెల్లి.. చూస్తే వావ్ అంటేరేమో! (ఫొటోలు)
-
సర్జరీ చేయించుకున్నా!
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె, నటి ఖుషీ కపూర్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రశంసలకు కారణం ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే... చిన్నతనంలో తన అమ్మతో కలిసి ఖుషీ కపూర్ ఓ సినిమా వేడుకకు హాజరయ్యారు. అలాగే ఇటీవల తాను నటించిన ‘ది ఆర్చీస్’ ఫిల్మ్ ప్రీమియర్ ఈవెంట్‌కు ఖుషీ వెళ్లారు. ఈ రెండు వీడియోలను గమనించిన కొందరు నెటిజన్లు ఖుషీ కపూర్ ముఖంలో ఏదో మార్పు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ్రపారంభించారు.వీటిని గమనించిన ఖుషీ కపూర్ తాను కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నానని, ముక్కు ఆకారం మారిందనీ సోషల్ మీడియాలో స్పందించారు. దీంతో ఖుషీ కపూర్ నిజాయితీని కొందరు నెటిజన్లు అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘చాలామంది హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకుంటారు. కానీ బయటకు చెప్పరు... ఒప్పుకోరు. అయితే ఖుషీ ధైర్యంగా చెప్పింది. ఆమె నిజాయితీని మెచ్చుకోవాలి’ అని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌తో ఖుషీ కపూర్ బిజీగా ఉన్నారని, ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారని బాలీవుడ్ భోగట్టా. -
ఖరీదైన కారు కొన్న జాన్వీ కపూర్ సిస్టర్.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ చెల్లెలు, శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త రెడ్ కలర్ మెర్సిడెజ్ కారులో తిరుగుతూ ముంబయి వీధుల్లో కనిపించింది. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు.కాగా.. ఖుషీ కపూర్ ది ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో బెట్టి కూపర్ పాత్రలో మెప్పించింది. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సుహానా ఖాన్, అగస్త్యానందా కీలక పాత్రల్లో కనిపించారు. ఖుషీ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీగా వస్తోన్న నాడనియాన్ చిత్రంలో నటించనుంది. ఇందులో ఇబ్రహీం అలీఖాన్ హీరోగా చేస్తున్నారు. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేస్తోన్న లవ్ టుడే చిత్రంలో కనిపించనుంది. మరోవైపు జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బేబమ్మగా ఖుషీ
దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ‘ఉప్పెన’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని టాక్. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ (2021) తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా సమయంలో విడుదలైన ఈ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో బేబమ్మగా తనదైన నటనతో అలరించిన కృతీ శెట్టి ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హిట్ మూవీని నిర్మాత బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో అంగీకరించిన రెండో చిత్రం సందర్భంగా చెప్పారట బోనీ. ‘దేవర’ (ఎన్టీఆర్ హీరో) మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జాన్వీ. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్‌తో నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారీ బ్యూటీ. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ్రపారంభోత్వంలో జాన్వీ కపూర్‌తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన అతిథులతో సరదాగా ముచ్చటించిన బోనీ కపూర్.. ‘‘బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ సినిమా చూశాను. కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. మా చిన్నమ్మాయి ఖుషీ కపూర్‌ని ‘ఉప్పెన’ మూవీ చూడమని చెప్పాను’’ అన్నారట. దీంతో ‘ఉప్పెన’ బాలీవుడ్ రీమేక్‌లో హీరోయిన్గా ఖుషీ నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్‌గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్‌ను సెట్ చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్‌లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్‌నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్‌తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్‌లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్- దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 2018లో 'ధడక్' సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈ మధ్యే 'ద ఆర్చీస్' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓపక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని చెప్పుకొచ్చింది. ఖుషీ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని చెప్పుకొచ్చింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూసింది. చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
అతనితో డేటింగ్.. నోరు జారిన దేవర భామ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం ధడక్‌తో అలరించింది. గతేడాది బవాల్ చిత్రంలో మెరిసింది. తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారుయ అయితే ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. తన సోదరి ఖుషి కపూర్‌తో కలిసి కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. కాఫీ విత్ కరణ్ సీజన్ -8 పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కరణ్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ, ఖుషి ఆసక్తికర సమాధానాలిచ్చారు. (ఇది చదవండి: ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) జాన్వీ కపూర్‌ను ప్రశ్నిస్తూ నీ స్పీడ్ డయల్ నంబర్స్‌లో ముగ్గురి పేర్లు చెప్పమని కరణ్ జోహార్ అడిగాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ పాపా(నాన్న), ఖుషు, శిక్కు అని ఠక్కున చెప్పేసింది. దీనికి ఖుషీ, కరణ్ ఆశ్చర్యంగా జాన్వీ వైపు చూశారు. ఆమె సమాధానంతో నటుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చాలాసార్లు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా జంటగా చాలాసార్లు కనిపించారు. కానీ తమ రిలేషన్‌పై ఎక్కడా స్పందించలేదు. కాగా.. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' ఫుల్ ఎపిసోడ్ జనవరి 4న ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. -
సినిమాల్లోకి జాన్వీ కపూర్ చెల్లెలు ఎంట్రీ.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్ ఎక్కువ సినిమాల్లో కనిపించిన జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆమె చెల్లెలు కూడా అక్కా బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చచిన్న కూతురిగా ఖుషీ కపూర్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ మూవీతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చిందో.. లేదో అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ది ఆర్చీస్ సహా నటుడు వేదంగ్ రైనాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఖుషీ కపూర్ తన మొదటి సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తుండగా.. మరోవైపు రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.అయితే ఈ వార్తలను నటుడు వేదాంగ్ రైనా ఖండించారు. వేదాంర్ రైనా మాట్లాడుతూ ఖుషీ కపూర్, నేను చాలా సందర్భాల్లో కనెక్ట్ అయ్యాం. సంగీతంలో మా ఇద్దరికీ అభిరుచులు ఓకేలా ఉన్నాయి. అలాగని మేమిద్దరం డేటింగ్ చేయడం లేదు. ఆమెతో నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఆ టైం వస్తే నేనే మీ ముందుకొచ్చి చెబుతా' అన్నారు. కాగా.. ది ఆర్చీస్ మూవీలో ఖుషీతో పాటు అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, సుహానా ఖాన్ నటించారు. -
ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!
సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో రెండు ఫ్లాట్లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్‌గా చెబుతున్నారు. అదే కాంప్లెక్స్‌లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు రెండు కార్ పార్కింగ్‌లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం. 2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే.. గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్లోని రెండు ఫ్లాట్లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్‌లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను రూ. 6 కోట్లకు విక్రయించింది. -
దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా దూసుకుపోతుంది. బాలీవుడ్‌తో పాటు తాజాగా టాలీవుడ్‌లోనూ జాన్వీ గ్రాండ్‌గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్‌లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఖుషీ ధరించిన డ్రెస్ అండ్ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఖుషీ కపూర్‌కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ. గతంలో ఇదే డ్రెస్‌ను దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్‌ను రిపీట్ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్ చోకర్నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్‌లో ఖుషి కపూర్‌తో పాటు సుహానా ఖాన్, వేదాంగ్ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ కిడ్స్ ఉండటంతో ది ఆర్చీస్పై ఇప్పటికే హైప్ నెలకొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మల్టీకలర్ డ్రెస్ లో వావ్ అనిపిస్తున్న ఖుషి కపూర్..చూశారంటే మైమరిచిపోవాల్సిందే (ఫోటోలు)
-
అక్క టాలీవుడ్.. చెల్లి కోలీవుడ్.. ఎంట్రీ అదిరిపోయింది!
అతిలోక సుందరిగా సీనీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె తన సినీ కెరీర్లో నాలుగేళ్ల వయసులోనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కందన్ కరుణై అనే చిత్రంతో శుభారంభం జరిగింది. అది మొదలుకుని ఐదు దశాబ్దాల పాటు బాలనటి స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ కథానాయకి వరకు శ్రీదేవి నటన ఎదిగింది. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. వారిద్దరూ శ్రీదేవికి వారసులుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పెద్ద కూతురు జాన్వీ కపూర్ దఢక్ అనే హిందీ చిత్రంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి వరుసగా చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ సైతం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా తన అక్క బాటలోనే ది ఆర్చీస్ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయమైంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా నెట్ఫిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. కాగా ఖుషీ కపూర్ నటించిన తొలి చిత్రం ఇంకా తెరపైకి రాకుండానే కోలీవుడ్‌లో నటించే హీరోయిన్ ఛాన్స్ తలుపు తట్టిందని సమాచారం. యంగ్ హీరో అధర్వకు జంటగా నటించడానికి ఖుషీ కపూర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆకాష్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుందని తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా దక్షిణాదిలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా.. చిన్న కూతురు ఖుషీ కపూర్ తమిళ చిత్రంతో పరిచయం కాబోతుందన్నమాట. -
నా టీనేజ్ ఫోటోలు అశ్లీల వెబ్సైట్లో కనిపించాయి: జాన్వీ కపూర్
2018లో రొమాంటిక్ డ్రామా ధడక్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగా ఫేమ్ ఉన్నప్పటికీ తన గ్లామర్‌తోనూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మిలి మూవీతో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో అలరించింది. ఈ ఏడాదిలో వరుణ్ ధావన్ సరసన బవాల్‌లో నటించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరనస దేవరతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను స్టార్ కిడ్ కావడంతో ఫోటోలు, వీడియోలు నా జీవితంలో ఓ భాగమయ్యాయని తెలిపింది. అంతే కాకుండా ఈ డిజిటల్ యుగంలో తనపై తీవ్ర ప్రభావం చూపించాయని వెల్లడించింది. (ఇది చదవండి: 'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!) జాన్వీ మాట్లాడుతూ..' కెమెరాలు ఎల్లప్పుడూ నా జీవితంలో ఒక భాగం. నా చిన్నతనం నుంచి నా సమ్మతితో లేక నా అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు నాతోపాటు నా సోదరి ఖుషీ కపూర్ల ఫోటోలు తీశారు. అయితే అవీ మేము యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసినవి. కానీ కొందరు తమ మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్స్‌లో పెట్టారు. నేటి డిజిటల్ యుగంలో నకిలీ చిత్రాల బెడద ఎక్కువైంది. కానీ ప్రజలు ఇలా మార్ఫింగ్ చేసిన చిత్రాలు చూసి అవి వాస్తవమైనవని నమ్ముతున్నారు. అది నాకు చాలా ఆందోళనకు గురిచేసింది.' అని అన్నారు. తనకు కేవలం 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఇంటర్నెట్లో నా ఫోటోలు కనిపించాయి. స్కూల్లో చదువుతున్నప్పుడే యాహూ హోమ్‌పేజీలో నా ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఒక రోజు పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో తన క్లాస్మేట్స్ కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న నా ఫోటోలు చూశారు. అవీ చూసి తాను చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు వారంతా భావించారు. కానీ ఆసమయంలో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని జాన్వీ పేర్కొంది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేశారని తెలిపింది. ఇండస్ట్రీలో నేను కష్టపడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. స్కూల్ ఎప్పుడు మానేస్తున్నావు? అని ప్రశ్నించేవారని తెలిపింది. వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో.. నన్నెందుకు జడ్జ్ చేస్తున్నారో అర్థమయ్యేది కాదని దేవర భామ వెల్లడించింది. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) -
కోలీవుడ్ కబురు?
దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌కు కోలీవుడ్ నుంచి కబురు వెళ్లిందట. తమిళ నటుడు అథర్వ హీరోగా ఆకాష్ అనే కొత్త దర్శకుడు ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఖుషీ కపూర్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఖుషీకి ఈ కథ నచ్చిందని, ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఖుషీ కపూర్ నటించే తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘పయ్యా (‘ఆవారా’)’ సినిమాకు సీక్వెల్‌గా ‘పయ్యా 2’ రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంపికయ్యారనే టాక్ గతంలో కోలీవుడ్‌లో వినిపించింది. అయితే ‘పయ్యా 2’ సీక్వెల్లో ఖుషీ కపూర్ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక హిందీలో ‘ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌లో ఖుషీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. -
దక్షిణాదిలో ఎంట్రీ ఇస్తోన్న శ్రీదేవి కూతురు.. హీరో ఎవరంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాలతో కెరీర్లో బిజీగా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఆమె చెల్లెలు ఖుషి కపూర్ సైతం దక్షిణాదిలో ఎంట్రీకి సిద్ధమైంది. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ యువ హీరోకు జంటగా ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. (ఇది చదవండి: రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి) ది అర్చీస్ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేశారు ఖుషి కపూర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మ్యూజికల్ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే ఖుషి కపూర్ త్వరలోనే కోలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారంటూ నెట్టింట వైరలవుతోంది. అధర్వ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్గా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆకాశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. మంచి ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (ఇది చదవండి: 'ఏంటి సార్ కొత్త ఫోనా'.. ఆసక్తి పెంచుతోన్న బిగ్ బాస్ ప్రోమో!) -
లవ్ టుడే హిందీ రీమేక్‌లో ఆమిర్ ఖాన్ కొడుకు, శ్రీదేవి కూతురు
ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ప్రేమికులు కానున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయదర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటించనున్నారు. రూ. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. అప్పట్నుంచి ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో నటించనున్నారంటూ పలువురు హిందీ యువ హీరో హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారని లేటెస్ట్ టాక్. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట. -
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రతిభతో నిలదొక్కుకునేందుకు వస్తున్న 'బీటౌన్' వారసులు
వారిస్ వస్తున్నారోచ్.. హిందీలో వారిస్ వస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ విజిటింగ్ కార్డ్‌తో వస్తున్నారు. ఒకట్రెండు సినిమాలకే బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగపడుతుంది. అందుకే టాలెంట్‌తో నిలబడాలనుకుని వస్తున్నారు. ఇప్పుడందరి కళ్లూ ఈ వారిస్ మీదే. ‘వారిస్ ఆ రహే హై’ (వారసులు వస్తున్నారు) అంటూ స్టార్ కిడ్స్‌కి వెల్కమ్ చెప్పడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. త్వరలో పరిచయం కానున్న ఆ వారసుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో వారసుల ఎంట్రీ లిస్ట్ ప్రతి ఏడాది అప్డేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ పేర్లు చేరిపోయాయి. ఈ ముగ్గురూ జోయా అక్తర్ డైరెక్షన్లో ఓ వెబ్ ఫిలిం చేయనున్నారని టాక్. కామిక్ బుక్ ఆర్చీస్ ఆధారంగా ‘ది ఆర్చీస్’ అనే మ్యూజిక్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది నవంబరులో దర్శకురాలు జోయా అక్తర్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 1960 నేపథ్యంలో టీనేజర్స్ కథలా ఉంటుంది ఆర్చీస్ నవల. ఈ ప్రాజెక్ట్ కోసం తాజాగా అగస్త్య నంద, సుహానా ఖాన్, జోయాల మధ్య ఓ మీటింగ్ జరిగినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ షాప్స్‌లో భాగంగానే అగస్త్య, సుహాన, జోయ కలిశారన్నది బీ టౌన్ టాక్. ఇదే ప్రాజెక్ట్‌లో ఖుషీ కపూర్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది. ఖుషీ కపూర్‌కు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని, న్యూయార్క్‌లో శిక్షణ తీసుకుంటోందని గత ఏడాది ఓ సందర్భంలో ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ అన్నారు. తాజాగా ‘త్వరలోనే ఖుషీ కపూర్ కెమెరా ముందుకు వెళుతోంది. ఖుషీ యాక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కావొచ్చు’’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. దీంతో ఖుషీ ‘ది ఆర్చీస్’ ప్రాజెక్ట్‌లో భాగమయిందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీమ్ అలీఖాన్ (సైఫ్–అమృతా సింగ్‌ల కుమారుడు ఇబ్రహీమ్) పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం జోయా అక్తర్ పరిశీలించిన పేర్లలో వినిపిస్తోంది. ఆండ్రూస్, బెట్టి కూపర్, వెరోనికా లాడ్జ్, జగ్హెడ్ జోన్స్ అనే నలుగురు టీనేజ్ క్యారెక్టర్ల చుట్టూ ‘ది ఆర్చీస్’ తిరుగుతుంది. మరి.. ఇందులో ఎవరెవరు ఏయే క్యారెక్టర్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ పైన చెప్పిన స్టార్ కిడ్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే మాత్రం ఒకే ప్రాజెక్ట్‌తో నలుగురు వారసుల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రముఖ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ యాక్టింగ్ జర్నీ ఆరంభమైంది. హీరోయిన్ అనుష్కా శర్మ నిర్మిస్తున్న ‘క్వాల’ అనే వెబ్ సిరీస్‌లో బాబిల్ నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఐదు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ చిన్న కొడుకు రజ్వీర్ (సన్నీ పెద్ద కొడుకు కరణ్ 2019లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు) ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఈ చిత్రానికి ఎస్. అవ్నీష్ దర్శకుడు. మరోవైపు అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తనయుడు (ఆమిర్–రీనా దత్ల కుమారుడు) జునైద్ ఖాన్ ‘మహా రాజా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా ‘మేదియా’ అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ కూడా ఖరారవుతున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్యన్ యాక్టర్‌గా కన్నా కూడా రైటర్‌గానే ముందుగా పరిచయం కానున్నాడని బీ టౌన్ వార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆర్యన్ రైటర్‌గా మారాడని భోగట్టా. అలాగే ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ నటించనున్నారట. ఇక ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి ఎంట్రీ కూడా ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మరికొందరు స్టార్ కిడ్స్ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. మరి.. టాలెంట్‌తో నిలబడే వారసులు ఎందరో చూడాలి. -
శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది
Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19: బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. జనవరి 10న జాన్వీ కపూర్ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోస్‌తో వారికి కరోనా సోకిందని అనుమానాలు వచ్చాయి. ఈ పోస్ట్‌లో జాన్వీ తన నోట్లో థర్మామీటర్ పెట్టుకుని కనిపించింది. ఆమెతోపాటు ఖుషీ కపూర్ కూడా ఉంది. జాన్వీ ఇన్‌స్టా పోస్ట్ చూసి వారికి కరోనా సోకిందని భావిస్తున్నారు. వీరితో పాటు బోనీ కపూర్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో వారి నివాసాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు (బీఎంసీ) సీల్ వేసి శానిటైజ్ చేసిన విషయం తెలిసిందే. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా అర్జున్, అన్షులా, రియాకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా వారు అధికారికంగా వెల్లడించలేదు. బాలీవుడ్ తారలను కరోనా తెగ ఇబ్బందిపెడుతుంది. ఇప్పటికే జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్, మధుర్ భండార్కర్, ప్రేమ్ చోప్రా, అతని భార్య ఉమా చోప్రా, మృణాల్ ఠాకూర్, స్వరా భాస్కర్లకు కొవిడ్ సోకింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని -
ముగ్గురు వారసులు.. ఓ సినిమా
హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది స్టార్ల వారసత్వం హిందీ తెరపై కనిపించింది. కానీ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండటం బీ టౌన్లో చర్చనీయాంశమైంది. ‘జిందగీ నా మిలేగీ దొబార’, ‘గల్లీభాయ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలు జోయా అక్తర్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ఫిల్మ్ చేయనున్నారు. ఒక అంతర్జాతీయ బుక్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బీటౌన్ బాద్ షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటించనున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని బీటౌన్ టాక్. మరి.. ఈ వె»Œ æఫిల్మ్‌తో ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే. -
బాయ్‌ఫ్రెండ్‌ను వదిలించుకోవాలనుకున్నా!: ఆలియా
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది కానీ వీరి బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. అతడితో బ్రేకప్ అయింది. విచిత్రంగా బ్రేకప్ అయిన కొన్నాళ్లకే ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడింది, అదీ డేటింగ్ యాప్‌లో! అయితే మొదట అతడిని వదిలించుకోవాలని చూసిన ఆలియా తన స్నేహితులు ఖుషీ కపూర్, ముస్కాన్‌ల సూచనతో మనసు మార్చుకుందట! Aaliyah Kashyap: తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా మాట్లాడుతూ.. 'చాలాకాలం దాకా ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోవద్దని అనుకున్నా. కానీ నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన నెల రోజులకు జస్ట్ ఫన్ కోసం ఓ డేటింగ్ యాప్‌లో జాయిన్ అయ్యాను. ఇతర అబ్బాయిలతో మాట్లాడితే బాధను మర్చిపోవచ్చన్నది నా ఉద్దేశం. అయితే ఎవరికీ ఫోన్ నంబర్ మాత్రం ఇవ్వలేదు. ఆ సమయంలో షేన్ గ్రెగొయిర్ ప్రొఫైల్ మ్యాచ్ అయింది. అతడు నాతో వీడియో కాల్ మాట్లాడదాం అంటే సరేలే, చూద్దాం అన్నాను. అదే రోజు రాత్రి నా ఫ్రెండ్స్ ఖుషీ కపూర్, ముస్కాన్‌లకు మెసేజ్ చేశాను. షేన్ను ఇప్పుడే వదిలించుకుందాం అనుకుంటున్నా. నేను కేవలం అబ్బాయిలతో సంభాషించాలనుకున్నానే తప్ప ఇలా వీడియో కాల్స్ మాట్లాడటంలాంటి వ్యవహారాలు నాకు అక్కర్లేదని నా స్నేహితులకు చెప్పాను. అయితే వాళ్లు నా మాటలను వ్యతిరేకించారు. ఒకసారి అతడు అడిగినట్లు వీడియో కాల్ మాట్లాడి చూడమని సూచించారు. విచిత్రంగా తొలిసారే మేమిద్దం నాలుగు గంటలదాకా మాట్లాడుకున్నాం. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి సుమారు నాలుగు గంటలపాటు మాట్లాడుకుంటూనే ఉన్నాం' అంటూ షేన్‌తో ప్రేమ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది ఆలియా. ఈ ప్రేమజంట గత నెలలో లవ్ యానివర్సరీ కూడా జరుపుకుంది. -
అక్క జాన్వీనే ఫాలో అవుతున్న ఖుషీ.. త్వరలోనే..
సినిమా ఇండస్ట్రీలో వారసులను పరిచయం చేసేందుకు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. బాలీవుడ్లో అయితే వారసులను పరిచయం చేయడానికి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మంది వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆయన తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి–నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను హీరోయిన్ గా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నారని టాక్. శ్రీదేవి–బోనీ కపూర్ల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ను తమ ధర్మా ప్రొడక్షన్స్‌పై ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు కరణ్ జోహార్. త్వరలో కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఖుషీ. ఇప్పుడు ఖుషీని పరిచయం చేసే బాధ్యతను కూడా కరణే తీసుకున్నారట. ధర్మా –కార్నర్‌స్టోన్ ఏజెన్సీ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్న ఆయన ఈ బ్యానర్లో ఖుషీ కపూర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. -
‘మిస్ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం
అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి నేడు. ఫిబ్రవరి 24వ తేదీన ఆమె దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె వర్ధంతి సందర్భంగా శ్రీదేవి కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఆమె మరణించిదనే విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. తల్లి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా శ్రీదేవి తనను ఉద్దేశించి స్వయంగా రాసిన ఓ పేపర్‌ను జాన్వీ పంచుకుంది. ‘ఐ లవ్యూ మై లబ్బు.. యువర్ ద బెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్’ అని శ్రీదేవి రాసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా బోనీకపూర్, శ్రీదేవి కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. మిస్ యూ అని జాన్వీ, ఐ లవ్యూ అమ్మ అని ఖుషీ కపూర్ అంటూ పోస్టులు చేశారు. శ్రీదేవీ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెను స్మరించుకున్నారు. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) -
ఫ్యాన్స్‌కి ఖుషీ?
మూడేళ్ల విరామం తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ‘పెళ్లి సందడి’ టైటిల్‌నే ఈ కొత్త సినిమాకు పెట్టారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తారని టాక్. అలాగే హీరోయిన్గా శ్రీదేవి చిన్న కుమార్తె, జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కనిపించే అవకాశం ఉందట. హీరోయిన్స్ పేరు ప్రస్తావనలో ఖుషీ కపూర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అనేక బ్లాక్‌బస్టర్స్‌లో కనిపించారు శ్రీదేవి. ఆమె కెరీర్లో ముఖ్యమైన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. తెలుగులో శ్రీదేవి ఓ ప్రత్యేకమైన స్థానం. ఖుషీ తెలుగు తెరకు పరిచయం అయితే శ్రీదేవి అభిమానులు ఖుషీ అవుతారు. మరి ఖుషీ ఇస్తారా? చూడాలి. ఒకవేళ ఈ సినిమా అంగీకరిస్తే ఇదే ఖుషీ కపూర్‌కి తొలి సినిమా అవుతుంది. ఇంకా హిందీలో కూడా ఆమె నటించలేదు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘పెళ్లి సందడి’కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. -
మా పిల్లలు ప్రతిభావంతులు
చిన్నతనంలో పిల్లలు పిచ్చి గీతలు గీస్తేనే మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. పెద్దయ్యాక వాళ్లే కుంచె పట్టుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తే? ఆ ఆనందానికి అవధులుండవు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. లాక్డౌన్లో బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ డ్రాయింగ్ మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్లో వాళ్లు గీసిన పెయింటింగ్స్‌ను తన ట్విట్టర్లో షేర్ చేసి, ‘మా పిల్లలు ప్రతిభావంతులు’ అని మురిసిపోయారు బోనీ కపూర్. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గీసిన చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. -
‘అంతకంటే ముందు నేను ఓ పని చేయాలి’
న్యూయార్క్: నటిగా తనను తాను నిరూపించుకున్నాకే తన కుటుంబంతో కలిసి పనిచేస్తానని అలనాటి నటి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్ అన్నారు. నటి శ్రీదేవి, బోనీ కపూర్ల చిన్న కూమార్తె ఖషీ కపూర్. తల్లి శ్రీదేవి, సోదరి జాన్వీ కపూర్లాగే హీరోయిన్ కావాలని ఖుషీ కపూర్ కోరుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ వెళ్లిన ఖుషీ అక్కడే న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీలో ఖుషీ మూవీకి సంబంధించిన కోర్సు పూర్తి కూడా చేస్తున్నారు. ఇక త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం న్యూయార్కులోనే ఉన్న ఖుషీ తన స్కూల్ అకాడమీ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తూ, న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్లో తన అనుభవాన్ని పంచుకున్నారు. (చెఫ్‌గా మారిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై) తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. ‘నా ఫ్యామిలీ బిజినెస్ చూస్తుంటారు. నా కుటుంబంతో కలిసి పనిచేసేందుకు నేనెప్పుడూ ఇష్టపడతాను. కానీ అందుకు కొంచెం సమయం పడుతుంది. అంతకంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. నటిగా నా స్థానాన్ని నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. ఫిల్మ్ స్కూల్లో నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. ఇప్పుడు నేను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను’. అంటూ పేర్కొన్నారు. కాగా ఖుషీకి నటన వారసత్వంగానే ఉంది. ఆమె నిర్మాత సురీందర్ కపూర్ మనవరాలు. తండ్రి బోనీ కపూర్ కూడా నిర్మాతే. తల్లి శ్రీదేవి సోదరి జాన్వీ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్ అంతా బాలీవుడ్ నటులే. ఇక ఖుషీ తన నటనతో బాలీలవుడ్‌లో ఏ మేరకు రాణించగలరో చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. (విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య) -
క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై
ముంబై : లాక్డౌన్లో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ మాస్టర్ చెఫ్‌గా మారారు. కిచెన్‌లోకి దూరి కష్టపడి క్యారెట్ కేక్ తయారు చేశారు.దీనిని ముద్దుల చెల్లెలు ఖుషీకి రుచి చూపించి..ఎలా ఉందో చెప్పాలని కోరారు. అయితే క్యారెట్ కేక్‌ను టెస్ట్ చేసిన ఖుషీ మాత్రం ఊహించని రిప్లై ఇచ్చారు. ముందుగా కొద్దిగా తిన్న ఖుషీ బాగుందని కితాబు ఇచ్చింది. మరికొంత తినమని జాన్వీ అడగడంతో.. ఖుషీ అందుకు నిరాకరించి నాకు అది నచ్చలేదు అని సమాధానమిచ్చారు. ఈ వీడియోను మొదటి జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేయగా అనంతరం ఆమె ఫ్యాన్స్ క్లబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్‌గా నివేదా) ఇంతకముందు జాన్వీ లాక్డౌన్ కాలం తనను మార్చిన విధానాన్ని ఓ వివరణాత్మక పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ పుణ్యామా అని సెలబ్రిటీలంతా తమలో ఉన్న నైపుణ్యాలను బయటపెడుతున్నారు. దీపికా పదుకొనే నుంచి కత్రినా కైఫ్ వరకు కొత్త కొత్త వంటలు సృష్టించడంలో బిజీగా ఉన్నారు. నలభీముడిలా మారిపోయి గరిట తిప్పుతున్నారు. కాగా ఈ వంటకాలను చూసిన అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. తాము ఆరాధించే తారలు యాక్టింగ్ మాత్రమే కాకుండా.. ఇంటి పనులు కూడా చకాచకా చేయగలరని అభిప్రాయపడుతున్నారు. (ఎక్కడైనా నేర్చుకోవచ్చు: జాన్వీ) -
శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్
-
శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్
సాక్షి, తిరుమల: శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరివురు తన స్నేహితురాలితో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాన్వీ 3500 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు జాన్వీ కపూర్‌కి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రాలతో సత్కరించారు. అచ్చం తెలుగింటి అమ్మాయిలా చీరకట్టులో జాన్వీకపూర్ శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. #JhanviKapoor visits Tirupati to seek blessings of Lord Venkateshwara. She climbed 3,500 steps barefoot and offered prayers to the presiding deity. pic.twitter.com/2hdRtJNHAB — Bollywood Knocks (@BollywoodKnocks) February 10, 2020 -
సెలబ్రిటీ సిస్టర్స్ పోస్ట్‌కు నెటిజన్ల ఫిదా
న్యూఢిల్లీ : సెలబ్రిటీ సిస్టర్స్ తమ మధ్య ఉన్న ఆప్యాయతలను చాటుకుంటూ తమ ఎమోషనల్ బాండింగ్ ఏపాటిదో తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శ్రీదేవి, బోనీకపూర్‌ల ముద్దుల తనయలు ప్రతి సందర్భంలోనూ తమ మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియాలో చాటుతుంటారు. ఇక ఉన్నత విద్య కోసం సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన జాన్వీ కపూర్ చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్ క్రిస్మస్ హాలిడే గడిపేందుకు ముంబైలోని తమ ఇంటికి చేరుకుంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బోనీ కపూర్ తన కుమార్తెను రిసీవ్ చేసుకుని ఇల్లు చేరారో లేదో జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫైనల్లీ అనే క్యాప్షన్‌తో ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఖుషీని పట్టరాని ఆనందంతో జాన్వీ హగ్ చేసుకుంటున్న ఫోటోలు కనిపించాయి. తన అక్కను చాలారోజుల తర్వాత కలుసుకున్న సంతోషంతో ఖుషీ జాన్వీపై వాలిపోయింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఖుషీ మూవీకి సంబంధించిన కోర్సు అభ్యసిస్తోంది. కోర్సు ముగిసిన అనంతరం బాలీవుడ్లో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. ఖుషీ 20వ పుట్టిన రోజున సైతం జాన్వీ ఉద్వేగంగా రియాక్టరయ్యారు. ‘నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నువ్వే నా ప్రాణ’మంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. -
సెలవుల్లోనూ వర్కవుట్
‘‘ఎక్సర్సైజ్లకు సెలవు ఇవ్వకండి.. బద్దకించకుండా వర్కవుట్లు చేయండి.. చక్కగా ఉండండి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ‘ధడక్’ చిత్రంతో కథానాయిక అయిన జాన్వీ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంతసేపూ పని అంటే బోరే కదా.. అందుకే తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. ఈ ముగ్గురూ న్యూయార్క్ చెక్కేశారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్‌లకైతే సెలవు చెప్పారు కానీ వ్యాయామాలకు మాత్రం ‘నో హాలిడే’ అన్నారు జాన్వీ. వెకేషన్లో కూడా వర్కవుట్లు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న ఓ వీడియోను జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిట్నెస్ మీద ఈ బ్యూటీకి ఎంత శ్రద్ధో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీదేవి కూడా అంతే. ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. 50 ఏళ్ల వయసులోనూ మంచి శరీరాకృతితో ఉండేవారామె. కూతురికి కూడా తల్లిలా ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రస్ట్ అని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే, తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో టైటిల్ రోల్ చేశారు జాన్వీ. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక వెకేషన్ నుంచి ముంబై తిరిగి రాగానే ‘దోస్తానా 2’ షూటింగ్లో పాల్గొంటారు. -
అందమైనపు బొమ్మ
శ్రీదేవి గొప్ప అందగత్తె. అంతకు మించిన గొప్ప నటి. సౌతిండియా నుంచి నార్తిండియా వరకూ తన ప్రతిభతో లేడీ సూపర్‌స్టార్ అయ్యారు. ఓ బ్రాండ్లా ఎదిగారు. అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి మరణించారు. అందరి మనసుల్లో చెరిగిపోని బొమ్మగా నిలిచిపోయారు. ఇప్పుడు సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అందమైన మైనపు బొమ్మగా మారారు శ్రీదేవి. ఈ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘శ్రీదేవి మరణించిన తర్వాత కూడా ఆమె మీద కురిపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. నా భార్యగా తనని ఎంతగా ప్రేమించానో, తన ఆర్ట్‌ని, తనకు సినిమా మీద ఉన్న ప్రేమను అంతే గౌరవించాను. ఈ విగ్రహం తన ఆనవాళ్లకు ఓ చిహ్నంలా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు బోనీ కపూర్. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటలో శ్రీదేవి లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారు. తల్లి బొమ్మను తదేకంగా చూస్తున్న జాన్వీ శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి -
అక్క చెప్పింది... చెల్లి వస్తోంది!
అతిలోకసుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల పెద్దకుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓ చాట్ షోలో భాగంగా కన్ఫార్మ్ చేశారు. ‘‘ఖుషీ యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ఏదో అలా వచ్చాంలే అనుకోకుండా ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోనుంది. ఈ విషయంపై నాన్న బోనీ కపూర్ కూడా కాస్త ఎగై్జటింగ్‌గానే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీకపూర్. ఇక.. జాన్వీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జోహారే తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను వ్యక్తపరిచారట ఖుషీకపూర్. ఆలియా భట్, సిద్దార్ధ్‌మల్హోత్రా, వరుణ్‌ధావన్ ఇలా చాలామంది స్టార్స్ కొడుకులు, కూతుర్లను కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందరూ కూడా కెరీర్లో దూసుకెళుతున్నారు. -
‘అయినా... నువ్వంటే నాకెంతో ఇష్టం’
‘ చిన్ననాటి నుంచి నీ నుంచి నేను ఎదుర్కొన్న బెదిరింపులకు ఉదాహరణ ఇది... అయినా నువ్వంటే నాకెంతో ఇష్టం, ఎంత అంటే నువ్వు ఊహించలేనంతగా.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ తన చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్‌కు.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. బుల్లి జాన్వీ, ఖుషీలు టీవీ ముందు డాన్స్ చేస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సో క్యూట్.. ఈ చిన్నారులు ఇద్దరు.. ప్రస్తుతం ఇద్దరు కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించిన యువతులు. మీ బంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ ఖుషీకి విషెస్ తెలుపుతున్నారు. తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత ఖుషీ తొలి పుట్టినరోజు ఇదే కావడంతో.. ‘ మీ అమ్మ ఎక్కడ ఉన్నా మీ బంధం చూసి ఆనందపడతారు. ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు’ అంటూ జాన్వీ, ఖుషీలను అభినందిస్తున్నారు. కాగా ఖుషీతో ఉన్న రిలేషన్షిప్ గురించి జాన్వీ కపూర్ పలు సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ– ‘ఇంటి బయట మాత్రమే హీరోయిన్ అనే స్టేటస్ ఉంటుంది. ఇంట్లో మాత్రం నేను సాదాసీదా అమ్మాయినే. స్టార్‌ని అనే ఫీలింగ్‌ని నాకు రాకుండా, నన్ను భూమ్మీదే ఉంచుతుంది నా చెల్లెలు ఖుషీ(నవ్వుతూ). ‘నువ్వు చాలా కూల్ అనుకుంటావు కానీ అలా ఏం కాదు అంటూ సరదాగా ఆటపట్టిస్తూ నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. అయినా ఖుషి అంటే నాకు చాలా ఇష్టం. తనను నా చెల్లెలు అనడం కంటే అక్క అనడం బెటరేమో! ’ అంటూ చెల్లెలి గురించి జాన్వీ బోలెడు కబుర్లు చెప్పింది. ఇక బోనీ కపూర్- శ్రీదేవి దంపతుల పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడఖ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అక్క బాటలోనే ఖుషీ కూడా త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారని బీ- టౌన్ టాక్. View this post on Instagram Just an example of how most of my childhood consisted of being bullied by you.... I still love u though, more than you’ll ever be able to imagine. #hbd A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Nov 4, 2018 at 11:21am PST -
ఖుషి నాకు చెల్లెలు కాదు!
‘బయట అందరికీ నేను ‘ధడక్’లో హీరోయిన్ని కావచ్చు. సెలబ్రిటీ కావచ్చు. కానీ ఎప్పుడూ నన్ను నాలానే ఉంచే వ్యక్తి నా చెల్లెలు ఖుషి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ఖుషీతో ఉన్న రిలేషన్షిప్ గురించి జాన్వీ మాట్లాడుతూ– ‘‘సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య మేం కలసి ఉండటం చాలా తక్కువ అవుతోంది. తను నన్ను కలవడానికి వచ్చినా నేనేదో నా పనుల్లో బిజీగా ఉంటున్నాను. అది కొంచెం బాధగా అనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ అన్నింట్లో ‘స్పెషల్ ట్రీట్మెంట్’ ఉంటుంది. ఇంటి బయట నా స్టేటస్ ఇది అయితే ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. ఎందుకంటే స్టార్ ఫీలింగ్‌ని నాలోకి రాకుండా చేస్తుంది ఖుషి. నన్ను భూమ్మీదే ఉంచుతుంది (నవ్వుతూ). ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ‘నువ్వు చాలా కూల్ అనుకుంటావు కానీ అంతేం కాదు’ అంటూ సరదాగా ఆటపట్టిస్తుంది. నాతో అన్ని పనులు చేయించుకుంటుంది. టీవీలో మేం ఏం చూడాలో తనే డిసైడ్ చేస్తుంది. అందుకే ఖుషి అంటే నాకు బోలెడంత ఇష్టం. నా చెల్లి అనడంకంటే ఖుషీని అక్క అనాలేమో?’’ అని చెల్లెలి గురించి చాలా కబుర్లు చెప్పారు జాన్వీ. -
బోని కపూర్‌కు ఎవరంటే ఎక్కువ ఇష్టం
ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొచ్చిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ ఫీచర్, సెలబ్రిటీల నుంచి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. తమ తమ జీవిత విశేషాలు, కెరీర్, ఇష్టఅయిష్టాలను సెలబ్రిటీలు ఈ ఫీచర్ ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల బోని కపూర్ మొదటి భార్య కూతురు అన్హులా కపూర్ కూడా ఈ ఫీచర్‌ను వాడారు. ఈ ఫీచర్ ద్వారా అన్హులా కపూర్ నుంచి పలు ఆసక్తికర విషయాలను అభిమానులు రాబట్టారు. ‘మీ నలుగురు తోబుట్టువుల్లో, బోని కపూర్ ఎక్కువగా ఇష్టపడేది ఎవరూ?’ అని అభిమానులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం అందరూ అర్జున్ కపూర్ లేదా జాన్వీ కపూర్ వస్తుందని భావించారు. కానీ వారిద్దరూ కాదంట. అందరి కంటే చిన్న చెల్లి, ఖుషీ కపూర్ అంటే బోని కపూర్‌కు ఎక్కువగా ఇష్టమని అన్హులా రివీల్ చేశారు. బోని కపూర్ మొదటి భార్య మోనా కపూర్ సంతానం అర్జున్, అన్హులాలు కాగ, జాన్వీ, ఖుషీలు అందాల తార, రెండో భార్య శ్రీదేవి సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవీ చనిపోయిన తర్వాత వీరి బంధం బాగా బలపడింది. చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అర్జున్, అన్హులాలు ఎల్లవేళలా తోడుంటూ వస్తున్నారు. అన్న అర్జున్ కపూర్, చెల్లెళ్లపై ఈగ కూడా వాలనీయనంత కేరింగ్‌గా చూసుకుంటూ వస్తున్నారు. చాలా మంది బోని కపూర్‌కు తన ఒకానొక కొడుకంటే ఎక్కువగా ఇష్టమని, లేదా జాన్వీని ఎక్కువగా ముద్దు చేస్తారని అనుకునే వారు. కానీ వారందరి కంటే కూడా నలుగురిలో ఎక్కువగా బోనికి తన చిన్న కుట్టి, ఖుషీ అంటే ఎక్కువ ఇష్టమని అన్హులా చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. ఖుషీ ఎక్కువగా బోనికి క్లోజ్ అని, జాన్వీ తనపై ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. అయితే బోని నిజాయితీగా అందర్ని సమానంగా ప్రేమిస్తారని కూడా అన్హులా చెప్పుకొచ్చారు. మరో యూజర్, మీ తోబుట్టువుల్లో మీకు నచ్చే విషయమేమిటని అడుగగా.. ‘వారి హార్ట్, వారి బలం, చీకటి రోజుల్లో కూడా వారు ఎప్పుడూ వెలుతురు వైపే చూసే సామర్థ్యం కలిగి ఉండటం.. కారణం లేకుండా వారు నన్ను నవ్వించగలగడం.. కానీ ఎక్కువగా వారు నా వారు అని చెప్పుకోవడాన్ని ప్రేమిస్తాను’ అని అన్హులా ఎంతో భావోద్వేగంతో చెప్పారు. బోని కపూర్ ఇద్దరూ భార్యలు చనిపోయిన సంగతి తెలిసిందే. మొదటి భార్య మోనా కపూర్ 2012లో క్యాన్సర్‌తో చనిపోగా.. రెండో భార్య శ్రీదేవీ దుబాయ్‌లో బాత్‌టబ్‌లో పడి ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. అప్పటి నుంచి నలుగురు తోబుట్టువులు, తండ్రి తోడుగా, ఆయన్ని నవ్విస్తూ.. ఎంతో సానిహిత్యంతో మెలుగుతున్నారు. -
సినిమాల్లోకి జాన్వీ.. మరి ఖుషీ ప్లాన్సేంటి?
ముంబై : దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో జాన్వీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తల్లి లాగే జాన్వీ కూడా కళ్లతోనే భావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త శ్రీదేవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానుందనేదే ఈ వార్తల సారాంశం. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్ తెలిపారు. ‘ఖుషీ మొదట మోడల్ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్ కావాలనుకుంటోంది. కెరీర్ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని’ బోనీ కపూర్ వ్యాఖ్యానించారు. -
కన్నీటిపర్యంతమైన శ్రీదేవి చిన్న కూతురు
-
కన్నీటిపర్యంతమైన ఖుషీ కపూర్
జాన్వీ కపూర్‌కు, ఎంటైర్ కపూర్ ఫ్యామిలీకి నేడు బిగ్ డే. అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్ల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ధడక్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. అనిల్ కపూర్, బోని కపూర్ల నుంచి ఖుషీ కపూర్ వరకు ఈ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు. ఈ ఉద్వేగభరిత సందర్భంలో శ్రీదేవీ లేకపోవడం ప్రతి ఒక్కర్ని కలచివేసింది. చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తల్లుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అలా తీవ్ర ఉద్వేగానికి గురైన చెల్లిని, జాన్వీ కపూర్ అక్కుని చేర్చుకుని ఓదార్చడంతో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. జాన్వీ సైతం మీడియా ఎంతో ముందు ఎంతో నెర్వస్‌గా ఫీలయ్యారు. జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేయడంపై శ్రీదేవీ ఎప్పుడూ కలలు కంటూ ఉండేవారు. తల్లి కలను జాన్వీ నిజం చేయబోతున్నారు. శ్రీదేవి మరణించిన దగ్గర్నుంచి అక్కా చెల్లెళ్లు ఒకరికొకరు ఎంతో చేదుడువాదోడుగా ఉంటున్నారు. వీరికి అన్న అర్జున్ కపూర్, సోదరి అన్హులా కపూర్లు కూడా అండగా నిలబడుతూ వస్తున్నారు. నేడు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనసుకు హత్తుకునేలా ఓ పోస్టు కూడా చేశారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైటన్ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. -
సైట్లో చెల్లెలి ఫొటోలపై అసభ్య వ్యాఖ్యలు.. మండిపడ్డ హీరో!
సాక్షి, ముంబై: తన సోదరి జాన్వీ కపూర్ ఫొటోలను అభ్యంతరకరరీతిలో ప్రచురించిన వెబ్‌సైట్‌పై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మండిపడ్డాడు. ఎక్స్పోజింగ్ చేసేలా జాన్వీ కపూర్ ‘సెక్సీ దుస్తులను’ ధరించిందంటూ ఓ బాలీవుడ్ సినిమా వెబ్సైట్ అసభ్య కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అర్జున్ కపూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఇటీవల అర్జున్ కపూర్ నివాసం వద్ద జాన్వీ, ఆమె సోదరి ఖుషీ ఉన్న సమయంలో తీసిన ఫొటోలు.. పోస్టు చేస్తూ అభ్యంతరకరమైన రీతిలో కథనాన్ని ప్రచురించడంతో ఆ వెబ్‌సైట్‌ను అర్జున్ చీల్చిచెండాడాడు. ‘నీచమైన వెబ్సైట్.. అలాంటి సమయంలోనూ నీ కళ్లు అలా దుర్బుధ్దితో అన్వేషించడం సిగ్గుచేటు. మన దేశంలో అమ్మాయిలను ఇలాగే చూస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇందుకు సిగ్గుపడుతున్నా’ అని అర్జున్ ఆవేదనగా ట్వీట్ చేశాడు. సదరు వెబ్సైట్ వెంటనే కథనాన్ని తొలగించింది. గతంలోనూ జాన్వీ, ఖుషీలను ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు కించపరిస్తే.. వారికి మద్దతుగా అర్జున్ నిలిచాడు. శ్రీదేవి కూతుళ్లు అయిన జాన్వీ, ఖుషీ అర్జున్‌కు సవతి చెల్లెళ్లు అవుతారు. బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ సంతానం అర్జున్, అన్షులా. ఇటీవల శ్రీదేవి ఆకస్మికంగా మృతిచెందడంతో తీవ్ర బాధలో ఉన్న జాన్వీ, ఖుషీకి అర్జున్, అన్షులా అండగా నిలిచారు. ఈ క్రమంలో ఇటీవల బోనీ తన కూతుళ్లు జాన్వీ, ఖుషీలను తీసుకొని అర్జున్, అన్షులా ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవి: ఆ రోజు ఏం జరిగిందంటే..
ముంబై: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై వారం రోజులుగా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె భర్త, ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. తన స్నేహితుని వద్ద శ్రీదేవి మరణించిన రోజు ఏం జరిగిందనే విషయంపై పెదవి విప్పారు. తాను సడెన్‌గా దుబాయ్ వెళ్లడం.. అక్కడ శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడం.. ఇద్దరం కలసి గడపడం.. చివరిగా బాత్రూమ్లో శ్రీదేవిని విగతజీవిగా చూడటం.. ఇలా ఫిబ్రవరి 24న సాయంత్రం జరిగిన ప్రతి విషయాన్ని బోనీ తన స్నేహితుడు, ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నాహ్తాకు పూసగుచ్చినట్టు వివరించారు. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు కొద్దిసేపటి ముందు వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణలను యథాతథంగా కోమల్ తన బ్లాగ్‌లో రాసి ఆ తర్వాత దానిని అధికారిక ట్వీటర్ పేజీలో షేర్ చేశారు. ఒంటరితనమంటే ఆమెకు భయం.. కోమల్ బ్లాగ్‌లో షేర్ చేసిన ప్రకారం(బోనీ కోణం నుంచి).. ఫిబ్రవరి 24 ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్టు ఆమెకు చెప్పలేదు. దుబాయ్ వెళ్లాలనే ఆలోచనకు జాన్వీ కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే.. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుందనేది ఆమె భయం. గత 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు వెళ్లకపోవడం రెండుసార్లే జరిగింది. సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు శ్రీదేవి వెళ్లింది. అప్పుడు నేను ఆమెతో లేను. అయితే నా స్నేహితుని భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌లోనే జరిగింది. ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ ఓ వివాహం నిమిత్తం దుబాయ్ వెళ్లాం. ఫిబ్రవరి 22న లక్నోలో ఓ కీలకమైన సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను ఇండియా వచ్చాను. ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని రూమ్ నంబర్ 2201లో శ్రీదేవి రిలాక్స్ అవుతూ.. జాన్వీ కోసం షాపింగ్ చేసింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు నేను విమాన టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాను. హోటల్ వద్ద శ్రీదేవిని సర్ప్రైజ్ చేశాను. ఇద్దరం 15 నిమిషాలు గడిపాం. అనంతరం నేను ఫ్రెషప్ అయి.. రొమాంటిక్ డిన్నర్‌కు వెళదామని ప్రతిపాదించాను. దీనికి ఓకే అన్న శ్రీదేవి.. స్నానానికి వెళ్లింది.శ్రీదేవి మాస్టర్ బాత్రూమ్కు వెళ్లింది. లివింగ్ రూమ్‌కు వచ్చిన నేను టీవీ చూస్తూ కొద్దిసేపు గడిపాను. 15–20 నిమిషాల తర్వాత సమయం 8 గంటలకు సమీపిస్తుండటం.. శనివారం కావడంతో హోటల్లో రష్ పెరిగిపోతు0దనే ఉద్దేశంతో లివింగ్ రూమ్ నుంచే రెండుసార్లు బిగ్గరగా శ్రీదేవిని పిలిచినా పలక లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్లీ పిలిచినా స్పందన లేదు. దీంతో బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను. ఎంతసేపటికీ డోర్ తీయకపో వడం.. లోపలి నుంచి ట్యాప్ అన్ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్ తెరిచే ప్రయత్నం చేశాను. లోపల బోల్ట్ పెట్టకపోవడంతో డోర్ వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్ట బ్లోని నీటిలో పూర్తిగా మునిగిన శ్రీదేవి కనిపించింది. షాక్‌కు గురై ఎటువంటి చలనం లేకుండా శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాను. శ్రీదేవి మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపో యింది. శ్రీదేవిని బోనీ సర్ప్రైజ్ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయిందని కోమల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తొలుత నీట మునిగి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చని లేదా మొదట నిద్రలోకి జారుకుని లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగిపోయి ఉండొచ్చని కోమల్ అంచనా వేశారు. ఆమె ఒక్క నిమిషం కూడా వేదన అనుభవించిన దాఖలాలు లేవని, ఎందుకంటే బాత్‌టబ్ పూర్తిగా నిండినా చుక్క నీరు కింద పడకపోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం సాక్షి, చెన్నై: ప్రముఖ నటి శ్రీదేవి అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం రామేశ్వరం వద్ద సముద్రంలో కలిపారు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోయి శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయానికి ముంబైలో ఫిబ్రవరి 28న అంత్యక్రియలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం శ్రీదేవి మృతదేహాన్ని దహనం చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. అనంతరం ఈసీఆర్‌లోని శ్రీదేవి ఫామ్ హౌస్‌లో బసచేశారు. శనివారం ఉదయాన్నే పూజలు నిర్వహించిన తర్వాత రామేశ్వరానికి వెళ్లి అక్కడి సముద్రతీరంలోని అగ్నితీర్థంలో శ్రీదేవి అస్థికలను బోనీకపూర్ కలిపారు. -
ఫిట్‌గా ఉండటం కోసమే డైట్
శ్రీదేవి విపరీతంగా డైట్ చేయడంవల్ల ఆమె ఆరోగ్యం పాడైందన్నది ఇప్పుడు కొందరి అభిప్రాయం. నిజానికి తాను విపరీతంగా డైటింగ్ చేయడంతో పాటు సన్నగా ఉండాలని పిల్లలను కూడా సరిగ్గా తిననిచ్చేవారు కాదనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. ఇదే విషయం గురించి గతంలో ఓసారి అడిగినప్పుడు.. జగదేక సుందరి నవ్వేశారు. ‘‘పిల్లల కడుపు మాడ్చే తల్లిని కాదు. ఆ మాటకొస్తే నేను అన్‌హెల్దీ వేలో ఫుడ్ తీసుకోను. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను హెల్త్ క్లబ్‌కి వెళ్లేదాన్ని. ఒకసారి నా పిల్లలు కూడా వస్తానంటే రమ్మన్నాను. అక్కడ నాతో పాటు జాన్వీ, ఖుషీ యోగా చేశారు. దాంతో పిల్లలను కూడా హెల్త్ సెంటర్స్‌కి తీసుకొచ్చి వాళ్లతో విపరీతంగా వర్కవుట్స్ చేయిస్తున్నానని, డైట్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అది నిజం కాదు. నా కూతుళ్లకు కూడా ఫిట్నెస్ మీద మంచి అవగాహన ఉంది. వాళ్లు స్పోర్ట్స్ ఆడతారు. ఫిట్‌గా ఉండాలనుకుంటారు. అందులో తప్పేముంది’’ అన్నారు శ్రీదేవి. భార్య కఠినమైన డైట్ పాటిస్తే భర్త బోనీ కపూర్ మాత్రం డైటింగ్‌కి దూరం. ఆయన భోజనప్రియుడు. ఆయనతో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయించడానికి శ్రీదేవి చాలా ప్రయత్నాలు చేశారట. కానీ పొద్దున్నే నిద్ర లేవగానే ఏదో వంక చెప్పి బోనీ తప్పించుకునేవారట. ‘‘డైట్ విషయంలో శ్రీదేవి చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. తను కంట్రోల్ చేసుకుంటూ నన్ను కంట్రోల్ చేస్తుంటుంది. వాస్తవానికి నేను భోజనప్రియుణ్ణి. హైదరాబాద్, చెన్నై వంటకాలు అంటే చాలా ఇష్టం నాకు. వీలు దొరికినప్పుడు ఫుడ్ లాగించడానికి ట్రై చేస్తాను. అలా చేస్తానని తనకీ తెలుసు. చిన్నగా మందలిస్తుంది. నాకు రెండే రెండు బలహీనతలు. ఫస్ట్ నా కుటుంబం అయితే సెకండ్ నాకు ఇష్టమైన ఫుడ్’’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తెలిపారు. భర్త ఫుడ్ లవర్ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు తినడానికి వీలుగా ఫుడ్ రెడీ చేయించేవారట శ్రీదేవి. -
శ్రీదేవికి గుండెపోటు..అసలేం జరిగింది?
-
శ్రీదేవికి గుండెపోటు.. అసలేం జరిగింది?
దుబాయ్: సినీ వినీలాకాశంలో అతిలోకసుందరిగా అందరి మన్ననలు అందుకున్న శ్రీదేవి ఊహించనివిధంగా శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం రస్ ఆల్ ఖైమాకు వెళ్లిన ఆమె శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు పెళ్లిలో అప్పటివరకు సంతోషంగా గడిపిన శ్రీదేవికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బాత్రూమ్లో పడిపోయి అపస్మారస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను బంధువులు వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని భారత కాన్సులేట్ జనరల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బోని పక్కనుండటం అదృష్టం.. శ్రీదేవి చివరిశ్వాస విడిచే సమయానికి భర్త బోనికపూర్, కుమార్తె ఖుషి.. ఆమె పక్కనే ఉండటం అదృష్టమని సన్నిహితులు వ్యాఖ్యానించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పెళ్లి వేడుకలు పూర్తైన తర్వాత కుమార్తెతో పాటు బోనికపూర్ ముంబై తిరిగి వెళ్లాల్సివుంది. శ్రీదేవి తన సోదరి శ్రీలతతో పాటు కొద్దిరోజులు దుబాయ్‌లో ఉండాలని అనుకున్నారు. బోనికపూర్ ముంబై వెళ్లిపోయివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోందని సన్నిహితులు పేర్కొన్నారు. దుబాయ్‌కు వెళ్లేముందు ముంబై విమానాశ్రయంలో బోనికపూర్, శ్రీదేవి, ఖుషి (యోగేన్ షా ఫొటో) ముంబైలో ఒంటరిగా జాహ్నవి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ షూటింగ్ కారణంగా దుబాయ్‌కు వెళ్లలేదు. శశాంక్ ఖైతాన్ ‘దడక్’ సినిమాలో బిజీగా ఉండడంతో తల్లితో పాటు వెళ్లలేకపోయింది. తన తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన అంధేరీలోని తన నివాసానికి చేరుకుంది. ఒంటరిగా ఉన్న ఆమెను బంధువులు, సన్నిహితులు ఓదారుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకు తరలించే అవకాశముంది. కేన్సర్ వదంతులు.. శ్రీదేవి ఆరోగ్యంపై గతంలో వదంతులు వచ్చాయి. శ్రీదేవికి కేన్సర్ ఉందని 2010-11 మధ్యకాలంలో సమాచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎనిమిదేళ్లుగా శ్రీదేవి.. హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. -
ఆ వదంతులు నమ్మొద్దు: నాగ్
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ రెండో సినిమా ప్రాజెక్ట్ ఇటీవల మొదలైంది. తొలి సినిమా 'అఖిల్' నిరాశపరచడంతో రెండో మూవీ ప్రాజెక్టును నాగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాగ్‌కు 'మనం' లాంటి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి టాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించకుండా.. బాలీవుడ్ భామను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వచ్చిన వదంతులను నాగ్ కొట్టిపారేశారు. ఖుషీకి భారీ పారితోషికం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వచ్చిన ఓ కథనాన్ని నాగ్ రీట్వీట్ చేస్తూ.. ఇది నిజం కాదనిస్పష్టం చేశారు. మరోవైపు ఈ తన కొత్త ప్రాజెక్టు కోసం అఖిల్ కసరత్తులు చేస్తున్నాడు. విక్రమ్ సినిమా ఫిజికల్‌గా చాలా డిమాండ్ చేస్తోందని, కొత్త ట్రైనర్ వర్కవుట్ షెడ్యూల్ ఇచ్చారు. డైట్ కూడా ప్లాన్ చేశారని స్వయంగా అఖిల్ ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు మనం మూవీకి పనిచేసిన టెక్నీషియన్లు ఈ భాగస్వామ్యం కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. -
ఆ ఇద్దరితో శ్రీదేవిని చూసి..!
ముంబై: అతిత్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్న తన ఇద్దరు కూతుళ్లతో వెటరన్ నటి శ్రీదేవి నడిచిరావడాన్నిచూసి అక్కడివారంతా స్థాణువైపోయారు. అతిలోక సుందరి నుంచి పుణికిపుచ్చుకున్న అందానికితోడు ట్రెండీ వేరింగ్‌లో దర్శనమిచ్చిన జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లకు హాయ్ చెప్పేందుకు అభిమానులు పోటీపడ్డారు. అయితే స్టార్‌డమ్‌ను మేనేజ్‌చెయ్యడం అలవాటైన ఆముగ్గురూ.. ప్రతిస్పందించకుండా తమదారిలో వెళ్లిపోయారు. శుక్రవారం ముంబై అంతర్జాతీయ విమానంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి.. సుదీర్ఘ విరామం తర్వాత 2012లో ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళంలో ‘పులి’సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రధారిగా ‘మామ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మామ్’కు రవి ఉద్యావర్ దర్శకుడు. నవాజుద్దీన్ సిద్దిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్(పవన్‘గబ్బర్‌సింగ్’ విలన్) ఇతర పాత్రధారులు. ఇక శ్రీదేవి పెద్దకూతురు జాహ్నవి కపూర్‌ను కరణ్ జోహార్ రూపొందించనున్న సినిమాతో లాంచ్ చేయబోతున్నసంగతి తెలిసిందే. ఇక శ్రీదేవి కుటుంబం విమానంలో ఎక్కడికి వెళ్లారన్నదిమాత్రం సస్పెన్స్! -
బాయ్‌ఫ్రెండ్‌తో కూతురి డేటింగ్‌పై శ్రీదేవి..!
శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల పిల్లలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌కు స్టార్ కిడ్స్‌గా బాలీవుడ్లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్ టు లిప్ కిస్ చేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట. జాన్వి, శిఖర్ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న శ్రీదేవి.. కూతురికి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించిందని ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న జాన్వి అస్సలు యువకులతో స్నేహం చేయవద్దని, డేటింగ్ చేయడం సంగతి దేవుడెరుగు అస్సలు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నా నేను అంగీకరించబోనని కూతురికి గట్టిగా చెప్పినట్టు పేర్కొంది. ఒక్కప్పటి అందాల కథానాయికగా రాణించిన శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె తాపత్రయపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు.