మా కోడలు ఆస్పత్రిలో ఉంది.. డబ్బు ఇవ్వండి సారూ.. | old men request for for money exchange hi's doughter in law in hospital | Sakshi
Sakshi News home page

మా కోడలు ఆస్పత్రిలో ఉంది.. డబ్బు ఇవ్వండి సారూ..

Published Mon, Nov 14 2016 3:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

old men request for for money exchange hi's doughter in law in hospital

‘మా కోడలు ఆస్పత్రిలో ఉంది సారూ.. మందుగోలీలకు డబ్బులు కావా’లంటూ ఓ వృద్ధుడు బ్యాంకుకు వచ్చి మొరపెట్టుకున్నాడు. కానీ అప్పటికే సమయం అరుుపోరుుందంటూ అధికారులు నిరాకరించడంతో.. కంటతడి పెడుతూ వెనుదిరిగాడు. మెదక్ మండలం పాతూరుకు చెందిన సిద్ధయ్య కోడలు ఆదివారం మెదక్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో డెలివరీ అరుుంది. ఆమెకు వెంటనే మందులు తీసుకురావాలంటూ వైద్యులు సూచించారు. దాంతో సిద్దయ్య దగ్గరున్న పెద్ద నోట్లను తీసుకుని పట్టణంలోని ఎస్‌బీహెచ్ బ్రాంచికి వచ్చాడు. తనకు డబ్బులివ్వాలని అధికారుల కాళ్లావేళ్లాపడ్డాడు. కానీ అప్పటికే సమయం ముగిసిపోరుుందంటూ అధికారులు తాళం వేసుకుని వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement