
నా జీవితంలో ‘అమ్మ’
అమ్మ... మనకు కమ్మనైన జీవితాన్ని ప్రసాదించే దేవత. అమ్మ... మనకి కళ్ల ముందు కనిపించే నిజమైన దేవత.అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే! విశ్వంలో స్వచ్ఛమైన ప్రేమ అమ్మ ప్రేమే!! అందుకే... అమ్మస్థానం చాలా గొప్పది. నేను ఈ రోజు ఇలా మీ ముందు ఉన్నానంటే కారణం మా అమ్మే. ఆకలేస్తే అన్నం పెట్టి, నిద్ర వస్తే జోల పాడి, బాధ వస్తే ఓదార్చి, కష్టం వస్తే ఆసరాగా నిలుస్తుంది అమ్మ.
అలాంటి అమ్మకు వందనాలు. నేను ఓ చల్లనైన అత్తకు కోడలిగా అత్తగారింట్లో అడుగుపెడుతున్నాను. అమ్మ ప్రేమను మరిపించి నాకు మరో అమ్మగా రాబోతున్న మా అత్త హరితగారు నన్ను ప్రాణంగా, నా కోడలు బంగారం అన్నట్లు చూసుకుంటారు. మే 22వతేదీ మధ్యాహ్నం జీ తెలుగులో మా బంగారు అత్తయ్యతో కలిసి ‘మా కోడలు బంగారం’ మెగా సీరియల్‌తో మీ ముందుకు వస్తున్నాం. బంగారు ఆశీస్సులు అందిస్తారని కోరుతూ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.