Health
-
ఆ బ్రెడ్‌తో కొలెస్ట్రాల్, కొలొరెక్టల్ కేన్సర్‌కి చెక్..!
బ్రెడ్‌ని చాలామంది స్నాక్స్ రూపంలోనో లేదా బ్రేక్ఫాస్ట్గానో తీసుకుంటుంటారు. అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు చెప్పడంతో కొందరూ ప్రత్యామ్నాయంగా గోధుమలతో చేసిన బ్రెడ్‌ని ఎంచుకుంటున్నారు. అయినప్పటకీ పరిమితంగానే తినమని నిపుణులు సూచించడం జరిగింది. అయితే బ్రెడ్ అంటే.. ఇష్టపడే ఔత్సాహికులు ఇలాంటి బ్రెడ్‌ని బేషుగ్గా తినొచ్చని నిపుణులే స్వయంగా చెప్పారు. పైగా ఆ సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.ఈ బ్రెడ్‌పై పరిశోధన చేసిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉటుందని తెలిపారు. స్పెయిన్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..ఆ దేశంలోని ప్రజలు ఏడాదికి సగటున 27.35 కిలోల బ్రెడ్‌ని తింటారట. వారికి ఈ బలవర్ధకమైన బ్రెడ్‌ని అందివ్వగా వారంతా బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ఈ బ్రెడ్ కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్నికూడా తగ్గిస్తుందట. దీని పేరు "రై బ్రెడ్"."రై బ్రెడ్" అనేది కేవలం రై ధాన్యంతో చేసిన రొట్టె. రై ఒక మట్టి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొద్ది మొత్తంలో ఇతర పిండిలతో కలిపి తయారు చేయడంతో రుచి చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. దీన్ని మొలాసిస్, కోకో పౌడర్ వంటి చేర్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు. కలిగే లాభాలు..దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌గా పిలిచే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ధమనుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగి హృదయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కణితులు పెరగకుండా సంరక్షిస్తుంది. ఇందులోని ఫైబర్ పేగు రవాణాను వేగవంతం చేసేలా మల ఫ్రీక్వెన్సీని పెంచి బ్యాక్టీరియా జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఫెరులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు రక్తప్రవాహంలోని చక్కెర, ఇన్సులిన్ విడుదలను నెమ్మదించేలా చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను 14 శాతం వరకు తగ్గిస్తుంది.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: 6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!
ప్రస్తుతం బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ అనేది కాస్త కష్టమైపోయింది. ఏదో ఒక టెన్షన్‌తో రోజు గడిచిపోతుంది. ఇక వ్యాయామాలు చేసే టైమ్ ఏది. కనీసం నాలుగు అడుగులు వేసి వాకింగ్ చేద్దామన్నా.. కుదరని పరిస్థితి. అలాంటి వారు ఈ సింపుల్ 6-6-6 వాకింగ్ రూల్ ఫాలో అయితే చాలు.. సులభంగా వాకింగ్, వ్యాయామాలు చేసేయొచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ రూల్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతకీ అదెలాగంటే..రోజువారీ శారీరక శ్రమను పెంచేలా చిన్న చిన్న.. సెషన్లుగా విభజించే వాకింగ్ రూల్ ఇది. ఏం లేదు..జస్ట్ రోజు ఆరు నిమషాలు ఆరు సార్లు చొప్పున వారానికి ఆరు రోజులు చేయాలి. ఆరు నిమిషాలు చొప్పున నడక కేటాయించండి ఎక్కడ ఉన్నా.. ఇలా రోజంతా ఆరు నిమిషాల నడక..ఆరుసార్లు నడిచేలా ప్లాన్ చేసుకుండి. ఇలా వారానికి ఆరురోజులు చేయండి. ఈ విధంగా నడకను తమ దినచర్యలో భాగమయ్యేలా చేసేందుకు వీలుగా ఈ నియమాన్ని రూపొందించారు. ఆయా వ్యక్తులు తమ సౌలభ్యానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలు.. సులభంగా వాకింగ్ చేసి..మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు..హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిరక్తపోటుని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన మాసిక ఆరోగ్యం సొంతంఈ చిన్న చిన్న వాకింగ్ సెషన్లు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. చాలా చిన్నసెషన్ల నడక అయినప్పటికీ..క్రమం తప్పకుండా వారమంతా చేయడం వల్ల చక్కగా కేలరీలు బర్న్ అయ్యి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఈ నియమం హృదయ సంబంధ ఫిట్నెస్, మానిసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే అత్యంత ప్రభావవంతంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంపందించడం మంచిది. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
తేలిగ్గా బరువు తగ్గించే దానిమ్మ!
దానిమ్మ గుండెజబ్బులను నివారిస్తుందన్నది చాలామందికి తెలిసిందే. అయితే అది బరువు పెరగకుండా చూడటం వల్ల ఒబేసిటీ కారణంగా వచ్చే అనేక ఆరోగ్య అనర్థాలను కూడా నివారిస్తుంది. దానిమ్మతో బరువు తగ్గడానికి కారణమూ ఉంది. అదేమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉండటం వల్ల అది కడుపు (స్టమక్) ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుతుంది. అంతేకాదు దానిమ్మపండులో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సీ, విటమిన్ కె అనే ప్రధాన విటమిన్లతోపాటు పొటాషియమ్ వంటి హైబీపీని నియంత్రించేందుకు సహాయపడే లవణాలూ ఉన్నాయి. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉన్నందున బరువు తగ్గించడానికి దానిమ్మపండు బాగా ఉపయోగపడుతుంది.(చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యాయి. జల్గావ్లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ -
ఎముక క్యాన్సర్ అంటే...?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ క్యాన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.ఎముక క్యాన్సర్‌లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ క్యాన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక క్యాన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ క్యాన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన క్యాన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ క్యాన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ క్యాన్సర్లలో... ⇒ మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే క్యాన్సర్)⇒ ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన క్యాన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ⇒ ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) ∙కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ క్యాన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ క్యాన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ్రపోస్టేట్ వంటి ఇతర ్రపాంతాల్లో వచ్చి క్యాన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక క్యాన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అపాయకరం కాని ‘నాన్ క్యాన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. చికిత్స... ఒకసారి ఎముక క్యాన్సర్ నిర్ధారణ చేశాక... ఆ క్యాన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ్రపాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక క్యాన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... ⇒ శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ⇒ కీమోథెరపీ : కొన్ని మందులతో క్యాన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి క్యాన్సర్ల కోసం వాడతారు. ⇒ రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో క్యాన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సా«ధారణంగా శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని క్యాన్సర్లలో లాగే ఎముక క్యాన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతో పాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (్రపోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన క్యాన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతో పాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక క్యాన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని క్యాన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతో పాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.తమకు వచ్చిన క్యాన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతో పాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతో పాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక క్యాన్సర్ నిర్ధారణ చేస్తారు. -
సమస్త ఆరోగ్య సమాచారం మీకోసం..
అల్లోపతి నుంచి న్యాచురోపతి వరకు.. ఆయుర్వేదం నుంచి ఆక్యుపంచర్ వరకు.. యోగా నుంచి యునాని వరకు.. హోమియోపతి నుంచి ఎనర్జీ హీలింగ్ వరకు..ఎలాంటి సందేహమైనా సరే సాక్షి లైఫ్.. మీకు సరైన సమాచారం అందిస్తుంది. జనరల్ హెల్త్ , మెంటల్ హెల్త్, ఉమెన్ హెల్త్, కిడ్స్ హెల్త్, ఇలా ఒకటేమిటి అన్నిరకాల ఆరోగ్య సమాచారం మీకు సింగిల్ క్లిక్ లోనే అందిస్తుంది హెల్త్ వెబ్ సైట్ life.sakshi.com -
బాత్రూంలోల ఎక్కువసేపు గడుపుతున్నారా? స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్న నిపుణులు
బాత్రూంలోకి వెళ్లగానే చాలామంది రిలాక్స్ అయిపోయి పాటలు పాడుకుంటూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. ఎవ్వరికైనా కాస్త రిలాక్స్ అయ్యే ప్రదేశం అది. అయితే కొందరూ మరీ విపరీతంగా బాత్రూంలో ఎన్ని గంటలు ఉంటారో చెప్పలేం. అవతలి వాళ్లు వీడెప్పుడు ఊడిపడతాడ్రా.. బాబు అని తిట్టుకుంటుంటారు. అలాంటి వారు దయచేసి అంతలా అన్ని గంటలు ఉండకండి. అలా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. చాలామంది రకరకాల ఆరోగ్య సమ్యలతో వస్తుంటారు. వారందరీ సమస్యలకు మూల కారణాలపై విశ్లేషించగా ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆయా సమస్యలతో బాధపడుతున్న రోగులంతా కూడా గంటలకొద్ది బాత్రూమ్లలో గడిపేవారని అన్నారు. కొందరైతే సెల్ఫోన్లు, ఐఫోన్లు ఇతర గాడ్జెట్లు తీసుకుని బాతూరూమ్ టాయిలెట్ సీట్‌పై కూర్చొని రిలాక్స్ అవుతుంటారని అన్నారు. ఇది అస్సలు మంచిది కాదని తెలిపారు. ఇప్పుడు చాలా వరకు అందరూ వెస్ట్రన్ టాయిలెట్లనే వాడుతున్నారు. అవి ఓవెల్ ఆకారంలో ఉండటంతో దానిపై తక్కువ ఎత్తులో కూర్చొంటాం. ఈ భంగిమలో గురత్వాకర్షణ శక్తి మనపై ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. గురత్వాకర్షణ బలం తోపాటు నేలపై కలుగు చేసి ఒత్తిడి కలగలసి శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తుందట. ఫలితంగా పేగులో కొంత భాగం జారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ భంగిమ వల్ల రక్త నాళాలు ఉబ్బి హేమరాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొంటే పెల్విక్ కండరాలపై ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అంతేగాదు ఈ అలవాటు అంతరర్లీనంగా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని, ముఖ్యంగా మలబద్ధకం, ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణశయాంతర వ్యాధులను కలుగజేస్తుందని చెప్పుకొచ్చారు. అందువల్ల సుదీర్ఘంగా బాతూరూమ్లో గడపడాన్ని పరిమితం చేయమని చెబుతున్నారు. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై కూర్చొనే అలవాటును దూరం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎలాంటి గాడ్జెట్లు, మ్యాగ్జైన్లు వంటివి బాత్రూమ్ దరిదాపుల్లోకి తీసుకెళ్లవద్దని అన్నారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..) -
పైనాపిల్ : ఆ సమస్యలుంటే తినకపోవడమే మేలు!
ప్రస్తుతం చాలామంది ఆరోగ్య స్ప్రుహతో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటున్నారు. వాటిలో పైనాపిల్ కూడా ఒకటి. అయితే పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.అయితే ఈ పైనాపిల్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పండులో ఉండే తీపి, పిలుపు రుచి కారణంగా చాలామంది తినేందుకు ఇష్టపడతుంటారు. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఈ పైనాపిల్‌లో ఉన్న బ్రోమోలైన్ ఎంజైమ్ జీర్ణ క్రియను మెరుగ్గా ఉంచుతుందిఇన్ని ప్రయోజనాలు ఉన్నా..దీనిలో సహజ చక్కెరలు, కేలరీలు అధికం. అలాగే ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందువల్ల వాళ్లు ఈ పండు తీసుకోకపోవడమే మంచిది. అలాగే కడుపులో అల్సర్, అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి సమయంలో పైనాపిల్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు విటమిన్స్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ తినాలనుకున్నా ఈ పండుని మితంగా తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..) -
సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యిందని పలు కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీతా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. తన శారీరక పరిస్థితి, బరువు తగ్గడం తదితర ఊహగానాలకు చెక్‌పెట్టేలా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే తాను బరువు కోల్పోలేదని పెరిగానని చెప్పారు. తాను అంతరిక్షం కేంద్రవ వద్దకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అంతే ఉన్నానని అన్నారు. అంతేగాదు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చంద్రుడు, అంగారక గ్రహంపై భవిష్యత్తులో మానవ అన్వేషణ లక్ష్యంగా చేస్తున్న ఈ మిషన్ కొనసాగుతుందని ధీమాగా చెప్పారు. అలాగే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ కారణంగానే తన శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయే తప్ప బరువు కోల్పోలేదని వివరించారు. మైక్రోగ్రామిటీ వల్లే ఇదంతా..అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీకి శరీరంమంతా ఉండే ద్రవాలు పునః పంపిణీ అవుతుంటాయి. దీంతో తమ తలలు చాలా పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు సునీతా. అలాగే ఈ అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వ్యాయామాలు, వర్కౌట్లు వంటివి అత్యంత అవసరమని అన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వారి తుంటి, వెన్నుమకల్లో ప్రతి నెల రెండు శాతం వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని అన్నారు. అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్లు, ట్రెడ్మిల్ వర్కౌట్లతో సహా రోజువారీ ..వ్యాయామం రెండు గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయమాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. అలాగే తాను బాగానే తింటున్నాని, ముఖ్యంగా..ఆలివ్‌లు, అన్నం, టర్కిష్ చేపల కూర తింటున్నట్లు చెప్పారు. (చదవండి: క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పింది?) -
నలత లేకుండా చలాకీగా..!
పిల్లలు తమ తల్లిదండ్రుల కంటి దీపాలు. వాళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో దేదీప్యమానంగా వెలుగుతుండటమే తల్లిదండ్రులు, పెద్దలు కోరుకునేది. ఈ నెల 14వ తేదీ బాలల దినోత్సవం. ఈ సందర్భంగా... పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పెద్దలు గమనించాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని అంశాలివి...అప్పుడే పుట్టిన పిల్లలకు ఏడుపే వాళ్ల భాష. తమ తాలూకు బాధలను పెద్దలకు తెలియజెప్పడానికి వాళ్లు ఏడుపునే సాధనంగా ఎంచుకుంటారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని కారణాలు ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, ∙దాహం వేసినప్పుడు ఒక్కరే ఉండి బోర్‌గా అనిపించినప్పుడు ∙పక్క తడి అయినప్పుడు, వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు కాంతి బాగా ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా పళ్లు వస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) జ్వరం జలుబు, చెవినొప్పి వంటి సాధారణ లేదా కొన్ని తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారా తెలియజేస్తారు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు.ఇన్ఫెన్టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు ముఖ్యమైన కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆకలి వేయడంగానీ, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్‌కు కొన్ని కారణాలు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్, కడుపులోని గాలి వెళ్లిపోయేందుకు తేన్పు వచ్చేలా చూడటం అంటే ఎఫెక్టివ్ బర్పింగ్తో ఏడుపు మాన్పించవచ్చు. చికిత్స వరకు వెళ్లాల్సివస్తే... కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు బాగా అవసరమైన పరిస్థితుల్లో మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనేవి ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి.ఏడాది నుంచి రెండేళ్ల వరకు... ఏడాది వయసు నుంచి పిల్లలు కొద్దికొద్దిగా సపోర్ట్ తీసుకుంటూ నిలబడుతుండటం, కొద్ది కొద్దిగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మళ్లీ పడిపోతూ, మళ్లీ నిలబడుతుండటం చేస్తుంటారు. వీళ్లు నిలబడుతుండటానికి సపోర్ట్ ఇస్తూ ఆడుకునేలా చేస్తుండాలి. ఈ టైమ్‌లోనే పిల్లలు రివాల్వింగ్ చైర్స్ వంటివి పట్టుకుని నిలబడానికి ప్రయత్నించినప్పుడు అవి చక్రాల మీద జారిపోయి, పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఏ వస్తువును పడితే ఆ వస్తువును కదిలించడానికి ప్రయత్నించడం, సొరుగులు లాగేయడం వంటివి చేస్తుంటారు. ఈ సమయాల్లో వారి వెనకే ఉంటూ ప్రోత్సహిస్తూనే, వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.రెండేళ్ల వయసు నుంచి స్కూలుకు వెళ్లే సమయం వరకు... ఈ టైమ్‌లో పిల్లలను కాస్త ఆరుబయట ఆడనివ్వాలి. వాళ్లు ఆరుబయటకు వెళ్తుంటే భయపడకుండా కాస్త నీరెండలోకి, మట్టిలోకి వెళ్లడానికి అనుమతించాలి. కాకపోతే ఎండ నేరుగా తగలకుండా హ్యాట్ లాంటిది వాడటం, ఒళ్లంతా కప్పి ఉంచేలా దుస్తులు తొడగడం, అవసరమైతే 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఆరుబయట ఆడుకుని వచ్చాక వాళ్ల ఒళ్లు తుడిచి, చేతులు శుభ్రంగా కడగాలి. మట్టితో ఆడుకోనివ్వని పిల్లల కంటే అలా ఆడుకున్న చిన్నారులకే ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.మూడు నుంచి ఐదేళ్ల వయసుకు.. ఈ వయసులో చిన్నారులు ఇతర పిల్లలతో కలిసి ఆడుతుంటారు. అలా ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఈ టైమ్‌లో ట్రైసైకిల్ లేదా సైకిల్ నేర్చుకునేలా సపోర్ట్ చక్రాలున్న సైకిల్, బంతిని విసిరి పట్టుకునే ఆటలు (థ్రోయింగ్ అండ్ క్యాచింగ్), గెంతడం, స్కిప్కింగ్, డాన్సింగ్ వంటి యాక్టివిటీస్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ వయసు పైబడిన పిల్లలు, వాళ్ల వయసుకు తగినట్లుగా కాస్తంత పెద్ద ఆటలను ఆడేలా చూడాలి.అన్ని టీకాలూ టైముకు ఇప్పించడం... పిల్లలకు ఆయా సమయాల్లో ఇప్పించాల్సిన టీకాలు (వ్యాక్సినేషన్) తప్పక ఇప్పించాలి. ఈ టీకాల షెడ్యూలు చిన్నపిల్లల డాక్టర్లందరి దగ్గరా ఉంటుంది. వారిని సంప్రదించి... డీటీఏపీ, ఫ్లూ, హెచ్ఐబీ, ఎమ్ఎమ్ఆర్, పోలియో, రొటా వైరస్ మొదలైన వ్యాక్సిన్లు అన్నింటినీ ఆయా సమయాలకు ఇప్పిస్తూ ఉండాలి.ఆహారం విషయంలో... పాలు మరిచిన పిల్లలకు మొదట్లో గుజ్జుగా చేసిన అన్నం, పప్పు, నెయ్యి వంటి ఆహారాన్ని అందిస్తూ, క్రమంగా ఘనాహారం వైపు మళ్లించేలా చేయాలి. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటూ మార్కెట్లో లభ్యమయ్యేవాటి కంటే ఇంట్లో ఆరోగ్యకరమైనన పరిస్థితుల్లో వండిన భోజనాన్ని తాజాగా అందిస్తుండటమే మేలు.‘క్లీన్ ప్లేట్ రూల్’ వద్దు... ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కొందరు తల్లులు తాము ప్లేట్లో వడ్డించినదంతా పిల్లలు తినేయాలని అనుకుంటుంటారు. పిల్లలను ఘనాహారం వైపు మళ్లించే వీనింగ్ ప్రక్రియ సమయంలో ప్లేట్లో పెట్టిందంతా పిల్లలు తినేయాలని అనుకోవద్దు. కడుపు నిండిన వెంటనే వారు తినడానికి విముఖత చూపుతారు. అప్పుడు ఫీడింగ్ ఆపేయాలి. ఈ ‘క్లీన్ ప్లేట్ రూల్’ బదులుగా చిన్నారులకు చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినిపించడం మేలు. ఇక పిల్లలు కాస్త ఎదిగాక అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పీచు పుష్కలంగా ఉండేలా పొట్టుతీయని కాయధాన్యాలతో వండిన అన్నం, మాంసాహారం తినిపించేవారు చికెన్, చేపలు, తాజా పండ్లతో కూడిన ఆహారాలు అందిస్తూ వారికి అన్ని పోషకాలు అందేలా జాగ్రత్త తీసుకోవాలి. వారు మితిమీరి బరువు పెరగకుండా ఉండేందుకు నెయ్యి, వెన్న వంటి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఉప్పు వంటి వాటిని పరిమితంగా ఇవ్వడం మేలు. పిల్లలకు తినిపించేటప్పుడు తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, వారు ముద్ద నమిలి మింగేవరకు ఆగి, అప్పుడు మరో ముద్ద పెట్టడం, ఆహారం వారికి ఇష్టమయ్యే రీతిలో చాలా రకాల (వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్) ఆహారాలను మార్చి మార్చి రుచిగా, కాస్తంత గుజ్జుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పెద్దలు వాళ్లతో కమ్యూనికేట్ అవుతూ ఉండటం, వాళ్ల ఫీలింగ్స్ గురించి మాట్లాడటం, ప్రతికూల ఆలోచనలను, ధోరణులను దగ్గరికి రాకుండా చూడటం, వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతుండటం, వాళ్ల సెల్ఫ్ ఎస్టీమ్‌కు భంగం రానివ్వకుండా ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడటం, మొదట్లో చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచి, వాటిని నెరవేర్చగానే చిన్న చిన్న బహుమతులు అందిస్తూ ప్రోత్సాహపూర్వకంగా ప్రశంసించడం, వారికై వారు తమ లక్ష్యాలను మెల్లగా పెద్దవిగా చేసుకునేలా చూడటం, విఫలమైనప్పుడు ఏమాత్రం నిరుత్సాహపరచకుండా మరింత ప్రోత్సహించడం చేస్తూ వాళ్లు అన్నివిధాలా మానసిక, శారీరక ఆరోగ్యాలతో ఎదిగేలా చేయాలి. (చదవండి: పిల్లలూ దేవుడూ చల్లని వారే) -
కొర్రలతో కొండంత ఆరోగ్యం!
ఇటీవల చిరుధాన్యాల వాడకం పెరిగిపోయిన కాలంలో కొర్రలకు మంచి ప్రాధాన్యం ఏర్పడింది. చాలామంది కొర్రలను పిండిగా కొట్టించి, వాటితో చేసిన ఆహారాలను వాడటం పరిపాటి అయ్యింది. నిజానికి గోధుమ పిండి కంటే కొర్రల పిండి మంచిదంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. కొర్రలలో ఉండే పోషకాలూ, వీటితో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం...ఒక కప్పు కొర్రపిండిలో ప్రోటీన్ 10 గ్రాములు డయటరీ ఫైబర్ 7.4 గ్రాములు, మెగ్నీషియమ్ 83 మిల్లీగ్రాములతో తోపాటు ఇంకా చాలా రకాల సూక్ష్మపోషకాలు అంటే మైక్రోన్యూట్రియెంట్లూ ఉంటాయి. కొర్రపిండితో సమకూరే కొన్ని ప్రయోజనాలు... కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం తేలిగ్గా నివారితమవుతుంది. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయన్న సంగతి తెలిసిందే. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి. ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలాసేపు అలసి΄ోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసి΄ోకుండా పనిచేయగల సమయం (టైమ్ డ్యూరేషన్) పెరుగుతాయి. ఈ అంశాలన్నీ కలగలసి రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. డయాబెటిస్ నివారణకూ... కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు దేహంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. ఈ పీచు పదార్థమూ, ఈ గుణం కారణంగానే టైప్–2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారంగా రూపొందాయి. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు ఈ అంశం దోహదపడుతుంది. ఈ జింక్ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది. (చదవండి: స్పాండిలోసిస్ అంటే..?) -
ఆస్పత్రిలో ప్రముఖ జానపదగాయని.. పరామర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీహర్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో శారదా సిన్హా కుమారుడు అన్షుమన్ సిన్హాకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి, శారదా సిన్హా క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.శారదా సిన్హా ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త బ్రిజ్కిషోర్ సిన్హా మరణానంతరం శారదా సిన్హా ఆందోళనకు లోనయ్యారు. శారదా సిన్హాను బీహార్ కోకిల అని కూడా అంటారు. ఆమె భోజ్‌పురి, మైథిలి, మాగాహి జానపద గీతాలను ఆలపించడంలో పేరొందారు. శారదా సిన్హా బీహార్ సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారు. ఆమె పాడిన 'కహే తో సే సజ్నా','పెహ్లే పెహిల్ హమ్ కయేని' పాటలు ఎంతో ఆదరణ పొందాయి. శారదా సిన్హా 2018లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.ఇది కూడా చదవండి: రాహుల్ రెండు గంటల పర్యటన -
స్పాండిలోసిస్ అంటే..?
స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. వాస్తవానికి ఇది ఒక రకమైన ఆర్థరైటిస్ (అంటే ఎముకల అరుగుదల వల్ల వచ్చే రుగ్మత) అని చెప్పవచ్చు. ఈ సమస్య మెడ భాగంలో వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలోసిస్‌కు కారణాలు: వెన్నులో కూడా అనేక జాయింట్స్ ఉంటాయి. అవి అరిగాక ఒక ఎముక మరో ఎముకతో రాసుకుపోయే సమయంలో వాటి మధ్యన ఉండే నరాలు నలిగిపోయి నొప్పి రావచ్చు. స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్‌లో మెడనొప్పితోపాటు తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు పాకుతున్నట్టుగా వస్తుంది లంబార్ స్పాండిలోసిస్‌లో నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితోపాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పిగా చెబుతారు. ఈ సమస్య నివారణ కోసం ఫిజియోథెరపిస్టులను సంప్రదించి వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. అలాగే మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వంటి ఆహారపరమైన జాగ్రత్తలు పాటించాలి. కూర్చోవడం లేదా నిల్చోవడంలో సరైన భంగిమలు (పోష్పర్స్) ΄పాటించాలి. డాక్టర్లను సంప్రదించి అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.(చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?) -
నోట్లో పొక్కులు వస్తున్నాయా..?
కొందరికి నోట్లో, నాలుక మీద పగుళ్ళు రావడం, దాంతో ఏవైనా వేడిపదార్థాలూ లేదా కారపు పదార్థాలు తిన్నప్పుడు మంట, బాధ కలుగుతుండటం చాలా సాధారణం. ఇలా నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావడం తోపాటు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగ్జైటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా కనిపించవచ్చు. ఇవి వచ్చినప్పుడు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారం పాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశమున్నందున డాక్టర్లు తగిన పరీక్షలు చేయించి, కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?
చిన్నపిల్లలు తమ కళ్లను అటు ఇటు తిప్పి చూస్తున్నప్పుడు వాళ్ల రెండు కన్నులు సమానంగా ఉండాలి. అలా కాకుండా వాటిలో ఏదైనా కనుపాప పక్కకు చూస్తున్నట్లుగా ఉండి. కన్నుల మధ్య అలైన్మెంట్ లోపించడాన్ని మెల్ల కన్నుగా చెప్పవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పిల్లల్లో చూపు కాస్త మసగ్గా ఉండవచ్చు లేదా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. అందుకే చిన్నారులు తమ మూడో నెల వరకు ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. మూడు నెలల వయసప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలుపెడతారు. మూడు నెలల వయసు దాటాక పిల్లల్లో మెల్లకన్ను కనిపిస్తుంటే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. అంతేతప్ప మెల్ల అదృష్టమనే అపోహతో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి అది దురదృష్టం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా, కారణాలూ, చికిత్స త్వరగా ఎందుకు చేయించాలనే అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? పిల్లల కన్నులు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు చూసినప్పుడు వాళ్లలో కేవలం ఒక కన్నుకు మాత్రమే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘మెల్ల’ అని అనుకోవచ్చు. పసిపాపలు బలహీనంగా ఉండి, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉండటం వల్ల ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అవే లక్షణాలు కనిపిస్తే వెంటనే పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.కారణాలు... మెల్లకన్ను రావడానికి ఇదీ కారణమని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం, మజిల్ ఇంబాలెన్సెస్, నరాల సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అయితే స్పష్టంగా కనిపించడం అన్నది కాస్త పిల్లలు పెద్దయ్యాక జరుగుతుంటుంది. మెదడుకు సంబంధించిన రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా మెల్ల కన్ను వస్తుంది. త్వరిత నిర్ధారణ చాలా ముఖ్యం చిన్నారుల్లో మెల్ల కన్ను ఉన్నట్లు చూడటంగానీ లేదా అనుమానించడం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. వుూడు నెలలు దాటాక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, తగిన చికిత్స అందించక΄ోతే ఆ కండిషన్ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. ఆ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన విధంగా పిల్లలను కంటి డాక్టర్ ఫాలో అప్‌లో ఉంచాలి. మెల్లకన్నుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించకోకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు / కాంప్లికేషన్కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్ల లోపు దీన్ని చక్కదిద్దకోకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతమయ్యే అవకాశాలూ ఎక్కువే.చికిత్సమెల్ల కన్నుల్లోని అకామడేటివ్, ఈసోట్రోపియా అనే రకాలకు ‘ప్లస్’ కళ్లజోళ్లను డాక్టర్లు సూచిస్తారు. ఒక కన్నులో దృష్టిలోపం ఉండి, ఒక కన్ను నార్మల్‌గా ఉన్నప్పటికీ... దృష్టిలోపం ఉన్న కన్ను క్రమంగా మెల్లకన్నులా మారుతుంది. రానురానూ ఇది ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా) అనే కండిషన్‌కు దారితీస్తుంది. దీనికి కూడా కళ్లజోడు వాడటమే సరైన చికిత్స. అప్పుడప్పుడూ కనిపించే మెల్ల కన్ను (ఇంటర్మిటెంట్ స్క్వింట్) అనేది కంటి కండరాల బలహీనత వల్ల వస్తుంది. కంటి వ్యాయామాల ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కొందరు చిన్నారులు పుట్టుకతోనే మెల్లకన్ను కలిగి ఉంటారు. దీనికి న్యూరాలజిస్ట్ సహాయంతో చికిత్స అందించాల్సి వస్తుంది. వీటన్నింటితోనూ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కంటి వైద్య నిపుణులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఈ శస్త్రచికిత్స చాలా సులువైనదీ, ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. ఇప్పటికీ చాలాచోట్ల మారుమూల పల్లెల్లో మెల్ల కన్ను అదృష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. చిన్నారులు తమ దృష్టి జ్ఞానం కోల్పోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మెల్లకన్నుకు చికిత్స అందించడం అవసరం.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!) -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
మట్టి ప్రమిదలు,నువ్వుల నూనె : ఆరోగ్య లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం!
వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం. ‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్‌తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. -
18 అడుగుల శానిటరీ ప్యాడ్ రూపొందించి..
నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్‌ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రిన్స్ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్ ఆఫ్ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం -
నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్న నీతా అంబానీ..ఏకంగా లక్షలాదిమంది..
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించారు. అందులో భాగంగా సుమారు 50 వేల మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స, 50 వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ కేన్సర్లకు ఉచిత స్క్రీనింగ్ పరీకలు, చికిత్స, అలాగే దాదాపు పదివేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వంటి సేవలను అందజేయనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలా సరసమైన ధరలో తమ రిలయన్స్ ఫౌండేషన్ వైద్యసేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా మిలియన్లమందికి జీవితాలను ప్రసాదించి లెక్కలేనన్ని కుటుంబాల్లో కొత్త ఆశను అందించామని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సేవలందింస్తోన్న తమ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు మరిన్ని సేవలందించేలా ఇలా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంబించామని అన్నారు. మంచి ఆరోగ్యం సంపన్న దేశానికి పునాది అని, అలాగే ఆరోగ్యవంతమైన స్త్రీలు, పిల్లలు సమాజానికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కాగా, రిలయన్స్ పౌండేష్ గత దశాబ్ద కాలంలో 1.5 లక్షల మంది పిల్లలతో సహా 2.75 మిలియన్ల భారతీయులకు వైద్య సేవలను అందించింది. అత్యాధునిక వైద్యం అందించడంలో అత్యుత్తమైన ఆస్పత్రిగా నిలిచింది. అంతేగాదు ఐదు వందలకు పైగా అవయవ మార్పిడి తోపాటు కేవలం 24 గంటల్లో ఏకంగా ఆరు అవయవాల మార్పిడి చేసి బహుళ ప్రాణాలను కాపాడిని ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. ఇది భారతధేశంలోనే నెంబర్ వన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తింపు పొందింది. (చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!) -
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..
అది ఇటీవల కేరళలో రుతూ ముంచేసిన బురద ప్రవాహమే కావచ్చు... లేదా అప్పట్లో చార్ధామ్ లో తుడిచిపెట్టేసిన వరద ప్రవాహమే కావచ్చు. అలనాటి సునామీ లేదా ఉత్తర కాశీ భూకంపమే కావచ్చు... ఇంకా యుద్ధ ఘటనలు.. దాడి లేదా దౌర్జన్యం, లైంగిక దాడి, ముష్కరులు మూకుమ్మడిగా విరుచుకుపడటం, గాయాలపాలు చేయడం, దోపిడీ... ఇలా ఏదైనా సరే అది మానసికంగా షాక్‌కు గురిచేయవచ్చు. ఇవే కాదు... తుఫాను, భారీ అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు, కుటుంబసభ్యులెవరైనా దూరం కావడం, హత్య, ఆత్మహత్య వంటి ఘటనల్లో షాక్‌కు గురవుతారు. షాక్ తర్వాత బాధితులను నిస్తేజంగా మార్చే పరిస్థితిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ (పీటీఎస్డీ) అంటారు. ఈ ‘పీటీఎస్డీ’ గురించి అవగాహన కోసమే ఈ కథనం.పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) బారిన పడ్డ వ్యక్తులు సురక్షితంగా ఉన్నప్పుడూ లేదా అలాంటి పరిస్థితులేమీ లేని సమయాల్లో కూడా తీవ్రంగా భయపడుతుంటారు. మిగతావాళ్లతో పోలిస్తే స్త్రీలు, పిల్లలు ఈ షాక్‌కు గురయ్యే ఛాన్స్ ఎక్కువ. పిల్లలైతే... ఎప్పుడో వదిలేసిన పక్క తడపడం వంటి అలవాటు పునరావృతం కావడం మాటలు మరచి΄ోవడం, మాటల కోసం తడుముకోవడం ∙హాయిగా, ఆడుకోలేక΄ోవడం ఆత్మీయులైన పెద్దలను విడవకపోవడం. బాధితులతో వచ్చే ముప్పు... తమను తాము ఎంతో నిస్సహాయులుగా పరిగణించి బాధపడటం తీవ్రమైన భయాలతో ఎవరితోనూ కలవక, ఒంటరిగా ఉండిపోవడం తమను తాము బాధించుకోవడం, ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఒక్కోసారి ఎదుటివాళ్లపై దాడికి దిగడం. నిర్ధారణ... బాధితుల లక్షణాలనూ వాళ్ల మెడికల్ హిస్టరీని బట్టి బాధితుల స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను రాబట్టడం ద్వారా ∙కొన్ని మానసిక పరీక్షల ద్వారా. మేనేజ్మెంట్ / చికిత్స... సపోర్టివ్ థెరపీ, రీ ఎష్యూరెన్స్, యాక్టివ్ లిజనింగ్, కోపింగ్ స్కిల్స్ నేర్పడం వంటి చికిత్సలు.ఎక్స్పోజర్ థెరపీ : ఒకేసారి ఆ సంఘటనను గుర్తు చేయకుండా మెల్ల మెల్లగా ఆ సంఘటన గురించి వివరిస్తూ, ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి మెల్ల మెల్లగా తీసుకెళ్తూ, ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదనీ, ఇకపై అక్కడ ఎంతమాత్రమూ హాని జరగదనే భరోసా కల్పించడం. లక్షణాలు... ఆ సంఘటన మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లే ఫీల్ కావడం లేదా ఆ సంఘటనలో ఉన్నట్లే ఫీలవుతారు. నిద్రలో పీడకలలు. అందులో అదే సంఘటన జరుగుతున్నట్లుగా కలలు వస్తాయి ఆ సంఘటన గురించి తలచుకోడానికి, మాట్లాడానికి ఇష్టపడకపోవడం ఎంత వద్దనుకున్నా మాటిమాటికీ ఆ సంఘటనల తాలూకు ఆలోచనలే రావడంసంఘటన తాలూకు ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం ఆ టైమ్‌లో తమతో ఉన్న వాళ్లను కలవకపోవడం లేదా తప్పించుకుని తిరగడం ∙మూడ్స్ వేగంగా మారిపోవడం ∙ఒక్కోసారి ఆ సంఘటన తాలూకు ఎలాంటి జ్ఞాపకమూ లేకపోవడం ఆ సంఘటన గురించిన భయాలు, విపరీతమైన కోపం, సిగ్గుగా ఫీల్ కావడం ప్రతికూల ఆలోచనలే వస్తుండటం సంఘటన పట్ల తనను తానుగానీ లేదా ఇతరులను గానీ నిందిస్తూ ఉండటం ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరి గా ఉండటం ఒకప్పుడు తనకు సంతోషం కలిగించిన అవే పనులు ఇప్పుడు ఏమాత్రం ఆనందం ఇవ్వక΄ోవడం పరిసరాల పట్ల చాలా ఎక్కువ అనుమానాస్పదంగా ఉండటం ఏ విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, నిద్ర సమస్యలు (నిద్రపట్టక΄ోవడం లేదా ఎప్పడూ నిద్రలోనే ఉండటం).కాగ్నిటివ్ రీ కన్స్ట్రక్షన్ ఆ సంఘటనలో బాధితుల ప్రమేయం లేదనీ, ఆ సంఘటన గురించి అపరాధభావనతో ఉండాల్సిన అవసరం లేదనీ, అప్పుడున్న మనుషుల నుంచి తప్పించుకుని తిరగాల్సిన పనిలేదనే నమ్మకాన్ని కల్పించడం. ఇలా సైకోథెరపీ చేస్తూ, ఆత్మహత్య ఆలోచనలనుంచి బయటపడేసే మందుల తోపోటు సెలెక్టివ్ సెరిటోనిన్ రీ–ఆప్టేక్ ఇన్హిబిటార్స్, సెరిటోనిన్ నార్ ఎపీనెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటార్స్, నార్ ఎపీనెఫ్రిన్–డోపమైన్ రీ అప్టేక్ ఇన్హిబిటార్స్ వంటి మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స అందిస్తారు. డా. శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్ సైకియాట్రిస్ట్(చదవండి: బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్) -
ఔషధాల సిరి ఉసిరి : జుట్టు, చర్మ సంరక్షణలో భళా!
ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు. మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. జుట్టుకుఆమ్లా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్‌ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది. చర్మం కోసంసహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.యాంటీ ఏజింగ్ పవర్హౌస్లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్‌తో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్‌ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేయవచ్చు. -
అనారోగ్య కారణాల వల్లే సినిమాలకు బ్రేక్
-
యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!
యాపిల్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్ గాక అందులో చాలా వెరైటీలు ఉంటాయననే విషయం తెలుసా. వీటిని ఎప్పుడైన తిని చూశారా..!. తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా త్వరగా తెలుసుకుని ట్రై చేసి చూడండి. యాపిల్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక యాపిల్ ఎన్నో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి యాపిల్స్‌లో మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి. అవేంటంటే..అంబ్రి యాపిల్జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబ్రి రకం యాపిల్. ఒకప్పుడూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాపిల్ రకంలో ఇది ఒకటి. దీనిని కాశ్మీర్ రాజు అనిపిలుస్తారు. ఇది చక్కటి ఆకృతి, తీపి వాసనతో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పాడవ్వకుండా ఉండటంలో ప్రసిద్ధి చెందినవి. వీటటిని డెజర్ట్లోల ఉపయోగిస్తారు. చౌబత్తియా అనుపమ్ ఇది ఎరుపురంగులో పండిన యాపిల్‌లా ఉంటుంది. మద్యస్థ పరిమాణంఓ ఉంటుంది. ఇది హైబ్రిడ్ యాపిల్ రం. వీటిని ఎర్లీషాన్బరీ, రెడ్ డెలిషియన్ మధ్య క్రాస్ చేసి పడించిన యాపిల్స్. దీన్ని ఉత్తరాఖండ్‌లో విస్తారంగా సాగు చేస్తారు. గోల్డెన్ ఆపిల్దీన్ని గోల్డెన్ డెలిషియస్ అని కూడా పిలుస్తారు. పసుపు పచ్చని రంగుతో మృదువైన ఆకృతిలో ఉంటాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇప్పుడు వీటిని హిమచల్ ప్రదేశ్‌లో కూడా పండిస్తున్నారు. తేలికపాటి రుచితో మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా యాపిల్ సాస్, యాపిల్ బటర్, జామ్‌ల తయారీకి అనువైనది. గ్రానీ స్మిత్యాపిల్కి పర్యాయపదంలా ఉంటాయి ఈ గ్రానీ స్మిత్ యాపిల్స్. వీటిని హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే భారతదేశంలో పెరిగే ఈ రకం యాపిల్స్ మమ్రాతం ఇక్కడ ప్రత్యేక వాతావరణానికి కాస్త తీపిని కలిగి ఉండటం విశేషం. వీటిని ఎక్కువగా సలాడ్లు, జ్యూస్‌లు, బేకింగ్ పదార్థాల్లో ఉపయోగిస్తారు. సునేహరి యాపిల్ఇది కూడా హైబ్రిడ్ యాపిల్‌కి సంబంధించిన మరో రకం. అంబ్రి యాపిల్స్ క్రాసింగ్ నుంచి వస్తుంది. యాపిల్ క్రిమ్సన్ స్ట్రీక్స్లా పసుపు తొక్కను కలిగి ఉంటుంది. ఆకృతి క్రంచీగా ఉంటుంది. తీపితో కూడిన టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. పార్లిన్ బ్యూటీ ఈ యాపిల్స్ భారతదేశంలోని తమిళనాడుకి చెందింది. ఈ రకానికి చెందిన యాపిల్స్ కొడైకెనాల్ కొండల్లో ఉండే వెచ్చని శీతాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ రకం యాపిల్స్ వస్తుంటాయి. ఇవి మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణం వరకు వివిధ ఆకృతుల్లో లభిస్తాయి.ఐరిష్ పీచ్అత్యంత చిన్న యాపిల్స్. ఇవి లేత పసుపు గోధుమ ఎరుపు రంగులతో ఉంటుంది. పరిమాణంలో చిన్నది. విలక్షణమైన తీపి టార్ట్ రుచిని కలిగి ఉంటుంది. వీటిని పచ్చిగానే తీసుకుంటారు. అధిక పీచుతో కూడిన యాపిల్స్ ఇవి. స్టార్కింగ్ ఈ యాపిల్స్ తేనె లాంటి సువాసనతో అత్యంత తియ్యగా ఉటాయి. వీటని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. వీటిని తాజాగా తింటారు. అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా జ్యూస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఎనిమిది రకకాల యాపిల్స్ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రకం యాపిల్ రుచి, ఆకృతి పరంగా మంచి పోషకవిలువలు కలిగినవి. ఏ యాపిల్స్‌లో ఏదో ఒకటి తీసుకునేందుకు ప్రయత్నించినా.. మంచి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు. -
మెడ పట్టేసిందా..? ఇలా చేస్తే నొప్పి మాయం..
చాలామందికి నిద్రలోగాని, లేదా ప్రయాణంలో గానీ లేదా సుదూర ప్రయాణాల తర్వాత గాని మెడ పట్టుకుంటుంది. ఇలా మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ (wry neck) అంటారు. ఇలా మెడ పట్టేస్తే, నిద్రలో దానంతట అదే వదిలేస్తుందని, లేదా తలదిండు తీసేసి పడుకోవడం వల్ల త్వరగా తగ్గుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా సర్దుకునేందుకు పాటించాల్సిన సూచనలివి...మెత్తటి టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా చుట్టి (రోల్ చేసుకుని) మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి. అంటే తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా... భుజాలకు కూడా సపోర్ట్ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది. వ్యాయామాలు చేసేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. పైగా మెడ పరిస్థితి సర్దుకునేందుకు ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా గబుక్కున ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు. కొందరు సెలూన్ షాప్‌లో మెడను రెండుపైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇలాంటి మొరటు పద్ధతుల్ని ఏమాత్రం అనుసరించకూడదు. దీనివల్ల పరిస్థితి మరింతగా ప్రమాదకరంగా మారవచ్చు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ లేదా ప్రమాదం లేని నొప్పినివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యతో అప్పటికీ ఉపశమనం కలగకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. (చదవండి: డార్క్ చాక్లెట్స్‌తో గుడ్ మూడ్స్... గుడ్ హెల్త్!) -
డార్క్ చాక్లెట్స్‌తో గుడ్ మూడ్స్... గుడ్ హెల్త్!
డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనేది ఇప్పటికే పలు పరిశోధనల్లో తెలింది. అదే విషయం దక్షిణ–కొరియన్ పరిశోధనల్లో మరోసారి వెల్లడైంది. చాక్లెట్స్లోని కొన్ని పోషకాలు గట్ బ్యాక్టీరియా / గట్ మైక్రోబియమ్ పెంచడం వల్ల మంచి వ్యాధి నిరోధకత పెరుగుతుందనీ, అలాగే... తక్కువ మోతాదులో చక్కెర ఉండే డార్క్ చాక్లెట్స్ తినేవారిలో వాటిలో ఉండే ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ వల్ల కొన్ని రకాల కేన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక ఆరోగ్య సమస్యల నివారణ జరుగుతుందంటూ దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... డార్క్ చాక్లెట్లు మూడ్స్‌ను బాగుపరచి తినేవారు ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంచేందుకు సహయపడతాయని తేలింది. ఇక డార్క్చాక్లెట్స్ తినేవారి మల పరీక్షల్లో తేలిన విషయం ఏమిటంటే... వాళ్ల పేగుల్లో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్ బాక్టీరియా కారణంగానే కడుపు ఆరోగ్యం బాగుండటంతో పాటు వాళ్ల మూడ్స్ మరింత మెరుగయ్యాయని తేలింది. ఈ ఫలితాలన్నీ ‘‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. (చదవండి: అలియా లాంటి ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం..!)