
Amitabh Bachchan Felt Emotional In KBC: ప్రముఖ హిందీ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' గురించి తెలియనీ వారుండరు. దీని నుంచే ఎవరు మీలో కోటీశ్వరులు పోగ్రామ్ వచ్చిందని కూడా తెలిసిందే. బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎందరో సామాన్యులు వచ్చి కరోడ్‌పతులుగా మారి ప్రేక్షకులను అలరించారు. ఈ పోగ్రామ్ ఈ శుక్రవారం 1000వ ఎపిసోడ్‌ను పూర్తిచేసుకోనుంది. ఈ ప్రత‍్యేకమైన ఎపిసోడ్‌లో బిగ్‌బీ కుమార్తె శ‍్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నంద పాల‍్గొననున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌లోని ఉత్తమ క్షణాలను వీడియో రూపంలో విడుదల చేశారు. అది చూసిన బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ వీడియోలో 2000 సంవత్సరంలో భారీ మొత్తాన్ని గెలుచుకున్న హర్షవర్ధన్ నవతే ఉన్నాడు. అలాగే 2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఉన్నాడు. ఇంకా ఆ వీడియోలో హాట్‌సీట్‌లో కూర్చున్న వారితో ఆనంద క్షణాలు పంచుకున్న బిగ్‌బీ ఉన్నారు. షోలో పాల్గొన్నవారి విజయాన్ని చూసి ఆనందించారు అమితాబ్. వీడియో క్లిప్ చూసిన శ్వేతా బచ్చన్, తండ్రి అమితాబ్‌ను ఎలా ఫీల్ అవుతున్నారని అడిగింది. అందుకు బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకుంటూ 'నా ప్రపంచం మొత్తం మారిపోయింది.' అని బదులిచ్చారు. 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి ఎపిసోడ్‌ను హోస్ట్ చేశారు బిగ్‌బీ అమితాబ్. అయితే మూడో సీజన్‌కి అమితాబ్ అనారోగ్యం కారణంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. దీంతో పాటు 21 ఏళ్లుగా షోలో స్థిరమైన హోస్ట్‌గా వ్యవహరించారు అమితాబ్ బచ్చన్.
అంతకుముందు అమితాబ్ తన బ్లాగ్‌లో 'ఉదయం తెల్లవారుజామున లేవగానే 5000కుపైగా ఆలోచనలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అంతకుముందు రాత్రి ఆ మిగిలిపోయిన పనులు మనస్సును వెంటాడుతాయి. కానీ కౌన్ బనేగా కరోడ్‌పతి 1000వ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. అవును, 2000 సంవత్సరంలో టెలివిజన్ ప్రపంచానికి పరిచయం అయిన కేబీసీ 1000 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది.'అని రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment