Gujarat Titans
-
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్‌గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్‌ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్‌లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్‌తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్‌కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
GT ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు..
-
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌లో సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్‌మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్‌ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో పవర్‌ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
గుజరాత్ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్ టైటాన్స్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.ఊహించని ఈ ఘటన కారణంగా గుజరాత్ బృందం మొత్తం దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్‌కు తరలించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా, నిన్న (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలిచింది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీనివ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమైన ఆ జట్టు.. అనంతరం దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
మళ్లీ వేటాడేసింది...
‘సుదీర్ఘ కాలం మనం వేటాడబడ్డాం... ఇకపై వేటగాళ్లలా మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం’... గత ఏడాది ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ డ్రెస్సింగ్‌రూమ్‌లో చేసిన వ్యాఖ్య ఇది. ఆ సమయంలో విజయోత్సాహంతో చెప్పిన మాటలుగానే ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహా ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్ మళ్లీ చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్‌తో ఆగిపోకుండా తమ ఆకలిని తీర్చుకుంటూ వరుసగా రెండో ట్రోఫీని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.తేదీలు మారడం మినహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్ వరకు చేరింది. లీగ్ దశలో 9 విజయాలతో అగ్రస్థానం, తొలి క్వాలిఫయర్‌లో ఏకపక్ష గెలుపుతో ఫైనల్‌కు... తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్‌గా సొంతగడ్డ బెంగళూరులో మళ్లీ ట్రోఫీనిముద్దాడతామని గత ఏడాది గర్వంగా చెప్పినా... వేర్వేరు కారణాలతో అది జరగలేదు. కానీ మళ్లీ అదే అహ్మదాబాద్ వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. 18వ సీజన్లో తొలిసారి ‘ఈ సాలా కప్ నమ్దు’ అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 13 మంది ఈసారి కూడా గెలుపులో భాగమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ పూర్తి ఏకపక్షంగా సాగగా... ఈసారి గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్లే గిల్, సుదర్శన్, బట్లర్ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్‌తో పోరులో సరిగ్గా 155 పరుగులే చేసి ఆర్సీబీ ఓడగా... ఇప్పుడు అసలు పోరులో సీన్ రివర్స్ అయింది. ఛేదనలో కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభంతో ఆర్సీబీ విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైనా... దిగ్గజ ఆటగాడిగా ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూసుకుపోయిన కోహ్లి భారీ సిక్స్‌తో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆర్సీబీ బృందంలో సంబరాలు షురూ అయ్యాయి. అహ్మదాబాద్: ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్–2026 టైటిల్‌ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగిపోగా, వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. టపటపా... ప్రతీ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్ భారీ స్కోరు ఆశలు కోల్పోయింది. శుబ్‌మన్ గిల్ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ కాగా, నిశాంత్ సింధు (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) ప్రభావం చూపలేదు. పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తడబడిన జోస్ బట్లర్ (23 బంతుల్లో 19; 1 ఫోర్) సహనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో సుందర్ కొంత పట్టుదలగా నిలబడినా... అతనూ పెద్ద షాట్లు కొట్టలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్ క్యాచ్ అందుకున్నా... రీప్లేలో బంతి గ్రౌండ్‌కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15; 2 సిక్స్‌లు) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి బ్యాటర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ రాలేదు! తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది. శుభారంభం... ఛేదనలో వెంకటేశ్, కోహ్లి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులే ఇచ్చినా... రబాడ వేసిన తర్వాత ఓవర్లో వెంకటేశ్ 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. సిరాజ్ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా... రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6, 4తో చెలరేగిపోయాడు. వెంకటేశ్, పడిక్కల్ (1) పరుగు తేడాతో వెనుదిరగ్గా... పవర్‌ప్లేలో జట్టులో 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెపె్టన్ రజత్ పాటీదార్ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (1)లను రషీద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లి మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించగా... విరాట్ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరం చేర్చాడు.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12; గిల్ (సి) పాటీదార్ (బి) హాజల్‌వుడ్ 10; నిశాంత్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 20; బట్లర్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ 19; సుందర్ (నాటౌట్) 50; అర్షద్ (సి) సలామ్ (బి) హాజల్‌వుడ్ 15; తెవాటియా (సి) పాటీదార్ (బి) సలామ్ 7; హోల్డర్ (సి) హాజల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 7; రషీద్ (సి) షెఫర్డ్ (బి) సలామ్ 7; రబాడ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–22, 2–26, 3–55, 4–73, 5–99, 6–115, 7–142, 8–151. బౌలింగ్: డఫీ 4–0–38–0, భువనేశ్వర్ 4–0–29–2, హాజల్‌వుడ్ 4–0–37–2, సలామ్ 4–0–27–3, కృనాల్ 4–0–23–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) రబాడ (బి) సిరాజ్ 32; కోహ్లి (నాటౌట్) 75; పడిక్కల్ (సి) అర్షద్ (బి) రబాడ 1; పాటీదార్ (సి) రబాడ (బి) రషీద్ 15; కృనాల్ (ఎల్బీ) (బి) రషీద్ 1; డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ 24; జితేశ్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్లపతనం: 1–62, 2–63, 3–89, 4–91, 5–132. బౌలింగ్: సిరాజ్ 4–0–36–1, రబాడ 3–0–44–1, హోల్డర్ 2–0–16–0, రషీద్ 4–0–25–2, అర్షద్ 4–0–32–1, ప్రసిధ్ 1–0–7–0. -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్‌గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్‌ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది. దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సీఎస్కే రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. విజేతగా ఆర్సీబీఇక ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలిచింది. గుజరాత్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లి కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో రాణించాడు.చదవండి: వైభవ్‌కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే? -
అరుదైన ఫీట్‌తో భువనేశ్వర్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు. కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్‌పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.Bhuvneshwar Kumar in IPL2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*2025 - 17 wickets (9.28 Eco)2024 - 11 wickets (9.35 Eco)2023 - 16 wickets (8.33 Eco)2022 - 12 wickets (7.34 Eco)2021 - 6 wickets (7.97 Eco)2020 - 3 wickets (6.98 Eco)2019 - 13 wickets (7.81 Eco)2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్‌గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ ఔటైన వెంటనే పిచ్‌పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్‌వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్‌ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్‌కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్, భువనేశ్వర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్‌మన్ గిల్
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్లు శబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచారు. క్వాలిఫయర్-2లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెండో బంతిని గిల్ షార్ట్-ఆర్మ్ జాబ్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన కుడివైపునకు పరిగెత్తుకు వచ్చి బంతిని అందుకున్నాడు.దీంతో గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఓవర్లో సాయిసుదర్శన్(12 బంతుల్లో 12) కూడా ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో (732), సుదర్శన్(722) రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు.చదవండి: IND vs SL: రుతురాజ్ గైక్వాడ్‌కు బంపర్ ఆఫర్ -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్‌కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగులతో, రాజస్తాన్‌పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్‌కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్‌పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
ఐపీఎల్-2026 సీజన్ విజేతగా ఆర్సీబీ
IPL 2026 RCB vs GT Live Updates: ఐపీఎల్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర. 156 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 25 బంతుల్లోనే కోహ్లి ఆర్ధ సెంచరీ సాధించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/4ఊహించని ట్విస్ట్.. నాలుగో వికెట్ డౌన్‌గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ పోరులో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ముందు పాటీదార్ (15)ను వెనక్కి పంపిన రషీద్.. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఆర్సీబీ 88-28 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (38), రజత్ పాటీదార్ (15) పరుగులతో ఆడుతున్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 32 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దుమ్ములేపుతున్న విరాట్ కోహ్లి158 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కోహ్లి కేవలం పది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్(26) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ దాటింది.దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(22) దూకుడుగా ఆడుతున్నాడు.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీతో గుజరాత్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(12), సాయిసుదర్శన్(12), జోస్ బట్లర్(19) వంటి స్టార్ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ డౌన్‌గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హోల్డర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18.4 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 143/7ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 115 పరుగులవ వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా రసిక్ సలామ్ బౌలింగ్‌లో పాటీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్ డౌన్అర్షద్ ఖాన్(15) రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అర్షద్ ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న అర్షద్ ఖాన్జోష్ బట్లర్ స్ధానంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 5 బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 100/4గుజరాత్ నాలుగో వికెట్ డౌన్‌గుజరాత్ టైటాన్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. జోస్ బట్లర్(19) రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 73/4గుజరాత్ మూడో వికెట్ డౌన్నిషాంత్ సింధు రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సింధు.. రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(2), జోస్ బట్లర్(2) ఉన్నారు.గుజరాత్‌కు భారీ షాక్గుజరాత్కు భారీ షాక్ తగిలింది. ఇన్ఫామ్ బ్యాటర్ సాయిసుదర్శన్(12) రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో సుదర్శన్ ఔటయ్యాడు. 4 ఓవర్లు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 30/2గుజరాత్ తొలి వికెట్ డౌన్‌గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. రజత్ పాటిదార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.2 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(6), సాయిసుదర్శన్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో తుది పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సాయికిషోర్ స్ధానంలో పేసర్ అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్ -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్‌ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్! -
ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం
-
అద్వితీయ ప్రదర్శనకు సై!
తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు వేచి చూసి ఇప్పుడు అదే జోరులో ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వరుసగా రెండో ట్రోఫీపై గురి పెట్టిన జట్టు ఒక వైపు... ఆడిన తొలి సీజన్లోనే కప్‌ను గెల్చుకోవడంతో పాటు ఐదో సీజన్లోనే మరో సారి విజేతగా నిలిచే లక్ష్యంతో నిలిచిన జట్టు మరో వైపు... దూకుడైన బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్‌తో పాటు అమిత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్ సవాల్ విసురుతుండగా... ముగ్గురు బ్యాటర్లే దాదాపు మొత్తం బ్యాటింగ్ భారం మోస్తుండగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో సమరానికి మరో జట్టు రెడీ అయింది. వరుసగా రెండో టైటిల్ నెగ్గిన కెపె్టన్‌గా అరుదైన జాబితాలో చేరేందుకు ఒక సారథి ఉవి్వళ్లూరుతుండగా, తన నాయకత్వంలో మొదటి టోర్నీ గెలిపించాలని మరొకరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్–19 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.అహ్మదాబాద్: ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో అనూహ్య ఫలితాలు, అసాధారణ బ్యాటింగ్ విన్యాసాలు, కొత్త రికార్డులు, సరికొత్త ఘనతలు...64 రోజులు, 73 మ్యాచ్‌లు, 2299 ఫోర్లు, 1416 సిక్సర్ల తర్వాత ఐపీఎల్ పోరాటం ఆఖరి ఘట్టానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు, మాజీ చాంపియన్ గుజరాత్‌ను ఢీకొడుతుంది. ఏ జట్టు నెగ్గినా ఇది వారి రెండో టైటిల్ కానుంది. పాయింట్ల పట్టికలో టాప్–2 స్థానాల్లో నిలిచిన జట్లే చివరి సమరానికి సమాయత్తం కావడం విశేషం. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ మానసికంగా పైచేయి సాధించగా... సొంతగడ్డపై ఫైనల్ ఆడనుండటం టైటాన్స్‌కు సానుకూలాంశం. ఆటగాళ్లంతా ఫామ్‌లో... డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సారి గత ఏడాదికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి దూసుకొచి్చంది. అన్ని అంచనాలను అందుకుంటూ జట్టు పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన టీమ్‌ను ముందంజ వేసేలా చేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ 10 మ్యాచ్‌లు గెలవగా... 8 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలవడం జట్టు సమష్టితత్వానికి నిదర్శనం. ప్రతీ ఒక్కరు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి అద్భుత ఫామ్ ఓపెనింగ్‌లో జట్టు శుభారంభానికి ప్రధాన కారణం. పదేళ్ల క్రితం 2016లో ఇదే స్థాయి ఆటతో ఒంటిచేత్తో బెంగళూరును ఫైనల్‌కు చేర్చిన విరాట్ కోహ్లి... మరోసారి నాటి ఆటను గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో జట్టుకు రెండో టైటిల్ అందించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. కోహ్లి 600 పరుగులు చేయగా, కెపె్టన్ రజత్ పాటీదార్ (486) ఏకంగా 196.76 స్ట్రైక్‌రేట్‌తో 5 అర్ధ సెంచరీలతో తన స్థాయిని ప్రదర్శించాడు. పడిక్కల్ (463) కూడా చెలరేగగా... కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శన (225 పరుగులు, 13 వికెట్లు) జట్టును నడిపించాయి. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ఎంతో పనికొచి్చంది. భువీ ఇప్పటికే 26 వికెట్లు తీయగా...హాజల్‌వుడ్ (13) అండగా నిలిచాడు. వీరికి తోడు యువ బౌలర్ రసిఖ్ సలామ్ (16) సత్తా చాటడం బౌలింగ్ బలాన్ని పెంచింది. ఫిట్‌గా ఉంటే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. లేదంటే వెంకటేశ్ అయ్యర్ కొనసాగుతాడు. బౌలింగ్‌లో పరిస్థితిని బట్టి సుయాశ్, డఫీలలో ఒకరికి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా అవకాశం దక్కుతుంది. టాప్–3 దూకుడు... టోర్నీ ఆరంభంనుంచి గుజరాత్ ఒకే విమర్శను మళ్లీ మళ్లీ ఎదుర్కొంది. టాప్–3 బ్యాటర్లు మినహా జట్టులో ఏమి లేదని, వీరిని అవుట్ చేస్తే కుప్పకూలడం ఖాయమని విమర్శలు వచ్చాయి. అయితే చివరిసారి ఈ విమర్శకు గుజరాత్ సిద్ధమైంది. మ్యాచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా టాప్–3 బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. శుబ్‌మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710), జోస్ బట్లర్ (507) తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు కాబట్టి ఈ విషయంలో మేనేజ్మెంట్కు ఆందోళన లేదు. వీరు చెలరేగితే మిడిలార్డర్ అవసరం ఉండదనే భావన రాజస్తాన్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కూడా రుజువైంది. సుందర్ (327) కూడా జట్టు విజయాల్లో కొంత పాత్ర పోషించాడు. అయితే పదునైన బౌలింగ్ దళం సహకారంతో గుజరాత్ ముందంజ వేయగలిగింది. కొత్త బంతితో రబాడ (28 వికెట్లు), సిరాజ్ (18) ప్రత్యర్థులను పూర్తిగా కట్టపడేస్తున్నారు. హోల్డర్ (17) కూడా కేవలం 7.54 ఎకానమీతో బౌలింగ్ చేయడం టైటాన్స్‌కు అదనపు బలంగా మారింది. గత పోరులో రషీద్ లైన్ తప్పినా... అతనిలాంటి స్టార్ బౌలర్ ఏ సమయంలోనైనా చెలరేగిపోగలడు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే స్పిన్నర్ సాయికిషోర్‌కు ఈ సారి బౌలింగ్ అవకాశం లభించవచ్చు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్/ వెంకటేశ్, పడిక్కల్, కృనాల్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, భువనేశ్వర్, హాజల్‌వుడ్, సలామ్, డఫీ/ సుయాశ్ గుజరాత్: గిల్ (కెపె్టన్), సుదర్శన్, బట్లర్, సుందర్, నిశాంత్, హోల్డర్, తెవాటియా, రషీద్, రబాడ, సిరాజ్, ప్రసిధ్, సాయికిషోర్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉన్నా...బౌలర్లూ ప్రభావం చూపగలరు. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఆ పోరులో గుజరాత్ గెలిచింది. అన్నింటికి మించి ఈ స్టేడియంలో రెండో సారి బ్యాటింగ్ సులువుగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
ఫైనల్‌కు వాన గండం..! మ్యాచ్ రద్దైతే విజేత ఎవరంటే?
ఐపీఎల్-2026 సీజన్లో తుది సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ పోరులో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. బెంగళూరు మాత్రం ఫైనల్ మ్యాచ్‌లోనూ తమ జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వరకు వర్షం పడేందుకు అస్కారం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దేతే పరిస్థితి ఏంటి? ట్రోఫీ ఎవరికి ఇస్తారు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఒకవేళ వర్షం పడితే?మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. కానీ ఈ తుది పోరుకు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేకంగా రిజర్వ్ డే ను కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మే 31) పూర్తి మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు నిర్వహిస్తారు.సమయం మించిపోతుంటే ఓవర్లను కుదిస్తూ వస్తారు. ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి చివరి కట్-ఆఫ్ సమయం రాత్రి 11:55 గంటల వరకు ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12:50 గంటల లోపు కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను తేల్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికి వాతవారణం అనుకూలించకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి మారుతుంది.ఒకవేళ ఆదివారం నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదలు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం(జూన్ 1)మ్యాచ్‌ను నిర్వహిస్తారు. మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను సోమవారం కొనసాగిస్తారు.రిజర్వ్ డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. గ్రూపు స్టేజ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్ధానంలో ఉంది కాబట్టి ఛాంపియన్‌గా అవతరిస్తోంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.చదవండి: సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో? -
ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
హోరా హోరీగా సాగిన ఐపీఎల్ 2026 ఫైనల్ దశకు చేరింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఫైనల్ మ్యాచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. వెస్ట్రన్ రైల్వే ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సూపర్ ఫైట్‌ను ఈ చూసేందుకు వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివెళ్లనున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు ప్రత్యేక ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు నడపనున్నారు.ట్రైన్ నంబర్ 09021: మే 31న ఉదయం 6:20 గంటలకు ముంబై సెంట్రల్లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మ్యాచ్ రోజునే ప్రయాణించాలనుకునే అభిమానులకు ఇది చాలా అనుకూలమైన ఆప్షన్.ఈ రైలులో ప్రీమియం శతాబ్ది తరహా రేక్తో పాటు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏసీ చైర్ కార్, అనుభూతి క్లాస్, మరియు విస్టాడోమ్ కోచ్‌లు కూడా ఉంటాయి.రిటర్న్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 09022): ఇది అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.ఫైనల్ మ్యాచ్ ముగిసాక అదనపు సర్వీసులుమ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వెస్ట్రన్ రైల్వే జూన్ 1న మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది.ట్రైన్ నంబర్ 09044: అహ్మదాబాద్ నుండి బాంద్రా టెర్మినస్ వరకు నడుస్తుంది.ట్రైన్ నంబర్ 09043: అదే రోజు రాత్రి బాంద్రా టెర్మినస్ నుండి వాటివా (Vatva) వరకు నడుస్తుంది.ప్రత్యేకతలు: ప్రీమియం ఏసీ రైళ్లతో పోలిస్తే, ఈ రైళ్లలో ఏసీ త్రీ-టైర్ మరియు స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.రైలు ఆగే స్టేషన్లు ఈ ప్రత్యేక రైళ్లు ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బోరివలి, వాపి, సూరత్, భరూచ్ మరియు వడోదర ఉన్నాయి. దీనివల్ల వివిధ నగరాల నుండి ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుంది.బుకింగ్స్ ఎలా అంటే..ఈ నాలుగు ప్రత్యేక సర్వీసుల బుకింగ్స్ మే 30 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా పీఆర్ఎస్ (PRS) రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.ఐపీఎల్ ఫైనల్ వీకెండ్ కారణంగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకునే ముందు పూర్తి టైమ్‌టేబుల్ మరియు కోచ్ వివరాలను తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. కాగా టైటిల్కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. -
అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మరోసారి చాంపియన్‌గా నిలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగాటోర్నీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలిచినప్పటికీ, క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవనున్నట్లు, అందుకు జోష్ హాజిల్‌వుడ్ కారణం కానున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు హాజిల్‌వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైనల్స్ ఆడితే.. ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహించిన జట్టే చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టులో హాజిల్‌వుడ్ ఉన్నాడు. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్సర్స్, 2021 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు, 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన సీఎస్కే, 2025 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్‌వుడ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ హాజిల్‌వుడ్ సభ్యుడిగా ఉండడం విశేషం.దీంతో హాజిల్‌వుడ్ లక్కీ హ్యాండ్ అని.. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు చాంపియన్‌గా నిలుస్తుందని అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడు లక్కీహ్యాండ్ మాత్రమే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్‌లోనూ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైనల్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2012 చాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో హాజిల్‌వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే భువనేశ్వర్, రసిక్ సలామ్‌లు రాణిస్తుండడంతో హాజిల్‌వుడ్‌కు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.చదవండి: ‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’ -
‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అర్థసెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అయితే ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ రాజస్తాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులోనూ మరోసారి హిట్‌వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వరుసగా రెండుసార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచిపోయాడు. హిట్‌వికెట్‌గా రెండోసారి ఔటవ్వడంపై సాయి సుదర్శన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త పద్ధతిని అనుసరిస్తానని నవ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ సమస్యను అధిగమించడానికి కొత్తగా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉపయోగించి బంతులు ఆడే ప్రయత్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్‌లో బంతిని ఆడే క్రమంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద పడింది. కానీ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడాలనుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండరీ వెళ్లినప్పటికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఫైనల్లో ఈ సమస్య రాకుండా ఒక కొత్త పద్ధతిని అనుసరించాలనుకుంటున్నా. అది ఎంతమేర సఫలమవుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సీజన్లో సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ తరఫున ఓపెనింగ్‌లో వస్తున్న సాయి సుదర్శన్ 16 ఇన్నింగ్స్‌లో 710 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలున్నాయి. అయితే ఈ సీజన్లో గుజరాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లో సాయి సుదర్శన్ ఒక ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత నుంచి వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ స్థిరమైన ప్రదర్శనతో కనీసం అర్థసెంచరీ సాధించడం విశేషం. మరో విషయమేంటంటే సాయి సుదర్శన్ వరుసగా రెండో సీజన్లోనూ 700 పరుగుల మార్క్‌ను అధిగమించాడు. గతంలో క్రిస్ గేల్ మాత్రమే వరుసగా రెండు సీజన్లలో 700 ప్లస్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. Glad he can still see the funny side of it 😅🎥 Sai Sudharsan on his back-to-back bizarre dismissals \|/#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/nGVrC10SUc— IndianPremierLeague (@IPL) May 29, 2026THE RAREST OF RARE DISMISSALS! TWICE IN TWO INNINGS 😯😯Sai Sudharsan's bat fell onto his own stumps 🫣Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/htGSYpu3YH— IndianPremierLeague (@IPL) May 29, 2026The Sai Sudharsan dismissal. 😄 pic.twitter.com/m0DaXI29aE— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026చదవండి: అభిమానులకు గుడ్‌న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక! -
గిల్ విశ్వరూపం... IPL 2026 ఫైనలు గుజరాత్
-
ధోని.. రోహిత్.. కోహ్లి వల్లే కాదు ..! 15 ఏళ్లకే ఇంత ప్రెజర్ ను ఎలా హ్యాండిల్ చేశావ్..?
-
ఒక్కడిని అవుట్ చేయడానికి ఎన్ని ప్లాన్ లు వేశార్రా..! ఒంటిచేత్తో జీత్ ని ఊచకోత కోసిన వైభవ్
-
IPL 2026: ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది మరొక రోజులో తేలిపోనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఒక వార్త నిరాశ కలిగిస్తోంది. బెంగళూరు సిటీలో కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఆర్సీబీ గనుక రెండో టైటిల్ గెలిస్తే నగరమంతటా భారీ సంఖ్యలో ప్రజలు గూమిగూడతారనే అంచనాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పేర్కొంది.2025 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవాలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి 11 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీంతో ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద బెంగళూరు సిటీ మొత్తం కఠిన ఆంక్షలు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.కఠిన ఆంక్షలు ఇవే..👉ముందస్తు అనుమతి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయరాదని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి ఆమోదం పొందితే తప్ప బహిరంగ ప్రదేశాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు.👉ఇక ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో సాముహిక విజయోత్సవ సంబరాలు చేసుకోకూడదు.👉ముఖ్యంగా జనం పెద్ద ఎత్తున గూమికూడి విజయోత్సవాల పేరుతో బైక్ ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేస్తూ సంబరాలు చేసుకోవడం పూర్తిగా నిషేధం.👉ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై టపాసులు కాల్చడం లేదా ఇతర కార్యక్రమాలు చేపట్టడం చేయవద్దని సూచించారు.విషాదంలా విజయోత్సవాలు..2025 ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవం నిర్వహించింది. ఈ విజయోత్సవం కాస్తా విషాదంగా మారిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవాలకు జనాలు భారీగా తరలివచ్చారు. స్టేడియం నిండిపోవడంతో బయట కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు గూమిగూడారు. భారీ జనసమూహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ తెలిపింది.గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ..రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ నిలకడగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు గుజరాత్ కూడా స్థిరమైన ప్రదర్శన కొనసాగించినప్పటికీ మధ్యలో కొన్ని అపజయాలు పలకరించాయి. కానీ అన్నీ దాటుకొని ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌కు క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ షాక్ ఇచ్చింది. అయితే క్వాలిఫయర్-2 పోరులో మాత్రం రాజస్తాన్‌ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: వైభవ్‌కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా! -
వైభవ్‌కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్
గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.రాజస్తాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముల్లన్‌పూర్‌లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనేఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply— Star Sports (@StarSportsIndia) May 29, 2026ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..👉విరాట్ కోహ్లి- 9 శతకాలు👉జోస్ బట్లర్- 7 శతకాలు👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు👉సంజూ శాంసన్, శుబ్‌మన్ గిల్- 5 శతకాలు👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలుగుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు👉శుబ్‌మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్‌పై👉శుబ్‌మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై👉శుబ్‌మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపైఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 5👉కేఎల్ రాహుల్- 3👉శుబ్‌మన్ గిల్- 2.కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా చేసి పడేశాడు.చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!
-
గుజరాత్ ఘనంగా ఫైనల్‌కు
ఐపీఎల్లో ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ విజయలక్ష్యం 215 పరుగులు... కానీ నాకౌట్ మ్యాచ్‌లోనూ ఒత్తిడి లేకుండా శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ తమ ఆటతో దీనిని చాలా చిన్నదిగా మార్చేశారు. విధ్వంసక ప్రదర్శన లేకుండానే తమదైన శైలిలో ఓపెనర్లు 77 బంతుల్లోనే 167 పరుగులు జోడించడంతో టైటాన్స్ ఫైనల్ చేరడం లాంఛనంగా మారిపోయింది. కీలక పోరులో రాజస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు మరోసారి సెంచరీ చేజారినా... వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్‌తోనే రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. తమ సొంతగడ్డపై ఫైనల్ ఆడనున్న గుజరాత్... తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి రెండోసారి టైటిల్ సాధిస్తుందా చూడాలి. న్యూ చండీగఢ్: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ అవకాశం కోల్పోయాడు. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, డొనొవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివర్లో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఐపీఎల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రేపు అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ తలపడుతుంది. వైభవ్ దూకుడు... గత మ్యాచ్‌లతో పోలిస్తే వైభవ్ ఈసారి కాస్త ఓపికను ప్రదర్శించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ (1), తర్వాతి ఓవర్లో ధ్రువ్ జురేల్ (7) వెనుదిరగడం కూడా అందుకు కారణం. సిరాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన వైభవ్ 14వ బంతికిగానీ తన తొలి సిక్స్ కొట్టలేదు. అయితే నాలుగో స్థానంలో వచి్చన జడేజా చకచకా పరుగులు రాబట్టాడు. ప్రసిధ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 19 బంతుల్లోనే 34 పరుగులకు చేరుకున్నాడు. అయితే మోచేతి గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకోగా, ఆ తర్వాత రాజస్తాన్ ఇన్నింగ్స్ తడబడింది. జడేజా మళ్లీ క్రీజ్‌లోకి వచి్చనా తర్వాతి 14 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. మరోవైపు 46 పరుగుల వద్ద సుదర్శన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అది నెమ్మదైన అర్ధ సెంచరీ! హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు చూపించిన వైభవ్ తర్వాత ఆడిన 15 బంతుల్లో చెలరేగి 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96కు చేరుకున్నాడు. ఈసారైనా సెంచరీ ఖాయం అనుకోగా... మళ్లీ సరిగ్గా గత మ్యాచ్ తరహాలోనే ర్యాంప్ షాట్ ఆడబోయి మరోసారి షార్ట్ థర్డ్మాన్లోకి క్యాచ్ ఇచ్చాడు. అయితే రషీద్ వేసిన చివరి ఓవర్లో రెచి్చపోయిన ఫెరీరా 4 సిక్స్‌లు బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. పరుగుల జుగల్బందీ... ఛేదనలో గుజరాత్ అలవోకగా దూసుకుపోయింది. రాయల్స్ పేలవ బౌలింగ్‌తో సుదర్శన్, గిల్ ఎలాంటి శ్రమ లేకుండా ఒకరితో మరొకరు పోటీ పడుతూ సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ చెరో 2 ఫోర్లతో మొదలు పెట్టగా, పవర్‌ప్లేలో జట్టు 10 ఫోర్లు సహా 69 పరుగులు రాబట్టింది. సుదర్శన్ 14 వద్ద ఉన్నప్పుడు ఫెరీరా, షనక సమన్వయ లోపంతో క్యాచ్ వదిలేయడం కూడా గుజరాత్‌కు కలిసొచి్చంది. ఆపై తుషార్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి 30 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరిన గిల్... జడేజా ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. అనంతరం 26 బంతుల్లోనే సుదర్శన్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు 13వ ఓవర్లో సుదర్శన్ ‘హిట్ వికెట్’తో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అనూహ్యంగా ఒకే తరహాలో అవుట్ కావడం విశేషం. 47 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గిల్, సుందర్ (16) తక్కువ వ్యవధిలో అవుటైనా... తెవాటియా (17 నాటౌట్), బట్లర్ (9 నాటౌట్) కలిసి ఆటను ముగించారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 1; వైభవ్ (సి) ప్రసిధ్ (బి) రబాడ 96; జురేల్ (సి) గిల్ (బి) రబాడ 7; జడేజా (నాటౌట్) 45; పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11; షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3; ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 7; ఫెరీరా (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–101, 4–109, 5–118, 6–172. బౌలింగ్: సిరాజ్ 4–0–42–1, రబాడ 4–0–35–2, ప్రసిధ్ 4–0–42–1, సుందర్ 2–0–23–0, హోల్డర్ 4–0–27–2, రషీద్ 2–0–45–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58; గిల్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 104; బట్లర్ (నాటౌట్) 9; సుందర్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16; తెవాటియా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–167, 2–182, 3–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–45–1, బర్గర్ 4–0–35–1, బ్రిజేశ్ 3.4–0–44–1, తుషార్ 3–0–34–0, యశ్‌రాజ్ 2–0–29–0, జడేజా 2–0–28–0. టాస్ గందరగోళం... మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు కారణమైంది. గిల్ నాణెం విసరగా, పరాగ్ ‘హెడ్స్’ చెప్పాడు. అయితే నాణెం కింద పడిన తర్వాత దానిని స్పష్టంగా చూపించకుండా రిఫరీ ప్రకాశ్ భట్ తాను ‘సరిగా వినలేదని’... టాస్ మళ్లీ వేయమని కోరాడు. దాంతో మళ్లీ నాణెం విసరగా, ఈసారి పరాగ్ టాస్ నెగ్గాడు. దాంతో గిల్ తన అసంతృప్తిని ప్రదర్శించాడు. గత మ్యాచ్‌లో వాడిన పిచ్ కాబట్టి తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ రిఫరీ సరిగా వినలేదని అతను వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో టైటాన్స్ ఓడి ఉంటే ఇది కూడా పెద్ద వివాదానికి కారణమయ్యేదేమో. -
పాపం సాయి సుదర్శన్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2లో సుదర్శన్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. సుదర్శన్ ఇలా విచిత్రంగా ఔటవ్వడం ఇది వరుసగా రెండో సారి కావడం విశేషం. అంతకుముందు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా సుదర్శన్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి మంచి రిథమ్‌లో కన్పించాడు. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బ్రిజేష్ శర్మ.. ఐదో బంతిని సుదర్శన్‌కు ఫుట్‌టాస్‌గా సంధించాడు. ఆ బంతిని ఆఫ్‌సైడ్ డీప్‌స్క్వేర్ దిశగా బౌండరీకి తరలించాడు. అయితే షాట్ ఆడే వేగంలో ఈసారి కూడా బ్యాట్ అతని చేతిలో నుంచి జారిపోయింది.గత మ్యాచ్‌లో బ్యాట్ కిందపడి దొర్లుకుంటూ వికెట్లను తాకితే, ఈసారి మాత్రం నేరుగా వెళ్లి స్టంప్స్ మీద పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. శుభ్‌మన్ గిల్ తల పట్టుకుని మోకాళ్లపై కూలబడిపోయాడు. లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి తన మార్క్ స్టైల్లో... "ఎక్కడ ఉంది ఫెవికాల్? ఎక్కడ ఉంది? వ్యాఖ్యనించాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్‌వికెట్ అవ్వడం ఇదే తొలిసారి కావచ్చు. సుదర్శన్ మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58 పరుగులు చేశాడు.ಹೀಗೂ ಆಗುತ್ತಾ? Hit wicket! Twice in two innings! 👀🤯 Sai Sudarshan ಪಾಲಿಗೆ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ದುರದೃಷ್ಟ ಬೇರೆ ಇಲ್ಲ! ಕ್ರೀಸ್ನಲ್ಲಿದ್ದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಔಟ್ ನೋಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಶಾಕ್ ಆಗಿದೆ! 😱ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL 2026, Qualifier 2 👉 #GTvsRR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar. pic.twitter.com/al2pOTFFk5— Star Sports Kannada (@StarSportsKan) May 29, 2026 -
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్‌లో శుభ్‌మన్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.రియాన్ పరాగ్ 'హెడ్స్' అని కాల్ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్‌ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్‌ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్‌కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంToss clip 🔥SCAM?? MISTAKE??FIXED??? OR WOTTT??? 🙊 #GTvsRR pic.twitter.com/atQe43C6Mm— CHICO (@CHICOx58) May 29, 2026 -
క్వాలిఫయర్-2లో గుజరాత్ ఘన విజయం
Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates: ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ ఫైనల్ బెర్త్‌ను గుజరాత్ ఖరారు చేసుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఈ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సుదర్శన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ తలా వికెట్ సాధించారు. మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీతో గుజరాత్ తలపడనుంది.సుందర్ అవుట్వాషింగ్టన్ సుందర్(6).. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.గుజరాత్ రెండో వికెట్ డౌన్‌గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 104 పరుగులు చేసిన గిల్.. ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.శుబ్‌మన్ సెంచరీగుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గుజరాత్ విజయానికి 38 బంతుల్లో 39 పరుగులు కావాలి.గుజరాత్ తొలి వికెట్ డౌన్సాయిసుదర్శన్(58) రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సుదర్శన్ మరోసారి హిట్‌వికెట్ రూపంలో వెనుదిరిగాడు.విజయం దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(39 బంతుల్లో 81), సాయిసుదర్శన్(27 బంతుల్లో 51) దుమ్ములేపుతున్నారు. గుజరాత్ విజయానికి 54 బంతుల్లో 71 పరుగులు కావాలి.దుమ్ములేపుతున్న గుజరాత్ ఓపెనర్లు6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(30), శుబ్‌మన్ గిల్(29) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్215 పరుగుల భారీ లక్ష్య చేధనను గుజరాత్ టైటాన్స్ ఘనంగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(21), సాయిసుదర్శన్(14) ఉన్నారు.వైభవ్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.వైభవ్ సెంచరీ మిస్రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీని 4 పరుగులు దూరంలో మిస్ చేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.వైభవ్ హాఫ్ సెంచరీవైభవ్ సూర్యవంశీ 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 14 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/5రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆర్చర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా తిరిగి క్రీజులోకి వచ్చాడు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్దసన్ షనక రూపంలో రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన షనక.. హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.రియాన్ పరాగ్ రెండో వికెట్ డౌన్రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జడేజా రిటైర్డ్ హార్ట్మంచి టచ్‌లో కన్పించిన రవీంద్ర జడేజా(19 బంతుల్లో 34) గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 100/2మొదలెట్టిన వైభవ్వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 27) దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోర్: 45/2రాజస్తాన్‌కు భారీ షాక్.. 13 రన్స్‌కే 2 వికెట్లుధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 13/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్టాస్ గెలిచి బ్యాటింగ్‌కు రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.గుజరాత్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్ సాయికిషోర్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్‌లతో కూడిన బలమైన లైనప్‌కు తోడు భువనేశ్వర్, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్‌ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
GT vs RR: పొంచి ఉన్న ప్రమాదం.. మ్యాచ్ రద్దైతే?
క్వాలిఫయర్-1లో ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్.. తనకున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్లో మూడోసారి ఫైనల్ చేరడమే లక్ష్యంగా రాజస్తాన్ రాయల్స్‌తో పోటీకి సిద్ధమైంది.ముల్లన్పూర్ వేదికగా..ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్- రాజస్తాన్ మధ్య ఈ నాకౌట్ మ్యాచ్‌కు న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గల మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక.పొంచి ఉన్న ప్రమాదంకాగా వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముల్లన్‌పూర్‌లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయంత్రం మేఘావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌కు కొద్దిమేర వర్ష ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు.సాయంత్రానికి పరిస్థితి చక్కబడితే మాత్రం మ్యాచ్‌కు ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ వాన వల్ల మ్యాచ్‌కు ఆటంకం కలిగితే, రద్దైతే పరిస్థితి ఏమిటి?.. ఐపీఎల్ నిబంధల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు.మ్యాచ్ రద్దైతే?కాబట్టి వర్షం వల్ల ఇప్పుడు క్వాలిఫయర్-2కు అంతరాయం కలిగితే.. 16.10.3 క్లాజ్ ప్రకారం.. ఇరుజట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు టై అయితే.. ఫలితం తేలేంత వరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు.అయితే, సూపర్ ఓవర్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోతే.. గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు కలిగి ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. ఒకవేళ పాయింట్లు కూడా సమంగా ఉంటే అప్పుడు నెట్‌రన్‌రేటు కీలకంగా మారుతుంది.కాగా గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి 18 పాయింట్లు సాధించింది. మరోవైపు.. రాజస్తాన్ పద్నాలుగింట ఎనిమిది గెలిచి.. 16 పాయింట్లతో ఉంది. కాబట్టి.. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫయర్-2 ఆడే పరిస్థితి తెచ్చుకుంది.ఆర్సీబీతో తలపడేది ఎవరో!మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్ట సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. క్వాలిఫయర్-2 రూపంలో సువర్ణావకాశం దక్కించుకుంది. కాగా ఐపీఎల్-2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. క్వాలిఫయర్-2 విజేతతో మే 31న ఆర్సీబీ అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంటుంది. కాగా గతేడాది ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవగా.. గుజరాత్ తమ అరంగేట్ర సీజన్ 2022లోనే ట్రోఫీ సాధించింది. ఇక 2023లో కూడా ఫైనల్ చేరిన గుజరాత్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
వైభవ్ X గుజరాత్
న్యూ చండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించడమే లక్ష్యంగా... నేడు మాజీ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్త్ లభిస్తుంది. క్వాలిఫయర్–1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే టైటిల్ పోరుకు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో చోటు కోసం మరోపోరుకు సిద్ధమైంది. తొలి ఐపీఎల్ సీజన్లో (2008) విజేతగా అవతరించిన రాజస్తాన్ 2022లో రెండోసారి ఫైనల్ చేరి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గుజరాత్ జట్టు 2022లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి, 2023లో రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. సన్‌రైజర్స్‌తో ఇదే వేదికపై జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించి రాజస్తాన్ రాయల్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి మరోసారి వైభవ్పైనే కేంద్రీకృతమైంది. వైభవ్ 10 ఓవర్లు క్రీజులో ఉంటే మాత్రం రాజస్తాన్ రాయల్స్ మరోసారి ప్రత్యరి్థకి 200 పరుగులపైనే లక్ష్యాన్ని నిర్దేశించడం ఖాయం. వైభవ్‌ను పవర్‌ప్లే లోపు అవుట్ చేస్తే మాత్రం గుజరాత్ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. టాప్–3పైనే భారం బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లలో సారూప్యత కనిపిస్తోంది. ఈ సీజన్లో రెండు జట్లు ఎక్కువగా టాప్–3 బ్యాటర్లపైనే ఆధారపడ్డాయి. వైభవ్ సూర్యవంశీ (15 మ్యాచ్‌ల్లో 680 పరుగులు), యశస్వి జైస్వాల్ (15 మ్యాచ్‌ల్లో 426 పరుగులు), ధ్రువ్ జురేల్ (15 మ్యాచ్‌ల్లో 508 పరుగులు) ఈ సీజన్లో నిలకడగా రాణించారు. మరోవైపు గుజరాత్ టాపార్డర్ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (14 మ్యాచ్‌ల్లో 618 పరుగులు), సాయి సుదర్శన్ (15 మ్యాచ్‌ల్లో 652 పరుగులు), జోస్ బట్లర్ (15 మ్యాచ్‌ల్లో 498 పరుగులు) కూడా ఈ సీజన్లో మెరిపించారు. రెండు జట్ల మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల టాపార్డర్ బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగితే భారీ స్కోర్లు ఆశించలేము. ఒకవేళ క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం పరుగుల విందు ఖాయమనుకోవాలి. గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు కలిపి మొత్తం 59 సిక్స్‌లు కొట్టగా... రాజస్తాన్ చిచ్చరపిడుగు వైభవ్ ఒక్కడే 65 సిక్స్‌లు బాదాడు. బౌలర్ల తడాఖా... బౌలింగ్ విభాగానికొస్తే గుజరాత్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. గుజరాత్ పేస్ బౌలర్లు రబాడ 26 వికెట్లు, సిరాజ్ 17 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 15 వికెట్లు, హోల్డర్ 15 వికెట్ల చొప్పున పడగొట్టారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రాజస్తాన్ పేసర్లు ఆర్చర్ 24 వికెట్లు నేలకూల్చగా... బ్రిజేశ్ శర్మ, బర్గర్ 13 వికెట్ల చొప్పున తీశారు. రెండు జట్ల ఓపెనర్లు ఆరంభంలో వికెట్ ఇవ్వకుంటే భారీ స్కోరుకు బాటలు పడతాయి. ఈ సీజన్లో ఛేజింగ్ చేసిన జట్లు 43 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... 27 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మరో మ్యాచ్ ‘టై’ అయింది. ఐపీఎల్ 19 సీజన్లను పరిశీలిస్తే ‘నాకౌట్’ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 36 సార్లు గెలుపొందగా... ఛేజింగ్ చేసిన జట్టు 35 సార్లు విజయం అందుకుంది.పిచ్, వాతావరణం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌నే క్వాలిఫయర్–2లోనూ వాడనున్నారు. ఫలితంగా ఈసారి ఛేజింగ్ చేసే జట్టు ఇబ్బంది పడవచ్చు. మ్యాచ్ రోజున మధ్యాహ్నం వడగళ్ల వాన కురిసే అవకాశముంది. అయితే సాయంత్రం మేఘావృతంగా ఉండి మ్యాచ్‌కు ఆటంకం ఉండకపోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) గుజరాత్ టైటాన్స్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, నిశాంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తేవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్/సాయికిశోర్. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, డోనోవాన్ ఫెరీరా, షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్ శర్మ, సుశాంత్ మిశ్రా, యశ్‌రాజ్ పుంజా. -
గుజరాత్ కొంపముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్‌కే?
ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్-1లో 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ కీలక మ్యాచ్‌లో గుజరాత్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ విఫలమైంది. ముఖ్యంగా గుజరాత్ ఓటమికి ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ పరోక్షంగా కారణమయ్యాడు.రబాడ బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టినప్పటికి తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఫీల్డింగ్‌లో అయితే రబాడ వదిలిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. గుజరాత్ ఓటమిని శాసించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రబాడ జారవిడిచాడు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ స్కోర్ పవర్‌ప్లేలోనే 76/1కు చేరింది. పవర్‌ప్లే తర్వాత గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా 9 ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ కేవలం మూడు బంతుల వ్యవధిలో కోహ్లీ (43), పడిక్కల్ (30) ఇద్దరినీ అవుట్ చేసి ఆర్సీబీకి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్వంత్ ఖేజ్రోలియా, రషీద్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు వేగం నెమ్మదించింది.దీంతో 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 128/3గా ఉండేది. అయితే సరిగ్గా ఇదే సమయంలో రబాడ చేసిన తప్పిదం గుజరాత్ టైటాన్స్ కొంపముంచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో మూడో బంతిని పాటిదార్ ఫుల్‌షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. అయితే డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రబాడ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇందుకు గుజరాత్ టైటాన్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 20 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడి సునామీ ఇన్నింగ్స్ ధాటికి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. మే 29న ఛండీఘర్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ లేదా రాజస్తాన్ రాయల్స్‌తో గుజరాత్ తలపడనుంది.చదవండి: ఇప్పట్లో అతడిని టెస్టులకు ఎంపిక చేయొద్దు: గంగూలీ -
'పనికొచ్చే ప్రశ్నలు వేయండి'.. గుజరాత్ బ్యాటర్ ఆగ్రహం!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విధించిన 255 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం గుజరాత్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ మీడియా సమావేశానికి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న రిపోర్టర్లలో ఒక వ్యక్తి తన ప్రశ్నలతో గ్లెన్ ఫిలిప్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. 'ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసినప్పుడే మీ మైండ్‌లో ఓటమి భయం మొదలైందనుకుంటా' అని ప్రశ్నించాడు. రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఫిలిప్స్ ఆ తర్వాత సదరు రిపోర్టర్‌కు ధీటుగా బదులిచ్చాడు. 'ఇదొక దిక్కుమాలిన ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడు లక్ష్యం గురించి ఆలోచించరు. మ్యాచ్‌లో టార్గెట్ ఎంత ఉన్నప్పటికీ పరుగులు చేయడానికే ప్రయత్నిస్తారు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలను మదిలోకి రానివ్వరు. మీరు వేసిన ప్రశ్న చాలా ఘోరంగా ఉంది. ఐపీఎల్ ఇంతకుమించి టార్గెట్లు ఛేదించిన సందర్భాలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారా?అయితే భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. ఆ ఒత్తిడిలో ఒక్కోసారి విజయం సాధించలేకపోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. చదవండి: ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ! -
పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ పోరులో గుజరాత్ టైటాన్స్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. ఈ సీజన్ లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. ఆర్సీబీతో క్వాలిఫయర్-1 పోరులోనే వరుస బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో అద్భుతమైన స్క్వేర్ కట్‌తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగిన బ్యాట్ వచ్చి నేరుగా లెగ్ స్టంప్‌ను తాకి బెయిల్స్‌ను పడగొట్టింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ సాయి సుదర్శన్‌ను హిట్ వికెట్‌గా ఔటిచ్చాడు. దీంతో చేసేదేం లేక సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి విచిత్రమైన ఔట్ చూసి కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా షాక్ తిన్నారు. మ్యాచ్‌లో కూడా ఇదే టర్నింగ్ పాయింట్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో గుజరాత్ తరఫున నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఆరెంజ్‌క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. గతేడాది కుశాల్ మెండిస్..ఇక ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ దశలో హిట్ వికెట్ అయిన రెండో బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. తొలి బ్యాటర్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతేడాది ముంబై ఇండియన్స్‌తో ప్లేఆఫ్ మ్యాచ్ సందర్భంగా ఇదే గుజరాత్‌కు చెందని కుశాల్ మెండిస్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఔట్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'బంతి బౌండరీకి వెళ్లింది.. కానీ బ్యాట్ వికెట్లను కొట్టేసింది', 'పాపం సాయి సుదర్శన్', 'క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. HOW UNFORTUNATE! 🤯Probably the only way to end Sai Sudharsan's streak of five 50-plus scores 🫣Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/DbpVS0JUKw— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: గుజరాత్‌పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే! -
గుజరాత్‌పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్‌లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్‌లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్‌లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్‌గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్‌గా మారింది. తాను బౌలింగ్‌కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్‌ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్‌కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్‌ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్‌పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్‌తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్‌ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్‌ను గెలిపించింది వాళ్లే!’
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు. ఈ మ్యాచ్‌లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్‌తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు.పాటీదార్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశాడు. సెంచరీ ఏముంది మరో మ్యాచ్‌లో చేసుకోవచ్చు. అయినా నా బ్యాటింగ్‌లో చాలా తప్పులున్నాయి. లైఫ్‌లు లభించడంతోనే ఇవాళ భారీ స్కోరు సాధించాను. మేము భారీ స్కోరు చేసినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గెలుపు క్రెడిట్‌ను నేను తీసుకోలేను, మా బౌలర్లే ఇవాళ నిజమైన హీరోలు.ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని మా బౌలర్లు ముందే చెప్పారు. లీగ్ ముందుకు సాగుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్, రసిక్ సలామ్, కృనాల్ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని రజత్ పాటీదార్ ధీమా వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెపె్టన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Body Language: “𝘞𝘦 𝘢𝘳𝘦 𝘤𝘰𝘮𝘪𝘯𝘨 𝘧𝘰𝘳 𝘺𝘰𝘶” 🦁 pic.twitter.com/oVXoBEWBki— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026 -
పాటిదార్ ఊచకోత.. గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టు.. ఇవాళ (మే 26) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ రజత్ పాటిదార్ మహోగ్రరూపం (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దాల్చాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్ (14) దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరగడంతో ఈ జట్టు పతనం ప్రారంభమైంది. ఆతర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2).. 51 పరుగుల వద్ద బట్లర్ (29), నిషాంత్ సింధు (5), హోల్డర్ (0) ఔట్ కావడంతో పవర్ ప్లేలోనే (5.4 ఓవర్లలో) ఓటమి ఖరారైంది. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) కూడా ఔట్ కావడం 100 పరుగులలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో తెవాతియా (68) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోర్ 100 పరుగుల మార్కు దాటింది. అంతిమంగా గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, భువీ, రసిక్, కృనాల్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
IPL 2026 Qualifier 1: అదే జరిగితే.. ఫైనల్‌కు ఆర్సీబీ?
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరింది. మంగళవారం ధర్మశాల వేదికగా జరగనున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తుది పోరుకు అర్హత సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో ధర్మశాలలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.మ్యాచ్ రద్దు అయితే?ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లకు ఎలాంటి 'రిజర్వ్ డే' లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలో వర్షం కారణంగా అంతరాయం కలిగితే మ్యాచ్ ఫలితం తేల్చేందుకు అదనంగా కేవలం ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది.కానీ ప్లేఆఫ్స్ మ్యాచ్ విషయంలో మాత్రం అదనంగా రెండు గంటల సమయం కేటాయిస్తారు. కనీసం సూపర్ ఓవర్లో అయినా ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు.అప్పటికి కూడా ఆట వీలుకాకపోతే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తారు. అదే జరిగితే లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్నందున ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.అప్పుడు గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. కాగా లీగ్ దశ ముగిసేసరికి రెండు జట్లు చెరో 14 మ్యాచ్‌లు ఆడి, 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించడంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు -
క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న పోరులో అందరి కళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్‌లో కోహ్లీ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఆర్సీబీ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్‌లో 17 మ్యాచ్‌లాడిన కోహ్లీ 121 స్ట్రైక్‌రేట్‌తో 396 పరుగులు సాధించాడు. మరి గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే గుజరాత్‌తో మ్యాచ్‌లో పిచ్‌పై అవగాహన వచ్చేవరకు నిలదొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. పైగా ధర్మశాలలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 557 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఇరుజట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వాలిఫయర్-1 పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.చదవండి:‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’ -
క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ అడుగు ఎవరిది?
ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్ జట్లు మరో టైటిల్ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ టీమ్‌ల మధ్య మ్యాచ్ తొలి క్వాలిఫయర్ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్‌లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్ దశ రెండు ముఖాముఖి మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి క్వాలిఫయర్–1 ద్వారా నేరుగా ఫైనల్‌కు చేరుతుందా? గత సీజన్లో ఎలిమినేటర్‌లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్ దూసుకొచ్చింది. ఐపీఎల్లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి. ఆద్యంతం నిలకడగా..వరుసగా రెండో సీజన్లో టాప్–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్‌లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంటే టీమ్ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్ (433), పాటీదార్ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్‌లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. హాజల్‌వుడ్, రసిఖ్ సలామ్లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్‌లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్ డేవిడ్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో తన బాధ్యతను నెరవేర్చాడు. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్‌వుడ్ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్‌కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్‌గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్ అయ్యర్‌నే కొనసాగిస్తారు. స్పిన్నర్ సుయాశ్ స్థానంలో పేసర్ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. టాప్–3 బ్యాటింగ్‌తోనే..గుజరాత్ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్ బౌలింగ్ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా, అర్షద్ ఖాన్ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్ ఎంతో ప్రభావం చూపించాడు. ఆల్‌రౌండర్ హోల్డర్ పేస్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్ ఖాన్ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్‌ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్‌లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రసిధ్ లేదా సాయికిషోర్లలో ఒకరికి చాన్స్ లభిస్తుంది. బ్యాటింగ్‌లో మరోసారి టైటాన్స్ టాప్–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్ (638), శుబ్‌మన్ గిల్ (616), జోస్ బట్లర్ (469) చెలరేగడంతోనే టైటాన్స్ ప్రస్థానం ప్లే ఆఫ్స్ వరకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.పిచ్, వాతావరణంభారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్‌లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్‌లలో కూడా ఛేదన చేసిన టీమ్ విజయం సాధించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో బ్యాట్‌ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్‌పై ముంబై గెలిచిన మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. The steepest climb of the season, but the view from the top is a spot in the Final! 🏔️Dharamshala is READY for the #Qualifier1 🏟️#TATAIPL | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/sCdPkNMzyZ— IndianPremierLeague (@IPL) May 25, 2026 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! -
ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్లుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ప్లేఆఫ్స్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ సమయంకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు. మే 26న జరగనున్న క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఇక మే 27న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ తలపడనున్నాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మే 29న జరగనున్న క్వాలిఫయర్-2 పోరులో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడనుంది. ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముల్లన్పూర్ వేదిక కానుంది. ఇక ఆదివారం (మే 31న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో క్వాలిఫయర్-1 విజేతతో క్వాలిఫయర్-2 విజేత అమీతుమీ తేల్చుకోనుంది.ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్మే 26- క్వాలిఫయర్-1 (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ధర్మశాల, రాత్రి 7.30 నుంచి)మే 27- ఎలిమినేటర్ (ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్తాన్, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 29-క్వాలిఫయర్-2 (క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 31- ఫైనల్ (క్వాలిఫయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫయర్-2 విన్నర్, అహ్మదాబాద్, రాత్రి 7.30 నుంచి)4️⃣ teams. 1️⃣ winner All roads lead to the ultimate glory 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు! -
గుజరాత్ ఓపెనర్‌కు అశ్విన్ చురకలు!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలకడ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడిన సాయి సుదర్శన్ 157 స్ట్రైక్‌రేట్‌తో 638 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్‌లో కొనసాగుతున్నాడు. అయితే సాయి సుదర్శన్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరముందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు.ఐపీఎల్లో స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నప్పటికీ ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో సాయి సుదర్శన్ విఫలమవుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజరాత్ టైటా న్స్ను అటు కెప్టెన్‌గా సమర్థంగా నడిపిస్తూనే బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్రదర్శన మెచ్చుకునే రీతిలో ఉన్నప్పటికీ మోడ్రన్ టీ20 క్రికెట్‌కు సరిపోయేలా అతడు ఆడడం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువగా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్‌లో వేగం పెంచితే మాత్రం సాయి సుదర్శన్‌కు తిరుగుండకపోవచ్చు. ఆరెంజ్ క్యాప్‌లో లీడింగ్‌లో ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ తన ప్రదర్శనను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అతడు దీనిని చేయగలడని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్నప్పటికీ తనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయలేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థశతకాలతో రాణించారు. జాస్ బట్లర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమితో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: ఆటగాళ్లకు అవమానం.. పాక్ జట్టులో సంక్షోభం! -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌ర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో శుభ్‌మన్ 600 పరుగుల మైలు రాయిని దాటేశాడు. కెప్టెన్‌గా గిల్ ఒకే సీజన్లో 600 పరుగులను పూర్తి చేసుకోవడం ఇది రెండో సారి. ఈ క్రమంలో 26 ఏళ్ల గిల్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గిల్ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ చరిత్రలో 27 ఏళ్ల వయస్సులోపు కెప్టెన్‌గా ఒకటి కంటే ఎక్కువ సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి 27 ఏళ్ల వయస్సు లోపు కేవలం ఒక్క సీజన్లో మాత్రం ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లిని గిల్ అధిగమించాడు.👉అదేవిధంగా వరుస సీజన్లలో కెప్టెన్‌గా 600కు పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ కేఎల్ రాహుల్( 29 ఏళ్ల వయసులో) పేరిట ఉండేది.👉27 ఏళ్లు నిండకముందే ఒక ఆటగాడిగా ఐపీఎల్లో మూడు వేర్వేరు సీజన్లలో 600 ప్లస్ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గిల్ రికార్డులకెక్కాడు.👉ఐపీఎల్ చరిత్రలో వరుస సీజన్లలో కెప్టెన్‌గా 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో సారథిగా గిల్ నిలిచాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇక మ్యాచ్‌లో సీఎస్కేపై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84), జోస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి తలా వికెట్ సాధించారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి సీఎస్కేను దెబ్బ తీశారు. -
ఘోర ఓటమి.. ఐపీఎల్ నుంచి సీఎస్కే అవుట్
ఐపీఎల్-2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో సీఎస్కే ఘోర పరాజయం పాలైంది. దీంతో సీఎస్కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చెన్నైకు ప్లే ఆఫ్స్ రేసులో ఉండేది. కానీ ఓడిపోవడంతో ఈ ఏడాది సీజన్లో సీఎస్కే కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84), జోస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. గుజరాత్ బౌలర్ల ధాటికి 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!.. ఐపీఎల్లో సరికొత్త చరిత్ర -
GTతో CSKఢీ.. భారీ తేడాతో గెలిస్తేనే చెన్నైకి ఛాన్స్
-
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. ప్రపంచ రికార్డు
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సాయి బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 247 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.మూడు అర్ధ శతకాలులక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెరుగ్గా రాణించారు. సాయి 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులతో అజేయంగా నిలవగా.. గిల్ 49 బంతుల్లో 85 పరుగులు చేశాడు. మిగతావారిలో జోస్ బట్లర్ 35 బంతుల్లో 57 పరుగులు రాబట్టగలిగాడు.The 𝗦 in Effortle𝘀𝘀 stands for 𝗦hubman Gill and 𝗦ai Sudharsan 🤌Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/pLTiOLMZUU— IndianPremierLeague (@IPL) May 16, 2026అయితే, ఈ ముగ్గురి హాఫ్ సెంచరీలు గుజరాత్‌ను నిలబెట్టలేకపోయాయి. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులకే పరిమితమైన గుజరాత్.. 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ పొట్టి క్రికెట్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.అతి తక్కువ ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అత్యంత వేగంగా.. అంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే టీ20 ఫార్మాట్లో ఈ మైలురాయిని చేరుకున్న క్రికెటర్ సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఆసీస్ స్టార్ షాన్ మార్ష్ 85 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. సాయి సుదర్శన్ కేవలం 78 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకోవడం విశేషం.టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 3000 రన్స్ సాధించిన టాప్-5 క్రికెటర్లు👉సాయి సుదర్శన్ (ఇండియా)- 78 ఇన్నింగ్స్‌లో👉షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా)- 85 ఇన్నింగ్స్‌లో👉డిఆర్సీ షార్ట్ (ఆస్ట్రేలియా)- 86 ఇన్నింగ్స్‌లో👉డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)- 86 ఇన్నింగ్స్‌లో👉క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 87 ఇన్నింగ్స్లోసాయి సుదర్శన్ టీ20 ఫార్మాట్ రికార్డు ఇదీఐపీఎల్లో గుజరాత్ తరఫున ఇప్పటికి 53 మ్యాచ్‌లలో కలిపి సాయి సుదర్శన్ 2347 పరుగులు సాధించాడు. తమిళనాడు తరఫున దేశీ టీ20 టోర్నీలో 25 మ్యాచ్‌లలో 670 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఒక మ్యాచ్ ఆడినప్పటికీ పరుగులేమీ రాబట్టలేకపోయాడు.చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ -
మాకు గెలిచే అర్హత లేదు.. తప్పంతా వాళ్లదే: గిల్
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది.ఈ నేపథ్యంలో కోల్‌కతా చేతిలో ఓటమి అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టినా ఫీల్డింగ్‌లో తాము విఫలమయ్యామని.. క్యాచ్‌లు జారవిడిచి మ్యాచ్‌ను చేజార్చుకున్నామని పేర్కొన్నాడు.మాకు గెలిచే అర్హత లేదుఈ మేరకు.. ‘‘ఈ వికెట్ బాగుంది. ఇక్కడ 200- 210 పరుగులు స్కోరు చేయవచ్చు. మేము ఇక్కడ బాగా బ్యాటింగ్ చేశాము. ఈ విషయంలో ఆందోళన లేదు. అయితే, మా ఫీల్డింగ్ చెత్తగా సాగింది.మూడు సులువైన క్యాచ్‌లు వదిలేశాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అర్హత లేదనే చెప్తాను. ఏదేమైనా క్వాలిఫయర్స్‌కు చేరువవుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ మాకు మంచి ప్రాక్టీస్‌ను ఇచ్చింది.కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత బలంగా తిరిగి వస్తాము. తదుపరి మ్యాచ్ మా సొంతమైదానంలో జరుగనుంది. అందుకోసం అహ్మదాబాద్ బయల్దేరుతాం. అక్కడి వికెట్‌కు అనుగుణంగా మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము’’ అని గిల్ పేర్కొన్నాడు. ఓటమికి ప్రధాన కారణం అదేఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని.. తమ ఓటమికి ప్రధాన కారణం అదేనని గిల్ తెలిపాడు. కాగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను గుజరాత్ వదిలేసింది. 200 games done, will there be 200 more? 😯Sunil Narine speaks about playing more and more for @kkriders 💜#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/m7m6Pj1isd— IndianPremierLeague (@IPL) May 16, 2026ఈ క్రమంలో అలెన్ తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని.. 35 బంతుల్లోనే 93 పరుగులు సాధించి జట్టు గెలుపునకు బాటలు వేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 53 నాటౌట్), గిల్ (49 బంతుల్లో 85).. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (35 బంతుల్లో 57) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, కేకేఆర్ విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా విజయానికి 29 పరుగుల దూరంలో నిలిచిపోయింది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన కేకేఆర్ ఓపెనర్ -
గుజరాత్‌పై విజయం.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. చివరిలో సాయిసుదర్శన్, జోస్ బట్లర్ కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్(57), సాయిసుదర్శన్(53 నాటౌట్) రాణించారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
మహమ్మద్ సిరాజ్ 'డబుల్ సెంచరీ'
టీమిండియా పేసర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన టీ20 కెరీర్లో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20ల్లో 200 వికెట్లను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్-2026లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అజింక్య రహానే అవుట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 21 భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఇప్పటివరకు 174 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మియా.. 8.00కు పైగా ఏకానమితో రెండు వందల వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 ఫోర్ వికెట్ హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కూడా సిరాజ్ మియా సభ్యునిగా ఉన్నాడు. సిరాజ్‌టెస్టు క్రికెట్లోనే కాకుండా వైట్‌బాల్‌తో కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. అలెన్ కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
గిల్ మెరుపులు వృథా.. గుజరాత్‌పై కేకేఆర్ విజయం
Gujarat titans vs Kolkata knight riders Live updates: ఈడెన్‌గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్(57), సాయిసుదర్శన్(53 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, దూబే, గ్రీన్ తలా వికెట్ సాధించారు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్177 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 85 పరుగులు చేసిన గిల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.రసవత్తరంగా జీటీ-కేకేఆర్ మ్యాచ్16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 177పరుగులు చేసింది. క్రీజులో గిల్(85), జోస్ బట్లర్(50) ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో గిల్(52), జోస్ బట్లర్(29) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గిల్9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(46), జోస్ బట్లర్(6) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్49 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు చేసిన సింధు.. నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ సాయిసుదర్శన్(23) గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 49 పరుగులు చేసింది.గుజరాత్ ముందు భారీ టార్గెట్ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలెన్ కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.భారీ స్కోర్ దిశగా కేకేఆర్అలెన్ ఔటైనప్పటికి గ్రీన్(35), రఘువంశీ(45) దూకుడుగా ఆడుతున్నారు.16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 192/2ఫిన్ అలెన్ఫిన్ అలెన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసిన అలెన్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీఫిన్ అలెన్ 21 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 85/1తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ రహానే రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రహానే.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 47/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే(9), ఫిన్ అలెన్(4) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. కేకేఆర్ జట్టులోకి వరుణ్ చక్రవర్తి తిరిగి రాగా.. గుజరాత్ టీమ్‌లోకి సాయి కిషోర్ వచ్చాడు. తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగిగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ -
'వైభవ్ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ వంటి కీలక వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ను సుదర్శన్ తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. కష్టతరమైన పిచ్‌పై సుదర్శన్ సంయమనంతో ఆడి గుజరాత్ జట్టు 168 పరుగుల స్కోరు సాధించేలా చేశాడు. మొత్తంగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 41.75 సగటుతో 501 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సుదర్శన్ 500 పరుగులు దాటడం ఇది వరుసగా మూడో సీజన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సుదర్శన్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుదర్శన్ ఆటతీరును కొనియాడుతూ, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సుదర్శన్ సూచించాడు.ఐపీఎల్-2026 సీజన్ ఆరంభంలో సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దారుదాపుల్లో కూడా కన్పించలేదు. కానీ ఇప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతడికి బాగా కలిసి వస్తోందని, అహ్మదాబాద్ పిచ్ కూడా అతడికి సహకరిస్తుందని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.అతను సాంప్రదాయబద్ధమైన (Orthodox) క్రికెట్ షాట్లు ఆడతాడు. అలా అని ఎక్కడా స్లోగా ఆడడు. మైదానానికి రెండు వైపులా పరుగులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజరాత్ ఫ్రాంచైజీ అతడిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. అయినప్పటికి ప్రతీ సీజన్లోనూ అతడు రాణిస్తున్నాడు. మనం సాధారణంగా భారత టీ20 జట్టు గురించి చర్చించేటప్పుడు సుదర్శన్ పేరును కనీసం పరిగణలోకి తీసుకోము. కానీ అతడు తన ప్రదర్శనలతో మన ఆలోచన తప్పు అని ప్రతీసారి నిరూపిస్తున్నాడు. ఇలాంటి నిలకడ ఉన్న ఆటగాడు జట్టులో ఉండాలి. కేవలం సిక్సర్లు కొట్టే ఆటగాళ్లు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాళ్లు కూడా జట్టులో ఉండాలి.కాబట్టి టీమిండియా సెలక్టర్లు అతడిని కచ్చితంగా టీ20 జట్టులోకి తీసుకోవాలని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఇదే సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వైభవ్ సూర్యవంశీ పేరును జాఫర్ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
చారిత్రక రికార్డును సమం చేసిన రబాడ
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రబాడ.. తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఓ చారిత్రక రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్‌లో రబాడ తీసిన 3 వికెట్లు పవర్‌ప్లేలో (ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు) వచ్చినవే. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ జాన్సన్ (2013), ట్రెంట్ బౌల్ట్ (2020)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 17 వికెట్లతో మహ్మద్ షమీ (2023) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. షమీ పేరిట ఉన్న ఈ రికార్డును రబాడ ఈ సీజన్లో తప్పక అధిగమించే అవకాశం ఉంది.అందనంత ఎత్తుకు..!తాజా ప్రదర్శనతో రబాడ ఈ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. రబాడ తర్వాత ఈ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ (12) ఉన్నాడు. ఆతర్వాతి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ (9), సిరాజ్ (9) నిలిచారు.ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో కొత్త బంతితో రబాడ వేసిన స్పెల్ ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకరమైందిగా నిలిచింది. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరణ్ రవిచంద్రన్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపిన రబాడ.. ఎస్ఆర్హెచ్ను కోలుకోలేని దెబ్బ తీశాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్ (4-0-20-3), ప్రసిద్ద్ కృష్ణ (3-0-23-2), సిరాజ్ (3-1-11-1), రషీద్ ఖాన్ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సాయి సుదర్శన్ అరుదైన ఫీట్!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్‌ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ 61 పరుగులతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్లో ఒక అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్‌తో పాటు ఎస్ఆర్హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్‌ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్‌లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్‌ఆర్‌హెచ్‌లపై ఒక్కో అర్థశతకం సాధించాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్లోనూ ఐదొందల పరుగుల మార్క్‌ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్‌ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.చదవండి: ‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ -
రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్ సమీకరణలు
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ప్లే ఆఫ్స్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. సీజన్ ప్రారంభంలో చెలరేగి ఆడిన జట్లు ప్రస్తుతం మెత్తబడగా.. అడపాదడపా ప్రదర్శనలతో ప్రారంభించిన జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.దశ తిరగబడి, అనూహ్యంగా పుంజుకున్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ ముందుంది. ఈ జట్టు రెండు వరుస పరాజయాలతో సీజన్ ప్రారంభించి, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు, ఆతర్వాత మళ్లీ రెండు వరుస పరాజయాలు, వాటి తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ప్రస్తుతం పాయింట్ట పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సీజన్ ప్రారంభంలో ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్ ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్‌గా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (కేకేఆర్, సీఎస్కే) ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారరవుతుంది. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 అపజయాలతో 16 పాయింట్లు కూడగట్టుకుంది. ఈ జట్టు రన్‌రేట్ (0.551) కూడా మెరుగ్గా ఉంది.అంచనాలు తల్లకిందులైన జట్లలో పంజాబ్, రాజస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లుగా చలామణి అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో వెనుకపడ్డాయి. వీటిలో పంజాబ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అపజయం కూడా ఎదుర్కోలేదు. అయితే ఆతర్వాత అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై, నాలుగో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంకటంలో పడేసుకుంది. ఇకపై ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో (ముంబై, ఆర్సీబీ, లక్నో) కనీసం రెండైనా గెలవకపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్ అశలను వదులుకోవాల్సిందే. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 అపజయాలతో 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది. నాలుగు వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, రన్‌రేట్ (0.428) ఇంకా మెరుగ్గానే ఉండటం పంజాబ్‌కు ఊరట కలిగించే విషయం.ఆరంభంలో అదరగొట్టి, ఆతర్వాత ఢిలా పడిపోయిన మరో జట్టు రాజస్థాన్. ఈ జట్టు సీజన్ ప్రారంభంలో నాలుగు వరుస విజయాలు సాధించి, ఆతర్వాత 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బాగా వెనుకపడిపోయింది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో (ఢిల్లీ, లక్నో, ముంబై) కనీసం రెండైనా గెలవకపోతే, ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 6 విజయాలు సాధించి, 5 అపజయాలు ఎదుర్కొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్ (0.082) మెరుగ్గానే ఉంది.హ్యాట్రిక్ పరాజయాలు.. హ్యాట్రిక్ విజయాలుఈ సీజన్లో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన జట్టు సీఎస్కే. ఈ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్ ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. చివరి 8 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాలు సహా 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. సీఎస్కేకు రన్‌రేట్ (0.185) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది.ప్లే ఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న మరో రెండు జట్లు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. సీజన్ ప్రారంభం నుంచి స్థిరంగా రాణిస్తున్న ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొని 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ జట్టు రన్‌రేట్ అన్ని జట్లకంటే మెరుగ్గా (1.103) మెరుగ్గా ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో (కేకేఆర్, పంజాబ్, ఎస్ఆర్హెచ్) రెండు గెలిస్తే సునాయాసంగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (14 పాయింట్లు, 0.331 రన్‌రేట్) కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్‌లు (సీఎస్కే, ఆర్సీబీ) గెలిస్తే, మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అధికారికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్న మరో రెండు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్. ఈ రెండు జట్లు టెక్నికల్‌గా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. ఢిల్లీతో పోలిస్తే కేకేఆర్‌కు కాస్త మెరుగైన అవకాశాలే ఉన్నా, అది కూడా అంత ఈజీ కాదు. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో ఓడినా లీగ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇప్పటివరకు లక్నో, ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
టేబుల్ టాపర్ గా గుజరాత్ టైటాన్స్
-
ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.👉గుజరాత్‌తో మ్యాచ్‌లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్‌లో 113 పరుగులు, 2024లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 113 పరుగులు, 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 114 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్హెచ్కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్‌లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్లో ముంబైతో మ్యాచ్‌లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్‌కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్లో రాజస్తాన్‌పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్‌పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్‌లను సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్‌ను సొంత గ్రౌండ్లో ఆడనుండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.చదవండి: ‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక! -
‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్‌కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్‌ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహం కూడా అదే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్‌ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్‌పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్‌ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్‌ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్‌లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.చదవండి: ‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ -
ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. 86 పరుగులకే ఆలౌట్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐదో ఓటమి ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో పాట్ కమ్మిన్స్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినగుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(61), వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రపుల్ హింగే, షకీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(5)తో పాటు జోస్ బట్లర్(7) విఫలమయ్యాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానానికి చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ను సుదర్శన్ ఆదుకున్నాడు.ఈ తమిళనాడు క్రికెటర్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్-2026 సీజన్లో 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.👉ఐపీఎల్ చరిత్రలో 24 ఏళ్ల వయసులోపు మూడు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇంతకుముందు ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 24 ఏళ్ల వయసులోపు రెండు సీజన్లలో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (2014-2017), కె.ఎల్. రాహుల్ (2018-2021), విరాట్ కోహ్లి (2023-2025), సాయి సుదర్శన్ (2024-2026) ఉన్నారు.👉గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడుసార్లు 500+ పరుగులు చేసిన మొదటి ఆటగాడు కూడా సుదర్శనే కావడం గమనార్హం. -
వైభవ్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బౌలర్లను ఉతికారేస్తుండడంతో అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కమిన్స్, షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడి పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ మాత్రం వైభవ్ సూర్యవంశీని పెద్దగా పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అతడికి బంతులు వేసే క్రమంలో 11 ఏళ్లుగా తనకు తెలిసిన విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై మ్యాచ్ అనంతరం రబాడ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్‌ను కొనసాగించాలి’ అని పేర్కొన్నాడు. శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్‌గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.ఐపీఎల్ 2026 సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రెండో అంచెలో మాత్రం ఓటములు చవిచూస్తూ వస్తోంది. అయితే వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో మినిమం గ్యారంటీ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో నాలుగోసారి సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన వైభవ్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్‌లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్‌పై విజయంతో గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.చదవండి: సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్! -
దుమ్ములేపిన రషీద్, గిల్.. టాప్-2కు దూసుకొచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36 పరుగులు) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో రాజస్తాన్ లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన రాజస్తాన్ ఐదో స్థానానికి పడిపోయింది.గుజరాత్ ఓపెనర్ల దూకుడు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ శుభారంబాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు శతక భాగస్వామ్యం (118 పరుగులు) జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అర్థసెంచరీ అనంతరం సాయి సుదర్శన్ వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బట్లర్, వాషింగ్టన్ సుందర్‌లతో కలిసి గిల్ భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో సుందర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ 220 ప్లస్ స్కోరును దాటింది.చేధనలో చతికిలపడి..230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు వైభవ్ సూర్యవంశీ తన దనాధన్ ఇన్నింగ్స్‌తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్తాన్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. జురేల్, జడేజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం మినహా ఏం చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓటమి దిశగా పయనించింది. ఈ సీజన్లో గుజరాత్ చేతిలో రాజస్తాన్‌కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.A 𝙏𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 by 7⃣7⃣ runs✌️4⃣th consecutive win for @gujarat_titans as they move to no.2⃣ in the Points Table 🔢This is also #GT's biggest #TATAIPL win (by runs) 👏👏Scoreboard ▶️ https://t.co/t7CEEL9Bzp#KhelBindaas | #RRvGT pic.twitter.com/jXKWcdBfru— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా! -
వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరుకుంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ 2024 సీజన్లో ఓవరాల్‌గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి వైభవ్ ఇంకా ఎన్ని సిక్సర్లు కొడుతాడో చూడాలి. ఇప్పటికైతే వైభవ్ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (2025 సీజన్లో 39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (2016 సీజన్లో 38 సిక్సర్లు, 2024 సీజన్లో 38 సిక్సర్లు), సూర్యకుమార్ (2025 సీజన్లో 38 సిక్సర్లు), రిషబ్ పంత్ (2024 సీజన్లో 37 సిక్సర్లు) ఉన్నారు.👉ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లే (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024 సీజన్), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్*), జయసూర్య (22 సిక్సర్లు, 2008 సీజన్), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024 సీజన్), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025 సీజన్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉 ఐపీఎల్ సీజన్లో ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించడం వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడోసారి. ఈ సీజన్లో ఇది నాలుగోసారి కావడం విశేషం.👉 ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.MAKING IT A HABIT 🤩🎥 Just Vaibhav Sooryavanshi with yet another high-intent knock 🙌Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/LYEfiG4wnZ— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా? -
ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా?
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఆర్చర్ 5 వైడ్లు వేశాడు. ఆరు బంతులు వేయాల్సిన చోట 11 బంతులు వేసిన ఆర్చర్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు. ఇక ఆర్చర్ మరో రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన ఏడో బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు. గతంలో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ 11 బంతుల ఓవర్ వేశారు.👉మహ్మద్ సిరాజ్ (11 బంతులు, 2023లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో)👉 తుషార్ దేశ్‌పాండే (11 బంతులు, 2023లో లక్నోతో మ్యాచ్‌లో)👉 శార్దూల్ ఠాకూర్ (11 బంతులు, 2025లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో)👉 సందీప్ శర్మ (11 బంతులు, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో)👉 హార్దిక్ పాండ్యా (11 బంతులు, 2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో)👉 అర్ష్‌దీప్ సింగ్ (11 బంతులు, 2026లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో)అయితే సోషల్ మీడియాలో జోఫ్రా ఆర్చర్‌ను క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. ఇటీవలే హనీట్రాప్ అంశం తెరమీదకు రావడం, ఆర్చర్ కూడా గుజరాత్ తో మ్యాచ్‌కు ముందు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. ఒక అభిమాని శ్రుతి మించి ఆర్చర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆర్చర్ శనివారం ఉదయం జైపూర్ హోటల్లో అమ్మాయితో కనిపించాడని.. సాయంత్రానికి నోబాల్ సహా ఐదు వైడ్లు వేయడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది* అంటూ పేర్కొన్నాడు. ఆర్చర్ తన కెరీర్లోనే అత్యంత చెత్త ఓవర్ వేసి జైస్వాల్ కెరీర్ నాశనం చేశాడంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేశారు.హనీట్రాప్ అంటే..'హనీ ట్రాపింగ్' అంటే క్రికెటర్లను ప్రేమ సంబంధమైన లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా మోసగించడం, లొంగదీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం లేదా ఉచ్చులో పడేయడం వంటి పరిస్థితులను సూచిస్తుంది. తాజాగా జోఫ్రా ఆర్చర్ 11 బంతుల ఓవర్ వేసిన తర్వాత, అతని పేరు హనీ ట్రాప్ వివాదంతో ముడిపడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆటగాళ్లు హనీ ట్రాప్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని బీసీసీఐ భయపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను అరికట్టడానికి, టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు ఎవరూ హోటల్ గదుల్లోకి ప్రవేశించకుండా చూసుకోవాలని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసింది.Not a very good start for Rajasthan and for Jofra Archer😬😬 17 runs in 1 over for Gujarat 🔥 A lot of Freebies from Archer😐 pic.twitter.com/EARUdGdnWp— STUMP THEORY (@SANIL__18) May 9, 2026చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్‌దీప్‌పై వేటు! -
IPL 2026: రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం
శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓటమి దిశగా రాజస్తాన్ రాయల్స్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దాసున్ షనక 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్తాన్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెరీరా (4)ను క్లీన్‌బౌల్డ్ చేసిన రషీద్ ఖాన్ అంతకముందు 24 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్‌ను కూడా క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మూడు పరుగులు చేసిన స్టాండ్ ఇన్ కెప్టెన్ జైస్వాల్ రబాడ బౌలింగ్‌లో వెనుదిరగడంతో రాజస్తాన్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సూర్యవంశీ (38) ఔట్.. రాజస్తాన్ 38/1230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ 36 పరుగులు చేసి అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్తాన్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.రాజస్తాన్ లక్ష్యం 230 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.గిల్ (84) ఔట్.. మూడో వికెట్ డౌన్84 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ బ్రిజేశ్ శర్మ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ టైటాన్స్ 185 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గిల్ (78), వాషింగ్టన్ సుందర్ 17 పరుగులతో ఆడుతున్నాడు.మరో వికెట్ డౌన్జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డోనోన్కు క్యాచ్ ఇచ్చి 13 పరుగులకే జోస్ బట్లర్ వెనుదిరిగాడు. స్కోరు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 166గా ఉంది.సాయి సుదర్శన్ ఔట్ సాయి సుదర్శన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో బట్లర్ 6 పరుగులతో ఉన్నాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 114గా ఉంది. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 52 పరుగుల చేశాడు. శుభ్‌మన్ గిల్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. గుజరాత్ ఓపెనర్లు దూకుడురాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39), శుబ్‌మన్ గిల్ (32) పరుగులతో ఆడుతున్నారు.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (34), గిల్ (7) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో 18 పరుగులిచ్చిన ఆర్చర్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే వైడ్ల రూపంలో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సుదర్శన్ (14), గిల్ (2) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన రాజస్తాన్..టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. పరాగ్ తొడ కండరాల గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్‌కు రాజస్తాన్‌ను జైస్వాల్ నడిపించనున్నాడు. ఇక గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మానవ్ సుతర్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్‌మైర్‌తో పాటు యష్‌రాజ్ పుంజా తుదిజట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు తొమ్మిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఆరుసార్లు నెగ్గితే.. రాజస్తాన్ మూడుసార్లు విజయాన్ని అందుకుంది. జైపూర్‌లో కూడా గుజరాత్‌దే పైచేయి. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గుజరాత్ గెలుపొందింది.తుది జట్లు:గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రారాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్ -
పోరాడి ఓడిన పంజాబ్.. గుజరాత్‌ను గెలిపించిన సుందర్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ మధ్యలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బార్ట్లెట్ (4-0-38-2), అర్షదీప్ సింగ్ (4-0-24-2), జన్సెన్ (4-0-33-1), విజయ్ కుమార్ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (5), నిషాంత్ సంధు (15), తెవాతియా (2), హోల్డర్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. బట్లర్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అర్షద్ ఖాన్ (8 నాటౌట్) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.అంతకుముందు పంజాబ్ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్యాంశ్ షేడ్గే (57), మార్కస్ స్టోయినిస్ (40), ఆఖర్లో మార్కో జన్సెన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్ సుతార్ (1-0-27-0), అర్షద్ ఖాన్ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్ 15, కూపర్ కన్నోల్లీ డకౌట్, శ్రేయస్ అయ్యర్ 19, నేహల్ వధేరా, జేవియర్ బార్ట్లెట్ డకౌటయ్యారు. విజయ్ కుమార్, అర్షదీప్ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. -
పెళ్లిపై నిశ్శబ్దం వీడిన శుభ్‌మన్ గిల్
టీమిండియా టెస్ట్, వన్డే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్ తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ ఇవాళ (మే 3) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ సమయంలో గిల్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చాడు.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావా..? అని ప్రెజెంటర్ డ్యానీ మోరిసన్ అడగగా, అలాంటిదేమీ లేదని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.గిల్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని కొందరు.. బాలీవుడ్ నటీమణులు సారా అలీ ఖాన్, అవ్నీత్ కౌర్, సోనమ్ బజ్వా ప్రేమాయణం సాగిస్తున్నాడని మరికొందరు పుకార్లు పుట్టించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గిల్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంది.తన పెళ్లి, డేటింగ్‌పై వచ్చిన వార్తలను గిల్ గతంలోనూ చాలాసార్లు ఖండించాడు. తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అయినా గిల్ ఏదో దాస్తున్నాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, గిల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ గత సీజన్లలో మాదిరిగానే రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 3 అర్ద సెంచరీల సాయంతో 373 పరుగులు చేసి, లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో గిల్ నేతృత్వంలోని గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.ఇవాళ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ ఆదిలోనే ప్రత్యర్దిని చావు దెబ్బకొట్టినప్పటికీ.. సూర్యాంశ్ షేడ్గే (58), మార్కస్ స్టోయినిస్ (29) కలిసి పంజాబ్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. 15.5 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 126-5గా ఉంది. -
పంజాబ్‌పై గుజరాత్ గెలుపు
పంజాబ్‌పై గుజరాత్ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ మధ్యలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బార్ట్లెట్ (4-0-38-2), అర్షదీప్ సింగ్ (4-0-24-2), జన్సెన్ (4-0-33-1), విజయ్ కుమార్ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (5), నిషాంత్ సంధు (15), తెవాతియా (2), హోల్డర్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. బట్లర్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అర్షద్ ఖాన్ (8 నాటౌట్) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్14.5వ ఓవర్- 124 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (57) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 94 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో విజయ్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి నిషాంత్ సింధు (15) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్8.1వ ఓవర్- 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ (26) ఔటయ్యాడు. ఆదిలోనే గుజరాత్‌కు షాక్1.3వ ఓవర్: 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5) రెండో ఓవర్లోనే అర్షదీప్ బౌలింగ్‌లో కూపర్ కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పంజాబ్ స్కోర్ 163-9టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్యాంశ్ షేడ్గే (57), మార్కస్ స్టోయినిస్ (40), ఆఖర్లో మార్కో జన్సెన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్ సుతార్ (1-0-27-0), అర్షద్ ఖాన్ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్ 15, కూపర్ కన్నోల్లీ డకౌట్, శ్రేయస్ అయ్యర్ 19, నేహల్ వధేరా, జేవియర్ బార్ట్లెట్ డకౌటయ్యారు. విజయ్ కుమార్, అర్షదీప్ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. పతనం అంచుల్లో పంజాబ్పంజాబ్ కింగ్స్ మరోసారి వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో సిరాజ్, 18వ ఓవర్లో హోల్డర్ ఈ ఘనత సాధించారు. తాజాగా హోల్డర్ స్టోయినిస్ (40), బార్ట్లెట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్15.6వ ఓవర్- 126 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో సూర్యాంశ్ షేడ్గే (57) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్8.4వ ఓవర్- 47 పరుగుల వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కష్టాల్లో పంజాబ్6.3వ ఓవర్- పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తాజాగా నేహల్ వధేరాను (0) హోల్డర్ ఔట్ చేశాడు. బట్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్5.2వ ఓవర్- 35 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మానవ్ సుతార్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్పంజాబ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస బంతుల్లో ప్రియాంశ్ ఆర్య (2), కన్నోల్లీ (0)ని ఔట్ చేశాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్0.2వ ఓవర్- ఇన్నింగ్స్ రెండో బంతికే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో నిషాంత్ సంధుకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్మ (2) ఔటయ్యాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నగుజరాత్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) జరుగుతున్న 46వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఓ మ్యాచ్‌లో ఓడగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొంది.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ -
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్ మొత్తం వారికే: గిల్
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది.15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లను గిల్ కొనియాడాడు."కీలక మ్యాచ్‌లో విజయం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్ధి జట్టును 160 పరుగులలోపు కట్డడి చేయడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్‌లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్రతీ ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవర్లో విరాట్ భాయ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అతడి వికెట్‌తో తిరిగి మేము గేమ్‌లోకి వచ్చాము. నేనేమి ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. నేను ఒక రిథమ్‌లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్‌లో పడింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జట్టులో కీలక సభ్యుడు. ఈ రోజు అతడు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్యతను తెవాటియా తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 43 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
-
ఆర్సీబీ vs జీటీ మ్యాచ్‌లో 240 సీసీటీవీ కెమెరాలు ఆఫ్..!
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటెన్స్ (జీటీ) జట్ల మధ్య చిన్నస్వామి క్రీడామైదానంలో ఈనెల 24న జరిగిన రాయల్ ఐపీఎల్ పోటీల సమయంలో 240 సీసీటీవీ కెమెరాల సర్క్యూట్‌ను కట్‌చేసిన ఘటనకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్‌సీఏ) స్పషీ్టకరణను ఇచ్చింది. ఇది పూర్తిగా ప్రైవేట్ అమ్మకందారులతో కూడిన అంతర్గత వివాదంగా స్పష్టం చేసింది. క్రీడామైదానం భద్రతకు సంబంధించి సంబంధం లేదని వెల్లడించింది. అమ్మకందారుల, దాని ఉద్యోగుల మధ్య చెల్లింపులకు సంబంధించి భిన్నాభిప్రాయాలతో ఈ సమస్య ఉద్భవించిందని పేర్కొంది. హర్యాణాకు చెందిన ఎస్టీఏక్యూ టెక్నాలజీస్ సంస్థ ఆదిత్య భట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్రదుర్గ జిల్లా హిరియూర మంజునాథ్ (37), ఉత్తర ప్రదశ్ సుల్తాన్పుర అబ్దుల్ కలాం (19) అరెస్ట్ చేశారని పేర్కొంది. ‘క్రీడామైదానం భద్రత కోసం అమర్చబడిన సీసీటీవీ కెమెరాల నిర్వహణ బాధ్యతను ఐవీఎస్ డిజిటల్ సొల్యూషన్ అనే ఉప పంపిణీదారుల సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థలో మంజునాథ్, అబ్దుల్ కలాం గతంలో పనిచేశారు. అయితే కంనెనీ నుంచి జీతం పెండింగ్ ఉంది, ఎంత అడిగినా జీతం ఇవ్వకపోవటంతో కోపగించుకొని ఈ కృత్యానికి పాల్పడ్డారు’. ఈ విషయం తనిఖీ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. -
అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్‌లు వేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లి(28), దేవ్‌దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం గుజరాత్ టైటాన్స్ ఈ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని పాటిదార్ తెలిపాడు."ఈ పిచ్‌పై మేము సాధించిన స్కోర్ మాత్రం సరిపోదు. అయినప్పటికి మా బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. మ్యాచ్‌ను 16 ఓవర్లకు తీసుకొచ్చారు. ఇది మాకు ఒక సానుకూల ఆంశం. పిచ్‌పై ఉన్న పచ్చిక ఫాస్ట్ బౌలర్లకు బాగా సహకరించింది. అయితే శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచాడు. కానీ అంత ఒత్తిడిలోనూ మా బౌలర్లు తిరిగి పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం. గిల్‌ను ఆరంభంలోనే ఔట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బ తీసింది. ఇక భువనేశ్వర్ కుమార్ గురుంచి మనందరికీ తెలిసిందే. అతడు టీ20 ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న బౌలర్. ఈ మ్యాచ్‌లో కూడా తన మార్క్ చూపించాడు.ఇక ఈ టోర్నీలో మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మేము పాయింట్ల పట్టిక గురుంచి ఆలోచించడం లేదు. మా తదుపరి మ్యాచ్‌లో అత్యత్తుమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యమని" పాటిదార్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో మే7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు! -
ఆర్సీబీకి షాకిచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి షాకిచ్చింది (4 వికెట్ల తేడాతో గెలుపు). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ఆర్సీబీని 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు.హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టి ఆర్సీబీని కుప్పకూల్చారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్‌వుడ్ డకౌటయ్యారు.అనంతరం 156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్‌వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. -
ఆర్సీబీపై గుజరాత్ గెలుపు
ఆర్సీబీపై గుజరాత్ గెలుపు156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్‌వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గెలుపు దిశగా గుజరాత్7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 86-2గా ఉంది. బట్లర్ 33, సుందర్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌటైంది.ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్‌వుడ్ డకౌటయ్యారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ13.6వ ఓవర్- 126 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది.రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పడిక్కల్ (40) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.1వ ఓవర్- 80 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ (1) అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హోల్డర్ సూపర్ క్యాచ్7.4వ ఓవర్- 79 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రజత్ పాటిదార్ (19) ఔటయ్యాడు. కోహ్లి ఔట్3.2వ ఓవర్- 35 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (28) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 34 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి జేకబ్ బేతెల్ (5) ఔటయ్యాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరుగనున్న 42 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. గుజరాత్ 8లో నాలుగు విజయాలు నమోదు చేసింది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్ -
గిల్ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ విషయంలో ఆన్‌ఫీల్డ్, ఆఫ్‌ఫీల్డ్‌లో చాలా ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి. ఆరం భంలో వరుస పరాజయాలు, మధ్యలో విజయాలు, మళ్లీ ఓటమి.. ఇలా సీఎస్కే తన ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. అయితే ఆన్‌ఫీల్డ్‌లో ఇలా ఉంటే ఆఫ్‌ఫీల్డ్‌లో సీఎస్కే కు అవమానాలు జరుగుతున్నాయి. సీజన్ ఆరంభంలో ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ గిల్‌పై సీఎస్కే చేసిన ఫిర్యాదు కాపీ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అసలేం జరిగింది?ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్కేపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్కే ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఏఐతో రూపొందించిన తన ఫొటోను పంచుకున్న గిల్ చేతిలో పసుపు రంగు విజిల్ పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. అయితే గిల్ పెట్టిన పోస్టు సీఎస్కే జెర్సీని, ఫ్రాంచైజీ నినాదం అయిన విజిల్ పోడును అవమానిస్తున్నట్లుగా ఉందంటూ సీఎస్కకే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నకిలీదా లేక నిజమైనదేనా అన్నది ఇంకా తెలియదు. అయితే సీఎస్కే ఫ్రాంచైజీ గిల్‌పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన కాపీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.CSK filed another complaint this time against India skipper & star batter Shubham Gill... pic.twitter.com/w6iGlOydw1— The Cricket View (@TheCricketView) April 26, 2026గతంలో ఆర్సీబీపై ఫిర్యాదుఇక ఇదే సీజన్లో 11వ మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్కే తలపడ్డాయి. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్‌ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్‌పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారంటూ సీఎస్కే ఆర్సీబీ ఫ్రాంచైజీపై బీసీసీఐకి ఫిర్యాదులో చేసింది. కాగా ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే ఐదో ఓటమిని మూటగట్టుకుంది. సీఎస్కే విధించిన 159 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సాయి సుదర్శన్ (87), గిల్ (33), బట్లర్ (39 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.చదవండి: ‘వైభవ్‌పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
ఇది అవుటా? నాటౌటా? పాపం రఘువంశీ
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీని దురదృష్టం వెంటాడింది. క్రికెట్లో అరుదుగా కన్పించే 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' (ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం) నిబంధన ప్రకారం రఘువంశీ ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔటైన నాలుగో బ్యాటర్‌గా రఘువంశీ నిలిచాడు.ఏమి జరిగిందంటే?కోల్‌కతా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు.అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనుక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు.దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్‌గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై రఘువంశీతో పాటు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, మెంటార్లు షేన్ వాట్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రఘువంశీ మైదానాన్ని వీడే క్రమంలో తన బ్యాట్‌ను, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడు క్రీజులోకి చేరుకోవాలనే ఉద్దేశంతోనే అలా పరిగెత్తాడని, అలా ఎలా ఔట్ ఇస్తారని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో యూజర్ రూల్స్ ప్రకారం ఇది అవుటేనని కామెంట్ చేశాడు. Obs 🥵Angkrish Raghuvanshi !! Obstructing the field #LSGvsKKR #CSKvsGTpic.twitter.com/2mTxfZlbJU— Baba Jaipuriya (@BabaJaipuriya) April 26, 2026 -
చితక్కొట్టిన సాయి సుదర్శన్.. సీఎస్కేను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. సీఎస్కే నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.గుజరాత్ ఓపెనర్ సాయిసుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మరోసారి సత్తాచాటాడు. అతడితో పాటు జోస్ బట్లర్(39 నాటౌట్), శుభ్‌మన్‌గిల్(33)రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఆకిల్ హోస్సేన్, నూర్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్, బ్రెవిస్ వంటి స్టార్ ప్లేయర్లు ఆరంభంలోనే ఔటైనప్పటికి.. రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడుతూ జట్టుకు గౌరప్రదమైన స్కోర్‌ను అందించాడు.60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓవర్టన్(6 బంతుల్లో 18) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్ ఖాన్, సుత్తార్, సిరాజ్ తలా వికెట్ సాధించారు. గుజరాత్‌కు ఇది నాలుగో విజయం. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది.చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు' -
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే స్కోరెంతంటే?
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి తమ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు.60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు జేమీ ఓవర్టన్(6 బంతుల్లో 18) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్ ఖాన్, సుత్తార్, సిరాజ్ తలా వికెట్ సాధించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన సంజూ సంశాన్.. గుజరాత్‌పై మాత్రం 11 పరుగులు చేసి ఔటయ్యాడు. -
సీఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి అర్షద్ ఖాన్ రాగా.. సీఎస్కే జట్టులోకి ఉర్విల్ పటేల్ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్ -
తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి!
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్‌ను ప్యాడ్కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ గుజరాత్ తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్! ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆర్సీబీ స్టార్ జాకబ్ బెతెల్ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్ మిడ్‌వికెట్ వద్ద వాషింగ్టన్ సుందర్ సునాయాస క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్ భారీ మూల్యం చెల్లించింది.మరో ఎండ్‌లో పడిక్కల్ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన అతను సిరాజ్ ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. రషీద్ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టగా... ప్రసిధ్ ఓవర్లో పడిక్కల్ 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ఆపై రషీద్ ఓవర్లోనూ 2 సిక్స్‌లతో చెలరేగిన పడిక్కల్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.హోల్డర్ వైల్డ్‌గా సెలబ్రేషన్స్.. తీవ్ర అసంతృప్తిలో కోహ్లిపడిక్కల్ను రషీద్ అవుట్ చేయగా, హోల్డర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్‌కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Set batters gone 😯🎥 Rashid Khan and Jason Holder hit the timber \|/Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/zVUsxy1NB2— IndianPremierLeague (@IPL) April 24, 2026ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్ శర్మ (10), కెప్టెన్ రజత్ పాటీదార్ (8) విఫలమైనా... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
ఆ మూడు ఓవర్లలో తడబడ్డాం: గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.వాస్తవానికి గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని వారిని కట్టడి చేశారు. ఛేదన సమయంలోనూ గుజరాత్‌కు పైచేయి సాధించే అవకాశం ఉండింది. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీయగలిగినా, ఆతర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయింది. చివరికి మూల్యం చెల్లించుకుంది.మ్యాచ్ అనంతరం గిల్ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అతని మాటల్లో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి మంచి స్థితిలో ఉన్నాం. కానీ, 16 నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాము. ఆ మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాంప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే, పవర్‌ప్లే తర్వాత మా బౌలర్లు ఆ పనిని చేయలేకపోయారు. ఆ సమయంలో కొన్ని మంచి బంతులు వేసినా, అవసరమైన స్థాయిలో లెంగ్త్‌ను మెయిన్టైన్ చేయలేకపోయారు.సుతార్‌కు బంతి ఇవ్వడంపై వివరణపిచ్ స్పిన్‌కు సహకరిస్తోందని తాను బ్యాటింగ్ చేసే సమయంలోనే గమనించాను. ముఖ్యంగా కృనాల్ వేసిన బంతులు బాగా టర్న్ అయ్యాయి. అందుకే చివర్లో మానవ్ సుతార్‌కు అవకాశం ఇచ్చాను.మరో రెండు వికెట్లు పడుంటే మ్యాచ్ మళ్లీ తమవైపు తిరిగేది.సాయి సుదర్శన్‌పై సరదా వ్యాఖ్యసాయి ఇటీవల రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచినా, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతని ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే మ్యాచ్‌లో అయినా సాయి తనకు పవర్‌ప్లేలో స్ట్రైక్ ఇస్తాడని ఆశిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్‌పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్ సెంచరీస్ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్‌కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్‌స్కోరర్‌గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆర్సీబీ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఈ గెలుపు ద్వారా ఆర్సీబీ ఓ అరుదైన ఘనత సాధించింది. సొంత మైదానం బెంగళూరులో తమ 50వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ముంబై ఇండియన్స్ (వాంఖడే), కేకేఆర్ (కోల్‌కతా), సీఎస్కే (చెన్నై) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. గత 18 సీజన్లలో కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్లో ఇప్పటికే (5 మ్యాచ్‌ల్లో) 4 విజయాలు సాధించింది. ఈ సీజన్లో బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన ఏకైక పరాజయం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. ఈ మ్యాచ్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ ఓ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది.ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన టాప్-5 జట్లుపంజాబ్ కింగ్స్- 10ముంబై ఇండియన్స్- 6ఆర్సీబీ-5రాజస్థాన్- 5ఎస్ఆర్హెచ్- 5ఐపీఎల్లో ఆర్సీబీ ఛేదించిన 200 ప్లస్ లక్ష్యాలు228 vs LSG, లక్నో, 2025206 vs GT, బెంగళూరు, 2026*204 vs KXIP, బెంగళూరు, 2010202 vs SRH, బెంగళూరు, 2026201 vs GT, అహ్మదాబాద్, 2024ఐపీఎల్లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు58 - MI (వాంఖడే)55 - KKR (కోల్‌కతా)53 - CSK (చెన్నై)50 - RCB (బెంగళూరు)*40 - SRH (హైదరాబాద్)*సూపర్ ఓవర్ విజయాలతో కలిపికాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కాడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గర్జించిన కోహ్లి, పడిక్కల్.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హాజిల్‌వుడ్ తలా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్‌లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్‌వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్), హోల్డర్ (23 నాటౌట్) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్‌ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో జాకబ్ బెతల్ (14) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్‌కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026 -
చరిత్ర సృష్టించిన సుదర్శన్.. తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో 'గోల్డెన్ డక్' అయిన సుదర్శన్.. ఈమ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు.ఈ తమిళనాడు క్రికెటర్ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి రెండు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన సుదర్శన్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. సుదర్శన్‌కు ఇది మూడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం.ఈ క్రమంలో సాయిసుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్‌లు పరంగా అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డులకెక్కాడు. అతడు కేవలం 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో అభిషేక్ శర్మ(1193) అగ్రస్ధానంలో ఉన్నాడు.బంతులు పరంగా అత్యంతవేగంగా 2000 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే1193 - అభిషేక్ శర్మ1211 - వీరేంద్ర సెహ్వాగ్1306 - రిషబ్ పంత్1326 - యశస్వి జైస్వాల్1353 - యూసుఫ్ పఠాన్1361 - సాయి సుదర్శన్Krunal Pandya ಅವರ ಬೌನ್ಸರ್ ಎಸೆತಕ್ಕೆ Sai Sudharsan ಅಟ್ಟಿದ ಭರ್ಜರಿ ಸಿಕ್ಸರ್!😱🔥ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #RCBvsGT | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0BTEiT4tnC— Star Sports Kannada (@StarSportsKan) April 24, 2026 -
IPL 2026: గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రజత్ పటీదార్ మానవ్ సుతర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బెంగళూరు 15.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న పడిక్కల్5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(16), దేవ్‌దత్త్ పడిక్కల్(18) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బెతల్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయిసుదర్శన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.అతడితో పాటు శుభ్‌మన్ గిల్(32), జోస్ బట్లర్(25), జాసన్ హోల్డర్(23) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలా వికెట్ సాధించారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్‌గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జోస్ బట్లర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.గుజరాత్ రెండో వికెట్ డౌన్‌గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 100 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 170/2సాయిసుదర్శన్ సెంచరీగుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయిసుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదర్శన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 155-1గుజరాత్ తొలి వికెట్ డౌన్128 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్:61/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(48), శుభ్‌మన్ గిల్(11) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న గుజరాత్2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(8), శుభ్‌మన్ గిల్(1) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గుజరాత్ టైటాన్స్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ -
స్మోకింగ్ చేస్తూ పట్టుబడ్డ గుజరాత్ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. టీమ్ హోటల్ పరిసరాల్లో సిగరెట్ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసి అభిమానులు రబాడపై చర్యలుంటాయా అని ఆరా తీస్తున్నారు.ఐపీఎల్ కాంట్రాక్ట్‌లో స్మోకింగ్‌పై స్పష్టమైన నిషేధం లేదు. అంటే సిగరెట్ తాగడం నిబంధనలకు వ్యతిరేకం కాదు. అయితే ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రొఫెషనల్ ప్రవర్తన దృష్ట్యా ఇది విమర్శలకు దారి తీస్తోంది.🚨 KAGISO RABADA IS SMOKING !🤯- Kagiso Rabada was smoking and got caught on camera while doing so. At that moment, Rashid Khan and the rest of the staff came and asked him, “What is this?” 👀pic.twitter.com/kF65xT8Mxl— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 22, 2026రబాడాకు డోపింగ్ ఉల్లంఘన నేపథ్యం ఉన్నందున ఈ ఘటనను బీసీసీఐ యాంటీ-డోపింగ్ విభాగం పరిశీలించే అవకాశం ఉంది. అతను వాడింది కేవలం సిగరెట్ మాత్రమేనా? లేక మరేదైనా నిషేధిత పదార్థమా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో రబాడ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. జట్టు విషయానికొస్తే.. గుజరాత్ ఈ సీజన్లో మధ్యస్త ప్రదర్శనలతో మమ అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 అపజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. -
‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మంది ప్రపంచకప్ విజేతలు ఉన్నారని... వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తమ జట్టును ఆపడం ఎవరి వల్లా కాదని మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఐపీఎల్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్... ఆ తర్వాత భారీ షాట్లతో రెచ్చిపోయి అజేయ సెంచరీతో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలర్లు సమష్టి కృషితో సత్తాచాటడంతో గుజరాత్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ... ‘ఈ ప్రదర్శన నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమైంది. గత నాలుగైదు మ్యాచ్‌ల్లో ఏదీ కలిసిరాలేదు. ఎక్కువ సమయం క్రీజులో గడిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో గుజరాత్‌తో మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అనుకున్నా... అది ఫలితాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్... తిలక్ మెరుపులతో తిరిగి గెలుపు బాట పట్టింది. తిలక్ వర్మకు ఐపీఎల్లో ఇదే తొలి శతకం కాగా... ఈ జోరు సీజన్ మొత్తం కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ‘అహ్మదాబాద్ వేదికగా ముంబై మ్యాచ్ ఎప్పుడు జరిగినా... ఇలాంటి పిచ్‌పైనే సాగుతుంది. ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే అది కాస్త నెమ్మదిగా ఉంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో స్ట్రెయిట్‌గా ఆడాలని నిర్ణయించుకున్నా. దీంతో సులువుగా పరుగులు రాబట్టగలిగా. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. కానీ జట్టుకు అవసరమైనప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి దీని కోసం ఎంతో సాధన చేశా. ఎక్కువ ఆలోచించడం లేదు. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవడమే మా పని. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. మా సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. జట్టులో చాలా మంది ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు. అనుభవం, నైపుణ్యానికి కొదవలేదు. మేమంతా కలిసికట్టుగా రాణిస్తే... ముంబై ఇండియన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఉత్సాహపరిచాడు. ‘నువ్వు చేయగలవు’ అని పదే పదే చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో ‘ప్రశాంతంగా ఉండు... మిగిలిందంతా నేను చూసుకుంటా’ అని చెప్పాను. మొత్తానికి ఈ విజయం జట్టులో జోష్ నింపింది’ అని తిలక్ వివరించాడు. -
గుజరాత్‌ను వారి ఇలాకాలో ఓడించిన అనంతరం హార్దిక్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత ఇలాకాలో (అహ్మదాబాద్) చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత గుజరాత్‌కు ఎదురైన తొలి ఓటమి ఇది. మరోవైపు ముంబైకు నాలుగు వరుస పరాజయాల తర్వాత వచ్చిన తొలి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తిలక్ శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ గెలుపుపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లాంటి కఠిన వేదికపై గెలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మైదానంలో ముంబై ఇండియన్స్‌కు గతంలో పెద్దగా విజయాలు లేవు. ఈసారి మంచి క్రికెట్ ఆడి విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపించింది. ఈ గెలుపు జట్టుకు అత్యంత అవసరమైంది.మ్యాచ్‌లో కీలక మలుపు 14వ ఓవర్ టైమ్‌ఔట్ తర్వాత వచ్చింది. ఆ సమయంలో తిలక్ వర్మకు ఓ సందేశం ఇచ్చాను. బంతిని గమనించి, ధైర్యంగా కొట్టు అని చెప్పాను. తిలక్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది, అతను తన సహజ ఆట ఆడితే చాలు అన్న భావనతో ప్రోత్సహించాను. చివరికి తిలక్ అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.బౌలింగ్‌లో బుమ్రా వినియోగంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎప్పుడైనా ఉపయోగించవచ్చని, అతను ప్రత్యేకమైన బౌలర్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అతన్ని వినియోగించడం ముఖ్యమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితోనే ప్రభావం చూపాలని నిర్ణయించి, బుమ్రాను ప్రారంభంలోనే బౌలింగ్‌కు తీసుకురావడం విజయానికి దోహదపడిందని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అరంగేట్రం బౌలర్ కృష్ మంచి లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని, అశ్వనీ కుమార్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. గత సీజన్లో కూడా అతను ఇదే తరహా ప్రదర్శన చేసినట్లు గుర్తు చేశాడు. అదనంగా ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగ్గా రాణించిందని, ముఖ్యంగా నమన్ ప్రదర్శనను ప్రశంసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఇక దూసుకుపోతామని పరోక్షంగా చెప్పాడు. -
ముంబై చేతిలో పరాజయాన్ని బౌలర్లపై నెట్టిన గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 20) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ముంబైకి వచ్చిన మొదటి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి ఉండకపోయుంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం అయ్యేవి. మరోవైపు గుజరాత్‌కు ఇది హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ చేతులెత్తేసింది. అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.గిల్ మాటల్లో.. ఈ పిచ్‌పై 160-170 పరుగుల స్కోర్ చాలా ఎక్కువ. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఈ ఓటమిని పెద్ద సమస్యగా చూడదలచుకోలేదు. చిన్న అవాంరంగానే పరిగణిస్తాం. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల్లో తిరిగి విజయాల బాట పడతాం. జట్టు ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాము.పిచ్‌పై మాట్లాడుతూ.. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్‌పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. కొన్ని బంతులు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా, ఇంకొన్ని తక్కువ ఎత్తులో ఉండటం వల్ల సరైన లెంగ్త్‌ను నిరంతరం కొనసాగించలేకపోయాము. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్‌ను కచ్చితంగా పాటించలేకపోవడం మా ప్రధాన లోపం.ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో పిచ్‌లో మార్పులపై ప్రశ్నించగా.. పెద్దగా తేడా లేదని చెప్పాడు. అయితే తమ బ్యాటింగ్ సమయానికి కొంత మంచు ప్రభావం ఉండిందని అన్నాడు. ఇది ముంబై బౌలర్లకు కలిసొచ్చిందని పరోక్షంగా తెలిపాడు.మొత్తంగా, గిల్ ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ విజయాల బాట వచ్చని నమ్మకం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తన జట్టును మళ్లీ సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. -
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్లో తిలక్ వర్మ (101 నాటౌట్) సెంచరీతో విధ్వంసం చెలరేగగా, నమన్ ధిర్ (45) బాధ్యతాయుతంగా ఆడారు. గుజరాత్‌బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజన్లో రెండో విజయం సాధించిన ముంబై 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో పట్టిలకలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్‌గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. అశ్విన్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 45/3గుజరాత్ రెండో వికెట్ డౌన్‌గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జోస్ బట్లర్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బుమ్రా వేసిన మొదటి ఓవర్లో తొలి బంతికే సాయిసుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు.తిలక్ వర్మ విధ్వంసంఅహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. అతడితో పాటు నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.తిలక్ వర్మ హాఫ్ సెంచరీతిలక్ వర్మ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మాదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న తిలక్16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(37), హార్దిక్ పాండ్యా(7) ఉన్నారు.ముంబై నాలుగో వికెట్ డౌన్98 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన నమన్ధీర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్: 103/4ముంబై మూడో వికెట్ డౌన్44 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడుముంబై రెండో వికెట్ డౌన్23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. కగిసో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.తొలి వికెట్ డౌన్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అరంగేట్ర ఆటగాడు డానిష్ మాలెవర్(2).. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్: 21/1ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున యువ ఆటగాళ్లు డానిష్ మలేవార్, క్రిష్ భగత్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మముంబై ఇండియన్స్ : డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ -
గుడ్ న్యూస్ చెప్పిన రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను రషీద్ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నారికి 'అస్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు రషీద్ వెల్లడించాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రషీద్ ఖాన్ గతేడాది ఆగస్టులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు 2024 అక్టోబర్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ మొదటి పెళ్లి జరిగింది. రషీద్ వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన రెండో భార్యకు మగ బిడ్డ జన్మించడంతో రషీద్ తండ్రయ్యాడు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్-2026లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 5 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
-
కోల్ ‘కథ’ మారలేదు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన రహానే సారథ్యంలోని నైట్‌రైడర్స్... మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. పాతిక కోట్ల విలువైన ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (55 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఎట్టకేలకు రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న గ్రీన్ భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. గుజరాత్ ఫీల్డింగ్ లోపాలు కూడా అతడికి కలిసి రావడంతో ఈ సీజన్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. పావెల్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అజింక్యా రహానే (0), రఘువంశీ (8), సీఫెర్ట్ (19), అనుకూల్ రాయ్ (9), రింకూ సింగ్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 86; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో టైటాన్స్‌కిది మూడో విజయం. శుబ్‌మన్ దూకుడు... ఓపెనర్లు చెలరేగడంతో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన శుబ్‌మన్, రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో గిల్, సాయి సుదర్శన్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్) కలిసి 3 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా గిల్ దూకుడు కొనసాగడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 71 పరుగులు చేసి సుదర్శన్ వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే 4, 6, 4 కొట్టిన బట్లర్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... వరుణ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ 27 బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించాడు. బట్లర్, సుందర్ (13) వెనుదిరిగినా... ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్... గ్రీన్ పట్టిన చక్కటి క్యాచ్‌కు పెవిలియన్ బాటపట్టాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సైఫెర్ట్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 19; రహానే (సి) రబాడ (బి) సిరాజ్ 0; రఘువంశీ (సి) బట్లర్ (బి) రబాడ 8; గ్రీన్ (సి) బట్లర్ (బి) రషీద్ 79; పావెల్ (సి) సిరాజ్ (బి) అశోక్ 27; రాయ్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 9; రింకూ (సి) బట్లర్ (బి) రబాడ 1; రమణ్‌దీప్ (సి) సిరాజ్ (బి) అశోక్ 17; నరైన్ (సి) ఫిలిప్స్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (రనౌట్) 6; వైభవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–32, 4–87, 5–147, 6–148, 7–165, 8–166, 9–173, 10–180. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2; రబాడ 4–0–29–3; ప్రసిధ్ 4–0–32–1; అశోక్ 4–0–45–2; రషీద్ 4–0–44–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) కార్తీక్ (బి) నరైన్ 22; గిల్ (సి) గ్రీన్ (బి) అరోరా 86; బట్లర్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 25; సుందర్ (సి) కార్తీక్ (బి) వరుణ్ 13; ఫిలిప్స్ (సి) రింకూ (బి) రమణ్‌దీప్ 19; తెవాటియా (నాటౌట్) 7; షారుక్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–57, 2–95, 3–141, 4–158, 5–177. బౌలింగ్: వైభవ్ 4–0–35–1; కార్తీక్ 4–0–40–0; అనుకూల్ రాయ్ 3–0–37–0; నరైన్ 4–0–28–1; వరుణ్ 4–0–34–2; రమణ్‌దీప్ 0.4–0–5–1. -
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్‌దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు కామెరున్ గ్రీన్ ఎట్టకేలకు మెరిశాడు. సీజన్లో కామెరున్ గ్రీన్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అర్థసెంచరీ సాధించిన గ్రీన్ మొత్తంగా 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. గ్రీన్ దంచికొడుతున్న సమయంలో కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ చివరి రెండు ఓవర్లలో తనకే స్ట్రైక్ వచ్చినప్పటికీ పరుగులు చేయడంలో విఫల మయ్యాడు.ఇక గతేడాది జరిగిన వేలంలో గ్రీన్‌ను కేకేఆర్ రూ. 25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అధిక ధరకు అమ్ముడైన గ్రీన్ ఈ సీజన్లో మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. 23 కోట్లు దండగంటూ అభిమానులు సోషల్ మీడియాలో గ్రీన్‌ను ఏకిపారేశారు. అభిమానుల మాటలు గ్రీన్ మనుసుకు తగిలాయేమో కానీ గుజరాత్‌తో మ్యాచ్‌లో చివరిదాకా నిలబడి కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో గ్రీన్ ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 18, 2, 4, 32, 0 పరుగులు సాధించాడు. Making a strong statement 💪Cameron Green getting a move on for #KKR 💜 Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR | @KKRiders pic.twitter.com/utzOHFRbGx— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
IPL 2026: ఉత్కంఠపోరులో గుజరాత్ విజయం
Gujarat Titans Vs KKR Updates..ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ 86 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్‌దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.86 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో కామెరున్ గ్రీన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. గిల్ 81, పిలిప్స్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వాషింగ్టన్ సుందర్ (13) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.గిల్ అర్థశతకం.. గుజరాత్ 101/2కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అర్థశతకం సాధించాడు. గిల్ 27 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అంతకముందు గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జాస్ బట్లర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్కేకేఆర్తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన సాయి సుదర్శన్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.దంచికొడుతున్న గుజరాత్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేదనను దూకుడుగిఆ ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (22), గిల్ (34) క్రీజులో ఉన్నారు.గుజరాత్ టార్గెట్ 181 పరుగులుగుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ 180 పరుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) పరుగులతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రోవ్‌మెన్ పావెల్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒక దశలో 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులతో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అంతకముందు రింకూ సింగ్ రబాడ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అనుకుల్ రాయ్ ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కామెరున్ గ్రీన్ 75 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నాడు.87 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. పావెల్ (27).. అశోక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.8 ఓవర్లలో కేకేఆర్ 59/38 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పావెల్ (21), గ్రీన్ (8) క్రీజులో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన సీఫెర్ట్ రబాడ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్8 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ రబాడ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.రహానే గోల్డెన్ డక్గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే సిరాజ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫిన్ అలెన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ మాత్రం జట్టులో ఏ మార్పు చేయలేదు. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటి పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ముఖాముఖి పోరులో నాలుగుసార్లు తలపడగా గుజరాత్ మూడుసార్లు, కేకేఆర్ ఒకసారి గెలుపొందాయి.కోల్‌కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్),వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ. -
గుజరాత్ టైటాన్స్‌లోకి సౌతాఫ్రికా నయా సంచలనం
ఐపీఎల్-2026 మధ్యలో గుజరాత్ టైటాన్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హుయిజెన్తో గుజరాత్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.గతేడాది జరిగిన మినీ వేలంలో టామ్ బాంటన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బాంటన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు గుజరాత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే బాంటన్ తన గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుండడంతో.. ఇప్పుడు మొత్తం సీజన్‌కే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఎస్టర్హుయిజెన్ రూ. 75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుందిఎవరీ ఎస్టర్హుయిజెన్?24 ఏళ్ల కానర్ ఎస్టర్హుయిజెన్ గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి సిరీస్‌లోనే అద్బుత ప్రదర్శలనతో అందరిని ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్‌లలో 145.98 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడి రాకతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. జోస్ బట్లర్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎస్టర్హుయిజెన్ ఉండనున్నాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. గిల్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం! -
రషీద్ ఖాన్‌కు కీలక పదవి
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్ అసోసియేషన్ (WCA) ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని WCA సీఈవో ఇవాళ (ఏప్రిల్ 14) ప్రకటించారు. WCA ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో రషీద్‌తో పాటు చమారి ఆటపట్టు, డారిల్ మిచెల్, వేన్ మాడ్సెన్, మాడీ గ్రీన్ కూడా చోటు దక్కింది. ఈ పదవిలో రషీద్ తదితరులు గ్లోబల్ క్రికెట్లో జరిగే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. WCA బోర్డు 2018లో ఏర్పడింది. ఐసీసీ ఈవెంట్లు, షెడ్యూలింగ్, కమర్షియల్ అంశాలపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రతిబింబించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ఇందులో 17 ప్రధాన క్రికెట్ దేశాల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం ఉంది.కొత్త బోర్డు సభ్యుల నియామకం తర్వాత WCA సీఈవో మాట్లాడుతూ.. ఆటగాళ్లు క్రికెట్ భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతున్నారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పాల్గొనడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఆటగాళ్ల హక్కులు, అవకాశాలు, క్రికెట్ అభివృద్ధి కోసం వారు కలసి పనిచేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై (4-0-17-3) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసి, గతకొంతకాలంగా లేని ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. 2024లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత రషీద్ ప్రభావం కాస్త తగ్గింది. ఈ సీజన్లో గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న జరుగనుంది. -
ఐపీఎల్ షెడ్యూల్లో కీలక మార్పు!
ఐపీఎల్ 2026 సీజన్లో షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేసింది. అహ్మదాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. విషయంలోకి వెళితే.. సీజన్ తొలి దశలో ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదికను చెన్నై చిదంబరం స్టేడియానికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాచ్ సమయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మే 21 ఈ రెండు జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మరోసారి తలపడాల్సి ఉంది. తాజాగా ఈ వేదికను అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్! -
ప్రసిధ్ పరాక్రమం
లక్నో: ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో మాజీ విజేత గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. గత మ్యాచ్‌లో ముకుల్ చౌదరీ మెరుపులతో విజయం సాధించిన లక్నో... ఈ పోరులో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్‌లో కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మార్క్రమ్ (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా ఇరవై పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ రిషభ్ పంత్ (18), మార్ష్ (11), ఆయుశ్ బదోనీ (9), పూరన్ (19), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరీ (18), జార్జ్ లిండే (16), షమీ (12 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60; 11 ఫోర్లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (40 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో టైటాన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 30; మార్ష్ (సి) గిల్ (బి) రబాడ 11; పంత్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; బదోని (సి) ఫిలిప్స్ (బి) ప్రసిధ్ 9; పూరన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 19; అబ్దుల్ సమద్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 18; ముకుల్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 18; లిండే (సి) (సబ్) షారుక్ (బి) అశోక్ 16; షమీ (నాటౌట్) 12; అవేశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164. వికెట్ల పతనం:1–14, 2–45, 3–69, 4–74, 5–109, 6–118, 7–131, 8–157. బౌలింగ్: సిరాజ్ 4–0–19–1; రబాడ 4–0–54–1; అశోక్ 4–0–32–2; ప్రసిధ్ 4–0–28–4; రషీద్ 4–0–25–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) అవేశ్ (బి) రాఠీ 15; గిల్ (సి) పంత్ (బి) ప్రిన్స్ 56; బట్లర్ (సి) మార్క్రమ్ (బి) షమీ 60; సుందర్ (నాటౌట్) 21; తెవాటియా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–45, 2–129, 3–135. బౌలింగ్: షమీ 4–0–36–1; ప్రిన్స్ 4–0–31–1; దిగ్వేశ్ రాఠీ 4–0–31–1; లిండే 3–0–28–0; అవేశ్ 2–0–24–0; మార్క్రమ్ 1.4–0–15–0. -
రాణించిన ప్రసిద్ద్, గిల్, బట్లర్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. రబాడ (4-0-54-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. రషీద్ ఖాన్ (4-0-25-0) వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ 11, పంత్ 18, బదోని 9, పూరన్ 19, అబ్దుల్ సమద్ 18, ముకుల్ ఛౌదరి 18, జార్జ్ లిండే 16, షమీ 12 (నాటౌట్), ఆవేశ్ ఖాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. శుభ్‌మన్ గిల్ (56), బట్లర్ (60) అర్ద సెంచరీలతో రాణించి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించి వేగంగా మ్యాచ్‌ను ముగించాడు. మిగతా ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 15, తెవాతియా 10 (నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ తలో వికెట్ తీశారు. -
లక్నోపై గుజరాత్ గెలుపు
లక్నోపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం లక్నో 164/8(20) గుజరాత్ 165/3(18.4)లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్165 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా సాగుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 69 పరుగులుగా ఉంది. గిల్ (40), బట్లర్ (14) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీసి లక్నోను దెబ్బ తీశాడు. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో18.1వ ఓవర్- 131 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ముకుల్ చౌదరి (18) ఔటయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నో14.3వ ఓవర్-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ (19) ఔటయ్యాడు.నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నోలక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96 పరుగులుగా ఉంది. పూరన్ (6), సమద్ (17) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో4.1వ ఓవర్- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి పంత్ (18) ఔటయ్యాడు. మార్ష్ (11) ఔట్1.3వ ఓవర్- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్స్: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్ -
‘గిల్‌ను కలవాలి’.. కూతురుకు మాజీ క్రికెటర్ షాక్!
క్రికెటర్లకు అభిమానులుండడం సహజం. కానీ మాజీ క్రికెటర్ కూతురు మరో క్రికెటర్‌కు అభిమానిగా ఉండడం, అతడిని కలవాలని కోరడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. టీమిండియా మాజీ క్రికెటర్ వృద్దిమాన్ సాహా, అతడి కూతురు అన్వి మధ్య జరిగిన సంభాషణను సాహా భార్య రోమి మిత్రా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సాహా, కూతురు అన్వి మధ్య సంభాషణ ఆద్యంతం ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. అన్వి శుబ్‌మన్ గిల్‌కు అభిమాని. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్‌ను కల్పించాలాంటూ అన్వి పదే పదే తండ్రి సాహాను రిక్వెస్ట్ చేసింది. అయితే దీనిపై సాహా కూతురుకు ఊహించని షాక్ ఇచ్చాడు. ‘గిల్‌ను కలవాలనుకోవడం ఓకే. కానీ అందరిలానే లైన్లో నిలబడి అతడిని కలవాల్సి ఉంటుంది. ఇందులో నీకు ఎలాంటి మినహాయింపు ఉండదు’ అని సాహా తన కూతురితో పేర్కొన్నాడు. అందుకు అన్వి.. ‘అదేంటి.. మీరు గిల్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారుగా’ అని గుర్తుచేసింది. దానికి సాహా ‘అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడడం లేదు కదా’ అని నవ్వుతూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణను సాహా భార్య రోమి మిత్రా రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కాగా సాహా గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌లు పంచుకున్న సంగతి తెలిసిందే. వృద్దిమాన్ సాహా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఐపీఎల్ టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సాహా సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఒక ఐపీఎల్ సీజన్ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా సాహా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ కెరీర్లో 170 మ్యాచ్‌లాడిన సాహా 2,934 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా 13 అర్థశతకాలున్నాయి. ధోని హయాంలో పెద్దగా వెలుగులోకి రాలేకపోయిన వృద్దిమాన్ సాహా టీమిండియా తరఫున 40 టెస్టులు, 9 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2024 రంజీ సీజన్లో బెంగాల్ తరఫున ఆడిన సాహా ఆ తర్వాత అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2024-25 రంజీ సీజన్లో పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా బెంగాల్ ఆటగాళ్లు సాహాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. సాహా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 142 మ్యాచ్‌లాడి 7 వేలకు పైగా పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Romi Mitra (@romi_mitra) చదవండి: నడిరోడ్డుపై చాహల్ హల్చల్! -
‘నేనైతే మిల్లర్‌ను తోసేసేవాడిని’
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ నిరాకరించడం తీవ్ర చర్చకు దారి తీసింది. మిల్లర్ తప్పు చేశాడని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఎక్కువ భాగం విమర్శలు వచ్చాయి. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు మిల్లర్ ఏం ఆలోచించాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తనకు అర్థం కావడం లేదని, మ్యాచ్ ఫలితాన్ని అసలు నమ్మలేకపోతున్నానని అతను వ్యాఖ్యానించాడు.‘ఆఖరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాల్సి ఉందంటే మిల్లర్ నిర్ణయం సరైంది అనుకోవచ్చు. కానీ 2 బంతుల్లో 2 పరుగులు అంటే మహా అయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే స్కోరు సమమయ్యేది. చివరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడు. అలా కాకున్నా అతను అవుటయ్యేవాడు. అలాంటిది 10 మ్యాచ్‌లలో ఒకసారి జరగవచ్చంతే. భారీ స్కోర్ల మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడంలో నష్టం ఏముంది. ఆ ఐదో బంతికి కుల్దీప్ స్థానంలో నేను ఉండి ఉంటే సింగిల్ కోసం దూసుకుపోయి అక్కడి నుంచి మిల్లర్‌ను పరుగెత్తమని తోసేసేవాడిని’ అని అశ్విన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు కొత్త తరహా దారులు వెతుకుతున్నట్లు అనిపిస్తుందని కూడా అశ్విన్ విశ్లేషించాడు. ‘ఈ తరహాలో ఓడిపోవడం వల్ల ముందుగా మీ జట్టులో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పైగా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడితే తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్న గుజరాత్ కోలుకొని మళ్లీ బరిలోకి నిలిచేందుకు మీరు అవకాశం కల్పించి మీరు నాలుగు పాయింట్ల వద్దే ఆగిపోయారు’ అని అశ్విన్ విమర్శించాడు. మిల్లర్ ఆలోచన తప్పు కాదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మాత్రం మిల్లర్ నిర్ణయాన్ని సమర్థించాడు. జట్టును గెలిపించాలనే అతని ఉద్దేశంలో తప్పేమీ లేదని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘మిల్లర్ అప్పటికి చాలా బాగా ఆడుతున్నాడు. గెలిపించగలనని తనపై తాను నమ్మకం ఉంచాడు. అతaని ఉద్దేశాన్ని మనం తప్పు పట్టవద్దు. చివరకు అతని ఆలోచన సరిగా అమలు చేయలేకపోయాడు. ప్రసిధ్ కృష్ణ చక్కటి స్లో బౌన్సర్‌తో మిల్లర్‌ను కట్టిపడేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈ స్థితిలోనే మన బుర్రను వాడాలి. నా ఉద్దేశం ప్రకారం కూడా ఐదో బంతికి సింగిల్ తీస్తే బాగుండేది. అంతకు ముందు కుల్దీప్ సింగిల్ రాబట్టగలిగాడనే విషయం మర్చిపోవద్దు’ అని గావస్కర్ అన్నాడు. -
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
-
బాంబు పేల్చిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, తన అంతర్జాతీయ కెరీర్‌పై ఆసక్తికర ప్రకటన చేశాడు. నిన్న (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (3-17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అతను.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చి బాంబు పేల్చాడు.మ్యాచ్ అనంతరం రషీద్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా నేను ఆడాను. గతేడాది జింబాబ్వేపై ఓ టెస్ట్ మ్యాచ్‌లో 67 ఓవర్లు వేశాను. ఈ చర్య నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్ట్‌లు ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు. కాగా, రషీద్ ఖాన్ 2023 నుంచి వెన్ను గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్యులు రెడ్‌బాల్ క్రికెట్ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. అయినా రషీద్ గతేడాది జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఈ నిర్ణయం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. రషీద్ 2023 వన్డే వరల్డ్ కప్ కోసం శస్త్రచికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆతర్వాత యూకేలో సర్జరీ చేయించుకున్నాడు. 2024లో తిరిగి వచ్చాడు. వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అతను తిరిగి గాడిలో పడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించాడు. రషీద్ టెస్ట్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 2017లో టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్‌లు ఆడగా, రషీద్ కేవలం 6 టెస్ట్‌ల్లో మాత్రమే పాల్గొన్నాడు. చివరిసారి అతను 2025లో జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 67 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా రషీద్ తన టెస్ట్ కెరీర్లో 6 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్ సింగిల్‌కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది. Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026ఆఖరి బంతిని మిస్ చేయడంతో కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్‌ను కెప్టెన్ అక్షర్ పటేల్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ఓదార్చారు. మిల్లర్ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్‌కు మద్దతు తెలిపింది. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్‌ను తిట్టిపోశారు. 19వ ఓవర్ ఐదో బంతిలో సింగిల్ తీసుంటే కనీసం సూపర్ ఓవర్‌కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్‌దే అంటూ సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్‌కు చీవాట్లు పెట్టారు.నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్ ఫైర్ అవడం సహజమే. ఇందులో మిల్లర్‌ను నిందించాల్సిన అవసరం లేదు.ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్‌రేట్ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ హైలైట్స్ - GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.- గిల్ (70), బట్లర్ (52), సుందర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. - ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిస్సంక (41) చెలరేగి ఆడారు. - గాయపడిన చేతితో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు. - రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్‌ను కుదిపేశాడు. -
శుబ్‌మన్ గిల్‌కు ‘ఊహించని’ షాక్!
గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్) చేసిన పొరపాటు టైటాన్స్ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టైటాన్స్‌ను విజయం వరించింది.ధనాధన్సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 70) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. జోస్ బట్లర్ (27 బంతుల్లో 52), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92), మిల్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.శుబ్‌మన్ గిల్‌కు ఊహించని షాక్అయితే, గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘‘ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
పరుగు తేడాతో బోణీ కొట్టిన GT
-
‘సింగిల్’తో ఢిల్లీ డీలా
ఢిల్లీ విజయానికి చివరి 18 బంతుల్లో 45 పరుగులు కావాలి. రిటైర్డ్హర్ట్గాతప్పుకొని మళ్లీ క్రీజ్‌లోకి వచ్చిన మిల్లర్‌పైనే ఆశలు ఉన్నాయి. 18వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ చెలరేగి 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో 11 పరుగులు లభించాయి. ఇక చేయాల్సింది 2 బంతుల్లో 2 పరుగులే! అయితే డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వరకు బంతి వెళ్లినా సునాయాస సింగిల్ తీయకుండా కుల్దీప్ను మిల్లర్ వెనక్కి పంపించాడు. ఈ అనూహ్య నిర్ణయం ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ బంతిని మిల్లర్ ఆడలేకపోగా, సింగిల్ తీసే ప్రయత్నంలో కుల్దీప్ రనౌటయ్యాడు. వైడ్ కోసం అంపైర్లు పరిశీలించగా అది సరైందేనని తేలింది. దాంతో గుజరాత్ సంబరాలు చేసుకోగా... ఢిల్లీ బృందం నిరాశలో మునిగింది. అంతకుముందు గిల్, బట్లర్, సుందర్ అర్ధసెంచరీలతో గుజరాత్ భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. న్యూఢిల్లీ: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో గెలుపు బోణీ చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన గుజరాత్ బుధవారం జరిగిన పోరులో ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (27 బంతుల్లో 52; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. రెండో వికెట్‌కు బట్లర్‌తో 32 బంతుల్లో 60 పరుగులు జోడించిన గిల్... మూడో వికెట్‌కు సుందర్‌తో 61 బంతుల్లో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడిపోయింది. కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేజార్చుకోగా, డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడాడు. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ సాయి సుదర్శన్ (12) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... చాలా కాలం తర్వాత బట్లర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటంతో టైటాన్స్ భారీ స్కోరుకు పునాది పడింది. సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచిన బట్లర్...అక్షర్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. అనంతరం ముకేశ్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అతను ఆ తర్వాత మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేయగా, 24 బంతుల్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో అతని ఆటను ముగించాడు. ఈ దశలో గిల్, సుందర్ కలిసి ధాటిని ప్రదర్శించారు. విప్రాజ్ వేసిన 12వ ఓవర్ గుజరాత్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, గిల్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. 33 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న గిల్... కుల్దీప్ ఓవర్లో మరో రెండు సిక్స్‌లతో చెలరేగాడు. గుజరాత్ ఆఖరి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టగా... 30 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. అనారోగ్యంతో గత మ్యాచ్‌లో ఆడని గిల్ కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఒక్క కుల్దీప్ బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. రిజ్వీ విఫలం... సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది నిసాంక జోరుగా ఛేదనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అశోక్ ఓవర్లోనూ అతను వరుసగా 4, 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన రాహుల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. అశోక్ ఓవర్లోనే ఢిల్లీ 23 పరుగులు రాబట్టింది. తొలి వికెట్‌కు 76 పరుగుల (49 బంతుల్లో) తర్వాత నిసాంకను ప్రసిధ్ అవుట్ చేయగా...అదే ఓవర్ చివరి నాలుగు బంతుల్లో రాహుల్ వరుసగా 4, 6, 6, 4తో చెలరేగి 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ రాణా (5) మళ్లీ విఫలం కాగా, గత రెండు మ్యాచ్‌ల హీరో సమీర్ రిజ్వీ (0) ఈసారి తొలి బంతికే బౌల్డయ్యాడు. అక్షర్ పటేల్ (2) కూడా నిలబడలేకపోగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుటయ్యాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా బయటకు వెళ్లిన మిల్లర్ ఈ దశలో తిరిగొచ్చి చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (బి) ముకేశ్ 12; గిల్ (సి) రాణా (బి) ఎన్గిడి 70; బట్లర్ (బి) కుల్దీప్ 52; సుందర్ (సి) రాణా (బి) ముకేశ్ 55; ఫిలిప్స్ (నాటౌట్) 14; తెవాటియా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–19, 2–79, 3–183, 4–205. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–55–2, ఎన్గిడి 4–0–24–1, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0–42–1, నటరాజన్ 4–0–34–0, విప్రాజ్ 1–0–23–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 41; రాహుల్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 92; రాణా (సి) సుదర్శన్ (బి) రషీద్ 5; రిజ్వీ (బి) రషీద్ 0; మిల్లర్ (నాటౌట్) 41; అక్షర్ (సి) ఫిలిప్స్ (బి) రషీద్ 2; స్టబ్స్ (రనౌట్) 7; విప్రాజ్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 12; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–101, 3–101, 4–134, 5–160, 6–166, 7–202, 8–209. బౌలింగ్: సిరాజ్ 4–0–52–1, రబాడ 4–0–32–0, రషీద్ ఖాన్ 4–0–17–3, అశోక్ శర్మ 3–0–45–0, ప్రసిధ్ కృష్ణ 4–0–52–2, సుందర్ 1–0–11–0.ఐపీఎల్లో నేడుకోల్‌కతా X లక్నో వేదిక: కోల్‌కతారాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఉత్కంఠ పోరు.. ఒకే ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది.చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిరాజ్ వేసిన 19 ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఒక్కసారి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు తిరిగిపోయింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయసమీకరణం 13 పరుగులగా మారింది. చివరి ఓవర్ వేసే బాధ్యతను గుజరాత్ కెప్టెన్.. ప్రసిద్ద్ కృష్ణకు అప్పగించాడు. అయితే తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీగా మలిచాడు. తర్వాతి బంతికి నిగమ్ ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 4 బంతుల్లో 9 పరుగులగా మారింది. మూడో బంతికి కుల్దీప్ సింగిల్ తీసి మిల్లర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో రెండు బంతుల్లో ఢిల్లీకి రెండు పరుగులు అవసరయ్యాయి. మిల్లర్ క్రీజులో ఉండడంతో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని భావించారు. ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకున్నాడు. కానీ అయితే ఆఖరి బంతిని ప్రసిద్ద్ అద్భుతమైన బౌన్సర్‌గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. మిల్లర్ బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ సూపర్‌త్రోతో స్ట్రైకర్ ఎండ్ వైపు స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మిల్లర్‌తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. అయినప్పటికి ఢిల్లీ ఓడిపోవడంతో రాహుల్, మిల్లర్(20 బంతుల్లో 41) ఇన్నింగ్స్‌లు వృథా అయిపోయాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. -
జట్టు నుంచి తీసేమన్నారు.. కట్ చేస్తే! బౌండరీలతో బీభత్సం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన ఐపీఎల్ హాఫ్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు.వాషీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సుందర్ కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం సుందర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫలమయ్యాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ గుజరాత్ మేనెజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. తన అద్భుత ఇన్నింగ్స్‌తో మేనెజ్మెంట్ నమ్మకాన్ని సుందర్ నిలబెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సుందర్‌తో పాటు శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.Gujrat Titans against Delhi CapitalsGT70(45 : Shubman Gill55(32) : Washington Sundar52(27) : Jos ButtlerDC2/55 : Mukesh Kumar1/24 : Lungi Ngidi1/42 : Kuldeep Yadav pic.twitter.com/Wk8cmnCVba— Hello Cricket (@thehellocricket) April 8, 2026 -
జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బట్లర్ మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్‌కు బట్లర్ చుక్కలు చూపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బట్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఓవర్ మొదటి బంతికే తన ఫేవరెట్ 'ర్యాంప్ షాట్'తో సిక్సర్ కొట్టి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. బట్లర్ మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్ -
ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ విజయం
Gujarat titans vs Delhi capitals live Updates: ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమిఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిద్ద్ కృష్ణ పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడం మ్యాచ్ గుజరాత్ వశమైంది. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) చివరి వరకు పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు నిస్సాంక(41) కూడా రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.మిల్లర్.. కిల్లర్అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రాహుల్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్160 పరుగుల వద్ద ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. డిల్లీ విజయానికి 20 బంతుల్లో 50 పరుగులు కావాలిఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అక్షర్ పటేల్ కేవలం రెండు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్(71) ఉన్నాడు.డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఎడమ చేతి వేలి గాయం కారణంగా మిల్లర్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.రషీద్ ఖాన్ మ్యాజిక్రషీద్ ఖాన్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ ఐదో బంతికి నితీష్ రాణా ఔట్ కాగా.. ఆరో బంతికి సమీర్ రిజ్వీ క్లీన్ బౌల్డయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీతొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కేఎల్ రాహుల్.. గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసిన నిస్సాంక.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(26), నిస్సాంక(35) ఉన్నారు.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/04 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(19), నిస్సాంక(15) ఉన్నారు.గిల్ విధ్వంసం.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.శుభ్‌మన్ గిల్ ఔట్శుభ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన గిల్.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.భారీ స్కోర్ దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(51), వాషింగ్టన్ సుందర్(41) ఉన్నారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన బట్లర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 85/2దూకుడుగా ఆడుతున్న గుజరాత్జోస్ బట్లర్(22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్19 పరుగుల గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 2.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 19/1టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ తిరిగి రావడంతో కుమార్ కుశాగ్ర బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్Innovative 🤝 Powerful Jos Buttler looks in the 𝙈.𝙊.𝙊.𝘿 tonight 😎#GT 68/1 after the powerplay. Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT | @josbuttler | @gujarat_titans pic.twitter.com/mLBuDqyQWl— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు!
భారత్‌లో ఫాస్ట్ బౌలర్ల కన్నా మీడియం ఫాస్ట్ బౌలర్లే ఎక్కువగా ఉంటారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా మరో ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. అతడే గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శర్మ. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వచ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడడంలో విఫలమై డిఫెన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అశోక్ శర్మ సంధించిన బంతి అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. అశోక్ శర్మ కంటే ముందు లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), రబాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శర్మను రాజస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. 2 ఓవర్లు కలిపి 9 సగటుతో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయడంతో పాటు తన ఫాస్ట్ బౌలింగ్‌తో వణికించాడు. అంతేకాదు గుజరాత్ బౌలర్లలో అందరూ దాదాపు భారీగా పరుగులిచ్చుకోగా.. అశోక్ శర్మ మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే తక్కువ ఎకానమీ నమోదు చేయడం విశేషం. గుజరాత్ ఓడినప్పటికీ అశోక్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అశోక్ శర్మ? ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరీ అశోక్ శర్మ?రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకుమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకిముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7— CREX (@Crex_live) April 4, 2026చదవండి: రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు! -
రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే మొదట బ్యాటింగ్‌లో ధ్రువ్ జురేల్, జైస్వాల్ మెరిస్తే.. ఆ తర్వాత బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే సూపర్ బౌలింగ్‌తో రాజస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గ్లెన్ పిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాలు రవి బిష్ణోయ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే గ్లెన్ పిలిప్స్ వికెట్ తీయడం ద్వారా రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (25 ఏళ్ల 211 రోజులు) బిష్ణోయ్ నిలిచాడు. 171 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు భారత్ తరఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌలర్‌గా, 9వ స్పిన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రషీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన రవి బిష్ణోయ్ గతలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు. టీమిండియా తరఫున 44 టీ20లు ఆడిన రవి బిష్ణోయ్ 64 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జురేల్ (75), జైస్వాల్ (55) రాణించారు. అనంతరం కడదాకా పోరాడిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులకు పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ తప్పిదం మా కొంపముంచింది’ -
‘ఆ తప్పిదం మా కొంపముంచింది’
ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్ రాయల్స్‌నే విజయం వరించింది. గుజరాత్ టైటాన్స్ సీజన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఓటమిపై స్పందించాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నిజానికి మేము మంచిగానే బౌలింగ్ చేశాం. తొలుత రాజస్తాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనుకున్నాం. కానీ మా బౌలర్లు కట్టడి చేయడంతో 210 పరుగులకు కట్టడి చేశాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మంచి ఆరంభమే దక్కింది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. అయితే భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉండడం సహజం. ఇలాంటి పిచ్‌పై ఓవర్‌కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి. అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఆఖరి ఓవర్ లో మా మధ్య (రబాడతో) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్‌గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో రాణిస్తాం. మా రెగ్యులర్ కెప్టెన్ గిల్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్! -
ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై రాయల్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి (7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనను దూకుడుగా ప్రారంభించిన గుజరాత్.. మధ్యలో ఒక్కసారిగా లయ తప్పి స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రబాడ, రషీద్ ఖాన్ గుజరాత్‌కు గెలుపుపై ఆశలు కలిగించి, ఆఖర్లో చేతులెత్తేశారు. చివరి ఓవర్లో వీరు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి వీరిని కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి, లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి స్వల్ప వ్యవధిలో 4 వికెట్లతో గుజరాత్ నడ్డి విరిచాడు. ఫలితంగా గుజరాత్‌కు సొంతగడ్డపై పరాభవం తప్పలేదు.చెలరేగిన జురెల్, జైస్వాల్తొలుత బ్యాటింగ్‌లో ధృవ్ జురెల్ (75), యశస్వి జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో చెలరేగడంతో రాయల్స్ భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ (31) సైతం మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 4, హెట్‌మైర్ 18, డొనొవన్ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 2, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.రాయల్స్‌ను భయపెట్టిన సాయి సుదర్శన్భారీ ఛేదనను గుజరాత్ ఓపెనర్ ధాటిగా ప్రారంభించాడు. 44 బంతుల్లో 73 పరుగులు చేసి రాయల్స్ శిబిరంలో భయాన్ని రేకెత్తించాడు. అయితే ఇతను ఔటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. బిష్ణోయ్ దెబ్బకు గుజరాత్ మిడిలార్డర్ పేకమేడలా కూలింది. బట్లర్ (26), రషీద్ ఖాన్ (24), రబాడ (23 నాటౌట్) పోరాడి చేతులెత్తేశారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ 4, బర్గర్, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు. -
IPL 2026: సరికొత్త ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ ద్వారా మరో భారత టాలెంట్ బయటపడింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి (7:30 గంటలకు) ప్రారంభమైన మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అనామక బౌలర్ అశోక్ శర్మ నిప్పులు చెరిగాడు. ఊహించని విధంగా గంటకు 154 కిమీ వేగంతో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ చివరి బంతికి అశోక్ మెరుపు వేగంతో బంతిని సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న ధృవ్ జురెల్ పరుగు సాధించలేకపోయాడు.ప్రస్తుత సీజన్లో అశోక్ శర్మ తర్వాత అత్యంత వేగవంతమైన బంతి లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్జే (150.9) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానాల్లో కార్తీక్ త్యాగి (149.7), రబాడ (149.1), ఓవర్టన్ (145.6) ఉన్నారు.ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి షాన్ టైట్ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో ఇతను రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతూ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 వేగవంతమైన బంతులు ఇలా ఉన్నాయి.157.71 కిమీ/గం - షాన్ టైట్ (2011)157.4 కిమీ/గం - గెరాల్డ్ కోయెట్జీ (2024)157.3 కిమీ/గం - లాకీ ఫెర్గూసన్ (2022)157.0 కిమీ/గం - ఉమ్రాన్ మాలిక్ (2022)156.22 కిమీ/గం - అన్రిచ్ నోర్ట్జే (2020)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. జురెల్ (75), జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 4, హెట్‌మైర్ 18, డొనొవన్ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 2, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు. -
గుజరాత్‌పై రాయల్స్ గెలుపు
గుజరాత్‌పై రాయల్స్ గెలుపుఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్‌పై రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్106 పరుగుల వరకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు దిశగా సాగిన గుజరాత్.. స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. రవి బిష్ఱోయ్ (3-0-31-4) ఒక్కసారిగా చెలరేగి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 161-7గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్10.4వ ఓవర్- 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (73) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 8వ ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి కుమార్ కుషాగ్రా (18) ఔటయ్యాడు.ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు. రాయల్స్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.జురెల్ (75), జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు. నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్15.3వ ఓవర్- 165 పరుగుల వద్ద రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశోక్ శర్మ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ (18) ఔటయ్యాడు. జైస్వాల్ (55) ఔట్12.3వ ఓవర్-126 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జురెల్‌కు (31) జతగా రియాన్ పరాగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. వైభవ్ సూర్యవంశీ (31) ఔట్6.2వ ఓవర్- 70 పరుగుల వద్ద రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న జైస్వాల్, సూర్యవంశీటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్ ధాటిగా ఆడుతుంది. పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆ జట్టు 69 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (35), వైభవ్ సూర్యవంశీ (31) చెలరేగి ఆడుతున్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించనుండటమే రియాన్ నిర్ణయానికి కారణం. ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్ ఆడటం లేదు. గిల్ స్థానంలో రషీద్ ఖాన్ టాస్కు వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ శర్మ స్థానంలో తుషార్ దేశ్‌పాండే.. రవి బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబే జట్టులోకి వచ్చారు. గుజరాత్ విషయానికొస్తే.. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగుతుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(c), కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, అనుజ్ రావత్, జయంత్ యాదవ్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, రవి సింగ్ -
‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్‌ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం షేక్ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్‌కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఆడిన 175 పరుగుల ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్‌ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్‌తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్ ఫామ్‌పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్‌తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.Two generations of the Royals 💗🥹 pic.twitter.com/d8y76RbGaT— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే! -
ఐపీఎల్లో నేడు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో తొలి ‘డబుల్ హెడర్’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్–5 బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గుజరాత్ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. -
మ్యాచ్ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్‌పై ప్రశంసలు
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ హీరో కచ్చితంగా కూపర్ కనోలీనేనని, అతడి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. అయితే గుజరాత్ కెప్టెన్ గిల్‌పై శ్రేయస్ ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. శ్రేయస్ మాట్లాడుతూ..‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్‌లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్‌తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్లు మాత్రం అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్‌తో కూడా చెప్పాను. శుభ్‌మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్‌కు అనర్హత -
మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?
టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు...ఇంగ్లండ్‌కు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ... ఐపీఎల్లో ఏడు సెంచరీలు సహా నాలుగు వేలకు పైగా పరుగులు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర... గత ఏడాది కూడా గుజరాత్ తరఫున 163 స్ట్రయిక్ రేట్‌తో 538 పరుగులు... కానీ ఇప్పుడు జోస్ బట్లర్ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. బౌండరీలు కాదు కదా సింగిల్ తీయడమే కష్టంగా మారిపోయింది. తనపై వస్తున్న విమర్శలకు బట్లర్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్తాడేమో చూడాలి..ఇటీవల టీ20 ప్రపంచకప్‌లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన చేశాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 87 పరుగులే చేసిన బట్లర్ ఐదుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. నిజానికి రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో బట్లర్ ఆట ఏమాత్రం బాగా లేదు. గత నాలుగు ఐసీసీ టోర్నీల్లో కలిపి (రెండు టీ20 ప్రపంచకప్‌లు, వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ) ఇంగ్లండ్ తరఫున 28 ఇన్నింగ్స్‌లలో బట్లర్ ఒకే ఒక అర్ధసెంచరీ చేయడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. అయితే ఐపీఎల్‌కు వచ్చేసరికి అన్నీ వెనక్కి తోసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి చెలరేగుతాడని ఆశించిన టైటాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లో ఉన్నంత సేపు బట్లర్ చాలా ఇబ్బందిగా కనిపించాడు. అసలు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. తన తొలి 30 బంతుల్లో అతను 11 డాట్ బాట్స్ ఆడాడు. ఆ తర్వాత లెక్క సరి చేసేందుకు అతను చాలా శ్రమించాడు. స్వీప్, రివర్స్ స్వీప్‌లు ప్రయత్నించినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. చివరకు చహల్ బౌలింగ్‌లో వరుసగా రెండు డాట్ బాల్స్ తర్వాత అసహనంతో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కేవలం 115.15 స్ట్రయిక్‌రేట్‌తో ఇన్నింగ్స్ ముగించడం బట్లర్ స్థాయికి సరిపోదని క్రికెట్ ఫ్యాన్స్ వాపోయారు.2022లో ఆరెంజ్ క్యాప్..2022 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో ఓపెనర్‌గా వచ్చిన బట్లర్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 868 పరుగులు చేసిన బట్లర్ ఆ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు బాదిన బట్లర్ ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. 2023, 2024 సీజన్లలోనూ బట్లర్ రాజస్తాన్ రాయల్స్ తరఫునే ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2025 మెగావేలంలో బట్లర్‌ను దక్కించుకునేందుకు రాజస్తాన్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. చివరకు బట్లర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 15.06 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో గుజరాత్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 538 పరుగులు సాధించాడు. లెక్క సరిచేయాలి..కానీ ఈ సీజన్లో మాత్రం బట్లర్ బ్యాట్ మూగబోయినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ అయినప్పటికీ బట్లర్ ఆడిన తీరు అతడు ఫామ్‌లేమితో సతమత మవుతున్నట్లు అర్థమవుతుంది. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు బట్లర్‌కు ఒక్క ఇన్నింగ్స్ చాలు. రాబోయే మ్యాచ్‌ల్లో బట్లర్ మెరవాలని కోరుకుందాం. చదవండి: చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో! -
కూపర్... సూపర్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 163 పరుగుల విజయలక్ష్యం.... పంజాబ్ ఒకదశలో 11 ఓవర్లలో 110/2... మిగిలిన 48 బంతుల్లో మరో 53 పరుగులు అంటే అలవోకగా ఛేదించవచ్చు... కానీ ఇక్కడ జట్టు అనూహ్యంగా తడబడింది. 16 బంతుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆ్రస్టేలియన్ కూపర్ కనోలీ పట్టుదలగా నిలబడ్డాడు. ఒత్తిడిని అధిగమిస్తూ చివరి వరకు నిలబడి ఒంటి చేత్తో గెలిపించాడు. అంతకుముందు పంజాబ్ పదునైన బౌలింగ్ ముందు నిలవలేక గుజరాత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూ చండీగఢ్: ఐపీఎల్లో మూడు ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత ఉత్కంఠభరిత పోరు జరిగింది. మంగళవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కూపర్ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యం! బార్ట్లెట్ ఓవర్లో గిల్ మూడు ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించగా, మరో ఓపెనర్ సాయిసుదర్శన్ (13) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బట్లర్ కూడా ఆశించిన స్థాయిలో దూకుడుగా ఆడకపోవడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 54 పరుగులే చేయగలిగింది. ఇందులో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం. ఆ తర్వాత చహల్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి గిల్ వెనుదిరగ్గా, గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 16వ ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్ ప్రభావం కనిపించలేదు. చివరి 4 ఓవర్లలో టైటాన్స్ కేవలం 2 ఫోర్లతో 31 పరుగులే రాబట్టగలిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్ (18), షారుఖ్ ఖాన్ (4) కూడా విఫలమయ్యారు. రాణించిన ప్రభ్‌సిమ్రన్... ఛేదనలో ఆరంభంలోనే ప్రియాన్‡్ష ఆర్య (7) వెనుదిరిగినా... ప్రభ్ సిమ్రన్ సిక్సర్లతో చెలరేగాడు. రబాడ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను, సుందర్ బౌలింగ్‌లో మరో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అయితే కీలక సమయంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లు తీసి పంజాబ్‌పై ఒత్తిడి పెంచింది. కానీ కనోలీ పోరాటంతో మ్యాచ్ పంజాబ్ వశమైంది. అశోక్ అరంగేట్రం... రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అడుగు పెట్టాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 15.63 సగటుతో 22 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో 2022లో కోల్‌కతా, 2025లో రాజస్తాన్ జట్లలో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) అయ్యర్ (బి) యాన్సెన్ 13; గిల్ (సి) కనోలీ (బి) చహల్ 39; బట్లర్ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 38; ఫిలిప్స్ (సి) యాన్సెన్ (బి) వైశాక్ 25; సుందర్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 18, షారుఖ్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 4; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–37, 2–83, 3–119, 4–129, 5–144, 6–150.బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–42–0, బార్ట్లెట్ 4–0–36–0, యాన్సెన్ 4–0–20–1, వైశాక్ 4–0–34–3, చహల్ 4–0–28–2, పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) అశోక్ (బి) రబాడ 7; ప్రభ్‌సిమ్రన్ (సి) ప్రసిధ్ (బి) రషీద్ 37; కనోలీ (నాటౌట్) 72; శ్రేయస్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 18; వధేరా (సి) గిల్ (బి) సుందర్ 3; శశాంక్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 4; స్టొయినిస్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 0; యాన్సెన్ (సి) గిల్ (బి) అశోక్ 9; బార్ట్లెట్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–7, 2–83, 3–110, 4–113, 5–118, 6–118, 7–144. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0 రబాడ 3–0–34–1, అశోక్ శర్మ 3–0–31–1, రషీద్ 4–0–29–1, సుందర్ 3.1–0–27–1, ప్రసిధ్ 4–0–29–3. -
IPL 2026: పంజాబ్‌ను గెలిపించిన కన్నోల్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు (19.1 ఓవర్లలో) మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.తొలుత సునాయాసంగా గెలుస్తుందనుకున్న పంజాబ్ ఓ దశలో తడబడింది. 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఈ దశలో కన్నోల్లీ సంయమనంతో ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి జేవియర్ బార్ట్లెట్ (11 నాటౌట్) సహకరించాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (18), ప్రియాంశ్ ఆర్య (7), నేహల్ వధేరా (3), శశాంక్ సింగ్ (4), స్టోయినిస్ (0), జన్సెన్ (9) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ (4-0-29-3) అద్భుతమైన స్పెల్‌తో పంజాబ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచగా.. రషీద్ ఖాన్ (4-0-29-1) పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లలో రబాడ, అశోక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు గుజరాత్ సైతం ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ.. పంజాబ్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. విజయ్‌కుమార్ వైశాక్ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్ (4-0-28-2), మార్కో జన్సెన్ (4-0-20-1), బార్ట్లెట్ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్ సింగ్ (4-0-42-0) మినహా పంజాబ్ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్ చేశారు.గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్ (13), వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్ తెవాతియా (11), రషీద్ ఖాన్ (0) అజేయంగా నిలిచారు. -
చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 31) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్‌పూర్) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. విజయ్‌కుమార్ వైశాక్ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్ (4-0-28-2), మార్కో జన్సెన్ (4-0-20-1), బార్ట్లెట్ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్ సింగ్ (4-0-42-0) మినహా పంజాబ్ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్ చేశారు.గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్ (13), వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్ తెవాతియా (11), రషీద్ ఖాన్ (0) అజేయంగా నిలిచారు. -
గుజరాత్‌పై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.శ్రేయస్ ఔట్12.1వ ఓవర్- 110 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (18) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) ఔటయ్యాడు. ఆదిలోనే పంజాబ్‌కు ఎదురుదెబ్బ1.2వ ఓవర్- 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రబాడ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 129 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (38) పెవిలియన్ బాట పట్టాడు.మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్13.6వ ఓవర్- 119 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గ్లెన్ ఫిలిప్స్ (25) ఔటయ్యాడు. గిల్ ఔట్9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (39) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సుదర్శన్ (13) ఔట్3.4వ ఓవర్- 37 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్‌పూర్) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఇరు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. అహ్మదాబాద్ వేదికగా గత ఎడిషన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో (232) నిలిచిపోయింది. ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లు..పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గేగుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(c), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, M షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్రా -
టైటాన్స్‌తో పంజాబ్ ఢీ.. పంజా విసిరేదెవరు?
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్‌తో శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. భారత టి20 జట్టులో స్థానంలేని ఇరు జట్ల కెప్టెన్లు అటు తమ బ్యాటింగ్‌తో, ఇటు నాయకత్వంతో తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతీ సీజన్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా... గిల్ స్ట్రయిక్‌రేట్‌పై ఇటీవల చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో తనలో దూకుడు పెంచాలని అతను భావిస్తున్నాడు. మరోవైపు శ్రేయస్ గత ఏడాది అద్భుత బ్యాటింగ్‌తో 604 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తే జట్టు ముందంజ వేయవచ్చు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చదవండి: సినెర్దే మయామి మాస్టర్స్ -
ఐపీఎల్-2026కు ఆంధ్ర కుర్రాడు దూరం
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు ఆ జట్టు పేసర్ యర్రా పృథ్వీరాజ్ దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పృథ్వీరాజ్‌ను గతేడాది జరిగిన వేలంలో రూ. 30 లక్షల బేస్‌ప్రైస్‌కు గుజరాత్ సొంతం చేసుకుంది. కానీ ప్రాక్టీస్ సెషన్లో అతడు గాయపడినట్లు తెలుస్తోంది.ఈ కారణంతోనే పృథ్వీ ఐపీఎల్-19వ సీజన్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్దానాన్ని ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియాతో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఖేజ్రోలియాకు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. ఖేజ్రోలియా గతంలో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు మరోసారి అతడికి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది. మొత్తంగా 6 ఐపీఎల్ వికెట్లు అతడి పేరిట ఉన్నాయి. మరోవైపు కేకేఆర్ గాయపడిన హర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేసర్ నవ్దీప్సైనీతో ఒప్పందం కుదర్చుకుంది. సైనీ ఇప్పటికే కేకేఆర్ ట్రైనింగ్ శిబిరంలో చేరాడు. సైనీ గతంలో రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ వంటి ఫ్రాంచైజీల తరపున ఆడాడు.ఐపీఎల్-2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుఅజింక్య రహానే (కెప్టెన్), రఘువంశీ, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కెమెరాన్ గ్రీన్, ఫిన్ సింగ్, టి ప్రవిష్ణ, తీజాక్ అలెన్, తీజాక్ పవీయానా, తీషా సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ.ఐపీఎల్-2026 కోసం గుజరాత్ టైటాన్స్ జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ సింగ్ బి, గుర్నౌర్ ఖాన్, మన్షి సునర్ శర్మ కిషోర్, జయంత్ యాదవ్, అశోక్ శర్మ, జాసన్ హోల్డర్, టామ్ బాంటన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ల్యూక్ వుడ్చదవండి: IPL 2026: ఆర్సీబీ టీమ్ పేరు మార్పు? -
ఆశల పల్లకిలో...
ఐపీఎల్లో అడుగు పెట్టిన తొలి ఏడాదే చాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించడంతో పాటు తర్వాతి ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచి గుజరాత్ టైటాన్స్ తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఆ తర్వాతి సీజన్లో అనూహ్యంగా వెనుకబడి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. కానీ గత సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరగలిగింది. 2025తో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా ఈసారి కూడా జట్టు బరిలోకి దిగుతోంది. శుబ్‌మన్ గిల్ నాయకత్వానికి ఆశిష్ నెహ్రా కోచింగ్ వ్యూహాలు తోడైతే రెండో టైటిల్‌ను ఆశించవచ్చు. అయితే జోస్ బట్లర్, రషీద్ ఖాన్‌లాంటి స్టార్స్ ఇటీవలి తమ వైఫల్యాలను అధిగమించి ఫామ్‌లోకి రావడం జట్టుకు కీలకం. –సాక్షి క్రీడా విభాగం గత సీజన్లో లీగ్ దశలో 9 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో నిలిచిన టైటాన్స్... ‘ఎలిమినేటర్’లో ముంబై చేతిలో ఓడి నిష్క్రమించింది. ఐపీఎల్ వేలంలో ఈ ఏడాది గుజరాత్ ఐదుగురు ఆటగాళ్లనే ఎంచుకుంది. వీరిలో ముగ్గురు విదేశీయులు హోల్టర్, టామ్ బాంటన్, ల్యూక్ వుడ్ ఉన్నారు. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్‌ను జట్టు వదిలేసుకొని అతని స్థానంలో టామ్ బాంటన్‌ను ఎంచుకుంది. గాయం కారణంగా గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ఫిలిప్స్ ఈసారి అందుబాటులో ఉండటం గుజరాత్ బలాన్ని పెంచింది. తుది జట్టులో ఆడే విదేశీ ఆటగాళ్లలో రషీద్, బట్లర్లకు చోటు ఖాయం కాబట్టి బాంటన్, ఫిలిప్స్‌లలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే బౌలింగ్‌లో రబాడ లేదా హోల్డర్‌కు అవకాశం కల్పించడం కూడా కీలకం. టాప్–3 పైనే... గుజరాత్ మరోసారి తమ టాప్–3 బ్యాటింగ్ ఆర్డర్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్ కలిసి 2025 సీజన్లో జట్టు మొత్తం స్కోరులో 74.54 శాతం స్కోరు సాధించారు. ఒకే టీమ్ నుంచి టాప్–3 ఒక సీజన్లో 500కు పైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. అయితే ఈసారి టైటాన్స్ ఇదే విషయంలో కొంత సవాల్‌ను కూడా ఎదుర్కొంటోంది. గిల్ భారత టి20 జట్టులో చోటు కోల్పోయాడు. బట్లర్ తన కెరీర్లోనే అతి ఘోరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి టి20 వరల్డ్ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 26 కాగా, ఐదుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. సాయిసుదర్శన్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. కాబట్టి మిడిలార్డర్లో బాంటన్, ఫిలిప్స్, సుందర్, షారుఖ్, తెవాటియాలపై భారీ స్కోరు భారం ఉంది. గత రెండు సీజన్లలో మిడిలార్డర్ బ్యాటర్లు కలిపి అతి తక్కువ పరుగులు చేసిన జట్టు గుజరాత్‌దే. ఈసారి మాత్రం అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను గుజరాత్ తాజా సీజన్ కోసం బ్యాటింగ్ కోచ్‌గా ఎంచుకుంది కాబట్టి అతని ప్రభావం కూడా కొంత ఉండవచ్చు. రషీద్ రాణించేనా... ఐపీఎల్లో 9 సీజన్లు ఆడిన లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కానీ ఇటీవల రషీద్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో అతని ఫామ్ పేలవంగా ఉంది. 2025లోనైతే మరీ ఘోరంగా కనీసం 10 వికెట్లు కూడా తీయలేకపోయిన రషీద్ ఏకంగా 57.11 సగటు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 9కి పైగా ఉంది. ఇలాంటి స్థితిలో అతను మళ్లీ లయ అందుకుంటే తప్ప గుజరాత్ బౌలింగ్ బలహీనంగా మారిపోతుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయికిషోర్ ప్రభావం చూపించగలడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ప్రధాన పేసర్లు కాగా...మూడో పేసర్‌గా ఆల్‌రౌండర్ నైపుణ్యం ఉన్న హోల్డర్ వైపే జట్టు మొగ్గు చూపవచ్చు. వేలంలో రూ.7 కోట్లకు ఎంచుకున్న హోల్డర్ ఇటీవలి వరల్డ్ కప్‌లో మెరుగ్గా రాణించాడు. గత ఏడాది డోపింగ్ నిషేధం కారణంగా నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైన రబాడ ఈసారి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. విదేశీ ప్రత్యామ్నాయ పేసర్‌గా లెఫ్టార్మ్ బౌలర్ ల్యూక్‌వుడ్ అందుబాటులో ఉన్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్‌కు తుది జట్టులో స్థానం లభించడం కష్టమే. ఆంధ్ర ఆటగాడు పృథ్వీరాజ్ గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. 2019 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతను ఇప్పటి వరకు మరో ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు.గుజరాత్ టైటాన్స్ గణాంకాలుఆడిన మ్యాచ్‌లు 60 గెలిచినవి 37 ఓడినవి 23 అత్యుత్తమ ప్రదర్శనవిజేత (2022), రన్నరప్ (2023) గుజరాత్ టైటాన్స్ జట్టు: శుబ్‌మన్ గిల్ (కెపె్టన్), జోస్ బట్లర్, కుమార్ కుశాగ్ర, అనూజ్ రావత్, టామ్ బాంటన్, గ్లెన్ ఫిలిప్స్, సాయిసుదర్శన్, నిశాంత్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, సాయికిషోర్, జయంత్ యాదవ్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ సింగ్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, ల్యూక్‌వుడ్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖెజ్రోలియా. -
గర్జించేందుకు గిల్ రెడీ
అహ్మదాబాద్: మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... ప్రశాంతంగా ఉండటం వల్ల సునిశిత దృష్టి అలవడుతుందని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. ఇటీవల టి20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు రెండో టైటిల్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తొలి సీజన్లోనే చాంపియన్ అవతరించింది. ఆ తర్వాత ఏడాది రన్నరప్‌గా నిలిచిన టైటాన్స్... గత సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. శుక్రవారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ ఫ్రాంచైజీ ‘శుభారంభం–2026’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం గిల్ మాట్లాడుతూ... ‘నేను సాధారణంగా ప్రశాంతంగానే ఉంటాను. అదే నాకు జట్టుపై నమ్మకం, విశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనూ కాకుండా ఉండటం ద్వారా విశాల దృక్పథం అలవుడుతుంది. దీంతో ఆ క్షణాలను విభిన్నంగా చూడగల శక్తి వస్తుంది. అప్పుడు సమస్యల పరిష్కారం సులువు అవుతుంది’ అని వెల్లడించాడు.ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ... ‘గతేడాది మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం ద్వారా ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాం. దీంతో జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరగడంతో పాటు పరస్పర నమ్మకం కలుగుతుంది. వేలంలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశాం. జట్టు కూర్పుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాం. ఆ ఫలితాలు మరి కొన్ని రోజుల్లో మీ ముందు ఉంటాయి’ అని అన్నాడు. -
IPL 2026: ‘గెలవడానికే బరిలోకి దిగుతున్నాం’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ప్రస్థానం 2022లో మొదలైంది. ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగిన తొలిసారే చాంపియన్‌గా నిలవడం విశేషం. ఆ మరుసటి ఏడాది అంచనాలను అందుకుంటూ మరోసారి ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమయింది. అయితే 2024 సీజన్లో పేలవ ఆటతీరుతో లీగ్ దశకే పరిమితమైన గుజరాత్ గత సీజన్లో మాత్రం మరోసారి మంచి ప్రదర్శన నమోదు చేసింది. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐదో సీజన్ ఆడనున్న గుజరాత్ టైటాన్స్ ఈసారి కప్పు గెలవడానికే బరిలోకి దిగుతోందని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ పూర్తిస్థాయి జట్టుతో శుభారంభ్-2026 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆటగాళ్లతో పాటు అభిమానులు, ఫ్రాంచైజీ ఓనర్లు, సహాయక సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడాడు. ‘ఈ సీజన్లో భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఆలోచించడానికేం లేదు. ఎందుకంటే బరిలోకి దిగనున్న జట్టు మ్యాచ్ ఎలా ఆడాలన్నది ఆలోచిస్తోంది, జట్టు ఆటగాళ్లు దీని గురించి ఆలోచిస్తారు. ఒక కోచ్‌గా నేను సలహాలు మాత్రమే అందివ్వగలను. ఈ శుభారంబ్ వేడుక సాక్షిగా ఒక విషయం చెప్పదలచుకున్నా. ఈ సీజన్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వస్తున్నాం. ఈసారి కేవలం పాల్గొనడానికి రాలేదు, ఐపీఎల్లో కప్పు గెలవడానికే వస్తున్నాం. కొత్త జట్టుకు సమయం పడుతుందని అంతా అంటున్నారు. కానీ మా విధానాలు, ప్రణాళికలు ఎప్పుడు రెండు అడుగులు ముందే ఉంటాయి. ఐదేళ్లుగా గుజరాత్ జట్టుతోనే ఉన్నాను. ఈ ఐదేళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ శుభారంభ్ మా గుజరాత్ టైటాన్స్‌కు కొత్త శోభను తీసుకొచ్చింది. ఇది ఇచ్చిన స్ఫూర్తి, ఐక్యతతో ముందుకు సాగుతాం’ అని చెప్పుకొచ్చాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తొలి మ్యాచ్‌ను మార్చి 31 ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. -
టూ టైమ్ విన్నింగ్ కోచ్‌తో ఒప్పందం చేసుకున్న గుజరాత్
తమ తొలి సీజన్లోనే (2022) టైటిల్ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్ విన్నింగ్ కోచ్ విజయ్ దాహియాతో ఒప్పందం చేసుకుంది. రానున్న సీజన్ కోసం అతన్ని అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్ కోచ్ మాథ్యూ హేడెన్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. దాహియా తన ఐపీఎల్ కెరీర్లో కేకేఆర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు కూడా పని చేశాడు. అతని కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, హార్దిక్ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన గుజరాత్.. ఆతర్వాత సీజన్లో కూడా ఫైనల్‌కు చేరినా, సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్‌లో చేరడంతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ సారథ్యంలో గుజరాత్ తొలి సీజన్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్‌కు చేరలేకపోయింది. రాబోయే సీజన్లో మరోసారి గిల్ నేతృత్వంలో గుజ.రాత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఇదిలా ఉంటే, 2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్ (20 మ్యాచ్‌లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.గుజరాత్ టైటాన్స్ తొలి విడత షెడ్యూల్.. - మార్చి 31: GT vs PBKS - ఏప్రిల్ 4: GT vs RR - ఏప్రిల్ 8: GT vs DC - ఏప్రిల్ 12: GT vs LSG దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే. -
గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా ఆసీస్ క్రికెట్ దిగ్గజం
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ను తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు గుజరాత్ ప్రకటించింది. వరల్డ్‌కప్ విన్నర్, డేంజరస్ ప్లేయర్ హేడెన్ రాకతో టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది."మా ప్రయాణంలో మాథ్యూ హేడెన్ నియామకం ఒక కీలకమైన ఘట్టం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాథ్యూను మా బ్యాటింగ్ కోచ్‌గా నియమించాము. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది" గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ విధ్వంసకర బ్యాటర్ గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు. హేడన్ గతంలో 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. కానీ పూర్తి స్ధాయిలో ఎప్పుడు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న హేడెన్.. ఐపీఎల్లో కూడా తన మార్క్‌ను చూపించాడు.హేడెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడారు. 2010లో టీమ్ ని టైటిల్ గెలిపించగా, 2009లో 12 మ్యాచ్‌ల్లో 572 రన్స్ చేసి ఆరెంజ్ కాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. పవర్ ప్లే ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆట తీరునే మార్చేసిన హేడెన్, ఇప్పుడు కోచ్‌గా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడాలి. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.చదవండి: Teamindia: బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం.. ముంబై మందు భారీ టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు తమ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది.అయితే జార్జియా వేర్హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43), భారతి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు. వీరిద్దరితో పాటు మూనీ(33), కనిక అహుజా(35) రాణించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, అమీలియా కేర్, కారీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్.. -
పాక్ పట్ల భారత వైఖరిపై విండీస్ స్టార్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరిపై విండీస్ స్టార్ క్రికెటర్, ఆ దేశ మాజీ కెప్టెన్, టీ20 స్పెషలిస్ట్ జేసన్ హోల్డర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల హోల్డర్ Game On with Grace అనే పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. భారత్–పాకిస్తాన్ బీఫ్ (వివాదం) నాకిష్టం లేదని అన్నాడు. అలాగే టీమిండియా ఆసియా కప్ 2025 ట్రోఫీని స్వీకరించకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు.హోల్డర్ ఈ వ్యాఖ్యలు అవగాహన లేమితో చేసినట్లు తెలుస్తున్నప్పటికీ.. అతను భారతీయ క్రికెట్ అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడు. ఫలితంగా తన ఐపీఎల్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో హోల్డర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 7 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.మంచి ఆఫర్ అనుకునేలోపే హోల్డర్ అనవసర విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నాడు. దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించని భారత క్రికెట్ అభిమానులు హోల్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ ఎదుర్కొన్న నష్టమే హోల్డర్ కూడా ఎదుర్కొనే ప్రమాదముంది.వాస్తవానికి హోల్డర్ తన వ్యాఖ్యల్లో భారత్‌పై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అయినా ఇది భారత క్రికెట్ అభిమానులకు నచ్చదు. ఫలితం అక్కడ ఉన్నది ఎంతటి స్టార్ అయినా మూల్యం చెల్లించుకోకతప్పదు. బంగ్లాదేశీ ఆటగాడిని హైర్ చేసుకున్నాడని తమ ఆరాధ్య హీరోనే వ్యతిరేకించిన ఘన చరిత్ర మన భారత క్రికెట్ అభిమానులది. కాబట్టి హోల్డర్ విషయంలో కూడా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తప్పేలా లేదు.ఈ నేపథ్యంలో సదరు ఫ్రాంచైజీ పరిశీలించబోయే హోల్డర్ ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేద్దాం. హోల్డర్ పొట్టి ఫార్మాట్లో అత్యంత ప్రభావితమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ప్రపంచ క్రికెట్లో ఇలాంటి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న వాటిలో గుజరాత్ పరిశీలించే అవకాశం ఉన్న ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లలో ముఖ్యుడు, ప్రథముడు ఎవాన్ జోన్స్.ఎవాన్ జోన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2026లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున 182 స్ట్రైక్‌రేట్‌తో మెరిసిన పవర్‌హిట్టర్.హోల్డర్లాగే భారీకాయుడైన జోన్స్ డెత్ ఓవర్లలో 233 స్ట్రైక్‌రేట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చే సామర్థ్యం ఉన్న ఆటగాడు.ప్రస్తుత దేశవాలీ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి మంచి ఊపుమీద ఉన్న జోన్స్, హార్డ్లెంగ్త్ బౌలింగ్‌తో అహ్మదాబాద్ పిచ్‌లకు సరిపోయే బౌలర్. అయుష్ వర్తక్ ఈ ముంబై యువ ఆల్‌రౌండర్ అండర్-23 విభాగంలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. 169.62 స్ట్రైక్‌రేట్‌తో లోయర్ ఆర్డర్ హిట్టర్‌గా మంచి పేరుంది. స్వల్ప కెరీర్లోనే 26 సిక్సర్లు బాదాడు. బ్యాటింగ్‌తో పాటు సీమ్ బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు.మనిశంకర్ మురసింగ్ఈ త్రిపుర ఆల్‌రౌండర్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టాడు. 21 సిక్సర్లు సహా 46.16 సగటున, 172.04 స్ట్రైక్‌రేట్‌తో 277 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 7.6 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. మనిశంకర్ బ్యాట్‌తో పాటు బంతితోనూ ప్రభావం చూపగల ఆటగాడు. -
ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర వీరుడు
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందే ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బెస్ ప్రెస్‌కు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్‌ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.కాగా గత సీజన్ వేలంలో రూథర్ ఫర్డ్‌ను రూ. 2.6 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఈ కరేబియన్ ఆటగాడు ఇప్పుడు అదే ప్రైస్ ట్యాగ్‌తో ముంబైకి మారాడు. ఐపీఎల్-2025లో రూథర్ ఫర్డ్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికి గుజరాత్ అతడిని ట్రేడ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే నమన్ ధీర్ వంటి సూపర్ ఫినిషర్ ఉండడంతో రూథర్‌ఫర్డ్‌ను మిడిల్ ఆర్డర్లో ఉపయోగించుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు తెలుస్తోంది.Poore #CricketTwitter ko hila daala na? 😎🔥 pic.twitter.com/wuizRDyvwM— Mumbai Indians (@mipaltan) November 13, 202527 ఏళ్ల షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ విండీస్ తరపున ఇప్పటివరకు వెస్టిండీస్ తరపున 44 టీ20లు ఆడాడు. ఆండ్రీ రస్సెల్‌తో కలిసి టీ20ల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(139) నెలకొల్పిన రికార్డును అతడు కలిగి ఉన్నాడు. ఇక 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన రూథర్ ఫర్డ్.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్-2020 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు కూడా అతడు ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ముంబై తరపున మళ్లీ ఆడనున్నాడు. -
మా జట్టుకు మాత్రం.. గిల్ ఎప్పుడూ ఇలా ఆడడు: కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.గిల్ ధనాధన్యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్‌గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.టీమిండియా ఘన విజయం ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్‌మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడుఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్‌ను ప్రశంసించాడు. టీ20 జట్టు వైస్ కెప్టెన్గాకాగా టైటాన్స్‌కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్‌గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్‌తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్‌గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
గుజరాత్ టైటాన్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర వీరుడు?
గుజరాత్ టైటాన్స్.. తమ ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 టైటిల్‌ను హార్దిక్ పాండ్యా పాండ్యా సారథ్యంలోని గుజరాత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్లోనూ తమ జట్టును రన్నరప్‌గా హార్దిక్ నిలిపాడు.కానీ అనుహ్యంగా ఐపీఎల్-2024కు ముందు ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ బాధ్యతలు చేపట్టనప్పటికి జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన గుజరాత్.. అంతకముందు సీజన్లో లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.హార్దిక్ గుజరాత్‌ను వీడి రెండు సీజన్లు అవుతున్నప్పటి అతడి స్ధానాన్ని సరైన ఆటగాడు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. హార్దిక్ బ్యాట్, బంతితో రాణించి గుజరాత్ విజయాల్లో భాగమయ్యేవాడు. అయితే ఈసారి మినీవేలంలో అయినా హార్దిక్ తగ్గ ఆటగాడిని కొనుగోలు చేయాలని గుజరాత్ యాజమాన్యం భావిస్తుందంట.గ్రీన్‌పై కన్ను..?ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై గుజరాత్ టైటాన్స్ కన్నేసినట్లు తెలుస్తోంంది. గ్రీన్ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న గ్రీన్ వచ్చే ఏడాది సీజన్లో ఆడనున్నాడు.ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున అదరగొడుతున్నాడు. ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని గుజరాత్ యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న గ్రీన్.. త్వరలోనే బౌలింగ్‌కు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాడు. గ్రీన్ ఇప్పటికే ఐపీఎల్లో రెండు సార్లు రూ. 17.50 కోట్లు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. గత రెండేళ్లలో టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా ఉంది. ఐపీఎల్ 2026 వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్ ఉన్నాడు. గ్రీన్‌కు ఓ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది. -
కౌంటీల్లో అరంగేట్రం చేయనున్న మరో భారత క్రికెటర్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి మరో భారత ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. తమిళనాడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిశ్రీనివాస్ సాయి కిషోర్ సర్రే కౌంటీ జట్టుతో రెండు మ్యాచ్‌ల స్వల్ప ఒప్పందం చేసుకున్నాడు. సాయి కిషోర్ ఈ నెల 22న యార్క్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌తో కౌంటీ అరంగేట్రం చేస్తాడు. ఆ మ్యాచ్‌లో సాయి తన మాజీ సీఎస్కే సహచరడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఢీకొంటాడు. రుతురాజ్ కూడా ఇదే సీజన్‌తో యార్క్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేశాడు.28 ఏళ్ల సాయి సర్రే క్లబ్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఘన చరిత్ర కలిగిన సర్రేకు ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. సాయి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడతాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత్ తరఫున 3 టీ20లు ఆడిన సాయికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 23.5 సగటున 192 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 2022 సీజన్ నుంచి గుజరాత్‌కు ఆడుతున్న సాయి.. ఈ లీగ్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 20.3 సగటుతో 32 వికెట్లు తీశాడు.ఈ సీజన్లో ఆరో క్రికెటర్ప్రస్తుత కౌంటీ సీజన్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ఐదుగురు భారత ఆటగాళ్లు వేర్వేరు క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్, తిలక్ వర్మ హ్యాంప్‌షైర్, ఖలీల్ అహ్మద్ ఎసెక్స్, రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్, యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్నారు.వీరిలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే ఇరగదీశారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేయగా.. ఇషాన్ రెండు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశారు. -
రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రషీద్ ఖాన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పేరు గాంచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పు తిప్పలు పెట్టే సత్తా ఉన్నోడు రషీద్. కానీ ఐపీఎల్-2025లో మాత్రం రషీద్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ దారుణంగా విఫలమయ్యాడు.ప్రతీ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్లోనూ అదే తీరును కనబరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 31 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన రషీద్.. 9.34 ఏకానమితో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.రషీద్ ఖాన్ చెత్త రికార్డు..ఈ క్రమంలో రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా రషీద్ ఆప్రతిష్టను మూటకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో రషీద్ ఏకంగా 33 సిక్సర్లు ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరిట ఉండేది. 2022 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తూ సిరాజ్ 31 సిక్సర్లు ఇచ్చాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్సర్లు ఇచ్చిన రషీద్.. సిరాజ్‌ను అధిగమించాడు. వీరిద్దరి తర్వాత స్ధానాల్లో చాహల్(30), హసరంగా(30),బ్రావో ఉన్నారు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్ -
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా ఈవెంట్ నుంచి గుజరాత్ నిష్కమ్రించింది. 229 పరుగుల భారీ లక్ష్య చేధనలో సాయిసుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడి ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. ఏకంగా 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లు కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగానే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.కన్నీరు పెట్టుకున్న నెహ్రా ఫ్యామిలీ..ఇక ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాండ్స్‌లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కూమర్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ కూడా వారిని ఓదర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM— IndianPremierLeague (@IPL) May 30, 2025 Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1— WTF Cricket (@CricketWtf) May 30, 2025 -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది. సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు."క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఈ మ్యాచ్‌లో మేము మూడు సునాయస క్యాచ్‌లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్‌లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్ -
అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్
ఐపీఎల్-2025లో శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినిటేర్ మ్యాచ్ సస్పెన్ష్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ 20 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. ఆదివారం జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై తలపడనుంది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు."కీలక మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఒకానొక దశలో గేమ్ సమానంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ బ్యాటింగ్‌కు మరింత మెరుగ్గా అనుకూలించింది. మంచు కారణంగా బంతి సునాయసంగా బ్యాట్‌పైకి వచ్చింది. దీంతో రిథమ్ అందుకున్న గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా మా బౌలర్లకు సపోర్ట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాము.ఇక జానీ బెయిర్ స్టో తన అరంగేట్రంలో ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మాకు అతడు అద్బుతమైన ఆరంభాన్ని అందించాడు. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ చూపించాడు. తొలుత కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి.. తన రిథమ్ అనుకున్న తర్వాత ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలింగ్‌లో గ్లీసన్, బుమ్రా, అశ్విన్ కుమార్ ప్రతీ ఒక్కరూ రాణించారు.ఈ మ్యాచ్‌లో మేము ఎటువంటి ఒత్తిడి లోనవ్వలేదు. తొలి ఇన్నింగ్స్‌లో నేను మరో సిక్స్‌లు కొట్టి ఉంటే బాగుండేంది. ఎందుకంటే ఆఖరిలో చేసే పరుగులు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయి. బ్యాటింగ్‌లో మేము అనుకున్న విధంగా దూకుడుగా ఆడాము. ఇక బుమ్రాతో ఎప్పుడు బౌలింగ్ చేయంచాలన్నది అన్నది చాలా సులభం. మ్యాచ్ చేజారిపోతుందని అనిపిచ్చినప్పుడు బుమ్రాను ఎటాక్‌లో తీసుకురావాలి. బుమ్రా లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే కెప్టెన్‌కు అదొక వరం.ముంబైలో ఇళ్లు ఎంత ఖరీదుగా ఉంటాయో, బుమ్రా కూడా అంతే కాస్టలీ. చివరి ఓవర్లలో అదనపు పరుగులు ఉంచుకోగలిగితే, వాటిని డిఫెండ్ చేయగల బౌలర్లు జట్టులో ఉన్నారు అని భావించాను. అందుకే 18 ఓవర్ బుమ్రాతో వెయించాను. అందుకు తగ్గట్టే ఆ ఓవర్లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో గుజరాత్‌కు కావల్సిన రన్‌రేట్ పెరిగింది. మా తదుపురి మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని హార్ధిక్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(81) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(80) పోరాడాడు. అయితే 48 పరుగులతో దూకుడుగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేసి బుమ్రా మ్యాచ్ మలుపు తిప్పాడు. -
GT Vs MI: కీలక మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్‌కు ఝలక్ (ఫొటోలు)
-
MI Vs GT: ముంబై ముందుకు... గుజరాత్ ఇంటికి
ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు చేరింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ దూకుడుకు... బెయిర్‌స్టో, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్... కీలక ఎలిమినేటర్ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపగా... జానీ బెయిర్‌స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్‌స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్‌స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌తో దూకుడు పెంచిన బెయిర్‌స్టో... ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన రోహిత్ సాయి కిషోర్ బౌలింగ్‌లో 6, 4, 4తో గేర్ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్ మరో సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్‌స్టోను అవుట్ చేసి సాయి కిషోర్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చాడు. రషీద్ ఓవర్లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్‌లు పూర్తి చేసుకున్న రోహిత్... 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్‌ను సాయి కిషోర్ పెవిలియన్ పంపగా... ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్‌ను ప్రసిధ్ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 సిక్స్‌లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్ (1) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్ సుదర్శన్ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సహకరించగా... సుదర్శన్ క్లాస్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్ పవర్‌ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్‌తో సుందర్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్‌ను గ్లీసన్‌ను అవుట్ చేయగా... రూథర్‌ఫోర్డ్ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (13; 1 సిక్స్) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 81; బెయిర్‌స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్ 47; సూర్యకుమార్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 33; తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25; హార్దిక్ (నాటౌట్) 22; నమన్ ధీర్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 9, సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్: సిరాజ్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్ 4–0–42–2; రషీద్ ఖాన్ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్ 1–0–7–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80; గిల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 1; మెండిస్ (హిట్ వికెట్) (బి) సాంట్నర్ 20; సుందర్ (బి) బుమ్రా 48; రూథర్‌ఫోర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24; తెవాటియా (నాటౌట్) 16; షారుక్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) అశ్వని కుమార్ 13; రషీద్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్: బౌల్ట్ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్ 3.3–0–39–1; హార్దిక్ పాండ్యా 3–0–37–0; సాంట్నర్ 1–0–10–1; నమన్ ధీర్ 1–0–9–0; అశ్వని కుమార్ 3.3–0–28–1. -
IPL 2025 Eliminator Match: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ముంబై ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్‌లో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ చేతుల్లో ఉండింది. అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్ వరకు పోరాడినా గుజరాత్‌కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (48) రాణించాడు. శుభ్‌మన్ గిల్ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. రూథర్‌ఫోర్డ్ 24, తెవాతియా 16 (నాటౌట్), షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వనీ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది.


