koun banega karodpati
-
లండన్‌లో రతన్‌టాటాతో బిగ్‌బీకి ఎదురైన అనూహ్య అనుభవం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్‌కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్‌బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్‌బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్‌బీ.కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్‌బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్‌ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్‌గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్‌ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!
Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, కర్జాత్‌లోని ఎన్డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్డీ స్టూడియోసీజ్కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు. ఎన్డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.252.48 కోట్లుగా తేలింది. (ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?) నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం. VIDEO | "He was a good friend of mine. I met him 10-15 days ago, but didn't feel that he was in any kind of tension," says Shiv Sena (UBT) leader Baban Dada Patil on film art director Nitin Desai's suicide. pic.twitter.com/uBBG8Q0cSX — Press Trust of India (@PTI_News) August 2, 2023 #WATCH | Maharashtra: Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. pic.twitter.com/lEgENNCRjy — ANI (@ANI) August 2, 2023 ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు? ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) నితిన్ కుడిభుజం కాకా ఎన్డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్ మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్ అప్‌కమింగ్ మూవీ OMG 2 ఆన్లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) Unbelievably sad to know about the demise of Nitin Desai. He was a stalwart in production design and such a big part of our cinema fraternity. He worked on so many of my films… this is a huge loss. Out of respect, we are not releasing the OMG 2 trailer today. Will launch it… — Akshay Kumar (@akshaykumar) August 2, 2023 నాలుగు జాతీయ అవార్డులు, అద్భుతమైన సినిమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ , దేవదాస్ మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాలు . Shocking news this morning - Art Director Nitin Desai is no more. Such a warm human being, associated with many of my projects and ballets, his passing is a terrible loss to the film industry. May he find peace wherever he is🙏 pic.twitter.com/STNsz6Kwr8 — Hema Malini (@dreamgirlhema) August 2, 2023 -
భజ్జీ బౌలింగ్‌లో అమితాబ్ సిక్స్ .. వీడియో వైరల్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సిక్స్ కొట్టాడు. అదేంటి అమితాబ్ క్రికెట్ ఎప్పుడు ఆడాడు అనే డౌట్ రావొచ్చు. అమితాబ్ పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 13వ సీజన్‌కు భజ్జీతో పాటు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్లు గెస్ట్లుగా వచ్చారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో అమితాబ్, హర్బజన్‌లు క్రికెట్ ఆడగా.. ఇర్ఫాన్ కామెంటరీ చేశాడు. ''మేం ఎంతో మంది దిగ్గజాలకు బౌలింగ్ చేశాం. ఇక హర్భజన్ ఇప్పుడు మరో లెజెండరీకి బౌలింగ్ వేయబోతున్నాడు.. ఏం జరుగుతుందో చూద్దాం'' అంటూ ఇర్ఫాన్ కామెంట్ చేశాడు. చదవండి: LPL 2021: బౌలర్ వింత సెలబ్రేషన్‌కు బ్యాట్స్‌మన్ షాక్ హర్బజన్ వేసిన ఒక బంతిని అమితాబ్ సిక్స్ కొట్టడంతో ఇర్ఫాన్ భజ్జీని తనదైన శైలిలో టీజ్ చేశాడు. '' యార్ ఇట్స్ సిక్స్‌ర్.. హర్భజన్ చేతిలోని బంతి అమితాబ్ చేతిలోని బ్యాట్‌తో ఓడిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హర్భజన్ అమితాబ్, ఇర్ఫాన్ పఠాన్లను పంజాబీ బాంగ్రా డ్యాన్స్ చేయించడం విశేషం. కాగా డిసెంబర్ 17న సోనీ టీవీలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. #KBC13 ke manch pe AB sir ne lagaaye apne balle se chauke aur chakke,Harbhajan Singh ki pitaai or hamari commentary,Dekhiye iss entertaining pal ko #KaunBanegaCrorepati ke #ShaandaarShukriya week mein, Mon-Fri, raat 9 baje, @SonyTV @SrBachchan @harbhajan_singh pic.twitter.com/egGdx4HKMN — Irfan Pathan (@IrfanPathan) December 17, 2021 -
KBC: అమితాబ్‌పై జయా బచ్చన్ ఫిర్యాదు!
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సిజన్లో కేబీసీ ఓ 1000వ ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సందర్భంగా హాట్ సీట్లో కూర్చొని క్విజ్‌లో పాల్గొనడానికి తన కూతురు స్వేతా బచ్చన్, మనవరాలు నవ్వా నవేలీ నందాలను అమిత్ ఆహ్వానించారు. దీంతో పాటు అమితాబ్ భార్య జయా బచ్చన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రోమోల్లో అమితాబ్, జయా అనుబంధం చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమిత్‌పై జయా.. ఫిర్యాదు చేసింది. ‘ఫోన్ చేస్తే.. అస్సలు లిఫ్ట్ చేయరు’ అని కంప్లైంట్ చేశారు. ‘ఇంటర్నెట్ వస్తూపోతూ ఉంటే నేను ఏం చేయను?’ అంటూ అమితాబ్ ఫన్నీగా తనను తాను సమర్థించుకున్నారు. స్వేతా బచ్చన్ జోక్యం చేసుకొని జయా పక్షాన మాట్లూడుతూ.. ‘సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం, ట్వీట్లు పెట్టడం చేస్తారు’ అని గుర్తుచేస్తుంది. టాపిక్ మారుస్తూ.. అమితాబ్ ‘జయా నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అంటారు. వెంటనే స్పందిన జయా.. ‘మీరు అబద్దాలు చెప్పేటప్పుడు బాగుండరు’ అని సరదగా బదులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక 1000వ ఎపిసోడ్ డిసెంబర్ 3 రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
నా ప్రపంచం మారిపోయింది.. కన్నీళ్లతో అమితాబ్
Amitabh Bachchan Felt Emotional In KBC: ప్రముఖ హిందీ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' గురించి తెలియనీ వారుండరు. దీని నుంచే ఎవరు మీలో కోటీశ్వరులు పోగ్రామ్ వచ్చిందని కూడా తెలిసిందే. బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎందరో సామాన్యులు వచ్చి కరోడ్‌పతులుగా మారి ప్రేక్షకులను అలరించారు. ఈ పోగ్రామ్ ఈ శుక్రవారం 1000వ ఎపిసోడ్‌ను పూర్తిచేసుకోనుంది. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో బిగ్‌బీ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నంద పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌లోని ఉత్తమ క్షణాలను వీడియో రూపంలో విడుదల చేశారు. అది చూసిన బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలో 2000 సంవత్సరంలో భారీ మొత్తాన్ని గెలుచుకున్న హర్షవర్ధన్ నవతే ఉన్నాడు. అలాగే 2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఉన్నాడు. ఇంకా ఆ వీడియోలో హాట్సీట్లో కూర్చున్న వారితో ఆనంద క్షణాలు పంచుకున్న బిగ్‌బీ ఉన్నారు. షోలో పాల్గొన్నవారి విజయాన్ని చూసి ఆనందించారు అమితాబ్. వీడియో క్లిప్ చూసిన శ్వేతా బచ్చన్, తండ్రి అమితాబ్‌ను ఎలా ఫీల్ అవుతున్నారని అడిగింది. అందుకు బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకుంటూ 'నా ప్రపంచం మొత్తం మారిపోయింది.' అని బదులిచ్చారు. 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి ఎపిసోడ్‌ను హోస్ట్ చేశారు బిగ్‌బీ అమితాబ్. అయితే మూడో సీజన్‌కి అమితాబ్ అనారోగ్యం కారణంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. దీంతో పాటు 21 ఏళ్లుగా షోలో స్థిరమైన హోస్ట్‌గా వ్యవహరించారు అమితాబ్ బచ్చన్. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) అంతకుముందు అమితాబ్ తన బ్లాగ్‌లో 'ఉదయం తెల్లవారుజామున లేవగానే 5000కుపైగా ఆలోచనలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అంతకుముందు రాత్రి ఆ మిగిలిపోయిన పనులు మనస్సును వెంటాడుతాయి. కానీ కౌన్ బనేగా కరోడ్‌పతి 1000వ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. అవును, 2000 సంవత్సరంలో టెలివిజన్ ప్రపంచానికి పరిచయం అయిన కేబీసీ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.'అని రాసుకొచ్చారు. -
భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై
సాక్షి, ముంబై: హిందీ పాపులర్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లేటెస్ట్ సీజన్లో బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ తన యాంకరింగ్‌తో అభిమానులకు ఆకట్టుకుంటున్నారు. గణేష్ చతుర్ధి సందర్భంగా ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ సెస్సేషన్‌గా నిలవనుంది. హాట్‌లోసీట్‌లో ఉన్న అమితాబ్‌కు భర్త రణవీర్ సింగ్‌పై దీపికా ఫిర్యాదు చేయడం, ఈ సందర్భంగా దీపికా దంపతులతో బిగ్‌బీ చేసిన సందడి హైలెట్‌గా నిలిచింది. చదవండి : Chiranjeevi Sarja Son: బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం ఈ కార్యక్రమంపై ప్రోమోల మీద ప్రోమోలను విడుదల చేసింది సోనీ టీవీ. లేటెస్ట్ ప్రోమోలో తన భర్త రణ్వీర్ సింగ్ ఫిర్యాదు చేసింది దీపిక. బ్రేక్‌ఫాస్ట్ చేసి పెడతానని ప్రామిస్ చేసిన రణవీర్ ఇంతవరకు ఆ పనిచేయలేదంటూ గోముగా ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రణవీర్‌ను లైన్లోకి తీసుకొచ్చిన అమితాబ్ ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా వంట చేయలేదటగా అంటూ మరింత క్రేజ్ పెంచారు. దీంతో అమితాబ్ జీకి నా విషెస్ చెప్పమంటే.. నామీదే కంప్లైంట్ చేస్తావా అంటూ రణవీర్ అలిగాడు. చివరలో తన ఒడిలో కూర్చొ బెట్టుకుని ఆమ్లెట్ తినిపించమని అమితాబ్ చెప్పారంటూ ప్రేక్షకులను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడు రణవీర్. చదవండి: కేబీసీలో దీపికా, ఫరా సందడి మామూలుగా లేదుగా! పండుగ సందర్భంగా స్పెషల్ ఎడిషన్‌తో సందడి చేసే షో నిర్వాహకులు తాజాగా దీపికా, ఫరా ఖాన్‌ను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫరా, దీపికా అల్లరితోపాటు, కొన్ని ఎమోషనల్ సంగతులను కూడా ప్రేక్షకులకు వడ్డించనున్నారు. దీంతోపాటు ఇండియన్ ఐడల్ సింగర్స్ తమ పాటలతో చేసిన సందడి షోకు మరింత ఎట్రాక్షన్‌గా నిలనుంది. చదవండి : కోటి రూపాయలను తలదన్నే కథ View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కేబీసీలో.. కేటీఆర్? విషయం ఏమిటంటే?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికరంగా వార్తల్లో నిలిచారు. సాధారణంగా కోవిడ్ బాధితులు, ఇతర సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ అభినందనలు అందుకునే కేటీఆర్ పాపులర్ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి -13లో అనూహ్యంగా చోటు సంపాదించుకున్నారు. అయితే ఆయన పార్టిసిపెంట్‌గా అనుకుంటే మాత్రం.. మీరు పొరబడినట్టే.. విభిన్న అంశాలపై స్పందించే ఆయన ట్వీట్ కేబీసీలో ఒక ప్రశ్నగా రావడం విశేషంగా నిలిచింది. ఇపుడు ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో కేటీఆర్ ట్వీట్‌ను కేబీసీ షో నిర్వాహకులు పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ హాజరైన ఎపిసోడ్లో కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్‌ని ప్రశ్నగా సంధించారు హాట్ సీట్లో ఉన్న అమితాబ్. దీనిపై స్వయంగా కేటీఆర్ కూడా ఒకింత ఆశ్చర్యాన్ని, మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదో సరదాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ట్విటర్లో షేర్ చేసి.. వీటిని సరిగ్గా పలికే వారున్నారా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని వెనుక కచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుందని చమత్కరిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్‌ని ట్యాగ్ చేశారు. ఆ ట్వీటే కేబీసీలో ప్రశ్నగా మారింది. కేటీఆర్ ఈ ట్వీట్‌ను ఎవరికి ట్యాగ్ చేశారంటూ కేబీసీలో అమితాబ్ ప్రశ్నించారు. సమాధానాల్లోని నాలుగు ఆప్షన్స్‌గా కపిల్ సిబల్, సుబ్రమణ్యస్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ పేర్లను ఇచ్చారు. దీనిపై సౌరవ్ గంగూలీ, చాలా స్మార్ట్‌గా ఆలోచించి శశిథరూర్ అని