‘పోస్టులను’ అప్‌గ్రేడ్ చేయాలి | Government have to do upgrade posts | Sakshi
Sakshi News home page

‘పోస్టులను’ అప్‌గ్రేడ్ చేయాలి

Published Mon, Nov 11 2013 3:58 AM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM

Government have to do  upgrade posts

కంఠేశ్వర్, న్యూస్‌లైన్ :  పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక భృతిని 50 శాతం పెంచాలన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు ఇప్పిస్తామన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లాలో పీఆర్టీయూను మరింత బలోపేతం చేస్తామని యూనియన్ జిల్లా అద్యక్షుడు కమాలాకర్ రావు పేర్కొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలొ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విఠల్‌గురూజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తంరెడ్డి, యూనియన్ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement