'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పాల్గొనాలని ఉందా..? | Kaun Banega Crorepati 16 Registration Open Now | Sakshi

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పాల్గొనాలని ఉందా..?

Apr 29 2024 11:14 AM | Updated on Apr 29 2024 1:09 PM

Kaun Banega Crorepati 16 Registration Open Now

హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్‌గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్‌ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.

మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్‌ 29)  రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు.
 

1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?
A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్

2: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్‌లు ఉన్నాయి?
A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement