ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్‌లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు.
‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్‌కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్‌బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్‌బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్‌జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్‌బీ.
కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్‌బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్‌ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment