
సినిమా ఇండస్ట్రీలో వారసులను పరిచయం చేసేందుకు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. బాలీవుడ్‌లో అయితే వారసులను పరిచయం చేయడానికి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మంది వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆయన తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి–నిర్మాత బోనీ కపూర్‌ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను హీరోయిన్ గా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నారని టాక్.
శ్రీదేవి–బోనీ కపూర్‌ల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ను తమ ధర్మా ప్రొడక్షన్స్‌పై ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు కరణ్ జోహార్. త్వరలో కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఖుషీ. ఇప్పుడు ఖుషీని పరిచయం చేసే బాధ్యతను కూడా కరణే తీసుకున్నారట. ధర్మా –కార్నర్‌స్టోన్ ఏజెన్సీ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్న ఆయన ఈ బ్యానర్‌లో ఖుషీ కపూర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment