KBC 15: రూ. 12.5 లక్షల ప్రశ్నకు ఆన్సర్‌ మీకు తెలుసా..? | Do You Know Answer This Is 12.5 lakh Question KBC 15 | Sakshi
Sakshi News home page

KBC 15: రూ. 12.5 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక క్విట్‌ చేశాడు.. జవాబు మీకు తెలుసా?

Published Sun, Oct 1 2023 1:18 PM | Last Updated on Sun, Oct 1 2023 1:29 PM

Do You Know Answer This Is 12.5 lakh Question KBC 15 - Sakshi

బాలీవుడ్‌ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో అత్యంత పాపులర్‌ అయినదిగా గుర్తింపు ఉంది. బుల్లితెరపై వచ్చే చాలా షోస్‌లలో దీనిని ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుత సీజన్‌లో చాలా మంది కంటెస్టెంట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారు భారీ మొత్తంలో డబ్బును గెలుచుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ షోలో కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ జాబితాలో జస్కరన్, జస్నిల్ పేర్లు ఉన్నాయి. చివరి ఎపిసోడ్‌లో, హోస్ట్ బీహార్‌కు చెందిన మండల్ కుమార్ అనే కంటెస్టెంట్‌తో గేమ్ ఆడారు అమితాబ్‌, దీనిని స్టూడియోలోని ప్రేక్షకులతో పాటు టీవీ వీక్షకులు కూడా ఆనందించారు.

(ఇదీ చదవండి: బతికి ఉన్న ప్రముఖ నటికి అంత్యక్రియలు కూడా చేసేసిన యూట్యూబర్స్‌)

రూ. 40,000 ప్రశ్నపై మూడు లైఫ్‌లైన్‌లను కోల్పోయిన తర్వాత అతను 'సూపర్ సందూక్‌' సహాయంతో తన ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ని తీసుకున్నాడు. 10 ప్రశ్నలకు విజయవంతంగా సమాధానమిచ్చిన తర్వాత, మండల్ రూ. 6.4 లక్షలు గెలుచుకున్నాడు. తర్వాత రూ.12.5 లక్షల ప్రశ్నకు ఆయన సరైన సమాదానం చెప్పలేక క్విట్‌ చేశాడు. దీంతో ఆయన కేవలం రూ.6.4 లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రూ. 6.4 లక్షల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు
 రూ. 6.4 లక్షల ప్రశ్న: 'విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్' పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న హిందీ రచయిత ఎవరు?
A. శరద్ జోషి, B.మోహన్ రాకేష్, C.బాబా నాగార్జున, D. హరిశంకర్ పర్సాయి

► రూ. 12.5 లక్షల ప్రశ్న: అంతరించిపోతున్న పక్షి నార్కొండమ్ హార్న్‌బిల్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక పక్షి?
A.లడఖ్, B. అండమాన్, నికోబార్ దీవులు, C. నాగాలాండ్, D.కేరళ
పై ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్‌ చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement