క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 2025 మార్చిలోగా వాణిజ్యపరంగా 5జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 11,500లకుపైగా 4జీ టవర్స్ ఉన్నాయి. దశలవారీగా వీటిని 5జీకి అప్‌గ్రేడ్ చేస్తాం. స్పామ్ సందేశాలను అడ్డుకునే సాంకేతికతను పరిచయం చేశాం.
ఈ సేవలను కాల్స్‌కు కూడా త్వరలో విస్తరిస్తాం. ప్రస్తుతం స్పామ్ కాల్స్ కట్టడికి సంబంధించి టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోటికి పైగా చందాదార్లు ఉన్నారు. ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తున్న సగటు ఆదాయం నెలకు రూ. 200 ఉంది. సగటున ఒక్కో కస్టమర్ డేటా వినియోగం ప్రస్తుతం నెలకు 18–20 జీబీ ఉందని ఆనంద్ చెప్పారు. దేశవ్యాప్తంగా కంపెనీ రూ.18,000 కోట్ల తాజా పెట్టుబడులు చేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment