
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 2) చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ చిత్తు చేసింది. ఈ విజయంలో గుజరాత్ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్‌ది కీలక పాత్ర. తన మాజీ జట్టుపై సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఫిల్ సాల్ట్ (13 బంతుల్లో 14), దేవ్‌దత్ పడిక్కల్ (3 బంతుల్లో 4), లియామ్ లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54)లను సిరాజ్ ఔట్ చేశాడు. సిరాజ్‌తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కుర్పించాడు. తన మాజీ జట్టుపై సిరాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడని హర్భజన్ అన్నాడు.
"ఐపీఎల్-2025లో మహ్మద్ సిరాజ్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఆర్సీబీపై తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే చాలా సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడినప్పటికి అతడిని వారు రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అదే సిరాజ్ ఆర్సీబీ ఓడను ముంచేశాడు. డీఎస్సీ సిరాజ్‌కు సెల్యూట్. ఇది ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనే. సిరాజ్‌కు అభినందనలు.
రషీద్ ఖాన్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లో కూడా గుజరాత్ బాగా రాణించింది" అని తన యూట్యూబ్ ఛానల్‌లో భజ్జీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.
గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: IPL 2025: గుజరాత్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన రబాడ