Mothers Day
-
కుమారునితో స్టార్ హీరోయిన్.. వీడియో పోస్ట్ చేసిన భర్త!
ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్ నెలలో నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌లో తమ జీవితంలో రీల్ విషయం, రియల్ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్‌శివన్ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్‌లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024 -
అమ్మ ప్రేమను వర్ణించే మధురమైన పాటలు
ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతిఒక్కరూ పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒక తల్లికి మాత్రమే! నవ మాసాలు మోసి.. పురిటినొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే! బిడ్డ క్షేమారోగ్యాలే తన సిరిసంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పదనాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. అందుకే కళాకారులు పాటల రూపంలో తనను పొగిడారు. పాటల రూపంలో తన స్వభావాన్ని, త్యాగాన్ని వర్ణించారు. నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలను కొన్నింటిని కింద ఇచ్చాం.. విని ఆనందించండి..1. నాలో నిను చూసుకోగా.. 2. వంద దేవుళ్లే కలిసొచ్చినా.. 3. అమ్మా.. అమ్మా.. నే పసివాణ్నమ్మా.. 4. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా.. 5. సువ్వి సువ్వాలమ్మా.. 6. ఎదగరా.. ఎదగరా.. 7. అమ్మా అని కొత్తగా.. 8. అమ్మ 9. అమ్మనే అయ్యానురా.. 10. అమ్మా.. అమ్మా.. నీ వెన్నెల.. 11.. అమ్మా.. వినమ్మా.. 12. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా.. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమా పాటలు అమ్మ ప్రేమను కమ్మగా వినిపించాయి. సినీ సాంగ్సే కాకుండా.. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో.. ఇలా ఎన్నో జానపద పాటలు సైతం తల్లి మమకార మాధుర్యాన్ని గుర్తు చేశాయి. -
మదర్స్ డే వెనకాల మనసును కదిలించే కథ!
అవతార మూర్తి అయిన అమ్మ ప్రేమకు దాసోహం అన్నాడు. కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ అని పురాణాలు సైతం చెబుతున్నాయి. అలాంటి అపురూపమైన అమ్మ ప్రేమ, సేవలను తలుచుకుని గౌరవించడం కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డేని వేడుకగా జరుపుకుంటున్నాం. అయితే ఈ మదర్స్ డే ఎలా ప్రాచుర్యంలోకి వచ్చి ఎలా ఏర్పడిందో వింటే మనసు భావోద్వేగానికి గురవ్వుతుంది. అమ్మ అనే రెండు అక్షరాలు ఎంతటి బాధనైనా పోగొట్టేస్తుందనడానికి ఈ గాదే ఉదహారణ.అమెరికా అంతర్యుద్ధం...1861-65 కాలం అమెరికాలో భయంకరంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో అప్పటిదాక ఒకటిగా ఉన్న ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోయారు యూనియన్ కాన్ఫడరేంట్ అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు అలాంటి సమయంలో వర్జినియాలో శత్రువులకు సంబంధించిన సైనికుడు చనిపోయారు. అతన్ని చూడటానికి ఎవరూ ముందుకు రాలేదు. మూపైళ్లు కూడా లేని ఓ మహిళ మాత్రం అతనని సాటి మనిషిగా భావించింది. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించింది.ఆమె పేరు యాన్ జార్వీస్. కేవలం ప్రార్దనలతో సరిపెట్టలేదు. తను స్దాపించిన మదర్స్ డే వర్క్స్ క్లబ్‌తో ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించే యత్నం చేశారు. దేశంలో ప్రతిఒక్కరూ ఎవరోఒకరి పక్షాన ఉండితీర్సాలిన ఆ పరిస్దితిలో కూడా తమ క్లబ్ యుద్ధానికి వ్యతిరేకమని ఏ పక్షంవైపు ఉండబోమని స్పష్టం చేశారు. ఆ క్లబ్ ఏ సైనికుడు అవసరంలో ఉన్నా.. తిండి, బట్టలు అందించారు. సైనిక శిబిరంలో టైఫాయిడ్ లాంటి మహమ్మారి విజృంభిస్తుంటే సపర్యలు చేశారు.ఇంతకీ ఈ యాన్ ఎవరంటే..1832లో వర్జీనియాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు యాన్. తన జీవితం సాఫీగా సాగిపోతుండేది. నచ్చిన వ్యక్తితో పెళ్లి ఆ తర్వాత పిల్లలు. అక్కడ నుంచే తనని కలిచి వేసే సంఘటనలు సందర్భాలు ఎదురు పడ్డాయి. అప్పట్లో పసిపిల్లలు చనిపోవడం ఎక్కువగా ఉండేది. అలానే యాన్‌కి పుట్టిన 13 మంది పిల్లల్లో నలుగురు మాత్రమే ఉన్నారని చెబుతారు. టైఫాయిడ్, డిప్తీరియా వంటి వ్యాధుల వల్ల ప్రతీ ఇంట్లో ఇలాంటి పరిస్దితే ఉండేది. యాన్ తన పిల్లలను ఎలాగో కోల్పోయింది. కానీ ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం కనుక్కోవాలనుకుంది. వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం, సమయానికి మందులు వాడకపోవడం శుభ్రత లేకపోవడం వంటివే శిశు మరణాలకు కారణమని తెలుసుకుంది. దాంతో మదర్స్‌డే వర్క్ క్లబ్స్‌ని ఏర్పాటు చేసింది. అయితే చాలామంది దీనిలో చేరి సేవలందించేందుకు ముందుకు వచ్చారు. వాళ్లంతా ఇంటిఇంటికి వెళ్తూ పసిపిల్లలకు వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పిస్తూ..మందులు ఇస్తూ సేవలు చేశారు. అలా పసిపిల్లల మరణాలను చాలా వరకు తగ్గించగలిగారు. అదుగో అలాంటి సమయంలో అమెరికన్ అంతర్యుద్ధం రావడంతో శాంతిని నెలకొల్పేందుకు మదర్స డే వర్స్ క్లబ్స్ మరో అడుగు వేశాయి. అవి ఎంతలా విజయం సాధించాయంటే..యుద్ధం పూర్తి అయిన తర్వాత ప్రజలందరిని ఒకటి చేసేందుకు అధికారులు యాన్ని సంప్రదించారు. దాంతో యాన్ 'మదర్స్ ఫ్రెండ్ షిప్ డే' పేరుతో రెండు వర్గాలకు చెందిన సైనికుల కుటుంబాలని ఒకటి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పనిచేస్తే ఊరుకునేది లేదంటూ అధికారులు సీరియస్ అయ్యారు. వాళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గకుండా ఇరు సైనికుల కుటుంబాలను సమావేశ పరిచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పూర్తి స్దాయిలో సఫలం అయ్యింది యాన్. తల్లి ప్రేమతో ఎలాంటి సమస్యనైనా పరిష్కిరించొచ్చని చాటిచెప్పింది.తన తల్లిలాంటి వాళ్ల కోసం..అలా ఆమె తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక స్వచ్ఛంద సేవలో పాల్గొంటూనే ఉన్నారు యాన్. 1905లో యాన్ చనిపోయారు. యాన్ కూతురైన అన్నాకు తల్లి అంటే ఆరాధనగా ఉండేది. ఆమె కెరీర్లో ఎన్నో విజయాలు సాధించినా..తల్లి ఆశయాలు వాటి కోసం ఆమె చేసిన కృషి చూసి గర్వపడేది. అందుకే తల్లి చనిపోయాక తన తల్లిలాంటి వాళ్లని తలుచుకునేందుకు ప్రత్యేకంగా ఓ రోజు ఉండాలని, మదర్స్ డే ఏర్పాటు చేసి, దాన్ని పాటించాలనే ఉద్యమం మొదలు పెట్టింది. నిజానికి ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి అమ్మకోసం కేటాయించడం అనేది అప్పట్లో కొత్తేమి కాదు. ఈస్టర్కి ముందు ఒక నలభై రోజుల పాటు సాగే లెంట్ అనే సంప్రదాయంలో భాగంగా దూరంగా ఉన్న పిల్లలు తల్లిదగ్గరకు వచ్చే ఆచారం ఒకటి ఉంది. ఈజిప్టు నుంచి రష్యా వరకు మదర్స్ డే వంటి సంప్రదాయాలను పాటిస్తారు. కాకపోతే యాన్ కూతురు మొదలు పెట్టిన మదర్స్ డే కాస్త వ్యక్తిగతంగా, ఆధునికంగా కనిపిస్తుంది. అందుకే త్వరలోనే ప్రచారంలోకి వచ్చేసింది. మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాటం..క్రమంగా మదర్స్ డే ప్రతి ఇంటికి చేరుకుంది. కానీ దాని మొదలు పెట్టిన అన్నా మాత్రం సంతోషంగా ఉండేది కాదు. తల్లిని తలుచుకుని తనతో మనసులోని మాటను పంచుకోవాల్సిన సమయాన్ని ఇలా గ్రీటింగ్ కార్డుల తంతుగా మారడం చూసి బాధపడేది. ఒక తెల్లటి పువ్వుని ధరించి తల్లిని గుర్తు చేసుకోవాలనే 'మదర్స్ డే; సంప్రదాయం పూల వ్యాపారంగా మారడం చేసి అన్నా మనసు విరిగిపోయింది. అందుకే తను మొదలు పెట్టిన మదర్స్‌డే ని రద్దు చేయాలంటూ మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. చివరి రోజుల వరకు మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాడింది. ఇక ఓపిక లేని దశలో ఓ శానిటోరియంలో చేరి దయనీయమైన స్దితిలో చనిపోయింది. మదర్స్ డే మొదలై ఇప్పటికీ నూరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రెండు భిన్నమైన మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఫార్మాల్టిగా అమ్మను తలుచుకోవడమా!..లేకపోతే ప్రేమకు, సహనానికి మారురూపం అయిన అమ్మ పట్ల అభిమానాన్ని చాటుకోవడమా! చాయిస్ ఈజ్ అవర్స్..!.(చదవండి: మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు) -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్‌లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్‌లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్‌లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్‌గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్‌లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్‌కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్‌ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్‌హుడ్‌ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్‌తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్‌కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్‌ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...పెద్దవయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.క్రమం తప్పని వ్యాయామంఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు పట్టించుకోరు.ఆహారం పట్ల నిర్లక్ష్యంఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్‌ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్‌తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.కింగ్ లాంటి లంచ్కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్‌లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి. స్నాక్స్రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.చివరిగాఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! -
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’, ‘‘అమ్మను మించిన దైవమున్నదా..‘‘ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’’ ఇలా ఎలా పాడుకున్నా..అమ్మకు సాటి పోటీ ఏమీ ఉండదు. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు తన చివరి శ్వాసదాకా బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అంతటి ప్రేమమూర్తి అమ్మ. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు అందించే వేళ మీరు మీ అమ్మకు విషెస్ ఇలా చెప్పండి.నిజానికి అమ్మ ప్రేమను ఒకరోజుకో, ఒక్క క్షణానికో పరిమితం చేయడం అసాధ్యం. ప్రతీ రోజూ ప్రతీక్షణం అమ్మను ప్రేమించాలి. మనకు జీవితాన్నిచ్చిన అమ్మకు జీవితాంతం రుణ పడి ఉండాల్సిందే.ఈ మాతృ దినోత్సవం రోజున అమ్మను సర్ ప్రైజ్ చేద్దామాపొద్దున్న లేవగానే హ్యాపీ మదర్స్ డే అంటూ అమ్మకు విషెస్ చెప్పండి. ఆనందంగా ఆలింగనం చేసుకోండి. హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకోండి. మామ్.. నాకు లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ..లవ్యూ అని చెప్పండి. అంతే అపుడు అమ్మ చూపించే మీప్రేమకు మీ కన్నీళ్లు ఆగవు అంతే. అమ్మ ప్రేమ అలాంటిది మరి. అమ్మకిష్టమైన వంటఅమ్మ రోజూ మనకోసం ఎన్నో చేసి పెడుతుంటుంది. స్కూలుకు, కాలేజీకి, పట్టుకెళ్లిన బాక్స్ పూర్తిగా తినలేదని కోప్పడుతుంది కదా. అందుకే మదర్స్ డే రోజు తనకోసం, తన ఇష్టాఇష్టాలను గురించి, అమ్మకోసం మంచి వంటకం చేసి పెట్టండి. అమ్మకోరిక తెలుసుకోండినిరతరం మనకోసం ఆలోచించే అమ్మ తన గురించి, తన కోరికలు గురించి అస్సలు పట్టించుకోదు. అందుకే ఆమెకు ఏది ఇష్టమో బాగా ఆలోచించండి. స్పెషల్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేయండి. మంచి పుస్తకం, చీర, మొక్కలు లాంటివి కొనివ్వండి. లేదంటే వంట ఇంటి పనిలో భాగంగా ఇది ఉంటే బావుండు ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుందో దాని గుర్తించి ఆ వస్తువును ఆమెకు అందుబాటులోకి తీసుకురండి. అమ్మ సంబరం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసు.అమ్మతో బయటికికుటుంబంకోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పక్కన బెట్టే అమ్మను సరదాగా అలా బయటికి తీసుకెళ్లండి. అది మూవీ కావచ్చు, హోటల్‌కి కావచ్చు, మ్యూజిక్ కన్సర్ట్కి కావచ్చు. లేదంటే అమ్మకెంతో ఇష్టమైన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లండి.స్పాకి తీసుకెళ్లండిసంవత్సరమంతా బిడ్డల కోసం కష్టపడే అమ్మను ఆమెను స్పాకి తీసుకెళ్లండి. తల్లికి అలసట నుండి ఉపశమనం కలిగించే ప్రత్యేక స్పా ప్యాకేజీని తీసుకోండి. కొత్త ఉత్సాహం వచ్చేలా ఏదైనా గ్రూమింగ్‌కి ప్లాన్ చేయండి. తన కోసం ఆలోచించే బిడ్డలు ఉన్నారనే తృప్తి మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది. దూరంగా ఉన్నారా..అమ్మకు దూరంగా ఉన్నా పరవాలేదు. అమ్మకు దగ్గరగా లేనని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి. ఎలా ఉన్నావు? అమ్మా అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడండి. ఆమె మనసులో ఏముందో తెలిసుకునే ప్రయత్నం చేయండి. నీను నేను న్నాను అనే భరోసా ఇవ్వండి. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. మీరు చేసే ఏ చిన్నపని అయినా ఆమెకు కొండంత సంతోషాన్నిస్తుంది.అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే! అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే!! -
మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు
సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకునే రోజే మదర్స్ డే. మే నెల రెండోఆదివారం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మాతృమూర్తుల త్యాగాలను, కష్టాలను గుర్తించడం, తిరిగి ప్రేమను అందించడమే ఈ మదర్స్ డే లక్ష్యం.అంతులేని త్యాగానికి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం. ఆ దేవదేవుడికైనా, సామాన్య మానవుడికైనా అమ్మే ఆది దైవం, గురువు అన్నీ.ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా , అమెరికాలలో మే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. 1908వ సంవత్సరంలో అమెరికాకు చెందిన కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లిని గౌరవించేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని ప్రారంభించింది. ఆ తరువాత తల్లి కష్టాలను గుర్తించే రోజుగా మదర్స్‌డేగా ప్రాచుర్యంలోకి వచ్చింది.మదర్స్ డే చరిత్రనిజానికి మదర్స్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది. పురాతన గ్రీకు నాగరికతలో వసంత వేడుకలా దీన్ని జరుపుకునేవారు. రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్‌గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి నివాళులర్పించే వారు. 17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు. అదే 1872 లో అయితే జూలియ వర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని నిర్వహించారు.అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. 1914 నుంచి అధికారికంగా జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి మేనెలలో వచ్చే రెండో ఆదివారం మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో మదర్స్ డే జరుపుకుంటారు.ఏడాదికి రెండు సార్లు మదర్స్ డే?కొన్ని దేశాల్లో మార్చిలో కూడా జరుపుకుంటారు. యూకే, కోస్టారికా, జార్జియా, సమోవా , థాయిలాండ్‌లలో ఈస్టర్ ఆదివారం కంటే మూడు వారాల ముందు మదర్స్ డే జరుపుకుంటారు.మదర్స్ డే వెనుక ఇంత కథ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి. అమ్మ ప్రేమని ఈ కేవలం ఒక్కరోజు స్మరించుకుంటే సరిపోతుందా? ఒక గులాబీ పువ్వో, లేదా ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక హగ్ ఇచ్చేస్తే సరిపోతుందా? ఎంతమాత్రం కానే కాదు. కల్మషం ఎరుగని అమ్మ సేవలకు విలువ కట్టలేం. కానీ కన్నబిడ్డగా ఆమె రుణం తీర్చుకోవచ్చు. అమ్మకు అమ్మంత ప్రేమను తిరిగి ఇచ్చేయండి. అమ్మకు అండగా నిలవండి. ఈ సంవత్సరం మదర్స్ డే రోజు అమ్మకు ఇంతకంటే అద్భుతమైన బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. -
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే.. -
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా
ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్ డే’.» అమ్మ ఫోన్ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్ కాల్కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్ వాచ్ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్ రేడియో), మంచి ఫోన్ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్ సబ్స్క్రిప్షన్, ఓటీటీల సబ్స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం. -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
మీర్పేట్లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్‌డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్లో నివాసముంటున్న శ్రీను నాయక్‌కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి.. -
Mother's Day 2023: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' హవా..
'అమ్మ' అనే పదాన్ని వర్ణించడానికి పదాలు చాలవు, శ్లోకాలు చాలవు ఆఖరికి గ్రంధాలు కూడా చాలవు. ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు బానిస అవుతాడు అనేది శాసనం. ఏ రంగంలో అయినా, ఏ సందర్భంలో అయినా.. భూమి నుంచి ఆకాశం వరకు ఏదైనా చెయ్యగలిగే శక్తి మాతృమూర్తి సొంత. ఇక వ్యాపార రంగంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 'మాతృ దినోత్సవం' సందర్భంగా వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్తున్న నలుగురు తల్లీ కూతుళ్ళ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.. ఫల్గుణి & అద్వైత నాయర్ అమెరికాలో ఉద్యోగం వదిలి తన తల్లి ఫల్గుణి నాయర్ సహాయంతో వ్యాపార రంగంలో ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఫల్గుణి నాయర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె 2021లో చాలా విజయవంతమైన IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,000 కోట్లకు పైగా ఉన్న Nykaa CEO కూడా. ఈ కంపెనీకి అద్వైత నాయర్ నేతృత్వంలోని Nykaa ఫ్యాషన్ అనే ఫ్యాషన్ విభాగం తోడైంది. ఉన్నత చదువులు చదువుకున్న అద్వైత కంపెనీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. 10 మందితో ప్రారంభమైన వీరి కంపెనీ ఇప్పుడు 3000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. తల్లీ, కూతుళ్లు నైకా బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులు విక్రయిస్తూ విజయాల బాటలో ప్రయాణిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వీరి ఆదాయం రూ. 724 కోట్ల కంటే ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి కృషి చేయడానికి కావలసిన ఎన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఫల్గుణి నాయర్ & అద్వైత భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరుగా ఉన్నారు. వీరి నికర ఆస్తుల విలువ రూ.20,000 కోట్లు. షహనాజ్ హుస్సేన్ & నెలోఫర్ కర్రింబోయ్ షహనాజ్ హుస్సేన్ భారతదేశంలోని షహనాజ్ హుస్సేన్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈమె హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు, ఆయుర్వేదంలో భారతీయ మూలికా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. వాణిజ్య పారిశ్రామిక రంగంలో షహనాజ్ కృషికి భారత ప్రభత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. షహనాజ్ హుస్సేన్ కుమార్తె నెలోఫర్ కర్రింబోయ్ కూడా తల్లి మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఈ తల్లీ కూతుళ్ల ద్వయానికి చెందిన బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. టెక్నాలజీ పట్ల నీలోఫర్స్కు ఉన్న ఆసక్తి ఆయుర్వేదం, బ్యూటీ రంగంలో మరింత మంచి భవిష్యత్తుకు మార్గదర్సకం కానుంది. శోభన కామినేని & ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్ సామ్రాజ్య స్థాపనకు కారకులైన కుటుంబానికి చెందిన శోభన కామినేని & ఉపాసన కామినేని కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ 'శోభనా కామినేని', అపోలో హాస్పిటల్స్‌లోని CSR వైస్ చైర్‌పర్సన్‌గా 'ఉపాసన కామినేని' పనిచేస్తున్నారు. ఉపాసన ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ద వహించే మెళుకులను తెలియజేస్తూ.. మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వరిస్తోంది. జయ & శ్వేతా శివకుమార్ వై సో బ్లూ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మారిన తల్లీ కూతుళ్లే జయ & శ్వేతా శివకుమార్. వారి కుటుంభంలో ఒక విషాద సంఘటన జరిగిన తరువాత వారు ఈ సంస్థకు ప్రాణం పోశారు. ఆధునిక కాలంలో అద్భుతమైన డ్రెస్ బ్రాండ్ ప్రారంభించి వీరి జీవిత కాల కళను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వారు అద్భుతమైన పర్యావరణ స్పృహతో కూడిన కాటన్ దుస్తుల బ్రాండ్‌ను సృష్టించి మంచి లాభాలను గడిస్తున్నారు. నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. (అమ్మతో సమానమైన పూజ్యులు గానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు) అన్న మాటలు ఇప్పటికే నిత్య సత్యాలే.. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి సాక్షి బిజినెస్ తరపున శుభాకంక్షాలు. -
ప్రపంచంలో బెస్ట్ మదర్ నువ్వే.. భార్యకు విఘ్నేశ్ శివన్ విషెస్
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అంతలా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగు, తమిళ, మళయాళంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ చిత్రంలో కనిపించనుంది. అగ్ర హీరోలతో జతకట్టిన నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్!) అయితే ఈ జంట గతేడాది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన తల్లితో దుబాయ్‌లో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) విఘ్నేశ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రియమైన నయన్ ... ఒక తల్లిగా నీకు 10కి 10 మార్కులు. నీ అపారమైన ప్రేమ, శక్తి నాకు రక్ష. నీకు మొదటి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఒక కల నిజమైంది. ఉయిర్, ఉలగం కవలలతో ఆశీర్వదించిన దేవుడికి నా ధన్యవాదాలు. యూ ఆర్ ది బెస్ట్ మదర్ ఇన్ ది వరల్డ్' అంటూ పోస్ట్ చేశారు. నయనతార పిల్లలను ఎత్తుకుని ఫోటోలను పంచుకున్నారు. ఆస్పత్రిలో తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నయన్ అరుదైన పిక్స్ మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) అలాగే తన తల్లి మీనాకుమారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నువ్వు చూపించిన ప్రేమ, అప్యాయతలే మా జీవితాన్ని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తకు ఎదిగేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి నువ్వే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్‌లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్‌బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్‌గా మెప్పించిన నిహారిక.. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. అమ్మకు మేకప్ వేస్తూ ఆమె గొప్పదనం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) నిహారిక తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అమ్మ నా చిన్నప్పుడు నన్ను చాలా బాగా అలంకరించేది. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా. అమ్మ నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. ఈ ప్రత్యేకమైన రోజు అమ్మ బయటికి వెళ్లేందుకు అమ్మను రెడీ చేస్తున్నా. ఇలా చేయడం నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అమ్మ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. నిహారిక నటించిన వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: బెడ్‌పై ఒకరు, మైండ్‌లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Ishita Dutta: మదర్స్ డే నాకు ఎంతో ప్రత్యేకం..
-
అమ్మ.. అత్తమ్మ ఫొటోలతో కోహ్లి! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న సచిన్!
Mothers Day 2023- Virat Kohli- Sachin Tendulkar: స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయతకు ప్రతిరూపం అమ్మ. అమ్మంటే అంతులేని అనురాగం. కడుపులో నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డను కంటికి రెప్పలా కాచే దైవం. కడుపున పుట్టిన బిడ్డల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భర్తతో కలిసి అనేకానేక త్యాగాలు చేసి వారు కోరుకున్న జీవితాన్ని ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసే సహనశీలి. అలాంటి మాతృమూర్తి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ముఖ్యంగా అబ్బాయిలు చాలా మంది అమ్మకూచిగానే ఉంటారు. మన టీమిండియా స్టార్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి కూడా ఆ కోవకు చెందినవారే! అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మాతృ దినోత్సవం సందర్భంగా అందమైన ఫొటోలను పంచుకున్నారు ఈ సెంచరీల వీరులు. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. ‘‘కృత్రిమ మేధ(AI)తో అద్భుతాలు చేస్తున్న ఈ నవయుగంలో.. ఒక్క అమ్మ(AAI- ఆయి) స్థానాన్ని మాత్రం దేనితో భర్తీ చేయలేం’’ అంటూ తల్లి తనను దీవిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. అద్భుతమైన క్యాప్షన్‌తో అమ్మపై ఉన్న అనంతమైన ప్రేమను చాటుకున్నాడు. అమ్మ.. అత్తమ్మ.. వామిక తల్లి! ఇక విరాట్ కోహ్లి సైతం మదర్స్ డేను పురస్కరించుకుని తన తల్లి సరోజ్ కోహ్లి, అత్తగారు ఆషిమా శర్మల ఫొటోలను పంచుకున్నాడు. వారిద్దరితో పాటు తన సతీమణి అనుష్క శర్మ తమ గారాల పట్టి వామికను ఎత్తుకుని ఉన్న చిత్రాన్ని షేర్ చేస్తూ ఆమెకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. కోహ్లి ఈ మేరకు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్-2023లో కాగా వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మెంటార్‌గా ఉన్న సచిన్.. అదే జట్టు తరఫున తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఈ ఏడాది అరంగేట్రం చేయడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి నేడు (మే 14) రాజస్తాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లి ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడి 420 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 82*. చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. హెన్రిచ్ క్లాసెన్‌కు బిగ్ షాక్! భారీ జరిమానా 'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్ Happy Mother’s Day ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/oXTBkKWeIE — Virat Kohli (@imVkohli) May 14, 2023 In the Age of AI, the one that is irreplaceable will always be A”AI”!#MothersDay pic.twitter.com/p9Ys5CSVcP — Sachin Tendulkar (@sachin_rt) May 14, 2023 -
అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం: మెగాస్టార్
ఎంతగొప్ప పేరు గలవాడైనా ఆమె ముందు ఎప్పటికీ చిన్నవాడే. ఎందుకంటే ఈ సృష్టికి నిన్ను పరిచయం చేసిన ఆమె కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) మెగాస్టార్ ట్వీట్ రాస్తూ.. 'అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్థమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళాశంకర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్ధమే అమ్మ ... అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d — Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023 -
మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా?
అమ్మ...ఆ పదం పలకడానికి పెదాలు కమ్మగా కదులుతాయి. అలా పిలవడానికి మనసు నిలువెల్లా పులకరించి గొంతులో ఏకమవుతుంది. అమ్మ గర్భంనుంచి బయటకొచ్చిన బిడ్డ కూడా ఈ ప్రపంచంకంటే ముందు అమ్మనే చూస్తుంది. అమ్మనే పిలుస్తుంది. అమ్మా అనే ఏడుస్తుంది. అమ్మ చుట్టూనే ప్రపంచం.. అమ్మ ఉంది కాబట్టే ప్రపంచం. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా.. వెండితెరపై అమ్మను కీర్తిస్తూ అలరించిన గీతాలపై ఓ లుక్కేద్దాం. అమ్మంటే ప్రేమకి పర్యాయపదం. అమ్మ మనసు అనురాగ నిలయం. అమ్మ కమ్మని కథలు చెబుతూ.. నమ్మలేని లోకాల్ని కళ్లముందు చూపెడుతుంది. అంతే కాదు.. అమ్మ ధైర్యాన్ని నూరిపోస్తుంది. కొడుకుని వీరుడిగా తీర్చిదిద్దుతుంది. ఐనా కొడుకెప్పుడా ఆ మమతల తల్లి మదిలో చిన్నిపిల్లవాడే. జన్మనిచ్చేదే అమ్మ అయినపుడు... ఆ అమ్మకు జన్మనిచ్చింది కూడా అమ్మే అయినపుడు అమ్మను మించిన దైవమేముంటుంది.. ఆ మాట మనుషులే కాదు.. ఆ మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అందుకే అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే అన్నారు. అమ్మ గురించి వింటుంటే.. అమ్మను చూస్తుంటే.. అమ్మ ఒడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే.. ప్రతిదీ మనసు ఫలకంపై అక్షరాలు దిద్దినంత గట్టిగా తాకుతుంది. అమ్మ ప్రేమకన్నా విలువైన సంపద ఈ సృష్టిలో లేనేలేదు. అమ్మ ఆప్యాయత ముందు ఏదీ నిలవదు. వందమంది దేవుళ్లు ఎదురుగా వచ్చి నిలబడినా.. ఆమ్మ అందించే ప్రేమ ముందు తక్కువే అవుతారు. కంటికి వెలుగునిచ్చే అమ్మ కదిలే దేవతే కదా. అమ్మా అని తొలిపలుకు పలికే అదృష్టం పెదాలకు దక్కిన అదృష్టమే కదా! సృష్టిలో ఒక మనిషికే కాదు.. ఏ జీవికైనా అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మలోని కమ్మదనం.. అమ్మప్రేమలోని మధురం ఒక్కటే. జన్మనిచ్చే తల్లే ఎవరికైనా తొలిదైవం... ఏ జీవికైనా అమ్మే ఒక వరం. బిడ్డ అలిగితే తల్లి బుజ్జగిస్తుంది. బ్రతిమిలాడో, బామాడో అన్నం తినిపిస్తుంది. అప్పుడే తన కడుపు నిండినట్టు భావిస్తుంది. ఐతే.. కొన్ని సందర్భాల్లో అమ్మ కూడా అలకబూనుతుంది. అప్పుడు కొడుకు పడే వేదన హృదయాన్ని తాకుతుంది. అమ్మ మీద ప్రేమని చెప్పకనే చెబుతుంది. అమ్మ అనే రెండక్షరాల పదం కంటే గొప్పది ఎవరు మాత్రం రాస్తారు. అసలు అంతకంతే గొప్పమాట.. అమ్మగురించి పాడటంకంటే గొప్ప పాట ఏముంటాయి? రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఎగిరిపోతున్నా... తనును నడిరోడ్డుమీద వదిలేసినా.. ఏ తల్లీ బిడ్డను శపించదు.. ఆకలికడుపుతో అలమటిస్తూనే నవ్వుతూ బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తుంది. అమ్మా అని ప్రేమగా పిలిస్తే చాలనుకుంటుంది. మనిషైనా.. మాకైనా.. అమ్మకు.. అమ్మ మనసుకు ఆ భేదాలేమీ ఉండవు. ఆమె బిడ్డను ప్రేమిస్తుంది.. పాలిస్తుంది.. లాలిస్తుంది. ప్రాణంకంటే మిన్నగా కాపాడుకుంటుంది. జాబిల్లిని పిలిచినా... బూచోడని భయపెట్టినా ఊరుకోని బిడ్డ... అమ్మ చేతి స్పర్శ తగిలితే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఎందుకంటే అమ్మ పిల్లల ప్రాణాలను తన అరచేతుల్లో పెట్టుకుని బతుకుతుంది. మన జీవితంలో అమ్మ లేని చోటుండదు.. అమ్మను స్మరించుకోని క్షణాలుండవు. మనకు తెలిసినా.. తెలియకపోయినా.. తమకు మాటలు నేర్పిన అమ్మను పిలవడానికి, తలవడానికి పెదాలెప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. బాధకలిగితే అమ్మా.. అలసిపోయేంతగా నవ్వితే అమ్మ.. దెబ్బ తాకితే అమ్మ.. కన్నీళ్లొస్తే అమ్మ.. కడుపు మాడితే అమ్మ.. కడుపు నిండినా అమ్మే.. అమ్మ తలపురాని చోటుండదు. ఎందుకంటే తల్లి ప్రాణం ఎప్పుడూ పిల్లలతోనే ఉంటుంది. అమ్మ బంధం కంటే వరమేముంటుంది... ఇలలో అంతకంటే సంతోషాల ఆనందం ఏముంటుంది. అందుకే అమ్మగురించి రాయని వాళ్లులేరు. అమ్మ జోలపాట గుర్తొచ్చి పాడనివాళ్లూ లేరు. అసలు ఈ ప్రపంచంలో ఒక గొప్ప పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు కూడా అమ్మే. అది అమ్మకు మాత్రమే సొంతమయ్యే ఘనత. బిడ్డకు ఎలాంటి హాని జరిగినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. దగ్గరుండి మనసు గాయాల్ని మాన్పుతుంది. మరి అమ్మకే తీరని కష్ణమొస్తే.. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. ?కనిపెంచిన అమ్మకు ఏమైనా జరిగితే.. తట్టుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. అలాంటి కష్టకాలంలో ఆమ్మ జ్ఞాపకాలతో హృదయం నిండిపోతుంది. వయసంతా వెనక్కి మళ్లి అమ్మ ఒడిలోకే పారిపోతుంది. నిజమే కదా... ఉరుము ఉరిమినా.. మెరుపు మెరిసినా.. బిడ్డను గుండెలకు హత్తుకుని.. ఆకశంలో విరిసే హరివిల్లును బిడ్డ బోసినవ్వుల్లోనే చూసుకునే అమ్మ మెరిసే మేఘం.. కురిసే వాన. అమ్మ గురించి పాడినా.. అమ్మగురించి రాసినా.. అమ్మగురించి మాట్లాడినా... అమ్మ గురించి చదివినా జన్మ గుర్తొస్తుంది. జన్మజన్మలకు అమ్మకు మొక్కుతూనే ఉండాలనిపిస్తుంది. కడుపున పుట్టకపోయినా... ఒక పసిబిడ్డ అమ్మకు కన్నబిడ్డలాగే కనిపిస్తుంది. ఒక అనాదను తీసుకొచ్చి పెంచుకున్నా..నిజమైన తల్లిమనసుకు ఎప్పుడూ పరాయి అనే భావమే ఉండదు. ఉంటే అమ్మ అనిపించుకోదు. ఇప్పుడు ఎంతో మంది తల్లులు అనాథపిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అలా ప్రేమించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అమ్మకు సాటి పోటీ ఏమీ లేదు. ఏమన్నా ఉంటే అది మళ్లే అమ్మే అవుతుంది.. అక్కడకూడా అమ్మే ఉంటుంది. బిడ్డ కంటికి రెప్ప అమ్మ. ప్రేమైక శక్తి అమ్మ. ప్రపంచమంతా అమ్మను ఈరోజు విష్ చేయొచ్చు.. కానీ ఆ ప్రపంచాన్ని అమ్మ ఎప్పుడూ విష్ చేస్తూనే ఉంటుంది. అమ్మను ప్రతిరోజూ ప్రతిక్షణం ప్రేమిద్దాం. ప్రేమగా పలకరిద్దాం. -
ఈ సూపర్ మామ్స్‌కి కుడోస్.. మదర్స్ డే స్పెషల్
కోవిడ్ టైమ్‌లో.. ఇటు ఆఫీస్ బాధ్యతలు.. అటు పెరిగిన ఇంటి బాధ్యతలతో సతమతమవుతూ 51 శాతం వర్కింగ్ మదర్స్ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డారు.కోవిడ్ తర్వాత.. దాదాపు ఎనిమిదివేల మంది వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. అందులో 38.6 శాతం మంది తమకు అనుకూలంగా ఆఫీస్ పనివేళలను మార్చుకునే వీలుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు. 32.3 శాతమేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కంటిన్యూ చేస్తే తాము ఉద్యోగం వదిలే ప్రసక్తి ఉండదని చెప్పారు. 17 శాతమేమో ఆఫీసుల్లో పిల్లలను చూసుకునే కేర్ సెంటర్స్ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చారు.12.1శాతం వర్కింగ్ మదర్సేమో ఇటు వర్క్, అటు కుటుంబం.. రెండూ తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో మరింత ముందుకు వెళ్లడానికి సైకలాజికల్ కౌన్సెలర్స్ సపోర్ట్ అవసరమని స్పష్టం చేశారు. అది జాబ్స్ ఫర్ హర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే వివరం. కోవిడ్ తర్వాతే.. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ కూడా ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశంలోని వర్కింగ్ మదర్స్ కోవిడ్ సమయంలో పిల్లల సంరక్షణకోసం అదనంగా 360 గంటలు వెచ్చించారు. ఇది సగటు భారతీయ పురుషులు వెచ్చించే సమయానికన్నా పదింతలు ఎక్కువన్నమాట. అంటే వర్కింగ్ మదర్స్ తమ ఉద్యోగాల్లో.. లేదా కెరీర్లో నిలదొక్కుకోవాలంటే అదనంగా అన్ని గంటలు పనిచేయాలన్నమాట! ‘ప్రిడిక్మెంట్ ఆఫ్ రిటర్నింగ్ మదర్స్’ పేరుతో అశోక యూనివర్సిటీ చేసిన మరో సర్వేలో దేశంలో 30 ఏళ్ల వయసున్న దాదాపు 50 శాతం వర్కింగ్ మదర్స్ పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగాలు వదిలేసినట్టు తేలింది. మిగిలిన 50 శాతంలో 48 శాతం వర్కింగ్ మదర్స్.. మెటర్నిటీ లీవ్, పాండమిక్ తర్వాత ఉద్యోగంలో చేరి.. కేవలం నాలుగు నెలలే పనిచేసి విధులకు రాజీనామా చేశారు. కుటుంబంలో.. పనిచేసే చోట కావల్సిన సపోర్ట్ దొరక్క! అయినా పనిచేస్తున్న ఆ రెండు శాతం తల్లులు కూడా పనిచేసే చోట.. బంధువుల్లో.. కుటుంబాల్లో వివక్షకు గురవుతున్నారు.. పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టక.. ఉద్యోగం, కెరీర్ అంటూ ఊరేగుతున్నారనే కామెంట్స్‌తో. ఇన్ని లెక్కలతో ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది పాఠకులకు! ఎస్.. ఈ రోజు మదర్స్ డే! ఆ సందర్భంగా వర్కింగ్ మదర్స్ ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టట్లేదు. కానీ వాళ్లకున్న ప్రతికూల వాతావరణాన్ని ఆ సర్వేల ఫలితాల ద్వారా తెలియజేసి.. ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకుంటూ.. ఉద్యోగిగా కాకపోతే అంట్రప్రెన్యూర్‌గా డిఫరెంట్ కెరీర్‌కి స్విచ్ ఆన్ అయిన వర్కింగ్ మదర్స్ పరిచయ ప్రయత్నమే ఈ కథనం.. మమీయూ ఇదో మెటర్నిటీ గార్మెంట్స్ బ్రాండ్. శాలినీ శర్మ బ్రెయిన్ చైల్డ్. మార్కెట్లోకి వచ్చి రెండేళ్లవుతోంది. మమీయూ కంటే ముందు శాలినీ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌గా పనిచేసేది. తను తల్లి కాబోతున్నానని తెలియగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో చాలా అసౌకర్యం ఫీలైంది. ఎంతటి వదులు దుస్తులు వేసుకున్నా సౌకర్యంగా అనిపించలేదుట. ప్రసవమయ్యాకా అదే పరిస్థితి. ఆన్లైన్.. ఆఫ్‌లైన్ మార్కెట్ అంతా గాలించింది. ఆమెకు అనువైన దుస్తుల కోసం. పెద్ద పెద్ద బ్రాండ్స్‌లోనూ వెదికింది. ఫారిన్ బ్రాండ్స్‌లో ఉన్నాయి. కాని అవి తనకు నప్పే సైజుల్లో లేవు. ఆశ్చర్యపోయింది.. మన దగ్గర గర్భిణీకి.. బాలింతకు సౌకర్యంగా ఉండే దుస్తులే లేవా? అని. ఆ అసహనమే తల్లి అయిన శాలినీ శర్మలో కొత్త కెరీర్ ఆలోచనను రేకెత్తించింది. ‘మమీయూ’ను సృష్టించింది. ఈ రోజు ఆమెను ఓ అంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. ఆ ప్రయాణానికి ముందు మార్కెట్ రీసెర్చ్ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతంలోని 150 మంది గర్భిణీలను కలసి.. మెటర్నిటీ దుస్తుల అవసరం.. సౌకర్యం.. కొనుగోలు చేసే ఆర్థిక స్థితి వంటివన్నిటి మీదా ఆరా తీసింది. దాదాపు 87 శాతం మంది గర్భిణీలు దేశీ మెటర్నిటీ గార్మెంట్స్ అవసరం ఉందని చెప్పారు. తమకు నప్పే సైజుల్లో దొరికితే కొంటామనీ తెలిపారు. ఆ సమాధానాలు విన్నాక తన ఆలోచన సరైనదేననే నమ్మకం కుదిరింది శాలినీకి. ముందుకు కదిలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఇటు గుజరాత్ నుంచి మిజోరమ్ దాకా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేనేత మహిళా కార్మికులు అందరి చేనేత కళను తన సృజనలో భాగస్వామ్యం చేసింది. మమీయూను కమ్యూనిటీ బేస్డ్ క్లాతింగ్ బ్రాండ్‌గా మలచి.. తాలుకా, మండల, జిల్లా కేంద్రాల నుంచి మెట్రో నగరాల దాకా కొనుగోలుదార్లను క్రియేట్ చేసుకుంది. ఇలా గ్రామీణ మహిళా చేనేత కార్మికుల నైపుణ్యంతో పట్టణ మహిళల అవసరాన్ని తీర్చుతూ భారతీయ మార్కెట్లో మెటర్నిటీ గార్మెంట్స్‌కి కొరత లేకుండా చేసింది. ‘ఇలా బ్రాండ్‌ను లాంచ్ చేయగానే అలా లాభాలు వచ్చిపడలేదు. చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్‌గా దేశంలోని డిఫరెంట్ సిటీస్‌లో పనిచేయడం వల్ల.. ఎక్కడ ఏ స్కిల్ దాగుంది.. దాన్ని ఎలా వాడుకోవాలి వంటివన్నీ తెలియడం.. నా ఈ కొత్త కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. చాలెంజెస్‌ను హ్యాండిల్ చేయడమూ ఈజీ అయింది. నేను హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరగడం వల్ల నా వర్క్ ప్లేస్‌నీ అక్కడే పెట్టుకున్నాను. ప్రస్తుతం మా బ్రాండ్ కోసం హిమాచల్, సోలన్ జిల్లాలోని పందొమ్మిది గ్రామాలకు చెందిన దాదాపు 450 మంది మహిళా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా 21 నుంచి 68 ఏళ్ల లోపు వారు. డిఫరెంట్ వర్క్ స్కిల్స్.. డిఫరెంట్ వర్క్ టైమింగ్స్‌లో పనిచేస్తూ మమీయూ బ్రాండ్ సక్సెస్‌కి తోడ్పడుతున్నారు’ అంటుంది అంట్రప్రెన్యూర్‌గా మారిన మదర్ శాలినీ శర్మ. జాబ్స్ ఫర్ హర్.. ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన వర్కింగ్ మదర్స్ మీద సర్వే చేసిన సంస్థే ఇది. దీన్ని స్థాపించింది కూడా ఓ వర్కింగ్ మదరే. పేరు నేహా బగారియా. స్వస్థలం బెంగళూరు. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, ఎడ్యుకేషన్ అంట్రప్రెన్యూర్ కూడా! ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను చూసుకోవడానికి మూడేళ్లు విరామం తీసుకుంది. ఆ టైమ్‌లోనే.. లాయర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, ఎంబీఏస్గా సక్సెస్ఫుల్ కెరీర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు పుట్టగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం.. వాళ్లు కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించి విఫలమవడం చూసింది. ఆ వైఫల్యానికి కారణాలను వెదికింది.. అధ్యయనం చేసింది. ‘తల్లులు అయ్యాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడానికి.. లేదా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేయడానికి వాళ్లకు ఇంటి నుంచి సమాజం దాక ఎక్కడా సపోర్ట్ లేదు. అంతటా వాళ్లను ఓ గిల్ట్‌లోకి నెట్టే వాతావరణం.. వివక్షే! ఇంటి పట్టున బిడ్డ ఆలనా పాలనా చూసుకోక.. ఉద్యోగాలు ఏంటీ అని వాళ్లలో ఓ అపరాధభావాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని లెక్కచేయకుండా ఉద్యోగాలు చేస్తున్న తల్లులను పంక్చువాలిటీ, పెర్ఫార్మెన్స్ పేరుతో ఆత్మన్యూనతకు, వివక్షకు గురిచేస్తున్నారు. దీంతో వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమకున్న నైపుణ్యాలను పట్టించుకోవట్లేదు. జాబ్, కెరీర్‌కి సంబంధించి అప్టు డేట్ కాలేకపోతున్నారు. అందుకే తల్లులు అవగానే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగానికి ఓ దండం పెట్టేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వీటిని అధిగమించడానికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం.. స్కిల్స్‌ని పెంపొందించుకోవడం.. వివక్షను ఎదుర్కోవడానికి సంసిద్ధమవడం వర్కింగ్ మదర్స్‌కి తప్పనిసరి అని అర్థమైంది’ అంటుంది నేహా. దానికి తగిన శిక్షణ కావాలనీ గ్రహించింది. అలా వాళ్లను ట్రైన్ చేసి.. వాళ్ల చేత సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయించాలనీ నిశ్చయించుకుంది. అటు వైపుగా రెండు అడుగులు వేస్తూ తనూ సెకండ్కెరీర్ను స్టార్ట్ చేసింది. అదే జాబ్స్ ఫర్ హర్ సంస్థ. మాతృత్వంతో ఉద్యోగం లేదా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఎంటర్ కావాలనుకునే వాళ్లకు అన్నిరకాలుగా తర్ఫీదునిచ్చి.. దేశంలోని ఉద్యోగ అవాకాశాల గురించీ ఎరుకనిచ్చి వాళ్లు మళ్లీ ఆర్థికస్వావలంబన సాధించేలా కృషి చేస్తుందీ జాబ్స్ ఫర్ హర్ సంస్థ. దీన్ని మొదలుపెట్టే ముందు నన్ను నేను కూడా అన్ని ప్రతికూలతలకు సిద్ధం చేసుకున్నా. ఇటు అత్తిల్లు, అటు పుట్టిల్లు నుంచి బంధువులు, స్నేహితులు, నా ఇరుగు, పొరుగులతో ఒక సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తున్నంత తేలికగా సాగలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. నా సంస్థలో ఉద్యోగులకు.. తర్ఫీదు కోసం వచ్చే వారికీ ఇదే చెబుతా. ముందు మనకున్న భయాలను గుర్తిస్తే.. వాటిని ఎదుర్కొనే దారి దొరుకుతుంది. అదే మన విజయానికి మార్గం. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. భయమే గనుక లేకపోతే మీరేం సాధించాలనుకుంటున్నారు అని’ అంటూ వర్కింగ్ మదర్స్‌కి ధైర్యాన్నిస్తోంది నేహా బగారియా. మిష్రీ డాట్ కామ్ జర్నలిజంలో తనూ గంగూలీకి 20 ఏళ్ల అనుభవం. ఎన్డీటీవీ ఫుడ్ చానెల్‌కి పదేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేసింది. ఆమెకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి అనుకునేది.. కెరీర్ మారాలి అని. ఎక్కడో ఉద్యోగం కంటే తనే సొంతంగా ఏదైనా మొదలుపెడితే.. ఇటు మాతృత్వాన్నీ ఆస్వాదించవచ్చు.. అటు ఆర్థిక స్వేచ్ఛనూ కాపాడుకోవచ్చు అని. తను ఫుడ్ చానెల్‌తో అసోసియేట్ అయ్యుండడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఫుడ్‌కి సంబంధించి తనను ఎన్నో సలహాలు అడిగేవారు. ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు. వాళ్లందరికీ ఆమె మీదున్న ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకోవాలని యోచించింది. తర్వాత అది ఫుడ్ రివ్యూ వెబ్‌సైట్‌గా డిసైడ్ అయింది. అదే మిష్రీ డాట్ కామ్ . మొదలై నాలుగేళ్లవుతోంది. గృహిణులు, మదర్‌హుడ్ కారణంగా జాబ్ వదిలేసిన తల్లులు తమ కిచెన్ స్కిల్స్‌కు సానబెట్టుకునే అవకాశాన్ని కల్పించే వేదిక అది. దేశంలోనే.. ఫుడ్ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేసే తొలి వెబ్సైట్ కూడా! ‘మన ఎక్స్పీరియెన్సే మన ఆలోచనలకు ఓ రూపమిస్తుంది. అలా ఫుడ్ చానెల్లోని నా వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నే నా ఈ ఫుడ్ రివ్యూ వెబ్సైట్ మీద ఇన్వెస్ట్ చేశా. సక్సెస్ చూస్తున్నా. ఈ వెబ్సైట్లో దాదాపు 90 శాతం ఉద్యోగులు మహిళలే. వాళ్లకు అనుకూలమైన టైమ్‌లోనే పనిచేస్తారు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు’ అంటుంది తనూ గంగూలీ. వీళ్లు సరే... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తమ మదర్ హుడ్‌తో ఇన్ఫ్లుయెన్స్ చేసి.. మామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వేల.. లక్షల ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెలిబ్రిటీలుగా మారిన అమ్మలూ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇక్కడ.. అనుప్రియ కౌర్.. ఆమె ఇన్స్టాగ్రామ్ చూడగానే అర్థమవు తుంది.. ఆమె యాక్టివ్ అండ్ ఫిట్ అని! కార్పొరేట్ ఉద్యోగిని. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఫిట్నెస్, శారీ ఫ్యాషన్ వరకు చాలా విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. రిద్ధి డోరా సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్. ముఖ్యంగా తొలి చూలు తల్లులకు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇస్తూంటుంది. తన ఈ సేవలను సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా కార్పొరేట్స్ కోసం బయట కూడా వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటుంది. ‘న్యూ మదర్స్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా.. సంతోషంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను’ అంటుంది. చావి మిత్తల్ ‘మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్’విన్నర్. కంటెంట్ క్రియేటర్. ‘బీయింగ్ ఉమన్ (b్ఛజీnజఠీౌఝ్చn)’ వ్యవస్థాపకురాలు కూడా అయిన చావి.. పేరెంటింగ్‌కి సంబంధించి అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సరు ముఖర్జీ శర్మ ‘డైపర్స్ అండ్ లిప్స్టిక్స్’ పేరుతో పేరెంటింగ్ నుంచి ఫ్యాషన్, ఫిట్నెస్ దాకా అన్ని విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. ‘అమ్మ అవగానే అన్నిటినీ వదిలేయాల్సిన అవసరం లేదు. మన మీద మనకూ శ్రద్ధ చాలా అవసరమని’ చెప్తుంది సరు .. తన బ్లాగ్‌లోని ‘బికాజ్ యూ ఆర్ మోర్ దాన్ జస్ట్ ఏ మామ్’ అనే స్టేట్మెంట్తో! శ్రద్ధ సింగ్.. యూట్యూబ్‌లో చాలా పాపులర్. ఇన్‌స్టాలో కూడా బ్యూటీ, ఫ్యాషన్, పేరెంట్‌హుడ్‌కి సంబంధించిన వ్లాగ్స్, పోస్ట్‌లను షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఓ కూతురు.. పేరు.. కైనా... కికీగా ఇన్‌స్టాలో ప్రసిద్ధి. తన పేరు, తన కూతురు పేరుతో కికి అండ్ శ్రాడ్స్తో ఇంకో ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది. అందుతో రోజూ తన కూతురు చేసే అల్లరి.. ముద్దు ముచ్చట్లను పోస్ట్ చేస్తూంటుంది. మదర్స్ డే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన మరో సెలబ్రిటీ.. ‘మామ్.. షెఫ్.. బైకర్ గర్ల్.. స్కూబా డైవర్ అండ్ యాక్టర్’ సమీరా రెడ్డి! ఈ టైటిల్స్ అన్నీ ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఉంటాయి. అన్నిట్లోకి మామ్ అంటూ తనకున్న ‘అమ్మ’ అనే హోదానే ముందు పెట్టుకుంది సమీరా. ఒకప్పుడు గ్లామర్ వరల్డ్‌లో మెరిసిన ఈ తార.. తల్లి అయిన తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పుల దగ్గర్న నుంచి వయసుతో పాటు వచ్చే మార్పుల వరకూ ఎలాంటి ఫిల్టర్లు.. మేకప్ లేకుండా తనను తనలాగే ఇన్‌స్టాలో ప్రెజెంట్ చేసుకుంటుంది. గ్లామర్ రంగంలో వైట్ స్కిన్ పట్ల ఉన్న అబ్సేషన్ తనను బాధించినా.. తనకున్న డస్కీ స్కిన్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకుని బాడీ పాజిటివిటీకి ప్రతీకగా నిలిచింది. అందంగా కనిపించడం కోసం మేకప్ నుంచి కాస్మెటిక్ సర్జరీల దాకా వెళ్తున్న కాలం ఇది. దానికి సమీరా రెడ్డి ఫక్తు వ్యతిరేకి అని ఆమె ‘ఇంపర్ఫెక్ట్లీపర్ఫెక్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయినే చెప్తోంది. ఇవన్నీ సరే.. మానసిక అనారోగ్యాల పట్లా అంతే బోల్డ్‌గా పోస్ట్‌లు పెట్టి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి కేస్ స్టడీలో తీసుకోకుండా తొలి ప్రసవం తర్వాత తాను అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించే రాసి.. చర్చను లేవనెత్తింది. ‘మానసిక అస్వస్థత కనిపించదు.. అది ఉంటుంది అంతే. దాన్ని ఎదుర్కొని ఆరోగ్యవంతులం కావాలంటే ముందు ఆ మానసిక రుగ్మతల మీద మనకు అవగాహన రావాలి. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నేను పోస్ట్‌పార్టమ్ స్ట్రెస్ నుంచి అంత త్వరగా బయటపడలేక పోయాను. కారణం దాని మీద నాకు సరైన అవగాహన లేకపోవడమే’ అంటుంది సమీరా రెడ్డి. ఇవన్నిటితోపాటు తన పిల్లలతో ఆమె చేసే రీల్స్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి, పిల్లలు కాగానే అప్పటిదాకా హీరోయిన్గా వెలిగిన నటికి తల్లి పాత్రలు.. కాస్త నాజూగ్గా ఉంటే అక్క, వదిన పాత్రల అవకాశాలు వస్తుంటాయి. అలాంటి స్టీరియోటైప్ క్యారెక్టర్లకు కాల్షీట్స్ ఇవ్వకుండా.. తల్లి అయిన తర్వాతా అభినయానికి అవకాశమున్న ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న నటీమణులూ ఉన్నారు. రెండు డైలాగులు, నాలుగు పాటలకు పరిమితమయ్యే హీరోయిన్లుగా కాకుండా కథను ప్రభావితం చేసే ఇంకా చెప్పాలంటే కథానాయకుడి కన్నా ప్రాధాన్యమున్న భూమికల్లో నటిస్తున్నారు. గ్లామర్ గ్రామర్ని మార్చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ ముందుంది. అందులో కాజోల్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్ వంటివారు కనిపిస్తున్నారు. ఈ సూపర్ మామ్స్కీ కుడోస్.. బాక్సర్ మేరీ కామ్ అంటే తెలియని వాళ్లుండరు! 2012లో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ అందుకుంది తను తల్లి అయ్యాకే! 2007లో సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన మరుసటి ఏడాదే అంటే 2008లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ప్రసవం తర్వాత తను మళ్లీ బరిలోకి దిగుతాను అని మేరీకామ్ ప్రకటించగానే.. ఏదో ఉత్సాహపడుతుంది కానీ.. ఏం సాధిస్తుందిలే అని పెదవి విరిచిన క్రీడా విశ్లేషకులు.. క్రీడాభిమానులూ ఉన్నారు. వాళ్లందరికీ తన విజయాలతో సమాధానం చెప్పిందీ సూపర్ మామ్ మేరీ కామ్. ఈ వరుసలోనే సానియానూ కొనియాడాలి. ప్రసవానంతర మార్పులకు ఏ మాత్రం బెదరక అదే ఆట తీరుతో లాన్ టెన్నిస్ కోర్ట్‌లో సాధించిన విజయాలతో తన కొడుకు దోసిళ్లు నింపింది. ఆ స్ఫూర్తికి హ్యాట్సాఫ్! ఈ గెలుపు కథలు మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి విజేతలైన అమ్మలు మనింట్లో.. మన చుట్టూరా ఉంటారు. కాకపోతే మనం చూడం! ఒకసారి తలెత్తి చూసి.. తలవంచి గౌరవించమనే ఈ కథన సారాంశం. -
ఈ పిల్లి 'మ్యావ్' అనదు.. ‘మామ్’ అంటుంది..!
ఈ పిల్లి ‘మ్యావ్’ అంటుందా? ‘మామ్’ అంటుందా? అనే విషయం కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ ‘మామ్’ అంటుందనే శబ్దభ్రమను కలిగిస్తుంది. ముంబైకి చెందిన ఒక మహిళ పిల్లిని పెంచుకుంటుంది. ఆమె పేరేమిటో తెలియదుగానీ పిల్లి పేరు జగ్గు. ఒక విధంగా చెప్పాలంటే ఈ జగ్గు ఆమెకు కన్న కొడుకుగా మారిపోయి, ఆమెను నీడలా అనుసరిస్తోంది. వీరి బంధాన్ని ప్రతిబింబించే వీడియో ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jaggu Patil (@jaggu_ae_jaggu) ఇన్స్టాగ్రామ్ పేజీ ‘జగ్గు పాటిల్’లో జగ్గు ప్రతి మూమెంట్‌ను డాక్యుమెంట్ చేశారు. ‘మదర్స్ లవ్ ఈజ్ యూనివర్శల్’ ‘ఎందరో తల్లులు. ప్రేమ మాత్రం ఒక్కటే’ ‘భావోద్వేగాలు మనుషులకు మాత్రమే పరిమితమైనవి కావు’ ‘ఇలాంటి ప్రేమ మన దేశంలోని తల్లులకు మాత్రమే సాధ్యపడుతుంది. భగవంతుడు కోరుకునేది ఇదే’ ‘నిజమైన ప్రేమకు నిలువెత్తు సంతకం... తల్లి’... అంటూ నెటిజనులు స్పందించారు. -
'మదర్స్ డే' రోజు ఓ తల్లి అడిగిన వినూత్న కానుకలు
మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్‌లు ఇవ్వడానికి పిల్లలు రకరకాలుగా ప్లాన్లు చేస్తుంటారు. అయితే ఈ పంజాబీ మహిళ మాత్రం ‘మీరు ఇచ్చే గిఫ్ట్‌లు నాకు వద్దుగాక వద్దు’ అంటోంది. ‘అదేమిటి!’ అని ఆశ్చర్యపోయేలోపే ‘నేను అడిగిన గిఫ్ట్‌లు మాత్రం ఇవ్వాలి’ అన్నది. ఆమె అడిగిన గిఫ్ట్‌లు... సెల్‌ఫోన్‌తో గంటలు గంటలు గడపవద్దు అదే లోకంగా బతకవద్దు పొద్దుపోయాక బద్దకంగా నిద్ర లేవడం కాదు, ఉదయాన్నే హుషారుగా లేవాలి ఆన్లైన్ ఫుడ్ పార్శిల్స్ వద్దు ఇంటి తిండే ముద్దు ‘ఇవి డిమాండ్సా? గిఫ్ట్‌లా?’ అని ఒక యూజర్ సందేహం రైజ్ చేస్తే, మరో యూజర్ ఇలా స్పందించాడు... ‘డిమాండ్స్‌కు పిల్లలు ఓకే అంటే అవే గిఫ్ట్‌లుగా మారిపోతాయి. పిల్లల మంచి భవిష్యత్‌కు మించి తల్లికి కావల్సిన గొప్ప గిప్ట్ ఏదీ లేదు!’ సోనియా కత్రి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sonia Khatri (@_punjabimom) -
మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే
'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 'మాతృ దేవో భవ' మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'బిచ్చగాడు' తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది. ప్రభాస్ 'ఛత్రపతి' 2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి. అమ్మ చెప్పింది 2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమ్మా రాజీనామా 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. యమ లీల 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్దీర్వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 'నిజం' కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. -
అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల
‘‘నేనెక్కడ ఉంటే మా అమ్మకు అదే ఫేవరెట్ ప్లేస్. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఇంటిని బాగా చూసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయం అమ్మకు ఇష్టం. మా అమ్మ బెస్ట్ పర్సన్’’ అన్నారు శ్రీలీల. ‘పెళ్లి సందడి’తో తెలుగుకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం చేతిలో అరడజనకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు ‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా శ్రీలీల షేర్ చేసుకున్న విషయాలు ఈ విధంగా.. ► మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అలానే ఆమెకి చాలా ఓర్పు ఎక్కువ. నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో.. ఇవ్వకూడదో ఆమెకు బాగా తెలుసు. అలాగే ఏ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలో.. ఉండకూడదో కూడా బాగా తెలుసు. ► నా స్కూల్ డేస్‌లో చాలా బిజీగా ఉండేదాన్ని. స్కూల్ అవ్వగానే డ్యాన్స్ క్లాస్, స్విమ్మింగ్.. ఇలా గడిచిపోయేది. కానీ నాకేమో అల్లరి చేయాలని ఉండేది. అయితే దానికి చాన్స్ ఉండేది కాదు. ఎందుకంటే మా అమ్మ కళ్లన్నీ నా మీదే ఉండేవి. ► తిండి విషయంలో చిన్నప్పుడు నేను చాలా నిర్లక్ష్యంగా ఉండేదాన్ని. స్కూల్‌కి వెళ్లేటప్పుడు అమ్మ ఇచ్చిన లంచ్ బాంక్స్ ఇంట్లో సోఫా వెనకాలో, కారు సీటులోనో దాచేసేదాన్ని. తినడానికి ఇష్టపడక అలా చేసేదాన్ని. ► ఇక నా విషయాలను నేను హ్యాండిల్ చేయగలననే నమ్మకం కుదిరాక మా అమ్మ నాకు స్వేచ్ఛ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటినుంచి మా అమ్మ నాకు మంచి ఫ్రెండ్‌లా అయిపోయారు. ఎప్పుడైతే మా అమ్మ నాకు ఫ్రెండ్‌లా అయ్యారో అప్పట్నుంచి అన్నీ ఆమెతో షేర్ చేసుకుంటున్నాను. రాత్రిపూట జోక్స్ చెప్పుకోవడం, రిలాక్స్ అవ్వడం.. డ్యాన్స్ చేయడం... వాట్ నాట్.. మేం చాలా బాగా టైమ్ స్పెండ్ చేస్తాం. తన కూతురు కావడం నా లక్. ► మా అమ్మగారు మల్టీ టాస్కర్. అందుకే తనకి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటుంటాను. అదే విషయం ఆమెతో చెబితే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అమ్మకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. ఏదో పని పెట్టుకుని, ఆ పని పూర్తి చేసేంతవరకూ ప్రశాంతంగా ఉండరు. ► మా అమ్మగారు డాక్టర్. షేషెంట్లతో ఎప్పుడూ ఫుల్ బిజీ. కొన్నేళ్ల పాటు అవిడ డాక్టర్‌గా సర్వీస్ చేశారు. పైగా శ్రద్ధగా చేయడంతో ఎందరో పేషెంట్స్ ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేవారు. చాలా గౌరవించేవారు. ఇవన్నీ స్వయంగా చూసిన నాకు మా అమ్మంటే చాలా గౌరవం.. గర్వం.. స్ఫూర్తి కూడా. నేను ఆవిడ్ని ‘సూపర్ ఉమన్’ అంటాను. ఆవిడ సెమినార్స్‌లో పాల్గొన్నప్పుడు నేను చాలా ఆరాధనగా చూసేదాన్ని. ఆవిడకున్న నాలెడ్జ్ సూపర్. ► మా అమ్మ నాలో భాగం. నా కెరీర్లోనూ ఆమె సగ భాగం. చాలా అర్థం చేసుకుంటారు. నా కెరీర్‌కి ఎంత హెల్ప్ చేయాలో అంతా చేస్తారు. నేనివాళ ఇంత బిజీగా సినిమాలు చేయగలుగుతున్నానంటే ఆమె సపోర్ట్ కారణం. ► ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అంటారామె. కొంచెం కూడా బాధపడరు. నేనేమో ‘సెన్సిటివ్’. చిన్న విషయాలకు కూడా బాధపడిపోతుంటాను. నేను ఆ బాధ మరచి పోయేలా ఆమె కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మ స్పిరిచ్యువాల్టీ పర్సన్. ప్రతిరోజూ దేవుడిని పూజిస్తుంటారు. ఆ పూజలు నాకు ధైర్యాన్నిస్తాయి. ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నా ధైర్యం రెట్టింపు అవుతుంది. ∙‘మదర్స్ డే’కి మా అమ్మ కోసం స్పెషల్‌గా ఒకటి ప్లాన్ చేశాను. అది సీక్రెట్. -
Mothers Day: అమ్మలుగా.. అధికారులుగా
నల్గొండ: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ పమేలా సత్పతి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె తన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటున్న తీరు ఆదర్శనీయం. తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో దగ్గరుండి చేర్పించారు. కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఇతర అంశాలపై పట్టు దొరికే విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. పలుచోట్లకు తనతో పాటు తీసుకెళ్లి తల్లి మమకారాన్ని పంచుతున్నారు. మొత్తంగా కలెక్టర్‌గా బిజీగా ఉంటూనే తన బిడ్డ బాగోగులను ఎప్పటి కప్పుడు చూసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న సమ యంలోనూ పమేలా సత్పతి తన చిన్న బాబుతోనే వార్డుల్లో పరిశీలనకు వెళ్లేవారు. బాలికలకు ‘రక్ష స్నేహిత’ సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఏదో ఓ చోట హింసకు గురవుతూనే ఉన్నారు. భద్రతపై వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కలెక్టర్ పమేలా సత్పతి ‘రక్ష స్నేహిత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అధికారులను, ప్రజాప్రతినిధులను, వైద్యారోగ్య సిబ్బందిని భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్థినులు వేధింపులకు గురైన సమయంలో ఎలా స్పందించాలి.. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ కాన్సెప్ట్‌తో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లే.. మార్గదర్శకురాలు కలెక్టర్ పమేలా సత్పతికి తన తల్లి మార్గదర్శకురాలు. చిన్నపటి నుంచే చనువు ఎక్కువ. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. ప్రతి చిన్న అంశాన్ని కూడా తల్లితో పంచుకునేవారు. బిడ్డ చెప్పిన ప్రతి అంశాన్ని తల్లి తన మనసులో పెట్టుకుని మంచి చేసే అంశాలను తెలియజేసేవారు. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రుల స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఐఏఎస్ సాధించానంటున్నారు పమేలా సత్పతి. శాంతిభద్రతలు కాపాడడంలో తనదైన ముద్ర వేస్తూనే.. ఏడాదిలోపు వయసున్న తన ఇద్దరు (కవలలు) పిల్లల పెంపకంలో తల్లిగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు నల్లగొండ ఎస్పీ అపూర్వరావు. విధుల్లో భాగంగా పిల్లలకు దూరంగా ఉండాల్సిన సమయంలో తన తల్లి లేదా అత్తను వారి వద్ద ఉంచి పిల్లల బాగోగులు చూసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఖాళీ సమయంలో పిల్లలతోనే ఎక్కువగా గడుపుతారు. జిల్లాలో గంజాయిని అదుపు చేయడంలో, అంతరాష్ట్ర ముఠా దొంగల ఆటకట్టించడంలో ఎస్పీగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. సమస్య ఉందని గ్రీవెన్స్‌డేలో తన వద్దకు వచ్చే వారికి భరోసా కల్పిస్తున్నారు. షీటీంను పటిష్టం చేసి ఆకతాయిల ఆగడాలను కట్టడి చేశారు. సామాజిక మాద్యమాల ద్వారా మోస పోకుండా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. విధుల్లో భాగంగా ఎంత బిజీగా ఉన్న ముందుగానే ప్రణాళికలు వేసుకుని.. తన పిల్లలతో గడిపేందుకు కూడా సమయం ఇస్తున్నారు. పిల్లలతో గడపడం ఇష్టం అమ్మ తోడుంటే జీవితం బంగారుమయంగా మరుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ప్రతిఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర కీరోల్గా ఉంటుంది. క్రమశిక్షణ, చదువు, భవిష్యత్‌కు తల్లే మార్గదర్శిగా నిలుస్తుంది. తల్లిగా నేను ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసూ్తనే విధులు నిర్వహిస్తున్నాను. నాకు పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా.. వారి దగ్గరకు చేరేలా ప్లాన్ చేసుకుంటా. అమ్మ ఆర్థిక స్వావలంబన సాధిస్తేనే.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలుగుతుంది. – అపూర్వరావు, ఎస్పీ -
మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra Shares Her Daughter Malti First Pic: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనస్‌లు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడు బేబీ బంప్‌తో కనిపించని ప్రియాంక ఆకస్మాత్తుగా తల్లైనట్లు ప్రకటించడం అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సరోగసి ద్వారా వారు తల్లిదండ్రులు అయినట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. చదవండి: మదర్స్‌డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్ అంతేగాక ఇటీవల తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్తీ 100 రోజులకు పైగా హాస్పిటల్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. చదవండి: 'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్! లాస్ ఎంజల్స్లోని పిల్లల హాస్పిటల్లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు తమ కూతురు పూర్తి ఆరోగ్యం ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్‌పై పులువురు బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ వారు సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రితీ జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక ఆరోరాలు కామెంట్స్ చేస్తూ లవ్ ఎమోజీతో ప్రియాంక, నిక్ దంపతుల కూతురు మల్తీకి స్వాగతం పలికారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో ముద్దాడిన సీఎం
సాక్షి, చెన్నై: మాతృదినోత్సవం సందర్భంగా చెన్నై గోపాలపురంలోని నివాసంకు సీఎం ఎం.కే.స్టాలిన్ ఆదివారం వెళ్లారు. అక్కడ తన మాతృమూర్తి దయాళమ్మాళ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో ముద్దాడారు. చిత్రంలో స్టాలిన్‌తో పాటుగా ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి సెల్వి, డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ తదితరులు ఉన్నారు. చదవండి: Mylapore: దంపతుల హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు -
ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ
కీవ్: అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ముందస్తు ప్రకటన లేకుండానే ఆమె ఇక్కడికి రావడం గమనార్హం. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్‌లోని ఉజ్హొరోత్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్స్కీతో సమావేశమయ్యారు. మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని పునరుద్ఘాటించారు. జిల్ బైడెన్, ఒలెనా జెలెన్స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు. యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా మీడియాతో మాట్లాడారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ కూడా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కెనడా ప్రధాని కూడా... రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. రష్యా దాడుల్లో ఈ పట్టణం ఇప్పటికే చాలావరకు ధ్వంసమయ్యింది. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. -
Photo Feature: అమ్మ ప్రేమ కమ్మన..!
అమ్మ నడకే కాదు నాగరికతను నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు, మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే, కనిపించే దైవం అమ్మ, అనురాగానికి చిరునామా అమ్మ, ఎంత ఎదిగి దూర తీరాలకు వెళ్లిన ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
తల్లికి ఖరీదైన కారు గిఫ్టిచ్చిన రాశీ ఖన్నా, ధర ఎంతో తెలుసా?
అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు అమ్మ లేకపోతే ఈ సృష్టే లేదు అంటుంటారు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప! ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం నాడు అమ్మ దగ్గరికి వెళ్లిన ఆమె బీఎమ్‌డబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని ధర దాదాపు రూ.1.40 కోట్లని తెలుస్తోంది. ఎప్పటికైనా ఓ లగ్జరీ కారు సొంతం చేసుకోవాలన్న తల్లి కలను రాశీ ఎట్టకేలకు నెరవేర్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా రాశీ ఖన్నా యోధ సినిమాతో త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టనుంది. సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన యోధ ఈ ఏడాది నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఫర్జి అనే ప్రాజెక్ట్‌తో త్వరలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ. చదవండి: హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో పెళ్లికి ముహూర్తం ఫిక్స్! నా కూతురితో కారులో ఉన్నాను.. అత్యాచారం చేస్తానని బెదిరించాడు -
మదర్స్‌డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్
మదర్స్ డే (మే 8) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోని తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో ఓ పాత వీడియోని షేర్ చేశాడు. అందులో తన తల్లి అంజనాదేవితో పాటు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆ వీడియో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ అప్పటిది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ కూడా అక్కడే జరుతుంది. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్) దీంతో నాగబాబు, అంజనాదేవిలు షూటింగ్ లోకేషన్‌కు వచ్చారు. అందరు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత తల్లిని దగ్గర ఉండి కారు ఎక్కించారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘అమ్మలందరికీ అభివందనములు’ అని చిరంజీవి కామెంట్ చేశారు. ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నేడు(మే8వ తేదీ) మదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవ సంబంధమైంది. ఏపీలోని తల్లులందరి సాధికారత కోసం కృషి చేయడం కంటే నాకు ఈ జీవితాన్ని బహుమతిగా ఇచ్చిన మా అమ్మకు గొప్ప బహుమతి మరొకటి ఉండదు’’ అంటూ ట్విట్టర్ వేదికగా తల్లులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. A mother’s love is eternal and divine. There can be no greater gift for my mother who has given me the gift of life, than to work towards the empowerment of all the mothers in AP.#MothersDay — YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2022 -
Happy Mothers Day: హ్యాపీ 'అమ్మ'
‘పెళ్లి కాకుండా పిల్లలేంటి? ఊర్లో మేం తలెత్తుకుని తిరగాలా? వద్దా? నువ్వు చేసిన పనికి మీ నాన్న కుంగిపోతున్నాడు. బతికుండగానే మమ్మల్ని చంపేస్తావా?’ ఓ తల్లి బాధ.. పెళ్లి కాకుండా డోనర్ ద్వారా గర్భవతి అయిన కూతురు గురించి. ఇది ‘గిల్టీ మైండ్స్’ అనే వెబ్‌సిరీస్‌లో ఓ దృశ్యం. సినిమాలు, సీరియళ్ల కథాంశాలకు జీవితాలు.. ధోరణులు.. ఒరవడులే ప్రేరణ. అంటే పెళ్లి కాకుండానే తల్లి కావాలనుకోవడం నిజ జీవితాల్లో కనిపిస్తోందా? అని రెట్టించి అడిగితే సమాధానం అవుననే.. సాఫ్ట్వేర్ ఉద్యోగినుల నుంచి సెలబ్రిటీల దాకా! మహాభారతకాలం నాడు కుంతి కూడా పెళ్లి కాకుండానే కర్ణుడిని కన్నది. సమాజానికి భయపడి బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. నేటి సమాజపు స్థితిగతులూ అవే. కాకపోతే స్త్రీలే ధైర్యంగా నిలబడుతున్నారు. ఏటికి ఎదురీదుతున్నామని తెలిసే తాము తీసుకున్న నిర్ణయం పట్ల స్థిరంగా ఉంటున్నారు. పెళ్లి ఊసు లేకుండానే పిల్లల్ని కనడానికి ఇష్టపడుతున్నారు. కంటున్నారు.. చక్కగా పెంచుకుంటున్నారు కూడా! ఈ అంశం మీద తప్పొప్పుల చర్చో.. మంచిచెడుల తీర్పో కాదు ఈ వ్యాసం. మాతృత్వానికి సంబంధించి ఈ తరం చేస్తున్న ఆలోచనలు.. దాన్ని ఆస్వాదించడంలో వాళ్లు తీసుకుంటున్న చొరవ.. చూపిస్తున్న తెగువ గురించి మాత్రమే ఈ నాలుగు మాటలు .. అదీ మదర్స్ డే సందర్భం కాబట్టి! 1980ల దశకం చివర్లో .. బాలీవుడ్ నటి నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. సమాజం ఉలిక్కిపడింది. ఆ చర్యను సంచలనంగా చూసింది. నీనా చలించలేదు. వివియన్ రిచర్డ్స్ మీదున్న ప్రేమను కూతురు రూపంలో పదిలపరచుకోవాలనుకుంది. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్లదని తెలిసే ఆ రోజు ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. మసాబాకు జన్మనిచ్చింది. అయితే ఈ దేశంలో ఒంటరి తల్లిగా ఆ బిడ్డను పెంచడం ఆమెకేమీ నల్లేరు మీద నడక కాలేదు. రోలర్ కోస్టర్ రైడే సాగింది. ఆమె ఊహించుకున్నదాని కంటే ఎక్కువ సమస్యలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోకూడదని ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. శతాబ్దం మారి ఇరవై ఏళ్లవుతోంది. నాటితో పోల్చుకుంటే నేడు మహిళల చదువు పెరిగింది. ఆర్థిక వెసులుబాటూ హెచ్చింది. అవి హక్కుల స్పృహను కల్పించాయి.. నిర్ణయాధికారాన్నిచ్చాయి. సాంకేతిక విప్లవం.. అదిచ్చిన ఉద్యోగావకాశాలు వాటికి దోహదపడ్డాయి. కెరీర్ ఒత్తిళ్లు.. ఉపాధి అవకాశాలు స్త్రీ, పురుషుల మధ్య పోటీనీ పెంచాయి. అది మహిళల మీద చాలా ప్రభావం చూపిస్తోంది. ఎంతలా అంటే జీవితంలో ఘట్టాలైన పెళ్లి, పిల్లలు వంటి వాటినీ మరచిపోయేంత.. మరిపించేంత లేదా వాయిదా వేసుకునేంతలా! ఆ పోటీ, వేగం ఉద్యోగ అభద్రతను కల్పించాయి... కల్పిస్తున్నాయి. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనే క్రమంలో సెలవులు అవసరమవడం.. సెలవుల మీద వెళ్లిన గర్భిణీలను ఉద్యోగంలోంచి తీసేయడం.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు గగనమవడం.. ఈ ఇన్సెక్యూరిటి వల్లే పెళ్లిని వాయిదా వేసుకోవడం.. పిల్లలనూ కనకుండా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడం వంటి కఠిన నిర్ణయాలకూ వచ్చిన ఉద్యోగినులున్నారు. తర్వాతర్వాత మెటర్నిటీ లీవులను తమ హక్కుగా సాధించినా.. పెళ్లి విషయంలో ఆధునిక మహిళల నిర్ణయాలను అదంతగా ప్రభావితం చేయలేకపోయింది. అంటే కెరీర్లో పడిపోయి పెళ్లికి అంత ప్రాధాన్యానివ్వని స్త్రీలు చాలామందే కనిపిస్తున్నారు. పురుషులతో సమంగా పెద్ద పెద్ద హోదాలు నిర్వహించడం.. ఆ అనుభవాలు ప్రాపంచిక జ్ఞానాన్ని అందివ్వడం.. ఇవన్నీ ఆడవాళ్లు.. ఆర్థికంగా, వ్యవహారికంగా పురుషుల మీద ఆధారపడే చాన్స్‌లను గణనీయంగా తగ్గించేశాయి. దాంతో వైవాహిక బంధంలో ప్రధానంగా కనిపించే ఈ పరస్పర ఆధారిత అంశం పలచబడుతోంది. అది సహజంగానే జీవిత భాగస్వామి అవసరాన్ని తగ్గించేస్తోంది. కానీ మహిళలోని మాతృత్వపు ఆలోచనను.. ఆ ఆశను మాత్రం పదిలంగానే ఉంచుతోంది. ఆ అభిలాషే పెళ్లి బంధానికావల తల్లి కావాలనే ధైర్యాన్నిస్తోంది. ఇవీ కారణాలు కావచ్చు.. సాంకేతిక వృద్ధి.. పెళ్లితో దొరికే తోడు, తల్లి కావడానికి ఉండే ఈడుతో పనిలేకుండా మాతృత్వాన్ని పొందే అవకాశాలను సృష్టించింది. అండాశయాలను, వీర్యకణాలను భద్రపరచుకునే బ్యాంక్‌లను ఏర్పాటు చేసి. ఈ సౌకర్యం ఉద్యోగినులను పెళ్లి లేకుండానే బిడ్డలను కనాలనే ఆలోచనవైపు ఆకర్షిస్తుండొచ్చు. కెరీర్‌కు సంబంధం లేకుండా ఈ ధోరణిని పరికిస్తే.. అన్ని విధాలా తనకు సరితూగే మిస్టర్ రైట్ దొరక్కపోవడం, వరకట్నాల డిమాండ్, గృహ హింస, కుటుంబ హింస, పరస్పర గౌరవమర్యాదల్లేని వైవాహిక అనుబంధాలు, వివాహ వెఫల్యాలు, మగవాళ్ల వ్యసనాలు, చైల్డ్ అబ్యూజ్ వంటి చేదు అనుభవాలూ వివాహం పట్ల ఈ తరం అమ్మాయిలు విముఖత చూపడానికి, పెంచుకోవడానికి కారణమవుతున్నాయని ఓ పరిశీలిన, పరిశోధన. ఇవీగాక శారీరకంగా తలెత్తే సమస్యలూ ఉంటున్నాయి. మారిన జీవన శైలి వల్ల వస్తున్న స్థూలకాయం, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ వంటివీ పెళ్లంటే అనాసక్తతను పెంచుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. పెళ్లిని వద్దనుకుంటున్నా.. సంతానాన్ని వద్దనుకోవడంలేదు. మాతృత్వపు మాధుర్యాన్ని చవిచూడాలనుకోవడమే కాదు.. దాని తాలూకు బాధ్యతనూ ఒంటరిగా మోయడానికి సిద్ధపడ్తున్నారు ఆ మహిళలు. అంతేకాదు పెళ్లి లేకపోయినా.. తనకంటూ ఓ కుటుంబం ఉండాలని.. దాన్ని ఏర్పర్చే పిల్లల తోడుగా జీవితాన్ని కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు సహజీవనం, స్పెర్మ్ డోనర్స్ అనే మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇవేవీ కుదరని పక్షంలో సరొగసికీ సిద్ధపడుతున్నారు. ఇదీ సఫలం కాకపోతే దత్తత తీసుకోవడానికీ వెనకాడ్డం లేదు. సమస్యలూ ఉన్నాయి.. విడాకులతో భర్త నుంచి వేరై.. సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతను మోస్తున్న తల్లికే సామాజిక మద్దతు కొరవడుతున్న పరిస్థితి. అలాంటిది వివాహ వ్యవస్థను కాదని పిల్లలను కని, పెంచుతున్న ఒంటరి తల్లులను సమాజం ఆదరిస్తుందా? మద్దతు ప్రకటిస్తుందా? గౌరవిస్తుందా? ఆర్థికంగా సర్వస్వతంత్రంగా ఆ తల్లులు సమాజం విసిరే సవాళ్లను ఎదర్కోవడం కష్టమే. అది పిల్లల మీదా ప్రభావం చూపి వారిని అభద్రతలోకి నెట్టే ప్రమాదాలూ ఉన్నాయి. కాబట్టి వెడ్లాక్కి అతీతంగా తల్లి కావాలని ఎంత దృఢచిత్తం చేసుకున్నా.. గర్భం దాల్చే కంటే ముందు తదనంతర పరిణామాలు, సామాజిక ప్రతికూల స్పందనలు వగైరాల మీద కౌన్సెలింగ్ తీసుకోవాలి. అన్నిటికీ తమను తాము సిద్ధపరచుకోవాలి అని సలహా, సూచనలిస్తున్నారు మానసిక విశ్లేషకులు. పిల్లల పెంపకం విషయంలోనూ ఆ కౌన్సెలింగ్ తప్పనిసరి అని చెబుతున్నారు. స్కూళ్లు, వేడుకలు వంటి ప్రదేశాలు, సమూహాల్లో పిల్లలకు ఎదురయ్యే బుల్లీయింగ్ పట్ల అవివాహిత ఒంటరి తల్లులకు ఓ అవగాహన ఉండాలి. వాటిని పిల్లలు అధిగమించే మార్గాలూ తెలుసుండాలి. పిల్లలకు మానసిక స్థయిర్యం ఇచ్చే సహనం, ఓర్పు అత్యవసరం... మిగతా తల్లులకన్నా. ఎందుకంటే వివాహిత ఒంటరి తల్లుల పట్ల కనీసం కుటుంబాల్లోనైనా సహానుభూతి అందుతుంది. కానీ అవివాహిత తల్లుల విషయంలో అదీ కరవే. అందుకే మరింత సహనంతో వాళ్లు వ్యవహరించాల్సి ఉంటుంది. పసి మనసులు గాయపడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నైతిక మద్దతు.. తాము కోరుకున్న ఈ కొత్త కుటుంబ భవిష్యత్‌కు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలే కాదు.. సామాజిక ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా పెరిగేలా వేసుకునే ప్రణాళికలూ అవసరమే! అందుకు ఒంటరి తల్లులకు సంబంధించిన అసోసియేషన్స్, సోషల్ మీడియా గ్రూప్స్ వంటివేమైనా ఉంటే అందులో చేరడం, వారి అనుభవాలను పాఠాలుగా తెలుసుకోవడం, నైతిక స్థయిర్యాన్ని పొందుతూ ఓ మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తల్లీ, తండ్రీ రెండు పాత్రలు పోషించాలి కాబట్టి ఓర్పు చాలా అవసరం. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల ముందు బేలగా ఉండడం, బెంబేలెత్తడం, తమకు ఎవరూ లేరనే స్పృహను కల్పించడం అసలు చేయకూడదని మానసిక విశ్లేషకుల మాట. దాని బదులు ఇతర కుటుంబాల కన్నా తామెందుకు భిన్నమో.. ఆ బిడ్డ తనకెంత ముఖ్యమో.. సందర్భం వచ్చినప్పుడు సంభాషణల్లోనే చెప్పడం.. ఆ ప్రాధాన్యాన్ని చూపించడం చేయాలనీ సూచిస్తున్నారు మానసిక విశ్లేషకులు. చట్టం ఒప్పుకోవట్లేదు.. కానీ న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి.. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం.. పిల్లలను దత్తత తీసుకునే వీలు ఉంది. కానీ పిల్లల పెంపకంలో, వాళ్ల చదువుల విషయంలో సింగిల్ మదర్స్‌కు ఎదురయ్యే ప్రశ్న.. సంరక్షకులు ఎవరని. అసలు సింగిల్ మదర్స్‌కు గార్డియన్‌గా ఉండే అర్హత ఉందా? మన దేశంలోని చట్టాల ప్రకారమైతే లేదు. కేవలం తండ్రికి మాత్రమే సంరక్షకులు అనే హోదా ఉంది. ప్రభుత్వ రికార్డులు సైతం తండ్రినే గుర్తిస్తుంటాయి. తల్లి సహజంగానే సంరక్షకురాలు అనే గుర్తింపు ఉన్నా.. తండ్రి తర్వాతే ఆమె స్థానం. అందుకే ‘సింగిల్ మదర్స్’ హక్కులకు రక్షణ కావాలనే డిమాండ్ తలెత్తింది. ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ). గార్డియన్షిప్ చట్టాలకు సంబంధించి కొన్ని సవరణలు అవసరమనే ప్రతిపాదనలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపించింది కూడా. ఆ సవరణలు ఇంకా జరగలేదు. మన దేశంలో వారసత్వానికి సంబంధించి రెండు ప్రధాన చట్టాలు ఉన్నాయి. హిందూ మైనార్టీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 (హెచ్ఎంజీఏ), గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890.. ప్రకారం తల్లి, తండ్రి లేదంటే ఇతరులు గార్డియన్షిప్ హక్కులను కలిగి ఉంటారు. హెచ్ఎంజీఏ సెక్షన్ 6 ప్రకారం.. ఒక బిడ్డకు తండ్రే సంరక్షకుడు. ఆయన తదనంతరం తల్లికి ఆ హక్కు సంక్రమిస్తుంది. అయితే వివాహ బంధంతో సంబంధం లేని సందర్భాల్లో బిడ్డ పరిస్థితి ఏంటి? అందుకే రాజ్యాంగ బద్ధంగా కల్పించిన హక్కులకు సెక్షన్ 6 (14, 15 ఆర్టికల్స్)కు విఘాతం అని వాదిస్తుంది జాతీయ మహిళా సంఘం. అలాగే సెక్షన్ 6(బీ) ప్రకారం.. వివాహేతర సంతానం అనే పదాన్నీ తొలగించాలని కోరుతోంది. ఈ రెండు సెక్షన్లు.. సింగిల్ మదర్స్‌తో పాటు భర్తలకు దూరమైన తల్లులు, పిల్లల్ని కనే లైగింకదాడి బాధితురాలి హక్కులకూ భంగం కలిస్తున్నాయని జాతీయ మహిళా సంఘం వాదిస్తోంది. అయితే..చట్టంలో సింగిల్ మదర్స్ హక్కులకు భద్రత కరువైనా న్యాయస్థానాలు మాత్రం అందుకు అనుకూలమైన తీర్పులే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సింగిల్ మదర్స్‌కు బిడ్డను కనే హక్కు మాత్రమే కాదు.. వాళ్లను పెంచే హక్కులు కూడా ఉంటాయని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. కేరళలో ప్రముఖ న్యాయవాది అరుణ.ఎ. వాదించిన ఓ కేసులో ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఒక సింగల్ మదర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక 2015లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. ఏబీసీ వర్సెస్ స్టేట్ (ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ).. కేసులో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పెళ్లి కాని తల్లులు.. బిడ్డ తండ్రి పేరు, గుర్తింపును బయటపెట్టాల్సిన అవసరం లేదని, తల్లే ఆ బిడ్డకు ఏకైక సంరక్షకురాలని స్పష్టం చేసింది. ‘ఎవరి మీద ఆధారపడకుండా బిడ్డలను పెంచుతున్న తల్లుల సంఖ్య పెరిగిపోతున్న సమాజం ఇది. అలాంటప్పుడు తండ్రే సంరక్షకుడు అంటూ సింగిల్ మదర్స్‌ను ఇబ్బంది పెట్టడం, తండ్రి పేరు చెప్పాలంటూ ఆమె(సింగిల్మదర్) ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదు. అలాగే ఆ బిడ్డకు తండ్రి పేరు తెలుసుకునే హక్కు ఉంటుంద’ ని వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఈ తీర్పును చాలా హైకోర్టులు సమర్థించాయి కూడా. కానీ చట్టంలో ప్రత్యేక సవరణలు జరగనంత కాలం.. సింగిల్ మదర్స్‌కు వారసత్వ విషయంలో ఇలా కోర్టుల మీద ఆధారపడాల్సిన పరిస్థితే ఉంటుంది. ముగింపు.. సంప్రదాయ పునాదుల మీద.. వివాహం, కుటుంబ వ్యవస్థలే రెండు కళ్లుగా కొనసాగుతున్న సమాజం మనది. సాంకేతిక పురోభివృద్ధి మోసుకొచ్చే ఆధునిక సౌకర్యాలన్నింటినీ మనఃపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. వాటి కూడా వచ్చే, ప్రభావం చూపే పరాయి సంస్కృతీసంప్రదాయాలూ ఉంటాయి. ఇది వరకైతే అవి మనల్ని చేరడానికి ఏళ్ల సమయం పట్టేది. కానీ సమాచార విప్లవంతో గంటలు మహా అయితే రోజుల తేడాతో బదిలీ అవుతున్నాయి. అది అనివార్యం. ఏ ధోరణికైనా.. ఒరవడికైనా! -భాస్కర్ శ్రీపతి -
మదర్స్ డే: మమతల కోవెల..సేవే ‘సాధన’
సాధారణ పిల్లలతో పోలిస్తే intellectual disability(మేధో వైకల్యం) పిల్లలకి చాలాచాలా ప్రేమ కావాలి. ఆదరణ కావాలి. అలాగే ఇలాంటి పిల్లల విషయంలో తండ్రులతో పోలిస్తే తల్లులే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. స్పీచ్ థెరపీ అని, ఫిజియో థెరపీ అంటూ నానా కష్టాలు పడుతూ చాలా జాగ్రత్తగా వాళ్లని ఆసుపత్రులకు తీసుకెడుతున్న తల్లులు చాలామంది మన కంట పడతారు కదా? మరి అలాంటి పిల్లల్ని దాదాపు 148 మందిని అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది సాధన హోం.. మెంటల్లీ చాలెంజ్డ్ కిడ్స్ కోసం ఎలాంటి వసతులు ఉన్నాయి. మానవతకు ప్రతీకగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో అమ్మగా వెలుగులు నింపుతున్న సురేఖ రెడ్డిని సాక్షి.కామ్ పలకరించింది. అసలు ఈ హోం ఏర్పాటు వెనక ఉన్న ఉద్ధేశ్యం ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ పిల్లల రోజువారీ అవసరాలకు అనుగుణంగా, శిక్షణ ఇస్తున్నారు. వారిలోని స్పెషల్ స్కిల్స్ గుర్తించి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాంగ్వేజ్, స్పీచ్ థెరపీ, ఫిజియో థెరపీ, లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడున్న టీచర్స్ పిల్లల్నందరినీ ప్రత్యేక శ్రద్ధగా, అపురూంగా చూసుకుంటారు. మరోవిధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలా భావిస్తారు. అంతేకాదు సంగీతం, డాన్సింగ్, సింగింగ్, ఫైన్ ఆర్ట్స్ , కంప్యూటర్ స్కిల్స్ లాంటివి నేర్పిస్తారు. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు, తమ జీవితాన్ని వారు స్వయంగా లీడ్ చేసేలా తీర్చి దిద్దుతారు. అలాగే వృద్ధుల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాడు చేయడం విశేషం. ఈ సేవలకు గాను సాధనం హోం అనేక అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. త్యాగానికైనా, ధైర్యానికైనా అమ్మ తరువాతే ఎవరైనా ఇల్లయినా, ఆఫీసైనా ఒంటిచేత్తో నడిపించే ‘బాహుబలి’ కష్టమొచ్చినా.. కన్నీరొచ్చినా ఏ మాత్రం వెరువని ధీశాలి అమ్మ అయితే ఒక చిన్న మాట ఈ ఒక్కరోజు అమ్మను తలచుకుని, ఒక పువ్వో, ఒక ముద్దో, ఒక హగ్గో ఇచ్చేస్తే సరిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోను కాదు. అయితే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అమ్మను తీసుకోకుండా.. అమ్మ చాకిరీకి, త్యాగానికి విలువ ఇచ్చి.. హార్ట్‌ఫుల్‌గా అమ్మను ప్రేమించాలి. ఆమె మనసుకు కష్టం కలిగినపుడు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి.. అచ్చం అమ్మలాగా.. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ విషెస్ అందిస్తోంది. -
దేవుడే డాక్టరై వచ్చాడు..