చెప్పారు. ఇంగ్లీష్‌పై పట్టు అంటే రాజకీయ వర్గాల్లో ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది పేరు శశి థరూర్. Rs.40000 worth question 👇🏾 pic.twitter.com/GlT0T5UjNz — krishanKTRS (@krishanKTRS) September 3, 2021 Would you like to answer this question asked in KBC today @KTRTRS garu ? pic.twitter.com/QPmZPVnqvD — krishanKTRS (@krishanKTRS) September 3, 2021 Ain’t this hilarious @ShashiTharoor ! Just a tongue-in-cheek comment apparently made it to KBC 😁 Hope Dada and Sehwag got it right https://t.co/y6VsC9lFEg — KTR (@KTRTRS) September 3, 2021 I suspect @ShashiTharoor Ji Pakka has a role to play in this 👇 https://t.co/zO024Pq0Oa — KTR (@KTRTRS) May 20, 2021 -
కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి..
Kaun Banega Crorepati: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ). ప్రస్తుతం కేసీబీ 13వ సీజన్ కొనసాగుతోంది. అయితే ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ రైల్వే అధికారి చిక్కుల్లో పడ్డాడు. అయితే ఆయన సరైన సమాధానం చెప్పనందు వల్ల కాదు.. షోలో పాల్గోనందుకు. కంటెస్టెంట్ దేశ్ బంధ్ పాండే కేబీసీలో పాల్గొని.. బిగ్ బీ అడిగిన పది ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.3,40,000 గెలుచుకొని ఇంటి ముఖం పట్టాడు. కేబీసీలో పాల్గొని అమితాబ్ బచ్చన్‌ను కలవాలన్న తన కలను దేశ్ పాండే నెరవేర్చుకున్నారు. దేశ్ పాండే వృత్తి రీత్యా రైల్వే ఉద్యోగి. అయితే తాను పని చేస్తున్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ అతనికి షాక్ ఇచ్చింది. కేబీసీలో పాల్గొన్నందుకు ఆయనకి చార్జ్‌షీట్ పంపించింది. కేబీసీ షోలో పాల్గొనడానికై రాజస్థాన్‌లో కోటా నుంచి దేశ్ పాండే ముంబైకి వచ్చారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకు ఆయన ముంబైలో ఉన్నారు. షోలో పాల్గొనేందుకు దేశ్ పాండే తన ఉన్నతధికారుల వద్ద సెలవుల కోసం అప్లికేషన్ పెట్టాడు. చదవండి: కాజోల్‌ను నాతో చూడగానే కోపం తెచ్చుకునేవాడు: షారుక్ అయితే ఉన్నతధికారులు ఆయన సెలవుల అప్లికేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదు. అనంతరం ఆయన కేబీసీ షోలో పాల్గొన్నారు. దీంతో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆయనకు చార్జ్ షిట్ను పంపించింది. అయితే విషయంపై రైల్వే ఉద్యోగులు.. అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పశ్చిమ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్ సెక్రటరీ ఖలీద్ ఈ విషయంపై స్పందిస్తూ.. దేశ్ పాండేపై రైల్వే అడ్మినిస్ట్రెషన్ ఎప్పుడూ సరిగా వ్యవహరించలేదన్నారు. ఆయన బిహార్‌లోని పట్నాలో పుట్టి పెరిగారని, రైల్వేలో ఆయన ఆఫీస్ సూపరింటెండెంట్ అని తెలిపారు. ఉద్యోగం కోసం దేశ్ పాండే గత 13 ఏళ్ల నుంచి రాజస్థాన్‌లోని కోటాలో ఉంటున్నారని పేర్కొన్నారు. చదవండి: పోర్నోగ్రఫీ: ప్రొడక్షన్ హౌజ్‌పై మాజీ మిస్ యూనివర్స్ సంచలన వ్యాఖ్యలు -
మరోసారి కేబీసీకి ‘సూపర్ 30’ ఆనంద్
ముంబై : సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో మరోసారి పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న ఎపిసోడ్ 51, 61,62లలో పాల్గొనవల్సిందిగా కేబీసీ ఆనంద్‌ను ఆహ్వానించనుంది. ఈ మేరకు సూపర్ 30 శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2017లో మొదటిసారి ఆయన కేబీసీలో పాల్గొన్నారు. గేమ్ ఆడి 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు. అంతేకాకుండా ‘అరక్షణ్’ సినిమాలో పాత్రకు సంబంధించి అమితాబ్ బచ్చన్‌కు ఆనంద్ కొన్ని సలహాలను కూడా ఇచ్చారు. చదవండి : అక్షయ్ బాటలో మిలింద్.. తొలిసారి ఆ పాత్రలో! -
హిందువుల మనోభావాలు కించపరిచారని..
ముంబై: అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. అలాంటిది ఈ కార్యక్రమంలో హిందువులను కించపరిచారంటూ మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ ఆరోపించారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సోనీ టెలివిజన్‌లో అక్టోబర్ 30న ప్రసారమైన ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్, నటుడు అనూప్ సోని అతిథులుగా వచ్చారు. కార్యక్రమంలో భాగంగా రూ.6.40 లక్షల ప్రైజ్‌మనీ కోసం‘1927 డిసెంబర్ 25న డాక్టర్ అంబేడ్కర్, అతని అనుచరులు ఈ ప్రతుల్లో వేటిని తగులబెట్టారు?’ అనే ప్రశ్నను అమితాబ్ అడిగారు. ఎ)విష్ణు పురాణం, బి) భగవద్గీత, సి) రుగ్వేదం, డి) మనుస్మృతి అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. కుల వివక్ష, అస్పృశ్యతలను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్, అతని అనుచరులు మనుస్మృతి ప్రతులను తగులబెట్టారని ఆ తర్వాత అమితాబ్ ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు. అయితే, ఈ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ అమితాబ్‌పై, సోనీ ఎంటర్టైన్మెంట్పై చర్యలు తీసుకోవాలని అభిమన్యు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాధానాలన్నీ హిందూమతానికి సంబంధించిన గ్రంథాలవని, ప్రశ్నలోని ఉద్దేశం హిందువుల మనోభావాలు కించపరచడమేనని అభిమన్యు ఆరోపించారు. -
కంటెస్టెంట్ జోకు.. అమితాబ్ సీరియస్
జీవితంలో చాలా వాటికి అలసిపోతూ ఉంటాం. ప్రయాణంలో అలసట సహజమే. జీవితమంటేనే ప్రయాణం కదా. ఎక్కడైనా కొంచెంసేపు ఆగితే అలసట తీరుతుందని అనుకుంటాం. తీరదు! ఆ ఆగడం మరింత అలసటగా అనిపిస్తుంది. అదే జీవితంలోని విశేషం. అలసట తెలియకూడదంటే జర్నీ సాగుతూనే ఉండాలి. ఎక్కడో ఒక పువ్వు విచ్చుకుని ఊగుతూ చటుక్కున మన అలసటను తెంపుకుని వెళుతుంది. ఇష్టమైన ఒక మనిషి ముఖం మన అలసటను పంచుకుని ముంగురులను సవరించి ఇక పొమ్మంటుంది. ఆ మనిషికీ తన ప్రయాణం ఒకటి ఉంటుంది మరి. అందుకే పొమ్మనడం. ఏమిటిది?! సీరియస్‌గా ఎటో వెళ్లి పోతున్నాం!! అసలైతే ఖోష్లేంద్ర చెందివున్న అలసట గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవలసింది. కె.బి.సి 12 కంటెస్టెంట్ అతడు. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అతడిని అడిగారు.. ‘‘ఖోష్లేంద్ర జీ, గెలిచిన డబ్బుతో మీరేం చేస్తారు?!’’ అని. సాధారణంగా కె.బి.సి. విజేతలకు చిన్న చిన్నవే పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి. స్కూల్ కట్టిస్తాను అంటారు. మా ఊరికి చెరువు తవ్విస్తాను అంటారు. పొలం కొని సేద్యం చేస్తాను అంటారు. ఖోష్లేంద్ర ఇలాంటివేమీ చెప్పలేదు. అయినా ఇలాంటివే చెప్పాలని ఏముంది? ఆయన అవసరాలు ఏవో ఉండొచ్చు. ‘‘ఊ.. బోలియే ఖోష్లేంద్ర జీ మీరైతే ఏం చేస్తారు?’ అని తనదైన గంభీర స్వరంతో మళ్లీ అడిగారు అమితాబ్. ‘‘జీ.. నాకు వచ్చిన డబ్బుతో నేను నా భార్య ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను’’ అన్నారు ఖోష్లేంద్ర జీ. ‘‘ఎందుకంటే పదిహేనేళ్లుగా నేను నా భార్య ముఖం చూసీ చూసీ అలసిపోయాను’’ అని కూడా అన్నారు. అమితాబ్ కి నిజంగా కోపం వచ్చింది. ఆయన రియాక్షన్ చూసి, ‘‘ఊరికే జోక్ చేస్తున్నాను అమితాబ్ జీ’’ అన్నారు ఖోష్లేంద్ర. ‘‘ఖోష్లేంద్ర జీ.. జోక్ గా కూడా అలాంటి మాటలు అనకండి’’ అన్నారు అమితాబ్. ఖోష్లేంద్రకు కూడా పాఠశాలలు కట్టించాలని, చెరువులు తవ్వించాలని, రోడ్ల పక్కన అశోకుడిలా చెట్ల మొక్కలు నాటించాలనీ, వీటన్నింటికంటే ముందు.. భార్యను జోయ్ అలుక్కాస్కో, త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరీ జ్యుయలరీస్కో తీసుకెళ్లాలని వుండొచ్చు. అయితే అమితాబ్‌ని నవ్వించాలని అనుకుని తన భార్యపై జోక్ వేసినట్లున్నారు. ఆయనకు మాత్రం తెలియకుండా ఉంటుందా.. పదిహేనేళ్లుగా భార్యా తన ముఖం చూస్తూనే ఉందని! -
కరోడ్పతికి 20 ఏళ్లు
హర్షవర్ధన్ నవాతే తొలి కె.బి.సి.లో (2000) కోటి రూపాయలు గెలుచుకున్నప్పుడు అతడి వయసు 27. ఆ డబ్బుతో ఒక ఏడాది పాటు రాక్ స్టార్లా వెలిగిపోయాడు. ధ్యాస పెట్టలేక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ని వదిలేశాడు. చేతిలో డబ్బుంది కాబట్టి యూకే వెళ్లి ఎంబీఏ చేసాడు. తొలి కారు మారుతీ ఎస్టీమ్‌ను కొనుక్కున్నాడు. ముంబైలో సొంత ఇంటివాడు కూడా అయ్యాడు. చాలా కాలం పాటు మహీంద్రాలో ఉద్యోగం చేశాడు. ఏడాదిగా ఓ కార్పొరేట్ కంపెనీకి హెడ్ గా ఉంటున్నాడు. కె.బి.సి. జ్ఞాపకాలను చెబుతూ, అమితాబ్ ఆ రోజు (తాను విజేత అయిన రోజు) తనతో అన్న మాటను గుర్తు చేసుకున్నాడు. ‘హర్షా.. డబ్బు వచ్చిందా, పోయిందా అని కాదు. ఏ స్థితిలోనూ నువ్వు నీ పేరెంట్స్‌ని నిర్లక్ష్యం చెయ్యకూడదు’ అని చెప్పారట అమితాబ్. ‘గ్రేట్ మ్యాన్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అమితాబ్‘ అంటాడు హర్షవర్ధన్. -
‘ఛత్రపతి శివాజీకి అవమానం.. తీవ్ర విమర్శలు’
సాక్షి, ముంబై : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా సోనీ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు తగిన గౌరవం ఇవ్వలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనిటీవీ చానెల్‌ను, కేబీసీ కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. వివరాలు.. బుధవారం (నవంబర్ 6) నాటి కేబీసీ ఎపిసోడ్లో మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్‌కు సమకాలికుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి.. a)మహారాణా ప్రతాప్, b)మహారాజా రంజిత్ సింగ్, c)రాణా సంగా, d)శివాజీ. అయితే మొదటి ముగ్గురి రాజుల పేర్లకు ముందు వారి బిరుదులను చేర్చినట్టుగా శివాజీకి చేర్చలేదని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకున్న బిరుదుతో కలిపి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అని ఆప్షన్ ఇవ్వకుండా అవమానించారని అంటున్నారు. హిందూ దేవాలయాలను కూల్చేసిన ఔరంగజేబుకు మెఘల్ సామ్రాట్ అనే బిరుదును ఎలా పెట్టారని ఒక నెటిజన్ విమర్శించగా.. ఔరంగజేబు చేత శివాజీ దక్షిణ భారత సింహం అనిపించుకున్నాడని, అదీ ఆయన గొప్పతనమని మరొకరు కామెంట్ చేశారు. హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించిన వీరుడిని అగౌరవపరచడం అవమానకరమని, దీనివల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. #BoycottSonyTv, #BoycottKBC హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. అయితే, ఈ వివాదంపై తక్షణం స్పందించిన సోని టీవీ యాజమాన్యం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. మరుసటి రోజునే (గురువారం) కేబీసీ ప్రోగ్రాం సమయంలో క్షమాపణలు చెబుతూ స్క్రోలింగ్ రన్ చేసింది. -
ఆ షో కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
మామూలుగా రియాల్టీ షోలలో మనుషులు పాల్గొనటం పరిపాటి. కానీ, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ షోలో ఓ అనుకోని కంటెస్టెంట్ పాల్గొన్నాడు. ఆ కంటెస్టెంట్ అమితాబ్ ముఖంలో నవ్వులు పూయించాడు. ఇంతకూ ఆ కంటెస్టెంట్ ఎవరా!!.. అనుకుంటున్నారా?. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 11లో పాల్గొన్నది... ఓ పిల్లి. విషయమేంటంటే.. కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లోకి గురువారం ఓ పిల్లి వచ్చింది. అది బిగ్‌బీ కాళ్లకు దగ్గరగా ఉన్న సెట్‌పైకి ఎక్కి కూర్చుంది! హాయిగా నిద్రపోయింది. అయితే ఈ విషయాన్ని‘‘ కేబీసీ ఆడటానికి వచ్చిందో పిల్లి.. ఫాస్టెస్ట్ ఫింగర్ వరకు వచ్చిందది.. ఆడలేక అక్కడే చతికిల బడిపోయింది’’ అంటూ బిగ్‌బీ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో పిల్లి చేష్టలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. T 3534 - 🤣🤣🤣 ऐ बिलौरी , बिल्ली बिल्ली , खेलन चली KBC जैसे आइ Fastest Finger, लोट पोट हो गयी वहीं ~ अब pic.twitter.com/3pq49UfSXR — Amitabh Bachchan (@SrBachchan) October 30, 2019 -
బిగ్ బీ అమితాబ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, సినిమా : తనకు ఏమతం లేదనీ, తాను ఒక భారతీయుడినని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక వేత్త బిందేశ్వర్ పాఠక్ అడిగిన ప్రశ్నకు అమితాబ్ పై విధంగా స్పందించారు. అంతేకాక, బచ్చన్ అనే పేరు నిజానికి తమ ఇంటి పేరు కాదని తమ ఇంటి పేరు శ్రీవాస్తవ అని వెల్లడించారు. తన తండ్రి హరివంశరాయ్ తనను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇంటి పేరు శ్రీవాస్తవ అని కాకుండా తన కలం పేరైన బచ్చన్ అని రాయించారని, దాంతో తనకు అదే పేరు స్థిరపడిపోయిందని వెల్లడించారు. అంతేకాక, బచ్చన్ అనే పేరు ఏమతాన్నీ సూచించదని చెప్పుకొచ్చారు. మరోవైపు అమితాబ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు రంగులు పూసిన తర్వాతే హోళీ పండుగను ప్రారంభిస్తారు. ఈ విషయం గురించి అడుగగా, కుటుంబ సంప్రదాయం ప్రకారం ఇంట్లోని పెద్ద మనిషికి ఆ రకంగా గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి ఐతే ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేసే వ్యక్తి పాదాలకు రంగు పూసి ఆ తర్వాతే పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ విషయంలో మాకెలాంటి సిగ్గూ అనిపించదని అమితాబ్ పేర్కొన్నారు. కాగా, అమితాబ్ బచ్చన్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. -
కౌన్‌బనేగా కరోడ్‌పతి అంటూ..
సాక్షి, నెల్లూరు : ‘మేము కౌన్‌బనేగా కరోడ్‌పతి నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. కొంత నగదు చెల్లిస్తే మనీ మీకు ఇస్తామం’ ఓ యువకుడ్ని ఇద్దరు వ్యక్తులు బురీడీ కొట్టించి రూ.2.11 లక్షల నగదు కాజేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని నవాబుపేట గాండ్లవీధికి చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈనెల 21వ తేదీన రాణాప్రతాప్ సింగ్, సింఘానియా అనే ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి సదరు యువకునికి ఫోన్ చేశారు. తాము కౌన్‌బనేగా కరోడ్‌పతి నుంచి మాట్లాడుతున్నామని అతడిని నమ్మించారు. ఫోన్ నంబర్లు లాటరీ తీయగా మీకు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ వచ్చిందని, అది ఇవ్వాలంటే కొంతనగదు తాము చెప్పిన అకౌంట్లలో డిపాజిట్ చేయాలని యువకుడికి చెప్పారు. వారి మాటలను గుడ్డిగా నమ్మిన యువకుడు ఇంట్లో వారికి తెలియకుండా వారు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లో వివిధ తేదీల్లో రూ.2.11 లక్షల నగదు డిపాజిట్ చేశాడు. అప్పటినుంచి సదరు వ్యక్తులకు ఫోన్ చేయగా ఆ నంబర్లు పనిచేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నవాబుపేట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నవాబుపేట ఇన్స్పెక్టర్ కె.వేమారెడ్డి తెలిపారు. -
హాట్సీట్లో సింధు.. ప్రైజ్‌మనీ ఎవరికంటే..
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ పతాక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. సోనీ టీవీలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యహహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో సింధు తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. సింధూ తన అక్కతో ఆడిన ఈ గేమ్‌లో బిగ్‌బీ అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నారు. అయితే షో ప్రారంభానికి ముందు కోచ్ పుల్లెల గోపిచంద్ నుంచి ప్రత్యేక మెసేజ్‌తో ఆమె ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ షోలో పాల్గొనే ముందే సింధు గెలుచుకున్న ప్రైజ్‌మనీ పేద క్యాన్సర్ బాధితులకు అందజేస్తానని ప్రకటించారు. -
ఆగస్టులో కేబీసీ 8 ప్రారంభం: అమితాబ్
అక్షరాలా కోటి రూపాయలను అందిస్తూ ఇప్పటివరకు ఏడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమ ప్రసారాలను ప్రారంభిస్తున్నట్టు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కొత్త ముఖం ఆగస్టులో ప్రసారం అవుతుందని ఆయన తెలిపారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్, ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలాంటి సామాజిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెబుతుంటారు. అలాగే ఈసారి కూడా ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మీడియాతోనే చెప్పారు. ''ఇది కేబీసీ కొత్త ఆకారం. కేబీసీ కొత్త ముఖం ఆగస్టులో ప్రారంభం అవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా జరిగాయి. ఒక్క సీజన్ మాత్రం షారుక్‌ఖాన్ చేశారు'' అని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. తానెంత పెద్ద నటుడైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గేమ్షోకు వచ్చేవారిని ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించి, అనేకమందిని ఇప్పటికి కోటీశ్వరులను చేశారు. ''ఇక్కడ కేవలం డబ్బులు మాత్రమే కాదు.. హృదయాలు కూడా గెలచుకుంటారు. ప్రతి ఒక్క పోటీదారు నా హృదయాన్ని గెలుచుకుని వెళ్తుంటారు.. మీ అందరికీ ప్రేమతో'' అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను ప్రసారం చేయనుంది. కేబీసీ స్ఫూర్తితోనే తెలుగులో నాగార్జున హోస్ట్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌షో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు అత్యధికంగా 12.50 లక్షలను మాత్రమే గెలుచుకోగలిగారు.