Priyanka Chopra Shares Her Daughter First Pic On Mothers Day - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది..

Published Mon, May 9 2022 10:54 AM | Last Updated on Mon, May 9 2022 11:33 AM

Priyanka Chopra Shares Her Daughter Malti Marie First Pic Gets EMotional - Sakshi

Priyanka Chopra Shares Her Daughter Malti First Pic: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్‌ జోనస్‌లు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడు బేబీ బంప్‌తో కనిపించని ప్రియాంక ఆకస్మాత్తుగా తల్లైనట్లు ప్రకటించడం అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సరోగసి ద్వారా వారు తల్లిదండ్రులు అయినట్లు ప్రియాంక సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేసింది. 

చదవండి: మదర్స్‌డే: అమ్మతో మెగా బ్రదర్స్‌.. వీడియో వైరల్‌

అంతేగాక ఇటీవల తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్‌’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ పంచుకుంది. ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్‌ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్తీ 100 రోజులకు పైగా హాస్పిటల్‌లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. 

చదవండి: 'ప్రాజెక్ట్‌ కె'లో బాలీవుడ్‌ హీరోయిన్‌, వైరల్‌ అవుతున్న పోస్ట్‌!

లాస్‌ ఎంజల్స్‌లోని పిల్లల హాస్పిటల్‌లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు తమ కూతురు పూర్తి ఆరోగ్యం ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్‌ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్‌పై పులువురు బాలీవుడ్‌ స్టార్స్‌ స్పందిస్తూ వారు సైతం ఎమోషనల్‌ అయ్యారు. ప్రితీ జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక ఆరోరాలు కామెంట్స్‌ చేస్తూ లవ్‌ ఎమోజీతో ప్రియాంక, నిక్‌ దంపతుల కూతురు మల్తీకి స్వాగతం పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement