Role model
-
'హెల్త్‌కేర్ మహిళలలో కనిపించని రోల్‌మోడల్..' ఫ్రంట్లైన్కే పరిమితమా?
'హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే కనిపిస్తున్నారు అని దస్రా ఆర్గనైజేషన్ ఒక డేటా విడుదల చేసింది. మహిళలు వైద్యవిద్యలలో 29 శాతం ఉంటే, నర్సింగ్ సిబ్బందిలో 80 శాతం ఉన్నారు. ఇక 100 శాతం ఆశావర్కర్లుగా ఉన్నారు.ఆరోగ్య సంరక్షణలో నాయకత్వ స్థానాల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రంగంలో పురుషుల కంటే 34 శాతం స్త్రీలు తక్కువ సంపాదిస్తున్నారు.' లాభాపేక్ష లేకుండా, అన్ని రంగాలలో సామాజిక మార్పునకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ దస్రా. ఈ సంస్థ హెల్త్ కేర్ రంగంపై దృష్టి పెట్టి, ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పొందుపర్చిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది మహిళలకు రోల్‌మోడల్స్ లేకపోవడం, వారి పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం గురించి సరైన అవగాహన లేకపోవడం అని పేర్కొంది. ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే.. భారతదేశంలో ప్రధానమైన హెల్త్‌కేర్ రంగం కొన్ని సంవత్సరాలుగా సాంకేతికత, నైపుణ్యాలు, విద్య, వృత్తిపరంగా గణనీయమైన అభివృద్ధి, విస్తరణను చవిచూసింది. అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ రంగంలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలో కనిపిస్తున్నారని దస్రా నివేదిక సూచిస్తుంది. దస్రా డైరెక్టర్ శైలజా మెహతా మాట్లాడుతూ ‘ఆరోగ్య సంరక్షణరంగంలో మహిళల నాయకత్వంలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే, ఇతర రంగాలను కూడా హెల్త్‌కేర్ ప్రభావితం చేయడమే కారణం. లింగ సమానత్వం విషయంలో మా పనిలో మేం మహిళల పురోగతికి సంబంధించిన గ్యాప్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం’ అని తెలిపారు. అతి తక్కువ శాతం! నివేదిక ఫలితాల ప్రకారం మొత్తం హెల్త్‌కేర్ వర్క్ ఫోర్స్‌లో 54 శాతం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ సెక్టార్లో మహిళలు దాదాపు 25 నుంచి 30 శాతం నాయకత్వ స్థానాలను ఆక్రమించారు. ఫార్మాస్యూటికల్, బయోటెక్ రంగాలలో 5 నుంచి 10 శాతం మాత్రమే నాయకత్వపాత్రల్లో మహిళలు ఉన్నారు. మార్కెటింగ్ కార్యకలాపాల స్థానాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రవేశ స్థాయి స్థానాల్లో మహిళలు 40 నుంచి 50 శాతం ఉండగా, సీనియర్ పాత్రలలో ఈ శాతం గణనీయంగా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. పరిమిత ప్రాధాన్యం.. మహిళలు ఆర్ అండ్ డి, నర్సింగ్, హెచ్ఆర్, పరిపాలన, నాణ్యత హామీ, చట్టపరమైన, నియంత్రణ వ్యవహారాలు వంటి విధుల్లో బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ హెచ్ఆర్ పాత్రల కోసం మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. దీని ఫలితంగా గణనీయంగా 70–80 శాతం ప్రాతినిధ్యం ఉంది. ఇదే నాయకత్వ స్థానాల్లో 20 నుంచి 30 శాతానికి పడిపోతుంది. నివేదిక ఫలితాలు, రోగుల సేవా బృందాలు, ఎఫ్ అండ్ బి మొదలైన వాటిలో ఇదే విధమైన నమూనాను గమనించాయి. ప్రవేశ స్థాయులలో 40 నుంచి 60 శాతం మహిళలను ప్రాధాన్యంగా నియమించుకుంటారు. అయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్థాయులకు వారి పురోగతి పరిమితంగా ఉంది. ఇది 15 నుంచి 20 శాతానికి మాత్రమే చేరుకుంది. రోల్ మోడల్స్ లేకపోవడమే.. లీడర్షిప్ క్వాలిటీ పెంపొందించుకోవడానికి మహిళలకు ప్రధాన అవరోధం రోల్ మోడల్స్ లేకపోవడమే. మహిళల పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం, వైవిధ్యం గురించి నమ్మదగిన సాంస్కృతిక కథనం లేకపోవడం అని నివేదిక హైలైట్ చేసింది. శైలజా మెహతా మరిన్ని వివరాలు చెబుతూ ‘అడ్డంకులు చాలా రెట్లు ఉన్నాయి. మహిళలు నిజంగా ప్రభావవంతంగా ఉన్నారా.. మంచి నాయకులు కాదా... అని ప్రశ్నించే మూస పద్ధతి కూడా ఒక కారణంగా ఉంది. మహిళల నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల పక్షపాతాలు, నిబంధనలు, ప్రవర్తనలు, ఊహాజనితాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వదులుకోవడం అంత సులభం కాదు. సంస్థలు మెరుగైన వ్యాపారం కోసం ఆలోచిస్తాయే తప్ప మహిళా ఉన్నతిని పెద్దగా పట్టించుకోవు. హెల్త్‌కేర్ రంగంలో మహిళలు లీడర్షిప్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. భారతదేశంలో చాలా మంది మహిళలకు వారి ఆకాంక్షలకు కఠినమైన అడ్డంకులు ఉంటాయి. మహిళల లక్ష్యం నర్సు కావడమే అన్నట్టుగా ఉంటుంది. మేనేజర్‌గా లేదా సీఇవోగా ఉండటానికి వారికి అవకాశం ఇవ్వరు. ‘మహిళలు తమ పరిమితులను దాటి, విస్తరించాలి. అడ్డుగోడలను, నిబంధనలను తొలగించుకుంటూ తమను తాము ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తారు’ అని చెబుతున్న దస్రా నివేదిక మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఇవి చదవండి: కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది! -
మహిళా సాధికారతలో ఏపీ దేశానికే రోల్ మోడల్
-
ఇంధన సంరక్షణలో ఏపీ ఆదర్శం.. డాక్టర్ అజయ్ మాథుర్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మేటి అని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ కొనియాడారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ‘ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాటర్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్ అజయ్ మాథుర్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి తన పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను అందుకున్న ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎస్ఈసీఎంను అభినందించారు. ఇంధన పరిరక్షణకు సంబంధించిన పలు పథకాలను సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. ఏపీలో ఎల్ఈడీ బల్బుల పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో అన్ని శాఖలనూ భాగస్వాములను చేయడం, అన్ని విభాగాల్లోనూ ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు వంటి చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ఆయన చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రోత్సాహం, అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధనశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు లభిస్తున్నాయని చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్రానికి మూడు ‘ఎనర్షియా’ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న విధానాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు లభించింది. ఇంధన రంగంలో జాతీయ స్థాయిలో ఏపీకి మూడు అవార్డులు వచ్చాయి. ఇంధన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవార్డుకు ఏపీ ఎంపికైంది. అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీట్రాన్స్కో)కు అవార్డు లభించింది. ఉత్తమ పునరుత్పాదక సంస్థగా ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌ఈడీఏపీ) నెడ్కాప్ను అవార్డు వరించింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 15వ ఎనర్షియా అవార్డుల సదస్సులో ఈ అవార్డులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్ అందుకున్నారు. ఎనర్షియా ఫౌండేషన్ అనేది ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భారత్‌తో పాటు ఆసియా, మిగిలిన ప్రపంచ దేశాల్లో క్లీన్, గ్రీన్, సస్టైనబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ, ఇంధన రంగం అభివృద్ధికి కృషిచేస్తోంది. చదవండి: పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా? -
శ్రీదేవి నాకు రోల్‌మోడల్ : ప్రియంక చోప్రా
‘‘మీ రోల్ మోడల్ ఎవరు?’’ అని ఏ హీరోయిన్ని అడిగినా.. శ్రీదేవి పేరు చెప్పనివారు తక్కువమంది ఉంటారు. ఈ అతిలోక సుందరి పేరు చెప్పేవారిలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఇటీవల ఒక హాలీవుడ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ శ్రీదేవి తనకు రోల్ మోడల్ అని ప్రియాంక అన్నారు. శ్రీదేవి గురించి ప్రియాంక చెబుతూ – ‘‘ఆవిడ బ్యూటీ ఐకాన్. శ్రీదేవి కెరీర్‌ని చూస్తూ పెరిగాను. ఫ్యాషన్ పరంగా ఆమె ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. అలాగే సినిమా సినిమాకి తన లుక్స్ మార్చుకుంటూ వచ్చారు. కొత్తగా కనబడడానికి ప్రయత్నించేవారు. శ్రీదేవి కళ్లు అద్భుతంగా ఉంటాయి. చాలా పెద్ద కళ్లు కూడా. హావభావాలను అద్భుతంగా పలికించేవారు. కెరీర్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండేవారు. అందుకే ఆమె నాకు స్ఫూర్తి’’ అన్నారు. -
‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే
మార్చి 8 మహిళాశక్తి బర్త్ డే! బాయ్స్ అండ్ బిగ్ బాయ్స్.. ఆరోజు మీరు మీ మహిళకు.. మీ బాస్, మీ కొలీగ్, మీ టీచర్, మీ మదర్, వైఫ్, సిస్టర్ .. వారెవరైనా సరే.. శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. ‘మేడమ్ మీవల్లే’ ‘అమ్మా నన్ను కన్నందుకు’ ‘సోదరీ తోడున్నావు’ ‘సహచరీ నీడవయ్యావు’ కృతజ్ఞతగా ఒక్కమాట. ఒక్క ప్రణామం. ప్లస్.. వాళ్లను రెస్పెక్ట్ చేస్తూ ఒక ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్! బార్బీ బొమ్మల తయారీ కంపెనీ ‘మటెల్’ కూడా ఈ ఏడాది ఉమెన్స్ డే కి మహిళాశక్తిని రెస్పెక్ట్ చేస్తూ డీజే క్లారా గా ఒక కొత్త బార్బీని మార్కెట్ లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా బ్రిటిష్ రేడియో ప్రెసెంటర్. ‘పవర్ గర్ల్’ బార్బీ, ‘సూపర్ ఉమన్’ క్లారా ప్రతి మహిళలోనూ ఉంటారు. మహిళే మన రోల్ మోడల్. అమ్మాయిలూ.. (లేదా) మహిళలూ.. మీరొక సెలబ్రిటీ అనుకుందాం. ‘అనుకోవడం ఏంటీ! నేను సెలబ్రిటీనే’ అంటారా! మరీ మంచిది. ‘ఉమెన్స్ డే’ కి మీకు రెండు గిఫ్టులు. అయితే రెండూ కాదు. ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి. మొదటిది: ఆస్కార్ అవార్డు. రెండోది: మీ తెలివి తేటలతో, మీ రూపలావణ్యాలతో, మీ ప్రొఫెషనల్ ప్రతిభా సామర్థ్యాలతో, అచ్చంగా మీలా ఉండే బార్బీ డాల్ మీ పేరిట మార్కెట్లో రిలీజ్ అవడం. రెండిట్లో ఏది కోరుకుంటారు? పైకి చెప్పక్కర్లేదులెండి. డీజే క్లారా సంతోషాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఏమంటారంటే.. మీరసలు ఆస్కార్ వైపే చూడరని! ‘ఎలా చెప్పగలరు మీరలా!’.. అంటారా? డీజే క్లారా ప్రస్తుతం ఆకాశం పట్టనంత సంతోషంగా ఉన్నారు. ఆమెను రోల్ మోడల్‌గా చూపుతూ.. బార్బీ బొమ్మలు తయారు చేస్తుండే ప్రపంచ ప్రసిద్ధ ‘మటెల్’ టాయ్స్ కంపెనీ ‘డీజే క్లారా బార్బీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ‘ఒక మహిళకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది?’ అంటున్నారు క్లారా. తన రూపంలో ఉన్న ఆ కొత్త బార్బీ డాల్‌ను రెండు చేతులతో అందుకుని అపురూపంగా చూసుకుంటూ ఆమె మురిసిపోతున్నారు. 36 ఏళ్ల క్లారా యాంఫో (ఆమె పూర్తి పేరు) ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ. లండన్‌లో బి.బి.సి. రేడియో ప్రెజెంటర్. బి.బి.సి టెలివిజన్ లో వ్యాఖ్యాత. క్లారాయాంఫో డాట్ కామ్‌లోకి వెళ్లి చూస్తే ఆమె గురించి అంతా తెలిసిపోతుంది. అంత ఓపిక లేకపోతే క్లారా బార్బీ డాల్‌ను చూసినా సరే. క్లారా బాహ్య సౌందర్యాన్ని, ఆమె అంతఃశక్తిని ప్రతిఫలించేలా ఉంది క్లారా బార్బీ. కంగ్రాట్స్ క్లారా. మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ∙∙ బార్బీ ‘గర్ల్ పవర్’ అయితే, క్లారా ‘సూపర్ ఉమెన్’, ఇద్దరూ కలిసిన ‘పవర్ ఉమన్’.. మహిళ. ఫలానా మహిళ అని కాదు. ప్రతి మహిళా! మన మేడమ్, మన కొలీగ్, మన టీచర్, మన సహోద్యోగి, స్నేహితురాలు, అమ్మ, సోదరి, జీవిత సహచరి.. చుట్టూ ఎంత శక్తి! మనల్ని బతికిస్తున్న, మనల్ని నడిపిస్తున్న, మనిషంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్న శక్తులు. ఆ శక్తులకు, సామర్థ్యాలకు ప్రతీకలే క్లారా, క్లారా బార్బీ. క్లారా మొదట డాన్సర్. తర్వాత డీజే (డిస్క్ జాకీ). బి.బి.సి. టీవీలో ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ అనే డాన్స్ పోటీల ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఇప్పటికీ వస్తోంది. ‘స్ట్రిక్ట్లీ’ అంటారు షార్ట్‌కట్‌లో. ఆ ప్రోగ్రామ్ కంటెస్టెంట్‌గా వచ్చి, బి.బి.సి.లోనే రేడియో ప్రెసెంటర్‌గా ప్రసిద్ధి చెందారు క్లారా. అయితే బార్బీగా ఆమె అవతరించడానికి అదొక్కటే కారణం కాదు. జాతి వివక్షకు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తన జాతి హక్కుల కోసం నిలబడ్డారు. గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బ్రిటన్‌లో జరిగిన అనేక సభల్లో ఆమె ప్రసంగించారు. బి.బి.సి.లో ఉద్యోగం పోతుందనీ, ఉద్యోగం పోతే గుర్తింపు ఉండదని అనుకోలేదు. ఆమె నిబద్ధతని బ్రిటన్ గుర్తించింది. ‘ది ఫేసెస్ ఆఫ్ హోప్’ అంటూ బ్రిటిష్ ‘వోగ్’ పత్రిక 2020 సెప్టెంబర్ సంచిక కోసం తను ఎంపిక చేసిన 40 మంది సామాజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారాకు స్థానం కల్పించింది. బార్బీగా కూడా ఇప్పుడు స్థానం పొందడాన్ని క్లారా తన అదృష్టంగా భావిస్తున్నారు. ‘‘నా ప్రొఫెషనల్ లైఫ్‌కు లభించిన గౌరవమిది. శక్తికి, ఆత్మవిశ్వాసానికి ఆదర్శవంతమైన ఒక బార్బీని అవడం కన్నా అదృష్టం ఏమంటుంది!’’ అంటున్నారు క్లారా ఎంతో గర్వంగా. ‘మిల్క్ హనీ బీస్’ అని లండన్‌లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నల్లజాతి మహిళలకు, బాలికలకు సృజనాత్మక రంగాలలో చేదోడుగా ఉంటుంది. ఆ సంస్థకు చేదోడుగా కూడా క్లారా ఉంటున్నారు. కలలకు రూపం బార్బీ ప్రపంచంలో ఎన్ని రంగాల్లోనైతే మహిళలు రాణిస్తున్నారో అన్ని రంగాల మహిళలకూ బార్బీలో రోల్ మోడల్స్ వచ్చేశాయి. ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) సహా దాదాపు 200 జాబ్ ఫీల్డ్స్‌లో బార్బీ బొమ్మలు ఉన్నాయి. ఆడపిల్లల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉండే ‘డ్రీమ్ గ్యాప్’ను చెరిపేయడానికే బార్బీ ఆవిర్భవించింది. తొలి బార్బీ 1959లో ఫ్యాషన్ డాల్‌గా అమెరికన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ బార్బీ సృష్టికర్త రూత్ హ్యాండ్లర్ అనే మహిళ. ఆగమనంతోనే ఆడపిల్లలకు ఆత్మీయనేస్తం అయింది బార్బీ. తోబుట్టువు పుట్టినంతగా సంతోషించారు. ఆడపిల్లల్ని కనుక మనం సంతోషంగా ఉంచగలిగితే వాళ్లు ఏదైనా సాధించగలరు అని మార్లిన్ మన్రో అంటుండేవారు. ఒక బార్బీని కొనిచ్చినా వారు ఏదైనా సాధించగలరు. అయితే వారు కోరుకున్న బార్బీని మాత్రమే. ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలటరీ, పాలిటిక్స్, ఆర్ట్స్, బిజినెస్, సైన్స్.. ఏ రంగలోని బార్బీని కోరుకుంటే ఆ బార్బీ. ‘స్పెషల్లీ ఏబుల్డ్’ బార్బీలు కూడా ఉన్నాయి. గత ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి (అక్టోబర్ 11) మానసి జోషీ బార్బీ విడుదలైంది. మానసి ప్యారా–బాడ్మింటన్ ప్లేయర్. అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి గత ఏడాది వచ్చిన తన రోల్ మోడల్ బార్బీతో మానసి జోషి -
రోల్ మోడల్
-
కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రోల్ మోడల్
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను అమలు చేస్తోందని వినోద్ పేర్కొన్నారు. ప్రమాదంలో కార్మికుడు చనిపోతే రూ. 6 లక్షలు చెల్లిస్తోందన్నారు. ఆడపిల్ల పుడితే రెండు కాన్పుల వరకు ఒక్కొక్కరికి రూ. 30 వేల చొప్పున, ఆడపిల్ల పెళ్లికి మరో రూ. 30 వేలు అందజేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు సంఘం రూపొందించిన గుర్తింపు కార్డులను అందజేశారు. సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు జాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలస్వామి, కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇంటింటికీ గో‘దారి’
గోదారమ్మ... జిల్లాలోని ప్రతి ఇంటి తలుపూ తట్టనుంది. గోదారి ఇన్నాళ్లూ పుడమి తల్లి గర్భాన్ని తడిపి సస్యశ్యామలం చేయడమే కాకుండా జనం దాహార్తిని తీరుస్తూ వచ్చింది. ఇప్పుడు మరింత ముందుకు సాగి వైఎస్సార్ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ఇంటింటికీ కుళాయి నీళ్లతో గొంతు తడపనుంది. స్వచ్ఛమైన నీళ్లు తాగాలంటే టిన్ల రూపంలో రూ.10 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేయాల్సిందే. ఆ కష్టాలకు చెక్ పెడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట నీటి మూట కాదంటూ అధికారం చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరూపించుకున్నారు జగన్. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కాలువల్లో కలుషితమైన నీటిని వేడి చేసి వడగట్టి తాగాల్సిన అవసరం ఇక ఎదురుకాదు. ఆక్వా చెరువులతో తాగునీరు కాలుష్యమైపోయి గుక్కెడు శుద్ధి చేసిన నీరు దొరకడమే గగనమైపోతున్న పరిస్థితులకు ఇక చెల్లు చీటీ. ఎందుకంటే ఇక ఇంటింటికీ గోదావరి జలాలు రానున్నాయి. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి దారిపొడవునా జనం తాగు నీటి ఇబ్బందులను తీసుకువెళ్లారు. ఒక మధ్య తరగతి కుటుంబం నెలకు తాగునీటి కోసం రూ.1000 నుంచి రూ.1200 ఖర్చుపెడుతున్న పరిస్థితిని తెలుసుకుని నాడు ఆయన చలించిపోయారు. ఆ సమయంలోనే ప్రతి ఇంటికీ నేరుగా స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తానని మాట ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడు నెలలు తిరగకుండానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఇంటింటికీ గోదావరి జలాలు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో రూపొందించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఆ డిజైన్‌నే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా రూ.3,960 కోట్లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ప్రస్తుతం జిల్లాలో ఉన్న 52 (సీపీడబ్ల్యూ స్కీమ్స్) సమగ్ర రక్షిత మంచినీటి పథకం) ద్వారా మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 45 శాతం మందికి మాత్రమే మంచి నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. తలసరి 40 లీటర్లు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అంటే ఒక గ్రామంలో 75 కుటుంబాలుంటే ఒక పబ్లిక్ ట్యాప్ (వీధి కుళాయి) ఉంటుంది. ఆ కుటుంబాలన్నీ ఆ ఒక్క ట్యాప్ నుంచి తెచ్చుకోవాల్సిందే. అది కూడా వారానికి నాలుగైదు రోజులు మాత్రమే సరఫరా. జిల్లాలో ఏ మంచినీటి పథకమైనా పంట కాలువలే మూలాధారం. ప్రస్తుతం చెత్తా చెదారంతో, ఆక్వా మురుగు నీరు, వ్యర్థ జలాలతో పంట కాలువలలో నీరు కాలుష్య కారకంగా మారిపోయింది. చివరకు చూస్తూ, చూస్తూ ఆ నీటిని తాగలేక మార్కెట్లో మంచినీటి టిన్నులను కొనుక్కునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు సహా అమలాపురం, రామచంద్రపురం, తుని తదితర పట్టణాల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం కుళాయి నీటిని తీసుకువెళుతుంటారు. ఈ పరిస్థితి మార్చేస్తామంటూ గత చంద్రబాబు ప్రభుత్వం ఊరూవాడా మంచినీటి పథకాలకు శంకుస్థాపనలతో హడావుడి చేసేసింది. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లని నమ్మించి మోసం చేసింది. జగన్ సర్కారు చిత్తశుద్ధితో... ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ సర్కారు ఓ అడుగు ముందుకు వేసి జిల్లా రక్షిత మంచినీటి పథకాల రూపురేఖలనే మార్చేసే వాటర్ గ్రిడ్‌కు ప్రణాళిక రూపొందించి. గత సెప్టెంబరులో ఆర్డబ్ల్యూ ఎస్ ఉభయ గోదావరి జిల్లాల అధికారులు రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో పవర్ గ్రిడ్ ప్రాజెక్టును ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.గాయత్రీ దేవి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ గ్రిడ్‌నే రోల్‌మోడల్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. తొలి విడతలో ఎంపికైన జిల్లాల్లో మన జిల్లా ఉండటంతో ఇక్కడి ప్రజలకు భారీ ప్రయోజనం కలగనుంది. ఇక ముందు తలసరి 40 లీటర్లకు బదులు 100 లీటర్లు నీటిని సరఫరా చేయనున్నారు. ఒక గ్రామంలో 2,500 మంది ఉంటే అందులో 45 శాతం అంటే వెయ్యి మందికి మాత్రమే ప్రస్తుతం పథకాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక ముందు 2,500 మందికి పూర్తిగా నీటిని అందించనున్నారు. అదీ కూడా గోదావరి నుంచి నేరుగానే సరఫరా చేస్తారు. ‘రాష్ట్రానికే రోల్‌మోడల్’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలవడం చాలా అనందంగా ఉంది. మన జిల్లా అధికారులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అమలుచేసేలా ఉపయోగపడింది. జిల్లా ప్రజలకు ఇది చాలా ప్రయోజనం కలుగుతుంది. రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే రూ.3,960 కోట్లకు ఆమోదం తెలియజేయడం జిల్లా ప్రజలకు వరమే. ప్రతి ఆవాసానికి నేరుగా గోదావరి జలాలు అందించే ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం 40 లీటర్లు మాత్రమే అందివ్వగలుగుతున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 లీటర్ల్ల నీటిని సరఫరా చేయగలుగుతాం. – డి.మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తలసరి 100 లీటర్లు శుద్ధిచేసిన నీరు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా జిల్లాలో ప్రతి ఆవాసానికి మంచినీటి సరఫరాకు మార్గం సుగమం అవుతుంది. జిల్లాలో 2051 వరకూ పెరిగే జనాభా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాం. పంట కాలువల ద్వారా నీటిని తీసుకుని శుద్ధిచేసి స్టోరేజీ ట్యాంకుల ద్వారా పబ్లిక్ కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ముందు నేరుగా గోదావరి నీటిని తీసుకునే పాయింట్లోనే శుద్ధి చేసి నేరుగా స్కీమ్‌ల నుంచి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి నీటిని సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – టి.గాయత్రీదేవి,ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో ఆరోగ్య శాఖను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య, విధాన పరిషత్ కమిషనర్ రమేశ్‌రెడ్డితో కలసి వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 9 జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం రూ.550 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మ హబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా, వ్యాధులను పరిగణనలోకి తీసుకొని పీహెచ్‌సీలను రేషనైజేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్‌సీల సంఖ్య తగ్గించకుండానే అవసరమున్న చోటికి తరలించే లా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కుటుంబం యూ నిట్‌గా ఆరోగ్య సమస్యలపై నివేదిక తయారు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఉన్న ఆసుపత్రులన్నింటిలో స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో హెల్త్‌హబ్‌గా కరీంనగర్ 1000 పడకల ఆసుపత్రిగా కరీంనగర్ హాస్పిటల్ ను తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బందిని నియమించి రాష్ట్రంలోనే హెల్త్ హబ్‌గా మార్చుతామన్నారు. ప్రస్తుతం 33 మెడికల్ కళాశాలలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని, మరో ఏడు మెడికల్ కళాశాలల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. -
అభిమానుల ప్రేమే నా బలం
హీరోయిన్గా ఐశ్వర్యా రాయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అందాల సుందరి సాధించిన అవార్డులు, చేసిన పాత్రలను బట్టి ఆమె కొత్త కథానాయికలకు ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఐశ్వర్యా రాయ్‌లోని ఇలాంటి లక్షణాలే ఆమెకు ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఉమెన్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండియా (డబ్ల్యూఐఎఫ్‌టి) –2018 అవార్డ్స్‌లో భాగంగా ఐశ్వర్యను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమం అమెరికాలో జరిగింది. ఈ వేడుకలో తల్లి బ్రిందా రాయ్, కూతురు ఆరాధ్యతో కలసి ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నారు. ‘‘ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. శ్రేయోభి లాషులు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నా బలం’’ అని అవార్డ్ సీక్వరించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్యా రాయ్. అలాగే ఈ వేడుకలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, డైరెక్టర్ జోయా అక్తర్ కూడా పాల్గొన్నారు. జాన్వీ కపూర్‌కు ‘ధడక్’ సినిమాకు బెస్ట్ డెబ్యూ కేటగిరీలో డబ్ల్యూఐఎఫ్‌టి ఎమరాల్డ్ అవార్డు రాగా, జోయా అక్తర్‌కు వైలర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డైరెక్షన్ అవార్డ్ దక్కింది. ‘‘నా మిసెస్‌కి ఈ అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. అక్కడున్న ఆరాధ్య తనకు ప్రేమతో హగ్ ఇస్తుంది. నేనేమో ఆ ఫోటో చూస్తూ ప్రౌడ్ హస్బెండ్‌లా ఫీల్ అవుతున్నాను’’ అని అభిషేక్ తన ఆనందాన్ని ట్వీటర్లో పేర్కొన్నారు. -
గంగారాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
సత్తుపల్లి : గంగారం గ్రామాన్ని వచ్చే రెండు, మూడేళ్లలో తెలంగాణలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని గంగారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం ‘ఆదర్శ సంసద్ గ్రామం’ లో చేపట్ట వలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సర్పంచ్ కోటమర్తి రమేష్ అధ్యక్షతన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాన్ల సొల్యూష¯Œ్స అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులతో గ్రామసభ, సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి’ తాను పుట్టిన గ్రామాభివృద్ధి కోసం ఐదారేళ్ల నుంచి రూ.10 కోట్లు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు.. ప్రభుత్వ పరంగా మా వంతు సహకారం అందించి అన్ని సదుపాయాలు సమకూర్చేలా చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో అందరు కలిసి సహకారం అందించినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికి దక్కుతాయన్నారు. గంగారం గ్రామానికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ఎక్కువ వచ్చేలా చూస్తామని హమీ ఇచ్చారు. రోడ్డు పక్కన చెట్లు తీయకుండా విస్తరణ చేపట్టాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు సమీక్ష చేసుకుంటూ వేగవంతంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. గంగారాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం.. : ఎంపీ పొంగులేటి ఆదర్శ సంసద్ గ్రామమైన గంగారాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు అధికారులతో కలిసి సమీక్షలు చేయటమే కాకుండా రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకున్నానన్నారు. ప్రధానమైన 18 సమస్యలలో 14 అంశాలను సంపూర్ణంగా పరిష్కరించామన్నారు. అభివృద్ధి అంటే సీసీరోడ్లు, ఇళ్లుకట్టడం, నీరందించటం, మరుగుదొడ్లు కాదని 18 అంశాల్లో ఆదర్శంగా ఉంటేనే ఆదర్శగ్రామంగా ఉంటుందని.. వీటిలో 14 అంశాలు పరిష్కరించామన్నారు. దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి చేయూత అందిస్తున్నారని.. గంగారాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి తీరుతామన్నారు. చేయాల్సింది చాలా ఉంది.. : దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు గ్రామంలో తిరిగాను.. పదేâýæ్ల నుంచి నా తహాతకు మించి పని చేయిస్తున్నానని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని తాన్ల సొల్యూష¯Œ్స అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.. వచ్చే రెండు మూడేâýæ్లల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. అనంతరం జయహో గంగారం పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయబాబు, దిశ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, సీఈఓ మారుపాక నగేష్, ఎంపీడీఓ ఎ¯ŒS.రవి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భయమే అసలు శత్రువు
అప్రమత్తంగా ఉండటం వేరు. భయపడుతూ బతుకీడ్వడం వేరు. అప్రమత్తంగా ఉండేవారు తమకూ, తమ చుట్టూ ఉండేవారికీ ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసుకోగలుగుతారు. సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడగలుగుతారు. నిత్యం భీతిల్లేవారు తమకే కాదు...చుట్టూ ఉన్నవారికీ ముప్పు కలిగిస్తారు. పాశ్చాత్య సమాజం ఈ రెండిటికీ మధ్య ఉండే తేడాను గుర్తించలేని దిశగా పయనిస్తున్నదని ఇటీవల అమెరికా, బ్రిటన్లలో జరిగిన రెండు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. తొలి ఉదంతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఇర్వింగ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహమ్మద్‌కు సంబంధించింది. ఆ కుర్రవాడు చదువులో చురుకు. రేడియోలనూ, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బాగుచేయడం, సొంతంగా రూపొందించడం అతని హాబీ. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ లక్షణాలు అతణ్ణి అందరిలోనూ మెరిపించేవి. స్కూల్లో అతడి పేరు మార్మోగేది. పిల్లలందరికీ అతనొక రోల్ మోడల్ అయ్యేవాడు. కానీ జరిగింది వేరు. సొంతంగా తయారుచేసి పాఠశాలకు పట్టుకెళ్లిన గడియారాన్ని చూసి టీచర్లంతా బెంబేలెత్తారు. అతన్నో ఉగ్రవాదిగా అనుమానించారు. వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి పట్టించారు. ‘సెలవిచ్చాం పొమ్మ’ని మిగిలిన పిల్లలందరినీ పంపేశారు. అంతేకాదు...ఇకపై చదువుకునే పుస్తకాలు, అందుకోసం అవసరమయ్యే కంపాస్ బాక్స్, కాలిక్యులేటర్ వంటివి తప్ప విద్యార్థుల దగ్గర అంతకు మించి ఏమున్నా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తల్లిదండ్రులందరికీ లేఖలు పంపారు. తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించామని టీచర్లు భుజాలు చరుచుకోగా, పోలీసులు కూడా తమ పని తాము చేశారు. ఆ కుర్రవాడి చేతులు వెనక్కి విరిచి సంకెళ్లు వేశారు. జువెనైల్ హోంకు తీసుకుపోయి అయిదుగంటలపాటు ప్రశ్నించారు. బాంబు తయారు చేయడం కోసమే ముందుగా గడియారాన్ని రూపొందించాడని నిర్ణయానికొచ్చారు. ఈ విషయంలో సంతృప్తికరంగా అతను జవాబులివ్వలేకపోయాడని నిర్ధారించుకున్నారు. నేరస్తుడి దగ్గరనుంచి సేకరించినట్టు అరచేతి ముద్రలు మొదలుకొని అన్ని లాంఛనాలూ పూర్తిచేశారు. చివరకు ఇంటికెళ్లడానికి అనుమతించారుగానీ కేసు మాత్రం కొనసాగింది. ఇదంతా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకొచ్చి మహమ్మద్‌కు ప్రశంసలూ... పోలీసులకు హేళనలూ వెల్లువెత్తాక కేసు కథ ముగిసింది. బ్రిటన్ ఉదంతం ఇంతకన్నా ఘోరమైనది. పర్యావరణంపై తరగతిలో పాఠం చెబుతుండగా జరుగున్న చర్చలో ఒక విద్యార్థి నోట ‘ఇకో టైస్టు’(పర్యావరణ ఉగ్రవాది) అనే పదం వినబడేసరికల్లా టీచర్ కంగారుపడి పోలీసుల్ని పిలిపించాడు. వారొచ్చి ఆ కుర్రవాణ్ణి వేరే గదికి తీసుకెళ్లి అయిదారు గంటలు ప్రశ్నించారట. ‘ఆ పదం ఎలా తెలుసు...ఎక్కడ విన్నావు...ఎవరు ఉపయోగించారు’ అని గుచ్చి గుచ్చి అడిగారట. చివరకు ఐఎస్ ఉగ్రవాదుల గురించి తెలుసా అని అడిగాక గానీ తనను ఇంతవరకూ వారు ఏ ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నారో అతని అర్థం కాలేదట. అర్థమయ్యాక భయంతో వణికిపోయానని అతను చెబుతున్నాడు. ఇలా ఉగ్రవాదులని అనుమానం వచ్చిన పిల్లలిద్దరూ ముస్లింలు కావడం యాదృచ్ఛికం కాదు. అమెరికాలోనైనా, బ్రిటన్‌లోనైనా ముస్లింలు కావడం, వారిని పోలిన పేర్లుండటం ఇప్పుడు ప్రాణాంతకమవుతున్నది. గెడ్డం కారణంగా సిక్కు యువకులను ముస్లింలనుకుని చావబాదుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఈ అనుమాన పిశాచులకు పిల్లల్ని మినహాయిద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా కొరవడుతోంది. తమ నీడను చూసి తామే జడుసుకునే స్థితికి ఆ సమాజాలు చేరువవుతున్నాయి. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాంకూ, నటులు షారుఖ్ ఖాన్, కమల్ హాసన్లకూ ఆ గడ్డపై పరాభవం ఎదురైంది కేవలం వారి పేర్ల వల్లనే. పద్నాలుగేళ్లక్రితం అమెరికా గడ్డపై అల్ కాయిదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను ఢీకొట్టించి దాదాపు 3,000మంది మృతికి కారకులయ్యారు. అలాంటి దాడులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం అవసరమే. అయితే ఆ క్రమంలో చస్తూ బతికే పరిస్థితులను కల్పించుకోకూడదు. ఏ చిన్న వస్తువును చూసినా భయంతో వణకడం... పసి పిల్లల్ని చూసినా భీతిల్లి గుండె పగలడం దేనికి సంకేతం? ఆనాటి ఉగ్రవాద ఘటనకు బాధ్యులైనవారు ముస్లింలైనంత మాత్రాన ఆ మతానికి చెందినవారందరినీ అనుమానించడం సరైందేనా? అలాగైతే ఈ పద్నాలుగేళ్లలో అమెరికా, బ్రిటన్లు ఇరాక్, అఫ్ఘాన్, లిబియా, సోమాలియా, సూడాన్ తదితర దేశాల్లో సృష్టించిన విధ్వంసం ఎంత? ఎన్ని లక్షలమంది ప్రాణాలు అందులో ఆహుతైపోయాయి? ఆ రెండు దేశాలూ, వాటితో అంటకాగిన ఇతర దేశాలూ సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అమెరికాలో ఉగ్రవాద అనుమానితుడిగా వేధింపులకు గురైన కుర్రవాడికి దేశాధ్యక్షుడు ఒబామా మొదలుకొని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వరకూ ప్రముఖుల ఊరడింపులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎంఐటీ వంటి అత్యున్నత శ్రేణి విద్యా సంస్థ, సామాజిక మాధ్యమం ట్విటర్ ఎర్ర తివాచీ పరిచి అతణ్ణి ఆహ్వానిస్తున్నాయి. మంచిదే! ఒక పసివాడి పట్ల జరిగిన అపచారాన్ని సరిదిద్దడానికి, గాయపడిన ఆ లేత హృదయాన్ని సాంత్వనపరచడానికి ఇంతమంది పెద్దలు ముందుకు రావడం, స్పందించడం హర్షించదగిందే. కానీ తమ సమాజాలు ఎందుకిలా చిగురుటాకుల్లా వణుకుతున్నాయో... ఎందుకని జాత్యహంకారమూ, మత అసహనమూ ఇలా వెర్రితలలు వేస్తున్నాయో కూడా వారు ఆలోచించాలి. ఏ విత్తనాలు ఇలా విషవృక్షాలుగా ఎదిగి శాఖోపశాఖలై విస్తరించి సమాజ మనుగడకే ప్రమాదకరంగా మారాయో ఆచూకీ తీయాలి. వాటిని కూకటి వేళ్లతో పెకిలించ డానికి తామేం చేయాలో తెలుసుకోవాలి. అప్పుడు సామాజిక మాధ్యమా లకెక్కకుండా నిత్యం బలవుతున్న వేలాదిమంది మహమ్మద్‌లు సురక్షితంగా, ప్రశాంతంగా బతకగలుగుతారు. -
నిజజీవిత కథానాయకుడు
నేడు అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి దేవదాసు ఎలా ఉంటాడు? విప్రనారాయణ ఎలా ప్రవర్తిస్తాడు? కవి కాళిదాసు, భక్త జయదేవుడు ఎలా ఉండి ఉంటారు? మరి, దసరా బుల్లోడంటే? భగ్న ప్రేమి కుడి నుంచి భాగవతోత్తముడి దాకా, కవీశ్వరుడి నుంచి కుటుంబ కథల కథా నాయకుడి దాకా - ఏ పాత్రకైనా రోల్ మోడల్‌గా నిలవడం ఎంతటి నటుడికైనా సవాలు. కానీ, కష్టపడి పైకొచ్చి, ఆ సవాలును ఇష్టపూర్తిగా స్వీకరించి, అభినయమే శ్వాసగా బతికిన నటుడంటే అక్కినేని నాగేశ్వరరావు(1924 - 2014). పెద్దగా చదువైనా లేని పల్లెటూరి పిల్లగాడు... పెద్దయ్యాక కూడా నాటకాల్లో ఆడవేషాలు వేసిన ఒక కుర్రాడు... పెద్దమనుషుల్ని పరిచయం చేస్తే కనీసం నమస్కరించి మాట్లాడడం కూడా తెలియని శుద్ధ బుద్ధావతారం... నేర్చుకొనే గుణం ఉంటే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడవచ్చనీ, సాధన చేస్తే కొన్ని కోట్ల మందిని ఆకట్టుకొనే కథానాయకుడు కావచ్చనీ, ఒక జాతి తరతరాలూ చెప్పుకొనే కల్చరల్ ఐకాన్‌గా చిరకాలం మిగిలిపోవచ్చనీ నిరూపించడం అక్కినేని జీవిత కాలంలో చేసి చూపెట్టిన అపూర్వ సాధన. అనారోగ్యం రావచ్చు... ఒకటికి రెండు గుండె ఆపరేషన్లు జరగచ్చు... జీవితంలో, కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు ఎదురుకావచ్చు. కానీ, ‘బతుకు కన్నీటి ధారలలో బలి చేయకు’ అన్న పాఠాన్ని ఎలా చెప్పాలి? అవన్నీ ఎదురై నప్పుడు అక్షరాలా ఆచరించి చూపడం తప్ప! అక్కినేని చేసింది అదే! ఆఖరి క్షణంలో క్యాన్సర్ కబళిస్తున్నప్పుడు కూడా అదే ధైర్యం... అదే హుందాతనం. చేస్తున్న వృత్తినే దైవంగా భావించడం, ఆ భావనతోనే ఆఖరు దాకా జీవించడం... చాలా మంది చెబుతారు. కానీ, అక్కినేని చేసి చూపించారు. ‘నటుడిగానే మరణించాలి. మరణించాక కూడా జీవించాలి’- ఇది కొందరికి ఆశ. ఇంకొందరికి తీరని ఆశయం. మరికొందరికి కేవలం జనం మెచ్చడానికిచ్చే స్టేట్మెంట్. కానీ, చిన్ననాటే రంగస్థలంపై మొదలుపెట్టి, వెండితెరపై ‘ధర్మపత్ని’ (1941) నుంచి చనిపోయే ముందు ‘మనం’ (2014) దాకా ఏడున్నర దశాబ్దాల పైగా వృత్తినే శ్వాసించడం ఏయన్నార్ ఘనత. జీవితంలో నటించడం ఎక్కువై, నటనలో జీవించడం తక్కువైన రోజుల్లో అక్కినేని జీవితకాలపు జ్ఞాపకాల్ని జనం గుండెల్లో మిగిల్చిన మహానటుడు. అందుకే, భారతీయ సినీచరిత్రలో ఏయన్నార్ కథ చిరకాలపు పాఠం. అచ్చతెలుగు జీవితం, పంచెకట్టు వేషమంటే ఇప్పటికీ గుర్తొచ్చే ఆయన అమరజీవి... తెలుగు సమాజపు సమష్టి చేతనలో సదా చిరంజీవి. -
సానియా... ఓ రోల్ మోడల్..!
ఆరేళ్ళ వయసున్న సానియా ఇప్పుడు దేశంలోని పిల్లలందరికీ రోల్ మోడల్ అయ్యింది. గౌరా గ్రామంలోని ప్రతివారూ ఇప్పుడు సానియాను ఫాలో అవుతున్నారు. ఆమెలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆమె మాత్రమే గ్రామం మొత్తానికి హెల్దీ ఛైల్డ్ గా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్స్ తరపున వాత్సల్య ఎన్జీవో ఆర్గనైజేషన్ జరిపిన సర్వేలో గౌరా గ్రామంలో సానియా కుటుంబం తప్పించి మరెవ్వరూ పూర్తి ఆరోగ్యంతో లేనట్లు గుర్తించారు. ఈ ఆరేళ్ళ చిన్నారి ఆరోగ్యం దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నలక్షలమంది పిల్లలకు, వారి కుటుంబాలకు మార్గ దర్శకమైంది. ఓ ఆరోగ్యవంతమైన బిడ్డ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగల్గుతుంది అనేందుకు సానియా నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన జీవితాలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతాయన్నందుకు సానియా లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చెప్పొచ్చు. ఉత్తర ప్రదేశ్ లో ని గౌరా గ్రామంలో ఒకే ఒక్క హెల్దీ ఛైల్డ్ గా సానియా గుర్తింపు పొందింది. మంచి ఆహారపు అలవాట్లు ఉన్న కుటుంబంతోపాటు, తల్లిదండ్రులు పాటించిన ఫ్యామిలీ ప్లానింగ్ ఆమెకు వరంగా మారింది. ఎక్కువశాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న గౌరా గ్రామంలో ఓ ఎన్జీవో సంస్థ జరిపిన సర్వేలో ఈ నిజం వెలుగు చూసింది. ఇంటి చుట్టుపక్కలవారు, స్నేహితుల్లోనే కాక ఏకంగా గ్రామంలోనే ఆ ఆరేళ్ళ చిన్నారి ఆరోగ్యంలో ముందున్నట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. సానియా త్రండి కుండలు తయారు చేయడం వృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. అయితేనేం సానియా ఆరోగ్యంలో ముందుండేందుకు ఆమె కుటుంబ ఆహారపు అలవాట్లు ఎంతగానో సహకరించాయి. కేవలం శారీరకంగానే కాదు... మానసికంగా కూడ సానియా ఎంతో ఆరోగ్యంవంతంగా ఉంది. అతి చిన్న గ్రామంలో ఉంటున్నా సానియా కుటుంబం ఎంతో పరిశుభ్రతను పాటిస్తుంది. భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వారి కుటుంబాన్ని అనారోగ్యాలకు దూరంగా ఉంచగల్గుతోందని ఆ సంస్థ సర్వేలో తేల్చి చెప్పింది. ఇప్పటికీ దేశంలోని పలు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడ కొందరు మహిళలు ప్రసవం ఇంట్లోనే చేసుకుంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు కూడ కనీసం వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలను, వైద్యాన్ని తీసుకోవడం లేదు. కానీ ఓ చిన్న గ్రామంలో ఉన్నా... సానియా తల్లి మాత్రం గర్భంతో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్ చేయించుకోవడం, అవసరమైన పోషకాహారాన్ని, ఐరన్ మాత్రలను వాడటంతో ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డను కనగలిగింది. పసిబిడ్డల పెంపకంలో ఎంతో కష్టమైన మొదటి ఆరు నెలలు దాటే వరకూ తల్లిపాలివ్వడం సానియా ఆరోగ్యానికి కలసి వచ్చింది. అంతేకాదు తల్లిదండ్రులు బిడ్డ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు క్రమంగా వాక్సిన్లు వేయించారు. తమ ఆర్థిక స్థితిగతులను బట్టి మరో బిడ్డను ఆరోగ్యంగా పెంచడం కష్టమని తెలుసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ కూడ పాటించారు. ఇవన్నీ సానియాను నేడు ఆరోగ్యానికి ఓ రోల్ మోడల్ గా నిలబెట్టాయి. -
రాష్ట్రం రోల్ మోడల్ కావాలి
సాక్షి,హైదరాబాద్: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ.. వాటి నుంచి ఇంధన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం తన నివాసంలో అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఘన వ్యర్థాలను సేకరించి శుద్ధి చేసి సేద్యానికి వినియోగించే పద్ధతులపై సీఎం చర్చించారు. స్వచ్ఛ భారత్‌పై ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా ఇతర రాష్ట్రాలకు చెప్పే ముందు వాటిని ఏపీలో విజయవంతంగా నిర్వహించటంపై దృష్టి పెట్టానన్నారు. ఏపీకి సరిపోయే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ప్రతినిధులను కోరారు. ఢిల్లీలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరహాలో ఏపీలో కూడా జిల్లాకు ఒకటి చొప్పున 18 నెలల్లో ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాల్లో పశువ్యర్థాల నుంచి వర్మి కల్చర్ అభివృద్ధి ప్లాంట్లు స్థాపిస్తామని చెప్పారు. ఏపీలోని 13 జిల్లాలలో రోజుకు 9 వేల టన్నుల ఘన, ద్రవ వ్యర్థాలు పేరుకుంటున్నాయని, పునర్వినియోగం ద్వారా ఇంధన ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులు సీఎంకి తమ విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో టాటా, ఏఈసీఓఎం, ఐఎల్ అండ్ ఎస్ ఎస్ ఇతర కంపెనీల ప్రతినిధులతో పాటు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, కార్యదర్శి జయలక్ష్మి, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోల్ మోడల్‌గా సిద్దిపేట
జిల్లాలోని 46 మండలాల్లో ఉన్న సమస్యల్లో రెవెన్యూ పరమైన ఇబ్బందుల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిష్కరించుకునేందుకు ఏళ్ల తరబడి చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి చెక్ పెట్టాలని భావించిన మంత్రి హరీష్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో సరైన ప్రణాళిక తయారు చేసుకుని అధికారులు రంగంలోకి దిగారు. ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందించేందుకు కలెక్టర్, జేసీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రైతులకు సరిపడా పాస్‌బుక్‌లు మండలానికి వచ్చేలా చూశారు. రెవెన్యూ సదస్సులు, గ్రామదర్శినితో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పట్టాపాసు పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఇలా చేయడం వల్ల పైసలిస్తేనే పాస్‌బుక్‌లు వస్తాయనే భావనను పోగొట్టారు. సమస్యలు పరిష్కారం ఇలా... సిద్దిపేట రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. రెవెన్యూ చట్టాల ప్రకారం 45 రోజుల్లో వాటిని పరిష్కారం చేస్తున్నారు. ఈ సమయంలో ఏవైనా ఇతర పత్రాలు అవసరమైతే దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వాటిని తెప్పించుకుంటున్నారు. స్థానిక మంత్రి హరీష్‌రావును సంప్రదిస్తూ నిబంధనల మేరకు చకచకా సమస్యలు పరిష్కరిస్తున్నారు. 2012 నుం చి ఇప్పటి వరకు 6,197 రెవెన్యూ సమస్యలు పరిష్కరించి ప్రజల మెప్పు పొందుతున్నారు. అన్ని శాఖల్లో సాధ్యమయ్యేనా..! సిద్దిపేట తహశీల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కారం అవుతున్న తీరును ఇతర శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది గుర్తించి ఆయా శాఖల్లో ఈ విధంగా సమస్యలు పరిష్కరించడం పట్ల దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలోనే సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు దక్కే అవకాశం ఉంది. -
గొప్ప టీమ్ లీడర్ లక్షణాలేంటి?!
కార్యాలయంలో ఒక బృందానికి నాయకత్వం వహించడం సులభం కాదు. విజయవంతమైన నాయకుడిగా సహచరులను ముందుకు నడిపిస్తే అనుకున్న ఫలితాలను సాధించొచ్చు. ఒక టీమ్‌లో రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వారు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు! అనేది నాయకుడిపైనే ఆధారపడి ఉంటుంది. లీడర్ సమర్థుడైతే అనుచరులు కూడా అంతే సమర్థంగా పనిచేస్తారు. ఒక వ్యక్తి సక్సెస్‌పుల్ లీడర్‌గా గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. సహచరులను గౌరవించండి ఆఫీస్‌లో మీరు టీమ్‌లీడర్ అయితే.. మీతో కలిసి పనిచేసేవారిని గౌరవించండి. చేస్తున్న పనిపై వారి అభిప్రాయాలను తెలుసుకోండి. సూచనలు తీసుకోండి. పనిలో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారానికి సహచరుల సహకారం పొందండి. తమ పనికి గుర్తింపు లభిస్తోందని, తాము ముఖ్యమైన వ్యక్తులమనే భావన వారిలో కలిగేలా వ్యవహరించండి. వారి కృషిని మనస్ఫూర్తిగా ప్రశంసించండి. దీనివల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వారి పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆరోగ్యవంతమైన అనుబంధాన్ని కొనసాగించండి. ప్రేరణ కలిగించండి సహచరులకు సవాళ్లతో కూడిన పనులను అప్పగిస్తూ వారిలో ప్రేరణ నింపండి. స్ఫూర్తిని కలిగించండి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే బహుమతులు ప్రదానం చేయండి. తగురీతిలో సత్కరించండి. కార్యాలయంలో మీ పనితీరు, సత్ప్రవర్తనతో జూనియర్లకు ఒక రోల్‌మోడల్‌గా మారండి. వారు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేలా వ్యవహరించండి. మీరు ఎలాంటి నాయకుడనేది దీన్ని బట్టే తెలిసిపోతుంది. అర్థమయ్యేలా వివరించండి మీరు రూపొందించిన ప్రణాళిక విజయవంతం కావాలంటే.. అది బృంద సభ్యులకు సరిగ్గా అర్థం కావాలి. దానితో వారు అనుసంధానమవ్వాలి. కాబట్టి మీ ఆలోచనలను అర్థమయ్యేలా వివరించండి. లక్ష్యాలను చేరడానికి దారి చూపండి. టీమ్ నుంచి మంచి ఔట్పుట్ రావాలంటే లీడర్ నైపుణ్యాలు మెరుగవ్వాలి. జవాబుదారీతనం సహచరులకు కొత్త బాధ్యతలను, విధులను అప్పగించడం ద్వారా వారిలో జవాబుదారీతనం పెంచండి. విధుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకొని, ఫలితాలను సాధించేలా వారిని ప్రోత్సహించండి. దీంతో వారిపై వారికి నమ్మకం పెరిగి భవిష్యత్తులో మంచి ఉద్యోగులుగా రాటుతేలుతారు. జూనియర్లను విశ్వసించండి భవిష్యత్ లక్ష్యాలను జూనియర్లతో పంచుకోండి. చేపట్టాల్సిన బాధ్యతలను వారికి పంచండి. లక్ష్యాలు సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను వారి సహకారంతో రూపొందించండి. అందులో వారిని భాగస్వాములను చేయండి. సహచరులను సంపూర్ణంగా విశ్వసించండి. నాయకుడు ఎల్లప్పుడూ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. -
వీధికో షాడో!
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి జిల్లాను కనుసన్నల్లో శాసించిన షాడోనేతలా తామూ ఎదిగిపోవాలని, ఎదురులేని విధంగా పెత్తనం చెలాయించాలని టీడీపీ నేతలు ఆత్రంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది షాడోనేతను ఆవహింపజేసుకుని ఆయన్ను అనుసరిస్తూ అధికారులపై ఒతిళ్లు తెస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకి ఒకే ఒక్క షాడోనేత ఉండగా ఇప్పుడు వీధికో షాడో నేత తయారయ్యాడని, వీరితో ఎలా వేగాలని అధికారులు ఆందోళన చెందుతున్నారు. - టీడీపీ నేతలకు రోల్‌మోడల్‌గా రాజ్యాంగేతర శక్తి - అధికార దాహంతో ఊరికొకరు,వార్డుకొకరు తయారు - ఇప్పటికే మొదలైన అజమాయిషీ - బెంబేలెత్తిపోతున్న అధికారులు,ఉద్యోగులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తరచూ షాడోనేత పేరును వల్లిస్తూ అధికారులపై తీగ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా....విచిత్రంగా మరో పక్క టీడీపీ నాయకులు ఆ నేతను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు. అశోక్ నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నేతనే అనుసరిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వార్డుకొక నాయకుడు తయారవుతున్నాడు. పవర్ చెలాయించేందుకు ఇప్పటికే దుకాణాలు తెరిచేశారు. అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు.. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైభవమేంటో అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగా పవర్ చెలాయించారు. షాడోనేతగా పేరుపొందారు. జిల్లాలో ఆయన ఆధిపత్యం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. చెప్పాలంటే ఆ పార్టీ జిల్లా నేతల్లో కసి పెంచింది. కాంగ్రెస్ నేతల్లో ఎవర్ని తిట్టకపోయినా చిన్నశ్రీనును మాత్రం వదిలేవారు కాదు. ఒంటికాలి తో లేచేవారు. ఆయన్ను రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. షాడో నేత కాస్త జీరో అయ్యారు. నాడు సలామ్ కొట్టిన వారంతా దూరంగా ఉంటున్నారు. పిలిచినా పలికేందుకు ఇష్టపడటం లేదు. అయితే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి ముఖం వాచి పోయిన టీడీపీ నాయకులు మాత్రం ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. గతంలో ఆయనెలా అధికారం చెలాయించారో అదే తరహాలో వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా అంతటికీ ఒకే షాడోనేత ఉండగా, ఆ తరహాలో ఇప్పుడు ఊరుకొకరు, వార్డుకొకరు తయారవుతున్నారు. ఎక్కడికక్కడ పవర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు షాడోనేతలా అధికార దర్పం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేయకుండానే తమ వద్దకు అధికారులను పిలిపించుకుని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కాని వారు కూడా షాడో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరేమి చేయాలో నిర్ణయిస్తున్నారు. ఏ ఉద్యోగి ఉండాలో, ఎవరు ఉండకూడదో నేరుగా సూచించేస్తున్నారు. తమకిష్టం లేని ఉద్యోగుల్ని, అధికారులను వేరొక చోటకి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కాదని వ్యతిరేకిస్తే తాము బదిలీ చేయాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. పనిచేసే ఉద్యోగులు, అధికారులు కూడా తరుచూ కలవాలని, పాలన పరంగా ఏం చేసినా తమకు చెప్పి చేయాలని, ఏ పథకం వచ్చినా తమ దృష్టిలో పెట్టి ముందుకెళ్లాలని హకుం జారీచేస్తున్నారు. అంతటితో ఆగకుండా పథకాల అమలు, కొత్తగా చేయాల్సిన కార్యక్రమాలు తదితర వాటిపై ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో అధికారులు అవాక్కైపోతున్నారు. గతంలో ఒకరే అనధికార బాస్‌గా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రాంతానికొకరు తయారయ్యారని వాపోతున్నారు. ఇలాగైతే కష్టమేనని, ఒకర్నైతే తట్టుకోగలమని, ఇంతమందైతే వేగలేమనే అభిప్రాయానికొచ్చేస్తున్నారు. మండలాల్లో ఎంపీటీసీలు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు, జిల్లా పరిషత్‌లో పలువురు జెడ్పీటీసీలు ఇప్పటికే అధికారులపై ఒత్తిళ్లు పెట్టారు. తమకు అనుకూలంగా పనులు చేపట్టాలని జాబితాలిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో తమ వారిని వేసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. తమ మాట వినకపోతే కాంగ్రెస్ మద్దతుదారుడిగా చిత్రీకరించి, బదనాం చేస్తామని పలుచోట్ల బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది. జిల్లా కేంద్రంలో ఇద్దరు నాయకులైతే పార్టీ కీలక నేత అనుచరులమని, తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని అధికారుల వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారు. ఇదంతా చూసి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దని తరచూ సమావేశాల్లో హితబోధ చేస్తున్న అశోక్ దృష్టికి తీసుకెళ్తే తప్ప అదుపులోకి వచ్చేటట్టు లేదన్న ఆలోచనకు అధికారులొస్తున్నారు. -
ఏలూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని దేశంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఆ పార్టీ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ చెప్పారు. ఇందు కు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే రూపొందించామని, తాను ఎంపీగా ఎన్నికైన వెంటనే దానిని అమలు చేస్తానని ప్రకటించారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో కలసి లోక్‌సభ నియోజకవర్గ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనిఫెస్టోను రూపొందించేందుకు జనవరిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించామని, నియోజకవర్గ పరిధిలోని 750 గ్రామాలకు అభిప్రాయ సేకరణ పత్రాలను పంపించామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి 30 నుంచి 40 మందితో పూర్తి చేయించామని, మొత్తంగా 1.30 లక్షల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారని వివరించారు. వాటన్నిటినీ క్రోడీకరించి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో రూపొందించామన్నారు. ఎంపీగా గెలి చిన మరుక్షణమే మేనిఫెస్టోను అమలు చేయడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. మోడల్ సిటీగా ఏలూరు ఏలూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రశేఖర్ చెప్పా రు. ఐఏఎస్ అధికారిగా ఇప్పటికే పలు నగరాలను అభివృద్ధి చేసిన అనుభవం తనకుందని గుర్తు చేశారు. నగర ప్రజ లకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయా లు కల్పించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేస్తామని తెలి పారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. నగరంలో ఆగ్రో ప్రోసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని తెలిపారు. తమ్మిలేరు ముంపునుంచి నగరాన్ని రక్షిస్తామన్నారు. నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని, అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఉండే అవకాశాల ప్రాతిపదికన ఒక గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కొల్లేరు అభయారణ్య ప్రాం తాన్ని ఐదో కాంటూరు నుంచి మూడుకు కుదించే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. డెల్టా ఆధునికీకరణ పనులను సత్వరం పూర్తి చేయించి ముంపు బారినుంచి రైతులను కాపాడతామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తాం చింతలపూడి, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తామని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణాన్ని సాకా రం చేసి పోలవరం, చింతలపూడి నియోజకవర్గ ప్రజల చిరకాల వాం ఛను నిజం చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తామని, నూజివీడులో మ్యాంగో మార్కెట్ నెలకొల్పుతామని, జిల్లాలో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. గ్రామా ల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు మినరల్ వాటర్‌ను తక్కువ ధరకు ఇస్తామని, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రయత్నిస్తామని, ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. మేనిఫెస్టో హర్షణీయం : ఆళ్ల నాని రాష్ట్రంలో ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొం దించిన ఘనత తోట చంద్రశేఖర్‌కే దక్కిందని ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని చెప్పారు. పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్నివర్గాలకు మేలు చేసేవిధంగా మేనిఫెస్టోలోని అంశాలు ఉన్నాయన్నారు. చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా ఇక్కడకు వచ్చినప్పు డు రాజకీయ అనుభవం లేదనుకున్న వారంతా ఆయన పనితీరును చూసి అభిప్రాయాన్ని మార్చుకున్నారని తెలి పారు. మేనిఫెస్టో రూపకల్పన ద్వారా ఆయన వినూత్నంగా ఆలోచిస్తున్నారని అర్థమవుతోందని అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఊదరగొండి చంద్రమౌళి, బొద్దాని శ్రీనివాస్, నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తిప్పాని రామ్మోహనరావు, మోర్త రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
నాకు నేనే బాస్ అంటున్న పరిణీతి
-
నాయికల నాయకుడు
మననం అక్కినేని తొలి దశలో నటించిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరో’ ఇమేజ్ ఏర్పడింది. ప్రేమ, విరహం, విషాదం... అంటే ఆయన ఓ ‘రోల్ మోడల్’ అయ్యారు. తన సినీ జీవితంలో అక్కినేని సరసన 76 మంది కథానాయికలు నటించడం ఓ రికార్డు! తొలి రోజుల్లో శాంతకుమారి, లక్ష్మీ రాజ్యం, ఎస్.వరలక్ష్మి, భానుమతి, అంజలీదేవి, సావిత్రి; ఆ తర్వాత షావుకారు జానకి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజసులోచన, కాంచన, పద్మిని వంటివారు అక్కినేని సరసన నటించారు. ‘మాయలోకం’లో ఆయన కంటే వయసులో పెద్దవారైన శాంతకుమారి, ఎమ్.వి.రాజమ్మల సరసన హీరోగా నటించారు ఏఎన్నార్. శాంతకుమారితో ప్రేమ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు కంగారుపడేవారట. అప్పుడు శాంతకుమారి అలాంటి సన్నివేశాలలో ప్రేమను పండించాలంటే... డైలాగులు ఎలా చెప్పాలో, శృంగారాన్ని ఎలా అభినయించాలో చెప్పి ఉన్న భయాన్ని పోగొట్టారు. భరణీ వారి తొలి చిత్రం ‘రత్నమాల’లో భానుమతి సరసన మొదటిసారిగా నటించారు అక్కినేని. ఆ చిత్రానికి దర్శకుడు భానుమతి భర్త రామకృష్ణ. భానుమతితో అక్కినేనికి చనువు ఏర్పడాలని - వాళ్లిద్దర్నీ కలిసి పరుగెత్తమని చెప్పి 16 మి.మీ. కెమెరాతో ఆ దృశ్యాలను తీసి చూపించేవారు. భానుమతిని ‘మేడమ్’ అని, రామకృష్ణను ‘గురువుగారూ’ అని పిలిచేవారు అక్కినేని. ‘చింతామణి’ తీయాలని సంకల్పించి, బిల్వమంగళుడి పాత్రను ధరించమని వాళ్లు కోరినప్పుడు అక్కినేని తిరస్కరించారు. ‘‘నేను చేయకపోవడం అలా ఉంచండి. చింతామణి మేడమ్‌గారు వేయదగ్గ పాత్ర కాదు. ఆ సినిమాను ‘డ్రాప్’ చేసుకోండి’’ అని కూడా సూచించారు సంస్థ పట్ల అభమానం కొద్దీ! ఆ తర్వాత భరణీ అధినేతలు ఎన్టీయార్‌తో ‘చింతామణి’ తీశారు. ఆ చిత్రం అపజయాన్ని చవిచూసింది. అక్కినేని హీరోయిన్లలో ప్రధానమైన నటీమణి అంజలీదేవి. ఒక బిడ్డ తల్లిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ‘గొల్లభామ (1947)’ తో గ్లామర్ నటిగా సంచలనాన్ని సృష్టించారు. అంతవరకూ ‘వ్యాంప్’ పాత్రలు ధరించి, ‘శ్రీలక్ష్మమ్మ కథ’లో అక్కినేని సరసన సాధ్వి పాత్రలో మెప్పించారు. ఈ జంట ఆ రోజుల్లోనే ‘పరదేశి’లో వయసు మళ్లిన దంపతుల పాత్రల్లో కనిపించడం విశేషం. ‘ఇలవేలుపు’ చిత్రంలో మొదట ప్రేమికులై, ఆ తర్వాత నాయిక (అంజలీదేవి)ను, హీరో తల్లిగా చూడవలసి రావడం అప్పట్లో ‘యాంటీ సెంటిమెంట్’ అన్నారు. కానీ అక్కినేని, అంజలీదేవి ఆ చిత్రంలో అద్భుతంగా రాణించారు. అక్కినేని నట జీవితంలో మరో ప్రధానమైన నటీమణి సావిత్రి. ‘మూగమనసులు’లోని ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాటను గోదావరి నదిపై పడవలో చిత్రీకరిస్తున్నప్పుడు, సావిత్రి పట్టుతప్పి నదిలో పడిపోయారు. పడవను పట్టుకుని వేలాడుతున్న ఆమెను సమయస్ఫూర్తితో అక్కినేని చేయి పట్టుకుని పైకి లాగుతూ ఉంటే, ఈతగాళ్లు వచ్చి ఆ ఇద్దరినీ కాపాడటం జరిగింది. సావిత్రి ఎంతోమందికి చెప్పారు ఏయన్నార్ రక్షించిన సంగతి! ‘సావిత్రి మనిషిగా గొప్పదా? నటిగా గొప్పదా? అనేది తేల్చుకోవడం కష్టం’ అంటారు అక్కినేని. ఆ తర్వాత వచ్చిన మరోతరం నటీమణులలో లక్ష్మి, శారద, జయలలిత, వాణిశ్రీ, భారతి - అనంతరం లత, జయచిత్ర, సుజాత, మంజుల, జయసుధ, జయప్రద వంటివారు అక్కినేని సరసన ఆకర్షణీయమైన పాత్రలు పోషించారు. ప్రేక్షకులకు ‘రాంగ్ మెసేజ్’ వెళ్లకూడదనేది అక్కినేని వాదం. యద్దనపూడి సులోచనారాణి నవల ‘విజేత’ ఆధారంగా ‘విచిత్ర బంధం’ తీస్తున్నప్పుడు, హీరో కథానాయిక (వాణిశ్రీ)ను ‘రేప్’ చేసే ఘట్టాన్ని ఎంతగానో వ్యతిరేకించారు. నిర్మాత దుక్కిపాటి, దర్శకుడు ఆదుర్తి - ఆయనను అతికష్టం మీద ఒప్పించారు. చిత్రీకరణ అయిన తర్వాత ‘‘ఓస్! రేప్ అంటే ఇదేనా? ఏమో అనుకుని భయపడ్డాను’’ అని వాణిశ్రీ నవ్వారు. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా చిత్రీకరించారు ఆదుర్తి. ప్రేమ సన్నివేశాలైనా, ఏ తరహా దృశ్యాలైనా ఆలోచింపజేసేలా, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలనేది అక్కినేని ధోరణి. అందుకనే ఏదీ ‘మోతాదు’కు మించకుండా ఉండాలని కోరుకుంటూ, ఆ మేరకు దర్శక నిర్మాతలు శ్రద్ధ వహించేలా చూసేవారు. ఆ మధ్య అక్కినేని నాయికలందరూ ఒకే వేదికపై చేరి, ఆయనను సత్కరించడం విశేషానందాన్ని కలిగించిన ఘట్టం! - బి.కె.ఈశ్వర్