వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్‌నెస్‌తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్‌నెస్‌తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్‌నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..
ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్‌లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు.
ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్‌గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.
బాల్యం మొదలైంది అలా..
ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు.
అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్‌నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్‌ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు.
చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్‌ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్‌తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్‌ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ.
ఆండి యువతరానికి ఇచ్చే సలహా..
దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్‌నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..
శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది.
అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండి
ఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు.
అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం.
ఇంట్లో లేదా జిమ్‌లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో.
(చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..)


