Sridevi
-
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక) -
మంత్రి సవిత తక్షణం మహిళలకు క్షమాపణలు చెప్పాలి
-
'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో ఎవరినీ పలకరించినా దేవర పేరే వినిపిస్తోంది. మరో పది రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం దేవర. ఇందులో యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మూవీటీమ్ చిట్ చాట్ నిర్వహించింది.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ప్రశంసలు కురిపించారు. జాన్వీ నటన, హావభావాలు అచ్చం శ్రీదేవిలాగే ఉన్నాయని ఎన్టీఆర్ కొనియాడారు. తనకు తాను నటన ప్రదర్శించుకున్న తీరు శ్రీదేవిని గుర్తు చేసిందని అన్నారు.(ఇది చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము ఒక ఫోటోషూట్ కోసం లుక్ టెస్ట్ చేశాం. అక్కడే జాన్వీ పడవలో కూర్చుని కెమెరా వైపు చూస్తోంది. ఆ ఫోటో చూడగానే అచ్చం శ్రీదేవిలా కనిపించింది. తను కేవలం కెమెరాలో కొంత భాగాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన విధానం, స్మైల్ మళ్లీ క్యాప్చర్ చేయగలరని నేను అనుకోను. అవీ చూడగానే శ్రీదేవి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చాయి' అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. జాన్వీ స్పందిస్తూ.. తెలుగులో నటించడం తనకు సొంత ఇంటిలా అనిపించిందని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. -
‘లోకేష్, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’
కర్నూలు, సాక్షి : నిజాలు తెలుసుకోకుండా మంత్రులు నారా లోకేష్, అనితా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయలేదు. టీడీపీ పార్టీ నేతల వర్గా విబేధాలుతోనే ఈ హత్య జరిగింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు, మంత్రి బురద జల్లే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. హోసూరులో జరిగిన హత్యను తప్పు పుట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. హోసూరు గ్రామంలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా మా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. -
తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్
'దేవర' సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్న జాన్వీ కపూర్‌కి తిరుపతి వేంకటేశ్వర స్వామి చాలా సెంటిమెంట్. ఎప్పటికప్పుడు స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. మంగళవారం తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా మరోసారి స్వామి వారిని దర్శించుకుంది. కాకపోతే మెట్ల దారిలో కొండ పైకి చేరుకుంది.(ఇదీ చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. రేర్ ఫొటోలు)ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో తల్లి శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టింది. ఇందులో తల్లితో చిన్నప్పటి ఫొటోని, మెట్ల దారిలో తాను దిగిన ఓ ఫొటోని జాన్వీ షేర్ చేసింది.హిందీలో చాన్నాళ్ల క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో 'దేవర', రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఈ రెండింటిపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే మాత్రం జాన్వీ దశ తిరిగినట్లే!(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)Our Thangam #JanhviKapoor At Lord Venkateswara Swamy Temple In Tirumala Today 💛🤩. #Chuttamalle pic.twitter.com/FMQ5tkHcGq— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) August 13, 2024 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి.. మధుర జ్ఞాపకాలుగా ఆ ఫోటోలు
-
అమ్మ బతికుండగా పట్టించుకోలేదు.. కానీ: జాన్వీ కపూర్
దేవర భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావుకు జంటగా కనిపించనుంది. క్రికెట్ నేపథ్యంలో అపూర్వ మోహతా, కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి మరణం తర్వాత నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా తిరుమలకు తరచుగా వెళ్లడానికి గల కారణాన్ని వివరించారు.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'అమ్మకు దైవ భక్తి ఎక్కువ. కొన్ని విషయాలను బాగా నమ్మేది. స్పెషల్ డేస్‌లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అని చెప్పేది. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేది. అంతే కాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దనేది. కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని లైట్ తీసుకున్నా. కానీ అమ్మ దూరమయ్యాక నమ్మడం మొదలుపెట్టా. ఇప్పుడు నేనే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని' తెలిపింది.జాన్వీ కపూర్ తిరుమలరు వెల్లడంపై మాట్లాడుతూ..' అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలచేది . షూటింగ్ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటూ ఉండేది. ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచుగా వెళ్తుంటానని' చెప్పుకొచ్చింది. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. -
సీరియల్ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)
-
గాంధీ-అంబేడ్కర్ అప్పుడేం మాట్లాడుకున్నారో వినాలనుకుంటున్నా : జాన్వీ కపూర్
ఒక టైమ్ మెషీన్లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్‌ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్ అనే మహిళ డాన్స్ తెగ వైరల్ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్ హిట్. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్ సావన్ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ సేమ్ చాందినీ సినిమాలోని లొకేషన్ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్ షూట్ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్’లాంటి పాటలకు డాన్స్ చేయడానికి లొకేషన్స్ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!) -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్‌కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్‌ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవి బయోపిక్కు అనుమతి ఇవ్వను
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవిపై ఫీలింగ్స్.. అమ్మకు తెలిసి రాఖీ తీసుకొచ్చింది: నిర్మాత
దివంగత నటి శ్రీదేవి.. ఈమె అందాన్ని ఆరాధించినవాళ్లెందరో! నిర్మాత బోనీ కపూర్ సైతం శ్రీదేవిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. మనసులో తన పేరు లిఖించుకున్నాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయింది. అతడి భార్య పేరు మోనా షౌరీ. ఈ జంటకు అర్జున్, అన్షులా కపూర్ సంతానం. బోనీ ప్రేమ విషయం భార్యకు కూడా తెలుసు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవిని ఐదారేళ్లపాటు ఆరాధించాను. నా ప్రేమ విషయం నా భార్యకు సైతం తెలుసు. అబద్ధాలు చెప్పి తనను మోసం చేయాలనుకోలేదు. శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు కూడా ఆమెను నా భార్య ఇంట్లోనే ఉంచాను. రాఖీ కట్టించాలని చూసింది శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్ మా అమ్మ పసిగట్టేసింది. రాఖీ పండుగ రోజు పెద్ద పళ్లెంలో అక్షింతలు, రాఖీ పెట్టి తీసుకొచ్చి శ్రీదేవికి ఇచ్చి నాకు రాఖీ కట్టమని చెప్పింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లింది. నువ్వేం బాధపడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్లేటు నీ గదిలోనే ఉంచమని చెప్పాను. అసలు నాకు రాఖీ ఎందుకు కట్టమని చెప్పిందో తనకేం అర్థం కాలేదు' అని నవ్వేశాడు. కాగా బోనీ తన మొదటి భార్య మోనాకు 1996లో విడాకులిచ్చాడు. అదే ఏడాది జూన్ 2న శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. మళ్లీ కనిపిస్తే బాగుండు!
మంజుల-విజయ్ కుమార్ల వారసురాలిగా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్‌కుమార్. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తెలుగులో 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్గా నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్ లాంటి చిత్రాల్లోను కనిపించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్‌ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అయితే ప్రభాస్‌కు మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తోంది. అయితే ప్రభాస్‌కు జంటగా నటించిన ఈశ్వర్ చిత్రం 2002లో రిలీజైంది. ఈ మూవీ విడుదలై దాదాపు 22 ఏళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా.. వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరిపై ఓ అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈశ్వర్ సినిమా రిలీజై 22 ఏళ్లు అవుతున్నా ఇద్దరు ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు.. రాబోయే ప్రభాస్ అన్నయ్య సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తే బాగుండు అని రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రీదేవి పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడని వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది ముద్దుగుమ్మ. Prabhas 1st Heroine #SrideviVijayKumar ❤️🔥 Eeshwar release ayyi 22 years ayna still they both look good together 😍#Prabhas Anna future movies lo edho okka chinna role lo ayna kanapadithe bagundu ❤️#Kalki2898AD #Spirit #TheRajaSaab pic.twitter.com/o3Hhm7Ne8l — Ayyo (@AyyAyy0) March 29, 2024 -
ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
వాలెంటైన్ డే మూడ్‌లో రష్మిక.. బ్లాక్ డ్రెస్‌లో నిహారిక లుక్స్ వైరల్!
వాలెంటైన్ డే ప్లాన్ చెప్పమంటోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. బ్లూ కలర్ శారీలో శ్రీదేవి స్మైలీ లుక్స్.. బ్లాక్ డ్రెస్‌లో నిహారిక డిఫరెంట్ లుక్స్.. చిన్ననాటి పుస్తకాల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటోన్న సామ్ బాలీవుడ్ భామ మౌనీ రాయ్ పోజులు View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) -
ఈమె ఒకప్పటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడేమో ఫ్యాషన్ డిజైనర్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. మంచి మంచి హిట్ సినిమాలు చేసింది. జస్ట్ ఐదేళ్లలో ఏకంగా 30 సినిమాలు చేసింది. కానీ ఏమైందో ఏమో సడన్‌గా యాక్టింగ్ కెరీర్‌కి టాటా చెప్పేసింది. అయితే ఈమె పేరు చెబితే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. అలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా గుర్తొస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మహేశ్వరి. గుర్తొచ్చిందా? అవును మీరనుకున్న బ్యూటీనే. అతిలోక సుందరి శ్రీదేవికి ఈమె బంధువు అవుతుంది. అంటే ఈమె.. శ్రీదేవి అక్కకు పుట్టిన కూతురు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేశ్వరి.. 1994లో ఇండస్ట్రీలోకి వచ్చింది. తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చాలావరకు తెలుగు చిత్రాలే చేసింది. ఈమె చేసిన వాటిలో 'పెళ్లి', గులాబీ, దెయ్యం లాంటి హిట్ సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో అకస్మాత్తుగా నటన పూర్తిగా పక్కనబెట్టేసింది. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) 1994-2000 వరకు దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన మహేశ్వరి.. యాక్టింగ్ పక్కనబెట్టేసిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉంది. అలా 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక 2010లో సీరియల్ యాక్టర్‌గా కెరీర్ షురూ చేసింది. ఓ నాలుగేళ్లు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన తర్వాత దాన్ని కూడా పక్కనబెట్టేసింది. ఇక ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం మహేశ్వరి.. ఫ్యాషన్ డిజైనర్‌గా డిఫరెంట్ కెరీర్‌ని ఎంచుకుంది. హైదరాబాద్‌లో ఈమెకు ఓ స్టోర్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్‌తో మహేశ్వరి అప్పుడప్పుడు కనిపిస్తోంది. వరసకు వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు అవుతారు. కానీ మహేశ్వరి ఒకప్పుడు హీరోయిన్ కాగా.. జాన్వీ మాత్రం ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అమ్మ నన్ను తిట్టేది:జాన్వీ కపూర్
దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయేది.. పక్కింటి అమ్మాయిగా కనిపించేది, కల్మషం లేని నవ్వుతో కవ్వించేది.. అమ్మాయిలు అసూయ చెందేలా అందంతో అల్లాడించేది.. కంటిచూపుతో చంపడం, నవ్వుతుంటే ముత్యాలు రాలడం ఈమె విషయంలో నిజమయ్యేది.. ఆవిడే అందాల తార శ్రీదేవి. ఈమె తల్లిది తిరుపతి.. తండ్రిది తమిళనాడులోని శివకాశి. దీంతో చిన్నప్పటినుంచే తెలుగు, తమిళ భాషల్లో శ్రీదేవి అనర్గళంగా మాట్లాడేది. కాందన్ కరుణై అనే తమిళ చిత్రంతో ఈమె బాలనటిగా మారింది. మా నాన్న నిర్దోషి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హీరోల కంటే ఎక్కువ పారితోషికం తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో బాలనటిగా, హీరోయిన్గా మెప్పించింది. రజనీకాంత్, కమల్ హాసన్, అంబరీష్, కృష్ణ, నందమూరి తారక రామారావు, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, అమితాబ్ బచ్చన్, జితేంద్ర, రాజేశ్ ఖన్నా, అనిల్ కపూర్.. ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. 1996లో నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడింది. బోనీకి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సంతానం. దొంగతనం చేసి దొరికిపోయేదాన్ని జాన్వీ ఇప్పటికే హీరోయిన్గా క్రేజ్ సంపాదించగా ఖుషీ ఈ మధ్యే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మ గదికి వెళ్లి తన లిప్‌స్టిక్‌లు దొంగిలించి జేబు నిండా నింపుకునేదాన్ని. అమ్మ నన్ను ఆపి నీ జేబు చూపించు అని అడిగేది. నేనేమో ఏమీ తెలియనట్లు జేబులో ఏం లేదమ్మా.. అని అబద్ధం చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ.. నా కొడకా.. అని తిట్టేది. తను ఎప్పుడూ అలాగే తెలుగులో తిడుతూ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఎంత క్యూట్‌గా తిట్టిందో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా జాన్వీ.. దేవర సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయం కానుంది. Naa Kodaka... 😁 pic.twitter.com/dReIBc6Urw — Imho (@Artoo_Detwo) January 3, 2024 చదవండి: సామ్‌కు బాలీవుడ్లో ఆఫర్.. ఊ అంటుందా? ఉఊ అంటుందా? -
అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్- దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 2018లో 'ధడక్' సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈ మధ్యే 'ద ఆర్చీస్' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓపక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని చెప్పుకొచ్చింది. ఖుషీ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని చెప్పుకొచ్చింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూసింది. చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా దూసుకుపోతుంది. బాలీవుడ్‌తో పాటు తాజాగా టాలీవుడ్‌లోనూ జాన్వీ గ్రాండ్‌గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్‌లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఖుషీ ధరించిన డ్రెస్ అండ్ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఖుషీ కపూర్‌కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ. గతంలో ఇదే డ్రెస్‌ను దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్‌ను రిపీట్ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్ చోకర్నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్‌లో ఖుషి కపూర్‌తో పాటు సుహానా ఖాన్, వేదాంగ్ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ కిడ్స్ ఉండటంతో ది ఆర్చీస్పై ఇప్పటికే హైప్ నెలకొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చిన్నారి శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది.. గతంలో చంద్రమోహన్ పంచుకున్న విశేషాలు
చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్.. నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అనారోగ్యంతో శనివారం (నవంబర్ 11) తుది శ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్‌ని చేశారు.వారిలో దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూడా ఉన్నారు. ఆమె గురించి గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చంద్రమోహన్. శ్రీదేవి మరణించిన రోజు(2018) ‘సాక్షి’తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు చంద్రమోహన్ శ్రీదేవి గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే .. (ఇది 2018లో శ్రీదేశి మరణించిన రోజు చంద్రమోహన్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ) శ్రీదేవిగారికి తెలుగులో మీరు ఫస్ట్ హీరో. ‘పదహారేళ్ల వయసులో’ మీ ఇద్దరు జంటగా చేసినప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారా? చంద్రమోహన్: ఆ సినిమాకి శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కానీ కమల్‌హాసన్‌తో ఇదే సినిమాలో తమిళంలో బాగా చేసిందని రాఘవేంద్రరావుగారు కన్విన్స్ చేశారు. నాక్కూడా శ్రీదేవితో చేయడానికి అభ్యంతరం అనిపించలేదు. తననే కథానాయికగా తీసుకున్నాం. బ్రహ్మాండంగా నటించింది. హీరోయిన్గా అందనంత దూరం వెళ్లిపోయింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీతో ఒక సినిమా చేసినట్లున్నారు? అవును. ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర చేసింది. ఆ సినిమాలో నేనేమో నారదుడి పాత్ర చేశాను. అప్పుడు శ్రీదేవికి ఏడెనిమిదేళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే చాలా క్రమశిక్షణగా ఉండేది. చాలా ముచ్చటేసేది. బిస్కెట్లు తింటూ కూర్చునేది. నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన తను ఆ తర్వాత మూడేళ్లకు నా పక్కన హీరోయిన్ (‘పదహారేళ్ల వయసులో)గా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అయితే ‘యశోద కృష్ణ’ సినిమా చేస్తున్నప్పుడు తను పెద్ద స్థాయికి వెళుతుందనుకున్నాను. (చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) బాలనటిగా ఆమె మీ సినిమాలో చేసినప్పుడు జరిగిన సంఘటనలేమైనా గుర్తు చేసుకుంటారా? ‘యశోద కృష్ణ’ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి వేరే తమిళ సినిమా ఒప్పుకుంది. మర్నాడు మద్రాసు వెళ్లాలి. ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అప్పట్లో మేం మద్రాసులో ఉండేవాళ్లం. నా షెడ్యూల్ కంప్లీట్ అయిపోవడంతో నా కారులో శ్రీదేవిని తీసుకు రావడానికి వీలు పడుతుందా? అని ఆమె అమ్మగారు అడగడంతో సరే అన్నాను. దాదాపు 14 గంటలు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది. జాగ్రత్తగా వాళ్ల అమ్మకు అప్పజెప్పాను. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) మీతో సినిమా చేయకముందు నుంచే శ్రీదేవిగారి కుటుంబంతో మీకు పరిచయం ఉందా? మద్రాసు టీ నగర్లో మావి పక్క పక్క ఇళ్లే. మా పిల్లలతో శ్రీదేవి ఆడుకునేది. వాళ్ల అమ్మగారికి కూతుర్ని పెద్ద హీరోయిన్ని చేయాలని ఉండేది. అమ్మ కలని కూతురు నెరవేర్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హిందీలో చాలా బాగా సక్సెస్ అయిన మన తెలుగు పిల్ల అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరి శ్రీదేవి. తనలా ఎవరూ ఉండరు. పుట్టరు. శ్రీదేవి శ్రీదేవే. మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా ఆ తర్వాత స్టార్ అవుతారనే సెంటిమెంట్ శ్రీదేవిగారి విషయంలో కూడా నిజమైంది కదా? అప్పట్లో ఆ సెంటిమెంట్ ఉండేది. ‘పదహారేళ్ల వయసులో’ సూపర్ డూపర్ హిట్టయి శ్రీదేవికి చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు తన అమ్మగారు ‘చంద్రమోహన్‌గారి సినిమాతో హీరోయిన్గా మా అమ్మాయి అరంగేట్రం అయింది. స్టార్ అయిపోయింది’ అనేవారు.జయప్రద, జయసుధ.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఆ సెంటిమెంట్‌ని ఆపాదించారు. ‘నాదేం లేదు.. అంతా మీ స్వయంకృషి’ అనేవాణ్ణి. విశేషం ఏంటంటే... తన భర్త బోనీకపూర్‌కి నన్ను పరిచయం చేసినప్పుడు ‘నా ఫస్ట్ హీరో’ అని చెప్పింది. ఓసారి నా తెలుగు సినిమా షూటింగ్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి చేస్తున్న సినిమా షూటింగ్ పక్క పక్కనే జరిగాయి. అప్పుడు అమితాబ్‌కి ‘నా ఫస్ట్ హీరో. లక్కీ హీరో’ అని నన్ను పరిచయం చేసింది. ‘పదహారేళ్ల వయసులో’ తమిళ మాతృకలో కమల్‌హాసన్‌గారు చేశారు. ఎప్పుడైనా నటనపరంగా మీ ఇద్దరికీ శ్రీదేవిగారు పోలిక పెట్టారా? ఆ సినిమా విజయోత్స వేడుకలో నాకన్నా చంద్రమోహన్‌గారు బాగా చేశారు అని కమల్‌హాసన్ అన్నారు. ‘నేను తప్ప ఆ క్యారెక్టర్ని వేరే ఎవరూ బాగా చేయలేరనుకున్నా. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. చంద్రమోహన్‌గారు గొప్పగా నటించారు’ అని కమల్‌గారు అన్నారు. శ్రీదేవి కూడా ఆ మాటే అంది. వాస్తవానికి ‘స్వాతిముత్యం’ సినిమాలో నేనే చేయాల్సింది. ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ‘పదహారేళ్ల వయసు’ క్యారెక్టర్లానే ఉంటుంది. అయితే ఆ సినిమాని తమిళ్లో కూడా ప్లాన్ చేశారు. అక్కడ కమల్‌గారికి మార్కెట్ ఉంది కాబట్టి, బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఆయనతో చేయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నటిగా శ్రీదేవిగారిలో ఉన్న మంచి లక్షణాల గురించి? నేను భానుమతిగారు, సావిత్రిగార్లతో సినిమాలు చేశాను. వాళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా రాజీపడేవారు కాదు. ఆ లక్షణాలను శ్రీదేవిలో చూశాను. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయిలు ఆ తర్వాత శ్రీదేవి స్థాయిలో హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోయారు. శ్రీదేవి గొప్ప నటి. ఎన్టీఆర్, ఏయన్నార్, కమల్‌హాసన్, రజనీకాంత్.. ఇలా ఎవరి పక్కన చేసినా తన నటన ప్రత్యేకంగా ఉండేది. ఆడియన్స్ తననే చూసేంత గొప్పగా నటించేది. అందుకే అన్ని లాంగ్వేజెస్‌లో రాణించగలిగింది. చివరిసారిగా మీరు ఆమెను ఎప్పుడు కలిశారు? వైజాగ్‌లో జరిగిన టీయస్సార్ అవార్డు ఫంక్షన్లో కలిశాం. అప్పుడు సన్నిహితులెవరో ‘నీ ఫస్ట్ హీరోయిన్ వచ్చారు’ అంటే, ‘నా ఫస్ట్ హీరో వచ్చారు’ అని శ్రీదేవి నా దగ్గరకు నవ్వుతూ వచ్చింది. ఎంత స్టార్ అయినా తనలో ఎప్పుడూ నేను భేషజం చూడలేదు. నటిగా అందనంత దూరానికి వెళ్లింది. ఇప్పుడు కూడా అందనంత దూరానికి వెళ్లింది. క్షణాల్లో మిస్సయిసోయింది. అని చద్రమోహన్ ఎమోషనల్‌కు గురయ్యారు. -
హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. (చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) ♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ♦ చంద్రమోహన్‌పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. ♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్‌గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది ♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. ♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్‌గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి'
ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'మొదటగా డైరెక్టర్ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్‌కు వెళ్లాము.' అని చెప్పాడు. మెరిల్ స్ట్రీప్‌తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్ శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌తో పోలుస్తూ.. ఆమె 'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. శ్రీదేవి, జాన్వీ కపూర్ల మధ్య పోలికలు శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్ వివరించాడు. జాన్వీ తన తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్ చేయడం చాలా కష్టమైన పని.. కానీ జాన్వీ కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్ ఉంది. కచ్చితంగా భవిష్యత్‌లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్ తెలిపాడు. టాలీవుడ్లో జూ.ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. -
నటి శ్రీదేవి విజయ్‌కుమార్ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!
శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్‌తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో మరణించింది. (ఇది చదవండి: ప్రభాస్ బర్త్‌డే నాడు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..?) హీరోల కంటే ఎక్కువ పారితోషికం శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది. అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్‌స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది. (ఇది చదవండి: బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ)