
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (మార్చి 25) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్, పంజాబ్ ఐదు సందర్భాల్లో ఎదురుపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, పంజాబ్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. గత సీజన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్‌ను వారి సొంత మైదానంలోనే ఓడించింది.
ఈ సీజన్‌లో గుజరాత్ సాధారణ జట్టుతో బరిలోకి దిగనుండగా.. పంజాబ్ విధ్వంసకర ఆల్‌రౌండర్లతో తమ తొలి టైటిల్ వేటను ప్రారంభించనుంది. గుజరాత్ సైతం జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి మెరుపు వీరులను కొత్తగా జట్టులో చేర్చుకున్నా.. పంజాబ్ హిట్టర్లు స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ ముందు వారు దిగదుడుపే అనిపిస్తుంది. ఈ సీజన్‌లో పంజాబ్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా చేసుకోగా.. గుజరాత్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఈ సీజన్‌లో గుజరాత్‌తో పోలిస్తే.. పంజాబ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్‌లో విధ్వంసకర బ్యాటర్లు (శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్, శశాంక్ సింగ్), ఆల్‌రౌండర్లతో (స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, జన్సెన్) పాటు లోకీ ఫెర్గూసన్, అర్షదీప్ సింగ్, చహల్ లాంటి స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నారు.
గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టులో కూడా గిల్, బట్లర్, ఫిలిప్స్, తెవాటియా, షారుక్ ఖాన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా నాణ్యమైన ఆల్‌రౌండర్లు కొరవడ్డారు. వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతను అంత ప్రభావితం చేయగలడో లేదో చూడాలి. రషీద్ ఖాన్ వారి బౌలింగ్ తరుపుముక్క అనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో గుజరాత్ కొత్తగా రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ లాంటి పేసర్లను పంచన చేర్చుకుంది.
అరంగేట్రం నాటి నుంచి గుజరాత్ ఇలాగే సాధారణ జట్టులా కనిపించినా అద్భుత విజయాలు సాధించిన విషయాన్ని గమనించాలి. ఆ జట్టుకు ఐపీఎల్‌లో ఏ జట్టుకూ లేని విజయాల శాతం ఉంది. గుజరాత్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 45 మ్యాచ్‌ల్లో 28 గెలిచి 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ జట్టు హార్దిక్ నేతృత్వంలో ఓ సారి టైటిల్ సాధించి, ఓ సారి రన్నరప్‌గా నిలిచింది. గుజరాత్‌కు (24 మ్యాచ్‌ల్లో 17 విజయాలు) ఛేదనలోనూ మంచి రికార్డు ఉంది. గతాన్ని పక్కన పెడితే నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.
నేటి మ్యాచ్‌లో తుది జట్ల అంచనా..
గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్,
పూర్తి జట్లు..
పంజాబ్ కింగ్స్: జోష్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, నేహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాక్, ప్రవీణ్ దూబే, లోకీ ఫెర్గూసన్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, యశ్ ఠాకూర్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్
గుజరాత్ టైటాన్స్: జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, మహిపాల్ లోమ్రార్, కరీమ్ జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్, గెరాల్డ్ కోయెట్జీ, షెర్ఫన్ రూథర్‌ఫోర్డ్, మానవ్ సుతార్, కుమార్ కుషాగ్రా, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు
Comments
Please login to add a commentAdd a comment