
బాలీవుడ్ అగ్రనిర్మాత, డైరెక్టర్ బోనీ కపూర్ తాజాగా ఓ సినిమాను ప్రకటించారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించునున్నట్లు వెల్లడించారు. 2017లో వచ్చిన మామ్ మూవీకి కొనసాగింపుగా తాజాగా ఉండనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన చిన్న కూతురైన ఖుషీ కపూర్ సైతం నటిస్తున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ-2025 అవార్డుల వేడుకకు హాజరైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
అయితే శ్రీదేవి సీక్వెల్ మూవీలో ఖుషీ కపూర్‌ను ఎంపిక చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి స్థానంలో ఖుషీ చేయడమేంటి? ఇది చూస్తుంటే పెద్ద జోక్‌గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదే నిజమైతే డిజాస్టర్ ఖాయమని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి ఈ సినిమాకు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. వీలైతే యామీ గౌతమ్, కంగనా రనౌత్, బిపాసా బసుని తీసుకోండి కానీ.. ఖుషీ కపూర్‌కు నటనా నైపుణ్యాలు లేవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
నటన విషయానికొస్తే ఖుషీ కపూర్ చివరిసారిగా ఇబ్రహీం అలీ ఖాన్‌తో నాదానియన్‌లో కనిపించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా బోనీ కపూర్ చేసిన ప్రకటనతో నెటిజన్స్ తీవ్ర నిరాశకు గురువుతున్నారు. శ్రీదేవీ మూవీ సీక్వెల్‌లో మాత్రం ఖుషీ కపూర్ వద్దని తెగేసి చెబుతున్నారు. మామ్ సీక్వెల్ కోసం ఖుషీని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. 2018లో ఆమె మరణానికి ముందు నటించిన చివరి చిత్రమిదే. శ్రీదేవి కెరీర్‌లో 300వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, పాకిస్థానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి మరణానంతరం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మామ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది.