upgraded
-
వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్.. ఇక వేగవంతమైన నెట్వర్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండోర్ నెట్‌వర్క్‌ను 20కిపైగా జిల్లాల్లో మెరుగుపర్చినట్టు తెలిపింది. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 3,450కిపైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది.తద్వారా కస్టమర్లకు మెరుగైన నెట్వర్క్ లభిస్తుందని తెలిపింది. రూ.691 కోట్లతో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 2.4 మెగాహెట్జ్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. 5,000లకుపైగా సైట్స్‌లో నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను 10 మెగాహెట్జ్ నుండి 20 మెగాహెట్జ్‌కి అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. తద్వారా వినియోగదార్లు వేగవంతమైన డేటాను అందుకోవచ్చని వివరించింది.ఇదీ చదవండి: మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా? -
ఆ ఐటీఐలు ఇక నుంచి ఏటీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఆ దిశగా రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన విభాగం కార్యాచరణ వేగవంతం చేసింది. గతవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏటీసీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చగా, మాసబ్టాంక్లో నాలుగు ఏటీసీల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏటీసీలుగా అప్‌గేడ్ర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, తొలివిడతలో 25 ఐటీఐలను మాత్రమే అప్‌గ్రేడ్ చేస్తారు. ఇవన్నీ 2024–25 నుంచే సేవలు ప్రారంభిస్తాయి.తొలివిడతలోకి వచ్చే ఐటీఐలతో కూడిన ప్రతిపాదిత జాబితా ను సిద్ధం చేసేందుకు శిక్షణ, ఉపాధికల్పన శాఖ కసరత్తు చేస్తోంది. తొలివిడత ప్రాజెక్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఐదు ఐటీఐలు ఏటీసీలుగా మారనున్నాయి. మిగతా వాటిని కూడా ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇండస్ట్రీస్ 4.0.... అప్‌గ్రేడ్ చేసే క్రమంలో ప్రస్తుతమున్న శిక్షణ కార్యక్రమాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రెండుమూడు దశాబ్దాల క్రితం ఉన్న శిక్షణ కార్యక్రమాలనే ఐటీఐల్లో కొనసాగిస్తున్నారు. ఇకపై ఏటీసీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోర్సుల ఎంపికపైనా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరు రకాల ట్రేడ్లు ఎంపిక చేసి వాటిని ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా చర్యలు వేగవంతం చేసింది. ఇవన్నీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఐఓటీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ఆర్ట్ వెల్డింగ్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెల్డింగ్, పెయింటింగ్ తదితర కొత్త ట్రేడ్లు ఏటీసీల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీస్ 4.0 పేరిట లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన ట్రేడ్లను ఏటీసీల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. చాలా ఐటీఐల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సమస్య, స్థలాభావం కారణంగా భవనాల సమస్య ఉండడంతో యుద్ధప్రాతిపదికన ఏటీసీలుగా మార్పు చేయడం కత్తిమీద సాములా పరిణమించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
2023–24లో వృద్ధి 6.3 శాతం: యూబీఎస్
ముంబై: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను విదేశీ బ్రోకరేజ్ యూబీఎస్ అప్‌గ్రేడ్ చేసింది. దీనితో ఈ రేటు 6.3 శాతానికి ఎగసింది. మధ్య కాలికంగా చూస్తే (ఐదేళ్లు) క్రితం 5.75–6.25 శాతం శ్రేణి అంచనాలను ఎగువముఖంగా 6–6.5 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. బ్రోకరేజ్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ మాట్లాడుతూ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ఫలితాలు వంటివి ఎకానమీపై ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు. -
క్రెడిట్ కార్డ్.. లిమిట్ పెంచుకుంటున్నారా?
క్రెడిట్ కార్డ్ వినియోగం మన దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2023 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 8.6 కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నాటికి ఉన్న 7.5 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 15 శాతం పెరిగాయి. 2024 ఆరంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేస్తే తగ్గింపులతో పాటు, రివార్డులు, ఉచిత మూవీ టికెట్లు ఇలా ఎన్నో ఆఫర్లు వినియోగాన్ని పెంచుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్న తర్వాత దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని, క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలంటూ బ్యాంక్‌లు కోరుతుండడం చాలా మందికి అనుభవమే. చాలా మంది తమ కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం లేదంటే క్రెడిట్ లిమిట్ (అప్పు పరిమితి) పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కార్డ్ అప్‌గ్రేడ్ లేదా క్రెడిట్ లిమిట్ పెంపుతో ప్రయోజనాలున్నట్టే.. కొన్ని రిస్క్‌లు లేకపోలేదు. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఓకే చెప్పడానికి ముందు ఇందులో ఉండే చిక్కుల గురించి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత దీనిపై నిర్ణయానికి రావాలి.. ‘‘క్రెడిట్ పరిమితి (లిమిట్) పెంపు లేదా క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను, కార్డుదారుడి ఇటీవలి రుణ చరిత్ర ఆధారంగానే బ్యాంక్‌లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత కార్డుపై ఉన్న పనితీరును చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటుంటాయి. కార్డుదారుడి ఆదాయ స్థాయి పెరిగినట్టు బ్యాంక్ భావించిన సందర్భాల్లోనూ ఈ ఆఫర్లు ఇస్తుంటాయి’’అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ లేదా లిమిట్ పెంపు ఆఫర్ వచి్చందంటే అది కచి్చతంగా రుణ పరపతి పెరిగిన దానికి సంకేతంగా చూడొచ్చు. అయితే, సంబంధిత ఆఫర్ లేదా అభ్యర్థనను ఆమోదించే ముందు తప్పకుండా సానుకూలతలు, ప్రతికూలతల గురించి విశ్లేíÙంచుకోవాలని రిషి మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్ మంచికేనా..? ఉన్నత శ్రేణి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే, దానిపై రుణం రేటు, రివార్డులు, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, డీల్స్ కూడా మెరుగ్గానే ఉంటుంటాయి. దీంతో కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల అధిక రివార్డులు, క్యాష్‌బ్యాక్, ఇతర ప్రయోజనాలు లభిస్తుంటాయి. కాకపోతే కార్డ్‌పై నిర్ధేశిత వ్యయాలు చేయాలనే నిబంధనలు ఉంటాయని మర్చిపోవద్దు. అప్‌గ్రేడెడ్ కార్డుకు వెళ్లకుండా, ఎన్నేళ్లు గడిచిన అదే పాత కార్డ్‌లోనే కొనసాగే వారు మంచి డీల్స్‌ను కోల్పోవాల్సి రావచ్చు. ‘‘పాతబడిన క్రెడిట్ కార్డ్ ఆధునిక ఫీచర్లు, ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. నేడు దాదాపు చాలా క్రెడిట్ కార్డ్ సంస్థలు అర్హులైన కస్టమర్లకు ఉచిత ఎయిర్పోర్ట్ లాంజెస్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ లావాదేవీపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, క్రెడిట్ లిమిట్‌ను పెంచుతున్నాయి. పాత కార్డ్‌లోనే కొనసాగడం వల్ల.. బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల లభించే నూతన, అదనపు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అధిక లిమిట్ లాభమేనా? క్రెడిట్ లిమిట్ కంటే తక్కువ ఖర్చు చేసే వారి పట్ల క్రెడిట్ బ్యూరోలు సానుకూలంగా వ్యవహరిస్తాయి. ‘‘క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరును ఎన్నో అంశాల ఆధారంగా లెక్కిస్తుంటాయి. అందులో క్రెడిట్ వినియోగం ఒకటి. తక్కువ క్రెడిట్ వినియోగ రేషియో (సీయూఆర్) అన్నది.. లిమిట్‌ను వినియోగించుకునే విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలియజేస్తుంది. క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడడం లేదని సంకేతం ఇస్తుంది. ఇది ఒకరి క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుంది’’అని ఆదిల్ శెట్టి వివరించారు. కార్డుపై ఉన్న మొత్తం లిమిట్లో ఎంత శాతం ప్రతి నెలా వినియోగిస్తున్నారన్నది క్రెడిట్ వినియోగ రేషియో రూపంలో తెలుస్తుంది. ఇది తక్కువగా ఉంటే సానుకూలం అవుతుంది. ‘‘ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్షగా ఉంటే, ప్రతి నెలా వినియోగిస్తున్నది రూ.50,000గా ఉంటే అప్పుడు సీయూఆర్ 50 శాతం అవుతుంది. అదే క్రెడిట్ లిమిట్ రూ.1,50,000 అయి ఉండి, వినియోగించే మొత్తం ప్రతి నెలా రూ.50,000 స్థాయిలోనే ఉంటే, అప్పుడు వినియోగ రేషియో 33 శాతం అవుతుంది’’అని శెట్టి తెలియజేశారు. క్రెడిట్ స్కోర్ సగటున 700–750 మధ్య ఉంటే, దీన్ని పెంచుకునేందుకు అధిక క్రెడిట్ లిమిట్ సాయపడుతుంది. ‘‘సగటు స్కోరులో ఉన్న వ్యక్తి (750లోపు) క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల అప్పుడు వారి క్రెడిట్ స్కోరు సైతం 750 ఎగువకు చేరుతుంది. అప్పటికే ఎక్కువ స్కోర్‌లో ఉన్న వారు క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల అదనంగా పొందేదేమీ ఉండదు’’అని మెహ్రా సూచించారు. తక్కువ సీయూఆర్ వ్యక్తి ఆర్థిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆదిల్‌శెట్టి సూచించారు. ‘‘సీయూఆర్ తక్కువగా ఉంటే మీరు మీ ఆర్థిక వ్యవహారాలను ఎంతో క్రమశిక్షణగా నిర్వహిస్తున్నట్టు తెలియజేస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు దాదాపు తక్కువగా ఉంటాయని సంకేతమిస్తుంది. రుణాల విషయంలో సరైన నడవడిక, సకాలంలో చెల్లింపులు, రుణాల్లో సరైన సమతుల్యం (వివిధ రుణాలు) అనేవి మంచి క్రెడిట్ స్కోరుకు దారితీస్తాయి’’అని శెట్టి తెలిపారు. రిస్‌్కలు ఇవీ.. అధిక క్రెడిట్ లిమిట్‌తో ఉండే అతిపెద్ద రిస్క్ పరిమితికి మించి ఖర్చు చేయడం. ‘‘ఎక్కువ లిమిట్ ఉంటే, అవసరాలు ఏర్పడినప్పుడు ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటారు. సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే అది భారంగా మారుతుంది. క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ కార్డ్ నిర్వహణ భద్రంగా లేకపోతే అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. మోసపూరిత లావాదేవీలకు ఆస్కారం ఉంటుంది’’అని మెహ్రా పేర్కొన్నారు. కార్డు వినియోగం విషయంలో జాగ్రత్తగా, నియంత్రణతో వ్యవహరించకపోతే అది ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. అధికంగా వినియోగించడం వల్ల అప్పుడు క్రెడిట్ వినియోగ రేషియో (సీయూఆర్) పెరిగేందుకు దారితీస్తుంది. సీయూఆర్ ఎక్కువ అయితే అది క్రెడిట్ స్కోర్‌ను వెనక్కి లాగేస్తుంది. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే, అప్పటికే ఉన్న క్రెడిట్ లిమిట్లో అధిక శాతం వినియోగించాల్సి వస్తుంటే.. అప్పుడు క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకోవాలి. దీనితోపాటు క్రమశిక్షణతో కార్డును వినియోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం చాలా కీలకమవుతుంది. ఆఫర్‌కు ఓకే చెప్పాలా..? బ్యాంక్‌లు, లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీలు తరచుగా కార్డ్ అప్‌గ్రేడ్ లేదా లిమిట్ పెంచుకోవాలంటూ ఆఫర్లు ఇస్తుంటాయి. అప్పుడు తమ వైపు నుంచి సమీక్షించుకోవాలి. ఖర్చు చేసేందుకు అదనపు వెసులుబాటు ఉందా? రివార్డుల పరంగా ఆ కార్డ్ మెరుగైనదా? లేదంటే తమ అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక కార్డా? సెక్యూరిటీ ఫీచర్లు ఏ మేరకు? ఇవన్నీ చూడాలి. ముఖ్యంగా ఒక క్రెడిట్ కార్డ్‌తోనే ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ పరిమితం కాదు. ఇతర బ్యాంక్‌ల నుంచి రుణాలు, కార్డ్‌లు తీసుకోవాల్సి వస్తే, మీ పరిస్థితి ఏంటన్నది కూడా చూడాలి. మంచి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఉంటే ఇతర కార్డ్ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుంటాయి. ‘‘బ్యాంక్ ఇచి్చన ఆఫర్ తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే ఉందా? ఖర్చు చేసే ధోరణికి అనుకూలంగా ఉందా?మరిన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయా? వీటికి అవుననే సమాధానం వస్తే, అప్పుడు ఆ కార్డ్ ఆఫర్‌ను ఆమోదించొచ్చు. తాజా ఆఫర్‌కు సంబంధించి షరతులు మీకు అనుకూలంగా లేకపోతే, మీ లక్ష్యాలకు అనుకూలమైన ఇతర కార్డ్‌ను పరిశీలించొచ్చు’’అని ఆదిల్ శెట్టి సూచించారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంపు లేదా కార్డ్ అప్‌గ్రేడేషన్ అదనపు సదుపాయాలతో రావడమే కాదు, వార్షిక ఫీజు కూడా అధికంగా ఉంటుంది. అందుకని అప్‌గ్రేడ్‌ను ఎంపిక చేసుకునే ముందు పడే భారం ఎంత, ప్రయోజనాలు ఏ మేరకో చూడాలి. చాలా వరకు బ్యాంక్‌లు కార్డ్‌పై వార్షికంగా ఇంత వ్యయం చేస్తే, వార్షిక నిర్వహణ చార్జీని మాఫీ చేస్తున్నాయి. దీంతో సులభంగానే ఈ భారం పడకుండా చూసుకోవచ్చు. ఇలా అయితే సమ్మతి.. క్రెడిట్ కార్డ్ సంస్థ నుంచి ఎలాంటి ఆఫర్లు రానప్పుడు.. ఇంతకంటే మెరుగైన కార్డ్‌కు తాను అర్హుడినని భావిస్తే, అప్పుడు కార్డుదారుడే స్వయంగా లిమిట్ పెంచాలని లేదా కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరొచ్చు. ‘‘క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత తమ ఆదాయం పెరిగితే అప్పుడు క్రెడిట్ లిమిట్ పెంపునకు అర్హత లభించినట్టుగా భావించొచ్చు. క్రెడిట్ కార్డ్ కంపెనీతో దీర్ఘకాల బంధం ఉన్నవారు తమ లిమిట్ పెంచుకునే అనుకూలతతో ఉంటారు. కొన్ని ప్రయోజనాలు ప్రీ అప్రూవ్డ్ (ముందే ఆమోదించినది)గా ఉంటాయి’’అని శెట్టి వివరించారు. అప్‌గ్రేడ్ చేసుకోవడం, క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం పూర్తిగా అవసరాల ప్రాతిపదికనే ఉండాలన్నది మర్చిపోవద్దు. ఆదాయం పెరిగినప్పుడు, మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడే క్రెడిట్ లిమిట్, క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడేషన్‌కు వెళ్లాలని మెహ్రా సూచిస్తున్నారు. ‘‘ఒక వ్యక్తి ఖర్చులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. కొంత కాలానికి ఇందులో మార్పు వస్తుంటుంది. అలాంటప్పుడు కార్డ్‌ను మార్చుకోవచ్చు. ప్రస్తుత కార్డ్ ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, అవి తమకు అనుకూలంగా లేకపోతే కార్డ్ అప్గ్రేడేషన్ను కోరొచ్చు. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఒక కార్డ్‌ను ఉపసంహరించి, దాని స్థానంలో వేరేది ఇస్తున్నట్టు అయితే, అందులో ప్రయోజనాలు అంత ఆకర్షణీయంగా లేవనిపిస్తే అప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని కోరొచ్చు’’అని మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్ ద్వారా తీసుకునే కార్డులో ప్రయోజనాలు తమకు అనుకూలంగా, ఆకర్షణీయంగా ఉన్నాయేమో చూసుకోవాలి. అంతేకానీ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. -
5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్‌గ్రేడ్ అయ్యారు?
న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్‌లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్‌లో మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్‌ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్‌లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్‌లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్‌ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్‌గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్‌కి అప్‌గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్‌కి వెళ్లే టీనేజ్‌ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్‌గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్‌గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్‌గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్‌గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్‌కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్‌ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్‌ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్‌లో ఉండేలా తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్‌గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్‌ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్‌గ్రేడ్‌ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్‌ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
ఆర్బీఐ కొత్త తరం డేటా వేర్‌హౌస్ - ముందుగా వారికే..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త తరం డేటా వేర్‌హౌస్ అయిన సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను (సీఐఎంఎస్–సిమ్స్)ను ఆవిష్కరించింది. ముందుగా కమర్షియల్ బ్యాంకులు దీనికి రిపోర్టింగ్ చేయడం మొదలుపెడతాయని, ఆ తర్వాత అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకూ దీన్ని వర్తింపచేస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో 17వ స్టాటిస్టిక్స్ డే నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ప్రజలకు మరింత డేటాను అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర యూజర్లు ఆన్లైన్లో గణాంకాలపరమైన విశ్లేషణ చేపట్టేందుకు కూడా కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుందని దాస్ చెప్పారు. -
BS6: మారుతి లవర్స్‌కు గుడ్ న్యూస్, మారుతీ వాహనాలన్నీ అప్‌గ్రేడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలు రెండవ దశ కింద అన్ని మోడళ్లను అప్‌గ్రేడ్ చేసినట్టు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్, ఎంపీవీలు, ఎస్‌యూవీలతోపాటు వాణిజ్య వాహనాలు సైతం వీటిలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఈ20 ఇంధనం వినియోగానికి అనువుగా వీటిని తీర్చిదిద్దినట్టు పేర్కొంది. కాలుష్యం ఏ స్థాయిలో వెలువడుతుందో ఎప్పటికప్పుడు తెలిపే ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ) సిస్టమ్‌ను వాహనంలో అమర్చినట్టు వివరించింది. అన్ని మోడళ్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వ్యవస్థను కలిగి ఉన్నాయని ప్రకటించింది. కంపెనీ ఖాతాలో ప్రస్తుతం 15 మోడళ్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్ ) -
ఈపీసీ రంగంలో టెక్ నిపుణులు
ముంబై: నిర్మాణ రంగంలోని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) విభాగంలో టెక్ నిపుణుల నియామకాలు ఊపందుకున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఈ రంగంలోని సంస్థలు నిలకడగా టెక్నాలజీ ప్రమాణాల పెంపు(అప్‌గ్రెడేషన్)ను చేపడుతుండటం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ నివేదిక తెలియజేసింది. ‘దేశ ఈపీసీ రంగంలో నేటి ఉపాధి ధోరణి(ట్రెండ్)–2023 ఫిబ్రవరి’ పేరిట రూపొందించిన నివేదికలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. 2023 బడ్జెట్ నేపథ్యంలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఈపీసీ రంగంలో టెక్ నిపుణులకు డిమాండును పెంచినట్లు పేర్కొంది. అటు అత్యుత్తమ స్థాయి యాజమాన్యం, ఇటు కొత్తవారికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు తెలియజేసింది. టెక్నాలజీయేతరాల్లో.. నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్(2,367 ఉద్యోగాలు) తదుపరి టెక్నాలజీయేతర రంగాలలో ఈపీసీ 11 శాతం వాటాతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోంది. ఆపై బ్యాంకింగ్ 10 శాతం, ఎఫ్ఎంసీజీ రంగం 3 శాతం, ఫార్మా 2 శాతం చొప్పున నిలుస్తున్నాయి. ఈ నివేదికను సీఐఈఎల్ హెచ్ఆర్ 80,000 మందికి ఉపాధి కల్పించిన 52 ఈపీసీ కంపెనీలపై చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించింది. 2023 జాబ్ పోర్టళ్లలో నమోదు చేసిన 21,865 ఉద్యోగాలనూ విశ్లేషణకు పరిగణించింది. ఈపీసీ కంపెనీలు సాంకేతికతలను నిరంతరంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఫుల్ స్టాక్ డెవలపర్లు, జావా డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు, ఇంటెగ్రేషన్ నిపుణులను నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ నిపుణుల ఎంపికలో బెంగళూరు( 19 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్(18 శాతం) టాప్ ర్యాంకులో నిలిచాయి. కార్యకలాపాల డిజిటైజేషన్, సామర్థ్యం, కస్టమర్ సేవల మెరుగు తదితరాల కోసం ఈపీసీ కంపెనీలు ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయి. మౌలికాభివృద్ధిపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి కారణంగా ఈ రంగం వేగవంతంగా విస్తరించనున్నట్లు సీఐఈఎల్ హెచ్ఆర్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. దీంతో గతంలోలేని విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
టిక్‌టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!
వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్‌తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్‌టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్‌తో కారు ఇంజిన్‌ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు. దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్‌తో వస్తున్నాయి. -
అప్‌గ్రేడెడ్ ఇంజిన్లతో టాటా వాహనాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కఠినతరమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్లతో ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఆవిష్కరించినట్లు టాటా మోటర్స్ వెల్లడించింది. ఈ ఇంజిన్లు ఈ–20 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. వీటితో వాహనాలు మరింత సురక్షితంగానూ, సౌకర్యవంతంగా ఉంటాయని వివరించింది. ప్రారంభ గేర్లలో కూడా సౌకర్యవంతమైన అనుభూతి కలిగించేలా ఆల్ట్రోజ్, పంచ్ వాహనాలను తీర్చిదిద్దినట్లు టాటా మోటర్స్ వివరించింది. ఈ రెండు మోడల్స్‌లో మరింత మైలేజీనిచ్చేలా ఐడిల్ స్టాప్ స్టార్ట్ ఫీచర్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. పనితీరు మెరుగుపడేలా నెక్సాన్ డీజిల్ ఇంజిన్‌ను కూడా రీట్యూన్ చేసినట్లు కంపెనీ వివరించింది. -
అధికారిక డేటాకు మించిన వృద్ధి ఉంటుంది
ముంబై: అధికారిక డేటాలో కనిపిస్తున్న దానికి మించి భారత్ వృద్ధి చెందుతోందని స్విస్ బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్ ఈక్విటీల అంచనాలను ’అండర్‌వెయిట్’ నుంచి ’బెంచ్‌మార్క్’ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. కీలక సూచీలు 14 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని సంస్థ రీసెర్చ్ హెడ్ నీలకంఠ్ మిశ్రా తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6 శాతం దిగువకు తగ్గొచ్చని అంతా అంచనా వేస్తున్నప్పటికీ ఇది 7 శాతం స్థాయిలో ఉంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా అంతా కేవలం అధికారిక డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము మరింత విస్తృత గణాంకాలను విశ్లేషించి ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ‘దేశీయంగా మరిన్ని వృద్ధి చోదకాల ఊతంతో 2023లో భారత్ జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రభుత్వం ఖర్చు చేయడాన్ని పెంచడం, అల్పాదాయ ఉద్యోగాలు పెరగడం, సరఫరావ్యవస్థపరమైన అవాంతరాలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడగలవు. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ఎకానమీ మందగమనం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా నిలువరించగలవు‘ అని మిశ్రా చెప్పారు. రిస్కులు ఉన్నాయి.. ఇంధనాల దిగుమతులు, విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం, ప్రపంచ ఎకానమీ మందగించడం వంటి అంశాల ఆధారిత రిస్కులు కొనసాగుతాయని మిశ్రా చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ మరింతగా వడ్డీ రేట్లను పెంచాల్సినంతగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఇతరత్రా పరిస్థితులు లేవని తెలిపారు. అయినప్పటికీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆర్బీఐ .. రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు. మరోవైపు, చైనా కష్టాల్లో ఉండటం వల్లే భారత్‌లోకి మరిన్ని నిధులు వస్తున్నాయన్నది అపోహ మాత్రమేనని మిశ్రా చెప్పారు. ప్రాంతాలను బట్టి ఆసియా పసిఫిక్, వర్ధమాన మార్కెట్లు వంటి వాటికి మేనేజర్లు పెట్టుబడులు కేటాయిస్తూ ఉంటారని, దానికి అనుగుణంగానే భారత్‌లోకి నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం ఆశావహంగా కనిపిస్తోందని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ రంగాలపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని మిశ్రా వివరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో వొడా ఐడియా నెట్వర్క్ అప్‌గ్రేడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు మరింత మెరుగైన 4జీ సర్వీసులను అందించేందుకు నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్-ఐడియా (వీఐ) వెల్లడించింది. 1800 మెగాహెట్జ్ రేడియో తరంగాలను రెట్టింపు స్థాయిలో వినియోగంలోకి తేవడంతో డేటా డౌన్లోడ్, అప్లోడింగ్ మరింతగా వేగవంతంగా ఉంటుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 4జీకి సంబంధించి సమర్ధమంతమైన 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఏకైక ప్రైవేట్ టెల్కో తమదేనని వివరించింది. 2018 సెప్టెంబర్ నుంచి 11035 బ్రాడ్‌బ్యాండ్ టవర్లను ఏర్పాటు/అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ క్లస్టర్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ జైన్ చెప్పారు. -
‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్ అవ్వండి’
సైబర్ నేరస్తులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మార్కెట్ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆధార్ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్ ఇలా సందర్భాన్ని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా మన దేశంలో అందుబాటులోకి వచ్చిన ఫాస్టెస్ట్ 5జీ నెట్ వర్క్ సైబర్ నేరగాళ్లకు కాసులు కురిపిస్తోంది. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ పేరుతో కేటగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటూ పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. యూపీఐ, బ్యాంకు యాప్‌లకు అనుసంధానం అయిన మొబైల్ నంబర్ల ద్వారా ఖాతాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ అవ్వండంటూ వచ్చే ఏ మెసేజ్‌ను నమ్మొద్దు చెబుతున్నారు. ఆ తరహా మెసేజ్ లింకులు క్లిక్ చేయొద్దు. ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత టెలికం సంస్థ కార్యాలయంలో 5జీ అప్‌గ్రేడేషన్ చేసుకోవాలని, ఫేక్ లింకులను క్లిక్ చేసి ఆర్థిక మోసాలకు, డేటా చౌర్యానికి గురికావద్దని అంటున్నారు. 5జీ పేరుతో ఫేక్ లింకులు వస్తున్నాయని, అనుమానం ఉంటే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సైతం సామాన్యుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. -
భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం
న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను మెరుగుపర్చడం, ట్యాక్సేషన్‌ను సరళీకరించడం, టారిఫ్‌లపరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం మొదలైన సంస్కరణలు .. ప్రపంచ దేశాలతో భారత్ జరిపే వాణిజ్య లావాదేవీలకు కీలకమని ఒక నివేదిక పేర్కొంది. అబ్జర్వర్వ్ రీసెర్చ్ ఔండేషన్ (ఓఆర్ఎఫ్), ఓఆర్ఎఫ్ అమెరికా సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కోవిడ్ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లోకి (జీవీసీ) భారత్ ఏ విధంగా అనుసంధానం కాగలదనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని తయారు చేశాయి. నిర్దిష్ట ఉత్పత్తి తయారీలో వివిధ దేశాలు పాలుపంచుకునే ప్రక్రియను జీవీసీగా వ్యవహరిస్తారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో సరఫరా పరమైన సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఆర్థిక ప్రగతికి దివ్యౌషధంగా భావించిన జీవీసీ, ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోందని వివరించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, భారీ యంత్రాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న 200 పైచిలుకు దేశ, విదేశీ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయిదు సవాళ్లు.. ‘భారత్‌లో వ్యాపార విస్తరణకు కంపెనీలు ప్రధానంగా ఐదుఅడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటిలో ట్యాక్సేషన్ నిబంధనలు .. పాలసీలు; మౌలిక సదుపాయాల నాణ్యత (లోపాలు); వాణిజ్య.. టారిఫ్ విధానంలో అనిశ్చితి; మూలధనం (అందుబాటులో లేకపోతుండటం); ముడి వస్తువులు (కొరత) ఉన్నాయి‘ అని నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో జీవీసీలో అను సంధానానికి తోడ్పడేందుకు అత్యవసరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని వివరించింది. అలాగే కీలకమైన సరఫరా వ్యవస్థల్లోని బలహీనతలను గుర్తించడం, నియంత్రణ పరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం, లాజిస్టిక్స్.. రవాణా నిబంధనలను సమన్వయ తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించింది. మరిన్ని విశేషాలు.. ♦భారత వాణిజ్య భాగస్వామిగా అంతా ఏకగ్రీవంగా అమెరికాకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) గ్రూప్‌నకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ♦ జీవీసీలో భాగం కావడం తమకు చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 87 శాతం కంపెనీలు తెలిపాయి. మహమ్మారి అనంతరం జీవీసీల విషయంలో తమ అభిప్రాయాలు మారినట్లు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ♦ ఎక్కువగా ఇతరులపై ఆధారపడే తయారీ విధానాల వల్ల పరిశ్రమకు రిస్కులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ♦ దేశీ విధానాలు తమ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని ఆటో కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు తమపై ప్రభావం చూపుతాయని మిగతా రంగాల కంపెనీలు తెలిపాయి. ♦ జీవీసీతో అనుసంధానమయ్యేందుకు భారత్ వాణిజ్య విధానాలు చాలా ముఖ్యమని 70 శాతం సంస్థలు తెలిపాయి. వైద్య పరికరాలు, ఫార్మా పరిశ్రమలో ఈ ధోరణి మరింత స్పష్టంగా (93 శాతం) కనిపించింది. ♦ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ’ముడి వస్తువుల లభ్యత’ కీలకంగా ఉంటోందని 74 శాతం సంస్థలు వివరించాయి. నిపుణులైన సిబ్బంది అంశం తర్వాత స్థానంలో (70 శాతం కంపెనీలు) ఉంది. -
భారత్ రేటింగ్ అంచనా పెంపు
న్యూఢిల్లీ: భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగెటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం ‘బీబీబీ (–) మైనస్’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ 2006 ఆగస్టులో ‘బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతోంది. అయితే అయితే అవుట్‌లుక్ మ్రాతం ‘స్టేబుల్’–‘నెగటివ్’మధ్య ఊగిసలాడుతోంది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ తాజాగా పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో భారత్ ఎకానమీ అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నాం. మార్చిలో వేసిన అంచనాలు 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కుదిస్తున్నాం. అంతర్జాతీయ కమోడిటీ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, కఠిన ద్రవ్య విధానం దీనికి కారణాలు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 8.7 శాతం పురోగమించింది. ► కోవిడ్ –10 మహమ్మారి షాక్ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢమైన రికవరీని కొనసాగిస్తోంది. ► సహచర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోంది. ఇది ఎకానమీపై మా అవుట్‌లుక్ మారడానికి కారణం. -
అడగకుండా కార్డులు జారీ చేయొద్దు
ముంబై: కస్టమర్ల నుంచి విస్పష్టంగా సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని కార్డ్ కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో కస్టమర్‌కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. బాకీల వసూలు కోసం కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదంటూ కార్డుల సంస్థలు, థర్డ్ పార్టీ ఏజెంట్లకు ఆర్బీఐ సూచించింది. 2022 జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఎవరి పేరు మీదైనా అడగకుండానే కార్డు జారీ అయితే, వారు ఆ విషయంపై సదరు కార్డు సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. కంపెనీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుకు వాటిల్లిన నష్టాన్ని (సమయం, వ్యయాలు, మానసిక ఆవేదన తదితర అంశాలు) పరిగణనలోకి తీసుకుని కార్డు జారీ సంస్థ చెల్లించాల్సిన పరిహారాన్ని అంబుడ్స్‌మన్ నిర్ణయిస్తారు. రూ. 100 కోట్లకు పైగా నికర విలువ గల కమర్షియల్ బ్యాంకులు స్వతంత్రంగా లేదా కార్డులు జారీ చేసే ఇతర బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలతో కలిసి క్రెడిట్ కార్డు వ్యాపారం ప్రారంభించవచ్చు. స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకులతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వొచ్చు. ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్బీఎఫ్సీలు .. డెబిట్, క్రెడిట్ కార్డులు మొదలైనవి జారీ చేయకూడదు. కార్డు జారీ సంస్థలు/వాటి ఏజెంట్లు.. బాకీల వసూలు విషయంలో క్రెడిట్ కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు పట్ల మౌఖికంగా గానీ భౌతికంగా గానీ ఏ విధంగాను బెదిరించడం లేదా వేధింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే
ఇండియన్ రోడ్లపై హల్చల్ చేస్తోన్న సెల్టోస్, సొనెట్ మోడల్ కార్లకు కియా సంస్థ మెరుగులద్దింది. సరికొత్త ఫీచర్లు జోడించి రిఫ్రెషెడ్ వెర్షన్ పేరుతో మార్కెట్లో రిలీజ్ చేసింది. అనతి కాలంలోనే కియా సంస్థ ఇండియన్ మార్కెట్లో పాగా వేయగలిగింది. ముఖ్యంగా కియా సంస్థ నుంచి వచ్చిన సెల్టోస్, సొనేటా మోడళ్లు ఇక్కడి వారికి బాగా నచ్చాయి. గడిచిన మూడేళ్లలో ఇండియాలో బాగా సక్సెస్ అయిన మోడళ్లలో సెల్టోస్ ఒకటి. అమ్మకాల్లో ఈ కారు రికార్డు సృష్టిస్తోంది. వెయింటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. తాజాగా రీఫ్రెష్ చేసిన తర్వాత సెల్టోస్‌లో కొత్తగా 13 ఫీచర్లు, సొనెట్‌లో అయితే 9 రకాల మార్పులు చేసినట్టు కియా పేర్కొంది. కియా సంస్థ సెల్టోస్, సొనెట్ కార్లలో చేసిన కీలక మార్పుల్లో ఎంట్రీ లెవల్ హై ఎండ్ అనే తేడా లేకుండా అన్ని వేరియంట్లలో 4 ఎయిర్‌బ్యాగ్స్ అందించనుంది. కియా కనెక్ట్ యాప్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. డీజిల్ వెర్షన్ కార్లలో కూడా ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని పరిచయం చేసింది. కియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ మోడలైన సెల్టోస్ ప్రారంభం ధర రూ.10.19 లక్షల దగ్గర మొదలవుతోంది. సోనెట్ ప్రారంభ ధర రూ.7.15 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు 2.67 లక్షల సెల్టోస్ , 1.25 లక్షల సొనెట్ కార్లు ఇండియాలో అమ్ముడయ్యాయి. చదవండి: Kia Motors: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..! -
విమానయానానికి మరింత డిమాండ్ ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్‌పరమైన సవాళ్లు క్రమంగా తగ్గుతుండటంతో దక్షిణాసియాలో విమానయానానికి మరింతగా డిమాండ్ పెరగనుందని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ఎండీ (రీజనల్ మార్కెటింగ్) డేవ్ షుల్టి తెలిపారు. వ్యాపార అవసరాలు, విహారయాత్రలు మొదలైన వాటి కోసం ప్రయాణాలు చేసేందుకు ప్రజల్లో మళ్లీ ధీమా పెరుగుతోందని, ఎయిర్‌లైన్స్ కూడా సర్వీసులను పెంచుతున్నాయని ఆయన చెప్పారు. దాదాపు 90 శాతం వాటాతో దక్షిణాసియా విమానయాన మార్కెట్లో భారత్ కీలకంగా ఉంటోందని వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే 20 ఏళ్లలో భారత ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు కొత్తగా 2,000 పైగా చిన్న విమానాలు అవసరమవుతాయని డేవ్ చెప్పారు. ఇందుకు సంబంధించి దక్షిణాసియా, భారత మార్కెట్‌పై బోయింగ్ రూపొందించిన అంచనాల నివేదికను శుక్రవారమిక్కడ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమం సందర్భంగా డేవ్ ఆవిష్కరించారు. భారత్ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుండటం, మధ్య తరగతి వర్గాల పరిమాణం పెరుగుతూ ఉండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దక్షిణాసియాలో డిమాండ్ పుంజుకోగలదని ఆయన తెలిపారు. ఫలితంగా దక్షిణాసియాలో వచ్చే రెండు దశాబ్దాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఏటా 6.9 శాతం మేర వృద్ధి నమోదు కాగలదని, కొత్తగా దాదాపు 375 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,400 కమర్షియల్ విమానాలు అవసరమవుతాయని డేవ్ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి విమానయాన సంస్థలు.. ఇంధనం ఆదా చేసే విశిష్టమైన పెద్ద విమానాలపై మరింతగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం దేశీ ఎయిర్‌లైన్స్‌కు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తరహా పెద్ద విమానాలు 240 పైగా అవసరం పడవచ్చని వివరించారు. భారత్‌లో కార్గో కార్యకలాపాలు సగటున 6.3 శాతం వార్షిక వృద్ధి సాధించే అవకాశం ఉందని బోయింగ్ తన నివేదికలో పేర్కొంది. దేశీయంగా 75 పైగా రవాణా విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
ఎయిరిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతాం
ముంబై: ఇటీవల వేలంలో దక్కించుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ ఆర్థికంగా పటిష్టంగా చేస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సంస్థకు ఉన్న విమానాలను అప్‌గ్రేడ్ చేస్తామని, కొత్త విమానాలను తీసుకుంటామని, ఎయిరిండియాను ప్రపంచంలోనే టెక్నాలజీపరంగా అత్యాధునిక ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో చంద్రశేఖరన్ ఈ విషయాలు చెప్పారు. సంస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి భారత్‌ను అనుసంధానించాలన్నది తమ లక్ష్యమని చంద్రశేఖరన్ వివరించారు. అత్యుత్తమ కస్టమర్ సర్వీసులు అందించడం, అత్యాధునికంగా తీర్చిదిద్దడం, విమానాలను ఆధునీకరించుకోవడం, ఆతిథ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై ఎయిరిండియా ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐ–ఎస్ఏటీఎస్లో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా.. వర్చువల్ సమావేశంలో 10,000 మంది పైగా పాల్గొన్నారు. -
సరికొత్త లుక్‌తో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్స్..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ మిలాన్‌లో జరుగుతున్న ఇక్మాషో (EICMA)లో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్‌లను ఆవిష్కరించింది. రివైజ్డ్ స్టైలింగ్‌తో ఈ బైక్స్ రానున్నాయి. ఈ బైక్ యూరో 5 స్పెసిఫికేషన్ మోటార్‌తో అధిక పవర్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజ్‌తో సిక్స్-యాక్సిస్ ఐఎంయూను కలిగి ఉంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ 650 లిమిటెడ్ ఎడిషన్ ..! ఈ బుల్లెట్ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..! ఎంటీ 10 ఎస్పీ కూడా లేటెస్ట్ ఫీచర్లతో రానుంది.మునుపటి మోడల్ కంటే అధికంగా 5బీహెచ్పీ శక్తిని అందించనుంది. ఈ బైక్‌ల పీక్ పవర్ 162బీహెచ్పీకు చేరనుంది. వీటిలో అదనంగా సిక్స్-యాక్సిస్ ఐఎమ్‌యూ పొందుతుంది. బ్రేకింగ్ వ్యవస్థలో సరికొత్త రేడియల్ బ్రెంబో మాస్టర్ సిలిండర్‌ను అమర్చారు. డ్యూయల్ 320ఎమ్ఎమ్ డిస్క్‌లతో జత చేయబడింది. ఎమ్టీ 10లో అప్‌గ్రేడ్‌గా యమహా ఎమ్టీ 10 ఎస్పీ రానుంది. దీనిలో సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, త్రీ-పీస్ బెల్లీ పాన్ , స్టీల్డ్ బ్రేక్ లైన్లను అమర్చారు. యమహా ఎంటీ 10 బైక్ ధర సుమారు రూ. 14 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేది అప్పుడే..? -
హైదరాబాద్ ఎన్ఐఏబీ ఇక సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా అప్‌గ్రేడ్ చేసి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం ఈమేరకు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏబీతో పాటు, పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ సంస్థను కూడా అప్‌గ్రేడ్ చేసి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా నోటిఫై చేసినట్లు శనివారం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్లను త్వరితగతిన పరీక్షించి ధ్రువీకరణ ఇచ్చి కోవిడ్ మహమ్మారి నివారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. ప్రతి నెలా 60 బ్యాచ్‌ల వ్యాక్సిన్లను పరీక్షించే సామర్థ్యం ఈ ల్యాబ్‌లకు ఉన్నట్టు తెలిపింది. -
భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. ఇంతక్రితం 9.1% ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ఆర్బీఐ వృద్ధి అంచనా 9.5% కాగా, మిగిలిన పలు సంస్థల అంచనాలు 7.9% నుంచి 10 శాతం వరకూ ఉన్న సంగతి తెలిసిందే. ‘కే’ నమూనా రికవరీ..: సమాజంలో అసమానతలు పెరిగిపోవడంపై ఇండ్ రా ప్రధాన ఆర్థికవేత్త, పబ్లిక్ ఫైనాన్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి లక్షలాది సంఖ్యలో ప్రజలను పేదరికంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ (ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ (జు) నమూనా రికవరీ అని సిన్హా తెలిపారు. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు వేగంగా మరింత సమస్యల్లోకి జారిపోతారు. ఎకానమీలో దాదాపు 58 శాతం ఉన్న ప్రైవేటు వినియోగంలో గత స్థాయి వృద్ధి ప్రస్తుతం లేదని సిన్హా అన్నారు. -
అప్‌గ్రేడ్ సంస్థకు యూనికార్న్ హోదా
ముంబై: ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్‌గ్రేడ్ మూడోసారి భారీగా నిధులను సమీకరించింది. ఐఐఎఫ్ఎల్ గ్రూప్ నుంచి తాజాగా 185 మిలియన్ డాలర్లు(రూ.1,376 కోట్లు) సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 1.2 బిలియన్ డాలర్లకు(రూ.8,912 కోట్లు) చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి టెమాసెక్ హోల్దింగ్స్ నుంచి 12 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది. తదుపరి ఇదే నెలలో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంస్థ ఐఎఫ్‌సీ నుంచి 4 కోట్ల డాలర్లు లభించాయి. దీంతో కంపెనీ విలువ 85 కోట్ల డాలర్లను తాకింది. స్టార్టప్‌ల రంగంలో 100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా... ఈ కేలండర్ ఏడాది(2021)లో ఆగస్ట్ 2 వరకూ 17 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించాయి. 60 సంస్థలకు యూనికార్న్ హోదా ఈ బాటలో సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన విజన్ ఫండ్-2 నుంచి 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమకూర్చుకున్న మైండ్టికిల్తో కలిపి మొత్తం 60 సంస్థలు ఈ స్థాయికి చేరువకోవడం ప్రస్తావించదగ్గ విషయం!. ఈ ఏడాది యూనికార్న్ జాబితాలో చేరిన సంస్థలలో షేర్‌చాట్, గ్రో, గప్ షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, 'ఆఫ్‌బిజినెస్, క్రైడ్, మాగ్లిక్స్, జెటా, బ్రౌజర్‌స్టాక్ తదిర సంస్థలు చేరాయి. క్రెడిట్ స్వీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా 100కు మించిన స్టార్దప్లు యూనికార్న్ హోదాను పొందాయి. -
ఈ ఎగ్జామ్ పాస్ అయితే రూ.151 కోట్ల స్కాలర్ షిప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంపెనీ అప్‌గ్రేడ్‌కు చెందిన కోచింగ్ ఇనిస్టిట్యూట్ అప్‌గ్రేడ్‌జీత్... రూ.151 కోట్ల కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎన్ఆర్ఏ) సీఈటీ ఉపకార వేతనాలకు అర్హత పరీక్షలను నిర్వహించనుంది. ఈ నెల 8న జాతీయ స్థాయిలో జరగనున్న ఈ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది నమోదు చేసుకున్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో 18, 25 తేదీలలో రెండు సార్లు జీత్‌సీఈటీ టెస్ట్‌కు అపూర్వ స్పందన లభించిందని.. అందుకే మరొక టెస్ట్‌ను నిర్వహించనున్నామని అప్‌గ్రేడ్‌జీత్ సీఈఓ రితేష్ రౌషన్ తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు రౌండ్లుగా పరీక్ష ఉంటుంది. ఎన్ఆర్ఏ సీఈటీ ఎగ్జామ్ అంటే? కేంద్ర ప్రభుత్వశాఖలైన కాగ్, సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, రైల్వే,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగుల భర్తీకి కేంద్రం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబులిటి టెస్ట్ (NRA CET) టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఆ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించవచ్చు. అయితే ఈ ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారు? ఏఏ సబ్జెట్లను ఎలా చదివితే జాబ్ ఎలా వస్తుందనే అంశంతో పాటు.. అభ్యర్ధులకు కోచింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్ అప్‌గ్రేడ్‌జీత్ 'జీత్‌సీఈటీ టెస్ట్' ను నిర్వహించి భారీ మొత్తంలో స్కాలర్ షిప్‌ను అందించేందుకు సిద్ధమైంది. స్కాలర్ షిప్‌కు అభ్యర్ధుల ఎంపిక ఈ ఎగ్జామ్ ఆగస్ట్ 8న (వచ్చే ఆదివారం) నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్ధులను రెండు రౌండ్లుగా విభజించింది. ప్రిలిమినరీ రౌండ్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్ ఆహ్వానిస్తారు. ఈ రెండో రౌండ్ లో ఎంత మంది పాస్ అవుతారో వారిలో మెరిట్ ఆధారంగా 3వేల మంది అభ్యర్ధులను ఎంపిక చేసి వారికి 6నెలల NRA CET కోర్స్ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు రూ.151కోట్ల స్కాలర్ షిప్ ను అందిస్తుండగా.. ఇక రెండో రౌండ్లో 3వేల మందిని మినహాయించి మిగిలిన అభ్యర్ధులకు ఒక నెల NRA CET కోర్స్ సబ్స్క్రిప్షన్ అందిస్తున్నట్లు అప్‌గ్రేడ్‌జీత్ సీఈఓ రితేష్ రౌషన్ ప్రకటించారు. -
గూగుల్ షాకింగ్ నిర్ణయం..! ఇకపై వాటికి చెల్లించాల్సిందే...!
కరోనా రాకతో పూర్తిగా ఆన్లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్‌లతోనే స్కూల్, కార్యాలయాల పనులు సాగుతున్నాయి. తాజాగా గూగుల్ మీట్ యాప్‌ను వాడే యూజర్లకు గూగుల్ షాకివ్వనుంది. గూగుల్ మీట్లో ఇకపై అపరిమిత ఉచిత వీడియో కాలింగ్ ఫీచర్‌కు కాలం చెల్లనుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో యూజర్లు గ్రూప్ కాల్స్‌ను కేవలం ఒక గంటపాటు ఉచితంగా లభించనుంది. తాజా అప్డేట్ ప్రకారం గూగుల్ మీట్లో కాల్ మాట్లేడేటప్పుడు 55 నిమిషాల తరువాత కాల్ ముగుస్తుందనే నోటిఫికేషన్ రానుంది. తరువాత కాల్ కొనసాగించాలంటే అప్‌గ్రేడ్‌ను కోరుతుంది. అప్‌గ్రేడ్ చేస్తే కాల్ కొనసాగుతుంది లేకపోతే కట్ అవుతుంది. గూగుల్ తాజాగా తీసుకొచ్చిన అప్డేట్తో ముగ్గురు కంటే ఎక్కువ మంది పాల్గొనే మీటింగ్స్‌లో కేవలం గంట పాటు మాత్రమే సమావేశాలు కొనసాగుతాయి. జూమ్ కూడా మీటింగ్స్పై పరిమితిని విధిస్తోంది. జూమ్ యాప్‌లో కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు పాల్గొనే మీటింగ్‌లకు కచ్చితంగా అప్‌గ్రేడ్ కావాల్సిందే. కరోనా మహమ్మారి సమయంలో సమయ పరిమితి లేకుండా 100 మంది వ్యక్తులతో ఉచిత సమావేశాలను రూపొందించడానికి గూగుల్‌మీట్ యాప్‌ను గూగుల్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..!
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ నుంచి రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 ను ఫ్రీ అప్‌గ్రేడ్‌గా చేసుకోవచ్చునని ఇది వరకే ప్రకటించింది. కాగా ప్రస్తుతం విండోస్ 10 యూజర్లకే కాకుండా విండోస్7, విండోస్ 8.1 ఆపరేటింగ్ యూజర్లకు కూడా ఉచితంగా విండోస్ 11ను అప్‌గ్రేడ్ చేసుకొవచ్చునని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. విండోస్ 8 వాడుతున్న యూజర్లు మాత్రం డైరక్ట్‌గా ఆప్‌గ్రేడ్‌ను పొందలేరు. ఈ లేటేస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎక్కువ మంది యూజర్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లనుంచి దృష్టిమరల్చడానికి ఫ్రీ ఆప్‌గ్రేడ్‌ను మైక్రోసాఫ్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్ భవిష్యత్తులో పట్టించుకపోవచ్చును. అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ స్టాట్‌కౌంటర్ అందించిన డేటా ప్రకారం..విండోస్ 10 తర్వాత విండోస్ 7 ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గా నిలిచింది. విండోస్ 7 వోఎస్ మే 2021 నాటికి మార్కెట్ వాటాలో 15.52 శాతం. విండోస్ 8.1 తరువాత 3.44 శాతం వాటాగా ఉంది. కాగా విండోస్ 8 మార్కెట్లో 1.27 శాతం వాటా ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను జూన్ 24 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారికి వెంటనే ఆప్‌గ్రేడ్ ఇచ్చే విషయంపై అస్పష్టత నెలకొంది. చదవండి: Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల -
మన ఆయుర్దాయం మరో పదేళ్లు!
న్యూఢిల్లీ: భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి భారతీయుల్లో ఆయుర్దాయం పెరిగినంత మాత్రాన వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని చెప్పలేమన్నారు. చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల తో బాధపడుతూనే బతుకులీడుస్తున్నారని చెప్పారు. ► 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది. ► కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది. ► భారత్‌లోని వ్యాధుల్లో 58% ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) ప్రబలుతున్నాయి ► గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులుæ, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి. ► 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు), ► పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10–20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఊబకాయంతో కరోనా తీవ్రం భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రజల ఆయుర్దాయాలు పెరిగాయని, అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయని అ«ధ్యయనం సహరచయిత గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అలీ మొక్దాద్ చెప్పారు. ఊబకాయం, డయాబెటిస్ వంటి వాటితో కరోనా వైరస్ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. భారత్‌లో ఒకప్పుడు మాతా శిశు మరణాలు అత్యధికంగా ఉండేవని, అవిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. -
కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన ఆటో ఎక్స్పో 2020లో దీన్ని లాంచ్ చేసింది. బీఎస్-6 పెట్రోల్ ఇంజీన్‌తో ఇగ్నిస్ వాహనాన్ని అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఏడు వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ప్రస్తుతం ఉన్న రంగుల పాలెట్‌తో పాటు లూసెంట్ ఆరెంజ్ , టర్కోయిస్ బ్లూ అనే రెండు కొత్త రంగులలో లభ్యంకానుంది. సమర్థవంతమైన మన్నిక, విశాలమైన ఇంటీరియర్‌తో ఇగ్నిస్ వాహనం 1.1 లక్షలకు పైగా భారత యూజర్లను బాగా ఆకట్టుకుందని కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా తెలిపారు. తాజాగా వినియోగదారుల సరికొత్త అంచనాలకనుగుణంగా కొత్త ఇగ్నిస్ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా మారుతి సుజుకి నెక్సా పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం ఉంది . ప్రపంచవ్యాప్తంగా కూడా సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇది మొట్టమొదట ఫిబ్రవరి 2016లో జపాన్ మార్కెట్లో లాంచ్ చేయగా, తరువాత ఇండియా, ఐరోపా, ఇతర ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసింది. -
కొత్తగా సప్త‘నగరాలు’
కర్నూలు (అర్బన్): జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు అప్‌గ్రేడ్ కానున్నాయి. వీటిని నగర పంచాయతీలుగా చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం,, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ప్రతిపాదనలను పంపింది. గ్రామ పంచాయతీల్లోని జనాభా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని నగర పంచాయతీలు/ మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు మున్సిపాలిటీలకు సంబంధించి సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్/ డైరెక్టర్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే గ్రామ పంచాయతీలు, అలాగే కర్నూలు కార్పొరేషన్, ఆదోని మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు అవకాశం ఉన్న గ్రామాల జాబితాలను జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు పంపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో 25 వేలకు పైగా జనాభా ఉండడంతో పాటు పలు అంశాలను పరిశీలించి అప్‌గ్రేడ్, విలీనం జాబితాలను పంపారు. అప్‌గ్రేడ్ కానున్న గ్రామ పంచాయతీలు ఇవే.. కోడుమూరు, పత్తికొండ, కోసిగి, ఆలూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, బేతంచెర్ల గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. మున్సిపాలిటీల్లో విలీనం కానున్న గ్రామాలు ... కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోకి సమీపంలోని పెద్దపాడు, లక్ష్మీపురం, పందిపాడు గ్రామాలను, ఆదోని మున్సిపాలిటీ పరిధిలోకి మండగిరి, సాదాపురం, బసాపురం, మధిరె, ఢణాపురం గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ... ఈ ఏడాది డిసెంబర్లో పురపాలక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా నగర పంచాయితీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియతో పాటు మున్సిపాలిటీల విస్తరణ కార్యాక్రమం కూడా పూర్తి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
గ్రేడ్–1 మున్సిపాలిటీగా రాయచోటి
-
రాయచోటికి మహర్దశ
సాక్షి, రాయచోటి : కరవు కాటకాలకు కేరాఫ్‌గా ఉంటున్న రాయచోటి నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఈవిషయంలో చొరవ తీసుకుని తన నియోజకవర్గంలో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. కరవును శాశ్వతంగా దూరం చేసేందుకు రూ.800 కోట్లతో గండికోట నుంచి రాయచోటికి కృష్ణా జలాలను అందించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఈ దిశగా అనుమతులు కూడా వచ్చాయి. ఇదే సందర్భంలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రాయచోటి వాసుల రెండు కలలు నెరవేరుతున్నాయి. రాయచోటి గ్రేడ్–3 మున్సిపాలిటిని గ్రేడ్–1గా అప్గ్రేడు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ మరో జీఓ కూడా విడుదల అయింది. ఇప్పటివరకూ ఈ ఆస్పత్రి 50పడకల స్థాయిగా కొనసాగుతోంది. పడకలు పెంచాలనేది చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష. ఈ రెండు జీఓలు ఒకేసారి విడుదల కావడంతో రాయచోటి ప్రజానీకం హర్షం వ్యక్తంచేస్తోంది. పోరాటాలు లేకుండానే.... నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా తొమ్మిది మండలాల ప్రజలకు వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. పడకలు సరిపడేవి కావు. వంద పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ 10 సంవత్సరాలుగా పోరాటాలు నడిచాయి. అయినా గత ప్రభుత్వాలు స్పందించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం కంటి తుడుపుగా పడకలు పెంచుతున్నట్లు తప్పుడు ఉత్తర్వు జారీ చేసి అభాసుపాలైంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా వంద పడకల ఆసుపత్రిగాను, గ్రేడ్–1 మున్సిపాలిటీగా మారుస్తామన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మూడు నెలల్లోనే ఈ హామీ కార్యరూపం దాల్చుతుండటంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. గ్రేడ్ –1గా మున్సిపాలిటీ ఉన్నతీకరణ 2005లో పంచాయతీగా ఉన్న రాయచోటిని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రేడ్–3 మున్సిపాలిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేడ్ –3 మున్సిపాలిటీలో 97మంది ఉద్యోగులుండాలి. కానీ 36 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా మిగిలిన పోస్టులు ఖాళీగా వున్నాయి. ఉద్యోగుల కొరతతో పాటు జనాభా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చగలిగేలా నిధులు విడుదల కావడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గ్రేడ్–1గా పెంచేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. మున్సిపల్‌మంత్రి బొత్ససత్యనారాయణతో పలుమార్లు మాట్లాడారు. ఫలితంగా గురువారం మున్సిపాలిటి అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. మున్సిపాలిటీ స్థాయి పెరగడం వల్ల కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల నుండి వివిధరకాల పథకాల పేరిట నిధుల విడుదల పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. లక్షరూపాయల వరకు అత్యవసర పనులను కమిషనరు నామినేషన్ పద్ధతిలో చేపట్టవచ్చు. రాయచోటి రూపురేఖలే మారతాయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రేమాభిమానాల వల్ల రాయచోటి నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. రాయచోటి ఆసుపత్రిని వంద పడకల స్థాయిగా పెంచడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే మున్సిపాలిటీ కూడా గ్రేడ్–1గా మార్చేందుకు వీలు కల్పించారు. ఆసుపత్రికి అదనంగా 12 మంది వైద్యులతో పాటు 25 మంది సిబ్బంది సంఖ్య పెరగుతుంది. వైద్య సేవలూ విస్తృతమవుతాయి. రాయచోటిని విద్యా హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. – ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి -
మున్సి‘పోల్స్’కు ముందే హోదా పెంపు
సాక్షి, అనంతపురం న్యూసిటీ/కదిరి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించేందుకు సిద్ధమైంది. ఈనెల 31లోగా ఆయా పంచాయతీల స్థాయి పెంపుపై వివరాలు ఇవ్వాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం.18 విడుదల చేసింది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలతో పాటు కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడనున్న మూడు పంచాయతీల సమీప గ్రామాలు, ప్రాంతాలను సైతం ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరింది. దీంతో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కొత్తగా ఏర్పాటు కానున్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సమీప ప్రాంతాలు, గ్రామాల సమగ్ర సమాచారం ఇవ్వాలని పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మున్సి‘పోల్స్’కు ముందే హోదా పెంపు ఎన్నికలకు ముందే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుత్తి, పామిడి మున్సిపాలిటీలున్నాయి. ఈ నెల 2వ తేదీతో వీటి పాలకవర్గం గడువు ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వీటికి తిరిగి ఎన్నికలు నిర్వహించేలోపే ఉరవకొండ, గోరంట్ల, పెనుకొండ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కల్పించి వీటికీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది ప్రతిపాదనలు గతేడాది ఆగస్టు 23న అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారి జిల్లాలోని ఉరవకొండ, పెనుకొండ, గోరంట్ల, యాడికి మేజర్ గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించాలని, అనంతపురం చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే రాజీవ్‌కాలనీ, ప్రసన్నాయపల్లి, రాప్తాడు, ఏ నారాయణపురం పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అనంతపురం చుట్టు పక్కల ఉన్న బీకేఎస్, ఉప్పరపల్లి, రుద్రంపేట, కక్కలపల్లి కాలనీ, కక్కలపల్లి, అనంతపురం రూరల్ గ్రామ పంచాయితీలను విలీనం చేయవద్దని పేర్కొన్నారు. హోదా పెరిగితే.. నిధుల వరద పెనుకొండ, గోరంట్ల, ఉరవకొండ ప్రాంతాలను నగర పంచాయతీలు హోదా దక్కితే వాటికి భారీగా నిధులు మంజూరవుతాయి.దీంతో అవి అభివృద్ధి దిశగా ముందుకెళ్లనున్నాయి. -
మారుతి ఎర్టిగా సరికొత్తగా
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగా కారును విడుదల చేసింది. 1.5 లీటర్ డీడీఐఎస్ 225 డీజిల్ ఇంజిన్‌తో అప్డేట్ చేసి లాంచ్ చేసింది. వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్ మూడు వేరియంట్లలో ఈ కారును విక్రయిస్తోంది. వీటి ప్రారంభ ధర (న్యూఢిల్లీ ఎక్స్‌షోరూమ్) రూ.9.86లక్షలు. అత్యధిక ధర రూ.11.20 లక్షలు. పాత 1.3లీటర్ డీడీఐఎస్ 200 ఇంజిన్ స్థానంలో సరికొత్త 1.5 లీటర్ డీడీఐఎస్ 225 పెట్రోల్ ఇంజిన్ ను అమర్చింది. డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ టెక్నాలజీ, 1498 సీసీ ఫోర్ సిలిండర్‌తో వస్తున్న ఈ కొత్త ఎర్టిగా 4000 ఆర్పీఎం వద్ద 94 బీహెచ్పీ శక్తి, 1500-2500 ఆర్పీఎం వద్ద 225ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. అవసరమైతే 1.5 లీటర్ డీజిల్ ఇంజీన్‌ను బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తామని మారుతీ ఛైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. కాగా ఎర్టిగా ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయించే వాహనంగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
నీతి ఆయోగ్‌ను సంస్కరించాలి: వైవీరెడ్డి
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ను సంస్కరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నిర్ణయాలు ‘‘విస్తృత ప్రాతిపదికన ఆమోదం’’ పొందడంలేదని పేర్కొన్న ఆయన, ‘‘అంశాల పట్ల నిర్దిష్ట కేంద్రీకరణ’’ కూడా లేదని విశ్లేషించారు. కేంద్ర, రాష్ట్రాలను సమన్వయం చేస్తూ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా నీతి ఆయోగ్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ప్రధాన అంశంగా వైవీరెడ్డి ‘ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆవిష్కరణను పురస్కరించుకుని ఆర్బీఐ మాజీ గవర్నర్ మాట్లాడుతూ వ్యయాలు, బదలాయింపులకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలన్నారు. రాష్ట్రాల మధ్య ద్రవ్య, ఆర్థిక సమన్వయం విషయంలో ఒకప్పటి ప్రణాళికా సంఘం కీలక పాత్ర పోషించిందని వైవీరెడ్డి పేర్కొన్నారు. అయితే దీని స్థానంలో 2015లో నీతిఆయోగ్ ఏర్పాటయిన తర్వాత ఆయా బాధ్యతల నిర్వహణకు సంబంధించి పలు సందేహాలు వ్యక్తమయ్యాయని అన్నారు. కనీస ఆదాయ పథకం సాధ్యమే... కానీ పేదల సంక్షేమానికి రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం గురించి కూడా వైవీ రెడ్డి ప్రస్తావించారు. ప్రస్తుతం చేస్తున్న కొన్ని వ్యయాలకు కోతపెట్టడం ద్వారా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలుంటుందన్నారు. అయితే ద్రవ్యలోటు కొంత అవకాశం ఉందని పేర్కొన్న ఆయన, ఈ సమస్యనూ అధిగమించడానికి కేంద్రానికి అవకాశం ఉంటుందన్నారు. అయితే రాష్ట్రాలకు మాత్రం ఇలాంటి పథకాలు అమలు చేయడం కష్టమ చెప్పారు. రుణాలకు సంబంధించి రాష్ట్రాలకు పరిమితులు ఉండడం, తమ ఆర్థిక అవసరాలకు కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి దీనికి కారణమన్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఇలాంటి పథకం అమలు చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇలాంటి సందర్భం ‘‘క్లిష్టతకు’’ దారితీసే అవకాశం ఉందన్నారు. -
పదికోట్ల మందిని గమ్యస్ధానాలకు చేర్చేలా..
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయాన్ని రూ 9000 కోట్లతో సామర్ధ్యం పెంపుతో అప్‌గ్రేడ్ చేయనున్నట్టు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయాన్ని ఏటా 10 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చేలా మెరుగపరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్‌లతో కూడిన కన్సార్షియం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రెండు ప్రచురణలను మంగళవారం వెంకయ్య నాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. 2018లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను 7 కోట్ల మంది ప్రయాణీకులు ఉపయోగించుకోగా, రానున్న సంవత్సరాల్లో ప్రయాణీకుల సామర్ధ్యం 11 కోట్లకు పెరుగుతుందని పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయం లక్ష మందికి నేరుగా, మరో 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలను సమకూర్చిందని చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయం పదేళ్ల సేవలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. -
స్మార్ట్ అయితే ఓకే!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రకరకాల కారణాలతో ఇప్పటికీ బేసిక్, ఫీచర్ ఫోన్లను వాడుతున్న కస్టమర్లు... మెల్లగా స్మార్ట్‌కు మొగ్గుతున్నారు. కాస్త ఖరీదైన మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. వివిధ కంపెనీలు ఆకర్షణీయ డిజైన్లలో మోడళ్లను తెస్తుండటం... ధరలూ కాస్త దిగిరావటం, ప్రీమియం మోడళ్లలో ఉండే ఫీచర్లు చాలావరకూ మిడ్ సెగ్మెంట్‌కు రావడం దీనికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. వినియోగదార్లు తమ తదుపరి ఫోన్ కోసం క్రితం కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నెలకు 80 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతున్న మన మొబైల్ మార్కెట్లో మూడేళ్ల క్రితంతో పోలిస్తే ధరల శ్రేణి, బ్రాండ్ల విషయంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక వెలుగు వెలిగిన కంపెనీలు కనుమరుగు కాగా, కొన్ని చైనా బ్రాండ్లు రూ.10–20 వేల మిడ్ సెగ్మెంట్లో తమ సత్తా చాటుతున్నాయి. పోటీ ధరలే ప్రస్తుతం పెద్ద ఇన్నోవేషన్‌గా చెప్పుకోవచ్చు. తగ్గుతున్న రూ.10వేల లోపు ఫోన్లు!! భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో రూ.10,000లోపు లభించే స్మార్ట్ఫోన్ల విభాగం అత్యంత కీలకం. యూనిట్ల పరంగా సింహ భాగం కైవసం చేసుకున్నది కూడా ఈ విభాగమే. ఓ పరిశోధన సంస్థ గణాంకాల ప్రకారం 2015లో ఈ సెగ్మెంట్ వాటా ఏకంగా 70.8 శాతం నమోదైంది. ఇప్పుడు ఇది 55.8 శాతానికి వచ్చి చేరింది. కస్టమర్లు ఖరీదైన మోడళ్లవైపు మొగ్గు చూపుతున్నారనడానికిదే నిదర్శనం. డిమాండ్ రూ.10–20 వేల మధ్య.. 2015తో పోలిస్తే మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రూ.10–15 వేల ధరల విభాగం 11.8 నుంచి రెండింతలకుపైగా అధికమై 27.4 శాతానికి చేరింది. రూ.15–20 వేల శ్రేణి 7.6 నుంచి 10.9 శాతానికి పెరిగింది. మొత్తంగా రూ.10–20 వేల విభాగం మూడేళ్లలో రెండింతలై 38.3 శాతానికి చేరుకుంది. ఫీచర్లకు తోడు ఈఎంఐ సౌకర్యం ఈ సెగ్మెంట్ వృద్ధికి కారణమని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రస్తుతం 950 మోడళ్ల వరకూ రూ.5–20 వేల ధరలో లభిస్తున్నాయి. ప్రీమియం మోడళ్లలో ఉండే ఫీచర్లయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 16 ఎంపీ కెమెరా వంటివి ఈ మోడళ్లలో లభిస్తున్నాయి. ప్రీమియం సెగ్మెంట్ డీలా.. రూ.20 వేలు ఆపైన లభించే ప్రీమియం విభాగం వాటా మాత్రం మెల్లగా తగ్గుతూ వస్తోంది. మూడేళ్ల క్రితం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ సెగ్మెంట్‌కు 9.8% వాటా ఉండేది. ఇప్పుడిది 5.9%కి తగ్గింది. ఈ విభాగంలో ఇప్పుడు 150 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘కస్టమర్లు ఫీచర్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, బ్రాండ్స్‌ను పట్టించుకోవడం లేదు’’ అని మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. ఇక అమ్మకాల్లో మెట్రో సిటీలను ఇతర ప్రాంతాలు మించిపోయాయి. మెట్రోల వాటా 46%, నగరాలు, పట్టణాలు, గ్రామాలు 54% వాటా దక్కించుకున్నాయి. -
గురుకుల కాలేజీలు
బెల్లంపల్లి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు మహర్ధశ పట్టబోతోంది. కొత్తగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 27 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీçసుకుంది. ఈమేరకు జీవో నెంబర్ 7 జారీ చేసింది. వీటిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి బాలుర, నిర్మల్ బాలికల పాఠశాలలకు అవకాశం దక్కింది. దశాబ్దాల నుంచి హైస్కూళ్లకే పరిమితమైన ఆయా పాఠశాలలు ఎట్టకేలకు అప్‌గ్రేడ్‌కు నోచుకోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. అప్‌గ్రేడ్ అయిన గురుకుల కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్ విద్యాబోధన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలుత ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెడతారు. ఒక్కో కోర్సులో 40 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. రెండు కోర్సులకు కలిపి 80 మంది విద్యార్థులకు ప్రవేశం దక్కుతుంది. ఈ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇతర పాఠశాలలు, కళాశాలలతో పాటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త భవనాల నిర్మాణాలు జరిగే వరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న పాఠశాల తరగతి గదుల్లో లేదా కొత్తగా అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ భవనాలను తీసుకుని తరగతులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 గురుకుల జూనియర్ కళాశాలలను ప్రారంభించనుండగా ఇందులో బాలుర కోసం 13, బాలికల కోసం 14 జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 405 మందిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ.117.79 కోట్ల నిధులను విడుదల చేయనుంది. ఐదు దశాబ్దాల క్రితం అంకురార్పణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు ఐదు దశాబ్దాల క్రితం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. బెల్లంపల్లిలో బాలుర, నిర్మల్‌లో బాలికల గురుకుల పాఠశాలలు పని చేస్తున్నాయి. వీటిలో ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతి ఏటా ఐదో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ప్రాతిపదికన సీటును కేటాయిస్తారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు ప్రతిభాపాటవాలతోనే అడ్మిషన్ ఇస్తారు. పదో తరగతి వరకు గురుకుల పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్మీడియేట్ విద్యను గురుకులాల్లో అభ్యసించడానికి బాలబాలికలు పోటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అయితే మెరిట్ మార్కులు సాధించి సీటు వచ్చిన బాలబాలికలు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవడానికి అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. కొద్ది మంది మాత్రమే దూరప్రాంతాలకు వెళ్లి గురుకుల కళాశాలల్లో ఇంటర్ విద్యను చదువుకుంటున్నారు. వ్యయప్రయాసాలకోర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లడం, అభద్రత, ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో బాలికలు డ్రాఫౌట్స్ అవుతున్నారు. లేదా స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళా«శాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్మీడియేట్ను కూడా ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదవాలనే కోరికను అనివార్యంగా చంపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల ఆశ నెరవేరే అవకాశాలు మెరుగుపడ్డాయి. తీరనున్న దూరభారం గురుకుల విద్యార్థులకు చాలామట్టుకు ఇంటర్ విద్యను అభ్యసించడానికి దూరభారం తగ్గనుంది. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌లో బాలికలు, బెల్లంపల్లిలో బాలుర గురుకుల జూనియర్ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గురుకుల పాఠశాలల్లో పదో తరగతిలో 80 మంది చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసి మెరిట్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మాత్రమే గురుకుల కళాశాలల్లో సీటు దక్కుతుంది. దీంతో సీట్ల కోసం విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. విద్యార్థులకు ఉపయోగకరం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం హర్షణీయం. నాణ్యమైన విద్యకు ఇన్నాళ్లుగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. బెల్లంపల్లి బాలుర, నిర్మల్ బాలికల గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలలుగా మార్చడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు ప్రస్తుత పాఠశాల తరగతి గదుల్లో ఇంటర్ విద్య బోధించడం జరుగుతుంది. – ఎస్.సత్యనారాయణ, ప్రిన్సిపాల్, బెల్లంపల్లి గురుకుల పాఠశాల -
జూనియర్ కాలేజీలుగా 27 గురుకులాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 27 గురుకుల పాఠశాలలను గురుకుల జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 13 బాలుర, 14 బాలికల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును 2018–19 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించాలని, ప్రతి గ్రూప్‌లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ఇందుకు 405 పోస్టులను మంజూరు చేయాలని, అందుకోసం రూ.117.79 కోట్లు విడుదల చేయాలని విద్యా శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రతిపాదనలు పంపారు. అయితే పోస్టుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామని వెల్లడించారు. జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన గురుకులాలు బాలుర గురుకులాలు (ప్రాంతం–జిల్లా).. బెల్లంపల్లి– మంచిర్యాల, పెద్దాపూర్ క్యాంపు– జగిత్యాల, మేడారం– పెద్దపల్లి, వేలేర్– వరంగల్ అర్బన్, బండారుపల్లి– జయశంకర్ భూపాలపల్లి, ఎంకూర్– ఖమ్మం, తుంగతుర్తి– సూర్యాపేట, పోచంపాడు– నిజామాబాద్, మద్నూర్– కామారెడ్డి, బీచుపల్లి– జోగుళాంబ గద్వాల, తూప్రాన్– మెదక్, లింగంపల్లి– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్. బాలికల గురుకులాలు (ప్రాంతం–జిల్లా).. నిర్మల్– నిర్మల్, తాటిపల్లి– జగిత్యాల, నేరెళ్ల– సిరిసిల్ల రాజన్న, వంగర– వరంగల్ అర్బన్, నెక్కొండ– వరంగల్ రూరల్, కొడకండ్ల– జనగాం, బూర్గంపాడ్– భద్రాద్రి కొత్తగూడెం, చౌటుప్పల్– యాదాద్రి భువనగిరి, పోచంపాడు– నిజామాబాద్, బోధన్– నిజామాబాద్, మెదక్– మెదక్, దిగ్వాల్– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్, తాండూరు– వికారాబాద్. -
సీహెచ్‌సీకి మహర్దశ
బెల్లంపల్లి: బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)కు ఎట్టకేలకు మహర్దశ పట్టబోతోంది. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివకే ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయగా.. వారం రోజుల్లో జీవో వెలువడనున్నట్లు తెలుస్తోంది. 30 పడకల సామర్థ్యం ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే ప్రభుత్వం జిల్లా కేంద్రం మంచిర్యాలలోని 100 పడకల ఆస్పత్రిని 250 పడకలకు, 30 పడకల సామర్థ్యం కలిగిన లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయడానికి సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఉత్తర్వుల ప్రతి వారం రోజుల వ్యవధిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బెల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింతగా అందుబాటులో రానున్నాయి. రూ.17.50 కోట్లు మంజూరు బెల్లంపల్లిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సన్నద్ధమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.17.50 కోట్లు నిధులు విడుదలకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పక్కా భవనం ఉన్నా పాతది కావడంతో పగుళ్లు తేలి పనికిరాకుండా ఉంది. ఆపరేషన్ థియేటర్ గది శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారైంది. వార్ఢులు కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నూతన భవనం నిర్మించి, పడకల సామర్థ్యం పెంచి, సరిపడా వైద్యులు, సిబ్బందిని కేటాయించాలనే డిమాండ్ కొన్నాళ్ల నుంచి ఉన్నా ఇన్నాళ్ళకు కానీ మోక్షం కలుగలేదు. అప్‌గ్రేడ్ కానుండడంతో రోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అధునాతనంగా భవనం నిర్మించి మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు. రోజుకు 400పైనే రోగులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినా రోజువారీగా రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. చుట్టు పక్కల ప్రాంత రోగులకు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తోంది. రోజుకు 300 నుంచి 400 మంది వరకు రోగులు చికిత్స కోసం వస్తుంటారు. మంగళ, బుధ, శుక్రవారాల్లో ఆ సంఖ్య గరిష్టంగా రోజుకు 800 వరకు ఉంటుందని అంచనా. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో చికిత్స కోసం రోగులు అనివార్యంగా వచ్చిపోతుంటారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న తిర్యాణి, రెబ్బెన, దహెగాం మండలాల రోగులు కూడా ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. రోడ్డు, రైల్వే మార్గం ఉండడంతో సహజంగానే రోగుల సంఖ్య పెరుగుతోంది. అప్‌గ్రేడ్‌తో.. ఆరోగ్య కేంద్రం 100 పడకలకు అప్‌గ్రేడ్ కానుండడంతో వైద్యులు, సిబ్బంది పోస్టులు పెరగనున్నాయి. కనీసం 15 మంది వరకు వైద్యులు, 60కి పైగా అన్ని రకాల సిబ్బంది నియామకం కానున్నారు. వీరి నియామకంతో ఇకపై మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి కొన్ని రోగాలకు తప్పా దాదాపు అన్ని రకాల రోగాలకు బెల్లంపల్లిలోనే వైద్యం అందనుంది. హెల్త్ సెంటర్‌కు విశాలమైన ఖాళీ స్థలం కలిసొచ్చే అంశం. అధునాతనంగా ఆసుపత్రిని నిర్మించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం హెల్త్ సెంటర్ ఆవరణలో వైద్యులు, సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లు వినియోగంలో లేకుండా వృథాగా ఉంటున్నాయి. అప్‌గ్రేడ్ అయ్యాక వీటిని వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు.హెల్త్ సెంటర్ ప్రాంగణంలో దాదాపు 15 ఎకరాల వరకు ఖాళీ భూమి ఉండడం వల్ల భవిష్యత్‌లో ఆసుపత్రికి మరింత ప్రయోజనం కలుగనుంది. సీఎం సంతకం చేశారు.. బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన జీవో వారం రోజుల్లోగా అధికారికంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. సముచిత నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి -
మోదీ సర్కార్‌కు వరల్డ్ బ్యాంకు బూస్ట్
వాషింగ్టన్: ప్రపపంచబ్యాంకు మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట నిచ్చింది.భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్ చేస్తూ అంచనాలను విడుదల చేసింది. అనేక సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా, ఈ ఏడాది భారత ఆర్థిక ప్రగతి 6.7 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం ఊహించినదానికన్నా ఎక్కువే వుంటుందంటూ మోదీ సర్కర్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దుపై విమర్శలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విడుదలైన ఈ ప్రపంచ బ్యాంకు నివేదికపై బీజీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక ప్రగతి 6.5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాదు 2018-19 సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కూడా 7.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచదేశాలపైన కూడా తన నివేదికను వెల్లడించిన ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని వెల్లడించింది. భారత్ మళ్లీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ఈ సందర్భంగా భారత ఆర్థిక ప్రగతిపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. జీఎస్టీ వల్ల వృద్ధి రేటు గత ఏడాది రెండవ భాగంలో సుమారు 0.1 శాతం తగ్గినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. 2019-20లో జీడీపీ 7.5 శాతం ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జీఎస్టీ వల్ల లాభాలు మెలమెల్లగా వస్తుంటాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది. నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. మేకిన్ ఇండియా వల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరుగుతాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మంచి సందేశాన్ని అందిస్తున్నా, అప్రమత్తంగా వ్యవహరించాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ తెలిపారు. పెట్టుబడులకు ఇది మంచి అవకాశమని, గ్లోబల్‌గా ట్రేడ్ రికవరీ పుంజుకుంటోందనీ, తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు. ఏదేమైనా, దేశాలు తమ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్య రంగాల్లోకి ఎక్కువ మంది ప్రజలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చేరడానికి ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
31 నుంచి వాట్సాప్ పనిచేయదు
శాన్ఫ్రాన్సిస్కో: ఈ నెల 31 నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను కొన్ని మొబైల్ ప్లాట్‌ఫాంలకు నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ప్లాట్‌ఫాంలకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు కొత్త ఓఎస్ వెర్షన్ (ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చని తెలిపింది. అలాగే నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ ఈ నెల 31 తర్వాత పనిచేయదని పేర్కొంది. -
92 మంది పండిట్లకు పదోన్నతులు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్నతీకరించిన తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితుల పోస్టులకు గురువారం పదోన్నతులు కల్పించారు. స్థానిక సైన్స్‌సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 92 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా (గ్రేడ్–1) పదోన్నతులు కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సజావుగా జరిగింది. నేడు బదిలీల కౌన్సెలింగ్ తెలుగు, హిందీ పండిట్లకు శుక్రవారం సైన్స్ సెంటర్లో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగు, హిందీ పండిట్లకు విడివిడిగా రెండు హాళ్లలో ఏక కాలంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. తెలుగు 509 మంది, హిందీ 325 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు. నెరవేరిన రెండు దశాబ్దాల కల గ్రేడ్–1 భాషా పండితుల పోస్టులను పండిట్ల ద్వారా భర్తీ చేయాలనే డిమాండ్ దాదాపు రెండు దశబ్దాల తర్వాత నెరవేరింది. దీంతో భాషా పండితులు సంబరాలు జరుపుకున్నారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణను వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌యూపీపీ తులసిరెడ్డి, ఎర్రిస్వామి, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు ఆదిశేషయ్య, శివానందరెడ్డి, సలీం, వేణుగోపాల్, సలీం తదితరులు పాల్గొన్నారు. -
టాయిలెట్ విప్లవం.. ఇక్కడ కాదు!
అభివృద్ధిలో చైనా చాలా దూసుకెళ్లిపోతోందని అనుకుంటాం. అక్కడంతా అత్యాధునిక నిర్మాణాలు ఉన్నాయని చెప్పుకొంటాం. కానీ, అక్కడ పందుల పెంపకం కేంద్రాలకు సమీపంలోనే బహిరంగ మల విసర్జన జరుగుతోందట. ఇలాంటి వాటిని నివారించడానికి గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ విప్లవం' ఒకటి మొదలుపెట్టి, సుమారు 52 వేల టాయిలెట్లను అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్తగా నిర్మించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తమకిచ్చిన లక్ష్యంలో 92.7 శాతాన్ని చేరుకున్నామని చైనా నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ (సీఎన్టీఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పేరు.. 'ప్రోగ్రెస్ ఆఫ్ ద టాయిలెట్ రివల్యూషన్'. 2015 సంవత్సరంలో చైనా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ రివల్యూషన్' ప్రారంభించింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లోను, పర్యాటక ప్రాంతాల వద్ద ఉన్న టాయిలెట్ల వల్ల ఆ దేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందని గుర్తించారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు సరైన టాయిలెట్లు లేవు. పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్లు తగినంతగా లేకపోవడం, పారిశుధ్య కార్మికులు కూడా సరిపడ సంఖ్యలో లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 2015 నుంచి 2017 మధ్య కాలంలో 33వేల టాయిలెట్లను కొత్తగా కట్టాలని, 24 వేల టాయిలెట్లను పునర్నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న టాయిలెట్లను త్రీ స్టార్ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్తామని సీఎన్టీఏ అప్పట్లో చెప్పింది. -
వర్గోన్నతితో సరి.. వైద్యం హరీ
9 పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా ప్రకటించి ఆరేళ్లు మరుగునపడిన నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు ఆస్పత్రుల ఆప్‌గ్రేడేషన్ వర్గోన్నతి ఆస్పత్రుల్లో భర్తీకాని పోస్టులు సదుపాయాల సంగతి సరేసరి కొవ్వూరు : పేదోళ్లకు వైద్య సేవలు అందించే విషయంలో సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల వర్గోన్నతి (ఆప్‌గ్రెడేషన్)ప్రకియను కాగితాలకే పరిమితం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, వైద్యులు, సిబ్బంది కొరత తీర్చడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా పేదలు అరకొర వైద్యసేవలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, ఆచంట, పెనుగొండ, ఆకివీడు, భీమడోలు, బుట్టాయగూడెం, దెందులూరు, పోలవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలు (30 పడకల ఆస్పత్రులు)గా ఆప్‌గ్రేడ్ చేసి ఆరేళ్లు పూర్తి కావస్తోంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉన్న 9 ఆస్పత్రులను కమిషనర్ ఆఫ్ వైద్య విధాన షరిషత్లో విలీనం చేశారు. వర్గోన్నతి ప్రకారం ఈ ఆస్పత్రులకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చటంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కొయ్యలగూడెంలో ఆప్గ్రేడ్డె పీహెచ్‌సీని 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలో ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. సీహెచ్‌సీల్లో 10 డాక్టర్ పోస్టులు ఖాళీ జిల్లాలోని మొత్తం 14 సీహెచ్‌సీల్లో 10 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ వైద్యులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినా భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెక్కిరిస్తున్న బోర్డులు పేదలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తేవాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్‌సీ)ను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఆయన మరణానంతరం 2010 నవంబర్ 19న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటికి భవనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు రికార్డుల్లో ఈ నాలుగు ఏరియా ఆస్పత్రులుగానే నడిచాయి. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చకపోవడంతో వీటిని తిరిగి సీహెచ్‌సీ జాబితాలోకి నెట్టేశారు. ఏరియా ఆస్పత్రులుగా పేర్కొంటూ ఈ నాలుగు ఆస్పత్రులకు ఏర్పాటు చేసిన బోర్డులు ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతున్నాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లోను ఆ స్థాయికి తగినంతమంది వైద్యులు, సిబ్బంది లేరు. వైద్య సేవలు పూజ్యం జిల్లాలో ఆరేళ్ల క్రితం ఏర్పడిన తొమ్మిది సీహెచ్‌సీల్లో మెడికో లీగల్ కేసుల (ఎంఎల్సీ)కు వైద్యం అందించే పరిస్థితి లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, ఇతర ప్రమాదాల బారినపడిన వారికి అవస్థలు తప్పడం లేదు. క్షతగాత్రులను ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రులకు తరలించేలోపు కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మృతదేహాలకు నిడదవోలు, పోలవరంలో మినహా మిగిలిన ఏడు సీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేయటం లేదు. పోస్టుమార్టంకు అవసరమైన షెడ్లు, ఇతర ఏర్పాట్లు, సిబ్బంది, సరిపడినంత మంది వైద్యులు లేకపోవటమే దీనికి కారణం. దీంతో గోపాలపురం మండలం నుంచి సుమారు 40 కిలోమీటర్లు దూరంలోని కొవ్వూరు ఆస్పత్రికి, బుట్టాయగూడెం మండలం నుంచి జంగారెడ్డిగూడేనికి, దెందులూరు, భీమడోలు మండలాల నుంచి ఏలూరుకు, ఆచంట, పెనుగొండ మండలాల నుంచి పాలకొల్లు, ఆకివీడు మండలం నుంచి భీమవరం ఆస్పత్రులకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాల్సి వస్తోంది. అప్‌గ్రేడ్ చేసిన ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనతోపాటు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఈ సమస్యలకు తెరపడే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవకు దూరం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించే 133 వైద్య సేవలు జిల్లాలో కేవలం మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే అందిస్తున్నారు. కొన్ని సీహెచ్‌సీల్లో ఈ సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి నామమాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వైద్య సేవలు అందుబాటులో లేక రోగులు అవస్థ పడుతున్నారు. నాలుగు సీహెచ్‌సీలను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఒక్కో ఆస్పత్రికి నలుగురు సివిల్ సర్జన్లు, 10 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు హెడ్ నర్సుల పోస్టులు సమకూరతాయి. తద్వారా ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు, ఉద్యోగులకు ప్రభుత్వపరంగా అందించే వైద్య సేవలు, ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతిపాదనలు పంపాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలలు పడుతుంది. గత ఏడాది వైద్య విధాన పరిషత్‌లో కలిసిన తొమ్మిది సీహెచ్‌సీల్లో ఏడు చోట్ల పోస్టుమార్టం షెడ్లు లేవు. ఈ ఆస్పత్రుల్లో 100 మంది పారిశుధ్య కార్మికులు, 50 మంది సెక్యూరిటీ గార్డులు, 9 మంది సూపర్వైజర్లను నియమిస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కొవ్వూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా, చింతలపూడి ఆస్పత్రిని 100 పడకలు, కొయ్యలగూడెం ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రులుగా మార్చాలని ప్రతిపాదనలు పంపింంచాం. వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఎన్టీఆర్ వైద్య సేవలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను అందుబాటులోకి వస్తాయి. డాక్టర్ కె.శంకరరావు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త -
వర్గోన్నతి సరే.. వైద్యులు ఏరి..!
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్ జిల్లావ్యాప్తంగా ఉన్న 12 పశు చికిత్సా కేంద్రాలను పశువైద్యశాలలుగా, 15 గ్రామీణ పశువైద్య కేంద్రాల ను (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు) పశు చి కిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి కల్పిం చిం ది. అయితే ఆ స్థాయిలో వైద్యుల ని యా మకం జరగలేదు. ప్రస్తుతం 31 మంది ఏడీలకు 19 మంది మాత్రమే సేవలం దిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్గోన్నతి పొందిన వైద్యశాలలకు నిధులు, మందులు, సౌకర్యాలు పెంచినా ఫలితం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏడీల కొరత నిబంధనల మేరకు వర్గోన్నతి పొం దిన పశు వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. పశు చికిత్సా కేంద్రాలకు పశు వైద్యాధికారులను నియమించాలి. అయితే జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 31 మంది ఏడీలకు గాను 19 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకూ వారితోనే ఎలాగోలా నెట్టుకొచ్చేస్తుం డగా, ఇప్పుడు వర్గోన్నతి పొందిన పశువైద్యశాలలకు మరో 12 మంది ఏడీల అవసరం ఉంది. ఇప్పటికే 12 మంది ఏడీల కొరత ఉండగా అదనంగా 12 మంది ఏడీలను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పశు చికిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి పొందినా ఇప్పటివరకూ కాంపౌండర్ స్థాయి ఉద్యోగులతో నడుస్తున్న కేంద్రాలకు వారినే ఇన్చార్జిలుగా వాడుకోవాల్సిన ప రిస్థితి ఏర్పడింది. వర్గోన్నతి పొందిన చికిత్సా కేంద్రాలివే.. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ పశు చికిత్సా కేంద్రాలుగా సేవలందిస్తున్న నిడదవోలు, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, ఉండి, పోడూరు, అత్తిలి, గణపవరం, పెనుగొండ, నల్ల జర్ల, ధర్మాజీగూడెం, దెందులూరు కేంద్రాలు పశు వైద్యశాలలుగా మారనున్నాయి. వీటితో పాటు గ్రామీణ పశువైద్య కేంద్రాలుగా ఉన్న ఆచంట వేమవరం, మత్స్యపురి, తడికలపూడి, పెదకడిమి, శనివారపు పేట, పోతవరం, పశి వేదల, ఎల్బీ చర్ల, కోరుమామిడి, వెంకటాపురం, దొరమామిడి, ఆరుగొల ను, రేలంగి, మోగల్లు, ఆగడాలలంక కేం ద్రాలు పశు చికిత్సా కేంద్రాలుగా రూ పాంతరం చెందనున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఉన్న 11 పశువైద్యశాలలతో వర్గోన్నతి పొందిన 12 కలిపి మొత్తం 23 పశు వైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా లో 102 పశు చికిత్సా కేంద్రాల్లో వర్గోన్నతి పొందిన 12 కేంద్రాలు పోను 95 చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. వీటికి వర్గోన్నతి పొందిన మరో 15 గ్రామీణ కేంద్రాలు కలిపి మొత్తంగా 105 కేంద్రాలు సేవలందించనున్నాయి. -
తప్పు గ్రేడేషన్ ..జీఓ
పీఈటీలు, పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం 16 ఏళ్లుగా పోరాడిన ఉపాధ్యాయులను మభ్య పెట్టేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆ జీఓలో షెడ్యూలు, విధి విధానాలు లేవు. ఇదేమిటని ఉపాధ్యాయులు అడిగితే.. ఆర్థిక శాఖ క్లియరె¯Œ్స ఇచ్చి, మెమో విడుదల చేసింది. బాగానే ఉందనుకుంటే.. విద్యా శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ చేయడంలేదు. ఈ మెలిక ఏమిటన్న ప్రశ్నలకు సాకులు చెబుతున్నారే తప్ప, ఆ జీఓను అమలు చేయడం లేదు. ఇంతవరకూ చేసినట్టుగా తిరిగి పోరాట బాటలోకి వెళతామని ఉపాధ్యాయులు అంటున్నారు. భానుగుడి (కాకినాడ) : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. కుప్పలతెప్పలా పేరుకుపోయిన సమస్యలతో ఉపాధ్యాయులను గందరగోళంలో పడ్డారు. ఇందులో అతీగతీ లేని నెలవారీ పదోన్నతులు, సంవత్సరానికో డీఎస్సీ తెస్తామన్న ప్రభుత్వ హామీ, ఉపాధ్యాయులను పాత పెన్ష¯ŒS స్కీము వర్తింపు, విద్యాసంవత్సరం మధ్యలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన తదితర సమస్యలు ఉపాధ్యాయులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్యల కోవలోకి పీఈటీల, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒS కూడా చేరింది. ఇందుకు సంబం«ధించిన జీఓ జారీ చేసి ఐదు నెలలైనా అమలు కాలేదు. 16 ఏళ్ల పోరాటం... పీఈటీ, పండిట్లు 16 ఏళ్లుగా అప్ గ్రేడేష¯ŒS కోసం పోరాటం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఈ సమస్యను దాటవేశాయే తప్ప పరిష్కరించడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో పీఈటీ, పండిట్ల అప్ గ్రేడేష¯ŒS కోసం జీఓ 144ను విడుదల చేసింది. అయితే ఇంతవరకూ ఆ జోఓ అమలుకాలేదు. అప్‌గ్రేడేష¯ŒS షెడ్యులు లేకపోవడం, విధి వి«ధానాలు లేకుండా మొక్కుబడిగా జీఓ ఉంది. గతేడాది ఆక్టోబర్‌లో అప్‌గ్రేడేష¯ŒSకు ఆర్థిక శాఖ క్లియరె¯Œ్స ఇచ్చి, మెమో విడుదల చేసింది. విద్యా శాఖ డైరెక్టరేట్ నుంచి మాత్రం ఆదేశాలు రాలేదు. నిరీక్షణలో 341 మంది ఉపాధ్యాయులు. జిల్లాలో 166 పీఈటీ పోస్టులు, 105 తెలుగు పండిట్ పోస్టులు, 65 హిందీ, 5 సంస్కృత ఉపాధ్యాయుల పోస్టులు అప్‌గ్రేడ్ చేసినట్టు డీఈఓ వెబ్సైట్లో ఉంచారు. అయితే సీనియారిటీ జాబితా వివరాలు, కౌన్సిలింగ్ తేదీలు, విధి విధానాలు మాత్రం ఇందులో లేవు. ఈ విషయమై ఉపాధ్యాయులు అధికారులను ఎన్నిసార్లు కలిసినా విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి అదేశాలు రాలేదనే చెబుతున్నారు. అక్కడికు వెళితే నెలవారీ పదోన్నతుల కేసు కోర్టులో ఉందంటూ సాకు చెబుతున్నారు. విద్యాశాఖ ఆదేశాలతో 164 జెడ్పీ పాఠశాలలు, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ పీఈలుగా మార్పు చేస్తున్నట్టు, ఎల్పీలను ఎస్ఏలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు వెబ్సైట్లో ఉంచారు. అయితే ఉపాధ్యాయుల సినీయారిటీ లిస్టు, షెడ్యుల్స్ అందులో లేకపోవడంతో ఉపాధ్యాయులను గందరగోళంలో పడ్డారు. తక్షణమే షెడ్యులు విడుదల చేసి పీఈటీ, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒSను నిర్వహించకుంటే రోడ్డెక్కుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమానికి దిగుతాం పీఈటీ, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒS కోసం 16 ఏళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా మా దుస్థితి మారడం లేదు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన జీఓలో విధివిధానాలు లేవు. ఇప్పటికైనా అప్‌గ్రేడేష¯ŒS పూర్తి చేయకుంటే ఉద్యమం చేపడతాం. – ఎల్.జార్జి, పీఈటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాతో ఆటలా? రాత్రికి రాత్రే జీఓలు జారీ చేసి, పనులు చకచకా చేసుకుంటున్న రోజులివి. ఉపాధ్యాయుల కొచ్చేసరికి కొర్రీలు వేస్తున్నారు. చాలామంది రిటైర్మెంట్కి దగ్గరకొచ్చినా పీఈటీగానే ఉన్నారు. 25 ఏళ్లు సర్వీసు చేసినా ఎస్ఏ క్యాడర్ లేదు. మాతో ఆటలాడటం సరికాదు. – పప్పు శ్రీనివాసరావు, పీఈటీ, జెడ్పీహెచ్ఎస్, పవర ఇక ఉద్యమమే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నాం. ఏ త్యాగానికైనా మేనుకాడం. ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. ప్రభుత్వానికి మాపై కనికరం లేదు. జిల్లాలో ఉపాధ్యాయు లందరూ నిరీక్షిస్తున్నారు. వారు ఆగ్రహం చెందక ముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. – వి.మాచర్రావు, నేమాం జెడ్పీహెచ్ఎస్ పీఈటీ -
జియో యూజర్లకు వార్నింగ్.. ఆ మెసేజ్‌తో జాగ్రత్త!
న్యూఢిల్లీ : ఉచిత ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్న రిలయన్స్ జియో రోజువారీ డౌన్లోడ్ పరిమితిని పెంచుతుందంటూ... మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే వాటిని నమ్మి మోసపోకండి. జియో డౌన్లోడ్ పరిమితినేమి పెంచడం లేదట. సైబర్ క్రిమినల్స్ పన్నిన పన్నాగమే ఈ తప్పుడు మెసేజ్‌లు అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రిలయన్స్ జియో పేరుతో ఫేస్బుక్లో ఫేక్ మెసేజ్‌లు పంపుతూ యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ క్రిమినల్స్ కొట్టేస్తున్నారట. అంతేకాదు ఆ మెసేజ్‌లను మరో 10 స్నేహితులకు ఫార్వర్డ్ చేయడంటూ వారిని కూడా రిస్క్‌లో పడేస్తున్నారట. రిలయన్స్ జియో యూజర్లు ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, రోజువారి డేటా పరిమితి 1జీబీ నుంచి 10 జీబీకి అప్‌గ్రేడ్ అవుతుందనే మెసేజ్ ఇటీవల ఫేస్బుక్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, యూజర్ల మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్‌తో పాటు పలు వివరాలను అడుగుతోంది. అన్ని వివరాలను యూజర్లు షేర్ చేసిన అనంతరం ఆ మెసేజ్‌ను మరో 10 మంది వాట్సాప్ గ్రూప్‌లకు పంపండంటూ అది అడుగుతోంది. జియో సర్వీసు అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఆ లింక్‌ను 10 మంది వాట్సాప్ గ్రూప్స్‌కు లేదా స్నేహితులకు పంపించాల్సిందేనట. నిజంగా జియో సర్వీసు అప్‌గ్రేడ్ అవుతుందని నమ్మి ఈ పని చేశారో, యూజర్లు మోసపోయినట్టేనట. యూజర్ల వ్యక్తిగత డేటా సైబర్ క్రిమినల్స్ చేతిలోకి వెళ్లిపోతుందట. ఆ పేజీలోనే మరో వివరం కూడా ఉంది. గో4జీ అసలు రిలయన్స్ లేదా జియోకు సంబంధించి కాదని నిబంధనలు, షరతుల్లో తెలుపుతున్నారు. దాన్ని చూసుకోకుండా ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, కేవలం తమ వ్యక్తిగత డేటానే కాకుండా స్నేహితులను రిస్కులో పడేసినట్టేనని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. కంపెనీ ఇటీవలే ఉచిత ఆఫర్ల సర్వీసులను పొడిగిస్తూ హ్యాపీ న్యూఇయర్ ఆఫర్లో రోజువారి కేవలం 1జీబీ డేటానే రిలయన్స్ జియో ఆఫర్ చేస్తుంది. ఈ పరిమితిని పెంచుతూ కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ ఫేక్ మెసేజ్‌లు జియో పేరుతో వచ్చి యూజర్లను మోసం చేస్తున్నాయి. -
పీఈటీ, పండిట్ అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు విడుదల
అనంతపురం : రాష్ట్రంలో అప్‌గ్రేడ్ అయిన 2,650 పీఈటీ, పండిట్ పోస్టులను జిల్లాలకు కేటాయిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్టీయూ ఏపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ జిల్లాలైన వైఎస్సార్ కడపకు అప్‌గ్రేడ్ అయిన పీఈటీ పోస్టులు 60, అనంతపురం 98, కర్నూలు 110, పండిట్లు కడపకు 76, అనంతపురం 131, కర్నూలు 145 పోస్టులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. 200 మంది విద్యార్థులు మించిన ఉన్నత పాఠశాలలకు సంబంధించి పోస్టులు కేటాయించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారన్నారు. వెంటనే పదోన్నతులు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పురపాలక శాఖ ప్రతిపాదించిన పీఈటీ, పండిట్ పోస్టులన్నీ అప్‌గ్రేడ్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. -
‘అప్‌గ్రేడ్’ పోస్టులపై చిక్కుముడి!
• ఆ పోస్టుల్లో ఎస్జీటీలకు అవకాశమివ్వద్దంటున్న పండిట్లు • జీవో నంబర్లు 11, 12లను సవరించాలని డిమాండ్ • నిబంధనల ప్రకారం తమను నియమించాలంటున్న ఎస్జీటీలు సాక్షి, హైదరాబాద్: ఉన్నత పాఠశాలల్లో భాషా పండిత పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మరో చిక్కుముడి పడుతోంది. విద్యాహక్కు చట్టం నేపథ్యంలో కొన్నేళ్ల కింద జారీ అయిన జీవో నంబర్ 11, 12లతో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. అప్‌గ్రేడ్ అయ్యే పోస్టుల్లో అర్హతలు కలిగిన భాషా పండితులనే నియమిస్తారా.. లేక పండిత శిక్షణ కోర్సుతో సంబంధం లేకుండా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా నియమితులై బీఈడీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసినవారినీ నియమిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) కేడర్ ఉపాధ్యాయులు.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) పనిచేయాలి. అయితే భాషా పండితుల్లో గ్రేడ్-1, గ్రేడ్-2 అనే రెండు రకాల పోస్టులు ఉన్నాయి. పీజీ కలిగిన పండిట్లకు గ్రేడ్-1, భాషా పండిత కోర్సులు మాత్రమే చేసినవారికి గ్రేడ్-2 పండిట్ హోదా ఇచ్చారు. గ్రేడ్-1 పండిట్‌ను ఎస్ఏ హోదాతో సమానంగా పరిగణిస్తారు. వారికి కొన్నేళ్ల కిందే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ (ఎస్ఏఎల్) హోదా కూడా ఇచ్చారు. గ్రేట్-2 పండితులు ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్నా వారికి ఎస్ఏ హోదా లేదు. అయితే విద్యా హక్కు చట్టం నేపథ్యంలో గ్రేడ్-2 పండిట్ పోస్టులను కూడా ‘స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్’ హోదా గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ కలిగిన వారిని స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌గా మార్చుతామంటూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఎస్జీటీగా నియమితులైనా కూడా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉంటే.. వారికి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పోస్టులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో గ్రేడ్-2 భాషా పండిత ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. తొలి నుంచీ డిమాండ్.. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 6 వేల మంది గ్రేడ్-2 భాషా (తెలుగు, ఉర్దూ, హిందీ) పండితులు.. అప్‌గ్రేడ్ చేసే పోస్టుల్లో పండిత శిక్షణ కోర్సుతో పాటు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారిని నియమించాలని తొలి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జీవో 11, 12లను సవరించాలని కోరుతున్నారు. ఆ జీవోలను సవరిస్తేనే భాషా పండితులకు న్యాయం జరుగుతుందని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్రీయ పండిత పరిషత్తు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, జగదీశ్‌లు పేర్కొన్నారు. ఎస్జీటీలకు అవకాశమిస్తే భాషా పండితులకు అన్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు ప్రస్తుత నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన తమకు ఎస్ఏఎల్గా అవకాశమివ్వాల్సిందేనని ఎస్జీటీలు డిమాండ్ చేస్తున్నారు. -
స్థాయిపెంపు ఆర్థిక భారమే..
ఏసీ నుంచి ఆర్జేసీ స్థాయికి తలుపులమ్మలోవ దీనివల్ల భక్తులకు ఒరిగేదేమీ ఉండదంటున్న ఆలయ వర్గాలు తుని రూరల్ : అసిస్టెంట్ కమిషనర్ హోదాతో నడుస్తోన్న తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయికి పెంచడం వల్ల ఆర్థిక భారమే తప్ప భక్తులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఐదు దేవాలయాల స్థాయి పెంచాలన్న నిర్ణయం ఆయా ఆలయాలపై పరోక్షంగా ఆర్థికభారం మోపడమేనని పలువురు భక్తులతో పాటు, ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కసారిగా.. 1981లో దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చిన తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఏసీ స్థాయిలో ఉంది. ఐదారేళ్ల క్రితం డిప్యూటీ కమిషనర్ స్థాయికి పెంచాలని ప్రతిపాదనలు మూలనపడ్డాయి. ఇప్పుడు ఏకంగా రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయికి పెంచడంపై ఉద్యోగులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐదారేళ్లగా దుకాణాల లైసెన్సులు, హుండీలు, ప్రసాదం, పూజా సేవలు, విరాళాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల ద్వారా ఆదాయం బాగా పెరిగింది. అంతే మొత్తం ఖర్చులూ అవుతున్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే.. దుకాణాల లైసెన్సులు, హుండీలు, వసతి, సేవలు, విరాళాలు, అడ్వాన్స్‌లు, వడ్డీలు, ఇతరత్రా ఆదాయం రూ.11.43 కోట్లు రాగా, ఎస్టాబ్లిష్మెంట్, గ్రూపు గ్రాట్యుటీ, సరకులు కొనుగోళ్లు, అభివృద్ధి, సౌకర్యాలు, తాగునీరు, మరమ్మతులు, స్టాట్యుటరీ, డిపాజిట్లు, ఇతర వ్యయాలకు పై మొత్తాన్ని ఖర్చుగా పేర్కొన్నారు. ఇందులో రూ.5,14,990లను అంత్య నిల్వగా చూపించారు. పెంపుతో.. తలుపులమ్మ దేవస్థానంతోపాటు అరసవెల్లి, కోటప్పకొండ, అహోబిలం, మహానంది ఆలయాల స్థాయి పెంచినప్పుడు అవసరమైతే ఇప్పుడున్న సిబ్బందికి అదనపు సిబ్బందిని నియమించుకోవచ్చు. అదనంగా ఏఈఓ, డీఈ, పీఆర్ఓ సహా పది పోస్టులు లభిస్తాయి. దీంతో ఇప్పుడు నెలకు రూ.15లక్షలుగా ఉన్న జీతభత్యాలు రూ.20లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఏసీ స్థాయిలో అత్యవసరాలకు రూ.20వేలు ఖర్చు చేసే మొత్తం రూ.లక్షల వరకు వినియోగించుకోవచ్చు. సర్ధుబాటుకే ఆలయాలస్థాయి పెంపు ఉన్నతాధికారుల సర్దుబాటుకేనని తెలుస్తోంది. ప్రముఖ ఆలయాలకు ఐఏఎస్ అధికారులను నియమించాలన్న ప్రభుత్వం ఆలోచనలో భాగంగానే ఈ స్థాయి పెంపు అంశం తెరపైకి వచ్చిందంటున్నారు. అన్నవరం దేవస్థానం వంటి ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఆర్జేసీలు పర్యవేక్షిస్తున్నారు. వారి స్థానంలో ఐఏఎస్‌లను నియమించి ఆర్‌జేసీలకు కొత్తగా స్థాయి పెంచే ఆలయాల నిర్వహణను అప్పగిస్తారని తెలుస్తోంది. ఆదాయం, సౌకర్యాలు పెంపు వల్ల భక్తులకు మేలు జరుగుతుంది తప్ప, ఆలయాల స్థాయి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. -
సర్వీస్‌రూల్స్ సాధిస్తాం
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నిజామాబాద్‌అర్బన్: సర్వీస్ రూల్స్ లేకపోవడంతో ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోతున్నారని, త్వరలో వాటిని సాధిస్తామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, త్వరలో హెల్త్‌కార్డులు అందేలా చూస్తామన్నారు. దీని కోసం ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు మాత్రమే పాటిస్తామన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, కమలాకర్‌రావులు జిల్లాలో ఎస్ఎంస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మాణం చేశారు. మోడల్, కేజీబీవీ టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పడి సంఘం రెండుగా విడిపోయినప్పటికీ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు, మండలాల బాధ్యులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి.. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్ఇండియా టీచర్స్ అసోసియేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ విధానం అప్రజాస్వామికమని, దాన్ని రద్దు చేయాలని దశల వారీగా పోరాటాలు చేస్తామన్నారు. పీర్టీయూ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో డిప్యూటీ డీఈవోలకు పదోన్నతి కల్పించి డీఈవోలుగా నియమించాలన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో కొనసాగేలా చూడాలన్నారు. తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిలను దసరా, దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయలని, ఉపాధ్యాయుల జీపీఏకు సంబంధించి 100 కోట్ల వడ్డీని వెంటనే విడుదల చేయలన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
బాలభవన్‌గా బాలకేంద్రం
ఏలూరు: ఏలూరులోని బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పార్ట్‌టైమ్ పోస్టులను ఫుల్‌టైమ్ పోస్టులుగా మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులిచ్చారు. సూపరింటెండెంట్, డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్లు, అటెండర్, ఆయా/స్వీపర్లను పూర్తికాల ఉద్యోగులుగా అప్‌గ్రేడ్ చేశారు. -
తండాల అప్‌గ్రేడ్‌కు ప్రణాళికలు
గుండ్రాతిమడుగు (కురవి) : తండాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. మండలంలోని గుండ్రాతిమడుగు (విలేజీ) శివారు పెద్ద తండాలో ఆదివారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ తండాలను పంచాయతీలుగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 5046 తండాలుండగా.. మొదటి దశలో 1756 తండాలు పంచాయతీలు కానున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించనుందని తెలిపారు. తీజ్ ఉత్సవాలను రాష్ట్రంలో ఒకేసారి నిర్వహించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డోర్నకల్ మాజీ ఎమ్మె ల్యే సత్యవతిరాథోడ్, నాయకులు బండి వెంకటరెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నున్నా రమణ, గుగులోత్ కిషన్‌నాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పశువైద్యం.. మరింత చేరువ
– జిల్లా పశు సంవర్ధకశాఖ పునర్వ్యవస్థీకరణ – 30 వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు – పదకొండింటి స్థాయి పెంపు – జేడీ కార్యాలయానికి 5 పోస్టులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధక శాఖ పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పశువులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. పలు గ్రామీణ పశువైద్యశాలలు, పశువైద్యశాలలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా ఏడీ, డీడీ పోస్టులు మంజూరయ్యాయి. అప్‌గ్రేడ్ అయిన గ్రామీణ పశువైద్యశాలలు.. జిల్లాలోని 30 గ్రామీణ పశువైద్యశాలలను అఫ్‌గ్రేడ్ చేశారు. ఇప్పటి వరకు కాంపౌండర్ స్థాయి ఉద్యోగులతో నడిచే వీటికి ఇకపై వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లను నియమిస్తారు. అల్లూరు(నందికొట్కూరు), అల్లూరు(ఉయ్యాలవాడ), విరుపాపుర ం, బైచిగేరి, మాధవరం, ఉరుకుంద, ముక్కెళ్ల, కటారుకొండ, డబ్ల్యూ కొత్తపల్లి, ఆలమూరు, యాగంటిపల్లి, నొస్సం, కొచ్చెరువు, ముద్దవరం, ఉల్చాల, నిడ్జూరు, పోలకల్, పెద్దకొట్టాల, నెహ్రూనగర్(గోస్పాడు), ఉల్లిందకొండ, గడిగరేవుల, వెంకటాపురం, మోత్కూరు, కైరుప్పల, గూళ్యం, కొటేకల్, ముగితి, కర్నూలు బుధవారపేట, మిట్టకందాల, ప్రాతకోట(వెస్ట్) పశువైద్యశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు పశువైద్యశాలలు (వెటర్నరీ డిస్పెన్షరీలు) జిల్లాలో 121 ఉండగా వీటితో కలిపి ఈ సంఖ్య 151కి చేరనుంది. జిల్లాకు మొత్తం 33 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. వీటిని కొత్తవారితో భర్తీ చేస్తారు. 11 పశువైద్యశాలల స్థాయి పెంపు జిల్లాలోని 11 పశువైద్యశాలలను వెటర్నరీ హాస్పిటల్‌గా పదోన్నతి కల్పించారు. ఇకపై వీటిల్లో వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లకు బదులు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతి కల్పించడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పెద్దకడుబూరు, బేతంచెర్ల, కొసిగి, ఆస్పరి, కల్లూరు, జూపాడుబంగ్లా, పాణ్యం, వెలుగోడు, గూడూరు, రుద్రవరం, సంజామల పశువైద్యశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి జిల్లాలో 15 ఉండగా ఇకపై 26కు చేరతాయి. 5 డీడీ పోస్టులు మంజూరు జిల్లాకు కొత్తగా 5 ఉప సంచాలకుల (డీడీ)పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆళ్లగడ్డ(నాలుగు) డివిజన్లుండగా అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి అధికారులు నేతత్వం వహిస్తున్నారు. ఈ పోస్టులను కూడా అఫ్‌గ్రేడ్ చేశారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థకు ఇప్పటి వరకు ఏడీ స్థాయి అధికారి పనిచేస్తున్నారు. దీనిని డీడీ పోస్టుగా మార్పు చేశారు. పశుగణాభివద్ది సంస్థకు అదనంగా ఒక వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టు మంజారైంది. ఇక నుంచి డివిజనల్ స్థాయిలోనూ పశుగణాభివద్ధి సంస్థకు డీడీలు పనిచే స్తారు. ఏడీలకు పదోన్నతి కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేస్తారు. జేడీ కార్యాలయానికి కొత్తపోస్టులు పశుసంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి మూడు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు మంజారయ్యాయి. ఇప్పటి వరకు జేడీ కార్యాలయానికి ఎలాంటి పోస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై తెచ్చుకొని పనిచేయించుకుంటున్నారు. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా 3 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు. 2 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజారైనట్లు జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. -
గ్రంథాలయ అప్‌గ్రేడ్‌కు మోక్షం
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మానుకోట శాఖ గ్రంథాలయం అప్‌గ్రేడ్ కానుంది. ఈ గ్రంథాలయం ప్రస్తుతం గ్రేడ్ 3గా ఉంది. గ్రంథాలయ కమిటీ, పలు సంఘాలు గ్రేడ్ 2 కోసం కొన్నేళ్లుగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయితే జిల్లా ఏర్పాటుతో మానుకోట గ్రంథాలయం గ్రేడ్–1 అయ్యే అవకాశం ఉం ది. 1939 సంవత్సరంలో బాపూజీ పేర గ్రంథాలయాన్ని ఏర్పా టు చేయగా 1964లో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఈ గ్రం థాలయంలో 24వేల పుస్తకాలు, 2,450 మంది సభ్యులు ఉన్నా రు. రోజూ వచ్చే పాఠకుల సంఖ్య 500కు పైగా ఉంటుంది. పాఠకుల సంఖ్య మేరకు గ్రంథాలయం అభివృద్ధి జరగలేదు. ఉన్న రెండు గదుల్లో ఒకటి శిథిలావస్థకు చేరింది. దీంతో రీడింగ్ హాల్లోనే పుస్తకాలు భద్రపరుస్తున్నారు. క్రమంగా గ్రంథాలయానికి ఆదరణ కరువైంది. రెండేళ్లలో పోటీ పరీక్షల మెటీరి యల్, ఇతర పుస్తకాలు రావడంలేదు. 17 పుస్తకాలు మాత్రమే వచ్చాయని సిబ్బంది తెలిపారు. మానుకోట గ్రంథాలయం గ్రేడ్–3గా ఉండగా నర్సంపేట, జనగామ మాత్రం గ్రేడ్–2లో ఉన్నా యి. గ్రేడ్–2 కోసం ఎంతోకాలంగా కమిటీ సభ్యులు, పలు సంఘాల, పలు పార్టీలు పోరాడాయి. ఇక్కడ కనీసం మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేవు. గ్రంథ పాలకుడు (లైబ్రేరియన్) కూడా ఇన్చార్జే ఉన్నారు. మరో ఫుల్‌టైమ్ వర్కర్ పనిచేస్తున్నా రు. జంగిలిగొండ, సబ్జైల్లో బుక్ డిపాజిట్ సెంటర్లు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) కొనసాగుతున్నాయి. నంబర్ వన్ గ్రేడ్.. మానుకోట జిల్లా ఏర్పాటుతో మానుకోట శాఖ గ్రంథాలయం గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కు అప్‌గ్రేడ్ కానుంది. గ్రేడ్–1 అయితే అన్ని హంగుల భవనం, ఇంటర్నెట్ సౌకర్యం, పుస్తకాలు, సిబ్బంది సంఖ్య పెరుగుదల, ఇతర సౌకర్యాలు మెరుగుపడతాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచే ఉంటుంది. గ్రేడ్ 2లో వార్తా పత్రికలు తప్పా పుస్తకాల సెక్షన్ ఉండదు. కానీ గ్రేడ్–1 అయితే పలు రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. -
మున్సిపల్ పండిట్లను అప్‌గ్రేడ్ చేయాలి
మచిలీపట్నం : ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లే పురపాలక సంఘ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ము నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తొలివిడతగా పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించటం అభినందనీయమన్నారు. ఇదే విధానాన్ని పురపాలక సంఘ పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. సక్సెస్ పాఠశాలల్లో పురపాలక సంఘ పాఠశాలలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. రాష్టోపాధ్యాయ సంఘం మచిలీపట్నంశాఖ అధ్యక్షుడు యువీ రాధాకృష్ణమూర్తి జీవో నెంబరు 144ను పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ఒక ప్రకటనలో కోరారు. -
పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి
రాంనగర్: భాషా పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు సీహె చ్. రాములు, పి. గోపాల్‌రెడ్డి, ఎం. సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, రవికుమార్, విద్యాసాగర్‌రెడ్డి, సుందరయ్య, వెంకులు, వెంకటేశ్వర్లు, రామనర్సయ్య, దశరథరామారావు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ‘అప్‌గ్రేడ్’ ధర్నా
ఖమ్మం : రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని తెలుగు, హిందీ భాషా పండిట్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 11 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు, ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నర్సింహారావు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సీహెచ్.దుర్గాభవాని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్క ఉపాధ్యాయుడి సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు పెట్టండి.. టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయండి అని చెబుతూ ప్రభుత్వం విద్యారంగం నుంచి తప్పుకోవాలని చూస్తోందన్నారు. చర్చల సందర్భంగా సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నా శిబిరానికి టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు జీవీ నాగమల్లేశ్వరరావు, రామాచారి, ఎస్కె.మహబూబ్ అధ్యక్షత వహించగా.. సీఐటీయూ జిల్లా నాయకులు లింగయ్య, కార్మిక సంఘం ఐఎఫ్టీయూ నాయకులు అశోక్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు జలీల్ ధర్నా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పూర్ణచందర్రావు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్, ఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.కోటారెడ్డి, వివిధ సంఘాల జిల్లా నాయకులు ఆర్.రవికుమార్, రమాదేవి, బి.రాందాస్, మహబూబ్అలీ, నాగిరెడ్డి, బి.కృష్ణారావు, జె.రాంబాబు, బి.హనుమంతు, టి.ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ఎం.మురళీమోహన్, పీవీఆర్కే ప్రసాద్, ఎం.ఆంథోని, ఉమాదేవి పాల్గొన్నారు. -
పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రెడ్ చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న భాషా పండితులు గ్రేడ్–2 ఉపాధ్యాయులపై వేతనంలోను, హోదాలోను వివక్ష కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆరోపించింది. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ చేయాలని కోరుతూ గురువారం కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఉన్నత పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులే ఉండాలన్నారు. చేసే పనిలో తేడా లేకుండా హోదా, వేతనాలలో ఈ ఉపాధ్యాయులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్, పీఈటీ పోస్టులకు వారితో సమానంగా వేతనాలను అందజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీఈటీ, పండిట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ భారతీ హోలికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొండల్రావు, రవీందర్, సంజీవ, మల్లయ్య, దేవదాస్ పాల్గొన్నారు. -
‘గ్రేడ్–2 పండిత్‌లను అప్‌గ్రేడ్ చేయాలి’
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) కు బదులు తెలుగు, హిందీ, ఉర్దూలో గ్రేడ్–2 పండిత్‌లతోనే ప్రభుత్వం పని చేయించుకుంటోందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిట్ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వెంటనే గ్రేడ్–2 పండిత్‌లను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. సంఘం రాష్ట్ర మహిళా ప్రతినిధి అనురాధ మాట్లాడుతూ జీఓ 11, 12లను సవరించి పదోన్నతులు కల్పించాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో భాషా పండిత్‌లు, పీఈటీలను నియమించాలన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే మహాధర్నాకు జిల్లా నుంచి పండిత్‌లు, పీఈటీలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రతినిధి రాకేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణాచార్యులు, విజయ్‌కుమార్, లింగం, శాంతారెడ్డి, జగన్మోహన్గౌడ్, వాడెన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ కూసుమంచి : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆ శాఖ కమిషనర్ అరుణ కోరారు. కూసుమంచిలోని సమీకృత వసతి గృహాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల ప్రగతిని.. వసతులను పరిశీలించారు. అనంతరం కమిషన ర్ మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదుకోవాలన్నారు. బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 18 రెసిడెన్షియల్ స్కూళ్లు, 3 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు జరుగుతుందని అన్నారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మెరిట్ విద్యార్థులను గుర్తించి.. వారు ప్రభుత్వ ఖర్చుతో ఉన్నత చదువులు చదివేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహాల్లో హరితహారం కింద 30వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అనంతరం వసతి గృహ విద్యార్థులకు హరితహారంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించగా.. విజేతలైన వారికి కమిషనర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఈడీ ఆంజనేయశర్మ, వసతి గృహం ప్రత్యేకాధికారి ఈదయ్య తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్
హైదరాబాద్: హెచ్‌పీ లూబ్రికెంట్స్ తాజాగా అప్‌గ్రేడెడ్ డీజిల్ ఇంజిన్ ఆయిల్.. హెచ్‌పీ మిల్సీ సూపర్ 20 డబ్ల్యూ 40 (సీఎఫ్-4)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అన్ని రకాల బీఎస్-1 డీజిల్ ఇంజిన్ వాహనాలకు ఇది అత్యుత్తమంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనపు ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడంలో హెచ్‌పీ మిల్సీ సూపర్ 20డబ్ల్యూ 40 కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంది. -
మహిళకు మైక్రోసాఫ్ట్ నష్టపరిహారం
న్యూయార్క్ః సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లతో ప్రవేశ పెట్టిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.. సంస్థకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. లక్షల మంది యూజర్ల అభిప్రాయాలతో తీర్చి దిద్దామని, అత్యంత సురక్షితమైన వెర్షన్ అంటూ గత యేడాది మార్కెట్లో ప్రవేశ పెట్టిన కంపెనీ.. యూజర్లను అప్ గ్రేడ్ చేసుకోమంటూ తొందర పెట్టడం తలకు చుట్టుకుంది. పాత వెర్షన్ ఓ ఎస్ లను వాడుతున్న వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమంటూ నోటీసులు పంపించడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ మహిళ కోర్టుకెక్కడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియా సాసాలిటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీపై పెట్టిన కేసులో విజయం సాధించింది. మైక్రోసాఫ్ట్ తమను విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమని బలవంత పెడుతోందంటూ పెట్టిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్నెల్లలో 30 కోట్లమంది వరకూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకున్నా... అక్కడితో ఆగని మైక్రోసాఫ్ట్.. ఆ సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా పాత ఓ ఎస్ లను వాడుతున్నవారికి నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థ తమను బలవంత పెడుతోందంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేయగా... కొందరు తమ ప్రమేయం లేకుండా విండోస్ 10 ఇన్ స్టాల్ అయిపోతోందంటూ మండిపడ్డారు. అదే ఆరోపణలతో కోర్టు కెక్కిన మహిళ కేసును కోర్టు విచారించింది. తాజాగా వెలువడ్డ తీర్పులో ఆమెకు మైక్రోసాఫ్ట్ 10 వేల డాలర్డు అంటే సుమారు 7 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టెరీకి పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న టెరీ.. తన కంప్యూటర్లో విండోస్ 7 తో పనిచేస్తోంది. అయితే ఆమె చేసుకోకుండానే విండోస్ 10 అప్ డేట్ అయిపోవడంతో ఆగ్రహించిన ఆమె మైక్రోసాఫ్ట్ కంపెనీ తీరుపై కోర్టులో కేసు వేసింది. విండోస్ 10 అప్ డేట్ వల్ల కంప్యూటర్ పనిచేయడం మానేసిందని, తన వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని కోర్టుకు విన్నవించింది. అందుకు పరిహారంగా 17 వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు 10 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో సంస్థ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
ఆశీస్సులున్నవారికే...
‘వడ్డించేవారు మనవారైతే... కడబంతిలో కూచున్నా ఫర్వాలేదు’ అన్న సామెత ఇక్కడ అచ్చంగా సరిపోతుంది. అధికారం అండగా ఉంటే ఏదైనా సాధించొచ్చన్న దానికి ఇది అద్దం పడుతోంది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగుల కొనసాగింపుపై రాజకీయ క్రీనీడలు కమ్ముకున్నాయి. మెరుగైన పనితీరు కనబర్చినా... వారిని తప్పించేసి, ఆరోపణలు ఎదుర్కొన్నవారిని కొనసాగించడం చూస్తే ఈ వాస్తవాలు రుజువవుతున్నాయి. గ్రేడుల పేరుతో గందరగోళం సృష్టించి... పారదర్శకత పేరుతో పక్షపాత ధోరణితో వ్యవహరించి... 150మంది భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చేశారు. * కేజీబీవీ సిబ్బంది కొనసాగింపులో రాజకీయ జోక్యం ? * పనితీరు నిర్ధారణలో వివక్ష * మెరుగైన పనితీరు చూపించినవారికి సీ గ్రేడ్ * ఆరోపణలున్న వారికే పెద్దపీట * ప్రశ్నార్థకంగా మారిన 150మంది భవిష్యత్ సాక్షి ప్రతినిధి, విజయనగరం : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో రాజకీయ జోక్యం పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తాత్కాలిక ప్రాపతిపదికన పనిచేసే ఉద్యోగుల్ని ఏప్రిల్ వరకూ పనిచేయించుకుని, తిరిగి జూన్‌లో వారి ఉద్యోగాలను పునరుద్ధరిస్తారు. ఇక్కడ పనిచేసే ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు, అకౌంటెం ట్లు, ఏఎన్ఎంలు, కుక్‌లు ఇలా ప్రతీ ఒక్కరికీ ఏడాది ప్రాతిపదికనే రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. ఈసారి సిబ్బంది కొనసాగింపులో మాత్రం పనితీరును ప్రామాణికం పేరుతో రాజకీయ జోక్యానికి తెరతీస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వారినే రెన్యువల్ చేస్తే తమ వారికి అవకాశం రాదన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు పన్నిన వ్యూహమే పనితీరు ప్రామాణికమని వారు వాదిస్తున్నారు. 150 మందికి రెన్యువల్ నిలిపివేత జిల్లాలో 33కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 625మంది పనిచేస్తున్నారు. వీరందరినీ పనితీరు ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. ఏ, బీ గ్రేడ్ల వారికి రెన్యువల్ ఉత్తర్వులు అందజేసి, సీ గ్రేడ్లొచ్చిన వారికి నిలిపేసారు. 12మంది ప్రత్యేకాధికారులు, 50మంది సీఆర్టీలు, 33మంది అకౌంటెంట్లు, 14మంది ఏఎన్ఎంలతో పాటు పలువురు కుక్‌లు, పీఈటీలు ఇలా గాలిలో ఉన్నారు. గ్రేడ్ల నిర్ధారణపై ఆరోపణలు మెరుగైన ఫలితాలు, మంచి ప్రతిభ కనబరిచిన వారికి సీ గ్రేడ్లిచ్చి, ఆరోపణలు ఉన్న వారికి ఏ, బీ గ్రేడ్లు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. * రాష్ట్ర ఫైనాన్స్ కంట్రోల్ పర్యటనలో విద్యార్థులకు గుడ్లు పెట్టడం లేదని, చిన్న చిన్న అరటి పండ్లు, కుళ్లిన కూరగాయలు వండి పెడుతున్నారని ఓ కేజీబీవీని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశా రు. దానికి మంచి గ్రేడ్ ఇచ్చినట్టు సమాచారం. * ఓ కేజీబీవీలో విద్యార్థిని మృతిచెంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యాలయం నిర్వహణ సరిగా లేదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం లేదని, మెనూ కూడా సక్రమంగా అందించడం లేదని దానిపై ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పుడా కేజీబీవీని మెరుగైన గ్రేడ్‌లోకి తెచ్చారని చెబుతున్నారు. * మరో కేజీబీవీలో 26మంది విద్యార్థులు అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. కానీ పనితీరు ప్రామాణికంలో మంచి గ్రేడ్ ఇచ్చారు. * ఓ ఇద్దరు ప్రత్యేకాధికారులు రోజూ విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించడంతో విద్యాలయాలు సరిగా నడవడం లేదన్న ఆరోపణలున్నాయి. వాటికి తొలి గ్రేడ్లే ఇచ్చారు. * 100శాతం ఫలితాలు వచ్చిన పలు కేజీబీవీలను సీ గ్రేడ్‌లో పెట్టి, వాటి కన్న తక్కువ ఫలితాలొచ్చిన వాటికి ఏ, బీ గ్రేడ్లిచ్చినట్టు తెలుస్తోంది. ప్రత్యేక పరిశీలనలంటూ సన్నాయినొక్కులు సీ గ్రేడ్‌లో పెట్టిన వారందరినీ నేరుగా పొమ్మనకుండా ప్రత్యేక పరిశీలన పేరుతో ప్రస్తుతానికి బుజ్జగించే కార్యక్రమం చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వకుండానే మూడు నెలల పాటు అదే విద్యాలయాల్లో పనిచేయించుకునే యత్నాలు చేస్తున్నారు. ఈ మూడు నెలల పనితీరును అధ్యయనం చేసి, సంతృప్తికరంగా ఉంటే రెన్యువల్‌పై ఆలోచిస్తామంటూ ఆ 150మందికి సూచించారు. ఇదంతా చూస్తుంటే మూడు నెలలు పని చేయించుకుని సంతృప్తికరంగా లేదంటూ సాగనంపి, తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకేనని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజీవ్ విద్యా మిషన్ పీఓ లింగేశ్వరరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకామే గ్రేడింగ్‌లు ఇచ్చామని తెలిపారు. ఎక్కడా రాజీపడలేదని చెప్పారు. గ్రేడ్లు ఇవ్వడంలో లోటుపాట్లు ఉన్నాయని ఇంతవరకూ ఉన్నతాధికారులకు గానీ, తనకు గానీ ఫిర్యాదులు రాలేదనీ, ఒకవేళ వస్తే పరిశీలిస్తామని వివరించారు. -
భారీ సంఖ్యలో మారుతి కార్లు రీకాల్
కార్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోసారి వేల సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది. బాలెనో పేరుతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో దూసుకువచ్చిన మారుతి సుమారు 75వేల బాలెనో రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. కార్ల మార్కెట్ లో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు వీలుగా తన కార్లను వరుసగా అప్ గ్రేడ్ చేస్తూ వస్తున్న మారుతి తాజాగా తన సరికొత్త మోడల్ బాలెనో 75,419 కాలర్లను వెనక్కి రప్పించనుంది. 2015 ఆగస్టు 3 నుంచి 2016 మే 17 వరకు తయారుచేసిన పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్ల కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు సుజుకి ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ సమయంలో తయారుచేసిన 16వేల డీజిల్ బాలెనో కార్లలో ఫ్యుయల్ ఫిల్టర్ కూడా సరిచేయనున్నట్లు తెలిపింది. ఫ్యుయల్ ఫిల్టర్ మార్చడానికి 1961 డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను కూడా వెనక్కి పిలుస్తున్నట్లు వెల్లడించింది. వెనక్కి పిలిచే కార్లకు సంబంధించి కంపెనీనే కస్టమర్లను మే 31 నుంచి సంప్రదిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఫ్యుయల్ ఫిల్టర్ మార్చడం, సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ ఉచితంగానే చేస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. 0.5 శాతం నష్టాలను నమోదు చేసింది. కాగా ఇటీవల మారుతి తన వివిధ మోడళ్ల కార్లను వెనక్కి పిలిపించింది. అటు ఆల్టో 800 కార్లలో ఎయిర్ బ్యాగ్ సౌకర్యాన్ని కల్పించి సరికొత్తగా ముస్తాబు చేసి అందుబాటు ధరల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
బెంజ్ న్యూ ఎస్యూవీ లాంచ్
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ బుధవారం తన కొత్త అప్ గ్రేడెడ్ వెర్షన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం జీఎల్ఎస్ 350 డీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. పుణే లో దీని ఎక్స్ - షోరూమ్ ధర రూ. 80.38 లక్షలుగా ప్రకటించింది. భారతదేశం ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మరింత మెరుగైన సౌకర్యాలపై దృష్టిపెట్టినట్టు తెలిపింది. 2015 సం.రం లో 100 శాతం వృద్ధి సాధించామని, మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో రోలాండ్ ఫోల్గేర్ మీడియాకు చెప్పారు. భారత మార్కెట్ తమకు హైయ్యెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ అని పేర్కొన్నారు. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, హెడ్ ల్యాంప్ , లోగో ప్లేస్ మెంట్ తదితర మార్పులతో జీఎల్ఎస్ 350 డీని కంపెనీ రిమోడలింగ్ చేసింది. దీంతోపాటు కొత్త కలర్ ఆప్షన్స్ తో బ్రాండ్ న్యూ అవతారంలో కార్ లవర్స్ ను అలరించేందకు సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం నిర్దేశించుకున్న 12 మోడల్స్ లో ఇది తమకు నాలుగవది అని తెలిపారు. అయితే 2,000 సిసి డీజిల్ వాహనాలపై సుప్పీంకోర్టు నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఢిల్లీ -ఎన్‌సిఆర్ ప్రాంతంలో అమ్మకాలు జరపడం లేదని తెలిపారు. త్వరలోనే పెట్రోల్ వెర్షన్ తీసుకురానున్నట్టు తెలిపింది. 3073 ఎంఎం వీల్ బేస్ , 5130ఎంఎం పొడవు, 2141ఎం.ఎం వెడల్పు 1,849ఎంఎ ఎత్తు డైమెన్షన్,3.0 డీజిల్ ఇంజీన్, 8 అంగుళాల స్టాండలోన్ ట్యాబ్ లెట్ స్క్రీన్ విత్ టచ్ పాడ్ కంట్రోల్, నప్పా వెదర్ తో తయారుచేసిన 3 స్పోక్ స్టీరింగ్, 21 ఏఏంజీ లైట్ ఎలోయ్ వీల్స్ తదితర ఫీచర్స్ తో రిలీజ్ అయిన ఈ జీఎల్ ఎస్ వాహనం, ఆడి క్యూ 7, వోల్పో ఎక్స్ డీ 90, రేంజ్ రోవర్ కార్లకు ప్రధాన పోటీగా నిలవనుందని మార్కెట్ నిపుణుల అంచనా. -
పోలీస్స్టేషన్లు అప్‌గ్రేడ్
నగర కమిషనరేట్ పరిధిలో అన్నీ సీ-గ్రేడ్ స్టేషన్లే రాజధాని నేపథ్యంలో గ్రేడ్ పెంపునకు కసరత్తు నాలుగు స్టేషన్లను ఏ-గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఒక్కో స్టేషన్లో 100 మంది సిబ్బంది విజయవాడ : విజయవాడ రాజధాని నగరం కావటంతో కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలి విడతలో నాలుగు స్టేషన్లను ఏ-గ్రేడ్ చేయాలని నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న నగర కమిషనరేట్‌లో ఇప్పటికీ అన్నీ సీ-గ్రేడ్ స్టేషన్లే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పాలన చేస్తుండటం, వీవీఐపీల తాకిడి పెరగటం, రాజధాని అవసరాల నేపథ్యంలో పోలీస్స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు నిర్ణయం తీసుకున్నారు. పెరగనున్న సిబ్బంది సంఖ్య, వసతులు.. విజయవాడ నగరంలో 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కమిషనరేట్ ఆవిర్భావం తర్వాత వీటికి పోలీసుల సంఖ్య పెరిగిన దాఖలాలు లేవు. నగరంలో ఉన్న ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రోజుకు సగటున మూడు నుంచి ఐదు వరకు కేసులు నమోదవుతున్నాయి. ఐదు వరకు వివిధ రకాల ఫిర్యాదు అందుతున్నాయి. ప్రస్తుతం గవర్నర్ పేట, వన్‌టౌన్, సూర్యాపేట పోలీస్ స్టేషన్లలో సగటున 40 మంది వరకు సిబ్బంది ఉన్నారు. మిగిలిన స్టేషన్లలో 60 మంది వరకు ఉన్నారు. సీఎంతో అన్ని బందోబస్తు కార్యక్రమాలు, మిగిలిన లా అండ్ ఆర్డర్ డ్యూటీలు ఈ సిబ్బందే నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో గత ఏడాది నుంచి సిబ్బంది సంఖ్య భారీగా పెంచాలనే వాదన అటు పోలీసు సంఘాల్లో, ఇటు అధికారుల్లో ఉన్నా కార్యరూపం దాల్చటం లేదు. తాజాగా నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. కమిషనరేట్‌లో అందులోనూ రాజధాని నగరంలో అన్నీ సీ-గ్రేడ్ స్టేషన్లే ఉండటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలి విడతలో కృష్ణలంక, పటమట, మాచవరం, ఆటోనగర్ తదితర పోలీస్ స్టేషన్లను నేరుగా ఏ-గ్రేడ్ చేసి స్టేషన్‌కు సగటున 100 మంది వరకు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి రెండు పోలీస్ స్టేషన్లను ఒక ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తే మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందే అవకాశం ఉందని భావించారు. దీనిలో భాగంగా కొత్తగా కమిషనరేట్‌కు వచ్చే పోలీసులతో ఏ-గ్రేడ్ చేసి దానికి అనుగుణంగా స్టేషన్లలో వసతులపై దృష్టి సారించనున్నారు. -
భారత్ రేటింగ్ పెంచండి
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నట్లుగా గణాంకాలు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ)కి ప్రభుత్వం సూచించింది. వస్తు, సేవల పన్నుల చట్టం (జీఎస్టీ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు మరింత మెరుగై 8 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. భారత పర్యటనకి వచ్చిన ఎస్అండ్పీ అధికారులతో జరిగిన భేటీలో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ ఈ అంశాలు ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాల కథనం. దీని ప్రకారం .. ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంటు లోటు దిగి వచ్చాయని, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయని సుబ్రమణియన్ వివరించారు. ఆర్థిక సంస్కరణల దరిమిలా మధ్యకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు అమలు, బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోతున్న మొండిబకాయిల సమస్య పరిష్కారానికి హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు తదితర అంశాల పురోగతి గురించి, చైనా యువాన్ డీవేల్యుయేషన్ ప్రభావాలను ఎదుర్కొనే తీరు గురించి ఎస్అండ్పీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగుమతుల మందగమనంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, జవాబుదారీతనం పెంచేలా చేపడుతున్న పాలనాపరమైన సంస్కరణలు తదితర చర్యల గురించి బ్యాంకింగ్ కార్యదర్శి హస్ముఖ్ అధియా వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం అదనపు మూలధనం సమకూర్చడం మొదలైన చర్యల కారణంగా హోల్డింగ్ సంస్థ ఏర్పాటు అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. -
షావొమీ ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్సెట్ దిగ్గజం షావొమీ తాజాగా తమ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంకి అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ఎంఐయూఐ-7’ను ప్రవేశపెట్టింది. భారత్‌లో తాము విక్రయించిన స్మార్ట్‌ఫోన్స్ అన్నింటికి దీని బీటా వెర్షన్ ఆగస్టు 24న లభిస్తుందని షావొమీ గ్లోబల్ వీపీ హ్యూగో బరా తెలిపారు. ఇందులో విజువల్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, స్మార్ట్ ఎస్ఎంఎస్ ఫిల్టర్ మొదలైన ‘మేడ్ ఫర్ ఇండియా’ ఫీచర్లు ఉంటాయని ఆయన వివరించారు. -
రిజిస్ట్రేషన్ శాఖకు లక్ష్మీ కటాక్షం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ సర్వర్ల మొరాయింపు సమస్య ఉన్నప్పటికీ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో మరీ ఎక్కువగా ఉంది. తరచూ విద్యుత్ సరఫరాలో ఆటంకాలతో పాటు యూపీఎస్లూ డౌన్ అవుతున్నాయి. అధికారులు మేల్కొని సెంట్రల్ సర్వర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇక్కడి సర్వర్లు మళ్లీ అప్ అవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. శనివారం నుంచి భూముల విలువ పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మరుసటి రోజు ఆది వారం కావడంతో సోమవారం నుంచి లావాదేవీలు మరింత జోరందుకునే అవకాశం ఉందని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. 30 నుంచి 40 శాతం అధికం: శ్రీకాకుళంలోని కేంద్ర రిజిస్ట్రేషన్ కార్యాలయంతోపాటు జిల్లాలో మరో 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఓ డీఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఏటా భూముల మార్కెట్ ధరను 30 నుంచి 40 శాతం వరకు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక్కో జిల్లాకు ఒక్కోలా, అర్బన్/రూరల్‌కు వేర్వేరుగా ఉంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో 5,636 లావాదేవీలు జరగ్గా రూ.7.7 కోట్ల ఆదాయం వచ్చింది. లక్ష్యం రూ.5.36 కోట్లే కాగా సుమారు 140 శాతం పైనే లక్ష్యం సాధించామని రెండు జిల్లాల అధికారి సరోజ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే జూలై మూడో వారం వరకు సుమారు 3,331 లావాదేవీలు జరగ్గా సుమారు రూ.5.04 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి మూడు నెలలకూ లక్ష్యం వేర్వేరుగా ఉంటుంది. ఆవిధంగా జూలైలో రూ.7.37 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. మరో వారం రోజుల లావాదేవీలు కలిపితే లక్ష్యాన్ని మించి వృద్ధి సాధించినట్టు అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. గత నెల 25వ తేదీ నుంచి 30 వరకు మొత్తం 290 వరకు లావాదేవీలు జరిగినట్టు అంచనా. శనివారం నుంచి భూముల విలువ పెరుగుతుండడంతో ఆగస్టు నెలలో కూడా లక్ష్యాన్ని దాటి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఏటా సుమారు రూ.67 కోట్ల ఆదాయ లక్ష్యంతో పనిచేస్తుంటే మూడు నెలల్లోనే (త్రైమాసిక) రూ.14 కోట్ల మేర ఆదాయం సాధించామని డీఐజీ స్పష్టం చేశారు. గతేడాది హుద్‌హుద్ తుపాను సమయంలో కాస్త వెనక్కు వెళ్లిపోయినా అనంతర పరిణామాలతో ఒక నెల కంటే మరో నెల గరిష్టంగా ఆదాయం సంపాదించగలిగామన్నారు. ఏసీబీ హడల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారుల (ఏసీబీ)కు ఫిర్యాదిచ్చారు. దీంతో కొన్నాళ్లగా ఏసీబీ అధికారులు జిల్లా కేంద్ర రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిఘా పెంచారు. ఇటీవల అక్కడి అధికారుల వద్ద స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించినట్టు తెలిసింది. గత నెల 31వ తేదీ శుక్రవారం కూడా సోదాలు జరిపి కొన్ని విలువైన పత్రాలు, అక్కడి దస్తావేజులేఖకుల నుంచి కొన్ని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఫిర్యాదు మేరకు రెండు జిల్లాల అధికారిణి నుంచి కూడా వివరాలు సేకరించారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోదాలు నిజమేనని ఏసీబీ అధికారి ఒకరు ధ్రువీకరించారు. -
అప్‌గ్రేడేషన్ ఎప్పుడో?
ఏళ్ల తరబడి పండిట్, పీఈటీల నిరీక్షణ సమాన పనికి సమాన వేతనం పొందని పండితులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)లు తమ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇతర సబ్జెక్టు టీచర్లు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఎక్కువ వేతనం తీసుకుంటుండగా.. పండిట్లు, పీఈటీలు మాత్రం సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) స్థాయిలో తక్కువ వేతనంతోనే పనిచేయాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా.. తమకు ఆ స్థాయి వేతనం ఇవ్వకపోవడం పట్ల వారు ఆవేదన చెందుతున్నారు. పైగా ఉన్నత పాఠశాలల్లో బోధించే వారంతా స్కూల్ అసిస్టెంట్లే ఉండాలని 2009లో ప్రభుత్వమే ఓ విధానం చేసింది. ఇందులో భాగంగా అప్పటివరకు ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్-ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్-హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును ఫిజికల్ డెరైక్టర్ పోస్టులుగా మా ర్చింది. భవిష్యత్ నియామకాలన్నీ ఈ పద్ధతిలోనే చేపట్టాలని పేర్కొంది. కానీ అప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు మా త్రం సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 7 వేల మందికి పైగా పండిట్లు, 3 వేల మం ది కి పైగా ఉన్న పీఈటీలు తమ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం ఆందోళన చెందుతున్నారు. జూనియర్ల కింద పనిచేస్తున్నాం భాషా పండితులకు పదోన్నతులు లేవు. దీంతో జూనియర్ల కింద పనిచేయాల్సి వస్తోంది. ఆత్మన్యూనతాభావం వేధిస్తున్నా ఉద్యోగం కోసం పనిచేయక తప్పడం లేదు. - పొన్నాల బాలయ్య, కరీంనగర్ సమాన పనికి సమానం వేతనం ఇవ్వాల్సిందే.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే ఎలా? స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా గుర్తించకపోతే ఎలా? ఏళ్ల తరబడి పండిట్లను, పీఈటీలను దోపిడీ చేస్తున్నారు. -ఎ.కుమారస్వామి, వరంగల్ అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం తెలుగు, ఉర్దూ, హిందీ సబ్జెక్టుల్లో అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం. పండితుల బోధన వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయి. ఇతర సబ్జెక్టుల వారితో సమానంగా పనిచేస్తున్నాం. ఆయినా మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? - వేల్పుల స్వామి, కరీంనగర్ ఇదేనా పండితులకిచ్చే మర్యాద సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాం. అలాంటి పండితులకు ఇచ్చే మర్యాద ఇదేనా? పక్క టీచర్లతో సమాన వేతనం ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సరైందేనా? ఒక్క ప్రభుత్వం ఆలోచించాలి. - బత్తిని వేణుగోపాల్, కరీంనగర్ -
ఏడాది చివరికల్లా రేటింగ్ అప్‌గ్రేడ్?
ఆర్థిక శాఖ అంచనా న్యూఢిల్లీ: విధానపరమైన చర్యలు, ద్రవ్యోల్బణం.. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏడాది ఆఖరు నాటికి భారత రేటింగ్ అప్‌గ్రేడ్ కావొచ్చని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. విధానపరమైన చర్యల ప్రభావం ఏడాది ఆఖరు నాటికి కనిపించడం మొదలు కాగలదన్నారు. అలాగే, ముడి చమురు ధరల తగ్గుదల 2015-16లోనూ కొనసాగవచ్చని, ఫలితంగా మిగతా అన్నింటి ధరలూ తగ్గవచ్చని మహర్షి తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యల కారణంగా కరెంటు అకౌంటు లోటు, ద్రవ్య లోటు కొంత మెరుగైన స్థాయికి వచ్చాయని, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించడంతో విదేశీ పెట్టుబడుల రాక కూడా పెరిగిందని ఆయన చెప్పారు. గత నెల 9న భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘సానుకూల’ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. వచ్చే 12-18 నెలల్లో సార్వభౌమ రేటింగ్‌ను కూడా పెంచవచ్చని పేర్కొన్న నేపథ్యంలో మహర్షి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కొత్త సరకు
లావా ఐరిస్ ఫ్యుయెల్ 60... లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. త్వరలో రానున్న కొత్త ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం... ఇవీ లావా ఐరిస్ ఫ్యుయెల్ 60 స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకునేందుకు ఉన్న రెండు మంచి కారణాలు. ఈ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ఈ సరికొత్త మోడల్ ఫోన్ ఐదు అంగుళాల ఐపీఎస్ హెచ్డీ స్క్రీన్, 1280 బై 720 రెజల్యూషన్ డిస్ప్లేతో లభిస్తోంది. స్క్రీన్‌పై గీతలు వంటివి పడకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్-3ని ఉపయోగించడం విశేషం. శక్తిమంతమైన మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తున్న ఫ్యుయెల్ 60లో ఒక జీబీ ర్యామ్, 8 జీబీల మెమరీ ఉంది. కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తోడుగా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం వల్ల 2జీ నెట్‌వర్క్‌పై దాదాపు 32 గంటల టాక్‌టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. క్విక్‌ఛార్జ్ టెక్నాలజీ కారణంగా మూడు గంటల 15 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 10 ఎంపీ కాగా, వీడియోకాలింగ్ కోసం 2 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. త్రీజీ, వైఫై, బ్లూటూత్ 3.0 యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ ఫోన్ ధర రూ.8888. ఎనిమిది అంగుళాల స్క్రీన్‌తో ‘హానర్ టీ1’ టాబ్లెట్ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి తాజాగా టీ1 పేరుతో ఎనిమిది అంగుళాల స్క్రీన్సైజున్న టాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉన్న ఈ టాబ్లెట్‌లో 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్)ను ఉపయోగించారు. స్క్రీన్ రెజల్యూషన్ 1280 బై 800 గా ఉంది. ర్యామ్ 1 జీబీ, మెమరీ 8 జీబీలుగా కాగా... మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 32జీబీ వరకూ పెంచుకునే వెసలుబాటు ఉంది. వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏజీపీఎస్ త్రీజీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ టాబ్లెట్‌లో 4800 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని వాడారు. ఫలితంగా దాదాపు 300 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దీంట్లో జెల్లీబీన్ 4.3 వెర్షన్‌ను మాత్రమే వాడుతూండటం అది కూడా కంపెనీ చేసిన ఔట్ ఆఫ్ ది బాక్స్ మార్పులు, యూజర్ ఇంటర్ఫేస్ 1.6లతో ఉండటం గమనార్హం. -
మెడికల్ కళాశాలతో ప్రొద్దుటూరుకు మహర్దశ
- ప్రతిపాదనలు పంపిన అధికారులు - వైఎస్ హయాంలో జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆమేరకు వైద్య కళాశాల మంజూరైతే ప్రొద్దుటూరుతోపాటు పరిసర గ్రామాల్లోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అలాగే విద్యార్థులు కూడా చదివేందుకు అదనంగా సీట్లు లభిస్తాయి. వివరాలిలావున్నాయి. పూర్వం నుంచి ప్రొద్దుటూరులో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఏరియా ఆస్పత్రి కొనసాగుతూ ఉంది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కడపలో ఉన్న జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్సెన్సైస్(రిమ్స్)ను నిర్మించారు. అదే సమయంలో ప్రొద్దుటూరులోని ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి 3-5-2008న శిలాఫలకం వేశారు. సుమారు రూ.20కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం 12-8-2011న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసి వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిస్థితులన్నీ అనుకూలించి ఇక్కడ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభించే అవకాశం ఉంది. అలాగే వంద సీట్లతో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యుల కొరత ఉంది. అదే వైద్య కళాశాల మంజూరైతే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇందుకు నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చొప్పున నిదులు కేటాయించనున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ప్రశంసించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మొత్తం 56 కేటగిరిల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్‌తోపాటు ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నవారు ఉన్నారు. సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి జిల్లా ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుతాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు పరిసరాల్లో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే వైద్య నిపుణుల కొరత కూడా తీరే అవకాశం ఉంది. డాక్టర్ ఎం.బుసిరెడ్డి, ఆర్ఎంఓ, జిల్లా ఆస్పత్రి -
విజయవాడ పోలీసు కమిషనరేట్ అప్‌గ్రేడ్
హైదరాబాద్: విజయవాడ నగరం పోలీసు కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ కమిషనరేట్‌కు కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారిని నియమించేవారు. తాజా మార్పుచేర్పులతో అదనపు డీజీ స్థాయికి పెంచి, ప్రస్తుతం ప్రత్యేక భద్రతా బలగం (ఎస్పీఎఫ్) డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. దీంతో సహా మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘పోస్టులను’ అప్‌గ్రేడ్ చేయాలి
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక భృతిని 50 శాతం పెంచాలన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు ఇప్పిస్తామన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పీఆర్టీయూను మరింత బలోపేతం చేస్తామని యూనియన్ జిల్లా అద్యక్షుడు కమాలాకర్ రావు పేర్కొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలొ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విఠల్‌గురూజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తంరెడ్డి, యూనియన్ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీ లను అప్‌గ్రేడ్ చేయటంపై సానుకూలంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఎయిడెడ్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫైలు చివరి దశలో ఉందని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారికి పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. గురువారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, డీఎస్సీ 2012 ద్వారా వేల పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ 2013 అంశాన్ని ప్రస్తావించిన మంత్రి దానిపై వివరణ ఇవ్వకుండానే దాటవేయటంతో నోటిఫికేషన్‌పై స్పష్టత రాలేదు. ఉపాధ్యాయులు ఉన్నత మన స్తత్వంతో కులతత్వం, మతతత్వం, అవినీతి రుగ్మతలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గురువులను చూస్తే గౌరవం తగ్గిపోతోందని అది మంచిది కాదన్నారు. ఉపాధ్యాయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తే వారి వ్యక్తిగత సమస్యలపైనే చర్చ వస్తోందని, ప్రభుత్వ స్కూళ్లను ఎలా బాగు చేయాలనే చర్చ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తప్పయితే క్షమించాలని కోరారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.21 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. టీచర్ల అప్రెంటిస్ రద్దు, అప్రెంటిస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 202 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నగదు బహుమతితో పాటు బంగారు పతకాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని, హాజరుశాతం తగ్గుతోంద ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారిలో పాఠశాల విద్యాశాఖ తరపున 57 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ కింద 38 మంది టీచర్లకు, ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుంచి 23 మంది లెక్చరర్లు, ముగ్గురు సాంకేతిక విద్యాశాఖ లెక్చరర్లతోపాటు యూనివర్సిటీ, కళాశాల విద్యా శాఖ లెక్చరర్లు 77 మందికి, సాంస్కృతిక శాఖ నుంచి నలుగురుకి పురస్కారాలు లభించాయి.