జహీరాబాద్: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం పీహెచ్‌సీకి వచ్చింది. అక్కడ డాక్టర్ లేకపోవడంతో ఏరియా ఆస్పత్రికి తరలించమని సిబ్బంది సలహా ఇచ్చారు. ఈలోగానే ఆ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆ దారిన వెళ్తున్న ఓ వైద్యుడు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేకాపూర్ తండాకు చెందిన మంజూబాయి ప్రసవం కోసం ఆదివారం మధ్యాహ్నం మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆస్పత్రిలో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. అక్కడ ఉన్న ఏఎన్ఎంలు వివరాలు తెలుసుకుని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆటో మాట్లాడి ఆమెను తీసుకెళ్లే క్రమంలోనే పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో, ప్రస్తుతం వరంగల్ జోనల్ మలేరియా ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ వ్యక్తిగత పనిపై అటు వైపు వచ్చారు. అందరూ గుమిగూడటం చూసి విషయం ఆరా తీశారు. వెంటనే ఆస్పత్రి ఆవరణలో ఏఎన్ఎంలతో కలిసి పురుడు పోశారు. అనంతరం తల్లీ బిడ్డలకు పీహెచ్సీలో వైద్యం అందించారు. మాతృదినోత్సవం రోజున మంజూబాయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన వైద్యుడు సునీల్‌ని పలువురు ప్రశంసించారు. చదవండి: మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా -
ఈ ఒక్క మెసేజ్‌తో జీవితం ధన్యమైంది: చిన్మయి
ఆమె గాత్రం మాధుర్యంగా ఉండటమే కాదు గళంలో ఆవేశమూ ఉంటుంది. పాడటానికి మాత్రమే సవరించే గొంతు.. ఏదైనా నిగ్గదీసి అడగడానికి సైతం వెనుకాడదు. ముఖ్యంగా ఆడవారి పట్ల జరుగుతున్న వివక్షను నిలదీసేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఆవిడే ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద. అయితే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఎంతోమంది తమకు ఎదురైన చేదు అనుభవాలను, జరుగుతున్న అఘాయిత్యాలను చిన్మయికి చెప్పుకుని బాధపడుతుంటారు. అలా అనేక మంది బాధలను, వారి నిస్సహాయ స్థితిని చిన్మయి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేవారు. ఆదివారం నాడు మదర్స్‌డే సందర్భంగా ఆమెకు ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది. "ప్రియమైన చిన్మయి.. చాలామంది పిల్లలు వారికేదైనా సమస్య రాగానే తల్లికి చెప్పుకుందామని చూస్తారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా అమ్మతోనే పంచుకుంటారు. కానీ లైంగిక వేధింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం వాటిని కన్నతల్లితో కూడా చెప్పుకోలేక బాధపడుతుంటారు. కానీ అలాంటి చేదు విషయాలను కూడా మేం నీతో చెప్పుకోగలిగాం. ఆ ధైర్యాన్ని నువ్వే మాకు అందించావు. అందుకే నీతో అన్నీ షేర్ చేసుకున్నాం. హ్యాపీ మదర్స్‌డే" అని వచ్చిన మెసేజ్ చూసి చిన్మయి ఎమోషనల్ అయింది. ఈ ఒక్క మెసేజ్‌తో తన జీవితానికి సార్థకత లభించినట్లు అయిందని భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం చెప్పినట్టు ఆడరు -
నాన్న చనిపోయాడు, అప్పుడు నేను గర్భవతిని: నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మదర్స్‌డేను పురస్కరించుకుని రెండుసార్లు గర్భవతి అయిన సమయంలోని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెండు సార్లు కవల పిల్లలను కనడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఏడు లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పినప్పుడు తన భర్త పీటర్ ముఖంలో కనిపించిన సంతోషం ఇప్పటికీ గుర్తుందని ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను అభిమానులతో పంచుకుంది. "రెండుసార్లు కవలలకు జన్మనివ్వడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్(గర్భధారణ మధుమేహం) వచ్చింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు మా నాన్న చనిపోయారు. ఆ షాక్‌లో నేను నడిచే సామర్థ్యాన్ని కోల్పోయాను. నా భర్త పీటర్ నన్ను వీల్‌చెయిర్‌లోనే తీసుకు వెళ్లేవాడు. అప్పుడు నా ఎముకలు సైతం దెబ్బతిన్నాయి, కడుపులో బిడ్డలు తన్నేకొద్దీ శ్వాస తీసుకోవడం మరింత కష్టంగా ఉండేది. ఆ తర్వాత బేబీ షాంషర్ చనిపోవడడం, మరో బిడ్డ అర్తుజాగ్ మూడు నెలల పాటు పాటు ఇంక్యుబేటర్‌లో ఉండటం, అదే సమయంలో మా అమ్మ చనిపోవడం.. ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు మాతృత్వం ఎంత గొప్పదో అర్థమైంది. నిజానికి వీటన్నింటినీ తట్టుకునేంత సామర్థ్యం నాలో ఉందని అనుకోలేదు. ఇక మా అమ్మ మీటా జైట్లీ విషయానికి వస్తే ఆమె తన జీవితంలో ఎన్నో త్యాగాలను చేసింది. అసలు మాతృత్వానికి లింగబేధం లేదు. ఎవరైనా సరే.. పిల్లలు ఎదగడానికి అవసరమైన శక్తి, ప్రేమను ఎంత పంచుతారనేదే ముఖ్యం. నాకు అలాంటి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతగా భావిస్తున్నాను. ప్రేమ, పెంపకం, సంరక్షణ కోసం ప్రతిజ్ఞ పూనే ప్రతి ఒక్కరికీ మదర్స్ డే శుభాకాంక్షలు" అని సెలీనా జైట్లీ రాసుకొచ్చింది. చదవండి: లాక్డౌన్.. వలస కూలీల కడుపు నింపుతున్న సన్నీలియోన్ వెబ్ దునియాలో సత్తా చాటుతోన్న డ్రీమ్ గర్ల్ -
Mother's Day: వైరలవుతున్న క్రికెటర్ల పోస్టులు
ముంబై: కన్నతల్లి అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ఏ ప్రేమకైనా దూరంగా ఉంటాడేమో కానీ కన్నతల్లి ప్రేమ నుంచి దూరంగ ఉండలేడు. తన సంతోషం కన్నా బిడ్డల సంతోషాన్ని కోరుకునే గొప్ప మానవతావాది అమ్మ. అందుకే ప్రపంచంలో అమ్మ ఎవరికైనా అమ్మే.. ఆ విషయంలో క్రికెటర్లు కూడా ఒక్కటే. ఎంత గొప్ప పేరు సంపాదించినా తల్లి ముందు మాత్రం తాను ఎప్పటికీ పిల్లాడే. మే 9వ తేదీ.. మదర్స్‌డే పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదలుకొని సెహ్వాగ్, రహానె, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్, దినేశ్ చండిమాల్, డేవిడ్ వార్నర్ తదితరులు తమ తల్లులతో ఉన్న అనుబంధాలను.. తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి Mothers are the ones who pray for you no matter how old you get. For them, you are always their child. Blessed to have two mothers in my life who have nurtured and loved me always. Wishing Aai and Kaku a very Happy #MothersDay, sharing some photos from the past. 🙏🏻 pic.twitter.com/x22BBvDDiC — Sachin Tendulkar (@sachin_rt) May 9, 2021 — Virender Sehwag (@virendersehwag) May 9, 2021 -
తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి కనిపించే దైవం వంటిదని సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు జయచిత్ర అన్నారు. కన్నతల్లిని మించిన దైవం ఈలోకంలో మరొకటి లేదన్నారు. ఈనెల 9వ తేదీన మాతృదినోత్సవం సందర్భంగా ఆమె శనివారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఎదిగినా, అనేక విజయాలు సాధించినా అంతగా తీర్చిదిద్దిన కన్నతల్లిని ఎప్పుడూ మరువరాదన్నారు. బిడ్డలు ప్రయోజకులు కావడం తల్లిదండ్రులకు ఆనందం అన్నారు. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులను కాపాడుకోవాలని, పదహారేళ్ల ప్రాయంలో సినీ జీవితంలోకి అడుగుపెట్టి పరిశ్రమలో గుర్తింపు, గౌరవం, హోదా దక్కించుకున్నానంటే తన తల్లి జయశ్రీ ఆశీస్సులే ప్రధాన కారణమని తెలిపారు. తన కృషికి తల్లిదీవెన తోడు కావడంతో సినీ పరిశ్రమలో రాణించగలిగానని చెప్పారు. అలాగే తన కుమారుడు అమ్రీష్‌కు తన దీవెనలు రక్షగా నిలిచాన్నారు. సినీసంగీత దర్శకుడిగా ఎదిగి పేరు ప్రతిష్టలు గడించాడని, తన కుమారుడు సైతం ఇటీవల కొన్ని సంఘటనల నుంచి బయటపడ్డాడని, ఈ మాతృదినోత్సవాన్ని కలిసి జరుపుకోవడం తల్లిగా తన అదృష్టమని జయచిత్ర చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీలోకి నయనతార కొత్త సినిమా.. మే 9 నుంచి స్ట్రీమింగ్ -
డాక్టర్ల సలహాలతో మనోధైర్యం తో మగబిడ్డకు జన్మనిచ్చిన మున్ని
-
తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘‘అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు’’ అని సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చదవండి: Mother's Day: అమ్మ కూడా మనిషే డాక్టరమ్మలు మదర్స్ డే సెల్యూట్ -
వాట్ ఏ క్రియేటివీ అదాశర్మ... వీడియో వైరల్
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అదాశర్మ. ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. ఇక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాంధించుకుంటుంది అందాల ముద్దుగుమ్మ అదా శర్మ. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మదర్స్‌డే సందర్భంగా అదా శర్మ షేర్ చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘అదా శర్మ ప్రతి విజయం వెనుక అమ్మ ఉంటుంది’అంటూ ఆ వీడియోని షేర్ చేసింది అదా శర్మ. అందులో ఆదా తల్లితో కలిసి ఓ హింది పాటకి డాన్స్ చేసింది. అయితే వీడియో ఎండింగ్ వరకు ఆమె వెనుక తల్లి ఉందన్న విషయం బయటపడదు. తన తల్లితో కలిసి చేసిన ఈ డాన్స్ విన్యాసం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంది. అదా క్రియేటివిటీకి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది!
అమ్మ అంటే అనురాగం... అమ్మ అంటే ఆలంబన... అమ్మ అంటే ఆత్మస్థయిర్యం... అమ్మ అంటే కొండంత అండ... నిస్వార్థమైన ప్రేమకు చిరునామా – అమ్మ. ‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి వనితా శిరోద్కర్ గురించి నటి, మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చెబుతూ, ‘అమ్మ అంటే ధైర్యం’ అన్నారు. ఇంకా తన తల్లి, పిల్లల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► మీ అమ్మగారి గురించి? నమ్రత: అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ మా అమ్మ. ఈరోజు నేను, నా సోదరి (శిల్పా శిరోద్కర్) స్ట్రాంగ్ ఉమెన్‌గా ఉండగలుగుతున్నామంటే మా అమ్మ పెంపకం వల్లే! మా అమ్మ జీవన విధానం నాకు గొప్ప ఇన్స్పిరేషన్. అమ్మ జాబ్ చేసేవారు. ఇంటినీ, ఉద్యోగాన్నీ ఆవిడ బ్యాలెన్స్ చేసుకున్న తీరు అద్భుతం. మేం ‘నెగ్లెక్టెడ్ చిల్డ్రన్’ అనే ఫీలింగ్ మాకెప్పుడూ కలగలేదు. అమ్మలేని లోటును నేనెప్పటికీ ఫీలవుతుంటాను. అయితే ఆవిడలోని చాలా విషయాలను నా సిస్టర్ శిల్పలో చూస్తున్నాను. ► అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు? ఇతరుల పట్ల దయగా ఉండడం... మానవత్వం. అన్ని సమయాల్లో ధైర్యంగా ఉండడం, సవాళ్లను ఎదుర్కోవడం వంటివన్నీ ఆమె నుంచి నేర్చుకున్నాను. అవి నా పిల్లలకు నేర్పుతున్నాను. మా అమ్మ తన పిల్లలకు ‘బెస్ట్ మామ్’గా నిలిచారు. మా అమ్మలా నేను నా పిల్లలకు బెస్ట్ మామ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ► అమ్మతో గడిపిన ఆనంద క్షణాలు? మా అమ్మగారి చివరి రోజుల్లో నాతో ఎక్కువగా గడిపారు. అవి నాకు ముఖ్యమైన రోజులు. ఆ మూడు నెలలు అమ్మకు ఏమేం చేయాలో అన్నీ చేశాను. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆవిడను చూసుకున్న ఆ మూడు నెలలు నాకు స్పెషల్‌గా గుర్తుండిపోతాయి. ► సమస్యలను అధిగమించడానికి మీ అమ్మగారు ఎలా హెల్ప్ చేసేవారు? అమ్మకు ఒక మంచి లక్షణం ఉండేది. ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు ఓపికగా వినేవారు. ‘వినడం’ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవారు. సమస్య మొత్తం విన్నాక అప్పుడు పరిష్కార మార్గం చెప్పేవారు. సమస్య అనే కాదు.. ఏ విషయాన్నయినా పూర్తిగా వినాలనే లక్షణం అమ్మ నుంచి నాకు అలవాటయింది. ► అమ్మ చేసిన వంటల్లో నచ్చినవి? పెప్పర్ చికెన్, అలాగే వైట్ సాస్ చికెన్ కూడా అద్భుతంగా వండేవారు. ► ‘ఆడపిల్లలు’ అంటూ... మీ అమ్మగారు పదే పదే జాగ్రత్తలు చెప్పేవారా? జాగ్రత్తలు చెప్పేవారు కానీ పదే పదే చెప్పేవారు కాదు. ఒక తల్లిగా తను చెప్పదలచుకున్నవి చెప్పేవారు. కానీ ఏదైనా మా అంతట మేం తెలుసుకోవాలనేవారు. అలాగే ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోమనేవారు. ఎలా ఉంటే ఆ దారి బాగుంటుందో మాత్రం చెప్పేవారు. అలా చేయడం వల్ల మాకంటూ సొంత వ్యక్తిత్వం ఏర్పడింది. పిల్లల చెయ్యి పట్టుకుని నడిపించాలి. కానీ వాళ్ల జీవితం మొత్తం పట్టుకునే నడిపించాలనుకుంటే సొంత వ్యక్తిత్వం ఏర్పడదని నమ్మిన వ్యక్తి మా అమ్మ. ► మీకు ఆంక్షలు ఏమైనా పెట్టేవారా? కొన్ని రూల్స్ పెట్టేవారు. అయితే నేను వాటిని ఆంక్షలు అనను. ఏ తల్లయినా పిల్లలకు కొన్ని నియమాలు పెట్టడం చాలా అవసరం. అవి వాళ్ల భవిషత్తుకు మంచి పునాది అవుతాయి. ► మీరు మీ పిల్లలతో ఎలా ఉంటారు? పిల్లల కోసం పూర్తిగా టైమ్ కేటాయిస్తాను. పిల్లలకు మంచీ చెడు చెబుతుంటాను. గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్‌కి తేడా చెబుతాను. వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెబుతాను. దాదాపు ఏ పిల్లలూ అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరు. అందుకే చదివించేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ముఖ్యం. గౌతమ్‌కు స్విమ్మింగ్, సితారకు డ్యాన్స్ వంటి క్లాసులు ఉన్నాయి. వాటిని ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. ► కరోనా లాక్డౌన్లో పెద్దలు, పిల్లలు బయటికి వెళ్లే వీలు లేదు. ముఖ్యంగా పిల్లల అల్లరిని ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? ఇద్దరూ గొడవపడుతుంటారా? మా ఇద్దరు పిల్లలు బంగారాలనే చెప్పాలి. వాళ్లను మ్యానేజ్ చేయడం నాకెప్పుడూ ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. అందుకని మిగతా రోజులకి, లాక్‌డౌన్‌కి నాకు తేడా తెలియడంలేదు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే గొడవపడడం కామన్. వీళ్లిద్దరిదీ ఇల్లు పీకి పందిరేసేంత అల్లరి కాదు కాబట్టి మ్యానేజ్ చేసేయడమే (నవ్వుతూ). ► ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను ఏ విధంగా చూసుకోవాలి? పిల్లలతో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. అలాగే మాస్కు ధరించడంవల్ల ఉండే ఉపయోగాలను పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ‘ఈ టైమ్‌లో కొంచెం ఎక్కువ శుభ్రంగా ఎందుకు ఉండాలి? భౌతిక దూరం ఎందుకు పాటించాలి?’ అనే విషయాలను పిల్లలకు వివరించాలి. అలాగే ఈ సమయంలో స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. శుభ్రమైన శ్వాస ప్రాముఖ్యాన్ని చెప్పాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం పిల్లలకు ఇవ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పాలి. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే! ► మీ అమ్మగారు మీకిచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ... చెప్పిన విషయాల గురించి కానీ షేర్ చేసుకుంటారా? ఓ సందర్భలో మా అమ్మ నాకు ‘శ్రీసాయి సచ్చరిత్ర’ పుస్తకాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆ పుస్తకాన్ని ఏకాగ్రతగా చదవమని చెప్పారు. మంచి చేయడంతో పాటు సవాళ్లను అధిగమించి ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. నేను ఏడు రోజుల పారాయణం పూర్తి చేశాను. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే. సచ్చరిత్ర చదువుతున్నప్పుడే నాకు ఓ బలం, నమ్మకం ఏర్పడ్డాయి. ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా అభిమానించడం, జీవితాన్ని స్పష్టంగా చూడడం కూడా అలవాటైంది. మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది! ► మీ అమ్మగారు ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనాలనుకున్నారట. కానీ మీరు ‘మిస్ ఇండియా’ అయ్యారు... ‘మిస్ ఇండియా’ కాంటెస్ట్‌లో అమ్మ పాల్గొనలేకపోవడానికి కారణం అప్పటికే ఆమెకు పెళ్లి కావడమే! నన్ను మిస్ ఇండియాగా చూడాలన్నది ఆమె కల. అది నెరవేర్చగలిగాను. నేను సాధించిన ‘మిస్ ఇండియా’ కిరీటం నా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి. వాళ్ల కోసం ఏదో సాధించానన్న తృప్తి నాకెప్పటికీ ఉంటుంది. నితిన్, వనిత దంపతులు మా మమ్మీ చాలా కూల్ – సితార మహేశ్‌బాబు–నమ్రతల ముద్దుల కుమార్తె సితార తన తల్లి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పిన విశేషాలు... ► మీ అమ్మగారు వెరీ స్ట్రిక్టా? మా అమ్మ చాలా గారాబం చేస్తుంది. వెరీ కూల్. వెరీ స్వీట్. అయితే స్ట్రిక్ట్‌గా ఉండాల్సినప్పుడు మాత్రం ఉంటుంది. మేం తప్పు చేస్తున్నాం అనిపించగానే మందలిస్తుంది. కరెక్ట్ ఏంటో చెబుతుంది. ► నువ్వు అలిగినప్పుడు మీ అమ్మ ఏం చేస్తారు? ఫన్నీ స్టోరీలు చెప్పి నవ్విస్తారు. ► నీతో ఎప్పుడూ ఏం చెబుతుంటారు? ‘ముందు చదువుకో... తర్వాతే ఆటలు’ అంటారు. ► మరి.. స్టడీస్ విషయంలో హెల్ప్ చేస్తారా? ఓ.. అన్ని సబ్జెక్టులకీ హెల్ప్ చేస్తారు. అలాగే ఆర్ట్ వర్క్‌కి కూడా! నాకేది ఇష్టమో అవన్నీ చేస్తారు. ► నీతో ఆటలు ఆడుకుంటారా? మేం ఇన్డోర్ గేమ్స్ ఆడతాం. మేము ఇంట్లో పెంచుతున్న మా పెట్స్ నోబు, ప్లూటోతో బాగా ఆడుకుంటాం. ► మీ అమ్మ ఫేవరెట్ ఫుడ్? అమ్మకు అన్నీ ఇష్టమే. హెల్త్ కోసం మంచివే తినాలంటారు. ఆర్గానిక్ ఫుడ్‌ని ఇష్టపడతారు. ► మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు నచ్చినవి చేయడానికి ఎంకరేజ్ చేసే ‘బెస్ట్ మామ్’ మా అమ్మ. నా బెస్ట్ మామ్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. – డి.జి. భవాని -
ఆదర్శ మాతృమూర్తులకు అవార్డ్స్ ప్రధానం
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్వర్యంలో 'మదర్స్ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటా డీసీ మెట్రో వారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నలుగురు ఆదర్శ మాతృమూర్తులను గుర్తించి వారికి గౌరవ ప్రదమైన ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలతో సత్కరించడం రివాజుగా మారింది. అందులో భాగంగానే ఈసారి కూడా అమెరికా రాజధాని పరిసర ప్రాంతాల తెలుగు సేవా సంస్థలైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షురాలు కవితా చల్లా, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, వారధి అధ్యక్షురాలు పుష్యమి దువ్వూరి, ఉజ్వల ఫౌండేషన్ అధ్యక్షురాలు అనిత ముత్తోజు, రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (సీఏటీఎస్) అధ్యక్షురాలు సుధారాణి కొండపులను ఆదర్శ మాతృమూర్తి పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరంతా తమ కుటుంబ బాధ్యతలే కాక వృత్తి, వ్యాపారాలకు న్యాయం చేస్తూనే అనేక సేవాకార్యక్రమాలతో ఆడదంటే అబల కాదు అని నిరూపిస్తున్నారు. వారిని ఈ ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తూ మదర్స్ డే రోజున వారందరికీ ఆదర్శ మాతృమూర్తి గౌరవ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి నాటా ఉమెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధారాణి సారధ్యం వహించారు. సంధ్య బైరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని టీవీ ఏషియా తెలుగు ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. రితిక స్వాగత గీతం పాడగా.. ఆర్వీపీ అనిత నాటా సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఆర్వీపీ చైతన్య నాటా ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్ వారికి, లోకల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్లకు, రీజినల్ కోఆర్డినేటర్స్‌కు, నాటా నాయకులు సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(సంయుక్త కార్యదర్శి), బోర్డు సభ్యులు సతీష్ నరాల, కిరణ్ గుణ్ణం, బాబూ రావు సామల, కలాడి మోహన్, మీడియా మిత్రులకు, నాటా శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. -
కాబోయే తల్లికి శుభాకాంక్షలు!
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా, కలసి చేసే ప్రయాణాల ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రేమను చెప్పకనే చెబుతున్నారు. ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో విఘ్నేష్ శివన్‌ని నయనతార హబ్బీ (భర్త) అని సంబోధించారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నయనతార చిన్న పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది. దానికి ఈ విధంగా క్యాప్షన్ చేశారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోయే తనకి (నయనతారని ఉద్దేశిస్తూ) మదర్స్ డే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు విఘ్నేష్. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు ఈ కామెంట్ మరింత బలాన్ని చేకూర్చింది. విఘ్నేష్ శివన్, నయనతార -
ఆమెను తలుచుకున్నపుడల్లా ఏడుస్తా: రోజా
సాక్షి, తిరుపతి : తన ఎదుగుదలకు మొదటి కారణం తల్లేనని, ఆమె దగ్గరినుంచి మల్టీటాస్కింగ్, డిసిప్లేన్ నేర్చుకున్నానని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇంట్లోకానీ, బయటకానీ, ఏ టాస్కు ఇచ్చినా అమ్మ సక్సెస్‌ఫుల్‌గా చేసేది. ఏది చేసినా సిస్టమాటిక్‌గా చేయాలనే వారు. ఆమె నేర్పిన అనేక విషయాల వల్లే ఈ రోజు నన్ను మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దాయని అనుకుంటున్నా. ఆమె మమ్మల్ని చాలా బాధ్యతతో పెంచింది. నాకు ఇన్పిరేషన్ అమ్మే. నా కోసం వాలెంట్రీ రిటైర్మెంట్ తీసుకుని నా వెంట చెన్నై వచ్చేసింది. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆర్టిస్ట్‌గా నా సక్సెస్‌ను చూసింది. ఈ రోజు తను లేకపోవటం చాలా బాధగా ఉంది. ( మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయం: రోజా) మేమందరం సెటిల్ అయ్యాం, పిల్లలతో ఉన్నాం, మా పిల్లలతో ఆడుకోవాల్సిన సమయంలో అమ్మలేకపోవటం మా అందరికి తీర్చలేని కొరత. తల్లి రుణం ఎవరూ తీర్చుకోలేనిది. అమ్మను చాలా మిస్ అవుతున్నాను. ఆమెను తలుచుకున్నపుడల్లా ఏడుస్తుంటా. మా అమ్మలేని లోటును నా భర్త తీరుస్తున్నారు. నాపై మా అమ్మ చూపిన ప్రేమనే.. నా పిల్లలకు పంచుతున్నా. వాళ్లు అడిగినవి అన్నీ కొనిస్తుంటాను. మా పిల్లలు ప్రస్తుత ట్రెండ్‌కు ఆపోజిట్‌గా ఉన్నారు. వాళ్లకి తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ’’ని అన్నారు. -
సీఎం వైఎస్ జగన్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : ప్రపంచంలోని ప్రతి తల్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృ దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ‘వారి వారి జీవితకాలంలో రకరకాల పాత్రలు పోషిస్తున్న తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టిలో అమ్మ ప్రేమను మించింది మరొకటి ఉండదు. అమ్మ ప్రతి ఒక్కరికి గురువు, సంరక్షకురాలు, స్ఫూర్తిదాయని’ అని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. A confidante, a mentor, a caregiver & most importantly an inspiration; a very Happy Mother's Day to all the remarkable mothers who don various hats in their lifetime. Truly, there is no love like a mother's love. #mothersday — YS Jagan Mohan Reddy (@ysjagan) May 10, 2020 -
పాలామృతం
అమృతం అంటే మృతి చెందనివ్వనిది అని అర్థం చెప్పుకుంటే అది బహుశా అమ్మపాలే కావచ్చు. ఈ నెల 10న మదర్స్ డే సందర్భంగా మాతృత్వంతో బిడ్డను సాకే పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలెలా ఉపయోగపడతాయో, అవి బిడ్డకు ఎంతటి మేలు చేస్తాయో, పాలివ్వడం వల్ల తల్లికీ కలిగే మేలు ఏమిటో లాంటి అనేక అంశాలను తెలుసుకుందాం. తల్లిపాలలో బిడ్డలో తప్పక జరగాల్సిన అనేక జీవరసాయన చర్యలను ప్రేరేపించే ఎంజైములు, హార్మోన్లు, పెరుగుదలకు తోడ్పడే అంశాలు ఉంటాయి. వ్యాధినిరోధకతను పెంచే అత్యావశ్యక అంశాలూ ఉంటాయి. కళ్లకూ, మెదడు, నాడీ మండలానికి మేలు చేసే పదార్థాలెన్నో ఉంటాయి. తల్లి పాలతో ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని జబ్బులు చాలా ఆలస్యమవుతాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కనీసం ఆరు నెలలకు తగ్గకుండా బిడ్డకు తల్లిపాలే పట్టాలని సిఫార్సు చేస్తుంది. తల్లిపాల కారణంగా బిడ్డకు కలిగే మేళ్లలో కొన్ని ఇవి.. ♦జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు జీర్ణకోశానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా తేలిగ్గా అరుగుతాయి. తల్లిపాలు తాగే బిడ్డకు విరేచనం తేలిగ్గా అవుతుంది. తద్వారా బిడ్డలోని బిలురుబిన్ ఈ మార్గంలో వెళ్లిపోవడం వల్ల బిడ్డకు కామెర్లు రావు. ♦బిడ్డ పుట్టాక తల్లిలో ఊరే పసుపుపచ్చ రంగులో ఉండే ముర్రు పాలతో ఇమ్యూనోగ్లోబ్యులిన్–ఏ అనే వ్యాధి నిరోధకశక్తి అత్యధికంగా ఉండి, వాటి వల్ల మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. ♦పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి ఊపిరితిత్తుల జబ్బులు, ఎగ్జిమా వంటి చర్మసమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. పోతపాల అలర్జీల కారణంగా ఇలా జరుగుతుంది. తల్లి పాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవు. అంతేకాదు, తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు, చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే ఊబకాయం (ఛైల్డ్ ఒబేసిటీ) వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ♦తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (ఛైల్డ్‌హుడ్ క్యాన్సర్లు) వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ♦పెద్దయ్యాక వచ్చే గుండెజబ్బులు, టైప్–2 డయాబెటిస్ వంటివి కూడా నివారితమవుతాయి. ♦తల్లిపాల వల్ల బిడ్డకూ, తల్లికీ మధ్య ఓ చక్కటి అనుబంధం వృద్ధి చెందుతుంది. పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు: ♦ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే వేటమాంసం, కోడిమాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, బీన్స్ వంటివి ఎక్కువగా తీౖసుకోవాలి. మాంసాహారం తినని వారు చిక్కుళ్లూ, డ్రైఫ్రూట్స్, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ♦రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయల వంటి వాటిని మార్చిమార్చి తింటూ ఉండాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా కొంతవరకు మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. ♦పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. అది అపోహ మాత్రమే. బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. ♦తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. ♦ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. దాంతో అటు తల్లికీ, బిడ్డకూ ఐరన్‌తో పాటు ఇటు వ్యాధి నిరోధక శక్తి కూడా సమకూరుతుంది. ♦తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. ♦విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లి తీసుకోకూడనివి కెఫిన్ ఉండే పదార్థాలు : పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు. సముద్రపు చేపలు : చేపలు మంచి పౌష్టికాహారమే అయినా... కొన్నిరకాల సముద్రపు చేపల్లో మెర్క్యూరీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మెర్క్యురీ బిడ్డలో నాడీవ్యవస్థ ఎదుగుదలపై దుష్ప్రభావం చూపుతుంది. కొన్నిరకాల సముద్రపు చేపలు తీసుకున్న తర్వాత పట్టే పాలు బిడ్డకు అలర్జీ కలిగించవచ్చు. అందుకే బిడ్డకు పాలు పట్టే సమయంలో సీ ఫిష్‌ను ఆహారంగా స్వీకరించక పోవడమే మంచిది. బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని.. ♦పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు... బిడ్డకు పాలిచ్చే ప్రక్రియ అన్నది... ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. ♦తల్లులు పాలు ఇస్తున్నంత కాలం వాళ్లు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజే యడంతోపాటు బరువు (ఒబేసిటి) రిస్క్ ఫ్యాక్టర్‌గా గల అనేక జబ్బుల నుంచి సహజ రక్షణ లభిస్తుంది. ♦తల్లుల్లో పాలు పడుతున్నంత కాలం ప్రకృతి సిద్ధంగానే గర్భధారణ జరగకుండా రక్షణ ఉంటుంది. అంటే పాలు పట్టడం ఒకరకంగా గర్భనిరోధకంగా పనిచేస్తుంది. (అయితే కొన్నిసార్లు గర్భంరావచ్చు కూడా). ♦పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది. డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. ♦చర్మం బాగా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది. -
తల్లీని సర్ప్రైజ్ చేసిన తొమ్మిదేళ్ల బాలుడు
-
స్మార్ట్ కిడ్.. తల్లికే షాకిచ్చాడు..!
బీజింగ్ : ఈ తరం పిల్లలకు పెద్దలంటే బొత్తిగా గౌరవం లేదు. తల్లిదండ్రుల్ని కూడా లెక్క చేయరు. అనే మాటలు వింటూనే ఉంటాం..! అడిగింది కొనివ్వలేదని గొడవలకు దిగే పిల్లల్ని కూడా చూస్తుంటాం..! కానీ చైనాలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం వీటన్నికీ భిన్నంగా ఆలోచించాడు. అమ్మకు జీవిత కాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. మదర్స్ డే రోజు (మే 12)న తన తల్లిని గ్వో ఇఫాన్ జ్యుయెలరీ షాప్‌నకు తీసుకెళ్లాడు. ‘నీ చేతికి ఏ ఉంగరం బాగుంటుందమ్మా’ అని అడిగాడు. విషయమేంటో ఆమెకు అర్థం కాలేదు. కుమారుడు అడుగుతున్నాడు కదా అని ఆమె తనకు నచ్చిన ఓ ఉంగరాన్ని చూపించారు. దాని ధరెంతో తెలుసుకున్న ఇఫాన్ నేరుగా బిల్ కౌంటర్ దగ్గరకెళ్లి జేబులో నుంచి రెండు పిగ్గీ బ్యాంక్‌లను తీశాడు. (చదవండి : బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..) వాటిని పగులగొట్టి.. ఆ మొత్తం లెక్కిస్తే.. అవి రూ.15 వేలు (1500 యువాన్లు)గా ఉన్నాయని తేలింది. వాటితో ఆ గోల్డ్ రింగ్‌ని ఖరీదు చేసి.. అమ్మకు అందించాడు. ఇక కుమారుడు చేసిన పనికి ఆ తల్లి ఆనందంతో పొంగిపోయారు. ‘అమ్మ మాకోసం చాలా కష్టపడుతుంది. ఆమె చేతులకు బంగారు ఆభరణాలు లేవు. ఆమెకు ఏదైనా మంచి బహుమతి ఇద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అమ్మ, అమ్మమ్మ ఇచ్చిన పాకెట్‌మనీని రెండేళ్లుగా పొదుపు చేసి ఈ గిఫ్టులు కొన్నాను’ అని చెప్పుకొచ్చాడు ఇఫాన్. ఈ ముచ్చటైన సంఘటన లింక్వాన్ పట్టణంలో మే 12న జరిగింది. తన తల్లితో పాటు ఆమె తల్లికి కూడా ఇఫాన్ నెక్లెస్ కానుకగా ఇవ్వడం మరో విశేషం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తల్లీని సర్ప్రైజ్ చేసిన తొమ్మిదేళ్ల బాలుడు -
మదర్స్ డే రోజు ఐరన్ లేడీకి ట్విన్స్
సాక్షి, బెంగళూరు: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ మరోసారి ఐరన్ లేడీ అని నిరూపించుకున్నారు. 46 ఏళ్ల వయసులో షర్మిల కవల పిల్లలకు జన్మనిచ్చారు. అదీ మాతృదినోత్సవం (మే 12వ తేదీ ఆదివారం) రోజున ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం విశేషం. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క్లౌడ్‌లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్లో ఆదివారం ఉదయం 9.21కి షర్మిల కవలలకు జన్మనిచ్చారనీ, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. వీరికి నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను ఖాయం చేశారు షర్మిల, డెస్మండ్ దంపతులు. ఇది తనకు కొత్త జీవితమంటూ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అందులోనూ మదర్స్ డే రోజు కవల ఆడబిడ్డలు కలగడం చెప్పలేని ఆనందాన్నిస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలని మాత్రమే తాను డెస్మండ్ కోరుకున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో ఉక్కు మహిళగా ఘనత కెక్కారు ఇరోమ్ షర్మిల. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకున్నారు. 2000 సంవత్సరం ఈ పోరాటాన్ని కొనసాగించారు ఆమె. ఆ తరువాత 2017 ఆగస్టులో తన ప్రేమికుడు గోవాలో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు డెస్మండ్ కౌటిన్హోను ఆమె వివాహమాడారు. తమిళనాడులోని కొడైకెనాల్లో ఉంటున్నారు. సుదీర్ఘ నిరాహార దీక్ష విరమణ అనంతరం శరీరాన్ని తిరిగి పూర్తి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఆమె మరో పోరాటమే చేశారు. -
2019 మంది తల్లులకు పాదపూజ
గోదావరిఖని(రామగుండం): అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం 2019 మంది మాతృమూర్తులకు పాదపూజ చేశారు. కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్దసంఖ్యలో మాతృమూర్తులు హాజరయ్యారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన తల్లి పాదాలను కడిగి ఆశీర్వాదం అందుకున్నారు. రామగుండం నియోజకవర్గంలోని 2019 మంది తల్లులకు వారి పిల్లలు పాదాభిషేకం నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్దగా ఈ తరహా కార్యక్రమం నిర్వహించిన విజయమ్మ ఫౌండేషన్‌కు వండర్బుక్ రికార్డును సంస్థ ప్రతినిధులు బింగి నరేందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. -
అమ్మ ప్రార్థనల్లో మ్యాజిక్ ఉంటుంది
మాతృ దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి సమంత తన తల్లి నినెట్టే ప్రభుకి శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి ప్రార్థన చేస్తున్న ఒక ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ మా అమ్మ ప్రార్థనలో మ్యాజిక్ ఉంటుందని నేను ఎప్పుడు నమ్ముతాను. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలాగైతే అమ్మ దగ్గరికి వెళ్లి.. అమ్మ నా కోసం ప్రార్థించవా అని అడిగేదానినో ఇప్పటికి కూడా అలాగే అడుగుతున్నాను. అమ్మ ప్రార్థనలు ఫలిస్తాయని నా నమ్మకం. అమ్మ ప్రార్థనల్లో ప్రత్యేకత ఏమిటంటే.. ఆమె ఎప్పుడూ కూడా తన కోసం ప్రార్థన చెయ్యరు. దేవునికి రెండో రూపమే అమ్మ. లవ్ వ్యూ మా’ అని అని సామ్ తన సందేశాన్ని ఉంచారు. సినీ తారలే కాకుండా.. పలువురు ప్రముఖులు కూడా మాతృమూర్తులపై వారికి గల ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram I have always believed.. like reallyyyyyy believed that my mothers prayers had magic in them 😊.. I still go to her like I did when I was a little girl and say ‘ mommy please pray for me ‘ believing that she was surely going to fix it .. and the best part about my mother is she has never ever prayed for ‘herself’ ... a mother is truly second only to God ❤️❤️ love you Ma A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 12, 2019 at 2:55am PDT -
అనురాగం ఏనాటిదో..
-
ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : నేడు మాతృ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం(మే 12) మదర్స్ డే సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘అమ్మ ప్రతి నిత్యం తన పిల్లలకు మార్గదర్శకురాలు. ప్రతి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. To each and every mother who nurtures, worries about, guides and supports their children every single day, wishing you a very happy Mothers Day. — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 May 2019 -
అమ్మ చిత్ర కథలు
వంట చేస్తూ అమ్మ తీసిన రాగాలు దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ని చేశాయి!కథల పుస్తకాల్లో అమ్మ తిప్పిన పేజీలు రానాను కథానాయకుణ్ణి చేశాయి!అమ్మ కొంగు పట్టుకుని వెంట తిరిగిన రోజులునమ్రతను ఇంటికి పట్టుగొమ్మను చేశాయి! స్టార్లకైనా.. సామాన్యులకైనా..కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ అమ్మే. పాలు పట్టినట్లే కథల్ని పడుతుంది అమ్మ.తేనెల్ని చిలికినట్లే మాటలు నేర్పుతుంది అమ్మ.పాలబువ్వ పెడుతూనే..బతుకు తోవల్ని చూపుతుంది అమ్మ. నేడు ‘మదర్స్ డే’. ఈ సందర్భంగా ఇస్తున్నఈ మూడు ఇంటర్వ్యూలు.. ముగ్గురమ్మల చిత్ర కథలు! అమ్మ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? దేవిశ్రీ ప్రసాద్: అమ్మ అనగానే ఎవరికైనా ప్రేమే గుర్తుకు వస్తుంది. లైఫ్‌లో మనం ఏం చేసినా, ఏమీ చేయకపోయినా మనల్ని మనస్పూర్తిగా సపోర్ట్ చేసేది అమ్మ మాత్రమే. కేవలం తల్లిదండ్రులు మాత్రమే. ఒకవేళ తప్పు చేసినప్పుడు కూడా క్షమించేసి మళ్లీ చేయరు అని మనల్ని నమ్మి, మరోసారి చేయకూడదని కోరుకునేది అమ్మ మాత్రమే. పిల్లలకు, అమ్మకు ఉండే గ్రేట్ కనెక్షన్ అది. ఈ ప్రపంచం ఇంత అందంగా, ఆనందంగా ఉంటుందంటే అది అమ్మ ప్రేమ వల్లే. మీరు రాక్‌స్టార్ కదా... మీ అమ్మగారికీ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మా మదర్‌కు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా అమ్మమ్మగారు (దేవి మీనాక్షి) చాలా పెద్ద సింగర్. అమ్మ వంట చేస్తూ రాగాలు పాడతారు కానీ పూర్తిస్థాయిలో ఆమ్మ పాడటం మేం విన్నది లేదు. అమ్మకు చాలా సిగ్గు. తను ఏ పని చేసినా అందులో సంగీతం ఉండాల్సిందే. మ్యూజిక్ వింటూనే వంట చేస్తారు. అలాగే అమ్మ మ్యూజిక్‌ని బాగా జడ్జ్ చేయగలుగుతారు. ‘రేయ్ ఈ పాట చాలా బావుంది రా’ అని అమ్మ చెప్పిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. మీకు సంగీతంపై ఆసక్తి పెరగడంలో మీ అమ్మగారి పాత్ర ఎంత? నా కెరీర్ ఇలా బిల్డ్ అవ్వడానికి కారణం మా మదర్. మేం చెన్నైలో కొత్త ఇల్లు రెడీ అయ్యే వరకూ అద్దె ఇంట్లో ఉన్నాం. అప్పుడు మా అమ్మమ్మగారు ఊరికి వచ్చారు. మా అమ్మమ్మగారు మా అమ్మతో ‘ఇక్కడ ఎవరో సంగీత విద్వాంసులు ఉన్నట్టున్నారు. వాళ్లు వేసుకునే బట్టలు ఆ ఇంటి ముందు ఆరేసున్నాయి. ఎవరో కనుక్కో’ అని చెప్పారు. మా అమ్మ కనుక్కోగా అది మాండలిన్ శ్రీనివాస్‌గారి ఇల్లు అని తెలిసింది. మా అమ్మగారి ఆనందం అంతా ఇంతా కాదు. నాకు మ్యాండలిన్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. మ్యాండోలిన్ శ్రీనివాస్‌గారు ఎవరో కూడా తెలియదు. వెంటనే నన్ను తీసుకెళ్లి శ్రీనివాస్‌గారి దగ్గర జాయిన్ చేశారు అమ్మ. అప్పుడే పాడటం, వయోలిన్ నేర్చుకుంటున్నాను. శ్రీనివాస్‌గారి దగ్గరకు వెళ్లినప్పుడు నా కళ్లలో కళ్లు పెట్టి చూసి ‘నీకు నిజంగా ఆసక్తి ఉందా?’ అని అడిగారు. ‘ఉంది’ అన్నాను. ‘రేపటి నుంచి రా’ అన్నారు. అప్పటినుంచి అన్నీ మానేసి ఆయనతో సంగీతం నేర్చుకున్నాను. అన్నయ్య అని పిలిచేవాణ్ణి. మా అమ్మగారి ఇంట్రెస్ట్ మీద నేర్చుకోవడం స్టార్ట్ చేసిన నేను సంగీతంలో గొప్పతనం తెలుసుకొని ఆయన దగ్గర 10–12 ఏళ్లు సంగీతం నేర్చుకున్నాను. ఎక్కువ శాతం వాళ్లింట్లోనే ఉండేవాణ్ణి. వాడ్ని కొంచెం ఇంటికి పంపిస్తారా? అని మా వాళ్ల శ్రీనివాస్‌గారి ఇంటికి ఫోన్ చేసేవారు. అమ్మ బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు పాట పాడి చీర్ చేస్తారా? ఆవిడ ఇప్పటి వరకు బ్యాడ్ మూడ్‌లో ఉండటం నేను చూడలేదు. ఆవిణ్ణి మేము చీర్ చేసే అవకాశం మాకెవ్వరికీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. అందుకే తను చాలా గ్రేట్. ఎప్పుడూ మాకేం కావాలో చూసుకోవడమే తప్ప తనని చూసుకోనివ్వరు. హాలీడే వెళ్దాం అంటే అవన్నీ ఎందుకులే మీ పని చేసుకోండి అంటారు. మిమ్మల్ని చూసి మీ మదర్ ప్రౌడ్‌గా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఎప్పుడూ ప్రౌడ్‌గానే ఫీల్ అవుతుంటారు. ప్రత్యేకంగా ఒక్క సందర్భం మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ‘కలుసుకోవాలని’ సినిమాలో ‘ఆకాశం తన రెక్కలతో నను కప్పుకుపోవాలి’ అనే పాట రాశాను. అది రాసిన వెంటనే అమ్మ, నాన్నలకు వినిపించా. నేను ఏ పాట రాసినా అమ్మానాన్నలకు ఫస్ట్ వినిపించడం నాకు అలవాటు. అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాం. చెల్లి, తమ్ముడు, బావ అందరికీ వినిపిస్తా. ఒక అమ్మాయి తనకు రాబోయే వాడు ఎలా ఉండాలనే సందర్భంలో ఆ పాట రాశాను. పాట వినిపించిన వెంటనే నన్ను హగ్ చేసుకున్నారు. ‘ఒక అమ్మాయిలా ఆలోచించి ఎలా రాయగలిగావు? నాకు పెళ్లయ్యే ముందు నా ఆలోచనలు ఇలానే ఉండేవి. చాలా బావుంది.. చాలా బావుందంటూ’ మెచ్చుకున్నారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే ‘బావుంది’ అని మాత్రమే చెప్పే ఆవిడ ఇంత బాగా మెచ్చుకున్నారంటే నాకు ఇంకా ఆనందంమేసింది. నాన్నగారి రచయిత కాబట్టి బాగా రాశావు, ఇంకోసారి పాడు అన్నారు. ఆ పాటను, అమ్మ పొగడ్తను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. పది ఆస్కార్లు ఒకేసారి వచ్చినంత ఆనందం. మీరు కంపోజ్ చేసిన పాటల్లో మీ అమ్మకు బాగా నచ్చిన పాటలు? ఇందాక చెప్పిన ‘ఆకాశం తను రెక్కలతో’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో ‘ఘల్‌ఘల్ ఘల్‌ఘల్..’ మా అమ్మ, నాన్న ఇద్దరికీ ఇష్టం. అలాగే నేను చేసిన వాటిలో క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్స్ అన్నీ తనకు ఇష్టం. బేసిక్‌గా అమ్మకు నేనేం చెసినా నచ్చుతుంది. అలా అని పార్షియాలిటీ ఉండదు. వేరే మ్యుజిషియన్స్ సాంగ్స్ నచ్చినా జెన్యూన్‌గా అభినందిస్తారు. మీ పేరు కూడా మీ అమ్మ వాళ్ల పేరెంట్స్ పేర్లని తెలిసింది? మా అమ్మమ్మగారి పేరు దేవి మీనాక్షి. తాతగారి పేరు ప్రసాదరావు. దేవి ప్రసాద్ ఇద్దరి పేర్లు కలిపి శ్రీ జత చేసి దేవి శ్రీ ప్రసాద్ అని పెట్టారు. పెట్టింది కూడా నాన్నగారే. మా అమ్మగారి పేరెంట్స్‌కి మా నాన్నతో అటాచ్మెంట్ ఎక్కువ. వాళ్లు కూడా అమ్మ కంటే నాన్ననే ఎక్కువ సపోర్ట్ చేసేవారు. నాన్న అల్లుడిలా కాక కొడుకులా ఉండేవారు. నేను కెరీర్ స్టార్టింగ్ లో ఆల్బమ్స్ చేసేటప్పుడు మ్యుజిక్ కంపెనీ వాళ్లు ‘దేవి శ్రీ ప్రసాద్’ అంటే చాలా పెద్ద వాళ్ల పేరులా ఉంది. పేరు మార్చుకోమని అడిగారు. నేను మార్చుకోను అని చెప్పాను. నేనేం చేసినా ఇదే పేరుతో చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నన్ను చీర్ చేస్తూ నా ఫ్యాన్స్ డీఎస్పీ డీఎస్పీ అని అరుస్తారు. వాళ్లు నాకోసం అరుస్తున్నారనే దానికంటే వాళ్లు పెట్టిన పేరుకి అందం తెచ్చిపెట్టాను అనిపిస్తుంది. పెళ్ళి చేసుకోమని అడగరా? అది ఎప్పుడూ ఉంటుంది. పెళ్ళి చేసుకోవడం ఒకరి చేతిలో ఉండదు. ఏ పేరెంట్స్ అయినా వాళ్ల పిల్లల్ని పెళ్ళి చేసుకో అని ఫోర్స్ చేయకూడదు. అది కరెక్ట్ కాదేమో. నా కోసం కార్ కొను, పరిగెత్తు, అది చేయ్ ఇది చేయ్.. ఇలా ఏది అడిగినా ఓకే. కానీ నా కోసం నువ్వు పెళ్ళి చేసుకో అని చెప్పకూడదు అని నా ఫీలింగ్. మీ సక్సెస్‌లో ఎంత క్రెడిట్ మీ అమ్మగారికి ఇస్తారు. నా అచీవ్మెంట్ అంతా మా అమ్మకే ఇస్తాను. నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తాను అది ఇదీ అని అంటారు. అది నా జాబ్, నా డ్రీమ్. వచ్చిన పేరు నిలబెట్టుకోవాలి ఇలా చాలా కారణాలుంటాయి. అదెప్పుడూ కష్టం అనిపించలేదు. అది నా లైఫ్‌స్టైల్ అయిపోయింది. ఫేమ్, నేమ్ ఇలా అన్నీ వస్తాయి. హోమ్ మేకర్స్‌గా ఉండే మదర్స్‌కు ఎక్కువ గుర్తింపు ఉండదు. అమ్మకు నచ్చితే అది నాకు ఆస్కారే హోమ్ మేకర్స్‌ని మించిన అచీవ్మెంట్గానీ, జాబ్‌గానీ లేదని నా ఫీలింగ్. ఎవరెన్ని పనులు చేసినా ఇంటిని వాళ్లు మేనేజ్ చేయడం టఫ్ జాబ్. వాళ్ల త్యాగం, వాళ్ల వల్ల మిగతా వాళ్ల లైఫ్ అంతా ఈజీ అయిపోతుంది. మా అందరి కంటే ముందు లేస్తారు. అందరు పడుకున్న తర్వాత పడుకుంటారు ఇప్పటికి అదే అలవాటు. ఇంక వద్దూ రెస్ట్ తీసుకో అమ్మా అన్నా వినరు. మదర్స్ అంటే అంతేనేమో? వాళ్లు లైకపోతే మన లైఫ్ ఇంత ఈజీగా ఉండదు. మా నాన్నగారు మాకు ధైర్యం. అమ్మ నా కాన్ఫిడెన్స్. మీ అమ్మ చేసే వంటల్లో మీకేది ఇష్టం? నాకు రెగ్యులర్ టైమింగ్స్ అని ఉండవు. ఒక్కోసారి 2కి తింటా. మరోసారి 3, 4. ఎప్పుడు ఆకలి వేసినా అమ్మ కాల్ చేస్తుంది. రేయ్ ఆకలవుతుందా? అని. నాకు షాక్ అనిపిస్తుంది. నా ఆకలి తనకెలా తెలిసిపోతుందని? ఫస్ట్‌లో షాక్ అయ్యేవాణ్ణి. తర్వాత అలవాటైపోయింది. అమ్మగారు చేసే ఎగ్‌రైస్ అంటే చాలా ఇష్టం. షోలు చేస్తూ విదేశాల్లో ఉన్నా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ తినాలినిపించేది ఎగ్‌రైస్. అది తిన్న తర్వాత మళ్లీ ఇంట్లో పడ్డాం అనే ఫీలింగ్ వస్తుంది. పైనా స్టూడియోలో ఉంటాను. సేమియా తినాలిపించింది అని నాకు అనిపించినా తనకు తెలిసిపోతుంది. కింద నుంచి ఫోన్ చేస్తుంది. ‘రేయ్ సేమియా చేశాను తినడానికి కిందకు రా’ అని. మదర్స్‌కు మాత్రమే వాళ్ల పిల్లలతో ఓ విచిత్రమైన బంధం ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా వాళ్లలో ఓ భాగమే కదా. మీ అమ్మగారు తనకు ఏదైనా కావాలని అడుగుతారా? అమ్మ ఎక్కువ ఏదీ అడగరు. మా ఫాదర్ ఆ టైమ్‌లో ఆయన టాప్ రైటర్. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చుపెడుతున్నారో తెలియదు. ఆయన రెమ్యునరేషన్ లెక్క చూసుకుంది లేదు. అంతా అమ్మగారు హ్యాండిల్ చేసేవారు. ఇంటికి, మా అందరికీ ఖర్చుపెట్టడం తప్ప ఆవిడ సొంతంగా ఖర్చు పెట్టుకోవడం తనకు అస్సలు తెలియదు. ‘నువ్వేమైనా కొనుక్కో’ అని నాన్న తిట్టేవారు. ఎప్పుడో ఓసారి షిరిడీ తీసుకెళ్లమన్నారు. మా అందరి షెడ్యూల్స్ ఎప్పుడు బిజీగానే ఉండేవి. అమ్మానాన్న ఇద్దర్నీ కలిపి తీసుకెళ్లడం కుదర్లేదు. ఇటీవల ఓసారి షిరిడీ వెళ్లాం. చిన్నపిల్లలా చాలా సంతోషపడింది. లోపలికి వెళ్లాం. బయటకు రాగానే మళ్లీ ఇంకోసారి చూద్దాం రా అని అడిగింది. అమ్మ అలా ఎప్పుడూ అడగలేదు. ఏదైనా అడగండి అని చెబుతుంటా. అడగరు. కెరీర్ బెస్ట్ మూమెంట్స్ అన్నీ అమ్మతో షేర్ చేసుకుంటారా? కచ్చితంగా షేర్ చేసుకుంటాను. చిరంజీవిగారు ఇలా అన్నారు. మహేశ్ ఇది చెప్పారు అని చెబుతుంటాను. మీకు ఏదైనా హార్డ్ టైమ్స్‌లో మీ మదర్ స్ట్రాంగ్‌గా నిలబడి మీకు స్ఫూర్తిగా నిలిచిన సందర్భాలున్నాయా? మా చిన్నప్పుడు నాన్నగారికి హార్ట్ అటాక్ రావడంతో ఆరోగ్యం దెబ్బతింది. చాలా పెద్ద ప్రమాదం. చాలా రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. తర్వాత కోలుకున్నారు. ఇది మెడికల్ మిరాకిల్ అని డాక్టర్స్ అన్నారట. ఆ అద్భుతానికి ఆయన కాన్ఫిడెన్సే కారణమట. మనకేం జరగదు అని అనుకునే స్వభావం ఆయనది. చెన్నైకు మేం కొత్త. సిటీకి అటువైపు మా స్కూల్, హాస్పిటల్ ఏమో ఇటువైపు. ఉదయాన్నే వెళ్లి డాడీకి ఏం కావాలో చూసుకొని మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లేవారు. మా స్కూల్ అయిపోయే టైమ్‌కు మమ్మల్ని తీసుకొచ్చేవారు. ఇలా ఇబ్బంది అవుతుందని హాస్పిటల్ నుంచి స్కూల్‌కు వెళ్లే ఈ గ్యాప్‌లో డ్రైవింగ్ క్లాసులకు వెళ్లి కార్ డ్రైవ్ చేయడం నేర్చుకొని హాస్పిటల్ టు స్కూల్ తిరిగేవారు. నాదీ, తమ్ముడిది వేరే స్కూల్ చెల్లిది వేరే స్కూల్. ఇప్పుడు తలుచుకుంటే భయమేసేది. 30 ఏళ్లు నాన్నగారిని గాజుబొమ్మలా చూసుకున్నారు అమ్మ. అలానే ఉండిపోయారు. అది త్యాగం అని కూడా కాదు. నాన్నకు ఏ టాబ్లెట్ దేనికో కూడా తెలియదు. అమ్మ ఏది ఇస్తే అదే వేసుకోవడమే. అలాంటి కాంబినేషన్ ఎక్కడా చూడలేదు. వాళ్లకు ఏ విషయంలో అసంతృప్తి లేదు. మేం నేర్చుకున్నది అదే. ఇద్దరూ మా కోసం చేసిన త్యాగాలు, మమ్మల్ని ప్రోత్సహించిన తీరు మాటల్లో చెప్పలేనిది. ఆవిడ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. నువ్వు కానీ ఏదైనా జాబ్ టేకప్ చేసుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యేదానివి అని చాలాసార్లు చెప్పాను. మా అందరికంటే సక్సెస్ఫుల్ తనే నా అభిప్రాయం. నేను ‘లీడర్’లా ఉండడం అమ్మకు ఇష్టం మదర్స్ డే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? రానా: మదర్స్ డే అనేది కొత్తగా వచ్చింది.. అంతే. అమ్మతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఎక్కువ అమ్మ ప్రభావమే. నాన్నగారు, తాతగారు సినిమాల్లో ఉన్నప్పటికీ చిన్నప్పుడు నేను సినిమా కథలకన్నా కామిక్ బుక్స్ బాగా చదివాను. ఆ బుక్స్ అన్నీ అమ్మ ఇచ్చినవే. ఇప్పుడు ‘అమర్‌చిత్ర కథ’ కామిక్ బుక్స్‌తో అసోసియేట్ (అమర్ చిత్రకథ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు) అయ్యున్నానంటే అది అమ్మ వల్లే. నా చిన్నప్పుడు అమర్ చిత్రకథ పుస్తకాలు ఇచ్చింది. ఆ పుస్తకాలన్నీ నాతో ఇంకా ఉన్నాయి. అమ్మ కథలు కూడా చెప్పేవారా? చెప్పేవారు. అలా నాకు అలవాటు అయింది. చాలా సైలెంట్‌గా నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది మా అమ్మే. చిన్నపుడు నాకు లెక్కలు వచ్చేవి కాదు. మా స్టూడియో (రామానాయుడు)లో చాలా పనులు చేసేవాణ్ణి. లెక్కల విషయానికొస్తే మాత్రం దూరం పారిపోయేవాణ్ణి (నవ్వుతూ). దాంతో మా అమ్మ నన్ను స్టూడియోలో కూర్చోబెట్టి అకౌంట్స్ రాయించేది. ప్రతి సమ్మర్ హాలిడేస్‌లో కాసేపు ఇలా ఎంగేజ్ అయ్యేవాణ్ణి. ఈ రోజు ఇలా సక్రమంగా లెక్కలు వేస్తున్నానంటే అప్పుడు స్టూడియోలో రాసిన అకౌంట్సే కారణం. ఆ తర్వాత చదివింది ఏమీ లేదు. అమ్మ లెక్కలు నేర్పారు. ఎలా బతకాలో కూడా నేర్పించారా? కథలతో బతకాలని నేర్పింది అమ్మే. ఆర్టిస్ట్ కథ (చేసే సినిమా కథలను ఉద్దేశించి)ల మీదే బతుకుతాడు. ఆ కథలు నాకు త్వరగా తెలిసింది అమ్మ ద్వారానే. అమ్మ కథలు నేర్పిన విధానమే ఇప్పుడు నా లైఫ్స్టైల్లో రిఫ్లెక్ట్ అవుతోంది. చిన్నప్పుడు స్కూల్‌కు బాగానే వెళ్లేవారా? అమ్మ కొట్టి పంపించాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఆ.. కొట్టిందండీ.. చాలాసార్లు. ఆ తర్వాత పెద్దోడిని అయిపోయా. సైజ్‌లో చిన్నప్పటికే పెద్ద సైజ్‌లో ఉండేవాణ్ణి (నవ్వుతూ). దాంతో చేయి దాటిపోయాడు అని ఆపేసింది. అక్కడితో కొట్టుడు ఆగిపోయింది. నేను వెరీ బ్యాడ్స్టూడెంట్ని. అయితే ఇప్పుడు మా అమ్మ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడులా ఇప్పుడు అల్లరి చేయలేను కదా. ప్రోగ్రెస్ కార్డ్ సంతకం కోసం అమ్మను కాకా పట్టిన సందర్భాలు ఉన్నాయా? అన్నీ అమ్మే చూసుకునేది. మేం ఏం చేస్తున్నాం? ఏంటి? ఇలా అన్నీ నాన్నకు తెలుసు కానీ అమ్మే చూసుకునేది. నాన్న చదువు గురించి చాలా తక్కువ మాట్లాడేవారు. నాన్న మమ్మల్ని ఎప్పుడూ తిట్టలేదు. కొట్టలేదు. దేని గురించీ అరిచింది లేదు. ఇష్టమొచ్చింది చేసుకోనిచ్చారు. అయితే వెనక నుండి గమనిస్తూనే ఉండేవారు. అమ్మ మాత్రం కొట్టడం, తిట్టడం. అయితే తక్కువ మార్కులు వచ్చాయని పెద్దగా ఫీలయ్యేది కాదు. ఒక బ్యాడ్ స్టూడెంట్‌తో లైఫ్ గడిపితే ఎలా ఉంటుందో అదంతా చూసింది మా అమ్మ. బ్యాడ్ అంటే బాగా బ్యాడ్. క్లాస్‌లో లాస్ట్ వచ్చే వాళ్లు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. అందులో నేనొకడిని. అందులోనూ హైట్ కాబట్టి లాస్ట్ బెంచ్. నాకు సైట్ ఉండేది. దాంతో బోర్డ్ కనిపించేది కాదు. ఓహ్.. నాతో అమ్మ చాలా టెన్షనే పడింది. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటారు. మీలాంటి రిచ్ కిడ్స్‌కు జాబ్ చేస్తేనే... అనే పరిస్థితి లేదు కాబట్టి మీకు తక్కువ మార్కులొచ్చినా ఇంట్లో ఫీలవ్వలేదా? ఎడ్యుకేషన్ అనేది ఎవ్వరికైనా కచ్చితంగా ఇంపార్టెంట్. నాకు ఆర్ట్స్ అంటే ఇష్టమని నా చిన్నప్పటి నుంచే వాళ్లకు అర్థం అయింది. చిన్నప్పుడు నేను చదివినన్ని కామిక్ బుక్స్ బహుశా ఎవ్వరూ చదివి ఉండరేమో. అప్పుడే నా ఇంట్రెస్ట్ ఏంటో వాళ్లకు అర్థం అయ్యుంటుంది. ఫిఫ్త్ క్లాస్ టైమ్‌లోనే ఎడిటింగ్ నేర్చుకున్నాను. టెన్త్ క్లాస్‌లో అకౌంట్స్ చేసేవాణ్ణి. నా జీవితంలో ఏ దశలో అయినా నేను సినిమాకు సంబంధించినవే నేర్చుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు వాళ్లు ఏం కావాలో దానికి సంబంధించినదే నేర్చుకుంటుంటారు కదా. నాకు స్టాండర్డ్ ఎడ్యుకేష మీద నమ్మకం లేదు. ఇవాళ ఏదైనా నేర్చుకోవాలంటే ఇంటర్న్నెట్ ఓపెన్ చేస్తే చాలు.. అన్నీ తెలుస్తాయి. ఆ సిస్టమ్‌లో నేను పెరగలేదు. వీడు ఇలానే నేర్చుకుంటాడేమో అని మా అమ్మ అనుకుంది.. అర్థం చేసుకుంది. అందుకే ఆర్ట్స్‌లో షైన్ అవుతానని అనుకుంది. ఏదో సందర్భంలో అమ్మ కన్నీళ్లు పెట్టుకునే పనులు చేస్తాం కదా... అలాంటివి ఏమైనా మీ లైఫ్‌లో ఉన్నాయా? అబ్బో! లెక్కలేదండి బాబు. బోలెడు అంటే బోలెడు ఉన్నాయి. సిగిరెట్ తాగానని.. ఇలా చాలా ఉన్నాయి. అప్పుడు ఇలాంటివి మళ్లీ చేయకూడదు అనుకున్న సందర్భాలు..? మా అమ్మ స్ట్రిక్ట్‌గా ఎప్పుడూ లేరు. ఆ ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంటుంది. నేను బాగా చదువుకునేవాణ్ణి కాదు కానీ, అంత పెద్ద బ్యాడ్ మూమెంట్స్ ఏం లేవు. అన్నీ చిన్న చిన్నవే. వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళుతుంటాను. మీ బర్త్‌డేలు ఎలా చేసేవారు? మాది జాయింట్ ఫ్యామిలీ. మేం 8, 9 మంది పిల్లలం కలసి ఉండేవాళ్లం. మా ఇంట్లో చాలా మంది నవంబర్ – డిసెంబర్ టైమ్‌లో పుట్టాం. అలా సెలబ్రేషన్స్ రెండు నెలలు సాగుతుండేది. మనకు నచ్చినా నచ్చకపోయినా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉండేవి. అమ్మ చేసే వంటకాల్లో బాగా ఇష్టపడి తినేవి? తను రెగ్యులర్‌గా కుక్ చేయకపోయినా అప్పుడప్పుడూ బిర్యానీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. అది ఇష్టంగా తింటాను. అమ్మ కోసం ఏదైనా చేసి పెట్టారా? అంత ట్యాలెంట్ నాకు లేదు. బ్రెడ్ టోస్ట్ లాంటిది ఏదైనా చేసుంటానేమో కానీ పెద్ద పెద్దవి కష్టం. మీ అమ్మగారు కుటుంబం మొత్తాన్ని బాగా చూసుకుంటారని, కుటుంబం మొత్తం కలసి ఉండటానికి ఈవిడ మెయిన్ పిల్లర్ అని విన్నాం.. 100 పర్సెంట్ కరెక్ట్. ఆమె అందరూ కలసి ఉండాలనుకుంటుంది. చాలా సింపుల్ పర్సన్. మనీ, ఫేమ్ ఇవేమీ తనను ఎఫెక్ట్ చేయవో లేక తను అసలు వాటిని పట్టించుకోదో నాకు తెలియదు. ఆవిడ చేసేది ఏదైనా చాలా నార్మల్‌గా, రియల్‌గా ఉంటాయి. ఆర్టిఫీషియల్‌గా ఏదీ ఉండదు. మీ అమ్మ నుంచి అడాప్ట్ చేసుకున్న క్వాలిటీ? అమ్మ ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయినట్టే. దాని గురించి లాగడం, నాన్చడం ఉండవు. చాలా విషయాల్లో స్ట్రయిట్ ఫార్వార్డ్. అది నాకు నచ్చుతుంది. ఆ లక్షణాన్ని ఫాలో అవుతుంటా. కొడుకు పెళ్లి చేయాలని అమ్మకు బాగా ఉంటుంది. మరి ప్రెషర్ చేయడం లేదా? అస్సలు లేదు. ఓ సరదా సంఘటన జరిగింది.. అది చెబుతాను. ఇది వింటే మీకు మా మదర్ ఎలాంటి ఆవిడో అర్థం అవుతుంది. ఓ రోజు అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను. నువ్వే వేస్ట్‌గా ఇంట్లో పడున్నావు.. ఇంకో అమ్మాయిని కూడా తెచ్చి పెట్టుకోవాలా మేము? అన్నారు. ఆవిడ అంత సరదాగా, ప్రాక్టికల్‌గా ఉంటారు (నవ్వుతూ). కొడుకు చిక్కిపోతే అమ్మకు కంగారుగా ఉంటుంది. ‘బాహుబలి’ కోసం లావైన మీరు ఇప్పుడు మరీ సన్నగా ఉన్నారు.. ఏదైనా కథ కోసమే. నేను సక్సెస్ఫుల్ ఫ్యామిలీలో పుట్టాను. ఏ పని చేయకపోయినా నన్ను చూసుకునే పరిస్థితిలో మా వాళ్లు ఉన్నారు. అలాగని నేనేమీ చేయకుండా ఉండలేను. నా లైఫ్‌కి ఓ అర్థం ఉండాలిగా. మా అమ్మ దాన్ని అర్థం చేసుకుంది. జస్ట్ ఊరికే ఓ పని చేయాలనుకుని చేయడం మానేశాను. ఊరికే ఓ సినిమా చేయను నేను. కథ లేకపోతే సినిమా మొదలుపెట్టను. అలాంటి థాట్ ప్రాసెస్‌లో ఉన్నాను. ఆ విషయాన్ని అమ్మ గ్రహించింది. అందుకే బరువు తగ్గినా, పెరిగినా సినిమాల కోసమే కాబట్టి టెన్షన్ పడదు. ‘బాహుబలి’లో మీరు అతి కిరాతకుడు భల్లాలదేవగా కనిపించినప్పుడు మీ అమ్మగారు ఏమన్నారు? ‘బాహుబలి’ సినిమా చేసే సమయంలో సినిమా కథ చెప్పాను అమ్మకు. ముఖ్యంగా సినిమాలో నేను మా అమ్మను చంపేసే సీన్ ఉంది కదా.. దాని గురించి చెప్పాను. ఒక్కసారి నా వైపు చూసి ‘ఒరేయ్.. ఇలాంటి సినిమాలు చేస్తున్నావేంట్రా నువ్వు?’ అని నవ్వింది. ఆ రోజు ఆ సీన్ చెప్పకుండా ఒకేసారి థియేటర్లో డైరెక్ట్‌గా సినిమా చూపిస్తే ఆవిడకు అనవసరమైన ఆలోచనలు వచ్చే చాన్స్ ఉండేదేమో (పెద్దగా నవ్వుతూ). మీరు చేసిన సినిమాల్లో ఏ పాత్ర ఆమెకు బాగా ఇష్టం? ‘లీడర్’లో అర్జున్ ప్రసాద్ పాత్ర తనకు బాగా ఇష్టం. ఎందుకంటే అర్జున్ ప్రసాద్ బాగా చదువుకున్నవాడు. యాక్చువల్లీ రానా అనే తన కొడుకు అంత గుడ్ బాయ్‌లా ఉండాలని అమ్మ కోరుకుంది. అందులో ఓ డైలాగ్ ఉంటుంది. ‘అతను అమెరికాలో చదువుకున్నాడు. కంపెనీ సీఈఓ’ అంటూ పొగిడే డైలాగ్ అది. ఆ సీన్ చూసి ఎంత మురిసిపోయానో తెలుసారా అంటుంది అమ్మ. అమ్మకు ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చారా? చిన్న చిన్నవే. బుక్స్. అందులోనూ కామిక్స్ ఎక్కువ ఇస్తుంటాను. మా కమ్యూనికేషన్ అంతా ఎక్కువ బుక్స్ ఇచ్చుకోవడమే. ఎలాగూ బ్యాడ్ స్టూడెంట్ అన్నారు.. చదువు కాకుండా అమ్మకు మీ నుంచి వేరే ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మళ్లీ అమ్మ చెప్పిన ఓ సంఘటన చెబుతాను. ఒకరోజు ‘ఒరేయ్.. చిన్నప్పుడు నువ్వు అంత బ్యాడ్ స్టూడెంట్‌గా ఉండటంతో నువ్వు ఇప్పుడు ఏం చేసినా బాగానే ఉంది రా’ అంది. అంటే.. ఒక్క టెన్త్ క్లాస్ పాస్ అవ్వడానికే బాగా కష్టపడినవాడు లైఫ్‌లో వేరే ఏది చేసినా బాగానే ఉంటుంది కదా? (నవ్వుతూ). మా అమ్మకు అలా ఉంది ఇప్పుడు. అమ్మ హెల్త్ గురించి మీరు కేర్‌ఫుల్‌గా ఉంటారా? నేను ప్రత్యేకంగా పట్టించుకోనక్కర్లేదు. తనే చాలా జాగ్రత్తగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ తీసుకుంటుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? బాబు అని పిలుస్తుంది. ఫైనల్లీ .. ఇప్పుడు ‘అమర్ చిత్రకథ’తో మీ అసోసియేషన్ మీ అమ్మగారికి రిటర్న్ గిఫ్ట్‌లా అనుకోవచ్చా? నేను అమర్ చిత్రకథలో ప్రస్తుతం చిన్న భాగం అయ్యానంటే కచ్చితంగా అమ్మ వల్లే. అందులో సందేహమే లేదు. అమ్మకి గిఫ్ట్ అని పెద్ద మాట అనను కానీ, ఇవాళ ఇలా ఉన్నానంటే తనే కారణం. చిన్నప్పుడు మీ అమ్మగారు మీకు ఆడపిల్ల వేషం వేసి ఫోటోలు తీసిన సందర్భాలు ఉన్నాయా? ఒకసారి తీసింది. అప్పుడు తాత (రామానాయుడు) అబ్బాయికి అమ్మాయి వేషం ఏంటి? అని తిట్టారు. ఆ తర్వాత మళ్లీ అలా వేషం వేయలేదు. ఆ ఫొటో ఏ వయసులో తీశారో సరిగ్గా గుర్తు లేదు. మ్యాన్లీగా ఉండే రానా ఆడపిల్ల వేషంలో ఎలా ఉంటారో తెలుసుకుందాం.. ఫొటో చూపిస్తారా? అస్సల.. అస్సల. అస్సల... చాన్సే లేదు. నేను బయటివాళ్లకు కనపడనివ్వకుండా లైఫ్ లాంగ్ జాగ్రత్తగా దాచుకుంటున్న ఫొటో అది. ఎవరికీ చూపించను (నవ్వేస్తూ). అమ్మకు ముద్దు పెట్టందే కదలం మీ అమ్మగారి గురించి చెప్పాలంటే.. నమ్రత: ఆమెతో నా రిలేషన్షిప్ వెరీ వెరీ స్పెషల్. అన్ ప్యారలెల్. తనే నా ధైర్యం. నా బ్యాక్‌బోన్. ఫ్రెండ్. చాలా త్వరగా చనిపోయారు. ప్రస్తుతం నాతో లేకపోయినప్పటికీ ఆమె నేర్పిన విషయాలు నాతోనే ఉంటాయి. ఆమె తాలూకు జ్ఞాపకాలు నా మనసులో పదిలంగా ఉంటాయి. మీ అమ్మగారి నుంచి అడాప్ట్ చేసుకున్న క్వాలిటీస్? నాకు ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతే ఏదైనా. ఇది అమ్మ నుంచే అలవాటైంది. ఆమె ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చేది. ఒక స్త్రీ ఎలా ఉండాలో అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నాను. ఇవాళ నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నానంటే అమ్మే కారణం. మీతో మీ అమ్మ ఎలా ఉన్నారో మీరు మీ పిల్లలతో అలానే ఉంటారా? అవును. మా అమ్మ చాలా శుభ్రంగా ఉండే మనిషి. అన్నీ క్లీన్‌గా ఉండాలనుకుంటారు. నేను కూడా అలానే ఉంటాను. మా పిల్లలకు కూడా అదే వచ్చింది. మహేశ్ కూడా (నవ్వుతూ). మా మమ్మీ ఒకేసారి ఎన్ని పనులైనా హ్యాండిల్ చేయగలిగేది. నేను కూడా అందులో బెస్ట్ అని చెప్పుకోగలను. పిల్లలకు ఫ్రెండ్‌గా, గైడ్‌లా ఉండేది. నేను నా పిల్లలతో అలానే ఉంటాను. మహేశ్ వాళ్ల మదర్‌తో ఎలా ఉంటారు. ఆయనెంత గుడ్ సన్? మహేశ్ చాలా మంచి కొడుకు. మహేశ్ తన ఫీలింగ్స్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా తన హార్ట్ గోల్డ్. మా అమ్మంటే నాకు ఇష్టం అదీ ఇదీ అని మహేశ్ ఎప్పుడూ బయటకు చెప్పడు. వాళ్ల అమ్మ మీద తనకున్న ప్రేమ అన్ప్యారలెల్. ‘మదర్స్ డే’ అంటే పిల్లలు గిఫ్ట్‌లు ఇవ్వాలని కోరుకుంటారా? మనుషుల్ని గిఫ్ట్స్‌తో గెలవాలనుకోవడం కరెక్ట్ ఐడియా కాదని నేననుకుంటాను. వాళ్లతో మనం ఎలా ఉంటున్నాం? ఎలా నడుచుకుంటున్నాం? వాళ్లతో మన ఎమోషన్ ఏంటి... అన్నది ముఖ్యం. తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ముఖ్యమే కాదు. వాళ్లతో మంచిగా ఉంటున్నామా? జాగ్రత్తగా చూసుకుంటున్నామా? ప్రేమ చూపిస్తున్నామా? అవి ముఖ్యమని నేననుకుంటాను. నేనొక తల్లిగా నా పిల్లల నుంచి ఇలాంటివి కోరుకుంటాను తప్పితే నెక్లెస్, ఫోన్, ఫ్లాట్ ఇవేం కాదు. వాటి బదులు నా మీద ప్రేమ, ఆప్యాయత, గ్రాటిట్యూడ్ చూపించాలని కోరుకుంటాను. మీరు మీ, సిస్టర్ (శిల్పా శిరోద్కర్) లో మీ అమ్మకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? మా అమ్మకు మా సిస్టర్ అంటే బాగా ఇష్టం. ఎందుకలా? ఎందుకంటే నేను మా ఫాదర్ ఫేవరెట్ కాబట్టి. మహేశ్ తన మదర్ని ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు? ఇంట్లో ఉంటే ప్రతి ఆదివారం కలుస్తూనే ఉంటాం. వీలున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం. ఏప్రిల్ 20న మా అత్తయ్య బర్త్‌డే. ఏప్రిల్ 19న కలిశాం. కేక్ కట్ చేయించాం. గౌతమ్, సితార మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాడీ, మమ్మీ? అమ్మ, నాన్న? అమ్మ, నాన్న. మహేశ్ ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా ఉన్నాడు. పిల్లలు నన్ను నాన్న అనే పిలవాలి అని నాతో చెప్పాడు. మా ఇంట్లో నేను మా అమ్మానాన్నలను మా, పప్పా అని పిలిచేదాన్ని. ‘మదర్స్ డే’ని ఒకరోజు సెలబ్రేట్ చేసుకునే పద్ధతిని నమ్ముతారా? మనకు ప్రతిరోజు మదర్స్ డేనే. మా ఇంట్లో ఒక రూల్ ఉంది. మా పిల్లలు ఇల్లు వదిలి ఇంటికి వెళ్లేప్పుడు అది ట్యూషన్‌కి అయినా, స్విమ్మింగ్‌కి అయినా సరే వాళ్లు అమ్మకు ముద్దు పెట్టి వెళ్లాలి. ఒకవేళ వాళ్లు ఇంట్లో ఉండి నేను బయటకు వెళ్లాను అనుకోండి.. వాళ్లకు నేను ముద్దిచ్చి బయటకు వెళ్లాలి. మహేశ్ కూడా ఈ రూల్కి అలవాటుపడ్డాడు. ఇది మాకో అలవాటు అయిపోయింది. మా తల్లిదండ్రులు అలా చేసేవారు. మా అమ్మానాన్న బతికి ఉన్నంతవరకూ ఇలానే చేసేవాళ్లం. -
అమ్మానాన్నకు ప్రేమతో..!
హుజూర్నగర్ : అమ్మానాన్న జ్ఞాపకార్థం మసీదును నిర్మించి ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా మత పెద్దల సమక్షంలో ప్రారంభించాడు.. హుజూర్‌నగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు ఎంఏ.మజీద్. ఈయన తల్లిదండ్రులు అబ్దుల్నబీ, తహెరాబేగంలు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అమ్మానాన్నల మీద ప్రేమతో స్థానిక షాదీఖానా సమీపంలో రూ. 20 లక్షలతో మసీదును నిర్మించాడు. మసీదుకు మజీద్–ఈ–తహెరా అబ్దుల్నబీ అనే పేరు పెట్టాడు. చిరకాలంగా తల్లిదండ్రుల పేరు చరిత్రలో నిలిచిపోనున్నందున వారి కుమారుడిగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని మజీద్ తెలిపారు. తల్లిదండ్రుల పేరు మీదుగా మసీదు నిర్మాణం చేపట్టడంపై పలువురు మజీద్‌ను అభినందించారు. -
మెగా మదర్
చిరంజీవి తల్లి అంజనాదేవికి ముగ్గురు కొడుకులు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్), ఇద్దరు కూతుళ్లు (విజయదుర్గ, మాధవి). ఆదివారం మదర్స్ డే సందర్భంగా తల్లికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె నుండి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సంతోషాల జ్ఞాపకమే ఈ ఫొటో. పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లడం వల్ల పాల్గొనలేకపోయారు. -
2018 మంది తల్లులతో.. 2018 కిలోల కేక్
నెహ్రూనగర్ (గుంటూరు): గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రపంచ మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లెర్ప్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2018 మంది మాతృమూర్తులతో.. 2018 కిలోల కేక్‌ను కట్ చేశారు. దీనికి సంబం ధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటుకు ప్రతిపాదనలు పంపించారు. అనంతరం ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ కుమారి, మంత్రి నక్కా ఆనందబాబు, లెర్ప్ అధ్య క్షుడు టీజేజీ శ్రీనివాస్ మాట్లాడారు. -
అమ్మా.. ఐ లవ్యూ మా..!
ఇరా శుక్లా! ఎవరో తెలీదు. చాలామంది ఈ పేరుతో ఉంటారు. కంపెనీ సెక్రెటరీలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిజం విద్యార్థినులు.. వీళ్లలో ఎందరికో ఈ పేరు ఉండొచ్చు. వీళ్లందరి ఇంటి పేరు మాత్రం ఒక్కటే.. ‘కూతురు’. అలాంటి ఈ కూతురు నిన్న ‘మదర్స్‌డే’ కి అమ్మను తలుచుకుంది. తను పెరిగి పెద్దయ్యాననే అనుకుంది ఇరా. తన కాళ్ల మీద తను నిలబడ్డాను అనుకుంది. ఒక్కదాన్నే ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నాను అనుకుంది. అన్ని పనులూ తనే స్వయంగా చేసుకోగలుగుతున్నాను అనుకుంది. కానీ ఇరాలోని చిన్నపిల్ల ఇంకా.. అమ్మకోసం ఆరాట పడుతూనే ఉంది! అమ్మ స్పర్శకోసం, అమ్మ చూపు కోసం, అమ్మ మాట కోసం, అమ్మ ఒడి కోసం, అమ్మ చిరునవ్వు కోసం, అమ్మ మందలింపు కోసం కూడా! ‘ఏయ్.. పిల్లా, ఎందుకు అబద్ధం చెబుతావ్’ అని అమ్మ చిరుకోపం ప్రదర్శిస్తే ఎంత హాయిగా ఉంటుంది! అమ్మ క్షేమంగానే ఉంది.. దూరంగా. తనూ క్షేమంగానే ఉంది అమ్మకు దూరంగా! దూరంగా ఉండి క్షేమంగా ఉన్నా.. అది క్షేమమే అవుతుందా? వెనక్కి వెళ్లి ఆలోచిస్తుంటే.. ‘మేమూ కాస్త ఆలోచించి పెట్టమా?’ అని కన్నీళ్లు ముందుకొచ్చేస్తున్నాయి. ఇరా ఒకటొకటీ గుర్తు చేసుకుంటోంది. ప్రతి పనిలోనూ అమ్మ గుర్తుకు వస్తోంది. వంట దగ్గర మరీనూ. తనూ చేస్తోందిప్పుడు వంట.. అమ్మ దగ్గర నేర్చుకున్నవన్నీ కలిపి. కానీ ప్లేటు ఖాళీగానే ఉన్నట్లు అనిపిస్తోంది.! ‘అమ్మా.. నేను ఇంటికొచ్చేశాను’ అని రోజూ ఆఫీస్ నుండి రాగానే కాల్ చేసి చెబుతుంది. ‘ఆఫీస్‌లో నాకేం స్ట్రెస్ లేదు’ అని తను చెప్పినప్పుడు, ‘అబద్ధం చెబుతున్నావ్’ అని అమ్మ తప్ప ఇంకెవరు కనిపెట్టగలరు? జ్వరానికి ఏ మాత్ర వేసుకోవాలో, జలుబుకు ఏ మందు రాసుకోవాలో తనకు తెలుసు. కానీ, అమ్మలా.. రాత్రంతా తన పక్కనే కనిపెట్టుకుని ఉండేదెవరు? షాపింగ్‌కి వెళ్లి తన కిష్టమైన డ్రెస్‌లు కొనుక్కోగలదు తను. కానీ ‘నీకు ఈ డ్రెస్ బాగుంటుంది’ అని అమ్మలా సెలక్ట్ చేసి పెట్టేవారెవరు? ఇష్టపడి హైహీల్స్ కొని తెచ్చుకుంటుంది తను. ఆఖరి నిముషంలో డ్రెస్‌కి అవి మ్యాచ్ కాకపోతే, తన చెప్పులు వేసుకొమ్మని ఇవ్వగలిగింది అమ్మ కాక మరెవ్వరు? అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే.. ‘ఎలా ఉందమ్మా?!’ అని తను వందసార్లు కాల్ చేయగలదు. కానీ, అమ్మ దగ్గర కూర్చుని, అమ్మ చెయ్యి పట్టుకుని అడిగినట్లుంటుందా ఆ అడగడం? అమ్మ కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే, ‘టీ తాగావా అమ్మా?’ అని తను ఫోన్ చేసి అడగ్గలదు. కానీ, అమ్మకు ఇష్టమైన ‘టీ’ని కాచి, కప్పును చేతికి అందివ్వగలదా? అమ్మానాన్న గొడవ పడుతుంటే.. ‘ఊర్కోమ్మా’ అని తను చెప్పగలదు. ఇంత దూరం నుంచి ఆ గొడవ పెద్దదవకుండా తను చేయగలదా? అమ్మ ఎప్పుడైనా ముస్తాబైనప్పుడు ఫొటోలు తీసి పంపించమ్మా అని తను అడగ్గలదు. కానీ, అమ్మ దగ్గర ఉన్నప్పటిలా అమ్మ కాళ్ల దగ్గర చీర అంచులను సవరించగలదా? ‘ఐ మిస్ యూ అమ్మ’ అని చెప్పడానికి ఇరా దగ్గర లక్షల సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్షణం ఒక సందర్భమే. -
మోడ్రన్ మదర్
-
అమ్మతో ఆకాశ్
-
మాతృదేవోభవ
-
సరదాగా కామాక్షమ్మ అంటుంటా..
సాక్షి, చిత్తూరు : అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును ‘సాక్షి’ పలకరించింది. అమ్మతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన పంచుకున్నారిలా.. మాది నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లి. నాన్న రాధాకృష్ణమూర్తి, అమ్మ కామాక్షమ్మ. ఇద్దరూ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు. నేను నాన్న కంటే కొంచెం అమ్మ దగ్గరే చనువుగా ఉంటా. అమ్మను సరదాగా కామాక్షమ్మ అంటుంటా. అమ్మ కూడా పెద్దగా నవ్వుతుంటుంది ఆ పిలుపు కోసమేఎదురు చూస్తున్నట్టుగా. అమ్మతో నేను గడిపిన ప్రతి క్షణం గుర్తే ఇప్పటికీ. అప్పుడు నాలుగో తరగతి పూర్తయింది. కొడిగెనహళ్లి ఏపీఆర్జేసీ స్కూల్లో అయిదో తరగతి చదవాలనేది నా కోరిక. మా నాన్న అప్లికేషన్ పూర్తి చేసి ఎంఈవోకి ఇచ్చారు. ఆయన దాన్ని పంపకుండా మరచిపోయారు. నేనేమో హాల్‌టికెట్ కోసం రోజూ ఎదురుచూపే. పరీక్ష ముందు రోజు వరకు ఎదురు చూశా. ఎంతకీ రాకపోయే సరికి చాలా బాధపడ్డా. అప్పుడు అమ్మ దగ్గరకు తీసుకొని ఓదార్చింది. కన్నీరు తుడిచింది.. ఒళ్లో కూర్చోబెట్టుకొని. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏడో తరగతిలో జిల్లాలోనే మొదటి ర్యాంకు సంపాదించా. ఒక్కసారి కొట్టింది.. ఎన్నో తరగతిలోనో సరిగా గుర్తు లేదు కానీ.. అమ్మ ఒక్కసారి నన్ను కొట్టింది. మా ఇంట్లో అప్పట్లో కోళ్లు ఉండేవి. నేను సరదాగా డ్యాన్స్ చేస్తున్నా. ఒక్కసారిగా కోడిపిల్ల వచ్చి నా కాలికింద పyì చనిపోయింది. అమ్మకు కోపం వచ్చి కొట్టింది. విలువలు నూరి పోసింది.. అమ్మ నాతో ఎక్కువగా విలువలు, నిజాయితీ గురించే మాట్లాడేది. మాట ఇస్తే తప్ప కూడదంటుంది అమ్మ. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా విలువలు తప్పకుండా పని చేస్తున్నానంటే కారణం అమ్మ నన్ను పెంచిన విధానమే. నా ఎమ్‌టెక్ పూర్తయిన తరువాత విదేశాల్లో చాలా ఉద్యోగావకాశాలు వచ్చాయి. మా స్నేహితులంతా అక్కడికే వెళ్లారు. నాకు గ్రూప్1లో ఉద్యోగం రావడంతో ఇక్కడే స్థిరపడ్డా. ప్రజాసేవ చేసేందుకు భగవంతుడు గొప్ప అవకాశమిచ్చాడు.. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని కర్తవ్యం గుర్తు చేసింది. అమ్మ మాట కర్తవ్యం. ‘అమ్మలో ఉన్న వైభవం.. దివ్యత్వం, ఎవరిలోనూ చూడలేదు. ప్రపంచంలో చాలా దేశాల్ని చుట్టి.. లక్షలాది మందిని కలిసినా అమ్మవంటి అపురూప వ్యక్తి తారసపడలేదు. నేను సంపాదించిందంతా అమ్మ పాదాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతా’ – ఎస్పీ రాజశేఖర్ బాబు -
అంతకు మించిన హీరోయిజం లేదు: వైఎస్ జగన్
సాక్షి, కైకలూరు: ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం మరోటి లేనేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం(మే 13) మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు నేనీ స్థానంలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం. అమ్మకు ధన్యవాదాలు..’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర(160వ రోజు) చేస్తోన్న వైఎస్ జగన్.. నేటి ఉదయం కైకలూరు శివారు నుంచి యాత్రను ప్రారంభించారు. కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం కాలకర్రు మీదుగా మహేశ్వరపురం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. There’s no heroism greater than motherhood. Thank you Amma, for making me what I am today. Happy #MothersDay. — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 May 2018 -
సన్నాఫ్ నిర్మల
ఎంతసేపూ నాన్న కొడుకులేనా?! ఇంటి పేరు నాన్నదే అయినా... కొట్టుకునే గుండె అమ్మదే కదా! నవమాసాలు మోసిందీ సద్గుణాల ఉగ్గు పట్టిందీ సంస్కారం రంగరించి పెంచిందీ అమ్మే కదా! వ్యవస్థలో విలువలు అడుగంటుతున్నప్పుడు స్త్రీలపై హింస అడవిలా అంటుకుంటున్నప్పుడు కూతుళ్లని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కంటే.. కొడుకుల్ని బాధ్యతగా పెంచాలని ‘నిర్మల’అమ్మ అంటున్నారు. మదర్స్ డే సందర్భంగా మీ బన్నీ చిన్నప్పటి విశేషాలు షేర్ చేసుకుంటారా? నిర్మల: చిన్నప్పుడు చాలా కామ్‌గా ఉండేవాడు. టీచర్స్‌కు పెట్ స్టూడెంట్. అందరికీ చాలా ఇష్టం బన్నీ అంటే. నా చేతుల్లోనే ఎక్కువ తన్నులు తినేవాడు (నవ్వుతూ). దేని గురించో కాదు.. ఎగ్జామ్స్ అప్పుడు అయిపోయిన సబ్జెక్ట్ మళ్లీ ఫ్రెష్‌గా చెప్పేవాడు ఎగ్జామ్ ఉందని. అది తప్ప ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఏ ఇబ్బంది పెట్టలేదు. అంటే.. స్కూల్ నుంచి కంప్లైంట్స్ వచ్చేవి కాదేమో? ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకున్నప్పుడు వాళ్ల నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు. బన్నీ చాలా స్లోగా రాసేవాడు. అది టీచర్స్‌కు తెలుసు. అందుకే ఒక పీరియడ్ 45 మినిట్స్ అంటే.. వాడికి ఓ 15 మినిట్స్ ఎక్కువ ఇచ్చేవారు రాసుకోవడానికి. మీరు ఫాస్ట్ లెర్నర్ అని సినిమాల్లో మీ ఎనర్జీని చూస్తే అనిపిస్తుంది.. స్లో గ్రాస్పరా? బన్నీ: అవునండీ. చాలా స్లో లెర్నర్ని. వెంటనే గ్రాస్ప్ చేయలేను. మా తమ్ముడు శిరీష్ ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. చాలా యంగ్ ఏజ్‌లో.. ఇంటర్నెట్ వస్తున్న కొత్తల్లోనే తను వెబ్సైట్ రన్ చేసేవాడు. అప్పుడు వాడికి 12 ఇయర్స్ అనుకుంటా. అప్పట్లో వాడికి ‘చైల్డ్ పెసిలిటే షన్’ కూడా చేశారు. బాక్సింగ్ అంటే రింగ్ లోపలా బయట, క్రికెట్ అంటే గ్రౌండ్ బయటా లోపల మొత్తం సబ్జెక్ట్ తెలుసుకుంటాడు. మీ బన్నీ స్టార్ అవుతారని మీరు అనుకున్నారా? నిర్మల: నిజం చెప్పాలంటే మా ముగ్గురి పిల్లల్లో బన్నీయే స్టార్ అవుతాడు అనిపించింది. చిప్పప్పుడు ఏ పార్టీ ఉన్నా మా ఇంట్లో అయినా చిరంజీవి గారింట్లో అయినా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. ఫుల్ ఎనర్జీ ఉండేది. సినిమా కోసం రిస్కీ ఫైట్స్ అవీ చేయాలి కదా.. ఓ మదర్‌గా ఎప్పుడైనా భయమేసిందా? నిర్మల: నాకు పెళ్లి అయిన దగ్గరి నుంచి మా మామగారు (అల్లు రామలింగయ్య), మా ఆడపడుచు సురేఖ భర్త చిరంజీవిగారు అందరూ సినిమాలోనే ఉన్నారు. నాకు 18 ఏళ్లకే పెళ్లి అయిపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాను కాబట్టి అంత భయపడ్డ సందర్భాలు ఎక్కువగా ఏం లేవు. మీ పిల్లల సినిమాల రిలీజ్ టైంలో టెన్షన్ పడతారా? నిర్మల: మనుషులమే కదా. డెఫినెట్లీ ఉంటుంది. బన్నీ: యాక్టర్ కంటే ప్రొడ్యూసర్‌కి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్‌గా మా నాన్న సినిమాల రిలీజ్ టెన్షన్ చూసినప్పుడు హీరోగా కొడుకు సినిమా రిలీజ్ అంటే చిన్న విషయమే. బన్నీలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్? నిర్మల: ఓపిక ఎక్కువ. అది ప్లస్. మైనస్ అంటే మొండితనం, షార్ట్ టెంపర్. కొంతమంది కోపంతో ఏదైనా అంటే రెండు మూడు రోజులు మాట్లాడరు. కానీ మా ఇంట్లో 5 నిమిషాల్లో మళ్లీ మామూలు అయిపోతుంది. షార్ట్ టెంపర్‌తో ఏదైనా అన్నా వెంటనే ‘ఆ.. ఏదో అలా అన్నాలే. సారీ’ అనేస్తాడు. బన్నీ యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినది? నిర్మల: వేదం’ చాలా ఇష్టం. బన్నీ: యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్స్ కంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అమ్మకి చాలా ఇష్టం. అప్పుడు నాన్నతో ‘అమ్మకు బాగా నచ్చింది. నాకైతే ఆస్కార్ గెలిచినట్టు ఉంది’ అన్నాను. అమ్మకు ఫ్రెండ్స్, పూజలు, సినిమాలు ఇష్టం. పిల్లల కోసం పూజలు, ఉపవాసాలు లాంటివి ఏవైనా చేస్తారా? నిర్మల: చేయనండి. నా పిల్లలకు ఇది కావాలి, వాళ్లు ఇలా ఉండాలి అని పూజలు చేయను. ఎందుకంటే జరిగేది ఏదైనా జరుగుతుంది. మనం ఫేస్ చేయాలి అంతే. బన్నీ ఫస్ట్ మూవీ తేజ డైరెక్షన్లో చేయాల్సింది. అది క్యాన్సిల్ అయినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. అక్కణ్ణుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి బన్నీ వచ్చాడు. ఇంటికి వచ్చే దారిలో ‘సినిమా క్యాన్సిల్ అయింది’ అన్నాడు. నేను ఎక్కువ షాక్ అవ్వలేదు. ఏది జరిగినా మంచికే అని ఫీల్ అవుతాను. తనని ఓదార్చలేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏదైనా నేర్చుకున్నాడు అనుకున్నాను. రిజెక్షన్లో ఉన్న పెయిన్ తనకి తెలియాలి. దాంతో ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తాడని అనుకున్నాను. బన్నీ: అమ్మ బేసిక్‌గా దేనికీ సర్ప్రైజ్ అవ్వదు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా... సమానంగా తీసుకుంటుంది. బయట ఎవరో ఏదో మా గురించి రాస్తారు. మాట్లాడతారు. కామెంట్ చేస్తారు. వాటి గురించి ఇంట్లో పెద్దగా డిస్కస్ చేసుకుంటే బతకలేం. అమ్మ అస్సలు పట్టించుకోదు. జరిగేవి జరగనివ్వండి అన్నట్లు ఉంటుంది. ఎవరో మాట్లాడే మాటలకు మనం బాధపడిపోయి, డిస్కస్ చేసుకుంటే.. మన జీవితం వేరేవాళ్ల కంట్రోల్లో ఉన్నట్లే అనే ఫీల్ మాకు కలిగేలా చేసింది. మీ అమ్మగారు వండే వాటిలో మీకు ఇష్టమైనది ఏది? బన్నీ: కొన్ని సంవత్సరాలుగా వండటం లేదు. మా అమ్మ బాగా సోషల్ అయిపోయింది (నవ్వుతూ). కానీ అమ్మ వంట బాగా చేస్తుంది. చైనీస్ బాగా చేసేది. నూడుల్స్, మంచూరియా ఇవన్నీ బాగా చేస్తుంది. ఇండియన్ ఫుడ్ అంటే ఎవరైనా వండుతారు. ఇంతకు ముందు చైనీస్ తినాలంటే బయటకు వెళ్లి తినేవాళ్లం. అమ్మ చైనీస్, బేకింగ్.. ఇలా చాలా క్లాస్‌లకి వెళ్లి, అవన్నీ నేర్చుకుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం దగ్గరుండి అన్నీ చేయిస్తుంది. మీ అమ్మగారిది చాలా ఫార్వాడ్ థింకింగ్ అనిపిస్తోంది.. సో.. స్నేహాగారితో మీ లవ్ గురించి చెప్పడానికి పెద్దగా టెన్షన్ పడలేదేమో? ముందు ఎవరికి చెప్పారు? బన్నీ: ఇద్దరికీ కలిపి చెప్పాను. ‘స్నేహా అని నా ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. రెడ్డీస్. మీకేమైనా అభ్యంతరమా?’ అన్నాను. ‘మేం చూసి చేసినా.. నీ అంతట నువ్వు సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు హ్యాపీగా ఉండటమే ముఖ్యం. అభ్యంతరం లేదు’ అన్నారు. ఫస్ట్ నుంచి అమ్మ మోడ్రన్. నేను చాలా మంది దగ్గర చెబుతుంటా. మోడ్రన్ అంటే మోడ్రన్ బట్టలు వేసుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడటం కాదు. అలోచనా విధానం చాలా ఫార్వాడ్గా ఉండాలని. మా మదర్ ఆ టైపే. అంటే.. ప్రొగ్రెసీవ్ థింకింగ్ ఈజ్ మోడ్రన్. నన్ను ఎవరైనా మోస్ట్ మోడ్రన్ పర్సన్ ఎవరూ అని అడిగితే మా అమ్మ పేరు చెబుతాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని ఇబ్బందిగా అనిపించలేదా.. పైగా మీ జనరేష¯Œ కు కొంచెం పట్టింపులు ఎక్కువగా ఉంటాయేమో ? బన్నీ: నేను చెబుతానండి. ఇది జనరేషన్ మీద తోసేయకూడదు. మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతకు ముందు జనరేషన్లో కూడా పట్టించుకోని వాళ్లు ఉన్నారు. ఇప్పటి జనరేషన్లో కూడా పట్టించుకుంటున్నవాళ్లు ఉన్నారు. నిర్మల: నాకు క్యాస్ట్ పెద్దగా పట్టింపు లేదు. మన కల్చర్ అయితే చాలనుకున్నాను. కోడలితో మేం మాట్లాడగలిగితే చాలు. బావుంటే కొన్ని రోజులు వాళ్లతో ఉంటాం. లేదంటే దూరంగా ఉంటాం. కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది వాళ్లు. అందుకే చాయిస్ వాళ్లు తీసుకుంటే మంచిదని నమ్మాను. ఇప్పటికీ మీ కొడుకు, కోడలు మీతోనే ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలా ఉండాలన్నది మీ నిర్ణయమా? నిర్మల: లేదు. నేను ఏ విషయంలోనూ ఎవరినీ ప్రెషర్ పెట్టను. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలనే మెంటాలిటీ నాది. నేను నా కోడలితో ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ల స్పేస్ వాళ్లకు ఇచ్చేస్తాం. బన్నీ: నా పెళ్లయి ఆల్మోస్ట్ ఏడేళ్లు అవుతోంది. అమ్మకీ, స్నేహాకీ ఒక్క ఇష్యూలో కూడా డిఫరెన్స్ రాలేదు. గొడవపడలేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలాంటి ఇష్యూలు ఏదీ రాలేదంటే ఆ క్రెడిట్ పూర్తిగా ఇద్దరికీ ఇవ్వాలి. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ప్రాబ్లమ్స్ రావు. నా కొడుకు ఇలా ఉండాలి.. నా కోడలు ఇలా చేయాలి అని అనుకుంటే అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అది లేనప్పుడు డిజప్పాయింట్మెంట్ ఉండదు. మీ అమ్మగారిలో మీకు నచ్చే క్వాలిటీస్, నచ్చనివి? బన్నీ: చాలా ఉన్నాయి. ఇందాక అన్నట్టు చాలా మోడ్రన్‌గా ఆలోచించే తీరు. ఒక పెద్దింట్లో లేదా హై పొజిషన్లో ఉన్న లేడీకి కావల్సిన క్వాలిటీ ఏంటంటే న్యూట్రల్‌గా ఆలోచించటం. హైస్, లోస్ని ఒకేలా ట్రీట్ చేయగలగటం. మా నాన్నగారు 500 కోట్లు సంపాదించినా మా అమ్మ ప్రవర్తనలో 1% మార్చు కూడా ఉండదు. అలాంటి లైఫ్ లీడ్ చేయటం బెస్ట్ క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్‌కు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.మేం పెద్దవాళ్లం అయ్యాక మావాడు ఇలా చూసుకోవాలని.. లేదా వేరే ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. మా అమ్మ ఏదీ ఎక్స్పెక్ట్ చేయదు. అది వండర్ఫుల్ క్వాలిటీ. నచ్చని విషయం అనను కానీ మా అమ్మ చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘నీ దగ్గర బాగానే డబ్బులున్నాయి కదా.. ఎందుకింత సింపుల్‌గా ఉంటావ్’ అంటుంటా. నేనొకసారి డైమండ్ జ్యువెలరీ కొనిస్తే పెట్టుకోలేదు. ‘ఒక అమ్మకు కొనిచ్చే పొజిషన్లో ఉండటం కొడుకుగా నా అదృష్టం. నువ్వు రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నప్పుడు తీసుకోవాలి కదా’ అంటుంటాను. నిర్మల: నాకు ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు వాడు ఓ 20–30 లక్షలు డొనేట్ చేశాడని తెలిసినప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ ఇచ్చినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అప్పట్లో అరవింద్‌గారు ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండేవారు. మరి.. మీ ముగ్గురి పిల్లలు (వెంకటేశ్, శిరీష్, అర్జున్) పెంచడానికి హెల్ప్ చేసేవారా? నిర్మల: ఆడపిల్లలైతే కుదురుగా ఉంటారు. మగపిల్లలు కదా.. అస్సలు కుదురుగా ఉండేవారు కాదు. అరవింద్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా వీకెండ్స్‌లో మాత్రం వీళ్లను బయటకు తీసుకువెళ్లే వారు. ఒకళ్లు పబ్, ఒకళ్లు ఏదైనా మాల్.. ఇంకొరు ఇంకో చోట.. ఇలా పిల్లలు ఒక్కో చోట ఉండేవారు. మాల్ దగ్గర దిగబెట్టి, పికప్.. ఆ తర్వాత పబ్.. ఇలా డ్రాపింగ్, పికప్ చేసుకునేవారు. బన్నీ: నేను అందరి కంటే కొంచెం వీక్ కాబట్టి నాతో ఎక్కువ ఉండేవారు. పైగా టీనేజ్ ప్రాబ్లమ్స్ కూడా నాకే ఎక్కువ ఉండేవి (నవ్వుతూ). సో..నా మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. శనివారం అయితే బయటకు వెళ్లిపోయేవాణ్ణి. వెళ్లొద్దనేవారు కాదు కానీ సేఫ్‌గా ఇంటికి రమ్మనేవారు. జనరల్‌గా ఆడపిల్లలను జాగ్రత్తగా పెంచుతాం. ఇవాళ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే.. మగపిల్లలను కూడా జాగ్రత్తగా పెంచాలనిపిస్తోంది. ముగ్గురు మగపిల్లల తల్లిగా మగపిల్లలు గల పేరెంట్స్ ఏదైనా చిన్న మెసేజ్? నిర్మల: విలువలు గురించి ఇంట్లోనే చెబితేనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఆ మధ్య అయాన్ (అల్లు అర్జున్ కొడుకు) ‘మా ఇంట్లో’ అన్నాడు. ‘అలా అనకూడదమ్మా.. మన ఇంట్లో’ అనాలి అన్నాను. రెండోసారి ‘మా ఇంట్లో’ అనబోయి, ‘మన ఇల్లు’ అని దిద్దుకున్నాడు. అలాగే చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే.. ‘నువ్వు గుడ్ బోయ్ కదా.. ఎందుకిలా చేశావ్’ అంటే.. పిల్లల మనసులో ‘మనం గుడ్ కదా.. బ్యాడ్ యాక్టివిటీస్ చేయకూడదు’ అనే మైండ్ సెట్ పెరుగుతుంది. ఇలా చెప్పకుండా జస్ట్ కోప్పడ్డామనుకోండి వాళ్ల మీద ఆ ఎఫెక్ట్ ఉండదు. మా అయాన్ సినిమాలు చూస్తాడు. వాడికి ‘బ్యాడ్ బాయ్స్ అంటే టీవీల్లో, సినిమాల్లో మాత్రమే ఉంటారు. బయట ఉండరు. వాళ్లు చేసేవి మనం చేయకూడదు’ అని చెబుతాం. ముగ్గురి పిల్లలకు చిన్నప్పుడు ఇలానే చెప్పేవాళ్లం. వాళ్లు చదువుకున్నది కో–ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో. బాయ్స్‌తోనే కాదు గర్ల్స్‌తో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. డిన్నర్ ఇవ్వాలంటే ఇంటికి తీసుకురమ్మనేవాళ్లం. బాయ్స్‌ని ఎలా ట్రీట్ చేసేవాళ్లమో గర్ల్స్‌ని కూడా అలానే. అబ్బాయా? అమ్మాయి? అని కాదు.. ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి. ఏదైనా చేస్తున్నప్పుడు చెయ్యొద్దు అనకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే.. మన ఇంటి నుంచి సమాజంలోకి ఒక మనిషిని పంపిస్తున్నాం. ఆ మనిషి ఎవరికీ నష్టం చేయకూడదు కదా. అలాగే మగపిల్లలు ఉన్న అమ్మలకు కొడుకులు ఆల్కహాల్‌కి అలవాటు పడిపోతారేమో? అనే భయం ఉంటుంది. మీకా టెన్షన్ ఉండేదా? వద్దని ఎప్పుడూ చెప్పలేదండి. ఎందుకంటే బేసిక్‌గా అరవింద్‌గారు సిస్టమేటిక్‌గా ఉంటారు. ఇప్పుడు జనరల్ యంగ్‌స్టర్స్ వర్క్‌ని వేరేగా ఆల్కహాల్‌ని వేరేగా ఉంచుతున్నారు. పెద్దవాళ్ల ముందు ఎలా పడితే అలా ఉండరు. ‘మా ఏజ్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి’ అని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారు. మా పిల్లలు మా ముందు స్మోక్ చేయడం, ఆల్కహాల్ పుచ్చుకోవడం వంటివి చేయరు. పిల్లల పిల్లలు ఉంటున్నారు. వాళ్లు పెరిగే వయసు. అందుకని ఇంట్లో పార్టీలు జరిగితే వాళ్ల కళ్లకి కనిపించేవాటినే ప్రొజెక్ట్ చేస్తాం. ఒకసారి అరవింద్‌గారు కొంచెం తాగిన గ్లాస్‌ని టేబుల్ మీద పెట్టి, మరచిపోయారు. అయాన్ వచ్చి ఇదేంటమ్మా ? అని అడిగితే.. అది తాతగారి జ్యూస్ నాన్నా అని చెప్పాను. అంతే కానీ ‘నీకెందుకు? నువ్వు చూడకూడదు’ అని చెబితే క్యూరియాసిటీ పెరుగుతుంది. చెడ్డ విషయాల గురించి తెలివిగా చెప్పడంవల్ల పిల్లలకు వాటి మీద క్యూరియాసిటీ పెరగదు. శిరీష్‌కి పెళ్లి చేసేస్తే మీ ముగ్గురు పిల్లలు లైఫ్‌లో సెటిలైనట్లే కదా? నిర్మల: లైఫ్‌లో సెటిల్మెంట్ అనేది ఉండదు. అరవింద్‌గారు నిర్మాత. ఆయన సినిమాలు తీస్తుండాలి. వెంకటేశ్ బిజినెస్ చూసుకుంటాడు. అది వాడు చేయాల్సిందే. బన్నీ, శిరీష్‌లు సినిమాలు చేయాల్సిందే. పెళ్లయితే సెటిలైనట్లు కాదు. లైఫ్ సైకిల్ని నడపాల్సిందే. ఎవరి లైఫ్ వారు లీడ్ చేయాలి. ఎవరి సొంతంగా వాళ్లు పరిగెత్తాలి. లైఫ్ అంటేనే పరుగు కదా. బన్నీ: ‘నువ్వు సెటిల్ అయ్యావు’ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఈ క్వొశ్చన్ నన్ను అడిగినా నాదీ సేమ్ ఆన్సర్. సెటిల్ అవ్వలేదు అనుకుంటాను. పిల్లలపై నెగటీవ్ కామెంట్స్ విన్నప్పుడు ఫీల్ అవుతారా? నిర్మల: బయట వాళ్లు చెప్పినప్పుడు పెద్దగా తీసుకోను. హీరోయిన్‌తో ఇలా ఉంది? అని అంటే పట్టించుకోను. వాళ్లు ఏదో రాసుకుంటారులే అని వదిలేస్తుంటాను. కానీ వాళ్లు నిజంగా తప్పు చేశారని నాకు అనిపిస్తే చాలా స్ట్రగుల్ అవుతాను. నా మనసుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే నేను పడే బాధను మాటల్లో చెప్పలేను. అలా మిమ్మల్ని ఎప్పుడైనా ఇరుకుల్లో పడేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు పిల్లలతో కూర్చుని మాట్లాడతారా? మాట్లాడను. నాకు కోపం వస్తే అస్సలు మాట్లాడను. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. నిజమైన ఇష్యూలు జరిగినప్పుడు ఎవ్వరూ అరుచుకోరని నా అభిప్రాయం. చాలా సైలెన్స్ ఉంటుంది. అంతలా సైలెంట్ అయిపోయాం అంటే బాగా అప్సెట్లో ఉన్నాం అని అర్థం. అయితే నేను లైఫ్‌లో ‘హౌ’ (ఎలా) అనేది మాత్రమే నమ్ముతాను. ‘వై’ (ఎందుకు) అనేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. పిల్లలు విషయం అనే కదా.. ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు.. ఎందుకిలా జరిగింది? అని మదనపడను. ఆ విషయాన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తాను. ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది. దాన్నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చూశారా? బన్నీ యాక్టింగ్ సూపర్ అని ప్రశంసలు వస్తున్నాయి నిర్మల: నాకు పర్సనల్‌గా ఆర్మీ అంటే చాలా గౌరవం. చిన్నప్పుడు మా అబ్బాయిలు ఆర్మీలో ఉంటే బావుండు అనుకున్నాను. కుదరలేదు. ఇప్పుడు ఏదో రకంగా ఆర్మీతో కనెక్షన్ కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను పేపర్ బాగా ఫాలో అవుతున్నాను. ఆర్మీ వాళ్ల ప్రతీ ఆర్టికల్ చూస్తుంటాను. పాకిస్థాన్ వార్, చైనా వార్ అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఫైనల్లీ.. నా పిల్లలు తప్పు చేయరు.. అనే భరోసా మీకు ఉందా? బన్నీ: ఈ ప్రశ్నకు అమ్మ కాదు.. నేను చెబుతాను. మా ముగ్గురి బ్రదర్స్ తరఫున నేను గ్యారెంటీ ఇస్తున్నాను. వాళ్ల పెంపకంలో తప్పు జరగదు. మా మదర్, మా ఫాదర్. ఇద్దరి ఐడియాలజీస్ బావుంటాయి. అవి మాకు ఎంతో కొంత వచ్చాయి. ఆ కల్చర్‌లోనే మేంపెరిగాం. ‘నా పిల్లలు తప్పు చేయరు’ అని ఇప్పుడు అమ్మ గ్యారెంటీ ఇచ్చిందంటే.. రేపు పొరపాటున ఏదైనా తప్పు జరిగితే, అవిడ బాధపడుతుంది. మేం తప్పు చేస్తామని కాదు. యాక్సిడెంటల్ మిస్టేక్స్ ఉంటాయి కదా.. వాటి గురించి చెబుతున్నా. నేనూ, మా అన్నయ్య, తమ్ముడు శిరీష్.. మేం ముగ్గురుం ఎప్పుడూ వాళ్లు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ తీసుకురాం. ఫెయిల్యూర్స్ రావచ్చు. కానీ బ్లండర్స్ చేయం. ఆ రోజు అమ్మను పట్టుకుని ఏడ్చేశాను మీ అమ్మ గారి గురించి మీకు గుర్తున్న సంఘటన? ప్రతివారికీ అమ్మ గురించిన అనుభూతులు, జ్ఞాపకాలు బోలెడు ఉంటాయి. ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మ గారి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ పేరు కనకరత్నం. అమ్మకి నేను ఒక్కడినే కొడుకుని. నాకు చిన్నప్పటి నుండి కొంచెం శుభ్రం ఎక్కువ. స్నానానికి అందరికీ ఒక బకెట్ అవసరం అయితే నాకు మాత్రం రెండు బకెట్ల నీళ్లు కావాలి. నేను రోజులాగానే ఓ రోజు స్నానానికి వెళ్లాను. ఆ రోజు మా ఇంట్లో మోటర్ చెడిపోయింది. ఆ విషయం నాకు తెలియదు. నేను స్నానానికి వెళ్లటం చూసిన మా అమ్మ హడావిడిగా బావి దగ్గరకు వెళ్లి రెండు బకెట్ల నిండా నీళ్లు తోడి మేడ మీదకు మోసుకొచ్చింది. బాత్రూమ్లో కుళాయిలో నుంచి నీళ్లు రావట్లేదని నేను బయటికి వస్తుంటే, నీళ్లు తెస్తూ అమ్మ ఎదురు వచ్చింది. అది చూసి ‘ఏంటమ్మా ఇది’ అని అడిగాను. ‘ఈ రోజు మోటర్ పాడైపోయింది, నీకు స్నానానికి ఎక్కువ నీళ్లు కావాలి కదా! అందుకే బావిలో నుంచి నీళ్లు తోడి తీసుకొస్తున్నాను’ అని చెప్పింది. అమ్మ ప్రేమకు చలించిపోయాను. ఆ రోజు మా అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. ఆ సంఘటన ఈ రోజుకీ నా మనసులో గుర్తుండిపోయింది. మీ అమ్మగారు మీకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ? ఒక గిఫ్టని చెప్పలేను, నా పుట్టినరోజు జనవరి 10. ప్రతి సంవత్సరం నాకు మా అమ్మ ఆ రోజుకి తప్పనిసరిగా ఒక వాచీ ఇస్తుంది. నేను ఇంత పెద్దవాడినైనా నాకు మనవళ్లు పుట్టినా కూడా ఆవిడకు నేను చిన్నపిల్లవాడినే. ఇప్పటికీ ఆవిడ నాకు ఇంకా వాచీ బహూకరిస్తూనే ఉంది. మీరు మీ అమ్మగారికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? నేను మా అమ్మ ఇచ్చినట్టు ప్రతి సంవత్సరం ఇవ్వట్లేదు కానీ, ఒక గిఫ్ట్‌ను మాత్రం ఆమె ఎంజాయ్ చెయ్యటం నాకు ఇంకా గుర్తు. నా భార్య నిర్మల వాళ్లది విజయవాడ. మొదటి కాన్పు కోసం మా ఆవిడ పుట్టింటికి వెళ్లింది. మా పెద్దబ్బాయి అల్లు వెంకటేశ్ (అల్లు బాబి) అక్కడే పుట్టాడు. వాడిని చూడటానికి మా అమ్మ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చింది. ఆ సమయంలో నా భార్య ఒడిలో నిద్రపోతున్న బాబుకి చక్కగా తువ్వాలు చుట్టబెట్టి అమ్మ చేతికి అందించాను. వాడిని చూడగానే ఆవిడకు పట్టరాని సంతోషం కలిగింది. వాడిని గుండెలకు హత్తుకుని ముద్దులాడింది. ‘చాలా సంతోషంగా ఉందిరా నాన్నా’ అని నన్ను ఆశీర్వదించింది. ఆ సమయంలో ఆవిడ కళ్లల్లో ఆనందబాష్పాలు నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు. మనకు ఏ మంచి జరిగినా మొట్టమొదటగా సంతోషపడేది అమ్మేనని ఆ రోజు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. -
అమ్మ ఆరోగ్యం
అమ్మల రోజు... అదేనండీ మదర్స్‌డే రోజున అందరూ అమ్మలకు శుభాకాంక్షలు చెబుతారు. అమ్మలకు ఏవోవో కానుకలు ఇస్తారు. ‘మాతృదేవోభవ’ అంటూ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ‘అనురాగానికి మారుపేరు అమ్మ’ అంటూ పొగడ్తలు కురిపిస్తారు. ఫేస్బుక్, వాట్సప్‌లలో ఫొటోలు షేర్ చేసుకుంటారు. అక్కడితో సంబరాన్ని సరిపెట్టేసుకుంటారు. మళ్లీ మర్నాటి నుంచి ఎవరి రొటీన్ వాళ్లదే. గజి‘బిజీ’ జీవితాల్లో పడి కొట్టుకుపోతూ అమ్మల్ని అంతగా పట్టించుకోవడం మానేస్తారు. తొమ్మిదినెలలు తన కడుపులో భద్రంగా మోసి, కని, కంటికి రెప్పలా పెంచిన అమ్మల కోసం ఏడాదికో రోజు సంబరం చేసుకుంటే అక్కడితో తీరిపోతుందా తల్లి రుణం. పిల్లలను కని పెంచే క్రమంలో అమ్మలు చాలా చాలా త్యాగాలు చేసి ఉంటారు. చివరకు వాళ్ల ఆరోగ్యాలను కూడా పట్టించుకోకుండా, పిల్లల ఎదుగుదల కోసం అహర్నిశలు పాటు పడి ఉంటారు. అంతగా శ్రమించిన తల్లులకు ఈసారి అమ్మల రోజున ‘ఆరోగ్య’ కానుక ఇవ్వండి. నడి వయసు మొదలుకొని ముదిమి మీరిన వయసు వరకు వారికి సాధారణంగా అవసరమయ్యే ఆరోగ్య పరీక్షలు జరిపించండి. పెరిగి పెద్దయిన పిల్లలు తల్లులకు ఇవ్వదగిన సరైన కానుక ఇదే. కొన్ని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి, ప్రమాదకర పరిస్థితులను నివారించడానికి కాలానుగుణంగా కొన్ని సర్వసాధారణ ఆరోగ్య çపరీక్షలను జరిపించుకుంటూ ఉండటమే మేలు. ముఖ్యంగా ఆరోగ్యాలను పణంగా పెట్టి మరీ కుటుంబాన్ని చక్కదిద్దే తల్లులకు ఇలాంటి పరీక్షలు మరింత అవసరం. మదర్స్ డే రోజున తల్లులకు వారి పిల్లలు చేయించదగ్గ కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు, వాటి వివరాలు... మూత్రపరీక్ష మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు పురుషుల కంటే మహిళల్లోనే చాలా ఎక్కువ. మహిళల శరీర నిర్మాణమే ఇందుకు కారణం. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లతో పాటు కిడ్నీల్లో రాళ్లు, కిడ్నీలకు సంబంధించిన ఇతర వ్యాధులు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధుల జాడ, వాటి తీవ్రత తెలుసుకోవడానికి మూత్రపరీక్ష తప్పనిసరి. తేలికగా జరిపించుకోగల ఈ పరీక్షతో చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ పరీక్ష థైరాయిడ్ గ్రంథిలోని లోపాలను, ఆ లోపాల వల్ల తలెత్తే సమస్యలను తెలుసుకోవడానికి టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చేస్తారు. ఇది ఒకరకమైన రక్తపరీక్ష. హైపో థైరాయిడిజమ్ లేదా హైపర్ థైరాయిడిజమ్ సమస్యలను గుర్తించ డానికి ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ సమస్యలు పురుషుల్లోనూ తలెత్తుతుంటాయి. అయితే, ఈ సమస్యలు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ. థైరాయిడ్ గ్రంథి పని చేయకపోవడం లేదా చాలా తక్కువగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజమ్ అంటారు. రోగనిరోధక వ్యవస్థలో లోపాల కారణంగా హైపోథైరాయిడిజమ్ పరిస్థితి తలెత్తుతుంది. హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారిలో మందకొడిగా ఉండటం, త్వరగా అలసట చెందడం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, రుతుక్రమం అస్తవ్యస్తం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి, గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మైక్సిడిమా కోమా అనే ప్రాణాంతక పరిస్థితి సంభవించే అవకాశం కూడా ఉంది. ఇక థైరాయిడ్ గ్రంథి అతిగా పని చేయడం వల్ల హైపర్ థైరాయిడిజమ్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు బరువు తగ్గి, సన్నగా మారిపోతారు. జుట్టురాలడం, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. థైరాయిడ్ లోపాలను పరీక్షల ద్వారా మొదట్లోనే గుర్తిస్తే తగిన చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు. విటమిన్– బి 12 పరీక్ష నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేయాలన్నా, ఎర్రరక్తకణాలు తయారు కావాలన్నా విటమిన్– బి 12 చాలా కీలకమైన పోషకం. నీటిలో కరిగే విటమిన్లలో ఒకటైన విటమిన్– బి 12ను ‘సైనకోబాలమిన్’ అంటారు. శరీరంలో విటమిన్– బి 12 పరిమాణం బాగా తగ్గిపోయే పరిస్థితిని ‘హైపోకోబాలమినియా’ అంటారు. వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారం నుంచి విటమిన్– బి 12ను గ్రహించే శక్తి క్షీణిస్తుంది. ఇది విటమిన్– బి 12 లోపానికి దారితీస్తుంది. దీనివల్ల మెదడు పనితీరు మందగించడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వయసు మళ్లుతున్న దశలో ఉన్న మహిళల్లో ఒకవేళ నీరసం, నిస్సత్తువ, నడుము నొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించినట్లయితే విటమిన్– బి 12 స్థాయిని తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. లోపం ఉన్నట్లు తేలితే విటమిన్– బి 12 సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకునే వీలుంటుంది. విటమిన్–డి పరీక్ష సూర్యరశ్మి నుంచి లభించే పోషకం విటమిన్–డి. పురుషులతో పోలిస్తే మహిళలు ఆరుబయటి వాతావరణానికి బహిర్గతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల మహిళల్లో విటమిన్–డి లోపం తరచుగా తలెత్తుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో చాలామంది మహిళలు విటమిన్–డి లోపానికి లోనవుతున్నారు. విటమిన్–డి లోపం వల్ల ఎముకలు పెళుసుబారడం, చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఈ లోపాన్ని రక్తపరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. లోపం ఉన్నట్లు తేలితే, విటమిన్–డి పుష్కలంగా ఉండే పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అవసరం మేరకు సప్లిమెంట్లు వాడటం, సూర్యరశ్మి సోకేలా ఉదయం, సాయంత్రం ఆరుబయట సంచరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు. సుగర్ పరీక్ష చక్కెర వ్యాధిని గుర్తించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి... ఫాస్టింగ్ సుగర్ టెస్ట్: ఈ పరీక్ష చేయించుకోవడానికి కనీసం ఎనిమిది గంటల సేపు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా ఈ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ర్యాండమ్ సుగర్ టెస్ట్: ఆహారం తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ చేసే పరీక్ష ఇది. ఇవే కాకుండా, రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) చేస్తారు. వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారికి మూత్రపరీక్ష కూడా చేస్తారు. ఒక వయసు దాటిన తర్వాత మహిళలు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయి తెలుసుకోవడానికి వైద్యుల సలహా మేరకు తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దంత పరీక్షలు నడి వయసు దాటిన మహిళల్లో దంతాలు, చిగుర్లు తదితర నోటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిజానికి మహిళలనే కాకుండా ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవడం అని దంత వైద్యులు చెబుతుంటారు. అలాంటప్పుడు నడి వయసు దాటిన మహిళలకు నోటి పరీక్షలు ఎంతగా అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోటి ఆరోగ్యం బాగుంటేనే గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యా«ధులు దరిచేరకుండా ఉండటమే కాకుండా, అన్ని అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు రక్తంలో కొవ్వుల పరిమాణం మోతాదుకు మించితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వారికి ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొవ్వులు, కొలెస్ట్రాల్ పరిమాణం తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ రక్తపరీక్ష చేస్తారు. ఇందులో ఎల్డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి అనేక కొవ్వుల పరిమాణం నిర్దిష్టంగా తెలుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌గా చెప్పుకొనే ఎల్డీఎల్ మోతాదు ఎక్కువగా ఉంటే, ధమనుల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌గా పిలిచే హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోకుండా అరికడుతుంది. అందువల్ల హెచ్‌డీఎల్ తగిన మోతాదులో ఉండటం అవసరం. ఇక ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎల్డీఎల్లాగానే హాని కలిగించేవి. లిపిడ్ ప్రొఫెల్ పరీక్షలో తేలే ఫలితాల బట్టి వైద్యులు ఆహారంలో మార్పులు సూచిస్తారు. అవసరమైన మందులు ఇస్తారు. తల్లుల ఆయురారోగ్యాలు బాగుండాలంటే పిల్లలు వారికి ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించాలి. ఈస్ట్రోజెన్ పరీక్ష నడి వయసులోని మహిళల్లో రుతుక్రమం నిలిచిపోయే దశలో తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఒంట్లోంచి ఆవిర్లు రావడం, తరచు భావోద్వేగాల్లో మార్పులు రావడం, ఎముకలు బలహీనపడటం, గుండెజబ్బులు తలెత్తడం, గర్భసంచి కిందకు జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. మహిళల్లో తలెత్తే హార్మోన్ల మార్పులను తెలుసుకునేందుకు ఒక రకమైన రక్తపరీక్ష చేస్తారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళల ఆరోగ్యంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, ఈస్ట్రోజెన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. లోపాలు ఏవైనా ఉన్నట్లు తేలితే వైద్యులు అవసరం బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలు అందిస్తారు. పాప్ స్మియర్ టెస్ట్ సర్వికల్ క్యాన్సర్‌ను తెలుసుకోడానికి చేయించే పరీక్ష ఇది. సర్విక్స్ అనేది మనలను కనడానికి తల్లిలోని గర్భసంచిలోని ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్లలోనూ అత్యంత ఎక్కువగా వచ్చేది ఇదే. పైగా దీనికి ప్రీ–క్యాన్సర్ దశ చాలా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది. అందుకే పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. అలా ముందుగానే కనుక్కుంటే దీన్ని తప్పక నయం చేయవచ్చు. అందుకే 35 ఏళ్లు దాటాక రొటీన్‌గా మహిళలకు ఈ పరీక్ష చేయిస్తుంటారు. ఇటీవల 30 ఏళ్లకే చేయిస్తున్నారు. ఇది ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష. మామోగ్రామ్ మహిళల్లో సాధారణంగానూ, ఎక్కువగానూ కనిపించే బ్రెస్ట్‌క్యాన్సర్‌ను కనుగొనే పరీక్ష ఇది. దీన్ని తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించడానికి అవకాశం ఉంది. ఇది కూడా నొప్పి లేని సులువైన పరీక్ష. అమ్మకు 40 ఏళ్లు దాటినప్పటి నుంచి తప్పక తరచూ చేయించాల్సిన పరీక్ష ఇది. మహిళల రొమ్ములో గడ్డలాంటిది ఏదైనా తగులుతూ ఉన్నా, రొమ్ములలో నొప్పి, సలపరం ఉన్నా, కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలా ఉన్నా తప్పక చేయించాల్సిన పరీక్ష ఇది. ఊపిరితిత్తుల పరీక్షలు ఇదివరకటి కాలంలో మహిళలు కట్టెల పొయ్యి మీదే వంట చేసేవాళ్లు. పొగకు ఉక్కిరిబిక్కిరయ్యేవాళ్లు. ఇటీవలి రెండు దశాబ్దాలుగా గ్యాస్ వాడకం చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. కట్టెల పొయ్యి బాధ కొంతవరకు తగ్గినా, కాలుష్యం వల్ల మహిళలకు ఊపిరితిత్తుల సమస్యలు తప్పడం లేదు. ఇంటిని శుభ్రం చేయడానికి వాడే రకరకాల రసాయనాలు, ఇళ్ల పరిసరాల్లోని కాలుష్యం కారణంగా ఆస్తమా, సీపీఓడీ, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యల బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పీఎఫ్‌టీ, స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులను నివారించవచ్చు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) ఇది చాలా సర్వసాధారణమైన రక్తపరీక్ష. ఈ ఒక్క పరీక్ష ద్వారానే చాలా అంశాలను తెలుసుకోవచ్చు. మన దేశంలో దాదాపు 85 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న వారే. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రక్త పరీక్ష ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని తెలుసుకోవచ్చు. అంతేకాదు, తెల్ల రక్తకణాల్లోని బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, నూట్రోఫిల్స్ వంటివి సాధారణ స్థితిలో ఉన్నాయో, లేదో తెలుసుకోవచ్చు. ప్రమాదాల్లో గాయపడినప్పుడు రక్తాన్ని గడ్డకట్టించి ప్రాణాలు నిలిపే ప్లేట్లెట్స్ సంఖ్య ఉండాల్సినంత ఉన్నదీ, లేనిదీ కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలోని దాదాపు అన్ని అంశాల పరిస్థితినీ సమగ్రంగా తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. రక్తహీనత వంటి సమస్యలు ఉన్నట్లు ఈ పరీక్షలో తేలితే తేలికపాటి చికిత్సతోనే పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. బోన్డెన్సిటీ టెస్ట్ యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళల్లో ఆస్టియోపోరోసిస్ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. మన దేశంలోని మహిళల్లో మెనోపాజ్ దాటాక దాదాపు అందరిలోనూ కనిపించే సమస్య ఇది. ఆస్టియోపోరోసిస్ వచ్చిన వారి ఎముకలు పెళుసుగా మారి, చిన్నపాటి దెబ్బలకే విరుగుతుంటాయి. మెనోపాజ్ దశ దాటాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ సమస్య వచ్చిపడుతుంది. అరవయ్యేళ్లు దాటిన మహిళల్లో 50 శాతం మందిలో, 80 ఏళ్లు దాటినవారిలో 90 శాతం మహిళల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. బోన్డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియోపోరోసిస్‌ను కనుక్కోవడం చాలా సులభం. ఆస్టియోపోరోసిస్ వచ్చినవారిలో ఎక్కువగా మణికట్టు, వెన్నుముక, తుంటిఎముక భాగాలను ఈ బోన్‌డెన్సిటో మీటర్ (డెక్సా స్కాన్) ద్వారా పరీక్షిస్తారు. ఆస్టియోపోరోసిస్‌ను నివారించడానికి వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం. -
‘మామ్ కాలింగ్’
సాక్షి, హైదరాబాద్: మాతృదినోత్సవం సందర్భంగా యూ ట్యూబ్‌లో ‘మామ్ కాలింగ్’ వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టకుంటోంది. మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సౌత్ ఇండియన్ లీడింగ్ విమెన్స్ మ్యాగజైన్ ‘జస్ట్ ఫర్ విమెన్’ ఒక వీడియోను రిలీజ్ చేసింది. మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మను మించిన ప్రయారిటీ మనకు మరేముంటుందనే సందేశంతో ఉన్న ఈ వీడియో పలువురి నెటిజనులతో సహా, సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ వీడియోను లాంచ్ చేసిన ప్రముఖ హీరో సూర్య, టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ తదితరులు ఈ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జన్మనిస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టయినా బిడ్డలను కాపాడుకుంటుంది. జీవితాంతం ఇదే అనుబంధం అమ్మసొంతం. సృష్టిలో ఏ జీవికైనా ఇంతకంటే ఏం కావాలి..అయితే..ఈ స్పూర్తిని, ప్రేమను మదర్స్ డే పేరుతో ఏదో ఒక రోజుకు పరిమితం చేయడం న్యాయమా అనే వాదన ఉన్నప్పటికీ...అమ్మ బిడ్డల పట్ల చూపించే , ఆప్యాయత, ఆదరణను, బిడ్డలు కూడా చూపించడం న్యాయం. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. మన తొలి ప్రాధాన్యత అమ్మదే.. ఇదే ఈ వీడియో సారాంశం.... అందుకోండి మరి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను ప్రేమించండి...ఎప్పటికీ.. అచ్చం అమ్మలాగే! -
నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘మామ్ కాలింగ్’
-
అమ్మకు వందనం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమానురాగాలు పంచే ఆత్మీ య మాతృమూర్తితో మదర్స్‌డే రోజంతా గడిపేందుకు మెజార్టీ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారట. ఈ నెల 13న మదర్స్‌డే సందర్భంగా భారత్ మ్యాట్రిమోని సంస్థ 6,448 మంది స్త్రీ, పురుషుల అభిప్రాయాలను ఆన్లైన్లో సేకరించింది. ఇందులో 80 శాతం మంది మదర్స్‌డేను జరుపుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు ఈ సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మదర్స్‌డే రోజున తల్లితో రోజంతా గడిపేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. అమ్మతో కలిసి లంచ్, డిన్నర్ చేయడం, షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది యువతీ, యువకులు మదర్స్‌డే రోజున ఇంటిపని, వంట పనులతో సతమతÐమవుతున్న అమ్మకు విశ్రాంతినిస్తే ఆమె సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడటం విశేషం. 40 శాతం మంది పురుషులు అమ్మకు అధిక తీరిక సమయం అవసరమని అభిప్రాయపడగా.. 30 శాతం మంది స్త్రీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పిల్లల సంతోషమే తల్లికి ఆనందం కలిగిస్తుందని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడినట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించిన భారత్ మ్యాట్రిమోని మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ తెలిపారు. -
అమ్మా నన్ను క్షమించు...!
⇔ మాతృదినోత్సవం నాడు నీకు శోకం కలిగించినందుకు...!! ⇔ ప్రేమోన్మాదానికి యువతి ఆత్మహత్య ⇔ తనను ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసాడని సూసైడ్ నోట్ పిఠాపురం/కొత్తపల్లి : ‘అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాతృ దినోత్సవం నాడు నీకు పుత్రికా శోకం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించు. నాకు బాగా చదువు కోవాలని ఐఏఎస్ అవ్వాలని ఉంది కాని నన్ను ఒక ప్రేమోన్మాది మోసం చేసాడు. అందుకే నేను అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా’ అంటు ఒక యువతి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగరంలో తీవ్ర విషాదఛాయలు నింపింది. ‘ప్రేమ పేరుతో వంచించి ముఖం చాటేశాడు. వాళ్ల నాన్నను, అమ్మను అడిగితే నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అన్నారు. అలాగని అతనిని మర్చిపోలేను అతనంటే నాకు చాలా ఇష్టం అందుకే మీకు అన్యాయం చేసి వెళ్లి పోతున్నా’. ‘నా చావుకు నన్ను మోసం చేసిన కన్నాతో పాటు వాళ్ల కుటుంబం కారణం. ఎవరిని వదిలినా బేబమ్మను మాత్రం వదలకు. అమ్మా ఐలవ్యూ. మాతృదినోత్సవ శుభాకాంక్షలు నన్ను క్షమించు మరో జన్మంటు ఉంటే మళ్లీ నీరుణం తీర్చుకుంటా. చెల్లి అమ్మ జాగ్రత్త, సునీల్ బాగా చదువుకో అమ్మను బాగా చూసుకో’ అంటు మృతురాలు రాసిన సూసైడ్ నోట్ చూసిన ప్రతి ఒక్కరు కంట తడిపెడుతున్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఆదివారం బక్కా శిరీష 19 అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అవతానని కలలు కన్న తన కన్న కూతురు మాతృదినోత్సవం నాడు అర్థంతరంగా తనువు చాలించడం తట్టుకోలేని మృతురాలి తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. ఐఏఎస్ అవ్వాలని..! కాకినాడ శాంతి నగర్‌కు చెందిన బక్కా శ్రీను, భవాని దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. వారిలో పెద్దదయిన శిరీష చదువులో ప్రతిభా వంతురాలు. ఐఏఎస్ అవ్వాలనే పట్టుదలతో బాగా చదివింది. నా కూతురు కలెక్టరు అని మీరు గర్వంగా చెప్పుకునేలా చేస్తానంటు ఎప్పుడు తల్లిదండ్రులతో అంటూ ఉండేదని ఆమె బంధువులు తెలిపారు.పదో తరగతిలో 9.8 గ్రేడు సాధిచిన శిరీష ఇంటర్లో 980 మార్కులు సాధించింది. డిగ్రీ చదువుతూ తల్లిదండ్రులకు భారం కాకూడదని పిఠాపురంలో ఒక ప్రైవేటు స్కూలులో టీచర్‌గా చేసేది. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ సాకా చిన సత్తిరాజు ఇంటి దగ్గర ఉంటుండేది. అమ్మమ్మ వ్యవసాయ పనుల మీద పిఠాపురం మండలం నర్శింగపురంలో ఒక పొలంలో తాత్కాలికంగా నివాసముంటున్నారు. ఏం జరిగిందంటే..! బాధితురాలి బంధువుల కథనం ప్రకారం పిఠాపురం మండలం కోలంకకు చెందిన ఒక పాస్టర్ ఆనందనగర్‌లో కొన్నేళ్లుగా ఒక ప్రార్థనా మందిరం నిర్వహిస్తున్నాడు. ఆయన కూడా అతని కుమారుడు కన్నా (మృతురాలి సూసైడ్ నోట్లో రాసిన ప్రకారం) వచ్చే వాడు. ఈ నేపథ్యంలో శిరీషతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానని నమ్మబలికి తరచూ కలిసేవాడు. ఇలా ఉండే అతడు కొద్ది రోజులుగా మాట్లాడడం మానేసి, ఫేస్ బుక్‌లో తన ఖాతా తొలగించి, వాట్సాప్ నిలిపివేసి, ఫోన్‌కు బదులిచ్చేవాడు కాదు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ తెలియకపోవడంతో శనివారం అతని స్వగ్రామమైన కోలంక వెళ్లి కన్నా కుటుంబ సభ్యులను ఆరా తీసింది. అయితే మా కొడుకే కనిపించడం లేదు అయినా మావాడితో నీకు సంబంధం ఏమిటీ? మర్యాదగా వెళ్లిపో నీఇష్టం వచ్చినట్లు చేసుకో అని గెంటేసినట్టు చెబుతున్నారు. దీంతో తాను మోసపోయానని ఏడుస్తూ స్థానికులకు తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఆమె బాధను ఎవరూ పట్టించుకోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే గ్రామంలో పొలంలో ఉన్న అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆ రాత్రికి ఉండిపోయింది. ఆదివారం ఉదయం ఆనందనగర్ వచ్చిన శిరీష ఉదయం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతలో ఆమె బంధువులు ఇంట్లో చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దింపి చూడగా ఆమె మృతి చెందిఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తన చావుకు కన్నా వాళ్ల అమ్మ నాన్నలే కారణమని మృతురాలు రాసిన సూసైడ్‌నోట్ సైతం లభించింది. పోలీసులు దానిని కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ, ఏఎస్సై లోవరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నా తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
అమ్మ మాట ఏనాడూ జవదాటలేదు: మంత్రి
దమ్మపేట(ఖమ్మం): 'నాకు 12 ఏళ్ల వయసులోనే నాన్న చనిపోతే.. అమ్మే(మాణిక్యమ్మ) నన్ను పెంచి పెద్ద చేసింది. రాజకీయంగా ఏ పని చేపట్టాలన్నా అమ్మకు పాదాభివందనం చేయడం నాకు అలవాటు. ఏ స్థాయిలో ఉన్నా.. అమ్మ కష్టపడి నా కుటుంబ సభ్యులను పెంచిన తీరును నేను ఎన్నడూ మరచిపోలేను. ఆమె ఉన్నంత వరకు నా ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకునేది. సమయానికి భోజనం చేస్తున్నావా అని అడిగేది. ఆమె కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. అమ్మ నన్ను నడిపోడు అనే పిలిచేది. రాజకీయంగా ఎంత బిజీ అయినా.. నాకు తెలిసినంత వరకు అమ్మ మాటను ఏనాడూ జవదాటలేదని' మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమ్మతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. -
రాజమాత
తాను పునర్జన్మ ఎత్తి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తాను త్యాగమై బిడ్డకు విజయగీతమందిస్తుంది తల్లి... కష్టాలను సహించి బిడ్డలను కని పెంచడంలోనే కాదు, ఎంతో ఓరిమితో కుటుంబాన్ని చక్కదిద్దడంలో తల్లులు పోషించే పాత్ర సాటిలేనిది. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలోనూ తల్లులది గురుతర పాత్ర. ఎంతటి దేశాధినేతలైనా, మేధావులైనా, మహనీయులైనా వాళ్లంతా తల్లులకు బిడ్డలే. వాళ్లంతా తల్లుల చల్లని ఆలనపాలనలో ఎదిగిన వారే. తల్లుల దినోత్సవం సందర్భంగా మహనీయులను కన్న కొందరు తల్లుల గాథలను మీ ముందు ఉంచుతున్నాం... అక్షరాలు దిద్దించిన తల్లి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర ప్రసిద్ధి పొందిన అబ్రహాం లింకన్‌ను కన్నతల్లి నాన్సీ లింకన్. బాల్యంలో అబ్రహాంపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. చిన్నారి అబ్రహాం చేత అక్షరాలు దిద్దించిన తొలి గురువు ఆమె. బాల్యంలో ఆమె తనకు ఇంట్లోనే చదువు చెప్పిన జ్ఞాపకాలను అబ్రహాం లింకన్ చాలాసార్లు నెమరు వేసుకునేవారు. సున్నితంగా మాట్లాడటం, పట్టుదల వంటి లక్షణాలను అబ్రహాం తన తల్లి నుంచే పుణికి పుచ్చుకున్నారు. దురదృష్టవశాత్తు అబ్రహాంకు తొమ్మిదేళ్ల వయసులోనే నాన్సీ అకాల మరణం పాలైంది. చిన్నారి అబ్రహాం తల్లి శవపేటిక తయారీలో తండ్రికి సహకరించారు. అధ్యక్షుడిగా ఎదిగినప్పటికీ అబ్రహాం జీవితాంతం తల్లి జ్ఞాపకాలను తలచుకుంటూ ఉండేవారు. నాన్సీ మరణం తర్వాత అబ్రహాం తండ్రి సారాను పెళ్లాడారు. అప్పటికి ఆమె ముగ్గురు పిల్లల తల్లి అయినా, అబ్రహాంను తన సొంత బిడ్డలతో సమానంగా ప్రేమించేది. ఆమెను అబ్రహాం ‘ఏంజెల్ మదర్’గా అభివర్ణించేవారు. తన జీవితంపై ఇద్దరు తల్లుల ప్రభావం ఉందని ఆయన తరచు చెప్పుకొనేవారు. గురువుగా మారింది.. విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్తగా థామస్ అల్వా ఎడిసన్ సుప్రసిద్ధుడు. విద్యుత్ బల్బు మాత్రమే కాదు, చరిత్రను మలుపు తిప్పిన మోషన్ పిక్చర్ కెమెరా ‘కినెటోగ్రాఫ్’ వంటి పలు ఆవిష్కరణల ఘనత ఎడిసన్‌కు దక్కుతుంది. తల్లి నాన్సీ ఆలనపాలన, అకుంఠిత దీక్షా దక్షతలు లేకుంటే థామస్ ఎడిసన్ ఒక శాస్త్రవేత్తగా ఎదిగేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. థామస్ ఎడిసన్ మొద్దబ్బాయి అని, అతడికి చదువు అబ్బదని స్కూల్ టీచర్ వ్యాఖ్యానించడంతో నాన్సీ కొడుకును స్కూలు మాన్పించింది. అలాంటి స్కూల్లో చదువుకుంటే తన కొడుకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని భావించి ఇంట్లో తానే స్వయంగా అతడికి పాఠాలు చెప్పింది. వినికిడి సమస్యతో పాటు నానా ఆరోగ్య సమస్యలతో బాధపడే కొడుకును కంటికిరెప్పలా కాపాడుకుంది. శాస్త్రవేత్తగా, పద్నాలుగు కంపెనీలను నెలకొల్పిన వాణిజ్యవేత్తగా థామస్ ఎడిసన్ సాధించిన ఎదుగుదల వెనుక ఆసరాగా నిలిచిన చల్లని తల్లి నాన్సీ. జ్ఞానం పంచింది... భారత వేదాంత సారాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి యోగిపుంగవుడు స్వామి వివేకానంద మాతృమూర్తి భువనేశ్వరీ దేవి. సంపన్న బెంగాలీ కాయస్థ కుటుంబంలో పుట్టిపెరిగిన భువనేశ్వరీ దేవి చిన్ననాటి నుంచి సనాతన ఆచారాలను పాటించేవారు. అయితే, మతపరంగా ఆమెవి ఉదార భావాలు. తన జ్ఞాన వికాసంలో తన తల్లి పాత్ర ఎంతగానో ఉందని, ఇందుకు ఆమెకు రుణపడి ఉంటానని స్వామి వివేకానంద స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఈ ప్రపంచంలో తాను ప్రేమించేది తన తల్లిని మాత్రమేనని కూడా ఆయన తన డెయిరీల్లో రాసుకున్నారు. స్వదేశంలోను, విదేశంలోను విరివిగా పర్యటనలతో గడుపుతూ ఉండటం వల్ల తన తల్లికి తగినంతగా సేవ చేసుకోలేకపోయినందుకు స్వామి వివేకానంద పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. వివేకానంద రెండో సోదరుడు తల్లి భువనేశ్వరీ దేవి బాగోగులు చూసుకునేవారు. అనుకోకుండా ఆయన అకాల మరణం చెందడంతో ఆమె బాగా కుంగిపోయారు. ఆ పరిస్థితుల్లో తాను తల్లికి సేవ చేసుకోవాలని వివేకానంద బాగా తపించారు. అయితే, దురదృష్టవశాత్తు ఆయన తన తల్లి కంటే ముందే చాలా చిన్న వయసులో కన్నుమూశారు. సామ్యవాదం వైపు నడిపింది.. క్యూబా విప్లవ నాయకుడు చేగువేరాను కన్న వీరమాత సిలియా డి లా సెర్నా. అర్జెంటీనాలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్నప్పటి నుంచే రాజకీయ చైతన్యం ఉండేది. ఏకైక సంతానమైన చే గువేరాను విప్లవ నాయకుడిగా తీర్చిదిద్దడంలో ఆమెది చాలా కీలక పాత్ర. సిలియా సంపన్న కుటుంబంలో పుట్టిన ఆమె అప్పుడప్పుడే మొదలైన స్త్రీవాద ఉద్యమంలో చురుకుగా పాల్గొనేది. తొలినాళ్లలో కేథలిక్ ఆచారాలను తు.చ. తప్పకుండా పాటించినా, సామాజిక, రాజకీయ ఉద్యమాలకు చేరువగా మెలగడం వల్ల క్రమంగా మతపరమైన విశ్వాసాలను సడలించుకుని, ఉదారవాదిగా మారింది. సోషలిస్టు భావజాలానికి దగ్గరైంది. తల్లికి గల సైద్ధాంతిక నేపథ్యమే చే గువేరాను ఉద్యమ మార్గంలో ముందుకు నడిచేలా చేసింది. అణగారిన ప్రజల విముక్తి కోసం ఆయుధం పట్టేలా చేసింది. తల్లి ఇచ్చిన స్ఫూర్తితో బాధ్యతగా చదువుకుని వైద్యుడిగా ఎదిగినా, కేవలం వైద్యరంగానికే పరిమితమైపోకుండా తల్లి ఆశయాల సాధన కోసం క్యూబా, కాంగో, బొలీవియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. చివరకు సీఐఏతో చేతులు కలిపిన బొలీవియా సైన్యం చేతిలో నేలకొరిగాడు. వీరుడిగా మలచింది... ‘ఛత్రపతి’ శివాజీ తల్లి జిజియా బాయి. రాజ్యాధికారం సాధించేలా శివాజీని తీర్చిదిద్దిన ఘనత ఆమెకే దక్కుతుంది. జిజియా భర్త షాహాజీ స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. మొగల్ సేనలు, అదిల్షాహీ సేనలు మూకుమ్మడిగా చేసిన యుద్ధంలో షాహాజీ ఓటమి పాలయ్యాడు. స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన చేయాలన్న భర్త ఆశయాన్ని కొడుకు శివాజీ ద్వారా నెరవేర్చాలని సంకల్పించింది జిజియాబాయి. చిన్నప్పటి నుంచి వీరగాథలను నూరిపోస్తూ ఆ ఆశయానికి అనుగుణంగానే అతడిని తీర్చిదిద్దింది. స్వరాజ్య స్థాపనతో పాటు ప్రజలకు సుపరిపాలన అందించాలని కొడుకుకు ఉద్బోధించేది. సైన్యాన్ని పోగు చేసుకుని శివాజీ రాజ్య స్థాపన దిశగా పోరాటం కొనసాగిస్తున్నప్పుడు న్యాయ, పరిపాలనాపరమైన అంశాల్లో జిజియాబాయి నిర్ణయాత్మక శక్తిగా ఉండేది. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించేది. చివరి రోజుల్లో కొడుకు పట్టాభిషేకాన్ని కళ్లారా చూసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే కన్నుమూసింది. నైతికంగా తోడు నిలిచింది... రష్యన్ సామ్యవాద విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తల్లి మారియా అలెగ్జాండ్రోవ్నా ఉల్యనోవా. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసింది. జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లిష్, రష్యన్ భాషల్లో స్వయంకృషితో ప్రావీణ్యం సాధించింది. ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. ఆమె భర్త, లెనిన్ తండ్రి నికోలాయెవిచ్ ఉల్యనోవ్ గణిత, భౌతిక శాస్త్రాల అధ్యాపకుడిగా ఉండేవారు. స్వయంగా టీచర్ కావడంతో మారియా పిల్లలకు ఇంటి వద్దనే చదువు సంధ్యలు చెప్పేది. శాస్త్ర సామాజిక అంశాలను నిశితంగా అధ్యయనం చేయడం, వాటిని ఆకళింపు చేసుకోవడం లెనిన్‌కు తల్లి ద్వారానే అబ్బింది. విప్లవోద్యమ కాలంలో కుటుంబానికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నిబ్బరంగా తట్టుకుని నిలబడ్డ ధీరవనిత మారియా. ఉద్యమకాలంలో లెనిన్ ఫ్రాన్స్, స్వీడన్లలో తలదాచుకుంటున్నప్పుడు వ్యయప్రయాసలకు ఓర్చి అంత దూరాలు ప్రయాణించి, అతడిని స్వయంగా కలుసుకుని నైతిక సై్థర్యాన్ని ఇచ్చిన తల్లి ఆమె. సత్య అహింసలను బోధించింది... పుత్లీబాయి గాంధీ దేశానికి మహాత్ముడిని అందించిన మాతృమూర్తి. కరంచంద్ గాంధీకి నాలుగో భార్య ఆమె. మొదటి ముగ్గురు భార్యలు చిన్న వయసులోనే మరణించడంతో కరంచంద్ పుత్లీబాయిని పెళ్లాడారు. పెళ్లినాటికి ఆమె వయసు పదమూడేళ్లు మాత్రమే. ఆమె సంతానంలో మోహన్‌దాస్ చిన్నవాడు కావడంతో అతడిపై అపారమైన ప్రేమ చూపేవారు. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతన గల పుత్లీబాయి పిల్లలను తన ఆదర్శాలకు, విశ్వాసాలకు అనుగుణంగానే పెంచారు. పిల్లలకు రామాయణ, మహాభారత కథలు చెప్పేవారు. ధర్మాచరణను వివరించేవారు. సత్యసంధత, అహింస వంటి సుగుణాలను మహాత్మా గాంధీ తల్లి నుంచే నేర్చుకున్నారు. మోహన్ దాస్ భారత్‌లో చదువు పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లడానికి సిద్ధపడినప్పుడు ఎలాంటి దురలవాట్లకు లోను కావద్దని పుత్లీబాయి కొడుకు చేత బాస చేయించుకున్నారు. మద్యమాంసాలకు దూరంగా ఉండాలని, అసత్యమాడరాదని మాట తీసుకున్నారు. మోహన్‌దాస్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చాక మహాత్ముడిగా పరిణమించడంలో తల్లి పుత్లీబాయి పాత్ర ఎనలేనిది. విజయాలకు బాటలు వేసింది... సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఆయన సాధించిన ఘన విజయాల గురించి, తన చారిటీ సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి అంతర్జాతీయ మీడియాలో తరచు కథనాలు వస్తుంటాయి. బిల్ గేట్స్ ఘన విజయాల వెనుక అడుగడుగునా ఆసరాగా నిలిచిన ఘనత ఆయన తల్లి మేరీ మాక్స్వెల్ గేట్స్‌కే దక్కుతుంది. మేరీ గేట్స్ స్వయంగా వాణిజ్యవేత్త. పలు కార్పొరేట్ సంస్థల్లో, చారిటీ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసేది. ఇంటా బయటా విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సైతం ఆమె తన కొడుకు బిల్ గేట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. అతడి చదువు సంధ్యలను పర్యవేక్షించేది. తన కొడుకు రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కొనుగోలు చేసేలా ఐబీఎం కంపెనీని ఒప్పించింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ చరిత్ర తెలిసిందే. వాణిజ్య విజయాలతోనే సరిపెట్టుకోకుండా సేవా కార్యక్రమాలు చేపట్టేలా తన కొడుకును ప్రోత్సహించిన మంచి మనసున్న తల్లి మేరీ గేట్స్. స్ఫూర్తి నింపింది... నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ను కన్న వీరమాత ప్రభావతీదేవి. ఆమె భర్త జానకీనాథ్ బోస్ కటక్ నగరంలో న్యాయవాదిగా ప్రసిద్ధుడు. సంపన్న కుటుంబం వారిది. జానకీనాథ్ బోస్, ప్రభావతీదేవి దంపతుల పద్నాలుగు మంది సంతానంలో సుభాష్‌చంద్ర బోస్ తొమ్మిదోవాడు. పద్నాలుగు మంది పిల్లలనూ ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘనత ప్రభావతీదేవికే దక్కుతుంది. సనాతన ఆచారాలను పాటించే కుటుంబమే అయినా పిల్లలను స్వేచ్ఛగా పెంచారామె. తీరిక వేళల్లో పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకుని పురాణ కథలు చెబుతూ స్ఫూర్తి నింపేవారు. సుభాష్‌చంద్ర బోస్‌ను ముద్దుగా ‘రంగా’ అని పిలుచుకునేవారు. ఆమె స్ఫూర్తితోనే సుభాష్‌చంద్ర బోస్ చిన్ననాటి నుంచే అన్యాయాలను ఎదిరించే తత్వాన్ని అలవరచుకున్నారు. స్వాతంత్య్రోద్యమ నాయకుడిగా ఎదిగారు. ‘సంపూర్ణ స్వరాజ్యం’ నినాదంతో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. సామ్యవాదిగా మలచింది... నల్లజాతి హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ తల్లి అల్బెర్టా కింగ్. నిజానికి తల్లి స్ఫూర్తితోనే మార్టిన్ లూథర్ కింగ్ నల్లజాతి ప్రజల హక్కుల కోసం పోరాటం సాగించాడు. ముగ్గురు పిల్లల తల్లిగా అల్బెర్టా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే చర్చి కార్యక్రమాల్లోను, సామాజిక కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొనేది. మహిళా సంఘాలతో కలసి పనిచేసేది. జాతి వివక్షపైనే కాదు, సమాజంలోని అన్ని రకాల అసమానతలపైనా ఆమెకు తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేలా ఆమె తన పిల్లలను తీర్చిదిద్దింది. వ్యవస్థలోని అన్ని అసమానతలనూ తన తల్లి తీవ్రంగా వ్యతిరేకించేదని, ఆమె ఆకాంక్ష మేరకు నల్లజాతి ప్రజలను తక్కువగా చూసే పరిస్థితులను తాను ఇక ఎంతమాత్రం కొనసాగనిచ్చేది లేదని మార్టిన్ లూథర్ కింగ్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. జాత్యహంకారుల చేతిలో మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు గురైన ఆరేళ్లకు అల్బెర్టా కూడా చర్చి సమావేశంలో ఉండగా దుండగుల కాల్పుల్లో మరణించడం విషాదం. -
కూతురులాంటి కోడలికి అమ్మలాంటి అత్త!!
‘అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’ అంటూ సృష్టికి శ్రీకారం చుట్టింది అమ్మేనంటారు. మరి అలాంటి అమ్మకు వందనాలు చెప్పడానికి ఓ రోజు... అదే ఈ మాతృదినోత్సవం. మనం భూమ్మీదకొచ్చిన తర్వాత తొలి ఆత్మీయ స్పర్శ అమ్మదే. తొలి ప్రేమలాలన అమ్మదే. స్వచ్ఛమైన ప్రేమకి ప్రతీక అమ్మ. మనం తొలిసారి తీసుకునే ఆహారం అమ్మ ప్రసాదించినదే. అమ్మ ప్రేమలోని మాధుర్యం తెలుసుకోవడం ప్రతి అమ్మాయి బాధ్యత. అయితే అది ఆమె అమ్మయ్యాకే పరిపూర్ణంగా తెలుస్తుంది. ఓ అమ్మకి కూతురిగా ఉంటూనే అమ్మగా మాతృత్వపు మాధుర్యాన్ని పొందడానికి దేవుడు నాకు ఓ వరమిచ్చాడు. ఆ వరమే మా పాప. మరి... నాకు కూడా కూతురులాంటి ఓ కోడలు వస్తోంది. ఆ కోడలు మామూలు కోడలు కాదు, బంగారంలాంటి కోడలు. నాకు కూతురు లాంటి బంగారు కోడలు సుహాసినితో కలిసి ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం జీ తెలుగులో ‘నా కోడలు బంగారం’ మెగా సీరియల్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఆశీర్వదిస్తారు కదూ! -
నా జీవితం అమ్మకే అంకితం
అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’... అమ్మ రుణం జన్మజన్మలకూ తీర్చుకోలేనిది. అమ్మపాలనలోనే మనం నిజమైన మనుషులుగా సమాజంలో సుస్థిర స్థానం సంపాదించుకోగలుగుతాం. ఈ ఆధునిక యుగంలో చాలామంది... అమ్మకు దూరంగా బతుకుతున్నారు. అది ఒక రకంగా శాపమనే చెప్పాలి. మా అమ్మ నాకు నేర్పించిన ఎన్నో మంచి విషయాలు కొండంత అండగా నిలిచాయి. అందుకే నేను షూటింగ్ లొకేషన్స్‌లో కానీ మరే ఇతర ప్రాంతాలకు వెళ్లినా... అక్కడికి వచ్చిన అందరినీ నా వాళ్లుగా, నా పిల్లలుగా భావిస్తాను. అలాంటి క్షణాలన్నీ నాకు మా అమ్మను గుర్తు చేస్తాయి. జీ తెలుగులో మే 22వ తేదీ మధ్యాహ్నం ప్రసారం కాబోతున్న మెగా సీరియల్ ‘గృహ ప్రవేశం’లో కూడా పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి కటువుగా ఉండే అమ్మగా కనిపించబోతున్నాను. ఆద్యంతం మానవ సంబంధాలను అందంగా ఆవిష్కరించే ‘గృహ ప్రవేశం’ మెగా సీరియల్‌ను చూసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.