Vodafone Idea
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్‌లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లపై అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్‌ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..
జియో, ఎయిర్టెల్ కంపెనీలు యూజర్లను ఆకర్షిస్తున్న వేళ.. 'వోడాఫోన్ ఐడియా' (VI) వినియోగదారుల కోసం ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 209 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ అన్ని రకాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 209 రూపాయల ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా, రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది. అంతే కాకుండా 300 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు రూ.199 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.209 ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలర్ ట్యూన్లను అందిస్తోంది. రూ. 209 ప్లాన్ కాకుండా.. కంపెనీ రూ. 218, రూ. 249, రూ. 289 ప్లాన్స్ కూడా అందిస్తోంది.రూ. 218 ప్లాన్కంపెనీ రూ.218 ప్లాన్ ద్వారా 1 నెల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో, మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3జీబీ డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ప్లాన్‌లో.. కంపెనీ అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. 300 ఎస్ఎమ్ఎస్ల పరిమితి ముగిసిన తర్వాత.. ఒక్కో లోకల్ ఎస్ఎమ్ఎస్ కోసం రూ.1, ఎస్టీడీ ఎస్ఎమ్ఎస్ కోసం రూ. 1.5 పైసలు చెల్లించాల్సి వస్తుంది.రూ. 249 ప్లాన్కంపెనీ అందించే.. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్‌లో అందించే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. దీనితో పాటు, మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.రూ. 289 ప్లాన్ఈ ప్లాన్ ద్వారా మీరు 40 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 4 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్ 600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండిమొబైల్ రీఛార్జ్ మరింత భారం అవుతుందా?రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది. -
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్‌లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్‌కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు. -
తిరుగులేని రీఛార్జ్ ప్లాన్.. హాఫ్‌డే ఇష్టమొచ్చినంత డేటా
నష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా పోటీని తట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది కాలపరిమితితో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను (Vi SuperHero) ప్రవేశపెట్టింది. కస్టమర్లు అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు.దీనికితోడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితం. ఈ ప్రీ–పెయిడ్ ప్లాన్స్ ధర ర.3,599 నుంచి ర.3,799 వరకు ఉంది. ప్రస్తుతానికి ఇవి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాకు పరిమితం.వీఐ సూపర్‌హీరో ప్లాన్ల ప్రయోజనాలు⇒ అపరిమిత డేటా: ప్రతి రోజు హాఫ్-డే (అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు) అపరిమిత డేటా.⇒ రోజువారీ డేటా కోటా: మిగిలిన గంటలలో ( మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 వరకు) 2 GB హై-స్పీడ్ డేటా.⇒ వారాంతపు డేటా రోల్ఓవర్: వినియోగదారులు ఉపయోగించని వారాంతపు డేటాను ఫార్వార్డ్ చేయవచ్చు. వారాంతంలో దాన్ని ⇒ ఉపయోగించుకోవచ్చు.⇒ ఓటీటీ (OTT) ప్రయోజనాలు: రూ.3,699 ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదే రూ.3,799 ప్లాన్‌లో యితే ఒక సంవత్సరం అమేజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్స్క్రిప్షన్ ఉంటుంది.ఓవైపు వొడాఫోన్ ఐడియా తన 4G నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉండగా పోటీ సంస్థలు జియో, ఎయిర్టెల్ ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అపరిమిత 5G డేటా ప్లాన్లను రూపొందించాయి. ఈ కొత్త "సూపర్‌హీరో" ప్లాన్లతో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.అదే సమయంలో వోడాఫోన్ ఐడియా 19.77 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. గడిచిన సెప్టెంబర్ నెలలో 15.5 లక్షల మంది యూజర్లను చేజార్చుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల విడుదల చేసిన అప్డేట్ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 18.30% వద్ద ఉంది. రిలయన్స్ జియో 39.9% వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారతి ఎయిర్టెల్ 33.5% వాటాతో రెండవ స్థానంలో ఉంది.ఇక కంపెనీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో విక్రయిస్తున్న వార్షిక ప్లాన్స్‌లో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా అందుకోవచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు.బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ప్రత్యేక వార్షిన్ ప్లాన్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. -
మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ఐడియా 4జీ నెట్వర్క్ అత్యుత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో కంపెనీ మెరుగైన నెట్వర్క్ అందించినట్లు ఓపెన్‌సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్‌విడ్త్ అప్‌గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం..కంపెనీ వినియోగదారులు నవంబర్ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.యూజర్లు 17.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్‌గ్రేడ్ చేసింది.ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. -
మార్చిలోగా వొడాఫోన్ ఐడియా 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 2025 మార్చిలోగా వాణిజ్యపరంగా 5జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 11,500లకుపైగా 4జీ టవర్స్ ఉన్నాయి. దశలవారీగా వీటిని 5జీకి అప్‌గ్రేడ్ చేస్తాం. స్పామ్ సందేశాలను అడ్డుకునే సాంకేతికతను పరిచయం చేశాం. ఈ సేవలను కాల్స్‌కు కూడా త్వరలో విస్తరిస్తాం. ప్రస్తుతం స్పామ్ కాల్స్ కట్టడికి సంబంధించి టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోటికి పైగా చందాదార్లు ఉన్నారు. ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తున్న సగటు ఆదాయం నెలకు రూ. 200 ఉంది. సగటున ఒక్కో కస్టమర్ డేటా వినియోగం ప్రస్తుతం నెలకు 18–20 జీబీ ఉందని ఆనంద్ చెప్పారు. దేశవ్యాప్తంగా కంపెనీ రూ.18,000 కోట్ల తాజా పెట్టుబడులు చేస్తోందని తెలిపారు. -
వొడాఫోన్ ఐడియా షేర్ల జారీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 175.53 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. షేరుకి రూ. 11.28 ధరలో వొడాఫోన్ గ్రూప్ సంస్థలకు వీటిని కేటాయించనుంది. తద్వారా రూ. 1,980 కోట్లు సమకూర్చుకోనుంది. ఒమెగా టెలికం హోల్డింగ్స్‌కు రూ. 1,280 కోట్లు, ఉషా మార్టిన్ టెలిమాటిక్స్‌కు రూ. 700 కోట్లు విలువైన షేర్లను జారీ చేయనుంది.2025 జనవరి 7న నిర్వహించనున్న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఈ అంశాలను బోర్డు చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ వాటా 22.56 శాతంకాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వం 23.15 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 8,747 కోట్ల నుంచి తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం సహకరించింది.మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం మెరుగుపడి రూ. 10,918 కోట్లను తాకింది. కాగా.. ఇటీవల టెలికం దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్తో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం సుమారు రూ. 30,000 కోట్ల(3.6 బిలియన్ డాలర్లు) విలువైన డీల్‌ను వొడాఫోన్ ఐడియా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు రూ. 8.11 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ నిర్ణయం.. వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట
న్యూఢిల్లీ: గత స్పెక్ట్రం కొనుగోళ్లకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల టెల్కోలపై గణనీయంగా ఆర్థిక భారం తగ్గుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సీవోఏఐ తెలిపింది. దీనితో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి నిధుల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొంది.2022కి ముందు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం సంస్థలు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.దీనితో ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట లభించనుంది. వొడాఫోన్ ఐడియా రూ. 24,747 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉండగా, దానికి గడువు కూడా ముగిసిపోయింది. అటు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియోకి కూడా ఊరట లభిస్తుంది. -
వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్.. ఇక వేగవంతమైన నెట్వర్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండోర్ నెట్‌వర్క్‌ను 20కిపైగా జిల్లాల్లో మెరుగుపర్చినట్టు తెలిపింది. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 3,450కిపైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది.తద్వారా కస్టమర్లకు మెరుగైన నెట్వర్క్ లభిస్తుందని తెలిపింది. రూ.691 కోట్లతో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 2.4 మెగాహెట్జ్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. 5,000లకుపైగా సైట్స్‌లో నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను 10 మెగాహెట్జ్ నుండి 20 మెగాహెట్జ్‌కి అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. తద్వారా వినియోగదార్లు వేగవంతమైన డేటాను అందుకోవచ్చని వివరించింది.ఇదీ చదవండి: మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా? -
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్ సాధించింది. ఏఆర్పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్కాగా.. మూడేళ్ల కాలంలో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది. -
ఓటీటీ యాప్‌ల మినహాయింపు.. టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్ యాప్‌లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్, బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సుల్లో సర్వీస్ ఆథరైజేషన్ నుంచి ఓటీటీ యాప్‌లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఏజీఆర్ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్టెల్ రూ. 21,500 కోట్లు ఏజీఆర్ బకాయీలు కట్టాల్సి ఉంది. -
వొడాఫోన్ ఐడియా భారీ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్వర్క్ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ ఐడియా నిలిచింది. మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటన పేర్కొంది. సరఫరాలు డిసెంబర్ క్వార్టర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీఐఎల్ 2.0కు శ్రీకారం... వీఐఎల్ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు. నోకియా, ఎరిక్సన్ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్సంగ్తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు. 2018లో ఐడియా సెల్యులర్‌తో విలీనం అనంతరం వొడాఫోన్ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్‌టెల్‌తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు. -
టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లోని వివరాలు విచారించింది. టెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు లెక్కించడంలో లోపాలు జరిగాయి. వాటిని సవరించాలి. ఇప్పటికే పోగైన బకాయిలపై వడ్డీని ఉపసంహరించాలి. క్యూరేటివ్ పిటిషన్‌ను బహిరంగంగా విచారణ చేయాలని కంపెనీలు కోరాయి.ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడిగతంలో సెప్టెంబర్ 1, 2020లో కోర్టు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం..మార్చి 31, 2021లోపు కంపెనీల బకాయిల్లో 10 శాతం చెల్లించాలి. తదుపరి ఏడాది మరో 10 శాతం చొప్పున 2031 మార్చి 31లోపు పూర్తి బకాయిలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం టెలికాం విభాగానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌పై రీవాల్యుయేషన్ అనుమతించబడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, అన్ని టెలికాం కంపెనీలు కలిపి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో లైసెన్స్ ఫీజు బకాయిలు మొత్తం రూ.92,642 కోట్లు కాగా, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు రూ.55,054 కోట్లుగా ఉన్నాయి. వొడాఫోన్ఐడియా కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ
టెలికమ్యునికేషన్ సేవలందిస్తున్న వొడాఫోన్-ఐడియా(వీఐ) ప్రతిష్టాత్మక ‘పీసీఐ డీఎస్ఎస్ 4.0’ సర్టిఫికేషన్ పొందినట్లు తెలిపింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా గుర్తింపు పొందింది. కస్టమర్ల డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నందుకు ఈ గుర్తింపు లభించిందని కంపెనీ పేర్కొంది.సిమ్‌కార్డు ఆధారంగానే డిజిటల్ లావాదేవీలు చేస్తూంటారు. మోసపూరిత చెల్లింపులను నివారించి, కస్టమర్ డేటాను భద్రంగా ఉంచడంలో పకడ్బందీ చర్యలు పాటిస్తున్నట్లు వీఐ తెలిపింది. కంపెనీ రిటైల్‌స్టోర్స్, పేమెంట్ ఛానల్స్‌కు సంబంధించి ఈ చర్యలు చేపట్టినందుకు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ వెర్షన్ 4.0 (పీసీఐ డీఎస్ఎస్ 4.0) సర్టిఫికేషన్ పొందినట్లు వెల్లడించింది. దాంతో భారత్‌లో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం ఆపరేటరుగా వొడాఫోన్-ఐడియా నిలిచింది.ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ..‘అత్యుత్తమ గ్లోబల్ సెక్యూరిటీ ప్రమాణాలకు సంస్థ కట్టుబడి ఉంది. కస్టమర్ల డేటా భద్రతకు కంపెనీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పీసీఐ డీఎస్ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందడమనేది పకడ్బందీ భద్రతా చర్యలను పాటించడంలో మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారత్‌లో ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం సంస్థగా నిలవడం సంతోషకరం. పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు, అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీలపై పెట్టుబడి పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘పది కోట్లమంది ప్రయోజనాలు కాపాడుతాం’పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ(పీసీఐ) సెక్యూరిటీ స్టాండర్డ్స్ కౌన్సిల్‌ను ప్రారంభించింది. డేటా ఉల్లంఘనలు, క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన మోసాలు గుర్తించడం, వాటికి అందించే భద్రత చర్యలు, అందుకోసం సంస్థలు పాటించే అత్యంత కఠినతరమైన, అప్-టు-డేట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఇది సూచిస్తుంది. భారత్‌లోని బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా పీసీఐ డీఎస్ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందాలని ఇప్పటికే ఆర్బీఐ మార్గదర్శకాల్లో నిర్దేశించింది. -
వొడాఫోన్‌కు గోల్డ్‌మన్ శాక్స్ షాక్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా రానున్న 3–4 ఏళ్ల కాలంలో తగ్గుతూనే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల చేపట్టిన మూలధన సమీకరణ సానుకూల అంశమే అయినప్పటికీ మార్కెట్ వాటా కోల్పోవడాన్ని అరికట్టబోదని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. రానున్న 3–4 ఏళ్లలో 300 బేసిస్ పాయింట్ల(3 శాతం)మేర మార్కెట్ వాటాకు కోత పడనున్నట్లు అంచనా వేసింది. ఈ సందర్భంగా పెట్టుబడి వ్యయాలు, ఆదాయ మార్కెట్ వాటా మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించింది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ప్రత్యర్ధి కంపెనీలు 50 శాతం అధికంగా పెట్టుబడులను వెచి్చస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నిధులను సమీకరించడం ఈ టెలికం కంపెనీకి సానుకూల అంశమేనని, అయితే మార్కెట్ వాటా బలహీనపడటాన్ని నివారించలేదని విదేశీ బ్రోకింగ్ సంస్థ వ్యాఖ్యానించింది. వెరసి సానుకూల ధోరణితో చూస్తే షేరు అంచనా విలువను రూ. 19గా పేర్కొంది. ప్రస్తుత రేటు(గురువారం ముగింపు)తో పోలిస్తే 26 శాతం అధికమైనప్పటికీ బేస్కేసుగా చేసిన మదింపుతో చూస్తే మాత్రం 83 శాతం పతనంకావచ్చని తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి వొడాఫోన్‌కు సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) స్పెక్ట్రమ్ సంబంధ చెల్లింపులు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. వీటిలో కొంతమేర బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశమున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఫ్రీక్యా‹Ùఫ్లో స్థితికి చేరేందుకు ఏఆర్పీయూ రూ. 200–270కు జంప్చేయవలసి ఉన్నట్లు అంచనా వేసింది. సమీపకాలంలో ఇది జరిగేందుకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. టారిఫ్‌ల పెంపు, పెట్టుబడుల సమీకరణ నేపథ్యంలోనూ 2025 మార్చికల్లా నికర రుణభారం– నిర్వహణ లాభం(ఇబిటా) నిష్పత్తి మెరుగుపడకపోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 11.5% పతనమై రూ. 13.36 వద్ద ముగిసింది. -
‘అన్లిమిటెడ్’ ప్లాన్లు ఉంటాయా? కంపెనీల వైఖరి ఇదే..
టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్లిమిటెడ్ ప్యాక్‌లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్ఎంఎస్లకు విడివిడిగా ప్యాక్‌లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.ఎయిర్టెల్ ఏం చెప్పిందంటే.. ఎయిర్టెల్ ట్రాయ్‌కి ఇచ్చిన స్టేట్మెంట్లో తమ ప్రస్తుత ప్లాన్లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్‌ల మోడల్‌కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్‌గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్‌లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.జియోదీ అదే వైఖరిఎయిర్టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్లను మోస్ట్ అఫర్డబుల్‌గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్‌ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్‌తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. -
బ్యాంక్ హామీని మినహాయించండి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ(ఎఫ్‌బీజీ) మినహాయించమంటూ టెలికం శాఖ(డాట్)ను అభ్యరి్థంచినట్లు తెలుస్తోంది. స్పెక్ట్రమ్ చెల్లింపులకుగాను 2025 సెపె్టంబర్లో అందించవలసిన రూ. 24,747 కోట్ల ఎఫ్బీజీని మినహాయించమని డాట్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ వేలం నిబంధనల ప్రకారం వార్షికంగా చెల్లించవలసిన మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) ఏడాది ముందుగానే సెక్యూరిటైజ్ చేయవలసి ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై వొడాఫోన్ ఐడియా స్పందించకపోవడం గమనార్హం! 2022కంటే ముందుగా నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కుగాను వీఐఎల్ చెల్లించవలసిన మొత్తమిది. అయితే 2022లో చెల్లింపులపై ప్రభు త్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా వీఐఎల్ నాలుగేళ్ల నిషేధాన్ని(మారటోరియం) వివియోగించుకుంది. ఫలితంగా 2016వరకూ నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులు 2025 అక్టోబర్– 2026 సెప్టెంబర్ మధ్యకాలంలో చేపట్టవలసి ఉంటుంది. మరోవైపు ఏజీఆర్ బకాయిల(చెల్లింపులు)పైనా మారటోరియాన్ని కంపెనీ వినియోగించుకుంది. ఇది 2026 మార్చిలో ముగియనుంది. దీంతో మారటోరియం ముగియడానికి కనీసం 13 నెలల ముందుగా వీఐఎల్ బ్యాంక్ గ్యారంటీలను సమరి్పంచవలసి ఉంటుంది. కాగా.. 2024 మార్చి31కల్లా కంపెనీ ప్రభుత్వానికి రూ. 2,03,430 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,33,110 కోట్లుకాగా.. ఏజీఆర్ బకాయిలు రూ. 70,320 కోట్లు! మారటోరియాన్ని అందుకున్న సమయంలో కంపెనీ రూ. 16,000 కోట్ల వడ్డీ చెల్లింపులను ఈక్విటీ జారీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్ చేసింది. తద్వారా కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించింది. తదుపరి కంపెనీ ఎఫ్‌పీవో ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించడంతో ప్రభుత్వ వాటా 23.8 శాతానికి పరిమితమైంది. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు ఫ్లాట్‌గా రూ. 16.62 వద్ద ముగిసింది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లు పెంపు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్‌లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.మొదటగా జియో టారిఫ్‌లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్‌లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.ప్లాన్ల కొత్త ధరలు ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్‌కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. -
వొడాఫోన్‌లో నోకియా, ఎరిక్సన్ వెండర్లకు 166 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో కీలక వెండార్ సంస్థలు నోకియా, ఎరిక్సన్ ఇండియాకు వాటా లభించనుంది. నెట్వర్క్ పరికరాలను సరఫరా చేసే వీటి బకాయిలను పాక్షికంగా చెల్లించేందుకు షేరుకి రూ. 14.8 ధరలో వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. ఇది ఎఫ్‌పీవో ధరకంటే 35 శాతం అధికంకాగా.. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 10 ముఖ విలువగల 166 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వీఐఎల్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 2,458 కోట్ల విలువైన వాటాను నోకియా, ఎరిక్సన్ పొందనున్నాయి. అయితే వీటికి 6 నెలల లాకిన్ వర్తించనుంది. నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఎరిక్సన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ దీర్ఘకాలంగా కీలక వెండార్లుగా సేవలందిస్తున్నట్లు వీఐఎల్ పేర్కొంది. నోకియాకు రూ. 1,520 కోట్లు(1.5 శాతం వాటా), ఎరిక్సన్కు రూ. 938 కోట్ల(0.9 శాతం) విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీఐఎల్‌లో ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ సంయుక్త వాటా 37.3 శాతంకాగా.. ప్రభుత్వ వాటా 23.2 శాతానికి చేరనుంది. -
Vodafone Idea: 6 నెలల్లో 5జీ సేవల విస్తరణ
ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రతిపాదిత రూ. 18,000 కోట్ల ఎఫ్‌పీవో ద్వారా నిధులు సమీకరణ అనంతరం 6–9 నెలల్లోగా 5జీ సరీ్వసులు విస్తరించే యోచనలో ఉంది. నిధుల కొరత వల్లే ఇప్పటివరకు సర్వీసులను ప్రారంభించలేకపోయామని సంస్థ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. రాబోయే 24–30 నెలల్లో తమ మొత్తం ఆదాయంలో 5జీ వాటా 40 శాతం వరకు ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్‌పీవో ద్వారా సేకరించే నిధుల్లో రూ. 5,720 కోట్ల మొత్తాన్ని 5జీ సరీ్వసులకు వినియోగించనున్నట్లు ముంద్రా వివరించారు. వొడా–ఐడియా ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ఏప్రిల్ 18న ప్రారంభమై 22తో ముగియనుంది. ఇందుకోసం ధర శ్రేణిని షేరుకు రూ. 10–11గా నిర్ణయించారు. ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా సేకరించే రూ. 18,000 కోట్లలో రూ. 15,000 కోట్ల మొత్తాన్ని 5జీ సేవల విస్తరణ, ఇతరత్రా పెట్టుబడుల కోసం వినియోగించుకోనున్నట్లు ముంద్రా వివరించారు. ప్రధానంగా కస్టమర్లు చేజారి పోకుండా చూసుకోవడం, యూజరుపై సగటు ఆదాయాన్ని (ఆర్పూ) పెంచుకోవడం, నెట్‌వర్క్‌పై పెట్టుబడులు పెట్టడం తమకు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2జీ యూజర్లు ఎక్కువగా ఉన్నందున తమ ఆర్పూ మొత్తం పరిశ్రమలోనే తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమ 21.5 కోట్ల యూజర్లలో కేవలం 2జీనే వినియోగించే వారి సంఖ్య 42 శాతంగా ఉంటుందని, వీరంతా 4జీకి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్పూ మెరుగుపడేందుకు ఆస్కారం ఉందన్నారు. -
వొడాఫోన్ భారీ ఎఫ్‌పీవో
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ. కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది. జీక్యూజీ, ఎస్బీఐ ఎంఎఫ్ ఆసక్తి.. ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
వొడా-ఐడియా కస్టమర్లకు బ్యాగేజీ కవరేజ్
ముంబై: అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్యాక్‌ను ప్రీ–బుక్ చేసుకునే తమ పోస్ట్‌పెయిడ్ యూజర్లకి .. బ్యాగేజీపరంగా తలెత్తే సమస్యలకు సంబంధించి కవరేజీని అందిస్తున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్ఐడియా (వీఐ) తెలిపింది. బ్యాగేజీ పోయినా లేదా అందడంలో ఆలస్యం జరిగినా ఒక్కో బ్యాగ్‌కి రూ. 19,800 పరిహారం పొందవచ్చని వివరించింది. ఇందుకోసం అమెరికాకు చెందిన బ్లూ రిబ్బన్ బ్యాగ్స్ సంస్థతో వీఐ చేతులు కలిపింది. ఏప్రిల్ 7 వరకు జరిపే ప్రయాణాల కోసం మార్చి 21 వరకు బుక్ చేసుకున్న నిర్దిష్ట ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లకు (రూ. 3,999–రూ. 5,999) ఇది వర్తిస్తుంది. -
లక్షల కోట్ల అప్పులు.. వొడాఫోన్ ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టనుంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలు, ఇతర రుణ మార్గాల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు తాజాగా ఆమోదముద్ర వేసింది. రూ. 2.1 లక్ష కోట్ల భారీ రుణ భారంతో కుదేలైన కంపెనీ మనుగడ కోసం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. త్రైమాసికవారీగా నష్టాలు ప్రకటించడంతోపాటు.. వినియోగదారులను కోల్పోతోంది. ఏప్రిల్‌లో బోర్డ్ భేటీ... నిధుల సమీకరణ నిర్వహణ కోసం బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు యాజమాన్యానికి అధికారాలనిస్తూ బోర్డు తీర్మానించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. వాటాదారుల అనుమతి తదుపరి త్రైమాసికంలో ఈక్విటీ నిధుల సమీకరణను పూర్తి చేయనున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థలో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా స్పందించింది. స్టార్లింగ్ తమ కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. సామాజికమధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మకూడదని చెప్పింది. ఏ సమాచారమైన అధికారిక వెబ్‌సైట్‌ల్లో సరిచేసుకోవాలని తెలిపింది. ఇదీ చదవండి: కొత్త కార్ల పరుగు దేశంలో తొలిసారి టెలికాం రంగంలో ప్రవేశించేందుకు స్టార్‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు ఇటీవల భారీగా ర్యాలీ అయ్యాయి. స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐలో తన 33.1 శాతం వాటాను మస్క్‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత్ రానున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధ్యాన్యం సంతరించుకుంది. -
ఒక్క రోజులో.. వొడాఫోన్ ఐడియా పంట పండింది!
టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా పంట పండింది. తక్కువ లాభాలు ఉన్నప్పటికీ, వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఒక్క రోజులో అమాంతం పెరిగాయి. ఆల్ టైమ్ హైని తాకాయి. గత కొన్ని నెలలుగా నీరసమైన లాభాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 29న 2023 చివరి మార్కెట్ సెషన్లో వోడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఏకంగా 20 శాతానికి పైగా ఎగిశాయి. సంవత్సర కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్లో 20 శాతానికి పైగా ఎగిసి రూ.13 నుంచి రూ.16కి చేరాయి. ఇది కంపెనీ 52 వారాల గరిష్టం. ఇక వొడాఫోన్ ఐడియా షేర్ ధరల 52 వారాల కనిష్టం విషయానికి వస్తే రూ. 5.70 వద్ద నమోదైంది. ఆ డీలే కారణం! 16.05 కోట్ల షేర్లను విక్రయించి నిధులను సేకరించేందుకు వొడాఫోన్ ఐడియా ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే షేర్ల ధరలు అకస్మాత్తుగా పెరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం డీల్ లావాదేవీ విలువ రూ. 233 కోట్లు అని హిందీ వార్తా సంస్థ ఆజ్‌తక్ నివేదించింది. నిధుల సమీకరణ కోసం వొడాఫోన్ ఐడియా గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే కంపెనీ ఇంకా చాలా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నందున పొడిగింపును కోరుతుందని భావిస్తున్నారు. అలాగే భారత్‌లో 5జీ రోల్ అవుట్ కోసం ప్రణాళికను రూపొందిస్తోంది. 2022లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు సంబంధించి వొడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికమ్యూనికేషన్స్ విభాగానికి రూ.1700 కోట్లు చెల్లించింది. ఇది కంపెనీ షేర్హోల్డర్లలో నమ్మకాన్ని పెంచి, కంపెనీ షేర్ ధరను పెంచింది. వాటాదారుల సొమ్ము రెట్టింపు గత ఆరు నెలల్లో వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు 113 శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు, వాటాదారుల డబ్బును రెట్టింపు చేసింది. 2007లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి వొడాఫోన్ ఐడియా షేర్లకు 2023 ఉత్తమ సంవత్సరం. -
5జీ కోసం వీఐ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రాబోయే త్రైమాసికాల్లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించేందుకు, అలాగే 4జీ కవరేజీని విస్తరించడానికి భారీగా పెట్టుబడులు చేస్తుందని దిగ్గజ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా వెల్లడించారు. ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్తోసహా క్లిష్ట, అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ దృష్టిని సాకారం చేయాలని కంపెనీ నిశ్చయించుకుందని ఆయన చెప్పారు. జియోస్పేస్‌ఫైబర్.. మారుమూల ప్రాంతాలకు హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి భారత్‌లో మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సేవలైన జియోస్పేస్‌ఫైబర్‌ను విజయవంతంగా ప్రదర్శించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ సేవలు అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ జియో పెవీలియన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి జియోస్పేస్ ఫైబర్‌తో సహా కంపెనీ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత, ఉత్పత్తుల గురించి వివరించారు. -
వొడాఫోన్ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్ కోసం ల్యాబ్–యాజ్–ఏ–సరీ్వస్‌లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది. ఇంటర్ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్‌ల టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్‌లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు. -
వరల్డ్ కప్ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్‌లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్ ఐడియా (Vi) యాప్‌లో అందుబాటులో ఉంటాయి . డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్ రూ. 839 హీరో అన్లిమిటెడ్ ప్యాక్‌తోపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్‌ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్‌పై డబుల్ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది. ఇక రూ. 418 డేటా ప్యాక్‌పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీఐ యాప్‌లో కూపన్ కోడ్ల ద్వారా, వెబ్ పోర్టల్‌లో ఫ్యాన్కోడ్ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్‌లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్‌పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్ కప్ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్‌లు, ప్లాన్లను ప్రారంభించాయి. -
వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వీఐ మ్యాక్స్ ప్లాన్లలో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) కొత్తగా మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో రెండు కొత్త ఫీచర్లను జోడించింది. డేటా షేరింగ్, నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ పరిమితికి మించి 10 జీబీ నుంచి 25 జీబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు. దీన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక రాత్రి 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు ఉండే నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా ఫీచర్‌ని మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం మీద రూ. 601 మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లో 2 కనెక్షన్లతో 120 జీబీ డేటా పొందవచ్చు. అంతకు పైబడిన ప్లాన్లలో 325 జీబీ వరకు పొందవచ్చు. -
వొడాఫోన్ ఐడియాకు షాక్.. మూలిగే నక్కపై తాటికాయ అంటే ఇదే..
మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదే.. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్ షాకిచ్చింది. ఇబ్బందికరమైన కాల్స్, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ. కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది. -
ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన జియో.. పాపం వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్‌లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. -
కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా
న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అయ్యో వొడాఫోన్ ఐడియా! పాపం భారీ నష్టాలు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,296 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,656 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 10,407 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 128 నుంచి రూ. 139కు మెరుగుపడింది. -
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టాలు తగ్గి రూ. 6,419 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 6,513 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం పుంజుకుని రూ. 10,507 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం పెరిగి రూ. 29,298 కోట్లను తాకింది. 2021–22లో రూ. 28,234 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 38,490 కోట్ల నుంచి రూ. 42,134 కోట్లకు బలపడింది. క్యూ4లో వెచ్చించిన రూ. 560 కోట్లతో కలిపి గతేడాదిలో పెట్టుబడి వ్యయాలు రూ. 3,360 కోట్లకు చేరాయి. 2022 డిసెంబర్‌కల్లా రూ. 2,28,890 కోట్లుగా నమోదైన స్థూల రుణభారం మార్చికల్లా రూ.2,09,260 కోట్లకు తగ్గింది. క్యూ4లో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 124 నుంచి బలపడి రూ. 135ను తాకింది. సబ్స్క్రయిబర్ల సంఖ్య 7 శాతం తగ్గి 22.59 కోట్లకు చేరింది. కంపెనీలో ప్రభుత్వ వాటా 33.1 శాతంగా నమోదైంది. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి జారీ చేయడంతో రుణ భారం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 7 వద్ద ముగిసింది. -
ఇలా అయితే వొడాఫోన్ ఐడియా కథ కంచికే..
భారతదేశంలో అతి పెద్ద టెలికం సంస్థలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్(Airtel) గత మార్చి నెలలో భారీ సంఖ్యలో కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రమే రోజు రోజుకి తన యూజర్లను కోల్పోతూనే ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 మార్చి నెలలో రిలయన్స్ జియోకు 30.5లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు యాడ్ అయ్యారు. దీంతో జియో యూజర్ల సంఖ్య ఏకంగా 43 కోట్లు దాటింది. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 42.71 లక్షలుగా నమోదైంది. ఎయిర్టెల్ కూడా మార్చి నెలలో 10.37లక్షల కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. ఈ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్యతో మొత్తం యూజర్ల సంఖ్య 37.09 కోట్లకు చేరింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 36.98 కోట్లుగా ఉండేది. ఈ రెండు సంస్థలు మార్చిలో మంచి వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి. ఇక వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ యూజర్లు క్రమంగా తగ్గుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 12.12 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియా సబ్స్కైబర్ల సంఖ్య 23.67 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 23.79 కోట్లుగా ఉండేది. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) మరింత మంచి వృద్ధిని పెంచుకోవడానికి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించడానికి జియో, ఎయిర్టెల్ రెండూ 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. అంతే కాకుండా రూ.239 అంతకన్నా ఎక్కువ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 5జీ ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్‌పై ఉచితంగా అన్లిమిడెట్ డేటా అందిస్తున్నాయి. (ఇదీ చదవండి: మళ్ళీ ఇండియాకు రానున్న చైనా బ్రాండ్ ఇదే - ఇషా అంబానీ అంటే మినిమమ్ ఉంటది!) జియో, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పరుగులు పెడుతుంటే వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 5జీ నెట్వర్క్ లాంచ్ చేయనేలేదు. 5జీ నెట్వర్క్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పైగా ఉన్న యూజర్లను కూడా కంపెనీ కోల్పోతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో వొడాఫోన్ ఐడియాకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. -
ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!
మనదేశంలో ప్రముఖ టెలికాం సర్వీసులైన జియో, ఎయిర్ టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పుట్టుకొస్తున్నాయి. 5జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలతో పోటీ పడటంలో వోడాఫోన్ ఐడియా కొంత వెనుకపడ్డాయి. ఈ కారణంగా ఈ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వోడాఫోన్, ఐడియా కొత్త ప్లాన్లు, ఆఫర్స్ తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువగా జియో సేవలకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించడానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 5జీబీ డేటా ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆఫర్ కింద రూ. 299తో గానీ అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్ పొందవచ్చని వోడాఫోన్ ఐడియా ప్రకటించాయి. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న మూడు రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 199 నుంచి రూ. 299 మధ్య ఉన్న వివిధ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వారికి 2జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ డేటాతో మీరు వీఐ మూవీస్, టీవీ, వీఐ మ్యూజిక్, వీఐ గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ మొదలైనవి వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించి, దీని ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ అందించింది. ఇందులో అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఓటీటీ బెనిఫీట్స్ వంటివి ఇందులో అందుబాటులో ఉండేవి, దీనికి ఆశించినంత ఆదరణ లేకపోవడం వల్ల సంస్థ దీనిని నిలిపివేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఓటీటీ బెనిఫిట్స్‌తో వొడాఫోన్ ఐడియా కొత్తప్లాన్స్, రోజుకి 2 జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను ప్రకటించింది. జియో, ఎయిర్టెల్ లాంటి దిగ్గజాలతో పోలిస్తే 5జీ సేవల్లో వెనుకబడి ఉన్న వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. త్వరలో 5జీని తీసుకు రావాలని యోచిస్తున్నట్లు హామీ ఇచ్చిన కంపెనీ తాజాప్లాన్లు ప్రకటించడం విశేషం. (Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!) యాక్టివ్ కస్టమర్ బేస్‌ను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా,రూ 368, రూ 369 ధరలతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య ఉన్న తేడా ఏంటంటే.. వొడాఫోన్ ఐడియా రూ.368 అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎంఎస్ ఉచితం. వాలిడిటీ 30 రోజులు. అంటే టోటల్‌గా 60జీబీ డేటాని వినియోగదారులు ఎంజాయ్ చేయొచ్చు. దీంతోపాటు 30 రోజులు చెల్లుబాటు అయ్యేలా సన్‌నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ సబ్స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) వొడాఫోన్ ఐడియా రూ.369 ఈప్లాన్లోకి రూ.368 ప్లాన్ లాంటి ప్రయోజనాలే లభ్యం. కానీ బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్, టీవీ యాప్స్, ప్రతినెల 2జీబీ వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని క్లెయిమ్ చేయడానికి 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) -
నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి కేకే మహేశ్వరి రాజీనామా.. కారణం ఇదే!
వోడాఫోన్ ఐడియా బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'కృష్ణ కుమార్ మహేశ్వరి' తన పదవికి రాజీనామా చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 19న రాజీనామా చేసినట్లు తెలిసింది. కెకె మహేశ్వరి రాజీనామా చేయడానికి గల కారణాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ మహేశ్వరి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మహేశ్వరి వోడాఫోన్ ఐడియా బోర్డులో చేరటానికి ముందు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. (ఇదీ చదవండి: వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పిల్లల హవా! ఒకరిని మించి మరొకరు..) నష్టాల్లో మునిగిపోయిన టెలికాం కంపెనీలో కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సమ్మేళనానికి 18 శాతం వాటా ఉంది. 2022 మార్చి 03న వొడాఫోన్ ఐడియా బోర్డులోకి నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. జులైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూండ్రా నియమితులు కాగా, హిమాన్షు కపానియా ఆగస్టులో టక్కర్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!
వోడాఫోన్ కస్టమర్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారతదేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వోడాఫోన్ సిద్ధమవుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా ఓ వార్తాచానెల్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ధ్రువీకరించారు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) వోడాఫోన్ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను వేగంగా కోల్పోతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. రాబోయే 5జీ సేవల కోసం వోడాఫోన్ మోటరోలా, షావోమీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం వోడాఫోన్ భారతదేశంలో 4జీ సేవలను మాత్రమే అందిస్తోంది. దేశంలో 5జీ సేవలను ఇప్పటివరకూ ప్రారంభించని ఏకైక టెలికాం కంపెనీ ఇదే. జియో, ఎయిర్టెల్ రెండూ ఇప్పటికే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత్‌లో వోడాఫోన్ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేది స్పష్టం చేయలేదు. దేశంలో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకు వొడాఫోన్ ఐడియా క్రమంగా కస్టమర్లను కోల్పోతున్న క్రమంలో ఈ ప్రకటన వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి వోడాఫోన్ 42.4 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2022 డిసెంబర్ నాటికి 12 నెలల వ్యవధిలో 24.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్-బేస్ కోతను చవి చూసింది. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా రూ. 7,990 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 7,595.5 కోట్లు. అయితే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.10,620.6 కోట్లు కాగా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.10,614.6 కోట్లు. ఎయిర్టెల్, జియో 5జీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దూసుకెళ్తుంటే వోడాఫోన్ ఐడియా వెనుకబడి ఉంది. ఏది ఏమైనప్పటికీ త్వరలో 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు వోడాఫోన్ ఐడియా ప్రకటించడం వల్ల కోల్పోయిన కస్టమర్లను తిరిగి పొందడంలో కొంతైనా సహాయపడవచ్చు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
వొడా–ఐడియా యాప్‌తో మహిళలకు ఉద్యోగావకాశాలు
ముంబై: జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ అప్నాతో కలిసి తమ యాప్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) తెలిపింది. దీని ద్వారా టీచర్ల నుంచి టెలీకాలర్లు, రిసెప్షనిస్టుల వరకూ వేల సంఖ్యలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే, టెలీ–కాలర్లు కాద ల్చుకునే మహిళలకు రూ. 5,000 డిస్కౌంటుతో ప్లేస్మెంట్ గ్యారంటీ శిక్షణ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తున్నామని వివరించింది. అటు ఎన్గురుతో కలిసి 50 శాతం డిస్కౌంటుతో ఇంగ్లీష్ శిక్షణా కోర్సులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు మార్చి 14 వరకూ వీఐ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. -
వొడాఫోన్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఓటీటీ ఆఫర్ తెలిస్తే..!
సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా మరో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. వీఐ మ్యాక్స్ 401 సౌత్ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను అందిస్తోంది. రూ. 401 ధరతో ఇప్పటికే ఇలాంటి ప్లాన్ ఉన్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌ను అదనంగా అందించడం ఇందులోని ప్రత్యేకత ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లోకల్ కంటెంట్‌ని ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది గొప్ప ప్లాన్. ఈ ప్లాన్ ఆఫర్లు, వాలిడిటీ వాలిడిటీ నెల, నెలకు 50 జీబీ డేటా, 3000 ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అదనంగా 50జీబీడేటా కూడా లభ్యం. దీంతో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, సన్ నెక్ట్స్ (SunNXT) ప్రీమియం HD OTT సభ్యత్వం ఉచితం. ఏడాదికి రూ. 799 విలువైన సన్ నెక్ట్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఇందులో సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా Vi మూవీలు, టీవీ యాప్ VIP యాక్సెస్, ZEE5 ప్రీమియమ్‌కి ఉచిత యాక్సెస్, హంగామా మ్యూజిక్, Vi యాప్ వంటి మరిన్ని ప్రయోజనాలున్నాయి. వీఐ రూ.401 సౌత్ ప్లాన్ వివరాలివే ఈ ప్లాన్ ఆన్లైన్ కొనుగోలు కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అదనపు 50 జీబీతో 1 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటాతో (ఉదయం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు), అన్లిమిటెడ్ కాలింగ్, నెలకు 3000 SMSలతో 200GB నెలవారీగా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ రూ.799 విలువైన SunNXT 12 నెలల ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇపుడున్న రూ.401 ప్లాన్‌కి, దీనికి తేడా ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 401 ప్లాన్ పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ తేడా ఏంటి అంటే సన్ నెక్ట్స్ సబ్‌స్క్రిప్షన్‌కు బదులుగా, రూ. 599 విలువైన సోనీ లివ్ మొబైల్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రెండూ వీఐ వెబ్సైట్ , వీఐ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. -
ఫిషింగ్ కట్టడికి తాన్లా పరిష్కారం
బార్సిలోనా: ఈ–మెయిల్స్, మొబైల్‌కు సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్‌ను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజూ చూస్తున్నాం. ఇలాంటి ఫిషింగ్ సందేశాలు సబ్స్క్రైబర్లకు చేరకుండా నిరోధించే టెక్నాలజీని క్లౌడ్ కమ్యూనికేషన్స్ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్–2023 సందర్భంగా ఈ సాంకేతికతను ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘యాంటీ–ఫిషింగ్‌కు పరిష్కారాన్ని భారత్‌లో అభివృద్ధి చేశాం. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. తాన్లా యాంటీ–ఫిషింగ్ ప్లాట్‌ఫామ్ ఒక నిమిషంలో మోసాన్ని గుర్తిస్తుంది. ఈ సాంకేతికత కోసం అంతర్జాతీయంగా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఫౌండర్, చైర్మన్, సీఈవో డి.ఉదయ్ రెడ్డి తెలిపారు. మోసగాళ్లను ఏరివేయడానికి నియంత్రణ సంస్థలకు ఇది సాయపడుతుందని అన్నారు. వాయిస్ కాల్ ఆధారిత మోసాలకు చెక్ పెట్టేందుకు సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీనిని వచ్చే రెండు త్రైమాసికాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. 30 కోట్ల మందికి ముప్పు.. భారత్‌లో కంపెనీ అంచనాల ప్రకారం దాదాపు 30 కోట్ల మంది ఫిషింగ్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ‘వీరిలో 5 లక్షల మంది మోసపోయే చాన్స్ ఉంది. బాధితుల్లో 7% మంది మాత్రమే వివిధ కారణాల వల్ల నేరం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఫేక్ ఎలక్ట్రిసిటీ బిల్ అలర్ట్, నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ వంటి 10–11 పద్ధతుల్లో ఫిషింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిమ్, యాప్స్‌ను మోసగాళ్లు వేదికగా చేసుకుంటున్నారు. స్కామ్ సందేశాలు వినియోగదారులకు చేరకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఈ టెక్నాలజీని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో మాత్రమే కాకుండా గూగుల్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో కూడా అనుసంధానించాం. ఫిషింగ్ సైట్స్‌ను నిరోధించే కొన్ని సర్వీస్ ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం చేసుకున్నాం’ అని వివరించారు. -
వొడాఫోన్ కొత్త ప్లాన్: జియో, ఎయిర్టెల్ తరహాలోనే, ఏది బెటర్?
సాక్షి,ముంబై:వొడాఫోన్ ఇండియా సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియోకు చెందిన రూ.296 రీచార్జ్ ప్లాన్లకు దీటుగా తాజా బల్క్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్ రూ.296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు 25 జీబీ బల్క్ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వీఐ మూవీస్, టీవీని ఎంజాయ్ చేయవచ్చు కానీ, వివో అన్లిమిటెడ్ ప్రయోజనాలుండవు. ఎయిర్టెల్ రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి -
వొడాఫోన్ ఐడియా నష్టాలు అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో మొబైల్ టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర నష్టం పెరిగి రూ. 7,990 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,234 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతంపైగా బలపడి రూ. 10,621 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. రూ. 9,717 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో కంపెనీ రూ. 16,133 కోట్లమేర (స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై) చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం ఈక్విటీగా మారి్పడి చేసుకుంది. దీంతో వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం 33 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించింది. మరోపక్క కంపెనీ బోర్డు ఏటీసీ ఇండియాకు రూ. 1,600 కోట్ల విలువైన అప్షనల్లీ కన్వరి్టబుల్ డిబెంచర్ల జారీకి ఆమోదించింది. కాగా, తాజా సమీక్షా కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 17 శాతంపైగా మెరుగై రూ. 135ను తాకింది. మొత్తం కస్టమర్ల సంఖ్య 23.44 కోట్ల(క్యూ2) నుంచి 22.86 కోట్లకు నీరసించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 7.70 వద్ద ముగిసింది. -
‘మీకో దణ్ణం! నాకు ఫోన్ చేయొద్దు’.. జెట్ ఎయిర్ వేస్ సీఈవో అసహనం!
9 ఏళ్ల నుంచి మీ నెట్ వర్క్ వినియోగిస్తున్నా. ఇక నుంచి వేరే నెట్ వర్క్‌కు మారుతున్నా. దయచేసి నాకు ఫోన్ చేయకండి అంటూ ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ఓ టెలికం కంపెనీ కస్టమర్ కేర్ నిర్వాహకంపై అసహననానికి గురయ్యారు. అందుకు ఓ కారణాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్ వేదికగా చివాట్లు పెట్టారు. జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ 9 ఏళ్ల నుంచి దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ నెట్ వర్క్ పనితీరు మందగించడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సంజీవ్ కపూర్‌కు సైతం ఈ తరహా ఇబ్బంది తలెత్తింది. ఆదివారం నెట్ వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, అదే సమయంలో కస్టమర్ కేర్ నుంచి వరుస కాల్స్ రావడంతో ఇరిటేట్ అయ్యారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ట్విటర్ వేదికగా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫోన్ చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ప్రియమైన @ViCustomerCare: నెట్ వర్క్ మారవద్దని నన్ను ఒప్పించేందుకు పదే పదే కాల్స్ చేస్తున్నారు. అలా కాల్ చేయడం మానేయండి. నేను 9 సంవత్సరాల తర్వాత నెట్ వర్క్ ఎందుకు మారుతున్నానో మీకు చెప్పాను. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కవరేజీ తక్కువగా. కొందరికి రోమింగ్ కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. అంతే. ధన్యవాదాలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు వీఐ కస్టమర్ కేర్ విభాగం స్పందించింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అని రిప్లయి ఇచ్చింది. ఆ ట్వీట్‌కు సంజీవ్ రిప్లయి ఇచ్చారు. @ViCustomerCare దయచేసి నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించకండి. నిన్నటి నుండి నాకు డజను కాల్స్ వచ్చాయి. ఫోన్ చేయడం ఆపండి, అంతే! అని అన్నారు. అయినా సరే వీఐ కస్టమర్ కేర్ విభాగం సంజీవ్ కపూర్‌కు మరోసారి ఫోన్ చేసి విసిగించింది. దీంతో ఏం చేయాలో పోక...మా నెట్ వర్క్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఫోన్ వచ్చింది. ఇది మంచి పద్దతి కాదు. ఫోన్ చేయడం ఎప్పుడు ఆపేస్తారో.. వీఐ యాజమాన్యం ఉన్నతాధికులు ట్విటర్లో ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తూ మరోసారి ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. Dear @ViCustomerCare : please stop calling me repeatedly trying to convince me not to switch carriers. I have told you why I am switching after 9 years: 1. Poor coverage in some parts of India, and 2. Inferior international roaming plans for some countries. That's all. Thanks. — Sanjiv Kapoor (@TheSanjivKapoor) February 12, 2023 Hi Sanjiv! I can understand this has caused difficulties for you. I’ve made a note of your concern. Will get in touch with you shortly - Vandana https://t.co/fuKV0H8zIF — Vi Customer Care (@ViCustomerCare) February 12, 2023 -
వొడాఫోన్‌లో ప్రభుత్వానికి భారీ వాటా
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా వడ్డీ బకాయిల చెల్లింపుకింద ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఈక్విటీని జారీ చేయనుంది. సుమారు రూ. 16,133 కోట్లకుగాను రూ. 10 ముఖ విలువగల దాదాపు 1,613.32 కోట్ల షేర్లను కేటాయించనుంది. స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) వాయిదా, స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులపై వడ్డీ కింద వొడాఫోన్ ఐడియా ఈక్విటీ కేటాయింపునకు ప్రతిపాదించింది. ఇందుకు తాజాగా కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. వెరసి వడ్డీ.. ఈక్విటీగా మార్పు చెందనుంది. ఇది కంపెనీ మొత్తం విస్తారిత ఈక్విటీలో 33.44 శాతం వాటాకు సమానంకానుంది. కంపెనీ మొత్తం చెల్లించిన మూలధన రూ. 48,252 కోట్లను మించనుంది. కంపెనీలో ప్రమోటర్లు వొడాఫోన్ గ్రూప్ వాటా 32.29 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 18.07 శాతానికి చేరనున్నాయి. 2018లో విలీనం తదుపరి 43 కోట్ల మొబైల్ వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా 35 శాతం మార్కెట్ వాటాను పొందింది. తద్వారా అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంస్థ ప్రస్తుతం 24.3 కోట్లమంది కస్టమర్లతో 21.33 శాతానికి మార్కెట్ వాటాకు పరిమితమై మూడో ర్యాంకుకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ షేరు బీఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 7.94 వద్ద ముగిసింది. -
వొడా ఐడియాకు ఊరట.. ప్రభుత్వానికి మెజారిటీ వాటా!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కట్టాల్సిన రూ. 16,133 కోట్ల వడ్డీ బాకీలను ఈక్విటీ కింద మార్చుకునే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. స్పెక్ట్రం వాయిదాలు, సవరించిన స్థూల లాభాలపై కట్టాల్సినది (ఏజీఆర్) కలిపి ప్రభుత్వానికి వీఐఎల్ భారీగా బాకీ పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను వాటాగా కేటాయించింది. దీంతో రూ.10 షేర్ విలువతో రూ.16,133 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేంద్రానికి బదిలీ చేసింది. తమ భాకీలను ఈక్విటీగా మార్చుకుంటే తమ సంస్థలో ప్రభుత్వానికి 33.14 శాతం వాటా లభించగలదని వీఐఎల్ గతంలో తెలిపింది. పలు కారణాలతో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే తాజాగా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ టెలికాం రంగంలో బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జియో దెబ్బకు ఈ రంగంలోని పలు టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకాయిలు కూడా టెలికాం రంగం ఇబ్బందులను మరింత పెంచాయి. చదవండి: అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ -
వొడాఫోన్‌కు 2023 కీలక సంవత్సరం కానుంది!
న్యూఢిల్లీ: టెలికం రంగానికి 2023 చాలా కీలక సంవత్సరంగా ఉండనుందని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది. పరిశ్రమలో లాభసాటైన మూడో సంస్థగా కొనసాగగలదా లేదా అనే కోణంలో వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ఇది నిర్ణయాత్మకమైన ఏడాదిగా ఉండనుందని తెలిపింది. అలాగే డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు ఆధారిత ఆదాయ వృద్ధి .. పరిశ్రమకు కీలకంగా ఉంటుందని ఒక నివేదికలో సీఎల్ఎస్ఏ వివరించింది. దీని ప్రకారం 2023లో దేశీ మొబైల్ మార్కెట్లో 5జీ సేవల విస్తరణ, టారిఫ్‌ల పెంపు, రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ మొదలైనవి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను అనుమతించిన పక్షంలో వ్యాపార సంస్థలకు ఇచ్చే 5జీ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చే ఆదాయాలకు కొంత గండి పడే అవకాశం ఉంది. 2022లో 14 శాతం పెరిగిన దేశీ మొబైల్ రంగం ఆదాయం 2023లో కూడా దాదాపు అదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. టారిఫ్‌ల పెంపు, డేటా వినియోగం పెరుగుదల ఇందుకు తోడ్పడనున్నాయి. టారిఫ్‌లను పెంచే విషయంలో భారతి ఎయిర్టెల్ అన్నింటికన్నా ముందు ఉండవచ్చని.. వీఐఎల్, రిలయన్స్ జియో దాన్ని అనుసరించవచ్చని సీఎల్ఎస్ఏ నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోను, బకాయిలకు బదులు కేంద్రానికి వాటాలు ఇచ్చే ప్రతిపాదనల అమల్లో జాప్యాల కారణంగా వీఐఎల్ ఆర్థిక సంక్షోభం అవకాశాలు పూర్తిగా సమసిపోలేదని తెలిపింది. వీఐఎల్ మార్కెట్ వాటా తగ్గుతూ జియో, ఎయిర్టెల్ మార్కెట్ పెరగడం కొనసాగవచ్చని సీఎల్ఎస్ఏ వివరించింది. మొత్తం మీద యూజర్లపై వచ్చే సగటు ఆదాయం, డేటా వినియోగం పెరగడం ద్వారా టెలికం పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రూ. 2,84,600 కోట్లకు చేరవచ్చని తెలిపింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్
ముంబై: డేటా వినియోగం, 4జీ కనెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది. వీటి దన్నుతో క్యూ3లో టెల్కోల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 3-4 శాతం వృద్ధి నమోదు చేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒరిస్సా, హర్యానాలో ఆవిష్కరించిన రేట్ల పెంపును భారతి ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లలోనూ అమలు చేసి, పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పడితే నాలుగో త్రైమాసికంలో సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయం 5 శాతం పైగా వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) దిగువ స్థాయిలో రేట్ల పెంపును ఎయిర్టెల్ రెండు సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేసిన పక్షంలో టెలికం రంగం ఆదాయ వృద్ధిపై పెద్దగా అర్థవంతమైన ప్రభావమేమీ ఉండకపోవచ్చని బీఎన్పీ పారిబా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ, దాన్ని ఇతర సర్కిళ్లకూ విస్తరిస్తే, పోటీ కంపెనీలు కూడా అనుసరిస్తే మాత్రం 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయాలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనూ త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్) టెలికం పరిశ్రమ ఆదాయాలు 3-4 శాతం స్థాయిలో వృద్ధి చెందాయి. నవంబర్ ఆఖర్లో అమలు చేసిన రేట్ల పెంపు ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ సానుకూలంగా కొనసాగింది. ఇక రెండో త్రైమాసికంలో కస్టమర్లు పెద్ద డేటా ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ అవుతుండటం ఆదాయాల వృద్ధికి కలిసి వచ్చింది. జియో, వొడా ఐడియా కీలకం.. పరిశ్రమలో పరిస్థితులను అంచనా వేసుకునేందుకు ఎయిర్టెల్ ఈ నెల తొలినాళ్లలో ఒరిస్సా, హర్యానాలో కనీస టారిఫ్‌ను ఏకంగా 57 శాతం పెంచి రూ. 155కి చేసిన సంగతి తెలిసిందే. పోటీ కంపెనీల ప్రతిస్పందనను కూడా చూసిన తర్వాత ఈ పెంపును కొనసాగించడం లేదా పూర్వ స్థాయికి తగ్గించడం గురించి తగు నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎయిర్టెల్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ మిగతా కంపెనీలు కూడా అదే బాట పడితే మాత్రం టారిఫ్‌ల పెంపును ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఎయిర్టెల్ చర్యలకు ప్రతిస్పందనగా జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) ఎంత మేర టారిఫ్‌లు పెంచుతాయనే దానిపై జనవరి–మార్చి త్రైమాసికంలో టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి ఆధారపడి ఉంటుందని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్ తన బేస్ ప్యాక్ టారిఫ్‌ల పెంపును ఎంత వేగంగా మిగతా సర్కిళ్లకు విస్తరిస్తుంది .. జియో, వీఐ తమ కనీస రీచార్జ్ ప్లాన్లను రూ. 99 నుండి రూ. 125 స్థాయికి పెంచుతాయా లేదా ఎయిర్‌టెల్‌కు సమానంగా నేరుగా రూ. 155కి పెంచేస్తాయా అనే అంశాలతో ఆదాయాలు ప్రభావితం కాగలవని వారు పేర్కొన్నారు. విక్రేతల మార్కెట్.. విశ్లేషకుల అంచనాలు ఒకవేళ పోటీ కంపెనీలు కూడా ఎయిర్‌టెల్‌ను అనుసరించిన పక్షంలో టెలికం పరిశ్రమ.. విక్రేతల మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సందర్భంలో రేట్లను వినియోగదారుల డిమాండ్ కాకుండా విక్రేతలే నిర్దేశించే అవకాశం ఉంటుంది. టెలికం రంగంలో ఇలాంటి పరిస్థితి కనిపించి దాదాపు దశాబ్ద కాలం పైగా గడిచిపోయింది. రేట్లను నిర్దేశించే శక్తి కంపెనీల దగ్గర ఉన్నప్పుడు ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు ఎంచుకునేందుకు ప్రత్యా మ్నాయ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు, టారిఫ్‌ల పెంపునకు ఇక్కడితో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో మరో విడత పెంపు అవసరం ఉంటుందని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. రేట్లను పెంచుతున్నా త్రైమాసికాల వారీగా టెల్కోల యూజర్ల స్థాయి దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుండటంతో.. టారిఫ్‌లను మరింతగా పెంచేందుకు టెలికం సంస్థలకు అవసరమైన ధీమా లభించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
వొడాఫోన్ ఓసీడీల జారీకి చెక్, ముగిసిన గడువు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా ప్రతిపాదిత ఐచ్చిక మార్పిడిగల డిబెంచర్ల(ఓసీడీలు) జారీకి తాజాగా చెక్ పడింది. మొబైల్ టవర్ల సంస్థ ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీల జారీకి కంపెనీ గతంలో ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఇందుకు గడువు తిరిపోయినట్లు మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వడ్డీబకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఏటీసీ టెలికంకు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 1,600 కోట్ల విలువైన ఓసీడీలను జారీ చేసేందుకు గత నెలలో వొడాఫోన్ ఐడియా వాటాదారులు అనుమతించారు. అయితే వీటిని 15 రోజుల్లోగా జారీ చేయవలసి ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. అంతకంటే ముందు ప్రభుత్వానికి 16వేల రూపాయల కోట్ల వడ్డీ(స్పెక్ట్రమ్, ఏజీఆర్) బకాయిలకుగాను ఈక్వీటీని జారీ చేయవలసి ఉన్నట్లు వివరించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఏటీసీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అవసరానుగుణంగా వాటాదారుల నుంచి మరోసారి అనుమతి తీసుకోనున్నట్లు పేర్కొంది. చెక్ -
ఫిఫా వరల్డ్‌కప్ 2022: అదిరిపోయే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: క్రమేపీ యూజర్లను కోల్పోతున్న టెల్కో వోడాఫోన్ ఐడియా ఫిఫా ప్రపంచకప్- 2022 సందర్భంగా కొత్త ప్లాన్లలను ప్రకటించింది. ఫుట్‌బాల్ ప్రియులను ఆకట్టుకునేలా వోడాఫోన్ ఐడియా ఐదు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను తీసుకొచ్చింది. జియో ప్లాన్ల మాదిరిగానే వీఐ కూడా అయిదు ప్లాన్లను తీసుకొచ్చింది. ఖతార్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న వినియోగ దారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. వీఐ వెబ్సైట్, లేదా వీఐ యాప్ ద్వారా వీటిని కొనుగోలు చేయ వచ్చని తెలిపింది. రూ. 2,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్ , వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వినియోగదారులకు లోకల్ కాల్స్, ఇండియా అవుట్గోయింగ్ కాల్స్ కోసం 200 నిమిషాల టాక్ టైమ్‌ను వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా, ఉచిత ఇన్కమింగ్ కాల్స్, 25 SMSలు ఉచితం. అదనంగా, వినియోగదారులకు 2 జీబీ డేటా కూడా. రూ. 3,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్ , వాయిస్ కాల్స్ 10 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 300 నిమిషాల టాక్ టైమ్ వాడుకోవచ్చు, ఇందులో భారతదేశానికి స్థానిక, అవుట్గోయింగ్ కాల్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు 3 జీబీ డేటా , 50 ఎస్ఎంఎస్లు అదనం. రూ. 4,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ 14 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారులకు భారతదేశానికి 500 నిమిషాల లోకల్ , అవుట్గోయింగ్ కాల్స్. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్. అదనంగా 50 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ. 5,999 రోమింగ్ ప్లాన్: అన్ని ప్లాన్లలో అత్యంత ఖరీదైన ప్లాన్ ఇది. ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్, 500 నిమిషాల స్థానిక, భారతదేశానికి అవుట్గోయింగ్ కాల్స్ అందిస్తుంది. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్. అదనంగా 100 50 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇతర దేశాలకు కాల్స్ చేయడానికి సబ్స్క్రైబర్లకు నిమిషానికి రూ.35 వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!
న్యూఢిల్లీ: టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్‌లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జియో యూజర్లు సెప్టెంబర్‌లో పెరిగినప్పటికీ ఆగస్టుతో పోలిస్తే (32.81 లక్షలు) మాత్రం తగ్గింది. ఇక తాజాగా సెప్టెంబర్‌లో మొత్తం అన్ని టెల్కోల వైర్లెస్ యూజర్ల సంఖ్య 36 లక్షల మేర తగ్గింది. ఆగస్టు ఆఖరు నాటికి ఇది 114.91 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ ఆఖరు నాటికి 114.54 కోట్లకు పడిపోయింది. -
4జీ స్పీడ్, మరోసారి టాప్‌లో జియో
న్యూఢిల్లీ: అతి వేగవంతమైన 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అక్టోబరు 4జీ స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. జియో సగటు 4G డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. (మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్) సగటు డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి నెలకొంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ డౌన్లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో 4జీ సగటు డౌన్లోడ్ వేగం 5 Mbps ఎక్కువ. (త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన) సగటు 4G అప్లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్టెల్ అప్లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ అప్లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్టెల్ అప్లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది. -
వొడాఫోన్‌కు తప్పని నష్టాలు..ఏడు వేల కోట్లకుపైగా నష్టాలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. రూ. 7,596 కోట్లకు చేరాయి. గత క్యూ2లో ఇవి రూ. 7,132 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం సుమారు 13 శాతం పెరిగి రూ. 9,406 కోట్ల నుంచి రూ. 10,614 కోట్లకు చేరింది. యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 19.5 శాతం పెరిగి రూ. 131కి చేరింది. సమీక్షాకాలంలో వొడాఫోన్ ఐడియా మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 24 కోట్ల నుంచి 23.44 కోట్లకు తగ్గినప్పటికీ 4జీ యూజర్ల సంఖ్య 15 లక్షలు పెరిగి 12 కోట్లకు చేరింది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం (లీజులకు చెల్లించాల్సినది కాకుండా) రూ. 2,20,320 కోట్లకు చేరింది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించిన మొత్తం రూ. 1,36,650 కోట్లు (ఇటీవల కొన్న స్పెక్ట్రం కోసం కట్టాల్సిన రూ. 17,260 కోట్లు సహా), సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 68,590 కోట్లు ఉన్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ. 15,080 కోట్లు కట్టాలి. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు 0.6 శాతం పెరిగి రూ. 8.6 వద్ద ముగిసింది. -
తెలుగు రాష్ట్రాల్లో వొడా ఐడియా నెట్వర్క్ అప్‌గ్రేడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు మరింత మెరుగైన 4జీ సర్వీసులను అందించేందుకు నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్-ఐడియా (వీఐ) వెల్లడించింది. 1800 మెగాహెట్జ్ రేడియో తరంగాలను రెట్టింపు స్థాయిలో వినియోగంలోకి తేవడంతో డేటా డౌన్లోడ్, అప్లోడింగ్ మరింతగా వేగవంతంగా ఉంటుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 4జీకి సంబంధించి సమర్ధమంతమైన 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఏకైక ప్రైవేట్ టెల్కో తమదేనని వివరించింది. 2018 సెప్టెంబర్ నుంచి 11035 బ్రాడ్‌బ్యాండ్ టవర్లను ఏర్పాటు/అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ క్లస్టర్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ జైన్ చెప్పారు. -
‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీని పెంచాలని, ప్రస్తుతం ఉన్న ఫోన్లను 5జీకి అప్ గ్రేడ్ అయ్యేలా సాఫ్ట్వేర్లను డిజైన్ చేయాలని స్మార్ట్ ఫోన్ సంస్థలైన యాపిల్, శాంసంగ్‌తో పాటు ఇతర కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమంలో ప్రధాని మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభం అవ్వగా.. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఈ సేవల్ని వినియోగించుకునే సౌలభ్యం కలగనుందని టెలికం సంస్థలు తెలిపాయి. చదవండి👉 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే 5జీ సేవలు ప్రారంభమైనా..వాటి వినియోగం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే? 4జీ స్మార్ట్ ఫోన్లలో 5జీని ఉపయోగించుకునే వెసలుబాటు లేదు కాబట్టి. ఈ తరుణంలో కేంద్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. 5జీ ఫోన్లు కావాలి ఈనేపథ్యంలో మంగళవారం.. కేంద్ర టెలికమ్యూనికేషన్లు, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల అధ్యతన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు యాపిల్,శాంసంగ్,వివో,షావోమీలతో పాటు దేశీయం టెలికం సంస్థలు రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోఫోన్ ఐడియాలతో సమావేశం జరిగింది. ఇందులో ఉన్నతాధికారులు.. ఫోన్ తయారీ కంపెనీలకు.. దేశంలో వీలైనంత త్వరగా 5జీ ఫోన్లను తయారు చేయడం, లేదంటే ప్రస్తుతం ఉన్న ఫోన్లనే 5జీని వాడుకునేలా అప్‌గ్రేడ్ చేయాలని కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది. నో 5జీ ఎయిర్టెల్ తన అఫీషియల్ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ సిరీస్ 12 నుండి 14 ఫోన్ల వరకు 5జీని వాడుకునేలా అప్‌గ్రేడ్ చేయలేదని స్పష్టం చేసింది. శాంసంగ్‌కు చెందిన ఎక్కువ శాతం ఫోన్లలో ఈ లేటెస్ట్ జనరేషన్ నెట్వర్క్ సదుపాయం లేదని పేర్కొంది. షావోమీ, వివోకు చెందిన మూడు డజన్లకు పైగా మోడల్లో ఎయిర్టెల్ 5జీ సేవల్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు హైలెట్ చేసింది. చివరిగా, టెలికాం కంపెనీలు, స్మార్ట్‌ఫోన్ సంస్థల మధ్య పరస్పరం చర్చలు జరుపుతున్నప్పటికీ, భారతదేశంలోని టెలికాం కంపెనీల నిర్దిష్ట 5జీ సాంకేతికత,ఫోన్లలో సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసేలా అప్‌గ్రేడ్ చేసేందుకు మరింత సమయం పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్‌లో టెలికం కంపెనీలపై పన్నుల మోత
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్‌లో టెలికం కంపెనీలపై పన్నుల మోత ఉంటోందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ్ ముంద్రా వ్యాఖ్యానించారు. పెట్టుబడులు భారీగా అవసరమయ్యే టెలికం పరిశ్రమపై ఇది మరింత భారం మోపుతోందని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించి, దాన్ని టెలికం నెట్‌వర్క్‌లపై తిరిగి ఇన్వెస్ట్ చేసే విధంగా పరిశ్రమపై ప్రభుత్వం పన్నుల భారం తగ్గించాలని పేర్కొన్నారు. టెలికం పరిశ్రమ 18 శాతం జీఎస్టీ, ఇతరత్రా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలతో పాటు స్పెక్ట్రం కొనుగోలు కోసం వెచ్చించినదంతా పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా 58 శాతం పన్నులు కట్టినట్లవుతుందని ముంద్రా చెప్పారు. -
పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీడియా నివేదికల ప్రకారం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీకి చెందిన 25 కోట్ల మంది కస్టమర్లు భవిష్యత్తులో భారీ షాకే తగలనుంది. కంపెనీ అప్పులు చెల్లించకపోవడంతో ఈ ముప్పు ఏర్పడింది. ఇండస్ టవర్స్ వొడాఫోన్-ఐడియా హెచ్చరించిన వైనం ఇపుడు సంచలనంగా మారింది. (హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0) విషయం ఏమిటంటే.. టెల్కో వొడాఫోన్ ఐడియా ఇండస్ టవర్స్‌కు దాదాపు రూ. 7000 కోట్లు బకాయిపడింది. వీలైనంత త్వరగాఈ రుణాన్ని చెల్లించకపోతే, నవంబర్ నాటికి టవర్లనుఉపయోగించడాన్ని నిలిపివేస్తామని ఇండస్ టవర్స్ హెచ్చరించింది. ఈ చెల్లింపుల విషయంలో వొడాఫోన్-ఐడియా విఫలమైతే మొబైల్ నెట్‌వర్క్‌లను మూసి వేస్తుంది. ఫలితంగా యూజర్లకు కష్టాలు తప్పవు. (Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో!) సోమవారం ఇండస్ టవర్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కంపెనీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్బంగా సుమారు 7,000 కోట్ల రూపాయల బకాయిలను గుర్తించింది. దీనిపై ఆందోళన చెందిన డైరెక్టర్లు బకాయిల చెల్లింపుపై లేఖ రాశారు. ముఖ్యంగా ప్రస్తుత నెలవారీ బకాయిలలో 80 శాతం వెంటనే చెల్లించాలని వొడాఫోన్ ఐడియాకు సూచించినట్లు జాతీయ మీడియా నివేదించింది. నెలవారీ బకాయిల్లో 100 శాతం "సకాలంలో" చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కాగా కంపెనీ మొత్తం టవర్ బకాయిలు రూ. 10,000 కోట్లు మించిపోయాయి. ఇందులో కేవలం ఇండస్ టవర్స్‌కే రూ.7,000 కోట్లు రావాల్సి ఉంది. అమెరికన్ టవర్ కంపెనీ (ఏటీసీ)కి రూ.3,000 కోట్లు బకాయి ఉంది. ఇదీ చదవండి: 28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే! -
28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!
సాక్షి,ముంబై: సాధారణంగా ఏ మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవాలన్నా 28రోజుల వాలిడిటీ ఉంటుంది గమనించారా? నెలలో 30, 31 రోజులుంటే టెలికాం కంపెనీలు లెక్క మాత్రం 28 రోజులే. అలాగే 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు? ఉంటాయి. దీనికి వెనుక బిజినెస్ ప్లాన్‌గురించి ఒకసారి ఆలోచిస్తే.. కస్టమర్లు సంవత్సరానికి 12 నెలలకు 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసు కోవాలనేది ఎపుడైనా గుర్తించారా? అదే కంపెనీ దోపిడీ మంత్ర. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇలా ఆయా కంపెనీల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లో అనేక రకాల ప్లాన్లను అందిస్తాయి. ఈ రకమైన ప్లాన్ కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల ప్లాన్ కారణంగా 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి. (పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్) ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరికొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని కంపెనీలు దండుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది. (డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!) ట్రాయ్ కీలక ఆదేశాలు వినియోగదారుల ఫిర్యాదుమేరకు 28 రోజుల ప్రణాళికను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తప్పుబట్టింది. 28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ మార్గదర్శకం జారీ చేసింది.దీని ప్రకారం నెల చెల్లుబాటయ్యేలా జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకూడా మొత్తంగా కాకగాపోయినా కొన్ని ప్లాన్లను లాచ్ చేసింది. -
ఓటీటీ ప్రియుల కోసం వోడాఫోన్ చవకైన ప్లాన్.. రూ.151తో డేటా, 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫర్లతో పాటు ట్రెండ్‌ని కూడా ఫాలో అవుతూ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా ప్రజలు ఓటీటీలకు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేటగిరి కస్టమర్లను దృష్టిలో వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఓటీటీ( OTT) ప్రయోజనాలతో వస్తుంది. ఓటీటీ ప్రియుల కోసం ప్రత్యేక ప్లాన్.. ఓటీటీ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌లోని బెనిఫిట్స్‌పై ఓ లుక్కేద్దాం.. వీఐ కొత్త రూ.151 ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్‌ని ప్రకటించింది. ఈ చవకైన రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఇందులో ప్రధానంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు మొత్తం 8GB డేటాను కూడా పొందుతారు. అయితే ఈ రీచార్జ్ ప్లాన్‌పై కాలింగ్, ఉచితంగా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అధిక డేటాతో హాట్ స్టార్, డిస్నీ సబ్స్క్రిప్షన్ కోరుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పువచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి వాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో ప్రభుత్వం వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షేరు విలువ రూ. 10 లేదా ఆపై స్థిరత్వాన్ని సాధిస్తే వాటాను పొందనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 10 ముఖ విలువకే ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. ముఖ విలువకే షేర్లను పొందేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. షేరు ధర రూ. 10 లేదా అపై స్థిరత్వాన్ని సాధించాక టెలికం శాఖ(డాట్) ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి షేరు రూ. 10 దిగువనే కదులుతోంది. తాజాగా 0.5% నీరసించి రూ. 9.70 వద్ద ముగిసింది. జూలైలోనే...: వీఐఎల్‌లో ప్రభుత్వం వాటాను సొంతం చేసుకునేందుకు జూలైలోనే ఆర్థిక శాఖ ఆమోదించింది. రూ. 16,000 కోట్లమేర వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి కేటాయించేందుకు వీఐఎల్ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. వెరసి వీఐఎల్‌లో ప్రమోటర్ల వాటా 74.99 శాతం నుంచి తగ్గి 50 శాతానికి పరిమితంకానుంది. ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ చెల్లింపులకు సంబంధించి వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు టెలికం కంపెనీలకు ప్రభుత్వం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి జూన్ చివరికల్లా స్థూలంగా రూ. 1,99,080 కోట్ల రుణ భారముంది. -
2 కోట్ల మంది వొడాఫోన్ యూజర్ల డేటా బహిర్గతం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (వీఐ) సిస్టమ్‌లోని పలు లోపాల వల్ల దాదాపు 2 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కాల్ డేటా రికార్డులు బహిర్గతం అయినట్లు సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ సైబర్ఎక్స్9 ఒక నివేదికలో వెల్లడించింది. ఏ కాల్స్‌ను ఎవరికి, ఎన్నింటికి, ఎంత సేపు, ఎక్కడ నుంచి చేశారనే వివరాలతో పాటు కస్టమర్ల పూర్తి పేరు, చిరునామా మొదలైన సమాచారం అంతా కూడా వీటిలో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని వీఐకి ఆగస్టు 22న తెలియజేయగా, సిస్టమ్‌లోని లోపాలను గుర్తించినట్లు ఆగస్టు 24న కంపెనీ తమకు ధృవీకరించినట్లు వీఐ తెలిపింది. మరోవైపు, నివేదికలో పేర్కొన్నట్లుగా డేటా ఉల్లంఘన వార్తలను వీఐ ఖండించింది. నివేదికంతా తప్పుల తడకని, విద్వేషపూరితమైనదని వ్యాఖ్యానించింది. తమ ఐటీ సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగానే ఉందని, కస్టమర్ల డేటా సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. బిల్లింగ్ విషయంలో లోపాలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించామని, దాన్ని వెంటనే సరిచేశామని పేర్కొంది. చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్) -
వొడాఫోన్ ఐడియా ఆఫర్ అదిరిపోలా!.. కేవలం రూ.82 రీచార్జ్‌తో ఓటీటీ సబ్స్క్రిప్షన్!
భారత్‌లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్‌తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే! ఆఫర్ అదిరిపోలా! వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో చూసే సౌకర్యం ఉండదు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్‌తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్‌ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
నష్టాల్లోనే వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ. 7,297 కోట్లకు చేరాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,319 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 10,410 కోట్లను తాకింది. ప్రస్తుత సమీక్షా కాలంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 104 నుంచి రూ. 128కు మెరుగుపడింది. టారిఫ్‌ల పెంపు ఇందుకు సహకరించింది. మార్చి నుంచి జూన్‌కల్లా మొత్తం వినియోగదారుల సంఖ్య 24.38 కోట్ల నుంచి 24.04 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే 10 లక్షల మంది 4జీ కస్టమర్లు జత కలవడంతో వీరి సంఖ్య 11.9 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కొత్త చైర్మన్.. ఈ నెల(ఆగస్ట్) 19 నుంచి చైర్మన్‌గా రవీందర్ టక్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ నెల 18కల్లా హిమాన్షు కపానియా నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలియజేసింది. వొడాఫోన్ గ్రూప్ నామినీ అయిన టక్కర్ ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టెలికం పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కీలక మార్కెట్లలో 5జీ సేవలను అందించేందుకు తగిన స్పెక్ట్రమ్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్లు సీఈవో టక్కర్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 9.10 వద్ద ముగిసింది. -
ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కు శనివారం డిమాండ్ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. -
5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధం
-
జియోకు జై, వొడాఫోన్ ఐడియాకు బై..బై!
సాక్షి, ముంబై: టెలికం మేజర్ రిలయన్స్ జియో మరోసారి దుమ్ము రేపింది. కొత్త కస్టమర్లను సాధించడంలో జియో తన ఆధిక్యాన్ని నిరూపించుకుని టాప్‌లో నిలిచింది. మే నెలలో 31 లక్షలమంది మొబైల్ వినియోగదారులను తన ఖాతాలో జమ చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నెలవారీ సబ్‌స్క్రైబర్ డేటా నేడు (జూలై19) విడుదల చేసింది. రెగ్యులేటరీ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం, మేలో 31 లక్షల మంది వైర్లెస్ మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. ఫలితంగా జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకుంది. అలాగే సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ మే నెలలో 10.27 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. దీంతో ఎయిర్టెల్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా 7.59 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో సబ్‌స్క్రైబర్ బేస్ 25.84 కోట్లకు పడిపోయింది. -
5జీ స్పెక్ట్రం: జియో మరో సునామీకి సిద్ధం
సాక్షి, ముంబై: 5జీ స్పెక్ట్రం వేలంలో టెలికాం మేజర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టాప్‌లో దూసుకొచ్చింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు జియో ఏకంగా 14 వేల కోట్లను డిపాజిట్ చేసింది. టెలికం సంస్థలు మొత్తం రూ. 21,800 కోట్లు ఈఎండీగా చెల్లించగా, ఇందులో 14,000 కోట్లతో జియో టాప్‌లో నిలిచింది. భారతి ఎయిర్టెల్ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్వర్క్స్ రూ. 100 కోట్లు డిపాజిట్ చేశాయి. తోటి బిలియనీర్ అదానీకి భిన్నంగా, అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ₹14,000 కోట్లను డిపాజిట్ చేయడం విశేషంగా నిలిచింది. 14,000 కోట్లతో, వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌లో మూడింట ఒక వంతు, 1.4 ట్రిలియన్ విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయవచ్చు. భారత టెలికాం రంగంలోకి ప్రత్యర్థులకు ధీటుగా జియో నిలవనుందని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ అన్నారు. జియో డిపాజిట్ భారీ స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రణాళికను సూచిస్తుందనీ, దీనికితోడు ఇప్పటికే 4G ఫ్రీక్వెన్సీల కోసం మునుపటి వేలంలో 57వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది, ఇక 4జీ లేదా ఇతర బ్యాండ్స్ ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరోవైపు గౌతమ్ అదానీ టెలికా రంగంలో ప్రవేశాస్తున్నారన్న ఊహాగానాలు ప్రత్యర్థి టెల్కోలను ఆందోళనకు గురి చేశాయి, ఆరేళ్ల క్రితం ముకేశ్ అంబానీ జియో ఎంట్రీ, సృష్టించిన సునామీని గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదానీ పోటీకి దూరంగా ఉన్నారనీ, 3.5 GHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తారని భావించడం లేదని పేరు చెప్పడానికి అంగీకరించని టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. 650-700 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయనుంది, కానీ ప్రస్తుతానికి, వినియోగదారుల సేవల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇది మూడు ప్రధాన టెల్కోలకు భారీ ఉపశమనం కానుందని వ్యాఖ్యానించారు. -
హాట్ రేసు: ‘నువ్వా.. నేనా..సై’ అంటున్న దిగ్గజాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. టెలికాం శాఖ మంగళవారం విడుదల చేసిన జాబితా ప్రకారం జూలై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలంప్రారంభం కానుంది. ఈ మేరకు దరఖాస్తులను కంపెనీలనుంచి ఇప్పటికే స్వీకరించామని డాట్ వెల్లడించింది. దరఖాస్తుల ఉపసంహరణకు జూలై 19 వరకు సమయం ఉంది. దీంతో ఇండస్ట్రీ దిగ్గజాలు నువ్వా నేనా అన్నట్టుగా రంగంలోకి దిగిపోయాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ డేటా నెట్వర్క్స్ తోపాటు, టెలికాం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా తమ దరఖాస్తులను సమర్పించాయి. ఈ మేరకు టెలికాం డిపార్ట్మెంట్ జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా అదానీ డేటా నెట్వర్క్స్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు 5 జీ వేలాన్ని దక్కించుకుని టెలికాం ఇండస్ట్రీలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోనున్నాయి. 600 ఎంహెచ్‌జెడ్, 700 ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్‌జెడ్, 2500 ఎంహెచ్‌జెడ్, 3300 ఎంహెచ్‌జెడ్, 26 గిగాహెడ్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను వాడుకునే హక్కును పొందేందుకు 5జీ వేలాన్ని డాట్ నిర్వహిస్తోంది. రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 ప్రారంభం కానుంది. ఈ వేలం పూర్తయితే శరవేగంగా, ప్రస్తుతం 4జీ నెట్వర్క్ స్పీడ్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. -
వేలకోట్ల రుణ భారం, వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016–17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018–19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
ఏజీఆర్ బకాయిలు: వొడాఫోన్ ఐడియాకు ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016-17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018-19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
రూ. 500 కోట్ల నిధుల సమీకరణ ప్లాన్స్: వోడాఫోన్ ఐడియా జూమ్
సాక్షి, ముంబై: ప్రముఖ టెల్కో వోడాఫోన్ ఐడియా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తరుణంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో వోడాఫోన్ షేర్ దాదాపు 3 శాతం లాభపడింది. వోడాఫోన్ గ్రూప్ సంస్థలకు ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు బుధవారం సమావేశమవుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారంలో వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా గ్రూపు నుంచి రూ. 500 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూషన్ ప్లాన్‌ను పరిశీలించేందుకు వోడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశం కానుంది. దీనికి బోర్డు ఆమోదం తె లిపితే రెండు నెలల్లో ఇది రెండవది కావడం విశేషం. మరోవైపు బోర్డు ఆమోదించిన రూ. 25,000 కోట్ల అదనపు పెట్టుబడులకు గాను ఇటీవలి రూ. 4,500 కోట్ల పెట్టుబడులకు తోడు తమకు ఇంకా రూ. 20,000 కోట్లు అవసరమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ ఇటీవల వెల్లడించారు. ఫండ్ ఇన్ఫ్యూషన్తో సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు, 5జీ పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ప్రమోటర్ల రూ. 4,500 కోట్ల నిధుల సమీకరణను కంపెనీ బోర్దు ఆమోదించింది. వోడాఫోన్ ఐడియాలో వొడాఫోన్ గ్రూప్ దాదాపు రూ.3,375 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,125 కోట్లు పెట్టింది. అయితే, ఎయిర్టెల్, జియోలతో పోలిస్తే కంపెనీ ఇప్పటివరకు ఒక్క విదేశీ ఇన్వెస్టర్ పెట్టుబడులను సేకరించ లేకపోయింది. -
5జీ వచ్చేస్తుంది, ఏఏ నగరాల్లో ముందంటే? ఇదే లిస్టు!
5జీ స్ప్రెక్టం వేలం కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 26న నిర్వహించే ఈ వేలంలో టెలింకా సంస్థలకు 72జీహెచ్‌జెడ్ 5జీ స్ప్రెక్టం బిడ్లను 20ఏళ్ల పాటు అప్పగించనుంది. దీంతో ఈ ఏడాదిలోపే 5జీ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే 4జీ కంటే 5జీ సేవల్ని 10రెట్ల వేగంతో వినియోగించుకోవచ్చు. 5జీ నెట్ వర్క్ వినియోగం టెలికాం శాఖ 5జీ స్ప్రెక్టం వేలంలో లో(తక్కువ)లో (600ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్ జెడ్‌లు) ఉండగా మిడ్‌లో ( 3300ఎంహెచ్‌జెడ్) హైలో (26జీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటాయి. ఇక మనకు 5జీ సర్వీస్ అందుబాటులోకి రావాలంటే మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటే సరిపోతుంది. 13 నగరాల్లో 5జీ స్ప్రెక్టం వేలం జులై 26న తొలిదశలో 5జీ నెట్వర్క్ స్ప్రెక్టం వేలం 13 నగరాల్లో జరగనుంది. వీటిలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీఘడ్, చెన్నై, ఢిల్లీ, గాంధీ నగర్ (గుజరాత్), గురుగ్రామ్, హైదారబాద్, జామ్ నగర్,కోల్ కతా, లక్నో, ముంబై, పూణేలు ఉన్నాయి. అంటే ముందుగా ఏ నగరంలో స్ప్రెక్టం వేలం జరిగితే ఆ ప్రాంతంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 5జీ రేసులో ఏఏ సంస్థలు ఉన్నాయంటే ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగదారుల్ని అందిస్తామంటూ టెలికాం సంస్థ 5జీ ట్రయల్స్ నిర్వహించాయి. వాటిలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు ఉండగా.. ఏ సంస్థ 5జీ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తుందనేది తెలియాంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. చదవండి👉సంచలనం, భారత్‌లో ఎయిర్టెల్ 5జీ సేవలు..ఎప్పట్నుంచో తెలుసా! -
5జీ కమింగ్ సూన్: దాదాపు 10 రెట్ల వేగంతో
సాక్షి, న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది. 5జీ సేవల బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలనే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లను ఆపరేట్ చేయడానికి వారికి మార్గం సుగమం చేస్తూ, సంస్థలకు నేరుగా ఎయిర్‌వేవ్‌లను కేటాయించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై నెలాఖరులోగా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్నినిర్వహించనుంది. దేశంలోని మూడు ముఖ్య టెలికాం సేవల సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయని భావిస్తున్నారు. ఎయిర్‌వేవ్‌ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న 13, 15, 18, 21 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో సాంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్‌హాల్ క్యారియర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత సొమ్మును 5జీ స్పెక్ట్రమ్ బిడ్డర్లు 20 నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించవచ్చు. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. కొత్త శకానికి నాంది 5జీ సేవల స్పెక్ట్రమ్ వేలం భారత టెలికాం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రకటించిన స్పెక్ట్రమ్ వేలం భారత్‌కా 5జీ ఈకో సిస్టం సాధనలోఅంతర్భాగమని మంత్రి చెప్పారు.