
‘‘మీ రోల్ మోడల్ ఎవరు?’’ అని ఏ హీరోయిన్‌ని అడిగినా.. శ్రీదేవి పేరు చెప్పనివారు తక్కువమంది ఉంటారు. ఈ అతిలోక సుందరి పేరు చెప్పేవారిలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఇటీవల ఒక హాలీవుడ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ శ్రీదేవి తనకు రోల్ మోడల్ అని ప్రియాంక అన్నారు. శ్రీదేవి గురించి ప్రియాంక చెబుతూ – ‘‘ఆవిడ బ్యూటీ ఐకాన్. శ్రీదేవి కెరీర్‌ని చూస్తూ పెరిగాను. ఫ్యాషన్ పరంగా ఆమె ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. అలాగే సినిమా సినిమాకి తన లుక్స్ మార్చుకుంటూ వచ్చారు. కొత్తగా కనబడడానికి ప్రయత్నించేవారు. శ్రీదేవి కళ్లు అద్భుతంగా ఉంటాయి. చాలా పెద్ద కళ్లు కూడా. హావభావాలను అద్భుతంగా పలికించేవారు. కెరీర్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండేవారు. అందుకే ఆమె నాకు స్ఫూర్తి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment