భారత్‌లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్‌లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్‌తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే!
ఆఫర్ అదిరిపోలా!
వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్‌లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్‌లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో చూసే సౌకర్యం ఉండదు.
ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్‌తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్‌ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment