money
-
పిల్లలూ దేవుడూ.. చల్లనివారే
మామా మందుకు డబ్బుల్లేవా.. డోంట్ వర్రీ మామా.. నేనున్నాను కదా పదా పోదాం.. ఇదిగో సిగరెట్ తీసుకో బావా.. భయమెందుకు నేనున్నా.. కదా.. బే ఫికర్ బ్రదర్.. నేను చూస్కుంటానులే.. ఈ చొక్కా నచ్చిందా తీసుకో.. నేను బిల్లు పే చేస్తాను.. ఆగాగు.. టిక్కెట్ నువ్వెందుకు తీయడం.. నీకసలే జీతం తక్కువ.. ఇంకెప్పుడూ పక్కన నేను ఉండగా నువ్వు జేబులో చేయి పెట్టొద్దు.. పెట్రోల్ నేను పోయిస్తాను తమ్ము.. నువ్వెందుకు కంగారు పడతావ్... ఇలాంటి స్నేహాలు మనం చూస్తూనే ఉన్నాం..వద్దులే లక్ష్మి ఆటోచార్జీ పది రూపాయలు నువ్వు ఇవ్వకు.. నేను ఇస్తాలే.. ఒసేయ్ మంగా మేమంతా తలో రెండొందలతో ఆరుకు వెళ్తున్నాం.. నువ్వూ రావాలి.. డబ్బులెం ఇవ్వద్దులే.. మేం చూసుకుంటాం.. జస్ట్ నువ్వు ఆటో ఎక్కు చాలు.. ఇదీ హౌస్ వైవ్స్ స్నేహం.. హలొ.. బ్రదర్ రాజేష్.. మనవాళ్ళం ముగ్గురం బిజినెస్ పెడుతున్నాం తలో టూ క్రోర్స్ ఉండాలి.. నువ్వు అంత పెట్టలేవు.. ఎంత ఉంటే అంత పెట్టు.. చాలు.. మిగతాది మేం చూస్తాం.. నువ్వేం ఫీల్ కావద్దు.. హలో రెడ్డీ.. ఈ బిజినెస్ మనదే.. పెట్టుబడి నేను పెడతాను.నువ్వు జస్ట్ డబ్బుల్లేకున్నా వర్కింగ్ పార్ట్నర్ గా ఉండు.. పని మొత్తం నువ్వే చూసుకో.. ఇదో టైప్ స్నేహం.. అసలు స్నేహం.. ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక జీవన విధానం అయింది.. చిన్నప్పుడు తెచ్చుకున్న బిస్కెట్ ముక్క.. కాకెంగిలి చేసి ఇచ్చిన ఉసిరికాయ లంచ్ టైములో తన డబ్బాలోంచి తీసిచ్చిన చిన్న ఆవకాయ ముక్క.. ఇవన్నీ మనలోని ఒక ఆత్మీయ భావనకు సూచికలు ...ఒక్కడే తిన్నది తిండీ కాదు.. ఒక్కడే బతికింది బతుకూ కాదు.. మనిషి సంఘ జీవి.. తాను బతుకుతూ ఇంకొందరిని బతికించాలి.. తానూ తింటూ ఇంకొకరి ఆకలి తీర్చాలి అప్పుడు కదా జీవితానికి సార్థకత. కాకి .. పిచ్చుక.. కుక్కలు కూడా తాము తింటూనే అక్కడ అక్కడ గింజలు.. మెతుకులు ఉన్నాయ్.. మీరూ రండి అని తోటివాళ్లను పీలుస్తాయి.. అంతా కలిసి ఆకలి తీర్చుకుంటాయి.. కానీ మనిషి ఒక్కడే తాను తింటే చాలనుకుంటాడు.చిన్న పిల్లలు.. పెద్ద మనసులు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ స్కూల్లో పిల్లలు తమ సహచరుడి ఫీజ్ కోసం ఎంత యాతన పడ్డారు.. వారంతా ఐక్యంగా ఆ సమస్య నుంచి తమ మిత్రుడిని ఎలాగట్టెక్కించారన్నది ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీనికి వేళల్లో షేర్లు.. వందల్లో కామెంట్లు వచ్చాయి. స్కూల్లో ఫీజు చెల్లించలేదని ఒక అబ్బాయిని స్కూలు మేనేజిమెంట్ ప్రశ్నిస్తుంది.. అయితే తన తండ్రి పేదరికం కారణంగా ఆ పిల్లడు ఫీజు సకాలంలో చెల్లించలేకపోతాడు.. దీంతో అతని సహచరులు.. అంతా పదేళ్లలోపు పిల్లలే అయినా పెద్దమనసు చేసుకుంటారు.. తలా కొంత వేసుకుని స్నేహితుడి ఫీజు చెల్లిస్తారు.వారు తమలోతాము చందాలు వేసుకుంటుండగా టీచర్ వచ్చి అబ్బాయిలు.. మీ ఫ్రెండ్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండి.. మీకెందుకురా కష్టం అని చెబుతున్నా.. మీ సాయం మాకు అవసరం లేదు.. మా వాడికి మేమున్నాం.. మేం చూసుకుంటాం అని వారంతా ఏకమై తమ మిత్రుడి ఫీజు చెల్లించిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. తనకోసం వాళ్లంతా ఇలా డబ్బులు వేసుకోవడాన్ని చూసిన ఆ పిల్లడు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనకైనా మనసు కరుగుతుంది. ఇది కదా పిల్లలలో ఉండాల్సింది. ఇలాంటి లక్షణాలు కదా పిల్లల్లో మొలకెత్తాలి.. అలా పిల్లల్లో పురుడుపోసుకున్న ఆలోచనలకూ తల్లిదండ్రులు సైతం తోడ్పాటును ఇవ్వాలి-సిమ్మాదిరప్పన్న These young good hearts collected money to pay fees of his friend 🥺I hope these young angels continue their pure and innocent spirit and bless the world 🙌 pic.twitter.com/BGQ2uw9d5o— Vineeta Singh 🇮🇳 (@biharigurl) February 7, 2025 -
పేటీఎం కొత్త ఫీచర్.. యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
పేటీఎం తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్’ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పేటీఎం క్యూఆర్ కోడ్‌ను నేరుగా తమ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై డిస్ ప్లే చేసుకోవచ్చు. ప్రతిసారి యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్స్టంట్ పేమెంట్ కనెక్షన్‌కు వీలు కల్పించింది.లావాదేవీలను సరళతరం చేయడంలో భాగంగా గతంలో ఐఓఎస్ యూజర్లకు ఈ క్యూఆర్ విడ్జెట్‌ను పేటీఎం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సర్వీసును ఆండ్రాయిడ్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. ఇది చిన్న వ్యాపారాలు, దుకాణదారులు.. వంటివారికి నిరాటంకంగా చెల్లింపులను స్వీకరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసు ద్వారా పేటీఎం చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.రియల్ టైమ్ అలర్ట్లుయూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేటీఎం ప్రత్యేకమైన కాయిన్ డ్రాప్ సౌండ్ నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రియల్ టైమ్ అలర్ట్ యూజర్ అందుకున్న చెల్లింపుల ధ్రువీకరణను నిర్ధారిస్తుంది. వినియోగదారులు యాప్‌ను తనిఖీ చేయకుండానే లావాదేవీల గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..క్యూఆర్ విడ్జెట్‌ను ఎలా యాడ్ చేయాలంటే..ఆండ్రాయిడ్ ఫోన్లో సులభంగానే హోమ్ స్క్రీన్‌పై క్యూఆర్ విడ్జెట్‌ను సెటప్ చేసుకోవచ్చు.పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.ఎగువ ఎడమవైపు ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి.క్యూఆర్ కోడ్ దిగువన ‘యాడ్ క్యూఆర్ టు హోమ్ స్క్రీన్’ ఆప్షన్ ఎంచుకోండి.దాన్ని కన్ఫర్మ్ చేయాలి. వెంటనే విడ్జెట్ హోమ్ స్క్రీన్‌పై వస్తుంది.పేటీఎం యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ విడ్జెట్ ద్వారా చెల్లింపులు స్వీకరించవచ్చు. -
బెట్టింగ్ యాప్‌లో రూ. 13 లక్షలు లాస్
ఆత్మకూరురూరల్: ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు సర్వం పోగొట్టుకుని కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఓ ఫైనాన్స్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 13 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఈ మొత్తాన్ని క్రెడిట్ కార్డులు, ప్రైవేట్ చీటీల ద్వారా తీసుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం రాత్రి ఆరు పేజీల లేఖ రాసి ఇంట్లో పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, భార్యను క్షమించమని, ఇక నుంచి ఎవరికీ కనపడనని లేఖలో రాశాడు. నిరంజన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాము తెలిపారు. -
కల్యాణలక్ష్మి డబ్బునుంచి పంట రుణం కోత
సిరికొండ: నిరుపేద ఆడపిల్లల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండగా, ఈ పథకం కింద వచ్చిన డబ్బు నుంచి బ్యాంకు అధికారులు పంట రుణాన్ని జమచేసుకున్నారు. దీంతో ఓ తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లచ్చింపూర్(బీ) గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందురు సోమ్బాయికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురుకు గత వేసవిలో వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా గతవారం ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 చెక్కు అందుకుంది.తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 17న వోచర్ రాసి ఇచ్చింది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను అడిగితే.. ఆమె పంట రుణం రూ.1.60 లక్షలు ఉండగా, వడ్డీ రూ.60 వేలు అయిందని, దీంతో కల్యాణలక్ష్మి డబ్బుల నుంచి వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్నామని చెప్పగా, ఆమె అవాక్కయింది. తనకు వచ్చిన పూర్తి డబ్బులను ఇవ్వాలని ఎంత వేడుకు న్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదని ఆమె ఆవే దన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలని అనుకుంటే, పంట రుణం కింద జమ చేసుకోవడం అన్యాయమని బోరుమంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నరేశ్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. -
AI జనరేటెడ్ ఫొటో కాదు.. ప్రభుత్వ అధికారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు
పాట్నా : ఈ నోట్ల కట్టల్ని చూసి ఏఐ జనరేటెడ్ ఫొటో అనుకునేరు. ఓ జిల్లా విద్యాశాఖ అధికారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు. బెడ్ కింద, సోఫా కింద ఇలా ఎక్కడ పెట్టినా నోట్ట కట్టలే దర్శనమిస్తున్నారు. దీంతో నోట్ల ఈ నోట్ల కట్టల్ని చూసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ముక్కున వేలేసేకుంటున్నారు. ఇంతకీ ఆ విద్యాశాఖ అవినీతి అధికారి ఎవరనుకుంటున్నారా?జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO).రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతిష్ఠాత్మక ఉద్యోగాల్లో ఒకటి. డీఈవోగా జిల్లాల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న రజనీకాంత్ ప్రవీణ్. భారీ అవినీతికి పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రం బెతియా జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి రజనీకాంత్ ప్రవీణ్ ఇంటిపై విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదును వెలుగులోకి వచ్చింది.అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ శాఖ చేసిన దాడిలో ప్రవీణ్ ఇంటి బెడ్రూమ్,సోఫాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాగా ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.KE PAISA BOLTA HAIBihar: Mountain of cash found at DEO’s residence, vigilance dept orders machines to count currency notes pic.twitter.com/kaCw2coEfR— Shakeel Yasar Ullah (@yasarullah) January 24, 2025 -
మీ కొడుకు రేప్ కేసులో దొరికాడు
బొంరాస్‌పేట: ‘హలో..ఆప్ కా బేటా రేప్ కేస్ మే మిల్గయా. ఛోడ్దేనా బోలేతో పచాస్ హజార్ అర్జెంట్ పే కరో.. నైతో జైల్‌మే దాల్దేతే’.. (నీ కొడుకు అత్యాచార ఘటనలో దొరికాడు. అతడిని విడిచిపెట్టాలంటే వెంటనే రూ.50 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే జైలులో వేస్తాం) అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఓ తండ్రి భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పక్కనున్న తన సన్నిహితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకొని ఫోన్ కట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా రేగడిమైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్ స్థానికంగా కిరాణదుకాణం నడిపిస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు సత్యనారాయణగౌడ్ భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.38 గంటలకు శ్యామలయ్యగౌడ్కు ఓ నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నీ కొడుకు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో దొరికాడని చెప్పాడు.ఫోన్లో పోలీస్ వాహనాల సైరన్ వినిపిస్తూ సత్యనారాయణను అరెస్టు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు. హడలిపోయిన శ్యామలయ్యగౌడ్ వెంటనే పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లుగా అనుమానించిన ఆయన పోలీస్‌స్టేషన్ వివరాలు అడగగా అవతలి వ్యక్తి పరుషపదజాలంతో తిట్టాడు. దీంతో ఫేక్ అని భావించి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే సత్యనారాయణకు ఫోన్ చేయగా, తాను ఆఫీసులో ఉన్నానని తండ్రికి చెప్పాడు. కొడుకుతో వీడియోకాల్ మాట్లాడిన తర్వాత తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫోన్‌కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ట్రంప్ దోషే కానీ... శిక్షేమీ విధించట్లేదు
న్యూయార్క్: హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శిక్ష నుంచి బేషరతుగా మినహాయింపు ఇస్తున్నట్టు (అన్‌కండిషనల్ డిశ్చార్జ్) న్యూయార్క్ కోర్టు ప్రకటించింది. మన్హాటన్ జడ్జి జువాన్ ఎం.మర్చన్ శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. ట్రంప్ దోషేనని ఆయన పునరుద్ఘాటించారు. అయినా ముందే ప్రకటించిన మేరకు ట్రంప్‌కు శిక్ష గానీ, జరిమానా గానీ విధంచడం లేదని స్పష్టం చేశారు. ‘‘అధ్యక్షునిగా ట్రంప్‌కు సంక్రమించబోయే అపరిమితమైన అధికారాలు, న్యాయపరమైన రక్షణలు శిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తాయే తప్ప కోర్టు తీర్పును అడ్డుకోజాలవు. అధ్యక్షునిగా ఆయన పాలన పగ్గాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఒకవైపు. చట్టానికి ఎవరూ అతీతులు కారాదన్న ప్రజల ఆకాంక్షలు మరోవైపు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది’’ అని వివరించారు. దాంతో, ఇది తనకో దారుణమైన అనుభవమంటూ ట్రంప్ వాపోయారు. తన ఫ్లోరిడా నివాసం నుంచే లాయర్‌తో కలిసి ఆయన వర్చువల్‌గా విచారణలో పాల్గొన్నారు. తాను నిర్దోషినని పదేపదే వాదించారు. ‘‘ఈ కేసు నాపై రాజకీయ వేధింపుల్లో భాగం. ఇదంతా నా ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించా’’ అని చెప్పుకొచ్చారు. ఆయన లాయర్ సైతం అదే వాదన విన్పించారు. కానీ న్యాయమూర్తి వాటిని ఆలకించలేదు. దాంతో అమెరికా చరిత్రలో దోషిగా తేలి మరీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న తొలి నేతగా ట్రంప్ నిలిచారు. తీర్పుపై ప్రాసిక్యూటర్లు కూడా అభ్యంతరం తెలపలేదు. అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయవ్యవస్థపైనే ట్రంప్ పదేపదే దారుణ రీతిలో దాడికి దిగారంటూ ఆక్షేపించారు. ఇలాంటి కేసులో సాధారణంగా కనీసం నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుంది. హష్ మనీ కేసు కారణంగా అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా కూడా ట్రంప్ నిలవడం తెలిసిందే. ఏమిటీ కేసు? శృంగార చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌తో తన లైంగిక సంబంధాలపై నోరు విప్పకుండా 2016 అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచార విరాళాల నుంచి ఆమెకు అక్రమంగా 1.3 లక్షలు డాలర్లు చెల్లించారని ట్రంప్‌పై ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి ఆయనపై ఏకంగా 34 రకాల అభియోగాలు నమోదయ్యాయి. వాటన్నింట్లోనూ ట్రంప్ దోషేనని ఆరు వారాల విచారణ అనంతరం 12 మంది జడ్జిల ధర్మాసనం గత మేలో తేల్చింది. నవంబర్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా గెలిచారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ విచారణ నుంచి తనకు రక్షణ ఉంటుందని ఆయన వాదించారు. కానీ అలాంటిదేమీ ఉండబోదని న్యాయమూర్తి ఇటీవలే తేల్చారు. అయితే, ‘‘జనవరి 10న శిక్ష విధిస్తా. కాకపోతే బేషరతుగా వదిలేస్తూ నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. ఆ తీర్పును అడ్డుకునేందుకు ట్రంప్ చివరిదాకా విఫలయత్నం చేశారు. గురువారం రాత్రి హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తీర్పు ప్రక్రియను ఆలస్యం చేసేలా జడ్జిని ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు 5–4 మెజారిటీతో తీర్పు వెలువరించారు. ఆయనపై దాఖలైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. అమెరికా అధ్యక్షునిగా జనవరి 20న ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా మూడు కేసులు విచారణకు వచ్చే అవకాశం లేదు. -
సోషల్ మీడియా స్టార్ ‘రాణి కోతి’: యూట్యూబ్ ద్వారా లక్షలు : వైరల్ వీడియో
కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్‌లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్‌లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్‌కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం. #WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N— Hindustan (@Live_Hindustan) December 30, 2024 -
కొత్త సంవత్సరంలో ఎవరు ఏం చేయాలో తెలుసా..
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాత రోజుల్లాగే ఈ ఏడాదీ గడిచిపోతే కిక్కేముంటుంది. వైవిధ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆర్థికంగా ఈ ఏడాదిలో మరింత రాణిస్తూ, పెట్టుబడులను కాపాడుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే కొందరు వయసురీత్యా రిస్క్ చేయలేకపోవచ్చు. ఏ వయసువారు ఎలాంటి పెట్టుబడి పంథాను ఎంచుకోవాలో..తమ ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకోవాలో ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.20-30 ఏళ్ల వయసువారు..ఈ వయసువారు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడుల్లో సుమారు 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత సురక్షితంగా ఉండాలంటే 70 శాతం వరకు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని నష్టం తక్కువగా ఉంటే లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మూడేళ్లలోపు నగదు అవసరం ఉందని భావిస్తే ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే వీలుంటుంది. ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.30-40 ఏళ్ల గ్రూప్ వారు..వీరికి స్థిరంగా ఆదాయం ఉంటుంది. ఈ వయసులోవారు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ పెద్దల ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్లు, బంధువుల ఇంటికి వెళ్లడం.. వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. దాంతోపాటు ప్రధానంగా పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి, రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో గరిష్ఠంగా 70 శాతం వరకే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది సురక్షితంగా ఉండే వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.40-50 ఏళ్లవారు..ఈ వయసులో రిస్క్ తీసుకోవడం సరికాదు. ఇది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించుకుని స్థిరాదాయం ఇచ్చే డెట్ పథకాల్లోకి పెట్టుబడిని మళ్లించాలి. మొత్తం మదుపులో ఈక్విటీ పెట్టుబడులు 60 శాతం మించకుండా జాగ్రత్తపడాలి.ఇదీ చదవండి: మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?50 దాటిన వారు..ఈ వయసులో అసలు రిస్క్ తీసుకోకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పదవీ విరమణ మరో మూడేళ్లు ఉందనుకున్నప్పుడే క్రమంగా మీ ఈక్విటీ పెట్టుబడులను స్థిర ఆదాయం వచ్చే డెట్ ఫండ్స్‌లోకి మళ్లించాలి. లేదంటే ఏదైనా అనిశ్చితులు ఏర్పడి మార్కెట్ పడిపోయినా, కొంత కాలంపాటు ఎలాంటి పెరుగుదల లేకుండా కదలాడినా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. పదవీవిరమణ తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి డబ్బును కాపాడుకోవడం ఉత్తమం. -
New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు
‘ట్రింగ్.. ట్రింగ్ ’ అని బెల్ మోగిస్తూ ఒక పోస్ట్‌మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్‌లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్’ తీసుకుని పోస్ట్‌మ్యాన్ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్‌తో పాటు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్‌లు మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్‌ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్‌స్టంట్‌గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్ ఆధారంగా ఉండేది.ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్‌మ్యాన్స్ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్‌శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.మనీ ఆర్డర్ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్ రాకతో ఈ సమస్యకు చెక్ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపేవారట.పోస్టల్‌శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొందింది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్స్టంట్ పేమెంట్ యాప్‌లు రావడంతో మనీ ఆర్డర్‌కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్‌ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్‌కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు. ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో.. -
నిత్య పెళ్లి కూతురు.. ఏడో పెళ్లికి దొరికి పోయిందిలా!
లక్నో : ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరగుతాయంటారు. అది నాటి మాట. కానీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు డబ్బు కోసం జరుగుతున్నాయనేది నేటి మాట’ అని అర్ధం వచ్చే ఘటన ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి అంటూ యువకుల్ని నమ్మించడం. వారిని పెళ్లి చేసుకున్న అనంతరం డబ్బులు, బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న ఓ యువతిని, ఆమె ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల మేరకు.. వధువుగా పూనమ్, ఆమె తల్లిగా సంజనా గుప్తా, విమలేష్ వర్మ ,ధర్మేంద్ర ప్రజాపతి పెళ్లిళ్ల పేరయ్యగా ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లు ముందుగా ఒంటరిగా ఉంటూ వివాహ ప్రయత్నాల్లో ఉన్న యువకుల్ని గుర్తిస్తారు. అప్పుడే విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతిలు రంగంలోకి దిగుతారు. మేం పెళ్లిళ్ల పేరయ్యలం. మీకు సంబంధాలు చూస్తాం. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువవుతుంది. మీకు ఓకే అయితే చెప్పండి. మేం మీకు మంచి అమ్మాయిని వెతికి పెడతాం. అంటూ పక్కా ప్లాన్ ప్రకారం బాధితులకు పెళ్లి కుమార్తెగా పూనమ్, సంజనా గుప్తా తల్లిగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అసలు కథ నడిపిస్తారు. ముందుగా మాట్లాడుకున్నట్లుగా రిజిస్టర్ ఆఫీస్‌లో పూనమ్‌ను ఇచ్చి సదరు యువకుడితో పెళ్లి జరిపిస్తారు. అనంతరం వరుడి ఇంటికి పంపిస్తారు. అదును చూసి వరుడి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువుల్ని అందిన కాడికి దోచుకుంటుంది పూనం. అక్కడి నుంచి.. మారు పేరుతో ప్రాంతాలు మార్చి తిరుగుతుంటారు. అలా ఈ గ్యాంగ్ మాస్టర్ మైండ్ పూనమ్ ఆరుగురిని వివాహం చేసుకుంది. అందరిని అలాగే మోసం చేసింది. ఏడో పెళ్లి చేసుకుందామని చూసింది. కానీ కథ అడ్డం తిరిగి జైలు పాలైంది. శంకర్ ఉపాధ్యాయ్ అనే ఒంటరి యువకుడిని పూనమ్ ముఠా సభ్యుడు విమలేష్ సంప్రదించాడు. అతనికి పెళ్లి చేస్తానని చెప్పాడు. అమ్మాయి బాగా చదుకుంది. మీకు నచ్చితే ఉద్యోగం చేస్తుంది. కాకపోతే ఆ అమ్మాయికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు. మీరు ఆ అమ్మాయికి ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఇష్టం . మాకు మాత్రం పెళ్లి చేసినందుకు రూ.1.5లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని మాట్లాడుకున్నారు. అసలే వయస్సు మీద పడడంతో పెళ్లి చేసుకుందామనే తొందరలో ముఠా డిమాండ్ ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు.గత శనివారం విమలేష్.. శంకర్‌ను ఓ ప్రాంతానికి పిలిచాడు. అక్కడే పూనమ్‌ను పరిచయం చేశాడు. అనంతరం రూ.1.5లక్షలు అడిగారు. దీంతో సదరు గ్యాంగ్‌పై శంకర్‌కు అనుమానం వచ్చింది. ఆమె తల్లిగా నటించిన పూనమ్, సంజనల ఆధార్ కార్డ్‌లు చూపించాలని అడిగారు. దీంతో నిందితులు బండారం బయటపడింది. తనని మోసం చేస్తున్నారని యువకుడు గుర్తించాడు. తాను ఈ పెళ్లి చేసుకోనంటూ ఖరాఖండీగా చెప్పాడు. దీంతో పూనమ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగింది. చంపేస్తామని, తప్పుడు కేసుల్లో ఇరికించామని హెచ్చరించారు. భయాందోళనకు గురైన బాధిత యువకుడు తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలంటూ మెల్లగా జారుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదుతో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు బాందా అదనపు పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ట్రంప్‌కు బేడీలు
-
యాచకులకు డబ్బులిస్తే జైలుకే.. జనవరి ఒకటి నుంచి అమలు
దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. బిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఒక ముందడుగు వేసింది.ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి ఒకటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధం విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్‌లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు.దేశంలో ఈ ప్రాజెక్ట్ 10 నగరాల్లో అమలుకానుంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండోర్‌లో ఈ ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారన్నారు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఓ ముఠా ఇక్కడికి వచ్చిందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచక రహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైనవారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనున్నదన్నారు. ఇక్కడి ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోకపోతే ఈ పథకం విజయవంతం అవదన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
అవసరం : తాత్వికథ
ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. ఆయన మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా చెప్పిన వ్యక్తి. ఓసారి ధనవంతుడొకడు ఆయనను చూడ్డానికి వచ్చాడు. ఆ గురువుకు దణ్ణంపెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు ఇచ్చాడు.గురువు ఆ సంచీని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు గురువు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది’’ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు స్వామీ!’’ చెప్పాడు ధనవంతుడు.‘సంతోషం’ అంటూనే ధనవంతుడి వంక చూసి‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ...’’ అని అడిగారు గురువు.‘‘అవునండీ ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు.‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాస్సేపు తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే కదండీ రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నానండీ’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బుసంచీని తిరిగి ధనవంతుడికే ఇచ్చేశారు. ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... ఇదిగో ఈ సంచీ మీ దగ్గరే ఉంచుకోండి‘‘ అన్నారు గురువు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. కనుక ఉన్న దానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది.– యామిజాల జగదీశ్ ఇదీ చదవండి : అహం బ్రహ్మాస్మి హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు -
ఏసీ బెర్త్‌కు రూ.1000.. నాన్ ఏసీకి రూ.500
సాక్షి, హైదరాబాద్: ఏసీ బెర్త్‌కు రూ.1000..నాన్ ఏసీ బెర్త్‌కు రూ.500. ఇవి టికెట్ చార్జీలు కాదు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్తులు కావాలంటే టికెట్ కలెక్టర్లకు (టీసీలకు) సమర్పించుకోవలసిన ఆమ్యామ్యాలు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లు, కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరహా బేరాలు జోరుగా సాగుతున్నాయి. టీసీలే స్వయంగా డబ్బులు తీసుకొని బెర్తులు కట్టబెట్టడంతో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న వారు నిశ్చింతంగా ప్రయాణం చేస్తున్నారు. నిజానికి టికెట్ నిర్ధారణ అయితే తప్ప ట్రైన్లో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణికుల జాబితా విడుదల అవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లు మాత్రమే రిజర్వేషన్ లభించిన ప్రయాణికులు. కానీ ప్రతి ట్రైన్‌కు వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులు ఉంటారు. చార్ట్ (జాబితా) సిద్ధమైన తరువాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు వారి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయి. కానీ కొందరు ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ప్రయాణం చేస్తారు. ఏదో ఒకవిధంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో టికెట్లను రద్దు చేసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ తాకిడి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపైనే కొందరు టీసీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీల్లో బెర్తులకు రూ.500, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో బెర్తులకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.శబరి రైళ్లకు డిమాండ్ ఫుల్... ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు తరలివెళ్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు సైతం దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సైతం డిమాండ్ బాగా ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలన్నా, ఫ్లైట్‌లో వెళ్లాలన్నా పెద్దమొత్తంలో వెచ్చించవలసి ఉంటుంది. చార్జీల భారం దృష్ట్యా ఏదోఒకవిధంగా రైళ్లలో వెళ్లడమే మంచిదని భావించే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు నవంబర్ 27వ తేదీన 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17230)లో సికింద్రాబాద్ నుంచి శబరికి బయలుదేరారు. వాళ్ల ప్రయాణానికి ఇంచుమించు నెల రోజుల క్రితమే సెకండ్ ఏసీ రిజర్వేషన్ కోసం టికెట్లు కొనుగోలు చేశారు. కానీ ప్రయాణ తేదీ నాటికి కూడా టికెట్లు నిర్ధారణ కాలేదు. రిజర్వేషన్ లభించలేదు. చార్ట్ (ప్రయాణికుల జాబితా) సిద్ధమైన తరువాత కూడా ఆ ప్రయాణికులు వెయిటింగ్ జాబితా (5 నుంచి 8 వరకు)లోనే ఉండిపోయారు. అయినప్పటికీ టికెట్లను రద్దు చేసుకోకుండా అదే ట్రైన్లో బయలుదేరారు. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికి వెళ్లి టీసీని సంప్రదించారు. ‘మొదట్లో ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్ తిరుపతికి చేరుకున్న తరువాత ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 చొప్పున మొత్తం రూ.4000 తీసుకొని నాలుగు బెర్తులు కేటాయించాడు. సెకండ్ ఏసీలోనే ఆ సదుపాయం లభించడంతో ప్రయాణం నిశ్చింతగా సాగింది.’ అని ఆ ప్రయాణికులు చెప్పారు. తమతో పాటు మరి కొందరికి కూడా రూ.1000 చొప్పున తీసుకొని ఏసీ బోగీల్లో, రూ.500 చొప్పున తీసుకొని స్లీపర్‌లో బెర్తులు ఇచి్చనట్లు వారు చెప్పారు.ఎలా సాధ్యం... ⇒ రిజర్వేషన్లు నిర్ధారణ అయిన ప్రయాణికులు ఆకస్మికంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకో వ చ్చు. అలాంటి వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ట్రైన్లో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్, టికెట్ కలెక్టర్, తదితర సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలను తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ మిషన్లలో నమోదు చేయాలి. ⇒ ఈ క్రమంలోనే కొందరు టీసీలు ఇలాంటి ప్రయాణికుల వివరాలను నమోదు చేయడంలోనే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.⇒ సదరు ప్రయాణికుల పేరు వద్ద ‘కాన్సిల్’ అని కాకుండా ‘జాయిన్’ అని నమోదు చేసి ఆ బెర్తులను వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు కేటాయిస్తున్నారు. అయితే ఆన్లైన్ టికెట్లపైన ఇది సాధ్యం కాదు. రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే టీసీలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. -
Video: పెళ్లి ఊరేగింపులో బంధువుల రచ్చ.. గాల్లోకి 20 లక్షలు జల్లుతూ
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. పెళ్లిని ఎవరైనా జీవితంలో గుర్తిండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అతిథులందరి సమక్షంలో గ్రాండ్‌గా జరుపుకుంటారు. అయితే ఒక చోట మాత్రం కొందరు పెళ్లి ఊరేగింపులో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. గాల్లోకి ఏకంగా లక్షలు వెదజల్లారు. ఈఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.అఫ్జల్, అర్మాన్ వివాహాం జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అంత సవ్యంగా సాగుతుండగా.. వరుడు, వధువు పక్కన ఉన్న బంధువులు ఒక్కసారికి గాలిలోకి డబ్బులు విసిరారు. చుట్టుపక్కలా ఉన్న ఇళ్లపై, జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి జల్లారు. రూ. 100, 200, 500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు.దీంతో గాల్లో ఎగురుతున్న నోట్లను స్థానికులు పట్టుకునేందుకు ఎగబడ్డారు. గాలిలో దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు డబ్బును అవసరమైన వారికి పంచాలని సూచించారు., మరికొందరు ఆదాయపు పన్ను కార్యాలయానికి కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు స్పందించలేదు. View this post on Instagram A post shared by 𓂀 𝔹𝕒𝕣𝕖𝕚𝕝𝕝𝕪_𝕛𝕙𝕦𝕞𝕜𝕒𝕔𝕚𝕥𝕪𝟘𝟘𝟙 𓂀 (@bareilly_jhumkacity001) -
నా ఫీజు రూ. 100 కోట్లు: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు సలహాలు వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. ఇటీవల బిహార్‌లో జనసూరజ్ పార్టీని స్థాపించి పూర్తి రాజకీయ నేతగా అవతరించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టారు.ఈ సందర్భంగా బెలగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పి కొట్టారు. తనది కొత్త పార్టీ కావొచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదని అన్నారు.తాను వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ఒక్క ఎన్నికల సమయంలో ఒక్క రాజకీయ పార్టీకి సలహాలిస్తే రూ. వంద కోట్లు తీసుకుంటాననిప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇది స్టార్టింగ్ మాత్రమేనని, తన పనిని బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటానని తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తే.. ఆ డబ్బుతో రాబోయే రెండేళ్లపాటు తన పార్టీ ప్రచారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పది రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.‘నా ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవని, సరిపోదని అనుకుంటున్నారా? నేను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా? బీహార్లోనే కాదు నా ఫీజుల గురించి ఇంతవరకు ఎవరూ వినలేదు. నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే నా ఫీజు రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే వసూలు చేశాను. అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోగలుగుతున్నాను.కాగా బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన నలుగురు అభ్యర్ధుల్ని నిలబెట్టారు. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్, ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచికిరణ్ సింగ్ ఉన్నారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. -
లండన్‌లో రతన్‌టాటాతో బిగ్‌బీకి ఎదురైన అనూహ్య అనుభవం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్‌కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్‌బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్‌బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్‌బీ.కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్‌బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్‌ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు లాకర్లో డబ్బు కాలిపోతే తిరిగిస్తారా..?
సంపాదించిన డబ్బు, బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి బ్యాంకు కాలిపోతే మన డబ్బు, బంగారంకు ఎవరు బాధ్యత వహిస్తారనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా. ఎలాగో ఆ డబ్బంతా బ్యాంకు లాకర్లో ఉంచాం కాబట్టి బ్యాంకే దానికి పూర్తి బాధ్యత వహిస్తుందని అనుకుంటాం. కానీ నిబంధనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.ఉదాహరణకు సునిల్ ఏడాదికి రూ.3000తో బ్యాంకు లాకర్ రెంట్ తీసుకున్నాడు. ఆ లాకర్లో 300 గ్రాముల బంగారం(ప్రస్తుత ధర ప్రకారం దాని విలువ సుమారు రూ.18 లక్షలు) ఉంచాడు. తానుంటున్న ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. దాంతో తాను కష్టపడి సంపాదించిన డబ్బు రూ.10 లక్షలు కూడా ఆ లాకర్లో పెట్టాడు. కొన్ని రోజులు గడిచాక తనకు డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్లి లాకర్ తాళం తీసిన సునిల్ షాక్‌కు గురయ్యాడు. తాను లాకర్లో ఉంచిన రూ.10 లక్షలు చెదలు పట్టింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పాడయ్యాయి. వెంటనే బ్యాంకు సిబ్బందికి విషయం చెప్పాడు. కానీ నిబంధనల ప్రకారం తనకు డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని చెప్పారు. ఒకవేళ బంగారం పోతే మాత్రం నిబంధనల ప్రకారం..ఏటా తాను చెల్లిస్తున్న రూ.3000కు 100 రెట్లు అంటే రూ.3,00,000 వరకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. అంతకు మించి విలువైన బంగారం అందులో ఉన్నా రూ.మూడు లక్షలే చెల్లించేలా నిబంధనలున్నాయని వివరించారు.బ్యాంకులు లాకర్ రూమ్‌కు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాయి. 24*7 కెమెరా సదుపాయం ఉంటుంది. భద్రత కోసం అలారం సౌకర్యం ఏర్పాటు చేస్తారు. లాకర్ల భద్రతకు సంబంధించి బ్యాంకులు పటిష్ట చర్యలే పాటిస్తాయి. కానీ ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే మాత్రం తదుపరి పర్యవసనాలకు కస్టమర్లు సిద్ధంగా ఉండాల్సిందే.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!డబ్బును లాకర్లు, బీరువాలో ఉంచడం వల్ల కాలంతోపాటు దాని విలువ తగ్గిపోతుంది. నిత్యం ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా ఏటా సుమారు 5-6 శాతం మేర డబ్బు విలువ పడిపోతుంది. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడులు ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఎఫ్డీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు..వంటివి ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానికి డబ్బుల డిమాండ్
ఐ.పోలవరం: నిండు గర్భిణి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించగా అక్కడ సిబ్బంది తీరుతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మురముళ్ల గ్రామానికి చెందిన గోడ లావణ్య అనే గర్భిణికి పురుడునొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టి.కొత్తపల్లి సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి గైనకాలజిస్టు అన్ని పరీక్షలు చేసి, వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రమాదమని చెప్పారు. అయితే ఆపరేషన్ కోసం మత్తు డాక్టరుకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో లావణ్య బంధువులకు ఏం చేయాలో పాలుపోలేదు. డబ్బులు లేవని ప్రాధేయపడినా వైద్య సిబ్బంది కనికరం చూపకపోవడంతో గర్భిణిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాగా.. ఆస్పత్రిలో ఎదురైన చేదు అనుభవాన్ని లావణ్య స్వయంగా విలేకరులకు తెలిపారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ డయానాను వివరణ కోరగా ఆ విషయం తన దృష్టికి రావడంతో ఆస్పత్రికి వెళ్లానన్నారు. మత్తు డాక్టరుకు ఇవ్వాలంటూ అక్కడి వైద్యురాలు డబ్బులు డిమాండ్ చేశారన్న బాధితుల ఆరోపణపై విచారణ చేయిస్తామని తెలిపారు. -
మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు. -
రూ.కోట్లలో లాటరీ గెలుపొందిన భారతీయులు (ఫొటోలు)
-
తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు
నల్లగొండ జిల్లా :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది.ఈసారి సైబర్ నేరగాళ్ల అమాయకుల్ని మోసం చేసేందుకు ప్రజా ప్రతినిధుల్ని ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యుల పేరుతో సైబర్ నేరగాళ్ల వాట్సాప్ కాల్స్ చేశారు.ఎమ్మెల్యే వేముల వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు మెసేజ్, వాట్సాప్ కాల్స్ చేశారు. సైబర్ కేటుగాళ్ల గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వీరేశం తన పేరుతో మెసేజ్‌లు,కాల్స్ వస్తున్నాయని,అలాంటి వాటికి స్పందించొద్దని కోరారు. -
బిల్లు కట్టమన్నందుకు.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు
ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా తిన్న ఆహారానికి బిల్లు తప్పక చెల్లించాల్సిందే. ఇంకా అదనంగా చాలామంది ఫుడ్ సర్వ్ చేసినందుకు వెయిటర్లకు టిప్ కూడా ఇస్తుంటారు. కానీ ఓ చోట హోటల్లో ఫుల్‌గా తిని.. బిల్లు చెల్లించకుండా పరారరయ్యారు కొంతమంది. డబ్బులు కట్టమని అడిగేందుకు వెయిటర్ వారి వెంట కారు వద్దకు పరుగెత్తుకెళ్లగా.. అతన్ని కారులో కిలోమీటర్ వరకులాక్కెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మెహకర్-పంధర్పూర్ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చాడు. హోటల్ బయట కారు పార్క్ చేసి భోజనం చేశారు. మొత్తం తిన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు బిల్లు కట్టకుండానే కారు వద్దకు తిరిగి వచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు క్యూర్ కోడ్ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు.చదవండి: స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడువెయిటర్ స్కానర్ తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు తమలో తాము గొడవపడుతున్నట్లు నటింది. కారులోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్ కారు డోర్ తెరిచాడు. ఇంతలోనే దుండగులు కారును రివర్స్ తీసి వెయిటర్ డోర్‌కు వేలాడుతూనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాడు. ఇంతలో మరో హోటల్ సిబ్బంది కారును వెంబడించాడు. కానీ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అనంతరం కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపి.. వెయిటర్‌ను కొట్టి అతని జేబులోని రూ. 11,500ను లాక్కున్నారు. అతని కళ్లకు గంతలు కట్టి రాత్రి అంతా బందించి ఉంచారు మరుసటి రోజు ఉదయం అతన్ని విడిచిపెట్టారు. ఇక దీనిపై హోటల్ యాజమాన్యం దిండ్రూడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.#Maharashtra: बीड में एक #Waiter खाने के बाद #Scanner लेकर #Car के पास आया और #Bill देकर पैसे की मांग की, लेकिन बिल का भुगतान करने की बजाय कार सवार उसे पकडकर एक किलोमीटर तक घसीटता ले गए. वेटर को पूरी रात बंधक बनाकर रखा और पिटाई भी की.#Maharashtracrime #maharashtranews pic.twitter.com/CF6wqnOC5S— Delhi Uptodate News (@DelhiUptodate) September 11, 2024 -
డబ్బే ముద్దు.. పిల్లలు వద్దు
డబుల్ ఇన్కమ్... నో కిడ్స్ ఫ్యామిలీ ΄ప్లానింగ్‌లో ఓ కొత్త ఒరవడి మొదలయ్యింది. నవ దంపతులు రెట్టింపు ఆదాయంపైనే దృష్టి పెడుతున్నారు. పిల్లలు మాత్రం వద్దు అనుకుంటున్నారు. రాహుల్ మంచి జీతంతో స్థిరపడ్డాడు. పెళ్లి చేసుకోవడానికి చాలా సంబంధాలు చూసి, ఒకమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి మాత్రం ‘నేను పిల్లలను కనాలనుకోవడం లేదు’ అని కచ్చితంగా చెప్పేసింది. ఎంత నచ్చజెప్పినా పెళ్లి క్యాన్సిల్ చేస్తానంది కానీ, మాట మార్చుకోనంది. స్నిగ్ధ, కిరణ్ లు పెళ్లి తర్వాత మూడేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నారు. ఆ తర్వాత అసలు పిల్లలే వద్దు అనే ఆలోచనకు వచ్చేశారు.పెద్దవాళ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తమ ఉద్యోగాలు మరో స్టేట్‌కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లిపోయారు. ‘ఇది ఒకరో ఇద్దరిదో సమస్య కాదు. మేం డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ దంపతులను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నారో కనుక్కుంటున్నాం’ అని తేల్చింది ప్రముఖ లాన్సెట్ అధ్యయనం. రానున్న రోజుల్లో ఇది తీవ్రమైన ఆర్థిక, సామాజిక అంశాలపై పెనుభారంగా పరిణమించనుందని స్పష్టం చేసింది.మోయడం కష్టమట..మొదట పిల్లలు వద్దనుకునే దంపతులు చాలా తక్కువగా కనిపించేవారు. అది పెద్దగా పట్టించుకోదగిన విషయంగా కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి సాంస్కృతిక ప్రధాన స్రవంతిగా మారాయి. అమెరికాలో పిల్లలు లేని కుటుంబాలు 2022 నాటికి 43 శాతానికి చేరుకున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చి చూస్తే 36 శాతానికి పైగా పెరిగింది. సమీప భవిష్యత్తులో వీరు 50 శాతానికి చేరుకోబోతున్నారు. కడుపున బిడ్డను మోయడం అనేది ఓ పెద్ద పనిగా, సమయం తీసుకునే అంశంగా భావిస్తున్నారు. ఇది ఒక్క అమెరికాలోనే కాదు ఆర్థికాభివృద్ధిలో కొంతస్థాయికి చేరుకుంటున్న దాదాపు 90 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నిర్ణయాలు అమలు‘మేం ఇద్దరం.. మాకు ఇద్దరు’ అనేది 1970 – 80లలో ఆకట్టుకునే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం. కొత్త తరాలు కోరుకునే ఈ నినాదాలేమీ విననివి కాదు. అధిక పేదరికం ఉన్న రోజుల్లో ప్రతి స్త్రీకి 4–5 మంది పిల్లలు ఉండేవారు. దీంతో సంతానోత్పత్తి రేటును తగ్గించడానికి ప్రభుత్వం ఈ నినాదాలు రూపోందించింది. అవి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు.నాటి నుంచి ప్రపంచం చాలా పురోభివృద్ధి సాధించింది. సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నందున, ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరగడం ఆగిపోతుందని యునైటెడ్ నేషన్స్ జనాభా డేటా వ్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో అంటే 2050 నుంచి 2100 మధ్య కాలంలో 90 దేశాల్లో జనాభా బాగా తగ్గి΄ోనుంది. వాటిలో ఎక్కువ భాగం ఐరోపా, లాటిన్ అమెరికాలో ఉన్నాయి. జనాభా పెరుగుదల నమోదవు తున్న ఏకైక ప్రాంతంలో ఆఫ్రికా మాత్రమే. 2020–2100 ఆఫ్రికా ఖండంలో మధ్య భాగం జనాభా 1.3 మిలియన్ల నుండి 4.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దక్షిణ కొరియాలో రాజకీయ నాయకులు సంతానోత్పత్తి రేటును పెంచాలని అక్కడి దంపతులను వేడుకుంటున్నారు.మన దేశంలో... లాన్సెట్ కొంతకాలంగా వేస్తున్న అంచనా ప్రకారం 2050 నాటికి పిల్లల రేటు భారీగా తగ్గి, ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు సీనియర్ సిటిజన్‌గా ఉంటారు. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపే శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. మనం ఎంత దూరం వచ్చామో అర్థం చేసుకోవాలంటే 1950 మన దేశ సంతానోత్పత్తి రేటు 6.18గా ఉంది. 1980లో 4.60 ఉండగా, 2021లో 1.91కి తగ్గింది. కొన్ని స్థానిక అంశాలు మానవ మనస్తత్వ కోణాలను పూర్తిగా మార్చేశాయి. చాలా మంది పిల్లలు వృద్ధ తల్లిదండ్రులకు పెట్టుబడి. కానీ, ఈ ఆలోచన పూర్తిగా తిరగబడింది. నేడు పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్నది. పైగా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారనే నమ్మకం లేదు.పరిస్థితి ఇలా మారుతోంది⇒ పేరెంట్‌హుడ్‌ను నివారించడానికి యువ జంటలు పట్టణాలలో పెంపుడు జంతువులను ఎంచుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు తక్కువ బాధ్యత ఉన్నప్పటికీ, యజమానులను బాగా ప్రేమిస్తాయి.⇒ మరికొందరు తమ జీవితాన్ని కొత్త స్వేచ్ఛను, ప్రయాణ, సాహస క్రీడల కోసం ఉపయోగిస్తున్నారు.⇒ నగరాలు, చిన్న పట్టణాలలో జీవనం కష్టంగా మారి పిల్లలతో కలిసి శివారుప్రాంతాలకు వలస వెళుతున్నారు. పట్టణీకరణ కేంద్రాలలోనూ జనాభా వేగంగా తగ్గిపోతోంది.⇒ పిల్లలు లేకుండా, తల్లిదండ్రులుగా మారడానికి ఇష్టపడే జంటలు సాధారణంగా ఐటీ, అడ్వరై్టజింగ్ ఇతర అధిక కార్పొరేట్ ఉద్యోగాలలో ఉంటున్నారు. సుదీర్ఘ పని గంటల తర్వాత సమయాన్ని, డబ్బును సెలవుల కోసమే కేటాయించుకుంటున్నారు. -
దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న డబ్బు ఎంత?
సాధారణంగా డబ్బును లక్ష్మిదేవితో పోలుస్తాం. లోకంలోని సమస్త ధనరాసికి దేవత ‘ఆమె’నే.. మరి అలాంటి లక్ష్మిదేవి పేరు మాత్రమే మహిళలకు మిగిలింది. దేశంలోని బ్యాంకు ఖాతాల్లో పురుషుల వద్దే అత్యధిక ధనం పోగుపడింది. ధన దేవత ‘లక్ష్మి’ పేరుండే మహిళల ఖాతాల్లో ఉన్నది కేవలం 21 శాతమే...నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా “మెన్ అండ్ విమెన్” నివేదిక ప్రకారం, దేశంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 20.8 శాతం లేదా దాదాపు ఐదవ వంతు మాత్రమే మహిళా ఖాతాదారులకు చెందినది. దేశంలో 91.77 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉంటే వీటిలో 36.4% మహిళల యాజమాన్యంలో ఉన్నాయి.దేశంలోని మొత్తం బ్యాంకు అకౌంట్లలో 187 లక్షల కోట్లు ఉండగా ఇందులో మహిళ ఖాతాల్లో ఉన్న మొత్తం కేవలం 39 లక్షల కోట్లు. దేశంలోని హిందూ అవిభాజ్య కుటుంబాలు, నివాసితులు, రైతులు, వ్యాపారులు, నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, వేతనజీవులు, ఇతరులు అందరి బ్యాంకు ఖాతాలను లెక్కలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.ఇక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా గణాంకాలను పరిశీలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో మొత్తం డిపాజిట్లలో 16.5% లేదా 1.9 లక్షల కోట్లు మాత్రమే మహిళలకు చెందినవి. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఇది 30% లేదా రూ.5.91 లక్షల కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో జన్ ధన్ ఖాతాలు విస్తృతంగా విస్తరించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. -
యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ
కొందరంతే.. తాముఅనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండ నీయదు. లండన్‌కు చెందిన నీషా షా ఈ కోవకు చెందినవారే. లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నా, ఏడాదికి రెండున్నర లక్షలకు డాలర్లకు పైగా జీతం. కానీ దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్‌గా సరికొత్త అడుగులు వేసింది. కట్ చేస్తే ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తోంది. నీషా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.నలుగురి కోసంఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్‌లో చేస్తున్నది కార్పొరేషన్లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే కదా, తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురి ప్రయోజన కోసం ఏదైనా చేయాలనిపించింది. దీనికి తగ్గట్టు చేస్తున్న పని సంతృప్తి నివ్వలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ కంటెంట్ క్రియేటర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 జనవరిలో బ్యాంకింగ్ వృత్తిని వదిలి పూర్తిగా యూట్యూబ్నుకొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది. View this post on Instagram A post shared by Nischa Shah (@nischa.me)2021 డిసెంబర్లో తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తనకు ఆసక్తి , పట్టు ఉన్న పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్ చేసేది. బిజినెస్ విషయాలు కావడం మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం వేచి చూడాల్సి వచ్చింది.అయినా పట్టుదలగా ముందుకే సాగింది. ఈ క్రమంలోనే 2022 సెప్టెంబరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. 50వేలకు పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. రూ.3 లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పింస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్ చేస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలను షేర్ చేస్తుంది. ముఖ్యంగా "మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్" నుండి "మీ తొలిపెట్టుబడి ఎలా పెట్టాలి" వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్ విభిన్నంగా, బిజినెస్‌లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది. అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ. 8 కోట్లను దాటేసింది. యూట్యూబ్ మానిటైజేషన్, కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్లు, బ్రాండ్స్ పార్టనర్షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి ,పట్టుదల, టాలెంట్ ఉంటో ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నీషా స్టోరీ మనకు తెలియజేస్తుంది. లండన్‌కు చెందిన నీషా షా నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ , ఆ తర్వాత ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) చదివారు. ఆ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే దాదాపు 80 శాతం ఆదాయాన్ని కోల్పోవడమే. కానీ కష్టమైనా ఇష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇపుడు బ్యాంకింగ్ ఉద్యోగంలో పొందిన జీతం కంటే యూట్యూబర్‌గా ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది- నీషా. -
రండి.. దేవుడిచ్చిన డబ్బులు తీసుకువెళ్లండి
ఏలూరు టౌన్: తమకు దేవుడు డబ్బులు ఇస్తాడని, వాటితో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తామని నమ్మించి కొంత మొత్తం అసలు నోట్లు తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఏఎస్పీ జి.స్వరూపరాణితో కలిసి ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఏలూరులో 108 అంబులెన్స్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దొండపాటి ఫణికుమార్‌కు జూలై 28న ఒక వ్యక్తి ఫోన్ చేసి తాము కష్టాల్లో ఉన్నవారికి ఆరి్థక సాయం చేస్తామని పరిచయం చేసుకున్నాడు. తమకు దేవుడు డబ్బులు పంపిస్తాడని, అలా పంపిన వాటిలో రూ.44లక్షలు ఉన్నాయని, ఈ మొత్తం కావాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని చెప్పాడు. ఇలా కొంత డబ్బు తీసుకుని నాలుగు రెట్లు ఎక్కువగా ఇవ్వడాన్ని తమ పరిభాషలో బ్యారిస్ అని అంటారని వివరించాడు. ఈ డబ్బులు ఎక్కువ రోజులు తమ వద్ద ఉండవని, ఆలస్యం చేస్తే మాయమైపోతాయని తెలిపాడు. వెంటనే డబ్బులు తీసుకుని బ్యాంకులో వేసుకోవాలని సూచించాడు. అయితే తన వద్ద అంత డబ్బులు లేవని ఫణికుమార్ చెప్పగా, కొంత అడ్వాన్స్‌గా ఇవ్వాలని, అనంతరం మిగిలిన సొమ్ము తీసుకురావాలని సూచించాడు. రూ.44లక్షలు వస్తాయనే ఆశతో ఫణికుమార్ జూలై 30వ తేదీన ఫోన్ చేసిన వ్యక్తిని, మరికొందరిని కలిసి రూ.3 లక్షలు ఇచ్చాడు.మిగిలిన డబ్బులు కూడా సిద్ధం చేసుకోవాలని ఆ ముఠా సభ్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఫణికుమార్ తన స్నేహితుల వద్ద ప్రస్తావించగా, వారు మోసం చేస్తున్నారని వివరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఫణికుమార్ శనివారం ఆ ముఠాకు ఫోన్ చేసి మిగిలిన డబ్బులు తీసుకువస్తున్నానని, ఏలూరు కొత్త బస్టాండ్ వెనుక రైల్వే ట్రాక్ రోడ్డు వద్దకు రావాలని కోరాడు. అదేవిధంగా ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీఐ కే.శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టారు. అక్కడికి వచ్చిన నకిలీ కరెన్సీ ముఠా సభ్యుడు చింతలపూడి మల్లాయిగూడెం ప్రాంతానికి చెందిన మారుమూడి మధుసూదనరావు, కారు డ్రైవర్ గప్పలవారిగూడేనికి చెందిన బిరెల్లి రాంబాబును అరెస్ట్ చేశారు. వారి నుంచి 94 కట్టల నకిలీ 500 నోట్లు రూ.47లక్షలు, ఒక సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిద్దరూ నకిలీ కరెన్సీ ముఠా వద్ద ఉంటూ మార్కెట్లో నకిలీ నోట్లు మారి్పడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
కాస్ట్ లీ ప్రేమ కథ.. నోట్ల కట్టలపై ప్రియురాలి నడక
-
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్‌లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్‌కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్‌ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
మీరు బ్యాంక్ బ్రాంచ్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి అని అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). బ్యాంక్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని బ్యాంక్ బ్రాంచ్ అధికారులు లేదా దాని ప్రధాన కార్యాలయం పరిష్కరించలేకపోతే, మీరు ఆర్బీఐలో బ్యాంక్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ పద్దతిని ఎంపిక చేసుకోవచ్చు.ఫిర్యాదులను స్వీకరించేందుకుఅటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బ్యాంకులు అందించే కొన్ని సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్ల కోసం ఒక వేగంగా చర్యలు తీసుకునే వేదిక.ఎటువంటి రుసుము లేకుండాబ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 వరకు సవరించిన ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు అని ఆర్బీఐ తరచుగా పేర్కొంది.ఆర్బీఐ అంబుడ్స్‌మన్ బ్యాంక్ ఖాతాదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా.. బ్యాంక్ తరుపు లోపాలుంటే ఖచ్చితంగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. సమస్య ఉందని పరిష్కారం కోరినా బ్యాంకులు పట్టించుకోకపోతే, సంబంధిత బ్యాంకు మీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుండి ప్రత్యుత్తరం రాకుంటే, బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు https://rbi.org.in/Scripts/Complaints.aspx ఈ లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. -
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
-
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
సైబర్ నేరస్తులు బెంగళూరులోని ఆర్బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు. నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్లో ముంబైలో ఐదు పాస్‌పోర్ట్‌లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. ముంబై పోలీసులు మీ పార్శిల్‌పై ఆరా తీశారు. ఈ కాల్‌ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం..అంటూ ప్లాన్ ప్రకారం.. కాన్ఫిరెన్స్ కాల్లో మరో సైబర్ నేరస్తుడు లైన్లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్‌గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్ అకౌంట్‌ను మనీ ల్యాండరింగ్‌కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్ అకౌంట్‌ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు పంపించండి. విచారణ పూర్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్‌కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్‌కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టీడీపీ అభ్యర్థి ఆఫీస్‌ను ముట్టడించిన మహిళలు
సాక్షి, నంద్యాల జిల్లా: టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. ఓటుకు డబ్బులు ఇస్తామని స్లిప్పులు తీసుకుని టిక్కులు వేసి డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, పచ్చ ప్రలోభాలు తారస్థాయికి చేరాయి. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బుతో పాటు వివిధ తాయిలాలను ఎర వేస్తున్నారు. కొన్ని చోట్ల కుటుంబాలను ఎంపిక చేసుకొని రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి వివిధ హామీలను గుప్పిస్తూ నగదును పంపిణీ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భారీగా నగదు స్వాధీనం..!
-
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. -
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
(సాక్షి, అమరావతి) : నిన్నటికి నిన్న... ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.04 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. తరవాత ఇవి తెలుగుదేశం నాయకులు తరలిస్తున్నట్లుగా తేలింది. దానికి ఒక్కరోజు ముందు... కదిరిలో ఓ ప్రయివేటు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అది సాక్షాత్తూ అక్కడి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనం. ఆయన పేరిట రిజిస్టరయి ఉండటంతో టీడీపీకి బొంకడానికి కూడా అవకాశం లేకపోయింది. ఇక విశాఖలో ఈ మధ్యనే మార్గదర్శి సిబ్బంది బేషరమ్‌గా తీసుకెళుతున్న రూ.కోటికి ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు. రెండు రోజుల కిందట తిరుపతిలో డ్వాక్రా మహిళలకు ఎర వేయటానికి అక్కడి టీడీపీ నాయకులు ఏకంగా ప్యాకెట్లలో రూ.3వేల నగదు, చీరలు పెట్టి పంపిణీ చేస్తూ దొరికిపోయారు. అక్కడ పంచిన మొత్తమే రూ.కోటి వరకూ ఉండొచ్చని అంచనా. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యగ్నేశ నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో నగదు దొరికినా... నోవా అగ్రిటెక్ కంపెనీ ముసుగులో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నిస్సిగ్గుగా ఓట్ల కొనుగోళ్లకు తెగబడినా... ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే. ఈ ఎన్నికల్లో గెలవకపోతే తాను, తన పార్టీ ఏవీ మిగలవన్న భయంతో చంద్రబాబు ఏకంగా డబ్బుల డ్యామ్‌కు కట్టలు తెంచేసి... ప్రవాహాన్ని వదిలిపెట్టేశాడు. ఇన్నేళ్ల అవినీతి సొమ్ములో కొంత ఖర్చు చేయక తప్పదని తాను కొంత పెడుతూ... తన వర్గీయులనందరినీ బరిలోకి దింపేశాడు. విదేశాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి బాబు వర్గానికి చెందిన వారంతా సామాజికవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తల ముసుగులో ఎక్కడికక్కడ తిష్ట వేసి డబ్బులు వెదజల్లుతున్నారు. పోలీసులు ముమ్మరంగా సోదాలు జరుపుతుండటంతో ఒకటీ అరా చోట్ల ఇలా దొరికిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... తన వర్గాన్ని, ఎన్నారై మద్దతుదారులను రంగంలోకి దించిన చంద్రబాబు వివిధ మార్గాల్లో రూ.13 వేల కోట్ల వరకూ సమీకరించి వెదజల్లుతున్నారు. పచ్చ ముఠా సభ్యులైన మార్గదర్శి చిట్‌ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ పెద్దలకు చెందిన రియల్ ఎస్టేట్, ఇతర సంస్థలు, తీరప్రాంతంలోని షిప్పింగ్ కంపెనీలను వీటి స్టోరేజీ కోసం ఉపయోగిస్తున్నట్లుగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకోవడంతోపాటు ఓట్ల కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ జట్టును ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రిటైర్డ్, సస్పెన్షన్‌లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో ఆ జట్టును ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు నియోజకవర్గానికి రూ.75 కోట్లు చొప్పున మొత్తం రూ.13 వేల కోట్లకుపైగా వెదజల్లేందుకు సిద్ధపడటం చంద్రబాబు బరితెగింపు రాజకీయాలకు నిదర్శనం. ‘పచ్చ’ కామెర్లు సోకిన ఈనాడు రామోజీకి పచ్చ దందా కానరావటం లేదు. నేరుగా టీడీపీ అభ్యర్థి వాహనంలో పోలీసులు రూ.2 కోట్లు పట్టుకున్నా.. రామోజీ మాత్రం తన పత్రికలో ఒక్క అక్షరం కూడా రాయలేదంటేనే ఆయన కళ్లు ఏ స్థాయిలో కామెర్లతో మూసుకపోయాయో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇది ‘ఈనాడు’ చెబితేనే లోకానికి తెలిసే కాలం కాదు కదా!!. ‘మార్గదర్శి’ ‘నారాయణ’, ఇతర కంపెనీలదే కీలక పాత్ర టీడీపీ అధికారంలో ఉండగా యథేచ్చగా భూ దోపిడీలు, ఆరి్థక అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు భాగస్వాములు అందరూ రంగంలోకి దిగారు. మరోసారి చంద్రబాబుకు పీఠం దక్కితే గతంలో కొల్లగొట్టిన దానికంటే పది రెట్లు అధికంగా దోపిడీకి పాల్పడవచ్చన్న ఉద్దేశంతో అక్రమాలకు తెగబడ్డారు. రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్, పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు, పలువురు టీడీపీ నేతలకు చెందిన అక్వా కంపెనీలు, షిప్పింగ్ కంపెనీలు... ఇలా చంద్రబాబు ముఠాకు చెందిన వ్యాపార సంస్థలన్నీ నల్లధనం గిడ్డంగులుగా మారిపోయాయి. ఆ సంస్థలకు హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని తరలించారు. వాటిని నల్లధనం స్టాక్ పాయింట్లుగా మార్చుకుని వివిధ మార్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించి భారీగా నోట్ల కట్టలను పంపిణీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలోని మార్గదర్శి బ్రాంచి నుంచి అక్రమంగా తరలిస్తున్న డబ్బులను పోలీసులు స్వా«దీనం చేసుకుని కేసు నమోదు చేయడం విదితమే. 2022 డిసెంబర్ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. అయినా సరే రాష్ట్రంలోని 37 బ్రాంచీల ద్వారా నెలకు దాదాపు రూ.200 కోట్ల నగదు టర్నోవర్‌ను లెక్కల్లో చూపిస్తుండటం గమనార్హం. ఆ టర్నోవర్ ముసుగులో టీడీపీ కోసం భారీగా నల్లధనాన్ని తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ సీనియర్ నేత పొంగూరు నారాయణకు చెందిన విద్యా సంస్థలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఎన్సై్పరా అనే కంపెనీ ముసుగులో భారీగా నల్లధనాన్ని తరలించడం అధికారుల సోదాల్లో బట్టబయలైంది. చంద్రబాబు బీజేపీ తరపున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిపిన సీఎం రమేశ్ ద్వారా భారీగా నల్లధనాన్ని డంప్ చేశారు. చంద్రబాబుకు సన్నిహితుడైన విశాఖకు చెందిన ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీ యజమాని ద్వారా నల్లధనం దందా సాగిస్తున్నారు. ఆయన కంపెనీ ఆరి్థక లావాదేవీల ముసుగులో భారీగా నల్లధనాన్ని షెల్ కంపెనీల నుంచి తరలించారు. అనకాపల్లి నియోజకవర్గంతోపాటు ఉత్తరాంధ్ర అంతటా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమాలకు ప్రత్యేక జట్టు ఎన్నికల అక్రమాల కోసం చంద్రబాబు ఏకంగా ఓ జట్టును ఏర్పాటు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నల్లధనాన్ని తెప్పించడం.. ప్రతి జిల్లాలో ప్రత్యేక డంపింగ్ కేంద్రాల్లో భద్రపరచడం.. అక్కడ నుంచి నియోజకవర్గాలకు పంపిణీ.. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నేతలకు నోట్ల మూటలు ఇచ్చి లోబరచుకోవడం.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేయడం.. ఈ మొత్తం ప్రక్రియను ఈ జట్టు పర్యవేక్షిస్తుంది.ఎస్వీయూలో తన సహ విద్యార్థిగా ఉన్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్, రాష్ట్ర విభజన అనంతరం పోలీస్ బాస్‌గా తాను నియమించిన అనంతపురం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఓ రిటైర్డ్ డీఐజీ, టీడీపీ ప్రభుత్వంలో ఆరి్థక వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ సలహాదారు తదితరులు ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. నల్లధనం, అక్రమ మద్యం పంపిణీ అంతా ఈ జట్టు కనుసన్నల్లోనే సాగుతోంది. ఏదైనా చేయండి.. డీల్ సెట్ చేయండి! టీడీపీ హయాంలో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను చంద్రబాబు విదేశాల్లోని వివిధ కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించారు. ఎన్నికల అక్రమాల కోసం ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ పెద్దల కంపెనీలకు తరలించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.75 కోట్ల వరకు వెదజల్లేందుకు చంద్రబాబు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు రూ.25 కోట్ల వరకు, రాష్ట్ర పార్టీ కార్యాలయ బృందాల ద్వారా రూ.50 కోట్ల వరకు ఎన్నికల అక్రమాల కోసం వెదజల్లాలన్నది చంద్రబాబు స్కెచ్. పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలకు రేటు నిర్ణయించేసి మరీ తమకు అనుకూలంగా మలచుకోవాలని హుకుం జారీ చేశారు. ‘పంచాయతీ స్థాయి నేతకు రూ.50 లక్షలు, మండల స్థాయి నేతకు రూ.కోటి, నియోజకవర్గ స్థాయి నేతకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఇచ్చేయండి..! ఏదైనా చేయండి.. డీల్ సెట్ చేయండి’ అని నిర్దేశించినట్లు సమాచారం. ఇక ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఓటుకు రూ.5 వేలు చొప్పున ఇవ్వడానికి వెనకాడొద్దని ఆదేశించారు. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్‌కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్‌లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. -
4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు
-
కదిరి టీడీపీ అభ్యర్థి.. కోటిన్నర నగదు పట్టివేత
-
లోక్‌సభ ఎన్నికల్లోనే రికార్డు.. రోజుకు రూ. 100 కోట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రికార్టు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ 45 రోజుల్లో కోట్ల నగదుతోపాటు డ్రగ్స్, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు పేర్కొంది. మొత్తం సొత్తులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకుసీజ్ అయిన రూ.778 కోట్లతో రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా.. అత్యల్పంగా లద్ధాఖ్‌లో రూ.11,580 మాత్రమే పట్టుబడింది. 2019 ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది. -
డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు
రాయచోటి టౌన్: తెలుగుదేశం పార్టీలో సూట్‌కేసుల్లో డబ్బు తీసుకొచ్చినవారికే టికెట్లు కేటాయిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా జెండామోసినవారికి, పార్టీకోసం అహరి్నశలు కష్టపడినవారికి మొండిచెయ్యి చూపుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) సోదరుడు, అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ నేత, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాతికేళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పని చేశానని, నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ జెండాలను మోశానని, టికెట్ ప్రకటించేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పార్టీ నాయకులకు గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు నాయుడు లేని హైప్ సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్త కొత్త వ్యక్తులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థిగా మాగంటి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా విదేశాల నుంచి అప్పటికప్పుడు సూట్ కేసులతో దిగిన వారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, మదనపల్లె ఇలా చాలా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రెచ్చగొట్టి రేసులో పెట్టారని వాపోయారు. అందుకే ఆ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక వినుకొండ దగ్గర జరుగుతున్న మేం సిద్ధం బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు రమేష్‌కుమార్ రెడ్డిప్రకటించారు. తన వ్యక్తిత్వం తెలిసినవారు, తన పనితీరు నచ్చి నవారు తనతో కలసి వస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా తెలిపారు. వైఎస్సార్సీపీలో పదవులకోసం కాకుండా తెలుగు దేశం పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తానని, అందుకోసం అహరి్నశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. -
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
పచ్చ పార్టీ ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/చీరాల: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇక తమకు ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి అడ్డదారులకు తెరలేపారు. ఓటర్లపై వారికి నమ్మకం సన్నగిల్లడంతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వెదజల్లి ప్రత్యర్థి పార్టీకి చెందిన చోటామోటా నేతలను, కార్యకర్తలను లోబర్చుకునేందుకు బరితెగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నేతకు రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి కార్యకర్తలకైతే రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ఈ కొనుగోళ్ల వ్యవహారం వారం రోజులుగా ఊపందుకున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఘటనల బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే.. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రూ.56 లక్షల డబ్బు కట్టలను గురువారం ఆయన మెరైన్ కంపెనీకి చెందిన కంటైనర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతల అక్రమాలు నిజమేనని స్పష్టమవుతోంది. అధికార పార్టీ నేతలకు రూ.లక్షల్లో చెల్లింపులు.. ఇదిలా ఉంటే.. బాపట్ల నియోజకవర్గంలో నామమాత్రంగా కూడా బలంలేని టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ కేవలం డబ్బు బలంతోనే టీడీపీ టికెట్ సంపాదించారని అందరికీ తెలిసిన విషయమే. ఆ బలంతోనే ఎన్నికల్లో నెగ్గేందుకు వర్మ సిద్ధమయ్యారు. కానీ, కొంతకాలంగా ఓటర్లకు చీరలు పంపిణీ చేసినా ప్రజల నుంచి స్పందన కరువవడంతో ఆయన డబ్బు రాజకీయానికి తెరతీశారు. గ్రామాల్లో ఉన్న చోటామోటా నేతలు, కార్యకర్తలను ప్రలోభపెట్టి డబ్బులు ముట్టజెప్పి కొనుగోళ్లకు తెరతీశారు. అధికార పార్టీలో పదవులున్న నేతకు రూ.10 లక్షలు, చోటా నేతకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గ్రామస్థాయిలో అయితే రూ.లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తున్నారు. పార్టీలో చేరిన వారికి రూ.పదివేలు చెల్లిస్తూ కండువాలు వేస్తున్నారు. అదే అధికార పార్టీ నుంచి పచ్చ పార్టీలో చేరితే మండల స్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 నుంచి 30 లక్షల ఆఫర్ చేస్తున్నారు. అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపిన వేగేశన నరేంద్ర వర్మపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా కంటైనర్ల ద్వారా తరలింపు? రాయల్ మెరైన్ అధినేత నరేంద్రవర్మ గత ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలకు ఈ కంటైనర్ వ్యవహారం బలం చేకూరుస్తోంది. కంటైనర్ల ద్వారా రొయ్యల బాక్సుల మధ్యలో డబ్బు తీసుకొస్తే ఎటువంటి అనుమానం రాదని, అందుకు పక్కా ప్లానుతో రాయల్ మెరైన్‌కు కంటైనర్ ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక ఆక్వా రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు నడిపే టీడీపీ నాయకులు చాలామంది ద్వారా ఇదే విధంగా నగదు అక్రమ రవాణా జరుపుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అసలు పట్టుబడ్డ నగదును నేరుగా తెచ్చుకోవాలి. కానీ, కంటైనర్లలో రొయ్యల బాక్సులలో మధ్యలో పెట్టి రహస్యంగా తీసుకురావడమే అనుమానాలకు తావిస్తోంది. ఇది ఒక్కసారి జరిగింది అయితే కాదని, ముందుగానే డబ్బును మెరైన్ కంపెనీలకు తరలించి అక్కడి నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా నరేంద్ర వర్మ ఒక్కరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రంగంలో ఉన్న టీడీపీ నేతల ద్వారా అక్రమమార్గాన విచ్చలవిడిగా నగదు రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రొయ్యల బాక్సుల మధ్యలో నోట్ల కట్టలు.. ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీకి నిజాంపట్నం నుంచి చీరాల పరిధిలోని ఈ సంస్థకు ఓ రొయ్యల కంటైనర్ చేరుకుంది. దీనికి సంబంధించి అప్పటికే సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ రాయల్ మెరైన్ వద్ద కాపు కాశారు. వచ్చిన కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, ఇన్‌కంటాక్స్, ట్రెజరీ అధికారులు గురువారం ఉ.11 గంటల సమయంలో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కంటైనర్‌లో అన్నీ రొయ్యల బాక్సులు ఉండగా, ఒక బాక్సులో మాత్రం రూ.500 నోట్లు 112 కట్టలతో మొత్తం రూ.56 లక్షలు దొరికాయి. దీంతో అధికారులు ఈ డబ్బు ఎక్కడ నుంచి తరలించారు, వీటికి సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అని విచారణ చేస్తున్నారు. ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు. మీడియా సహా ఎవరినీ ఆ కంపెనీలోకి అనుమతించకపోవడంతో డబ్బు కోట్లలోనే పట్టుబడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డబ్బుతోనే వర్మ ఓటర్లను, నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఐటీ అధికారులు వర్మ సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టారు. -
ఈజీ మనీ, క్రేజీ బోయ్: ఈ వీడియో చూస్తే మీకు పిచ్చెక్కుద్ది!
ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం, సులువుగా డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా స్మార్ట్‌గా ఉండాలి. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే దూకుడు సినిమా డైలాగును నూటికి నూరుపాళ్లు నిజం అంటారు మీరు ఈ వీడియో చూస్తే.. ది ఇన్స్టిగేటర్ అనే ట్విటర్ అకౌంట్ షేర్ చేసిన దాని ప్రకారం రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ని దాటడానికి నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణికులను రోడ్డు దాటిస్తున్నాడు. ఆగండాగండి.. ఇదేదో పుణ్యానికి చేస్తున్నాడనుకోరు. ఇందుకోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నాడు మనోడు. ‘‘డబ్బు సంపాదించే అవకాశాన్ని అస్సలు వదులు కోరు కొంతమంది’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన వీడియో ఇపుడు నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. పలు నగరాల్లో డివైడర్ కష్టాలను తలుచుకుంటూ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. ఐడియా అదిరింది గురూ, ఇది బిజనెస్ అంటే, స్మార్ట్ ఐడియా ఇలా పలు కమెంట్లు సందడి చేస్తున్నాయి. Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk — The Instigator (@Am_Blujay) March 19, 2024 -
భారీగా డబ్బు సీజ్..హైదరాబాద్ లో లేడీ డాన్ అరెస్ట్
-
డబ్బు సంపాదించడానికి 'చాట్‌జీపీటీ' - ఎలా అంటే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'చాట్‌జీపీటీ' దాదాపు అన్ని రంగాల్లోనూ చాలా ఉపయోగకరంగా మారుతోంది. మీ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఈ చాట్‌జీపీటీ ద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఈ కథనంలో చాట్‌జీపీటీ ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలనే విషయాలను తెలుసుకుందాం. చాట్‌జీపీటీ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఫ్రీలాంచ్ రైటింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ యాప్స్ అండ్ వెబ్సైట్లను అభివృద్ధి చేయడంలో సహాయపడటం మీ చిన్న వ్యాపారాల కోసం మార్కెటింగ్ ప్లాన్స్ రూపొందించండి ఆన్లైన్ సర్వేలను పూర్తి చేయడం వర్చువల్ అసిస్టెంట్ అవ్వడం కంపెనీల కోసం డాక్యుమెంట్స్ లేదా ఫైల్‌లను ట్రాన్స్‌లేట్ చేయడం ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ రెజ్యూమ్స్ రాయడం కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అందించండి మార్కెట్ రీసర్చ్ నిర్వహించడం ఇన్ఫర్మేషనల్ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం -
ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!
ఈ వైరల్ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్’ అంటున్నారు నెటిజనులు. -
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
-
ఆఫ్లైన్లోనూ ‘ఈ-రుపీ’ లావాదేవీలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆఫ్లైన్లోనూ ఈ-రుపీ లావాదేవీలను అందుబాటులోకి తేనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇది అందుబాటులోకి వస్తే డిజిటల్ రుపీ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట కూడా తమ లావాదేవీలు కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్ట్‌లోనే ఆఫ్‌లైన్ ఈ-రుపీ లావాదేవీలను పరిచయం చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2022 డిసెంబర్లో పైలట్ ప్రాజెక్టుగా రిటైల్ సీబీడీసీని ఆర్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్లో ఇది 10 లక్షల లావాదేవీలకు చేరింది. ఎంపిక చేసిన బ్యాంకులు తమ కస్టమర్లకు డిజిటల్ రుపీ వ్యాలెట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారానే వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారస్థుల మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులను ఆఫ్లైన్లోనూ జరిపేలా ఆర్బీఐ అనుమతించింది. -
రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా..
భూమి మీద దాదాపు అన్నింటికీ డబ్బు కావాల్సిందే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు మనుషులకు ఒక ఎడిక్షన్. ఇది మనల్ని ఎంతలా మార్చేసిందంటే మృగాలను వేటాడి పొట్టనింపుకునే ఆదిమానవులుగా ఉండే మనుషులను రాజ్యాలను శాసించే రాజులుగా మార్చింది. అంతేకాదు పగలు, రాత్రి డబ్బుకోసం కష్టపడే బానిసలుగా కూడా మార్చింది. ఈ డబ్బుకు ఇంత పవర్ ఎలా వచ్చిందో తెలుసా. ఇప్పుడు మనం ప్రతివస్తువు కొనేందుకు వాడే రూపాయి ఎలా పుట్టిందనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా?.. డబ్బు ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారైందో.. మన దేశంలో ఈ డబ్బు ఎలా చలామణైందో.. రాళ్ల నుంచి ‘ఈ-రుపీ’ వరకు ఎలా రూపాంతరం చెందిందో ఈ కథనంలో తెలుసుకుందాం. డబ్బు అంటే తెలియని కాలమది. కొన్ని రికార్డుల ప్రకారం క్రీస్తు పూర్వం దాదాపు 6000 ఏళ్ల కింద ఇరాక్‌లోని మెసపటోమియా ప్రాంతంలో చిన్న గుంపులుగా మనుషులు జీవించేవారు. వారికి తెలిసింది ఒక్కటే. వేటకు వెళ్లి పొట్ట నింపుకుని మళ్లీ పూటకోసం వేటకు వెళ్లడం. ఆ క్రమంలో కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. ఇంకొన్ని రోజులు ఆహారం దొరకదు. కానీ ప్రతిరోజూ ఆకలైతే వేస్తుంది కదా. ఇలా వేర్వేరు గుంపులుగా వేటకు వెళ్లే వారిలో కొన్ని గుంపులోని వారికి కొన్ని రోజులు, మరికొన్ని గుంపులకు ఇంకొన్ని రోజులు ఆహారం ఎక్కువగా దొరికేది. ఇలా అయితే కష్టం అని భావించి కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే ‘బార్టర్ సిస్టమ్’. బార్టర్ సిస్టమ్.. బార్టర్ సిస్టమ్‌లో భాగంగా ఆ గుంపుల్లోని వారివద్ద ఉన్న ఆయుధాలు ఇతర పరికరాలను వేరే గుంపులకు ఇచ్చి దానికి బదులుగా ఆహారాన్ని తీసుకునేవారు. ఇలా మొదలైన ఈ పద్ధతి చాలా ఏళ్లే కొనసాగింది. ఇలా జరుపుతున్న లావాదేవీలు ఏరోజుకు ఆరోజు సెటిల్ అయితే ఫర్వాలేదు. కానీ అలా సెటిల్కాకుండా తర్వాత రోజుల్లో సెటిల్ చేసుకోవాలనుకుంటే వాటిని గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తువులు ఇచ్చిపుచ్చుకునే వివరాలను రాళ్లపై నోట్ చేసుకునేవారు. ఇలా అకౌంటింగ్ మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ బార్టర్ సిస్ట్మ్తో కొత్త సమస్య వచ్చింది. ఇందులో ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ఇవ్వాల్సిందే కదా. అయితే బదులుగా ఇచ్చేవాటిలో కొన్ని ఎదుటివారికి అవసరం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చేది. దాంతో విలువైన వస్తువులు తీసుకుని జంక్ వస్తువులు ఇచ్చేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏదైనా వస్తువుకు బదులుగా ఒకే వస్తువును పరిగణించాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలు, విక్రయాలు జరిపినా ఆ వస్తువును మార్చుకుందామని భావించి కమొడిటీస్‌ను ఇచ్చిపుచ్చుకునేవారు. గవ్వలతో ట్రేడింగ్.. కమొడిటీస్ అంటే ఇప్పటిలాగా బంగారం, వెండీ కాదు. వీటికి బదులుగా ట్రేడ్ కోసం మొదటగా వాడిన వస్తువు గవ్వలు. అప్పట్లో హిందూమహాసముద్రంలో దిరికే అరుదైన ఈ గవ్వలను ట్రేడింగ్ కోసం వినియోగించేవారు. వాటిని విలువైన వస్తువులగా పరిగణించేవారు. అందుకే చరిత్రలోని కొన్ని సన్నివేశాలు, సినిమాల్లో వారు ధరించే వస్తువులు, దుస్తులు గవ్వలతో తయారుచేసి ఉంటాయి. తర్వాత రోజుల్లో మిరియాలు, ఉప్పు, పూసలు, రంగురాళ్లు, కుండలు.. వంటి అరుదైన వాటిని మనీగా వినియోగించేవారు. ఈ పద్ధతి ఇంకొన్నేళ్లు సాగింది. తర్వాత లోహం ఆవిష్కరించారు. దాంతో మెటల్ నాణెన్ని తయారుచేశారు. నాణెం పుట్టుక.. భారత్‌లో ముందుగా నాణెం పుట్టింది ఆరో శతాబ్దంలో అని పురాణాలు చెబుతున్నాయి. మహాజనపదాలు అనే రాజులు ఈ కాయిన్లను ముద్రించారు. వాటికి పురాణా, కష్యపణాలు, పణాలు అని పిలిచేవారు. ఇలా ముద్రించిన వాటికి ఎలాంటి ఆకారం ఉండేదికాదు. తర్వాతకాలంలో మౌర్యులు గ్రీక్‌ను గమనించి ప్రత్యేక మార్కుతో వివిధ మెటల్స్‌తో నాణేలు ముద్రించారు. బంగారు నాణేలను సువర్ణరూప, రాగి నాణెలను తామరరూప, వెండి నాణెలను రూప్యరూప అని పిలిచేవారని చంద్రగుప్తుడికి మంత్రిగా ఉన్న చాణుక్యుడు తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అయితే ఈ నాణెలు ఎవరు తయారుచేశారో వాటిపై ఉన్న గుర్తులనుబట్టి తెలుసుకునేవారు. నాణేలపై ఎలుగుబంటి ముంద్రించి ఉంటే చాణుక్యులదని, ఎద్దు ఉంటే పల్లవులదని, పులి ఉంటే చోళులదని.. తెలుసుకునేవారు. ఇదీ చదవండి: టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు? రుపీయే నుంచి రూపాయిగా.. దేశంలో మొఘలులు వచ్చాకే అప్పటివరకు వివిధ రూపాల్లో చలామణి అయిన నాణెలు రూపాయిగా మారింది. 1526 ఏడీలో మొఘల్ చక్రవర్తి షేర్షాసూరి 178 గ్రాముల సిల్వర్ కాయిన్‌ను రుపియేగా ప్రకటించారు. ఈ ఒక్క కాయిన్‌కు 48 కాపర్కాయిన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కాపర్కాయిన్లను దామ్‌గా పిలిచేవారు. 168 గ్రాములుగా ముద్రించే బంగారు కాయిన్లను మొహుర్గా పిలిచేవారు. ఇలా రూపాయి ఎన్నో రూపాలు మార్చుకుంది. కాలంగడుస్తున్న కొద్దీ ఈ రూపీయేలను స్టోర్ చేయాలంటే కష్టమయ్యేది. దాంతో చైనా పేపర్ మనీని ఆవిష్కరించి వాడుకలోకి తీసుకొచ్చింది. ఇలా రూపాలు మారుతూ చివరికి అవీ అంతరిస్తూ ‘ఈ-రుపీ’ వాడేరోజులు వచ్చాయి. -
ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే..
ప్రతి దేశంలో ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు ఉంటాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పలు కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలపై ఆధారపడి ఉంటుంటాయి. వాల్‌మార్ట్, ఫోర్డ్, రిలయన్స్ వంటి ‘కుటుంబ’ కంపెనీలు.. ఆయా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతంగా నిలుస్తుంటాయి. ఈ అంశంపై తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పరిశీలన జరిపింది. దేశాలవారీగా జీడీపీలో అక్కడి ‘వ్యాపార’ కుటుంబాల సంస్థల భాగస్వామ్యం ఎంత అన్న అంచనాలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్లలో కేవలం కుటుంబ కంపెనీల వాటానే 27 శాతం ఉంటుందని తేల్చింది. ఇది మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొంది. ‘వ్యాపార’ కుటుంబాల ఆదాయ శాతంలో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఏటా దేశ జీడీపీలో 79 శాతం వరకు పెద్దా, చిన్నా ‘కుటుంబ’ వ్యాపారాల నుంచే సమకూరుతున్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా వేసింది. ఈ విలువ 245 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! విలువపరంగా ‘వ్యాపార’ కుటుంబాలు సమకూర్చుతున్న మొత్తాన్ని చూస్తే.. రూ.1,205 లక్షల కోట్లతో అమెరికా ప్రపంచంలో టాప్‌లో ఉంది. 821 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద వాహనాల తనిఖీలు
-
డబ్బుకు బాబు దాసోహం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త క్యాండిడేట్ల కోసం టీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ఓట్లను డబ్బుతోనైనా కొని గెలవాలని నిర్ణయించుకుని దండిగా డబ్బున్నవారికోసం వలవేస్తోంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు వంటి వారిని బరిలోకి దింపాలని చూస్తోంది. అనంతపురం జిల్లాలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేందుకు కొందరు సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు, నాయకులకు శరాఘాతంగా మారాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి, కనకమేడల, టీజీ వెంకటేష్ వంటి బడావ్యాపారులకు సీట్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అనుసరించబోతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బడా కాంట్రాక్టర్‌ను దించాలని యోచిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అక్కడ పార్టీకి పనిచేస్తున్న వారిని ఈసారి పక్కన పెట్టొచ్చని విశ్వసనీయంగా తెలిసింది. గుంతకల్లు నియోజకవర్గంలో ఇప్పటివరకూ పనిచేసిన అభ్యర్థులను కాదని, ఒక సీఐ స్థాయి పోలీసు అధికారిని నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రెండుసార్లు పరిటాల సునీత పోటీ చేశారు. ఇప్పుడు బాగా డబ్బున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెరమీదకు వచ్చారు. ఈయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈయనకు టికెటిస్తే రూ.50 కోట్లయినా ఖర్చు చేయగలరని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఈసారి రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వకుండా దీపక్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అగ్రకులాల చేతిలో రిజర్వుడు స్థానాలు మడకశిర, శింగనమల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు మొత్తం ఆర్థిక బలమున్న అగ్రకులాల చేతుల్లోకి వెళ్లింది. పార్టీకి పనిచేసిన వాళ్లకు కాకుండా డబ్బున్న వాళ్లు ఎవరికి చెబితే వారికే దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకూ శింగనమలకు బండారు శ్రావణి, మడకశిరకు ఈరన్న పేర్లను ఖరారు చేయకుండా నాన్చుతున్నారు. రూ.10 కోట్లయినా ఖర్చు చేయగలిగే వాళ్లకే ఇక్కడ టికెట్లు ఇవ్వాలనేది బాబు యోచన. మిగిలిన స్థానాల్లోనూ ఆర్థిక బలమున్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నారు. -
డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా?
డబ్బుతో అన్ని కొనగలం గానీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కొనలేం అని తెలిసిందే. అందుకే పిసినారుల్లా, డబ్బు కోసం పడిగాపులు పడొద్దని పెద్దలు హితవు చెబుతుంటారు. అయితే ఈ విషయంపై పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు కూడా. అందుకు సమాధానం కనుగొన్నారు. ఆ అధ్యయనాల్లో డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చు అనిపించేలా ఫలితాలు వచ్చాయి. ఆదాయాలు పెరగడంతో కొందరూ సంతోషంగా ఉన్నామని చెప్పగా, అల్రెడీ ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో సంతోషం కనిపించలేదు. ఇక్కడ పెరుగుతున్న ఆదాయాలు సంతోషానికి కారణమవుతాయని తేలింది గానీ చివరిగా అందరూ ఒక్కదానికే ఏకగ్రీవంగా ఓటేశారు. అలా చేస్తేనే చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఇంతకీ అందరూ దేన్నీ హైలెట్ చేసి చెప్పారంటే... వివరాల్లోకెళ్తే..పరిశోధకులు డేనియల్ కాహ్నెమాన్, మాథ్యూ కిల్లింగ్స్‌వర్త్ ద్యయం చేసిన అధ్యయనం నిర్ధిష్ట ఆదాయ పరిమితిని చేరుకున్న తర్వాత సంతోషంగా ఉండగలమా? అనే దాన్ని సవాలు చేసిందన్నారు. ఈ మేరకు పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా సుమారు 33 వేల మందిపై అధ్యయనం చేసి వారి డేటాను సేకరించింది. అయితే వారిలో పెరుగుతున్న ఆదాయాలతో సంతోషం పెరుగుతుందని తేలింది. తక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు అధిక సంపాదన కలిగిన వారితో పోలిస్తే పెరిగిన ఆదాయం కారణంగా సంతోషంగా ఉండగలరని వెల్లడయ్యింది. వార్షిక జీతం దాదాపు 74 లక్షలు వరకు ఉంటే మానసిక ఆనందంలో మెరుగుదల కనపించింది. అంతకుమించి ఆదాయం పెరిగితే.. అవి ఆనందానికి, మానసికి సంతోషానికి మధ్య సంబంధాల పరిమితి ఏర్పడుతున్నట్లు గమనించారు. ఇక కిల్లింగ్సవర్త్ 2021 అధ్యయనం ప్రకారం దాదాపు రూ. 4 కోట్ల ఆదాయం ఉన్నప్పుడూ.. ఆనందంపై డబ్బు సానుకూల ప్రభావం కనిపించింది. అదేసమయంలో దాదాపు 83 లక్షలు కంటే ఎక్కువ జీతాలు అందుకున్న వ్యక్తుల్లో సంపద పెరిగినప్పటికీ వారి ఆనందంలో మెరుగుదల కనిపించలేదు. వారు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సంతోషాన్ని పొందడంలో అనుబంధాల పాత్ర అత్యంత కీలకమనిపేర్కొంది. మంచి జీవితానికి సంబంధాలు అవసరమని అందుకు సంపద కూడా ఒకింత కారణమని చెప్పారు. భౌతకపరమైన సంపదకంటే అనుభవాలతో ఆర్జించుకున్న సంతోషమే గొప్పదని తేలింది. కొంతమంది సామాజికి సంబంధాలతో సంతోషాన్ని పెంపొందించుకున్నారు. డబ్బుతో పనిలేదని ప్రూవ్ చేశారన్నారు. 2008లో ఎలిజబెత్ డన్ ఆమె సహచరులు నిర్వహించిన అధ్యయనంలో ఒక సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన అధ్యయనంలో కెనడాలోని వాంకోవర్ వీధిలో నడిచే వ్యక్తులకు కొంత డబ్బు నోటులు ఇచ్చి మీ కోసం లేదా ఇతరుల కోసం ఖర్చే చేయమని చెప్పారు. చివరిగా వారంతా తమ కోస కంటే ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలిగినట్లు ముక్తకంఠంతో చెప్పారు. పరోపకారమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది అని అన్నారు. అలాగే మిస్సౌరీ-కొలంబియా విశ్వవిద్యాలయంలోని సైకలాజి పరిశోధకుల అధ్యయనంలో ఇతరులను సంతోష పెట్టడం వల్ల ఆనందం అర్థవంతంగా ఉందన్న విషయాన్ని హైలెట్ అయ్యింది. దయతో కూడిన పరోపకార చర్యలే ఎక్కువ సంతోషానికి కారణమవుతాయని ఆ పరిశోధనలో తేలింది కూడా. ఈ అధ్యయనం ఇతరుల ఆనందానికి తోడ్పడటం అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ పరిశోధనల సారాంశం అవసరాలకు సరిపడ ఆదాయ పెరుగుదల మన సంతోషానికి కారణమవ్వడం తోపాటు ఇతరులకు సాయం చేయడం వల్ల మనం మరింత మానసిక సంతోషాన్ని పొందగలమని వెల్లడించింది. (చదవండి: చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు! ధర ఏకంగా..!) -
‘దేశం’లో ధనస్వామ్యం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. డబ్బులేదని నానికి ఝలక్.. తమ్ముడికి ఛాన్స్.. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. ♦ కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు. ♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్‌ఛార్జిని చేశారు. ♦ అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబానికే ఓటు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. తెరపైకి ఎన్ఆర్ఐలు ♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. ♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. -
‘అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్!’
అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్. ఈ ఏడాది ప్రపంచంలో పలు దేశాలు వ్యాపార నిమిత్తం వినియోగించే డాలర్‌ను ఇకపై తాము వినియోగించబోమని, సొంత కరెన్సీతో సంబంధిత లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని 20 దేశాలు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది అమెరికన్ డాలర్. ప్రపచంలోనే 95 శాతం దేశాలు అమెరికన్ డాలర్ ఆధారంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే ఇకపై ట్రెండ్ మారనుంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ వినియోగాన్ని తగ్గించేశాయి. సొంత కరెన్సీని ఆయా వాణిజ్య లావాదేవీలకు ఉపయోగిస్తున్నాయి. డాలర్ పెత్తనాన్ని అయితే తాజాగా మరిన్ని బ్రిక్స్‌లో కూటమైన దేశాలు, ఆసియన్ దేశాలు డాలర్ పెత్తనాన్ని అంగీకరించడం లేదు. సొంతంగా తమ స్థానిక కరెన్సీని మాత్రమే ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యాయి. అటు బ్రిక్స్ కూటమితో పాటు ఆసియన్ దేశాలు సైతం డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టనున్నాయి. బ్రిక్స్ కూటమిలో మరిన్ని దేశాలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు, గళాన్ని వినిపించేందుకు 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలకు ‘బ్రిక్’ కూటిమి ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరాక అది బ్రిక్స్‌గా అవతరించింది. ఆ దేశాలు ఇవే తాజాగా, మరో 5 దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వచ్చి చేరాయి. ప్రస్తుతం బ్రిక్స్ 10 దేశాల కూటమి అమెరికన్ డాలర్ వినియోగాన్ని విరమించుకోనున్నాయి. బ్రిక్స్ దేశాల కూటమి బాటలో ఆసియా దేశాలు అదే సమయంలో 10 ఆసియన్ దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలు వ్యాపార లావాదేవీలకు యూఎస్ డాలర్ సొంత కరెన్సీని వినియోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఏడాది అదనంగా మరో 16 దేశాలు ఈ డి-డాలరైజేషన్ మిషన్‌లో చేరతాయని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇది బలీయమైన ప్రపంచ ఆర్థిక కూటమిగా బ్రిక్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలకం ఆసియన్ సభ్యులతో పాటు పాకిస్తాన్, ఇరాక్, టర్కీ, నైజీరియా, ఈజిప్టుతో సహా ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుండి అనేక దేశాలు బ్రిక్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ చేరికలు రాబోయే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశం కీలక ఎజెండాగా మారనుందని అంచనా. వ్యాపార లావాదేవీల్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యంపై అసంతృప్తి నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్‌ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్‌చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్‌ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్‌లో చాలామంది ఇన్సూరెన్స్‌ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్‌పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్‌మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
సిలిండర్ ఈకేవైసీ @ రూ.150
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
అకస్మాత్తుగా ఖాతాల్లో డబ్బులు జమ.. అంత డబ్బు ఎలా వచ్చింది?
శాంతినగర్: చేనేత కార్మికుల ఖాతాల్లోకి అకస్మాత్తుగా డబ్బులు వచ్చి పడటంతో అటు ఆనందం వ్యక్తం చేయాలో లేక ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటామోనని ఆందోళన చెందుతున్నారు. రాజోళిలో 3,800 కుటుంబాలకు పైగా చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,100 మగ్గాలు ఉండగా.. మంగళవారం అకస్మాత్తుగా 168 మంది ఖాతాల్లో రూ.21,14,681లు జమ అయ్యాయి. అయితే ఈ డబ్బులు ఎవరు వేశారో తెలవకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయింది. అదే సమయంలో గ్రామానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్లు ఫోన్లు చేసి తామే డబ్బులు బదిలీ చేయించామని, 90 శాతం డబ్బులు తిరిగి తమ అకౌంట్లలోకి పంపాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేనేత కార్మికులందరూ మాట్లాడుకుని సగం డబ్బులు తిరిగి పంపేందుకు ఒప్పుకుని కొందరు పంపగా.. మరికొందరు పంపలేదు. డబ్బులు పంపిన వారి ఖాతాల్లోకి తిరిగి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మళ్లీ జమయ్యాయి. అసలు డబ్బులు ఎందుకు పడుతున్నాయి.. ఎవరు పంపిస్తున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. అంతేగాక కొందరికి రూ.7 వేలు, మరికొందరికి రూ.15 వేలు, ఇంకొందరి ఖాతాల్లో రూ.25 వేల వరకు నగదు జమ కావడంతో చేనేత కార్మికులు ఆశ్చర్యపోతున్నారు. ఖాతాల్లోకి దాతలు వేశారా.. లేక సైబర్ నేరగాళ్లు లేక బ్లాక్‌మనీ ఉన్న వారు వేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో.. గతంలో కరోనా కాలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు రాజోళి చేనేత కార్మికులు ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా... ఇప్పుడు కార్మికుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసి ఉంటారని కొందరు చెప్పుకుంటున్నారు. మాస్టర్ వీవర్స్ మాత్రం తామే అకౌంట్లలో డబ్బులు వేయించామని వాటిని తమకు పంపాలని ఒత్తిడి తెస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు మాత్రం దాతలు పంపి ఉంటారని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీస్, చేనేత జౌళిశాఖ అధికారులు స్పందించి చేనేత కార్మికుల ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించి.. 1,100 మంది చేనేత కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!
బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. అప్పటిదాక గడప దాటని అమాయకపు తల్లి అయినా బిడ్డ జోలికొస్తే.. శివంగిలా మారిపోతుంది. ఏదో విధంగా కాపాడాలని తపించిపోతుంది. అలానే ఇక్కడొక తల్లి కూడా వెరొక దేశంలో అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో చిక్కుకుని విలవిలలాడుతున్న కూతుర్ని రక్షించాలని తప్పనపడింది. అందుకు ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకోవడమే ఒక్కటే ఆ తల్లి ముందున్న మార్గం. అయితే ఆ దేశానికి భారతీయ పౌరులెవ్వరికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి హైకోర్టులో పోరాడి అనుమతి తెచ్చుకుని మరీ వెళ్లేందుకు పయనమవుతుంది. అక్కడ వాళ్లతో 'బ్లడ్ మనీ డీల్' చేయబోతోంది. ఏంటీ బ్లడ్ మనీ డీల్..? ఏంటా ఆ తల్లి గాథ అంటే.. నిమిషా ప్రియా అనే ఒక నర్సు 2011లో యెమెన్‌కి వెళ్లింది. అక్కడ ఆమె సనాలో నర్సుగా పనిచేసేది. అయితే ఏం జరిగిందే ఏమో 2017 యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. ఆమె సన్నిహితుల ప్రకారం..ఆమె పాస్‌పోర్ట్‌ని మహదీని తీసుకుని ఇవ్వకపోవడంతో ఎలాగైన అతడి నుంచి తీసుకునే క్రమంలో మహదీన్కి మత్తు మందులను ఇంజెక్ట్ చేసింది. దీంతో అతడు మరణించాడు. ఏం చేయాలో పాలుపోని నిమిషా తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో అతడి శవాన్ని ముక్కలు చేశారు. అయితే నిమిషా పోలీసులకు దొరికిపోయింది. దీంతో యెమెన్ ట్రయల్ కోర్లు కేసుని విచారించి..నిమిషాకి మరణ శిక్ష విధించగా, ఆమె సహోద్యోగికి జీవత ఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్ జైలులోనే ఉంది. అప్పటి నుంచి నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యెమెన్ సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే..? అక్కడ ఆమె అప్పీలును తిరస్కరించింది యెమెన్ సుప్రీం కోర్టు. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే 'బ్లడ్ మనీ డీల్' ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది తిరిగి భారత్‌లోని తన కుటుంబం చెంతకు వెళ్లిపోవచ్చు. అందుకోసం ఆమె తల్లి ప్రేమ కుమారి యెమెన్‌కి వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్‌కి ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యోమెన్‌కి వెళ్లటం ఆమెకు అసాధ్యం అందుకని ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతురుని రక్షించుకోవడానికి యెమెన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యెమెన్‌తో భారత్‌కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు పేర్కొంది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకి తెలిపింది. దీంతో హైకోర్టు భారత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకుండా తన స్వంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ తల్లిని కోరింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ (బుధవారం)ఆ తల్లికి పశ్చిమ ఆసియా దేశమైన యెమెన్ వెళ్లి తన కూతురు విడుదల కోసం "బ్లడ్ మనీ డీల్" చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 'బ్లడ్ మనీ డీల్' అంటే.. యెమెన్ షరియా చట్టాల ప్రకారం ఆమెను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడాన్ని " బ్లడ్ మనీ డీల్" అంటారు. అందుకోసం ఆ తల్లి వెళ్లడం అత్యంత ముఖ్యం. ఏదీఏమైన తన కూతురు కోసం ఆ తల్లి పడుతున్న కష్టం ఫలించాలని ఆశిద్దాం. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ జెస్ట్‌మనీ తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాపారం పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయాత్నాలు చేశామని, కానీ అవి ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో తమ వద్ద పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు చేసింది. దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా రుణాలపై ఆధారపడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. భారత ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక ‘బై నౌ పే లేటర్’ ఫిన్ టెక్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి షాపింగ్ కోసం ప్రజలకు తక్కువ ఖర్చుతో రుణాలు కల్పిస్తున్నాయి. అలా ఏడాళ్ల కిందట జెస్ట్‌మనీ కంపెనీ ప్రారంభమైంది. దేశంలో ఈ వ్యాపార మోడల్‌పై నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులు కంపెనీని దెబ్బతీసినట్లు సమాచారం. దాంతో బిజినెస్ పునరుద్ధరించడంలో విఫలమైనట్లు కంపెనీ ప్రకటించింది. చివరికి సంస్థను మూసివేస్తున్నట్లు తెలిపింది. కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది. మూసివేతకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసే వరకు కొంతమంది కంపెనీలోనే ఉండనున్నట్లు వివరించింది. తొలగించిన ఉద్యోగులకు డిసెంబర్ నెల వేతనం ఇస్తామని జెస్ట్‌మనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలోనూ వారికి సహాయం చేస్తామని చెప్పినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో జెస్ట్మనీను ఫోన్‌పేకు విక్రయించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ఒప్పందం కుదురకపోవడంతో కంపెనీ ముగ్గురు సహ వ్యవస్థాపకులు రాజీనామా చేశారు. దీంతో సంస్థ కొత్త నాయకత్వ బృందాన్ని నియమించింది. అయినా మూలధన అవసరాల నిమిత్తం నిధులను సమీకరించడం కష్టంగా మారింది. ఫలితంగా కంపెనీ మూసివేత అనివార్యమైందని సమాచారం. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! వాస్తవానికి కంపెనీని 2016లో లిజ్జీ చాప్మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ స్థాపించారు. కంపెనీ 17 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉండి నెలకు రూ.400 కోట్ల రుణాలను పంపిణీ చేసేది. దేశంలో 10,000 ఆన్లైన్ బ్రాండ్లు, 75,000 ఆఫ్‌లైన్ స్టోర్లతో 27 రుణ, వ్యాపార భాగస్వాములను కలిగి ఉండేది. ఈ క్రమంలో నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులతో వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నెలల కిందట కంపెనీ యజమానులు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
మంచిర్యాలలో పోలీసులు విస్తృత తనిఖీలు
-
కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే పేమెంట్ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది. -
‘మామయ్యా’ అనే పిలుపు కోసం..
చాలామంది అన్నదమ్ములు తమ సోదరికి జన్మించిన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారి చేత ‘మామయ్యా..’ అని పిలిపించుకోవాలని తపన పడిపోతుంటారు. అయితే ఈ మెట్లనన్నింటినీ దాటేసిన ఒక మేనమామ తన మేనకోడలికి పెళ్లిలో ఘనమైన కానుకను సమర్పించుకున్నాడు. హర్యానాలోని రేవాడీలో ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు ఇచ్చిన కానుక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన వితంతు సోదరి కుమార్తెకు కానుకగా ఇచ్చేందుకు అతను సోదరి ఇంట్లో రూ.500 నోట్ల కట్టలను కుప్పలుగా పోశాడు. మేనకోడలికి ఖరీదైన కానుకను అందించిన ఆ వ్యక్తి పేరు సత్బీర్. అతను క్రేన్ వ్యాపారి. సత్బీర్ తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు విలువైన నగలు కూడా బహూకరించాడు. సత్బీర్ మొత్తంగా ఒక కోటి, ఒక లక్షా పదకొండు వేల నూటొక్క రూపాయలను పెళ్లి కుమార్తెకు కానుగా ఇచ్చాడు. ఈ ఘటనలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసల్వాస్ రేవారి.. ఇది జైపూర్-ఢిల్లీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఈ ప్రాంతానికి చెందిన సత్బీర్ సోదరి వివాహం సిందర్‌పూర్‌లో జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఆమె భర్త మృతి చెందాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. తన మేనకోడలి పెళ్లి సందర్భంగా సత్బీర్ తన ఊరి ప్రజలతోపాటు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. పెళ్లిలో సత్బీర్ తన మేనకోడలికి ఇచ్చిన కానుకను చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ఈ సంద్భంగా సోదరి ఇంటిని సత్బీర్ రూ.500 నోట్ల కట్టలతో నింపేశాడు. కోటి రూపాయలకుపైగా మొత్తాన్ని తన మేనకోడలికి బహూకరించాడు. ఇది కూడా చదవండి: ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే! भाई ने विधवा बहन के घर लगा दिया रुपयों का ढेर, करोड़ों का भात बना चर्चा का विषय#rewari #haryana #bhaat pic.twitter.com/SYi95UEREl — Punjab Kesari Haryana (@HaryanaKesari) November 27, 2023 -
ఓ జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలు, డబ్బు స్వాధీనం
-
సల్మాన్ ఖాన్@ 220 కోట్లు..
సల్మాన్ ఖాన్ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తన సంపదను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బును విభిన్న మార్గాల్లో మదుపు చేసి ఏటా దాదాపు రూ.220 కోట్లు సంపాదిస్తున్నట్లు జీక్యూ ఇండియా సర్వే తెలిపింది. సల్మాన్ ఖాన్ కలిగి ఉన్న తొమ్మిది ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 1. బాక్సాఫీస్: అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి అనేక ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే సినిమా ప్రారంభించడానికి ముందే సల్మాన్‌ఖాన్ రెమ్మునరేషన్ తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ప్రాఫిట్-షేరింగ్ ఒప్పందాల ప్రకారం వాటికి వచ్చే ఆదాయంలో దాదాపు 50శాతం వాటాను తనకు ఇవ్వాల్సి ఉంటుంది. 2. ప్రొడక్షన్ హౌస్: 2011లో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో చిల్లర్ పార్టీ జాతీయ అవార్డు చిత్రంతోపాటు బజరంగీ భాయిజాన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇతర సినిమాలు సైతం ఈ బ్యానర్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. 3. స్టార్టప్‌లలో పెట్టుబడి: యాత్రా.కామ్ అనే ట్రావెల్ కంపెనీలో సల్మాన్‌ఖాన్‌కు దాదాపు 5శాతం వాటా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం తెలిసింది. ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నేతృత్వంలోని చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన ‘చింగారి’లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. 4. క్లాతింగ్ కంపెనీ: 2012లో స్థాపించిన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ కంపెనీ ద్వారా సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సేవలందిస్తోంది. దీని ద్వారా పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్యను అందిస్తున్నారు. ఈ కంపెనీ యూరప్, మిడిల్ఈస్ట్ దేశాల్లోనూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 90 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. 5. ఫిట్నెస్ పరికరాలు, జిమ్: సినీ పరిశ్రమలోని ఫిట్నెస్ నటుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్న సల్మాన్ ఖాన్ 2019లో బీయింగ్ స్ట్రాంగ్ కంపెనీను ప్రారంభించారు. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. ముంబై , నోయిడా, ఇందోర్, కోల్‌కతా, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో జిమ్‌లను ప్రారంభించారు. 6. రియల్ ఎస్టేట్: సల్మాన్ ఖాన్ ముంబయిలో ఇళ్లు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. ముంబయి శాంటాక్రూజ్‌లోని తన నాలుగు అంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చి నెలకు దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్నట్లు అంచనా. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ఖాన్ 2012లో రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ఈ స్థలాన్ని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్హాల్కు నెలకు రూ.90లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు. ఇదీ చదవండి: వందల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ అలెక్సా 7. టీవీ షోలు: 2010-11 సీజన్ నుంచి ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారానికి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారని కొన్ని మీడియా కథనాల్లో ప్రచురించారు. బిగ్ బాస్ సీజన్ 17 ముగిసే సమయానికి దాదాపు రూ.200 కోట్లను సంపాదించవచ్చని అంచనా. బిగ్ బాస్ కంటే ముందు ఆయన 10కా దమ్ అనే రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా పనిచేశారు. 8. బ్రాండ్ యాడ్లు: హీరో హోండా, బ్రిటానియా టైగర్ బిస్కెట్, రియల్మీ, రిలాక్సో, డిక్సీ స్కాట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు సల్మాన్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో కంపెనీ ద్వారా ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తారని అంచనా. 9. ఎన్ఎఫ్టీ: 2021లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, రజనీకాంత్, సన్నీ లియోన్‌తోపాటు ఇతర నటులు నాన్-ఫంగిబుల్ టోకెన్లలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల వారి అభిమానులు నటుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్ట్‌లు, మ్యూజిక్, వీడియోలు, ఫొటోలు వంటివి డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: క్రికెట్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే.. పైన తెలిపిన అన్ని మార్గాల ద్వారా సల్మాన్ ఖాన్ వార్షిక ఆదాయం రూ.220 కోట్లుగా తేలింది. అంటే నెలకు దాదాపు రూ.16 కోట్లు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఖాన్ ఆస్తుల నికర విలువ సుమారు 350 యూఎస్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,907 కోట్లు)గా ఉన్నట్లు కొన్ని కథనాలు వల్ల తెలుస్తుంది. -
HYD: ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో శనివారం భారీ నగదు పోలీసులకు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో ఈ నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే.. పట్టుబడ్డ ఈ నగదు ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ఓ నాయకుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలె ఐటీ దాడులు ఎదుర్కొన్న నేత అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ తనిఖీలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Telangana: వలస ఓటర్ల వేట
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. వారి ప్రసన్నం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికిపైనే ఉంటారు. వీరి ఓటింగ్ అభ్యర్థి గెలుపోటములను ప్రభా వితం చేసే వీలుంది. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఏ ఒక్క ఓటును తేలికగా విడిచిపెట్టకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమిస్తున్నారు. సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువంటే.. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువ నగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే 2 లక్షల మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40 వేలమందికి పైగా వలస ఓటర్లున్నట్టు లెక్కగట్టారు. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారు. ♦ దేవరకొండ నియోజకవర్గంలో 25 వేల మంది వరకూ వలస ఓటర్లున్నట్టు తెలుసుకున్నారు. వీళ్లు హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనగిరి, ఆలేరుల్లో దాదాపు 20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కలేశాయి. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉంటాయని ఓ ప్రధాన పార్టీ లెక్కలేసింది. ముంబై, సోలాపూర్, పుణేలో వివిధ పనులు చేసు కునే వీళ్ల కోసం ఆయా సామాజిక వర్గం నుంచే కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, పోలింగ్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు. అక్కడ ఈ ఓట్లే కీలకంగా భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వారిని రప్పించేందుకు రేషన్ డీలర్ల సాయం కూడా తీసుకుంటున్నారు. ♦నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు 15 వేలకు పైగానే ఉంటారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోనూ 10 వేల ఓట్లరు ఉంటారని అంచనా. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, కోయిల కొండ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్‌పేట మండలాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలకు చెందిన వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరిని రప్పించేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్ వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళకు ఇప్పటికీ ఓట్లు, రేషన్ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి చిరునామా, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ రూపొందించడానికి సాంకేతిక నిపుణులూ ఇందులో ఉంటున్నారు. వివిధ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో బృందం పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటున్నారు. నియోజకవర్గం వారీగా వలస ఓటర్ల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు మరో పది మంది డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో మాట్లాడటం, వారికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఉంటోంది. ఓటరు కచ్చితంగా ఏ పార్టీకి ఓటు వేస్తాడనే అంచనాలను ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా సేకరిస్తున్నారు. ఇక పూణే, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు అభ్యర్థుల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి వలస ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికలకు కనీసం రెండు రోజుల ముందే గ్రామాలకు రప్పించాలని నేతలు భావిస్తున్నారు. -
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
భారీగా నగదు సీజ్
గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా గురువారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.3,22,500 నగదును గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్పీ రితిరాజ్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలికూడదని తెలిపారు. వనపర్తి: జిల్లావ్యాప్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.4 లక్షల నగదు, 9 లీటర్ల మద్యం, 51 కేజీల నల్లబెల్లం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్పీ రక్షితా కె.మూర్తి వెల్లడించారు. పెద్దమందడి మండలం వెల్టూరు చెక్‌పోస్టు వద్ద రూ. 4లక్షల నగదు, ఖిల్లాఘనపురంలో 9 లీటర్ల మద్యం, వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 51 కేజీల నల్లబెల్లం పట్టుబడినట్లు తెలిపారు. జడ్చర్ల: పట్టణంలోని క్లబ్ రోడ్డులో తరలిస్తున్న రూ.9లక్షల నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. బ్యాంకులో డ్రా చేసిన నగదును బాదేపల్లికి చెందిన వంశీధర్‌రెడ్డి తన వాహనంలో తరలిస్తుండగా, పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కృష్ణా: మండలంలోని చేగుంట చెక్‌పోస్టు వద్ద రూ.2,47,479 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. రాయచూర్ నుంచి గుర్మిట్కల్కు నీలకంఠ పాటిల్ అనే వ్యక్తి నగదును తరలిస్తుండగా, పట్టుకుని నారాయణపేట్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. మాగనూర్: మరికల్ మండలం మాదారం గ్రామానికి చెందిన ఉప్పు రాము తన వాహనంలో రూ.లక్ష 40వేలు తరలిస్తుండగా, మాగనూర్‌లో పట్టుకున్నట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ఊట్కూర్: పగిడిమారికి చెందిన వెంకటేష్ తన వాహనంలో రూ.లక్ష నగదు తరలిస్తుండగా, మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ గోకారి తెలిపారు. -
పులిటీషియన్లు.. కొంగబావలు
అడవిలో పులి వేటకు బయలుదేరింది. కొంతకాలంగా ఆ అడవిలో దానిదే రాజ్యం. ఎంత కావాలంటే అంత ఆహారం. రోజుకో జంతువు విందు. అందుకే తాపీగా లేచి ఒళ్లు విరుచుకుని అడవి మీద పడింది. మాంచి ఆకలి మీద ఉందేమో కాసింత పెద్ద జంతువునే వేటాడేసి.. ఆరగించడం మొదలుపెట్టింది. పులికైనా పొలిటీషియన్ కైనా ఎంత తిన్నా ఆకలి అలాగే ఉంటుందని.. ఓ పెద్ద రైటర్ ఏనాడో చెప్పాడు. దొరికిన జంతువును ఆబగా తింటూండేసరికి దాని ఎముకగొంతులో ఇరుక్కుంది. దీంతో విలవిల్లాడిన పులి దాన్ని బయటకు తీయాలని అన్ని జంతువులను బతిమాలింది. కొని పులి అరాచకంపై కోపంతో.. మరికొన్ని భయంతో మావల్ల కాదనేశాయి. ఇంతలో ఓ కొంగ దాని కంటపడింది. కొంగ బావను ఎలాగైనా ఒప్పించాలని.. దానితో మాటలు కలిపి..తన బాధను చెప్పింది. ముందు కొంగ కూడా ససేమిరా అంది. అయితే పులి కొంగకు ఆశలు పెట్టింది. తాయిలాలు చూపింది. అచ్చం ఎలక్షన్ టైమ్‌లో మన నాయకులలాగా.. ‘ ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తాం, పింఛన్ పెంచుతాం. గ్యాస్‌ధర తగ్గిస్తాం.. ఈసారి ఓటేసి గట్టెక్కించండి...’’... అలా కొంగ బావకు రకరకాల ఆశలు పెట్టింది. దానితో కొంగ ఐసైపోయింది. మన ఓటరు లాగా. ‘ ఆహా.. చిన్న సాయానికే బతుకు మారిపోతుందే..’ అనుకుంది. తన పొడుగాటి ముక్కు పులి నోట్లో తల పెట్టి ఎముక చులాగ్గా లాగి పారేసింది. పులి ఊపిరి పీల్చుకుని కొంగకు «థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది. అలా వెళుతున్న పులికి దాని బాసలు గుర్తుచేసింది. తొందరగా పని కానివ్వు అన్నట్టుగా. తర్వాత రెండు మూడు నెలలు గడిచాయి. పులి జాడలేదు. ఇచ్చిన మాట జాడలేదు. ఎలాగోలా పులిని వెతికి పట్టుకుని ‘..నీ మాటేమైంది..’ అని కొంగ అడిగింది. ‘ .. చూద్దాం అదే పనిలో ఉన్నా..’ అని పులి అక్కడ నుంచి జారుకుంది. అలా నెలలు గడుస్తున్నాయి. ఉలకదు పలకదు. అచ్చం మన ప్రజాప్రతినిధిలా. ఓసారి పులి ఎదురైతే కొంగ గాట్టిగా నిలేసింది. ‘..ఎంతో మేలు చేస్తానన్నావ్ నీ పని అయిపోయాక తప్పించుకు పోతున్నావ్....’ అని. దానికి పులి చిద్విలాసంగా..‘‘ నేను నీకు మేలు ఎప్పుడో చేసేసాను.. నా నోట్లో నీ తల పెట్టినప్పుడు వదిలేశా.. అంతకన్నా మేలు ఏముంటుంది..’ అని తాపీగా నడుచుకుంటూ పోయింది. కొంగబావ అవాక్కయ్యింది. ఎన్ని ప్రలోభాలు.. ఎన్ని మాటలు.. ఎన్ని మోసాలు అని తిట్టుకుంది. అది మనిషి కాదు కనుక దానికిది కొత్త.. మనకైతే ప్రతి ఐదేళ్లకోసారి అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది...పులిటీషియన్లను ఇప్పుడు ఓటర్లే కాపాడాలి. ఎవరు మనవాళ్లు, ఎవరు విపక్షం, కొంగబావలాగా ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏమిస్తామని ప్రలోభ పెట్టాలి..ఇలా ఎన్నో లెక్కలు.. .. ఇస్తే ఓటేసేవారెవరు? తీసుకుని మరీ వేరేవాళ్లకు వేసేదెవరన్న ఈ అంశంపైనే అమెరికాకు చెందిన మిషిగన్, కాలిఫోర్నియా యూనివర్సిటీల పొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్లు.. ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృతమైన అధ్యయనం చేశారు. ఓట్ల కొనుగోళ్ల విషయంలో ఉన్న కొన్నిరకాల అభిప్రాయాలు తప్పు అని తేల్చారు. అభ్యర్థులు, ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్నది విశ్లేషించారు. ఇది క్లైంటెలిజమ్! ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులు, వివిధ రకాల వస్తువులు, బహుమతులు పంచడమే క్లైంటెలిజమ్. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణమే. దీనివల్ల అధికారం కొందరు రాజకీయ నేతలకే పరిమితమైపోతుంది. సిద్ధాంతపరమైన, సామాజిక ప్రయోజనకర అంశాలు పక్కనపడి.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమైపోతాయి. దానితో అభివృద్ధి కుంటుపడుతుంది. తాయిలాలకు ఓట్లు రాలుతాయా? డబ్బులు, బహుమతులు తీసుకున్నవారంతా ఓటేస్తారా? ఏదైనా తీసుకున్నప్పుడు, మరొకటి తిరిగిచ్చి రుణం తీర్చుకోవాలన్న సంప్రదాయం వర్కౌట్ అవుతుందన్న దానిపైనే తాయిలాలు తయారయ్యాయి... దీనిపై చేసిన సర్వేలో .. ఓటర్లు డబ్బులు, బహుమతులను తీసుకున్నా కూడా తమకు ఓటేయరేమోనని లేక ఓటేయడానికే రారేమోనని చాలా మంది అభ్యర్థులు భావిస్తున్నట్టు పేర్కొంది. కొందరు ఓటర్లు కూడా డబ్బు తీసుకున్నాక వేరేవారికి ఓటేయడం పట్ల పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమీ లేదని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసమేనేమో.. డబ్బులు తీసుకున్న ఓటర్లతో ఒట్టు పెట్టించుకోవడం, గుళ్లకు తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం, కుల సంఘాలు, అసోసియేషన్లలో ప్రమాణాలు చేయించడం వంటివి మన నేతలు చేస్తుంటారు. ఓట్లు అమ్ముకోవడం తప్పా? ఓట్లు కొనడం, అమ్ముకోవడం తప్పు అనే ప్రచారం ఉన్నా.. ఆ భావన అటు నేతల్లో, ఇటు ఓటర్లలోనూ కనబడటం లేదని అధ్యయనం పేర్కొంది. గెలవడానికి ఎంతెంత ఇచ్చాం, ఏమేం పంచామనేది నేతలు బహిరంగంగానే చెప్తున్నారని.. ‘వాళ్లు ఇస్తున్నారు. మేం తీసుకుంటున్నాం..’ అని చెప్పడానికి ఓటర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని వెల్లడించింది. అందుకే ఓటేయడా నికి డబ్బులు తీసుకోవద్దంటూ జరిగే ప్రచారానికి పెద్దగా ఫలితం ఉండటం లేదని స్పష్టం చేసింది. వ్యతిరేకులపై ప్రభావం అంతంతే.. తమపై వ్యతిరేకత ఉన్నవారికి డబ్బులు, బహుమతులు ఇచ్చినా తమకు అనుకూలంగా ఓటేయర న్న విషయం రాజకీయ నాయకులకు తెలుసని అద్యయనం పేర్కొంది. తమకు అనుకూలమైన వా రిని అలాగే కొనసాగించుకునేందుకు, త టస్థంగా ఉన్నవారిని తమవై పు తిప్పుకొనేందుకు మా త్ర మే డబ్బులు పంచుతారని తేల్చింది. తమ వెంట నిలిచిన కార్యకర్తలకు ఏదో ప్రయోజనం కల్పించామన్న భావన కోసం, తమను నాయకుడిగా గుర్తించేందుకు వారికి డబ్బు, బహుమతులు ఇస్తుంటారని వివరించింది. .. అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, కొన్నిసార్లు నేరుగానే డబ్బు సాయం చేయడం వంటివీ ఇందుకే.. ఇక ఇప్పుడు రాజకీయంగా తటస్థంగా ఉండేవారు తక్కువే. కానీ ఆ కొద్దిశాతం ఓట్లతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితులు ఎక్కువ. ఇక్కడే ‘పంపకాల’ ప్రయోజనం మరింత ఎక్కువన్నమాట. ప్రలోభాలకు లొంగవద్దనే ప్రచారాలతో ప్రయోజనమెంత? డబ్బు తీసుకుని ఓటేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. ఇందులో ఓటేసేందుకు ఎలాంటి డబ్బు, బహుమతులు తీసుకోవద్దనేది ఒకటైతే.. డబ్బు తీసుకోండి, కానీ మీకు నచ్చినవారికే ఓటేయండి అన్నది రెండో రకం ప్రచారం. నిజానికి రెండో రకం ప్రచారం వల్ల ఓటర్లు డబ్బులు తీసుకున్నా.. తమకు నచ్చిన, సమర్థుడైన నేతకే ఓటేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది తప్పు అని అధ్యయనం తేల్చింది. ఏమీ తీసుకోవద్దు, ఓటును అమ్ముకోవద్దన్న ప్రచారంతోనే కొంత ప్రయోజనం ఉంటోందని పేర్కొంది. ఏమీ తీసుకోనివారిలో ఎలాంటి బెరుకు ఉండదని, నచ్చినవారికి ఓటేస్తారని తెలిపింది. అయితే పంచే డబ్బు/బహుమతి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఓటర్లు తీసుకోకుండా ఉండలేకపోతున్నారని స్పష్టం చేసింది. ఇక.. ‘డబ్బు తీసుకోండి. నచ్చినవారికే ఓటేయండి’ అన్న ప్రచారం.. ఓట్ల కొనుగోలు, ప్రలోభాలను మరింతగా పెంచుతోందని అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లు డబ్బు/బహుమతులు తీసుకోవడంలో మొహమాటాన్ని పక్కన పెట్టేస్తున్నారని, ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నించే నేతలకు పని సులువు అవుతోందని పేర్కొంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లాక.. ‘డబ్బులు తీసుకున్నప్పుడు ఓటేయకపోతే ఎలా..?’ అన్న మీ మాంసతో డబ్బులిచ్చిన అభ్యర్థికే ఓటేస్తున్నారని తెలిపింది. -
ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ అభిషేక్ మల్హాన్. ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి పెద్దమొత్తంలో నగదును వెంట తీసుకెళ్తున్నట్లు వీడియోలో వెల్లడించాడు. రూ. 1.5 లక్షలతో ఐఫోన్ కొనాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అభిషేక్ వీడియోలో మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడూ తీసుకువెళ్లలేదు. ఈ సమయంలో నా హృదయం బాధతో ఉప్పొంగిపోతోంది. నా డబ్బు ఎలా పోయిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆ డబ్బులతో ఒక ఐఫోన్‌ని కొనుగోలు చేయాలనుకున్నా. కానీ ప్రస్తుతం ఆ నగదు నా వద్ద లేదు. డబ్బుతో జాగ్రత్తగా ఉండమని మా నాన్న చాలా సార్లు చెప్పారు. నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని అనుకోలేదు. ఇది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా" అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అభిషేక్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2లో మొదటి రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!) -
లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు. -
పైసలు... తీసుకెళ్లాలంటే పరేషాన్!
వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు. చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు. -
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?
ముంబయి: డ్రీమ్ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్ఐ సోమనాథ్పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎస్ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
డబ్బే.. డబ్బు
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి రూ.1,11,96,570 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధితోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.99,61,370 నగదు సీజ్ చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ సైదులు ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ ఏరియాలో తనిఖీలు జరపగా ద్విచక్రవాహనంపై బ్యాగ్‌లో ఉదయ్‌కుమార్, రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.28,73,000 తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. అలాగే రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం రూ.18,26,670, చిన్నచింతకుంట పోలీసులు లాల్కోట చౌరస్తాలో రూ.35,49,900, దేవరకద్ర పోలీసులు రూ.17,11,800 నగదు స్వాధీనం చేసుకుని కమిటీకి అప్పగించనున్నారు. అలాగే టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సంజయ్‌నగర్, కొత్త చెరువు రోడ్, హనుమాన్‌నగర్ ఏరియాల్లో బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురి ఇళ్లలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండగా 60 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరులోని ఓ సినిమా థియేటర్ దగ్గర కారును తనిఖీ చేయగా దామరగిద్ద మండలాలనికి చెందిన అయ్యవారిపల్లి బాల్‌రెడ్డి, దూదేపల్లికి చెందిన వ్యక్తి వాహనంలో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కమిటీకి అప్పగిస్తామని కోస్గి సీఐ జనార్దన్ తెలిపారు. మరికల్‌లోని ఆత్మకూర్ ఎక్స్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబ్‌నగర్ నుంచి నర్వ వెళ్తున్న వెంకటరాజు కారులో రూ.3 లక్షలు, దేవరకద్ర నుంచి రాయిచూర్ వెళ్తున్న శ్రీశైలం కారులో రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. అలాగే ఎలిగండ్లకు చెందిన శేఖర్‌గౌడ్ రూ.19 వేల విలువ గల మద్యం ఆటోలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో దాసుపల్లికి చెందిన జంగిరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వస్రుంనాయక్ తలిపారు. ఇందుకు సంబంధించి పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించామని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.1.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రక్షితాకె.మూర్తి తెలిపారు. అలాగే ఆత్మకూరు, రేవల్లి, పెబ్బేరు, గోపాల్పేట, వనపర్తి టౌన్ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలో నిల్వ చేసిన 191 లీటర్ల మద్యంను సీజ్ చేశామన్నారు. శ్రీరంగాపురం మండలంలోని నాగరాలలో బెల్టు షాపుపై దాడి చేసి 11 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటస్వామి చెప్పారు. మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు మండలంలోని చందాపూర్ శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా రవికుమార్ అనే వ్యక్తి కారులో రూ.2 లక్షలు, ఎదిర కిరణ్‌కుమార్‌కు చెందిన కారులో రూ.1.29 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు. దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి చెక్‌పోస్టు దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా మోదేపల్లికి చెందిన వ్యాపారి రంజిత్‌కుమార్ నుంచి రూ.1.57 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు చెప్పారు. అలాగే మరికల్‌కు చెందిన వ్యాపారి రాజు నుంచి రూ.1.85 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫుల్‌టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. 3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు. 4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. 5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్‌గా మారవచ్చు. 6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్‌క్యాస్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్‌కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. 7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది. 8. పెట్టుబడులు: స్టాక్‌లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం. 9. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం. రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Follow the Sakshi TV channel on WhatsApp -
ఐటీ దాడులు: 22 బాక్సుల్లో రూ.42 కోట్లు
బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా సొత్తు బయటపడింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ అశ్వత్తమ్మ, ఆమె భర్త ఆర్.అంబికాపతి, కూతురు, వారి బంధువుకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అంబికాపతి ఇంట్లో మంచం కింద దాచిన 22 పెట్టెల్లో రూ.42 కోట్ల రూ.500 నోట్ల కట్టలు బయటపడినట్లు ఐటీ శాఖ తెలిపింది. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి బెంగళూరు మీదుగా భారీగా డబ్బును హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరులోని అశ్వత్తమ్మ కుటుంబీకులకు చెందినలో ఆర్టీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో గురువారం రాత్రి వరకు జరిపిన సోదాల్లో రూ.42 కోట్ల లభ్యమైనట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ్ శ్రీనివాసమూర్తికి అశ్వత్తమ స్వయానా సోదరి. అశ్వత్తమ భర్త ఆర్.అంబికాపతి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయనే గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనికీ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ దర్యాప్తు జరపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు ఎన్నికల అస్త్రంగా మారాయి. మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలుకాగా , కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఆరోపణలు.. తెలంగాణ ట్యాక్స్ పేరుతో బిల్డర్లు, బంగారం వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.1,500 కోట్లను కాంగ్రెస్ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు పంపుతోందని తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ఇటీవల ఆరోపించింది. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ డబ్బును భారీగా వెదజల్లుతోంది. టిక్కెట్లు సైతం అమ్ముకుంటోంది’అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కోట్ల రూపాయలను పంపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సైతం ఆరోపణలు చేశారు.