రాయగడ( భువనేశ్వర్): అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఓ వృద్ధుడ్ని తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి మానవీయతను చాటుకున్నారు రాయగడ సబ్ కలెక్టర్ ప్రతాప్‌చంద్ర ప్రధాన్. ఆదివారం రాయగడ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి సుమారు ఏడు కిలొమీటర్ల దూరంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పి.రాములు అనే వృద్ధుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆటోలో వచ్చాడు.
ఈ సమయంలో బాలల దినోత్సవం సందర్భంగా గాంధీ పార్క్ వద్ద విద్యార్థులు ర్యాలీ నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆటో ముందుకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుందని భావించిన డ్రైవరు ఆ వృద్ధుడ్ని అక్కడే దింపి వెనక్కు వెళ్లిపోయాడు. అనారోగ్యం కారణంగా నడిచే ఓపిక లేక వృద్ధుడు అక్కడే దీనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అదే మార్గంలో సబ్ కలక్టర్ ప్రతాప్ చంద్ర ప్రధాన్ వెళ్తూ వృద్ధుడి దీనావస్థను గమనించి తన వాహనాన్ని నిలిపి వివరాలు ఆరా తీశారు. అనంతరం తన వాహనంలో వృద్ధుడ్ని ఎక్కించుకుని సరాసరి ఆస్పత్రికి తీసుకెళ్లి దగ్గరుండి చికిత్స చేయించారు. దీంతో వృద్ధుడు సబ్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
చదవండి: ఒడిశా: రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment