Old man
-
చచ్చినోడు తిరిగొచ్చాడు
సేలం: కావేరి నదిలో మునిగి మృతి చెందాడని భావించి అంత్యక్రియలు చేసి దహనం చేయబడిన స్థితిలో ఆ వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చిన సంఘటన మైలాడుదురైలో కలకలం రేపింది. మైలాడుదురై జిల్లా తరంగంపాడి తాలూకా మేలప్పాది ప్రాంతంలో గత డిసెంబర్ 22వ తేది గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కావేరి నదిలో తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అప్పుడు మురుదూర్ లక్ష్మీ నారాయణపురానికి చెందిన సెల్వరాజ్(62) అని తెలిసింది. దీంతో సెంబనార్కోవిల్ పోలీసులు సెల్వరాజ్ భార్య శాంతిని కలుసుకుని మృతదేహాన్ని గుర్తించమని కోరారు. అనంతరం ఆ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి తర్వాత శాంతికి అప్పగించారు. అనంతరం కుటుంబీకులు సెల్వరాజ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి దహనం చేశారు. ఈ స్థితిలో ఆదివారం అకస్మాత్తుగా సెల్వరాజ్ మరుదూర్ గ్రామానికి తిరిగి వచ్చాడు. చనిపోయాడని భావించిన సెల్వరాజ్ ప్రాణాలతో తిరిగి రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పుడు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసి అది సెల్వరాజ్‌గా భావించినట్టు తెలిసింది. "என்னோட இறுதி சடங்கு படையலுக்கு சரக்கு எங்கே?".. சுடுகாட்டில் எரிக்கப்பட்டவர் உயிருடன் வந்ததால் அதிர்ச்சி..!#Mayiladuthurai | #Death | #Funeral | #OldMan | #Crematorium | #PolimerNews pic.twitter.com/lUfoBFJvev— Polimer News (@polimernews) January 6, 2025 -
World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
లండన్: ప్రపంచంలోనే అత్యంత కురు వృద్ధుడిగా తొమ్మిది నెలలపాటు కొనసాగిన జాన్ ఆ్రల్ఫెడ్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 112 ఏళ్లు. లివర్‌పూల్‌లోని వృద్ధాశ్రమంలో సోమ వారం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం తెలిపింది. టిన్నిస్వుడ్ లివర్‌పూల్‌లో 1912 ఆగస్ట్ 26వ తేదీన జని్మంచారు. ఆగస్ట్‌లో 112వ జన్మదినం జరుపుకున్నారు. ఇంత సుదీర్ఘ కాలం జీవించడం కేవలం అదృష్టమని చెప్పే టిన్నిస్వుడ్.. మనం ఎక్కువ కాలం జీవించాలా, స్వల్ప కాలమా అన్నది మన చేతుల్లో లేదని ఆయన తెలిపేవారని కుటుంబం గుర్తు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా టిన్నిస్వుడ్ పేరు ఈ ఏడాది ఏప్రిల్‌లో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. బ్రిటిష్ ఆర్మీ పే కార్ప్స్లో సైనికుడిగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రెండు ప్రపంచయుద్ధాలు ఆయన జీవితకాలంలోనే జరిగాయి. టిన్నిస్‌వుడ్‌కు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మునిమనవలు ఉన్నారు. భార్య బ్లోడ్వెన్ 1986లో చనిపోయారు. -
60 ఏళ్ల వృద్ధుడితో యువతి వివాహేతర సంబంధం..చివరికి..!
అన్నానగర్: వేలచ్చేరిలోని ఓ హాస్టల్లో వృద్ధుడితో కలిసి ఉన్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు.. చెన్నైలోని వేలాచ్చేరి తరమణి 100 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో 60 ఏళ్ల వృద్ధుడితో కలిసి ఉంటున్న 27 ఏళ్ల యువతి ఛాతీ నొప్పితో మృతి చెందినట్లు వేలచ్చేరి పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయ పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో వృద్ధుడు చిందాద్రిపేటకు చెందిన జ్యోతి (60) అని తేలింది. ఇతడికి విల్లివాకానికి చెందిన శశికళ(50)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోయింది. శశికళ రెండో కూతురు రమ్య(27). భర్త నుంచి విడిపోయి తల్లి ఇంట్లో ఉంటోంది. ఈమెకు జ్యోతితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఇద్దరూ హోటల్‌కి వచ్చి రూమ్ తీసుకున్నారు. రమ్యకు మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది. హోటల్ కు చేరుకోగానే 6 సీసాల బీరు కొన్నారు. రమ్య రాత్రి 4 బీర్లు తాగింది. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు.సోమవారం ఉదయం మళ్లీ రమ్య 2 సీసాల బీరు తాగిన తర్వాత ఛాతీ నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రమ్య మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వేలాచ్చేరి పోలీసులు రమ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య చేశారా? లేక అధిక మోతాదులో మద్యం తాగడం వల్ల చనిపోయిందా? మరేదైనా కారణమా? అనేది తేలుతుందని పోలీసులు తెలిపారు. -
కొలెస్ట్రాల్ కంట్రోల్‌తో సెంచరీ కొట్టేశాడు! ఎలాగంటే..
గోర్డాన్ గ్రెన్లే హంట్ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్‌లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్‌ఫర్డ్‌లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్ లైలాండ్ రాయల్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు. ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్ చేపలు, చిప్స్ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్‌లోని లార్క్సెలీస్ రెంట్ హోమ్‌లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్ చెబుతున్నాడు.తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్‌గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.కొలస్ట్రాల్ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..కొలస్ట్రాల స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సాల్మన్ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్లో 25 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్, విటమిన్ బీ12, సెలీనియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, థియామిన్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, ఫాస్ఫరస్ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..నట్స్: బాదం, వాల్నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడోలు: మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్‌ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!) -
శివాజీరావు 90.0
రామంతాపూర్: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని సోమరిపోతులైన యువకులను ఉద్దేశించి అన్నాడో మహా కవి. దానిని సవరించుకుంటూ కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అని శివాజీరావును చూస్తే అనిపిస్తుంది. 90 ఏళ్ల వయస్సులో మనకు తెలిసి చాలా మంది మంచానికే పరిమితమైపోతారు. అనేక అనారోగ్య సమస్యలో ఇబ్బందిపడుతుంటారు. కాని శివాజీరావును చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఎందుకంటే ఇప్పటికీ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, కళ్లు మసకబారడం వంటి సమస్యలేవీ ఆయన దరిదాపుల్లోకి రాలేకపోయాయి అంటే ఆశ్చర్యపోతారేమో! మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన శివాజీరావు 30 ఏళ్ల కిందట రామంతాపూర్ శారదానగర్‌కు తన కుటుంబంతో సహా వచ్చి స్థిరపడ్డారు. శారదానగర్ ప్రధాన రహదారిలో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ చెప్పులు కుట్టే పనిలో బిజీగా ఉంటారు. మధ్యాహ్నం ఓ గంట సేపు నిద్రపోతారు. స్కూల్ పిల్లల షూస్, దివ్యాంగుల చెప్పులకు మాత్రం సగం రేటే తీసుకుంటారు.ఆరోగ్య రహస్యం నడక, జొన్నరొట్టే.. ఈ వయసులో కూడా తాను చెప్పులు కుట్టే వృత్తి నిర్వహిస్తున్నారు. తన వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకులు బస్సులో వెళ్లి తెచ్చుకుంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటని ప్రశి్నస్తే నడక మూడు పూటలా జొన్న రొట్టెను ఆహా రంగా తీసుకుంటానని, ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే అని సమాధానం ఇచ్చారు. రామంతాపూర్‌లో నడక ప్రారంభించి పాలిటెక్నిక్ కాలేజ్ వరకూ నడుస్తానని తెలిపారు. -
ఓ వ్యక్తి గొంతులో అసాధారణ పరిస్థితి..కంగుతిన్న వైద్యులు
పలువురు వింతగొలిపే సమస్యలతో బాధపడుతుంటారు. ఒక్కోసారి అవి వైద్య పరిజ్ఞానానికే అందని విధంగా ఉంటాయి కూడా. అలాంటి వింతైన సమస్యతో బాధపడుతున్నాడు 52 ఏళ్ల వ్యక్తి. అయితే అనుహ్యంగా ఓ దురలవాటుకి దూరంగా ఉండటంతో అతని సమస్యను పరిష్కరించడాని వైద్యులకు మార్గం సుగమమయ్యింది. ఇంతకీ అతను ఎలాంటి అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే..52 ఏళ్ల ఆస్ట్రియన్ అనే వ్యక్తి చాలా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరగని దగ్గు, తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్ప్రతిలో చేరాడు. అక్కడ వైద్యులు బ్రోంక్స్కోప్తో జరిపిన వైద్య పరీక్షల్లో..ఆ వ్యక్తి గొంతులోని పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఊహించని రీతిలో అక్కడ జుట్టు పెరగడం చూసి గందరగోళానికి గురయ్యారు. నిజానికి ఆ వ్యక్తికి పదేళ్ల వయసులో ట్రాకియోటోమీ చేయించుకున్నాడు. ట్రాకియోటోమీ అంటే.. మెడ వెలుపలి నుంచి శ్వాసనాళంలోకి (విండ్‌పైప్) ఓపెనింగ్ సృష్టించడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి, ఆక్సిజన్ చేరుకోవడంలో సహాయపడే ప్రక్రియ.ట్రాకియోటోమీ ఉన్న వ్యక్తి ఓపెనింగ్‌లో చొప్పించిన ట్రాకియోటోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాడు. దీని కారణంగా అతని శ్వాసనాళంలో ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ అతని చెవి నుంచి తీసిన చర్మం, మృదులాస్థితో అంటుకట్టుట పద్ధతిలో ఆ ఓపెనింగ్‌ని స్థిరీకరించేలా చేశారు వైద్యులు. సరిగ్గా ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో వెంట్రుకలు పెరగడం మొదలయ్యింది. అవి ఏకంగా ఆరు నుంచి తొమ్మిది వరకు.. సుమారు రెండు అండుళాల మేరు పొడవుగా ఉన్నాయి. అందువల్ల అతని గొంతు బొంగరుపోయి, దగ్గు వంటి సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ వెంట్రుకలను తొలగంచే ప్రక్రియ చేపట్టారు. ఇలా సదురు వ్యక్తి 14 ఏళ్ల పాటు ఆస్పత్రిని సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అతడే తనకున్న ధూమపానం దురలవాటుకి దూరంగ ఉంటూ ఉండటంతో అనూహ్యంగా వాటి పెరుగుదల తగ్గింది. వైద్యులు కూడా అతడిలో వచ్చిన సానుకూల మార్పుకి అనుగుణంగా ఎండోస్కోపిక్ ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ అనే కొత్త విధానానంతో జుట్టు పెరుగుదల శాశ్వతంగా చెక్కుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే.. మనకున్న దురలవాట్లే మనలను అనారోగ్యం పాలు జేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ . (చదవండి: ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!) -
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో వృద్దుడి ఆత్మహత్య
ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్దుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్‌కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్‌గా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మోదీపై పోటీ: రామ్‌కుమార్ ప్రత్యేకత ఏంటంటే..
ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసిలో ఓ వృద్ధుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు రామ్‌కుమార్ వైద్య. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా ఇందర్‌ఘడ్ వాసి. చిన్న కిరాణా దుకాణం నడుపుతుంటాడు. మోదీపై పోటీతో మాత్రమే కాదు.. నామినేషన్ టైంలోనూ ఆయన వార్తల్లోకి ఎక్కారు. వారణాసిలో పోటీ కోసం రూ.25,000 రూపాయి నాణేలు డిపాజిట్ చేసి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చురాన్ బుదియా అమ్ముతూ వేలల్లో నాణేలను పోగేసి వాటినే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వాటిని చూసి వాళ్లు కంగు తిన్నారు. కిందామీదా పడి నాణేలను లెక్కించారు. మంగళవారం నామినేషన్ వేసేందుకు వైద్య 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ వారణాసి వచ్చాడు. ఆయనకు ప్రతిపాదకులుగా వారణాసిలోని కొందరు ఆటోడ్రైవర్లు సంతకాలు చేశారు. ఎన్నికల బరిలో దిగడం ఆయనకు ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా పలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం బరిలో దిగుతున్న పార్లమెంట్ స్థానాన్ని మార్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.వారణాసి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేందుకే తాను అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. ప్రధాని అయినా సరే, మోదీకి గట్టి పోటీ ఇస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తుండటం విశేషం. మిమిక్రీ సంచలనం, ప్రముఖ హాస్య కళాకారుడు శ్యామ్ రంగీలా కూడా వారణాసిలో మోదీపై ఇండిపెండెంట్‌గా బరిలో దిగడం తెలిసిందే. కానీ ఆయన నామినేషన్ బుధవారం తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పట్లాగే అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. వారణాసిలో జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే.. వయసెంతంటే!
ఇంతవరకు ప్రపంచంలో అత్యంత వృద్ధుల జాబితాను చూశాం. ఇటివల సుదీర్థకాలం జీవించి ఉన్న వృద్ధులను ఓ ఐదుగురి గురించి తెలుసుకున్నాం. వారిలో కొందరూ గిన్నిస్ రికార్డులకెక్కారు కూడా. వాళ్లందర్నీ కాలదన్నేలా ఎక్కువ కాలం జీవించిన మరో వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఇంతవరకు గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుక్ను ఆ వృద్ధుల కంటే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అతడే. మంచి ఆరోగ్యంతో జీవించి ఉన్న వృద్ధుడు. అతడు పుట్టింది ఎప్పుడో వింటే ఆశ్చర్యపోతారు. అన్ని దశాబ్దాలు ఎలా జీవించాడా? అనిపిస్తుంది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే.. హువానుకోలోని సెంగ్రల్ పెరువియన్ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్. అతడి వయసు 124 ఏళ్లు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సుదీర్ఘకాలం జీవించిన వృద్ధుడిగా ధృవీకరించింది. అత్యంత పురాతనమైన వ్యక్తి కూడా అని తెలిపింది. అన్నేళ్లు అబాద్ జీవించడానికి అతడి అనుసరించిన జీవనశైలేనని చెబుతోంది అక్కడి ప్రభుత్వం. ప్రశాంతతకు పెద్ద పీఠ వేస్తూ ఆనందంగా ఉండటమే గాక అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతాడని మెచ్చుకుంది. ఈ ఏప్రిల్ 5న తన 124వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. అంతేగాదు పెరువియన్ అధికారులు అతడే అత్యంత వృద్ధ వ్యక్తి అని గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తుల చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పత్రాలను కూడా సమర్పించినట్లు తెలిపారు. తప్పకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ దరఖాస్తులను స్వీకరిస్తుందని ధీమాగా చెప్పారు అధికారులు. అయితే అక్కడ ప్రభుత్వం ఈ విషయాన్ని 2019లో గుర్తించింది. ప్రభత్వ పెన్షన్ పొందుతూ వృద్ధాశ్రమంలో ఉండటంతో అతని ఐడీతో సహా ఈ విషయాన్ని అదికారులు గుర్తించి వెల్లడించటం జరిగింది. అతడి ఆరోగ్య రహస్యం ఏంటంటే.. అబాద్ తన డైట్లో మంచి పండ్లు ఉండేలా చూసుకుంటాడు. అలాగే గొర్రె మాంసం ఇష్టంగా తింటాడట. పెరువియన్ సంప్రదాయం ప్రకారం తినే కోకా ఆకులను ప్రతిరోజు నమలడం అలవాటు చేసుకున్నానని. బహుశా ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి అది కూడా ఒక కారణమని అబాద్ చెప్పారు. అంత క్రితం గిన్నిస్ రికార్డులకెక్కిన వారి వయసు.. ఇంతకు మునుపు గిన్నిస్ రికార్డులకెక్కిన వారి వయసు పరిశీలిస్తే..114 ఏళ్ల జీవించిన వెనిజులా వ్యక్తి మరణాంతరం గిన్నిస్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం జీవించి గిన్నిస్ రికార్డులకెక్కిన వృద్ధుడి వయసు 111 ఏళ్లు. అతనితోపాటు ఇప్పటి వరకు జీవించి ఉన్న వృద్ధ మహిళ వయసు కేవలం 117 ఏళ్లు మాత్రమే. అయితే ఇప్పుడు పెరుకి చెందిన అబాద్ అనే వృద్ధుడే వాళ్లందర్నీ వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డులకెక్కడం ఖాయం కదూ..! (చదవండి: ఈ పువ్వులతో మధుమేహానికి చెక్ ! ఎలాగంటే..?) -
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్‌కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్‌ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్‌తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్‌ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్‌ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్‌లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
తాత తగ్గేదేలే..
-
Mumbai Airport: వీల్ చైర్ లేక గుండెపోటుతో వృద్ధుడి మృతి
ముంబై : నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఓ వీల్‌చైర్ అడిగాడు. వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు. దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘వీల్ చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవు. ఇందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదీ చదవండి.. 11 మంది సజీవ దహనం -
కుర్చీ తాత అరెస్ట్ బండారం మొత్తం బట్టబయలు చేసిన వైజాగ్ సత్య
-
93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!
ఓ వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా దేహ ధారుడ్యంతో పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారు. అతడి శరీరాకృతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి గల కారణాలేంటని అధ్యయనం చేసే పనిలో పడ్డారు పరిశోధకులు. ఐరిష్కి చెందిన 93 ఏళ్ల రిచర్డ్ మెర్గాన్ అనే వ్యక్తి చూడటాని 40 ఏళ్ల వ్యక్తిలా చురుగ్గా ఉన్నాడు. పైగా 70 ఏళ్ల వయసులో రోయింగ్(పడవ రేస్)ను ప్రారంభించినప్పటికీ నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడిని చూస్తే యువకుడి మాదిరిగా మంచి శరీరాకృతితో ఉంటాడు. శాస్త్రవేత్తలు సైతం అతడి హృదయ స్పందన రేటుని చూసి ఆశ్చర్యపోతున్నారు. మోర్గాన్ ఫిట్నెస్ ప్రయాణం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు అధ్యయనం చేయడంతో ఒక్కసారిగా అతను వార్తల్లో నిలిచాడు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అతను మనందరికీ ప్రేరణ అని చెబుతున్నారు. అతని జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను పరిశీలించింది పరిశోధకుల బృందం. అంతేగాదు అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం, హృదయ స్పందన రేటు, తదితర వాటిని రోయింగ్ ఎర్గోమీటర్తో కొలిచారు. అందుకు సంబంధించిన అధ్యయనం గురించి గత నెలలో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యింది. ఇక మోర్గాన్ తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చానని చెప్పుకొచ్చారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని తెలిశాక ఇక ఆపలేదని, అదే ఈ రోయింగ్ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు మోర్గాన్. వ్యాయామం మంచి ఫిట్నెస్గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్యా వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్‌పై జరిపిన పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. ఇక అతను మంచి ఫిట్‌నెస్‌లో.. వ్యాయామం స్కిప్ చేయకపోవడం, బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారం తదితరాలు తన రోజూ వారీ జీవశైలిలో ఉండే ప్రాథమిక మూల స్థంభాలని చెప్పారు పరిశోధకులు. ఇంకేందుకు ఆలస్యం వయసుతో సంబంధం లేకుండా చక్కగా మంచి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండటమే గాక వృధాప్య ప్రభావం పడకుండా చూసుకోండి. (చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడికి చూపించిన ప్రధాని మోదీ!) -
ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!
ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే పిచ్చెక్కిపోతుంది. బాబోయ్! అనిపిస్తుంది. అలాంటిది ఎవ్వరూ ఉండని ఊరిలో ఒక్కడే ఉండటమా?. ఆ ఊహ కూడా ఇష్టపడం. కానీ ఇక్కడొక వృద్ధుడు ఒక్కడే ఒంటిరిగా నివశిస్తున్నాడు. ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. పైగా అతడిపై పలు కథనాలు వెలువడటంతో నెట్టింట అతడి కథ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే.. ఎవరూ లేని ఆ ఊళ్లో అతనొక్కడే ఉంటున్నాడు. పాతికేళ్లుగా నీటమునిగిన ఆ ఊరు, తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడింది. అప్పటి నుంచి ఈ పెద్దాయన ఒక్కడే ఒంటరిగా ఆ ఊళ్లో ఉంటున్నాడు. నీటమునిగి నరసంచారానికి దూరమైన ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరిస్ ప్రావిన్స్ పరిధిలోని ఊరది. ఒకప్పుడు ఆ ఊరు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. అప్పట్లో ఆ ఊళ్లో దాదాపు రెండువేల మంది ఉండేవారు. ఏటా ఐదువేల మందికి పైగా పర్యాటకులు వచ్చి వెళుతుండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్ 1985లో వచ్చిన వరదల కారణంగా ధ్వంసమైంది. ఊళ్లోకి నీరు చేరడంతో, ఊరు కనిపించకుండా పోయింది. పాతికేళ్లుగా ఈ ఊరు నీటి అడుగునే ఉంది. ఆ తర్వాత ఇక్కడ అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. నీరంతా ఆవిరైపోవడంతో 2009లో శిథిలావస్థలో ఉన్న ఊరు బయటపడింది. ఇదే ఊరికి చెందిన పాబ్లో నోవాక్ అనే ఈ పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊళ్లో ఎవరూ లేకపోయినా, అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వస్తున్నాడు. తొంబైమూడేళ్ల పాబ్లో నోవాక్ ఒంటరిగా బతుకుతున్న సంగతి ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషి’గా అభివర్ణిస్తూ సీఎన్ఎన్ చానల్ ఇతడిపై ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మిగిలిన చానెళ్లు, పత్రికల్లోనూ ఇతడిపై కథనాలు వెలువడ్డాయి. (చదవండి: కితకితలు పెట్టగానే నవ్వు తన్నుకుంటూ ఎలా వస్తుందో తెలుసా! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక..
అది 2023, జూలై 6.. 70 ఏళ్ల వృద్ధుడు దట్టమైన అడవిలో దారి తప్పాడు. అతనితోపాటు వచ్చినవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి 48 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మనదేశంలోని గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు.. గుజరాత్‌లోని గిర్నార్ అడవుల ఎంతో దట్టంగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా దారి తప్పారంటే ఇక అంతే సంగతులు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా పూప్ తాలూకాలోని కుప్రాలా గ్రామానికి చెందిన మదన్మోహన్ మురళీధర్ జైన్(72) ఈ ఏడాది జూలై 6వ తేదీన 20 మంది సభ్యుల బృందంతో పాటు జునాగఢ్‌లోని గిర్నార్‌కు విహారయాత్రకు వచ్చాడు. వారంతా గిర్నార్‌లోని అంబాజీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారంతా అక్కడి జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే మురళీధర్.. బృంద సభ్యుల నుంచి వినిపోయాడు. ఆ సమయంలో అతనికి దాహం వేయడంతో నీటి కోసం వెదుకుతూ వెళ్లాడు. ఒకచోట ఊట నీరు తాగుతుండగా అతని కాలు జారింది. ఆ నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాడు. కాస్త తేరుకుని లేచి నిలబడే సమయానికి అడవి మధ్యలోకి వచ్చేశాడు. నీటిలో కొట్టుకుపోయిన సందర్భంలో అతని పాదాలకు, తలకు ముళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. అటువంటి దుర్భర పరిస్థితిలో మురళీధర్ తనను కాపాడమంటూ ఎనిమిది గంటల పాటు కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతని ఆరుపులు అరణ్యరోదనగా మారాయి. కొద్దిసేపటికి మురళీధర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి అడవి పందుల గుంపు అతనికి అతి సమీపం నుంచి వెళుతోంది. వాటిని చూసినంతనే అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. అయితే అవి అతనిని ఏమీ చేయకుండా విడిచిపెట్టడం విశేషం. మరోవైపు మురళీధర్ బృంద సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 33 మంది సభ్యులు గల ఎస్డిఆర్ఎఫ్, పోలీసు, అటవీ శాఖ హోంగార్డుల బృందం అడవిలో గాలింపు చేపట్టింది. ఎట్టకేలకు 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం వారు మురళీధర్‌ను గుర్తించి కాపాడారు. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..
వాషింగ్టన్: మానవునిలో పెద్ద పేగు దాకా ఏదైనా ఆహారం వెళ్లి దంటే అప్పటికే అది జీర్ణమైందని అర్ధం. అయితే అమెరికాలో ఓ పెద్దాయన పెద్దపేగులో ఒక ఈగ చిధ్రమవకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలోకాకుండా పేగు గోడలకు అతుక్కుని ఉన్న ఈగను చూసి అక్కడి వైద్యులు అవాక్క య్యారు. జీర్ణాశయం, చిన్నపేగును దాటి కూడా ఈ కీటకం ఎలా జీర్ణమవకుండా ఉందబ్బా? అని వైద్యులు పలు విశ్లేషణలు మొదలుపెట్టారు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ వింత ఘటన జరిగింది. ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటెరాలజీ’లో సంబంధిత వివరాలతో కథనం వెలువడింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా 63 ఏళ్ల పెద్దాయన ఆస్పత్రికి రాగా ఆయనకు వైద్యులు కొలొనోస్కోపీ చేశారు. అందులో ఈ విషయం వెల్లడైంది. ‘‘ కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ నేను తీసుకోలేదు. రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా, తోటకూర తిన్నాను. అసలది ఎలా లోపలికెళ్లిందో నాకైతే తెలీదు’’ అని ఆ పెద్దాయన తాపీగా చెప్పారు. ‘‘తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్ మయాసిస్ అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది’’ అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటెరాలజీ విభాగ సారథ మ్యాథ్యూ బెక్టోల్డ్ విశ్లేషించారు. ‘ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. అయినా సరే ఈయనకు అవేం లేవంటే నిజంగా ఇది వింతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం. చదవండి: మంచు‘మాయం’ -
పళ్లతో ఇనుప డ్రమ్మును లేపిన తాత వైరల్ వీడియో
-
అచ్యుతానందన్‌కు 100 ఏళ్లు
అలప్పుజ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వెలిక్కకత్తు శంకర్ అచ్యుతానందన్ శుక్రవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2006–11 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేశారు. 1991 నుంచి 2016 దాకా మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు. వీఎస్గా ప్రసిద్ధుడైన ఆయన 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన నేతగానూ రికార్డు సృష్టించారు. స్ట్రోక్ నేపథ్యంలో ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరికి 2016 ఎన్నికల్లో కూడా కేరళలో వామపక్ష కూటమి వీఎస్నే ముందు పెట్టుకుని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేపట్టింది. అభిమానులు ఆయన్ను ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు. అలప్పుజ జిల్లా పున్నప్ర గ్రామంలో 1923లో జన్మించిన వీఎస్ 11 ఏళ్లప్పుడే కన్నవారిని పోగొట్టుకున్నారు. మరుసటేడే స్కూలు మానేసి అన్న టైలరింగ్ షాపులో పనికి కుదురుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్‌లో చేరారు. రెండేళ్ల తర్వాత సీపీఐలోకి మారి పారీ్టలో చకచకా ఎదిగారు. 1964లో సీపీఐ నుంచి బయటికొచ్చి సీపీఎంను ఏర్పాటు చేసిన 32 మంది నేతల్లో వీఎస్ ఒకరు. పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు వీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
అరుదైన వింత వ్యాధి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..!
కరోనా టైంలో లాక్డౌన్, హోం క్యారంటైన్ వంటి పదాలని విని హడలిపోయాం. ఆ కరోనా మహమ్మారికి భయపడి అంతా స్వీయనిర్బంధంలో బిక్కుబిక్కుమని గడిపాం. అయిన వారితో సహా ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా గడపాల్సిన దారుణమైన దుస్థితితో ఎన్నో అవస్థలు పడ్డాం. హమ్మయ్యా! అని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. చాలా వరకు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ గడ్డు రోజులు తల్చుకుంటునే వామ్మో! అని హడలిపోతాం. అలాంటిది ఈ వృద్ధుడు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే జీవిస్తున్నాడు. అది కూడా అతనికి ఎలాంటి అంటు రోగం లేకపోయిన ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా తనను తాను నిర్బంధించుకుని ఎందుకు ఉంటున్నాడంటే.. వివరాల్లోకెళ్తే..71 ఏళ్ల ఆఫ్రికన్ వ్యక్తి తనను తాను నిర్బంధించుకుని ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఏకాకిగా బతుకుతున్నాడు. అతను ఎందుకిలా జీవిస్తున్నాడో వింటే ఇలాంటి భయాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. జంతువులు, నీళ్లు, నిప్పు తదితర భయాలు గురించి వాటి తాలుకా ఫోబియాల గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత అరుదైన ఫోబియా గురించి విన ఉండే అవకాశమే లేదు. ఐతే ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న విచిత్రమైన భయం ఏంటంటే ఆడవాళ్లు. మహిళలా!.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతడికి మహిళలంటేనే చచ్చేంత భయం. మహిళ గాలి సైతం తనను తాకకూడదని ఇలా 55 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా ఇంటి చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు. ఇలా ఆ వృద్ధుడు 16 ఏళ్ల ప్రాయం నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. విచిత్రం ఏంటంటే అతడికి మహిళలంటే భయం కానీ అతడు ఆ మహిళల సాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి సాయం చేసేది ఇరుగుపొరుగు మహిళలే. అ వ్యక్తి తన చిన్నతనం నుంచి ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడని, బయటకు అస్సలు రాడని చెబుతున్నారు చుట్టుపక్కల మహిళలు. పొరపాటున ఏ మహిళ అయినా అతడి ఇంటి ఆవరణలోకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించిన నిమిషం ఆలస్యం చేయకుండా తలుపువేసేసుకుంటాడని తెలిపారు. అతనికి మహిళలంటే చచ్చేంత భయం అని చెబుతున్నారు స్థానికులు. ఈ భయం కారణంగా ఆ వ్యక్తి 77 ఏళ్ల వచ్చినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చివరికి అతడు ఏ పని చేయలేని స్థితికి వచ్చేశాడు. అతడి దుస్థితిని చూసి చుట్టుపక్కల మహిళలు తమకు తోచిన రీతలో ఆహారపదార్థాలను అతడి వాకిట్లో ఉంచి వెళ్లిపోతారు. అతడు మాత్రం వారు వెళ్లిపోయాక మెల్లిగా వాటిని తీసుకుంటాడు. ఇలా వేరొక జెండర్‌ని చూస్తే భయపడే మానసిక స్థితిని గైనోఫోబియా అంటారు. అతడు తీవ్రమైన గైనోఫోబియాతో బాధపడుతున్నాడు. దీన్ని వైద్య పరిభాషలో డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్‌గా పిలుస్తారు. దీన్ని క్లినికల్ పరంగా ఓ నిర్ధిష్ట భయంగా చెబుతారు వైద్యులు. ఈ ఫోబియ ఉన్నవాళ్లు స్త్రీల పట్ల అహేతుకమైన భయంతో ఉంటారట. తరుచుగా వారి గురించి ఆలోచించడంతో ఒక విధమైన ఆందోళనకు దారితీసి క్రమంగా మరింత తీవ్రమైపోతుంది. ఫలితంగా ఆయా వ్యక్తులు పొరపాటున మహిళలను చూడగానే చెమటలు పట్టేసి, శ్వాస ఆడనట్లుగా అయిపోయి ప్రాణాలు కోల్పేయే పరిస్థితికి వచ్చేస్తారని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!) -
27 ఏళ్లుగా విడాకుల కోసం భర్త పోరాటం.. చివరకు బామ్మే గెలిచింది
ఆయనకు 89 ఏళ్లు. ఆయన భార్యకు 82 ఏళ్లు. భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఆ పెద్దాయన కోర్టుకెక్కారు. కానీ, అది ఇప్పుడే కాదు లేండి. సుమారు 27 కిందట!. తమ వివాహ బంధం కుప్పకూలిపోయిందని, విడాకులు ఇప్పించాలని ఆయన చేసిన అభ్యర్థన న్యాయస్థానాల్లో నానుతూ వస్తోంది. చివరకు.. దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. పెళ్లి అనే పవిత్ర బంధానికే కట్టుబడి ఉంటానన్న ఆమె అభ్యర్థన వైపే మొగ్గుచూపింది. విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ సింగ్ పనేసర్.. పరమ్‌జిత్ కౌర్‌లకు 1963లో వివాహమైంది. భర్త ఆర్మీలో పనిచేసేవారు. వారికి ముగ్గురు సంతానం. అయితే, అప్పట్లో మద్రాస్‌లో విధులు నిర్వహించే ఆయనతో వెళ్లేందుకు భార్య పరమ్‌జిత్ ఇష్టపడలేదు. దీంతో, 1984 నుంచి వారి బంధం ఒడిదుడుకులకు లోనైంది. ఈ క్రమంలో పరమ్‌జిత్ తొలుత అత్తమామలతో.. ఆ తరువాత కొడుకు వద్ద ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో.. 1996లో నిర్మల్ తొలిసారిగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. వివాహ చట్టంలో విడాకులకు అవసరమైన ‘‘క్రూరత్వం’’, ‘‘తనను విడిచిపెట్టి ఉండడం’’.. కారణాలుగా చూపించారాయన. దీంతో జిల్లా కోర్టు నాలుగేళ్ల తర్వాత.. అంటే 2000వ సంవత్సరంలో ఆయనకు విడాకులు మంజూరు చేసింది. కానీ, పరమ్‌జిత్ ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లడంతో.. ఏడాది తర్వాత కింది కోర్టు తీర్పును పైకోర్టు తోసిపుచ్చింది. అలా ఇన్నేళ్లు కోర్టుల్లో నలిగిన కేసు.. చివరకు సుప్రీం కోర్టుకు చేరింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలో కూడిన ధర్మాసనం ఈ విడాకుల పిటిషన్‌పై విచారణ జరిపి.. అక్టోబర్ 10వ తేదీన తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద.. వివాహ బంధం శాశ్వతంగా తెగిపోయిందన్న కారణంతో ఈ కేసులో విడాకులు మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. అన్ని సందర్భాల్లో ఒకే ఫార్మాలా వాడలేమని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం.. ఏ వ్యవహారంలోనైనా వ్యక్తులు లేదంటే పిటిషనర్లకు న్యాయం జరిగేలా తగు తీర్పు వెలువరించే ప్రత్యేకాధికారం సుప్రీం కోర్టుకు ఉంది. ‘‘ఈ కాలంలో విడాకులు తీసుకునే వారి పెరుగుతున్నప్పటికీ భారత సమాజంలో వివాహా వ్యవస్థకు ఇప్పటికీ ఓ పవిత్రస్థానం ఉంది. వివాహమనేది భార్యాభర్తల మధ్య ఉన్న భావోద్వేగపూరిత పవిత్ర బంధమని ఈమె అంటున్నారు. ఈ వయసులోనూ భర్త బాగోగులు చూసుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు. అన్నింటికి మించి.. ఈ వయసులో డైవర్సీగా చనిపోదలుచుకోలేదన్న ఆమె అనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేస్తే ఇరు వర్గాలకు పూర్తి న్యాయం జరగదు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు భర్త నిర్మల్ సింగ్ పనేసర్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. -
'తాత అని పిలిపించుకుని.. డబ్బు ఆశ చూపి..' ముగ్గురు బాలికలపై.. వృద్ధుడు
కరీంనగర్: ముగ్గురు బాలికలపై ఓ వృద్ధుడు మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన మండలంలోని తిర్మాలాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. తాత అని పిలిచిన వారికి డబ్బు ఆశ చూపి.. మాయమాటలు చెప్పి ఈ ఆకృత్యానికి ఒడిగడుతున్నాడు. పిల్లల ఆరోగ్యం బాగలేకపోవడంతో వారి తల్లులు మందలించగా.. అసలు విషయం బయటపడింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు రంగధామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకరు ఐదు, మరొకరు నాలుగు, ఇంకొకరు మూడో తరగతి చదువుతున్నారు. ముగ్గురి తండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. తల్లులు కూలి పనిచేస్తూ వీరిని పోషించుకుంటున్నారు. వీరి సామాజికవర్గానికే చెందిన శివరాత్రి ముత్తయ్య (65) వీరి ఇంటి సమీపంలో ఉంటాడు. పిల్లలకు సెలవు రోజు ఇంటికి పిలిచి డబ్బులు ఇవ్వడంతోపాటు పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఇలా మూడునెలలుగా తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారులు నాలుగురోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. తల్లులు ఆరా తీయగా జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. సదరు కామాంధుడిని కుల సంఘంలోకి పిలిస్తే రాకపోగా.. బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుల తల్లులు అంటున్నారు. దీంతో చేసేది లేక వారు గొల్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అడిగితే బెదిరింపులు.. తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. కుల పెద్దలు పిలిచినా ముత్తయ్య రాలేదని, పైగా ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్ తమనే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఉరి తీయాలి.. తమ పిల్లల జీవితాలను నాశనం చేసిన ముత్తయ్యను ఉరితీయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి నిందితుడితోపాటు ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సదరు నిందితుడిని ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. https://Follow the Sakshi TV channel on WhatsApp -
ఈ పెద్దాయన స్టాక్ మార్కెట్‌ని ఏలుతున్నారు?, కోట్లు వెనకేసి
చూశారా!! ఈ పెద్దాయనని. ఈయన ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారా? అయితే, మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆయన గురించి తెలుసుకుందాం పదండి. స్టాక్ మార్కెట్‌తో డబ్బులు సంపాదించడం ఎలా? అని ఎవరినైనా అడిగితే అమ్మో స్టాక్ మార్కెటా? వద్దులే. ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తేనో లేదంటే తెలిసిన వాళ్లకి వడ్డీ ఇచ్చుకున్నా నాలుగు రాళ్లు వెనకేసువచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అంటూ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని, అనుభవజ్ఞులైన నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలా తెలుసుకునే షేర్లలో పెట్టుబడులు పెట్టారు ఈ పెద్దాయన. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, క్రమశిక్షణ, ఓపిక వహించారు. ఇప్పుడు ముదుసలి వయసులో భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటారా? క్రమశిక్షణ, సహనం ఈ రెండింటిలో ఆరితేరిన బిగ్ బుల్, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్లు స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ల్పిట్లతో లాభాల్ని గడిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ కూడా అంతే. సోషల్ మీడియా ఓవర్‌నైట్ స్టార్ గురించి పెద్దగా వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నెటిజన్ ఈ పెద్దాయన గురించి వీడియో చేశారు. ఆ వీడియోలో కోట్ల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయనకు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో వివరించారు. ఆ వివరాల ఆధారంగా సదరు పెద్దాయన నికర ఆస్తి విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్అండ్టీలో 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో 4,000 షేర్లు తన వద్ద ఉన్నాయని తన మాతృ భాషలో పెద్దాయన చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం..100 మిలియన్ (రూ.10 కోట్ల) కంటే ఎక్కువ విలువైన షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అదనంగా, ఆ వ్యక్తి తాను సంవత్సరానికి సుమారుగా రూ. 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. As they say, in Investing you have to be lucky once He is holding shares worth ₹80 crores L&T ₹21 crores worth of Ultrtech cement shares ₹1 crore worth of Karnataka bank shares. Still leading a simple life#Investing @connectgurmeet pic.twitter.com/AxP6OsM4Hq — Rajiv Mehta (@rajivmehta19) September 26, 2023 ఈ సందర్భంగా రాజీవ్ మెహతా మాట్లాడుతూ పెద్దాయన చెప్పినట్లుగా పెట్టుబడులు మీరు అదృష్టవంతులు కావాలని అన్నారు. అంతేకాదు ఎల్ అండ్ టీలో రూ.80 కోట్ల విలువైన షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో రూ. 21 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో రూ. కోటి విలువైన షేర్లు ఉన్నాయని మెహతా పోస్ట్ చేశాడు.ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అని’ మెహతా పేర్కొన్నారు. Bhai 27,000 L&T shares = 8 cr no? Similarly 3.2 cr. of Ultratech 10 lakh of Ktk bank It's a decent amount still. More power to him. But please consider blurring his face, such publicity usually doesn't do good esp for old people living a simple life. — Deepak Shenoy (@deepakshenoy) September 26, 2023 ఆ వీడియోపై క్యాపిటల్ మైండ్ సీఈఓ, ఫౌండర్ దీపక్ షెనాయ్ స్పందించారు. రాజీవ్ మెహతా చెప్పిన దానిని బట్టి.. ఎల్ అండ్ టీ కంపెనీలో 27 వేల షేర్ల విలువ రూ. 8 కోట్లు, అల్ట్రాటెక్ కంపెనీలో రూ. 3.2 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంకులో రూ. 10 లక్షల విలువైన షేర్లు.. ఇలా మొత్తంగా రూ. 12 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం, ఈ పెద్దాయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. -
21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత?
శరీర బరువును తగ్గించడంలో రన్నింగ్ సహాయపడుతుందని ఫిట్నెస్ నిపుణులు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం 21 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా తన శరీర బరువును 11 కిలోలు తగ్గించుకున్నాడనే సంగతి మీకు తెలుసా? ఇటీవల రష్యాలోని రిపబ్లిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు రన్నింగ్ ద్వారా 11 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ఆ వృద్ధుడు 2 గంటల 50 నిముషాలు పరిగెత్తాడు. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలేమిటో ధృవీకరణ కాలేదు. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఉంటున్న 69 ఏళ్ల బహామా ఎగుబోవ్ పేరు 2019లో రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. అప్పుడు బహామా 5 గంటల పాటు పరిగెత్తి, 9 కిలోలకుపైగా బరువు తగ్గాడు. తాజాగా బహామా ఎగుబోవ్ 21 కిలోమీటర్ల రేసులో పరుగు తీసి, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫీట్లో బహామా ఎగుబోవ్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే ఇలాంటి విజయాన్ని రికార్డ్‌గా పరిగణించరు. త్వరగా బరువు తగ్గేందుకు ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బరువు తగ్గిన వ్యక్తి ని తానేనని బహామా ఎగుబోవ్ చెబుతున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం బహామా.. జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు. బహామా ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో బరువు తగ్గించే కళను నేర్చుకున్నాడు. తాను తన చిన్నతనంలో యుద్ధాల కోసం 17 కిలోల బరువును తగ్గానని బహామా తెలిపాడు. అయితే వృద్ధాప్యంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయినా తాను ఈ ఘనత సాధించానని పేర్కొన్నాడు. పోషకాహార నిపుణుడు ఒక్సానా లైసెంకో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా రెండు గంటల్లో 11 కిలోల బరువు తగ్గాలంటే, శరీరం నుండి తగినంత ద్రవాన్ని తొలగించాలి. ఇది బహామా ఎగుబోవ్ విషయంలో నిస్సందేహంగా జరిగింది. అయితే సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
తాత లుంగీ డాన్స్..
-
75 Weds 35.. సోషల్ మీడియాలో వైరల్ అయిన తాతయ్య పెళ్లి
సాక్షి, బెంగళూరు: ఆయన వయసు 75 ఏళ్లు.. ఆమె వయసు 35.. ఇద్దరూ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటైన ఘటన కర్ణాటకలో చిక్కబళ్లాపురం జిల్లా అప్పేగౌడనహళ్లిలోజరిగింది. వివరాల్లోకి వెళితే... అప్పేగౌడనహళ్లికి చెందిన ఈరన్న అనే మోతుబరి రైతు భార్య గతంలోనే మరణించింది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అనుశ్రీ అనే మహిళ భర్త నుంచి విడిపోయి వేరుగా జీవిస్తోంది. ఆమెకు పిల్లలు ఉన్నారు. ఈరన్న ఆమెతో పెళ్లి ప్రస్తావన తేగా అంగీకరించింది. దీంతో స్వగ్రామంలో నిరాడంబరంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోషూట్ జరుపుకున్నారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తూ కృష్ణా రామా అనుకునే వయస్సులో తాతయ్య రెండో పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! -
పట్టపగలే.. భార్య కళ్ల ఎదుటే.. కత్తితో..
వరంగల్: వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం ఉదయం ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య కళ్లేదుటే వృద్ధుడిని కత్తితో గొంతు కోసి పరారయ్యారు. భూ వివాదమే హత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన నాముతాబాజీ రాధాబాయ్, రాంచందర్(65) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాంచందర్ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహించి రిటైరయ్యారు. పదేళ్ల క్రితమే ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లై వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ప్రస్తుతం రాధాబాయ్, రాంచందర్ మాత్రమే ఎస్ఆర్ ఆర్తోటలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాంచందర్‌కు పరకాల నియోజవర్గం పత్తిపాక శాయంపేట గ్రామంలో 1.20గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయమై స్థానికుడి నడమ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 11.20 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్ఆర్తోటలో రాంచందర్ పేరు పెట్టి పిలుస్తూ ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరో వచ్చారు అని భార్య రాధాబాయ్ చెప్పగానే బెడ్రూం నుంచి హాల్లోకి ప్రవేశించిన రాంచందర్‌ను దుండగులు కింద పడేసి వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి పరారయ్యారు. ఆ దృశ్యం చూసిన భార్య షాక్‌కు గురైంది. రక్షించండి అంటూ రాంచందర్ ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరి రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ సురేష్.. ఎస్సై శ్రీలత, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి బంధువులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు నాము తాబాజీ ప్రదీప్ చందర్ మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ టి.సురేష్ తెలిపారు. భూ వివాదమే హత్యకు కారణమా..? వృద్ధుడి హత్య అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? పత్తిపాక శాయంపేటలోని 1.20 గంటల భూ వివాదమే హత్యకు కారణమా..? భూ వివాదంపై పట్టు వీడడం లేదనే కక్షతో గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసి ఉంటారా..? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. పత్తిపాక శాయంపేటకు చెందిన ఓ వ్యక్తికి రాంచందర్ నడమ భూవివాదం ఉందని, మృతుడి కుమారుడు ప్రదీప్ చందర్ చెప్పడంతో సదరు వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. హత్య చేసి పరారైన వ్యక్తులు ముందుగా ఎక్కడినుంచి ఇంటికి చేరుకున్నారు..? ఆ తరువాత ఏ దారిలో వెళ్లి ఉంటారు..? అనే దానిపై సీసీ పుటేజీలను సైతం పరిశీలించినట్లు తెలిసింది. -
ముసలోడే కానీ.. మహానుభావుడు, బైక్‌పై స్టంట్స్ చేసిన వృద్ధుడు
రోడ్ల మీద రయ్రయ్ అంటూ కుర్రాళ్లు చేసే స్టంట్స్ గురించి తెలిసిందే. ఇందులో పెద్ద విశేషం ఏముంది? కానీ కొంతమంది వయసుతో సంబంధం లేని పనులు చేస్తుంటారు. అలా కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓ వృద్దుడు యువకుడిలా మారి బైక్‌పై విన్యాసాలతో ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సరికొత్త విషయాలు, గమ్మత్తైన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. బైక్‌పై ఓ వృద్ధుడు విన్యాసాలు చేశాడు. బైక్‌ను నడుపుతూ ఒక్కసారిగా హ్యాండిల్‌ని విడిచిపెట్టేశాడు. బైక్‌పై జంప్స్ చేస్తే హుశారుగా స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. చాలామంది నెటిజన్లు వృద్ధుడి విన్యాసాలకు షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం.. తాతగారికి ఈ వయసులో అవసరమా? పొరపాటున కిందపడితే ఎంత ప్రమాదం? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। 😅 pic.twitter.com/9On89AL5SJ — Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023 -
యోగాలో ఉన్న పవర్ ఇది..బాడీని బొంగరంలా తిప్పేశాడు
-
ఏడుపదుల వయసులో స్కూల్‌కి..అది కూడా 3 కిలోమీటర్లు..
చదువుకోవాలన్న తప్పన, జిజ్ఞాస ఉండేలా కాని చదువుకోవడానికి ఏ వయసు అయితే ఏంటి?. చదువుకోవాల్సిన టైంలో ఏవో కారణాల రీత్యా చదువుకోలేకపోవచ్చు. అవకాశం దొరికితే వదులుకోకుండా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అని నిరూపించాడు ఓ వృద్ధుడు. వివరాల్లోకెళ్తే..మిజోరాంకు చెందిన లాల్రింగ్థరా అనే 78 ఏళ్ల వృద్ధుడు హైస్కూల్లో చేరి ఔరా అనిపించాడు. ఆ వయసులో కాలినడకన స్కూల్‌కి వెళ్లి మరీ చదువుకుంటున్నాడు. చదువుకి వయసు అడ్డంకి కాదు అని చేసి చూపించి ఆశ్చర్యపరిచాడు. ఆ వృద్ధుడు 1945లో ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించాడు. రెండొవ తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి మరణంతో చదువుకు దూరమయ్యాడు. తన తల్లికి అతడు ఒక్కడే సంతానం కావడంతో తల్లికి చేదోడుగా పొలం పనులకు వెళ్తుండేవాడు. బతుకు పోరాటం కోసం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ..అలా న్యూహ్రుయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. బాల్యం అంతా కటిక పేదరికంలోనే మగ్గిపోయింది. దీంతో లాల్రింగ్థరా చదువు అనేది అందని ద్రాక్షలా అయిపోయంది. ఇప్పుడు అతను ఓ చర్చిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనిలో చదువుకోవాలనే కోరిక మాత్రం చావలేదు. అందువల్లే ఇక ఇప్పుడైన తన కోరిక తీర్చుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ మేరకు లాల్రింగ్థరా మాట్లాడుతూ..తనకు చదవడం, రాయడంలో ఇబ్బంది లేదని, ఆంగ్లభాషలోని సాహిత్య పదాలు మాత్రం అర్థమయ్యేవి కావంటున్నాడు. ఎలాగైనా తన ఆంగ్ల భాషను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్లో జాయిన్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు లాల్రింగ్థరా. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అతను మా టీచర్ల బృందానికి, విద్యార్థులకు ఆదర్శమైన వ్యక్తి అని, అదే సమయంలో అతనికి నేర్పడం అనేది మాకు ఒక సవాలు కూడా అని అన్నారు. అతనికి తాము అన్ని విధాల మద్దతు ఇవ్వడమేగాక చదువుకోవడంలో తగిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఇదేం విచిత్రం! ఆవు పాము రెండు అలా..) -
78 ఏళ్ల తాతకు నైన్త్‌లో అడ్మిషన్.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..
మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్ ఈస్ట్ లైవ్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్‌రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది. ప్రస్తుతం లాల్‌రింగథర హువాయికోన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించిన లాల్‌రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు. ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. లాల్‌రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్‌కిమా మాట్లాడుతూ ‘లాల్‌రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్‌రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు.. -
పెద్దవయసు వారిని వణికించే పార్కిన్సన్స్ వ్యాధి!
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తిం, ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... కనిపెట్టినవారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురిం ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశీకంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు. లక్షణాలు: కదలికలు నెమ్మదిస్తాయి (దీన్ని బ్రాడీకైనేసియా అంటారు). దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు. కాళ్ల, చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట (ఫెటీగ్)కనిపిస్త, తరచూ నిద్రాభంగమవుతుంది. ఈ పరిణామాలతో పాటు మెదడులోని కొన్ని రసాయనాల అసమతౌల్యత వల్ల కుంగుబాటు (డిప్రెషన్), నిద్రసమస్యలు కనిపిస్తాయి. పీడకలల, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటినిద్ర రావచ్చు. కొందరిలో మింగడం కష్టంకావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం /ఇరుక్కుపోవడం. కొందరిలో కండరాల నొప్పులు / కీళ్ల నొప్పులు. మొదట్లో కనిపించే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే, అవి మరింత ముదిరి బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పడతారు. ∙కొన్ని చర్మ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన సమస్యల అలాగే మలబద్దకం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ ఇలా... పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాల్ని బట్టి, క్లినికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం ఈ కింది పరీక్షలు అవసరమవుతాయి. మెదడు ఎమ్మారై పరీక్ష, స్పెక్ట్ అనే పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు. పెట్ స్కాన్ పరీక్ష. చికిత్స : వయసు పెరగడంతో మెదడులోని డోపమైన్ తగ్గడం, దాంతో కదలికలను నియంత్రించే మెదడు కణాలు నశించడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతో పాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూ పోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. ∙యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గిం, ఉపశమనాన్నిస్తాయి. శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. నివారణతో పాటు అవసరమయ్యే ఇతర పద్ధతులు: ∙వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో పోషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అలాగే పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి వనసిక సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు. డాక్టర్ ఎం సాయి శ్రవంతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!
మనకు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే.. మేధావులు, జీనియస్‌లు, పండుతుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనించినా.. లేదా కష్టజీవులను చూసినా ఎంతో నేర్చుకోవచ్చు. మనం పడుతున్నదే కష్టం కాదు అంతకు మించి ఉందని అర్థం అవుతుంది. అందుకు ఉదహరణే ఈ ఉదయ్‌పూర్ వృద్ధుడు. ఆ వృద్ధుడు ఉదయ్‌పూర్‌లోని కోర్టు సర్కిల్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డుపక్కనే సమోసాలు అమ్ముతుంటాడు. సరిగ్గా ఆ సమయానికి అటుగా ఆర్యాన్ష్ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. కరక్ట్‌గా ఆ టైంలో మంచి జోరుగా వర్షం వస్తుంది. దీంతో ఆర్యాన్ష్ కారు పక్కకు పార్క్ చేసి నేరుగా అతని వద్దకు వచ్చాడు. గట్టిగా వర్షం కురుస్తుండటంతో ఏదైనా తిందామనిపించి చూడగా ఆ వృద్ధుడు అక్కడే సమోసాలు, పోహా అమ్మడం చూసి అతని దగ్గరకు వెళ్లాడు. కొన్ని సమోసాలు ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వయసులో ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు అని ఆర్యాన్ష్ ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి బదులుగా..ఈ వయసులో డబ్బు సంపాదించేందుకు కష్టం పడటం లేదు బేటా!. నా మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నాకు నచ్చిన పని చేస్తున్నాను. ఇలా నేను వండిన వంటకాల రుచిని ఆస్వాదించిన ముఖాలను చూస్తే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. నేను ఒంటరిగా ఇంటి వద్ద కూర్చొవడం కంటే ఇదే మేలని చెబుతాడు ఆ వృద్ధుడు. దానికి రియలైజ్ అయిన అర్యాన్ష్ ఇది జీవితానికి ఉపయోగపడే విలువైన పాఠం ఇది. వయసులో ఉన్న యువత సైతం ఒళ్లు వంచడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంతటి పండు ముదుసలి వయసులో ఎంతో ఉషారుగా పనిచేస్తున్నాడు. పైగా పనిచేస్తేనే సంతోషంగా ఉంటుందని చెబుతున్నాడు. అతని దృక్పథాన్ని వింటే ఎందరో యువత తమ జీవన విధానాన్ని మార్చుకుంటారు కదా అని ట్విట్టర్ వేదికగా ఈ విషయన్ని నెటిజన్లతో పంచుకున్నాడు ఆర్యాన్ష్. దీంతో నెటిజన్లు సదరు వృద్ధుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. It was raining heavily when I parked my car beside a traffic signal near court circle udaipur, where I saw an old uncle selling hot samosa and poha. I placed an order and curiously asked him why he didn't take a rest today, considering his age. He told me something that… pic.twitter.com/CCIutZv23Z — Aaraynsh (@aaraynsh) July 25, 2023 (చదవండి: 600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..) -
బైక్ నడుపుతూ ఇంటి చిరునామా మరిచిన వృద్ధుడు
అన్నానగర్: చైన్నెలోని కొలత్తూరు తిరుపతి నగర్‌కు చెందిన తిరువెంకటం (65) బైకుపై స్థానికంగా ఉండే ఓ దుకాణానికి వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే ఆ తర్వాత ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోయి, ఇంటికి వెళ్లే మార్గం తెలియక రోజంతా బైకుపై కొలత్తూర్, అన్ననగర్, అమంజకరై, అరుంబాక్కంలలో చక్కర్లు కొట్టాడు. చివరికి అరుంబాక్కంలోని 100 అడుగుల రోడ్డులో అర్ధరాత్రి 1.30 గంటలకు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ వాహనాల తనిఖీల్లో భాగంగా వృద్ధుడిని ఆపి విచారణ చేపట్టాడు. ఈ సమయంలో తన ఇంటికి వెళ్లే దారి తెలియక రాత్రంతా రోడ్లపై తిరుగుతున్నట్లు వెల్లడించారు. దీంతో వృద్ధుడి ఇంటి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్‌ను గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను సమాచారం అందించి ఇంటికి పంపించారు. -
రైలింజన్ పైకెక్కి వృద్ధుడి హల్చల్..!
వికారాబాద్: తాండూరు రైల్వేస్టేషన్లో నిలిచిన ఓ రైలింజన్ పైకి ఓ వృద్ధుడు ఎక్కి హల్చల్ చేశాడు. హైటెన్షన్ తీగను పట్టుకునేందుకు యత్నించి గాయాలపాలయ్యాడు. ఈఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కల్లూరుకు చెందిన 60 ఏళ్ల కొండం చంద్రశేఖర్ మతి స్థిమితం కోల్పోవడంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేవాడు. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ రైల్వేస్టేషన్లో ఆగింది. ఆ సమయంలో చంద్రశేఖర్ రైలింజన్ పైకెక్కి హైటెన్షన్ తీగను పట్టుకునేందుకు యత్నించాడు. అక్కడున్న వారు ఎంత వారించినా వినలేదు. ఇంతలో రైలు కదలడంతో ఇంజన్‌పై పడిపోయాడు. దీంతో వృద్ధుడికి గాయాలయ్యాయి. స్థానికులు అందరూ కలిసి అతన్ని కిందకు దింపి, చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీగకు చేయి తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, రైలు కదలడంతో ముప్పు తప్పిందని ప్రయాణికులుఅంటున్నారు. -
ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆవు మొదలుకొని ఆడ కుక్క వరకూ.. ఇలా పలు జంతువులపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన ఒక వృద్దుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో గుజైనీ నివాసి విజేంద్ర మిశ్రా(62)ను అరెస్టు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా నిందితునిపై గతంలోనూ పలు నేరారోపణలు వచ్చాయని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి మాట్లాడుతూ పోలీసులు తమ దర్యాప్తులో పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారని, వాటిలో మిశ్రా బహిరంగ ప్రదేశాల్లో వివిధ జంతువులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమయ్యిందన్నారు. మిశ్రా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని, అతనిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించామన్నారు. దీనికిముందు బులంద్షహర్లోనూ ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్లవృద్దుడు పెంపుడు కుక్కతో లైంగిక చర్య జరిపాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ శునకం యజమాని ప్రేమ్‌చంద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వృద్దుడుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే.. -
వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా..
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా, అది ఆ వృద్ధునిపై దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది. ఎన్నో ప్రయత్నాల తరువాతనే.. ఈ ఘటన 2023 జూలై 7,ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ వీడియోలో.. ముందుగా ఒక వృద్ధుడు రోడ్డుపై వెళుతుండటం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డు పక్కగా ఒక గాడిద నిలుచుని ఉంటుంది. అది ఉన్నట్టుండి, ఆ వృద్ధుని దిశాగా పరిగెత్తకుంటూ వచ్చి, అతనిపై దాడికి తెగబడుతుంది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన కాళ్లతో తొక్కివేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కల వారు ఆ వృద్ధుడిని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంటుంది. తరువాత ఒక వ్యక్తి ఆ గాడిదపైకి రాయి విసిరినా అది ఏమాత్రం అదరదు. మరికొందరు కర్రతో దానిని కొట్టడంతో ఆది తన దాడిని విరమించి పక్కకు వెళ్లిపోతుంది. తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు. महाराष्ट्र के #कोल्हापुर में एक गधे ने सड़क पर चल रहे बुजुर्ग पर किया जानलेवा हमला..पूरी घटना CCTV में कैद..घटना गांधीनगर इलाके में 7 जुलाई सुबह 11 बजे की है..पिछले 3 दिनों में गधे द्वारा लोगों पर हमले की यह दूसरी घटना@indiatvnews@KOLHAPUR_POLICE@Dev_Fadnavis pic.twitter.com/WoWt4vCjap — Atul singh (@atuljmd123) July 8, 2023 మూడు రోజుల్లో రెండవ దాడి ఘటన గడచిన మూడు రోజుల్లో స్థానికంగా జంతువుల కారణంగా జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికిముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు! -
Viral: ఈ తాత కథ మీలో ఎవరికైనా ఎరుకేనా?
Viral Photo: కొందరి క(వ్య)థలు.. ఇట్టే ఆకట్టుకుంటాయి. కదిలిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ కథలను చెప్పడానికి పెద్దగా వర్ణనలు అక్కర్లేదు. కేవలం అక్కడ కనిపించే పరిస్థితులు చాలూ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతుండడం చాలామంది చూసే ఉంటారు. ఒక వృద్ధుడు ఒక పాత కిరాణ దుకాణంలో ఉండగా.. పైన కనిపించే రాతలు ఆకట్టుకునేలా.. అంతకు మించి ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘‘నమ్మండి.. నేను వ్యాపారంలో నష్టపోలే. బదలు ఇచ్చి.. మధ్యవర్తిగా ఉండి నష్టపోయాను. నా సాయం తీసుకున్నవారు పొలాలు కొన్నారు. నేను మాత్రం పొలం అమ్ముకున్నాను’’ అని ఆ చిన్న కిరాణంపైన రాసి ఉంది. ఇది ఏ కాలానికైనా వర్తించే కఠిన వాస్తవం ఇదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్.. ఈ దుకాణం తమకు తెలుసని, వరంగల్ పక్కన నెక్కొండ అనే చిన్న పల్లెటూరిలో ఈ తాత ఉన్నాడని, తన అనుభవమే ఆయన అలా రాతలుగా చూపించారని అంటున్నారు. ఇంతకీ ఈ తాత పేరు, ఆయన కథ ఏంటి?.. ఆయనకు జరిగిన నష్టం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పరు! ఇదీ చదవండి: చావు అంచుల దాకా వెళ్తే.. రక్షించాడు -
78 ఏళ్ల వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇంతవరకు గుండె, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఊపరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి వినలేదు కదా. ఇది కాస్త రిస్క్‌తో కూడిన అపరేషన్ మాత్రమే గాక వైద్యులకు కూడా ఒక రకంగా సవాలుతో కూడిన ఆపరేషనే. అలాంటి శస్త్ర చికిత్సను ఆసియాలోనే అత్యంత వృద్ధుడికి చేశారు చెన్నైకి చెందిన వైద్యులు. వివరాల్లోకెళ్తే..బెంగళూరు నివాసి అయిన 78 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి సంబంధించిన ఆస్పిరేషన్ న్యుమోనియాతో బాధపడుతున్నాడు. అతను గత 50 ఏళ్లుగా కృత్రిమ ఆక్సిజన్ సపోర్టుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రోగి మంచి ఆరోగ్యంగా ఉండటమే గాక శస్త్ర చికిత్సకు తట్టుకోగలడని వైద్యులు నిర్ధారించేక అతనికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఆ రోగికి శస్త్ర చికిత్స చేయడానికి చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ ముందుకొచ్చింది. అలాగే సదరు వృద్ధుడు కూడా ద్వైపాక్షిక ఊపిరితిత్తుల మార్పిడి కోసం స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నాడు. అతనికి సరిపడా ఊపిరిత్తులను ఇచ్చే దాత అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు వైద్యులు. ఈ ప్రక్రియకు ముందే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అయినా వైద్యలు రిస్క్ తీసుకుని మరీ ఈ శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఈ ఆపరేషనే రిస్క్ అనుకుంటే అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి మరింత సవాలుగా మారింది వైద్యలకు. ఈ మేరుకు అతనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డైరెక్టర్ కే ఆర్ బాలకృష్ణన్, కో డైరెక్టర్ సురేష్ రావు, కేజీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అపర్ జిందాల్‌తో కూడిన వైద్య బృందం ఆ వృద్దుడికి ఆపరేషన్ నిర్వహించారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమవ్వడమే గాక అతను కూడా మంచిగా కోలుకుంటున్నాడు. దీంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేయడమే గాక మా ఆస్పత్రి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సదా అంకితభావంతో పనిచేస్తుందని సగర్వంగా పేర్కొంది. ఇక ద్వైపాక్షిక ఊపరితిత్తు మార్పిడి అంటే..దీనిలో సర్జన్లు వ్యాధిగ్రస్తులైన ఊపిరితిత్తులను ఒక్కొక్కటిగా తీసివేసి ఆపై దాత ఊపిరితిత్తులను రోగి శ్వాసనాళాల్లోకి గుండెకు దారితేసే రక్తనాళాలను జతచేస్తారు. (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?) -
విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..
బతికుండగానే ఓ వ్యక్తి తన అంత్యక్రియలు తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయినప్పుడూ ఇక్కడే చివరి కార్యక్రమాలు చేయాలని అభ్యర్థించాడు. తద్దినం దగ్గర నుంచి దశదిన కర్మల వరకు అన్ని తానే నిర్వహించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఎందుకిలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే.. అసలేం జరిగందంటే..యూపీలోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్‌కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాదు శంకర్ తన సమాధి కోసం ఓ కాంక్రీట్ ఫ్లాట్‌ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. (చదవండి: కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు) -
ఆమెకు 30.. ఆయనకు 62.. వారికి ముగ్గురు.. ఇదో వింత కథ..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల భర్త, 30 ఏళ్ల భార్య ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. ఇంతకూ.. భార్య భర్తల మధ్య ఇంత వయస్సు తేడా ఎందుకు వచ్చింది. ఇంత లేటు వయస్సులో పిల్లల్ని కనడానికి కారణాలేంటి? తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయాల్సిందే.. గోవింద్ కుశ్వాహా(62),ఉచెహ్ర మండలంలోని అతర్వేడియా ఖుర్ద్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి యుక్త వయస్సులోనే కస్తూరి బాయ్(60)తో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు పుట్టాడు. కానీ కొడుకు పెద్దయ్యాక 18 ఏళ్ల వయస్సు వచ్చాక ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో భర్తను రెండో వివాహం చేసుకోవాలని భార్య కస్తూరి బాయ్ కోరింది. ఆ తర్వాత గోవింద్‌కు హీరాభాయ్(30)తో వివాహం జరిగింది. సోమవారం రాత్రి హీరాభాయ్‌కి పురిటి నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. దీంతో గోవింద్ కుశ్వాహా ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం బాగుండాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల ఆరోగ్యం విషమంగా ఉన్నందున ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ప్రిమెచ్యూర్ కారణంగానే పిల్లల ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి:ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్! -
అవ్వ, తాత మస్తు హుషారు
-
109 ఏళ్లలోనూ మిస్టర్ పర్ఫెక్ట్..‘వావ్ తాత, ఏం ఆ ఎనర్జీ’
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఎంత ఫిట్‌గా ఉంటాడో, అంతే ఫిట్‌గా ఉంటాడు ఈ శత వృద్ధుడు. పేరు విన్సెంట్ డ్రాన్స్ఫీల్ట్. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడితను. చూడటానికి అరవై, డెభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, నిజానికి ఇతని వయసు 109 సంవత్సరాలు. ఇప్పటికీ కారు నడుపుతాడు. కళ్లజోడు లేకుండానే న్యూస్ పేపర్ చదువుతాడు. చేతికర్ర లేకుండానే ట్రాఫిక్‌లో వెళ్లి ఇంటికి అవసరమైన వస్తువులు, సరుకులు తీసుకొస్తాడు. తన వ్యక్తిగత పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుంటాడు. ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని అడగ్గా.. విన్స్ ఏడుగురు మనవరాళ్లలో ఒకరు ఇలా అన్నారు: ‘విన్స్ 21 ఏళ్ల వయసులో అగ్నిమాపక సహాయ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. దాదాపు 80 యేళ్ల పాటు అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. వారి దీవెనలే అతన్ని ఆరోగ్యంగా ఉంచాయి’. ఇదే విషయాన్ని అతని ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు మనవళ్లు, ఏడుగురు మనవరాళ్లు కూడా న మ్ముతున్నారు. విన్స్ మాత్రం తన ఆరోగ్య రహస్యం రోజూ ఒక గ్లాసు పాలు తాగడం, శరీరాన్ని నిరంతరం కదిలించడమే అని అంటున్నాడు. చదవండి: చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు.. -
తన చితికి తానే నిప్పుపెట్టుకుని విగతజీవిగా మారిన వెంకటయ్య
-
మోడీ తడిసాడు..అభిమాని తుడిచాడు
-
‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ‘జగన్‌బాబు దేవుడయ్యా... ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒకటో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణలేని అనేకమంది వృద్ధ దంపతులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు. జబ్బు చేసినా పెద్ద వైద్యం చేయించి ఆదరణ లేని మాలాంటి ముసలోళ్లను కాపాడుతున్నాడు..’ అంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు మోపిదేవి లీలాజలం కన్నీరు పెట్టుకున్నాడు. పెదపట్నంలో మంగళవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘జగనన్నే మా భవిష్యత్’లో భాగంగా గ్రామ సర్పంచ్ గడిదేసి అనూష, వైఎసాస్ర్సీపీ నాయకుడు గడిదేసి రాజు తదితరులు పెదపట్నంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు ఈ క్రమంలో 85 ఏళ్ల వయసు కలిగిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుని ఇంటి వద్దకు వెళ్లగా... ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తమకు కలిగిన మేలును వివరిస్తూ ఆనందంతో కన్నీరుపెట్టారు. -
వైరల్ వీడియో.. అనాధ వృద్ధుడికి నీళ్లు తాగించిన చిన్నారి
-
ఎంత పెద్ద మనసు.. చిన్నారి సాయం చూసి నెటిజన్లు ఫిదా!
సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటీ నుంచి ప్రతి విషయం నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. ఎక్కడ ఏది జరిగినా అది వెంటనే నెట్టింట ప్రత్యక్ష్యమవుతోంది. ఈ క్రమంలో కొన్ని ఫన్నీ వీడియోలు నవ్వించగా, మరికొన్ని మాత్రం గుండెలను తాకుతూ కంటనీరు తెప్పిస్తుంటాయి. వీడియో ఏదైనా కంటెంట్‌కు నెటిజన్లు కనెక్ట్ అయితే చాలు అది నెట్టింట వైరల్‌గా మారుతుంది. తాజాగా ఓ చిన్నారి వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పాప చేసిన పని అందరి చేత శాభాష్ అనిపిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? రోడ్డు పక్కన ఓ పెద్దాయన పుట్‌పాత్‌పై కూర్చుని ఉంటాడు. ఆయన చేయి వణుకుతూ ఉండడంతో నీరు తాగేందుకు ఇబ్బంది పడుతుంటాడు. ఇదంతా గమనించిన ఓ చిన్నారి ఆయనకు నీరు తాగించాలని అనుకుంటుంది. బాలిక పెద్దాయన వీపుపై ఒక చేయి వేసి మరో చేతితో బాటిల్ పట్టుకుని ఆయనతో నీరు తాగిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఆ బాలిక చూపిన ఔదార్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారి చేసిన పనిని అభినందిస్తూ.. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) -
తాతా.. ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయే!
-
ఖమ్మం: తాతా.. ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయే!
ఖమ్మం: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన.. ఓ తాతను చూసి అదృష్టవంతుడని అంతా అనుకుంటున్నారంతా. జిల్లాలోని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు నిర్లక్ష్యం ప్రదర్శించాడు. గూడ్స్ రైలు కింద నుంచి అవతలి ప్లాట్‌ఫామ్‌కు చేరే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆ గూడ్స్ ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆ తాత రైలు కిందపడిపోయాడు. అయితే.. అయితే తాత సమయస్ఫూర్తితో పట్టాల మధ్యే పడుకుండి పోయాడు. ఆ సమయంలో పక్కనే పట్టాల మధ్య ఓ వృద్ధురాలు(బహుశా ఆయన తాలుకానేమో) ఆయనకి ఏమవుతుందో ఏమోఅనుకుంటూ.. రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు.. గూడ్స్ డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ఆయన రైలును ఆపేశాడు. ఆ వెంటనే పట్టాల మధ్య బొక్కబోర్లా పడుకున్న తాతను బయటకు లాగేశారు ప్రయాణికులు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడికి చిన్న చిన్న గాయాలైనట్లు సమాచారం. -
తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది. గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి. చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు. -
కోట్ల ఆస్తిని ప్రభుత్వ పరం చేసిన వృద్ధుడు! ఎందుకంటే..
ఒక వ్యక్తి తన కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. ఆఖరికి తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకు ఉపయోగించమని అధికారులును కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముజఫర్ నగర్లో 85 ఏళ్ల నాథూ సింగ్ అనే వ్యక్తికి సొంత ఇల్లు, కొంత భూమి ఉంది. వాటి విలువ సుమారు రూ. 1.5 కోట్లు. అతనికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సహరాన్‌పూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసేవాడు. ఐతే ఇటీవలే అతడి భార్య మరణించడంతో ఒంటరివాడైనా ఆ పెద్ద మనిషి ఓల్డేజ్ హోంకి వెళ్లిపోయాడు. గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. తనను చూసేందుకు తన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆయన తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిస్తూ.. వాటిని ఆస్పత్రి, పాఠశాల నిర్మించేందుకు వినియోగించమని కోరాడు. ఈ వయసులో తన బాగోగులు చూసుకోవాల్సిన కొడుకు, కోడలు తనను సరిగా పట్టించుకోకపోవడంతో తన ఆస్తిని ఇలా ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఆఖరికి తను చనిపోయాక తన మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం ఇచ్చేయాలని చెప్పాడు. ఎందుకంటే తన అంత్యక్రియల సమయం అప్పుడూ కూడా తన కొడుకు, కూతుళ్లు తనను చూసేందుకు రాకూడదని చెప్పాడు. ఈ మేరకు ఆ ఓల్డేజ్ హోం మేనేజర్ రేఖా సింగ్ మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడని, కానీ తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ తనను చూసేందుకు రాలేదని చెప్పారు. దీంతో నాథూ సింగ్ బాగా కలత చెంది ఇలా చేసినట్లు వివరించారు. కాగా, నాథూ సింగ్ వీలునామా మాకు అందిందని, ఆయన మరణాంతరం అది అమలులోకి వస్తుందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది. (చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్) -
దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్
నౌపడ: హితారామ్ సత్నామీ. వయోభారంతో ఆరోగ్యం క్షీణించిన వృద్ధుడు. పైగా దివ్యాంగుడు. ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లాలో మారుమూల గ్రామం భుత్కాపడని నివసిస్తున్నాడు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మధుబాబు పెన్షన్ యోజన’ లబ్ధిదారుడు. స్వయంగా నడవలేడు. ప్రతినెలా దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు ఇతరుల సాయంతో ప్రయాణించి, పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకొనేవాడు. ఫిబ్రవరిలో మాత్రం అతడికి ఈ ప్రయాణ బాధ తప్పింది. గ్రామ సర్పంచి డ్రోన్ ద్వారా పెన్షన్ అందజేసే ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. సర్పంచ్ సరోజ్ అగర్వాల్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బులను తన ఇంటి వద్దకే చేర్చారని హితారామ్ సత్నామీ ఆనందం వ్యక్తం చేశాడు. వృద్ధుడు హితారామ్ గురించి తెలిసిన తర్వాత సొంత డబ్బులతో ఆన్లైన్లో డ్రోన్ కొనుగోలు చేశామని, ప్రతినెలా డ్రోన్ సాయంతో అతడికి పెన్షన్ అందజేయాలని నిర్ణయించామని సర్పంచ్ సరోజ్ అగర్వాల్ చెప్పారు. -
ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
గుంటూరు మెడికల్: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి గుండె ఆగిపోగా.. అప్రమత్తమైన జనరల్ సర్జన్ నేరుగా కడుపులో నుంచి చేతిని గుండెపైకి పంపించి గుండెకు మసాజ్ చేసి ఆగిన గుండెను కొట్టుకునేలా చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఇన్చార్జి డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ మీడియాకు చెప్పారు. ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) నెల రోజులుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు చేసి (గ్యాస్టిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్) చేసి కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. జనరల్ సర్జరీ వార్డులో మెరుగైన చికిత్స అందించేందుకు సీటీ స్కాన్, బేరియం ఎక్స్‌రే, గ్యాస్ట్రోస్కోపి, ఎండోస్కోపి చేశారు. స్కానింగ్‌లో గుండె చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటుగా లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన డయాఫ్రాగ్మెటిక్ హెరి్నయాతో రోగి బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్యలో ఉండే డయాఫ్రమ్‌కు రంధ్రం ఏర్పడి అందులో నుంచి కడుపు, పెద్దపేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించారు. సాధారణంగా పుట్టుకతో డయాఫ్రమ్‌కు రంధ్రాలు ఏర్పడి వయసు పెరిగే కొద్ది పూడుకుపోతుందని కిరణ్‌కుమార్ చెప్పారు. వెంకటేశ్వర్లు విషయంలో డయాఫ్రమ్‌కు ఉన్న రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని తెలిపారు. ఆగిన గుండె.. గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులు, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని, ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వృద్ధుడి గుండె ఆగిపోయిందన్నారు. మత్తు వైద్యులు ఛాతిపై నుంచి మసాజ్ చేసే (సీపీఆర్) ప్రయత్నం చేస్తామని, ఆపరేషన్ ఆపాలని సూచించినట్లు చెప్పారు. తక్షణమే తాను డయాఫ్రమ్‌కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండెపైకి పోనిచ్చి నేరుగా చేతితో ఆగిపోయిన గుండెను నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొద్ది క్షణాల్లో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు. 3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఛాతి, గుండెలోకి వెళ్లిన పెద్ద పేగు, కడుపును కిందకు లాగి మరలా సమస్య ఉత్పన్నం కాకుండా ప్రొలేన్ మెష్ అమర్చి డయాఫ్రమ్‌ను మూసివేశామన్నారు. 48 గంటల పాటు ఐసీయూలో రోగిని ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తరువాత వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వృద్ధుడు కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే? ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. జీజీహెచ్‌కు సీఎం వైఎస్ జగన్ అత్యాధునిక వైద్య పరికరాలు అందజేయడంతో జనరల్ సర్జరీ వైద్య విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన ఆపరేషన్లను తాము పేదలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. ఆపరేషన్‌లో తనతోపాటు వైద్యులు రమణాచలం, వంశీ, వెంకటరమణ, సంతోష్, నిఖిల్, అనూష, లిఖిత, కిషోర్, వేణు, కోటి, మత్తు వైద్యులు మహే‹Ùబాబు, ప్రదీప్, ధరణి, శ్వేత పాల్గొన్నట్లు వెల్లడించారు. జనరల్ సర్జరీ వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. -
డ్యాన్స్ ఇరగదీసిన పెద్దాయన.. కుర్రాళ్లు అసూయపడేలా స్టెప్పులు..
ఆనందాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తపరుస్తారు. కొందరు సంతోషంగా ఉన్నప్పుడు మొహం వెలిగిపోతుంది. కళ్లు మెరుస్తాయ్. మాట తీరు కూడా మారిపోతుంది. ఇక పట్టరాని ఆనందం వస్తే మరికొందరు పాటలు పాడుతారు, కాలు కదిపి డ్యాన్స్ కూడా చేస్తుంటారు. ఓ 82 ఏళ్ల వ్యక్తి కూడా సరిగ్గా ఇలానే చేశారు. పట్టలేని సంతోషంలో నృత్యం చేసి అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వయసులో ఆయన ఎనర్జీ చూస్తుంటే కూర్రాళ్లకు కూడా అసూయ పుట్టేలా ఉంది. అంతలా తనను తాను మర్చిపోయి డ్యాన్స్‌లో మునిగిపోయారు. సూటు, బూటు ధరించి నాటు స్టెప్పులతో ఇరగదీసిన ఈ పెద్దాయన డ్సాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పార్టీలో ఆయన డ్యాన్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by praveenyadav (@fitfoodfactory_on_runway) -
అతడికి 72, ఆమెకు 28..కోడలినే పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు
72 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల కోడలిని పెళ్లిచేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఛపియా ఉమారో అనే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..72 ఏళ్ల కైలాష్ అనే వ్యక్తి బరహల్‌గంజ్ పోలీస్టేషన్లో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఐతే అతని మూడో కొడుకు కూడా అనుకోకుండా మరణించాడు. దీంతో అతని కోడలు పూజా వితంతువుగా మారడంతో అప్పటి నుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. ఐతే అనుహ్యంగా గత కొన్ని రోజులుగా మళ్లీ తన భర్త ఇంటికి వచ్చి ఉంటోంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఈ విషయమై పలు అనుమానాలు తలెత్తాయి. ఈ కైలాష్ అనే వృద్ధుడు తన కోడలు పూజానే ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం గుప్పుమంది. ఈ ఫోటో కాస్త పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో బర్హల్‌గంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారిస్తామని చెప్పారు. (చదవండి: ఎయిర్ షో సందర్భంగా నాన్‌వెజ్ అమ్మకాలు బంద్!) -
షాకింగ్ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...
బిహార్‌లో వృద్ధుడిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢీ కొట్టడంతో ఆ వృద్ధుడు కారు ముందు భాగం బానెట్‌పై పడిపయాడు. అయినా ఆపకుండా ర్యాష్‌గా వెళ్లిపోయాడు కారు డ్రైవర్. ఆ తర్వాత సడెన్ బ్రేక్‌లు వేసి ఆ వృద్ధుడిని కింద పడేసి..అతడిపై నుంచే వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని చంపారన్ జిల్లాలోని జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బాంగ్రా గ్రామానికి చెందిన శంకర్ చౌధర్ అనే 70 ఏళ్ల వ్యక్తి సైకిల్‌పై వస్తున్నాడు. బాంగ్రా చౌక్ సమీపంలోని ఎన్‌హెచ్27 రహదారిని దాటుతుండగా గోపల్‌గంజ్ పట్టణం నుంచి వేగంగా వస్తున్న కారు అతడిని ఢీ కొట్టింది. ఈ అనుహ్య ఘటనకు ఆ వృద్ధుడు ఆ కారు బానెట్‌పై పడిపోయాడు. ఐతే ఆ కారు డ్రైవర్ మాత్రం కారు ఆపకుండా నిర్లక్ష్యంగా పోనిచ్చాడు. అలా ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ వృద్ధుడిని ఈడ్చుకెళ్లి..సడెన్ బ్రేక్‌లు వేసి కింద పడిపోయేలా చేశాడు. దీంతో ఆ వృద్ధుడు ఒక్కసారిగా కారు కింద పడిపోయాడు. ఆ డ్రైవర్ కాస్త కూడా వృద్ధుడని కనికరం చూపకుండా.. కారుని అతని పై నుంచి తీసుకెళ్లిపోయాడు. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల స్థానికులు గమనించి ఆ కారుని ఆపమని అరవడమే కాకుండా కొంతమంది ఆ కారుని వెంబడించారు. కానీ ఆ డ్రైవర్ ఆ స్థానికులను చూసి మరింత స్పీడ్‌గా కారుని పోనిచ్చినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వాళ్లు ఎన్‌హెచ్27 రహదారి సమీపంలోని పోలీస్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో ఆ కారుని పిప్రకోఠి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐతే ఆ కారు డ్రైవర్‌తో సహా కారులో ఉన్నవారందరూ పరరయ్యినట్లు పేర్కొన్నారు. ఆ కారు యజమానిని ట్రేస్ చేసి ఈ ఘటన గురించి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఢిల్లీలోని 20 ఏళ్ల యువతి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన తర్వాత దేశంలో ఇదేతరహాలో వరుస ఘటనలు చోటుచేసుకోవం బాధాకరం. (చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు) -
నడిరోడ్డులో సైకిల్‌పై హుషారుగా స్టంట్స్.. పాపం తాత దీనగాథ!
-
Viral: నడిరోడ్డుపై ఆ తాత ఎందుకలా చేశాడంటే..
వైరల్: దగ్గర దగ్గర ఏడు పదుల వయసు. నడిరోడ్డులో సైకిల్ హ్యాండిల్ వదిలేసి.. హుషారుగా సైకిల్ తొక్కుతున్న ఓ వీడియో ట్విటర్ ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. వయసు అనేది కేవలం అంకె మాత్రమే అనే విషయం మరోసారి ఈ వీడియో ద్వారా రుజువైందని, అనుభవశాలి అయిన ఆ తాత సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేయడం చూస్తున్నాం. అదే సమయంలో.. నెగెటివ్ కామెంట్లు కూడా కొన్ని వస్తున్నాయి. తాగి అలా చేసి ఉంటాడని కామెంట్లు చేశారు కొందరు. ఏది ఏమైనా.. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలంటూ ‘‘జిందగీ గుల్జార్ హై’’ అనే ట్విటర్ పేజీ నుంచి ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో వెనుక దీనగాథ ఉందని తర్వాతే తేలింది. ముంబైకి చెందిన ఓ వెబ్సైట్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర థానే చెందిన భీమ్జీ(66/68 ఏళ్లు).. పదేళ్ల కిందట భార్యను పొగొట్టుకున్నాడు. ఏడాది కిందట ఒక్కగానొక్క కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అప్పటి నుంచి ఆ తాత కష్టాలు రెట్టింపు అయ్యాయి. కోడలు భీమ్జీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి.. ఉండడానికి గూడు లేని ఆ పెద్దాయన వసాయ్(పాల్ఘడ్) వద్ద బస్ షెల్టర్‌లో కాలం వెల్లదీస్తున్నాడు. అక్కడే ఉంటూ.. దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నాడు. పని లేనప్పుడు ఇలా సైకిల్ మీద స్టంట్స్ చేస్తూ డబ్బులు అడుక్కుంటున్నాడట. ఇదీ సైకిల్ తొక్కుతూ, విన్యాసాలు చేస్తూ దూసుకెళ్లిన వృద్ధుడి వీడియో వెనుక ఉన్న కథ.. -
వైద్యులు షాక్.. ఆ వృద్ధుడి కడుపులో ఏమున్నాయంటే?
యశవంతపుర(కర్ణాటక): మానసిక రోగి ఆయిన ఓ వృద్ధుడు తన చేతికి ఇచ్చే నాణేలను నిత్యం మింగేసేవాడు. రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన ద్యావప్ప (58) ఇలా 187 నాణేలను మింగాడు. అనారోగ్యానికి గురి కావటంతో కుటుంబ సభ్యులు బాగలకోట బసవేశ్వర సంఘం కుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీసి ఇక ఆలస్యం చేస్తే ప్రాణానికి పెను ప్రమాదమని వెంటనే శస్త్ర చికిత్స చేసి నాణేలను బయటకు తీశారు. ఐదు, రెండు రూపాయలు కాయిన్లు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. డాక్టర్ ఈశ్వర కలబురిగి, ప్రకాశ కట్టిమని, అర్చన, రూపలు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స తరువాత ద్యావప్ప ఆరోగ్యం కుదుటపడింది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? -
వృద్ధాప్యంలోనూ.. కుటుంబం కోసం బండలు కొట్టి, చెమట చిందిస్తూ..
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): మనుమలతో ఇంటి వద్ద సరదాగా గడపాల్సిన వయసులో ఆ వృద్ధుడు ఎండనకా.. వాననకా.. కుటుంబం కోసం తన చెమటను చిందిస్తున్నాడు. గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మ బస్తీకి చెందిన 80 సంవత్సరాల జి.పుల్లప్ప వృద్ధాప్యంలోనూ బండలు కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ విషయమై ‘సాక్షి’ అతడిని పలకరించగా తనకు ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారని, రోజంతా కష్టపడి ఇప్పటికి నలుగురు కూతుళ్ల పెళ్లి చేశానని, మరో కూతురు, కొడుకు పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుందని బదులిచ్చారు. పింఛన్ కోసం చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా రావడం లేదని, అధికారులు స్పందించి నా వంటి వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరాడు. (చదవండి: చారిత్రక సంపదకు నయా నగిషీలు) -
నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన
‘నీ కాళ్లు మొక్కుత సారు..పైసలిప్పియ్యరూ.. అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది. బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు ఉడుత అంజయ్య అక్కడికి వచ్చాడు. రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమి, బోరు పోయిందని పైసలు ఇప్పించాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి దండం పెట్టి వేడుకున్నాడు. చదవండి: (అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్) -
ఏకంగా 61 సార్లు ఎన్నికల్లో గెలిచి 106 ఏళ్ల వృద్ధుడిగా గిన్నిస్ రికార్డు
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కన్హయ్య లాల్ గుప్తా అనే 106 ఏళ్ల వృద్ధుడు ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్యే యూనియన్ నాయకుడిగా రికార్డు సృష్టిచాడు. అతడు యూనియన్ ఎన్నికల్లో ఏకంగా 61 సార్లు గెలిచిన అత్యంత పెద్ద యాక్టివ్ ట్రేడ్ యూనియన్ లీడర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కబోతున్నాడు. గోరఖ్‌పూర్‌కి చెందిన కన్హయ్య లాల్ గుప్తా 1946లో రైల్వేలో చేరిన తర్వాత ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. స్వాతంత్యం వచ్చేంత వరకు 10 ఏళ్లు సైన్యంలో పనిచేశారు. ఆ కొద్దికాలంలోనే ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎన్ఈఆర్ఎంయూ)తో అనుబంధం కలిగి ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో పోటీ చేస్తుండేవాడు. ఆయన 1981లో పదవి విరమణ చేశాడు. అయినప్పటికీ తన సహ రైల్వే యూనియన్ సభ్యులకు ప్రాతినిధ్యం వహించడం ఆపలేదు. అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తాను 1974లో స్వాతంత్య్ర ఉద్యమకారుడు జయప్రకాశ్ నారాయణతో కలిసి పనిచేయడం వల్ల స్ఫూర్తి, నైతిక బలాన్ని పొదినట్లు చెప్పారు. అతను రైల్వేలో అత్యంత పెద్ద వయసు కలిగిన ఫించనుదారుడు. అంతేకాదు అతని కెరీయర్లో కొన్ని ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి. అతను నాలుగుసార్లు పదవి నుంచి తొలగింపబడ్డాడు, ఒక నెల జైలు శిక్ష అనుభవించాడు. కన్హయ్య లాల్‌కి ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయమే నివాసం, అందులోని సభ్యులే తన కుటుంబం అని చెబుతుంటాడు. మీడియా నివేదికల ప్రకారం అతని కార్యాలయం ఏడాది పొడువునా తెరిచే ఉంటుంది. (చదవండి: తల నరికేసే ఊరిలో... రెండు దేశాల బార్డర్) -
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్‌కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
చక్రాల కింద ఇరుక్కుని.. చావుని తప్పించుకుని..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. చౌటుప్పల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ విఘ్నేశాచారి (73) ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చౌటుప్పల్‌కు వచ్చాడు. ద్విచక్ర వాహనంతో లారీ కింద ఇరుక్కున్న విఘ్నేశాచారి పని ముగించుకుని స్థానిక అంగడి ప్రాంతం నుంచి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో యూటర్న్ తీసుకునేందుకు బస్టాండ్ వద్దకి వెళ్లాడు. అక్కడ నెమ్మదిగా యూటర్న్ చేస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న రెడీమిక్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విఘ్నేశాచారితో పాటు ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుంది. ఇది గమనించని లారీడ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో పాటు స్థానికులు గట్టిగా కేకలు వేయగా లారీడ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, విఘ్నేశాచారిని లారీ కింద నుంచి బయటకు తీశారు. కాలికి చిన్నపాటి గాయం తప్పితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ నెమ్మదిగా వెళ్తుండటం, స్థానికుల కేకలతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. -
సుబ్బు @ 102
సాక్షి రాయచోటి: ఆయనది విలక్షణ శైలి..ఒకవైపు ఊరిలో జనం కోసం పాటుపడుతూ..మరోవైపు పలు సేవలతో అందరికీ దగ్గరయ్యాడు. భారతం చదివించినా..హరికథ చెప్పించినా..ఊరి రైతుకు శనక్కాయలు ఇచ్చినా ప్రతి వ్యవహారంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు. రైతు నాయకుడిగా..ప్రజల మనిషిగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే స్థానానికి పోటీలో నిలిచాడు. చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ ఎవరినీ అడిగినా టక్కున ఆయన గురించి చెబుతారు. చిన్ననాటి నుంచి ఈనాటి వరకు చిన్న ఖాయలా కూడా లేకుండా దిట్టంగా తిరుగుతున్న ఆయన పేరు ఎర్రదొడ్డి సుబ్బారెడ్డి. ఆయన వయస్సు ప్రస్తుతం 102 ఏళ్లు. వంద ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ సాటి రైతులు బాగుండాలని అప్పట్లో ఆయన సంకల్పించారు. అంతేకాదు...30 పశువులు, నాలుగు జతల ఎద్దులు, ఐదుగురుపాలేర్లతోపాటు ప్రతిరోజు 30–40 మందికి పని కల్పించారు. వయస్సు మీదపడినా నేటికీ తన పనులు తానే చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆహారపు అలవాట్లు, మద్యం, బీడి, సిగరెట్లకు దూరంగా ఉండడం సుబ్బారెడ్డి ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు. సుబ్బారెడ్డిని ఒక్కపేరుతో కాదు..అనేక రకాల పేర్లతో ప్రజలు పిలిచేవారు. అలాంటి సుబ్బారెడ్డిని ‘సాక్షి’పలుకరించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎమ్మెల్యేకు పోటీ చేసి.. బోరింగ్ సుబ్బారెడ్డిగా మారి.. సంబేపల్లె మండలం పొన్నేళ్లవాండ్లపల్లె (ఎగువపల్లె) గ్రామానికి చెందిన ఎర్రదొడ్డి సుబ్బారెడ్డికి 102 ఏళ్ల వయస్సు. ఈయనను మండలంలోని ప్రజలు అనేక రకాలపేర్లతో పిలుస్తారు. కారణం లేకపోలేదు. వంద ఎకరాల పొలం ఉండడంతో అందరూ వందెకరాల సుబ్బారెడ్డిగా పిలిచేవారు. పలు పల్లెల్లో కనీసమంటే పది సార్లకుపైగా భారతం చదివించినందుకుగాను భారతం సుబ్బారెడ్డిగా పిలుస్తారు. హరికథలు చెప్పించిన చరిత్ర కూడా ఈయనకు ఉంది. తిరుపతికి వెళ్లి హరిదాసును తీసుకు రావడం, కొన్నిమార్లు ప్రొద్దుటూరుకు చెందిన హరిదాసును తీసుకొచ్చి కథలు చెప్పించడంతో హరికథ సుబ్బారెడ్డిగా మారిపోయారు. ఈయన పొలంలో వ్యవసాయం చేస్తూనే చుట్టుపక్కల పల్లెలకు సంబంధించిన భూములు కూడా కళకళలాడాలన్న సంకల్పంతో సీజన్లో వెయ్యి బస్తాల వరకు వేరుశనగ కాయలు తెచ్చి అందరికీ పంచేవాడు. పంట పండిన తర్వాత తిరిగి ఇచ్చేవారు కొందరైతే, పంటపండలేదని ఇవ్వనివారు లేకపోలేదు. అయితే అందరూ బాగుండాలని సంకల్పించిన ఆయనను శనిక్కాయల సుబ్బారెడ్డిగా కూడా పిలుచుకునే వారు. 100 ఎకరాల పొలంలో 40–50 ఎకరాలు మామడికాయలు పండించేవాడు. లారీల్లో లోడు తీసుకెళుతున్న నేపథ్యంలో ఆయనను మామిడికాయల సుబ్బారెడ్డిగా గ్రామస్తులు పిలుచుకునేవారు. ఇలా చెబుతూ పోతే కొన్నేళ్ల కిందట వరుసగా కుటుంబీకులకు కొత్త ఇళ్లు కట్టించడంతో కొత్తమిద్దె సుబ్బారెడ్డి అనేవారు. అయితే 30 ఏళ్ల కిందట ఈయన రాయచోటి ఎమ్మెల్యే స్థానానికి రేసులో నిలిచారు. పోటీలో దిగి రైతు నాయకుడిగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల సంఘం బోరింగ్ గుర్తును కేటాయించడంతో అప్పటి నుంచి అందరి దృష్టిలో బోరింగ్ సుబ్బారెడ్డిగా మారిపోయారు. సంబేపల్లె సబ్‌స్టేషన్ కోసం ఆమరణ దీక్ష సంబేపల్లె మండలానికి చెందిన సుబ్బారెడ్డి ఒకానొక సమయంలో స్వాతంత్య్ర ఉద్యమ సమరంలోనూ అందరితో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తర్వాతి కాలంలో రైతులకు సంబంధించిన అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. 1994 ప్రాంతంలో సంబేపల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.మూడు రోజుల అనంతరం పోలీసులు వచ్చి దీక్ష విరమింపజేశారు. రైతు నాయకుడిగా ఉండడంతో సమస్యలపై పలుమార్లు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి చర్చించేవారు. ఇప్పటికీ వైఎస్సార్ కుటుంబమంటే ఎనలేని అభిమానాన్ని చూపుతారు. ఆరోగ్య రహస్యం:వ్యసనం లేని జీవితం చిన్ననాటి నుంచి నేటి వరకు సుబ్బారెడ్డి వ్యసనాలకు దూరంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం కూడా తనపని తానే చేసుకోగలుగుతున్నాడంటే ఆయన జీవన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సిగరెట్, బీడి, మద్యం లాంటి వ్యవసనాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా బలవర్దక ఆహారం తీసుకునే వారు. రైతు సంఘం నాయకుడిగా ఉంటూ ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొసారి అర్దరాత్రి ఇంటికి వచ్చినా ఆహారంలోకి కచ్చితంగా శనక్కాయ విత్తనాలు, బెల్లం కలిపి తీసుకునేవాడు. వారంలో ఒకటి,రెండుసార్లు తలకూర తీసుకోవడం పరిపాటిగా ఉండేది. బెల్లం పాయసం, పూర్ణం కూడా ఎక్కువగా తీసుకునేవాడు. అప్పట్లో రాగి సంగటిని చికెన్, మటన్ చేసిన సందర్భంలో తీసుకునేవారు. మిగతా కాలంలో సాధారణ ఆహారం తీసుకునేవారు. అయితే ప్రతినిత్యం అటు పొలాల వద్దకు, ఇటు మండలకేంద్రం సంబేపల్లెకు నడకమార్గంలోనే వెళుతుండేవాడు. వయస్సు 102 సంవత్సరాలకు చేరుకున్నా సుబ్బారెడ్డికి బీపీ, షుగర్ అనేవి తెలియవు. కంటిచూపు బాగుంది....దినపత్రికను చదవడంతోపాటు పేపరుపై పెన్నుతో రాయడం వరకు నేటికీ పనితనం కనిపిస్తుంది. ఈయన ఇప్పటికే మనవళ్లతోపాటు మునివళ్లు కూడా కలిగి ఉన్నారు. కట్టెసాయంతో ముందుకెళతారు. ఇంటిలో కూడా తన పనులు తానుచేసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. -
మహిళను లోబర్చుకుని.. రాత్రి తలుపులు పగులకొట్టి..
సాక్షి,బీబీపేట(కామారెడ్డి): మహిళను లోబర్చుకున్నాడని ఓ వృద్ధుడిని మంత్రాల నెపంతో హత్య చేశారు. బీబీపేటలో శనివారం అర్ధరాత్రి జరి గిన ఈరోల్ల మల్లయ్య(62) హత్య కేసును పోలీసులు ఒక రోజు లోనే ఛేదించి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మల్ల య్య హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ప్రత్యేక నిఘా ఉంచగా బీబీపేట బస్టాండ్ వద్ద దొరికారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సోమవారం భిక్కనూర్ సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. మృతుడు మల్లయ్య ఇంటి పక్కన ఉండే మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహిళ బంధువులు కొంగరి పోచయ్య, రాజ్‌కుమార్ నిందితుడిపై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు మల్లయ్య ను హెచ్చరించారు. అయినా తీరు మారకపోవడంతో మల్లయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మల్లయ్య, మహిళను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసుకున్నాడు. దీంతో కొంగరి పోచయ్య, రాజ్ కుమార్‌లు గడ్డపారతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బ యటకు లాక్కొచ్చారు. మల్లయ్య తలపై బండరాయితో మోది, ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్య అక్కడికకక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు మల్లయ్యకు మంత్రాలు వస్తాయని, దీంతో మ హిళను లోబర్చుకున్నట్లు నిందితులు పోలీసులతో పేర్కొన్నా రు. పోలీసులు, నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చ గా నిజామాబాద్ జైలుకు తరలించారు. చదవండి: Extra Marital Affair: వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. -
చితి పేర్చి.. నిప్పంటించి
రామాయంపేట, నిజాంపేట (మెదక్): చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధునిపై అయినవారే హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చల్మెడ గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ సోదరి భూదేవికి ముగ్గురు కుమారులున్నారు. కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుదర్శన్ తమపై చేతబడి చేస్తున్నాడని కొన్నేళ్లుగా భూదేవి కుటుంబ సభ్యులు అనుమానిస్తూ, అతనిపై కక్ష పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం భూదేవి పెద్ద కోడలు అనారోగ్యానికి గురైంది. సుదర్శన్ చేతబడి చేశాడని అనుమానించారు. రెండు కుటుంబాల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. శనివారం ఉదయం భూదేవి ఆమె ముగ్గురు కొడుకులు, మరికొందరు సుదర్శన్ ఇంటికి వచ్చి దొరికిన వారిని దొరికినట్లే కొట్టారు. సుదర్శన్‌ను బయటకు లాక్కొచ్చి అతడి ఇంటి ముందే కర్రలతో చితిపేర్చి పెట్రోల్ పోసి నిప్పటించారు. అదే సమయంలో ఓ కేసు విచారణ నిమిత్తం నిజాంపేట వచ్చిన పోలీసులు మంటలను ఆర్పి సుదర్శన్‌ను రక్షించారు. గాయపడిన సుదర్శన్‌ను 108 అంబులెన్సులో రామా యంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ మేజిస్ట్రేట్ బాధితుని వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు ఒక్కరు కూడా హత్యాయత్నాన్ని అడ్డుకోలేదని బాధితులు వాపోయారు. -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
తిన్నింటికే కన్నం...రూ.40 లక్షలు స్వాహా
బంజారాహిల్స్: తన తండ్రికి సహాయంగా ఉండేందుకు నియమించిన అటెండర్ నమ్మక ద్రోహానికి పాల్పడి తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ. 40 లక్షల మేర నగదు డ్రా చేసి మోసగించాడంటూ ఓ ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ఆర్ఆర్ఎస్ అర్ని(94) నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు విద్యుత్ అర్ని కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుండగా కూతురు హాంకాంగ్‌లో ఉంటున్నది. 2019లో తల్లి చనిపోవడంతో తన తండ్రికి సహాయంగా ఉండేందుకు జనగామ సమీపంలోని చేల్పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌ను నెలకు రూ.30 వేల జీతంతో 2017లో అటెండర్‌గా నియమించారు. ఆ ఇంట్లో ఉదయ్‌కిరణ్‌తో పాటు గార్డెనర్, డ్రైవర్, కుక్, పనిమనిషితో సహా నలుగు రు పని చేస్తుంటారు. తన తండ్రికి సేవలు సరిగ్గా లభిస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విద్యుత్ అర్ని, కూతురు కలిసి ఇంట్లో 12 కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే పర్యవేక్షించేవారు. తన తండ్రికి సమయానికి ఆహారం, మాత్రలు ఇస్తున్నారో లేదో కెమెరాల ద్వారానే తెలుసుకునేవారు. తన తండ్రి ఫోన్, కంప్యూటర్, ఐప్యా డ్ తదితర పనులను కూడా ఉదయ్‌కుమార్ చేసేవారు. ఇదే అదనుగా బ్యాంకు లావాదేవీలు చూసే క్రమంలో ప్రతి నెల ఇంటి ఖర్చులు డ్రా చేసే నిమిత్తం మూడేళ్లలో రూ.40 లక్షల వరకు దొడ్డిదారిలో డ్రా చేసి తన జేబులో వేసుకున్నట్లుగా తేలిందన్నా రు. తాను ఇటీవల హైదరాబాద్‌కు వచ్చానని ఇంటి లెక్కలు ఆడిట్ చేయగా రూ.40 లక్షలు అక్రమాలు తేలాయని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉదయ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
పైశాచికం: మానసిక వికలాంగుడిపై దాడి.. విద్వేష హత్య!
భోపాల్: మతం పేరిట మానసిక వికలాంగుడు, అందునా వృద్ధుడిపై దాడి చేసిన హేయనీయమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. పైగా దాడి చేసింది బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానసిక వికలాంగుడైన ఓ వృద్ధుడిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరించడం, అందులో మతం పేరిట అతనిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఆ వృద్ధుడు విగతజీవిగా కనిపించడంతో.. తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ విమర్శలు రావడంతో.. పోలీసులు దాడి, హత్య కేసు నమోదు చేసుకున్నారు. పైగా దాడికి పాల్పడింది బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో.. ఘటన చర్చనీయాంశంగా మారింది. నీముచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. ‘నీ పేరేంట్రా? మహమ్మదా? నీ ఆధార్ కార్డు తీయ్ ముసలోడా’ అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది. పాపం.. ఏ జరుగుతుందో కూడా అర్థంకానీ స్థితిలో ఆ వృద్ధుడు అవస్థ పడడం వీడియోలో గమనించొచ్చు. తన దగ్గరున్న డబ్బు సంచి చూపించే ప్రయత్నం చేయగా.. నిందితుడు పదే పదే ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. గురువారం ఈ దాడి ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. బాధితుడిని రట్లమ్ జిల్లా సాస్రికి చెందిన భనర్వల్‌లాల్ జైన్‌గా గుర్తించారు. రాజస్థాన్‌లో దైవదర్శనానికి భనర్వల్‌లాల్ కుటుంబం. అయితే అక్కడే ఆయన తప్పిపోయాడు. మే 15వ తేదీ నుంచి భనర్వల్‌లాల్ కనిపించకుండా పోయాడని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో భనర్వల్‌లాల్ మృతదేహం లభ్యంకాగా, ఆ తర్వాతే దాడి వీడియో వైరల్ అయ్యింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా రాజకీయంగా ఈ దాడి దుమారం రేపడంతో.. హోం మంత్రి నరోట్టమ్ మిశ్రా స్పందించారు. నేరస్తుడు.. నేరస్తుడే అని.. దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు దినేష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. A murder case has been registered in after a 65-year-old with mental illness was found dead and a video showed Dinesh Kushwaha, husband of an ex BJP corporator asking him if his “name is Mohammed” and repeatedly assaulting him as he struggled to answer @ndtv @ndtvindia pic.twitter.com/jWNDlLKpFb — Anurag Dwary (@Anurag_Dwary) May 21, 2022 -
వయసు తలకిందులు
75 ఏళ్ల వయసంటే.. నడవడానికి కూడా కష్టమే. అలాంటిది తలకిందులుగా నిలబడటమంటే మామూలు విషయం కాదు. కానీ ఒకాయన మాత్రం ఆ వయసులోనూ తలకిందులుగా నిలబడి రికార్డు సృష్టించారు. అలాంటిలాంటి రికార్డు కాదు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు. 70 పదుల వయసులో ఇలాంటి పేరు సంపాదించిన ఆ వ్యక్తి పేరు టానియో హిలోవు. ఈయన కెనడాకు చెందిన వ్యక్తి. తలకిందులుగా నిలబడటాన్ని సరిగా చేయకపోతే మెడ, తలపై గాయాలవుతాయి. మామూలుగా యువకులుగా ఉన్నప్పుడే ఇవి చేస్తుంటారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇలాంటివి చేయకూడదని చెబుతుంటారు. అయితే టానియో మాత్రం.. శారీరక సవాళ్లను ఏ వయసులోనైనా ఎదుర్కోవచ్చని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశానన్నారు. గతేడాది అక్టోబర్‌లో టానియో గిన్నిస్ రికార్డు సాధించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరలైంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
Digital Rape: డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్
నోయిడా: తన కూతురికి చదువు చెప్పిస్తాడేమో అనే ఉద్దేశంతో అతని దగ్గరికి పంపిస్తే.. ఆ వృద్ధుడు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. అలా ఏడేళ్లపాటు అసాధారణ రీతిలో సాగింది ఆ వ్యవహారం. చివరికి బాధితురాలు ధైర్యం చేయడంతో ఈ వేధింపుల పర్వం వెలుగు చూసింది. నిందితుడి మౌరైస్ రైడర్ వయసు 81 ఏళ్లు. వృత్తి రిత్యా పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ కూడా. హిమాచల్ ప్రదేశ్‌లో అతనికొ ఒక ఆఫీస్ ఉంది. ఏడేళ్ల కిందట అతని దగ్గర పని చేసే ఓ వ్యక్తి.. తన కూతురిని ఆ వృద్ధుడి దగ్గరకు సాయంగా పంపించాడు. బదులుగా ఆమెకు చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చాడు ఆ వృద్ధుడు. అయితే ఆనాటి నుంచి వృద్ధుడు ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. తండ్రికి చెబితే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె భరిస్తూ వచ్చింది. చివరికి.. ఆ వృద్ధుడి ఆగడాలు తట్టుకోలేక ఆ టీనేజర్ ధైర్యం తెచ్చుకుంది. గత నెల రోజులుగా మౌరైస్ బాగోతాలను రికార్డు చేస్తూ వచ్చింది. అందులో చాలావరకు ఆడియో ఫైల్స్ ఉన్నాయి. చివరకు వాటిని ఓ మహిళకు అప్పగించి, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు(నోయిడా, యూపీ).. ఆదివారం డిజిటల్ రేప్ నేరం కింద మౌరైస్‌ను అరెస్ట్ చేశారు. డిజిటల్ రేప్ అంటే.. చాలామంది ఆన్లైన్ సంబంధిత నేరం అనుకుంటారు. కానీ, డిజిటల్ రేప్ మర్మాంగం కాకుండా ఏదేని వస్తువు, ఆయుధాలను, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడడం. ఇంగ్లీష్ డిక్షనరీలో డిజిటల్ అనే పదానికి అర్థంతో ఈ నేరానికి ఆ పేరొచ్చింది. గతంలో ఇది అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ, 2012 నిర్భయ ఘటన తర్వాత డిజిటల్ రేప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్ రేప్ కింద.. ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు.. ఒక్కోసారి జీవిత ఖైదు విధిస్తారు. ఈ తరహా ఘటనల్లో 70 శాతం దగ్గరి వాళ్ల వల్లనే జరుగుతున్నాయి. కాబట్టే.. చాలా చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. చదవండి: పెదాలపై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు -
కన్నకొడుకుని హతమార్చిన 90 ఏళ్ల వృద్ధుడు
గుంతకల్లు: ‘ఎంత వరకు ఓపిక పట్టాలి. ఎంతగా నచ్చచెప్పినా మారలేదు. ప్రతిరోజూ నాకు నరకమే చూపాడు. నాకున్న ఆరుగురు కుమారుల్లో ఎవరూ ఇంతగా సతాయించలేదు. ఏం చేయమంటారు? మనశ్శాంతి కోసం వాడు చచ్చేదాకా ఇనుప రాడ్‌తో తలపై పలుమార్లు బలంగా బాదాను’ అంటూ పోలీసుల ఎదుట 90 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి వేధింపులు తాళలేక చివరకు హతమార్చాల్సి వచ్చిందంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపిన మేరకు.. మద్యానికి బానిసగా మారి.. గుంతకల్లులోని ఎస్ఎల్వీ థియేటర్ వెనుక ఉన్న యల్లమ్మ తగ్గు ప్రాంతంలో నివాసముంటున్న షేక్ జాఫర్‌సాహెబ్‌కు ఆరుగురు కుమారులు సంతానం. వీరిలో ఐదో కుమారుడు షేక్ ఖలీల్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాగుడుకు బానిసైన ఖలీల్ వేధింపులు తాళలేక మూడేళ్ల క్రితం అతని భార్య విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి విడిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దనే ఖలీల్ ఉంటున్నాడు. ఎలాంటి పనీపాట లేకుండా మద్యం మత్తులోనే జోగుతుండేవాడు. వృద్ధాప్యంలో శరీరం సహకరించకపోయినా.. కూలి పనులతో కుటుంబ పోషణ భారాన్ని జాఫర్ సాహెబ్ మోస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ తండ్రిని ఖలీల్ వేధించేవాడు. డబ్బు లేదని చెబితే నడిరోడ్డుపై కేకలు వేస్తూ ఇరుగూపొరుగు వారితో గొడవకు దిగేవాడు. వేధింపులు తాళలేక.. మంగళవారం రంజాన్ పండుగను ఉన్నంతలో గొప్పగా చేయాలని తండ్రి భావించాడు. దాచుకున్న డబ్బు తీసి వంట సరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి చేతిలో డబ్బు చూసిన ఖలీల్ తనకు ఇవ్వాలని గొడవపడ్డాడు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. మాటలతో దూషించాడు. అసహాయుడైన వృద్ధుడిపై దాడి చేసేందుకూ వెనుకాడలేదు. దీంతో జాఫర్‌సాహెబ్‌లో ఓపిక నశించింది. ఇక కుమారుడు జీవించి ఉన్నంత కాలమూ తనకు మనశ్శాంతి ఉండదని భావించాడు. మధ్యాహ్నం నిద్రిస్తున్న కుమారుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని పలుమార్లు తలపై బలంగా మోదడంతో ఖలీల్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన వృత్తాంతాన్ని పోలీసులకు జాఫర్‌సాహెబ్ వివరించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నర్సింగప్ప, రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ..
సాక్షి, హైదరాబాద్: అతని వయసు 50 సంవత్సరాలు. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ని ఓ మాట్రిమోనియల్ సైట్లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే ఓ అందమైన 23 ఏళ్ల యువతి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టింది. అమ్మాయి కావడంతో యాక్సెప్ట్ చేసి మాట కలిపాడు. తాను నగరంలోని ఓ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఫైనలియర్ చదువుతున్నానని పరిచయం చేసుకుంది. మీ ప్రొఫైల్‌ని ‘మాట్రిమోనియల్’ సైట్లో చూశాను..నాకు నచ్చారని చెప్పింది. అందమైన యువతి తనకు తానే పలకరించడంతో ఆ వ్యక్తి పరవశించిపోయాడు. ఇద్దరి మధ్య కొద్దిరోజుల పాటు సాన్నిహిత్యంగా బాగా సాగింది. నాకంటే మీరు 25 ఏళ్లు వయసులో ఎక్కువ అయినా..మీ ఆచారాలు, పద్ధతులు నచ్చి ఇష్టపడ్డానన్నది. ఈలోపే ఇతగాడు ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. నిమిషాల కొద్దీ కాల్స్..గంటల కొద్దీ చాటింగ్ నడిచింది. సడన్‌గా ఒకరోజు ఫైనలియర్ ఫీజుకు డబ్బు అవసరమని కోరింది. కొంత ఇచ్చాడు. ఆ తర్వాత కోవిడ్ వచ్చిందని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యానని చెప్పింది. మరో రూ.10 లక్షలు ఇచ్చాడు. కొద్దిరోజులు గడిచాక మా అమ్మకు కోవిడ్ వచ్చిందని చెప్పి మరో రూ.10 లక్షలు లాగేసింది. తన లగ్జరీ ఖర్చులు, ఇతర అవసరాల కోసం అతగాడి నుంచి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.46 లక్షలు కాజేసింది. ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాక గానీ ఆ వ్యక్తి తాను మోసపోయానని గుర్తించలేకపోయాడు. చివరకు తేరుకుని శుక్రవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. చదవండి👉 ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్ -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
ముసలాయనే గానీ..మహానుభావుడు..