KBC
-
రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!
Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్‌పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.రూ.1 కోటి విలువైన ప్రశ్నరూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్‌లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్‌బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్‌కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్‌ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్‌బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్‌బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుని వెళ్లిపోయింది. -
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి -16 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్‌కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్‌లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్‌మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్‌కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్‌లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్‌కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్‌లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న
కౌన్ బనేగా కరోడ్‌పతి తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 26) క్రికెట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 50 లక్షల రూపాయల విలువైన ఈ ప్రశ్నను అభిషేక్ సంధు అనే కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. క్లిష్టమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సంధు గేమ్‌ను మధ్యలోనే వదిలేశాడు.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రంలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ ఎవరు..? ఈ ప్రశ్నకు కంప్యూటర్ మహాశయ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. అవేంటంటే.. ఏ- ఆర్థర్ ష్రూస్‌బరీ, బి- డబ్ల్యూజీ గ్రేస్, సి- డౌగ్ ఇన్సోల్, డి- టామ్ మార్స్డెన్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.A cricket question in KBC for 50 Lakhs. pic.twitter.com/7bs0VkWsnK— Mufaddal Vohra (@mufaddal_vohra) September 26, 2024కాగా, ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు తరుచూ ఎదురవుతున్నాయి. కంటెస్టెంట్లు క్రికెట్ పరిజ్ఞానం కలిగిన వారైతే ఆ ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు చెప్పగలుగుతున్నారు. తాజాగా ఎదురైన క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైతే ఎంతటి లోతైన క్రికెట్ పరిజ్ఞానమున్నా జవాబుల చెప్పడం కష్టం. ఇంతకీ పైన అడిన ప్రశ్నకు సమాధానం ఏంటని అనుకుంటున్నారా..? ఆప్షన్-డి. టామ్ మార్స్డెన్టామ్ మార్స్డెన్ 1826లో తన డెబ్యూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ ఏడాది జులై 26న మార్స్డెన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో షెఫీల్డ్ అండ్ లీసెస్టర్‌కు ప్రాతినిథ్యం వహించిన మార్స్డెన్.. నాటింగ్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగులు చేశాడు. చదవండి: బ్రాడ్‌మన్ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్ -
బిగ్‌బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్‌పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్‌లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్‌లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్‌బీ కూడా చలించిపోయారు. చందర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్‌ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ని అనే లైఫ్‌లైన్‌ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్‌గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్‌కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్‌కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్‌గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్‌ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్‌సీట్‌పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్‌తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్‌లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
KBC 15: రూ. 12.5 లక్షల ప్రశ్నకు ఆన్సర్ మీకు తెలుసా..?
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో అత్యంత పాపులర్ అయినదిగా గుర్తింపు ఉంది. బుల్లితెరపై వచ్చే చాలా షోస్‌లలో దీనిని ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుత సీజన్లో చాలా మంది కంటెస్టెంట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారు భారీ మొత్తంలో డబ్బును గెలుచుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ షోలో కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ జాబితాలో జస్కరన్, జస్నిల్ పేర్లు ఉన్నాయి. చివరి ఎపిసోడ్లో, హోస్ట్ బీహార్‌కు చెందిన మండల్ కుమార్ అనే కంటెస్టెంట్‌తో గేమ్ ఆడారు అమితాబ్, దీనిని స్టూడియోలోని ప్రేక్షకులతో పాటు టీవీ వీక్షకులు కూడా ఆనందించారు. (ఇదీ చదవండి: బతికి ఉన్న ప్రముఖ నటికి అంత్యక్రియలు కూడా చేసేసిన యూట్యూబర్స్) రూ. 40,000 ప్రశ్నపై మూడు లైఫ్లైన్లను కోల్పోయిన తర్వాత అతను 'సూపర్ సందూక్' సహాయంతో తన ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ని తీసుకున్నాడు. 10 ప్రశ్నలకు విజయవంతంగా సమాధానమిచ్చిన తర్వాత, మండల్ రూ. 6.4 లక్షలు గెలుచుకున్నాడు. తర్వాత రూ.12.5 లక్షల ప్రశ్నకు ఆయన సరైన సమాదానం చెప్పలేక క్విట్ చేశాడు. దీంతో ఆయన కేవలం రూ.6.4 లక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రూ. 6.4 లక్షల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు ► రూ. 6.4 లక్షల ప్రశ్న: 'విక్లాంగ్ శ్రద్ధా కా దౌర్' పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న హిందీ రచయిత ఎవరు? A. శరద్ జోషి, B.మోహన్ రాకేష్, C.బాబా నాగార్జున, D. హరిశంకర్ పర్సాయి ► రూ. 12.5 లక్షల ప్రశ్న: అంతరించిపోతున్న పక్షి నార్కొండమ్ హార్న్‌బిల్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక పక్షి? A.లడఖ్, B. అండమాన్, నికోబార్ దీవులు, C. నాగాలాండ్, D.కేరళ పై ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో మరో క్రికెట్ ప్రశ్న.. ఈసారి 3 లక్షల 20 వేలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో వరుసగా రెండో ఎపిసోడ్లో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. సెప్టెంబర్ 19న ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్‌ను భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 10కి 10 వికెట్లకు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనగా.. నిన్న (సెప్టెంబర్ 20) ప్రసారమైన ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నాడు. 19వ తారీఖున ప్రసారమైన ఎపిసోడ్లో కుంబ్లేకు సంబంధించిన ప్రశ్నకు ప్రైజ్‌మనీ 12 లక్షల 50 వేల రూపాయలు కాగా.. సెప్టెంబర్ 20న సెహ్వాగ్ గురించిన ప్రశ్నకు ప్రైజ్‌మనీ 3 లక్షల 20 వేల రూపాయలుగా ఉంది. ఇంతకీ ప్రశ్న ఏంటంటే..? వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీని ఏ స్టేడియంలో చేశాడు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా బారాబతి స్టేడియం, కటక్.. ఈడెన్ గార్డెన్స్ కోల్‌కతా.. హోల్కర్ స్టేడియం, ఇండోర్.. బ్రబోర్న్ స్టేడియం, ముంబైలను ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గత ఎడిసోడ్లోని ప్రశ్న ఏంటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీ 2011లో వెస్టిండీస్‌పై చేశాడు. నాటి మ్యాచ్‌లో వీరూ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (67), సురేశ్ రైనా (55) కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటై 153 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్ 19) ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. ప్రశ్న ఏమిటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. #OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings. 👏👏 Watch that fantastic bowling display 🎥👇 pic.twitter.com/OvanaqP4nU — BCCI (@BCCI) February 7, 2021 కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్‌లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్ ఎండ్‌లో ఏవీ జయప్రకాశ్ అంపైర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. టెస్ట్‌ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), ఇటీవలికాలంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా కెరీర్‌ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్ తరఫున 132 టెస్ట్‌లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్ ఆండర్సన్ (690), షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీథరన్ (800) మాత్రమే ఉన్నారు. -
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?
టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్‌కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు. రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి) ‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్‌లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్) కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నారు. అనిల్ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్ యూట్యూబ్‌లో సొంత ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు. రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు) బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్‌ని తెరిచారు. ఆమె జార్ఖండ్‌లో దీనిని ఏర్పాటుచేశారు. సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు) బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సన్మీత్ (దుస్తుల బ్రాండ్ రూపకర్త) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి) కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్‌కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో ఉంటున్నారు. ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు) ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు. తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం) తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అచిన్-సార్థక్ (వ్యాపారం) కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్‌లు తమ తల్లికి క్యాన్సర్‌కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అనామిక(సామాజిక సేవ) అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్‌కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. బినితా జైన్(కోచింగ్ సెంటర్) అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అజిత్‌కుమార్ (జైలు సూపరింటెండెంట్) బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు బబిత (కుక్) 2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు. సనోజ్ కుమార్ (యూపీఎస్సీ కోసం సిద్ధం) అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్) కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్ఫీల్డ్లో కమ్యూనికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి) అదే సీజన్లో జమ్మూ కాశ్మీర్లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి. హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం అందుబాటులో లేదు. కవితా చావ్లా, శశ్వత్ గోయల్ సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన కవితా చావ్లా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు -
కోటి రూపాయలు గెలిచింది.. కానీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు!
బాలీవుడ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 14న కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ ప్రారంభమైంది. ఈ సారి కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది ఈ షోలో పాల్గొని చివరిదాకా నిలిచి కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే ఈ షోలో మొదట కోటీ రూపాయలు గెలుచుకున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలేంటి? అన్న సందేహం వస్తోంది కదా. అయితే అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?) రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 15వ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ షో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా మహిళ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలిచింది. 2010లో కేబీసీ -4 సీజన్లో అమితబ్‌ను మెప్పించిన మహిళ రహత్ తస్లీమ్ రూ.కోటి రూపాయలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌కు చెందిన 37 ఏళ్ల రహత్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రాహత్ పాల్గొన్న సమయంలో రూ. 3.20 లక్షల ప్రశ్న నుంచి రూ. 50 లక్షల ప్రశ్న వరకు ఎలాంటి లైఫ్ లైన్లు వినియోగించుకోలేదు. ఆ తర్వాత నీపై ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందని బిగ్ బి ప్రశ్నించగా.. అది నా ఆత్మవిశ్వాసం నుంచే పుట్టింది.. నాకు అన్నీ తెలుసు.. అని సమాధానిచ్చినట్లు రాహత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే కేబీసీలో పాల్గొనేందుకు మేసేజ్ చేయడానికి తన మొబైల్ ఫోన్లో కేవలం రూ. 3 మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది. ఆ డబ్బులతోనే మేసేజ్ పంపినట్లు పేర్కొంది. ఆ తర్వాత తాను ఎంపికవ్వడంతో ముంబయిలో ఆడిషన్ కోసం పిలిచారని వెల్లడించింది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరికీ బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారని వివరించింది. (ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) అయితే ఆడిషన్స్ ముగిశాక.. ఇంటికి తిరిగి వెళ్లిన వెంటనే నేను చేసిన మొదటి పని బ్యాంక్ ఖాతా తెరిచి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడమే అని ఆ రోజులను రాహత్ గుర్తుచేసుకుంది. కాగా.. ప్రస్తుతం రాహత్ ఇప్పుడు గిరిదిహ్‌లోని పెద్ద మాల్లో దుస్తుల షోరూమ్ నిర్వహిస్తోంది. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న ఆమె.. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ లేని స్థితి నుంచి ఏకంగా బిజినెస్ చేసే స్థాయికి చేరుకోవడమంటే గొప్ప విషయమే. కౌన్ బనేగా కరోడ్‌పతి వల్ల ఓ సామాన్యురాలు సైతం బిజినెస్ వుమెన్‌గా అవతరించింది. -
అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు
కేబీసీ కరోడ్‌పతి రవి మోహన్ సైనీ గుర్తున్నారా. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన టాప్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్ సెన్సేషన్. కేవలం 14 సంవత్సరాలకే కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు.15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు. అంతేనా దయాగాడి దండయాత్ర అన్నట్టు రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్‌గా ఆ తర్వాత వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్లో పోరుబందర్‌కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ విజయగాథ ఇది. కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్ అబితాబ్‌ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్‌గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి ,ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోకపోవడం మరో విశేషం. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) 2012 లో మెయిన్స్‌ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే 2014లో, ఆల్ ఇండియా ర్యాంక్ 461తో అర్హత సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్‌లో చేరానంటారు ఎస్పీ డా. రవి మోహన్ సైనీ. પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા વાવાઝોડાથી સંભવિત નુકશાન થઈ શકે તેવા હાર્બર મરીન અને સુભાષ નગર જેટી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો અને સ્ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_office @CMOGuj@Igp_jnd_range pic.twitter.com/pNSqC2Oh84 — SP Porbandar (@SP_Porbandar) June 13, 2023 మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
అనుమతి లేకుండా అమితాబ్ పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేరుప్రఖ్యాతులున్న బచ్చన్‌కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. -
తండ్రి బర్త్‌డేకు అభిషేక్ బచ్చన్ సర్ప్రైజ్ ప్లాన్, ఎమోషనల్ అయిన బిగ్ బి
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 11 ఆయన బర్త్‌డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, భారత సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్‌డే నేపథ్యంలో బిగ్ బి హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్‌ను సర్ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కేబీసీ షోలో అడుగుపెట్టాడు. చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి ఆయన షో నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగింది. ఆ తర్వాత షో అయిపోయిందా? అని అందరు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ బచ్చన్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. తనయుడి రాకతో బిగ్ బి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం తండ్రిని హాట్ సీట్లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్లో తను కూర్చోని అమితాబ్‌ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా బిగ్‌బి అభిషేక్‌కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పక్కనే ఉన్న ఆయన సతీమణి జయ బచ్చన్ అమితాబ్‌ను తట్టి ఓదారుస్తున్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంది. అనంతరం షోలోనే కేక్ కట్ చేయించి తండ్రికి ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించాడు అభిషేక్. చదవండి: బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్ షేర్ చేశాడు. ‘దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా గోప్యంగా ఇది సరిగ్గా చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇంత చేసిన ఆయనకు ఇది తక్కువే అనిపిస్తుంది. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్‌లో(కేబీసీ షో) జరుపడం సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది భావోద్వేగానికి గురి చేసింది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్‌పతి టీంకు నా కృతజ్ఞతలు’ అంటూ అభిషేక్ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
KBC 14: కోటి గెలుచుకున్న కవిత.. కానీ, రూ. 7.5 కోట్ల ప్రశ్నకు మాత్రం!
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియల్టీ గేమ్ షో దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. ఇదే షో తెలుగులో మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా హిందీ వెర్షన్ కేబీసీ సీజన్ 14 నడుస్తోంది. ఇందులో బిగ్ బి తన చురుకైన మాటలతో షోకే హైలైట్‌గా నిలుస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా వినోదాన్ని అందిస్తున్నాడు. ఈ సీజన్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గృహిణి కవితా చావ్లా మొదటి కోటి రూపాయలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే చివరికి రూ.7.5 కోట్లు ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. పోటీ నుంచి తప్పుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఈ గేమ్ ఆడిన కవిత ప్రేక్షకులతో పాటు హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను ఆకట్టుకుంది. ఏంటి ఆ ప్రశ్న.. అప్పటికే కోటి గెలిచిన ఉత్సాహంతో కవిత ఈ గేమ్‌లో ముందుకు అడుగువేశారు. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్నగా రానే వచ్చింది. ఆ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు, దీంతో నరాలు తెగేంత ఉత్కంఠ ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. అయితే ఆయన ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? ఆఫ్షన్లు ఇవే.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. మొదట ఈ ప్రశ్నకు కవితా చాలా సేపు సమాధానం కోసం ఆలోచించింది. కానీ జవాబుపై స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె దగ్గర ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తన సమాధానంగా A ఎంపికను లాక్ చేశారు. అయితే, సరైన సమాధానం ఎంపిక B అని తేలింది. దీంతో తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కవిత కేబీసీ షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ప్రస్తుతం పట్టుదలతో షోలో పాల్గొనడంతో పాటు కోటి గెలిచి సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారింది. చదవండి: Samantha: స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే.. -
వొడాఫోన్ ఐడియా ఆఫర్ అదిరిపోలా!.. కేవలం రూ.82 రీచార్జ్‌తో ఓటీటీ సబ్స్క్రిప్షన్!
భారత్‌లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్‌తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే! ఆఫర్ అదిరిపోలా! వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో చూసే సౌకర్యం ఉండదు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్‌తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్‌ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
కౌన్ బనేగా కరోడ్‌పతి 14: రిజిస్ట్రేషన్లు ఈ తేదీ నుంచే!
కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) అభిమానులకు గుడ్‌న్యూస్. కేబీసీ 14వ సీజన్లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభవుతుందనేది ఏప్రిల్ 2న తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 9, రాత్రి 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రచార ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా విశేష జనాదరణ పొందింది. ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా మంది భారీగా నగదు గెల్చుకున్నారు. అంతేకాదు తమ అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకోవాలన్న తాపత్రయంతో కూడా కొంతమంది ఈ షోకు వస్తుంటారు. (క్లిక్: దగ్గుతో మోసం.. బహుమతి వెనక్కి, కేబీసీ కథేంటో తెలుసా?) కేబీసీ 14లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ల సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు హోస్ట్ అమితాబ్ బచ్చన్ మొదటి రిజిస్ట్రేషన్ ప్రశ్న అడుగుతారు. తర్వాత నుంచి ప్రతి రోజు రాత్రి కొత్త ప్రశ్న ఉంటుంది. సరైన సమాధానాలు ఇచ్చిన వారిని కేబీసీ బృందం సంప్రదించి షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. ఆశావహులు సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో 200ల సినిమాల్లో అవకాశం.. 'నో' చెప్పిన నటుడు) -
KBC: అమితాబ్‌పై జయా బచ్చన్ ఫిర్యాదు!
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సిజన్లో కేబీసీ ఓ 1000వ ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సందర్భంగా హాట్ సీట్లో కూర్చొని క్విజ్‌లో పాల్గొనడానికి తన కూతురు స్వేతా బచ్చన్, మనవరాలు నవ్వా నవేలీ నందాలను అమిత్ ఆహ్వానించారు. దీంతో పాటు అమితాబ్ భార్య జయా బచ్చన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రోమోల్లో అమితాబ్, జయా అనుబంధం చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమిత్‌పై జయా.. ఫిర్యాదు చేసింది. ‘ఫోన్ చేస్తే.. అస్సలు లిఫ్ట్ చేయరు’ అని కంప్లైంట్ చేశారు. ‘ఇంటర్నెట్ వస్తూపోతూ ఉంటే నేను ఏం చేయను?’ అంటూ అమితాబ్ ఫన్నీగా తనను తాను సమర్థించుకున్నారు. స్వేతా బచ్చన్ జోక్యం చేసుకొని జయా పక్షాన మాట్లూడుతూ.. ‘సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం, ట్వీట్లు పెట్టడం చేస్తారు’ అని గుర్తుచేస్తుంది. టాపిక్ మారుస్తూ.. అమితాబ్ ‘జయా నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అంటారు. వెంటనే స్పందిన జయా.. ‘మీరు అబద్దాలు చెప్పేటప్పుడు బాగుండరు’ అని సరదగా బదులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక 1000వ ఎపిసోడ్ డిసెంబర్ 3 రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
నా ప్రపంచం మారిపోయింది.. కన్నీళ్లతో అమితాబ్
Amitabh Bachchan Felt Emotional In KBC: ప్రముఖ హిందీ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' గురించి తెలియనీ వారుండరు. దీని నుంచే ఎవరు మీలో కోటీశ్వరులు పోగ్రామ్ వచ్చిందని కూడా తెలిసిందే. బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎందరో సామాన్యులు వచ్చి కరోడ్‌పతులుగా మారి ప్రేక్షకులను అలరించారు. ఈ పోగ్రామ్ ఈ శుక్రవారం 1000వ ఎపిసోడ్‌ను పూర్తిచేసుకోనుంది. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో బిగ్‌బీ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నంద పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌లోని ఉత్తమ క్షణాలను వీడియో రూపంలో విడుదల చేశారు. అది చూసిన బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలో 2000 సంవత్సరంలో భారీ మొత్తాన్ని గెలుచుకున్న హర్షవర్ధన్ నవతే ఉన్నాడు. అలాగే 2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఉన్నాడు. ఇంకా ఆ వీడియోలో హాట్సీట్లో కూర్చున్న వారితో ఆనంద క్షణాలు పంచుకున్న బిగ్‌బీ ఉన్నారు. షోలో పాల్గొన్నవారి విజయాన్ని చూసి ఆనందించారు అమితాబ్. వీడియో క్లిప్ చూసిన శ్వేతా బచ్చన్, తండ్రి అమితాబ్‌ను ఎలా ఫీల్ అవుతున్నారని అడిగింది. అందుకు బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకుంటూ 'నా ప్రపంచం మొత్తం మారిపోయింది.' అని బదులిచ్చారు. 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి ఎపిసోడ్‌ను హోస్ట్ చేశారు బిగ్‌బీ అమితాబ్. అయితే మూడో సీజన్‌కి అమితాబ్ అనారోగ్యం కారణంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. దీంతో పాటు 21 ఏళ్లుగా షోలో స్థిరమైన హోస్ట్‌గా వ్యవహరించారు అమితాబ్ బచ్చన్. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) అంతకుముందు అమితాబ్ తన బ్లాగ్‌లో 'ఉదయం తెల్లవారుజామున లేవగానే 5000కుపైగా ఆలోచనలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అంతకుముందు రాత్రి ఆ మిగిలిపోయిన పనులు మనస్సును వెంటాడుతాయి. కానీ కౌన్ బనేగా కరోడ్‌పతి 1000వ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. అవును, 2000 సంవత్సరంలో టెలివిజన్ ప్రపంచానికి పరిచయం అయిన కేబీసీ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.'అని రాసుకొచ్చారు. -
KBC: అమితాబ్ కష్టకాలపు రాతను మార్చి, కాసుల వర్షం కురిపించి..
కౌన్ బనేగా కరోడ్‌పతి? మీలో ఎవరు కోటీశ్వరుడు? అంటూ ప్రశ్నలతో పందెం విసిరి.. జవాబులకు వేలు, లక్షలు, కోటి రూపాయలు ఇస్తుంటే.. పందెం స్వీకరించడానికి ముందుకురాని వారెవరు?! ఆ చాన్స్‌తో జీకే మీద పట్టును, జీవితంలోని అదృష్టాన్నీ పరీక్షించుకోవడానికి హాట్ సీట్లో ఆసీనులైనవారెందరో! ఈ రియాలిటీ షో పోటీదారుల స్థాయిని పెంచింది.. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ కష్టకాలపు రాతను మార్చింది.. ప్రసారం చేసిన స్టార్ టీవీ చానల్ సరిహద్దుగీతను చెరిపేసింది.. ఏక కాలంలో అందరికీ కాసులు కురిపించింది.. దాని కథే ఇక్కడ.. 2000 సంవత్సరం మార్చి.. Kaun Banega Crorepati :ముంబై అంధేరీ ఈస్ట్‌లో ఉన్న స్టార్ టీవీ ఆఫీసులో వాతావరణం బాగా వేడెక్కి ఉంది. నాలుగేళ్ళ తరువాత సంస్థ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్ హాజరైన సమీక్షాసమావేశం అది. పాత ఒప్పందంలోని ఒక క్లాజ్ చూపించి ఎనిమిదేళ్ళపాటు హిందీ కార్యక్రమాలు చేయకుండా స్టార్‌ను జీ టీవీ అడ్డుకుంటూ వచ్చింది. ఉమ్మడి వ్యాపారానికి ఒప్పుకుంటే 50 శాతం వాటాతోబాటు చైర్మన్ పదవి ఇస్తానని చెబితే జీ టీవీ అధిపతి సుభాష్ కాదనటం మర్దోక్‌కి అవమానంగా అనిపించింది. అసహనాన్ని మరింత పెంచింది. తాజా రేటింగ్స్ తెలియజెప్పే మొదటి చార్ట్‌లోనే జీ టీవీ తిరుగులేని ఆధిక్యం, దానికి గట్టిపోటీ ఇస్తూ రెండో స్థానంలో సోనీ. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు మూడో స్థానంలో ఉన్న స్టార్‌కు టాప్ 20 ప్రోగ్రామ్స్‌లో ఒక్కటంటే ఒక్కటే స్థానం. ‘మళ్లీ ఇలాంటి చార్ట్ నాకు కనబడ్డానికి వీల్లేదు’ తీవ్రస్వరంతో హెచ్చరించాడు మర్దోక్. ‘జీ టీవీని వెంటాడాల్సిందే. ఏం చేస్తారో మీ ఇష్టం’ తేల్చి చెప్పేశాడు. కొత్త ప్రోగ్రామింగ్ చీఫ్‌గా చేరిన సమీర్ నాయర్ వెంటనే తన ప్రజెంటేషన్‌లో అసలు పాయింట్‌కి వచ్చేశాడు. హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ కార్యక్రమానికి హిందీ వెర్షన్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. సినిమాలు సరిగా ఆడని స్థితిలో ఉన్న 57 ఏళ్ళ అమితాబ్ సెలెబ్రిటీ స్థాయిని వాడుకోవటానికి హోస్ట్‌గా ఒప్పిస్తానన్నాడు. ‘ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?’ అడిగాడు మర్దోక్. లక్ష రూపాయలిచ్చి, కార్యక్రమం పేరు ‘‘కౌన్ బనేగా లఖ్పతి’’ అని పెడతానన్నాడు నాయర్. ‘అంటే ఎంత?’ మళ్లీ అడిగాడు మర్దోక్. ఆయనకు అర్థం కావటానికి ‘2,133 డాలర్లు’ అని చెప్పాడు నాయర్. ‘ఇంత తక్కువా?’ పెదవి విరిచాడు మర్దోక్. ‘కలలో మాత్రమే ఊహించుకోవాలంటే ఎంత ఉండాలి?’ అని మళ్ళీ అడిగితే ‘కోటి.. అంటే పది మిలియన్లు’ అని జవాబొచ్చింది. అర్థం కాలేదు, మళ్లీ చెప్పమంటే ‘2,13,310 డాలర్లు’ అని అక్కడెవరో అన్నారు. ‘అయితే కోటి ఖాయం చెయ్యండి’ అనేసి ఇంకో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయాడు మర్దోక్. ‘కౌన్ బానేగా లఖ్పతి’ పేరు అప్పటికప్పుడు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ గా మారిపోయింది. సమీర్ నాయర్ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. భారీ ప్రైజ్ మనీతో పోగ్రామ్ స్థాయి అనూహ్యంగా పెరగటం ఒకవైపు, అమితాబ్‌ను ఒప్పించగలమా అన్న భయం ఇంకోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి దాదాపు ఏడాది కిందటే ఈ కార్యక్రమం గురించి ఆలోచించటం మొదలైంది. బ్రిటిష్ మూలానికి ఆసియా హక్కులున్న ఈసీఎం సంస్థ నుంచి భారతదేశానికి హక్కులు కొనుక్కోవటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టటానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఒకే ఒక పేరు సిద్ధార్థ బసు. అప్పటికే డీడీలో ఆయన క్విజ్‌కు బాగా పేరుంది. బీబీసీలో మాస్టర్ మైండ్ ఇండియా కూడా పేరుమోసింది. ‘ఇంత భారీ ప్రోగ్రామ్ చేయగలనా?’ అని మొదట్లో తటపటాయించినా, తన సంస్థ సినర్జీ తరఫున చేయటానికి ఒప్పుకున్నాడు సిద్ధార్థ బసు. ఇది కేవలం క్విజ్ ప్రోగ్రామ్ కాదు. ఇందులో చాలా డ్రామా ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ కలిపి మాట్లాడుతూ రక్తి కట్టించాలి. అనుక్షణం నాటకీయత కనిపించాలి. ప్రేక్షకులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్టు ఉండాలి. హోస్ట్ భారతీయలందరికీ సుపరచితుడైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే అప్పటి ఏకైక సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతారన్నది సమీర్ నాయర్ అభిప్రాయం. సిద్ధార్థబసు కూడా సమర్థించారు. అప్పటికి అమితాబ్‌కు సినిమాలు లేవు. ఒప్పించటం సులువే అనుకున్నారు. అందుకే ధీమాగా మర్దోక్‌కి కూడా చెప్పారు. కానీ అమితాబ్ ఒప్పుకోలేదు. టీవీ అంటే ఒక మెట్టు దిగటమనే అభిప్రాయం ఆయనది. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరి అభిప్రాయమూ అదే. ఎలాగైనా ఒప్పించాలని ప్రయాణిస్తున్న సమయంలోనే ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఆఖరి ప్రయత్నంగా అమితాబ్‌ను లండన్ తీసుకువెళ్ళి అక్కడి సెట్, షూటింగ్ చూపిస్తే మనసు మారవచ్చుననుకున్నారు. ఆ విధంగా స్టార్ బృందం, అమితాబ్ లండన్ వెళ్ళారు. ఎల్స్ ట్రీ స్టూడియోలో ఒక రోజంతా గడిపి నిశితంగా పరిశీలించిన అమితాబ్ అడిగిన ప్రశ్న ఒక్కటే ‘అచ్చం ఇలాగే చేయగలరా?’ అని. అంతా భారీ స్థాయి, అద్భుతమైన సెట్, టెక్నాలజీ, లక్షల ఫోన్లను అందుకోగల సామర్థ్యం ఉండటం నిజానికి అప్పట్లో చాలా పెద్ద విషయాలే. జవాబు కోసం సిద్ధార్థ బసు వైపు చూశాడు సమీర్ నాయర్. ‘బడ్జెట్ ఉంటే చేయవచ్చు’ అన్నాడు బసు. స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాయర్ మూడు నెలల ప్రయత్నం ఫలించి ఏప్రిల్‌లో ఒప్పందం మీద అమితాబ్ సంతకం చేశారు. ఆన్ ఎయిర్ 250 మందితో కూడిన సినర్జీ బృందం ముంబయ్‌కి తరలి వచ్చింది. సెలడార్ రూపకల్పన చేసిన ఫార్మాట్ ను యథాతథంగా తీసుకోవటంతోబాటు సెట్ కూడా అచ్చు గుద్దినట్టు అలాగే తయారు చేయటంలో ప్రముఖ డిజైనర్ నితిన్ దేశాయ్ విజయం సాధించాడు. పోటీదారును ఉద్వేగభరితుణ్ణి చేసే లైటింగ్, మ్యూజిక్ అన్నీ సిద్ధమయ్యాయి. 2000, జూన్‌లో ముంబయ్ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్లో తొలిరోజు షూటింగ్‌కు అమితాబ్ రానే వచ్చారు. లైట్లాగి పోయాయి. ఏదో సాంకేతిక సమస్య. మూడు గంటలు వేచి చూసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇదేదో అపశకునమంటూ అమితాబ్ వెళ్ళిపోయారు. అది చివరి దూరదృష్టమని స్టార్ ఉద్యోగులు సర్దిచెప్పుకున్నారు. 2000, జులై 3న స్టార్ టీవీలో రాత్రి 9 గంటలకు ‘కౌన్ బానేగా కరోడ్‌పతి’ మొదలైంది. భారతదేశ టీవీ చరిత్రలో ముందెన్నడూ చూడని అతిపెద్ద కార్యక్రమం అది. ఇండియా–పాకిస్తాన్ వన్డే క్రికెట్‌ను మించిన ఉత్కంఠ కనబడటంతో జనం టీవీకి అతుక్కుపోయేట్టు చేసింది. కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే లాంటి పదాలు నిత్య జీవితంలో అందరూ సరదా సంభాషణాలలో వాడటానికి అలవాటు పడేంతగా పాపులర్ అయ్యాయి. కరోడ్‌పతి వర్సెస్ సినిమా మొదటివారంలో 10 రేటింగ్ పాయింట్స్ తెచ్చుకున్న షో ఆగస్టులో 18 దాటింది. వారానికి ఒక రోజు అరగంట చొప్పున ఉంటుందని జీ, సోనీ భావించగా సోమవారం నుంచి గురువారం దాకా నాలుగు రోజులపాటు గంటసేపు ప్రసారంగా మారటంతో అవి కంగుతిన్నాయి. అడ్వర్టయిజర్లు స్టార్ టీవీ ముందు క్యూ కట్టారు. పది సెకెన్లకు నాలుగున్నర లక్షలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్రకటనల వ్యవధిని పెంచాలని మాత్రం స్టార్ ఆలోచించలేదు. గంటకు 12 నిమిషాల ప్రకటనలకే పరిమితమైంది. ఆ సమయంలో మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం చేయటం ద్వారా కరోడ్‌పతి దూకుడుకు అడ్డుకట్టవేయాలని జీ నిర్ణయించుకుంది. అయితే, వారానికి నాలుగు రోజులకు కరోడ్‌పతి విస్తరించటంతో అన్ని సినిమాలు కొని ప్రసారం చేయటం జీటీవీకి దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో జీ – సోనీ ఆధిక్యాన్ని స్టార్ శాశ్వతంగా వెనక్కు నెట్టేసింది. కరోడ్‌పతి మొదలైన అదే జూలై 3న రాత్రి 10.30 కు ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ‘ కూడా మొదలవటం జీ, సోనీకి మరో దెబ్బ. కేబీసీ ఆదరణకు అడ్డుకట్టవేయటానికి అలాంటి కార్యక్రమమే సరైన మార్గమని జీటీవీ భావించింది. ప్రైజ్ మనీ భారీగా పెట్టి ‘‘సవాల్ దస్ కరోడ్ కా’’ అని ఊరిస్తూ, అనుపమ్ ఖేర్, మనీషా కోయిరాలా హోస్ట్‌లుగా ప్రారంభించింది. మొదటి వారం ఒక మోస్తరు రేటింగ్స్ వచ్చినా, మూడో వారానికే అందులో సగానికి పడిపోయి ఇక లేవలేదు. హిందీలో ఇప్పుడు నడుస్తున్నది 13వ సీజన్ కాగా, మొదటి మూడు సీజన్లు మాత్రమే స్టార్‌లో ప్రసారమయ్యాయి. ఆ తరువాత ఆసియా హక్కులు కొనుక్కున్న సోనీ సంస్థ భారత్ లో సోనీ టీవీలోనే ప్రసారం చేస్తూ వస్తోంది. మూడో సీజన్‌కు మాత్రమే షారూఖ్ ఖాన్ హోస్ట్‌గా ఉండగా మిగిలినవన్నీ అమితాబ్ నడిపినవే. మొదటి సీజన్లో కోటి రూపాయల బహుమతి ఉండగా 2, 3 సీజన్లలో ఆ మొత్తాన్ని రెండు కోట్లు చేశారు. 4 వ సీజన్‌తో సోనీలో మొదలైనప్పుడు ఇది 5 కోట్లకు చేరింది. ఏడో సీజన్ నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లతో సాగుతోంది. డింగు టకా.. గొళ్లెం పెట్టు తెలుగులో అనుకరణ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్న రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పేరడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వరుసగా కొన్ని ఆదివారాల పాటు ఆయన ‘డింగు టకా, గొళ్ళెం పెట్టు’ లాంటి మాటలతో అలరించిన ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ నిర్మాతలు రూపొందించగా జెమినీ టీవీ ప్రసారం చేసింది. ‘చల్ మోహన రంగా’ పేరుతో ఇది కేవలం సరదాగా నవ్వించటానికి తయారుచేసిన పేరడీ కార్యక్రమం మాత్రమే. ఆ తరువాత కేబీసీ నమూనాలో కొద్దిపాటు మార్పులు చేస్తూ క్రియేటివ్ డైరెక్టర్ అడివి శ్రీనివాస్ సారధ్యంలో మా టీవీలో 17 ఏళ్ల కిందట ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర’ పేరుతో క్విజ్ షో రూపొందించారు. ప్రైజ్ మనీ 5 లక్షలు. ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షో కోసం వేసిన సెట్ ఖరీదు కేవలం 5 లక్షలు కాగా ఆ రోజుల్లోనే 4 రేటింగ్ పాయింట్స్ సంపాదించటం విశేషం. ఐ న్యూస్‌లో బ్రహ్మానందం హోస్ట్‌గా చేసిన కార్యక్రమం కూడా కరోడ్‌పతి నమూనానే. ‘బ్రహ్మీ టెన్ లాక్ షో’ పేరులోనే ఉన్నట్టు దాని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఒక న్యూస్ చానల్ అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి షో చేయాలనుకోవటం దుస్సాహసమే అయినా, ఐ న్యూస్ అందుకు సిద్ధపడింది. కానీ భారీ ప్రొడక్షన్ ఖర్చు, బ్రహ్మానందం లాంటి బిజీ, ఖరీదైన నటుణ్ణి భరించటం సాధ్యంకాక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. దగ్గుతో మోసం అతిపెద్ద వివాదం సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2001 సెప్టెంబర్‌లో బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా ఉన్న చాల్స్ ఇన్‌గ్రాం విజేత అయ్యాడు. బహుమతి అందుకున్నాడు. అయితే రికార్డు చేసిన మొత్తం ప్రసారాన్ని ఎడిట్ చేస్తున్న ప్రొడక్షన్ సిబ్బందికి చిన్న అనుమానమొచ్చింది. అత్యంత కీలకమైన చివరి రెండు ప్రశ్నలకూ ముందు తప్పు సమాధానమిచ్చి తరువాత దిద్దుకోవటం గమనించారు. ఆ విధంగా అర మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ, మిలియన్ పౌండ్ల ప్రశ్నకూ ఒక దగ్గు శబ్దం వినపడగానే సమాధానం మార్చుకున్నట్టు అర్థమైంది. పైగా, అలా దగ్గింది స్వయానా ఇన్‌గ్రామ్ భార్య డయానా. మొత్తం టేపులు పరిశీలించినప్పుడు అంతకుముందు కూడా తప్పుడు సమాధానాలకు అలా దగ్గినట్టు తేలింది. ప్రత్యక్షప్రసారం కాదు కాబట్టి ఎడిటింగ్ దశలో గుర్తుపట్టిన ఈ మోసం వల్ల ఐటీవీ ఈ ఎపిసోడ్ ప్రసారం నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం కోర్టుకెక్కింది. డస్ట్ ఎలర్జీ వలన దగ్గానే తప్ప క్లూ ఇవ్వటానికి కాదన్న డయానా వాదనను కోర్టు నమ్మలేదు. మొత్తం ఫుటేజ్‌ని కోర్టు పరిశీలించి శిక్ష, జరిమానా విధించింది. బహుమతి వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సైనికాధికారులు చాల్స్ ఇన్‌గ్రామ్‌ను మేజర్ హోదా నుంచి తప్పించి ఇంటికి పంపారు. కోర్టు విచారణ పూర్తయ్యాక ఐటీవీ స్వయంగా ‘మిలియనేర్: ఏ మేజర్ ఫ్రాడ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తయారుచేసి ప్రసారం చేయటం విశేషం. బైటికిరాని ఆ ఫుటేజ్‌లోని కీలక భాగాలతోబాటు ప్రొడక్షన్ సిబ్బంది, ఆ సమయంలో పాల్గొన్న మరికొందరు పోటీదారుల ఇంటర్వ్యూలతో ఆ డాక్యుమెంటరీ తయారైంది. ఆ తరువాత జేమ్స్ గ్రాహమ్ రాసిన నాటకాన్ని కూడా ఐటీవీ ప్రసారం చేసింది. ఈ మొత్తం వివాదం మీద ‘బాడ్ షో: ది క్విజ్, ది కాఫ్, ది మిలియనీర్ మేజర్’ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చింది. ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ అనే అవకాశాన్ని వాడుకోవటం కూడా పక్కదారులు పట్టింది. ఈ లైఫ్ లైన్ వాడుకోవాలనుకునే వారికి సాయం చేసే ముఠా ఒకటి తయారైంది. విషయ పరిజ్ఞానం ఉన్న ఒక బృందాన్ని సిద్ధం చేసుకొని పోటీదారులతో బేరం కుదుర్చుకొని ఫోన్ నెంబర్ ఇవ్వటం ద్వారా 200 మందికి దాదాపు 5 మిలియన్ పౌండ్లు గెలుచుకోవటానికి సాయం చేసినట్టు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కీత్ బర్జెస్ ఒప్పుకున్నాడు. 2007లో బ్రిటిష్ పత్రికలు ఈ విషయం బహిర్గతం చేశాయి. ఈ లోపాన్ని సరిదిద్దటానికి ఆ తరువాత కాలంలో పోటీదారుడు తన ఫ్రెండ్ పేరుతో పాటు ఫోటో కూడా ఇవ్వాలనే షరతు పెట్టి దాన్ని కూడా టీవీ తెరమీద చూపించటం మొదలుపెట్టారు. ఈ భాషల్లోనూ.. ప్రాంతీయ చానల్స్ కూడా దీన్ని బాగానే వాడుకున్నాయి. అక్కడి భాషలో పేర్లు పెట్టుకోవటంతోబాటు కొద్దిపాటి మార్పులు చేసుకున్నాయి. స్టార్ లో మొదలైన కొద్ది నెలలకే సన్ గ్రూప్ తన తమిళ చానల్ సన్ టీవీలోనూ, మలయాళ చానల్ సూర్యలోనూ కోటీశ్వరన్ పేరుతో ప్రసారం చేసింది. 2011లో శత్రుఘ్న సిన్హా హోస్ట్‌గా భోజ్‌పురిలో, సౌరభ్ గంగూలీ హోస్ట్‌గా బెంగాలీలో, 2012లో స్టార్ విజయ్ (తమిళం) లో, స్టార్ సువర్ణ (కన్నడం)లో, ఈ టీవీ మరాఠీలో, ఏసియానెట్ (మలయాళం) లో, 2014లో స్టార్ మా (తెలుగు)లో, 2019లో డీడీ కశీర్ (కశ్మీరీ)లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇదే కార్యక్రమం వివిధ కారణాలవలన చానల్స్ మారుతూ వచ్చింది. ప్రసార హక్కులున్న సోనీ తనకు ప్రాంతీయ చానల్స్లేని చోట అలా అమ్ముతూ వస్తోంది. అందుకే ‘స్టార్ మా’లో మూడు సీజన్లు ( రెండు సీజన్లకు నాగార్జున, మూడో సీజన్‌కు చిరంజీవి హోస్ట్ లుగా) ప్రసారమయ్యాక ఇప్పుడు తెలుగులో నాలుగో సీజన్ జెమినీ టీవీలో ఎన్టీయార్ హోస్ట్‌గా ప్రసారమవుతోంది. మూలం.. బ్రిటన్‌లో డేవిడ్ బ్రిగ్స్ రూపకల్పన చేసిన ‘‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్ ’’ గేమ్ షోను ఐటీవీ కోసం సెలెడార్ సంస్థ నిర్మించింది. క్రిస్ టారంట్ దీనికి హోస్ట్. 1998 సెప్టెంబర్ 4 న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. సరైన సమాధానానికి బహుమతి ఇస్తూ, వరుసగా అడిగే ప్రశ్నల బహుమతిని పెంచుకుంటూ ఆఖరి ప్రశ్నకు మిలియన్ పౌండ్లు ఇవ్వటం స్థూలంగా ఈ క్విజ్ షో థీమ్. వచ్చిన బహుమతితో వెళ్ళిపోవటమా, కొనసాగటమా అనేది పోటీదారు ఇష్టం. జవాబు ఇవ్వటంలో సాయపడేలా అనేక లైఫ్ లైన్స్ కూడా ఇస్తారు. ఈ షో 1999 లో 60% మార్కెట్ వాటాతో బీబీసీ చరిత్రలోనే రేటింగ్స్ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గేట్టు చేసింది. ఇలా అనూహ్యమైన విజయం సాధించటంతో అంతర్జాతీయ ఫ్రాంచైజ్ గా మారి వివిధ దేశాలలో కొద్దిపాటి మార్పులతో ఇప్పటికీ ప్రసారమవుతూనే ఉంది. ఈ నమూనాకు ప్రాతిపదిక తమదేనంటూ చాలామంది కోర్టుకెక్కారు. కొన్ని వాదనలు వీగిపోగా, మరికొందరికి డబ్బిచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ షో వర్కింగ్ టైటిల్ ‘ది కాష్ మౌంటేన్’. అయితే 1956 నాటి ‘హై సొసైటీ’ చిత్రానికి కోల్ పోర్టర్ రాసిన పాట ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్‘ బాగా నచ్చి దాన్నే వాడుకున్నారు. అయితే, అలా వాడుకోవటం మీద దుమారం చెలరేగటంతో అప్పుడు కూడా కొంత పరిహారం చెల్లించి సెటిల్ చేసుకున్నారు. -తోట భావనారాయణ -
నాన్న సెక్యూరిటీ గార్డ్.. కొడుకు రూ. కోటి గెలిచాడు
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొనాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్విళ్లురుతుంటారు. కొందరు ఏళ్లుగా ప్రయత్నిస్తుంటారు. అదృష్టం వరించి.. సెలక్ట్ అయిన వారు ఎంతో కొంత సొమ్ముతో షో నుంచి వెనుదిరుగుతారు. కొందరు ప్రతిభావంతులు మాత్రం కోటి రూపాయలు సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలిచిన రెండవ వ్యక్తిగా నిలిచాడు సాహిల్ ఆదిత్య(19). సెక్యూరిటీ గార్డు కుమారుడైన సాహిల్.. ప్రస్తుత కేబీసీ 13వ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ వివరాలు.. (చదవండి: కేబీసీ 13: రూ. 7 కోట్ల ప్రశ్న, గెలుస్తాడా, లేదా?!) మధ్యప్రదేశ్ ఛతర్పూర్ మున్సిపాలిటీకి చెందిన సాహిల్ ఆదిత్య అహిర్వార్ తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా సాహిల్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. కాలేజీకి బంక్ కొట్టడం.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం చేసేవాడు. చదువు మీద అసలు ఆసక్తి కనపర్చేవాడు కాదు. కానీ గత రెండేళ్లలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. సమయం వృధా చేయకుండా దాని కోసం కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో కేబీసీ 13వ సీజన్లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు సాహిల్. ఎస్ఎమ్ఎస్లు పంపాడు. అదృష్టం బాగుండటంతో సెలక్ట్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్న వరకు సరైన సమాధానం చెప్పాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. ఇక సాహిల్ తండ్రి గురించి, తన గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. తండ్రి పదవ తరగతి వరకు చదువుకున్నాడని... ప్రస్తుతం నోయిడాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు అని తెలిపాడు సాహిల్. (చదవండి: కోటి రూపాయలను తలదన్నే కథ) ‘‘గత రెండేళ్లు నా జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. అంతకు ముందు నాకు చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజీకి బంక్ కొట్టి.. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లకు తిరిగేవాడిని. కానీ ఈ రెండేళ్లు నాలో ఎంతో మార్పు తీసుకువచ్చాయి. ప్రస్తుతం నేను ర్యాంక్ హోల్డర్ని. రానున్న రోజుల్లో తప్పక ఐఏఎస్ అవుతాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు సాహిల్. చదవండి: 900 కోట్ల రూపాయల అప్పు.. చీకటి రోజులవి: అమితాబ్