Priyanka Chopra
-
ఎంత పెద్ద స్టార్ అయినా ఓ బిడ్డకు తల్లి అయితే ఇంతేగా..!: ప్రియాంక చోప్రా
పిల్లలను నిద్రపుచ్చడానికి తల్లులు పడే పాట్లు ఇన్నీ అన్నీ కావు. అల్లరి బిడ్డ నిద్రలోకి జారుకుంటే ఆ తల్లి ఆనందం ఇంతా అంతా కాదయా! ఇలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా ఈసారి తన సరికొత్త పోస్ట్‌లో స్వాతంత్య్ర వేడుకల గురించి మాట్లాడింది!. నిద్రిస్తున్న తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రియాంక. ‘మీ సూపర్ యాక్టివ్ బేబీ నిద్రపోతుంటే’ అని ప్రియాంక ఈ వీడియోను పరిచయం చేసింది. దీంతోపాటు లాఫింగ్ ఇమోజీని కూడా షేర్ చేసింది. కొన్ని సెకన్ల తరువాత టామ్, జెర్రీ డ్యాన్స్ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో పాట వినిపిస్తుంది. ఈ వీడియోకు ‘ఆజాదీ’ అనే కాప్షన్ ఇచ్చింది. కూతురు అల్లరి చేయకుండా హాయిగా నిద్రపోవడమే... తనకు స్వాతంత్య్ర వేడుక!.(చదవండి: 'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణవివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై.. ) -
Priyanka Chopra: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..!
బాలీవుడ్ ప్రసిద్ధ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఫ్యాషన్, నటనల పరంగా సాటిలేరవ్వరూ. తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించి, వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఆమెకు చిన్న సంఘటనకు కూడా కన్నీళ్లు(cry) ధారాళంగా వచ్చేస్తాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పైగా ఆపడం తన తరం కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. నిజానికి ప్రియాంక భావోద్వేగాలను హ్యాండిల్ చేయగలదు. వాటి విషయంలో భయపడదు కానీ, బాధ కలిగించే సంఘటనలు జరిగితే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయని చెబుతోంది. అస్సలు ఇలా ఎందుకు జరుగుతుంది. కొందరూ అస్సలు ఏడుపుని బయటకి వ్యక్తం చెయ్యరు. మరికొందరు మాత్రం కళ్ల కిందే నీళ్ల కుండ పెట్టుకున్నట్లుగా వలవల ఏడ్చేస్తుంటారు ఎందుకని..? అంటే..మన శరీరం భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన మార్గమే ఏడుపు అని చెబుతున్నారు మానసిక నిపుణులు(Psychologist). అయితే కొందరూ అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటివాళ్లు తమ భావోద్వేగాలని ఆపుకోలేరు. దీంతో సులభంగా కనుల నుంచి నీళ్లు కుండపోత వాన వచ్చినట్లుగా వచ్చేస్తుంటాయి ఇలా ఎందకంటే..సున్నితమైన భావ్వోద్వేగం..అధిక సున్నితమై భావోద్వేగ కలవారు చాలా సులభంగా కన్నీళ్లు పెట్టేస్తుకుంటారట. వారి భావోద్వేగాలు ఇట్టే బయటపడిపోతాయట. దీంతో ఇలాంటి వ్యక్తులు తన భావోద్వేగం తగ్గేంత వరకు ఏడుస్తూనే ఉంటారట. ఒత్తిడి కారణంగా..ఒత్తిడి, ఆందోళన కారణంగా మనసు బరువు ఎక్కువైపోయి ఉంటే ఒక్కసారిగా ఏడుపు రూపంలో అది వ్యక్తమవుతుందట. దీన్ని ప్రెషనర్ కుక్కర్‌తో పోల్చి చెప్పొచ్చని అంటున్నారు. అంతేగాదు మనస్తత్వ శాస్త్రవేత్తలు భావోద్వేగాలతో మనసు నిండిపోయినప్పుడూ దాన్ని శరీరం ఏడుపు రూపంలో ఇలా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు. హార్మోన్ల వల్ల...హార్మోన్ల మార్పులు కూడా కన్నీటిని గణనీయంగా ప్రభావితం చేస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో, వ్యక్తులు ఏడుపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు తమ రుతు చక్రాల సమయంలో అధిక భావోద్వేగాలను అనుభవిస్తారు.నిద్ర లేమి, మానసిక ఆరోగ్యంనిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను బలహీనపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యక్తులు చిన్నదానికి కూడా అతిగి రియాక్ట్ అయ్యి కన్నీళ్లు కార్చేస్తారని చెబుతున్నారు. కొందరికి రోజువారీగా ఏడుపు ఏదో రూపంలో వస్తే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.ఏడుపు ఆరోగ్యకరమైనదేనా?భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఏడుపు అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన మార్గం. భావాలను అణచివేయడం కంటే ఏడవడమే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల గుండెల్లో భారం తగ్గి ప్రశాంతంగా ఉంటారట. అయితే, ఏడుపు అధికంగా లేదా అదుపు చేయలేనిదిగా మారితే మాత్రం అతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. సరైన మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని సూచిస్తున్నారు. (చదవండి: -
బామ్మర్ది పెళ్లిలో సాంగ్ పాడిన నిక్ జోనాస్.. ప్రియాంక చోప్రా డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గ్రాండ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకల్లో తన ముద్దుల కూతురు మాల్టీ మేరీకో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా ఇవాళ జరిగిన బరాత్ వేడుకల్లో తన భర్త, సింగర్ నిక్ జోనాస్లో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఈ వేడుకల్లో ప్రియాంక నీలిరంగు లెహంగాలో అందంగా కనిపించగా.. నిక్ జోనాస్ తెల్లటి షేర్వానీ ధరించి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.అంతకుముందు జరిగిన సంగీత్ వేడుకల్లో నిక్ జోనాస్ పాట పాడారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ బామర్ది పెళ్లిలో బావ అద్భుతమైన ఫర్మామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా.. తన ప్రియురాలు, నటి నీలం ఉపాధ్యాయను పెళ్లాడనున్నారు. మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) -
ఆ... భరణం అచ్చం అలాగే!
సినిమా తారలు ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వారు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను అంతా ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. అత్యంత ఖరీదైన ఆ డ్రెస్సులు, ఆభరణాలు వారిని మరింత ప్రత్యేకంగా చూపుతుంటాయి. యునిక్‌గా కనిపించే వాటిని అచ్చం అలాగే తయారు చేయించుకోవడమే కాదు మార్కెట్లోనూ ఆ రెప్లికా డిజైన్స్ లభిస్తుంటాయి. ఆభరణాలలో కనిపించే ఈ ట్రెండ్స్ వివాహ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురువారం తన సోదరుడు సిద్ధార్థ్ మెహందీ వేడుకలో పది కోట్ల రూపాయలకు పైగా విలువైన బల్లారి నెక్లెస్‌ను ధరించి, అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ మధ్య నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలో కోట్ల ఖరీదైన పచ్చల హారాన్ని ధరించింది.వేడుకలలో స్టార్ సెలబ్రిటీలు ధరించే జ్యువెలరీ ధర కోట్లలో ఉంటుంది. అంత ఖరీదు మనం పెట్టలేం, అలాంటి డిజైన్ని పొందలేం అని ఈ రోజుల్లో వెనకంజ వేయనక్కర్లేదు. కొన్ని రోజులలోనే అలాంటి డిజైన్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలు ధరించిన ఆభరణాల రెప్లికా డిజైన్స్ రూ.1500 నుంచి పది వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) మెరుపు తగ్గకుండా! ఇమిటేషన్, వన్‌గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్.. ఆభరణాలను కొత్తగా ఉంచడానికి వాటిని శుభ్రంగా ఉంచాలి. ఆభరణాన్ని వాడిన ప్రతిసారి మృదువైన, పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి. దీనివల్ల మురికి, చెమట తొలగిపోతాయి ఆభరణాల నాణ్యతను కాపాడుకోవడానికి సరైన విధంగా భద్రపరచుకోవాలి. తక్కువ ఖరీదు అనో, టైమ్ లేదనో.. అన్నింటినీ ఒకే బాక్స్‌లో పెట్టేస్తుంటారు. బీడ్స్, స్టోన్స్‌పై గీతలు పడకుండా, పాడవకుండా ఉండాలంటే ప్రతి ఆభరణాన్ని ప్రత్యేక కంపార్ట్మెంట్లలో ఉంచాలి ఏ కాస్త తేమ ఉన్నా ఆభరణాల రంగు మారుతుంది. ఆభరణాలను ఉంచే పెట్టెలో అదనపు తేమను గ్రహించడానికి మీరు సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించవచ్చు పెర్ఫ్యూమ్లు, లోషన్లు ఉపయోగించిన తర్వాతనే ఆభరణాలను అలంకరించుకోవాలి. లేదంటే వాటిలోని రసాయనాలు ఆభరణాలను మసకబారిస్తాయి ∙ఆర్టిఫిషియల్ ఆభరణాలలో ఒకేరకాన్ని తరచూ ధరించకూడదు. దీనివల్ల ఆ ఆభరణం త్వరగా రంగుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఆభరణాలలో ఏదైనా నష్టం గమనించినట్లయితే, వెంటనే మరమ్మతు చేయించాలి. వదులుగా ఉన్న రాళ్ళు లేదా విరిగిన వాటిని సకాలంలో గమనించినట్లయితే సులభంగా మరమ్మతు చేయవచ్చు. ఈ ఆభరణాలను బాగు చేసే షాపులు కూడా ఉంటాయి. వాటి ద్వారా నగను మరో రూపంగా కూడా మార్చుకోవచ్చు.బీడ్స్ .. చోకర్స్ఇప్పుడు వివాహ వేడుకలలో ట్రెండ్‌లో ఉన్నవి బీడ్స్, చోకర్స్. అన్నిరకాల బీడ్స్ లేయర్లుగా ఉన్నవి బాగా ఇష్టపడుతున్నారు. శారీ, డ్రెస్ కలర్‌కు మ్యాచింగ్ బీడ్స్ హారాలు, చోకర్స్ బాగా నప్పుతుంటాయి. వీటికి గోల్డెన్ బాల్స్, స్టోన్స్ లాకెట్స్ జత చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. వేడుకలలో ఆకర్షణీయంగా కనిపించాలి, ఫొటో, వీడియోలలో అందంగా కనిపించాలనుకునేవారు వీటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. బంగారం ధరలు బాగా పెరిగిపోవడం, ప్రతీ వేడుకకు కొత్త హారం కావాలనుకోవడం వల్ల కూడా ఇలాంటివాటికి బాగా డిమాండ్ ఉంటోంది.ఫోటో సెండ్ చేస్తే... ఆభరణం తయారీ..ఎంత గ్రాండ్ డిజైన్ అయినా, సెలబ్రిటీలు వేసుకున్న ఆభరణాలైనా.. నచ్చిన డిజైన్ ఫోన్లో ఫోట్ సేవ్ చేసుకొని, మాకు ఇస్తే ఆర్డర్ మీద ఆ డిజైన్ని తయారుచేసి ఇస్తుంటాం. వివాహ వేడుకలలో హైలైట్‌గా నిలిచే రెప్లికా డిజైన్స్, బీడ్ జ్యువెలరీని మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నాం. స్టోన్స్, బీడ్స్, వడ్డాణం, చేతి పట్టీలూ.. పూర్తి సెట్ వారి పెళ్లి శారీ కలర్ కాంబినేషన్ బట్టి తయారుచేయించుకుంటున్నారు. సంప్రదాయ వేడుకలలో ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ ఎంపికే ముందు వరసలో ఉంటుంది. – ఎల్.పద్మ, ఇమిటేషన్ జ్యువెలరీ మేకర్, హైదరాబాద్ (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.ఈ నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్, పెట్స్ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు. అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. (బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించిందిమరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి కూడా ప్రభావితమయ్యారు. ప్రియాంక పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు. ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!) -
మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఈ అరుదైన ఫోటోలు చూశారా?
-
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
-
ప్రియాంక చోప్రా స్టైలిష్ లుక్ : విలువ రూ. 20 లక్షలు!
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించిప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీనుంచి బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగింది. తరువాత హాలీవుడ్ దాకాఎదిగి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకుంది. తాజాగా ముంబై ఈవెంట్లో స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరిసింది ప్రియాంక చోప్రా. ఆమె మొత్తం ఔట్ఫిట్ ధర ఏకంగా రూ. 20 లక్షలట. దీంతో ధరించిన డ్రెస్, నగలు, హీల్ ఇలా ప్రతీదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్లో కాస్త సన్నగా తయారైన ఆమె అందరినీ ఆకర్షించడమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ప్రియాంక చోప్రా ధరించిన అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వివియన్ వెస్ట్వుడ్కు చెందిన డ్రెస్ ఖరీదు ధర రూ. 2.26 లక్షలు. అలాగే ఆమె ధరించిన క్రిస్టియన్ లౌబౌటిన్ హీల్ ధర 71 వేల రూపాయలు. ఆగండి ఆగండి ఇంకా ఉంది. ప్రియాంక చోప్రా Bvlgari బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో ఆమె ధరించిన Bvlgari బ్రాండ్, రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ ధర రూ. 7.6 లక్షలు. ఇక డైమండ్ చెవిపోగులు ధర తొమ్మిది లక్షలని ఫ్యాన్స్ అంచనా.ఇదీ చదవండి: అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయంవిదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రియాంకకు దేశంపై ఉన్న ప్రేమ పాత్ర అపారం. తన కిష్టమైన గేట్‌వే అంటూ ఒక వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అలాగే తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా ప్రాంతీయ సినిమాల్లో ముఖ్యమైన చిత్రాలకు సపోర్ట్ చేస్తోంది. నిర్మాతగా మరాఠీ-భాషా డ్రామా చిత్రం పానీకి సంబంధించిన ప్రచార కార్యక్రమానికి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తన తల్లి మధు చోప్రా , కొత్త పెళ్లికొడుకు, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలిసి పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
-
కూతురి కోసం ప్రియాంక చోప్రా ఏం చేసిందంటే?
బాలీవుడ్ నటి, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల తన సోదరుడి ఎంగేజ్మెంట్ వేడుకలకు హాజరైంది. ముంబయిలో జరిగిన సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పోస్ట్ చేసింది.అయితే హాలీవుడ్ సింగర్ నిక్‌జోనాస్‌ను పెళ్లాడిన ప్రియాంక చోప్రాకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. ఇండియా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన కూతురి ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా తన కూతురి పేరుతో ఇన్‌స్టా అకౌంట్ పేరును పంచుకుంది.తన కుమార్తె మాల్టీ మేరీతో ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. కూతురి పేరుతో ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది.కాగా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం పానీ అనే మరాఠీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా హెడ్స్ ఆఫ్ స్టేట్‌లో అనే మూవీలో నటిస్తున్నారు. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ది బ్లఫ్ మూవీలో ప్రియాంక కనిపించనున్నారు. -
నటి ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ చిత్రసీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక వెనుదిరిగి చూడకుండా బాలీవుడ్, హాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉండే నటిగా పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు గ్లోబల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ముంబైలో తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకలలో తళుక్కుమంది. ఆ వేడుకలో ఆమె ధరించిన చీర, ఆభరణాలు హైలెట్‌గా నిలిచాయి. డిజైనర్ మనీష్ మల్హోత్రా 9 గజాల బెర్రీ-హ్యూడ్ షిఫాన్ చీరను ధరించింది. ఆ కాస్ట్యూమ్‌కి తగ్గట్టుగా బల్గారీ బ్రాండ్‌కి చెందిన అద్భుతమైన ఆభరణాలతో మెరిశారు. ఐకానిక్ రోమన్ జువెలరీ మైసన్కి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక, లగ్జరీ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్‌కి చెందిన ఆభరణాలను ధరించింది. సర్పెంటైన్ కలెక్షన్ నుంచి డైమండ్ బ్రాస్ లెట్, వింటేజ్ ముత్యాల నెక్లెస్ ను ఎంచుకుంది. సర్పెంటీ వైపర్ బ్రేస్ లెట్‌గా పిలిచే ఈ బ్రేస్లెట్ మొత్తం డైమండ్స్‌తో కూడిన 18 క్యారట్ వైట్ గోల్డ్ సెట్లో వన్ కాయిల్ డిజైన్‌ను కలిగి ఉంది. అధికారిక బల్గారి వెబ్సైట్ ప్రకారం దీని విలువ అక్షరాలా 30,79,000/- పలుకుతుందట. అలాగే ముత్యాల నెక్లేస్ ధర అంతకు మించి అన్న రేంజ్లో ఉంది. హై జ్యువెలరీ పెర్ల్, రూబీస్, వైట్ గోల్డ్ ,డైమండ్స్‌లో కూడిన ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 8 కోట్లు పలుకుతుందట. ఆమె ఇలా లగ్జరీ ఆభరణాలు ధరించడం మొదటిసారి కాదు. ఇంతకుమునుపు బల్గారీ బ్రాండ్ 140వ వార్షికోత్సవంలో అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించి వార్తల్లో నిలిచింది. ఆ వేడుకలో ప్రియాంక సర్పెంట్ ఏటర్నా నెక్లస్‌ని ధరించింది. ఈ నెక్లస్‌ని రూపొందించడానికి ఏకంగా 2,800 గంటలు పట్టిందట. అంతేగా 140 ఏళ్ల వార్షికోత్సవానికి ప్రతీకగా 140 క్యారెట్లతో కూడి అత్యంత బరువున్న వజ్రం, ప్లాటినమ్, పియర్ ఆకారంలోని డైమండ్లతో తీడైమన్షనల్ వేవ్ స్ట్రక్చర్‌లో తీర్చిదిద్దారు కళాకారులు. (చదవండి: 102 ఏళ్ల బామ్మ సాహసం..ఏకంగా ఏడువేల అడుగుల ఎత్తు నుంచి..) -
దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!
దేశీ అమ్మాయి కాస్త ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అక్కడి నుంచి మొదలైన ఆమె విజయపరంపర ప్రభంజనంలా దూసుకుపోయింది. నటిగా మెప్పించి అందరీ అభిమానాన్ని పొందింది. అందివచ్చిన ప్రతి అవకాశన్ని అందిపుచ్చుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా మహిళ హక్కుల గురించి విరుచుకుపడేది. అదే ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైనలో శక్తిమంతమైన మహిళగా నిలబెట్టింది. పైగా తన కళా నైపుణ్యంతో మహిళ సాధికారతనకు అసలైన నిర్వచనం ఇచ్చింది. ఎవరామె అంటే..ఆ మహిళ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. సాధాసీధా దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ ఐకాన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించికుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనలోని కొత్త వెర్షన్‌ని పరిచయం చేసింది. ఒక కూతురిగా, సోదరి, భార్య, తల్లిగా ఇలా అన్ని రోల్స్‌కి సమన్యాయం చేసింది. 2000లో మిస వరల్డ్ పోటీలో సాధించిన గెలుపుతో మొదలైన ఆమె ప్రస్తానం వెనుతిరిగి చూడాల్సిన పనిలేకుండా..విజయపరంపరతో దూసుకుపోయింది. అలాగే బాలీవుడ్లో కెరీర్‌ను మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో వేలాదిమంది అభిమానుల మనుసును గెలుచుకుంది. అక్కడి నుంచి హాలీవుడ్లో ప్రవేశించి తన కెరియర్ని నిర్మించుకుంది. అలాగే ప్రియాంక నటించిన అంతర్జాతీయ వెబ్ సిరీస్ క్యాంటికో ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలా ఆమె గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకుంది.2018లో విదేశీయుడు జోనాస్‌ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో ఉండే సాంప్రదాయ మూస పద్ధతులన్ని బద్దలు గొట్టింది. ఆ తర్వాత సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొంది..దానిపై ఉండే అపోహలను దూరం చేసింది. ఆమె తన నటనకు గానూ పద్మశ్రీ అందుకుంది. అలాగే యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలయ్యింది.అంతేగాకుండా ఫోర్బ్స్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఆమె ఒకరిగా నిలిచింది. ప్రియాంక తరుచుగా లింగ సమానత్వం, విద్య, మహిళల హక్కులపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. అలాగే పలు టాక్ షోలు, ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను చెప్పేందుకు వెనకాడలేదు. అంతేగాదు బాలీవుడ్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి, రావాల్సిన మార్పు గురించి మాట్లాడుతుంది. మహిళలు జీవించే ప్రపంచం ఉండకూడదు, మహిళలు అభివృద్ధి చెందే ప్రపంచం ఉండాలని నర్మగర్భంగా చెబుతుంది. అలాగే సరళమైన పదాల్లో స్త్రీల హక్కులు లేనందున స్త్రీవాదం అవసమరమయ్యిందని తనదైన శైలిలో కౌంటరిస్తుంటుంది. ఆధునిక మహిళకు ప్రియాంక ఓ స్ఫూర్తి. తను ఎంచుకుని తీసే సిమాలలో అత్యంత శక్తిమంతమైన మహిళల పాత్రలతో సమాజానికి ఇవ్వాల్సిన సందేశం ఇస్తుంటుంది. అంతేగాదు తప్పు చేయడం మానవ సహజం దాన్నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానమైనదని అంంటోంది. ఆమె అచంచలమైన శక్తి, అంకితభావం, సాధికారతకు ప్రియాంక నిలువెత్తు నిదర్శనం. ఓ స్త్రీగా ఏమేమో చేయొచ్చొ చేసి చూపించింది అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!) -
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయ అక్కర్లేని పేరు. బీ టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించిన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.తాజాగా రోమ్‌లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించింది. దీంతో అందరి కళ్లు ప్రియాంక నెక్లెస్‌పైనే పడ్డాయి.ఇంతకీ ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లెస్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రియాంక వేసుకున్న నెక్లెస్‌ను 140 క్యారెట్ల డైమండ్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం డైమండ్ నెక్లెస్ దాదాపు రూ.358 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఆ నెక్లెస్ రూపొందించడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అత్యంత ఖరీదైన నెక్లెస్‌లో ఇది ఒకటిగా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక హాలీవుడ్ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో ఆమె చివరిసారిగా 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె అలియా భట్, కత్రినా కైఫ్‌తో కలసి జీ లే జరా అనే సినిమాలో కనిపించనుంది. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) -
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్లో నా కెరీర్ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్ హీరోయిన్ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. -
స్టార్ హీరోయిన్ సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్‌కి ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది. వధువు ఎవరంటే.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో కనిపించింది. View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ మీరా చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా తన ప్రియుడు రక్షిత్‌తో ఏడడుగులు వేసింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన మీరా.. ఈ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌కు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మీరా అభిమానులు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం మీరా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తెలుగువారికి సైతం సుపరిచితులైన మీరా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.కాగా.. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) -
మిస్ వరల్డ్: ఈ స్టన్నింగ్ ఇండియన్ బ్యూటీల గురించి తెలుసా?
అందరమూ కలలు కంటాం. వాటిల్లో కొన్ని చాలా పెద్దవి,చాలా చిన్నవి. చిన్నదైనా పెద్దదైనా ఆ కలను నేర్చుకునే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. కలలను సాకారం చేసుకునే అదృష్టం కొంతమందికే సాధ్యం. అందులోనే చాలా ప్రత్యేకమైంది అయితే ఆ జర్నీ చాలా కష్టం. ఇక, బ్యూటీ, మోడలింగ్ రంగంలో అమ్మాయిలు రాణించాలంటే నిజంతా అది కత్తి మీద సామే. అలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ సుందరీమణులుగా,విజేతలుగా నిలిచారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టారు. తాజాగా మిస్ వరల్డ్ 2023 సంబరాలకు ఇండియా వేదిక కానుంది. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌తో ఈ పోటీలు ఘనంగా నిర్వహించనుంది. ప్రతీ ఏడాది వివిధ దేశాల్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో మిస్ వరల్డ్ ఈవెంట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎపుడు నిర్వహించారో తెలుసా? యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ 1951లో ఈ పోటీలకు నాంది పలికారు. ఇంగ్లీషు టెలివిజన్ వ్యాఖ్యాత ఎరిక్ డగ్లస్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీ , కమ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టారు. 1978ల ఆయన నిష్క్రమించడంతో అతని భార్య బ్యూటీ క్వీన్ జూలియా మిస్ వరల్డ్ పోటీలను కొనసాగించింది. 82 ఏళ్ల వయసులో మోర్లీ 2000లో మరణించాడు. అతని భార్య, జూలియా మోర్లీ ఛైర్మన్‌గా ఉండగా కుమారుడు స్టీవ్ డగ్లస్ దాని సమర్పకులలో ఒకరుగా ఉన్నారు. లండన్‌లోని లైసియం బాల్రూమ్లో తొలి మిస్ వరల్డ్ టైటిల్‌ను మిస్ స్వీడన్, కికీ హాకోన్సన్ కైవసం చేసుకుంది. మన ముద్దుగుమ్మలు తమ అందానికి, సంకల్పాన్ని, తెలివితేటల్ని, జోడించి ఆరు సార్లు జగజ్జేతలుగా నిలిచారు. రీటా ఫారియా రీటా ఫారియా పావెల్ ఒక డాక్టర్. మోడలింగ్ రంగంలో రాణిస్తూ 1966లో మిస్ వరల్డ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. తొలి ఆసియా , భారతీయ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి బ్యూటీ రంగంలో ఇండియాలో పేరును సమున్నతంగా నిలిపింది. మరియు ముంబైలో గోవా తల్లిదండ్రులకు జన్మించింది. వైద్య శిక్షణ పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత ఆమె. ఏడాది పాటు మిస్ వరల్డ్‌గా ఉన్న ఆమె సినిమా ఆఫర్లను తిరస్కరించి వైద్య వృత్తికి అంకితమైంది. 1971లో, తన గురువు డేవిడ్ పావెల్‌ను వివాహం చేసుకుంది. ఐశ్వర్య రాయ్: ప్రపంచంలోనే అందాలరాణిగా నిలిచిన ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుని యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. రెండు ఫిల్మ్‌ఫేర్ నామినేషన్లతో సహా వివిధ అవార్డులును దక్కించుకుంది. అలాగే 2009లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని ,2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్‌ను గెల్చుకుంది. డయానా హేడెన్: మోడల్, నటి డయానా హేడెన్ 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ మహిళ. అంతేకాదు ఈ పోటీల్లో మూడు సబ్ టైటిల్స్‌ను గెల్చుకున్న ఏకైక మిస్ వరల్డ్ కూడా యుక్తా ముఖి: మిస్ ఇండియాగా నిలిచిన నాల్గో భామ యుక్తా ఇంద్రలాల్ ముఖి. 1999లో మిస్ వరల్డ్ టైటిల్‌తోపాటు 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. మోడల్‌గాను, కొన్ని హిందీ సినిమాల్లోనూ కనిపించింది. ప్రియాంక చోప్రా : 2000లో మిస్ వరల్డ్ 2000 విజేత ప్రియాంక చోప్రా, మోడల్‌గా, హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా తన సత్తాను చాటుకుంటోంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు గౌరవాలను గెలుచుకుంది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను నటి , మోడల్ మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె తన సొంత రాష్ట్రం హర్యానాకు ప్రతినిధిగా పోటీ పడి, గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారతీయురాలిగా నిలిచింది. చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్రతో ఆమె తొలిసారిగా నటించింది. -
డీప్ ఫేక్.. మరో స్టార్ హీరోయిన్ వీడియో వైరల్!
యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కత్రినా కైఫ్,అలియా భట్, కాజోల్ ఫోటోలు సైతం నెట్టింట వైరలయ్యాయి. దీంతో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కడో ఒక చోట వైరలవుతూనే ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ బారిన పడింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా.. అందులోని వాయిస్‌ను మార్చి వైరల్ చేశారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్ సింక్ అయ్యేలా క్రియేట్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్లు రూపొందించారు. ఓ బ్రాండ్ ప్రకటనతో 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ ఆ బ్రాండ్‌నే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ముంబై ఈవెంట్లో మెరిసిన ప్రియాంక.. వాచ్ ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడింది. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2023 హాజరైంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఫెస్టివల్లో ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తన భార్య ఫోటోలు చూసిన నిక్ జోనాస్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!) జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభింంచిన ప్రియాంక చోప్రా అనంతరం ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి అధికారిక అధ్యక్షురాలిగా హోదాలో అడుగుపెట్టారు. అద్భుతంగా డిజైన్ చేసిన గౌను ధరించి.. రెడ్ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈవెంట్లో బాలీవుడ్ భామ ధరించిన లగ్జరీ వాచ్‌పైనే అందరి దృష్టి పడింది. ఆమె వాచ్ విలువు దాదాపు రూ.1.5 కోట్ల విలువైనదిగా తెలుస్తోంది. ప్రియాంక ధరించిన వాచ్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్‌తో తయారు చేసినట్లు సమాచారం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ముంబై చేరుకుంది ప్రియాంక. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు సోనమ్ కపూర్ అహుజా, రిచా చద్దా, అలీ ఫజల్, దియా మీర్జా, షానయా కపూర్, డయానా పెంటీ లాంటి బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. కాగా.. ముంబయిలో జరుగుతున్న ఈ వేడుక అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. (ఇది చదవండి: శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ.. ఆ తర్వాత హాలీవుడ్‌కు మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ప్రేమవివాహాం చేసుకుంది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరుగుతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. చెల్లి పెళ్లికి అక్క ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న ప్రియాంత చోప్రా రాకపోవడం ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. మొదట ఈ వివాహానికి ప్రియాంక వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె పెళ్లి హాజరవ్వకుండా అభిమానులకు షాకిచ్చింది. సంగీత కచేరీకి హాజరు పరిణీతి చోప్రా పెళ్లికి రాని ప్రియాంక కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె తన భర్త నిక్ జోనాస్ సోదరుడు ఫ్రాంక్లిన్ జోనాస్‌తో కలిసి జై వోల్ఫ్ కచేరీలో పాల్గొంది. అయినా చెల్లి పెళ్లికి రాకపోవడమేంటని ప్రియాంక తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Bushra Khan 🇧🇩 (@b.khanfident) -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్‌లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్‌లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ బాష్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా సందడి చేసి మెప్పించిన ఎన్టీఆర్ తాజాగా 'దేవర'గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ - కొరటాల శివ రాకింగ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నన్ను చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు.. రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి) ఈ ప్రాజెక్ట్ తర్వాత, ఎన్టీఆర్ తన 31వ సినిమా కోసం ప్రశాంత్ నీల్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రం చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిధ్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీపై మరో క్రేజీ బజ్ నెలకొంది. తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. అయితే, ఇంతకు ముందు ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. చివరకు ప్రియాంక కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక, తారక్ జోడి అయితే బాగుంటుందని మేకర్స్ అంచనా వేశారట. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: Bhola Sankar Movie: స్కెచ్ అదిరింది, చిరంజీవికి బాలకృష్ణ జై కొడతాడా?) -
ఇండియాకు ప్రియాంక చోప్రా.. అలా రావడం తొలిసారి!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. అక్కడ రాజకీయాలు భరించలేకే హాలీవుడ్‌కు మారిపోయానని తెలిపింది. అయితే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా కూతురు, భర్తతో కలిసి తొలిసారిగా ఇండియాకు ప్రియాంక చోప్రా వచ్చారు. నిక్ జోనాస్, ప్రియాంక కుమార్తె మాల్తీ మేరీ శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కోసం వారు ముంబయికి వచ్చినట్లు సమాచారం. కాగా.. తన కూతురు మాల్తీని భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. ఇటీవలే జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. MY NEICE , MY CUTEST HOOMAN YALL 🥹❤️❤️❤️ LOVE OF MY LIFE 🥹🥹❤️❤️ MM is truly her mothers daughter 🫶🫶 my god🥹🥹 #PriyankaChopra pic.twitter.com/oCz874XKbe — k. (@karishmaokay) March 31, 2023 -
నన్ను ఓ మూలన పడేశారు.. అందుకే తప్పుకున్నా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రియాంక చోప్రా వెల్లడించింది. బాలీవుడ్లో తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని తెలిపింది. దీనికి కారణం తాను అభద్రతాభావానికి గురి కావడమేనని పేర్కొంది. కాగా.. ప్రియాంక చోప్రా 2015 టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించిన తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'తనను బాలీవుడ్లో ఓ మూలన పడేశారు. అంతేకాకుండా కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. బాలీవుడ్ రాజకీయాలతో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది. అందుకే అమెరికా వచ్చేశా.' అని ప్రియాంక వివరించింది. ఆ సమయంలోనే తన మేనేజర్ అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను చూసి యూఎస్‌లో పనిచేసే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పింది. మ్యూజిక్ కెరీర్ సక్సెస్ కాకపోతే సినిమాల్లో ప్రయత్నించి చూడాలని ఒకరు సూచించారని ప్రియాంక తెలిపింది. అందుకే క్వాంటికోలో నటించానని చెప్పింది. ఆ తర్వాత బేబీవాచ్, మ్యాట్రిక్స్, రెవల్యూషన్స్, ద వైట్ టైగర్‌లో అవకాశాలను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. త్వరలో సిటాడెల్ సెకండ్ షోతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక నటించిన లవ్ ఎగైన్ అనే సినిమా మేలో విడుదల కానుంది. గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక.. నిక్ జోనస్‌ను 2018 డిసెంబర్లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆమె రిచర్డ్ మాడెన్‌తో పాటు గూఢచారి పాత్రలో నటించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. -
ప్రియాంక చోప్రాకు ఉపాసన థ్యాంక్స్.. పోస్ట్ వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో ఫుల్ బిజీ ఉన్నారు. తన భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంకతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అమెరికాలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పలువురు తారలు మెరిశారు. సౌత్ ఏషియన్ ఎక్స్‌లెన్స్ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకతో దిగిన ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఉపాసన ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘‘లాస్ ఏంజెల్స్ ఫ్యామిలీ.. ఎల్లప్పుడూ మాకోసం ఉన్నందుకు థ్యాంక్యూ ప్రియాంక' అని పోస్ట్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ సందడి చేయనుంది. ప్రియాంక ఇచ్చిన పార్టీలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు ప్రీతిజింటా, జాక్వెలిన్ తదితరులు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఆ వేడుక ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, ‘నాటు నాటు’ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ప్రియాంకతో ఫొటోలు దిగారు. ‘మగధీర’ తర్వాత రామ్‌చరణ్ - ప్రియాంక చోప్రా కలిసి ‘తుపాన్’ అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. అప్పటి నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. -
ప్రత్యేక జెట్‌లో నిక్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రియాంక చోప్రా గ్రాండ్ విషెష్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇచ్చింది. అతని పుట్టినరోజు వేడుకలను ఏకంగా ప్రత్యేక జెట్‌లో ప్లాన్ చేసింది. ఇవాళ నిక్ 30వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బర్త్‌డే వేడుకల కోసం ప్రైవేట్ జెట్‌ను వేదికగా మార్చింది. ఈ సందర్భంగా సింగర్ నిక్ జోనాస్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక చోప్రా స్పెషల్ జెట్‌లో కూర్చొని భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. వేడుకలకు ముందు ప్రియాంక తన హ్యాండిల్‌పై ఫోటోను కూడా పంచుకుంది. (చదవండి: Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది) కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఓ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం కూడా చేశారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra Shares Her Daughter Malti First Pic: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనస్‌లు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడు బేబీ బంప్‌తో కనిపించని ప్రియాంక ఆకస్మాత్తుగా తల్లైనట్లు ప్రకటించడం అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సరోగసి ద్వారా వారు తల్లిదండ్రులు అయినట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. చదవండి: మదర్స్‌డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్ అంతేగాక ఇటీవల తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్తీ 100 రోజులకు పైగా హాస్పిటల్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. చదవండి: 'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్! లాస్ ఎంజల్స్లోని పిల్లల హాస్పిటల్లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు తమ కూతురు పూర్తి ఆరోగ్యం ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్‌పై పులువురు బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ వారు సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రితీ జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక ఆరోరాలు కామెంట్స్ చేస్తూ లవ్ ఎమోజీతో ప్రియాంక, నిక్ దంపతుల కూతురు మల్తీకి స్వాగతం పలికారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్..
Priyanka Chopra Get Angry For Calling Her Nick Jonas Wife: గ్లోబల్ స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం తన రాబోయే హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' ప్రమోషన్లో బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక ఓ వార్తా కథనంపై విరుచుకుపడింది. ఇంకా అలా ఏన్నాళ్లు రాస్తారు అని మండిపడింది. మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఒక వెబ్సైట్ తన వార్తా కథనంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ భార్యగా ప్రస్తావించడం (గుర్తింపు ఇవ్వడం) ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తా కథనాన్ని తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 'మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రాన్ని నేను ప్రమోట్ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్ ఆఫ్..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్‌ని నా బయోకు జోడించాలా ?' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ను కూడా ట్యాగ్ చేసింది. ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తాను నటించిన 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రియాంక అధికారికంగా ప్రారంభించింది. 'మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక 'సిటాడెల్' సినిమాతోపాటు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఒక బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్, అలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది ప్రియాంక జోనాస్. -
నిక్ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వచ్చిన వార్త షికారు కొట్టిన సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఈ వార్తపై తెగ చర్చ జరిగింది. ఇందుకు కారణం ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో నిక్ జోనాస్ పేరు తొలగించడమే. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ వార్తలను ఖండించింది ప్రియాంక తల్లి మధు చోప్రా. అవన్ని వట్టి పుకార్లే అని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది ప్రియాంక. ఇదీ చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? తాజాగా ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్ జొనాస్‌ను తన కామెంట్లతో ఓ ఆట ఆడేసుకుంది. నిక్ జొనాస్‌కు, ఆయన సోదరుల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తనకే ఉన్నారని తెలిపింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్ బ్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: కూతురి విడాకుల వార్తలపై మధు చోప్రా స్పందన 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడు నిక్. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పితే, సక్సెస్ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్ బ్రదర్స్‌ను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక అభిమానులకు గుడ్ న్యూస్.. అదేంటో తెలుసా ?
Priyanka Chopra Shares Her First Look Poster Of Matrix Resurrections Movie: బాలీవుడ్, హాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ది మ్యాట్రిక్స్' సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్'. సినిమాలో ప్రియాంక పాత్ర ఎలా ఉండనుందో ఈ పోస్టర్లో చూపించారు. ఇందులో ప్రియాంక ఎరుపు రంగు ప్యాంటు, నలుపు బూట్లతో బ్లూ కలర్ టాప్ ధరించి ఉన్నారు. ఆమె హేయిర్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో ఎప్పుడూ కనపడే నెంబర్ కోడ్స్ ఎరుపు, నీలం రంగుతో వేవ్స్ రూపంలో ఉండటం చూడొచ్చు. ఈ పోస్టర్‌ను ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ 'ఆమె ఇక్కడ ఉంది. రీ-ఎంటర్' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ ఈ హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక ఎలా ఉండనుందో అని ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రియాంక షేర్ చేసిన 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' థియేటర్ రిలీజ్ పోస్టర్లో కూడా తాను లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ప్రియాంక మీరెక్కడ' అని కూడా ఓ అభిమాని కామెంట్ చేశాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక కళ్లద్దాలు ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాలుగో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 22న ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో పేరు మార్చిన సంగతి తెలిసిందే. చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? -
ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్
సమంత పెళ్లి తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అక్కినేని కోడలు ‘శాకుంతలం’ మూవీని కంప్లీట్ చేసి, విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతు వాకుల్ రెండు కాదల్’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి టు టు టు మ్యూజికల్ వీడియో విడుదలై యూట్యూబ్‌లో ట్రేండింగ్లో ఉంది. తాజాగా ఈ పాటను చూసిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎంతో ఇప్రెస్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంగ్ ఎంతో బావుందని, మూవీ టీంకి కంగ్రాట్స్ తెలిపింది. అంతేకాకుండా దర్శకుడు విఘ్నేష్‌కి పుట్టిన రోజు విషెస్ చెప్పింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఈ పోస్ట్‌ని చూసి.. మీ మాటలు మా మూవీ టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పి, ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పింది. కాగా విఘ్నేష్ శివన్, నయన తార, లలిత్ కుమార్ సంయుక్తంగా ‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాని నిర్మిస్తున్నారు. చదవండి: ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటున్న ప్రియాంక చోప్రా This is super encouraging for us as a team .. Thankyou dear @priyankachopra 🙏❤️🤗🙌 https://t.co/t9jquNPZbr — S (@Samanthaprabhu2) September 19, 2021 -
‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్ 2018లో వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రియాంక తన భర్త నిక్‌పై తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 17న) నిక్ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్. అత్యంత దయ, ప్రేమ ఉన్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యూ బేబీ’ అంటూ ప్రియాంక నిక్‌పై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. చూడచక్కని ఈ జంటను చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ, సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియాంక ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నిక్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా మాట్లాడడు. అతను నన్ను ఎంతో ప్రభావితం చేశాడు. అతని వల్లే మిర్చిలాగా ఘాటుగా ఉండే నేను ఎంతో కూల్‌గా మారిపోయాను’ అని తెలిపింది. కాగా ప్రస్తుతం యూకేలో సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కేవలం భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు అమెరికా వచ్చింది. ప్రస్తుతం ఈ భామ ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్’ అనే హాలీవుడ్ మూవీ నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ది యాక్టివిస్ట్ రియాలిటీ షో: ప్రియాంక చోప్రా క్షమాపణలు
‘ది యాక్టివిస్ట్’.. అమెరికాలో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షో. గ్లోబల్ యాక్లివిస్ట్ సంస్థ రూపొందిస్తుండగా అక్టోబర్ నుంచి సీబీఎస్ ఛానల్లో ప్రసారం కానుంది. సామాజిక అంశాల గురించి సాగే ఈ షో చుట్టూ వివాదాలు రాజుకోవడంతో.. హోస్ట్‌గా చేస్తున్న నటి ప్రియాంక చోప్రా బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పింది. ప్రియాంకతో పాటు సింగర్ ఉషర్, డ్యాన్సర్ జూలియేన్ హగ్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మొత్తం ఆరుగురు పార్టిసిపెంట్స్ పాల్గొంటారు. అందులో కనీసం ముగ్గురు పబ్లిక్ ఫిగర్స్ ఉంటారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తారు. ఇందులో చర్చ జరిగిన తర్వాత వారిచ్చే సూచనలను జీ 20 సమావేశంలో వివరించాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సామాజిక అంశాలను టీవీలోకి షోగా చేయడంపై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై ప్రియాంక చోప్రా స్పందించింది.‘గతవారం నుంచి ఎంతోమంది చేస్తున్న కామెంట్స్ నన్ను బాధపెట్టాయి. ప్రజలకు మంచి చేసే విషయాల కోసం అందరూ చేతులు కలిపితే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎందరో సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది’ అని చెప్పింది. ఇంకా.. ‘మీరు తప్పుగా భావిస్తున్న ఈ షోలో నేను పాల్గొనడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు తెలుసు. దానికి క్షమాపణలు’ అని తెలిపింది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
రూ. 7.5 కోట్లు సేకరించాం: ప్రియాంక దంపతులు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆయా కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి భారత్‌లోని కోవిడ్ బాధితుల కోసం నిధులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 7.5 కోట్లు) సేకరించినట్లు తాజాగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే 3 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఆమె చెప్పారు. ఈ మొత్తం భారతదేశంలో కోవిడ్‌తో బాధపడుతున్న వారికి వెచ్చించాలని ప్రియాంక-నిక్ దంపతులు భావిస్తున్నారు. గివ్ ఇండియా ద్వారా ఈ నిధులను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 7.5 కోట్ల రూపాయల నిధులు సేకరించామని చెప్పారు. ఈ డబ్బును భారత్‌లో ఎలా వినియోగించనున్నారో వివరాలు అడుగుతూ గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సంభాషణను ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫండ్‌ను భారత్‌లో ఆక్సీమీటర్లు అవసరమైన ప్రాంతాల్లో వెచ్చించేలా ప్లాన్ చేస్తున్నట్లు సతీజా చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులో లేవని, వారి కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తామని ఆయన వివరించారు. అదే విధంగా ఆపదలో ఉన్న భారత్‌కు టీకాలు పంపి ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తాను కోరినట్లు ప్రియాంక తెలిపారు. భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తగిన విధంగా ఆదుకోవాలని బైడెన్‌కు వివరించినట్లు కూడా ప్రియాంక పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనస్ ఓ లైవ్ షోలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. తాను తొందరగా కొలుకునేందుకు ప్రియాంక కారణమని, ప్రతి క్షణం తనను కనిపెట్టుకుని అన్ని విధాల సపర్యలు చేసిందని, గొప్ప భార్య అంటూ ప్రియాంక మీద నిక్ ప్రేమ కురిపించాడు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నటి ప్రియాంక చోప్రా. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఆమెరికన్ పాప్ సింగర్ నిక్‌జోనస్‌తో ప్రేమలో పడిన ఈ భామ 2018లో అతడిని వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. తాజాగా ప్రియాంక పెళ్లికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రియాంక వివాహం మొదట దేవొంకే దేవ్ మహదేవ్ అనే హిందీ సీరియల్ నటుడు మోహిత్ రైనాతో చేయాలని ఆమె కుటుంబసభ్యులు భావించారట. ఈ సీరియల్లో శివుడి పాత్రలో కనిపించిన మోహిత్ ప్రియాంకకు సరిజోడి అని ఆమె తల్లి ఫిక్సయిందట. అంతేకాకుండా అతడి గురించి ఎంకర్వ్యైరీ కూడా చేసి ఎంతో మంచివాడని, మోహిత్తోనే ప్రియంకకు పెళ్లి జరిపించాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన వార్త మీడియాలో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మోహిత్‌తో ప్రస్తావించగా..ప్రియాంక అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను సూపర్ స్టార్ అని కొనియాడారు. తాను కేవలం టెలివిజన్ నటుడిని అని, అయినా తన గురించి ప్రియాంక పేరేంట్స్ ఇలా ఆలోచించడం చాలా గొప్పవిషయమని అన్నారు. అయితే తనలాంటి చిన్న వ్యక్తితో ప్రియాంక పెళ్లి ఈ జన్మలో జరగకపోయినా, వచ్చే జన్మలో అయినా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్ ఫర్ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్ చేయగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లోనూ నటిస్తోంది. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
శ్రీదేవి నాకు రోల్‌మోడల్ : ప్రియంక చోప్రా
‘‘మీ రోల్ మోడల్ ఎవరు?’’ అని ఏ హీరోయిన్ని అడిగినా.. శ్రీదేవి పేరు చెప్పనివారు తక్కువమంది ఉంటారు. ఈ అతిలోక సుందరి పేరు చెప్పేవారిలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఇటీవల ఒక హాలీవుడ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ శ్రీదేవి తనకు రోల్ మోడల్ అని ప్రియాంక అన్నారు. శ్రీదేవి గురించి ప్రియాంక చెబుతూ – ‘‘ఆవిడ బ్యూటీ ఐకాన్. శ్రీదేవి కెరీర్‌ని చూస్తూ పెరిగాను. ఫ్యాషన్ పరంగా ఆమె ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. అలాగే సినిమా సినిమాకి తన లుక్స్ మార్చుకుంటూ వచ్చారు. కొత్తగా కనబడడానికి ప్రయత్నించేవారు. శ్రీదేవి కళ్లు అద్భుతంగా ఉంటాయి. చాలా పెద్ద కళ్లు కూడా. హావభావాలను అద్భుతంగా పలికించేవారు. కెరీర్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండేవారు. అందుకే ఆమె నాకు స్ఫూర్తి’’ అన్నారు. -
ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే..
లండన్: ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్ 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్‌ను లండన్‌లో ప్రియాంక- నిక్ జోనాస్ దంపతులు 2021 ఆస్కార్ నామినేషన్ చిత్రాల జాబితాను సోమవారం ప్రకటించారు. 2018లో వచ్చిన బ్లాక్ ఫాంథర్ సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్‌తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్ నుంచి ఆస్కార్‌కు పోటీపడ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్-19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. 2021 ఆస్కార్ నామినేషన్లు - పూర్తి జాబితా ఉత్తమ చిత్రం కేటగిరీ ది ఫాదర్ జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య మాంక్ మినారి నోమాడ్ ల్యాండ్ ప్రామిసింగ్ యంగ్ వుమన్ సౌండ్ ఆఫ్ మెటల్ ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 ఉత్తమ దర్శకుడు కేటగిరీ థామస్ వింటర్బర్గ్, (అనదర్ రౌండ్) డేవిడ్ ఫించర్, (మాంక్) లీ ఐజాక్ చుంగ్, (మినారి) క్లోస్ జావో, (నోమాడ్లాండ్) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ నటుడు కేటగిరీ రిజ్ అహ్మద్, (సౌండ్ ఆఫ్ మెటల్) చాడ్విక్ బోస్మాన్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆంథోనీ హాప్కిన్స్, (ది ఫాదర్) గ్యారీ ఓల్డ్మన్, (మాంక్) స్టీవెన్ యూన్, (మినారి) ఉత్తమ నటి కేటగిరీ వియోలా డేవిస్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆండ్రా డే, (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే) వెనెస్సా కిర్బీ, (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్) ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్, (నోమాడ్‌ల్యాండ్) కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) డేనియల్ కలుయా, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లెస్లీ ఓడోమ్ జూనియర్, (వన్ నైట్ ఇన్ మయామి) పాల్ రాసి, (సౌండ్ ఆఫ్ మెటల్) లాకీత్ స్టాన్ఫీల్డ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) ఉత్తమ సహాయ నటి కేటగిరీ మరియా బకలోవా, (బోరాట్ సబ్సీక్వెంట్ మూవీఫిల్మ్) గ్లెన్ క్లోజ్, (హిల్‌బిల్లీ ఎలిజీ) ఒలివియా కోల్మన్, (ది ఫాదర్) అమండా సెయ్ ఫ్రిడ్, (మాంక్) యుహ్-జంగ్ యూన్, (మినారి) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లీ ఐజాక్ చుంగ్, (మినారి) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్) ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ లవ్ అండ్ మాన్స్టర్స్ మిడ్నైట్ స్కై ములన్ ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్ టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఆన్వర్డ్ ఓవర్ ద మూన్ ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్ సౌల్ వోల్ఫ్ వాకర్స్ (చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. నిరాశలో ఫ్యాన్స్) -
ప్రియాంక వాటిని చాలా మిస్సవుతుందట..
లాస్ ఏంజెల్స్: బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్‌ను ఏలుతూ గ్లోబల్ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. తన ప్రియుడు నిక్ జోనాస్‌కు ఇష్టమైన భారతీయ వంటకంపై, అలాగే తాను లాస్ ఏంజెల్స్‌లో ఉంటూ మిస్ అవుతున్న భారతీయ వంటకాలపై క్లారిటీనిచ్చింది. తాజాగా ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఆమె, ఆమె భర్త జీహ్వకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. ఇంతకీ ఈ ముద్దు గుమ్మ మిస్సవుతున్న వంటకాలేంటో తెలుస్తే షాకవుతారు. ఆమె మిస్సవుతుంది భారతీయ సాంప్రదాయ వంటకాలైన దాల్, రోటీలనట. ఆమె ప్రతిరోజు వీటిని చాలా మిస్సవుతున్నట్లు వెల్లడించింది. ఇక తన భర్త నిక్కు ఇష్టమైన భారతీయ వంటకంపై ఆమె స్పందిస్తూ.. ఆయన ఫేవరెట్ ఇండియన్ ఫుడ్ కచ్చితంగా ఏదో ఒక పనీర్ ఐటం అయ్యింటుందన్నారు. ప్రియాంకకు ఇష్టమైన వంటకాల జాబితాలో బిర్యానీ, కబాబ్, చాట్ తదితర ఐటమ్స్ ఉన్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ మూవీ 'టెక్స్స్ట ఫర్ యూ' షూటింగ్ నిమిత్తం లండన్‌లో బిజీగా గడుపుతున్నారు. అలాగే ఓటీటీ వేదికగా త్వరలో విడుదలకానున్న తన తాజా చిత్రం 'వైట్ టైగర్' చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. -
‘డ్రెస్ జిప్ విరగడంతో.. బిగుసుకుపోయాను’
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని.. బాలీవుడ్లో తన సత్తా చాటి.. హాలీవుడ్లో దూసుకెళ్తు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంక చోప్రా. హాలీవుడ్ వరకు కొనసాగిన తన ప్రయాణం గురించి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ఫినిష్డ్ పేరుతో ఆటోబయోగ్రఫీ తీసుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న ఓ అత్యంత ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు ప్రియాంక. 2019లో ప్రియాంక తొలిసారి కేన్స్ వేదికపై మెరిశారు. రాబర్టో కావల్లి క్రిషేయన్స్ వారు డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ షిమ్మరింగ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ సీక్విన్ డ్రెస్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై హోయలోలికించారు ప్రియాంక. వేదిక గ్లామర్‌ని మరింత పెంచారు. అయితే రెడ్ కార్పెట్ మీదకు వెళ్లడానికి కొన్ని నిమిషాల ముందు ఆమె ధరించిన డ్రెస్ జిప్పర్ విరిగిపోయిందట. ఈ ఊహించని పరిణామానికి ఆమె భయంతో బిగుసుకుపోయారట. నాడు తాను అనుభవించిన టెన్షన్ గురించి ప్రియాంక ఇన్‌స్టాగ్రమ్ వేదికగా వెల్లడించారు. (చదవండి: ఆ అనుభూతే వేరు) ‘‘ఈ ఫోటోలో నేను పైకి చూడటానికి ఎంతో చిల్ అవుతున్నట్లు.. సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాను. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లోలోపల నేను టెన్షన్, భయంతో బిగుసుకుపోయాను. ఎందుకంటే కేన్స్ వేదిక మీదకు రావడానికి నిమిషాల ముందు.. రాబర్ట్ కావిల్లి డిజైన్ చేసిన వింటేజ్ బ్లాక్ అండ్ రోజ్ కలర్ డ్రెస్ ధరిస్తుండగా.. అనుకోకుండా దాని జిప్పర్ విరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు... కాసేపు నా బుర్ర పని చేయలేదు. కానీ నాకు అద్భుతమైన టీం ఉంది. వారు కేవలం ఐదు నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు. కేన్స్ వేదికకు వచ్చే సమయంలో కార్లో నా డ్రెస్‌ని కుట్టి సమస్యను పరిష్కరించారు. పెద్ద ప్రమాదం నుంచి నన్ను కాపాడారు. కానీ ఆ టెన్షన్ మాత్రం నాలో అలానే ఉంది’’ అంటూ వెల్లడించారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలను తన అన్ఫినిష్డ్లో పొందుపరిచానని తెలిపారు ప్రియాంక చోప్రా. అలానే గతంలో మిస్‌వరల్డ్ సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిపారు ప్రియాంక. తాను ధరించిన డ్రెస్‌కు టేప్ అంటుకుందని.. తాను అలానే స్టేజ్ మీదకు వెళ్లానని తెలిపారు ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ఐ లవ్ యూ ప్రియాంక..స్పెషల్ విషెస్
ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఒకటయ్యారు ఈ జంట. క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటోలను షేర్ చేసి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశాడు పాప్‌స్టార్. దీనిపై ప్రియాంక స్పందించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది. అద్భుతమైన, అందమైన స్త్రీని వివాహమాడి సరిగ్గా రెండేళ్లు అయ్యిందని, 'హ్యాపి వెడ్డింగ్ అనివర్సరీ ఐ లవ్ యూ ప్రియాంక' అని నిక్ చేసిన పోస్ట్ పై ప్రియాంక స్పందించింది. (చదవండి: లాక్‌డౌన్‌పై కాజోల్ క్రేజీ క్యాప్షన్) 'నువ్వే నా బలం, బలహీనత, ఎల్లప్పుడూ నా వెంటే ఉండే నా ధైర్యం.. ఐ లవ్ యూ నిక్' అంటూ ప్రియాంక సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 2018 డిసెంబర్ 1న క్రైస్తవ పద్ధతిలో ఒకటైన ఈ జంట డిసెంబర్ 2వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ, ముంబైలలో గ్రాండ్‌గా రెండుసార్లు రిసెప్షన్ చేసుకున్నారీ జంట. కుటుంబ సభ్యులు, బాలీవుడ్ నటీనటులు, పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక చోప్రా ఇటీవల జర్మనీ యాక్టర్ కియానో రీవ్స్‌తో కలిసి షూటింగ్ ముగించింది. తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న 'ది వైట్ టైగర్'లో కనిపించనుంది. ఈ సినిమా 'అరవింద్ అడిగా' అనే బుక్ ఆధారంగా తెరకెక్కనుంది. రాజ్‌కుమార్‌రావ్, ఆదర్ష్ గౌరవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. హాలీవుడ్లో 'వి కెన్ బీ హీరోస్'లో కూడా ప్రియాంక కనిపించనుంది. ఈ సినిమాను రాబర్ట్ రోడ్రిక్వేజ్ నిర్మించనున్నారు. -
నిక్-ప్రియాంకల పెళ్లి బంధానికి రెండేళ్లు..
ముంబై : బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు రెండవ వివాహ వార్సికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్ తమన్నా దత్తా వీరికి యానివర్సిరీ విషెస్ తెలియజేస్తూ..ఎల్లప్పుడూ ప్రేమతో, సంతోషంగా ఉండండి అంటూ వారి పెళ్లిరోజు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ప్రేమ పక్షులుగా ఉన్న నికియాంకలు(నిక్ జోనాస - ప్రియాంక చోప్రా)లు 2018 డిసెంబర్1న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. క్రైస్తవ సంప్రదాయంతో పాటు భారతీయ సంప్రదాయాన్ని కూడా ఆచరించి రెండు సార్లు వివాహం చేసుకున్నారు. (నా భర్త, గోడ సాయం తీసుకున్నా: అనుష్క) డిసెంబర్1న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం,ఆ మరుసరి రోజు డిసెంబర్ 2న భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా న్యూఢిల్లీ, ముంబై రెండు చోట్ల వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు.సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చివరగా స్కై ఈజ్ పింక్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటించిన వైట్ టైగర్, రాజ్‌కుమార్ రావు, ఆదర్ష్ గౌరవ్ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. అంతేకాకుండా ప్రియాంక హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. (కేజీయఫ్ కాంబినేషన్లో ప్రభాస్ ప్యాన్ ఇండియా) -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వాజీద్ ఖాన్(42) ఆదివారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని చెంటూర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు కిడ్నీ సమస్యలు ఉండటంతో కొన్ని నెలల క్రితం కిడ్నీ మార్పిడి చేసుకున్నారు. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే ఆయన కరోనా బారిన పడ్డారు. కాగా సాజిద్- వాజిద్ పేరిట సంగీతాన్ని సమకూరుస్తూ వాజీద్ ఖాన్ పాపులర్ అయ్యారు. బాలీవుడ్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. లాక్‌డౌన్‌లోనూ హీరో సల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాటకు సంగీతం అందించారు. (తాప్సీ ఇంట్లో విషాదం..) ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'వాజీద్ ఖాన్ నవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంద'ని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 'అతను మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు' అని సింగర్ హర్షదీప్.. వాజీద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన బబుల్ సుప్రియో అతని మరణ వార్త విని షాక్‌కు లోనయ్యానన్నారు. మంచి మిత్రుడిని, ప్రతిభావంతుడిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు.(ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
రాణీ ప్రియాంక
పిల్లల చేతికి జుట్టు అందిందంటే.. మనం మనం కాదు. మిస్ వరల్డో.. మిస్ యూనివర్సో..! మేకప్ చేసి.. రబ్బర్ బ్యాండ్ పెట్టి.. ‘అదిరెను నీ స్టెయిలే’ అని అద్దం చూపిస్తారు. ప్రియాంక జుట్టు పక్కింటి చిన్నారికి అందింది! పూర్వపురాణి ప్రెట్టీ ప్రిన్సెస్ అయింది. ఇరవై ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ ఇప్పుడు అందాలరాణిగా సాక్షాత్కరించారు! 2000 సంవత్సరంలో లండన్‌లోని మిలీనియం డోమ్‌లో ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్న ఈ టీనేజర్.. లాస్ ఏంజెలిస్‌లోని తన ఇంటి క్వారెంటైన్లో ఈ సోమవారం తన 37 ఏళ్ల వయసులో ‘ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్’ టైటిల్‌తో ధగధగలాడారు. ఆ ప్రెట్టీ టైటిల్‌ను ప్రియాంకకు ఇచ్చింది ఆరేళ్ల చిన్నారి.. స్కై కృష్ణ! ఆ పాప.. టైటిల్ ప్రదాత మాత్రమే కాదు. ప్రియాంక కనురెప్పలపై ఐ షాడో దిద్దిన బ్యూటీషియన్. ప్రియాంక తల దువ్వి చక్కగా ముడులు వేసిన హెయర్ స్టయిలిస్ట్. ముస్తాబంతా అయ్యాక ప్రియాంక తలపై పెట్టిన ఆ ప్రెట్టీ కిరీటమూ స్కై కృష్ణ తన ఇంటి నుంచి తీసుకొచ్చిందే. నిజానికి ప్రియాంకపై ప్రయోగించిన తన మేకప్ ప్రావీణ్యానికి కొసమెరుపుగా స్కై కృష్ణ అలంకరించిన సౌందర్య మకుటం అది. ప్రియాంక మురిసిపోయారు. ‘ప్రెట్టీ ప్రెట్టీ ప్రిన్సెస్’ అని స్కై కృష్ణ మెచ్చుకుంది. ఆ అభినందనకు ప్రియాంక కళ్లింత చేసి ఆ మరపు రాని క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకున్నారు. ప్రియాంకకు చాలా కాలంగా స్టెయిలిస్ట్గా ఉన్న దివ్యజ్యోతి కూతురే స్కై కృష్ణ. గత నెల రోజులుగా ప్రియాంక, ఆమె భర్త నిక్.. హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. అయితే వాళ్లింటి పక్కనే ఉండే స్కై కృష్ణతో ప్రియాంక ఏ మాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. ఇప్పుడీ ఫొటోలను పోస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు.. మంచంపై వెల్లికిలా పడుకుని, చేతులు రెండూ వెనక్కు చాపి స్కై కృష్ణతో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను ప్రియాంక పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ‘నో జిమ్.. నో ప్రాబ్లం’ అని కామెంట్ పెట్టారు. గత ఏడాది ఆరంభంలో పోస్ట్ చేసిన ఇంకో వీడియోలో ఇద్దరూ స్విమ్మిగ్ పూల్‌లో ఉండి తామిద్దరిలో ఎవరు క్యూట్ అని పోటీ పడటాన్ని ఐదు కోట్ల మందికి పైగా ప్రియాంక ఫాలోవర్లు ఆసక్తిగా వీక్షించారు. అందులో ‘యు ఆర్ సో క్యూట్’ అని, ‘నో.. యు ఆర్ సో క్యూట్’ అని ఒకర్నొకరు అనుకుంటూ ఉంటారు. చివరికి ఆ వివాదం ‘వి ఆర్ సో క్యూట్’ అనే ఏకీభావంతో ముగుస్తుంది. అయితే ఇప్పుడు రోజంతటిలో ప్రియాంక చేస్తున్న అందమైన పనులలో స్కై కృష్ణతో ఉల్లాసంగా గడపడం అన్నది కటి మాత్రమే. ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే ఈ అంతర్జాతీయ తార.. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో మరింత తీరిక లేకుండా ఉన్నారు. కరోనా హెల్త్ వర్కర్లకు ఆర్థికంగా చేయూతను ఇస్తున్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా ఇవ్వడం కాదు. ఆరోగ్య కార్యకర్తల సంక్షేమం కోసం పని చేస్తున్న నికార్సయిన సంస్థలకు కోట్ల రూపాయల విరాళాలు పంపుతున్నారు. బాలల విద్య, వికాసం, సంరక్షణల కోసం అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వాటి బాధ్యతలు కొన్నింటిని తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లాక్డౌన్లో దినసరి కూలీలకు అండగా ఉండి, అన్నివిధాలా వారిని ఆదుకునేందుకు ఏర్పాటైన రిలీఫ్ ఫండ్లకు భర్త నిక్‌తో కలిసి భారీగా నిధులు అందజేస్తున్నారు. బాలల సంరక్షణ కోసం టీనేజ్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌తో కలిసి పని చేయడానికి కూడా ప్రియాంక ఏమాత్రం సంకోచించలేదు. సమాజం కోసం పాటు పడుతున్న ప్రతి మహిళా, ప్రతి బాలికా.. ప్రియాంక దృష్టిలో సూపర్ ఉమనే. ఇప్పుడా సూపర్ ఉమన్ లిస్ట్‌లో మనం స్కై కృష్ణను కూడా చేర్చుకోవాలి. ప్రియాంక వంటి అందాల రాణిని మరింత అందంగా చేసిందంటే పెద్ద విషయమే. -
‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’
ముంబై: బాలీవుడ్ నటి జైరా వసీమ్ అత్యంత ప్రతిభావంతురాలని, దంగల్‌లో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చిందని గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా అన్నారు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలలో జైరా నటన అమోఘమని కొనియాడారు. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే సత్తా తనకు ఉందని ప్రియాంకా ప్రశంసించారు. తన మత ఆచారాలకు ఆటంకం కలుగుతున్న కారణంగా.. ఇక మీదట బాలీవుడ్లో నటించబోనని జైరా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయాన్ని బాలీవుడ్లో పలువురు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం జైరా, ప్రియాంక కాంబినేషనల్లో ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ప్రియాంక సమాధానమిచ్చారు. మోటివేషనల్ స్పీకర్ ఈషా చౌదరి తల్లిదండ్రుల ప్రేమకథగా ఈ చిత్రం రూపొందిందని అన్నారు. ఇక ఈ సినిమాలో ఈషాగా జైరా నటిస్తుండగా..ఆమె తల్లిదండ్రులుగా ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. కూతురు ఈషాకు రోగనిరోదక వ్యవస్థ లోపం కారణంగా వచ్చే పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించగా, కూతురు కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో ప్రియాంకా కనిపించనున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం.. అందులోనూ కూతురికి అనారోగ్యం వంటి దుస్థితిని ఎదుర్కొనే అదితి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇక నటుడు రోహిత్ శరీఫ్ ఈ సినిమాలో జైరాకు అన్నగా నటిస్తున్నాడు. -
భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా
'స్కై ఈజ్ పింక్' సినిమా సీన్ చూసి తన భర్త నిక్ జొనాస్ కన్నీరు పెట్టుకున్నారని బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తెలిపారు. షోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ' స్కై ఈజ్ పింక్' చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా గతేడాది డిసెంబర్లో తన పెళ్లికి నాలుగు రోజుల ముందు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని ప్రియాంక తెలిపారు. 'నా పెళ్లికి నాలుగు రోజులు ముందు స్కై ఈజ్ షూటింగ్లో ఉన్నాను. పెళ్లి పనులు మొత్తం సెట్ నుంచే చూసుకున్నాని, దానికి మా నిర్మాతలు సహకరించారని పేర్కొన్నారు. ఆరోజు క్లైమాక్స్ షూట్ తర్వాత కేక్ పార్టీ ఉండడంతో మా టీంతో కలిసి నిక్‌ను ఆహ్వానించాము. కానీ నిక్ ముందుగానే రావడం, అదే సమయంలో మేము సినిమాకు సంబంధించి ఒక బలమైన సీన్ చేస్తున్నాం. నా పక్క నుంచి ఏదో శబ్దం వినపించడంతో, వెంటనే పక్కకు తిరిగి చూడగా.. ఆ సమయంలో నిక్ ఏడుస్తూ కనిపించాడని' ప్రియాంక పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డైరక్టర్ బోస్ స్పందిస్తూ.. '' ప్రియాంక ! నువ్వు నీ భర్తని ఏడిపించేశావు. నిజంగా ఇది చాలా గొప్ప సీన్ అని'' పేర్కొన్నారు. -
శరణార్థి దినోత్సవం రోజు ప్రియాంక స్పెషల్ వీడియో
ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక చోప్రా, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. జూన్20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె ఇటీవల ఇథియోపియాలోని చిన్నారులను కలిశారు. వారితో గడిపిన క్షణాలను భావోద్వేగపూరిత వీడియో ద్వారా షేర్ చేస్తూ ‘‘ఈ ప్రపంచం భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లో ఉంది. కానీ, వాస్తవం ఏమిటంటే... ఈ అమాయక పిల్లలు ప్రస్తుతం తమ భవిష్యత్ పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా జీవనం సాగిస్తున్నారు. అనేక కుటుంబాలు హింస, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ ఇళ్లను విడిచి, వలస బాట పడుతున్నారు. మనం వారి పక్షాన నిలబడి, వారి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’’ అని అన్నారు. అదేవిధంగా ‘‘ఈ రోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం కావునా ప్రపంచంలోని శరణార్థులందరికీ నా ప్రేమను పంచుతున్నాను. మీరు మీ ప్రతి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని కాంక్షిస్తున్నాను’’ అని 36 ఏళ్ల ప్రియాంక అన్నారు. యూనిసెఫ్‌లో భాగంగా ప్రియాంక జోర్డాన్, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిభిరాలకు వెళ్లి వచ్చారు. View this post on Instagram The truth is quite simple...the future of this world lies in the hands of the children of today. But the harsh reality is that there is an entire generation of innocent children growing up right now without any prospects for thier future...these children are affected by displacement due to serious conflict and emergencies in thier various regions. When families are forced to leave their homes due to violence, persecution, and natural disasters, they are torn apart and it's the children that end up suffering the most. The numbers are staggering, yes...but we have to continue to stand for them, in whatever capacity we can as individuals. They are the future and we need to help. Join me and @unicef by clicking the link in my bio to help keep refugee children safe. #AChildIsAChild #WorldRefugeeDay A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jun 19, 2019 at 10:41pm PDT -
‘నేను పీఎం.. మా ఆయన ప్రెసిడెంట్’
ఒక వేళ మాకే గనక అవకాశం వస్తే.. నేను భారత దేశానికి ప్రధానినవుతా.. నా భర్త నిక్ జోనాస్ తన దేశానికి ప్రెసిడెంట్ అవుతారు అంటున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రియాంక సడెన్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సండే టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. యూనిసెఫ్ ప్రతినిధిగా దేశ విదేశాలు తిరుగుతూ.. తన వంతు సాయం చేసే ప్రియాంక రాజకీయాల గురించి ఎన్నడు కామెంట్ చేయలేదు. కానీ తొలిసారి సండే టైమ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘అవకాశం వస్తే నేను భారత ప్రధానిని అవుతా. నా భర్త నిక్ అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తారు. నాకు రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలంటే నచ్చవు. కానీ దేశంలో మార్పు రావాలని నేను, నిక్ కోరుకుంటున్నాం’ అన్నారు. అయితే ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక నిజంగానే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రియాంక బాలీవుడ్లో ‘ది స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ఎనిమిదో అడుగు
భర్త ముందు నడుస్తాడు. భార్య వెనుక నడుస్తుంది.ఇది లోకాచారం. భర్త ఒకడుగు వెనుక నడిచి, భార్యను ముందుకు నడిపిస్తాడు!ఇది అఫెక్షన్.ఏడడుగుల తర్వాత.. భార్యపై ప్రేమతో, అఫెక్షన్తోఆమెను ముందుకు నడిపించడానికిభర్త వేసే వెనకడుగే.. ఎనిమిదో అడుగు. ఈ ఎనిమిదో అడుగు ప్రతి భర్తకూ ఆదర్శం కావాలి. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ చూడచక్కని జంట. రణ్వీర్ దీపిక మీద ఎంత అఫెక్షన్ చూపిస్తాడో మాటల్లో చెప్పలేం. చూపించడం కాదు. చూపించకుండా ఉండలేకపోవడం అది! మనసులో అంత ప్రేమ ఉంటే బయటికి వచ్చేయకుండా ఉంటుందా? పక్కన వాళ్లున్నారు, వీళ్లున్నారు అని చూసుకుంటుందా! ఈమధ్య.. ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ పెళ్లింటికి వెళ్లారు. సాధారణంగా కొత్తగా పెళ్లయిన కపుల్ ఎక్కడికి వెళ్లినా ఒకర్నొకరు అంటుకుని అడుగులు వేస్తుంటారు. వీళ్లూ అంతే కానీ.. దీపిక మనుషుల్లో పడిపోయారంటే రణ్‌వీర్‌ని అస్సలు పట్టించుకోరు. రణ్వీర్ కూడా ఫీల్ అవడు. ఆమె ఫ్రీడమ్‌ను తనూ ఎంజాయ్ చేస్తాడు. దీపిక ఫ్రీడమ్‌కు ఏవైనా అడ్డుపడితే వాటిని కూడా తొలగిస్తూ ఆమెను కంఫర్ట్‌గా ఉంచుతాడు. పెళ్లికి వెళ్లారు కదా..అక్కడ ఏమైందంటే.. వాళ్లను వీళ్లనూ గ్రీట్ చేస్తూ నట్టింట నడుస్తున్న దీపికకు హైహీల్స్ అడ్డుపడుతున్నాయి. ఆమె ఇబ్బందిని గమనించాడు రణ్వీర్. ‘‘నాకివ్వు.. పట్టుకుంటాను’’ అని తీయించి, వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ముందుకు నడుస్తుంటే.. హైహీల్స్ పట్టుకుని ఆమె వెనుక నడిచాడు! (పట్టుకుని నడవడం ఎందుకు? ఎక్కడైనా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు. కానీ దీపికకు మళ్లీ వాటి అవసరం వస్తేనో!) రణవీర్ దీపిక హైహీల్స్‌ని చేత్తో పట్టుకున్న దృశ్యం ఎవరి కెమెరాలోనో క్లిక్ అయింది. తర్వాత నెట్లో వైరల్ అయింది. రణ్వీర్ మెరూన్ కలర్ షేర్వాణీలో, దీపిక పూల వైట్ కలర్ శారీలో ఉన్నారు. కొప్పు, కొద్దిగా ఆభరణాలు దీపికను మెరిపించేస్తున్నాయి. అయితే ఫొటోల్లో ఇవేవీ నెటిజన్లకు కనిపించడం లేదు. రణవీర్ చేతుల్లోని దీపిక హైహీల్స్పైనే అందరి చూపు. ‘‘ఇలాంటి భర్త ఉంటేనా?’’ అని అమ్మాయిలు పరవశించిపోయారు. ఇది కాదు విశేషం. రణ్వీర్ ఫాన్స్ అస్సలు ఈగోలకు పోలేదు. భార్య చెప్పులు చేత్తో పట్టుకుని నడవడం ఏంటి అని ఒక్కరూ ఒక్క పోస్టయినా వెయ్యలేదు. పైగా లైకుల మీద లైకులు కొట్టారు. ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారని ఈ మధ్య ఒక దుర్మార్గమైన వార్త వచ్చింది. పాశ్చాత్య మీడియా సృష్టింపు అది. ‘అయ్యో’ అని ఎన్నో మనసులు కలత చెందాయి. అయితే ఆ వార్త నిజం కాదు. ఇద్దరూ హాయిగా ఉన్నారు. పెళ్లయ్యాక మొన్న వచ్చిన తొలి ఈస్టర్ను నిక్.. ప్రియాంక హృదయాన్ని హత్తుకునేలా సెలబ్రేట్ చేశాడు. రోజంతా ప్రియాంకను తన కుటుంబ సభ్యులతోనే ఉండనిచ్చాడు. అత్తగారు, భర్తతో కలిసి ఉన్న ఒక ఫొటోని ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హ్యాపీ ఈస్టర్ ఫ్రమ్ అవర్స్ టు యువర్స్’ అని కామెంట్ కూడా రాశారు. ఇంటర్వ్యూలలో ప్రియాంక మర్చిపోకుండా ఒక మాట చెబుతుంటారు. ‘నిక్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్’ అని. ఆ ఫ్యామిలీని అతడు తననెంతో ప్రేమించే ప్రియాంకకు కొంత పంచి పెట్టాడు. ‘తననెంతో ప్రేమించే’ ఓకే. ‘తనెంతో ప్రేమించే’ కాదా! ఇదిగో ఇలాంటి విరుపుల కారణంగానే విడిపోతల వదంతులు బయటికి వస్తుంటాయి. ప్రియాంక నిక్ని ఎంతగా ప్రేమిస్తున్నారో.. నిక్ కూడా ప్రియాంకను అంతగా ప్రేమిస్తున్నాడు. బ్రేక్ వస్తే చాలు.. ప్రియాంకను తీసుకుని అమ్మావాళ్ల (నిక్వాళ్ల) ఇంటికి వెళ్లిపోతున్నాడు. భూమండలాన్నంతా ఆల్రెడీ తిరిగేసిన ప్రియాంకకు ఇప్పుడు భువిపైనున్న స్వర్గసీమ అత్తగారిల్లు మాత్రమే. అలా ఆమె మనసులో అనుబంధాల పూలు పూయించాడు నిక్. మేఘన్ మార్కల్తో పెళ్లయ్యాక ప్రిన్స్ హ్యారీ సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజులు ఇవ్వడం (ప్రపంచానికి) సర్వసాధారణం అయిపోయింది. మేఘన్ పరిచయం కాకముందు వరకు ప్రిన్స్ హ్యారీ మూడీగా ఉండేవారు. లైఫ్‌లోకి ఆమె వచ్చాకే అతడిలోకి కాస్త జీవం వచ్చింది. తల్లి డయానా తలపుల్లోంచి బయటికి రాలేకపోయిన పసిపిల్లవాడే అతడు అన్నేళ్ల పాటు! అలాంటి పిల్లాణ్ని ఇప్పుడు మేఘన్ ఒడిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమే అతడి లోకం. ఆమె పట్ల అతడికెంత ఆరాధననో ఆ మధ్య వాళ్లు మొరాకో టూర్ వెళ్లినప్పుడు మళ్లీ ఒకసారి బయటపడింది. పి.డి.ఎ. అనే మాట వినే ఉంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నవాళ్లు ‘పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్’ (ఇదే పి.డి.ఎ)తో నలుగురి కంటా పడుతుంటారు. అంటే తమకు తెలియకుండానే ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పోతుంటారు. మొరాకోలోని ఆండలూషియన్ గార్డెన్స్‌లో షాపింగ్‌కి వెళ్లినప్పుడు మేఘన్‌కు ఒక పెండెంట్ నచ్చింది. దానిని మెడలో ధరించడానికి పోనీ టెయిల్ అడ్డం వచ్చి మేఘన్ ఇబ్బంది పడుతుంటే ప్రిన్స్ హ్యారీ ఆమె పోనీని ఎత్తి పట్టుకుని పెండెంట్ వేసుకోడానికి హెల్ప్ చేశారు! రాజకుటుంబంలోని జంట.. అదీ పురుషుడు ఇలా చొరవచూపడం అపురూపం, అపూర్వం కూడా! విరాట్, అనుష్క మనకు పాతబడి పోయి ఉండొచ్చు. వాళ్లకు వాళ్లు ఇంకా కొత్తగానే ఉన్నారు. అయినా పాతబడాలని రూల్ ఏముంది? ప్రేమికులుగా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, భార్యాభర్తలుగా ఇప్పుడు ఆనందవాసంలో ఉన్నప్పుడు విరాట్ ప్రతి ట్రోలింగ్‌లోనూ అనుష్కకు సపోర్ట్‌గా ఉన్నాడు, ఉంటున్నాడు. ఆమె ఇష్టాలను గౌరవిస్తున్నాడు. ఆమె అయిష్టాలను అల్లంత దూరంలోనే ఉంచేస్తున్నాడు. స్టేడియంలో అనుష్క ఉండడం వల్లనే విరాట్ ఓడిపోతున్నాడని విమర్శలు వచ్చినప్పుడు అమెకు గట్టి అండగా ఉన్నాడు విరాట్. ‘ఇలాంటివి మాట్లాడొద్దు’ అని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇండియన్ టీమ్‌తో కలిసి అనుష్క గ్రూప్ ఫొటో దిగడం ఏమిటన్నప్పుడు కూడా అలాంటి విజ్ఞప్తే చేశాడు. ‘తను నా స్నేహితురాలు’ అని వివాహానికి పూర్వం, ‘తను నా భార్య’ అని వివాహానంతరం ఆమెను తను సాధించిన ట్రోఫీలా ఎత్తి చూపాడు. రోడ్డుమీద ఎవరో చెత్తపారబోస్తే అనుష్క తిడుతున్న వీడియోను ఎవరో నెట్లో పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా ‘ఆమె తిట్టడంలో తప్పేమిటి?’ అని నెటిజన్లను ప్రశ్నించాడు తప్ప, ‘మనకెందుకొచ్చింది చెప్పు..’ అని భార్యను నిరుత్సాహపరచలేదు. ఈ ఏడాది జనవరిలో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌కు భార్యతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్.. అదే సమయంలో అక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంటే అనుష్క ఫేవరేట్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌కు ఆమెను తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఫెదరర్, విరాట్, అనుష్క.. ముగ్గురూ కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోలను ‘త్రీ లెజెండ్స్ : వన్ ఫొటో’ అనే కామెంట్‌తో అనుష్క పోస్ట్ చెయ్యడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఇరవైసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌కి, ఇండియా జట్టు కెప్టెన్ విరాట్‌కి.. ఒక సినిమా నటి సమానం ఎలా అవుతుంది? అసలు ఆమె లెజెండ్ ఎలా అవుతుంది అని నెటిజెన్స్ విమర్శించారు. విపరీతార్థాలు తీశారు. ‘రోజన్ని కలిస్తే నేనూ లెజెండ్‌ని’ అవుతానా అని ఒకరు వెటకరించారు. ‘అసలు అనుష్కే లెజెండ్. మిగతా ఇద్దరూ కాదు’ అని ఇంకొకరు వ్యంగ్యంగా గుడ్లు మిటకరించారు. ఆ సమయంలో విరాట్ అనుష్కకు ఇంటా బయట ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాడు. చివరిగా సోనమ్, ఆనంద్. సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా గతవారం ఢిల్లీలో ఒక స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్లో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. సోనమ్ స్టోర్‌లోని షూజ్‌ని తొడుక్కుని చూస్తున్నప్పుడు ఆనంద్ కిందికి వంగి ఆమెకు లేస్‌లు కట్టడం కపూర్ అభిమానుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆనంద్, విరాట్, హ్యారీ, నిక్, రణవీర్‌ల ఈ ‘పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్’కు అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం విశేషం. సహజమే. అమ్మాయిలు.. పెళ్లయినవాళ్లయినా, పెళ్లి కావలసినవాళ్లయినా.. ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ అఫెక్షన్’ని ఇష్టపడతారు. నిజంగా ప్రేమ ఉంటే అది పైకి కనిపించకుండా పోతుందా అన్నది వారి పాయింట్. -
ప్రియాంకపై విమర్శలు.. మద్దతిచ్చిన తల్లి
ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్న దగ్గర నుంచి విమర్శించే వాళ్లు ఎక్కువ అయ్యారు. మొన్నటికి మొన్న హలీవుడ్ మ్యాగ్జైన్ ఒకటి ప్రియాంకను గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అని.. నిక్ జోనస్‌కి ఇష్టం లేకుండానే ప్రియాంక, అతన్ని పెళ్లి చేసుకుందని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిక్ ఆ బంధం నుంచి తప్పుకుంటే మంచిదని కారు కూతలు కూసిన సంగతి తెలిసిందే. కానీ ప్రియాంక మాత్రం ఈ విషయాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా మరో మహిళ ప్రియాంకను ఉద్దేశిస్తూ ఇలానే ఓ ట్వీట్ చేశారు. దీపికా భరద్వాజ్ అనే ట్విట్టర్ యూజర్ ‘గట్టిగా అరచి మరి చెప్తారు. కేవలం బిడ్డల్ని కనడానికే తప్ప ఇతర ఏ విషయాల్లోను నాకు పురుషుడితో అవసరం లేదు అని. కానీ వారికి తగిన వాడు దొరికిన మరు క్షణంలోనే అందరిలానే అందమైన వధువుగా తయారవుతారు. అతనో సూర్యుడు, చంద్రుడు, ఓ తార అన్నట్లు మాట్లాడతారు. సింధూరం ధరిస్తారు.. ఆఖరుకి పేరును కూడా మార్చుకుంటారు. ఇది బాలీవుడ్ మహిళావాదుల అసలు రూపం’ అంటూ ప్రియాంకను ఉద్దేశిస్తూ(ప్రియాంక తన పేరును ప్రియాంక చోప్రా జోనస్‌గా మార్చుకున్నారు) ట్వీట్ చేశారు. అయితే ఈట్వీట్ని ప్రియాంక పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రియాంక తల్లి మధు చోప్రా మాత్రం కాస్తా ఘాటుగానే స్పందించారు. ‘సిందూరం అనేది స్త్రీ జీవితాని ఆటంకం కాబోదు. త్వరలోనే ప్రియాంక ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తుంది’ అంటూ రీ ట్వీట్ చేశారు మధు చోప్రా. -
ప్రియాంక కొత్త అధ్యాయం
ప్రత్యేకంగా యువతులు, మహిళల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ బంబల్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెడుతున్నారు. మహిళల మొట్ట మొదటి సోషల్ నెట్వర్కింగ్ యాప్ బంబల్‌లో త్వరలోనే భారతదేశంలో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే టెక్ స్టార్ట్అప్ హోల్బెర్టన్ స్కూల్లో పెట్టుబడిదారుగా ఉన్న బాలీవుడ్ భామ ప్రియాంక సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో పెట్టుబడిదారుగా, సలహాదారుగా ఇపుడు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ భాగస్వామ్యం విషయాన్ని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఫార్చ్యూన్ అతిశక్తివంతమైన మహిళల సమ్మిట్‌లో బంబల్ సీఈవో విట్నే వోల్ఫ్హెర్డ్ ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు. భారతదేశ మహిళల సాధికారతకు సహాయపడడంతోపాటు ఆమె ప్రపంచశక్తిగా నిలవనున్నారని పేర్కొన్నారు. గత తొమ్మిదినెలలుగా బంబుల్ లాంచింగ్ పనిలో, వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో ప్రియాంక తలమునకలై వున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. వారు సురక్షితంగా ఉండాలి. వారుతో అనుసంధానం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. సురక్షితంగా లేని కారణంగా ప్రస్తుత సోషల్ నెట్‌వర్క్‌లు భారతీయ మహిళల హృదయాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తమ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు. ఉదాహరణకు, మహిళలు వారి పూర్తి పేర్లకు బదులుగా తమ ప్రొఫైల్‌లో కేవలం ఫస్ట్ లెటర్ ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. 2017 అక్టోబర్‌లో బంబుల్ డేటింగ్ యాప్ విట్నే వోల్ప్ హెర్డ్ స్థాపించారు. ఇప్పటికే 160 దేశాలలో పనిచేస్తున్న బంబుల్, ఫోటో వెరిఫికేషన్ ఫీచర్ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 27 మిలియన్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తుండగా, దాదాపు 4000 కంటెంట్ మోడరేటర్లతో ఫోటోలను, ప్రొఫైల్స్‌ను నిరంతరం రివ్యూ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి భారతీయ మహిళలకు అందుబాటులోకి రానున్న బంబుల్ హిందీ, హింగ్లీషు (హిందీ, ఇంగ్లీషు కలిసిన) భాషల్లో లాంచ్కానుంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంలపై ఇది పనిచేస్తుంది. A new chapter for me! I am so excited to partner with @bumble and @holbertonschool as an investor. I’m honored to join two companies that strive to expand gender diversity in the tech space, and make a social impact for the greater good... let’s do this!! pic.twitter.com/xBdC13XE0n — PRIYANKA (@priyankachopra) October 4, 2018 -
అనాథ చిన్నారులతో చిందేసిన ప్రియాంక
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్ శనివారం సంప్రదాయబద్ధంగా ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి నిక్, పిగ్గీ చాప్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా ఈ ప్రేమజంట ఆదివారం సెయింట్ కాథరిన్స్ అనాథ ఆశ్రమాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కాసేపు చిన్నారులతో కలిసి ముచ్చటించారు. అలాగే ఓ చిన్నారితో కలిసి ప్రియాంక తన సినిమా ‘గూండే’ లోని హిట్ సాంగ్‌కు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా శనివారం సాయంత్రం ప్రియానిక్ జంట స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అలియాభట్, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా అంబానీ, సంజయ్ లీలా బన్సాలీ, విశాల్ భరద్వాజ్, పరిణీతి చోప్రా, సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ, ఆమె భర్త ఆయూష్ శర్మలు ఈ పార్టీలో సందడి చేశారు. ఇక నిక్ జోనాస్ తనకు కాబోయే భార్య ప్రియాంక చోప్రా, తల్లిదండ్రులు కెవిన్ జోనాస్, డెనిస్లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
పెళ్లి సెప్టెంబర్ 16..?
ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ అంటే ప్రియాంక చోప్రా నిశ్చితార్ధమే. ప్రియాంక - నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా అయ్యింది లాంటి ప్రశ్నలు అటు అభిమానులనే కాక ఇటు ఇండస్ట్రీ వర్గాల వారి బుర్రలను కూడా తొలిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఒక అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో కూడా దీని గురించే గుసగుసలు. కానీ ఈ వార్తలపై ఇటు ప్రియాంక, అటు ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే మీడియా మాత్రం ప్రియాంక నిశ్చితార్ధానికి సంబంధించిన సమాచారం రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ‘ప్రియాంకకు ఎంగేజ్మెంట్ అయ్యిందంటగా.. మీకు ఏమైనా తెలుసా’ అంటూ అడుగుతోంది. కొందరు మాకు తెలియదు అనగా, కొందరు మాత్రం చాలా వెరైటీగా స్పందిస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు. వీరిలో కంగనా రనౌత్, షారుక్ ఖాన్లు కూడా ఉన్నారు. మంగళవారం జరిగిన అవార్డుల ఫంక్షన్ సందర్భంగా మీడియా ప్రియాంక - నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్ గురించి షారుఖ్ దగ్గర ప్రస్తావించగా ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ‘నాకు కూడా వివాహం అవ్వబోతుంది.. మీకు ఆహ్వానం పంపిస్తాను.. రిసెప్షన్‌కు కూడా ఆహ్వానిస్తాను. మెహందీకి కూడా హాజరవ్వాలి మర్చిపోవద్దు’ అంటూ వింత సమాధానం ఇచ్చారు. కంగనా రనౌత్ అయితే ఏకంగా ‘నన్ను పిలవకుండానే ఎంగేజ్మెంట్ చేసుకుందా. అయితే నేను తన మీద అలిగాను. కానీ తన జీవితం సంతోషంగా సాగాలి’ అంటూ సమాధానమిచ్చారు. ఇంతకు వీళ్లంతా ప్రియాంకకు ఎంగేజ్మెంట్ అయ్యిందంటున్నారా..? లేదంటున్నారా అన్నది అర్ధం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు జనాలు. అసలు ఎంగేజ్మెంట్ గురించే సరైన స్పష్టత లేదంటే.. మరి కొందరు పుకారు రాయళ్లు మాత్రం ఏకంగా పెళ్లి డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 16న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు. -
ప్రియాంక పెళ్లి : ఆ ఇద్దరూ అన్‌హ్యాపీ
ముంబై : బాలీవుడ్ ప్రియాంక పెళ్లి వార్త మారుమోగుతోంది. ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో సల్మాన్‌తో ‘భారత్’ సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చిన ప్రియాంక, ఒక్కసారిగా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. స్పెషల్ రీజన్‌తోనే ప్రియాంక ‘భారత్’ నుంచి తప్పుకున్నారని ఆ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ ట్వీట్ చేశారు. ప్రియాంక, నిక్ జోనస్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు. దీంతో ప్రియాంక ఇల్లాలు కాబోతుందని ఆమె అభిమానులందరూ సంబురపడిపోతున్నారు. ఆ సినిమా డైరెక్టర్ కూడా హ్యాపీగానే ట్వీట్ చేశారు. కానీ ఓ ఇద్దరు మాత్రం అన్‌హ్యాపీగా ఉన్నారట. ఎవరా? ఆ ఇద్దరూ అంటే. సినిమా నిర్మాత నికిల్ నమిత్, ప్రియాంకతో జోడి కట్టబోయే సల్మాన్ ఖాన్. ఆమె హఠాత్తుగా సినిమా నుంచి తప్పుకోవడం, అనైతికమంటూ విరుచుకుపడుతున్నారు. ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నికిల్ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తన ఎంగేజ్మెంట్ కారణంతో, భారత్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె తమతో చెప్పింది. ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా అనైతికం అంటూ నిర్మాత విమర్శించారు. సల్మాన్ ఖాన్ కూడా ప్రియాంకపై కోపంగా ఉన్నారు. సడెన్‌గా భారత్ నుంచి ఆమె తప్పుకోవడంతో, మరోసారి ప్రియాంకతో వర్క్ చేయనంటూ సలూ భాయ్ కూడా తేల్చిచెప్పేశారట. భారత్ సినిమా డైరెక్టర్, ప్రియాంక స్నేహితుడు కావడంతో, ఎలాంటి వివాదాలు లేకుండా.. ఆమె తప్పుకోవడంపై సంతోషకరమైన ట్వీటే చేసినప్పటికీ.. సల్మాన్, నికిల్లు మాత్రం ప్రియాంక తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నాన్సెన్స్... ఒకవేళ ఆమె పెళ్లి చేసుకోవాలని ఉంటే, భారత్ షూటింగ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి. ఇదేమి చిన్న సినిమా కాదు అంటూ సల్మాన్ మండిపడ్డారట. ఇదిలా ఉంటే సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్ ఇస్తారో? చూడాల్సి ఉంది. కాగ, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ కథ 2017 మెట్ గలాలో మొదలైంది. నిక్ జోనస్, ప్రియాంక కంటే పదేళ్ల చిన్న. ఇటీవలే నిక్ జోనస్‌ను ప్రియాంక భారత్‌కు తీసుకుని వచ్చి, తన కుటుంబానికి పరిచయం చేసింది. నిక్ జోనస్ కూడా ప్రియాంకను వారి కుటుంబానికి పరిచయం చేయడంతో, వారి ప్రేమ కథకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ పడినట్టు తెలుస్తోంది. -
పెళ్లి కోసమేనా?
ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా బాలీవుడ్లో ‘భారత్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆమె అభిమానులు ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని తెలిసి రెట్టింపు ఆనందపడుతున్నారు. ప్రియాంక సినిమా చేయకపోతే హ్యాపీ ఫీలవ్వాల్సిన అవసరం ఏంటీ? అంటే.. ఓ స్పెషల్ రీజన్ ఉంది. ‘భారత్’ సినిమా డేట్స్‌ను క్యాన్సిల్ చేసిన ప్రియాంకా, పెళ్లికి డేట్స్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘భారత్’. ఈ సినిమా నుంచి సడన్‌గా ప్రియాంక తప్పుకున్నారు. ఈ విషయంపై దర్శకుడు జాఫర్ క్లారిటీ ఇస్తూ– ‘‘అవును..‘భారత్’ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించడం లేదు. ఈ నిర్ణయాన్ని ఆమె నిక్ ఆఫ్ టైమ్ (చివరి నిమిషం) లో చెప్పారు. హ్యాపీ లైఫ్‌ని ప్రియాంక గడపాలని ‘భారత్’ టీమ్ కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ పేరు వచ్చేట్లు ‘నిక్ ఆఫ్ టైమ్’ అని దర్శకుడు జాఫర్ ప్రస్తావించడంతో.. నిక్‌తో ప్రియాంక పెళ్లికి రెడీ అయిట్లు ఆయన హింటు ఇచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
చాలా అంచనాలు పెట్టుకున్నాను.. కానీ
ఫలితం గురించి ఆలోచించకుండా చేస్తున్న పని కోసం వందకు వంద శాతం కష్టపడతానంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రంగస్థలంతో భారీ విజయాన్ని అందుకున్న చెర్రి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ గురించి ముచ్చటించారు. బాలీవుడ్ ఎంట్రీ ‘జంజీర్’ అపజయం గురించి కూడా వివరణ ఇచ్చారు. ఐదేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా ‘జంజీర్’(తెలుగులో తుఫాను) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఘోర పరజయాన్ని మిగిల్చింది. ఈ విషయం గురించి చెర్రి మాట్లాడుతూ.. ‘జంజీర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాను. ఎందుకంటే బాలీవుడ్లో అది నా తొలి చిత్రం. మనస్ఫూర్తిగా నమ్మి, వంద శాతం కష్టపడి చేసిన సినిమా అది. కానీ నా అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. ఫలితం నాకు నిరాశ కలిగించిన మాట వాస్తవమే. ఆ సినిమా విజయం సాధించలేదని చెప్పి బాలీవుడ్ ప్రయత్నాలు మానుకోను. మంచి కథ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాన’ని తెలిపారు. ప్రియాంక చోప్రాతో నటించడం గురించి చెబుతూ.. ‘ప్రియాంక చాలా అందమైన, ప్రతిభ గల నటి. సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టం. వృత్తికి పూర్తిగా అంకితమవుతారు. మరోసారి ఆమెతో నటించాలనుకుంటు’న్నాను అన్నారు. ప్రియాంక ప్రస్తుతం హలీవుడ్లో నటిస్తున్నారు కదా మీరు ఆ వైపు వెళ్లే ఆలోచనలు ఉన్నాయా అని అడగ్గా ‘తెలుగు పరిశ్రమలో నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు ఫలానా సినిమాలు చేయాలి అని అనుకోలేదు. అలానే హలీవుడ్‌కి వెళ్లాలి అని కూడా అనుకోలేదు. నాకు నప్పే కథలతోనే నా ప్రయాణం సాగుతుంది. అంతేకాని ప్రణాళికలు వేసుకుని పనిచేయడం నాకు చేతకాదు. నేను చేసే ఏ సినిమాకైనా వందశాతం పూర్తిగా కష్టపడతాను. కానీ ఫలితం మన చేతిలో ఉండదు కదా’ అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా కైరా అద్వానీ నటించనుండగా, మిగతా పాత్రల్లో వివేక్ ఓబెరాయ్, స్నేహ, ఆర్యన్ రాజేష్‌లు నటిస్తున్నారు. -
ఇప్పుడే కదా కలిసింది...
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా...హాలీవుడ్ సింగర్, ఆర్టిస్ట్ నిక్ జోనస్ ప్రస్తుతం బీ టౌన్లో బాగా వినిపిస్తున్న పేర్లు వీరిద్దరివే. ఇటీవలే ప్రియాంక చోప్రా ముంబైలో తన నూతన గృహప్రవేశానికి గెస్ట్‌గా బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ను ఆహ్వానించారు. పనిలో పనిగా తన తల్లి మధుకు నిక్‌ను పరిచయం చేశారు ప్రియాంక. ఈ సందర్భంగా మధు తన కూతురు ప్రియాంక, నిక్‌తో కలిసి ముంబైలోని ఒక టాప్ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ‘నిక్ గురించి మీ అభిప్రాయం ఏంట’ని మీడియా మధు చోప్రాను ప్రశ్నించగా ఆమె కాస్తా భిన్నంగా స్పందించారు. ఈ విషయం గురించి మధు చోప్రా ‘మేము కేవలం డిన్నర్ చేయడం కోసం మాత్రమే వెళ్లాము. అప్పుడు అక్కడ నిక్ కూడా ఉన్నాడు. కానీ అప్పుడు అతనితో మాట్లాడ్డానికి కుదరలేదు. ఆ సమయంలో దాదాపు పదిమంది దాకా నిక్ జోనస్ చుట్టూ మూగారు. దాంతో అతని గురించి తెలుసుకోవడానికి నాకు అవకాశం లభించలేదు. అయినా నేను నిక్‌ను కలవడం ఇదే తొలిసారి. ఇంత తక్కువ సమయంలో అతని గురించి అప్పుడే ఒక నిర్ణయానికి రాలేను’ అని తెలిపారు. కాగా గతంలో ప్రియాంక తల్లి మధు విదేశీయుడికి తన కూతురిని కట్టబెట్టడం ఇష్టం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే నిక్ ఇప్పటికే ప్రియాంకను తన కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. నిక్ తరఫు బంధువుల పెళ్లికి కూడా ప్రియాంక హాజరయ్యారు. -
హీరోయిన్‌పై విరుచుకుపడ్డ బీజేపీ నేత
లక్నో : రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియాంక చోప్రాను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం..‘రోహింగ్యాల నిజ స్వరూపం ప్రియాంక వంటి వాళ్లకు తెలియకపోవచ్చు. ఆమె అసలు వాళ్లను కలవడానికి వెళ్లాల్సింది కాదు. రోహింగ్యా ముస్లింలకు ఇక్కడ(భారత్‌లో) చోటు లేదు. అలాగే వాళ్లకు సానుకూలంగా మాట్లాడే వారికి కూడా ఇక్కడ స్థానం లేదు. రోహింగ్యాల పట్ల సానుభూతి చూపడానికి ఢాకా వెళ్లిన ప్రియాంక, ఆమె లాంటి మరెవరైనా ఈ దేశాన్ని(భారత్) విడిచి వెళ్లాల్సి ఉంటుందంటూ’ వినయ్ కతియార్ వ్యాఖ్యానించారు. యూనిసెఫ్ బాలల హక్కుల రాయబారిగా పనిచేస్తున్న ప్రియాంక.. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి ఉండవద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్ పెట్టారు. అయితే ప్రియాంక చేసిన పనిని కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. ముస్లింలను పరామర్శించడమేమిటని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. -
ముస్లింలను పరామర్శిస్తావా...?
ముంబై : మంచి పని చేసినా దానికి మతం రంగు పులమడం నిజంగా విచారకరం. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు నటి ప్రియంక చోప్రా. ఈ బాలీవుడ్ హీరోయిన్ను యూనిసెఫ్ బంగ్లాదేశ్ పిల్లల హక్కుల ప్రచారకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓ వైపు ప్రియాంక పోస్టు చేసిన ఈ ఫోటోలకు దాదాపు 6 లక్షలకు పైగా లైక్స్ రాగా, మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఇది సెల్ఫీ స్టంట్లా, పబ్లిసిటీ స్టంట్లా ఉందంటూ విమర్శలు గుప్పించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ముస్లిం పిల్లలకు సహయం చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక మన దేశంలో ఉన్న శరణార్ధులను ఎప్పుడైనా కలుసుకున్నారా?. కాశ్మీరీ పండిట్లు స్వయంగా మన దేశంలోనే శరాణార్ధులుగా బతుకుతున్నారు. వారిని ఎప్పుడైనా సందర్శించారా అంటూ ప్రశ్నల వర్షం కురింపించగా, మరికొందరు మాత్రం ప్రియాంక చేసిన పనిని మెచ్చుకున్నారు. యూనిసెఫ్ టీ షర్టుతో చిన్నారులను పలకరిస్తున్న ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతేకాక ఈ ఫోటోలో ఒక చిన్నారి తాను ఆడుకునే బొమ్మ టీ కప్పును ప్రియాంకకు ఇవ్వగా, ప్రియాంక ఆ కప్పును తీసుకుని తాగుతున్నట్లు చేశారు. ఈ ఫోటోతో పాటు ప్రియాంక ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయిన ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి వద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. మనం వారి పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. -
మెట్ గాలా: అదరగొట్టిన ప్రియాంక
న్యూయార్క్: న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాలా ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ బ్యూటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ఎలిగెంట్ దుస్తుల్లో బంగారు ఆభరణాల్లో రెడ్ కార్పెట్ పై మెరిసిపోయారు. సోమవారం జరిగిన ఈ మెగా ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంకచోప్రా, దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడటంలో ఆశ్చర్యం ఏముంది. ఇపుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏటా ‘మెట్ గాలా’పేరుతో ఈవెంట్ నిర్వహించడం ఆనవాయితీ. ఈవెంట్ ద్వారా వచ్చే విరాళాలను ఛారిటీలకు వినియోగిస్తారు. ఈ సంవత్సరం - "హెవెన్లీ బాడీస్: ఫ్యాషన్ అండ్ కాథలిక్ ఇమాజినేషన్’’ థీమ్‌తో నిర్వహించారు. హర్పెర్స్ బజార్ అత్యుత్తమ దుస్తుల జాబితాలో టాప్‌లో నిలవగా, ప్రియాంకా చోప్రా 17స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి కూడా దీపికి పదుకోన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హాలీవుడ్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రియాంకచోప్రా, బాలీవుడ్స్టార్ హీరోయిన్ దీపికాను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
పదేళ్ల తరువాత సల్మాన్‌తో..!
ముంబై : బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా బిజీగా గడుపుతున్నారు. రెండేళ్లుగా బాలీవుడ్ తెరకు దూరమైన పిగ్గీ చాప్స్.. సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. టైగర్ జిందా హై ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలిపారు. దక్షిణ కొరియా సినిమా ‘ఓదే టూ మై ఫాదర్’ స్ఫూర్తితో తెరకెక్కుతోంది ఈ చిత్రం. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్’ టీమ్‌తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సల్మాన్, అలీలతో మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మళ్లీ ఈ సినిమాతో ఆ అవకాశం లభించింది’ అంటూ ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. గతంలో అలీ అబ్బాస్ జాఫర్ ‘గూండే’, సల్మాన్ ఖాన్ ‘ముజ్ సే షాదీ కరోగీ’ సినిమాలలో ప్రియాంక నటించారు. 2016లో విడుదలైన ‘జై గంగా జల్’ సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాలు, అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో ప్రియాంక బాలీవుడ్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం సల్మాన్ సినిమాకు సైన్ చేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఒక వ్యక్తి, జాతి కలిసి చేసే ప్రయాణం ‘భారత్’. ఈద్ 2019’ అంటూ దర్శకుడు అలీ అబ్బాస్ చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే.. సినిమా కోసం మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. And it begins “Bharat” @BeingSalmanKhan . A journey of a man and a nation together . Eid 2019 pic.twitter.com/nD05ca2FDE — ali abbas zafar (@aliabbaszafar) 16 April 2018 -
పెళ్లితో స్త్రీకి యుగాంతం ఏమీ వచ్చేయదు
‘‘పెళ్లితో అమ్మాయి జీవితం ఆగిపోదు. మొదలవుతుంది. భర్త, ఇల్లు, పిల్లలతోపాటు ఆమెకూ వ్యక్తిగత ప్రయాణం ఉంటుంది. ఆశలు, ఆశయాలతో ఆ లక్ష్యం వైపు పరిగెత్తాలనుకుంటుంది. ఆమె కలల రెక్కలనూ స్వాగతించే అత్తింటి వారుండాలి. ఆమెను ఆమెగా స్వీకరించాలి. ఆమె ‘మల్టీటాస్క్’కు సహకారం అందించాలి. ఆమెకంటూ ఉన్న లక్ష్యసాధనకు మద్దతు ఇవ్వాలి. పెళ్లికి ముందు తల్లిదండ్రులు, అన్నదమ్ముల నుంచి, పెళ్లయిన తర్వాత అత్తమామలు, భర్త నుంచీ ఇలాంటి సహాయసహకారాలుండాలి. అన్నిటినీ సంభాళించగల సామర్థ్యం స్త్రీకి సహజంగానే ఉంటుంది. ఇంటి బాధ్యతల్లో పడిపోయినప్పుడు భర్త ఆమెను ప్రోత్సహించాలి. ‘‘ఈ పనులు సగం నేను చేసి పెడతాను.. నీకు మాత్రమే సొంతమైన టాలెంట్ మీద దృష్టి పెట్టు’’ అని భుజం తట్టాలి. అమ్మాయిలు కూడా పెళ్లి కోసం వాళ్ల ఆశయాలను సర్దుబాటు చేసుకోనక్కర్లేదు. అర్థం చేసుకునే ఇంట్లో అడుగుపెట్టడానికి వెయిట్ చేయాలి. జీవితంలో పెళ్లి ఒక భాగం. అదే జీవితం కాదు. పెళ్లి, పిల్లలతో స్థిరపడటం స్త్రీలకు ఎంత అవసరమో పురుషులకూ అంతే. ఇద్దరికీ అంతే ఇంపార్టెంట్. కాబట్టి సర్దుబాటు కన్నా సహకారం కోసం చూడాలి. అలాగే తల్లులు కూడా తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే సమాన హక్కుల గురించి చెప్పాలి. నేర్పాలి. పెళ్లితో అమ్మాయికి అబ్బాయి ఒక భరోసా ఇచ్చేట్టు పెంచాలి తప్ప పెత్తనం పొందేట్టు కాదు.’’ (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, యూనిసెఫ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా. ఇటీవల ఇండియా వచ్చినప్పుడు ఢిల్లీలో ఇచ్చిన యూనిసెఫ్ ప్రసంగంలోంచి చిన్న భాగం). -
బాలీవుడ్ సినిమా అంగీకరిస్తుందా..?
చాలా రోజులుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా త్వరలో ఓ హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. వరుసగా హాలీవుడ్ సినిమాలతో టీవీ సీరిస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాజీరావ్ మస్తాని తరువాత ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. దీంతో ప్రియాంక బాలీవుడ్ సినిమాలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే పని మీద ముంబై చేరుకున్న ప్రియాంక చోప్రా మూడు రోజుల పాటు ఇక్కడ దర్శక నిర్మాతలతో చర్చలు జరపనున్నారు. త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించాలన్న ప్లాన్‌లోనే ప్రియాంక ముంబై వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కల్పనా చావ్లా బయోపిక్ లో ప్రియాంక నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఈ ట్రిప్ లోనే ఫైనల్ చేస్తారో లేదో చూడాలి. మూడు రోజుల పాటు ముంబైలో గడపనున్న పీసీ తరువాత క్వాంటికో 3 సీరిస్ కోసం ఐర్లాండ్ వెళ్లనున్నారు. -
చెత్త సినిమా ప్రియాంకదే!
లాస్ ఏంజిల్స్ : ప్రియాంక చోప్రా హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం బేవాచ్ చెత్తసినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రతి ఏడాది చెత్త సినిమాలకు ర్యాంకులనిచ్చే గోల్డెన్ రాస్బెర్రి 'వరస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో 2017 ఏడాదికిగానూ బేవాచ్ ఎంపికైంది. చెత్త సినిమా, చెత్త స్క్రీన్ ప్లే, చెత్త రీమేక్, సీక్వెల్, చెత్త నటుడు కేటగిరీల్లో బేవాచ్‌ను ఎంపిక చేశారు. ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన బేవాచ్ గత ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బేవాచ్ ఫ్లాప్ అయినా అందులో ప్రియాంక నటనకు మంచి మార్కులేపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన క్వాంటికో సిరీస్‌లోనూ తన నటనతో ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్న విషయం తెలిసిందే. చెత్త సినిమా విభాగంలో నామినీలు బేవాచ్ ది ఈమోజీ మూవీ ఫిఫ్టీ షేడ్స్ డార్కర్ ది మమ్మీ ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్ చెత్త హీరోయిన్ విభాగంలో నామినీలు కేథరిన్ హిగ్(అన్ఫర్గటబుల్) డకోటా జాన్సన్(ఫిఫ్టీ షేడ్స్ డార్కర్) జెన్నీఫర్ లారెన్స్(మథర్) టైలర్ పెర్రీ(బూ 2 ఏ మాడీ హల్లోవీన్) చెత్త నటుల విభాగంలో నామినీలు టామ్ క్రూస్ (ది మమ్మీ) జాన్ డెప్ ( పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్స్ : డెడ్ మెన్ టెల్ నో టేల్స్) జామీ డోర్నన్ (ఫిఫ్టీ షేడ్స్ డార్కర్) జాక్ ఎఫ్రాన్ (బేవాచ్) మార్క్ వేల్ బర్గ్( డాడీస్ హోమ్ 2, ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్) -
పెళ్లి చేసుకోవాలని ఉంది: టాప్ హీరోయిన్
ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నటీమణుల్లో ఎక్కువగా విజయం సాధించిన వారిలో ఈమె ఒకరు. ఇటీవల ఆమె బాలీవుడ్ హీరోలకు దీటుగా సంపాదన ఆర్జిస్తున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క నటి ప్రియాంక మాత్రమే. అంతేకాక భారత్‌లో మాత్రమే కాక, అమెరికాలోనూ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈమె అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో మూడో పార్ట్‌లో నటిస్తోంది. త్వరలోనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ ప్రియాంక షూటింగ్‌ను ప్రారంభించబోతుంది. ఇటు బాలీవుడ్‌లోనూ.. అటు హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ భామ పెళ్లెప్పుడు చేసుకుంటుందా? అని ఆలోచించని వారుండరు. ఇంతకీ ఈ భామకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉందా? లేదా? అంటూ ఇటీవల ఢిల్లీ ఈవెంట్‌కు వచ్చిన ప్రియాంకకు పెళ్లి ముచ్చట్లు ఎదురయ్యాయి. ''కచ్చితంగా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇప్పటివరకు నేను చేసిన హార్డ్ వర్క్‌ను అభినందించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అమ్మ చెప్పింద’ని ప్రియాంక పేర్కొంది. కానీ తగిన అబ్బాయి దొరకడమే కష్టమైన పని అనిపిస్తుందంటూ నవ్వేసింది. -
5 నిమిషాల పర్ఫామెన్స్‌కు 5 కోట్లు
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. గత రెండేళ్లుగా బాలీవుడ్ కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలు, టీవీ సీరీస్ లతో బిజీ బిజీగా ఉంది. అదే సమయంలో పలు అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంది. రెండేళ్ల తరువాత ఓ బాలీవుడ్ వేడుకకు హాజరు కానుంది ప్రియాంక.. అంతేకాదు ఈ వేడుకలో పర్ఫామ్ కూడా చేయనుంది. జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు అంగీకరించింది ప్రియాంక చోప్రా. ఈ నెల 19న జరగనున్న ఈ వేడుకలో ప్రియాంక 5 నిమిషాల పాటు డ్యాన్స్ చేయనుందట. అయితే ఈ పర్ఫామెన్స్ కు గానూ ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రియాంకకున్న గ్లోబల్ ఇమేజ్, అంతర్జాతీయ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ కారణంగా అంత పారితోషికం ఇచ్చేందుకు జీ మీడియా ముందుకొచ్చిందట. రెండేళ్ల తరువాత ఈ బ్యూటీ బాలీవుడ్ వేడుకలో సందడి చేయనుండటంతో ఆమె పర్ఫామెన్సే... షోకు హైలెట్ గా నిలువనుంది. -
దీపిక స్థానంలో ప్రియాంక!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరోసారి ‘ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా’ నిలిచారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా నిలిచిన ఆమె ఐదోసారీ ఈ టైటిల్ గెలుచుకుని శెభాష్ అనిపించుకున్నారు. లండన్‌కి చెందిన ఓ వారపత్రిక నిర్వహించిన పోలింగ్‌లో ఆమె మొదటి స్థానం సంపాదించుకున్నారు. అమెరికా టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో ఈ బ్యూటీ ఎంత గ్లామర్ ఒలకబోసిందో తెలిసిందే. ‘క్వాంటికో’తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు ప్రియాంక. 50 మందితో నిర్వహించిన పోలింగ్‌లో ఆమె తొలి స్థానంలో నిలవగా, టీవీ నటిగా పాపులర్ అయిన నియాశర్మ ద్వితీయ స్థానంలో నిలిచారు. గత ఏడాది తొలి స్థానంలో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ని ప్రియాంక ఈసారి బీట్ చేశారు. అంతకుముందు సంవత్సరం కైవసం చేసుకున్న ‘నంబర్ వన్’ స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. ఈ ఏడాది దీపికా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుర్రా తార ఆలియా భట్ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో పాక్ నటి మహీరాఖాన్కి కూడా చోటు దక్కింది. ‘‘ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా’ ఐదోసారి నిలవడం చాలా ఆనందంగా ఉంది. నేనింత అందంగా ఉన్నానంటే దానికి కారణం నా పేరంట్స్ జీన్సే. అలాగే ఐదోసారి ఈ టైటిల్ నాకు దక్కేలా చేసిన అభిమానులు మరో కారణం. నన్ను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు ప్రియాంకా చోప్రా. -
మరోసారి సన్నీనే టాప్
ముంబై : 2017 సంవత్సరంలో యాహూలో ఎక్కువగా వెదికిన భారతీయ నటుల్లో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంది సన్నీలియోన్. దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కత్రినా కైఫ్‌లాంటి స్టార్ హీరోయిన్లను దాటుకొని యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ జాబితాలో మరోసారి టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా, మూడో స్థానంలో ఐశ్వర్యారాయ్ నిలిచారు. ఇక నటుల జాబితాలో ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా టాప్ ప్లేస్‌లో నిలిచారు. వినోద్ ఖన్నా మృతి చెందిన సమయంలో నెటిజన్లు ఎక్కువగా ఆయన కోసం యాహూలో సెర్చ్ చేశారు. కాగా, ఆ తర్వాతి స్థానంలో అనూహ్యంగా కపిల్ శర్మ నిలిచారు. సల్మాన్ ఖాన్, రజినీ కాంత్ లాంటి వారిని దాటుకుని కపిల్ శర్మ రెండో స్థానంలో నిలవడం విశేషం. 2017 యాహూ మోస్ట్ సెర్చ్డ్ హీరోయిన్ల జాబితా సన్నీలియోన్ ప్రియాంకా చోప్రా ఐశ్వర్య రాయ్ కత్రినా కైఫ్ దీపికా పదుకునే కరీనా కపూర్ మమతా కులకర్ణి దిశాపటాని కావ్యా మాధవన్ ఇషా గుప్తా -
వెన్ హ్యారీ మెట్ మార్కెల్
‘వెన్ హ్యారీ మెట్ శాలీ’ అన్న హాలీవుడ్ సినిమా వంద రకాలుగా, వంద భాషల్లో వందసార్లు వచ్చి ఉంటుంది. అంత ఇన్స్పైరింగ్ సినిమా. ఇంకో సినిమా కూడా వచ్చింది. ‘మెయిడ్ ఇన్ మాన్‌హట్టన్’. ఓ పెద్దింటి కుర్రాడికి ఓ పనమ్మాయికి మధ్యలో ప్రేమ. ఇంకో సినిమా కూడా వచ్చింది. ‘ప్రెట్టీ ఉమన్’. ఒక విటురాలికి, ఓ సూపర్ రిచ్ మ్యాన్కీ లవ్వు. చూశారా! ఈ అన్నీ సినిమాల్లోనూ గొప్పింటోడు పేదింటమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికేదో ఇంత ఐడెంటిటీ ఏడ్చింది. ఇక్కడే ప్రియాంకా చోప్రాకు కోపం వచ్చింది. తన స్నేహితురాలు మేఘనా మార్కెల్ ఒక మంచి యాక్టర్, సమాజ సేవకురాలు, యాక్టివిస్టు, పరోపకారి, అందగత్తె, అన్ని ఉండగా ప్రిన్స్ హ్యారీకి కాబోయే భార్యగా మాత్రమే మీడియా అంతా టముకు టమూ, టముకు టమూ అని టముకు కొట్టేస్తుంటే చిర్రెత్తదు మరీ. ప్రియాంకకు మార్కెల్ మంచి స్నేహితురాలు. త్వరలో ప్రిన్స్ హ్యారీతో పెళ్లి. ఇక ఇప్పుడు బ్రిటిష్ మీడియా అంతా.. ప్రియాంకా చోప్రాయే మార్కెల్‌కు ఫేవరెట్ అండ్ ఫస్ట్ బ్రైడ్స్మేడ్ (పెళ్లికూతురుకు సహాయకురాలు) అని టముకు మొదలుపెట్టింది. నిన్నటి దాకా మార్కెల్.. ప్రిన్స్ హ్యారీ లవర్‌గా గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు ప్రియాంక ఆవిడ బ్రైడ్స్మేడ్గా సూపర్ ప్రమోషన్ కొట్టేస్తోంది. ఏమైనా చెప్పండి. బాలీవుడ్ అమ్మాయిలు చాలా స్మార్ట్. ఎప్పుడూ ఎలాగైతేనేం అలా న్యూస్‌లో ఉంటారు. ఒక అమ్మాయికి, ఓ రాకుమారుడి కాబోయే భార్యగా కాకుండా వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తింపు ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చి ప్రియాంక చోప్రా మంచి గుర్తింపు కొట్టేసింది. -
రవిని మిస్సవుతున్నా!
రాత్రి చంద్రుణ్ణి చూడటం తప్ప డే టైమ్‌లో ప్రియాంకా చోప్రా రవిని చూడటంలేదట. అదేనండీ.. సూర్యుణ్ణి. ఎందుకలా అనుకుంటున్నారా? మరేం లేదు. రాత్రంతా షూటింగ్ చేసి, పగలంతా నిద్రపోతున్నారు. అది కూడా ఇక్కడ కాదు. దేశం కాని దేశంలో. న్యూయార్క్‌లో. అది కూడా సినిమా షూటింగ్ కాదు.. టీవీ సిరీస్ షూట్ కోసం. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా హాలీవుడ్‌కి వారికి పరిచయమయ్యారు ప్రియాంక. రెండు సిరీస్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. మూడో సిరీస్ ముచ్చటగా ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ థర్డ్ సిరీస్‌లో ప్రియాంకా చోప్రా పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నారు. అందుకోసం హెయిర్‌ని షార్ట్‌గా కట్ చేసుకుని కంప్లీట్‌గా న్యూ లుక్‌లోకి మారారు ప్రియాంక. ‘‘నైట్ షూట్ చేస్తున్నాం. సూర్యుడు ఉదయించక ముందే షూటింగ్ పూర్తవుతోంది. ఆ తర్వాత ఇంటికెళ్లడం.. కునుకు తీయడం. ఇదేం నాకు కొత్త కాదు. హిందీ సినిమాలకు బోలెడన్ని నైట్ షూట్స్ చేశాను’’ అని పేర్కొన్నారు ప్రియాంక. -
ప్రియాకృతి
దుస్తులు తయారుచేసే కళ ప్రియంకాచోప్రాలో లేదు కానీ, ఏ దుస్తులు... వేసినా కళకళలాడుతుంది ఆకృతికి తగినట్టు ఉండేలా దుస్తుల ఎంపికలో మనమూ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ వేడుకలోనైనా ప్రియాకృతిలా వెలిగిపోవచ్చు. ►ఇది సింగిల్‌పీస్ గౌన్. ఫిష్‌కట్ డిజైన్ కావడంతో శరీరాకృతిని అందంగా చూపుతుంది. ఈ గౌన్‌కి బాటమ్‌లో లేయర్ కట్ ఇచ్చి క్రాస్ వచ్చేలా కుట్టారు. ఇలాంటి డ్రెస్ బర్త్‌డే పార్టీలు, చిన్న చిన్న గ్యాదరింగ్స్కి బాగుంటుంది. మంచి శరీరాకృతి ఉన్నవారు చాలా తక్కువ ఆభరణాలతో ఇలాంటి డ్రెస్‌ను ధరించాలి. ►ఇది ఇండోవెస్ట్రన్ డ్రెస్. టాప్, బాటమ్ విత్ ఓవర్ కోటుతో ఈ స్టైల్ తీసుకురావచ్చు. ఇండియన్ ఎంబ్రాయిడరీ జర్దోసీ వర్క్‌తో కోటు ని అందంగా తీర్చిదిద్దారు. శాటిన్ ఫ్యాబ్రిక్ తో టాప్, బాటమ్ ని డిజైన్ చేశారు. అఫీషియల్ మీటింగ్స్, పార్టీలకు ఈ తరహా డ్రెస్సింగ్ బాగా నప్పుతుంది. ►లేస్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తుల్లో ఏ అమ్మాయి అయినా అందంగా కనిపిస్తారు. ఈ డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద లేస్‌ని జత చేసి డిజైన్ చేశారు. బాటమ్‌గా స్కర్ట్ డిజైన్ చేశారు. స్కర్ట్ వద్దనుకుంటే బాటమ్‌గా పెన్సిల్ కట్ ప్యాంట్ వేసుకోవచ్చు. ►ఈ స్కర్ట్ హ్యాండ్ ఓవెన్ బెనారసీ స్కర్ట్. దీని మీద పికాక్ మోటివ్స్ అందంగా అమరాయి. ఈ స్కర్ట్ మీదకు ప్లెయిన్ ఐవరీ శాటిన్ షర్ట్ వేయడంతో రిచ్ లుక్ వచ్చేసింది. సాయంకాలాలు జరిగే ఏ వేడుకకు ఈ కాంబినేషన్ డ్రెస్ ధరించినా స్టైలిష్‌గా కనిపిస్తారు. ►ఈ శారీ సిల్వర్ టిష్యూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. దీని మీద గోల్డెన్ జర్దోసీ ఎంబ్రాయిడరీ చేసి, పూర్తి కాంట్రాస్ట్ పింక్ బార్డర్ ఇచ్చారు. దీని వల్ల యూత్‌ఫుల్ లుక్ వచ్చేసింది. ► ఇది పూర్తి వెస్ట్రన్ లుక్. ఈవెనింగ్ వేర్‌గా అమ్మాయిలు బాగా ఇష్టపడే డ్రెస్. ఇది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. బాటమ్‌లో ఫ్రీ ఐరన్ ఫ్యాబ్రిక్‌ని జత చేశారు. లేయరీ ఎఫెక్ట్ ఇవ్వడంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది ఏ ఈవెనింగ్ పార్టీకి ధరించినా సూపర్బ్ అనే ప్రశంసలు పొందుతారు. - భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్ -
ప్రియాంకకు షాక్..
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్వస్థలమైన బరేలీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. బరేలీలో నివసించడం లేదని ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా పేర్లను ఓటర్ లిస్టు నుంచి బుధవారం తొలగించారు. ప్రియాంక మిస్ వరల్డ్‌గా ఎంపికైనప్పుడే వారి కుటుంబం బరేలీ నుంచి ముంబైకి వలస వెళ్లిందని, సుమారు 17 ఏళ్ల నుంచి వారి ఇంటికి తాళం వేసుండటంతోనే ఓటర్ లిస్టు నుంచి తొలిగించామని జిల్లా మెజీస్ట్రిక్ అధికారి కెప్టెన్ ఆర్ విక్రమ్ సింగ్ మీడియాకు తెలిపారు. బరేలీ 50వ వార్డులో వీరికి ఓటు హక్కు ఉందని, ఇక్కడ నివసించడం లేదని ఓ స్థానిక నివాసి బ్లాక్ లెవల్ ఆఫిసర్‌కు ఫిర్యాదు చేశారని డీఎం చెప్పారు. బీఎల్ఓ ఆఫీసర్ ఆదేశాలతోనే వారి పేర్లు తొలిగించామన్నారు. ఇక ప్రియాంక తండ్రి కల్నల్ అశోక్ చోప్రా 2012లోనే బరేలీలో నివసించడం లేదనే విషయాన్ని జిల్లా అధికారులు తెలియజేశాడని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే ప్రియాంక ఫ్యామిలీకి ముంబైలో ఓటు హక్కు ఉందో లేదో అనే విషయం తెలియరాలేదు. -
గ్లోబల్ స్టార్‌కు మరో గౌరవం
సాక్షి,న్యూఢిల్లీ: గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళ-2017 జాబితాలో ప్రియాంకకు చోటుదక్కింది. అమెరికన్ టీవీ సీరియల్ క్వాంటికో సీజన్ 3లో నటించిన ప్రియాంక హాలీవుడ్‌నూ మెప్పించారు. ఇక ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల టాప్ 100 జాబితాలో ప్రియాంక చోప్రాకు 97వ స్ధానం దక్కింది. హాలీవుడ్లో ఆమె చేపట్టిన ప్రాజెక్టులు, ఛారిటీ పనులతో ప్రియాంకకు ప్రజాదరణ మరింత పెరిగింది. ఫోర్బ్స్ జాబితాలో తొలిస్ధానం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ దక్కించుకోగా, బ్రిటన్ ప్రధాని థెరెసా మే, పారిశ్రామికవేత్త మెలిందా గేట్స్ తర్వాతి స్ధానాల్లో నిలిచారు.భారత్ నుంచి ఈ జాబితాలో చోటు సాధించిన శక్తివంతమైన మహిళల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచ్చర్తో పాటు కిరణ్ మజుందర్ షా, రోష్ని నాడార్ మల్హోత్ర, శోభనా భార్తియాలున్నారు. -
ప్రియాంక పోయె ఐష్ వచ్చె!
యస్... ఫేమస్ బ్యూటిషియన్ షానాజ్ హుసేన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటించనున్నారట. కథానాయికగా పలు హిందీ చిత్రాల్లో నటించి, ఆరేళ్ల క్రితం చిన్న ఎన్టీఆర్ ‘శక్తి’లో క్యారెక్టర్ నటిగా కనిపించిన పూజా బేడీ ఈ చిత్రానికి దర్శకురాలు. ముందు ఈ సినిమాలో ప్రియాంకా చోప్రాని కథానాయికగా అనుకున్నారట. అయితే, ప్రియాంక హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ బయోపిక్ విషయమై క్లారిటీ ఇవ్వడంలేదట. దాంతో పూజా బేడీ మనసులోకి ఐశ్వర్యా రాయ్ వచ్చారు. ఈ చిత్రానికి కమలేశ్ పాండే కథ అందిస్తున్నారు. ఆయన కూడా షానాజ్ హుసేన్ పాత్రకు ఐశ్వర్యా రాయ్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు. చేస్తే ఐశ్వర్యే చేయాలన్నంతగా పూజా బేడీ ఫిక్స్ అయ్యారట. ఆమె అలా ఫిక్స్ కావడానికి కారణం ‘సరబ్జిత్’ సినిమా. పంజాబ్‌కి చెందిన సరబ్జిత్ పొరపాటున పాక్ సరిహద్దుల్లోకి వెళ్లడం, అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసి, జైల్లో పెట్టడం, తమ్ముణ్ణి విడిపించడానికి అక్క దల్బీర్ కౌర్ పడిన ఆరాటం, చివరికి సరబ్జిత్ పాక్ జైల్లోనే కన్ను మూయడం తెలిసిందే. ‘సరబ్జిత్’ సినిమాలో దల్బీర్ కౌర్ పాత్రను ఐష్ అద్భుతంగా చేయడంతో, ‘షానాజ్’ బయోపిక్కు ఐష్ న్యాయం చేస్తారని పూజా బేడి భావిస్తున్నారట. ఈ కథను ఐష్‌కి చెప్పారట కూడా. ఈ అందాల సుందరి ఇంప్రెస్ అయ్యారని టాక్. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ ‘ఫాన్నీ ఖాన్’లో నటిస్తున్నారు. ఆ సినిమా డేట్స్ చూసుకుని, పూజా బేడీకి డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారట. ఇంతకీ షానాజ్ హుసేన్ ఎవరంటే...సాందర్య సాధనాల వ్యాపారవేత్త. రసాయనాలు లేకుండా మూలికలతో తయారు చేసిన ఉత్పత్తులు షానాజ్ స్పెషాల్టీ. చిన్నగా మొదలై, పెద్ద స్థాయికి ఎదిగారామె. ‘పద్మశ్రీ’ అవార్డుగ్రహీత కూడా. ఉత్తమ మహిళా వ్యాపారవేత్తగా పేరుంది. టోటల్‌గా షానాజ్ది సక్సెస్ఫుల్ స్టోరీ. ఆమె జీవితం చాలామందికి ఆదర్శంగా ఉంటుందనే పూజా బేడీ ఈ బయోపిక్ తీయాలనుకున్నారు. -
బాలీవుడ్‌కు దారేది!
తమిళసినిమా: ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలవైపు చూస్తుంటే మనవాళ్లకు మాత్రం ఇప్పటికీ బాలీవుడ్‌పై మోజు ఏమాత్రం తగ్గలేదని నయనతార మరోసారి రుజువు చేశారు. అంతేకాదు డబ్బెవరికి చేదు పిచ్చోడా అన్నట్టుగా తనకు సినిమాలే చాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించను అని పెద్దపెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన నయనతార, చివరికి ఒక శాటిలైట్ సంస్థ ఆఫర్‌గా ప్లాట్ అయిపోయి దాని ప్రచారయాడ్లో నటించేసింది. అదేవిధంగా ఇప్పటి వరకు దక్షిణాది చిత్రాలు చాలు, ఉత్తరాదికి దూరం అంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిందీ చిత్రాలపై మోజు పడుతోంది. దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతారకిప్పుడు నిజానికి చేతినిండా చిత్రాలున్నాయి. అయినా తన పరిధిని పెంచుకోవడం కోసమో లేక మరింత ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆశతోనే బాలీవుడ్ రంగప్రవేశానికి పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం. నయనతార ఇప్పుడు మరో పనిలో కూడా బిజీగా ఉంది. తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో షికార్లు కొడుతున్న నయనతార ఇటీవల ఆయన పుట్టిన రోజును న్యూయార్క్‌లో జరిపి వార్తల్లోకెక్కింది. అయితే అక్కడ ఈ భామ స్వకార్యం, స్వామి కార్యం అన్నట్టుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కి వెళ్లిన బాలీవుడ్ క్రేజీ నటి ప్రియాంకచోప్రాను కలిసి కాసేపు ముచ్చటించిందట. పనిలో పనిగా తనకు హిందీ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని ప్రియాంకచోప్రా ముందు వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అవకాశాలను సంపాదించుకోవడానికి దారేంటని సలహాను కూడా అడిగేసిందట. మొత్తం మీద నయనతార బాలీవుడ్ రంగప్రవేశానికి సిద్ధం అవుతోందన్నమాట. -
ప్రియాంక8!
ప్రియాంకా చోప్రా ఇప్పుడు దేశీ స్టార్ మాత్రమే కాదు.. అమెరికన్ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా చిన్ని తెరకు వెళ్లి, ఇంటర్నేషనల్ లెవల్ పాపులార్టీ సంపాదించుకున్నారు. పాపులార్టీతో పాటు ప్రియాంక సంపాదన కూడా ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయింది. గత ఏడాది జూన్1 నుంచి 2017 జూన్ 1 వరకు ఎక్కువ సంపాదించిన టీవీ నటీమణుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక బయటపెట్టింది. అందరూ హాలీవుడ్ తారలు ఉన్న ఈ లిస్టులో మన ప్రియాంకా చోప్రా పేరు ఉండటం విశేషం. టీవీ షోస్, యాడ్స్ ద్వారా ఈ బ్యూటీ దాదాపు 70 కోట్లు సంపాదించి, ఎనిమిదో స్థానంలో నిలిచారని సదరు పత్రిక పేర్కొంది. కాగా, కొలంబియా నటి సోఫియా వెర్గరా ఎక్కువ సంపాదిస్తున్న తారగా ఆరేళ్లుగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రియాంకా చోప్రాకన్నా నాలుగింతలు.. అంటే దాదాపు 280 కోట్లు సోఫియా సంపాదిస్తున్నారట. ఏదేమైనా విదేశీ తారల జాబితాలో దేశీ తార ప్రియాంక ఉండడం అభినందనీయమే. -
ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక
లాస్ ఏంజెలిస్: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన టాప్–10 జాబితాలో ప్రియాంకా ఎనిమిదో స్థానం కైవసం చేసుకున్నారు. ‘క్వాంటికో’ టీవీ షోతో పశ్చిమదేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకా.. ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇక, రూ.271.85కోట్ల ఆర్జనతో కొలంబియా నటి సోఫియా వెర్గారా వరసగా ఆరో ఏడాదీ టాప్–10లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్ అనాటమీ నటీమణి ఎలెన్ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు. -
'సినీ రంగంలో ఎవరూ నెం 1 కాదు'
ముంబై: చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ అంటూ ఎవరూ ఉండరని బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా అన్నారు. నెంబర్ వన్ స్థానం ప్రతీ శుక్రవారం మారుతుంటుందని, చిత్రం వసూళ్లు వారి స్థానంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే టాప్-5 కథానాయికల్లో తాను కచ్చితంగా ఉంటాని తెలిపారు. తానెప్పుడూ స్టార్లా భావించనని ప్రియాంక చోప్రా అన్నారు. ఈ రంగంలో సాధించానన్న సంతృప్తి ఉందని చెప్పారు. తన 13 ఏళ్ల కెరీర్లో ఎత్తుపల్లాలను చవిచూశానని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులకు వినోదం అందించటానికి మెరుగ్గా పనిచేయాలని తాను కోరుకుంటానని చెప్పారు.