ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు? | Who Hurt You?: Bryan Johnson Responds To Indian Doctor Post Claiming His Anti Ageing Project Is Scam | Sakshi
Sakshi News home page

ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?

Published Mon, Mar 31 2025 8:32 PM | Last Updated on Tue, Apr 1 2025 2:54 PM

Who hurt you: Bryan Johnson responds to Indian doctor

వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్‌ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్‌ జాన్సన్‌పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.

‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.

తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్,  ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్  బెల్లె గిబ్సన్‌లతో  బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్.  నిన్న(ఆదివారం)  అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.

అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్‌ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్‌ జాన్సన్‌  మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్‌ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి.  దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్‌ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్‌ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్‌బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement