
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఇండోర్ నెట్‌వర్క్‌ను 20కిపైగా జిల్లాల్లో మెరుగుపర్చినట్టు తెలిపింది. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 3,450కిపైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది.
తద్వారా కస్టమర్లకు మెరుగైన నెట్‌వర్క్ లభిస్తుందని తెలిపింది. రూ.691 కోట్లతో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 2.4 మెగాహెట్జ్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. 5,000లకుపైగా సైట్స్‌లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను 10 మెగాహెట్జ్ నుండి 20 మెగాహెట్జ్‌కి అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. తద్వారా వినియోగదార్లు వేగవంతమైన డేటాను అందుకోవచ్చని వివరించింది.
ఇదీ చదవండి: మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
Comments
Please login to add a commentAdd a comment