జయహో.. గంగారం పాటల సీడీని ఆవిష్కరిస్తున్న మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే తాటి
సత్తుపల్లి : గంగారం గ్రామాన్ని వచ్చే రెండు, మూడేళ్లలో తెలంగాణలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని గంగారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం ‘ఆదర్శ సంసద్ గ్రామం’ లో చేపట్ట వలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సర్పంచ్ కోటమర్తి రమేష్ అధ్యక్షతన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాన్ల సొల్యూష¯Œ్స అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులతో గ్రామసభ, సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి’ తాను పుట్టిన గ్రామాభివృద్ధి కోసం ఐదారేళ్ల నుంచి రూ.10 కోట్లు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు.. ప్రభుత్వ పరంగా మా వంతు సహకారం అందించి అన్ని సదుపాయాలు సమకూర్చేలా చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో అందరు కలిసి సహకారం అందించినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికి దక్కుతాయన్నారు. గంగారం గ్రామానికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ఎక్కువ వచ్చేలా చూస్తామని హమీ ఇచ్చారు. రోడ్డు పక్కన చెట్లు తీయకుండా విస్తరణ చేపట్టాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు సమీక్ష చేసుకుంటూ వేగవంతంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
గంగారాన్ని అభివృద్ధిలో
పరుగులు పెట్టిస్తాం.. : ఎంపీ పొంగులేటి
ఆదర్శ సంసద్ గ్రామమైన గంగారాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు అధికారులతో కలిసి సమీక్షలు చేయటమే కాకుండా రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకున్నానన్నారు. ప్రధానమైన 18 సమస్యలలో 14 అంశాలను సంపూర్ణంగా పరిష్కరించామన్నారు. అభివృద్ధి అంటే సీసీరోడ్లు, ఇళ్లుకట్టడం, నీరందించటం, మరుగుదొడ్లు కాదని 18 అంశాల్లో ఆదర్శంగా ఉంటేనే ఆదర్శగ్రామంగా ఉంటుందని.. వీటిలో 14 అంశాలు పరిష్కరించామన్నారు. దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి చేయూత అందిస్తున్నారని.. గంగారాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి తీరుతామన్నారు.
చేయాల్సింది చాలా ఉంది.. :
దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి
ఈ రోజు గ్రామంలో తిరిగాను.. పదేâýæ్ల నుంచి నా తహాతకు మించి పని చేయిస్తున్నానని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని తాన్ల సొల్యూష¯Œ్స అధినేత దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.. వచ్చే రెండు మూడేâýæ్లల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. అనంతరం జయహో గంగారం పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయబాబు, దిశ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, సీఈఓ మారుపాక నగేష్, ఎంపీడీఓ ఎ¯ŒS.రవి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.