
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడ తన స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. "వ్యక్తిగత కారణాల" కారణంగా రబాడ సౌతాఫ్రికాకు వెళ్లినట్లు గుజరాత్ టైటాన్స్ మెనెజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే అతడు ఎప్పుడు తిరిగి భారత్‌కు వస్తాడన్న విషయాన్ని గుజరాత్ వెల్లడించలేదు. కాగా బుధవారం(ఏప్రిల్ 2)న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌కు కూడా రబాడ దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో రబాడ లేనప్పటికి గుజరాత్ టైటాన్స్ మాత్రం ఘన విజయాన్ని అందుకుంది.
మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ వంటి గుజరాత్ స్పీడ్ స్టార్లు అద్బుతంగా రాణించారు. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 6న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా రబాడ దూరమయ్యే అవకాశముంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన రబాడ.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే రబాడ తనదైన ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు.
చదవండి: పాక్ క్రికెట్ జట్టుకు మరోసారి జరిమానా